ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టడంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రస్థాయి కార్యక్రమానికి బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలోని ఆలపాటి వెంకట రామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాల బుధవారం వేదికైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దివ్య హస్తాల మీదుగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజుస్ కంటెంట్‌తో ఉన్న ట్యాబ్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి స్వీకారం చుట్టబోతున్నాం. ఆర్థిక స్థోమత వల్ల పిల్లలను చదివించుకోలేని తల్లిదండ్రుల బాధలను చూశా. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం. పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టాం. సమాజంలో ఉన్న అంతరాలు తొలగాలి. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య అందకూడదనే పెత్తందారీ భావజాలం చూసి బాధ వేసింది. విద్యార్థులకు అందించే చదువులో సమానత్వం ఉండాలి. మంచి విద్యా విధానంతో పిల్లల తలరాతలు మారతాయి. భావి తరాల పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. చదువులో సమానత్వం ఉంటేనే ప్రతి కుటుంబం అభివృద్ధి అని సీఎం జగన్ పేర్కొన్నారు.
'ట్యాబ్‌లలలో బైజూస్ కంటెంట్ అప్‌లోడ్ చేసి అందిస్తున్నాం. రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. నెట్‌తో సంబంధం లేకుండా పాఠ్యాంశాలు చూసే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఏటా 8వ తరగతిలోకి వచ్చిన విద్యార్థులందరికీ ట్యాబ్‌లు అందిస్తాం. ట్యాబ్‌ల ద్వారా విద్యార్థులకు సులువుగా పాఠాలు అర్థమవుతాయి. అందుకు అనుగుణంగానే కంటెంట్ ఉంటుంది' అని సీఎం జగన్ తెలిపారు.
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ రోజు రాష్ట్ర విద్యారంగంలోనే విప్లవాత్మకమైన రోజు. విద్యారంగంలో సీఎం జగన్ కొత్తశకానికి నాంది పలికారు.
మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. విద్యారంగానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలనేదే సీఎం జగన్ లక్ష్యం. ప్రపంచంతో పోటీపడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలనేదే సీఎం ఆకాంక్ష అని అన్నారు.
12:10AM
►ట్యాబ్‌లలో బైజూస్ కంటెంట్ అప్‌లోడ్ చేసి అందిస్తున్న ఏపీ ప్రభుత్వం
►రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్‌లు ఉచిత పంపిణీ
►నెట్‌తో సంబంధం లేకుండా పాఠ్యాంశాలు చూసూ వెసులుబాటు
►బైజూస్ లెర్నింగ్ యాప్‌తో లెక్కలు, ఫిజిక్స్, జువాలజీ, బయాలజీ, జియాలజీ, సివిక్స్, హిస్టరీ పాఠ్యాంశాలు
►తెలుగు ఇంగ్లీష్ హిందీతో పాటు దాదాపు 8 భాషల్లో పాఠ్యాంశాలు
►విద్యార్థులకు అర్థమయ్యేలా సుమారు 2 నుంచి 4 నిమిషాల నిడివితో యానిమేషన్, వీడియోల రూపంలో పాఠ్యాంశాలు
►బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్‌లో మొత్తం 57 చాప్టర్లు‍్ల, 300 వీడియోలు
►ట్యాబ్‌లపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇప్పటికే ఐటీ విభాగం అవగాహన
12:07AM
►రాష్ట్ర వ్యాప్తంగా 5,18,740 ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం
►4,59,564 మంది విద్యార్థులు.. 59,176 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు
►రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులపాటు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం
►నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా 9,703 స్కూళ్లలో బ్యాబ్‌ల పంపిణీ
12:03AM
బాపట్ల: యడ్లపల్లి బహిరంగ సభా వేదికపై సీఎం జగన్
►కాసేపట్లో జడ్పీ హైస్కూల్ 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్న సీఎం జగన్
11:30AM
సీఎం జగన్‌కు ఘనస్వాగతం
యడ్లపల్లిలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. దారిపొడవునా పూలు జల్లుతూ హారతులు పడుతూ పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
జన హృదయ విజేత.. నవరత్నాలు పొదిగిన సంక్షేమ సార్వభౌమ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం బాపట్ల జిల్లాకు రానున్నారు. భావి పౌరుల బంగారు భవితకు బాటలు వేసే బృహత్తర కార్యక్రమానికి తన పుట్టిన రోజున శ్రీకారం చుట్టనున్నారు. విద్యాంధ్ర సాధనకు శంఖారావం పూరించనున్నారు. జయీభవ.. ‘విద్య’యీభవ అంటూ విద్యార్థులను దీవించనున్నారు. వరాల రేడు పర్యటన నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు ఆనందభరితులవుతున్నారు. స్వాగతం.. సుస్వాగతం అంటూ జననేతకు జేజేలు పలుకుతున్నారు.
సాక్షి, నరసరావుపేట/వేమూరు: ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టడంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రస్థాయి కార్యక్రమానికి బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలోని ఆలపాటి వెంకట రామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాల బుధవారం వేదికవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దివ్య హస్తాల మీదుగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజుస్ కంటెంట్‌తో ఉన్న ట్యాబ్‌ల పంపిణీ కోసం సుందరంగా ముస్తాబై వేచిచూస్తోంది. దీనికోసం జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లనూ పూర్తిచేసింది. మంత్రి మేరుగ నాగార్జున, కలెక్టర్ విజయకృష్ణన్, ఉన్నతాధికారులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బాపట్ల జిల్లాగా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రెండోసారి జిల్లాకు వస్తున్నారు. అదీ తన పుట్టిన రోజున జననేత జిల్లాలో పర్యటించనుండడం విశేషం. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పారీ్టశ్రేణులు, ప్రజలు జననేత రాక కోసం ఉత్సాహంగా నిరీక్షిస్తున్నారు.
పటిష్ట బందోబస్తు..
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు చేపట్టింది. ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం యడ్లపల్లిలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఒక అదనపు ఎస్పీ, ఏడుగురు డీఎస్పీలు, 30 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 50 మంది మహిళా కానిస్టేబుళ్లు, మరో 890 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో కలిపి మొత్తం 1,050 మంది సిబ్బందితో కట్టుదిట్ట చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.మహేష్, డీఎస్పీలు టి.మురళీకృష్ణ, ఎ.శ్రీనివాసరావు, పి.శ్రీకాంత్, ఏఆర్ డీఎస్పీ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.
ఆనందంగా ఉంది
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు మనందరికీ పండుగ రోజు. అటువంటి రోజున ఆయన నా నియోజకవర్గంలో పర్యటించడం సంతోషంగా ఉంది. పేదింటి పిల్లల తలరాతలు మార్చే విద్యకు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమానికి బాపట్ల జిల్లాను ఎంచుకున్నందుకు సీఎంకు ధన్యవాదాలు.
– మేరుగ నాగార్జున, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment