
తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) బాపట్ల జిల్లా మేదరమెట్లకు బయల్దేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ పార్థీవదేహానికి నివాళులు అర్పించారు వైఎస్ జగన్. వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు జగన్.

అనారోగ్యంతో పాటు, వయోభారంతో బాధపడుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ(85)సోమవారం కన్నుమూశారు. పిచ్చమ్మ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు

మాతృమూర్తి మృతి వార్త తెలియడంతో వైవీ సుబ్బారెడ్డి హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయలుదేరారు. పార్లమెంట్ సమావేశాల కోసం సుబ్బారెడ్డి నిన్ననే ఢిల్లీకి వెళ్లారు. నేడు ఒంగోలులోనే సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ పార్థివదేహం ఉండనుంది. ఈ రోజు మేదరమెట్లలో ఆమె అంత్యక్రియల జరగనున్నాయి.

Comments
Please login to add a commentAdd a comment