Bapatla District
-
తాళపత్ర గ్రంథ పరిష్కారానికి కేరాఫ్ చంద్రమౌళి
అద్దంకి: తాళ పత్రాల గ్రంథాలను పరిష్కరించడంలో బాపట్ల జిల్లా అద్దంకి పట్టణానికి చెందిన జ్యోతి చంద్రమౌళి కేరాఫ్‌గా నిలుస్తున్నారు. ఈయన తాళపత్ర గ్రంథాలను పరిష్కరించడంలో కృష్ణా జిల్లాకు చెందిన తంగిరాల సుబ్బారావు తరువాత రాష్ట్రంలోనే రెండో వ్యక్తిగా నిలిచాడు. ఈయన వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేసే సమయం నుంచి రిటైరైన తరువాత తాళపత్రాలను సేకరించి వాటిని శుభ్రం చేసి వాటికి పుస్తక రూపం ఇచ్చి భావితరాలకు అందేలా కృషి చేస్తున్నారు. ఆయన ఇప్పటికి పది తాళపత్రాల గ్రంథాలను పరిష్కరించి శుద్ధ ప్రతులను తయారు చేశారు. ఇప్పటికే ఒక గ్రంథం అచ్చయింది. మిగిలిన వాటికి పుస్తకం రూపం ఇవ్వడం ఖర్చుతో కూడుకున్న పని. ప్రభుత్వం ప్రోత్సాహమో, లేక ఏదైనా సంఘాల చేయూత ఉంటేనే అవి అచ్చు అవుతాయి. ఇప్పటి వరకు పరిష్కరించిన తాళపత్ర గ్రంథాలు చంద్రమౌళి తన దగ్గరకు తెచ్చి ఇచ్చిన తాళపత్ర గ్రంథాల్లో ఇప్పటికి పోచయ్య బొంగరాలాట, కాటంరాజు కథ, వల్లురాజు కథ, ఆవుల మేపు, భట్టు రాయభారం, తరిగొండ వెంగమాంబ కథ, రాజయేగామృత సారం, గ్రామీణ వైద్యం అనే గ్రంథాలకు పుస్తకం రూపం ఇచ్చారు. పురాతన తాళపత్రాల గ్రంథాలను పరిష్కరించడం అంత తేలికైనపని కాదు. ఒక్కో ఆకు భద్రంగా బయటకు తీసి వాటికి రెండు రకాల రసాయనాలు పూస్తేనే అందులోని అక్షరాలు కనిపించి పరిష్కారానికి ఉపయోగిస్తాయి. తాళపత్ర పూర్వ చరిత్ర.. జ్యోతి చంద్రమౌళి అందించిన వివరాల మేరకు ప్రస్తుతం, ఏదైనా రచన చేయాలన్నా ఉత్తరం రాయాలన్నా కాగితం అవసరం. అయితే అది ఇప్పటి మాట. ఒకప్పుడు కాగితాలు లేవు. అప్పుడు గ్రంథాలను రాయాలన్నా ఉత్తరాలు రాయాలన్నా తాళ (తాటి ఆకులు) పత్రాలను వాడేవారు. ప్రముఖంగా గ్రంథాలను రాయడానికి వీటిని ఎక్కువగా ఉపయేగించేవారు. అంతకు మునుపు తామ్ర పత్రాలు అంటే సన్నగా చేసిన రేకులపైన రాసేవారు. ఇవి 300 సంవత్సరాలకు పైగానే మన్నుతాయి. తాళపత్రాల సేకరణకు ప్రోత్సహించాలితాళపత్ర గ్రంథాలు ఇప్పటికే వేటపాలెం, రాజమండ్రి, కడప వంటి గ్రంథాలయాల్లో ఉన్నాయి. అయితే ఇంకా చాలా గ్రంథాలు తరతరాల నుంచి ఇళ్లల్లో ఉన్నాయి. ఆయా గ్రంథాలను బయటకు తీసి వాటికి పుస్తక రూపం ఇస్తే ఆయా గ్రంథాలు వెలుగు చూస్తాయి. – విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, రచయిత, శాస్త్ర పరిశోధకుడు -
బాపట్ల జిల్లా పర్చూరులోని ఓ టింబర్ డిపోలో అగ్నిప్రమాదం
-
కొల్లూరులో రెస్టారెంట్ ధ్వంసం
కొల్లూరు : బాపట్ల జిల్లా కొల్లూరులో ఈనాడు గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో రెస్టారెంట్ నిర్వాహకులు ఆందోళనకు దిగారు. పోలీసులు, రెస్టారెంట్ నిర్వాహకుల కథనం మేరకు.. కొల్లూరుకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన్‌ప్రసాద్ ఆదివారం అర్ధరాత్రి రెస్టారెంట్ నిర్వాహకులకు రెండు పర్యాయాలు ఫోన్ చేసి అసభ్యపదజాలంతో దూషించారు. అంతేగాక రెస్టారెంట్ ఏమవుతుందో చూసుకోవాలంటూ హెచ్చరించారు.అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం నిర్వాహకులు వచ్చి చూసే సరికి రెస్టారెంట్ ధ్వంసమై కనిపించింది. దీంతో నిర్వాహకులు, బంధువులు ఆందోళనకు దిగారు. తెనాలి–రేపల్లె రహదారిపై కొల్లూరు బస్టాండ్ సెంటర్లో బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. గతంలో మద్యం దుకాణాల టెండర్ల సమయంలో ఇదే టీడీపీ నేత తాము వేసిన రూ.4 లక్షలు విలువ చేసే రెండు టెండర్ల డాక్యుమెంట్లను బలవంతంగా తీసుకుని బెదిరింపులకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రెస్టారెంట్ నిర్వాహకుడు గిరికుమార్స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు కొల్లూరు ఎస్ఐ ఏడుకొండలు చెప్పారు. -
మంటల్లో సజీవ దహనమైన అక్కచెల్లెలు
-
భూగర్భజలం పుష్కలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఐదేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ భూగర్భ జలాల లభ్యత పెరిగింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో భూగర్భ జలమట్టం 4.19 మీటర్లు పెరిగింది. భూగర్భ జలమట్టం పెరిగిన జిల్లాల్లో శ్రీసత్యసాయి జిల్లా (12.69 మీటర్లు) మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ప్రకాశం జిల్లా (8.52 మీటర్లు), మూడో స్థానంలో పల్నాడు జిల్లా (7.97 మీటర్లు) ఉన్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా(1.16 మీటర్లు), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (1.31 మీటర్లు), పార్వతీపురం మన్యం జిల్లా(1.52 మీటర్లు)లో అత్యల్పంగా పెరిగాయి. 26 జిల్లాల్లో భూగర్భ జలాలు పుష్కలంగా పెరగడంతో బోరు బావుల కింద రబీలో పంట సాగుకు, వేసవిలో తాగు నీటికి ఇబ్బందులు ఉండవని అధికారవర్గాలు చెబుతున్నాయి. సగటున 7.6 మీటర్లలో భూగర్భ జలాల లభ్యత నీటి సంవత్సరం జూన్ 1తో ప్రారంభమై.. మే 31తో ముగుస్తుంది. గత నీటి సంవత్సరం ముగిసేటప్పటికి అంటే 2024 మే 31కి రాష్ట్రంలో భూగర్భ జలాలు 11.79 మీటర్లలో లభ్యమయ్యేవి. గత ఐదేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల సమృద్ధిగా వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటికి 858 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా ఇప్పటిదాకా 950.57 మిల్లీమీటర్లు కురిసింది. అంటే సాధారణ వర్షపాతం కంటే 10.79 శాతం ఎక్కువ. దాంతో భూగర్భ జలాలు పెరిగాయి. ప్రస్తుతం భూగర్భ జలమట్టం సగటున 7.6 మీటర్లకు చేరుకుంది. అంటే.. ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటికే 4.19 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి.బాపట్ల జిల్లా గరిష్టం.. తూర్పు గోదావరిలో కనిష్టం భూగర్భ జలాల లభ్యతలో బాపట్ల జిల్లా (2.63 మీటర్లతో) ప్రథమ స్థానంలో ఉంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా (2.64 మీటర్లు) రెండో స్థానంలో, గుంటూరు జిల్లా (3.39 మీటర్లు) మూడో స్థానంలో నిలిచాయి. భూగర్భ జలాల లభ్యత కనిష్టంగా ఉన్న జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా (21.66 మీటర్లతో) ప్రథమ స్థానంలో నిలవగా.. ఏలూరు జిల్లా(17.59 మీటర్లు) రెండో స్థానంలో, అన్నమయ్య జిల్లా(13.67 మీటర్లు) మూడో స్థానంలో నిలిచింది. -
ఇసుక దందాతో తాగునీటికి కటకట
సాక్షి ప్రతినిధి, బాపట్ల : బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల ఇసుక దందా వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర సరిహద్దులు దాటి ఏకంగా జాతీయ స్థాయికి చేరింది. ఇసుక అక్రమ రవాణాతో భూగర్భ జలాలు అడుగంటాయని, తాగునీటికి కటకట తప్పదని వేటపాలెం మండలం పుల్లరిపాలెంలోని సాయి ఎస్టీ కాలనీ వాసులు యానాది హక్కుల పరిరక్షణ సంఘం పేరున నవంబర్‌లో జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.‘రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఎస్టీ కాలనీ సమీపంలోని ఇసుక దిబ్బల నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. పరిసర ప్రాంతాల్లోని అసైన్డ్ భూముల్లో పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు ఉండడంతో తవ్వకాల వ్యవహారాన్ని హైదరాబాద్‌కు చెందిన కొందరికి అప్పగించారు. ఈ వ్యవహారంలో స్థానిక నేతకు పెద్దఎత్తున ముడుపులు ముడుతున్నట్లు సమాచారం. వేటపాలెం ప్రాంతం నుంచి బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాలతోపాటు హైదరాబాద్‌కు సైతం ఇసుక భారీగా తరలిపోతోంద’ని వారు వివరించారు. ఈ విషయమై తక్షణం విచారించి చర్యలు తీసుకోవాలని ఎస్టీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు అందాయి. అయితే అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్న అధికారులు నవంబర్ 27న తొలి విచారణ సందర్భంగా బాధితులనే బెదిరించారు. ఈ విషయమై ఎస్టీలు మరోమారు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయగా, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తహసీల్దార్, పోలీసు, ఇతర అధికారులతో కూడిన బృందం ద్వారా వీడియో రికార్డింగ్ చేస్తూ విచారించాలని ఆదేశించింది. కాగా, తాము చెప్పినట్లు విచారణలో చెప్పాలని, ఇక్కడ ఎటువంటి ఇసుక తవ్వకాలు జరగడంలేదని అధికారులు రాసిన పేపర్లలో సంతకాలు పెట్టాలని అధికార పార్టీ నేతలు.. ఎస్టీలను బెదిరించినట్లు సమాచారం. మాపైనే ఫిర్యాదు చేస్తారా.. అని అధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తాము న్యాయవాదిని నియమించుకుని సమాధానం ఇస్తామని శుక్రవారం విచారణకు వచి్చన అధికారులకు బాధితులు తేల్చి చెప్పారు.మామూళ్ల మత్తులో అధికారులు! వేటపాలెం ప్రాంతంలో ఇప్పటికే కనుచూపు మేర రొయ్యల చెరువులు వెలిసి, కెమికల్స్ ప్రభావంతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని, ఇప్పుడు ఇసుక తవ్వకాల వల్ల వేసవిలో తాగునీటి కోసం తమ కుటుంబాలకు ఇబ్బందులు తప్పవని యానాది హక్కుల పరిరక్షణ సంఘం ప్రెసిడెంట్ ఇండ్ల స్వాతి, సెక్రటరి పోలయ్య, కాలనీ వాసులు వాపోతున్నారు. ఈ విషయమై మండల, జిల్లా అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించాల్సి వచి్చంది. అయినా కొందరు అధికారులు ఇసుక మాఫియా నుంచి నెల మామూళ్లు పుచ్చుకుంటుండటంతో ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని సమాచారం. -
‘భరోసా’ గంగపాలు!
పంపాన వరప్రసాదరావు బాపట్ల జిల్లా వాడరేవు నుంచి ‘సాక్షి’ ప్రతినిధి : కూటమి పార్టీల నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చాక ఇలా మొండిచెయ్యి చూపుతారని అనుకోలేదని గంగపుత్రులు మండిపడుతున్నారు. బాపట్ల జిల్లా వాడరేవు గ్రామంలో ఏ గడపకు వెళ్లినా ఇదే మాట వినిపిస్తోంది. వైఎస్ జగన్ హయాంలో ఐదేళ్ల పాటు వేట నిషేధ సమయంలోనే ఏటా రూ.10 వేల చొప్పున మత్స్యకార భరోసా వచ్చిందని గుర్తు చేసుకుంటున్నారు. రూ.20 వేల చొప్పున మత్స్యకార భరోసా ఇస్తామని నమ్మబలికి గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం ఆర్నెల్లలో తమకు ఎలాంటి సాయం అందించలేదని వాపోతున్నారు. 8 వేలకుపైగా జనాభా ఉన్న ఒక్క వాడరేవు గ్రామంలోనే 2,035 మంది మత్స్యకారులు ఐదేళ్లలో రూ.6.30 కోట్లు మత్స్యకార భరోసాగా అందుకున్నారు. ఈ ఏడాది గ్రామంలో 1,450 మంది అర్హత పొందగా ఆర్నెల్లుగా వేట నిషేధ భృతి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనిపై సీఎం, డిప్యూటీ సీఎంలకు లేఖలు రాసినా, కలసి విన్నవించినా పట్టించుకోలేదంటూ గంగపుత్రులు మండిపడుతున్నారు. ఇప్పట్లో ఇవ్వలేమని తాజాగా అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. భరోసా ఇవ్వకుండా ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు ఎందుకని నిలదీస్తున్నారు. ఐదేళ్లలో రూ.538 కోట్లు..వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాలతో పాటు రూ.2 వేలు నగదు ఇస్తుండగా చంద్రబాబు హయాంలో నిత్యావసరాలను నిలిపివేసి రూ.4 వేలు చొప్పున వేట నిషేధం ముగిసిన ఆర్నెల్లకో.. ఏడాదికో తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఇచ్చారు. అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే పాదయాత్ర హామీ మేరకు నిషేధ భృతిని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ఏటా వేట నిషేధ గడువు ముగిసేలోగా అర్హుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లకే కాకుండా తెప్పలు, ఇతర సంప్రదాయ నావలపై వేటకు వెళ్లే వారికి సైతం సాయాన్ని అందచేశారు. ఇలా ఐదేళ్లలో ఏటా సగటున 1.23 లక్షల మందికి రూ.538 కోట్ల మేర మత్స్యకార భరోసాతో లబ్ధి చేకూర్చారు.ఈసీకి కూటమి నేతల ఫిర్యాదుతో..వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఎన్నికల కమిషన్ అనుమతితో ఈ ఏడాది కూడా మే 2వ తేదీ నుంచి అర్హులను గుర్తించి జాబితాలను సిద్ధం చేసింది. 2023–24లో 1.23 లక్షల మంది అర్హత పొందగా 2024–25లో 1.30 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. అయితే ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఫిర్యాదు చేయడంతో గత ప్రభుత్వం మత్స్యకార భృతిని జమ చేసేందుకు ఈసీ అనుమతించలేదు. అనంతరం ఎన్నికల హామీ మేరకు రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.260.26 కోట్లు కావాలని మత్స్యశాఖ పంపిన ప్రతిపాదనలను కూటమి ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ఐదేళ్లలో వివిధ పథకాలతో లబ్ధి ఇలా..మత్స్యకారులకు లీటర్ డీజిల్‌పై సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9కి పెంచిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో ఏటా సగటున 23 వేల బోట్లకు రూ.148 కోట్ల మేర లబ్ధి చేకూరింది. టీడీపీ హయాంలో తొలి మూడేళ్లలో 460 బోట్లకు, తర్వాత రెండేళ్లకు 1,100 బోట్లకు డీజిల్ సబ్సిడీ ఇచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తొలి ఏడాదే మెకనైజ్డ్, మోటరైజ్డ్తోపాటు సంప్రదాయ బోట్లు కలిపి 14,229 బోట్లకు డీజిల్ సబ్సిడీ ఇచ్చారు. గరిష్టంగా 2023–24లో 23,209 బోట్లకు డీజిల్‌పై సబ్సిడీ ఇచ్చారు. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చే నష్ట పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ఐదేళ్లలో 175 మందికి రూ.17.71 కోట్ల పరిహారాన్ని అందించింది. వివిధ పథకాల ద్వారా ఐదేళ్లలో మత్స్యకారులకు రూ.4,913 కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చారు. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జీఎస్పీసీ (గెయిల్) పైపులైన్ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.78.22 కోట్లు, ఓఎన్జీసీ పైపులైన్ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది కుటుంబాలకు రూ.485.58 కోట్లు చొప్పున అందచేసి తోడుగా నిలిచింది.రూ.5 లక్షల అప్పు తీర్చిన ‘ఆసరా’.. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవుకు చెందిన సూరాడ ఎల్లయ్యమ్మ భర్త మత్స్యకారుడు కాగా ఆమె చేపలను విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గత ఐదేళ్లపాటు వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద ఏటా రూ.10 వేలు చొప్పున జమయ్యాయి. ఆసరా పథకం ద్వారా పొదుపు సంఘంలో ఉన్న రూ.5 లక్షల అప్పు అణా పైసలతో సహా మాఫీ అయ్యింది. వారి కుమారుడు కాకినాడలో ఎమ్మెస్సీ చదువుతుండగా కుమార్తె డిగ్రీ చదువుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమ్మఒడి, విద్యాదీవెన అందాయి. ఎల్లయ్యమ్మ మామ పింఛన్ పొందుతుండగా ఆమె అత్త వైఎస్సార్ చేయూత కింద నాలుగేళ్ల పాటు ఏటా రూ.18,750 చొప్పున లబ్ధి పొందింది. జగనన్న పాలనలో లబ్ధి పొందని మత్స్యకార కుటుంబం లేదు.. చంద్రబాబు పాలనలో ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదని ఎల్లయ్యమ్మ చెబుతోంది. నేను బతికున్నానంటే జగన్ బాబు చలవే.. మైలు సంజీవ్ 40 ఏళ్లుగా చేపల వేటనే నమ్ముకుని జీవిస్తున్నాడు. ఆయనకు గత ఐదేళ్ల పాటు మత్స్యకార భరోసా అందింది. కుమార్తెకు అమ్మ ఒడి వచ్చింది. పొదుపు సంఘంలో ఆయన భార్య అప్పు మాఫీ అయ్యింది. సంజీవ్ అమ్మకు చేయూత వచ్చింది. నాలుగేళ్ల క్రితం సంజీవ్‌కు గుండెపోటు రావడంతో వలంటీర్ ధైర్యం చెప్పి ఆరోగ్యశ్రీ కార్డుతో గుంటూరు ఆస్పత్రికి పంపించాడు. రూ.4 లక్షలు ఖరీదైన బైపాస్ సర్జరీని ప్రైవేట్ ఆస్పత్రిలో ఉచితంగా నిర్వహించారు. డిశ్చార్జీ అనంతరం ఇంటికి పంపేటప్పుడు చేతికి డబ్బులిచ్చి పంపారు. ఏడాది పాటు మందులు ఉచితంగా ఇచ్చారు. నేను ఇప్పుడిలా బతికి ఉన్నానంటే జగన్ బాబు చలవే అంటూ సంజీవ్ కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబాబు వచ్చి ఆర్నెళ్లు అవుతున్నా వేట సాయం కూడా ఇవ్వలేదని వాపోయాడు.ఐదేళ్లూ అందుకున్నా.. మా తాతముత్తాల నుంచి చేపల వేటే జీవనాధారం. 20 ఏళ్లుగా వేటకు వెళ్తున్నా. జగన్ పాలనలో ఐదేళ్లూ మత్స్యకార భరోసా అందుకున్నా. మా పిల్లలకు అమ్మఒడి, అమ్మకు చేయూత వచ్చింది. నా భార్యకు పొదుపు సంఘంలో అప్పు మాఫీ అయింది. రేషన్ కూడా ఇంటికే వచ్చేది. వలంటీర్ల వల్ల గడప దాటాల్సిన అవసరం లేకుండా అన్నీ అందేవి. ఇప్పుడు ఏ పని కావాలన్నా వేట మానుకొని ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఓపక్క వేటకు వెళ్తే సరైన చేపలు పడడం లేదు. మరోవైపు వేట నిషేధ భృతి ఇవ్వడం లేదు. ఆర్ధికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. – ఎస్.పోలయ్య, వాడరేవు, బాపట్ల జిల్లాహామీని నిలబెట్టుకోకుంటే ఉద్యమిస్తాం... వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడికి రూ.20 వేల చొప్పున వేట నిషేధ భృతి ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు అవుతున్నా హామీని నెరవేర్చలేదు. బడ్జెట్లో కేటాయింపులు కూడా చేయలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉండగానే ఈసీ అనుమతితో అర్హుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది. ఇప్పుడు మత్స్యకార భరోసాని ఎగ్గొట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్లడంతో తీరని అన్యాయం జరుగుతోంది. ఇచి్చన హామీని నిలబెట్టుకోకుంటే మత్స్యకారుల తరపున ఉద్యమిస్తాం. – కొండూరు అనీల్‌బాబు, మాజీ ఆప్కాఫ్ చైర్మన్ -
వెలుగు కార్యాలయం ఎదుట వీవోఏల ఆందోళన
జే.పంగులూరు: టీడీపీ కూటమి నేతల బెదిరింపులే లక్ష్యంగా 18మంది వీవోఏలను అక్రమంగా తొలగించారని నిరసన తెలుపుతూ వీవోఏలు, గ్రామ సంఘం అధ్యక్షులు, డ్వాక్రా మహిళలు సోమవారం మండల వెలుగు కార్యాలయం ముందు నిరవధిక ఆందోళనకు దిగారు. వీరికి సీపీఎం సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమకు న్యాయం జరిగే వరకూ 24 గంటలు వెలుగు కార్యాలయం ఎదుటే ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. మండలంలో 38మంది వీవోఏలు ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. జీతాలున్నా, లేకున్నా గ్రామంలోని మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి జీవనోపాధులు పెంచేందుకు తమ వంతు సాయి అందిస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రభుత్వాలు ఎన్నిమారినా ఎవరూ తొలగించేవారు కాదనీ, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదునెలల్లోనే 18మంది వీవోఏలను నిర్ధాక్షిణ్ణ్యంగా ఎలాంటి సమాచారం, గ్రూపు సభ్యుల తీర్మానాలు లేకుండా, వారి సంతకాలు ఫోర్జరీ చేసి మరీ అక్రమంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సంబంధించిన వ్యక్తికి మద్దతు తెలపకుంటే ఇంటికి వచ్చే పథకాలు రద్దు చేస్తామని ఒత్తిడి చేసి డ్వాక్రా మహిళలతో వారికి ఇష్టం లేకుండా సంతకాలు చేయించుకుని వారికి నచ్చిన వారిని వీవోఏలుగా నియమిస్తున్నారని వాపోయారు.అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి రాయిణి వినోద్‌బాబు, సీఐటీయూ మండల కార్యదర్శి మల్లారెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి రామారావుతో కలిసి మండల సమైక్య అధ్యక్షురాలు బాచిన నాగలక్ష్మీ, వీవోఏలు, గ్రామ సంఘం అధ్యక్షులు, డ్వాక్రా మహిళలు తహసీల్దార్ సింగారావుకు వినతిపత్రం అందజేశారు. -
రొయ్యల ప్లాంట్‌లో విషవాయువు లీక్.. 30 మంది కార్మికులకు అస్వస్థత
సాక్షి, బాపట్ల జిల్లా: నిజాంపట్నంలోని రొయ్యల ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో విష వాయువు లీక్ కావడంతో 30 మంది కార్మికులకు అస్వస్థత గురయ్యారు. ప్రస్తుతం నిజాంపట్నం, పిట్టలవానిపాలెం ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు.శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడటంతో ప్రాథమిక చికిత్స అనంతరం వారికి మెరుగైన వైద్యం అందించేందుకు బాపట్ల, గుంటూరు ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా, ఒక చోట మాత్రమే విషవాయువు లీకైందని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక అంచనా వేస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై యాజమాన్యం నిర్లక్ష్యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
వన్నెతగ్గిన జీడిపప్పు
వేటపాలెం: జీడిపప్పు తయారీ కేంద్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో జీడిపప్పు పరిశ్రమలు ప్రస్తుతం మూతపడే స్థితికి చేరాయి. విదేశాల నుంచి ముడి జీడిగింజల దిగుమతులు నిలిచిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. మనదేశం జీడి మామిడి ఉత్పత్తి, జీడిపప్పు ప్రాసెసింగ్, ఎగుమతుల్లో ప్రపంచంలోనే అగ్రగామి. ఇక్కడ నుంచే 65శాతం ఎగుమతులు జరుగుతున్నాయి.మనదేశంలోని ఫ్యాక్టరీలకు ఏటా 15–16 లక్షల టన్నుల ముడి జీడిగింజలను ప్రాసెస్ చేసి జీడిపప్పును ఎగుమతి చేసే సామర్థ్యం ఉంది. అయితే సగటు జీడిగింజల ఉత్పత్తి మాత్రం 7.28 లక్షల టన్నులు మాత్రమే ఉంది. దీంతో ఆఫ్రికా దేశాల నుంచి ముడి జీడిగింజలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. వీటి ధర ఒక్కసారిగా పెరగడంతో దిగుమతులు తగ్గి, ముడిసరుకు అందక ఎగుమతులు క్షీణిస్తున్నాయి. దేశంలో జీడిగింజల ఉత్పత్తిలో మహారాష్ట్ర మొదటి స్థానంలో, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా, ఉత్పాదకతలో మాత్రం మొదటి స్థానంలో మహారాష్ట్ర, రెండో స్థానంలో పశ్చిమబెంగాల్, మూడో స్థానంలో కేరళ ఉన్నాయి. మన రాష్టంలో శ్రీకాకుళంలోని పలాస, కాశీబుగ్గ వీటికి ముఖ్య కేంద్రాలుగా చెప్పవచ్చు, తరువాత విశాఖప³ట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో జీడిపప్పు తయారీ పరిశ్రమలు ఉన్నాయి. గింజల ధరల్లో భారీ పెరుగుదలజీడిమామిడి పంట ఏటా మార్చి, ఏప్రిల్‌లో వస్తుంది. వ్యాపారులు ఈ నెలల్లో శ్రీకాకుళం, విజయనగరం, పలాసతో పాటు, ఇతర ఆఫ్రికన్ దేశాల నుంచి జీడి గింజలు కొనుగోలు చేస్తుంటారు. 2023 మార్చిలో రైతుల నుంచి వ్యాపారులు బస్తా గింజలు రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు కొనుగోలు చేయగా, ఈ ఏడాది మార్చిలో బస్తా రూ.9 వేలకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం బస్తా ధర రూ.14 వేలకు చేరుకుంది. దీంతో జీడిపప్పు ధరలు కూడా పెంచాల్సి వచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు. సంక్షోభంలో పరిశ్రమరాష్ట్రవ్యాప్తంగా జీడిపప్పు పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. ఓవైపు గత ఏడాది రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో జీడి పంట గణనీయంగా తగ్గింది. మరో పక్కన కేంద్ర ప్రభుత్వం జీడిగింజల దిగుమతి పై 9.05 శాతం పన్ను విధించింది. బస్తా జీడి గింజలు ప్రస్తుతం రూ.14 వేల ధర పెరిగింది. దీంతో కష్టాలు తప్పడం లేదని జీడిపప్పు వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం కరువురాష్ట్రంలో పలాస, విజయనగరం, వేటపాలెం ప్రాంతాల్లో జీడిపప్పు పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు వందేళ్లకు పైగా ఈ పరిశ్రమలు ఉన్నా జీడిపప్పు ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి సంస్థను ఏర్పాటు చేయలేదు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల వ్యాపారులు ఇతర దేశాలకు జీడిపప్పును ఎగుమతి చేసుకోవడానికి ఆయా ప్రభుత్వాలు సంస్థలను ఏర్పాటు చేశాయి. వారంతా మన రాష్ట్రంలో తయారైన జీడిపప్పును కొనుగోలు చేసుకుని ఎగుమతు చేసి లాభాలు గడిస్తున్నారు. దీంతో జీడిపప్పు పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహం కరువైందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తగ్గుతున్న తోటల విస్తీర్ణంరాష్ట్రవ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు కోస్తా తీర ప్రాంతాల్లో 4.25లక్షల ఎకరాల్లో జీడి మామిడి తోటలున్నాయి. ఏటా జీడిగింజల ఉత్పత్తి 92 వేల మెట్రిక్ టన్నులు. ప్రతి ఎకరాకు సాలుసరి 350 కిలోలు దిగుబడి. అయితే కోస్తాతీరం వెంబడి గడిచిన 10 ఏళ్ల నుంచి జీడి మామిడి తోటలను నరికి వేసి రైతులు ఇతర పంటలు సాగు చేస్తుండటంతో దిగుబడి గణనీయంగా తగ్గింది.కొరత ఎక్కువగా ఉందిఈ ఏడాది జీడిమామిడి గింజల కొరత ఎక్కువగా ఉంది. పప్పు ధర బాగున్నా గింజలు లేక ఇబ్బంది పడుతున్నాం. ఈ ఏడాది పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. 30 శాతమే పండటంతో దాదాపు 70 శాతం గింజలను బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. విదేశాల నుంచి దిగుమతులు లేవు. – ప్రతి వెంకట సుబ్బారావు,జీడిపప్పు వ్యాపారి, వేటపాలెం, బాపట్ల జిల్లా -
అసలే కరువు.. ఆపై చేతివాటం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లాలో నాలుగున్నర టన్నులు పట్టే ట్రాక్టర్ ఇసుక రూ.9 వేలు, రూ.10 వేల చొప్పున అమ్ముతున్నారు. అంత ధర పెట్టి కొనుగోలు చేద్దామంటే కూడా నూటికి పది మందికి కూడా దొరకడంలేదు. దీంతో చాలా మంది పనులు ఆపుకున్నారు. చీరాల నియోజకవర్గంలోని పందిళ్లపల్లి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ, అటవీ భూముల నుంచే కాక వరద కాలువ గట్లలోని ఇసుకను కూడా టీడీపీ నేత ఒకరు అక్రమంగా తరలించి అమ్ము కుంటున్నాడు. రేపల్లె నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. వేమూరు నియోజకవర్గంలోని జువ్వలపాలెం, ఓలేరు, పెసర్లంక, గాజుల్లంక గ్రామాల పరిధిలో కృష్ణా నది నుంచి టీడీపీ నేతలు అక్రమంగా తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలోని కృష్ణా నది నుంచి 300 ఎద్దుల బండ్లలో ఇసుకను తరలిస్తున్నారు. వెల్లటూరు, కొల్లూరు, పెదపులివర్రు గ్రామాల సమీపంలోని కరకట్టకు వెలుపల గుట్టగా పోసి ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. బాపట్లలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పని దొరక్క తిరిగొచ్చేస్తున్నాంనేను తెనాలి, గుంటూరులో పనులకు వెళతాను. కొంత కాలంగా ఇసుక అందుబాటులో లేక పోవడంతో సక్రమంగా పనులు జరగడం లేదు. పనికి వెళ్లిన తర్వాత ఇసుక లోడు రాకపోవడంతో పని నిలిపి వేశామని నిర్మాణ దారులు చెబుతున్నారు. రోజూ పనికి వెళ్లే వారిలో పది శాతం మందికి కూడా పనులు దొరకడం లేదు. అంత దూరం వెళ్లి ఇళ్లకు తిరిగి వస్తున్నాము. – డి.రవీంద్రనాథ్, రాడ్ బెండింగ్ మేస్త్రీ, వరహాపురం, వేమూరు మండలంఉపాధి కరువైందిమా ప్రాంతంతో పాటు తెనాలికి పనుల కోసం వెళతాము. కొంత కాలంగా ఇసుక కొరత వల్ల పనులు అందరికీ దొరకడం లేదు. పని కోసం వెళితే ఇసుక దొరకడం లేదని కట్టుబడి దారులు చెబుతున్నారు. బయట కూడా పనులు లేవు. దీంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది.– కట్ట మరియదాసు, బేల్దార్ మేస్త్రీ, బలిజేపల్లి, వేమూరు మండలంప్రత్యేక సాయం ప్రకటించాలికూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక సరఫరాలో అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నాం. ఉచిత ఇసుక విధానం అంటూ అసలు ఇసుకే లేకుండా చేశారు. దీంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. నెలలో పది రోజులు కూడా పనులు దొరకని పరిస్థితి. దీంతో పస్తులు ఉండాల్సి వస్తోంది. భవన నిర్మాణ కార్మికులందరికీ ప్రభుత్వం వెంటనే ఉపాధి చూపాలి. లేదంటే ప్రత్యేక సాయం ప్రకటించాలి. – జొన్నలగడ్డ ధర్మరాజు, భవన నిర్మాణ కార్మికుడు, పేటేరుపెనమలూరులో పెద్ద ఎత్తున లూటీకృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని యనమలకుదురులో అక్రమ ఇసుక దందా పెద్ద ఎత్తున సాగుతోంది. టీడీపీ నేతలు ఏకంగా 40 ట్రాక్టర్లును అక్రమంగా నదిలోకి దించి, పొక్లయినర్‌తో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. రోజుకు 300 ట్రిప్పులకు పైగానే తరలిస్తున్నారు. ట్రాక్టర్ రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. విజయవాడ నగర శివారులో ఇంతలా ఇసుక మాఫియా నదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాగిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
చుట్టుముట్టిన కష్టాలు
కళ్ల ముందు నీళ్లు పారుతున్నాయి.. కానీ గొంతు తుడుపుకొనేందుకు గుక్కెడు మంచి నీరు లేని పరిస్థితి. పేదలకు పట్టెడన్నం దొరకని దుస్థితి. అడుగు పడనీయని అంధకారం.. విష పురుగులు విలయతాండవం.. ఇళ్లు, వీధుల్లో నీళ్లు పారుతుండటంతో అధ్వాన పారిశుధ్యం.. పట్టపగలే పీక్కుతింటున్న దోమలు. ఇదీ.. వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లోని లంక గ్రామాల ప్రజల దీన స్థితి.సాక్షి ప్రతినిధి, బాపట్ల : బాపట్ల జిల్లా కొల్లూరు మండలం తోకలవారిపాలెం, తురకపాలెం తదితర గ్రామాలను మంగళవారం ‘సాక్షి’ బృందం పరిశీలించింది. వరద సహాయ కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అందుతున్న కొద్దిపాటి సాయం కూడా ఒకవర్గం వారికే చేరుతోంది. బాధితులకు అధికారుల ద్వారా పంపిస్తున్నట్లు చెబుతున్న ఆహారం, తాగునీటి ప్యాకెట్లను ఆయా గ్రామాల్లోని అధికార పార్టీ నేతల ఇళ్ల వద్దకు చేరుతున్నాయి.దీంతో ఒక వర్గం వారికే సాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ కాలనీలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికీ చాలామంది పేదలు అన్నంతో పాటు తాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. కొద్దిపాటి నీరు, ఆహారం వచ్చిందంటే చాలు.. వాటి మీదికి జనం ఎగబడుతున్నారంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కనీసం మంచి నీళ్లిచ్చినా తాగి ప్రాణాలు దక్కించుకుంటామని పలువురు బాధితులు ‘సాక్షి’తో చెప్పారు.అంధకారంలో గ్రామాలుమూడు రోజులుగా 27 లంక గ్రామాలను వరద చుట్టుముట్టగా గత రెండు రోజులుగా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. లంక గ్రామాల పరిధిలో ఉన్న రెండు విద్యుత్ సబ్స్టేషన్లు నీటిలో మునగడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విద్యుత్ లైన్లు, స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచి పోయి గ్రామాల్లో అంధకారం అలుముకుంది. కొన్ని పూరిళ్లతో పాటు వీధుల్లోనూ నీరు అలానే ఉంది. విషపురుగులు బెడద పెరిగింది. దోమలు పట్టపగలే పీక్కుతింటున్నాయి. దీనికి తోడు పారిశుధ్యం అధ్వానంగా మారడంతో జ్వరాలు పెరుగుతున్నాయి. బయట ఆస్పత్రులకు వెళదామంటే బోట్లు లేని దుస్థితి. నీరు, భోజనం సరఫరా చేయడానికి వచ్చిన బోట్లలో కొంతమందిని బయటకు తరలించి అక్కడి నుంచి తెనాలి, గుంటూరులోని ఆస్పత్రులకు పంపారు. బోట్లు లేక.. ఊరు దాటలేక... లంక గ్రామాల నుంచి బయటకు వచ్చేందుకు బోట్లు అందుబాటులో లేక ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. బయటకు వచ్చి సొంతంగా తాగునీరు, ఆహారం, ఇతర వస్తువులు తెచ్చుకుందామన్నా ప్రభుత్వం తగినన్ని బోట్లను ఏర్పాటు చేయలేదు. అలాగే పశువులకు తినేందుకు మేత లేక అవి దీనంగా అరుస్తున్నాయి. వేలాది ఎకరాల్లోని అరటి, తమలపాకు, కంద, పసుపు వంటి వాణిజ్య పంటలు మొత్తం నీటి పాలయ్యాయి. ఒక్కో ఎకరానికి రెండు నుంచి రూ. 3 లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఎకరం రూ.50 వేలకు కౌలుకు తీసుకుని పంటలను సాగు చేశారు. వరద రాకతో ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ కష్టాలు తీర్చాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు. బోటు లేదు.. ఓటి మాటలేసీఎం చంద్రబాబు దగ్గరుండి మూడు రోజులుగా హెలికాప్టర్లు, డ్రోన్లు, బోట్లతో వరద బాధితులకు సాయం చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ.. కనీసం బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బోట్లు కూడా ఏర్పాటుచేయలేదనేందుకు నిదర్శనం ఈ చిత్రం. విజయవాడలో వరద నీటిలో థర్మాకోల్ షీట్‌పై వెళుతున్న దివ్యాంగురాలిని చంద్రబాబు పరామర్శిస్తున్న దృశ్యమిది. -
కడవకుదురు టు తెలంగాణ
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా పర్చూరు నుంచి వేల టన్నుల ఇసుక అక్రమంగా తెలంగాణకు తరలిపోతోంది. రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు రెవెన్యూ, అటవీభూముల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. ట్రక్కులు, టిప్పర్లు, ట్రాక్టర్లలో నింపుతున్నారు. ట్రక్కులన్నీ హైదరాబాద్‌కు వెళ్తున్నాయి. టిప్పర్లు, ట్రాక్టర్లు ప్రకాశం, పల్నాడు జిల్లాలకు వెళ్తున్నాయి. పర్చూరుకు చెందిన అధికార పార్టీ ముఖ్య నేత కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుండటంతో అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేతకు అవసరమైనప్పుడు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చే ఒక కంపెనీ అధినేత సమీప బంధువులు ఈ ఇసుక దందాను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇసుక తవ్వకాల ప్రాంతంలో ప్రైవేటు సైన్యాన్ని పెట్టి కర్రలు, రాడ్లు తదితర మారణాయుధాలతో కాపు కాస్తున్నారు. ఎవరైనా వస్తే దాడులు చేసేందుకు వారు వెనుకాడడంలేదు. పోలీసులకు మామూళ్లు వెళ్తుండటంతో వారు ఇటువైపు కన్నెత్తి చూడటంలేదన్న విమర్శలు వస్తున్నాయి.కడవకుదురు భూముల నుంచి..పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలం కడవకుదురు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇసుక (గుట్టలు) భూములు ఉన్నాయి. ఇందులో ప్రైవేటు భూములతోపాటు రెవెన్యూ, అటవీ శాఖ భూములూ ఉన్నాయి. ఈ భూముల్లో ఎస్సీ, ఎస్టీలకు గతంలో పట్టాలు ఇచ్చినా వ్యవసాయానికి పనికిరాకపోవడంతో బీళ్లుగానే ఉంచారు. ఇక్కడ నిర్మాణాలకు పనికొచ్చే నాణ్యమైన ఇసుక ఉండడం, వర్షాకాలం నేపథ్యంలో ఇసుకకు డిమాండ్ పెరగడంతో పర్చూరు అధికారపార్టీ నేత కన్ను పడింది. అనుచరులనుపెట్టి ఇసుక గుట్టలను అక్రమంగా తరలించి రూ. కోట్లు కొల్లగొడుతున్నారు. కడవకుదురు రైల్వే గేటు ప్రాంతంలో గత పది రోజులుగా తవ్వకాలు మొదలు పెట్టారు. ప్రభుత్వ పెద్దల సూచనలతో పగటిపూట కాకుండా రాత్రి 10 గంటల ప్రాంతంలో జేసీబీలు, ఇటాచ్‌లు పెట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. ట్రక్కులు, టిప్పర్లు, ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ. 4 నుంచి 8 వేలకు అమ్ముతున్నారు. ట్రక్కు ఇసుక రూ. 80 వేలు..కృష్ణా, గోదావరి నదులకు నీళ్లు రావడంతో మైదాన ప్రాంతాల ఇసుకకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్‌లో ఇసుకకు మరింత డిమాండ్ ఉంది. దీంతో కడవకుదురు నుంచి రోజూ 15 ట్రక్కుల్లో హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్క ట్రక్కు (18 టన్నులు) ఇసుక రూ. 80 వేలకు తగ్గకుండా అమ్ముతున్నట్లు తెలుస్తోంది. -
రేపల్లెలో శృతిమించిన టీడీపీ దౌర్జన్యం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ వారి దౌర్జన్యం శృతిమించింది. కూటమి అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులపై దాడులకు దిగి భయభ్రాంతులకు గురిచేసిన టీడీపీ నేతలు ఇప్పుడు పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసులు పెడుతున్నారు. గంజాయి కేసుల్లో ఇరికిస్తున్నారు. అధికారపక్షం కావడంతో పోలీసులు వారు చెప్పినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తాజాగా రేపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు రాజ్‌పాల్‌పై పోలీసులు గాంజా కేసు నమోదు చేశారు. ఇటీవల గంజాయితో పట్టుబడిన ముఠాలో రాజ్‌పాల్ లేకున్నా పోలీసులు కేసులో అతడి పేరు చేర్చారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు చెప్పారు. వాస్తవానికి రాజ్‌పాల్ ఓట్ల› లెక్కింపు అనంతరం టీడీపీ నేతల బెదిరింపులతో ఊరువదలి వెళ్లిపోయారు. అప్పటినుంచి ఇప్పటివరకు రేపల్లెకు రాలేదు. అయినా పోలీసులు అతడిపై గాంజా కేసు నమోదు చేశారు. తప్పుడు కేసులు మానుకోవాలి అధికారం శాశ్వతం కాదని, టీడీపీ నేతలు ఇప్పటికైనా తెలుసుకుని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు పేర్కొన్నారు. రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆగడాలు శృతిమించాయన్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, పోలీసుల ద్వారా తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా మారకపోతే తాము రోడ్డెక్కి ఆందోళనలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. రేపల్లెకు చెందిన తమ పార్టీ కార్యకర్త రాజ్‌పాల్ యాదవ్‌పై పోలీసులతో అధికారపార్టీ నేతలు గంజాయి కేసు పెట్టించడం దారుణమన్నారు. పోలింగ్ నాడు టీడీపీ నాయకుడితో రాజ్‌పాల్ గొడవ పడ్డారని, ఆ కక్షతోనే ఇప్పుడు అతడిపై గంజాయి కేసు పెట్టించారని చెప్పారు. ఓట్ల లెక్కింపు తర్వాత టీడీపీ వారి దాడులు పెరగడంతో రాజ్‌పాల్, మరికొందరు ఊరు వదలి వెళ్లారని తెలిపారు. తరువాత ఇప్పటికీ రాజ్‌పాల్ రేపల్లె రాలేదని చెప్పారు. రాజ్‌పాల్ గంజాయి విక్రయిస్తుండగా పట్టుకోబోతే పరారయ్యాడని పోలీసులు కట్టుకథ అల్లి అతడిపై కేసు పెట్టడం దారుణమన్నారు. టీడీపీ వారు దాడులు చేస్తారని ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్న రాజ్‌పాల్‌పై తప్పుడు కేసు పెట్టడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. పార్టీలు అధికారంలోకి రావడం, పోవడం సర్వసాధారణమన్నారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు పద్ధతి మార్చుకోవాలని ఆయన సూచించారు. -
బరితెగించిన టీడీపీ నేతలు
-
అమెరికాలో తెలుగు యువకుడిపై కాల్పులు
కర్లపాలెం/సాక్షి, అమరావతి: అమెరికాలో ఓ దుండగుడి తుపాకీ కాల్పుల్లో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన యువకుడు దాసరి గోపీకృష్ణ (32) మృతి చెందాడు. రైతు కూలీ కుటుంబానికి చెందిన దాసరి శ్రీనివాసరావు, లక్ష్మి దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు గోపీకృష్ణ. బీటెక్ వరకు చదివి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హెచ్–1బి వీసా రావటంతో ఉద్యోగం కోసం సుమారు 11 నెలల కిందట అమెరికా వెళ్లాడు.ఓ వైపు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ.. మరో వైపు టెక్సాస్ రాష్ట్రం డెల్లాస్ సిటీలోని సూపర్ మార్కెట్లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఓ దుండగుడు సూపర్ మార్కెట్‌కు వచ్చి గోపీకృష్ణపై గన్‌తో కాల్పులు జరిపి ఏవో వస్తువులు తీసుకుని పారిపోయాడు. తీవ్రగాయాలైన గోపీకృష్ణ అక్కడే కుప్పకూలిపోగా స్థానికులు ఓ వైద్యశాలలో చేరి్పంచారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.దీంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోపీకృష్ణకు రెండున్నరేళ్ల క్రితం ప్రవల్లికతో వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వ సహకారంతో తమ బిడ్డ భౌతికకాయాన్ని త్వరగా తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.గోపీకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: వైఎస్ జగన్అమెరికాలోని సూపర్ మార్కెట్లో జరిగిన కాల్పుల ఘటనలో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ మృతి చెందటం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపీకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం తోడుగా నిలవాలని, అన్ని రకాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గోపికృష్ణ కుటుంబానికి తగిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర విదేశాంగ శాఖను కోరారు. మృతుడి కుటుంబానికి వైఎస్ జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
సముద్రంలో మునిగి ఇద్దరు మృతి
వేటపాలెం: దూరప్రాంతాల నుంచి విహారం కోసం వస్తున్న పర్యాటకులు అనుకోని పరిస్థితుల్లో మృత్యువాత పడుతున్నారు. రామాపురం బీచ్‌లో నలుగురు యువకులు మృత్యువాత పడి రెండురోజులు గడవక ముందే అదే ప్రాంతంలో ఆదివారం మరో ఇద్దరు సముద్ర కెరటాలకు బలైపోయారు. వివరాల్లోకి వెళితే.. మంగళగిరికి చెందిన 12 మంది యువకులు విహారయాత్ర కోసం రామాపురం బీచ్‌కు చేరుకున్నారు. స్నేహితులంతా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ గడిపారు.సముద్రం నీటిలో మునుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు అలల తాకిడికి నలుగురు కొట్టుకుపోతుండగా గమనించిన స్నేహితులు ఇద్దరిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. మరో ఇద్దరు నాగేశ్వరరావు (27), బాలసాయి (26) మృత్యువాత పడ్డారు. వీరంతా విజయవాడలోని వివిధ బంగారం షాపుల్లో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఈపురుపాలెం ఎస్సై శివకుమార్ యాదవ్ పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.అయితే రెండురోజుల వ్యవధిలో రెండు సంఘటనలు చోటుచేసుకోవడంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చీరాల, వేటపాలెం ఎస్సైలకు పలు సూచనలు ఇచ్చారు. సముద్ర తీరం వద్ద నిఘా పెంచాలని, గజ ఈతగాళ్లు, మెరైన్ పోలీసులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు బీచ్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. -
శివ.. శివా.. ఆ ఎమ్మెల్యే నల్లతాచు
‘నల్లబాలు.. నల్లతాచు లెక్క’ అంటూ ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. కానీ బాపట్ల జిల్లాకు చెందిన ‘దేశం’ ఎమ్మెల్యే నిజంగా ‘నల్ల’తాచు లెక్క.. ఆయన దురాగతాలకు అంతేలేదు. నాసిరకం బయో మందులు విక్రయిస్తూ రైతులను వంచిస్తారు. ఎన్ఆర్ఐలు, గ్రానైట్ పరిశ్రమల నుంచి వసూలు చేసిన ‘నల్లధనం’తో ఎన్నికల బరిలోకి దిగుతారు. ఓట్లు కొంటారు, దొంగ ఓట్లు వేయిస్తారు. ఎలాగైనా గెలిచి మళ్లీ ప్రజలను పీడించుకుతినడమే ఆయన నైజం. పేరుకే ఆయన ‘శివుడు’.కానీ పనులన్నీ భస్మాసురుడిని తలపిస్తాయి. ఆ ఎమ్మెల్యే నల్లతాచు సాక్షి టాస్క్‌ఫోర్స్: బాపట్ల జిల్లాలో ఒక ఎమ్మెల్యే అక్రమంగా వసూలు చేసిన నల్లధనంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో దొంగ ఓట్ల వ్యవహారం బయటపడటంతో అక్రమాల తుట్టె కదులుతోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గంలో నీరు – చెట్టు పనుల్లో రూ. కోట్లు కొల్లగొట్టి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. పర్చూరు మండలం దేవరపల్లిలో దళితులకు ఇచ్చిన భూముల్లో నీరు – చెట్టు ద్వారా చెరువులు తవ్వాలని అప్పట్లో ఆయన పట్టుబట్టడంతో దళితులు వ్యతిరేకించారు. దళితులకు వైఎస్సార్సీపీ అండగా నిలబడడంతో చివరకు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో నాసిరకం బయో మందులపై సర్కారు చర్యలు తీసుకుంది. అయినా నకిలీ మందులు విక్రయించడం మాత్రం ఆపలేదు. అగ్రిటెక్ మాటున నకిలీ మందులు గుంటూరులోని ఎమ్మెల్యేకి చెందిన తన అగ్రిటెక్ కంపెనీ కార్యాలయంలో ఇటీవల రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీఎస్డీఆర్ఐ) జరిపిన తనిఖీల్లో ఆయన ఎన్నికల అక్రమాలు వెలుగుచూశాయి. ఎన్ఆర్ఐల నుంచి నిధులు పోగేసి తొలుత ఆ నిధులను తన కంపెనీకి తరలించి అక్కడి నుంచి ఎన్నికలకు వెచ్చించినట్లు వెలుగులోకి వచ్చింది. తనిఖీల్లో దొరికిన డైరీలో ‘నల్లధనం’ లెక్కలు వెలుగుచూశాయి. ఆ నిధులతోనే గడచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు,దొంగ ఓట్లు చేర్చడం, ఎన్నికల్లో ఇతరత్రా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. తొలుత ఆయన టీడీపీ మాజీ ఎంపీ దగ్గర పనిచేశారు. ప్రస్తుతం ఆ మాజీ ఎంపీ తెలంగాణలో బీఆర్ఎస్లో ఉన్నారు. ఆయనకు ఏపీలోనూ వ్యాపారాలు ఉన్నాయి. ఆయన వద్ద ఉన్నప్పుడే అగ్రిటెక్ కంపెనీ పురుడు పోసుకుంది. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రాగానే ఆ కంపెనీ తయారు చేసిన నకిలీ బయో ఎరువులు, పురుగు మందులను రాష్ట్ర వ్యాప్తంగా విక్రయించారు. మాజీ ఎంపీకి బినామీగా ఉన్న సమయంలో ఆయన అండతోనే ఎదిగారన్న ప్రచారమూ ఉంది. మైనింగ్,విజిలెన్స్ అధికారులపైనా దాడులు ఆ నియోజకవర్గంలో తన సామాజికవర్గం బలంగా ఉంది. ఆ వర్గంలో ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా గత రెండు ఎన్నికల్లో కోట్లాది రూపాయలు సమకూర్చారు. అదంతా నల్లధనమేనన్న ఆరోపణలు ఉన్నాయి. మార్టూరు మండలంలో 250కిపైగా గ్రానైట్ పరిశ్రమలు సామాజికవర్గం చేతుల్లోనే ఉన్నాయి. ఇక్కడి నుంచి 80 శాతం గ్రానైట్ రాయల్టీ లేకుండానే తరలిపోతోంది. దీనికి సహకరిస్తున్న నేతలకు పరిశ్రమల యజమానులు నిధులు కుమ్మరిస్తారు. వీరి నుంచి అధికమొత్తంలో నిధులు వెళ్తున్నట్టు సమాచారం. నియోజకవర్గంలో 15 వేలకు పైగా దొంగ ఓట్లు చేరి్పంచడంతో ఇటీవల అధికారులు విచారణ జరిపి సుమారు 12 వేల ఓట్లను తొలగించారు. దీనిలో ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్టు స్పష్టమవుతోంది. తన అగ్రిటెక్ కార్యాలయంలో లభించిన డైరీలో ఎమ్మెల్యే అక్రమాలు బయటపడటంతో ఎమ్మెల్యేతోపాటు కంపెనీ ఉద్యోగులపైనా కేసులు నమోదు చేశారు. ఇందులో ఎమ్మెల్యేను ఏ–1గా చూపారు. మార్టూరు గ్రానైట్ పరిశ్రమల నుంచి అక్రమంగా సరుకు తరలిపోతుందన్న ఫిర్యాదుతో జనవరి 30న తనిఖీలకు వచ్చిన మైనింగ్, విజిలెన్స్ అధికారులను తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే అడ్డుకొని దాడులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేతోపాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో పరారైన ఎమ్మెల్యేకు తర్వాత 41 నోటీసు ఇచ్చి విచారణ చేపట్టారు. కేసులు ‘అనంత’ం ► మార్టూరులోని గ్రానైట్ ఫ్యాక్టరీలో తనిఖీల నిమిత్తం వచ్చిన విజిలెన్స్ అండ్ మైనింగ్ అధికారులను అడ్డగించిన సందర్భాన్ని పురస్కరించుకొని విజిలెన్స్ ఏడీ బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదుపై 31/2024, 31/01/2024న ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ► 2019 ఎన్నికలలో పర్చూరు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, దొంగ ఓట్లు వేయించడం వంటివి ఆధారాలతో బట్టబయలు కావడంతో ఎమ్మెల్యేపై ఏ1గా కేసు నమోదు చేశారు. ► బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీసులు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని 123(1), ఐపీసీ సెక్షన్ 171(ఇ), రెడ్ విత్ 120(బి), సీఆరీ్పసీ 155(2)ల ప్రకారం కేసు నమోదు చేసారు. ► 220/2023, 19/09/2023వ తేదీన ఎమ్మెల్యేపై మార్టూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
విషాదం: అమెరికాలో తెలుగు విద్యార్థి రేవంత్ మృతి
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన విద్యార్థి ఆచంట రేవంత్(22) మృతిచెందాడు. ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం వెళ్లిన తమ బిడ్డ ఇలా అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లాలోని పర్చూరు మండలం బోడవాడకు చెందిన ఆచంట రేవంత్ (22) బీటెక్ పూర్తి చేసుకుని ఎంఎస్ అభ్యసించేందుకు గత ఏడాది డిసెంబరు చివరిలో అమెరికా వెళ్లాడు. మాడిసన్ ప్రాంతంలోని డకోట స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. భారత కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున ముగ్గురు స్నేహితులతో కలసి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు కారులో ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో వాతావరణంలో పెనుమార్పులతో ఒక్కసారిగా పొగ మంచు కమ్ముకుని, కారు అదుపుతప్పినట్లు తెలిసిందన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులతో పాటు రేవంత్‌కు తీవ్ర గాయాలవ్వగా, రేవంత్ దుర్మరణం చెందినట్లు సమాచారం అందిందన్నారు. దీంతో బోడవాడలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. -
రహదారే.. రన్‌వే.. జాతీయ రహదారిపై యుద్ధ విమానాల ల్యాండింగ్ సక్సెస్
సాక్షి ప్రతినిధి, బాపట్ల/అద్దంకి/మేదరమెట్ల: నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే 16వ నంబర్ జాతీయ రహదారి.. సోమవారం ఉదయం బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో కొంతసేపు నిర్మానుష్యంగా మారింది. ఆ వెంటనే సరిగ్గా 11.03 గంటలకు నాలుగు యుద్ధ విమానాలు వరుసగా ఒకదాని వెంట ఒకటిగా దూసుకువచ్చాయి. స్థానికులు సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా.. రెండు యుద్ధ విమానాలు రహదారిని తాకగా.. మరో రెండు అతి సమీపంలో చక్కర్లు కొట్టి వెళ్లిపోయాయి. అంతే అక్కడ ఉన్న వైమానిక దళ అధికారులు, సిబ్బంది, పోలీసులు చప్పట్లతో తమ సంతోషం వ్యక్తం చేశారు. అత్యవసర ల్యాండింగ్ కోసం.. యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి–16పై రేణింగివరం నుంచి మేదరమెట్లకు వెళ్లే దారిలో పి.గుడిపాడు వద్ద 4.1 కిలోమీటర్ల పొడవున, 33 మీటర్ల వెడల్పుతో ల్యాండింగ్ స్ట్రిప్ నిర్మించారు. గతంలో ఒకసారి దీనిపై ట్రయల్ రన్ నిర్వహించారు. తాజాగా సోమవారం మరోసారి ఈ స్ట్రిప్‌పై బాపట్ల జిల్లా సూర్యలంక వైమానిక దళం ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఉదయం 11.03 గంటలకు నాలుగు యుద్ధ విమానాలు రన్‌వే స్ట్రిప్‌పై ఎగురుతూ వెళ్లాయి. 11.05 గంటల నుంచి 11.06, 11.07 గంటల సమయంలో రెండు విమానాలు ఐదు అడుగుల ఎత్తులో రన్‌వేపై వెళ్లాయి. ఆ తర్వాత 11.19 గంటలకు ఒకటి, 11.24 గంటలకు మరొకటి ఎయిర్ స్ట్రిప్‌ను తాకుతూ(డెడ్‌లైన్)లో వెళ్లాయి. 11.28 గంటలకు సుఖోయ్–30, హాక్ విమానాలు రెండు అతి తక్కువ ఎత్తులో దూసుకెళ్లాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి ఏఎన్–32 ట్రాన్స్‌పోర్టు విమానం ల్యాండ్ అయ్యింది. ఇదే విమానం ఎయిర్ స్ట్రిప్‌పై కొంతదూరం నెమ్మదిగా వెళ్లి.. 12.08కి టేకాఫ్ తీసుకుంది. డారి్నయర్ ట్రాన్స్‌పోర్టు విమానం 12.30 గంటలకు ల్యాండ్ అయ్యి.. 12.39 నిమిషాలకు విజయవంతంగా టేకాఫ్ అయ్యింది. దీంతో వైమానిక దళ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేక ఏర్పాట్లు.. యుద్ధ విమానాల ల్యాండింగ్ నేపథ్యంలో జాతీయ రహదారికి ఇరువైపులా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. పోలీస్ బలగాలు, సాయుధ మిలటరీ బలగాలు, వైమానిక దళానికి చెందిన ప్రత్యేక ఫైర్ ఇంజిన్లు ఏర్పాటు చేశారు. అలాగే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్టేషన్ నుంచి వైమానిక దళ అధికారులు విమానాలకు మార్గనిర్దేశం చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి సహకరించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు వైమానిక దళ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. ‘వరదలు, భూకంపాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, తీర ప్రాంతాల్లో చొరబాటుదారులు, ప్రకృతి వైపరీత్యాలతోపాటు అత్యవసర పరిస్థితుల్లో విమానాలు ల్యాండ్ చేయడానికి అనువుగా జాతీయ రహదారి–16పై ఎమర్జెన్సీ ల్యాండింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. గతేడాది డిసెంబర్లో ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు కూడా ట్రయల్‌రన్ విజయవంతమైంది’ అని చెప్పారు. కార్యక్రమంలో వైమానిక దళ అధికారులు ఏవీఎం కుకరేజ్, జేపీ యాదవ్, విజయ్, ఎస్పీ వకుల్ జిందాల్, అడిషనల్ ఎస్పీ పాండురంగ విఠలేశ్వర్, జేసీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
సోషల్ మీడియాలో ‘సిద్ధం’ సంచలనం
సాక్షి, అమరావతి: బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఆదివారం సీఎం జగన్ నిర్వహించిన ‘సిద్ధం’ సభ సామాజిక మాధ్యమాలను ఊపేసింది. ఎక్స్ (ట్విట్టర్)లో వైఎస్ జగన్ ఎగైన్, వైనాట్ 175, సిద్ధం హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్‌లో దేశంలో అగ్రస్థానంలో నిలిచాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో సిద్ధం సభ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అభిమానులు భారీగా పోస్టులు చేశారు. జన సముద్రాన్ని తలపించిన సభా ప్రాంగణం.. సీఎం జగన్ ర్యాంప్‌పై నడుస్తున్న ఫొటోలు.. ప్రసంగిస్తుండగా జనం నీరాజనాలు పలుకుతున్న ఫొటోలతో ఎక్స్,Cలు నిండిపోయాయి. సాధారణంగా ఎక్స్‌లో పోస్టులు చేయడం, వాటిపై స్పందించడానికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ప్రత్యక్ష ప్రసారాలను తక్కువగా చూస్తారు. ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ ప్రసంగాన్ని ‘ఎక్స్’లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా 11 వేల మంది వీక్షించడం సంచలనం రేపింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్వహించిన సభను ఎక్స్ ద్వారా 2,400 మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించగా, టీఎంసీ లోక్‌సభ అభ్యర్థులను పరిచయం చేస్తూ పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన సభను 1,200 మంది తిలకించారు. లైవ్ సభల్లో టాప్.. ‘ఎక్స్’ చరిత్రలో అత్యధిక మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన రాజకీయ సభల్లో సీఎం జగన్ మేదరమెట్ల సభ అగ్రస్థానంలో ఉందని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. మరో సామాజిక మాధ్యమం యూట్యూబ్‌లో సాక్షి టీవీ ద్వారా మేదరమెట్ల సభను 56 వేల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇదే రీతిలో యూట్యూబ్‌లో ఎన్టీవీ, టీవీ 9 లాంటి ఛానళ్లలో భారీ ఎత్తున సిద్ధం సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇటు సామాజిక మాధ్యమాలు.. అటు వివిధ టీవీ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షలాది మంది ‘సిద్ధం’ సభను తిలకించారు. సీఎం జగన్‌పై వివిధ వర్గాల ప్రజల్లో ఉన్న ఆదరణ, విశ్వసనీయతకు నిదర్శనంగా ఈ సభ నిలిచిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మనవడి కోసం వచ్చాను మేదరమెట్ల వద్ద ఆదివారం నిర్వహించిన సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని తెలుసుకున్న 70 ఏళ్లు పైబడిన ఓ వృద్ధురాలు ఉదయం 7గంటలకే సభా ప్రాంగణానికి చేరుకుంది. ఉదయాన్నే సభావేదిక వద్ద వృద్ధురాలు కలియతిరగడం చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడే ‘ఎందుకు వచ్చావ్ అవ్వా’ అని అడిగిన వారందరికీ ‘మా ఆలన పాలన చూస్తున్న నా మనవడిని చూసిపోయేందుకు వచ్చా’నని బదులిచ్చింది. సభా ప్రాంగణంలో ఉన్న ఈ వృద్ధురాలి ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. – అద్దంకి వేదిక వద్ద ప్రైవేట్ డ్రోన్ ‘సిద్ధం’ సభా వేదిక వద్ద కుడి వైపు ఓ ప్రైవేట్ డ్రోన్ ఎగరటాన్ని గుర్తించిన మంత్రి అంబటి రాంబాబు దాన్ని స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. అనుమతి లేకుండా ఇక్కడ డ్రోన్ ఎలా ఎగరవేస్తున్నారు? ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. నారా లోకేష్ ఇలా దొంగచాటుగా డ్రోన్లను పంపడం కాకుండా ధైర్యముంటే నేరుగా రావాలని నరసరావుపేట పార్లమెంట్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు. -
రాజకీయ కుంభమేళా!
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, బాపట్ల: దక్షిణ కోస్తా ప్రాంతంలో వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ పరిధిలోని మేదరమెట్ల వద్ద ఆదివారం నిర్వహించిన ‘సిద్ధం’ సభ కుంభమేళాను తలపించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ సునామీకి తాజా సభ మరో తార్కాణమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. మేదరమెట్ల–రేణంగివరం మధ్య కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారికి పక్కనే వందలాది ఎకరాల సువిశాల మైదానంలో నిర్వహించిన సిద్ధం సభకు ఉదయం 9.30 గంటల నుంచే కార్యకర్తలు, నేతలు, అభిమానుల ప్రవాహం మొదలైంది. మధ్యాహ్నం 2.45 గంటలకు సభా ప్రాంగణం మొత్తం ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసిపోయింది. ఆ తర్వాత సభకు వస్తున్న వారంతా జాతీయ రహదారిపై(అత్యవసర సమయాల్లో యుద్ధ విమానాలు దిగడానికి వీలుగా పది లేన్లతో నాలుగు కి.మీ.పొడవున అభివృద్ధి చేశారు) నిలబడిపోయారు. సభకు తరలివస్తున్న లక్షలాది మంది ప్రజలు వాహనాల్లోనే ఉండిపోయారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. మేదరమెట్ల–రేణంగివరం మధ్య 18 కి.మీ. పొడవున ఆరు వరుసల రహదారిపై వేలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మేదరమెట్ల నుంచి అద్దంకి వైపు వెళ్లే నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై ఏడు కి.మీ. పొడవున వాహనాలు స్తంభించిపోయాయి. సీఎం జగన్ ప్రసంగం పూర్తయిన తర్వాత కూడా సభకు జనప్రవాహం కొనసాగడం గమనార్హం. శ్రేణుల్లో సరి కొత్త ఉత్సాహం.. బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక వైఎస్సార్సీపీ నిర్వహించిన ఈ సభకు జనం పోటెత్తడంతో పార్టీ శ్రేణుల్లో సరి కొత్త ఉత్సాహాన్ని నింపింది. వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ఉత్తరాంధ్రలో జనవరి 27న నిర్వహించిన భీమిలి సభ, ఉత్తర కోస్తాలో ఫిబ్రవరి 3న జరిగిన దెందులూరు సభ, రాయలసీమలో ఫిబ్రవరి 18న నిర్వహించిన రాప్తాడు సిద్ధం సభలు ఒకదానికి మంచి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. వాటికి మించి మేదరమెట్ల సభ సూపర్ హిట్ కావడం సీఎం జగన్ నాయకత్వంపై కార్యకర్తల్లో ఉన్న విశ్వాసానికి అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎన్నికల సన్నాహక సభలు ఈ స్థాయిలో గ్రాండ్ సక్సెస్ కావడంతో టీడీపీ–జనసేన–బీజేపీ నేతలు వణికిపోతున్నారు. మారుమోగిన ‘సిద్ధం’.. రాష్ట్రంలో 58 నెలల పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు చేసిన మంచిని వివరించడంతోపాటు చంద్రబాబు–పవన్ కళ్యాణ్‌పై పదునైన విమర్శలతో విరుచుకుపడుతూ సీఎం జగన్ చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. 2014 ఎన్నికల్లోనూ ఆ మూడు పార్టీలు జట్టు కట్టాయని గుర్తుచేస్తూ రుణమాఫీ పేరుతో రైతులకు, మహిళలకు చంద్రబాబు చేసిన మోసాలను సీఎం జగన్ ఎండగట్టారు. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానంటూ యువతను చంద్రబాబు వంచించిన వైనాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు అదే కూటమి మరోసారి జత కట్టిందని, చంద్రబాబు హామీలకు శకుని చేతిలో పాచికలకు తేడా లేదంటూ విమర్శించడంతో జనం హర్షధ్వానాలు చేశారు. మాట నిలబెట్టుకుంటూ ఎన్నికల హామీల్లో 99 శాతం అమలు చేశామని, డీబీటీతో రూ.2.65 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశామని.. పేదలు బాగుపడటం చూసి చంద్రబాబు కుళ్లుకుంటున్నారని సీఎం జగన్ విమర్శించినప్పుడు జనం నుంచి అనుహ్య స్పందన లభించింది. మరో చారిత్రక విజయానికి, మహా సంగ్రామానికి సిద్ధమా? అని సీఎం జగన్ ప్రశ్నించగా లక్షలాది మంది పిడికిళ్లు బిగించి సిద్ధమంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. రైతన్నల రాజ్యం.. సీఎం జగన్ అన్నదాతల శ్రేయస్సును కాంక్షిస్తూ రైతు రాజ్యం తీసుకొచ్చారు. వైఎస్సార్ రైతు భరోసాతో పాటు 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు అందచేశారు. ప్రతి కార్యక్రమంలో అక్క చెల్లెమ్మలకు పెద్ద పీట వేసి మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. ఉద్యోగాలు, పదవులు, రుణాలు, ఇళ్ల స్థలాలు... అన్నింటా వారికే ప్రాధాన్యం ఇచ్చారు. పేదింటి బిడ్డలకు పెద్ద చదువులు చేరువ చేసి విద్యా దీపాలు వెలిగించారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రతి నెలా ఒకటో తేదీనే టంచన్‌గా రూ.3 వేలు చొప్పున సామాజిక పింఛన్లను ఇంటివద్దే పారదర్శకంగా అందించే విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టారు. లక్షల సంఖ్యలో సచివాలయ ఉద్యోగాలతోపాటు గ్రూపు 1, గ్రూపు 2, డీఎస్సీతో యువత కలలను నెరవేరుస్తున్నారు. సీఎం జగన్‌ను ప్రతి పేద కుటుంబం తమ పెద్ద బిడ్డ మాదిరిగానే భావిస్తూ ఆశీర్వదిస్తోంది. – చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రీజినల్ కో–ఆర్డినేటర్, ఒంగోలు పార్లమెంటు సమన్వయకర్త. సముద్రంలో కలిపేస్తాం.. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న మొనగాడు సీఎం జగనైతే 14 ఏళ్లు అందరినీ వంచించిన మోసగాడు చంద్రబాబు. మొనగాడు కావాలో.. మోసగాడు కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. సీఎం జగన్‌ను గద్దె దింపేంత వరకు విశ్రమించబోనంటున్న చంద్రబాబు తనకు దత్తపుత్రుడు తోడైనా ధైర్యం చాలక ఇప్పుడు ముగ్గురం కలిసే వస్తామంటున్నారు. ఆయన సింగిల్‌గా వస్తే చితకబాదుతాం. ఇద్దరొస్తే విసిరి కొడతాం. ముగ్గురూ కలిసి వస్తే సముద్రంలో కలిపేస్తాం. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని 50 శాతానికిపైగా ప్రజలు కోరుకుంటున్నారు. ఎంత మంది కలిసి వచ్చినా ఆయన్ను ఏమీ చేయలేరు. టీడీపీ – జనసేన జెండాలు ఎత్తేసే సభలు నిర్వహిస్తున్నాయి. – అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రి వంచన చరిత్ర బాబుదే సీఎం జగన్‌కు పాలన చేతకాదని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు నాలుక మడత పెట్టి ఆయన ఒక బటన్ నొక్కితే నేను ఐదు బటన్లు నొక్కుతానని నమ్మబలుకుతున్నారు. కరోనా సమయంలో బడికి వెళ్లని పిల్లలకు ఎవరి అబ్బ సొమ్ములా అమ్మ ఒడి ఇచ్చారని విమర్శించిన చంద్రబాబు తాను ఒక్కరికైతే రూ.15 వేలు, ముగ్గురు పిల్లలుంటే రూ.90 వేలు చొప్పున ఇస్తామంటున్నారు. ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడి ప్రజలను మోసగించాలని ప్రయత్నిస్తున్నారు. రైతులు, డ్వాక్రా మహిళలనూ రుణమాఫీ పేరుతో వంచించిన చరిత్ర చంద్రబాబుదే. సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా ద్వారా మాటకు మించి పెట్టుబడి సాయాన్ని అన్నదాతలకు అందచేశారు. మాట ప్రకారం పొదుపు సంఘాల మహిళలను కూడా ఆదుకున్నారు. – కాకాణి గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పేద బిడ్డలకు ప్రోత్సాహం.. సీఎం జగన్ నిరుపేద బిడ్డలకు ఇంగ్లిషు మీడియం చదువులను అందుబాటులోకి తెచ్చారు. ప్రపంచంతో మన విద్యార్థులు పోటీ పడేలా ప్రోత్సహిస్తున్నారు. చేయూతతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. నిజమైన సాధికారత అంటే కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవటమే. మహిళల రక్షణ కోసం ‘దిశ’ తీసుకొచ్చారు. 1.40 లక్షల మంది మహిళల ఫోన్లలో దిశ రిజిస్టర్ కావడం సీఎం జగన్ కల్పిస్తున్న భరోసాకు నిదర్శనం. – మేకతోటి సుచరిత, హోంశాఖ మాజీ మంత్రి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ‘సిద్ధం’ బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు ఆత్మ గౌరవంతో తలెత్తుకుని ముందుకు సాగటానికి సీఎం జగన్ కల్పిస్తున్న భరోసానే కారణం. ప్రతి కార్యకర్త, నాయకుడు 45 రోజులు పాటు కష్టపడితే ఆ తరువాత ఐదేళ్లు సీఎం జగన్ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. 2024 తరువాత రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ మాత్రమే ఉంటుంది. జగనన్నను ఎదుర్కొనే దమ్ములేక ఇద్దరు వ్యక్తులు ఢిల్లీ వెళ్లి కాళ్లా వేళ్లా పడుతున్నారు. – అనిల్‌కుమార్ యాదవ్, నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త ఊరూరా ఘన స్వాగతం.. నన్ను అద్దంకి పంపించి ఇంత పెద్ద వైఎస్సార్ కుటుంబాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రతి గ్రామంలో ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రతి ఇంటికి చేరిన సంక్షేమ పథకాలు సీఎం జగన్ మంచితనం, మానవత్వాన్ని చాటుతున్నాయి. 70 ఏళ్ల పెద్దమ్మ కూడా జగనన్నా అంటోందంటే వారి మనసుల్లో సీఎం జగన్ చిరస్థాయిలో నిలిచారనేందుకు నిదర్శనం. – పాణెం హనిమిరెడ్డి, అద్దంకి వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఒక నమ్మకం.. భరోసా జగనన్న అంటే.. ఒక నమ్మకం.. ఒక భరోసా. పేదలకు అండగా ఉంటూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి చేయూతనందిస్తున్నారు. దాదాపు 36 సంక్షేమ పథకాల ద్వారా డీబీటీతో నేరుగా రూ.2.50 లక్షల కోట్లకు పైగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పారదర్శకంగా జమ చేశారు. పిల్లల చదువులు మొదలుకొని మహిళలు సాధికారతతో ఎదిగేలా తోడుగా నిలుస్తున్నారు. పేదలకు ప్రధానంగా కావాల్సింది విద్య, వైద్యం. వీటిని భరోసాగా వారికి అందించిన ఘనత సీఎం జగన్‌దే. – నందిగం సురేష్, బాపట్ల పార్లమెంట్ సభ్యుడు నా కుటుంబానికి అన్ని పథకాలు అందాయి. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు నా కుటుంబానికి అందాయి. నా భార్యకు వైఎస్సార్ చేయూత, డ్వాక్రా రుణమాఫీ అందాయి. నాకు సెంట్రింగ్ పని నిమిత్తం పెట్టుకున్న రుణం రూ.3లక్షలు కూడా అందజేసిన మనసున్న వ్యక్తి సీఎం జగనన్న. తిరిగి జగనన్నను సీఎంను చేసుకునేందుకు పాటుపడతాం. – షేక్ మీరావలి, సంతనూతలపాడు జగనన్నను చూడాలన్న కోరికతో వచ్చా సీఎం జగన్ ఇచ్చినన్ని సంక్షేమ పథకాలను ఏ ముఖ్యమంత్రీ ఇవ్వలేకపోయారు. అందుకే జగనన్న అంటే ఎనలేని అభిమానం. ఆయన సభ ఎక్కడ జరిగినా, ఎంత దూరమయినా వెళుతుంటాను. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా మా కుటుంబానికి ఎంతో మేలు జరిగింది. రానున్న ఎన్నికల్లో ఆయన మళ్లీ సీఎం అవడం ఖాయం. – సీహెచ్ రామ్మూర్తి, విశాఖపట్నం 3 చక్రాల బండిపై 80 కి.మీ. ప్రయాణించి వచ్చా.. మాది బాపట్ల పట్టణం ఇందిరానగర్ కాలనీ. దివ్యాంగులం అయిన మాకు జగనన్న సీఎం అయిన తర్వాత చేసిన మేలు జీవితంలో మరువలేం. మాకు గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు చక్రాల బండ్లు పంపిణీ చేశారు. జగనన్న మీద అభిమానంతో 80 కిలోమీటర్లు మూడు చక్రాల బండిమీద ప్రయాణం చేస్తూ వచ్చాను. అర్హులైన ప్రతి ఒక్క దివ్యాంగుడికి జగనన్న పాలనలోనే పెన్షన్లు సక్రమంగా వస్తున్నాయి. జగనన్న మాకు చేస్తున్న మేలును మేము జీవితంలో మరువలేం. – చల్లా రామయ్య, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆరోగ్యం బాగోలేదు.. అయినా నా మనవడిని చూద్దామని వచ్చా.. నాది జె.పంగులూరు మండలం రేణంగివరం గ్రామం. నా వయస్సు 73 ఏళ్లు. నాకు మూడు రోజులుగా జ్వరం. ఒళ్లంతా నొప్పులు. నా మనవడిని చూడాలని ఎప్పటి నుంచో కోరిక. మా ఊరి దగ్గరకు వచ్చినప్పుడైనా చూద్దామనుకుంటే జ్వరం వచ్చింది. అయినా సరే చచ్చినా ఫర్లేదు అనుకుని బయల్దేరాను. అందరూ ముసలిదానివి ఆ జనంలో తొక్కుతారు. చచ్చిపోతావని చెప్పారు. అయినా సంతోషమే అంటూ వచ్చాను. దేవుడి దయవల్ల నన్ను పోలీసులు స్టేజీ దగ్గరకు తీసుకెళ్లి కూర్చొబెట్టారు. నేను నా మనుమడిని దగ్గరగా చూశాను. ఈ జన్మకు ఇది చాలు. – భూమి రాములమ్మ 370 కి.మీ. ప్రయాణించి వచ్చా.. నాది తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా. నేను హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నా. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. విద్యా వ్యవస్థలో జగనన్న తీసుకుంటున్న సమూలమైన మార్పుల కారణంగా జగనన్నకు అభిమానిగా మారాను. ఇంత అభిమానం ఉన్న నాకు జగనన్నకు ఓటేసే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అబ్బాయిని వివాహం చేసుకుని జగనన్నకు ఓటు వేసి ఆయనకు మద్దతుగా నిలవాలన్నది నా కోరిక. ఆయన మీద అభిమానంతో 370 కి.మీ ప్రయాణం చేసి అద్దంకి సిద్ధం సభకు వచ్చా. జగనన్నను దగ్గరగా చూడటంతో నా జన్మ ధన్యమైంది. – తోకాటి నిదూష – కరీంనగర్ దివ్యాంగుడిని అయినా దిగులు లేదు దివ్యాంగుడిని అయినా నా జీవనంపై దిగులు పడకుండా ప్రభుత్వం నెల నెలా రూ.మూడు వేల పింఛన్ నగదు అందజేసి నాలో మనోధైర్యం నింపుతోంది. త్రిచక్ర వాహనాన్ని కూడా అందజేశారు. అలాగే నా కుటుంబంలో అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సంక్షేమం ప్రతి ఒక్కరికీ అందాలంటే జగనన్న తిరిగి ముఖ్యమంత్రి కావాలి. – ఆర్.ఆంజనేయులు, ఒంగోలు బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ జగన్‌తోనే.. మాది ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం చింతగుంట్ల గ్రామం. మా అభిమాన హీరో, మా ఇంటి ఆశాదీపం అయిన మా జగనన్నను చూసేందుకు బైక్‌పై 100 కి.మీ.ప్రయాణించి వచ్చాం. మా బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ జగనన్నతోనే ఉంటాం. సీఎం హోదాలో ఉన్న జగనన్న కామన్ మేన్‌గా నడుచుకుంటూ మా మధ్యలోకి రావడం మాకు చాలా ఆనందాన్నిచ్చింది. – రాంబాబు, నాగరాజు, అశోక్ నా రెండు కాళ్లూ సహకరించకున్నా జగన్ కోసం వచ్చా.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను చూసేందుకు వచ్చాను. నా రెండు కాళ్లు సహకరించకపోయినా మార్కాపురం నుంచి వచ్చాను. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పథకాలు మా కుటుంబానికి అందాయి. పంటల బీమా, డ్వాక్రా రుణమాఫీ వంటి వాటితో మా జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు జగన్. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలి. – ఎం.వెంకటేశ్వరరెడ్డి, మార్కాపురం తెలంగాణ నుంచి వచ్చా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు మా ఇంట్లో వెలుగులు నింపాయి. బతుకుదెరువు కోసం నేను బేల్దారి మే్రస్తిగా తెలంగాణ రాష్ట్రం హన్మకొండలో పనిచేస్తున్నాను. నా కుటుంబం ఇక్కడే ఉంటుంది. ఇద్దరు ఆడపిల్లలున్నారు. అమ్మ ఒడి, ఇళ్ల పట్టా, వైఎస్సార్ చేయూత వంటి పథకాలు మాకు అందాయి. సీఎం జగన్ మా ప్రాంతానికి వస్తున్నాడని తెలిసి హన్మకొండ నుంచి ఆయనను చూసేందుకు సిద్ధం సభకు వచ్చాను. – గంగుల అశోక్, మర్రిపూడి నా మనవడిని దగ్గరగా చూడాలన్న ఆశ నెరవేరింది.. జీవిత చరమాంకంలో ఉన్న మాలాంటి వృద్ధులకు అండగా నిలిచిన నా మనవడు జగన్‌ను దగ్గరగా చూడాలని సిద్ధం సభకు వచ్చాను. ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయం 6 గంటలకు పింఛన్ అందించి మాలాంటి వారికి ఆర్థిక ఇబ్బందుల్లేకుండా చూస్తున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ చేయించుకున్నా. నా మనవడిని దగ్గరగా చూడాలనే ఆశ నెరవేరింది. – చెన్నక్క, పొదిలి జగన్ నూరేళ్లూ చల్లగా ఉండాలి రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి ప్రతి ఇంటికీ పెద్ద కొడుకుగా సీఎం జగన్ నిలిచారు. మా ఇంట్లో రైతు భరోసా వచ్చింది. ఇల్లు కూడా కట్టుకున్నాం. మంచి మనసున్న సీఎం జగన్‌ను చూసేందుకు వృద్ధాప్యంలో ఉన్నా, భార్యాభర్తలం ఇద్దరం వచ్చాం. ఆయన నూరేళ్లు చల్లగా ఉండాలి. మళ్లీ ఆయనే సీఎం కావాలన్నది మా కోరిక. – అనంత సీతమ్మ, జె.పంగులూరు -
టీడీపీ, జనసేన రౌడీమూకల విధ్వంసకాండ
చెరుకుపల్లి: బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పుట్టావారిపాలెంలో తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన రౌడీలు విధ్వంసం సృష్టించారు. మద్యం తాగి గొడ్డళ్లు, ఇనుపరాడ్లు చేతపట్టుకుని అర్ధరాత్రి వేళ వైఎస్సార్సీపీకి చెందినవారి బైక్‌లను ధ్వంసం చేశారు. పుట్టావారిపాలెంలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలు వైఎస్సార్సీపీకి మద్దతు పలుకుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కొందరు రౌడీలు మద్యం తాగి శనివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గొడ్డళ్లు, ఇనుప రాడ్లు పట్టుకుని వైఎస్సార్సీపీకి మద్దతు తెలుపుతున్నవారి ఇళ్ల వద్దకు వెళ్లి హల్చల్ చేశారు. ఇళ్ల ముందు నిలిపిన 20 బైకులను ధ్వంసం చేశారు. గ్రామస్తులు కేకలు వేయడంతో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన రౌడీలు తమ బైక్‌లను వదిలి పారిపోయారు. గ్రామస్తులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి 11 బైక్‌లు, ఇనుపరాడ్డును స్వా«దీనం చేసుకున్నారు. వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ దురాగతానికి పాల్పడిన రౌడీమూకలను కఠినంగా శిక్షించాలని ఎంపీపీ మత్తి దివాకర రత్నప్రసాద్, వైఎస్సార్సీపీ మండల కన్వినర్ పైనం ఏడుకొండలరెడ్డి, స్థానిక సర్పంచ్ మొగలిపువ్వు కోటేశ్వరరావు పోలీసులను కోరారు. -
హుషారుగా.. అద్దంకి సిద్దం సభకు (ఫొటోలు)
-
Bapatla: జైత్ర యాత్రకు సిద్ధం
సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి, నరసరావుపేట: సిద్ధం... ఈ మాట వింటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమరోత్సాహంతో ఎన్నికల యుద్ధానికి కదం తొక్కుతున్నారు.. మరోవైపు ఈ సభలకు వస్తున్న ప్రతిస్పందన చూసి ప్రతిపక్ష నేతలు మాత్రం ఓటమి భయంతో వణికిపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధం పేరిట ఇప్పటికే మూడు సభలు నిర్వహించి గడచిన నాలుగేళ్ల పది నెలల కాలంలో ప్రజలకు చేసిన మేలును వివరించడంతో పాటు ప్రజలకోసం పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న మూకుమ్మడి కుట్రను వివరిస్తున్నారు. ► అందులో భాగంగా నేడు చివరి సిద్ధం సభ బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని పి.గుడిపాడులో జరగనుంది. ఇందులో పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల నుంచి పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలు హాజరుకానున్నారు. ► చరిత్రలో నిలిచేపోయే ఈ సభలో పాల్గొనాలని పల్నాడు జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. జననేత సందేశం వినాలని ఆత్రుతతో ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రసంగాన్ని ప్రతి ఇంటికీ చేర్చి మరోసారి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడేలా చూడటమే లక్ష్యంగా నేడు వీరు సిద్ధం సభకు వెళ్లనున్నారు. ► గుంటూరు జిల్లాలో గుంటూరు పశ్చిమ నుంచి మంత్రి విడదల రజని, తూర్పు నుంచి నూరి ఫాతిమా, తాడికొండ నుంచి మేకతోటి సుచరిత, ప్రత్తిపాడు నుంచి బలసాని కిరణ్‌కుమార్, తెనాలి నుంచి అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి నుంచి ఎమ్మెల్యే ఆర్కే, సమన్వయకర్త మురుగుడు లావణ్య, పొన్నూరు నుంచి అంబటి మురళీకృష్ణ, గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య నేతృత్వంలో జన సమీకరణకు సన్నాహాలు పూర్తి అయ్యాయి. ఇప్పటికే వాహనాలు సిద్ధం చేశారు. ►పల్నాడు జిల్లాలో సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు, మాచర్ల నుంచి ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల నుంచి ఎమ్మెల్యే కాసు మహే‹Ùరెడ్డి, నరసరావుపేట నుంచి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పెదకూరపాడు నుంచి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, వినుకొండ నుంచి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, చిలకలూరిపేట నుంచి సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో శ్రేణులు పెద్ద ఎత్తున సభకు తరలి వెళ్లడానికి సన్నద్ధం అవుతున్నారు. ► బాపట్ల జిల్లాలో బాపట్ల నుంచి ఎమ్మెల్యే కోన రఘుపతి, అద్దంకి నుంచి సమన్వయకర్త పానెం చిన హనిమిరెడ్డి, రేపల్లె నుంచి సమన్వయకర్త ఈవూరి గణే‹Ù, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, చీరాల నుంచి ఎమ్మెల్యే కరణం బలరాం, సమన్వయకర్త వెంకటేష్, పర్చూరు నుంచి సమన్వయకర్త ఎడం బాలాజీ, వేమూరు నుంచి సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో శ్రేణులు కదం తొక్కనున్నాయి. సొంత వాహనాల్లో ప్రయాణం పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఇప్పటికే పలు మార్లు సిద్ధం సభ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి భారీ సంఖ్యలో ప్రజలు సభకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ సీపీ అభిమానుల కోరిక మేరకు సభకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో వాహనాలు ఏర్పాటు చేశారు. మరికొంత మంది కార్యకర్తలు తాము సొంతగా వాహనాలు ఏర్పాటు చేసుకొని సభకు వెళ్లనున్నారు. వీటితో నేడు దారులన్నీ సిద్ధం సభ వైపునకు మళ్లాయి. ఇప్పటికే మంచి జోష్ మీద ఉన్న వైఎస్సార్ సీపీ క్యాడర్ నేడు సిద్ధం సభ వేదికగా సీఎం వైఎస్ జగన్ ఇచ్చే సందేశంతో మరింత పెరిగిన ఉత్సాహంతో రానున్న ఎన్నికల్లో పనిచేసి, పార్టీ అఖండ విజయానికి కృషి చేయనున్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. నగరంపాలెం: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో ఆదివారం జరగనున్న ‘సిద్ధం’ సభకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. సభకు ప్రజలు భారీగా తరలిరానున్నారు. అటుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు/ వాహనచోదకులకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను దారి మళ్లించినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇలా వెళ్లాలి.. ► విజయవాడ, గుంటూరు నుంచి జాతీయ రహదారిపై ఒంగోలు, చెన్నై వైపు వెళ్లే వాహనాలు బుడంపాడు అడ్డరోడ్ మీదగా పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట వైపుగా వెళ్లాలి. ► గుంటూరు నగరం నుంచి ఒంగోలు వెళ్లే వాహనాలు ఏటుకూరు జంక్షన్ నుంచి ప్రత్తిపాడు, పర్చురు, ఇంకొల్లు, నాగులుప్పలపాడు, త్రోవగుంట వైపు వెళ్లాలి. ► గుంటూరు నుంచి నరసరావుపేట మీదుగా ఒంగోలు వెళ్లే వాహనాలు చుట్టుగుంట, పేరేచర్ల, ఫిరంగిపురం, నరసరావుపేట, సంతమాగులూరు అడ్డరోడ్డు జంక్షన్, అద్దంకి, మేదరమెట్ల మీదుగా వెళ్లాలి. ► 16వ నంబర్ జాతీయ రహదారిపై బొల్లాపల్లి టోల్ ప్లాజా నుంచి బొల్లాపల్లి, మేదరమెట్ల వరకు ఎటువంటి వాహనాలకు అనుమతిలేదు. సిద్ధం సభ వాహనాలకు మాత్రమే అనుమతి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి వాహనాల దారి మళ్లింపు అమల్లోకి వస్తోందని జిల్లా ఎస్పీ తెలిపారు. -
Siddham Sabha: అద్దంకి సిద్ధం సభ హైలైట్స్
Medarametla Siddham Sabha Updates: 4:45PM, Mar 10th, 2024 సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ఏమన్నారంటే.. బిందువూ బిందువూ సింధువైనట్లుగా.. నా మీద, మన పార్టీ మీద నమ్మకంతో చేయి చేయి కలిపి ప్రభంజనంలా ఇక్కడికి సిద్ధం అంటూ ఉప్పెనలా తరలి వచ్చిన ఈ జన సమూహం.. ఓ మహాసముద్రంలా ఇక్కడి నుంచి చూస్తే కనిపిస్తోంది. ఈ మేదరమెట్లలో కనిపిస్తోంది ఓ జన సముద్రం. ఓ జన ప్రవాహం. ఇంటింటి అభివృద్ధిని, సామాజిక వర్గాల సంక్షేమాన్ని, పేదలందరి ఆత్మగౌవరాన్ని మొత్తంగా రాష్ట్ర ప్రగతిని ఇలాగే కాపాడుకుని మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు మద్దతు పలికేందుకు వచ్చిన ఈ ప్రజా సైన్యానికి, ఇక్కడున్న ప్రతి గుండె చప్పుడుకీ మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ సెల్యూట్ చేస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో జరగబోతున్న ఎన్నికల మహాసంగ్రామానికి, ఆ సంగ్రామంలో పేదవాడి భవిష్యత్‌ను కాపాడేందుకు, ఆ పేదవాడికి అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా..! పార్టీల పొత్తులతో బాబు.. ప్రజలే బలంగా మనమూ.. తలపడబోతున్న ఈ మహాసంగ్రామానికి మీరంతా కూడా సిద్ధమేనా..! జగన్‌ను ఓడించాలని వారు.. పేదల్ని గెలిపించాలని మనం.. చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవడానికి మీరంతా కూడా సిద్ధమేనా..! సిద్ధం అంటే ఓ ప్రజా సముద్రం. ఇప్పటికే ఉత్తరాంధ్ర సిద్ధం. ఇప్పటికే ఉత్తర కోస్తా సిద్ధం. ఇప్పటికే రాయలసీమ సిద్ధం. ఈరోజు దక్షిణ కోస్తా కూడా సిద్ధం. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మ, అధర్మాల మధ్య జరిగే ఈ యుద్ధంలో.. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరగబోయే ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర మీది. ప్రజలందరిదీ. అర్జునుడి పాత్ర మీ బిడ్డది. మీ అన్నది, మీ తమ్ముడిది. జమ్మి చెట్టు మీద ఇంత కాలం దాచిన ఓటు అనే అస్త్రాన్ని ఇంటింటి అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, పేద సామాజికవర్గాల అభివృద్ధికి, అడ్డు పడుతున్న పెత్తందార్ల మీద ప్రయోగించాల్సిన ఇక సమయం వచ్చేసింది. నాకు, చంద్రబాబుకు ఉన్నట్టుగా పది మంది నటించే పొలిటికల్ స్టార్లు నాకు లేరు. నాకు చంద్రబాబు మాదిరిగా ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లేదు. అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా నాకు లేదు. రకరకాల పార్టీలతో పొత్తులు లేవు మీ బిడ్డకు. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్న నాకు.. ఉన్నదల్లా.. నక్షత్రాలు ఎన్నున్నాయో అంత మంది పేదింటి స్టార్ క్యాంపెయినర్లు నాకు ప్రతి ఇంట్లోనూ ఉన్నారు. ప్రతి గడపలోనూ ఉన్నారు. నా ఎదుట ఇసుక వేస్తే కూడా రాలనంతగా ఈరోజు ఇక్కడ కార్యకర్తలు, అభిమానులు, ప్రజానీకం.. మీలో ప్రతి ఒక్కరూ మీ జగన్‌కు, మీ అన్నకు, మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లుగానే ముందుకు నడుం బిగించాలి. బహుశా మరో నాలుగు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తోంది. చంద్రబాబు పార్టీలు, చంద్రబాబు జేబులో ఉన్న మరో పార్టీ.. వీరంతా కూడా మన మీద, మన పేదల భవిష్యత్ మీద వీరంతా దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ పార్టీలందరిలో కూడా వీరందరికీ సైన్యాధిపతులే తప్ప ఏ పార్టీలో కూడా సైన్యం ఎక్కడా లేదు. ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో నోటాకు వచ్చినన్ని కూడా ఓట్లు రాని పార్టీలు. తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విడగట్టిన పార్టీలు, రాష్ట్ర ద్రోహుల పార్టీలు, మరికొందరు ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు, వ్యక్తులు. ఇటువంటి వారందరూ కూడా మనకు పోటీగా అటువైపున ఉన్నారు. మనం 5 కోట్ల ప్రజల అండదండలతో ఇంటింటికీ మంచి చేసి మనం ఈరోజు సిద్ధం అంటుంటే వారి వెనుక ప్రజలు లేరు, చేసిన మంచి చెప్పుకునే పరిస్తితి లేదు కాబట్టి, అరడజను పార్టీలతో, అరడజను ఎల్లో మీడియా సంస్థలతో పొత్తులతో, ఎత్తులతో, జిత్తులతో ఎక్కే గుమ్మం, దిగే గుమ్మంగా వారు రాజకీయం నడుపుతున్నారు. జాతీయ రాజకీయాలను తానే ఏలానని, స్టీరింగ్ కమిటీ చక్రం తానే తిప్పానని, ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని తానే నిర్ణయించానని ఒకప్పుడు చంద్రబాబు ఊదరగొట్టేవాడు. ఈరోజు ఏపీలో మనం చేసిన ఇంటింటి అభివృద్ధి, మంచి వల్ల మనకున్న ప్రజా బలం ముందు నిలబడలేక, మనతో నేరుగా తలపడలేక, ఏపీలో తన సైకిల్ చక్రం తిరగడం లేదని ఢిల్లీకి దత్తపుత్రుడితో కలిసి వెళ్లి పడిగాపులుగాసి, ఢిల్లీలో మోకరిల్లుతున్న పరిస్థితులు ఈరోజు చంద్రబాబు పరిస్థితి. కేవలం జగన్ ఒక్కడే ఇటువైపున. జగన్ వల్ల మంచి జరక్కపోయి ఉంటే ప్రతి ఇంటికీ, మేనిఫెస్టోలో చెప్పినది చేయకపోయి ఉంటే, జగన్ అనే ఒక్కడు చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తించి ఉండకపోయి ఉంటే.. చంద్రబాబు ఇన్ని పొత్తుల కోసం ఎందుకు పాకులాడుతున్నాడు? ఇంత మందితో పొత్తుల కోసం అగచాట్లు పడుతున్నాడు? ఎందుకు ఢిల్లీదాకా వెళ్లి అక్కడ మోకరిల్లుతున్నాడు. దీనికి కారణం చిత్తశుద్ధితో, నిజాయితీతో మనం చేసిన మంచి, అన్ని వర్గాల మీద మనం చూపిన కమిట్మెంట్, ఇంటింటికీ మనం చేసిన అభివృద్ధి. మన పార్టీ, మన ప్రభుత్వం నిండుగా విరగకాసిన మామిడిచెట్టులా మనం ఉంటే, చంద్రబాబు పార్టీ అందర్నీ మోసం చేసి వెన్నుపోట్లు పొడిచి, గత పాపాలకు ఫలితం అనుభవిస్తూ తెగులు పట్టిన చెట్టులా చంద్రబాబు పరిస్థితి ఉంది. మన ఎమ్మెల్యేలు, నాయకులు అంతా ప్రతి నియోజకవర్గంలో గడపగడపకూ ప్రజల వద్దకు వెళ్లి చేసిన మంచిని చెబుతూ తిరుగుతుంటే చంద్రబాబు మాత్రం రామోజీ గడప, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గడప, టీవీ5 గడప, ఢిల్లీలో ఇతర పార్టీల గడపలు.. ఇలా ఓ అరడజను గడపలు.. ఐదేళ్లుగా తన మనుషులను పంపి తాను తిరుగుతున్నాడు. ఇది కనిపిస్తున్న చంద్రబాబు మార్క్ రాజకీయం. మరి మీ జగన్ మార్క్ రాజకీయం.. మీ అన్న మార్క్ రాజకీయంలో విలువలున్నాయి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉంది. నిబద్ధత ఉంది. సిద్ధాంత బలం ఉంది. ఇంటింటికీ మంచి చేశాము అన్న చరిత్ర ఉంది. అన్నింటికీ మించి ప్రజల మీద, అక్కచెల్లెమ్మల మీద నమ్మకం ఉంది. మీ బిడ్డ పాలనలో ప్రతి ఇంట్లోనూ చిక్కటి చిరునవ్వులు కనిపించే పరిస్థితులున్నాయి. మన మార్క్ రాజకీయంలో ఇంటింటి అభివృద్ధి కూడా కనిపిస్తుంది. మన ఫ్యాన్ గిర్రున తిరిగేందుకు కావాల్సిన కరెంటు ఇతర పార్టీల నుంచి రాదు. ఇతరులతో పెట్టుకున్న పొత్తుల నుంచి రాదు. నేరుగా ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది. వారి గుండెల్లో ప్రేమ నుంచి వస్తుంది. మన ఫ్యాన్‌కు కరెంటు మనందరి ప్రభుత్వం ఇంటింటికీ చేసిన మంచి నుంచి వస్తుంది. మనం అందించిన నవరత్నాల నుంచి మన ఫ్యాన్‌కు కరెంటు వస్తుంది. లంచాలు లేని, వివక్ష లేని పాలన ఎవరైనా ఇవ్వగలుగుతారా అని ఆశ్చర్యం వెలిబుచ్చిన పరిస్థితుల నుంచి ఈరోజు లంచాలు లేని వివక్ష లేని పాలన అందించిన దాంట్లో నుంచి మన ఫ్యాన్‌కు కరెంటు వస్తుంది. మాటతప్పకుండా మేనిఫెస్టోను ఓ బైబిల్‌గా, ఖురాన్‌గా, భగవద్గీతగా భావించి ఇంత వరకు ఎవరూ ఎప్పుడూ చేయని విధంగా పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలు అమలు చేసిన ఆ నిజాయితీ నుంచి మన ఫ్యాన్‌కు కరెంటు వస్తుంది. చంద్రబాబు సైకిల్ పరిస్థితి ఏమిటని గమనిస్తే.. చంద్రబాబుకు సైకిల్‌కు ట్యూబుల్లేవు. టైర్లు లేవు. చక్రాలే లేవు. తుప్పు పట్టిన పరిస్థితిలో ఈరోజు ఉంది. తుప్పుపట్టిన సైకిల్‌ను తొక్కటానికి, తోయటానికి చంద్రబాబుకు వేరే పార్టీలు కావాలి. ఇదీ చంద్రబాబు గారి జాబ్ రిక్వైర్మెంట్. బాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క మంచీ కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు. ఒక్క స్కీము కూడా వినపడదు, కనిపించదు. పొత్తుల్లో భాగంగా ముందుగా ఒక ప్యాకేజీ ఇచ్చి దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు. ఈ ప్యాకేజీ స్టార్ అయితే, సైకిల్ సీటు తనకు కావాలని అడగడు. తన వారికి సీట్లు ఇవ్వకపోయినా ఈ పెద్దమనిషి అడగనే అడగడు. ఎందుకు ఇచ్చి తక్కువ సీట్లు ఇస్తున్నావని క్వశ్చన్ కూడా అడగడు. తాను తాగుతున్న టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు. చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు. స్టాండ్ అంటే నిలబడతాడు. ఎప్పుడు సైకిల్‌ను దిగమంటే అక్కడ దిగుతాడు. ఎప్పుడు సైకిల్‌ను తోయమంటే అప్పుడు తోస్తాడు. పొత్తుల్లో ఉండమంటే పొత్తుల్లో ఉంటాడు. విభేదించినట్లు డ్రామాలాడమంటే రక్తికట్టించేట్టు డ్రామా ఆడతాడు. వెనకటికి చంద్రబాబు లాంటి నాయకుడిని ఎవరో అడిగారట. అయ్యా.. పరిపాలన చేసేవారు కలకాలం గుర్తుండాలంటే ఎలాంటి పనులు చేయాలి అని అడిగారట. అప్పుడు ఆ బాబు.. ప్రజలకు అన్నం పెడితే అరిగిపోతుంది. చీర కొనిపెడితే చిరిగిపోతుంది. ఇల్లు కట్టిస్తే కూలిపోతుంది. కర్రు కాల్చి వాత పెడితే మాత్రమే ప్రజలకు కలకాలం గుర్తుంటుందని చెప్పాడట. ఈ 14 ఏళ్లు సీఎంగా ఉన్న బాబు కూడా అలాంటోడే. అదే చేశాడు. ఎంత మందితో పొత్తులు పెట్టుకున్నా కూడా ఈ చంద్రబాబు పరిస్థితి సున్నా. ఈ సున్నా ఇంటూ ఎన్ని పార్టీలున్నా దాని విలువ ఒక బోడి సున్నానే. ఆశ్చర్యం ఏమిటో తెలుసా.. ఇప్పుడు చంద్రబాబు ముగ్గురితో కలిసి పొత్తు అంటున్నాడు. ఈ ముగ్గురూ కలిసి 2014లో ఇలాగే పొత్తుగా ఏర్పడి ఈ ముగ్గురూ కలిసి ఒకే స్టేజీ మీద కూర్చుని వీళ్లంతా మీటింగులు పెట్టారు. ఒకే ప్రకటనలో ముగ్గురి ఫొటోలు వేసుకుని చంద్రబాబు సంతకం పెట్టి.. ఇంటింటికీ ఈ పాంప్లేట్ను పంపించాడు. రైతులకు రుణమాఫీ మీద మొదటి సంతకం చేస్తాను, డ్వాక్రా సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తాం, మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్, మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు డిపాజిట్ చేస్తాం, ఉద్యోగం వచ్చే దాకా నెలనెల రూ.2 వేలు నిరుద్యోగ భృతి, రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ, అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా గృహాలు మంజూరు చేస్తాం, రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తాం.... ఇవీ ఇదే చంద్రబాబు, ఇదే కూటమిలో ఉన్న ఇదే దత్తపుత్రుడి ఫొటో, ఇదే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కూటమిగా ఏర్పడి పొత్తులోకి తెచ్చుకున్న మోడీ గారి ఫొటో. వీళ్లు ముగ్గురూ కలిసి చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికీ పాంప్లేట్ పంపించాడు. ఇందులో ఇచ్చిన హామీలు ఏవైనా కూడా అమలయ్యాయా? ప్రత్యేక హోదా ఇచ్చారా? మరి ఇవి గతంలో చేయకుండా, పొత్తులో వీరంతా భాగమై ఈ మాదిరిగా మీటింగులు పెట్టి, మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టి, పాంప్లేట్లుగా చేసి చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికీ పంపి, మరోసారి ఇదే డ్రామాను, ఇవే పొత్తులు.. ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు మళ్లీ చంద్రబాబు పొత్తుల డ్రామాతో మీ అందరి ముందుకు వస్తున్నారు. చంద్రబాబు చూపిస్తున్న ఈ పొత్తులతో ఎవరికైనా ప్రయోజనం కలిగిందా? ప్రజలకు ఏ ఒక్కరూ కూడా మంచి చేయకపోగా, ప్రజలకు మంచి చేసిన జగన్‌ను టార్గెట్ చేయడానికి మాత్రమే వీళ్ల ఏకైక ఎజెండా కనిపిస్తోంది. చంద్రబాబుకు అధికారం ఎందుకు కావాలంఆటే ప్రజలకు మంచి చేయడం కోసం కాదు.. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది చేయడం కోసం కాదు.. కారణం.. ఆ అధికారంతో ప్రజల్ని దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు మాత్రమే చంద్రబాబుకు అధికారం కావాలి. గతంలో 2014లో చంద్రబాబు మేనిఫెస్టోలో.. ఇంటింటికీ పంపిన పాంప్లేట్.. టీవీ ఆన్ చేస్తే చాలు.. ఊదరగొట్టే అడ్వటైజ్మెంట్లు ఇవీ.. అడ్డగోలుగా మోసం చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు.. తాజా మేనిఫెస్టోగా.. నరకలోకానికి, నారా లోకానికి రమ్మంటే ఎవరూ రారు కాబట్టి ఎంట్రన్స్‌లో స్వర్గం చూపించి.. లోపలికి వెళ్లాక మోసం చేసి నరకం చూపించే మార్కెటింగ్ టెక్నిక్ చంద్రబాబుకు అలవాటు. కిచడీ వాగ్దానాలన్నీ కలిపాడు. కర్ణాటకలో నుంచి కొన్ని, తెలంగాణ నుంచి కొన్ని.. వాళ్ల హామీలన్నీ కలిపి కిచడీ మేనిఫెస్టో తెచ్చాడు. అందులో వారు చూపించే గ్రాఫిక్స్, ఎల్లో మీడియా డిబేట్లు.. వారు చేసే ప్రచారాలు.. ప్రజలు ఆలోచన చేయాలి. చంద్రబాబు చేసే వాగ్దానాలకు శకుని చేతిలో పాచికలకు తేడా ఏమైనా ఉందా? చంద్రబాబు కేరక్టర్‌కు భిన్నంగా మనందరి ప్రభుత్వం కరోనా కష్ట సమయంలో కూడా ఏమాత్రం సాకులు చూపకుండా పేదలందరికీ మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ ఇంటింటికీ అందించాం. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కతున్నాడు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు అక్షరాలా రూ.2.65 లక్షల కోట్లు నేరుగా వెళ్లిపోవడం జరుగుతున్న పరిస్థితిని గమనించాలి. నాన్ డీబీటీ పద్ధతిలో అయితే ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ తీసుకోకుండా, మన దగ్గర భూముల విలువ తీసుకోకుండా, మనం సేకరించిన భూముల విలువలు మాత్రమే తీసుకుని నాన్ డీబీటీ కింద మనం చేసిన ఖర్చు.. ఈ 58 నెలల కాలంలో.. చేసిన ఖర్చు రూ.1.10 లక్షల కోట్లు. మొత్తంగా డీబీటీ, నాన్ డీబీటీ కలిపితే 58 నెలల కాలంలో మనం 3.75 లక్షల కోట్లు ఖర్చు చేశాం. అంటే ఏటా ఈ పథకాల మీద మీ బిడ్డ ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరిగిన, ప్రజలకిచ్చిన సొమ్ము సంవత్సరానికి రూ.75 వేల కోట్లు. అది కూడా మనం చాలా కష్టపడితే, ఎక్కడా కూడా లంచాలు లేకుండా చేస్తే. మనందరి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని,ఇంటింటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఈర్ష్యతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పి గతంలో ఇదే ఈనాడు, ఇదే చంద్రబాబు ఎన్నెన్నో సందర్భాల్లో వాదించడం కూడా మన కళ్ల ఎదుట కనిపించిన సత్యం. ఇప్పుడు అదే నోటితో మరోసారి మోసం చేసేందుకు ఎలాగూ చెప్పేవన్నీ అబద్ధాలే కదా.. హద్దులెందుకు అని చంద్రబాబు ఈ మధ్య కాలంలో ఆరు వాగ్దానాలు అంటూ వదిలారు. ఏటా ఖర్చెంత అవుతుందని మా ఫైనాన్స్ వారిని లెక్కలు తీయమన్నాను. 2024 ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తున్న కొన్ని పథకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగాల్సిందే. ఉదాహరణకు అలాంటి ఎనిమిది పథకాలు.. 66 లక్షల మంది పెన్షన్లకు మనం ఖర్చు చేస్తున్నది దాదాపు రూ.24 వేల కోట్లు. రైతన్నలకిచ్చే ఉచిత విద్యుత్‌కు ఖర్చు రూ.11 వేల కోట్లు. సబ్సిడీ బియ్యానికి రూ.4600 కోట్లు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 104, 108.. మరో రూ.4.400 కోట్లు, పూర్తి పీజు రీయింబర్స్మెంట్ కింద మీ జగనన్న ఇస్తున్నది విద్యాదీవెన, వసతి దీవెన కింద మరో రూ.5000 కోట్లు సంపూర్ణ పోషణ కింద రూ.2200 కోట్లు, గోరుముద్ద కింద రూ.1900 కోట్లు. కేవలం ఈ ఎనిమిది పథకాలకే.. ఖర్చు రూ.52,700 కోట్లు. ఇవి కచ్చితంగా ఎవరైనా చేయాల్సిందే. చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ ఆరు వాగ్దానాలకు ఎంత ఖర్చవుతుందో లెక్కేస్తే, ఇది పచ్చి మోసం అని తెలిసినా లెక్క వేయిస్తే.. అదనంగా కావాల్సింది ఏటా రూ.73,440 కోట్లు. ఇది కాక చంద్రబాబు ఈ మధ్యనే ఏడో హామీ అని చెప్పి బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అదనంగా పెంచి ఇస్తానన్న హామీని లెక్కేస్తే ఇది అదనంగా రూ.13872 కోట్లు. అంటే చంద్రబాబు చెప్పిన ఆరు సిక్సులు, ఈ ఏడో పథకానికి ఈరెండూ కలిపితే 87312 కోట్లు, ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా 8 స్కీములకు కచ్చితంగా ఎలాగూ చేయాల్సిన స్కీములకు ఖర్చయ్యేది మరో 52,700 కోట్లు. రెండూ కలిపితే అక్షరాలా రూ.1.40 లక్షల కోట్లు.. చంద్రబాబు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం రూ.1.40 లక్షల కోట్లు.. మనం ఎంతో కష్టపడితే, ఎక్కడా లంచాలు లేకుండా ప్రజలకు ఇస్తే, పాలనలో ఎన్నో మార్పులు తెచ్చి పాలన చేస్తే మీ బిడ్డ ప్రభుత్వం పూర్తిగా కట్టడి చేసి ఎంతో కష్టపడితే ఇవ్వగలిగింది సంవత్సరానికి రూ.75 వేల కోట్లయితే, చంద్రబాబు చెబుతున్న హామీలు.. ఇప్పటికే రూ.1.40 లక్షల కోట్లు దాటుతోందంటే.. ఇక ఆలోచన చేయండి.. ఈ పెద్దమనిషి చంద్రబాబు చెప్పే హామీలు మళ్లీ ప్రజల్ని ఎంతగా మోసం చేసేందుకు చెబుతున్నాడో అని అందరూ ఆలోచన చేయాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటే చంద్రబాబు మాట్లాడరు. ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో సుదీర్ఘంగా దీని గురించి వివరించడం జరిగింది. ఎలాగూ అబద్ధాలు చెప్పేటప్పుడు హద్దులెందుకు, భావదారిద్ర్యం ఎందుకని అబద్ధాలు చెప్పే సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు. బాబు మేనిఫెస్టో ఏ ఒక్కరన్నా నమ్మడం అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మినట్లుగానే ప్రజలందరూ మోసపోతారు అని తెలియజేస్తున్నా. ఈ 58 నెలల్లో ప్రజల కోసం 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. దాదాపు రూ.1.70 లక్షల కోట్లు డీబీటీగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించాం. దేశ చరిత్రలో ఇది ఒక రికార్డు. మన రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా జరిగిందంటే అది కేవలం మీ జగన్‌కు మాత్రమే సాధ్యమైంది. అది కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమైంది. ఇవన్నీ కొనసాగాలంటే ఈ ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం మనకు స్టార్ క్యాంపెయినర్‌గా కుటుంబాలు బయటకు రావాలి. వారు ఓటు వేయడమే కాకుండా వంద మందికి చెప్పి ఓటు వేయించాలి. ప్రతి ఇంట్లోనూ చెప్పాలి. పొరపాటు జరిగితే పేదవాడి భవిష్యత్ అంధకారం అవుతుందని ప్రతి ఇంట్లోనూ చెప్పాలి. ప్రతి గ్రామంలోనూ వివరించాలి. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకం. ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో వివరించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో వేసే ఓటు వచ్చే 5 సంవత్సరాలు వారి భవిష్యత్‌ను ఎలా మారుస్తుందో వివరించాలి. 2019 ఎన్నికల ముందు మీ జగన్ ఓ మాట చెప్పాడు. గుర్తుందా? ఆ మాట.. మీ బిడ్డ వస్తాడు. మంచి రోజులు మీకు తెస్తాడని మీ బిడ్డ మాట ఇచ్చాడు. ఈరోజు మళ్లీ మీ అందరికీ.. ఐదేళ్ల తర్వాత మీ బిడ్డ మరో మాట చెబుతున్నాడు. నేను చెప్పే ఈ మాటను ప్రతి ఊర్లోనూ చెప్పండి. ప్రతి ఇంట్లోనూ, ప్రతి గడపకూ వెళ్లి చెప్పండి. పేద వాడి భవిష్యత్ బాగుపడాలంటే, జరుగుతున్న ఈ మంచి కొనసాగాలంటే, మళ్లీ జగనన్ననే తెచ్చుకుందామని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి, ప్రతి ఊళ్లోనూ, ప్రతి గడపకూ వెళ్లి చెప్పండి. మన అన్నను సీఎంగా తెచ్చుకుందాం. మన అన్న ప్రభుత్వాన్ని మనమే రక్షించుకుందాం. బాబు అనే మాయలేడి వలలో పడవద్దు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మరింత మంచి అన్నతో చేయించుకుందాం. మనందరి చల్లని దీవెనలతోనే ఇది సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరికీ వెళ్లి చెప్పండి. మీ కోసం నిలబడిన మన అన్నమీద అరడజను పార్టీలు బాణాలు ఎక్కుపెట్టాయి. ఆ అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, పేదలకు మీ అందరి తరఫున జగనన్న నిలబడ్డాడు. కాబట్టే అరడజను పార్టీలు, అరడజను బాణాలు ఎక్కుపెట్టాయి. అయినా అన్న పొత్తుల్ని నమ్ముకోలేదు, అన్న మనల్నే నమ్ముకున్నాడు, ఆ దేవుడిని నమ్ముకున్నాడు. అన్న ఒంటరిగానే సింహంలా మనందరికీ తోడుగా నిలబడ్డాడు. అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మన అన్న ప్రజల్ని, దేవుడి తప్ప పొత్తుల్ని, జిత్తుల్ని నమ్ముకోలేదు. మన అన్న ఎప్పుడూ మోసాలు చేయలేదు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు. అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మన అన్న నమ్ముకున్నది తాను చేసిన మంచిని, మంచి జరిగిన ప్రజల్ని మాత్రమే నమ్మకున్నాడు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మళ్లీ మన అన్నను గెలిపించేందుకు మనమంతా కూడా చేయి చేయి కలపాలి, మనమంతా ఒక్కటి కావాలి, మనమంతా సిద్ధం అని చెప్పాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. సీఎంగా అన్న వస్తేనే, నెలనెలా ఒకటో తేదీన మళ్లీ చిక్కటి చిరునవ్వులతో మన ఇంటికే రూ.3 వేల పెన్షన్ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుందని చెప్పండి. సీఎంగా మళ్లీ అన్న వస్తేనే ఇచ్చిన ప్రతి ఇంటి పట్టాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని చెప్పండి. సీఎంగా మళ్లీ అన్న వస్తేనే అమ్మ ఒడి కొనసాగుతుందని చెప్పండి. సీఎంగా మళ్లీ అన్న వస్తేనే చేయూత పథకం అందుతుందని, రైతు భరోసా రైతన్నకు తోడుగా నిలుస్తుందని చెప్పండి. సీఎంగా మళ్లీ అన్న పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ కింద విద్యాదీవెన, వసతి దీవెన కేవలం అన్న వస్తేనే జరుగుతుందని చెప్పండి. నేరుగా అక్కచెల్లెమ్మలకు ఎలాంటి వివక్ష లేకుండా డబ్బులు పడే పరిస్థితి రావాలంటే మళ్లీ అన్న ముఖ్యమంత్రి అయితేనే అని చెప్పండి. సీఎంగా మళ్లీ అన్న వస్తేనే గవర్నమెంట్ బడి బాగుపడుతుందని చెప్పండి, సీఎంగా అన్న వస్తేనే గవర్నమెంట్ ఆస్పత్రి బాగుపడుతుందని చెప్పండి. నవరత్నాల్లోని అన్నిపథకాలు కూడా కొనసాగుతాయని చెప్పండి. ఈ పథకాలు అందుకున్న మనందరం కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాలని చెప్పండి. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద అసెంబ్లీకి ఒక ఓటు, పార్లమెంటుకు ఒక ఓటు వేస్తేనే మళ్లీ అన్న సీఎం అవుతాడు. అన్ని పథకాలూ ఇంటికే వస్తాయని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. చెప్పేటప్పుడు.. అదే చంద్రబాబుకు ఓటు వేయడం అంటే.. మీకు అందే పథకాలన్నింటినీ కూడా రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే అవుతుంది అని కూడా చెప్పండి. మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయి. మళ్లీ లంచాలు, వివక్షల రాజ్యం మళ్లీ గ్రామాల్లో చెలరేగుతుంది. మళ్లీ అవ్వలు, తాతలు, రైతన్నలు క్యూలో నిలబడే పరిస్థితి, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి, ఎండనక, వాననక ఎవరైనా చనిపోతేగానీ ప్రభుత్వ పథకాలు అందని పరిస్థితి మళ్లీ వస్తుందని చెప్పండి. పొరపాటున చంద్రబాబుకు ఓటేయడం అంటే మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్న వాలంటీర్ వ్యవస్థ రద్దుకు మీరే ఓటు వేసినట్లు అవుతుందని చెప్పండి. బాబుకు ఓటు వేయడం అంటే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషుమీడియం రద్దుకు మీరే ఓటు వేసినట్లు అని చెప్పండి. బాబుకు ఓటు వేయడం అంటే గవర్నమెంట్ బడిని మళ్లీ కార్పొరేట్లకు అమ్మేయడం అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. బాబుకు ఓటు వేయడం అంటే మళ్లీ వైద్యం కోసం అప్పులు కావడమే, రైతన్నలు రైతు భరోసాను వదులుకోవడమే, మళ్లీ మోసపోవడమే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. బాబుకు ఓటు వేయడం అంటే చంద్రముఖిని మనమే వెళ్లి నిద్ర లేపి మన ఇంటికి తెచ్చుకున్నట్టే అని ప్రతి ఇంట్లోకి వెళ్లి చెప్పండి. మనం చేసిన మంచిని చూపించి మనం ఓటు అడుగుతున్నాం. గతంలో ఎప్పుడూ చంద్రబాబు మంచి చేయలేదు కాబట్టి మాయ చేసి చంద్రబాబు ఓటు అడుగుతున్నాడని చెప్పండి. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు, ఫ్యాన్‌కు మీరు వేసే ఓటు మీ బిడ్డల బంగారు భవిష్యత్‌కు వేసే ఓటు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌కు మీరు వేసే ఓటు మన పేదరికం సంకెళ్లను తెంపుకోవడానికి, మన భవిష్యత్ కోసం మనం వేసుకుంటున్న ఓటు అని చెప్పండి. ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్‌లోనే ఉండాలి అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఇవన్నీ వివరించి మరి ప్రతి ఇంటికీ ప్రతి ఊరికీ, ఇంత మంచి మనం చేశాం కాబట్టి, ఇంత మంచి చేసిన తర్వాత 2019కి మించిన మోజారిటీ, 175కు 1725.. 25 ఎంపీలకు 25 ఎంపీలు.. గెలవడానికి మనమంతా కూడా సిద్ధమేనా..! నా ప్రసంగం ముగించే ముందు ఒక్క మాట చెబుతున్నా. మన మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం. కానీ చేయగలిగిందే చెబుతాం. చేసేది మాత్రమే చెబుతాం. అందులో చెప్పిన ప్రతి ఒక్కటీ కూడా చేస్తాం. జగన్ మాట ఇచ్చాడంటే.. తగ్గేదే లేదు అని ఈ సందర్భంగా చెబుతున్నా. ఆంధ్రప్రదేశ్‌లో మనం ప్రారంభించిన పరిపాలన ఓ స్వర్ణయుగానికి దారి తీస్తోంది. 90 శాతం ప్రజలు తెల్లకార్డుల మీద జీవించే పరిస్థితి నుంచి ప్రతి కుటుంబం కూడా పేదరికం సంకెళ్లను తెంచుకుని వాళ్లు అడుగులు ముందుకు వేసే పరిస్థితి రావాలన్నది నా కల. అలా చేయాలన్నది నా లక్ష్యం ప్రతి ఒక్క ఇంటి నుంచి క్వాలిటీ చదువులు, గొప్ప చదువులు, అంతర్జాతీయ స్థాయి చదువులు చదివేలా ప్రతి పేద పిల్లాడికీ అవకాశం కల్పించడం, ఆ పేద పిల్లల బతుకులు మార్చాలన్నది నా కల. అది నా లక్ష్యం. ప్రతి అక్కచెల్లెమ్మ తన కాళ్ల మీద తాను నిలబడేట్టుగా చిరునవ్వు ఉండాలన్నది నా కల. నా లక్ష్యం. ఏ ఒక్క రైతన్న కూడా వ్యవసాయం వల్ల నష్టపోయానని చెప్పే పరిస్థితి రాకూడదు. వ్యవసాయాన్ని పూర్తిగా మార్చాలన్నది నా కల. అలా చేయాలన్నది నా లక్ష్యం. ఇక ఏ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఏ పేద కూడా పేదరికం వల్ల ఎదగలేకపోయాడన్న పరిస్థితి ఉండకూడదు. పేదవారికి సమానమైన అవకాశాలు రావాలి. సాధికారత కల్పించగలగాలి. అలా మార్చాలన్నది మీ బిడ్డ కల. మీ బిడ్డ సంకల్పం. మీ బిడ్డ లక్ష్యం. వైద్యం కోసం ఏ ఒక్కరూ మరణించే పరిస్థితి రాకూడదు. అప్పులపాలయ్యే పరిస్థితి, ఆస్తులమ్ముకునే పరిస్థితి రాకూడదు. అలా చేయాలన్నది నా కల. ఆ దిశగా అడుగులు వేసేది నా లక్ష్యం. వీటన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేయడానికి మాత్రమే మీ బిడ్డకు అధికారం కావాలి. లంచాలు, వివక్ష లేని వ్యవస్థ ఏర్పడాలన్నదే నా కల. నా లక్ష్యం. ఎవరూ కూడా లంచం అడిగే పరిస్థితి ఉండకూడదు. ఏ పేదవాడూ వివక్షకు లోనయ్యే పరిస్థితులు రాకూడదు. ఇది నా కల. ఇదే నా లక్ష్యం. ఇందుకోసమే మనకు అధికారం కావాలి. చదువుల పరంగా, వ్యవసాయం పరంగా, వైద్యం పరంగా మార్పులు తీసుకొచ్చాం. అక్కచెల్లెమ్మల సాధికారత విషయంలో ఎప్పుడూ చూడని రీతిలో అడుగులు వేశాం. సామాజిక న్యాయానికి అర్థం చెప్పాం. పారిశ్రామికంగా, మౌలిక సదుపాయాల పరంగా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల పరంగా ఎప్పుడూ చూడని విధంగా ఏపీని నంబర్ వన్ దిశగా అడుగులు వేగంగా పడుతూ కృషి చేస్తున్నాం. అద్భుత ఫలితాలు ఇచ్చేలా అడుగులు వేయాలన్నది, వేస్తావున్నది, ఈ ప్రయాణం మధ్యలో ఉన్నది, ఈ ప్రయాణం ముందుకు పోవాలి, పేదవాడి భవిష్యత్ మారాలన్నదే నా కల. దాని కోసమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ దిశగా ప్రయాణం కోసమే మనం అధికారం కావాలని కోరుకుంటున్నాం. పేదవాడి భవిష్యత్ మారాలని, మార్చాలని.. దీని కోసమే మీ బిడ్డకు అధికారం కావాలని అడుగుతున్నా. అధికారం అంటే మీ బిడ్డకు వ్యామోహం లేదు. అధికారం పోతుందన్న భయం మీ బిడ్డలో ఎప్పుడూ ఉండదు, రాదు అని చెబుతున్నా. హిస్టరీ ఉన్నంత కాలం మీ బిడ్డ పేరు ప్రతి హిస్టరీ బుక్‌లో ఉండిపోవాలన్నదే మీ బిడ్డ కోరిక. మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా.. ప్రతి పేద వాడి ముఖంలో చిరునవ్వులు చూడటం కోసం. ప్రతి పేద వాడి ఇంట్లో మీ బిడ్డ ఫొటో చిరకాలం ఉండాలని, చనిపోయిన తర్వాత కూడా మీ బిడ్డ ఎప్పుడూ పేదవాడి గుండెల్లో బతికుండటం కోసం మీ బిడ్డకు అధికారం కావాలి. దాని కోసమే మీ బిడ్డ అధికారం అడుగుతున్నాడు. దానికోసమే మీ బిడ్డ పరితపిస్తున్నాడు. మంచి చేయడం కోసం మంచి మనసుతో మీ బిడ్డ సంకల్పిస్తున్నాడు. దేవుడి దయ, ప్రజలందరి దీవెనలు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాడు. అలాగే కార్యకర్తలకు, అభిమానులకు, వాలంటీర్లకు ఒకే ఒక మాట చెబుతున్నా. ఇన్ని పదవులు, ఇన్ని హోదాలు భారతదేశ రాజకీయ చరిత్రలో మరే ఇతర పార్టీ కూడా ఎప్పుడూ ఇవ్వలేదు. మన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, ప్రతి వాలంటీర్.. అందరూ నా కుటుంబ సభ్యులే. వారికి కచ్చితంగా మంచి జరుగుతుంది. మంచి జరిగించేందుకు మీ బిడ్డ ఉన్నాడు. వారు మరో రెండు మెట్లు ఎదిగేందుకు, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఎన్నడూ లేనన్ని కార్పొరేషన్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు మొదలు, ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిపించుకుని అవకాశాలిచ్చిన పార్టీ ఒక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. మన పరిపాలన చూశారు. అందరూ ఆలోచన చేయాలి. మన 5 సంవత్సరాల పరిపాలన చూశారు. గతంలో 5 సంవత్సరాల చంద్రబాబు పాలన చూశారు. ఈ రాష్ట్రానికి ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతున్నా. నాయకుడంటే చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చే సరికి రంగురంగుల మేనిఫెస్టో చూపి, రకరకాల పార్టీలతో పొత్తులు పెట్టుకుని, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు చదువుకుంటున్న పిల్లలకు, ప్రతి సామాజిక వర్గాన్ని ఎలా మోసం చేయాలో దిక్కుమాలిన ఆలోచనలు చేసి రంగురంగుల మేనిఫెస్టో తెచ్చి అధికారంలోకి వచ్చాక చెత్తబుట్టలో వేసి మోసం చేస్తున్న చంద్రబాబులా నాయకుడు ఉండాలా? ఒక మాట నోట్లో నుంచి వచ్చాక, ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత కష్టమైనా, నష్టమైనా మాట మీద నిలబడే నాయకుడు.. నాయకుడంటే మాట ఇస్తే తగ్గేదే లేదని చెప్పే మీ జగన్ లాంటి నాయకుడు కావాలా? అని అడుగుతున్నా. నాలుగు సార్లు ఆలోచన చేసి మాట ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మాట తప్పకూడదు. మడమ తిప్పకూడదు. ఏకంగా 99 శాతం మేనిఫెస్టో హామీలన్నీ నెరవేర్చాం కాబట్టే, ప్రతి ఇంటికీ మేనిఫెస్టో చూపించి ప్రతి కార్యకర్తా చెప్పే పరిస్థితి. ఇదీ నాయకుడంటే.. ఇదీ పార్టీ అంటే. నాయకుడంటే ప్రతి కార్యకర్తా కూడా కాలర్ ఎగరేసి అదిగో మా నాయకుడు.. అలాంటి వాడే మా నాయకుడు.. అని ప్రతి కార్యకర్తా కాలర్ ఎగరేసేలా నాయకుడు ఉండాలి. అలాంటి నాయకుడు, అలాంటి పాలన ఉన్నప్పుడే ప్రతి గ్రామంలో, ప్రతి కార్యకర్తా, ప్రతి అభిమానీ ప్రతి ఇంటికీ వెళ్లి మా అన్న ఇవన్నీ దేవుడి దయతో చేశాడు అని వారి చిరునవ్వుల మధ్య కాలర్ ఎగరేసి తిరుగుతాడు. నాయకుడంటే ఆ మాదిరిగా ఉండాలి. నాయకత్వం అంటే విశ్వసనీయత అనే పునాదుల మీద ఎప్పుడూ పెరుగుతుంది. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటా. ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మరో రెండు మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత మీ బిడ్డది. నాది. ప్రతి గ్రామానికీ మంచి చేశాం. ప్రతి ఇంటికీ మంచి చేశాం. ప్రతి పేదకూ మంచి చేశాం. ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామం తీసుకున్నా.. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు.. ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికీ, రాష్ట్ర వ్యాప్తంగా 87 శాతం ఇళ్లకు ప్రతి ఇంటికీ మంచి జరిగింది. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో మీరందరూ మీ సచివాలయ పరిధిలో జరిగిన మంచి గురించి చూస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ, ప్రతి సచివాలయం పరిధిలో ఏకంగా రూ.20 కోట్లకుపైగా మంచి జరిగి నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లినట్లు కనిపిస్తుంది. ఈ మార్పు గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగనిది. దేశంలో ఎక్కడా జరగని ఈ మార్పు. ప్రతి ఇంటికీ, ప్రతి ఊరికీ మంచి చేశాం. మన హయాంలోనే బడులు, ఆస్పత్రులు బాగుపడ్డాయి. వ్యవసాయం మారింది. ప్రతి అక్కచెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. అందుకే చెబుతన్నా. వై నాట్ 175. వై నాట్ 25కు 25 ఎంపీ స్థానాలు అని గట్టిగా అడుగుతున్నా. చెబుతున్నా. పరిపాలనలో ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎంపీగానీ, ఒక్క ఎమ్మెల్యేగానీ తగ్గే పరిస్థితే ఉండకూడదని తెలియజేస్తున్నా. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఐదేళ్ల కాలంలో ఇంటికీ కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి పథకాలు కొనసాగించాలనే మనకు, వాటిని రద్దు చేయడమే టార్గెట్‌గా పెట్టుకుని డ్రామాలాడుతున్న చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం ఈ ఎన్నికలు. ఈ యుద్ధంలో పేదలు ఒకవైపున ఉంటే పెత్తందార్లు మరోవైపున ఉన్నారు. పెత్తందార్లను ఓడించి పేదల ప్రయోజనాలను కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా..! ఈ యుద్ధం మాట ఇచ్చిన నిలబెట్టుకున్న మనకు, మాట తప్పడమే అలవాటుగా ఉన్న వారికి మధ్య ఈ యుద్ధం. ఇది విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధం. ఈ యుద్ధంలో వంచకుల్ని, వెన్నుపోటుదారుల్ని ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా..! జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పని చేయడానికి చంద్రబాబునాయుడు ప్రచారాలు, ఈనాడు రోత రాతలు, ఏబీఎన్, టీవీ5 ఎల్లో మీడియా తప్పుడు కథనాలు, వారి అబద్ధాలు, మోసాలు.. వీటన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్‌ను కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా..! ప్రతి ఒక్కరూ కూడా మీ జేబులోంచి సెల్‌ఫోన్ తీయండి.. సెల్ ఫోన్లో లైట్ బటన్ ఆన్ చేయండి.. సిద్ధం అని చెప్పండి.. ఇలా వెలుగుల బాటలో ప్రయాణానికి మరోసారి సిద్ధం అని చెప్పండి. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో కేవలం రెండు నెలల్లోగా మరో ఐదేళ్లు ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు జగన్ అనే నేను.. మీ సేవకుడిగా సిద్ధం అని ఈ సందర్భంగా చెబుతున్నా. 4:27PM, Mar 10, 2024 సభా వేదికపైకి చేరుకున్న సీఎం జగన్ ర్యాంప్‌పై నలువైపులా తిరుగుతూ ప్రజలకు అభివాదం చేసిన సీఎం జగన్ కాసేపట్లో ప్రసంగించనున్న సీఎం జగన్ జన సంద్రంగా మారిన మేదరమెట్ల లక్షలాదిగా తరలివచ్చిన జనం మేదరమెట్లలో ఇసుకేస్తే రాలనంత జనం ఎక్కువ మంది వీక్షించేలా భారీ ఎల్ఈడీ స్క్రీన్లు 4:20PM, Mar 10, 2024 మేదరమెట్ల సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ సీఎం జగన్ ప్రసంగం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జనం 4:07PM, Mar 10, 2024 మేదరమెట్ల చేరుకున్న సీఎం జగన్ జనసంద్రమైన మేదరమెట్ల వైఎస్సార్సీపీ సిద్ధం సభకు పోటెత్తిన జన ప్రవాహం 15లక్షల మందికిపైగా వైఎస్సార్సీపీ శ్రేణులు వచ్చినట్లు అంచనా జై జగన్ నినాదాలతో హెరెత్తుతున్న మేదరమెట్ల సభా ప్రాంగణం వన్స్‌మోర్ జగన్ నినాదాలతో దద్దరిల్లుతున్న మేదరమెట్ల YSRCP కొత్త క్యాంపెయిన్ నా కల ఏపీలో వైఎస్సార్సీపీ కొత్త క్యాంపెయిన్ కు శ్రీకారం సిద్ధం సభ వేదిక పై నా కల ప్రచార కార్యక్రమం ప్రారంభం ఏపీ వ్యాప్తంగా నా కల పేరుతో హోర్డింగ్ లు యువత, రైతులు, మహిళలు, కార్మికులు, వృద్ధులు, విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమం డ్రోన్ కలకలం సిద్ధం సభలో మంత్రి అంబటి రాంబాబు ప్రసంగిస్తూండగా... సభా ప్రాంగణంలో ఒకవైపు డ్రోన్ ఒకటి ఎగురుతూ కనిపించింది. అప్రమత్తమైన నిర్వాహకులు వెంటనే డ్రోన్ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. అనుమతి లేకుండా డ్రోన ఎగురుతోందని, ఎవరో దాన్ని నియంత్రిస్తున్నారని సభా వేదికపై నుంచి ప్రకటించారు. సభకు హాజరైన వారు ఒక దిక్కుకు చూడటం కనిపించింది. అయితే ఈ అవాంతరం ఒకట్రెండు నిమిషాలకు మించి జరగలేదు. డ్రోన్ విషయాన్ని ప్రకటించిన తరువాత అంబటి తన ప్రసంగాన్ని కొనసాగించారు. 3:40PM, Mar 10, 2024 ఆకాశం బద్ధలైందా.. నేల ఈనిందా అన్నట్టుగా ఉంది ఇక్కడ జనసంద్రాన్ని చూస్తే.. : మంత్రి అంబటి రాంబాబు ఏంటి ఈ జన ప్రవాహం అనిపిస్తోంది ఇక్కడకు సీఎం జగన్ హాజరయ్యేలోపు ఓ నాలుగు మాట్లాడదామని వచ్చా ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్లినా 50 శాతం ప్రజలు సీఎం జగన్ కావాలనే అంటున్నారు సీఎం జగన్ మొనగాడు.. చంద్రబాబు మోసగాడు మొనగాడు కావాలా...?, మోసగాడు కావాలా...? సింగిల్ గా వస్తే చితకబాదుతాం ఇద్దరు వస్తే విసిరి కొడతాం ముగ్గురు కలిసి వస్తే విసిరి సముద్రంలో ముంచేస్తాం 14 ఏళ్లలో చంద్రబాబు చేసిన మేలు ఒక్కటీ లేదు చంద్రబాబు రా.. కదిలి రా అంటే ఎవరూ రావడం లేదు ఎంతమంది కలిసి వచ్చినా చంద్రబాబు ఓటమి ఖాయం ఎలాంటి వివక్ష లేకుండా సీఎం జగన్ పారదర్శక పాలన చేశారు 3:25PM, Mar 10, 2024 చంద్రబాబు పచ్చి మోసగాడు: మంత్రి కాకాణి చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలు నమ్మరు గతంలో రైతులు, అక్కా చెల్లెమ్మలను మోసం చేశాడు చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశాడు సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు 175కు 175 సీట్లు గెలిచి తీరుతాం 3:20PM, Mar 10, 2024 సీఎం జగన్‌కు ప్రజల అండదండలు ఉన్నాయి: అనిల్ కుమార్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో మన సత్తా చూపించాలి జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేక పొత్తులు పెట్టుకున్నారు ఎంతమంది కలిసి వచ్చినా జగన్ మరోసారి సీఎం 3:10PM, Mar 10, 2024 మేదరమెట్ల బయల్దేరిన సీఎం జగన్ కాసేపట్లో సిద్ధం సభకు హాజరుకానున్న సీఎం జగన్ జనసంద్రమైన మేదరమెట్ల వైఎస్సార్సీపీ సిద్ధం సభకు పోటెత్తిన జన ప్రవాహం జన సునామీని తలపిస్తున్న మేదరమెట్ల సీఎం జగన్ పర్యటనలో స్వల్ప మార్పు సీఎం జగన్ బాపట్ల జిల్లా మేదరమెట్ల పర్యటనలో స్వల్ప మార్పు వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావ సభ ‘సిద్దం’లో పాల్గొననున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం 3.25 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు అనంతరం బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు. అన్నిదారులు మేదరమెట్ల వైపే కోస్తాంధ్రలో కనివినీ ఎరుగుని రీతిలో భారీగా సిద్ధం సభ రైళ్లు, బస్సులు, కార్లు, సొంత వాహనాల్లో భారీగా తరలివస్తున్న వైఎస్సార్సీపీ క్యాడర్ రాజకీయ కుంభమేళాను తలపించనున్న సిద్ధం సభ మేదరమెట్లలో సీఎం జగన్ ఏం మాట్లాడతారనే ఆసక్తి విపక్షాలపై సీఎం జగన్ విసుర్లు ఎలా ఉండనున్నాయి? సీఎం జగన్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ మేదరమెట్లకు పోటెత్తిన వైఎస్సార్సీపీ శ్రేణులు మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిలుస్తారంటున్న జనం సీఎం జగన్ పథకాలే ప్రతిపక్షాలు కాపీ కొడుతున్నాయి: కార్యకర్తలు ఎంతమందితో చంద్రబాబు పొత్తు పెట్టుకున్న గెలిచేది మాత్రం జగనే వైఎస్ జగన్‌ని మళ్లీ సీఎం చేయడానికి ప్రజలు ‘సిద్ధం’: ఎంపీ విజయసాయిరెడ్డి సిద్ధం సభకి 15 లక్షల మంది వస్తున్నారు చంద్రబాబు సిద్ధాంతాలు, విలువలు లేకుండా పొత్తు పెట్టుకున్నారు బీజేపీకి గత ఎన్నికల్లో 1 శాతం ఓట్లు వచ్చాయి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ఎలాంటి ప్రయోజనం లేదు సీఎం జగన్‌ని ఓడించడం ఆ మూడు పార్టీల వలన కాదు గతంలో ఎన్డీఏలో ఉండి చంద్రబాబు ఏం సాధించారు సీఎం జగన్‌కి గత ఎన్నికల కంటే అధికంగా ఓట్ల శాతం వస్తుంది అధికారమే చంద్రబాబుఏకి పరమావధి జై జగన్ నినాదాలతో దద్దరిల్లుతున్న సిద్ధం సభ మేదరమెట్ల సిద్ధం సభకు యువత పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు జై జగన్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ జగన్ చేస్తున్న పాలన.. జనరంజకంగా సాగుతోందంటున్నారు ఎన్ని పార్టీలు పొత్తులతో కలిసి వచ్చినా తామంతా జగన్ వెంటే నడుస్తామని తేల్చి చెప్తున్నారు మేదరమెట్ల: సిద్ధం సభకు భారీగా తరలివస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులు వేలాదిగా బస్సులు, కార్లు, ఇతర ప్రయివేటు వాహనాలన్నీ మేదరమెట్ల వైపే దాదాపు 15 లక్షల మంది కార్యకర్తలు హాజరు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు కొన్నిచోట్ల వాహనాలు దారి మళ్లింపు సిద్ధం సభకు సర్వం సిద్ధం ప్రత్యేక కాన్సెప్ట్‌తో ర్యాంప్ రూపొందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వై నాట్ 175 కాన్సెప్ట్‌తో Y ఆకారంలో ర్యాంప్ ర్యాంప్ చివర 75 అడుగుల ఎత్తులో రెండు వైపులా వైఎస్సార్ కాంగ్రెస్ జెండా రెపరెపలు సీఎం జగన్ ఎన్నికల నినాదంతో ర్యాంప్ ఏర్పాటు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచిన వై నాట్ 175 కాన్సెప్ట్ ఇదే ర్యాంప్‌పై నడిచి ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేయనున్న సీఎం జగన్ దద్దరిల్లనున్న అద్దంకి సిద్ధం సభ 🔥✊🏻 సీఎం @ysjagan కు మద్దతు తెలపడానికి నాయకులు, క్యాడర్ సర్వం సిద్ధం #Siddham#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/aIC07wOoDl — YSR Congress Party (@YSRCParty) March 10, 2024 ►రాష్ట్రంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని పి.గుడిపాడు వద్ద ఆదివారం జరగనున్న ‘సిద్ధం’ ఆఖరి సభకు సర్వం సిద్ధమైంది. చరిత్రలో నిలిచిపోయేలా పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగసభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల వద్ద కోల్‌కత–చెన్నై జాతీయ రహదారి పక్కనే వందలాది ఎకరాల సువిశాల మైదానంలో ఈ సభను నిర్వహించడానికి భారీ ఏర్పాట్లుచేశారు. ►దక్షిణ కోస్తాలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని 44 నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో కదలిరానున్నారు. వీరిని ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సీఎం జగన్ ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడులలో నిర్వహించిన సిద్ధం సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ►రాప్తాడు సభ ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అతిపెద్ద ప్రజాసభగా నిలిచిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. మూడు సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడం.. టైమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్ మ్యారిటైజ్ వంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సునామీ సృష్టించడం ఖాయమని తేలడంతో చివరి ‘సిద్ధం’ సభకు కూడా ఉరిమే ఉత్సాహంతో కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ ఎత్తున తరలివెళ్లడానికి సంసిద్ధమయ్యారు. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్సీపీ దూకుడు ►ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి జనవరి 27న భీమిలి వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం జగన్ సమరశంఖం పూరించారు. ఓ వైపు జనబలమే గీటురాయిగా, సామాజిక న్యాయమే పరమావధిగా శాసనసభ, లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేస్తూనే.. మరోవైపు ‘సిద్ధం’ సభలు నిర్వహిస్తూ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈ సభలు పూర్తవడం.. అవి గ్రాండ్ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణులు ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నాయి. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా సీఎం జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రతి ఇంటా గుర్తుచేస్తూ.. ప్రభుత్వంవల్ల మంచి జరిగి ఉంటే.. మరింతగా మంచి చేయడానికి వైఎస్సార్సీపీని ఆశీర్వదించి, ఓటు వేయాలని శ్రేణులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. వీరికి ప్రజలు నీరాజనాలు పలుకుతుండటంతో మరింత నూతనోత్సాహంతో వారు ప్రచారంలో పాల్గొంటున్నారు. పొత్తుల లెక్కతేలినా నైరాశ్యం.. ఇక టీడీపీ–జనసేన పొత్తుల లెక్క తేలాక రెండు పార్టీలు మొదటిసారిగా ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘జెండా’ సభకు జనం మొహం చాటేశారు. ‘రా కదలిరా’ పేరుతో చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు ప్రజలు తరలిరావడంలేదు. టీడీపీ–జనసేన పొత్తును ఆదిలోనే జనం ఛీకొట్టడం.. వైఎస్సార్సీపీ సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడంతో ఆ రెండు పార్టీల శ్రేణులు నైతిక స్థైర్యాన్ని కోల్పోయాయి. అలాగే, టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక టైమ్స్‌నౌ–ఈటీజీ సంస్థ నిర్వహించిన సర్వేలోనూ 49 శాతం ఓట్లతో వైఎస్సార్సీపీ 21–22 లోక్‌సభ స్థానాల్లో ఘనవిజయం సాధిస్తుందని.. టీడీపీ–జనసేన కూటమి 45 శాతం ఓట్లతో 3–4 లోక్‌సభ స్థానాలకే పరిమితమవుతుందని తేల్చిచెప్పింది. ఇది ఆ రెండు పార్టీ శ్రేణులను తీవ్ర షాక్‌కు గురిచేసింది. దీంతో ఎన్నికలకు ముందే శ్రేణులు కకావికలమవుతుండటంతో ఉనికి చాటుకునేందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బీజేపీ పెద్దల కాళ్లావేళ్లాపడి.. ఆ పార్టీతోనూ పొత్తు ఖరారు చేయించుకున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం ఎస్పీ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సిద్ధం సభకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా మొత్తం సుమారు 4,200 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశామన్నారు. నలుగురు ఎస్పీలు, 14 మంది అడిషనల్ ఎస్పీలు, 21 మంది డీఎస్పీలు, 92 మంది సీఐలు, 292 మంది ఎస్‌ఐలతోపాటు ఏఆర్ నుంచి 400 మంది, స్పెషల్ ఫోర్స్ సుమారు 160 మంది బందోబస్తులో ఉన్నారన్నారు. పదివేలకు పైగా బస్సులు, ఇతర వాహనాలు వచ్చే అవకాశమున్నందున దానికి అనుగుణంగా 338 ఎకరాల్లో 28 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటుచేశామని ఎస్పీ చెప్పారు. పటిష్ట ఏర్పాట్లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లుచేస్తోంది. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి అక్కడే మకాంవేసి ఎప్పటికప్పుడు ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు. ఆదివారం సా.3 గంటల నుంచి 5 గంటల వరకూ ఈ సభ జరుగుతుంది. రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి విడదల రజిని, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, అద్దంకి సమన్వయకర్త పాణెం చిన హనిమిరెడ్డి తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. ► ఆదివారం ఉ.10 గంటల నుంచి వాహనాల దారి మళ్లింపు చేపడుతున్నట్లు ఎస్పీ జిందాల్ చెప్పారు. నెల్లూరు వైపు నుంచి ఒంగోలు మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలను ఒంగోలు సౌత్ బైపాస్ నుంచి సంఘమిత్ర హాస్పిటల్, కర్నూల్ రోడ్డు, చీమకుర్తి, పొదిలి దొనకొండ అడ్డ రోడ్డు మీదుగా హైదరాబాద్‌కు దారి మళ్లిస్తామన్నారు. ► హైదరాబాద్ వైపు నుంచి ఒంగోలు వైపునకు వచ్చే భారీ వాహనాలను సంతమాగులూరు అడ్డరోడ్డు, వినుకొండ, మార్కాపురం, పొదిలి, చీమకుర్తి మీదుగా.. ► నెల్లూరు వైపు నుంచి ఒంగోలు మీదుగా హైదరాబాదు వైపు వెళ్లే సాధారణ వాహనాలను మేదరమెట్ల వద్ద నుంచి నామ్ హైవేపై అద్దంకి, సంతమాగులూరు మీదుగా మళ్లిస్తున్నారు. ► ఒంగోలు వైపు నుంచి విశాఖ వైపు ఎన్‌హెచ్ 16పై వెళ్లే వాహనాలను త్రోవగుంట నుంచి ఎన్‌హెచ్ 216 పైకి మళ్లించి చీరాల, బాపట్ల, మచిలీపట్నం మీదుగా పంపుతున్నారు. ► ఒంగోలు వైపు నుంచి విజయవాడ, గుంటూరు వైపు వెళ్లే వాహనాలను త్రోవగుంట, చీరాల, బాపట్ల, పొన్నూరు మీదుగా వాహనాలను మళ్లిస్తారు. ► ఒంగోలు వైపు నుంచి చిలకలూరిపేట వైపు వెళ్లే వాహనాలను త్రోవగుంట, చీరాల, పర్చూరు మీదుగా.. విశాఖపట్నం నుంచి ఒంగోలు, చెన్నై వైపు వెళ్లే వాటిని నర్సాపురం, మచిలీపట్నం, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా.. గుంటూరు నుంచి ఒంగోలు, చెన్నై వైపు వెళ్లే వాహనాలను బుడంపాడు అడ్డరోడ్డు నుంచి పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా మళ్లిస్తున్నారు. ► 16వ నంబర్ ఎన్‌హెచ్‌పై మేదరమెట్ల గ్రోత్ సెంటర్ నుంచి బొల్లాపల్లి టోల్‌ప్లాజా వరకు ఎలాంటి వాహనాలను అనుమతించడంలేదని.. సిద్ధం సభ ప్రాంగణానికి వచ్చే వాహనాలనే అనుమతిస్తామని చెప్పారు. ఈ ఆంక్షలు ఆదివారం రాత్రి 8 వరకూ అమల్లో ఉంటాయన్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో జైత్రయాత్రకు ‘సిద్ధం’.. నేడు బాపట్ల జిల్లా మేదరమెట్ల వేదికగా వైఎస్సార్సీపీ ఎన్నికల సన్నాహక సభ..ఇంకా ఇతర అప్డేట్స్
-
జైత్రయాత్రకు ‘సిద్ధం’
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని పి.గుడిపాడు వద్ద ఆదివారం జరగనున్న ‘సిద్ధం’ ఆఖరి సభకు సర్వం సిద్ధమైంది. చరిత్రలో నిలిచిపోయేలా పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగసభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల వద్ద కోల్‌కత–చెన్నై జాతీయ రహదారి పక్కనే వందలాది ఎకరాల సువిశాల మైదానంలో ఈ సభను నిర్వహించడానికి భారీ ఏర్పాట్లుచేశారు. దక్షిణ కోస్తాలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని 44 నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో కదలిరానున్నారు. వీరిని ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సీఎం జగన్ ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడులలో నిర్వహించిన సిద్ధం సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. రాప్తాడు సభ ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అతిపెద్ద ప్రజాసభగా నిలిచిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. మూడు సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడం.. టైమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్ మ్యారిటైజ్ వంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సునామీ సృష్టించడం ఖాయమని తేలడంతో చివరి ‘సిద్ధం’ సభకు కూడా ఉరిమే ఉత్సాహంతో కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ ఎత్తున తరలివెళ్లడానికి సంసిద్ధమయ్యారు. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్సీపీ దూకుడు ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి జనవరి 27న భీమిలి వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం జగన్ సమరశంఖం పూరించారు. ఓ వైపు జనబలమే గీటురాయిగా, సామాజిక న్యాయమే పరమావధిగా శాసనసభ, లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేస్తూనే.. మరోవైపు ‘సిద్ధం’ సభలు నిర్వహిస్తూ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈ సభలు పూర్తవడం.. అవి గ్రాండ్ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణులు ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నాయి. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా సీఎం జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రతి ఇంటా గుర్తుచేస్తూ.. ప్రభుత్వంవల్ల మంచి జరిగి ఉంటే.. మరింతగా మంచి చేయడానికి వైఎస్సార్సీపీని ఆశీర్వదించి, ఓటు వేయాలని శ్రేణులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. వీరికి ప్రజలు నీరాజనాలు పలుకుతుండటంతో మరింత నూతనోత్సాహంతో వారు ప్రచారంలో పాల్గొంటున్నారు. పొత్తుల లెక్కతేలినా నైరాశ్యం.. ఇక టీడీపీ–జనసేన పొత్తుల లెక్క తేలాక రెండు పార్టీలు మొదటిసారిగా ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘జెండా’ సభకు జనం మొహం చాటేశారు. ‘రా కదలిరా’ పేరుతో చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు ప్రజలు తరలిరావడంలేదు. టీడీపీ–జనసేన పొత్తును ఆదిలోనే జనం ఛీకొట్టడం.. వైఎస్సార్సీపీ సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడంతో ఆ రెండు పార్టీల శ్రేణులు నైతిక స్థైర్యాన్ని కోల్పోయాయి. అలాగే, టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక టైమ్స్‌నౌ–ఈటీజీ సంస్థ నిర్వహించిన సర్వేలోనూ 49 శాతం ఓట్లతో వైఎస్సార్సీపీ 21–22 లోక్‌సభ స్థానాల్లో ఘనవిజయం సాధిస్తుందని.. టీడీపీ–జనసేన కూటమి 45 శాతం ఓట్లతో 3–4 లోక్‌సభ స్థానాలకే పరిమితమవుతుందని తేల్చిచెప్పింది. ఇది ఆ రెండు పార్టీ శ్రేణులను తీవ్ర షాక్‌కు గురిచేసింది. దీంతో ఎన్నికలకు ముందే శ్రేణులు కకావికలమవుతుండటంతో ఉనికి చాటుకునేందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బీజేపీ పెద్దల కాళ్లావేళ్లాపడి.. ఆ పార్టీతోనూ పొత్తు ఖరారు చేయించుకున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం ఎస్పీ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సిద్ధం సభకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా మొత్తం సుమారు 4,200 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశామన్నారు. నలుగురు ఎస్పీలు, 14 మంది అడిషనల్ ఎస్పీలు, 21 మంది డీఎస్పీలు, 92 మంది సీఐలు, 292 మంది ఎస్‌ఐలతోపాటు ఏఆర్ నుంచి 400 మంది, స్పెషల్ ఫోర్స్ సుమారు 160 మంది బందోబస్తులో ఉన్నారన్నారు. పదివేలకు పైగా బస్సులు, ఇతర వాహనాలు వచ్చే అవకాశమున్నందున దానికి అనుగుణంగా 338 ఎకరాల్లో 28 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటుచేశామని ఎస్పీ చెప్పారు. పటిష్ట ఏర్పాట్లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లుచేస్తోంది. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి అక్కడే మకాంవేసి ఎప్పటికప్పుడు ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు. ఆదివారం సా.3 గంటల నుంచి 5 గంటల వరకూ ఈ సభ జరుగుతుంది. రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి విడదల రజిని, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, అద్దంకి సమన్వయకర్త పాణెం చిన హనిమిరెడ్డి తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. ► ఆదివారం ఉ.10 గంటల నుంచి వాహనాల దారి మళ్లింపు చేపడుతున్నట్లు ఎస్పీ జిందాల్ చెప్పారు. నెల్లూరు వైపు నుంచి ఒంగోలు మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలను ఒంగోలు సౌత్ బైపాస్ నుంచి సంఘమిత్ర హాస్పిటల్, కర్నూల్ రోడ్డు, చీమకుర్తి, పొదిలి దొనకొండ అడ్డ రోడ్డు మీదుగా హైదరాబాద్‌కు దారి మళ్లిస్తామన్నారు. ► హైదరాబాద్ వైపు నుంచి ఒంగోలు వైపునకు వచ్చే భారీ వాహనాలను సంతమాగులూరు అడ్డరోడ్డు, వినుకొండ, మార్కాపురం, పొదిలి, చీమకుర్తి మీదుగా.. ► నెల్లూరు వైపు నుంచి ఒంగోలు మీదుగా హైదరాబాదు వైపు వెళ్లే సాధారణ వాహనాలను మేదరమెట్ల వద్ద నుంచి నామ్ హైవేపై అద్దంకి, సంతమాగులూరు మీదుగా మళ్లిస్తున్నారు. ► ఒంగోలు వైపు నుంచి విశాఖ వైపు ఎన్‌హెచ్ 16పై వెళ్లే వాహనాలను త్రోవగుంట నుంచి ఎన్‌హెచ్ 216 పైకి మళ్లించి చీరాల, బాపట్ల, మచిలీపట్నం మీదుగా పంపుతున్నారు. ► ఒంగోలు వైపు నుంచి విజయవాడ, గుంటూరు వైపు వెళ్లే వాహనాలను త్రోవగుంట, చీరాల, బాపట్ల, పొన్నూరు మీదుగా వాహనాలను మళ్లిస్తారు. ► ఒంగోలు వైపు నుంచి చిలకలూరిపేట వైపు వెళ్లే వాహనాలను త్రోవగుంట, చీరాల, పర్చూరు మీదుగా.. విశాఖపట్నం నుంచి ఒంగోలు, చెన్నై వైపు వెళ్లే వాటిని నర్సాపురం, మచిలీపట్నం, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా.. గుంటూరు నుంచి ఒంగోలు, చెన్నై వైపు వెళ్లే వాహనాలను బుడంపాడు అడ్డరోడ్డు నుంచి పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా మళ్లిస్తున్నారు. ► 16వ నంబర్ ఎన్‌హెచ్‌పై మేదరమెట్ల గ్రోత్ సెంటర్ నుంచి బొల్లాపల్లి టోల్‌ప్లాజా వరకు ఎలాంటి వాహనాలను అనుమతించడంలేదని.. సిద్ధం సభ ప్రాంగణానికి వచ్చే వాహనాలనే అనుమతిస్తామని చెప్పారు. ఈ ఆంక్షలు ఆదివారం రాత్రి 8 వరకూ అమల్లో ఉంటాయన్నారు. ఓటమి భయంతోనే పొత్తులు ► రంగులు మార్చడం చంద్రబాబు నైజం : మంత్రి విడదల రజిని ► ప్రజలంతా జగనన్న పాలనలోనే ఉండాలనుకుంటున్నారు : మోపిదేవి అద్దంకి: ఓటమి భయంతోనే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలతో పొత్తులు పెట్టుకుంటోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఎద్దేవా చేశారు. బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో ఏర్పాటుచేసిన సిద్ధం సభ ప్రాంగణాన్ని ఆమెతోపాటు రాజ్యసభ సభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు శనివారం పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. గతంలో అమిత్ షా ఏపీకి వచ్చినప్పుడు ఆయనపై చంద్రబాబు రాళ్లు వేయించిన విషయం ప్రజలు మరిచిపోతారా అని ఆమె ప్రశ్నించారు. అధికారంలో ఉన్న సమయంలో ఒక రకంగా అధికారంలో లేని సమయంలో మరో రకంగా రంగులు మార్చడమే చంద్రబాబు నైజమని విమర్శించారు. ఎన్ని పార్టీలు ఏకమై వచ్చినా వైఎస్సార్సీపీని ఏమీచేయలేరన్నారు. ప్రజలంతా సంక్షేమ పాలన అందించిన జగనన్ననే మళ్లీ సీఎంగా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె ధీమా వ్యక్తంచేశారు. నాలుగున్నరేళ్ల పాలనలో సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకెళ్లిన ఘనత జగనన్నదే అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అందుకున్న 80–85శాతం మంది తిరిగి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్నే తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారన్నారు. అపవిత్ర పొత్తుతో ప్రతిపక్షాలు.. ఇక సీఎం వైఎస్ జగన్‌ను ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపాలని ప్రతిపక్షాలన్నీ అపవిత్రమైన పొత్తు పెట్టుకుని అడ్డదారులు తొక్కుతూ, అమలుకు సాధ్యంకాని హామీలతో ప్రజల ముందుకొస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు విమర్శించారు. పేదలంతా వైఎస్సార్సీపీ పాలనతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. 2024లో జగనే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలు మళ్లీ పెత్తందారి వ్యవస్థను తేవాలని చూస్తున్నాయన్నారు. గతంలో రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం అని చెప్పిన బాబు వాటిని నెరవేర్చలేదన్న విషయం ప్రజలందరికీ ఇంకా గుర్తుందన్నారు. సిద్ధం సభలు ఏపీ చరిత్రలో నిలిచిపోతాయని.. వాటి ద్వారా ప్రజాభిమానం వెల్లువెత్తుతోందన్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. పొత్తుల ముసుగులో వైఎస్సార్సీపీని ఓడించాలని చంద్రబాబు చూస్తున్నాడన్న సంగతి ప్రజలకు అర్థమవుతోందన్నారు. 175కు 175 సీట్ల గెలుపు ఈ సభ నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు.ఈ సమావేశంలో సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, ఏపీఐఏసీ చైర్మన్ జంకె వెంకటరెడ్డి, రాష్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ ఆడపా శేషు, నియోజకవర్గ పరిశీలకుడు మారం వెంకారెడ్డి, స్థానిక నాయకులు ఉన్నారు. -
Siddam Sabha: అందరి చూపు.. ఆఖరి ‘సిద్ధం’ వైపు
సాక్షి, బాపట్ల జిల్లా: సీఎం జగన్ పాలనపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని మంత్రి విడదల రజని అన్నారు. మేదరమెట్ల ‘సిద్ధం’ సభకు వచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి తేడా ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు. శనివారం మేదరమెట్ల ‘సిద్ధం’ ఏర్పాట్లను పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలు సభా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. మేదరమెట్ల సిద్ధం సభ చరిత్రలో నిలిచిపోతుందని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. సిద్ధం సభలకు ప్రజాభిమానం వెల్లువెత్తుతోందని, ఏపీ రాజకీయ చర్రితలోనే సిద్ధం సభలకు కనీవిని ఎరుగని ప్రజామద్దతు లభిస్తోందన్నారు. గత మూడు సిద్ధం సభలకు ప్రజలు, పార్టీ శ్రేణులు లక్షలాదిగా హాజరైన నేపథ్యంలో.. ఆదివారం బాపట్ల జిల్లాలో జరిగే నాలుగో సిద్ధం సభకు భారీఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. సభాస్థలంలో సీఎం ప్రసంగం అందరికి కనబడేటట్లుగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ప్రజలకు చేరువగా వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా ర్యాంప్ ఏర్పాటు చేశారు. ఐదేళ్ల పాలన ప్రగతిని సీఎం.. ప్రజలకు వివరించున్నారు. సీఎం ప్రసంగం కోసం ఆసక్తిగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. సిద్ధం సభ కోసం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సభకు వచ్చేవారి కోసం వందల సంఖ్యలో గ్యాలరీలు ఏర్పాటు సిద్ధం చేశారు. సభకు తరలివచ్చేవారికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. సభావేదిక నుంచి పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. -
YSRCP Siddham: దద్దరిల్లేలా రేపే సిద్ధం సభ
అద్దంకి రూరల్/మేదరమెట్ల: గత మూడు సిద్ధం సభలకు ప్రజలు, పార్టీ శ్రేణులు లక్షలాదిగా హాజరైన నేపథ్యంలో.. ఆదివారం బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని పి.గుడిపాడులో జరిగే నాలుగో సిద్ధం సభకు భారీఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. సభాస్థలంలో సీఎం ప్రసంగం అందరికి కనబడేటట్లుగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు చేరువగా వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా ర్యాంప్ ఏర్పాటు చేశారు. సభకు అంచనాలకు మించి ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటారని భావిస్తున్నారు. సభ నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు ఉన్నతాధికారులు సభాస్థలాన్ని, వేదికను నిశితంగా పరిశీలిస్తున్నారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సభకు అన్నీ సిద్ధం: తలశిల రఘురామ్ సిద్ధం సభకు అన్నీ సిద్ధం చేశామని ఎమ్మెల్సీ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ చెప్పారు. సిద్ధం సభా ప్రాంగణాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. మొత్తం సుమారు 200 ఎకరాల్లో సిద్ధం సభ నిర్వహణ సాగుతుందని, సభకు వచ్చే వాహనాల కోసం 28 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారని చెప్పారు. సభ సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. వాహనాల దారి మళ్లింపు సిద్ధం సభ నేపథ్యంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ♦ నెల్లూరు వైపు నుంచి ఒంగోలు మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలను ఒంగోలు సౌత్ బైపాస్ సంఘమిత్ర హాస్పిటల్, కర్నూలు రోడ్డు, చీమకుర్తి, పొదిలి, దొనకొండ, అడ్డరోడ్డు మీదుగా మళ్లించారు. హైదరాబాద్ నుంచి ఒంగోలుకు వచ్చే భారీ వాహనాలు సంతమాగులూరు అడ్డరోడ్డు, వినుకొండ, మార్కాపురం, పొదిలి, చీమకుర్తి మీదుగా మళ్లిస్తారు. ఒంగోలు మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే సాధారణ వాహనాలు మేదరమెట్ల వద్ద నుంచి నామ్ హైవేపై అద్దంకి, సంతమాగులూరు మీదుగా వెళ్లాలి. ♦ ఒంగోలు వైపు నుంచి విశాఖపట్నం వైపు 16వ నంబరు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను త్రోవగుంట నుంచి ఎన్‌హెచ్ 216పైకి దారి మళ్లించి చీరాల, బాపట్ల, మచిలీపట్నం మీదుగా పంపుతారు. ♦ ఒంగోలు వైపు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను త్రోవగుంట, చీరాల, బాపట్ల, పొన్నూరు మీదుగా దారి మళ్లిస్తారు. ఒంగోలు వైపు నుంచి చిలకలూరిపేట వైపు వెళ్లే వాహనాలు త్రోవగుంట, చీరాల, పర్చూరు మీదుగా వెళ్లాలి. ♦ విశాఖపట్నం నుంచి ఒంగోలు, చెన్నై వైపు వచ్చే వాహనాలను నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా దారి మళ్లిస్తారు. గుంటూరు నుంచి ఒంగోలు–చెన్నై వైపు వెళ్లే వాహనాలు బుడంపాడు అడ్డరోడ్డు నుంచి పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా మళ్లిస్తారు. ♦ 16వ నంబర్ జాతీయ రహదారి మేదరమెట్ల గ్రోత్ సెంటర్ నుంచి బొల్లాపల్లి టోల్ ప్లాజా వరకు సిద్ధం సభకు వచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. అద్దంకి నుంచి నాగులపాడు, వెంకటాపురం మీదుగా జాతీయ రహదారిపై ఎటువంటి వాహనాలు అనుమతించరు. ♦ ఈ ఆంక్షలు 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అమలులోకి వస్తాయని ఎస్పీ తెలిపారు. -
175 స్థానాల్లో గెలుపే లక్ష్యం
మేదరమెట్ల: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో విజయం సాధిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పి.గుడిపాడు వద్ద వచ్చే నెలలో నిర్వహించే సిద్ధం సభ కోసం ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని ఆయన పార్టీ నేతలతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మార్చి 3న జరగాల్సిన సిద్ధం సభను 10వ తేదీకి మార్చామన్నారు. సిద్ధం సభలు ఎక్కడ జరిగినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. ఈసారి సభకు 15 లక్షల మంది హాజరయ్యేలా వంద ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. మరో వంద ఎకరాలు కూడా సభాప్రాంగణానికి ఆనుకుని అందుబాటులో ఉన్నాయన్నారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెందిన ప్రజలు ఈ సభకు హాజరవుతారని వెల్లడించారు. మార్చి 10న సిద్ధం సభకు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరై ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్ ప్రభుత్వం పాలన చేస్తోందని కొనియాడారు. ప్రజల స్పందన చూస్తుంటే రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుపొందడం ఖాయమని తెలుస్తోందన్నారు. మేనిఫెస్టోపై కసరత్తు జరుగుతోందని.. అతి త్వరలోనే ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రకటించకుండా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ ప్రకటిస్తారని చెప్పారు. ఎంతమంది పొత్తులతో వచ్చి నా ప్రజలు వైఎస్సార్సీపీ వెంటే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేశ్, మేరుగు నాగార్జున, ఎంపీలు నందిగం సురే‹Ù, మోపిదేవి వెంకట రమణారావు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ జంకె వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు పానెం చిన హనిమిరెడ్డి, కరణం వెంకటేశ్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆగని టీడీపీ సర్వే నాటకాలు
మార్టూరు: ప్రజలు ఎంత ప్రతిఘటించినా టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ మోసాలను మాత్రం విడనాడటం లేదు. ‘మీకు మా పథకాలు వస్తాయి..’ అంటూ అమాయక ప్రజలకు మాయమాటలు చెబుతూ సర్వే పేరిట వారి వివరాలు సేకరించి తమ ఫోన్లలో నమోదు చేసుకుంటున్నారు. ఆ తర్వాత వారి ఫోన్లకు వచ్చిన ఓటీపీలు చెప్పాలని కోరుతున్నారు. దీంతో ఆందోళనకు గురవుతున్న ప్రజలు వారిని నిలదీస్తే పారిపోతున్నారు. తాజాగా ఇటువంటి ఘటన బాపట్ల జిల్లా మార్టూరు మండలం డేగరమూడి గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తన్నీరు రాజు, ముక్తిపాటి వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. డేగరమూడి గ్రామంలోని ఆదర్శనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఆర్ఎంపీ విప్పర్ల బాలకృష్ణ టీడీపీ కార్యకర్త. అతను రెండు రోజులుగా మరో వ్యక్తితో కలిసి తమ కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ మహిళలు, పెద్దవారిని కలిసి వారి కుటుంబ వివరాలు సేకరిస్తున్నారు. కాలనీ వాసుల సెల్ఫోన్లకు వచ్చిన ఓటీపీలు తెలుసుకుని తమ సెల్ఫోన్లలో నమోదు చేస్తున్నారు. ఇలా ఆది, సోమవారాలు రెండు రోజులలో 50కిì పైగా కుటుంబాల వివరాలు సేకరించారు. ఈ విషయం స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు జంపని వీరయ్య చౌదరి దృష్టికి రాగా, ఆయన స్థానికులతో కలిసి ఆదర్శనగర్ కాలనీకి వెళ్లి సర్వే చేస్తున్న టీడీపీ కార్యకర్తలను నిలదీశారు. దీంతో వారు బైక్‌తో పారిపోయారు. ఆ యువకులు ఏం వివరాలు అడుగుతున్నారని వీరయ్య చౌదరి స్థానికులను ఆరా తీయగా... ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్ గ్యారెంటీ’ పేరుతో వివరాలు అడిగారని, తమ కుటుంబ వివరాలు సెల్ఫోన్లో నమోదు చేసుకున్నారని తెలిపారు. దీనివల్ల తమకు ఏమైనా నష్టం జరుగుతుందా.. అని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో గ్రామానికి చెందిన తన్నీరు రాజు, అన్నం శ్రీను, మరికొందరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బాపట్ల జిల్లా అద్దంకిలో టీడీపీ నేతల దౌర్జన్యం
-
పచ్చ పార్టీకి దొంగఓట్లే పెద్దదన్ను
ప్రజా సంక్షేమం కోసం పథకాలు అమలు చేయడం... చేసిన పనులు సగర్వంగా చెప్పుకోవడం... తద్వారా ఎన్నికల సమయంలో ఓట్లడగటం నిజమైన నాయకుడి లక్షణం. అదే దొంగ ఓట్లను నమ్ముకోవడం... అధికారంకోసం అడ్డదారులు ఎంచుకోవడం... అందుకోసం కుట్రలు, కుతంత్రాలకు తెరతీయడం... ఎంతటి అక్రమానికైనా వెరవకపోవడం కుటిల నీతికి నిదర్శనం. రెండో కేటగిరీకి చెందినవారే మన పచ్చనేతలు. విజయమే పరమావధిగా దొంగ ఓట్లను ఇష్టానుసారంగా చేరి్పంచేసి వారిద్వారా గెలవడం అలవాటు చేసుకున్నారు. ఇందుకు పర్చూరు, రేపల్లె, అద్దంకి నియోజకవర్గాలే సాక్ష్యం. అక్కడ అధికారుల తనిఖీల్లో వేలాది దొంగఓట్లు బహిర్గతమయ్యాయి. వాటి ద్వారానే గతంలో వారు విజయం సాధించారని ఈ సంఘటన రుజువు చేస్తోంది. సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని పలు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ దొంగ ఓట్లతోనే గత ఎన్నికల్లో గెలుపొందింది. తాజాగా బయటపడ్డ దొంగ ఓట్ల వ్యవహారం చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న దొంగ ఓట్లను తొలగించాలని అధికారపార్టీ నేతలు జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారులకు పలుదఫాలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వాటి తొలగింపునకు ఫారం–7 దరఖాస్తులు పెట్టారు. జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టగా పెద్ద ఎత్తున అక్రమ ఓట్లు ఉన్నట్లు తేలింది. ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో ఓట్లున్నవారికీ ఇక్కడ ఓట్లుండటం, స్థానికంగా ఒకే నియోజకవర్గంలో రెండు చోట్ల ఓట్లు నమోదు కావడం, చని పోయినవారి ఓట్లు జాబితాలో ఉండటం బయటపడింది. ఈ విధంగా బాపట్ల జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 46,116 దొంగ ఓట్లను అధికారులు తొలగించారు. గత ఎన్నికల్లో టీడీపీ గెలుపొందిన పర్చూరు, రేపల్లె, అద్దంకి నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు అధికంగా బయటపడ్డాయి. అక్రమ ఓట్ల వల్లే గత ఎన్నికల్లో టీడీపీ గెలుపొందినట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు వాటిని తొలగించడం వల్ల రాబోయే ఎన్నికల్లో వారి విజయం ప్రశ్నార్థకంగా మారనుంది. పర్చూరులో పదివేలకు పైగా దొంగ ఓట్లు పర్చూరు నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గెలుపొందారు. 2014లో 10,775 ఓట్లు, 2019లో 1647 ఓట్ల మెజారిటీ వచ్చింది. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా 1967, 1991, 2004, 2019లో మాత్రమే పదివేలకుపైబడి మెజార్టీవచ్చింది. మిగిలిన 11 ఎన్నికల్లో 7 వేలకు మించలేదు. తాజాగా అధికారులు ఈ నియోజకవర్గంలో 10,468 దొంగ ఓట్లను తొలగించారు. మరిన్ని దొంగ ఓట్లు బయటపడే అవకాశముంది. దీన్నిబట్టి పర్చూరులో టీడీపీ దొంగ ఓట్లవల్లే గెలుపొందినట్లు తెలుస్తోంది. రేపల్లెలోనూ దొంగ ఓట్ల హవా... రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ 2014లో 13,355 ఓట్లు, 2019లో 11,555 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకూ జరిగిన 15 ఎన్నికల్లో 8 సార్లు 10 వేలకు మించి మెజార్టీ రాగా 7 సార్లు 10వేలలోపు మెజార్టీ వచ్చింది. ఇక్కడ ఓట్ల విచారణ పూర్తికాక ముందే 8,880 దొంగ ఓట్లను గుర్తించారు. ఇంకా మరికొన్ని దొంగ ఓట్లు బయటపడే అవకాశముంది. దొంగ ఓట్ల తొలగింపు రాబోయే ఎన్నికల్లో పచ్చపార్టీపై ప్రభావం చూపనున్నట్టు తెలుస్తోంది. అద్దంకిలోనూ అదే తీరు... అద్దంకి నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ కాంగ్రెస్(ఐ), వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యరి్థగా పోటీచేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో ఆయనకు 12,991 మెజార్టీ వచ్చింది. 2009, 2019 ఎన్నికల్లో మాత్రమే ఈ నియోజకవర్గంలో 10 వేలకు మించి మెజార్టీ వచ్చింది. మిగిలిన 12 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సగటున 5 వేలకు మించి మెజార్టీ రాలేదు. తాజాగా ఈ నియోజకవర్గం పరిధిలో అధికారులు 7,207 దొంగ ఓట్లను తొలగించారు. విచారణ పూర్తయితే మొత్తం 8 వేల పైచిలుకు దొంగ ఓట్లను తొలగించే అవకాశముంది. -
ఒకే జిల్లాలో 61వేల కొత్త ఓట్లు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లాలో భారీ సంఖ్యలో కొత్త ఓటర్ల నమోదు జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఓటేయడానికి నవతరం ఉత్సాహంగా ముందుకు వస్తోంది. ఈ జిల్లాలో ఇప్పటివరకు 61,193 ఓట్లను కొత్తగా చేర్చారు. వీటిలో యువతవే 80 శాతం ఉన్నట్లు సమాచారం. మరోపక్క ఇబ్బడిముబ్బడిగా ఉన్న దొంగ ఓట్లను అధికారులు తొలగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా లక్షలాదిగా వచ్చిన ఫారం–6, ఫారం–7, 8లను ఎన్నికల అధికారులు వడపోసి, దొంగ ఓట్లను తొలగించి కొత్త ఓట్ల నమోదును చాలా వరకు పూర్తి చేశారు. ఇప్పటికే 46,116 అక్రమ ఓట్లను తొలగించారు. అన్నీ కలిపి మరో 600 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. వీటిలో కొత్త ఓట్లకు సంబంధించి 400 దరఖాస్తులు ఉన్నాయి. జనవరి 12వ తేదీ వరకు దరఖాస్తులను పరిశీలిస్తారు. జనవరి 22 నాటికి తుది జాబితా విడుదల చేస్తారు. ఇప్పటివరకు నమోదైన కొత్త ఓట్లలో అత్యధికంగా అద్దంకిలో 12,883 నమోదయ్యాయి. బాపట్లలో 9,967, రేపల్లెలో 9,961, చీరాలలో 9,958, పర్చూరులో 9,385, వేమూరులో 9,039 ఉన్నాయి. ప్రలోభాలకు లొంగకుండా దొంగ ఓట్ల తొలగింపు జిల్లాలో 65 వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని పర్చూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్, పలువురు అధికార పార్టీ నేతలు జిల్లా కలెక్టర్‌కు, రాష్ట్ర ఎన్నికల అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లను గుర్తించి వాటిని తొలగించాలని 65 వేలకు పైగా ఫారం–7 దరఖాస్తులను సమర్పించారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా వచ్చిన ఫారం–7 దరఖాస్తులను అధికారులు సమగ్రంగా పరిశీలించి దొంగ ఓట్లను తొలగిస్తున్నారు. దీంతో తమ దొంగ ఓట్ల వ్యవహారం బయటపడుతుందని భావించిన పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధికార పార్టీ దొంగ ఓట్లు చేర్పిస్తోందంటూ ఆరోపణలకు దిగారు. అధికారులకు పదేపదే ఫిర్యాదు చేశారు. కోర్టును ఆశ్రయించారు. జిల్లా అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. అయినా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం వేలాది ఫారం–7 దరఖాస్తులను నిశితంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. ఇప్పటివరకూ 46,116 దొంగ ఓట్లను గుర్తించి, తొలగించింది. వీటిలో అత్యధికంగా పర్చూరు నుంచి 10,468 ఓట్లను తొలగించారు. రేపల్లె పరిధిలో 8,880, చీరాల నుంచి 7,420, అద్దంకిలో 7,207, వేమూరులో 6,295, బాపట్ల నుంచి 5,846 ఓట్లను తొలగించారు. తొలగించిన ఓటర్లలో ఇతరప్రాంతాలకు వలస వెళ్లిన వారు, అక్కడే స్థిరపడిన వారు, చనిపోయిన వారు, రెండు చోట్లా ఓట్లు ఉన్నవారు ఉన్నారు. ఓటు హక్కుతో ఆనందం రాబోయే ఎన్నికల్లో తొలిసారి ఓటేసే ఆవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేస్తాను. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగను. మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకునేందుకు నా వంతు తోడ్పాటు అందిస్తాను. మంచి పాలన అందించేవారికి మద్దతుగా నిలవాలన్నది కోరిక. – పూరేటి సంధ్య, కొప్పెరపాడు, బల్లికురవ మండలం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నా నాకు ఓటు హక్కు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ఫీజు రీయింబర్స్ మెంట్‌తో చదువుకున్నాను. పేద, మధ్యతరగతి వారికి అండగా నిలిచే ప్రభుత్వాలకు ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాను. –ఎం.సాయి పూజిత, బీటెక్ విద్యార్థి, బాపట్ల ప్రజల కోసం పనిచేసే వారికే ఓటు తొలిసారి ఓటుహక్కు రావడం ఆనందంగా ఉంది. పేదలకు అండగా నిలిచి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికే రాబోయే ఎన్నికల్లో నా ఓటు. ఎవరి ప్రలోభాలకూ లొంగకుండా ఓటు వేస్తాను. అందరికీ మంచి జరగాలన్నదే నా కోరిక. – పి. వెంకట నాగ మణికంఠ రెడ్డి, దుండివారిపాలెం, కర్లపాలెం మండలం -
ఆ పత్రికలు చదవొద్దు.. అపోహలు నమ్మొద్దు: సీఎం జగన్
సాక్షి, బాపట్ల జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తిరుపతి, బాపట్ల జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెంలో తుపాను బాధితులతో మాట్లాడారు. అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని రైతులు, బాధితులతో ముఖాముఖిగా మాట్లాడారు. ‘‘ఇంతటి బాధాకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ.. మీ అందరి ఆప్యాయతలు, ప్రేమానురాగాల మధ్య ఈ ప్రభుత్వంలో ఏదైనా సంభవించరానిది సంభవిస్తే ఈ ప్రభుత్వం తోడుగా నిలబడుతుందన్న నమ్మకం మీ ప్రతి చిరునవ్వులో కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం మీది అని ఈ సందర్భంగా కచ్చితంగా చెబుతున్నా. ఈ ప్రభుత్వంలో మంచే జరుగుతుంది తప్ప.. ఏ ఒక్కరికీ చెడు జరగదని కచ్చితంగా చెబుతున్నా’’ అని సీఎం పేర్కొన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. ♦ఈ రోజు ఇక్కడికి రాకముందు తిరుపతి జిల్లాలో సందర్శించాను. దాని తర్వాత ఇక్కడికి రావడం జరిగింది ♦ఈ తుపాను తిరుపతి నుంచి మొదలుపెడితే సుదీర్ఘంగా కోస్తా తీరంలో తగులుకుంటూ పోయిన పరిస్థితులు ♦విపరీతమైన, ఎప్పుడూ చూడని వర్షం నాలుగు రోజుల వ్యవధిలోనే పడింది ♦దాని వల్ల వాటర్ లాగింగ్ జరిగి ఇబ్బందులు పడ్డాం ♦మిగిలిన ఏ రాష్ట్రాల్లో లేనిది, మన రాష్ట్రంలో మాత్రమే ఉన్నది ఒక గొప్ప వ్యవస్థ. సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ♦ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా, నష్టం జరిగినా చేయి పట్టుకొని నడిపించి సహాయం చేయించే ఒక గొప్ప వ్యవస్థ మన రాష్ట్రంలో ఉంది ♦వివక్షకు తావుండదు. నష్టం ఎవరికి జరిగినా కూడా, చివరికి మనకు ఓటు వేయని వారికి జరిగినా ఈ ప్రభుత్వం అందరికీ తోడుగా ఉంటుంది ♦ట్రాన్స్పరెంట్గా నష్టం జరిగిన వారిని గుర్తించి సచివాలయంలో సోషల్ ఆడిట్‌కు పేర్లు పెట్టడం జరుగుతోంది ♦పొరపాటు జరిగి ఉంటే మీ పేరు నమోదు చేసుకోవాలని లిస్టులు డిస్ప్లే చేసి మరీ సహాయం అందిస్తున్న ప్రభుత్వం మనది ♦ఇంతకు ముందు కరువు, వరదలు వచ్చినా పట్టించుకున్న పరిస్థితులు లేవు ♦గతంలో ఏరోజు ఇన్ పుట్ సబ్సిడీ వస్తుందో తెలియదు, ఎంత మందికి వస్తుందో తెలియదు ♦ఈ నాలుగున్నరేళ్ల మీ బిడ్డ పరిపాలనలో పూర్తిగా చరిత్ర మారిన పరిస్థితి కనిపిస్తోంది ♦నీళ్లతో నిండిన గ్రామాల్లో ప్రతి ఒక్కరినీ ఆదుకొనేందుకు, వాళ్లకు ఇవ్వాల్సిన రేషన్ తోపాటు ప్రతి ఇంటికీ రూ.2,500 ఇచ్చిన చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు ♦ఇప్పటికే రేషన్, రూ.2,500 ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టారు. నాలుగు రోజుల్లో ప్రతి ఇంటికీ పంపిణీ చేయడం పూర్తవుతుంది ♦దాదాపు 12 వేల మందికి, వారికి ఇవ్వాల్సిన 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలు ఇవ్వడంతో పాటు ప్రతి ఇంటికీ రూ.2చ500 ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది ♦ప్రతి ఇంటికీ వాలంటీర్ వచ్చి దగ్గరుండి ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. ♦రెండోది.. పంట నష్టానికి సంబంధించి.. ప్రతి రైతన్నకు ఒకటే చెప్పదల్చుకున్నా ♦ఎవరైనా మీకు ఇన్ పుట్ సబ్సిడీ రాదనో, ఇంకొకటి రాదనో చెబితే దయచేసి నమ్మవద్దండి ♦ఇక్కడ ఉన్నది మీ బిడ్డ ప్రభుత్వం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మీకు అన్యాయం జరగదు అనేది గుర్తు పెట్టుకోవాలి ♦మనం యుద్ధం చేస్తున్నది మారీచులతో. ఒక్క చంద్రబాబుతో మాత్రమే కాదు! ♦పనిగట్టుకొని అదేపనిగా అబద్ధాలనే నిజం చేయాలని, అబద్ధాలనే పనిగట్టుకొని చూపించేవాళ్లు, రాసేవాళ్లు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నాం ♦ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, జరగనిది జరిగినట్టుగా చూపించి భ్రమ కల్పించే కార్యక్రమం చేస్తున్నారు ♦ఇన్సూరెన్స్ గురించి సిగ్గుమాలిన, దిక్కుమాలిన రాతలు రాశారు ♦ఈ ఖరీఫ్ సీజన్లో నష్టం జరిగితే, మళ్లీ ఖరీఫ్ సీజన్ వచ్చేలోపే ఇన్సూరెన్స్ ఇచ్చినది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే ♦ఈ ఖరీఫ్ సీజన్‌కు ఇన్సూరెన్స్ వచ్చేది ఎప్పుడు? వచ్చే ఖరీఫ్ మొదలయ్యేనాటికి ♦జూన్‌కు రైతు భరోసాతోపాటు ఈ ఖరీఫ్ కు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు అప్పుడు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ♦ఇంతకు ముందు ఇన్సూరెన్స్ ఎప్పుడొస్తుందో, ఎంత మందికి వస్తుందో తెలియదు ♦అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ప్రతి ఎకరానూ, ప్రతి సచివాలయం పరిధిలో ఈక్రాప్ చేసి ఏ ఒక్క రైతు మిస్ కాకుండా ఈ క్రాప్‌లోకి నమోదు చేసి రైతు తరఫున కట్టాల్సిన ప్రీమియం సొమ్ము కూడా ప్రభుత్వమే కడుతూ రైతులకు ఇన్సూరెన్స్ ఇచ్చిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందంటే అది మన రాష్ట్రంలోనే ♦గతంలో చంద్రబాబు పాలనలో మీకు గుర్తుండే ఉంటుంది. ఐదేళ్లూ వరుసగా కరువు కాటకాలే ♦అయినా కూడా ఇన్సూరెన్స్ ఎంత అంటే.. కేవలం 35 లక్షల మందికి కేవలం రూ.3,400 కోట్లు ♦అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ నాలుగున్నర సంవత్సరంలో దేవుడి దయ వల్ల ఎక్కడా కరువు కాటకాలు ఏమీ లేకపోయినా కూడా రైతన్నలు సమృద్ధిగా వ్యవసాయంలో బాగుపడినా కూడా ఇన్సూరెన్స్ ఇచ్చినది 55 లక్షల మందికి రూ.7,800 కోట్లు ♦బాబు హయాంలో ఎక్కడ 3400 కోట్లు? మీ బిడ్డ హయాంలో ఎక్కడ 7800 కోట్లు? ♦చంద్రబాబు ఐదు సంవత్సరాల లెక్కలు, మీ బిడ్డ ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల లెక్కలే చెబుతున్నా. ♦ఏ సంవత్సరం అయినా ఈ ఖరీఫ్‌లో రైతన్న ఇబ్బంది పడితే, వచ్చే ఖరీఫ్ నాటికి ఇన్సూరెన్స్ కచ్చితంగా వస్తోంది ♦ఇన్ పుట్ సబ్సిడీ కూడా దేశంలో ఎప్పుడూ చూడని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ సీజన్ లో మీకు నష్టం జరిగితే ఈ సీజన్ ముగిసేలోగానే ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చి రైతన్నను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం దేశంలో మన ప్రభుత్వం. ♦వెంటనే కలెక్టర్లు అందరూ స్పందిస్తున్నారు. ఎన్యుమరేషన్ కార్యక్రమం రేపో మరునాడో మొదలు పెడతారు ♦కలెక్టర్లు ఎన్యుమరేషన్ పూర్తి చేసే కార్యక్రమం అయిపోయిన తర్వాత 15 రోజులపాటు సమయం ఇచ్చి గ్రామ సచివాలయాల్లో లిస్టును ప్రదర్శిస్తారు ♦గ్రామ సచివాలయంలో ఎవరైనా రైతు మిస్ అయితే, మీరు పేరు చూసుకోండి.. పొరపాటున మిస్ అయి ఉంటే మళ్లీ అవకాశం ఇస్తున్నాం, మళ్లీ వచ్చి చూసుకొని రీవెరిఫై చేసి మీకు వచ్చేట్టుగా చేస్తామని సమయం ఇస్తారు ♦వచ్చే నెలా సంక్రాంతి లోపు మీ అందరికీ ఇన్ పుట్ సబ్సిడీ వచ్చేస్తుంది ♦ఇది ఇప్పుడు మాత్రమే జరుగుతున్నది కాదు. ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఇది జరిగిస్తున్నాం ♦విత్తనాలను 80 శాతం సబ్సిడీతో రైతులకు అందుబాటులో ఉంచి సప్లయ్ చేస్తూ వెంటనే ఆదుకొనేందుకు చర్యలు తీసుకుంటున్నాం ♦మీ అందరితో విన్నవించేది ఒక్కటే దయచేసి అపోహలు నమ్మొద్దు ♦మరీ ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి చదవొద్దండి. ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 చూడొద్దండి. వీళ్లంతా అబద్ధాలు చెబుతున్నారు ♦కేవలం మీ బిడ్డ ప్రభుత్వం మీద బురద చల్లడం కోసం, వాళ్లకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోలేదు కాబట్టి వెంటనే ఈ మనిషిని తప్పించాలి, ఆ మనిషిని తీసుకొచ్చేయాలని దురుద్దేశంతో కావాలనే అబద్ధాలాడుతున్నారు ♦ఇలాంటి వారిని దయచేసి నమ్మొద్దని కోరుతున్నా ♦కచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుంది ♦మీ బిడ్డ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి నష్టం, ఇబ్బంది జరిగినా కచ్చితంగా మంచి జరిగించేందుకు ఒక పద్ధతి తీసుకొచ్చాం ♦సోషల్ ఆడిట్, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తెచ్చి, కలెక్టర్ల వ్యవస్థను డీసెంట్రలైజేషన్ చేసి, 13 జిల్లాలను 26 జిల్లాలు చేసి, ఆర్డీవోల సంఖ్యను డబుల్ చేసి, జేసీల ♦సంఖ్యను డబుల్ చేసి, సచివాలయ వ్యవస్థను గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చి, వాలంటీర్ల వ్యవస్థను గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చాం ♦ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా ఇబ్బంది పడిన పరిస్థితులు వచ్చినా, ముఖ్యమంత్రిగా నేను వచ్చి జరిగే పని చెడగొట్టి, అధికారులను నా చుట్టూ తిప్పుకొని, ఫొటోలకు పోజులిచ్చి, టీవీల్లోనూ, పేపర్లలోనూ నేను రావాలని తాపత్రయపడే ముఖ్యమంత్రి ఇప్పుడు లేడు ♦ఇంతకు ముందుకు, ఇప్పటికీ తేడా అది. ♦మీ బిడ్డ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కలెక్టర్లకు ఆదేశాలిస్తాడు ♦మీకు వారం రోజులు సమయం ఇస్తున్నా, వారం తర్వాత నేనే వచ్చి ప్రజలను అడుగుతా. నేనొచ్చి అడిగినప్పుడు మా కలెక్టర్ బాగా పని చేశాడు, గొప్పగా పని చేశాడనే మాట ప్రజల నుంచి రావాలి అని చెప్పాను ♦ఇంతకు ముందు చంద్రబాబు కలెక్టర్లకు డబ్బులు ఇచ్చేవాడు కాదు. టీఆర్27కు అర్థమే చంద్రబాబుకు తెలియదు ♦కలెక్టర్ల చేతుల్లో వెంటనే డబ్బులు పెట్టి, వ్యవస్థను మొత్తం యాక్టివేట్ చేసి వాళ్లందరికీ సఫిషియంట్ టైమ్ ఇచ్చి బాగా జరిగిందా లేదా అని మాత్రం చూసేందుకు మీ బిడ్డ వారం తర్వాత నేను వస్తానని చెప్పినప్పుడు, ప్రజలను అడుగుతాడు అని చెప్పినప్పుడు కలెక్టర్లు, సచివాలయాలు, ఎమ్మార్వోలు, వాలంటీర్ల వరకు ప్రతి ఒక్కరూ పరుగెత్తి ప్రజలకు మంచి చేస్తున్న కార్యక్రమం ఇప్పుడు మాత్రమే జరుగుతోంది. ♦జరిగిన నష్టం అపారమైనది, కాదని నేను అనను, జరగాల్సిన, చేయాల్సిన సహాయం అంతా పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ జరుగుతుంది. వేగంగా జరుగుతుంది ♦గత ప్రభుత్వాల కంటే మిన్నగా, ఎక్కువగా జరుగుతుంది ♦ఇవన్నీ కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా ♦ఇక టెంపరరీ డామేజ్లకు సంబంధించి, రోడ్లు, ఇరిగేషన్ ట్యాంకులు, ఇటువంటి వాటికి సంబంధించి ఎలాగూ జరుగుతాయి ♦వాటన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన టెంపరరీ రిలీఫ్ గా చేయాల్సినవన్నీ ముమ్మరంగా మొదలు పెట్టించే కార్యక్రమం వెంటనే చేస్తాం ♦పర్మినెంట్‌గా రెగ్యులర్‌గా చేయాల్సిన పనులు కూడా టేకప్ చేసే కార్యక్రమాలు చేస్తాం ♦మీ అందరి ఆప్యాయతలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఇదీ చదవండి: వాలంటీర్ల ద్వారా రూ.2500 సాయం : సీఎం జగన్ -
బాపట్ల జిల్లాలో పంట నష్టాన్ని అంచనా వేస్తున్న అధికారులు
-
అల్లకల్లోలంగా సూర్యలంక బీచ్
-
బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి, బాపట్ల: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఆటో ఢీకొనడంతో ఐదుగురు మృతిచెందారు. సంతమాగులూరులోని బాలాజీ హైస్కూల్ వద్ద ఘటన జరిగింది. వినుకొండ నుంచి నరసరావుపేట వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను నరసరావుపేటకి చెందినవారిగా గుర్తించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చదవండి: స్కూటీపై వెళ్తుండగా ముఖానికి చున్ని అడ్డువచ్చి .. -
టీడీపీ దొంగ ఓట్ల అడ్డా.. బాపట్ల
సాక్షి ప్రతినిధి, బాపట్ల: తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లకు బాపట్ల జిల్లాను అడ్డాగా మార్చుకుంది. ఇక్కడ వెల్లడైన దొంగ ఓట్ల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక్క పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే వేల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని అధికారపార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ జిల్లా అధికారులు, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లను తొలగించాలని ఒక్క పర్చూరు నుంచే 12,944 ఫారం–7 దరఖాస్తులను స్థానికులు అధికారులకు సమర్పించారు. దశాబ్దాల క్రితం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు చాలా మంది ప్రస్తుతం ఉన్న ప్రాంతాలతోపాటు పర్చూరులోనూ ఓట్లు ఉంచుకున్నారు. కొందరు రెండు చోట్లా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వేల సంఖ్యలో ఉన్న అక్రమ ఓట్లతోనే పర్చూరు, రేపల్లె, అద్దంకి నియోజకవర్గాల్లో టీడీపీ వరుసగా గెలుస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. వీటితోపాటు వేమూరు, బాపట్ల, చీరాల నియోజకవర్గాల్లోనూ టీడీపీ దొంగ ఓట్లను పెద్ద ఎత్తున చేర్పించుకొన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని అధికారపార్టీకి చెందిన మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, చీరాల ఇన్చార్జి కరణం వెంకటేష్, అద్దంకి ఇన్చార్జి బాచిన కృష్ణచైతన్య ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు తొలగించాలని ఫారం–7 దరఖాస్తులను సమర్పించారు. వేమూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 2,407 ఫారం–7 దరఖాస్తులు ఇవ్వగా రేపల్లెలో 5,544, బాపట్లలో 3,155, అద్దంకిలో 2,619, చీరాలలో 1,870 ఫారం–7 దరఖాస్తులు ఇచ్చినట్లు సమాచారం. దీంతోపాటు అక్రమ ఓట్ల జాబితానూ ఎన్నికల అధికారులకు అందిస్తున్నారు. టీడీపీ ఉలికిపాటు దొంగ ఓట్ల తొలగింపునకు అధికార పార్టీ పట్టుబట్టడంతో టీడీపీ ఉలిక్కిపడింది. దీనినుంచి బయట పడేందుకు అధికారపార్టీ నేతలు టీడీపీ ఓట్ల తొలగింపునకు కుట్రలు చేస్తున్నారంటూ ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి దిగింది. ఎన్నికల కమిషన్‌కూ తప్పుడు ఫిర్యాదులు చేసి రాద్ధాంతం చేస్తోంది. కృష్ణజిల్లా నాగాయలంకలో ఉంటున్న జాగర్లమూడి లక్ష్మీతులసికి బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి పోలింగ్ బూత్ 148లో, మార్టూరు మండలం బొల్లాపల్లి పోలింగ్ బూత్ నంబర్ 70లో రెండు చోట్లా ఓట్లు ఉన్నాయి. పర్చూరు మండలం నూతలపాడులో ఉంటున్న మిరియా చాయమ్మకు దేవరపల్లి 148 పోలింగ్ బూత్, నూతలపాడు 159 బూత్‌లో ఓట్లు ఉన్నాయి. సోమేపల్లి చిన్నవెంకటేశ్వర్లు తండ్రి వెంకటాద్రి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయనకి హైదరాబాద్‌లో ఓటు ఉంది. దాంతోపాటు దేవరపల్లి పోలింగ్ బూత్ 148లో సీరియల్ నంబర్ 631లో కూడా ఓటు ఉంది. హైదరాబాద్‌లో నివాసం ఉండే కొమ్మాలపాటి వీరాంజనేయులుకు దేవరపల్లి 148 పోలింగ్ బూత్‌లో సీరియల్ నంబర్ 581తో ఓటు ఉంది. హైదరాబాద్ శేరిలింగంపల్లి పోలింగ్ బూత్ నంబర్ 430లో సీరియల్ నంబర్ 247తోనూ ఓటు ఉంది. దొంగ ఓట్లు తొలగిస్తాం జిల్లావ్యాప్తంగా సుమారు 30 వేల వరకు ఫారం–7 దరఖాస్తులు వచ్చాయి. దీనిపై జాయింట్ కలెక్టర్‌తో విచారణ చేయిస్తున్నాం. ఫారం–7లను పూర్తిగా పరిశీలించాం. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లుంటే తొలగిస్తాం. నిబంధనల మేరకు దొంగ ఓట్లపై చర్యలు తీసుకుంటాం. ఫేక్ దరఖాస్తులు చేసిన వారిపైనా చర్యలు ఉంటాయి. – రంజిత్‌బాషా, కలెక్టర్, బాపట్ల జిల్లా -
ఆమంచికి సీఎం పరామర్శ
చీరాల: బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్‌ను సీఎం వైఎస్ జగన్ బుధవారం ఫోన్లో పరామర్శించారు. సోమ వారం రాత్రి ఆమంచికి చెందిన ఆక్వా నర్సరీ లో వాకింగ్ చేస్తుండగా కట్లపాము కాటేసింది. దీంతో ఆయనను ప్రాథమిక చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ప్రాణా పాయం నుంచి కాపాడారు. వైద్యుల సూచన లతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి ఆమంచిని తరలించగా మంగళవారం ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. -
అద్దంకి పొలం-ఖర్జూర ‘ఫలం’.. 40 ఏళ్లు దిగుబడి, ఎకరాకు 4 లక్షల ఖర్చు
పోషకాలు మెండుగా ఉండి చూడగానే నోరూరించే ఖర్జూరం అంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. ఎడారి పంట అయిన ఈ ఖర్జూరాన్ని మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. మనదేశంలో రాజస్థాన్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఖర్జూరం సాగుచేస్తున్నప్పటికీ మనం వినియోగించే ఖర్జూరంలో మెజారిటీ వాటా దిగుమతులే. దుబాయ్, సౌదీ, ఒమన్, ఖతర్, బహ్రెయిన్ వంటి దేశాలనుంచి భారత్ ఖర్జూరం దిగుమతి చేసుకుంటుంది. అయితే ఖర్జూరం పంటలో లాభ దాయకతను గుర్తించిన దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు ఇప్పుడిప్పుడే దీని సాగుపై మక్కువ చూపిస్తుండటంతో సాగు విస్తీర్ణం క్రమేపీ పెరుగుతోంది. మన రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో వాణిజ్య ప్రాతిపదికన ప్రారంభమైన ఖర్జూరం సాగు ప్రస్తుతం బాపట్ల జిల్లాకు విస్తరించింది. అద్దంకి: బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి, బల్లికురవ, కొరిశపాడు మండలాల్లో సుమారు 6.8 ఎకరాల్లో రైతులు ఖర్జూరం పంట సాగు చేస్తున్నారు. అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలో ఉప్పుటూరి చిరంజీవి అనే రైతు 2.5 ఎకరాల్లో నాణ్యమైన బర్హీరకం సాగుచేస్తున్నాడు. దుబాయ్ నుంచి మొక్కలు తెచ్చి విక్రయించే తమిళనాడు వ్యాపారి నిజాముద్దీన్ దగ్గర మొక్కలు కొనుగోలుచేసినట్లు చిరంజీవి చెప్పారు. వ్యవసాయంలో వినూత్న ప్రయోగాలు చేస్తేనే లాభం ఉంటుందని భావించి ఖర్జూరం సాగువైపు మొగ్గు చూపినట్లు తెలిపారు. చిరంజీవి తోట తోట ప్రస్తుతం నాలుగేళ్ల వయసులో ఉంది. అనుకూలమైన నేలలివే.. సారవంతమైన తువ్వ (తెల్ల) నేల, గరప, నల్ల నేల, బంక నేలలతోపాటు, పీహెచ్ విలువ 8 నుంచి 10 వరకు ఉన్న చౌడు భూముల్లోనూ ఖర్జూరం సాగు చేసుకోవచ్చు. నీరు నిల్వ ఉండే నేలలు ఈ పంటకి అనుకూలంకాదు. ఖర్జూరం వేసవిలో కాపుకి వస్తుంది. ఉషో్టగ్రత 25 నుంచి 40 డిగ్రీల వరకు ఉంటే మంచి దిగుబడి వస్తుంది. అధిక వర్షాలు, చలిగాలులు ఖర్జూరం పంటకు ఇబ్బందికరం. దీనివల్ల మొక్కలు తెగుళ్ల బారిన పడే అవకాశం ఉంటుంది. నాటిన మూడేళ్లకు కాపు ఈత జాతికి చెందిన ఖర్జూరం మొక్క నాటిన మూడేళ్లకు కాపుకి వస్తుంది. ఇందులో ఆడ, మగ మొక్కలు ఉంటాయి. 10 ఆడ మొక్కలకు ఒక మగ మొక్క అవసరం. సాలుకు సాలుకు మధ్య మొక్కకు మొక్కకు మధ్య 24 అడుగుల ఎడంతో ఎకరాకు 78 మొక్కలు నాటుకోవచ్చు. మగ మొక్కలు తోటకు చుట్టూ అంచు వరుసలో నాటుతారు. మగ మొక్కలు కండెకు వచ్చిన తరువాత ఆ పుప్పొడిని భద్రపరుస్తారు. ఖర్జూరం మొక్క డిసెంబర్లో పూతకు వస్తుంది. ఆడ మొక్కలు పూతకు రాగానే ఆ పూతపై మొగ మొక్కల నుంచి సేకరించిన పుప్పొడిని చల్లుతారు. పూసిన మూడు నుంచి నాలుగు నెలలకు కాయలు పక్వానికి వస్తాయి. ఐదు నెలలకు గెలలను కోసి విక్రయించుకోవచ్చు. ఖర్జూరం సాగుకు ఎకరాకు రూ.4 లక్షల వరకు వ్యయం అవుతుంది. మూడో ఏడాది నుంచి 40 ఏళ్లపాటు దిగుబడి వస్తుంది. తొలి నాలుగేళ్లు దిగుబడి తక్కువగా ఉంటుంది. ఖర్జూరం మొక్కలు నాటిన నుంచి ఏడేళ్ల వరకు అంతరపంటలుగా పప్పు ధాన్యాలు, పశువుల మేత వంటివి సాగుచేసుకోవచ్చు. గుంటూరుకు చెందిన వ్యాపారి బర్హీ రకం కాయలను కిలో రూ.250 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు రైతు చిరంజీవి చెప్పారు. ఈ రకం ఖర్జూరాన్ని ప్రాసెస్ చేయకుండానే తినవచ్చని తెలిపారు. ఒక్కో మొక్క రూ.4,500 అద్దంకి ప్రాంతానికి బాగా అనుకూలమైన రకం బర్హీ. ఇందులో పసుపు, ఎరుపు రకాలు బాగా తియ్యగా ఉంటాయి. వీటిని తమిళనాడుకు చెందిన నిజాముద్దీన్ దుబాయ్ నుంచి తెప్పిస్తాడు. నెల పాటు తన వద్ద మొక్కలను పెంచి ఒక్కో మొక్క రూ.4.500 చొప్పున విక్రయిస్తాడు. అదే విధంగా రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి కూడా మొక్కలు తెప్పించుకోవచ్చు. మొక్కల సంఖ్య, నాటే విధానం వివరాలు నర్సరీ నిర్వాహకులనుంచి తెలుసుకోవచ్చు. అనంతపురం రైతును స్ఫూర్తిగా తీసుకున్నా.. సంప్రదాయ వ్యవసాయ సాగులో ఏటా నష్టాలు వస్తున్నాయి. ఖర్జూరం సాగులో ఒక్కసారి పెట్టుబడి పెడితే నాలుగో సంవత్సరం నుంచి నలభై సంవత్సరాల వరకు ఎటువంటి దిగులు ఉండదు. అయితే ఖర్జూరం మొక్కలను మన దేశంలో టిష్యూ కల్చర్ చేయకపోవడంతో ఇతర దేశాల నుంచి తెప్పించుకోవాల్సి వస్తోంది. దీంతో మొక్కల కొనుగోలుకు అధిక ఖర్చు అవుతోంది. ఉపాధి హామీ ద్వారా ఉద్యాన శాఖ పరిధిలో మొక్కలు ఇస్తే ఖర్జూరం సాగు మరింత పెరిగే అవకాశం ఉంది. – చిరంజీవి, రైతు, తిమ్మాయిపాలెం అధిక ఉష్ణోగ్రతలు అనుకూలం ఉషో్టగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఖర్జూరం సాగు చేసుకోవచ్చు. వేసవిలో వర్షాలు పడితే కాపు రాదు. బాపట్ల జిల్లాలో ఇప్పుడిప్పుడే కొంతమంది రైతులు ఖర్జూరం సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే మగ మొక్కల నుంచి పుప్పొడి సేకరించి, ఆడ మొక్కల పూతపై వేసే సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్లు అవసరం. లేకపోతే రైతే ఆ పని నేర్చుకోవాల్సి ఉంటుంది. వాతావరణం అనుకూలిస్తే ఖర్జూరం సాగులో మంచి లాభాలు వస్తాయి. – దీప్తి, అద్దంకి డివిజన్, ఉద్యానశాఖ అధికారి, బాపట్ల జిల్లా -
తీరంలో తనివితీరా!
సాక్షి ప్రతినిధి, బాపట్ల: సముద్రతీర ప్రాంతానికి పర్యాటకుల రద్దీ పెరిగింది. బాపట్ల జిల్లాలోని బాపట్ల సూర్యలంక, చీరాల రామాపురం, ఓడరేవు, పాండురంగాపురం బీచ్‌లను చూసేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. గతంతో పోలిస్తే సముద్ర తీరం చూసేవారి సంఖ్య మరింతగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి నిత్యం సందర్శకులు బీచ్‌లకు తరలివస్తున్నారు. వారాంతంలో సందర్శకుల సంఖ్య రెట్టింపునకు మించి ఉంటోంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడి బీచ్‌లకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విశాఖ, గోవా, చెన్నైలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రానికి బాపట్ల, చీరాల బీచ్‌లు మరింత దగ్గరగా ఉన్నాయి. రైల్వేతో పాటు ఇతర రవాణా సౌకర్యాలున్నాయి. సొంత వాహనాలే కాకుండా రైల్లో రావాలనుకునేవారికి మరింత అనుకూలంగా ఉంది. ఖర్చుకూడా తక్కువవుతుండటంతో ఇక్కడ సందర్శకుల తాకిడి పెరిగింది. వీకెండ్స్‌లో చీరాల, బాపట్ల తీరప్రాంతంలోని బీచ్‌లకు రోజుకు 50 వేలకు మించి సందర్శకులు వస్తున్నారు. మిగిలిన రోజుల్లోనూ 20 వేల మందికి తగ్గకుండా వస్తున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ, మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహ స్వామి, నరసరావుపేటలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి, బాపట్లలోని సుందరవల్లీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీరభావన్నారాయణస్వామి, పొన్నూరులోని శ్రీ ఆంజనేయస్వామి లాంటి ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఈ ప్రాంతంలో ఉండటంతో సందర్శకులు అటు దేవాలయాలను, ఇటు బీచ్‌లను చూసుకుని వెళుతున్నారు. పర్యాటకాభివృద్ధికి పెద్దపీట.. తీరంలో సందర్శకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం ఇక్కడ పర్యాటకాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. తీరప్రాంతానికి రోడ్లు వేసి రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపర్చింది. తీరప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో సొంతంగా రిసార్టుల నిర్మాణానికి సిద్ధమైంది. పెరిగిన రిసార్ట్లు బీచ్‌లకు సందర్శకులు పెరగడంతో అంతే స్థాయిలో ఇక్కడ రిసార్టులూ పెరుగుతున్నాయి. బాపట్ల సూర్యలంకలో 32 రూమ్‌లతో హరిత రిసార్ట్స్ హోటల్ ఉంది. అటవీశాఖ ఆధ్వర్యంలో ఎకో రిసార్ట్స్ ఏర్పాటు చేసింది. రోజూ 90 శాతం రూమ్‌లు ఫుల్ అవుతుండగా.. వీకెండ్స్‌లో వందశాతం నిండిపోతున్నాయి. గడిచిన నాలుగేళ్లలో రద్దీ 50 శాతానికి పైగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గతంలో నెలకు రూ.20 లక్షల వ్యాపారం జరగ్గా.. ఇప్పడది రూ.40 లక్షలకు పెరిగిందని హరిత రిసార్ట్స్ మేనేజర్ చెప్పారు. హరిత రిసార్ట్స్‌లో రోజుకు రూమ్‌రెంట్ రూ.2,500 నుంచి 4,500 వరకూ ఉంది. ఇక ఈ ప్రాంతంలో గోల్డెన్శాండ్, వీ.హోటల్ , సీబ్రీజ్, రివేరా తదితర పేర్లతో వందలాది రూమ్‌లతో కార్పొరేట్ స్థాయి ప్రైవేటు రిసార్ట్స్‌లు పెద్ద ఎత్తున వెలిశాయి. వీటిల్లో రోజుకు రూమ్‌రెంట్ రూ.10 వేల నుంచి 20 వేల వరకూ ఉంది. ఆన్లైన్ బుకింగ్స్‌తో ఇవి నిత్యం నిండిపోతున్నాయి. ఇక సాధారణ స్థాయిలో వందలాదిగా రిసార్ట్లు వెలిశాయి. వీటిల్లో రోజుకు రూమ్‌కు రూ.3 వేలకు పైనే రెంట్ ఉంది. చీరాల, బాపట్ల పట్టణాల్లోనూ ఇబ్బడి ముబ్బడిగా హోటళ్లు వెలిశాయి. బీచ్‌ల ఎఫెక్ట్‌తో అన్నీ నిత్యం రద్దీగా ఉంటున్నాయి. నాణ్యంగా ఫుడ్ ఉంటుందని పేరున్న హోటళ్లకు మరింత డిమాండ్ ఉంది. గోవా బీచ్ కన్నా బాగుంది సూర్యలంక బీచ్ గోవా బీచ్ కన్నా బాగుంది. ఇక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది. మొదటిసారి సూర్యలంక బీచ్‌కు వచ్చాం. మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోంది. బీచ్ పరిశుభ్రంగా ఉంది. సెక్యూరిటీ కూడా బాగుంది. – సాద్, అతీఫ్, అమాన్అలీ, నాసిద్.. హైదరాబాద్ ఖర్చు చాలా తక్కువ రైలు సౌకర్యం అందుబాటులో ఉండటంతో చీరాల, బాపట్ల బీచ్‌లకు రాగలుగుతున్నాం. ఖర్చు కూడా చాలా తక్కువగా అవుతోంది. బీచ్ చాలా బాగుంది. ప్రైవేటు రిసార్ట్‌లలో అద్దె చాలా ఎక్కువగా వసూలు చేస్తున్నారు. – నవీన్, ప్రభాకర్, అజయ్.. మిర్యాలగూడ మూడేళ్లుగా మరింత రద్దీ సూర్యలంక, చీరాల ప్రాంతంలోని బీచ్‌లకు సందర్శకులు పెరిగారు. మూడేళ్లుగా పర్యాటకుల రద్దీ మరింతగా పెరిగింది. సోమవారం నుంచి గురువారం వరకు 90 శాతం రూమ్‌లు బుక్ అవుతుండగా.. శుక్రవారం నుంచి ఆదివారం వరకు 100 శాతం బుక్ అవుతున్నాయి. హోటల్ వ్యాపారం మరింతగా వృద్ధి చెందింది. రద్దీ పెరగడం వల్లే ఈ ప్రాంతంలో రిసార్టులు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. – నాగభూషణం, మేనేజర్, హరిత రిసార్ట్స్ -
అమెరికాలో అద్దంకి వాసి మృతి.. కొడుకుని కాపాడి..
సాక్షి, బాపట్ల జిల్లా : ఉద్యోగ రీత్యా అమెరికాలో నివసిస్తున్న బాపట్ల జిల్లా అద్దంకి వాసి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన భారత కాలమానం ప్రకారం శనివారం జరిగింది. అందిన సమాచారం మేరకు పట్టణానికి చెందిన పొట్టి రాజేశ్ కుమార్(42) సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఫ్లోరిడాలో పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలసి బీచ్‌కు వెళ్లాడు. బీచ్‌లో స్నానం చేస్తున్న కుమారుడు మునిగిపోతుండటంతో నీళ్లలోకి వెళ్లి కుమారుడిని రక్షించి తాను ప్రమాదవశాత్తు నీళ్లలో మునిగి మృతిచెందాడు. ప్రజాప్రతినిధులు, అధికారులు మృతదేహాన్ని పట్టణానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
అక్కను వేధించవద్దన్నందుకు అమానుషం
చెరుకుపల్లి: తన అక్కను వేధించవద్దని చెప్పిన పదో తరగతి విద్యార్థిపై ఓ యువకుడు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ అమానుష ఘటన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజవోలు గ్రామ పరిధిలోని ఉప్పాలవారిపాలెంలో శుక్రవారం జరిగింది. బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ కథనం ప్రకారం... రాజవోలు గ్రామ పరిధిలోని ఉప్పాలపాలేనికి చెందిన ఉప్పాల మాధవి కుమారుడు ఉప్పాల అమర్నా«థ్ (15) ఉదయం ఐదు గంటల సమయంలో రాజవోలుకు సైకిల్‌పై ట్యూషన్‌కు వెళుతున్నాడు. ఆ సమయంలో రాజవోలు గ్రామానికి చెందిన పాము వెంకటేశ్వరరెడ్డి (వెంకీ), అతని స్నేహితులు మరో ముగ్గురు కలిసి అమర్నాథ్ను అడ్డగించి సైకిల్ లాక్కుని రోడ్డు పక్కన మొక్కజొన్న బస్తాలు వేసిన చోటుకు తీసుకువెళ్లి దాడి చేశారు. అనంతరం ముందుగానే తెచ్చుకున్న పెట్రోల్‌ను అమర్నాథ్పై పోసి నిప్పు అంటించి అక్కడ నుంచి పారిపోయారు. మంటలు రావటంతో సమీపంలోని గ్రామస్తులు గమనించి ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పి అమర్నాథ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మంటల్లో తీవ్రంగా గాయపడిన అతడిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. గతంలోనూ దాడి.. పదో తరగతి ఫెయిల్ అయి ఖాళీగా తిరుగుతున్న పాము వెంకటేశ్వరరెడ్డి (వెంకీ) కొంతకాలంగా అమర్నా«థ్ అక్కను టీజ్ చేస్తున్నాడు. దీంతో వెంకీ, అమర్నాథ్ మధ్య గొడవ జరిగింది. అమర్నా«థ్పై వెంకీ దాడి చేశాడు. ఈ విషయం వెంకీ కుటుంబ సభ్యుల దృష్టికి కూడా అమర్నాథ్ తరఫు పెద్దలు తీసుకెళ్లారు. పాఠశాలలకు సెలవులు రావడంతో వీరు కలవలేదు. తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో అమర్నా«థ్, ట్యూషన్, స్కూలుకు వెళుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల మార్గంమధ్యలో అమర్నాథ్ను వెంకీ అడ్డగించి బెదిరించటం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో వెంకీ తన స్నేహితులతో కలిసి శుక్రవారం అమర్నాథ్పై దాడి చేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. అమర్నాథ్ తండ్రి నాంచారయ్య గతంలోనే మరణించారు. అమర్నాథ్ తల్లి మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. -
చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం గుర్తురాదు
-
మత్స్యకారులకు మేలు కలిగేలా స్మార్ట్ కార్డుల జారీ
-
ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు గుర్తొస్తారు..
-
నిజాంపట్నంకు చేరుకున్న సీఎం జగన్
-
నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో చుక్కల భూములకు విముక్తి
సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో భారీ స్థాయిలో చుక్కల భూములకు ప్రభుత్వంవిముక్తి కల్పించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే 41,041 ఎకరాల భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించింది. బాపట్ల జిల్లాలో 5,776 ఎకరాలను ఈ జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ శనివారం వేర్వేరు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేశారు. చుక్కల భూములకు విముక్తి కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమోటో వెరిఫికేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ సుమోటో వెరిఫికేషన్ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా ఆ జిల్లాలో 41,041 ఎకరాల చుక్కల భూములను 1908 రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఎ(1)ఇ నుంచి తొలగించారు. ఇవి కాకుండా సెక్షన్ 22ఎ(1)ఇ లోనే ఉన్న 13,883 ఎకరాలను 22ఎ(1)ఎ లోకి, 14,133 ఎకరాలను 22ఎ(1)బి లోకి, 751 ఎకరాలను 22ఎ(1)సి లోకి, 62 ఎకరాలను 22ఎ(1) డి లోకి మార్చారు. కేవలం 10 సెంట్లను మాత్రమే 22ఎ(1)ఇ లో కొనసాగిస్తున్నారు. అలాగే, బాపట్ల జిల్లాలో 5,776 ఎకరాల చుక్కల భూములను 22ఎ(1)ఇ నుంచి తొలగించారు. ఇవి కాకుండా సెక్షన్ 22ఎ(1)ఇలోనే ఉన్న 1,080 ఎకరాలను 22ఎ(1)ఎ లోకి, 89 ఎకరాలను 22ఎ(1)బి లోకి, 858 ఎకరాలను 22ఎ(1)సి లోకి మార్చారు. 13,461 ఎకరాలను మాత్రం 22ఎ(1)ఇ లోనే ఉంచారు. ఇప్పటికే పలు జిల్లాల్లో చుక్కల భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయగా, తాజాగా ఈ రెండు జిల్లాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఎప్పుడూ లేని విధంగా 15 జిల్లాల్లో ఒకేసారి 2.06 లక్షల ఎకరాలను చుక్కల భూముల నుంచి తొలగించడం ద్వారా లక్ష మంది రైతులకు ప్రభుత్వం మేలు చేకూరుస్తోంది. -
చిరకాల వాంఛ నెరవేరింది
బాపట్ల: బాపట్ల జిల్లా ఆవిర్భావ వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేళ తాళాలు, కోలాట నృత్యాలు, నెమలి నృత్య ప్రదర్శన, డప్పు కళాకారులు, వాయిద్య కళాకారుల ప్రదర్శనలు పట్టణ ప్రజలను అబ్బురపరిచాయి. రథంబజారులోని భావనారాయణస్వామి దేవాలయం వద్ద నిర్వహించిన సంబరాలకు అశేష జనం హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ కె.విజయకృష్ణన్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి కుటుంబ సమేతంగా భావనారాయణస్వామికి పొంగలి నివేదించారు. ముందుగా కుంభమేళాతో దేవాలయానికి చేరుకున్నారు. అనంతరం జిల్లా అధికారులను ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులను అధికారులు సత్కరించారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్, అంబేద్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. బాపట్ల జిల్లా ఏర్పాటుతో ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. నిజాంపట్నం పోర్టు రెండవ దశ విస్తరణ, అభివృద్ధి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. చీరాల ఓడరేవు నిర్మాణం, తీర ప్రాంతాల అభివృద్ధితో జిల్లా పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకోనుందని వివరించారు. అభివృద్ధికి అవసరమైన సహజ వనరులన్నీ జిల్లాలో పుష్కలంగా ఉన్నాయని అభివర్ణించారు. జిల్లా ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నా రు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ పేదరికంలో ఉన్న వారిని స్థితిమంతులుగా చేయడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఒకసారి ప్రజలకు ఏదైనా మాట ఇస్తే ముఖ్యమంత్రి జగన్ మరిచిపోరని అన్నారు. ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ బాపట్ల జిల్లా అభివృద్ధి వైపు ముందుకు సాగుతోందని అన్నారు. బాపట్లకు త్వరలో కొత్తగా రైల్వేలైన్ రానుందన్నారు. ప్రజల ఆకాంక్షలు, కలలు సాకారం అయ్యాయని, ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. జిల్లా ఆవిర్భావం అనంతరం జిల్లా యంత్రాంగం చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ కె.విజయకృష్ణన్ మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేస్తే బాపట్ల జిల్లా మరింత పురోభివృద్ధిలో పయనిస్తుందని అన్నారు. ప్రజలకు సేవలందించడం, మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు చేసిన కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ శాంతిభద్రతలకు ఎలాంటి విఘా తం కలగకుండా ప్రజలంతా సహకరించారని అన్నారు. ప్రజలు ప్రశాంతంగా జీవించే వాతావరణ కల్పించడానికి పోలీసు యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందన్నారు. జేసీ డాక్టర్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ చుక్కల భూముల కింద తొమ్మిది వేల ఎకరాల భూములను గుర్తించి హక్కుదారులకు పూర్తి హక్కులు కల్పించేలా నిషేధిత భూముల జాబితాలో నుంచి తొలగించా మని తెలిపారు. చీరాల–చిలకలూరిపేట, నిజాంపట్నం–బుడంపాడు వరకు రెండు జాతీయ రహదారులు జిల్లాకు వస్తున్నాయని చెప్పారు. జిల్లా అభివృద్ధిలో అధికారులు, ప్రజాప్రతితులు అందించిన సహకారం మరువలేనిదన్నారు. అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన గరటయ్య, చీరాల నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్‌బాబు, బుడా చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు, బుడా వైస్‌చైర్మన్ ఏ.భానుప్రతాప్, జిల్లా రెవెన్యూ అధికారి కె లక్ష్మీ శివజ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
అమెరికా వెళ్లిన ఏడు నెలలకే..
మార్టూరు: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి ఏడు నెలలకే అనుమానాస్పదస్థితిలో అర్ధంతరంగా తనువు చాలించాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి గ్రామానికి చెందిన గోవాడ రమేష్ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు గోవాడ నాగసాయి గోపి అరుణ్ కుమార్ (22) ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ చదవడం కోసం గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లాడు. లాంనార్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతూ టెక్స్‌పోర్టన్ ఏరియాలో ఐదుగురు స్నేహితులతో కలిసి నివాసం ఉంటుండగా, వారితో ఒక యువతి కూడా ఉంటోంది. ఈ క్రమంలో మార్చి 1న అరుణ్ కుమార్ స్నేహితులకు కనిపించకుండా పోవడంతో గదిలోని స్నేహితురాలి ఫిర్యాదు మేరకు అమెరికా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు మార్చి 3వ తేదీన అరుణ్‌కుమార్ మృతదేహాన్ని వారి నివాసానికి సమీపంలో ఓ నీటి సరస్సులో గుర్తించి స్నేహితులకు, ఇండియాలోని తండ్రి రమేష్‌కు సమాచారం అందించారు. శవ పరీక్ష అనంతరం అరుణ్‌కుమార్ మృతదేహాన్ని అతని స్నేహితులు స్వంత ఖర్చులతో ఇండియా పంపగా.. శనివారం మధ్యాహ్నం స్వగ్రామం జొన్నతాళి చేరింది. పోస్టుమార్టం నివేదిక వస్తేనే కానీ అరుణ్‌కుమార్ మృతికి కారణం తెలియదని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి తమ కుటుంబాన్ని ఆదుకుంటాడని ఆశించి అమెరికా పంపిస్తే శవమై తిరిగి వస్తాడని ఊహించలేదంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు వర్ణనాతీతం. సాయంత్రం గ్రామంలో అరుణ్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. -
బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఘోర రోడ్డు ప్రమాదం
-
బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అద్దంకి ఎస్ఐ భార్య, కూతురు మృతి
సాక్షి, బాపట్ల జిల్లా: మేదరమెట్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో అద్దంకి ఎస్సై సమంధర్ వలి భార్య కూతురు కూడా ఉన్నారు. చిన్నగంజాం లో తిరుణాలకు డ్యూటీకి వెళ్లిన ఎస్సై సమందర్ వలి, తన భార్య కూతురుతో పాటు, పక్కింటి మరో ఇద్దరిని కూడా తీసుకెళ్లారు. శివాలయంలో దర్శనం ముగించుకున్న తర్వాత డ్రైవర్ని ఇచ్చి కుటుంబ సభ్యులను అద్దంకి ఇంటికి పంపించారు. అయితే తిరుగు ప్రయాణంలో మేదరమెట్ల జాతీయ రహదారిపై రాగానే డ్రైవర్ కునుకు తీయడంతో ఒకసారిగా కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారు పల్టీ కొట్టి అవతలి రోడ్డుపై పడిపోవడంతో అటుగా వచ్చిన లారీ కారుని ఢీకొంది. దీంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వహీదా(39) ఆయేషా(9) గుర్రాల జయశ్రీ (50) గుర్రాల దివ్య తేజ(27), డ్రైవర్ బ్రహ్మచారిగా గుర్తించారు. డ్రైవర్ చేసిన తప్పిదం వల్ల ఐదుగురు నిండు ప్రాణాలు బలయ్యాయి.. తన భార్యతో పాటు తన 9 ఏళ్ల కూతురు ప్రమాదంలో చనిపోవడంతో అద్దంకి ఎస్ఐ సమందర్ వలి బోరున వినిపిస్తున్నారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు చాలా సేపు శ్రమించాల్సి వచ్చింది. మృతదేహాలను అద్దంకి మార్చురీకి తరలించారు. -
బాపట్లలో విషాదం: చెట్టు మీదే ప్రాణం విడిచిన చిన్నారి
సాక్షి, బాపట్ల: జిల్లాలో ఆదివారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. కొరిశపాడు మండలం దైవాల రావూరులో ఆటాడుకుంటూ విద్యుత్ తీగలు తగిలి ఓ చిన్నారి చెట్టు మీదే కన్నుమూశాడు. మరో చిన్నారి ఈ ఘటనలో గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఆదివారం కావటంతో.. స్థానికంగా ఉన్న సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న చెట్టు మీద ఎక్కి ఆడుకుంటున్నారు. ఈ తరుణంలో.. చెట్టు మధ్యలో ఉన్న కరెంటు తీగలు గమనించక ముందుకు వెళ్లారు. దీంతో విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు ఓ చిన్నారి. ఇక మరో చిన్నారి కరెంట్ షాక్ దెబ్బకు కింద పడిపోయి గాయాలపాలయ్యాడు. మృతి చెందిన చిన్నారి గడ్డం బుజ్జి కుమారుడు అఖిల్ గా స్థానికులు గుర్తించారు. మరొక బాలుడిని చికిత్స నిమిత్తం మేదరమెట్ల లోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రాణం విడిచి చెట్టు మీదే పడి ఉన్న చిన్నారి అఖిల్ మృతదేహం చూసి గ్రామస్తులంతా విలపించారు. -
హైవేపై విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ట్రయల్ రన్ సక్సెస్
మేదరమెట్ల(బాపట్ల జిల్లా): కొరిశపాడులోని పి.గుడిపాడు సమీపంలో జాతీయ రహదారిపై విమాన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ట్రయల్ రన్ నిర్వహించారు. జె.పంగులూరు మండలంలోని రేణింగివరం నుంచి కొరిశపాడు వరకు ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏర్పాటు చేశారు. ట్రయల్ రన్ కారణంగా గురువారం ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు ఒంగోలు వైపు నుంచి వచ్చే వాహనాలు అద్దంకి వైపునకు.. గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు రేణింగివరం వద్ద నుంచి అద్దంకి వైపునకు మళ్లించారు. ట్రయల్ రన్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సీఐ రోశయ్య, భారత వైమానికి దళం గ్రూప్ కెప్టెన్ ఆర్.ఎస్. చౌదరి, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మేదరమెట్ల, కొరిశపాడు ఎస్ఐలు శివకుమార్, వెంకటేశ్వరరావు, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: గుడివాడపైనే గురెందుకు? రెచ్చగొడుతున్నదెవరు? -
16 జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ ఎయిర్ ల్యాండింగ్ స్ట్రిప్
-
థాంక్యూ.. సీఎం జగన్ మామయ్య (ఫొటోలు)
-
బాపట్ల : సీఎం జగన్ చేతుల మీదుగా ట్యాబ్‌ల పంపిణీ (ఫొటోలు)
-
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టాం : సీఎం జగన్
-
పెత్తందారుల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదవాలా?: సీఎం జగన్
సాక్షి, బాపట్ల జిల్లా: పెత్తందారీ భావజాలం చూస్తుంటే బాధనిపిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. యడ్లపల్లిలో ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కొందరు పెత్తందారులు తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తుంటే కోర్టులకు వెళతారు’’అని అన్నారు. నా పుట్టినరోజు గురించి కాదు.. పుట్టిన బిడ్డ గురించి ఆలోచన చేస్తున్నానన్నారు. ‘‘ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి స్వీకారం చుట్టబోతున్నాం. ఆర్థిక స్థోమత వల్ల పిల్లలను చదివించుకోలేని తల్లిదండ్రుల బాధలను చూశా. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం. పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టాం. సమాజంలో ఉన్న అంతరాలు తొలగాలి. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య అందకూడదనే పెత్తందారీ భావజాలం చూసి బాధ వేసింది. విద్యార్థులకు అందించే చదువులో సమానత్వం ఉండాలి. మంచి విద్యా విధానంతో పిల్లల తలరాతలు మారతాయి. భావి తరాల పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. చదువులో సమానత్వం ఉంటేనే ప్రతి కుటుంబం అభివృద్ధి’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు దాదాపు 8 భాషల్లో పాఠ్యాంశాలు ఉంటాయి. పిల్లలకు మరింత సులువుగా పాఠాలు అర్థమయ్యేలా ట్యాబ్‌లు అందిస్తున్నాం. క్లాస్ టీచర్ చెప్పే పాఠశాలకు ఈ ట్యాబ్‌లు సపోర్ట్‌గా ఉంటాయి. పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో పేద తల్లిదండ్రుల కష్టాలను చూశాను. మూడున్నరేళ్లలో ఎక్కడా వెనకడుగు వేయలేదు’’ అని సీఎం అన్నారు. ‘‘పిల్లలకు నష్టం జరిగే కంటెంట్‌ను ట్యాబ్‌ల్లో తొలగించాం. విద్యార్థులకు ఇచ్చే ఒక్కో ట్యాబ్‌లో బైజూస్ కంటెంట్ విలువ రూ.32 వేలు.ట్యాబ్‌ల్లో బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి అందిస్తున్నాం.రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్‌లను ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. నెట్‌తో సంబంధం లేకుండా పాఠ్యాంశాలు చూసే వెసులుబాటు కల్పించాం’’ అని సీఎం పేర్కొన్నారు. చదవండి: క్యాంప్ కార్యాలయంలో బర్త్‌డే వేడుకలు.. కేక్ కట్ చేసిన సీఎం జగన్ ‘‘నా పుట్టిన రోజు నాడు నాకెంతో ఇష్టమైన చిన్నారుల భవిష్యత్తు కోసం చేస్తున్న మంచి కార్యక్రమంలో పలు పంచుకోవడం దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. మన పిల్లలు అంటే.. మన తర్వాత కూడా ఉండే మనం. పిల్లలు బాగుండాలని తమకన్నా కూడా బాగా ఎదగాలని, తమకన్నా మంచిపేరు ఇంకా తెచ్చుకోవాలని, ప్రతి తల్లీదండ్రీకూడా మనసారా కూడా కోరుకుంటారు. అలా కోరుకునే అనేక హృదయాలు రకరకాల కారణాల వల్ల అంటే తమ కులం వల్లనో, ఆర్థిక స్తోమత కారణంగానో సరిగ్గా చదివించుకోలేకపోతున్నామని వారు భావించినప్పుడు వారి మనస్సులు తల్లిడిల్లిపోతాయి. దీన్ని స్వయంగా నేను చూశాను.’’ అని సీఎం అన్నారు. -
తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం: సీఎం జగన్
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టడంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రస్థాయి కార్యక్రమానికి బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలోని ఆలపాటి వెంకట రామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాల బుధవారం వేదికైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివ్య హస్తాల మీదుగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజుస్ కంటెంట్‌తో ఉన్న ట్యాబ్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి స్వీకారం చుట్టబోతున్నాం. ఆర్థిక స్థోమత వల్ల పిల్లలను చదివించుకోలేని తల్లిదండ్రుల బాధలను చూశా. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం. పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టాం. సమాజంలో ఉన్న అంతరాలు తొలగాలి. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య అందకూడదనే పెత్తందారీ భావజాలం చూసి బాధ వేసింది. విద్యార్థులకు అందించే చదువులో సమానత్వం ఉండాలి. మంచి విద్యా విధానంతో పిల్లల తలరాతలు మారతాయి. భావి తరాల పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. చదువులో సమానత్వం ఉంటేనే ప్రతి కుటుంబం అభివృద్ధి అని సీఎం జగన్ పేర్కొన్నారు. 'ట్యాబ్‌లలలో బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి అందిస్తున్నాం. రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. నెట్‌తో సంబంధం లేకుండా పాఠ్యాంశాలు చూసే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఏటా 8వ తరగతిలోకి వచ్చిన విద్యార్థులందరికీ ట్యాబ్‌లు అందిస్తాం. ట్యాబ్‌ల ద్వారా విద్యార్థులకు సులువుగా పాఠాలు అర్థమవుతాయి. అందుకు అనుగుణంగానే కంటెంట్ ఉంటుంది' అని సీఎం జగన్ తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ రోజు రాష్ట్ర విద్యారంగంలోనే విప్లవాత్మకమైన రోజు. విద్యారంగంలో సీఎం జగన్ కొత్తశకానికి నాంది పలికారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. విద్యారంగానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలనేదే సీఎం జగన్ లక్ష్యం. ప్రపంచంతో పోటీపడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలనేదే సీఎం ఆకాంక్ష అని అన్నారు. 12:10AM ►ట్యాబ్‌లలో బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి అందిస్తున్న ఏపీ ప్రభుత్వం ►రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్‌లు ఉచిత పంపిణీ ►నెట్‌తో సంబంధం లేకుండా పాఠ్యాంశాలు చూసూ వెసులుబాటు ►బైజూస్ లెర్నింగ్ యాప్‌తో లెక్కలు, ఫిజిక్స్, జువాలజీ, బయాలజీ, జియాలజీ, సివిక్స్, హిస్టరీ పాఠ్యాంశాలు ►తెలుగు ఇంగ్లీష్ హిందీతో పాటు దాదాపు 8 భాషల్లో పాఠ్యాంశాలు ►విద్యార్థులకు అర్థమయ్యేలా సుమారు 2 నుంచి 4 నిమిషాల నిడివితో యానిమేషన్, వీడియోల రూపంలో పాఠ్యాంశాలు ►బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్‌లో మొత్తం 57 చాప్టర్లు్ల, 300 వీడియోలు ►ట్యాబ్‌లపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇప్పటికే ఐటీ విభాగం అవగాహన 12:07AM ►రాష్ట్ర వ్యాప్తంగా 5,18,740 ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ►4,59,564 మంది విద్యార్థులు.. 59,176 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు ►రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులపాటు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం ►నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా 9,703 స్కూళ్లలో బ్యాబ్‌ల పంపిణీ 12:03AM బాపట్ల: యడ్లపల్లి బహిరంగ సభా వేదికపై సీఎం జగన్ ►కాసేపట్లో జడ్పీ హైస్కూల్ 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్న సీఎం జగన్ 11:30AM సీఎం జగన్‌కు ఘనస్వాగతం యడ్లపల్లిలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. దారిపొడవునా పూలు జల్లుతూ హారతులు పడుతూ పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. జన హృదయ విజేత.. నవరత్నాలు పొదిగిన సంక్షేమ సార్వభౌమ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం బాపట్ల జిల్లాకు రానున్నారు. భావి పౌరుల బంగారు భవితకు బాటలు వేసే బృహత్తర కార్యక్రమానికి తన పుట్టిన రోజున శ్రీకారం చుట్టనున్నారు. విద్యాంధ్ర సాధనకు శంఖారావం పూరించనున్నారు. జయీభవ.. ‘విద్య’యీభవ అంటూ విద్యార్థులను దీవించనున్నారు. వరాల రేడు పర్యటన నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు ఆనందభరితులవుతున్నారు. స్వాగతం.. సుస్వాగతం అంటూ జననేతకు జేజేలు పలుకుతున్నారు. సాక్షి, నరసరావుపేట/వేమూరు: ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టడంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రస్థాయి కార్యక్రమానికి బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలోని ఆలపాటి వెంకట రామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాల బుధవారం వేదికవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివ్య హస్తాల మీదుగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజుస్ కంటెంట్‌తో ఉన్న ట్యాబ్‌ల పంపిణీ కోసం సుందరంగా ముస్తాబై వేచిచూస్తోంది. దీనికోసం జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లనూ పూర్తిచేసింది. మంత్రి మేరుగ నాగార్జున, కలెక్టర్ విజయకృష్ణన్, ఉన్నతాధికారులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బాపట్ల జిల్లాగా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రెండోసారి జిల్లాకు వస్తున్నారు. అదీ తన పుట్టిన రోజున జననేత జిల్లాలో పర్యటించనుండడం విశేషం. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పారీ్టశ్రేణులు, ప్రజలు జననేత రాక కోసం ఉత్సాహంగా నిరీక్షిస్తున్నారు. పటిష్ట బందోబస్తు.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు చేపట్టింది. ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం యడ్లపల్లిలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఒక అదనపు ఎస్పీ, ఏడుగురు డీఎస్పీలు, 30 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 50 మంది మహిళా కానిస్టేబుళ్లు, మరో 890 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో కలిపి మొత్తం 1,050 మంది సిబ్బందితో కట్టుదిట్ట చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.మహేష్, డీఎస్పీలు టి.మురళీకృష్ణ, ఎ.శ్రీనివాసరావు, పి.శ్రీకాంత్, ఏఆర్ డీఎస్పీ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ఆనందంగా ఉంది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు మనందరికీ పండుగ రోజు. అటువంటి రోజున ఆయన నా నియోజకవర్గంలో పర్యటించడం సంతోషంగా ఉంది. పేదింటి పిల్లల తలరాతలు మార్చే విద్యకు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమానికి బాపట్ల జిల్లాను ఎంచుకున్నందుకు సీఎంకు ధన్యవాదాలు. – మేరుగ నాగార్జున, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
మేనమామ సీఎం జగన్‌కు చిన్నారుల ప్రత్యేక శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం, యడ్లపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం బుధవారం ముఖ్యమంత్రి చేతుల మీదగా జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం చేతుల మీదుగా ట్యాబ్‌లు అందుకునేందుకు యడ్లపల్లికి వెళ్తున్న విద్యార్థులు.. తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న మేనమామ సీఎం వైఎస్ జగన్‌కు పేపర్లపై కార్టూన్లు వేసి మరీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే జగన్ మామయ్య అంటూ నినాదాలతో సీఎంకు విషెస్ తెలిపారు. చదవండి: సీఎం జగన్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు -
బాపట్ల: జగనన్న 175/175.. ఆకట్టుకున్న వరి కోత
సాక్షి, బాపట్ల: జననేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా అభిమానం వెల్లువెత్తుతోంది. ఇదిలా ఉంటే.. గత మూడేళ్లుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజుకి తన అభిమానాన్ని డిఫరెంట్‌గా కనబరిచే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకటరెడ్డి.. మరోసారి ప్రత్యేకతను చూపించారు. చుండూరు మండలం వలివేరు పంట పొలాలలో వైఎస్ జగన్ 175/175 సీట్లు లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ.. వరి కోత ప్రదర్శించారు. ఇదిలా ఉంటే.. మొదటి సంవత్సరం బాపట్ల బీచ్ లో ఇసుకతో జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని చేయించారు తర్వాత సంవత్సరం జై జగనన్న వరికొత్తతో కోయించారు తర్వాత సంవత్సరం రావిఆకు మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో గియించారు. ఇక ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి 175/175 సీట్ల లక్ష్యం సాధించాలని 175/175 జగనన్న అని వరి కోతతో కోయించి తన అభిమానాన్ని మరో సారి చాటుకున్నారు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మేరుగు నాగార్జున, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకటరెడ్డి పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొని కేక్ నీ కట్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటూ వెంకటరెడ్డికి అభినందనలు తెలిపారు మంత్రి మేరుగు. -
బాపట్ల జిల్లా యడ్లపల్లిలో పర్యటించనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటించనున్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పర్యటన వివరాలు.. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. 11.00 నుంచి 1.00 వరకు 8 వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. చదవండి: (AP CM YS Jagan: ఒకే ఒక్కడై విజేతగా.. జగన్ అంటే సాహసం) -
Bapatla District: పారిశ్రామికాభివృద్ధికి అడుగులు
సాక్షి, బాపట్ల: జిల్లాలో తీర ప్రాంతం విస్తరించి ఉండడంతో అటు పర్యాటకం, ఇటు పారిశ్రామికంగా అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం సరికొత్త అవకాశాలు కల్పిస్తూ, ప్రోత్సహిస్తుంది. నూతనంగా ఏర్పడ్డ బాపట్ల జిల్లాలో 74 కిలోమీటర్ల తీర ప్రాంతం విస్తరించి ఉంది. సూర్యలంక, పాండురంగాపురం, రామచంద్రాపురం, ఓడరేవు, కృపానగర్, అడవిపల్లెపాలెం బీచ్‌లు పర్యాటకానికి అనువుగా ఉండడంతో తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది పర్యాటకులు వచ్చి సంతోషంగా గడిపి వెళ్తున్నారు. తీరంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తుండడంతో స్టార్ హోటళ్లను తలదన్నేలా రిసార్ట్స్ వెలుస్తున్నాయి. అతిథ్య రంగం కూడా పుంజుకుంటుంది. తీర ప్రాంతం వెంబడి రొయ్యలు, చేపల సాగు విస్తృతంగా చేస్తుండడంతో ఆక్వా పరంగా రొయ్యల హేచరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు ఐదు ప్రాసెసింగ్ యూనిట్లతోపాటు మరో 18 హేచరీలు ఉన్నాయి. ఆయా యూనిట్లలో వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్, చీరాల పరిధిలోని ఓడరేవు హార్బర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు రూ.750 కోట్ల వ్యయంతో పనులు చేస్తున్న ఆ ప్రాజెక్టులు పూర్తయితే అనుబంధంగా మరెన్నో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ► తాజాగా కేరళకు చెందిన టెడ్ఎక్స్ ఛాయిస్ గ్రూప్ విద్యారంగంలో ఎన్నో విజయాలు సాధించిన ఆ సంస్థ జిల్లాలోని తీర ప్రాంతంలో ఆక్వా రంగంలోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. తీరం వెంబడి ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దాదాపు రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఆ ప్రాజెక్టు డీపీఆర్ కూడా పూర్తిచేసి అనుమతులు కోసం పంపారు. త్వరలోనే ఆ ప్రాజెక్టు రూపకల్పన జరగనుంది. ► క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పిస్తున్నాయి. 80 శాతం కేంద్రం, 15 శాతం రాష్ట్రం, 5 శాతం లబ్ధిదారులు వాటాగా ఇస్తూ పరిశ్రమల స్థాపనకు అవకాశాలు కల్పిస్తోంది. దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధానం అమలులో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంండడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. బాపట్లలో భావపురి రైస్ క్లస్టర్ పౌండేషన్ ద్వారా రూ.10 కోట్ల వ్యయంతో ధాన్యం ఆరబెట్టే మిషనరీతోపాటు ఫోర్టిఫైడ్ బియ్యం తయారీ మిషనరీ ఏర్పాటు చేశారు. ► ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ద్వారా కూడా జిల్లాకు 104 ప్రాజెక్టులకుగాను రూ.30.60 కోట్లు మంజూరయ్యాయి. ఆ పథకానికి ఇప్పటికే 80 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 32 మందికి రూ.94.50 లక్షలు మంజూరయ్యాయి. ఇందులో 15 గ్రౌండింగ్ అయ్యాయి ► చీరాల పరిధిలోనే ఈపూరుపాలెం వద్ద ఏపీఐఐసీ ద్వారా ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 44.57 ఎకరాల్లో లే–అవుట్ వేసి అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది. స్మాల్ ఇండస్ట్రీయల్తో ఎంతో మందికి ఉపాధి లభించనున్నది. ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహమిస్తుంది. ఇప్పటికే జిల్లాలో పారిశ్రామికంగా అడుగులు పడుతున్నాయి. తీరంలో ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కానున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన పథకాలు పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడనున్నాయి. – ఎన్ మదన్మెహన్, పరిశ్రమల శాఖ జీఎం, బాపట్ల -
పెళ్లీడుకొచ్చిన కొడుకు, కూతురు ఉన్నా... హసీనాతో ప్రేమ పాఠాలు
చిన్నతనంలోనే వివాహం.. ఐదేళ్లు గడిచేలోపే ఇద్దరు పిల్లలు.. అంతలోనే భర్త వేధింపులు.. ఇదే సమయంలో మరో వ్యక్తి ఫేస్బుక్లో పరిచయం. అతని మాయమాటలు నమ్మి తప్పటడుగులు.. తల్లిదండ్రులు మందలించడంతో బలవన్మరణం. వందేళ్ల జీవితాన్ని 25 ఏళ్లకే ముగింపు పలికిన దొర్నిపాడు మండల కేంద్రానికి చెందిన హసీనా గాథ ఇది. సాక్షి, నంద్యాల(దొర్నిపాడు): మండల కేంద్రం దొర్నిపాడుకు చెందిన దూదేకుల బాషా.. తన కూతురు హసీనా(25) తొమ్మిదో తరగతి చదువుతుండగానే వైఎస్సార్ జిల్లా పెద్ద ముడియం మండలం జంగాలపల్లె గ్రామానికి చెందిన బాబయ్యకు ఇచ్చి గతంలో వివాహం చేశాడు. అయితే కొంతకాలానికే భర్త వేధింపులు మొదలయ్యాయి. మానసిక పరిస్థితి సరిగాలేక చీటికిమాటికీ కొడుతుండటం, కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతుండటంతో మొదట్లో హసీనా సర్దుకుపోయింది. అంతలోనే ఇద్దరు కుమారులు బషీద్, బాలదస్తగిరి జన్మించారు. అయినా భర్త తీరులో మార్పు రాకపోవడంతో పాటు వేధింపులు ఎక్కువ కావడంతో ఐదేళ్ల క్రితం పిల్లలను తీసుకుని పుట్టినింటికి వచ్చేసింది. పొలం పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. 55 ఏళ్ల వక్తితో ఫేస్బుక్ పరిచయం.. ఐదు నెలల క్రితం బాపట్ల జిల్లా నర్సాయపాలెం గ్రామానికి చెందిన 55 ఏళ్ల వయసున్న భూషణం ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. అతనికి పెళ్లీడుకొచ్చిన కుమారుడు, కూతురు ఉన్నా... హసీనాకు తియ్యని ప్రేమపాఠాలు చెప్పాడు. కష్టాల్లో ఉన్న ఆమెకు.. అతని మాటలు సాంత్వన చేకూర్చేలా ఉండటంతో దగ్గర కావడానికి ఎంతో సమయం పట్టలేదు. అక్టోబర్ 31న అతనితో కలిసి చిన్న కుమారుడిని తీసుకొని బాపట్లకు వెళ్లిపోయి అక్కడ కాపురం పెట్టారు. కాగా తన కూతురు, మనవడు కనిపించకపోయే సరికి ఆందోళన చెందిన బాషా పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు వారి ఆచూకీ గుర్తించి గురువారం సాయంత్రం దొర్నిపాడు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ భూషణం మాటమార్చినట్లు సమాచారం. తనకు ఎలాంటి సంబంధం లేదని, అందరిలాగే హసీనాతోనూ చాటింగ్ చేశానని చెప్పడం, తల్లిదండ్రులు మందలించడంతో ఆమె అవమానంగా భావించి శుక్రవారం తెల్లవారు జామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ తిరుపాల్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తన కూతురి ఆత్మహత్యకు కారకుడైన భూషణంను కఠినంగా శిక్షించాలని మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. కాగా తండ్రి వదిలేయడం, తల్లి బలవన్మరణం చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. -
Vetapalem: బండ్ల బాపయ్య విద్యాసంస్థకు వందేళ్లు
వేటపాలెం (బాపట్ల జిల్లా): వేటపాలెం బండ్ల బాపయ్య విద్యాసంస్థ వందేళ్లు పూర్తిచేసుకుంది. ఈ బడిని 1921 నవంబర్ 4న బండ్ల బాపయ్య శెట్టి హిందూ మాధ్యమిక పాఠశాల పేరుతో నెలకొల్పారు. దీనికి ఐదెకరాల స్థలం కేటాయించి అందులో శాశ్వత భవనం నిర్మించారు. దీనికి అప్పట్లో ప్రభుత్వం రూ.12,457 గ్రాంటు కూడా మంజూరు చేసింది. అప్పటి నుంచి పాఠశాల దినదినాభివృద్ధి చెందింది. బడికి అనుబంధంగా 1946లో హైస్కూలు, 1961లో హయ్యర్ సెకండరీ స్కూల్, 1969లో జూనియర్ కళాశాల, 1981లో డిగ్రీ కళాశాల ఏర్పాటయ్యాయి. ఈ పాఠశాలలోని ఒక భాగంలో కొంత కాలం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల శిక్షణ తరగతులూ నిర్వహించారు. 400 మంది ఉపాధ్యాయులు ఇక్కడ శిక్షణ పొందారు. పూర్వం ఈ పాఠశాలను అందరూ ఇంగ్లిషు బడి అని పిలిచేవారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి ఎందరో విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. ఇక్కడ చదువుకున్న ఎందరో ఉన్నతస్థానాలు అధిరోహించారు. విదేశాల్లోనూ ఉన్నత స్థితికి చేరారు. చేయూతగా రాధాకృష్ణయ్య హాస్టల్ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్నం భోజనం పథకం తరహాలో ఈ పాఠశాలలో స్వాతంత్య్రం రాక పూర్వం నుంచి విద్యార్థులకు భోజనం పెట్టేవారు. గొల్లపూడి రాధాకృష్ణయ్య ఈ విధానానికి నాంది పలికారు. 1933లో పాఠశాలకు అనుసంధానంగా ఉచిత భోజన హాస్టల్ ఏర్పాటు చేశారు. ఇది ఇప్పటికీ రాధాకృష్ణయ్య వారసుల ఆధ్వర్యంలో నిర్విరామంగా కొనసాగుతుండడం విశేషం. నవంబర్‌లో శతజయంత్యుత్సవాలు బండ్ల బాపయ్య విద్యా సంస్థ నెలకొల్పి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా శత జయంత్యుత్సవాలు అంగరంగ వైభవంగా జరపనున్నారు. దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు, కాలేజీలో చదివి వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వవిద్యార్థులు పాల్గొననున్నారు. ఇంగ్లిష్ బాగా చెప్పేవారు నేను 1971–73లో వేటపాలెం బండ్ల బాపయ్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ చదివాను. అప్పట్లోనే అధ్యాపకులు ఇంగ్లిషు బోధించారు. అందువల్ల నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఇంగ్లిష్‌లో ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. గొల్లపూడి రాధాకృష్ణయ్య హాస్టల్లో మధ్యాహ్న భోజనం చేసేవాడిని. అది నా అదృష్టం. – డాక్టర్ సజ్జా లోకేశ్వరరావు, గుండె శస్త్ర చికిత్స నిపుణుడు, స్టార్ హాస్పిటల్, హైదరాబాద్ ఉపాధ్యాయ వృత్తికి పునాది ఇక్కడే ఈ పాఠశాలలో ప్రవేశానికి ఎంట్రన్స్ నిర్వహించేవారు. 1940లో 4వ తరగతిలో ప్రవేశానికి పరీక్ష రాశాను. పాసై బడిలో చేరాను. మా తల్లిదండ్రులు ఇంగ్లిష్ బడిలో చదువుతున్నానని గొప్పగా చెప్పుకునేవారు. ఈ విద్యా సంస్థల్లోనే విద్యనభ్యసించి, 37 ఏళ్లపాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాను. విద్యా సంస్థల్లో చదువుకున్న ఎందరో ఉన్నత పదవుల్లో ఉన్నారు. – లొల్లా శ్రీరాం మూర్తి, విశ్రాత ప్రధానోపాధ్యాయుడు -
ఆ ముగ్గురు కూడా మృత్యువాతే!
సాక్షి, బాపట్ల: బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో స్నానాలు చేస్తూ ఈ నెల 4న ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఆరుగురు విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. అదే రోజు మూడు మృతదేహాలు లభ్యంకాగా, మిగిలిన మూడు మృతదేహాలు బుధవారం తీరానికి కొట్టుకువచ్చాయి. ఓడరేపు బీచ్‌లో లభ్యమైన నల్లపు రాఘవ(18), సర్వసిద్ధి వెంకట ఫణికుమార్ (19), జక్కంపూడి ప్రభుదాస్ (17) మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (కానిస్టేబుల్‌తో ఎస్సై ప్రేమాయణం.. పెళ్లి చేసుకొని..) -
Bapatla: వరి నాట్లు వేసిన కలెక్టర్లు
బాపట్ల: అది బాపట్ల జిల్లాలోని మురుకొండపాడు గ్రామం. శివారున జలయజ్ఞంలో తడిసిన పంట పొలం. మరో వైపు ఆకాశాన భగభగ మండుతున్న భానుడు.. ఇంతలో ఓ కూలీల బృందం ఆ పంట చేలో వడివడిగా అడుగులు వేసింది. అప్పటికే పరిచి ఉన్న వరి మొక్కలను చేత పట్టారు ఆ కూలీలు. ఎరట్రి ఎండలో నేలమ్మ ఒడిలో మట్టి గంధంలో తడిసిన ఆ కూలీలే కలెక్టర్ దంపతులు. ఒకరు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, మరొకరు బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. ఆదివారం మురుకొండపాడు వరి చేలోకి వీరు తమ కుటుంబంతో సహా వచ్చి వరినాట్లు వేశారు. గంటకు పైగా వరి మొక్కలు నాటారు. అక్కడికే క్యారేజీలు తెప్పించుకొని గట్టుపై కూర్చుని భోజనం చేశారు. -
ఇద్దరితో వివాహేతర సంబంధం.. చివరికి షాకింగ్ ట్విస్ట్.. వీడిన మిస్టరీ
బాపట్ల టౌన్: దంపతుల హత్య కేసు మిస్టరీని పది నెలల అనంతరం పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వివరాలు వెల్లడించారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడు గ్రామానికి చెందిన హనుమంతరావు, రామతులశమ్మ దంపతులు. వీరి కుమార్తె అనితకు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామానికి చెందిన సాంబశివరావుతో వివాహమైంది. పొన్నూరు మండలం మునిపల్లె గ్రామానికి చెందిన కూచిపూడి రాజ్‌కుమార్‌తో అనిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. చదవండి: ఆర్ఎంపీతో వివాహం.. పక్కింటి యువకుడితో వివాహేతర సంబంధం.. ఆయనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే మరో వ్యక్తితో అన్యోన్యంగా ఉండటం ప్రారంభించింది. ఈ విషయాన్ని గమనించిన ప్రియుడు ఆమెను నిలదీశాడు. కొన్ని రోజుల తర్వాత ఆమె తన స్వగ్రామం పూసపాడు వెళ్లింది. రాజ్‌కుమార్ కూడా ఆ గ్రామానికి వెళ్లాడు. అక్కడ అనిత తల్లి రామతులశమ్మ నిందితుడితో గొడవపడింది. ఆమె కూడా అనితను సపోర్ట్ చేస్తున్నట్లు అనుమానించాడు. తనకు అనిత దూరం కావడానికి వేరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండటానికి రామతులశమ్మ కారణమని కక్షపెంచుకున్నాడు. ఆమెను చంపితే అనిత తనకు దక్కుతుందని భావించి హత్యకు పథకం పన్నాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడు అమర్తలూరు మండలం ఇంటూరు గ్రామానికి చెందిన కంచర్ల ప్రవీణ్‌కుమార్ అలియాస్ ప్రవీణ్, అలియాస్ కుమార్‌తో చర్చించాడు. ఇరువురు మద్యం తాగి 2021 నవంబర్ 19న అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై పూసపాడు చేరుకున్నారు. కొబ్బరిబొండాలు నరికే కత్తి వెంట తీసుకెళ్లారు. రామతులశమ్మతోపాటు ఆమె భర్త హనుమంతరావు కూడా పక్కనే ఉన్నాడు. ఒకరిని చంపితే మరొకరు కేకలు వేస్తారని భావించి ఇరువురిని కత్తితో నరికి హత్య చేశారు. మృతురాలి చెవికి బంగారు కమ్మలు ఉండటంతో కత్తితో చెవులు కోసి వాటిని తీసుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పది నెలల తర్వాత శుక్రవారం పొన్నూరు వద్ద నిందితులను అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు నగదు ప్రోత్సాహకం దంపతుల హత్య కేసు మిస్టరీను ఛేదించిన పోలీసులను శుక్రవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలు, నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ప్రశంసలు పొందిన వారిలో చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్, ఇంకొల్లు స్టేషన్ సీఐ డి.రంగనాథ్, ఎస్ఐ నాయబ్‌రసూల్, హెడ్‌కానిస్టేబుల్ జి.పూర్ణచంద్రరావు, కానిస్టేబుళ్లు బి.బాలచంద్ర, కె.హరిచంద్రనాయక్, చినగంజాం కానిస్టేబుళ్లు డి.శ్రీనివాసరావు, కె.అనిల్‌కుమార్, ఉమెన్ పీసీ జి.సంధ్యారాణి, హోంగార్డు ఎం.ప్రభాకరరావు ఉన్నారు. -
మెడికల్ ఆఫీసర్ ని స్పాట్ లో సస్పెండ్ చేసిన మంత్రి విడదల రజిని
-
Vodarevu Fishing Harbour: హార్బర్ తీరానికే దర్బార్..
అలలపై ఆరాటం.. బతుకు నిత్యపోరాటం.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఒడ్డుకు తెచ్చిన మత్స్యసంపద అమ్మకానికీ జంఝాటం.. ఇదీ తరతరాలుగా బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు గంగపుత్రుల దైన్యం. వీరి తలరాతలు మార్చేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. త్వరలో పనులు ప్రారంభం కానుండడంతో ఊరూవాడ సంబరపడుతున్నాయి. సాక్షి, బాపట్ల/చీరాల: మత్స్యకారులు ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో మైళ్ల దూరం వెళ్లి వేటాడిన మత్స్యసంపద దళారుల పరమవుతోంది. నిల్వ ఉంచుకోవడానికి కోల్డ్ స్టోరేజీలు, ఎండబెట్టుకునేందుకు అవసరమైన ఫ్లాట్‌ఫాంలు లేకపోవడంతో మద్రాసు ఏజెంట్లు చెప్పిన ధరకే తెగనమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. దీనికితోడు ఏటా వచ్చే ప్రకృతి విపత్తులకు రూ.లక్షలు పెట్టి కొన్న పడవలు, వలలు సముద్రంలో కొట్టుకుపోతున్నాయి. ఈ దయనీయ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని చీరాల మండలం వాడరేవు వాసులు ఎంతోకాలంగా కోరుతున్నారు. ఎట్టకేలకు వీరి కలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సాకారం చేస్తోంది. ఇప్పటికే హార్బర్ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసింది. కొద్దిరోజుల్లో పనులు ప్రారంభం కానున్నాయి. పదేళ్ల క్రితమే సర్వే జరిగినా.. వాడరేవు హార్బర్ నిర్మాణానికి 2012లోనే సర్వే నిర్వహించారు. అప్పట్లోనే మినీ హార్బర్, ఫ్లోటింగ్ జెట్టి నిర్మించాలని నిర్ణయించినా.. ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాడరేవులో హార్బర్ నిర్మాణంపై దృష్టి సారించింది. దీనికోసం ఏపీ మారిటైమ్ బోర్డు రూ.532 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు ఆహ్వానించింది. ఆ పక్రియలో విశ్వసముద్ర ఇంజినీరింగ్ లిమిటెడ్ ఏజెన్సీ రూ.408.42 కోట్లతో టెండర్లను దక్కించుకుంది. ప్రస్తుతం 20 ఎకరాలు అవసరం ఉండగా 13 ఎకరాల వరకు రెవెన్యూ శాఖ అప్పగించింది. మిగిలినది భూసేకరణ ద్వారా తీసుకోనున్నారు. హార్బర్ నిర్మాణానికి 20 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం, 80 శాతం నిధులు కేంద్ర మత్స్యమౌలిక అభివృద్ధి సంస్థ, నాబార్డు మంజూరు చేస్తాయి. నిజాంపట్నం హార్బర్ ఉన్నా.. ప్రస్తుతం వాడరేవులో హార్బర్ లేకపోవడంతో సముద్రంలో వేటాడిన మత్స్యసందపను ఒడ్డుకు తెచ్చుకునే అవకాశం లేదు. దీంతో కాకినాడ, చెన్నై ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. నిజాంపట్నంలో హార్బర్ ఉన్నా సామర్థ్యం సరిపోవడం లేదు. దీంతో చీరాల వాడరేవు నుంచి కాకినాడ గానీ చెన్నై గానీ వెళ్లాలంటే సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఫలితంగా మత్స్యసంపద దళారుల పాలవుతోంది. దళారులు మత్స్యసంపదను తక్కువ ధరకు కొని చెన్నై, బెంగళూరు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. (క్లిక్: పల్నాడు రైతుల వినూత్న పంథా.. ‘ఫల’ప్రదం) ప్రయోజనాలివీ.. ► హార్బర్ నిర్మాణం పూర్తయితే 890 ఇంజిన్ బోట్లు, 350 మెకనైజ్డ్ బోట్లు, 75 చిన్న ఓడలు సురక్షితంగా నిలుపుకునే అవకాశం ఉంటుంది. ► స్థానికంగానే మత్స్య సంపదను మార్కెటింగ్ చేసుకోవచ్చు. ► ఒంగోలు, నెల్లూరు, నిజాంపట్నం నుంచి బోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ► స్థానిక మత్స్యకార మహిళలకు సమృద్ధిగా జీవనోపాధి లభిస్తుంది. ► జిల్లాలోని తీరప్రాంతం అభివృద్ధి చెందుతుంది. జిల్లాకే తలమానికం హార్బర్ నిర్మాణం పూర్తయితే వాడరేవు జిల్లాకే తలమానికంగా మారుతుంది. మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నా హయాంలో హార్బర్ నిర్మాణ పనులు చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నా. మరోనెలలో శంకుస్థాపన చేసి పనులు మొదలుపెడతాం. దీనికితోడు వాడరేవు నుంచి పిడుగురాళ్ళ వరకు నేషనల్ హైవే మంజూరైంది. త్వరలో ఆ పనులూ ప్రారంభం కానున్నాయి. – కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్యే, చీరాల మరో నెలలో పనులు హార్బర్ నిర్మాణం ఎంతో మేలు చేస్తోంది. మత్స్యసంపదకు గిట్టుబాటు ధర లభిస్తుంది. సరుకు ఎండబెట్టుకునేందుకు ఫ్లాట్‌ఫాంలు, నిల్వ ఉంచుకునేందుకు ఏసీ స్టోరేజ్‌లు, డీజీల్ బంకులు, రవాణాకు రోడ్లు అందుబాటులోకి వస్తాయి. మరో నెలలో హార్బర్ పనులు ప్రారంభమవుతాయి. – డాక్టర్ పి.సురేష్, మత్య్సశాఖ జాయింట్ డైరెక్టర్ -
Bapatla: జిల్లాలో అక్రమ లేఅవుట్ల దందా
‘బాపట్ల మండలం ఈతేరులో ఉన్న ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కర్లపాలెంలో ఓ లే అవుట్ వేసింది. దీంతో కర్లపాలెం వాసులు కరీముల్లా ఖాన్, అబ్దుల్ సమీద్, శ్రీనివాసరావు, విజయ్ కుమార్, గోపీ, పవన్‌కుమార్, సోమయ్య తదితరులు ప్లాట్లను కొని అడ్వాన్స్‌గా రూ.20 లక్షలు చెల్లించారు. తీరా చూస్తే ఆ లేఅవుట్‌కు అనుమతి లేదని రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు రియల్ ఎస్టేట్ వ్యాపారిని నిలదీశారు. ఇచ్చిన నగదును తిరిగిచ్చే ప్రసక్తే లేదని ఆ వ్యాపారి తెగేసి చెప్పాడు. దీంతో బాధితులు కలెక్టర్‌ను ఆశ్రయించారు. సాక్షి, బాపట్ల: జిల్లాలో అనధికారిక లే అవుట్లకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. కొందరు అక్రమ లే అవుట్లను వేసి సొమ్ము చేసుకుంటున్నారు. పంచాయతీల్లో క్రమబద్ధీకరణకు అవకాశం లేకపోవడం, క్షేత్ర స్థాయిలో నిఘా సన్నగిల్లడం వల్లే ఈ దుస్థితి తలెత్తింది. పాలనా సౌలభ్యం కోసం బాపట్లను జిల్లాగా ప్రకటించడంతో పట్టణ పరిసరాల్లోని 15 కిలోమీటర్ల పరిధిలో వందల సంఖ్యలో లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. ఒక్కదానికీ అనుమతుల్లేవు. అయినా వ్యాపారులు యథేచ్ఛగా ప్లాట్లను అమ్మేసుకుంటున్నారు. అధికారులూ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. గుర్తించినవి ఇవే.. ► బాపట్ల పురపాలక సంఘం పరిధిలో మొత్తం 61 లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 24 లేఅవుట్లకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. 35 లేఅవుట్లకు లేవు. కానీ ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ► జిల్లాలో దాదాపు 150 వరకు అనధికార లే అవుట్లు ఉన్నట్టు అధికారులే చెబుతున్నారు. కానీ ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చు. వీటిపై చర్యలు లేవు. నిబంధనలివీ.. ► వ్యవసాయ భూమిని లేఅవుట్‌గా మార్చాలంటే ముందుగా ల్యాండ్ కన్వర్షన్ చేయాలి. దీనికోసం ప్రభుత్వానికి ఐదుశాతం ఫీజు చెల్లించాలి. ► అధికారుల అనుమతితోనే లేఅవుట్ వేయాలి. ► 40 అడుగుల రోడ్లు ఉండాలి. ► 10 శాతం భూమిని సామాజిక అవసరాలకు కేటాయించాలి. ► తాగునీటికి, విద్యుత్ సౌకర్యానికి రుసుములు చెల్లించాలి. ► కానీ ఇవేమీ అమలు కావడం లేదు. ప్రభుత్వం అవకాశం ఇచ్చినా..! అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొని ప్రజలు నష్టపోతున్నట్టు గుర్తించిన ప్రభుత్వం అనధికార లే అవుట్లకు క్రమబద్ధీకరణ పథకం–2020ని ప్రకటించింది. 2019 ఆగస్టు 31కి ముందు వేసిన అనధికార లే –అవుట్లలోని ప్లాట్లు నిర్ణీత అపరాధ రుసుముతోపాటు 14 శాతం ఓపెన్ స్పేస్ మొత్తం చెల్లించి క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ వెసులుబాటును చాలా వరకు రియల్టర్లు ఉపయోగించుకున్నారు. స్పందన బాగుండడంతో ఈ ఏడాది జూన్ 30 వరకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం పథకాన్ని ఆపేసింది. అయితే అనధికార లేఅవుట్లలో నిర్మించుకున్న భవనాలను వ్యక్తిగతంగా అపరాధ రుసుము చెల్లించి క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. అవకాశం ఇచ్చినా కొందరు వ్యాపారులు వినియోగించుకోలేదు. (క్లిక్: పాఠం స్కాన్ చేసేయొచ్చు.. మళ్లీ మళ్లీ వినొచ్చు) కలెక్టర్ సీరియస్.. జిల్లా వ్యాప్తంగా క్రమబద్ధీకరణ పథకానికి దరఖాస్తు చేసుకున్న అనధికార లే అవుట్లకు సంబంధించి అపరాధ రుసుం రూపంలో రూ.16 కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉంది. దీనిపై కలెక్టర్ విజయకృష్ణన్ ఇటీవల సీరియస్ అయ్యారు. తక్షణమే అపరాధ రుసుం వసూలు చేయాలని, ఇంకా ఉన్న అనధికార లే అవుట్లపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆ భూముల వివరాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపి నిషేధిత జాబితాలో నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని హుకుం జారీ చేశారు. దీంతో రియల్టర్లలో ఆందోళన మొదలైంది. చర్యలకు ఉపక్రమిస్తున్నాం పంచాయతీల్లో అనధికార లే–అవుట్లను గుర్తిస్తున్నాం. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అక్రమ లే అవుట్లపై చర్యలు తీసుకోవాలని ఇటీవల కలెక్టర్ ఆదేశించారు. ఆ లే అవుట్లను గుర్తించి త్వరలోనే కలెక్టర్ ఆదేశాల మేరకు నిషేధిత జాబితాలో పెట్టేందుకు చర్యలు చేపడుతున్నాం. – ఎ.రమేష్, జిల్లా పంచాయతీ అధికారి -
మద్యం మరణాలపై టీడీపీ దుష్ప్రచారం: ఎంపీ మోపిదేవి
సాక్షి, బాపట్ల జిల్లా: మద్యం మరణాలపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. ఆదివారం ఆయన రేపల్లెలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ నేతకు చెందిన వేడుకల్లో మద్యం పంపిణి చేశారని.. ఆ వేడుకల్లో మద్యం తాగి ఇద్దరు మరణిస్తే ప్రభుత్వానికి అంటగడుతున్నారన్నారు. చంద్రబాబు మాదిరిగా ఎమ్మెల్యే సత్యప్రసాద్ శవ రాజకీయాలు చేస్తున్నారని మోపిదేవి నిప్పులు చెరిగారు. చదవండి: కూలుతున్న టీడీపీ కంచుకోట.. కుప్పంలో వైఎస్సార్సీపీ రెపరెపలు -
Guntur: పల్లెల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్
సాక్షి, గుంటూరు: ఏ పల్లెలోనూ ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రతి వ్యక్తికీ రోజుకు సగటున 55 లీటర్ల నీటిని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. జలజీవన్ మిషన్ పథకం ద్వారా 2024 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. గతంలో ఒక వ్యక్తికి రోజుకు సగటున 45 లీటర్ల నీటిని అందించాలని, ఆ మేరకు తాగునీటి పథకాలను జలజీవన్ మిషన్‌లో భాగంగా విస్తరించాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. అయితే మారిన జీవన ప్రమాణాల నేపథ్యంలో సగటున ఓ వ్యక్తికి రోజుకు 55 లీటర్లు అవసరమని గుర్తించి మళ్లీ ప్రతిపాదనలను తయారు చేశారు. ఈ పనులకు అక్టోబర్ 2020లో పాలనా అనుమతులు లభించగా, 2021లో మొదలయ్యాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వీటిని జిల్లాల వారీగా విభజించారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ఈ పనులు చేపడుతున్నారు. 5,79,156 ఇళ్లకు కుళాయిలు 2020 ఏప్రిల్ 1 నాటికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2,21,270 ఇళ్లకు మాత్రమే కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. జల జీవన్ మిషన్ పథకం ద్వారా 2024 నాటికి ఈ సంఖ్యను 5,79,156కి చేర్చాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం రూ.400.74 కోట్లతో 1,264 పనులు చేపట్టారు. వీటిని పని విలువను బట్టి విభజించి టెండర్లు పిలిచారు. కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇంకొన్ని టెండర్ల దశలో ఉన్నాయి. మూడు దశల్లో పనులు ► జలజీవన్ మిషన్ పనులను మూడు దశలుగా విభజించారు. ► తొలిదశలో ఇప్పటికే సగటున ఓ వ్యక్తికి రోజుకు 40 లీటర్లు ఇస్తున్న గ్రామాల్లో అందుబాటులో ఉన్న పథకాలను విస్తరించడం, అంతర్గత పైపు లైన్లను నిర్మించడం చేయనున్నారు. ► రెండో దశలో ఇప్పటికే ఉన్న పథకాలకు అదనపు నీటి సదుపాయాలను సమకూర్చనున్నారు. ► మూడో దశలో తాజా ప్రతిపాదనల మేరకు కొత్త పథకాల నిర్మాణం చేపట్టనున్నారు. ► ఉపరితల జలాల లభ్యత లేని ప్రాంతాల్లో మాత్రమే భూగర్భ జలాలను వినియోగించేలా పథకాల నిర్మాణానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. ► జలజీవన్ మిషన్ పథకాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం పెంచడానికి విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో 25 శాతం మహిళలు, వార్డు మెంబర్లకు, 50 శాతం వెనకబడిన తరగతుల వారీకి సభ్యులుగా అవకాశం కల్పించారు. వీరికి అవసరమైన శిక్షణ ఇచ్చి తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వాటి సమగ్ర వినియోగంపై దృష్టిసారించేలా చూడనున్నారు.