tirupati laddu
-
బాబూ.. ఆ సామెత నీకు కరెక్ట్‌గా సరిపోతుంది: ఆర్కో రోజా
సాక్షి, తాడేపల్లి: తిరుమల లడ్డూ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చింత సచ్చిన పులుపు చావలేదు ఆన్న సామెత చంద్రబాబు కోసమే పుట్టినట్టు ఉందంటూ సెటైర్లు వేశారు. కల్తీ రాజకీయాలు చేస్తారు కాబట్టే కల్తీ రాజకీయాలను నమ్ముకున్నారని ఆరోపించారు.మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా..‘చింత సచ్చిన పులుపు చావలేదన్న సామెత మన ముఖ్యమంత్రి చంద్రబాబు కోసమే పుట్టినట్లు ఉన్నది. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలపై విచారణ, ఆధారాలు లేకుండా రాజకీయ దురుద్దేశంతో కల్తీ ఆరోపణలు చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. సుప్రీం కోర్టు చంద్రబాబు సిట్‌ను కాకుండా సీబీఐ సారథ్యంలో నూతన సిట్ ఏర్పాటు చేయడంతో పాటు రాజకీయ విమర్శలు వద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.అయినా తన కలుషిత బుద్ధి మానుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధాని మోదీకి శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందజేసిన సందర్భాన్ని కూడా తన మీడియాతో స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన లడ్డు అని ముఖ్యమంత్రి అంటే ప్రధాని సంతోషించారంటూ కల్తీ వార్తలు ప్రచారంలో పెట్టారు. తాను మాట్లాడితే కోర్టు ధిక్కరణ అవుతుంది కనుక తన మీడియాతో కల్తీ కథనాలు ప్రచారంలో పెట్టారు. కల్తీ రాజకీయాలను చెసే వారు గనుక కల్తీ ప్రచారాన్ని నమ్ముకున్నట్లున్నారు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. చింత సచ్చిన పులుపు చావలేదు ఆన్న సామెత మన ముఖ్యమంత్రి @ncbn గారి కోసమే పుట్టినట్లు ఉన్నది. పవిత్రమైన తిరుమల శ్రీవారి @TTDevasthanams లడ్డు ప్రసాదాలపై విచారణ , ఆధారాలు లేకుండా రాజకియ దురుద్దేశ్యంతో కల్తీ ఆరోపణలు చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. సుప్రీం… pic.twitter.com/ao9VntFTgv— Roja Selvamani (@RojaSelvamaniRK) October 9, 2024 -
పవన్ కల్యాణ్‌పై కేఏ పాల్ ఫిర్యాదు
పంజగుట్ట (హైదరాబాద్): తిరుపతి లడ్డూ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కేఏ పాల్ సోమవారం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పాల్ మాట్లాడుతూ లక్ష లడ్డూలు కల్తీ చేసి అయోధ్యకు పంపించారని అబద్ధపు మాటలు మాట్లాడారని, లడ్డూపై విచారణ జరిగిందే జూన్‌లో కాగా, అయోధ్య ప్రారంభోత్సవం జనవరిలో జరిగిందని కల్తీ ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. 14 సెక్షన్ల కింద ఫిర్యాదు చేశానని,ఆర్టికల్ 8 ప్రకారం ఆయన్ను వెంటనే ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని, లేదా ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పవన్‌కల్యాణ్‌కు ఎవరు స్క్రిప్ట్ ఇస్తే.. అది సినిమాలో మాదిరి చదువుతున్నాడని, గతంలోనే చెప్పినా వినిపించుకోలేదన్నారు. ఏపీ స్పీకర్, గవర్నర్, దేశ ప్రధాని, కేంద్ర హోంమంత్రి, ఛీప్ జస్టిస్, సీబీఐ అతనిపై విచారణ చేయాలని, వెంటనే పవన్‌కల్యాణ్ ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు -
పవన్ తన్ను తాను మోసం చేసుకుంటున్నారా!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వింత, విచిత్ర ధోరణి అంతుపట్టకుండా పోతోంది. మాటలు మార్చే విషయంలో ఘనాపాఠిగా చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడినే మించిపోయేలా ఉన్నాయి వపన్ చర్యలు. ఈ క్రమంలోనే ఆయన రకరకాల విన్యాసాలు చేస్తూ.. తనను తాను మోసగించుకుంటున్నారా? లేక పార్టీ కార్యకర్తలు లేదా ప్రజలందరినీ మూర్ఖులను చేస్తున్నారా? అన్నది తెలియడం లేదు. ఈ ప్రస్తావనంతా ఎందుకిప్పుడు అంటే...తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు వ్యాఖ్యానించడం, ఆ వెంటనే పవన్ రంగంలో దిగి దీక్ష డ్రామాకు తెర తీయడం మనం చూశాం. అయితే ఈలోపుగానే.. లడ్డూ తయారీలో జంతువు కొవ్వు కలిసిన నెయ్యి వాడారు అనేందుకు ఆధారాల్లేనట్లు అందరికీ తెలిసిపోయింది. ఈ పరిణామంతో చంద్రబాబైనా కొంత తగ్గాడేమో కానీ.. పవన్ మాత్రం మరింత రెచ్చిపోయాడు. తానే అసలు సిసలైన హిందువు అని జనాన్ని నమ్మించేందుకు ముందు తిరుమల యాత్ర అని ఆ తరువాత వారాహి డిక్లరేషన్ అని నానా డ్రామాలూ ఆడేశారు. ఆయా సందర్భాల్లో ఆయన చేసిన ప్రసంగాలు కూడా రంకెలేసినట్లుగా అరుపులతోనే సాగాయి. మత విద్వేషాన్ని ఎగదోయడమే లక్ష్యమన్నట్టుగా పవన్ మాట్లాడారని ప్రజలు చాలా మంది అభిప్రాయపడ్డారు.సనాతన ధర్మమంటూ మాట్లాడి, అదేమిటో చెప్పకుండా, హిందూ మతాన్ని తానే ఉద్దరిస్తున్నట్లు ఫోజు పెట్టారు. తిరుమలేశుని భక్తుణ్ణి అని చెప్పుకుంటూనే ఆయనకు అపచారం జరిగేలా లడ్డూ పై ప్రజలలో విశ్వాసం పోయేలా మళ్లీ మాట్లాడారు.అధికారంలో ఉన్నప్పుడు మన మాటలు, చేష్టలు బాధ్యతాయుతంగా ఉండాలి. ఎన్నికల ముందు ఎన్ని అబద్దాలు చెప్పినా చెల్లిపోయింది కదా అని, ఇప్పుడు కూడా అదే ధోరణిలో వెళితే జనానికే కాదు.. జనసేన కార్యకర్తలకు సైతం విసుగొచ్చే ప్రమాదముంది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఇచ్చిన వాంగ్మూలంలోనే లడ్డూ కల్తీ ప్రస్తావనను టీటీడీ తీసుకురాకపోతే.. ప్రభుత్వంలో మంత్రి హోదాలో ఉన్న పవన్ లేనిపోని ఆరోపణలను వల్లెవేయడంలో ఆంతర్యమేమిటో ఆయనకే తెలియాలి.ఎర్ర కండువా నుంచి కాషాయానికి మారడం తప్పు కాదు కానీ తాను గతంలో ఏం మాట్లాడింది? ఇప్పుడు మాట్లాడుతున్నదేమిటి? అన్నది కూడా ఆలోచించుకుని ఉండాల్సింది. ఆ విజ్ఞతతో ప్రసంగించాలి. అంతే తప్ప సనాతన ధర్మ పరిరక్షకుడిని తానే అన్నట్టుగా మాట్లాడినా, పోజు పెట్టినా ప్రజల్ని తక్కువ అంచనా వేయడమే అవుతుంది.2014లో అసలు జనసేన సిద్దాంతాలుగా ఆయన ప్రకటించిందేమిటి? చెప్పిన ఏడు పాయింట్లలో మొదటిది కులాలను కలిపే ఆలోచనా విధానం అనే కదా ఉంది? ఆ తరువాత కులాల గురించి మాటలు ఎన్ని మార్చారో అందరికి తెలుసు. ఎన్నికల సందర్భంగా ఆయన చివరకు తన కులపు వాళ్లయినా తనకు మద్దతివ్వాలని అడిగిన వైనం ప్రజల మనసుల్లో తాజాగానే ఉంది. జనసేన పార్టీ సిద్ధాంతాలుగా పవన్ ప్రకటించిన వాటిల్లో రెండోది మతాల ప్రస్తావన లేని రాజకీయం. ఈ సిద్ధాంతం కూడా ఇప్పుడు అధికారం వచ్చాక మారిపోయింది. తాను హిందూమతం కోసం పాటు పడతానని, సనాతన ధర్మం కోసం పని చేస్తానని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. వీటినిబట్టే కులం, మతం విషయాలలో పవన్ వైఖరి ఎంత దారుణంగా మారిందో అర్థమవుతుంది. ఆయన నిజంగా స్వామి అవతారం ఎత్తదలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, పార్టీ రాజకీయాలను వదలిపెట్టి అలాగే చేసుకోవచ్చు. అలా కాకుండా వేషం మాత్రం మార్చి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే దొంగ బాబాగా మిగిలిపోతారు.పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన మాటల్ని ఒకసారి గుర్తుకు చేసుకుందాం.... ఒకసారి తాను బాప్టిజం తీసుకున్నానని, ఇంకోసారి తన భార్య, కుమార్తె క్రైస్తవులని ఒకసారి చెప్పుకొచ్చారు ఆయన. పరస్పర విరుద్ధమైన ప్రకటనలకు కొదవేలేదు. వీడియోలు అనేకం కనిపిస్తున్నాయి. సనాతన దర్మంలో తండ్రి మతం కాకుండా తల్లి మతం కుమార్తెకు ఎలా వస్తుందన్న ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వగలరా? ఏదో పబ్లిసిటీ కోసం తన కుమార్తెతో తిరుమలలో డిక్లరేషన్ ఇప్పించి తన పరువు తాను తీసుకున్నారు. ఇక వ్యక్తిగత జీవితంలోకి వెళ్లితే సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు చెబుతున్న ఈయన చేసిన నిర్వాకాలేమిటో అందరికీ తెలుసు.అయినా ఎలాంటి భేషజం లేకుండా పవన్ కళ్యాణ్ ఏది పడితే అది మాట్లాడుతున్నారంటే, ఆయన మోసపూరిత రాజకీయం చేస్తున్నారని తెలిసిపోతుంది. రాజకీయంగా మాటలు మార్చితే ఒక పద్దతి.అలా కాకుండా మతాల మధ్య చిచ్చుపెట్టేలా అధికారంలో ఉన్న పెద్ద మనిషి వ్యవహరిస్తే అది సమాజానికి ప్రమాదం అవుతుంది. సనాతన ధర్మం అంటే తోచిన అబద్దం చెప్పడమా? తిరుపతి సభలో ఆయన మాట్లాడుతూ సనాతన దర్మాన్ని దెబ్బతీయాలని చూసేవారు ఎవరైనా తుడిచిపెట్టుకు పోతారని హెచ్చరించారు. సనాతన ధర్మం ప్రకారం విడాకుల ప్రసక్తి ఉండదని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు చెబుతున్నారు.మరి పవన్ ఏమి చేశారు. రెండుసార్లు విడాకులు తీసుకున్నారు. రెండుసార్లు హిందూ స్త్రీలకు విడాకులు ఇచ్చి మూడోసారి క్రైస్తవ మహిళను వివాహమాడారు. అంటే హిందూ ధర్మంపై దాడి చేసింది పవనే అవుతారు కదా! చట్టం ప్రకారం ఆయన చేసింది తప్పు కాకపోవచ్చు.కానీ ఆయన చెబుతున్న సనాతనం ప్రకారం అయితే అది నేరం కాదా?ఇందులో ఇతర అంశాల జోలికి వెళితే బాగుండదు. అవన్ని కూడా సనాతన ధర్మానికే కాదు..హిందూ మత విధానాలకే వ్యతిరేకంగా చేశారు. ఆయన ఇప్పుడు వచ్చి ఈ ధర్మం గురించి బోధిస్తుంటే ఏళ్ల తరబడి హైందవ ధర్మం కోసం పనిచేస్తున్న స్వామీజిలు బిత్తరపోతున్నారు.తాము ఇచ్చిన హామీలను ఎలా నిలబెట్టుకోవాలా అన్నదానిపై పవన్ ఇప్పుడు ఆలోచిస్తున్నారట. ఎన్నికల ముందు ఆలోచించకుండా ఇష్టారీతిలో అబద్దపు వాగ్దానాలు చేయడం సనాతన ధర్మంలో ఉందా? హిందూ మతంలో ఉందా? కలియుగ దైవానికి అపచారం చేస్తే ఎందుకు ఊరుకుంటాం అని పవన్ ప్రశ్నించారు. అపచారం చేసింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లే కదా? జంతు కొవ్వు కలిసిన నేతిని లడ్డూ తయారీలో వాడారని ఆధారం లేని సంగతి చెప్పింది వారే కదా? అది నిజమే అయితే రెండు నెలలపాటు మౌనంగా ఉండడం నేరం కాదా? అయోధ్యకు పంపిన లడ్డూలు కల్తీ అయ్యాయని పవన్ చేసిన ఆరోపణకు నిదర్శనం చూపించాలి కదా? ఈయన స్వయంగా అక్కడకు వెళ్లారు కదా.అప్పుడు ఎవరైనా ఈయనకు ఫిర్యాదు చేశారా? చేస్తే వెంటనే ప్రకటన ఇచ్చేవారు కదా? అంటే అసత్యం చెప్పారనే కదా!'ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోవాలి. అల్లా అంటే ఆగిపోతారు. అదే గోవిందా అంటే మనం ఆగిపోం.." అని అంటారు. ఇది మతాలను రెచ్చగొట్టడం కాదా? హైందవ ధర్మంలో ఇదేనా ఉంది? సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అంటే గొడవ పెట్టుకోవడానికి వచ్చాను అని పవన్ అన్నారు. గొడవలు సృష్టించడానికే ప్రజలు ఆయనకు అధికారం ఇచ్చారా? అసలు ఎవరైనా సనాతన ధర్మం గురించి ఈ మధ్యకాలంలో మాట్లాడారా? కేవలం పవన్ కళ్యాణ్ లేని వివాదం తెచ్చి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. జగన్ పాలనలో ఏదో జరిగిందని పచ్చి అబద్దాలు చెప్పి హిందూ మతానికి ఈయన మరింత అప్రతిష్ట తెస్తున్నారు.టీడీపీ ప్రభుత్వం వచ్చాక కొన్ని చోట్ల రధం దగ్దం చేయడం వంటివి కొన్ని జరిగాయి. అలాగే మహిళలపై ఈ నాలుగు నెల్లోనే జరిగినన్ని అత్యాచారాలు,ప్రత్యేకించి చిన్న పిల్లలపై జరిగిన ఘోరాలు సమాజాన్ని కలచివేస్తున్నాయి.వాటి గురించి మాట్లాడే ధైర్యం లేని పవన్ ఎంతసేపు గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ, సనాతన ధర్మం అంటూ కొత్తపాట ఎత్తుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. నిజానికి ఆయనకు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియదనేదే విద్యాధికుల స్పష్టమైన భావన. ఏపీ ప్రజలలో మత భావాలను పెంచి బీజేపీ ఎజెండా ప్రకారం ఇలాంటి కుట్రలకు పవన్ పాల్పడుతున్నారన్నది మరికొందరి అనుమానం. చంద్రబాబే అవకాశ వాదంతో రకరకాల వర్గాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటారంటే, ఆయనను దాటి పోవాలని ఏమైనా అనుకుంటున్నారా? అన్నది తెలియదు. కానీ హనుమంతుని ముందు కుప్పి గంతులా అన్నట్లు చంద్రబాబు ఈయన తోక కట్ చేయగలరు. తన మీడియా బలంతో భ్రష్టు పట్టించగలరు. చంద్రబాబు, లోకేష్ లు తెలివిగా పవన్ కళ్యాణ్ ను ఇరికించి పరువు తీస్తున్నారా? అన్నది మరికొందరి సందేహం. ప్రస్తుతానికి ఇద్దరూ కలిసి జనాన్ని మోసం చేయడానికి ఈ గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తిరుమల లడ్డూ ప్రసాదంపై తీరు మారని పచ్చ పార్టీ
-
బాబు మెడకు జంతువుల కొవ్వు.. బాలకృష్ణ, పవన్ సైలెంట్..
-
Video: బాబూ.. ఇదేనా వెంకన్నపై నీకున్న భక్తి: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: తిరుమల వేంకటేశ్వర స్వామి వీరభక్తుడనని బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు నిజ స్వరూపం మరోసారి బట్టబయలైంది. శ్రీవారి ఆలయంలో కనీసం అక్షింతలు కాసేపు కూడా తలపై ఉండనివ్వలేదు చంద్రబాబు. దీనికి సంబంధించిన వీడియోను వైఎస్సార్సీపీ షేర్ చేసింది.చంద్రబాబు భక్తిని ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..వేంకటేశ్వర స్వామి వీరభక్తుడనని బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు. శ్రీవారి ఆలయంలో కనీసం అక్షింతలు కాసేపు కూడా తలపై ఉండనివ్వలేదు. దేవుడంటే చంద్రబాబుకి భక్తి లేదు.. భయం అంతకంటే లేదు.. ఇదిగో సాక్ష్యం!.వేంకటేశ్వర స్వామి వీరభక్తుడనని బిల్డప్ ఇచ్చిన @ncbn.. శ్రీవారి ఆలయంలో కనీసం అక్షింతలు కాసేపు కూడా తలపై ఉండనివ్వలేదు దేవుడంటే చంద్రబాబుకి భక్తి లేదు.. భయం అంతకంటే లేదు.. ఇదిగో సాక్ష్యం!#CBNShouldApologizeHindus#SatyamevaJayate#TirupatiLaddu#CBNDestroyedAPin100Days pic.twitter.com/YZuC5A79eN— YSR Congress Party (@YSRCParty) October 5, 2024ఇదే సమయంలో లడ్డూ విషయంలో డైవర్షన్ రాజకీయాలను ప్రశ్నించింది. చంద్రబాబు రాజకీయ పునాదులు.. అబద్ధాలు, డైవర్షన్ పాలిటిక్సే. లడ్డూ వ్యవహారంలో కూడా ఆయన పద్ధతి ఇదే. వీటికి సమాధానాలు చెప్పకుండా.. ఈ డైవర్షన్లు ఎందుకు. మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. కనీసం సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లకైనా సమాధానం చెప్పు.1.లడ్డూల్లో కల్తీ నెయ్యి కలిస్తే.. ఆధారాలెక్కడ? 2.కల్తీ జరిగిందని అనుకున్నప్పుడు లడ్డూలపై ఎందుకు పరీక్షలు చేయించలేదు?3.ఈవో ఒకమాట, సీఎం ఒక మాట ఎందుకు చెప్పారు? ఆరోపణలున్న నెయ్యిని తిప్పిపంపామని ఈవో, లేదు వాడారని సీఎం… పరస్పర విరుద్ధ ప్రకటనలు ఎందుకు చేశారు?4.ఎలాంటి ఆధారం లేకుండా భక్తుల మనోభావాలను చంద్రబాబు ఎందుకు దెబ్బతీశారు?5.జులై 23న రిపోర్టు వస్తే సెప్టెంబరు 18వరకూ 54 రోజులపాటు ఎందుకు దీని గురించి పట్టించుకోలేదు. 6.అసలు నెయ్యి సరఫరా జరిగింది ఎప్పుడు? చంద్రబాబు పరిపాలనలో కాదా? 7.శాంపిళ్లు తీసిన జులై 6, జులై 12 తేదీల్లో నడుస్తున్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా? టీటీడీలో ఉన్నది చంద్రబాబు వేసిన ఈవోనే కదా?. -
సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు
-
సుప్రీం తప్పుపట్టినా ఆగని లడ్డు రాజకీయం.. బాబుపై జగన్ ఫైర్
-
టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా సీబీఐ సిట్ విచారణ
-
సుప్రీంకోర్టు తప్పుపట్టినా మారవా బాబూ.. వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. సుప్రీంకోర్టు తప్పుపట్టినా చంద్రబాబులో మార్పు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదంపై రాజకీయాలు చేస్తున్నారంటూ ట్వీట్ చేసిన ఆయన.. పలు రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు, తదితరులకు ట్యాగ్ చేశారు. Even after the critical remarks of the Hon’ble Supreme Court against @ncbn , TDP continues to politicize the Laddu Prasadam issue. @BJP4India @INCIndia @arivalayam @BRSparty @samajwadiparty @AamAadmiParty @AIADMKOfficial @narendramodi @AmitShah @ShivSenaUBT_ @AITCofficial… pic.twitter.com/vefByATGT6— YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2024 ‘సుప్రీంకోర్టు మీకు మొట్టికాయలు వేస్తూ తీర్పు ఇస్తే.. సిగ్గూ ఎగ్గూ లేకుండా ఆ తీర్పును వక్రీకరిస్తారా? మీరు చేసిన తప్పులను సుప్రీంకోర్టు ఎత్తి చూపుతూ మిమ్మల్ని నిలదీస్తే మాకు అక్షింతలు వేసిందంటూ దుష్ప్రచారం చేస్తారా?’ అంటూ నిన్న(శుక్రవారం) నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపడ్డారు. శుక్రవారం ‘ఎక్స్’లో తెలుగుదేశం పార్టీ అధికారిక ఖాతా(హ్యాండిల్)లో చేసిన పోస్టింగ్స్ చూస్తే.. ‘తప్పు జరిగిందని తెలిసినా, దేవుడి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించినా చంద్రబాబులో కనీస పశ్చాత్తాపం కనిపించడం లేదు’ అంటూ దుయ్యబట్టారు.టీడీపీ అధికారిక ఖాతా నుంచి ‘ఎక్స్’లో చేసిన ఆ పోస్టింగ్స్‌లో ఏం రాశారన్నది చదివి వినిపిస్తూ ‘తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో అబద్ధం మీద అబద్దాలు చెప్పుకుంటూ పోతున్నారు. మనిషి అన్నాక కొద్దిగానైనా దేవుడంటే భక్తి ఉండాలి. కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇంత దారుణంగా వక్రీకరణ చేయడమా?’ అంటూ వైఎస్ జగన్ తీవ్రంగా ఆక్షేపించారు.ఇదీ చదవండి: సిగ్గూ ఎగ్గూ లేకుండా కోర్టు తీర్పు వక్రీకరణకాగా, తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) సుప్రీంకోర్టు పక్కన పెట్టిన పెట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నందున ఈ వ్యవహారంపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తద్వారా దర్యాప్తు విశ్వసనీయత పెరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు తామే ఓ స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. -
బాబు సిట్' క్లోజ్
-
సుప్రీం సిట్ అయినా నిజం నిగ్గుదేల్చేనా?
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ కల్తీ ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గదే అయినప్పటికీ విచారణ నిస్పక్షపాతంగా సాగుతుందా? లేదా? అన్నదానిపై అప్పుడే ఒక అభిప్రాయానికి రాలేము. ఎందుకంటే.. వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై కొత్త ఎత్తులు వేస్తారా? అన్న సందేహం అందరిలోనూ ఉంది కాబట్టి! లడ్డూ వ్యవహారంలో తమకు సహకరించమని సుప్రీంకోర్టు కోరిన సోలిసిటర్ జనరల్ ఒకపక్క స్వతంత్ర సిట్‌కు ఓకే అంటూనే.. ఇంకోపక్క రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌కూ సర్టిఫికెట్ ఇస్తూ వారి అర్హతలు బాగానే ఉన్నాయనడం బాబు కేంద్రాన్ని ఏ మేరకు ప్రభావితం చేశారో అర్థం చేసుకోవచ్చు. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి అన్నది ఇక్కడ మరచిపోరాదు.ప్రపంచం మొత్తమ్మీద కోట్లాది మందికి ఇష్టదైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ తయారీలో జంతు కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత నెలలో ఒక అర్థం పర్థం లేని ఆరోపణ చేయడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ సాగిన ఈ అసత్యపు ఆరోపణలపై నిజాలు నిగ్గుదేల్చేందుకు విషయం సుప్రీంకోర్టుకు ఎక్కింది. అయినా సరే.. టీటీడీ పవిత్రతను కాపాడవలసిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రే దానిని దెబ్బతీసేలా వ్యవహరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి దీనిపై దీక్ష పేరుతో ఒక డ్రామా కూడా ఆడారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తోసిరాజని బహిరంగ సభపెట్టి మరీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టుకే ఆదేశాలు ఇస్తున్న రీతిలో, మతాల మధ్య ద్వేషాలు పెంచేలా పవన్ మాట్లాడిన నేపథ్యంలో సుప్రీంకోర్టు రాజకీయ డ్రామాలు ఆపండని ఘాటుగా స్పందించడం విశేషం.ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏ విచారణకు అయినా సిద్దం అని చెప్పలేకపోవడం ద్వారా చంద్రబాబు ఎంత ఆత్మరక్షణలో పడింది అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వం, టీటీడీల తరఫు న్యాయవాదులు అఫిడవిట్లలో జంతు కొవ్వు కల్తీ ప్రస్తావనే తేలేదట. సుప్రీంకోర్టు మాత్రం తుషార్ మెహతా సూచనను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వ నియమించే ఇద్దరు సభ్యులకు అవకాశం కల్పించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఎలా పనిచేస్తుంది? దాని ఎజెండా ఏమిటి? కాల పరిమితి ఏమిటి? ఏ అంశాలపై విచారణ జరుపుతుంది? మొదలైన విషయాలపై స్పష్టత రావల్సి ఉంది.చంద్రబాబు, పవన్ లు అధికారంలోకి వచ్చాక జరిగిన ఈ ఘటనలను గత జగన్ ప్రభుత్వానికి పులిమి రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నం జరిగింది. మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డిలు ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించి విచారణ కోరి ఉండకపోతే, చంద్రబాబు తన అరాచక ఆరోపణలు కొనసాగించే వారు. తాను చెప్పిన విధంగా నివేదిక తయారు చేసేందుకే సొంత సిట్ ను నియమించుకున్నారు. ఈ విషయాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొంతవరకు గమనించినట్లే అనుకోవాలి. అందుకే వారు పలు ప్రశ్నలు సంధించారు. ఏ ఆధారంతో లడ్డూలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారని చెప్పారని సూటిగానే అడిగింది. విచారణ జరగకుండా సీఎం మీడియాకు ఎక్కడమేమిటని అసహనం వ్యక్తం చేసింది.సుప్రీం వేసిన ప్రశ్నలకు చంద్రబాబు, పవన్ ల వద్ద జవాబు లేదు. టీటీడీ తరపున వాదించిన లాయర్ సిద్దార్ధ్ లూద్రా కల్తీ నెయ్యి తో లడ్డూ తయారు కాలేదని చెప్పారు. ఇది ప్రభుత్వం తరపున చెప్పినట్లే. అలాంటప్పుడు లడ్డూ విషయంలో స్పష్టత వచ్చినట్లయింది. ఇక విచారణ జరపవలసింది ఈ లడ్డూ వివాదంలో ఎవరి పాత్ర ఏమిటనేదే? చంద్రబాబు నాయుడు ఏ ఆధారంతో జంతుకొవ్వు కలిసిందని అన్నారు? తనతో శ్రీ వెంకటేశ్వర స్వామే నిజాలు చెప్పించారని అంటూ, గత ప్రభుత్వంపై చేసిన ఆరోపణలలో నిజం ఎంత? అబద్దం ఎంత?పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో సాగించిన తంతు ఏమిటి? ఈ ఓ శ్యామలరావు తొలుత వెజిటబుల్ ఫాట్ (వనస్పతి) కలిసిందని, ఆ టాంకర్లను వాడలేదని ఎలా చెప్పారు. తదుపరి జంతు కొవ్వు ప్రసావన ఎందుకు చేశారు. చంద్రబాబు ప్రభావంతోనే ఆయన అలా చేశారా? లడ్డూని పరీక్షకు పంపకుండా సీఎం స్థాయిలోని వ్యక్తి రెండు నెలల తర్వాత ఏ ఆరోపణ అయినా చేయవచ్చా? మైసూరులోని సంబంధిత పుడ్ టెస్టింగ్ లాబ్ కు తిరస్కరించిన నెయ్యి శాంపిల్స్ పంపించారా? లేదా? పంపిస్తే ఆ లాబ్ ఏమి రిపోర్టు ఇచ్చింది.పనికట్టుకుని గుజరాత్ లోని ఎన్.డి.డి.బి లాబ్ కు పంపడంలో ఏమైనా కుట్ర ఉందా? ఆ సంస్థ చైర్మన్ సరిగ్గా అంతకు ఒకటి, రెండు రోజుల ముందే టీటీడీ ఈఓని, మరికొందరు ప్రముఖులను ఎందుకు కలిసి వెళ్లారు? గతంలో చంద్రబాబు హయాంలో కాని, జగన్ హయాంలో కాని ఇలా నాణ్యత ప్రమాణాలు లేని నేయి ట్యాంకర్లను తిరస్కరించినప్పుడు, వేరే లాబ్ లకు పరీక్ష నిమిత్తం పంపించారా? లేదా? లేకుంటే ఎందుకు చేయలేదు. సుప్రీంకోర్టు విచారణలో పలు సందేహాలు వ్యక్తం చేసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ యధాప్రకారం లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని ఆరోపించడంలో ఉద్దేశం ఏమిటి? అయోధ్యకు కూడా కల్తీ నెయ్యి కలిసిన లడ్డూలు పంపారని పవన్ చెప్పడానికి ఆధారం ఏమిటి? అప్పట్లో అయోధ్యలో ఈ ప్రసాదం లడ్డూలను తిన్నవారెవరు ఎలాంటి పిర్యాదు చేయలేదు కదా? ఎన్.డి.డి.బి రహస్య నివేదిక ఇస్తే దానిని టీడీపీ ఆఫీస్ నుంచి ఎలా విడుదల చేశారు?ఇలాంటి అంశాలన్నిటిపైన కొత్త కమిటీ దర్యాప్తు చేస్తే మంచిదే. కమిటీ కూర్పులో సీబీఐ నుంచి ఇద్దరు, పుడ్ సేఫ్టి టెస్టింగ్ లాబ్ నుంచి ఒకరిని నియమించడం వరకు ఫర్వాలేదు.రాష్ట్రం నుంచి ఇద్దరు సిట్ సభ్యులను నియమించడం వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది. వారు చంద్రబాబు పక్షాన ఆయనకు అనుకూలంగా ప్రభావితం చేయరన్న గ్యారంటీ ఉంటుందా.? కేంద్రంలోని సీబీఐపై కూడా విపక్షాలు పలు విమర్శలు చేస్తుంటాయి. అలాంటప్పుడు సుప్రీంకోర్టు నేరుగా ఈ అంశాన్ని పర్యవేక్షిస్తే బాగుండేదేమో! లేక ఒక న్యాయమూర్తిని లేదా రిటైర్డ్ జడ్జిని నియమించి విచారణ చేయిస్తే ఎక్కువ ఉపయోగం ఉండేదేమో ఆలోచించాలి. తొలుత విచారణ జరిపినప్పుడు న్యాయమూర్తులు చేసిన ఘాటైన వ్యాఖ్యలకు తగినట్లుగా ఈ విచారణ సంఘం ఏర్పాటు కాలేదేమో అన్న అభిప్రాయం ప్రబల వచ్చు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చేయాల్సిన అపచారం అంతా చేసి, కేవలం రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీయడానికి తప్పుడు ఆరోపణలు చేసి ఇంత గందరగోళం సృష్టించారన్న భావన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయడం , అందులో వివాదాస్పద ,పక్షపాతంతో పనిచేసే అధికారులను నియమించిన వైనంపై రాజకీయ పార్టీలు తప్పు పట్టాయి. ఇన్ని పరిణామాలు జరిగిన ఈ ఉదంతంలో తొలుత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లనే విచారించాలి. అలాగే టీడీపీ ఆఫీస్ లో టెస్ట్ రిపోర్టు అంటూ విడుదల చేసిన టీడీపీ ప్రతినిధులను ప్రశ్నించాలి.తదుపరి ఈ ఓ శ్యామలరావును ప్రకటనలపై దర్యాప్తు చేయాలి.టెస్ట్ రిపోర్టు వచ్చిన రెండు నెలల తర్వాత దానిని ముఖ్యమంత్రి ఎందుకు బహిర్గతం చేశారో తెలుసుకోవాలి. ఎలాగూ ఏఆర్ సంస్థకు టెండర్ వచ్చిన దానిపై విచారణ జరుగుతుంది? అయితే వారు నెయ్యి సరఫరా చేసింది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. మాజీ చైర్మన్ లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలను, మాజీ ఈఓ ధర్మారెడ్డిని ఎలాగూ కమిటీ విచారిస్తుంది! ఏది ఏమైనా మొత్తం హైందవ సమాజం అంతటిని గందరగోళంలోకి నెట్టిన ఈ అంశంలో, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారు సృష్టించిన ఈ వివాదంలో నిష్పక్షపాతంగా కమిటీ విచారణ జరగాలి.అప్పుడే తిరుమలేశుని లడ్డూ ప్రసాదానికి జరిగిన అపచారానికి పరిహారం అయినట్లు అవుతుంది.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సుప్రీంకోర్టు దెబ్బకు తప్పు ఒప్పుకున్న చంద్రబాబు
-
‘ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రకు తెరలేపారు’
తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వంద రోజుల పాలనపై ప్రజల దృష్టిని మరల్చేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదు అంటూ ఎద్దేవా చేశారు పెద్దిరెడ్డి. ‘ లడ్డూ ప్రసాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. పుంగనూరులో చిన్నారి అశ్వియా అంజుమ్ కిడ్నాప్‌కు గురై హత్య గావించబడితే పోలీసులు కనీసం పట్టించుకోలేదు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ కాలిపోతే డిజిపి స్పెషల్ ఫ్లైట్, ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చారు. డిజిపి పనితీరు మార్చుకోవాలి. మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనలో నాపై బురద చల్లెందుకు ఎన్నో కుట్రలు చేశారు, ఎలాంటి ఆధారాలు లభించక లేదు’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన అశ్వియా అనే బాలిక కిడ్నాప్ గురై ఆ తర్వాత దారుణంగా హత్య చేయబడింది. అశ్వియా కుటుంబ సభ్యులను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలు పరామర్శించనున్నారు. అయితే పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిలు హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు పుంగనూరుకు వెళుతున్నారన్న సమాచారంతో అక్కడ పెద్ద ఎత్తును పోలీసులను మోహరించింది చంద్రబాబు సర్కారు. -
తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై సీబీఐ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘సిట్’ను పక్కనపెట్టిన సుప్రీంకోర్టు
-
లడ్డూలో కాదు.. కూటమిలోనే కల్తీ
సాక్షి, విశాఖపట్నం: పవిత్రమైన తిరుపతి లడ్డూను రాజకీయ దుర్బుద్ధితో అపవిత్రం చేశారు. వందరోజుల పాలన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు విషరాజకీయాలకు తెరతీశారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపేశారంటూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. రెండు రోజుల తర్వాత.. కల్తీ నెయ్యి అనీ.. మరికొద్ది రోజుల తర్వాత.. లడ్డూలో కలవలేదనీ.. కలవకుండా ఆపేశామంటూ పూటకోమాట మార్చేస్తూ.. భక్తుల మనోభావాలతో రాజకీయ చదరంగమాడారు. దీనిపై నిస్పాక్షికమైన దర్యాప్తు జరిపించాలంటూ వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు, అండ్ కో చేసిన వ్యాఖ్యలపై భారత అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాల్లేకుండా.. దేవుడిని రాజకీయాల్లోకి లాగారంటూ మండిపడింది. చేసిన తప్పుడు వ్యాఖ్యల్ని సమరి్థంచుకునేందుకు కూటమి ప్రభుత్వం.. రాష్ట్ర పోలీసులతో సిట్ పేరుతో ఆడాలనుకున్న నాటకాలకు ధర్మాసనం స్వస్తి పలికింది. లడ్డూ వ్యవహారం సీబీఐకి అప్పగించి.. స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కుటిల స్వార్థంతో భగవంతుడిని రాజకీయాల్లోకి లాగారంటూ ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. సుప్రీం నిర్ణయం చంద్రబాబుకు చెంపపెట్టులాంటిదని అభిప్రాయపడుతున్నారు. తప్పు జరిగితే దేవుడే చూసుకుంటాడని.. తప్పుడు ఆరోపణలు చేసినా.. ఏడుకొండల వాడు విడిచి పెట్టరంటున్నారు. మతజ్వాలలు రగిలించిన ప్రభుత్వ వ్యవహారంపై చిన్నా పెద్దా తేడాలేకుండా.. యావత్ ప్రజలు ఆగ్రహిస్తున్నారు. అసలు లడ్డూలో కల్తీ లేదని.. కూటమి ప్రభుత్వం చేసిన విషప్రచారంలోనే ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుంటే బావుంటుంది ఈ మధ్య మా మిత్రులతో కలిసి భద్రాచలం వెళ్లాం. అక్కడ ప్రసాదం తినే ముందు సీఎం చంద్రబాబు దుర్బుద్ధితో చేసిన కల్తీ లడ్డూ ప్రకటన గుర్తుచేసుకొని బాధపడ్డాం. ప్రత్యేక దర్యాప్తు బృందం ఐదుగురితో ఏర్పాటు చేసిన బృందంలో ఏపీకి చెందిన ఇద్దరు పోలీస్ అధికారులకు బదులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉంటే బావుంటుంది. సిట్ విచారణ చేయడానికి సుప్రీంకోర్టు కాలపరిమితి విధించాలి. – జీవీఎన్ సంజయ్, సాఫ్ట్ వేర్ ఆపరేషన్ మేనేజర్ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. తెలిసితెలిసి కలియుగ దైవం వేంకటేశ్వరస్వామితో ఆడుకుంటే వారికి మామూలుగా పాపం అంటదు. వంద రోజుల ప్రభుత్వ పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కల్తీ లడ్డూ వివాదం కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది. చివరకు మాజీ సీఎం వైఎస్ జగన్‌ను తిరుమల రాకుండా మతం రంగు పులిమి అడ్డు తగిలారు. సుప్రీంకోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అయింది. –దంతులూరి వెంకట శివ సూర్యనారాయణరాజు, ఎంపీపీ, భీమిలిచంద్రబాబు ప్రకటన ఆవేదనకు గురిచేసింది నేను మూడేళ్ల నుంచి తిరుమల వెంకటరమణమూర్తి గోవింద మాల వేస్తున్నాను. తిరుమల లడ్డూ ప్రసాదం జంతువుల కొవ్వుతో కల్తీ చేశారనే చంద్రబాబు ప్రకటన చాలా ఆవేదనకు గురిచేసింది. ఆధారం లేకుండా ముఖ్యమంత్రిగా ఎలా బహిరంగ ప్రకటన చేశారని చంద్రబాబును సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించిన తర్వాత కాస్త మనసు కుదుటపడింది. దర్యాప్తులో ఏ రాజకీయ పార్టీది తప్పని తేలితే ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలి. – మజ్జి రవికుమార్, తిరుమల గోవింద మాలధారుడుచంద్రబాబును బహిష్కరించాలి హిందూ ధర్మ పరిరక్షణే మూల సిద్ధాంతంగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగం బీజేపీ మెజార్టీ హిందువుల ఓట్లతో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. హిందువుల మనోభావాలను కించపరిచేలా చంద్రబాబు తిరుపతి లడ్డూపై వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తిని ఎన్డీఏ కూటమి నుంచి బహిష్కరించాలి. సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిజాయితీగా దర్యాప్తు చేయాలలి– వాసు, జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ఫైవ్మెన్ కమిటీని స్వాగతిస్తున్నా.. తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు స్వాగతిస్తున్నాం. విచారణకు సంబంధించి ఫైవ్‌మెన్ కమిటీతో నిజాలు బయటపడతాయన్న ఆశ ఉంది. కోట్లాది మంది హిందువులు..శ్రీవారి భక్తుల మనోభావాలను చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ దెబ్బతీశారు. సనాతన ధర్మం కోసం పవన్‌కల్యాణ్ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. – వాసుపల్లి గణేష్‌కుమార్, వైఎస్సార్సీపీ దక్షిణ సమన్వయకర్తశివుడు కూడా సహించడు తిరుపతి వెంకన్న లడ్డూ్డ అంటే అది దివ్యప్రపాదం. ఒకసారి స్వామికి నివేదించాక అది అమృతం కన్నా గొప్పది. దేవతలు మనంపెట్టే నైవేద్యాలను ఆఘ్రాణ రూపంగా ఆరగిస్తారని శా్రస్తాలు చెపుతాయి. అటువంటి గొప్ప ప్రసాదం మీద కల్తీ అనే అపవాదు వ్యాపింపజేయడం గొప్ప అపచారం. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా సమయోచితంగా స్పందించింది. పరమ పవిత్రమైన లడ్డూపై జరిగిన దు్రష్పచారాన్ని చంద్రచూడుడు (శివుడు) మాత్రం సహిస్తాడా?? – బులుసు వేంకటేశ్వర్లు, ప్రముఖ పద్యకవి, తగరపువలసబాబు ఆరోపణలు తగవు తిరుమల లడ్డూ విషయంలో వైఎస్సార్ సీపీ స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలని ఆది నుంచి కోరింది. సుప్రీంకోర్టు కూడా ఫైవ్‌మెన్ కమిటీతో విచారణ చేపట్టాలని ఆదేశించింది. స్వతంత్ర దర్యాప్తుతోనే వాస్తవాలు బయటకు వస్తాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ విషయంపై ఆరోపణలు చేయడం సమంజసం కాదు. – గొలగాని హరి వెంకటకుమారి, విశాఖ నగర మేయర్నిజం నిగ్గు తేలుతుంది రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌పై హిందువులెవరికీ నమ్మకం లేదు. ఒక స్వతంత్ర ఏజెన్సీ ద్వారా దర్యాప్తు జరపాలని వైఎస్సార్సీపీ తొలి నుంచి డిమాండ్ చేస్తోంది. శ్రీవారి లడ్డూపై వచ్చిన ఆరోపణలపై నిజనిజాలు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తు చేయాలని సుప్రీం ఇచ్చిన ఆదేశాలను యావత్ హిందువులు స్వాగతిస్తున్నారు. మాపార్టీ నుంచి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సు్రíపీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐ దర్యాప్తు చేయించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం స్వాగతిస్తున్నాం. – గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, విశాఖ -
దేవుడంటే బాబుకు భయమూ, భక్తి రెండూ లేవు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ దుర్భుద్ధితో మత విశ్వాసాలను ఎలా రెచ్చగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుందన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. పొలిటికల్ డ్రామాలు చేయవద్దని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పిందని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ టీడీపీ ఇప్పటికీ అసత్య ప్రచారమే చేస్తుందని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై వైఎస్ జగన్ స్పందించారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది. చంద్రబాబు రాజకీయ దుర్భుద్ధితో మత విశ్వాసాలను ఎలా రెచ్చిగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. పొలిటికల్ డ్రామాలు చేయవద్దని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది. జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారు చేసినట్టుగా చంద్రబాబు అసత్య ప్రచారం చేశారు. ఈ విషయంలో చంద్రబాబుకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. చంద్రబాబు స్వయంగా వేసుకున్న సిట్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిందన్నారు... చంద్రబాబుకు దేవుడంటే భక్తి ఉంటే ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలి. చంద్రబాబుకు భయం, భక్తి రెండూ లేవు. ఆయనకు భయం, భక్తి ఉంటే.. ఇప్పటికైనా పశ్చాత్తాపం రావాలి. చెప్పిన అబద్దాన్నే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. ఇప్పటికీ టీడీపీ ట్విట్టర్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కోర్టులు వారిని తప్పుబడితే సోషల్ మీడియాలో మాపై తప్పుడు ప్రచారానికి తెరలేపారు. లడ్డూ విషయంలో కల్తీ జరగలేదని టీటీడీ ఈవోనే చెప్పారు. చంద్రబాబు చెప్పింది తప్పు అని ఈవోనే అంటున్నారు. ఇప్పటికీ అసత్య ప్రచారమే చేస్తున్నారు. సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా చంద్రబాబు తీరు మారలేదు. సిగ్గు లేకుండా చంద్రబాబు ప్రతీ విషయాన్ని వక్రీకరిస్తున్నారు. తిరుమల ప్రతిష్టను చంద్రబాబు అపవిత్రం చేశారని ఆరోపించారు. .. లడ్డూ వివాదంలో జాతీయ మీడియా కూడా చంద్రబాబును తప్పు బట్టింది. శ్రీవారి లడ్డూ విశిష్టతను అపవిత్రం చేస్తూ చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ హయాంలో 14 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపితే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 18 సార్లు ట్యాంకర్లను తిరస్కరించాం. ఈ టెండర్లలో వచ్చిన వాళ్లకే కాంట్రాక్ట్‌లు ఇస్తారు. ప్రతీ నెయ్యి ట్యాంకర్ సర్టిఫికెట్ తీసుకుని రావాలి. నెయ్యి ట్యాంకర్లకు టీటీడీ మూడు టెస్టులు చేస్తుంది. టెస్టులు ఫెయిల్ అయితే ఆ ట్యాంకర్లను వెనక్కి పంపుతారు. ట్యాంకర్లను రిజెక్ట్ చేసినట్టు స్వయంగా ఈవోనే చెప్పారు. నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ మాత్రమే ఉందని ఈవోనే స్పష్టంగా వెల్లడించారు. చంద్రబాబు మాత్రం లడ్డూ ప్రతిష్టను దిగజార్చారు... కల్తీ నెయ్యి ప్రసాదానికి వాడలేదని ఈవో మరోసారి చెప్పారు. ఈవో చెప్పినప్పటికీ చంద్రబాబు మళ్లీ అసత్య ప్రచారాలు చేశారు. భక్తుల మనోభావాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని కోర్టు చెప్పింది. రాజకీయ డ్రామాలు చేయవద్దని హెచ్చరించింది. చంద్రబాబు మంచి వ్యక్తి అయితే ఆధారాలను చూసి సిగ్గుపడాలి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
భక్తుల మనోభావాలు దెబ్బతినేలా బాబు వ్యవహరించారు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నట్టు తెలిపారు.ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘టీటీడీ లడ్డూ విషయంలో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నాము. సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నాము. పొలిటికల్ కామెంట్ చేయొద్దు అని కోర్టు చెప్పింది. చంద్రబాబు వ్యాఖ్యల కారణంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిజాలు బయటపెట్టేలా విచారణ జరిపించాలని పిటిషన్ వేయడం జరిగింది. ఆరోపణలు నిజమైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెప్పాము.నా హయాంలో ఏఆర్ కంపెనీ నుంచి ఎప్పుడూ నెయ్యి సరఫరా జరగలేదు. ఎన్నికల సమయంలో టెండర్ ఆమోదించారు. కల్తీ జరిగితే ఎలాంటి పదార్థాలు కలిశాయి అన్నది కూడా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నింద వేసింది కాబట్టి ఇక వెనక్కి వెళ్లొద్దు అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. విచారణ ముగిసే వరకు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంటుంది. మాపై చేసిన నిందలు తొలగిపోతాయని అనుకుంటున్నాము. మేము ఉన్న సమయంలో కల్తీ జరగలేదు. లడ్డులను ఇంతవరకు టెస్ట్ చేయలేదు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ‘సుప్రీం’ నిర్ణయం చంద్రబాబుకు చెంపపెట్టు: వైఎస్సార్సీపీ -
తిరుమలలో అపశృతి
తిరుపతి,సాక్షి : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రారంభం ముందు అపశృతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభంపై ఇనుప కొక్కి విరిగింది. సాయంత్రం ధ్వజారోహణం సమయంలో ధ్వజస్తంభంపై గరుడ పఠాని ఈ కొక్కి ద్వారానే ఏగుర వేయాల్సి ఉందని అర్చకులు తెలిపారు. కొద్దిసేపటి క్రితం కొక్కి విరగడంతో టీటీడీ మరమ్మత్తు పనులు ప్రారంభించింది. అర్చకులు ద్వారా ధ్వజస్తంభంపై టీటీడీ మరమ్మత్తు పనులను ముమ్మరం చేసింది. -
సీబీఐ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్ దర్యాప్తును స్వాగతిస్తున్నాం
-
‘మీరే హిందూ మతానికి అసలైన శత్రువులు’.. పవన్‌కు డీఎంకే కౌంటర్
చెన్నై: తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కౌంటర్ ఇచ్చింది. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేసిన రాజకీయంపై సుప్రీం కోర్టు మొట్టి కాయలు వేసిన విషయాన్ని గుర్తు చేసింది పవన్ వారాహి డిక్లరేషన్ సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా మాట్లాడారు. ‘సనాతన ధర్మం వైరస్ లాంటిదని, ఆ మహమ్మారిని నిర్మూలించాలని ఈ మధ్య ఓ యువ నాయకుడు మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరైనా సరే దాన్ని నిర్మూలించాలనుకుంటే, వారే తుడిచి పెట్టుకుని పోతారు. తిరుపతి బాలాజీ సాక్షిగా ఈ మాట చెబుతున్నా’ అంటూ హెచ్చరించారు.అయితే పవన్ వ్యాఖ్యలపై డీఎంకే గట్టి కౌంటర్ ఇచ్చింది. డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ.. తమ పార్టీ ‘ఏ మతం గురించి, ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదు.. కుల దురాగతాలు, అంటరానితనం గురించి మాత్రమే మాట్లాడుతుంది’ అని సూచించారు. తిరుమల లడ్డూ వివాదంపై సెప్టెంబర్ 30న తొలిసారి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా.. శ్రీవారి ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించడం తగదంటూ మొట్టికాయలు వేసింది. తాజాగా ఆ వ్యాఖ్యల్ని ప్రస్తావించిన హఫీజుల్లా..‘ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీలే హిందూ మతం, మానవత్వానికి నిజమైన శత్రువులు ’ ద్వజమెత్తారు. డీఎంకే ఏ మతం గురించి మాట్లాడదు. మతాన్ని, హిందూ దేవుళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేది బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్. వారే అసలైన శత్రువులు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో మీకు మీరే సాటి అని సెటైర్లు వేశారు. ‘ఇంకా.. కులం, అంటరానితనంపై అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, పెరియార్ ఇతర ద్రావిడ ఉద్యమ వ్యవస్థాపకుల తరహా వైఖరినే డీఎంకే అవలంభిస్తుంది. వాటికి అనుగుణంగా కులం, అంటరానితనం గురించి పోరాడుతుంది. వ్యతిరేకిస్తుందని సూచించారు.👉చదవండి: సుప్రీంలో చంద్రబాబుకు ఎదురు దెబ్బ -
స్వతంత్ర సిట్ దర్యాప్తుపై వైవీ సుబ్బారెడ్డి ఫస్ట్ రియాక్షన్
-
‘సుప్రీం’ నిర్ణయం చంద్రబాబుకు చెంపపెట్టు: వైఎస్సార్సీపీ
సాక్షి, తిరుపతి: సీబీఐ సిట్ బృందం విచారణ పూర్తిగా స్వాగతిస్తున్నామని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుమల లడ్డూ కేసులో సుప్రీం కోర్టు నిర్ణయంపై ఆయన స్పందిస్తూ.. లడ్డూపై కేవలం దురుద్దేశ పూర్వకంగా చంద్రబాబు ఆరోపణలు చేశారన్నారు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందనే నమ్మకం ఉందన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆదేశాలతోనే సుప్రీంకోర్టు ద్వారా ఆదేశాలు వచ్చాయన్నారు. సీబీఐ విచారణ ద్వారా నిజాలు నిగ్గు తేలతాయని, సత్యం వెలుగులోకి వస్తుందని భూమన అన్నారు. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం: వైవీ సుబ్బారెడ్డిసుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నామని వైఎస్సార్సీపీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పొలిటికల్ కామెంట్లు చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. చంద్రబాబు వ్యాఖ్యలతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిజాలు బయటపెట్టేలా విచారణ జరిపించాలని పిటిషన్ వేశామన్నారు. ఆరోపణలు నిజమైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెప్పాము. నా హయాంలో ఏ.ఆర్ కంపెనీ నుంచి ఎప్పుడూ నెయ్యి సరఫరా జరగలేదు. కల్తీ జరిగితే ఎలాంటి పదార్థాలు కలిశాయన్నది కూడా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నింద వేసింది కాబట్టి ఇక వెనక్కి వెళ్లొద్దన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. విచారణ ముగిసే వరకు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంటుంది. మా పై చేసిన నిందలు తొలగిపోతాయని అనుకుంటున్నాము. మా సమయంలో కల్తీ జరగలేదు’’ అని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.బాబు అబద్ధాలు తేటతెల్లమయ్యాయి: రవీంద్రనాథ్రెడ్డితిరుమల లడ్డు కల్తీ ఆరోపణలపై సుప్రీం కోర్టు సిట్ వేయడం చంద్రబాబుకు చెంపపెట్టని, ఇప్పటికైనా చంద్రబాబు దేవుడిని తన స్వార్ధ రాజకీయాలకు వాడుకోవడం మానుకోవాలని వైఎస్సార్సీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరుని భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారని, లడ్డూలో కల్తీ నెయ్యి వాడకపోయినా కల్తీ జరిగిందంటూ చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేశారని ఆయన అన్నారు. నేటి సుప్రీం కోర్టు తీర్పుతో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలని తేటతెల్లమయ్యాయని, సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పారు.స్వతంత్ర దర్యాప్తుతో వాస్తవాలు బయటికి..: ఆర్కే రోజాశ్రీవారి లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు నిర్ణయం ఆహ్వానించదగ్గ పరిణామం’’ అని మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్ చేశారు. సున్నితమైన భక్తుల మనోభావాలతో కూడుకున్న శ్రీవారి ప్రసాదాల విషయంలో రాజకీయ దురుద్దేశపూరిత వ్యాఖ్యలు మానుకుంటే మంచిదని ఆమె హితవు పలికారు.‘‘మొదటి నుంచి మేము భావిస్తున్నది రాష్ట్ర ముఖ్యమంత్రే విచారణ, ఆధారాలతో సంబంధం లేకుండా రాజకీయ ఆరోపణలు చేసిన నేపథ్యంలో వారి పరిధిలోని విచారణతో నిజాలు బయటికి రావని స్వతంత్ర దర్యాప్తు సంస్థ కావాలని కోరుకున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా సిట్ సరిపోదని, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో విచారణ జరగాలనే వాదనతో మా డిమాండ్‌కు విశ్వసనీయత పెరిగింది. సుప్రీం పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తుతో వాస్తవాలు బయటికి వస్తాయని, తద్వారా గాయపడిన కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని పునరుద్ధరించినట్టు అవుతుందని తిరుపతి ఆడబిడ్డగా నమ్ముతున్నాను..!!’’ అని ఆర్కే రోజా ట్వీట్ చేశారు.శ్రీవారి లడ్డూ ప్రసాదాల వివాదంలో #SupremeCourt తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామం. సుప్రీం తీర్పుతో అయినా సున్నితమైన భక్తుల మనోభావాలతో కూడుకున్న శ్రీవారి ప్రసాదాల విషయంలో రాజకీయ దురుద్దేశపూరిత వ్యాఖ్యలు అందరూ మానుకుంటే మంచిది. మొదటి నుంచి మేము భావిస్తున్నది రాష్ట్ర…— Roja Selvamani (@RojaSelvamaniRK) October 4, 2024 చంద్రబాబు, పవన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: కొట్టు సత్యనారాయణ స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయడం స్వాగతిస్తున్నామని మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు వంద రోజుల పరిపాలన ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకొని లడ్డూ రాజకీయం చేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనం కోట్లాది మంది హిందువుల మనోభావాలు నిలబెట్టింది. దుర్మార్గుడైన ముఖ్యమంత్రి రాజకీయ క్రీడలకు ఇది చెంపపెట్టు. లడ్డూ వివాదంపై ఇప్పటికైనా ప్రభుత్వం పుల్ స్టాప్ పెట్టి సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉండాలి.ఇదీ చదవండి: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ..స్వతంత్ర సిట్ కమిటీ చంద్రబాబు పవన్ కల్యాణ్‌లను కూడా విచారణ చేయాలి. కల్తీ లడ్డూలు అయోధ్య రామలయానికి కూడా పంపారంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఏ ఆధారాలతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.? ఎవరు స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్టు మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మంలో బ్రాహ్మణ ఇతరులు సైతం కూడా ఆచరించే ఆగమాలు సైతం ఉన్నాయి. సనాతన ధర్మంపై పవన్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు.సుప్రీంకోర్టు నిర్ణయం స్వాగతిస్తున్నాం: కాకాణిసుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకి చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. మొదటి నుంచి వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్న దానినే సుప్రీంకోర్టు ఏకీభవించినట్లు అనిపించిందన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ద్వారా నిజానిజాలు బయటికి రావు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు అయ్యే స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారానే నిజాలు బయటికి వస్తాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉండాలి హిందూ భక్తులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. రాజ్యాంగం, కోర్టుల గురించి పవన్‌కు అవగాహన లేదు. హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదు. వారాహి డిక్లరేషన్‌లో పవన్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణ కింద పరిగణలోకి తీసుకోవాలి.చంద్రబాబు రాజకీయ పతనం ఆరంభమైంది: తోపుదుర్తితిరుపతి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పుపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి స్పందిస్తూ.. తిరుపతి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. సుప్రీంకోర్టు.. చంద్రబాబుని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మడం లేదు. చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం భగవంతున్ని సైతం వదలకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు. చంద్రబాబు రాజకీయ పతనం ఆరంభమైంది. చంద్రబాబు సుప్రీం కోర్టు నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, లేదంటే రాజీనామా చేయాలి’ అని తోపుదుర్తి డిమాండ్ చేశారు. -
లడ్డూ వివాదంపై సుప్రీం ఆదేశాలు.. అంబటి రియాక్షన్
-
చంద్రబాబుకు సుప్రీం ఊహించని దెబ్బ..