రాజకీయాల్లో సుద్దపూసలు భూతద్దంతో వెతికితేనే కనిపిస్తారని ఓ మహానుభావుడన్నాడు. చంద్రబాబులాంటి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నేత ఆ కోవ కిందకు అసలే రారు. తాజాగా తిరుమల ప్రసాదంపై ఆయన చేసిన ప్రేలాపనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అదే టైంలో.. మునుపెన్నడూ లేనివిధంగా దిగజారిపోయి మరీ ఆయన మత రాజకీయాలకు దిగడం చూస్తున్నాం.
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. బీజేపీతో ఎన్డీయే పొత్తులో ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు జాతీయ మీడియాను కూడా బాగానే మేనేజ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. తిరుపతి లడ్డూపై ఆయన కామెంట్లను అవి హైలెట్ చేసిన తీరే అందుకు నిదర్శనం. అయితే అందుకు భిన్నంగా ఓ ఆంగ్ల మీడియాలో ప్రచురితమైన సంచలనాత్మక వ్యాసం .. ఇప్పుడు చర్చనీయాంశమైంది.
తిరుపతి లడ్డూపై కూటమి ప్రభుత్వం నడిపిస్తున్న రాజకీయాన్ని ఆ ఆర్టికల్ ఫుల్లుగా ఏకీపారేసింది. ముఖ్యంగా చంద్రబాబు తన స్వార్థ రాజకీయం కోసం ఆధారాల్లేకుండా చేసిన ఆరోపణలు.. ఆ ఆరోపణలను ఎలా అనుకూలంగా మార్చుకోవాలని చూసింది కపిల్ కోమిరెడ్డి ఆ వ్యాసంలో విశ్లేషించారు.
చంద్రబాబు చెబుతున్న అబద్ధాలు, వాస్తవాల వక్రీకరణ, తప్పుడు ప్రచారాలను విపులంగా అందులో వివరించారు. అదే టైంలో.. చంద్రబాబు కొత్తగా మొదలుపెట్టిన మతపరమైన రాజకీయాలనూ ప్రశ్నించారు. బాబు జిత్తులమారి రాజకీయానికి నిజనిర్ధారణతో సంబంధం లేకుండా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలాంటి వాళ్లు పడిపోవడం సైతం ఆ ఆర్టికల్‌లో ప్రస్తావించారు.
ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు మార్క్ కన్నింగ్ రాజకీయం రాష్ట్ర విభజన తర్వాత కూడా ఎలా నడిచిందనేది సైతం డిటైయిల్డ్‌గా చర్చించింది ఆ వ్యాసం. తండ్రి వైఎస్సార్ బాటలో అన్ని మతాలను వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎలా ఆదరించింది.. అయినా కూడా జగన్‌పై హిందూ వ్యతిరేకి ముద్ర వేసేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాన్ని టచ్ చేసింది.
తిరుపతి ఆలయ ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలు.. ఉద్దేశపూర్వకమైనవేనని, పక్కా రాజకీయ లబ్ధి కోసమేనని కుండబద్ధలు కొట్టారు కపిల్. అలాగే.. ఆయన సుదీర్ఘ రాజకీయంలో ఇదే అత్యంత దిగజారిన పరిణామమని అభిప్రాయపడ్డారు.
చివరగా.. రాజకీయ సంస్కృతిలో మతాన్ని జొప్పించడం ద్వారా చంద్రబాబు ఘోరమైన తప్పిదమే చేశారని, ఏపీ ప్రజానీకం బాబు కుట్రలను, కుతంత్రాన్ని అర్థం చేసుకోగలరని ఆ వ్యాసం విశ్లేషించింది. ఏపీలో అధికారం ఎల్లవేళ ఒకే పార్టీ దగ్గర ఉండదనే విషయాన్ని ప్రస్తావించింది. మత రాజకీయం చేద్దామనుకున్న చంద్రబాబు ప్రయత్నం.. బెడిసి కొట్టడమే కాకుండా జీవితాంతం ఆయన్ని, ఆయన రాజకీయ వారసత్వాన్ని వెంటాడుతూనే ఉంటుందని ఆ ఆర్టికల్ పేర్కొంది.
ప్రింట్ ఆంగ్ల వ్యాసం కోసం క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment