లడ్డూ వ్యవహారం సీబీఐకి అప్పగించడంపై సర్వత్రా హర్షం
సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్ ఏర్పాటు చెయ్యాలని ఆదేశం
భగవంతుడ్ని రాజకీయాల్లోకి లాగడంపై ధర్మాసనం ఆగ్రహం
సుప్రీం నిర్ణయంతో ఉలిక్కిపడుతున్న కూటమి నేతలు
తప్పు జరిగితే దేవుడే చూసుకుంటాడంటున్న సామాన్యులు
రాజకీయ లబి ్ధకోసం దేవుడ్ని వాడుకోవడంపై మండిపాటు
సాక్షి, విశాఖపట్నం: పవిత్రమైన తిరుపతి లడ్డూను రాజకీయ దుర్బుద్ధితో అపవిత్రం చేశారు. వందరోజుల పాలన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు విషరాజకీయాలకు తెరతీశారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపేశారంటూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. రెండు రోజుల తర్వాత.. కల్తీ నెయ్యి అనీ.. మరికొద్ది రోజుల తర్వాత.. లడ్డూలో కలవలేదనీ.. కలవకుండా ఆపేశామంటూ పూటకోమాట మార్చేస్తూ.. భక్తుల మనోభావాలతో రాజకీయ చదరంగమాడారు.
దీనిపై నిస్పాక్షికమైన దర్యాప్తు జరిపించాలంటూ వైఎస్సార్‌సీపీ తరఫున రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు, అండ్ కో చేసిన వ్యాఖ్యలపై భారత అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాల్లేకుండా.. దేవుడిని రాజకీయాల్లోకి లాగారంటూ మండిపడింది. చేసిన తప్పుడు వ్యాఖ్యల్ని సమరి్థంచుకునేందుకు కూటమి ప్రభుత్వం.. రాష్ట్ర పోలీసులతో సిట్ పేరుతో ఆడాలనుకున్న నాటకాలకు ధర్మాసనం స్వస్తి పలికింది.
లడ్డూ వ్యవహారం సీబీఐకి అప్పగించి.. స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కుటిల స్వార్థంతో భగవంతుడిని రాజకీయాల్లోకి లాగారంటూ ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. సుప్రీం నిర్ణయం చంద్రబాబుకు చెంపపెట్టులాంటిదని అభిప్రాయపడుతున్నారు. తప్పు జరిగితే దేవుడే చూసుకుంటాడని.. తప్పుడు ఆరోపణలు చేసినా.. ఏడుకొండల వాడు విడిచి పెట్టరంటున్నారు. మతజ్వాలలు రగిలించిన ప్రభుత్వ వ్యవహారంపై చిన్నా పెద్దా తేడాలేకుండా.. యావత్ ప్రజలు ఆగ్రహిస్తున్నారు. అసలు లడ్డూలో కల్తీ లేదని.. కూటమి ప్రభుత్వం చేసిన విషప్రచారంలోనే ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుంటే బావుంటుంది
ఈ మధ్య మా మిత్రులతో కలిసి భద్రాచలం వెళ్లాం. అక్కడ ప్రసాదం తినే ముందు సీఎం చంద్రబాబు దుర్బుద్ధితో చేసిన కల్తీ లడ్డూ ప్రకటన గుర్తుచేసుకొని బాధపడ్డాం. ప్రత్యేక దర్యాప్తు బృందం ఐదుగురితో ఏర్పాటు చేసిన బృందంలో ఏపీకి చెందిన ఇద్దరు పోలీస్ అధికారులకు బదులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉంటే బావుంటుంది. సిట్ విచారణ చేయడానికి సుప్రీంకోర్టు కాలపరిమితి విధించాలి.
– జీవీఎన్ సంజయ్, సాఫ్ట్ వేర్ ఆపరేషన్ మేనేజర్
ప్రజల దృష్టిని మళ్లించేందుకే..
తెలిసితెలిసి కలియుగ దైవం వేంకటేశ్వరస్వామితో ఆడుకుంటే వారికి మామూలుగా పాపం అంటదు. వంద రోజుల ప్రభుత్వ పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కల్తీ లడ్డూ వివాదం కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది. చివరకు మాజీ సీఎం వైఎస్ జగన్‌ను తిరుమల రాకుండా మతం రంగు పులిమి అడ్డు తగిలారు. సుప్రీంకోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అయింది.
–దంతులూరి వెంకట శివ సూర్యనారాయణరాజు, ఎంపీపీ, భీమిలి
చంద్రబాబు ప్రకటన ఆవేదనకు గురిచేసింది
నేను మూడేళ్ల నుంచి తిరుమల వెంకటరమణమూర్తి గోవింద మాల వేస్తున్నాను. తిరుమల లడ్డూ ప్రసాదం జంతువుల కొవ్వుతో కల్తీ చేశారనే చంద్రబాబు ప్రకటన చాలా ఆవేదనకు గురిచేసింది. ఆధారం లేకుండా ముఖ్యమంత్రిగా ఎలా బహిరంగ ప్రకటన చేశారని చంద్రబాబును సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించిన తర్వాత కాస్త మనసు కుదుటపడింది. దర్యాప్తులో ఏ రాజకీయ పార్టీది తప్పని తేలితే ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలి.
– మజ్జి రవికుమార్, తిరుమల గోవింద మాలధారుడు
చంద్రబాబును బహిష్కరించాలి
హిందూ ధర్మ పరిరక్షణే మూల సిద్ధాంతంగా పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ విభాగం బీజేపీ మెజార్టీ హిందువుల ఓట్లతో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. హిందువుల మనోభావాలను కించపరిచేలా చంద్రబాబు తిరుపతి లడ్డూపై వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తిని ఎన్‌డీఏ కూటమి నుంచి బహిష్కరించాలి. సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిజాయితీగా దర్యాప్తు చేయాలలి
– వాసు, జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్
ఫైవ్‌మెన్ కమిటీని స్వాగతిస్తున్నా..
తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు స్వాగతిస్తున్నాం. విచారణకు సంబంధించి ఫైవ్‌మెన్ కమిటీతో నిజాలు బయటపడతాయన్న ఆశ ఉంది. కోట్లాది మంది హిందువులు..శ్రీవారి భక్తుల మనోభావాలను చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ దెబ్బతీశారు. సనాతన ధర్మం కోసం పవన్‌కల్యాణ్ మాట్లాడడం చాలా
విడ్డూరంగా ఉంది.
– వాసుపల్లి గణేష్‌కుమార్, వైఎస్సార్‌సీపీ దక్షిణ సమన్వయకర్త
శివుడు కూడా సహించడు
తిరుపతి వెంకన్న లడ్డూ్డ అంటే అది దివ్యప్రపాదం. ఒకసారి స్వామికి నివేదించాక అది అమృతం కన్నా గొప్పది. దేవతలు మనంపెట్టే నైవేద్యాలను ఆఘ్రాణ రూపంగా ఆరగిస్తారని శా్రస్తాలు చెపుతాయి. అటువంటి గొప్ప ప్రసాదం మీద కల్తీ అనే అపవాదు వ్యాపింపజేయడం గొప్ప అపచారం. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా సమయోచితంగా స్పందించింది. పరమ పవిత్రమైన లడ్డూపై జరిగిన దు్రష్పచారాన్ని చంద్రచూడుడు (శివుడు) మాత్రం సహిస్తాడా??
– బులుసు వేంకటేశ్వర్లు, ప్రముఖ పద్యకవి, తగరపువలస
బాబు ఆరోపణలు తగవు
తిరుమల లడ్డూ విషయంలో వైఎస్సార్ సీపీ స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలని ఆది నుంచి కోరింది. సుప్రీంకోర్టు కూడా ఫైవ్‌మెన్ కమిటీతో విచారణ చేపట్టాలని ఆదేశించింది. స్వతంత్ర దర్యాప్తుతోనే వాస్తవాలు బయటకు వస్తాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ విషయంపై ఆరోపణలు చేయడం సమంజసం కాదు.
– గొలగాని హరి వెంకటకుమారి, విశాఖ నగర మేయర్
నిజం నిగ్గు తేలుతుంది
రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌పై హిందువులెవరికీ నమ్మకం లేదు. ఒక స్వతంత్ర ఏజెన్సీ ద్వారా దర్యాప్తు జరపాలని వైఎస్సార్‌సీపీ తొలి నుంచి డిమాండ్ చేస్తోంది. శ్రీవారి లడ్డూపై వచ్చిన ఆరోపణలపై నిజనిజాలు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తు చేయాలని సుప్రీం ఇచ్చిన ఆదేశాలను యావత్ హిందువులు స్వాగతిస్తున్నారు. మాపార్టీ నుంచి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సు్రíపీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐ దర్యాప్తు చేయించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం స్వాగతిస్తున్నాం.
– గుడివాడ అమర్‌నాథ్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, విశాఖ
Comments
Please login to add a commentAdd a comment