Tabs distribution
-
Fact Check: వాస్తవాలు దాచిపెట్టి ట్యాబ్‌లపై విష ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లల్లో విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చిందని.. వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు పేద విద్యార్థులకు జరుగుతున్న మేలుపై తప్పుడు ప్రచారం జరుగుతోందని పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్స్ ఆన్లైన్లో తక్కువ ధర లభిస్తున్నా.. అధిక ధరకు కొనుగోలు చేశారంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపింది. ట్యాబ్ కొనుగోలులో రూ.1,200 కోట్లు అవినీతి జరిగిందనడం పూర్తిగా అబద్ధమని పేర్కొంది. ట్యాబ్ స్పెసిఫికేషన్, వారంటీ తెలియకుండా ఆన్లైన్ ధర రూ.11,999 ఉందని.. బల్క్‌లో కొంటే రూ.9 వేలకే వస్తున్నట్టు పేర్కొంటూ.. ఈ ట్యాబ్స్‌ను రూ.14,250కు కొనుగోలు చేయడంలో అక్రమాలకు పాల్పడ్డారనడం పూర్తిగా అవాస్తవమని ఖండించింది. పాఠశాల విద్యాశాఖ ఇంకా ఏం తెలిపిందంటే.. ► వాస్తవానికి ఆయా కంపెనీలు పాత స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు ఆన్లైన్లో తక్కువ ధరకు పెడుతుంటాయని, పైగా మనం కోరుకున్న స్పెసిఫికేషన్స్ అందులో ఉండవు. కానీ.. ప్రభుత్వం కొనుగోలు చేసిన ట్యాబ్స్‌కు నిర్ణీత ప్రత్యేకతలు పేర్కొని, ఆ తరహా ట్యాబ్స్ మాత్రమే తీసుకుంది. ► విద్యార్థులకు ప్రధానంగా శాంసంగ్ ఏ7 లైట్ ట్యాబ్‌లు ఇవ్వగా.. దాని బ్యాటరీతో సహా 3 ఏళ్ల వారంటీ, మూడేళ్ల పాటు మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ (ఎండీఎం), ఓటీజీ కేబుల్, ట్యాబ్‌కు రక్షణగా ఫ్లిప్ కవర్ ఉంటాయి. ► 256 జీబీ మెమరీ కార్డు గల ట్యాబ్ ధర మార్కెట్లోగాని, ఆన్‌లైన్‌లోగాని రూ.17,500 పైనే ఉంది. కానీ.. ప్రభుత్వం టెండర్ ద్వారా రూ.14,250 అంటే ఆన్లైన్ ధర కంటే చాలా తక్కువకు తీసుకుంది. ఆయా కంపెనీలు ఓటీజీ కేబుల్, డ్యూయల్ లేయర్ ట్యాబ్ ప్రొటెక్టెడ్ రగ్గడ్ కేస్, ట్యాంపర్డ్ స్క్రీన్ గార్డ్, ఫ్లాష్డ్ ఎడ్యుకేషన్ కంటెంట్‌తో 256 జీబీ యూ3 మెమరీ కార్డు, 3 సంవత్సరాల వారంటీతో అందించాయి. ► ఆన్లైన్లో కొనుగోలు చేసిన వస్తువులకు వారంటీగాని, సాఫ్ట్వేర్ సమస్యలకు కొనుగోలుదారే అదనంగా చెల్లించాలి. కానీ.. విద్యార్థులు ట్యాబ్‌లో ఏదైనా సమస్య తలెత్తితే సమీపంలోని గ్రామ/వార్డు సెక్రటేరియట్లో ఇచ్చి కంపెనీ సేవలకు ఉచితంగా పొందవచ్చు. గతేడాది ట్యాబ్స్ కొనుగోలుపైనా ఆరోపణ ► గత సంవత్సరం ఏసర్ ట్యాబ్ ధర రూ.14 వేలు ఉంటే, దాన్ని ప్రభుత్వం రూ.17,500కి కొనుగోలు చేసిందని, దాంతో రూ.2,500 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు. ► వాస్తవానికి గతేడాది ప్రభుత్వం ఏసర్ ట్యాబ్‌లను కొనుగోలు చేయనేలేదు. ఈ ఏడాది మాత్రమే 1.35 లక్షల ఏసర్ ట్యాబ్‌లను కొనుగోలు చేసింది. ఒక్కో ఏసర్ ట్యాబ్‌ను రూ.14,200కు ఓటీజీ కేబుల్, డ్యూయల్ లేయర్ ట్యాబ్ ప్రొటెక్టెడ్ రగ్గడ్ కేస్, ట్యాంపర్డ్ స్క్రీన్ గార్డ్, ఫ్లాష్డ్ ఎడ్యుకేషన్ కంటెంట్‌తో గల 256 జీబీ యూ3 మెమరీ కార్డు, 3 సంవత్సరాల వారంటీ ఈ ధరలోనే ఉన్నాయి. అన్ని యాక్సెసరీస్‌కు మూడేళ్ల గ్యారెంటీ కూడా ఉంది. ► పైగా ట్యాబ్ కొనుగోలు టెండర్ జ్యుడీషియల్ ప్రివ్యూకు వెళ్లిన తర్వాత, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే టెండర్లు పిలిచారు. రెండేళ్లలో ప్రభుత్వం 9,52,925 ట్యాబుల కొనుగోలుకు వెచ్చించిన మొత్తం రూ.1.305.74 కోట్లు అయితే.. రూ.2,500 కోట్ల అక్రమాలకు ఎలా ఆస్కారముంటుందని పాఠశాల విద్యాశాఖ ప్రశ్నించింది. -
విశాఖ జిల్లాలో 132 ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో ట్యాబ్ ల పంపిణీ
-
నేటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ
-
చదువే ఆయుధం
‘‘మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలనే సదుద్దేశంతో బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు ఇస్తున్నాం. రూ.620 కోట్లతో 4,34,185 మంది పిల్లలకు మామగా ఈ కానుక అందిస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ 8వ తరగతి నుంచి బోధన ప్రారంభిస్తున్నాం. 55 నెలలుగా ప్రతి అడుగూ విప్లవాత్మక మార్పు దిశగానే వేస్తున్నాం. పిల్లలకు మనం ఇవ్వగలిగే విలువైన ఆస్తి చదువులే’’ – ట్యాబ్‌ల పంపిణీలో సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పేద కుటుంబాలకు చెందిన పిల్లల చదువుల పట్ల దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ తీసుకోనంత శ్రద్ధ వహిస్తూ తరతరాల తలరాతలను మారుస్తున్న మనందరి ప్రభుత్వంపై కొందరు పెత్తందారులు దుర్బుద్ధితో, దురుద్దేశాలతో బురద చల్లుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. పేదరికం నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలని మీ జగన్ ఆరాట పడుతుంటే దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని విప్లవాత్మక సంస్కరణలు చేపడితే విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పుడు రాతలతో పేద విద్యార్థులపై విషం కక్కొద్దని సూచించారు. పిల్లలు మరింత మెరుగ్గా పాఠ్యాంశాలను అవగాహన చేసుకునేలా ట్యాబ్‌లు అందిస్తుంటే వారిని చెడగొడుతున్నారంటూ, పాడు చేస్తున్నారంటూ దుర్మార్గమైన కథనాలు ప్రచురిస్తున్నారని, మరి మీ పిల్లలు, మనవళ్ల చేతిలో ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఉండవచ్చా? అని పెత్తందారులను నిలదీశారు. అసలు అది పేపరా?.. పేపర్‌కు పట్టిన పీడా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లీషు మీడియం, ఇంగ్లీషు ల్యాబ్‌లు, ఐఎఫ్‌పీలు, డిజిటల్ బోధనతో తీర్చిదిద్ది బైజూస్ కంటెంట్‌తో ఖరీదైన ట్యాబ్‌లను పిల్లలకు ఉచితంగా అందిస్తున్నామని, ప్రాథమిక స్థాయి నుంచి టోఫెల్ శిక్షణతోపాటు సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా అడుగులు వేయడంతో ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లు ప్రభుత్వ పాఠశాలలతో పోటీ పడాల్సిన పరిస్థితి కల్పించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 8వ తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది ట్యాబ్‌లు పంపిణీ కార్యక్రమాన్ని గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తొలుత విశాఖ ఎయిర్‌పోర్టు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో చింతపల్లి వచ్చారు. ఆశ్రమ పాఠశాలలో డిజిటల్ లెర్నింగ్ స్టాల్‌ని పరిశీలించి విద్యార్థులతో కలసి క్లాస్ రూమ్‌లో కూర్చొని ఆప్యాయంగా ముచ్చటించారు. క్లాస్‌లు ఎలా జరుగుతున్నాయి? భోజనం ఎలా ఉంది? చదువులు బాగా చెబుతున్నారా చిన్నా? అంటూ విద్యార్థులను ఆరా తీశారు. అనంతరం చింతపల్లి మైదానంలో సభా వేదిక వద్దకు చేరుకుని బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ ట్యాబ్స్ రాష్ట్రవ్యాప్తంగా 9,424 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఆ వివరాలివీ.. పేద బిడ్డల బంగారు భవిష్యత్ కోసం.. గిరిపుత్రుల స్వచ్ఛమైన మనసుల మధ్య, పేద బిడ్డల బంగారు భవిష్యత్‌ను ఆకాంక్షిస్తూ నా పుట్టిన రోజున ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం దేవుడిచి్చన అదృష్టం. రాష్ట్రంలోని పిల్లలే మన భవిష్యత్తు, మన వెలుగులు. మన తర్వాత, మనం వెళ్లిపోయిన తర్వాత కూడా రాష్ట్ర భవిష్యత్తును నిలిపే వారసులు వారంతా. వరుసగా రెండో ఏడాది ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రూ.620 కోట్లు ఖర్చు చేస్తూ 4,34,185 మంది పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు పెడుతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యే ప్రతి మండలాన్ని సందర్శిస్తూ 10 రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. డిజిటల్ విప్లవంలో భాగంగా గతేడాది కూడా నా పుట్టిన రోజున రూ.686 కోట్లతో 5.18 లక్షల ట్యాబ్‌లను పిల్లలకు, టీచర్లకు పంపిణీ చేశాం. ఆఫ్‌లైన్‌లో సైతం పనిచేసేలా బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి మరీ ఇస్తున్నాం. ట్యాబ్‌ల్లో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తినా ఆందోళన చెందొద్దు. వాటిని హెడ్ మాస్టార్‌కు లేదా గ్రామ సచివాలయంలో అందచేస్తే రసీదు ఇచ్చి మరమ్మతులకు పంపిస్తారు. వారం రోజుల్లోనే ట్యాబ్ రిపేరు చేసి ఇస్తారు. లేదంటే మరో ట్యాబ్ మీ చేతిలో పెడతారు. వాటిలో సెక్యూర్డ్ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ లోడ్ చేయడం వల్ల పిల్లలు పాఠాలు, బోధనకు సంబంధించిన అంశాలను మాత్రమే చూడగలుగుతారు. పిల్లలు ఏం చూశారు? ఏం చదివారు? అన్నది టీచర్లకు, తల్లిదండ్రులకు ఈ సాఫ్ట్వేర్ ద్వారా తెలుస్తుంది కాబట్టి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఉచితంగా రూ.33 వేల ట్యాబ్, కంటెంట్.. ఒక్కో పిల్లాడి చేతిలో పెడుతున్న ఈ ట్యాబ్ మార్కెట్ విలువ రూ.17,500. దీనికి తోడు బైజూస్ కంటెంట్ ఇస్తున్నాం. రూ.33 వేలు విలువ చేసే ట్యాబ్, కంటెంట్ ఉచితంగా ఇస్తున్నాం. శ్రీమంతుల పిల్లలు బైజూస్ కంటెంట్ కొనుగోలు చేసి డౌన్లోడ్ చేసుకోవాలంటే రూ.15 వేలు చెల్లించాలి. మన పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా నిలవాలన్న తలంపుతో ఇంత ఖర్చు పెడుతున్నాం. డిజిటల్ గదులు.. ఇంగ్లీష్ ల్యాబ్‌లు నాడు – నేడు తొలిదశ పూర్తైనస్కూళ్లలో 6వ తరగతి ఆపై ఉన్న 32,213 క్లాస్ రూంలలో ఇప్పటికే ఐఎఫ్‌పీలు అమర్చి డిజిటలైజ్ చేశాం. బైజూస్ కంటెంట్‌తో కూడిన పాఠాలను తరగతి గదిలో నేర్పుతారు. అవే పాఠాలు ట్యాబ్స్‌లో కూడా ఉంటాయి. దీనివల్ల మెరుగ్గా నేర్చుకుంటారు. 1 నుంచి 5వతరగతి వరకు స్కూళ్లలో ఇంగ్లీషు ల్యాబ్‌లు తెచ్చి 10,038 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశాం. ఐఎఫ్‌పీలు, క్లాస్‌రూంల డిజిటలైజేషన్ కోసం మొదటి దఫాలో చేసిన ఖర్చు రూ.427 కోట్లు. నాడు–నేడు రెండో దశ పనులు వేగంగా జరుగుతున్నాయి. 62,097 తరగతి గదులన్నీ పూర్తిగా డిజిటలైజ్ అయ్యే కార్యక్రమం జనవరి 30 నాటికి పూర్తవుతుందని అధికారులు చెప్పారు. సందేహాల నివృత్తికి యాప్.. ఫిజిక్స్, మేథ్స్, బయాలజీ, ఇంగ్లిషు సబ్జెక్టుల్లో పిల్లల సందేహాలను నివృత్తి చేసేందుకు ఈసారి ట్యాబ్‌లలో డౌట్ క్లియరెన్స్ బాట్ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసి అందించాం. ఇంత ధ్యాసపెట్టి పిల్లలు ఏం చదువుతున్నారు? ఎలా చదువుతున్నారు? ట్యాబ్‌లలో ఏం ఉండాలి? పిల్లలకు మరింత మెరుగ్గా ఎలా ఉపయోగపడాలి? సులభంగా అర్ధమయ్యేందుకు ఏం చేయాలి? అనే ఆలోచన చేస్తూ తాపత్రయపడుతున్నాం. సందేహాల నివృత్తికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తెచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. పిల్లలు విదేశీ భాషలను నేర్చుకునేందుకు డ్యుయోలింగో యాప్‌ను కూడా చేర్చాం. ఇలా ట్యాబ్‌లు పిల్లలకు ఒక ట్యూటర్‌లా తోడుంటాయి. కొత్త టెక్నాలజీకి అనుగుణంగా.. మన పిల్లలు ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలిచేందుకు ప్రాథమిక స్థాయి నుంచే 3వ తరగతి నుంచే టోఫెల్ పరీక్షకు సిద్ధం చేసేలా అమెరికాకు చెందిన టోఫెల్ నిర్వాహణ సంస్ధ ఈటీఎస్(ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్)తో ఒప్పందం చేసుకున్నాం. టోఫెల్ శిక్షణ కోసం ఒక పీరియడ్ కేటాయించేలా చర్యలు తీసుకున్నాం. మారుతున్న టెక్నాలజీ, పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా వేగంగా అడుగులు వేయాలి. రానున్న 20 ఏళ్లలో చాలా ఉద్యోగాలు కనుమరుగవుతాయని చెబుతున్నారు.మన జీవితాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ప్రభావం పెరుగుతుంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మన పిల్లలను సిద్ధం చేస్తూ వచ్చే ఏడాది 8వ తరగతి నుంచి ఫ్యూచర్ స్కిల్స్ అనే సబ్జెక్టును ప్రవేశపెడుతున్నాం. అందులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, మెటావర్స్, డేటా ఎనలెటిక్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, వర్చువల్ రియాలటీ, అగ్మెంటెడ్ రియాలటీ, ఫైనాన్షియల్ లిటరసీ లాంటి అంశాలన్నీ పిల్లలకు పరిచయం చేసేలా ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్టు తెస్తున్నాం. సంబంధిత ట్యూటర్ల నియామకానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న మన పిల్లలు నేరుగా విదేశీ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియేట్) సిలబస్‌ను కూడా రాబోయే రోజుల్లో తెస్తున్నాం. దీనికోసం ఐబీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గిరికోనల్లో గొప్ప మార్పులు నా చెల్లెమ్మ భాగ్యలక్ష్మి (పాడేరు ఎమ్మెల్యే) నియోజకవర్గానికి బీటీ రోడ్లు, బ్రిడ్జిలు కావాలని అడిగింది. వాటిని యుద్ధప్రాతిపదికన వేగంగా మంజూరు చేస్తాం. ఇవాళ గిరిజన ప్రాంతాన్ని చూస్తుంటే గొప్ప మార్పులు కనిపిస్తున్నాయి. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం వేగంగా జరుగుతోంది. పార్వతీపురం, నర్సీపట్నం, పాడేరులో మూడు మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. ఐటీడీఏ పరిధిలో పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరం, బుట్టాయిగూడెం, డోర్నాలలో కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ వేగంగా నిర్మాణం అవుతోంది. గిరిజన ప్రాంతాల్లో గతంలో లేనివి కేవలం ఈ 55 నెలల్లో మీ బిడ్డ హయాంలో మాత్రమే జరుగుతున్నాయి. దుబారా కాదు.. రేపటి భవిష్యత్తు కోసమే గతంలో మన స్కూళ్లు ఎలా ఉండేవి? ఇవాళ మన బడులన్నీ ఎలా ఉన్నాయి? ఈ 55 నెలల కాలంలో మన ప్రభుత్వ స్కూళ్లు ఎలా మారిపోయాయో చూడాలని కోరుతున్నా. ప్రైవేట్ స్కూళ్లు మెరుగ్గా ఉంటాయనే నానుడి పోయి ఇవాళ అవన్నీ ప్రభుత్వ పాఠశాలలతో పోటీపడే పరిస్థితి వచ్చిందా? లేదా? జగన్ దుబారాగా డబ్బులు ఖర్చు చేస్తున్నాడని గిట్టని వారు అంటున్నారు. కానీ మేం ప్రతి పైసా మానవ వనరుల అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నాం. రేపటి భవిష్యత్తు మీద ప్రతి పైసా ఖర్చు కూడా పెడుతున్నాం. పిల్లలందరికీ నాణ్యతతో కూడిన విద్య ఇవ్వగలిగితే వారి జీవితం, భవిష్యత్తు మారుతుంది. అప్పుడు పేదరికం ఆటోమేటిక్‌గా పక్కకు పోయే పరిస్ధితి వస్తుందని గట్టిగా నమ్మాం కాబట్టే ఇంత వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ దిశగానే విద్యా దీవెన, విద్యాకానుక, గోరుముద్ద, అమ్మఒడి పథకాలతోపాటు ఇంగ్లీషు మీడియం చదువులు, బైలింగ్యువల్ టెక్ట్స్‌బుక్స్, సీబీఎస్ఈ బోధన తెచ్చాం. విద్యార్థుల సమక్షంలో బర్త్‌డే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పుట్టినరోజు వేడుకలను విద్యార్థుల సమక్షంలో నిర్వహించారు. విద్యార్థుల నడుమ భారీ కేక్ కట్ చేసి వారికి తినిపించారు. హ్యాపీ బర్త్‌డే మామయ్యా అంటూ విద్యార్థులు ఆయనకు ఆప్యాయంగా కేక్ తినిపించారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎం జగన్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా ఇన్చార్జి మంత్రి గుడివాడ అమర్నాథ్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ, ధనలక్ష్మి, పెట్ల ఉమాశంకర్ గణేష్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, తలశిల రఘురామ్, అనంతబాబు, కుంభారవిబాబు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్, కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
ట్యాబ్ లను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్
-
మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలి: సీఎం జగన్
Updates: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం: సీఎం జగన్ ►అడవి తల్లి బిడ్డల మధ్య గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నాం ►మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలి ►మన రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది ►8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌ల పంపిణీ 10 రోజుల పాటు చేస్తాం ►ప్రతీ ఎమ్మెల్యే ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు ►మీ మేనమామగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చా ►రూ.620 కోట్లతో 4 లక్షల 34 వేల 185 మంది విద్యార్థులకు ట్యాబ్‌లు ►55 నెలలుగా ప్రతీ అడుగు విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా పడింది ►పిల్లలకు అవసరమైన బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లు ►విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం జగన్ ►ట్యాబ్‌లలో చదువుకు సంబంధించిన అంశాలే ఉంటాయి ►తల్లిదండ్రులకు ఎలాంటి భయాలు అవసరం లేదు ►ట్యాబ్‌లలో సమస్య తలెత్తితే ప్రభుత్వమే రిపేర్ చేయిస్తుంది ►రిపేర్ కాకుంటే కొత్త ట్యాబ్ అందజేస్తాం ►ప్రతీ క్లాస్ రూమ్‌ను అత్యుత్తమ ప్రమాణాలతో తీర్చిదిద్దాం ►మేం అందిస్తున్న ట్యాబ్ మార్కెట్ విలువ రూ.17,500 ►రూ.15,500 విలువైన బైజూస్ కంటెంట్‌ను ఉచితంగా ఇస్తున్నాం ►ట్యాబ్‌ల పంపిణీతో ప్రతీ విద్యార్థికీ రూ.33వేల లబ్ధి ►నాడు-నేడు రెండో దశ పనులు వేగంగా జరుగుతున్నాయి: సీఎం జగన్ ►త్వరలోనే పనులన్నీ పూర్తి చేస్తాం ►మన పిల్లలు ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఎదగాలి ►ప్రతీ తరగతి గదిని డిజిటలైజ్ చేస్తున్నాం ►ట్యాబ్‌తో పిల్లలకు చదువు సులభతరమవుతుంది ►మన పిల్లలు ప్రపంచంలోనే దిబెస్ట్‌గా ఉండాలనేదే నా ఆకాంక్ష ►వైఎస్సార్ అమ్మ ఒడి విద్యార్థుల తల్లిదండ్రులకు ఓ వరం ►పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం ►పిల్లలకు ఇచ్చే ఈ ట్యాబ్ వారికి ట్యూటర్‌గా ఉంటుంది ►టోఫెల్ పరీక్షకు కూడా మన పిల్లలను తీర్చిదిద్దాలి అమ్మ ఒడితో మాకు ఎంతో మేలు జరిగింది: విద్యార్థిని ►పేద విద్యార్థులకు సీఎం జగన్ అండగా నిలిచారు ►పేదరికం చదువుకు ఆటంకం కాకూడదన్న జగన్ ఆలోచన అద్భుతం ►గిరిజన ప్రజల పక్షపాతి సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం ►స్కూల్స్ రూపురేఖలు మారాయంటే జగనన్నే కారణం విద్యారంగంలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారు: ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ►నాడు-నేడుతో ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలు మారిపోయాయి ►సీఎం జగన్ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు ►పేద విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌ల పంపిణీ ఓ విప్లవాత్మక నిర్ణయం ►సీఎం జగన్ పేద విద్యార్థులకు డిజిటల్ విద్యను అందుబాటులోకి తెచ్చారు. ►విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించిన సీఎం జగన్ ►డిజిటల్ లెర్నింగ్ స్టాల్స్ పరిశీలించిన సీఎం ►కాసేపట్లో ప్రభుత్వ విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్న సీఎం ►చింతపల్లి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్న సీఎం ►విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్ ►కాసేపట్లో హెలికాప్టర్లో చింతపల్లి బయలుదేరనున్న సీఎం ►చింతపల్లి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్న సీఎం పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తాచాటాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం మేరకు రూ.620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ గల 4,34,185 ట్యాబ్స్‌ను 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఈ పంపిణీని ప్రారంభించారు. దాదాపు రూ.17,500కు పైగా మార్కెట్ విలువ గల ఒక్కో ట్యాబ్.. రూ.15,500 విలువ గల బైజూస్ కంటెంట్‌తో కలిపి ప్రతి విద్యార్థికీ రూ.33వేల మేర లబ్ధి చేకూరనుంది. ఇప్పుడిచ్చే ట్యాబ్స్‌తో కలిపి రెండేళ్లలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి రూ.1,305.74 కోట్ల విలువైన 9,52,925 ట్యాబ్‌లను ప్రభుత్వం అందించింది. వీటిల్లో ఎనిమిదో తరగతితో పాటు, 9, 10 తరగతుల బైజూస్ కంటెంట్‌ను కూడా లోడ్ చేయడంతో పాటు ఇంటర్మీడియట్ కంటెంట్ కూడా అప్లోడ్ చేసేందుకు వీలుగా ట్యాబ్ సామర్థ్యాన్ని 256 జీబీకి పెంచి అందిస్తున్నారు. ఇక గత ఏడాది విద్యార్థులు, ఉపాధ్యాయులకు 5,18,740 ట్యాబ్స్‌ను పంపిణీ చేశారు. ఉచిత ట్యాబ్‌లో ఉన్నత కంటెంట్.. ►ప్రతి ట్యాబ్లోను ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లిష్, టోఫెల్ ప్రిపరేషన్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్’ అప్లికేషన్ ఉంది. ►విద్యార్థులు సులభంగా విదేశీ భాషలు నేర్చుకునేందుకు వీలుగా ‘డ్యులింగో’ యాప్‌ను సైతం ఇన్స్టాల్ చేసి, ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో సైతం పనిచేసేలా ఏర్పాటుచేశారు. ►ప్రస్తుతం 4 నుంచి 10వ తరగతి వరకు ఉచితంగా అందిస్తున్న రూ.15,500 విలువైన బైజూస్ కంటెంట్‌ను ఇకపై ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం అందించనున్నారు. ►తద్వారా 34.3 లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. ►ఈ ట్యాబ్‌ల మెమరీ సామర్థ్యం పెంచడంతో పాటు ట్యాబ్ సంరక్షణకు రగ్డ్ కేస్, టెంపర్డ్ గ్లాస్ వంటి హంగులు సైతం సమకూర్చారు. ► అవాంఛనీయ సైట్లు, యాప్స్‌ను నిరోధించే ప్రత్యేక సాఫ్ట్వేర్ రక్షణతో పాటు మూడేళ్ల వారంటీతో వీటిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. -
ప్రభుత్వ విద్యార్థులకు నేడు ఉచితంగా ట్యాబ్స్ పంపిణీ
-
సాంకేతికత.. డిజిటల్ బాట
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగానికి పెద్దపీట వేస్తూ పేద విద్యార్థుల ఉన్నత చదువులే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ఇప్పటికే మనబడి–నాడు నేడు కార్యక్రమంలో కార్పొరేట్‌కు దీటుగా సర్కారీ బడులను తీర్చిదిద్దుతున్నారు. అలాగే అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద వంటి పథకాలతో ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నారు. దీంతోపాటు పేద పిల్లలకు సాంకేతిక విద్యను చేరువ చేసేలా గతేడాది నుంచి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేసి బైజూస్ కంటెంట్‌తో పాఠాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే డిజిటల్ తరగతులను నిర్వహిస్తోంది. స్మార్ట్ టీవీ, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ద్వారా బోధన, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, వర్చువల్ క్లాస్ రూమ్‌లు, పెర్‌ఫెక్టివ్ అడాప్టివ్ లెర్నింగ్ ట్యాబ్‌లు ఇలా ఒక్కొక్కటిగా సాంకేతికతను చొప్పిస్తూ ప్రభుత్వ విద్యను శిఖరాలకు తీసుకువెళుతోంది. దీంతో విద్యార్థుల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభ్యసనా సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయి. గతేడాది నుంచి.. విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీకి గతేడాది శ్రీకారం చుట్టిన ప్రభుత్వం రెండో ఏడాది కూడా అందించాలని నిర్ణయించింది. ఏలూరు జిల్లాలో 398 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 17,410 మందిని ఈ ఏడాది అర్హులుగా గుర్తించారు. గతేడాది 18,370 మంది విద్యార్థులకు, 2,613 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో 276 పాఠశాలల్లో 13,790 మంది విద్యార్థులకు ఈ ఏడాది ట్యాబ్‌లు అందించనున్నారు. గతేడాది 14,353 మంది విద్యార్థులకు, 2373 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు అందజేశారు. గతేడాది ట్యాబ్‌లు అందుకున్న విద్యార్థులు ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది (10వ తరగతి పూర్తి చేసే) వరకూ ట్యాబ్‌లు వారి వద్దనే ఉంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. సామర్థ్యం పెంచి.. విద్యార్థుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ట్యాబ్‌ల సామర్థ్యాన్ని పెంచారు. 8.7 అంగుళాల స్క్రీన్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ రోమ్, 256 జీబీ ఎస్టీ కార్డు సామర్థ్యం గల ట్యాబ్‌లు అందించనున్నారు. ట్యాబ్‌ల కోసం గతేడాది ప్రభుత్వం రూ.101.64 కోట్లు వెచ్చించగా ఈ ఏడాది రూ.99.84 కోట్లు ఖర్చు చేసింది. అలాగే ట్యాబ్‌ల పర్యవేక్షణకు ప్రభుత్వం పర్యవేక్షక బృందాన్ని నియమించింది. మండలానికి ఇద్దరు ఉపాధ్యాయులకు ట్యాబ్ సాఫ్ట్వేర్ సమస్యలపై జిల్లా నోడల్ పర్సన్‌తో శిక్షణ ఇప్పించింది. విద్యార్థి అభ్యసనకు సంబంధించి వైఫై మేనేజర్, బైజూస్ కంటెంట్, డిక్షనరీ మాత్రమే ట్యాబ్‌లో అందుబాటులో ఉండేలా సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేస్తారు. ఇతర ఎటువంటి యాప్‌లను డౌన్లోడ్ చేసినా, ఇన్స్టాల్ చేసినా సంబంధిత ఉపాధ్యాయుడికి ఓటీపీ వచ్చేలా ట్యాబ్‌ల రూపకల్పన జరిగింది. -
గన్ షాట్: పేద పిల్లలకు ట్యాబ్ లిస్తే భరించలేరా..?
-
థాంక్యూ.. సీఎం జగన్ మామయ్య (ఫొటోలు)
-
బాపట్ల : సీఎం జగన్ చేతుల మీదుగా ట్యాబ్‌ల పంపిణీ (ఫొటోలు)
-
విద్యారంగంలో ఇది విప్లవాత్మక మార్పు : మంత్రి బొత్స సత్యనారాయణ
-
తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం : సీఎం వైఎస్ జగన్
-
పెత్తందారుల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదవాలా?: సీఎం జగన్
సాక్షి, బాపట్ల జిల్లా: పెత్తందారీ భావజాలం చూస్తుంటే బాధనిపిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. యడ్లపల్లిలో ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కొందరు పెత్తందారులు తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తుంటే కోర్టులకు వెళతారు’’అని అన్నారు. నా పుట్టినరోజు గురించి కాదు.. పుట్టిన బిడ్డ గురించి ఆలోచన చేస్తున్నానన్నారు. ‘‘ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి స్వీకారం చుట్టబోతున్నాం. ఆర్థిక స్థోమత వల్ల పిల్లలను చదివించుకోలేని తల్లిదండ్రుల బాధలను చూశా. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం. పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టాం. సమాజంలో ఉన్న అంతరాలు తొలగాలి. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య అందకూడదనే పెత్తందారీ భావజాలం చూసి బాధ వేసింది. విద్యార్థులకు అందించే చదువులో సమానత్వం ఉండాలి. మంచి విద్యా విధానంతో పిల్లల తలరాతలు మారతాయి. భావి తరాల పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. చదువులో సమానత్వం ఉంటేనే ప్రతి కుటుంబం అభివృద్ధి’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు దాదాపు 8 భాషల్లో పాఠ్యాంశాలు ఉంటాయి. పిల్లలకు మరింత సులువుగా పాఠాలు అర్థమయ్యేలా ట్యాబ్‌లు అందిస్తున్నాం. క్లాస్ టీచర్ చెప్పే పాఠశాలకు ఈ ట్యాబ్‌లు సపోర్ట్‌గా ఉంటాయి. పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో పేద తల్లిదండ్రుల కష్టాలను చూశాను. మూడున్నరేళ్లలో ఎక్కడా వెనకడుగు వేయలేదు’’ అని సీఎం అన్నారు. ‘‘పిల్లలకు నష్టం జరిగే కంటెంట్‌ను ట్యాబ్‌ల్లో తొలగించాం. విద్యార్థులకు ఇచ్చే ఒక్కో ట్యాబ్‌లో బైజూస్ కంటెంట్ విలువ రూ.32 వేలు.ట్యాబ్‌ల్లో బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి అందిస్తున్నాం.రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్‌లను ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. నెట్‌తో సంబంధం లేకుండా పాఠ్యాంశాలు చూసే వెసులుబాటు కల్పించాం’’ అని సీఎం పేర్కొన్నారు. చదవండి: క్యాంప్ కార్యాలయంలో బర్త్‌డే వేడుకలు.. కేక్ కట్ చేసిన సీఎం జగన్ ‘‘నా పుట్టిన రోజు నాడు నాకెంతో ఇష్టమైన చిన్నారుల భవిష్యత్తు కోసం చేస్తున్న మంచి కార్యక్రమంలో పలు పంచుకోవడం దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. మన పిల్లలు అంటే.. మన తర్వాత కూడా ఉండే మనం. పిల్లలు బాగుండాలని తమకన్నా కూడా బాగా ఎదగాలని, తమకన్నా మంచిపేరు ఇంకా తెచ్చుకోవాలని, ప్రతి తల్లీదండ్రీకూడా మనసారా కూడా కోరుకుంటారు. అలా కోరుకునే అనేక హృదయాలు రకరకాల కారణాల వల్ల అంటే తమ కులం వల్లనో, ఆర్థిక స్తోమత కారణంగానో సరిగ్గా చదివించుకోలేకపోతున్నామని వారు భావించినప్పుడు వారి మనస్సులు తల్లిడిల్లిపోతాయి. దీన్ని స్వయంగా నేను చూశాను.’’ అని సీఎం అన్నారు. -
తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం: సీఎం జగన్
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టడంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రస్థాయి కార్యక్రమానికి బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలోని ఆలపాటి వెంకట రామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాల బుధవారం వేదికైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివ్య హస్తాల మీదుగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజుస్ కంటెంట్‌తో ఉన్న ట్యాబ్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి స్వీకారం చుట్టబోతున్నాం. ఆర్థిక స్థోమత వల్ల పిల్లలను చదివించుకోలేని తల్లిదండ్రుల బాధలను చూశా. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం. పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టాం. సమాజంలో ఉన్న అంతరాలు తొలగాలి. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య అందకూడదనే పెత్తందారీ భావజాలం చూసి బాధ వేసింది. విద్యార్థులకు అందించే చదువులో సమానత్వం ఉండాలి. మంచి విద్యా విధానంతో పిల్లల తలరాతలు మారతాయి. భావి తరాల పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. చదువులో సమానత్వం ఉంటేనే ప్రతి కుటుంబం అభివృద్ధి అని సీఎం జగన్ పేర్కొన్నారు. 'ట్యాబ్‌లలలో బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి అందిస్తున్నాం. రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. నెట్‌తో సంబంధం లేకుండా పాఠ్యాంశాలు చూసే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఏటా 8వ తరగతిలోకి వచ్చిన విద్యార్థులందరికీ ట్యాబ్‌లు అందిస్తాం. ట్యాబ్‌ల ద్వారా విద్యార్థులకు సులువుగా పాఠాలు అర్థమవుతాయి. అందుకు అనుగుణంగానే కంటెంట్ ఉంటుంది' అని సీఎం జగన్ తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ రోజు రాష్ట్ర విద్యారంగంలోనే విప్లవాత్మకమైన రోజు. విద్యారంగంలో సీఎం జగన్ కొత్తశకానికి నాంది పలికారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. విద్యారంగానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలనేదే సీఎం జగన్ లక్ష్యం. ప్రపంచంతో పోటీపడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలనేదే సీఎం ఆకాంక్ష అని అన్నారు. 12:10AM ►ట్యాబ్‌లలో బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి అందిస్తున్న ఏపీ ప్రభుత్వం ►రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్‌లు ఉచిత పంపిణీ ►నెట్‌తో సంబంధం లేకుండా పాఠ్యాంశాలు చూసూ వెసులుబాటు ►బైజూస్ లెర్నింగ్ యాప్‌తో లెక్కలు, ఫిజిక్స్, జువాలజీ, బయాలజీ, జియాలజీ, సివిక్స్, హిస్టరీ పాఠ్యాంశాలు ►తెలుగు ఇంగ్లీష్ హిందీతో పాటు దాదాపు 8 భాషల్లో పాఠ్యాంశాలు ►విద్యార్థులకు అర్థమయ్యేలా సుమారు 2 నుంచి 4 నిమిషాల నిడివితో యానిమేషన్, వీడియోల రూపంలో పాఠ్యాంశాలు ►బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్‌లో మొత్తం 57 చాప్టర్లు్ల, 300 వీడియోలు ►ట్యాబ్‌లపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇప్పటికే ఐటీ విభాగం అవగాహన 12:07AM ►రాష్ట్ర వ్యాప్తంగా 5,18,740 ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ►4,59,564 మంది విద్యార్థులు.. 59,176 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు ►రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులపాటు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం ►నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా 9,703 స్కూళ్లలో బ్యాబ్‌ల పంపిణీ 12:03AM బాపట్ల: యడ్లపల్లి బహిరంగ సభా వేదికపై సీఎం జగన్ ►కాసేపట్లో జడ్పీ హైస్కూల్ 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్న సీఎం జగన్ 11:30AM సీఎం జగన్‌కు ఘనస్వాగతం యడ్లపల్లిలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. దారిపొడవునా పూలు జల్లుతూ హారతులు పడుతూ పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. జన హృదయ విజేత.. నవరత్నాలు పొదిగిన సంక్షేమ సార్వభౌమ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం బాపట్ల జిల్లాకు రానున్నారు. భావి పౌరుల బంగారు భవితకు బాటలు వేసే బృహత్తర కార్యక్రమానికి తన పుట్టిన రోజున శ్రీకారం చుట్టనున్నారు. విద్యాంధ్ర సాధనకు శంఖారావం పూరించనున్నారు. జయీభవ.. ‘విద్య’యీభవ అంటూ విద్యార్థులను దీవించనున్నారు. వరాల రేడు పర్యటన నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు ఆనందభరితులవుతున్నారు. స్వాగతం.. సుస్వాగతం అంటూ జననేతకు జేజేలు పలుకుతున్నారు. సాక్షి, నరసరావుపేట/వేమూరు: ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టడంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రస్థాయి కార్యక్రమానికి బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలోని ఆలపాటి వెంకట రామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాల బుధవారం వేదికవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివ్య హస్తాల మీదుగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజుస్ కంటెంట్‌తో ఉన్న ట్యాబ్‌ల పంపిణీ కోసం సుందరంగా ముస్తాబై వేచిచూస్తోంది. దీనికోసం జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లనూ పూర్తిచేసింది. మంత్రి మేరుగ నాగార్జున, కలెక్టర్ విజయకృష్ణన్, ఉన్నతాధికారులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బాపట్ల జిల్లాగా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రెండోసారి జిల్లాకు వస్తున్నారు. అదీ తన పుట్టిన రోజున జననేత జిల్లాలో పర్యటించనుండడం విశేషం. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పారీ్టశ్రేణులు, ప్రజలు జననేత రాక కోసం ఉత్సాహంగా నిరీక్షిస్తున్నారు. పటిష్ట బందోబస్తు.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు చేపట్టింది. ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం యడ్లపల్లిలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఒక అదనపు ఎస్పీ, ఏడుగురు డీఎస్పీలు, 30 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 50 మంది మహిళా కానిస్టేబుళ్లు, మరో 890 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో కలిపి మొత్తం 1,050 మంది సిబ్బందితో కట్టుదిట్ట చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.మహేష్, డీఎస్పీలు టి.మురళీకృష్ణ, ఎ.శ్రీనివాసరావు, పి.శ్రీకాంత్, ఏఆర్ డీఎస్పీ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ఆనందంగా ఉంది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు మనందరికీ పండుగ రోజు. అటువంటి రోజున ఆయన నా నియోజకవర్గంలో పర్యటించడం సంతోషంగా ఉంది. పేదింటి పిల్లల తలరాతలు మార్చే విద్యకు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమానికి బాపట్ల జిల్లాను ఎంచుకున్నందుకు సీఎంకు ధన్యవాదాలు. – మేరుగ నాగార్జున, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
బాపట్ల జిల్లా యడ్లపల్లిలో పర్యటించనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటించనున్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పర్యటన వివరాలు.. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. 11.00 నుంచి 1.00 వరకు 8 వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. చదవండి: (AP CM YS Jagan: ఒకే ఒక్కడై విజేతగా.. జగన్ అంటే సాహసం) -
పేద విద్యార్థులకు డిజిటల్ విద్య
-
న్యాణ్యమైన విద్య అందించేందుకే ట్యాబ్‌లు: మంత్రి బొత్స
-
ఎక్కడున్నారో చెప్పేస్తుంది!
సాక్షి, ఇందూరు (నిజామాబాద్ అర్బన్): విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వారికి చెక్ పెట్టేందుకు, క్షేత్ర స్థాయిలో సిబ్బంది పనితీరు తెలుసుకునేందుకు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఆయా మండలాల్లో పని చేస్తున్న ఐకేపీ సెర్ప్ ఉద్యోగుల పనితీరును ఇక నుంచి ‘ట్యాబ్’ ద్వారా తెలుసుకోనుంది. క్షేత్ర స్థాయికి వెళ్లి పని చేయకుండా ఎక్కడో ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి నూతన విధానం చెక్ పెట్టనుంది. ఐకేపీలో సెర్ప్ శాఖ తెచ్చిన ఈ నూతన సంస్కరణతో ఇకపై డీపీఎం స్థాయి నుంచి ఎంఏ సీసీల వరకు కచ్చితంగా పని చేయాల్సి ఉంటుంది. క్షేత్ర స్థాయిలో ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడమే కాకుండా మహిళా సంఘాలకు సులభతరమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ట్యాబ్‌లు మన జిల్లాకు చేరుకున్నాయి. జిల్లా ఐకేపీ కార్యాయలంలో మండలాల ఉద్యోగులకు వాటిని పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని ఆరుగురు జిల్లా ప్రాజెక్టు మేనేజర్(డీపీఎం)లు, 32 మంది అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ (ఏపీఎం)లు, 96 మంది కమ్యూనిటీ కో–ఆర్డినేటర్లు, 64 మంది క్లస్టర్ కో–ఆర్డినేటర్లు ఉన్నారు. డీపీఎంలు తప్ప మిగతా ఉద్యోగులు మండల సమాఖ్య కార్యాలయాల్లో పని చేస్తారు. మహిళా సంఘాల కార్యకలాపాలు, సమావేశాలు, బ్యాంకు లింకేజీ రుణాలు, వాటి రికవరీ, ఇతర వివరాల నమోదు, సేకరణ, తదితర పనులన్నీ కమ్యూనిటీ, క్లస్టర్ కో–ఆర్డినేటర్లు క్షేత్ర స్థాయికి వెళ్లి చేయాల్సి ఉంటుంది. అయితే, వీరిలో కొందరు క్షేత్ర స్థాయికి వెళ్లి పని చేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఎక్కడో ఉండి పని చేస్తున్న వారున్నారు. దీంతో మహిళా సంఘాలకు సంబంధించిన కార్యక్రమాలు, పథకాల అమలులో ఆలస్యమతోంది. కాగా క్షేత్ర స్థాయికి వెళ్లి పని చేసినా కాగితాల రూపంలో చేయాల్సి ఉంటుంది. మళ్లీ మండల సమాఖ్య కార్యాలయాలకు వెళ్లి కంప్యూటర్లో నమోదు చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం ట్యాబ్‌లను అందజేయడంతో ఈ పనులన్నీ సులభంగా జరగనున్నాయి. గ్రామాలకు వెళ్లి మహిళా సంఘాల వద్దే వివరాల నమోదు, రుణాలకు దరఖాస్తుల నమోదు సీసీలే చేసుకోవచ్చు. ట్యాబ్‌లోనే సంఘాల పేర్లు, సభ్యురాలి పేరు వెబ్సైట్లోకి వెళ్లి చూడవచ్చు. ఒక విధంగా కాగిత రహిత పాలనగా చెప్పవచ్చు. ఇందుకు ట్యాబ్ వినియోగంపై సెర్ప్ అధికారులు ఐకేపీ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. ఒక్కో ట్యాబ్ విలువ దాదాపు రూ.8వేల వరకు ఉంది. జీపీఆర్ఎస్ అనుసంధానం ఉద్యోగులు సక్రమంగా పని చేయడానికి ట్యాబ్‌లకు జీపీఆర్ఎస్ సిస్టం ఏర్పాటు చేశారు. ఎక్కడుండి పని చేస్తున్నారో దీని ద్వారా ఇట్టే తెలిసి పోతుంది. క్షేత్ర స్థాయికి వెళ్లి పని చేస్తున్నారో లేదో స్పష్టంగా తెలుస్తుంది. జీపీఆర్ఎస్ సిస్టంను హైదరాబాద్ సెర్ప్ కార్యాలయానికి, అలాగే జిల్లా కార్యాలయానికి అనుసంధానం చేశారు. -
స్వయం సహాయక సంఘాలకు ట్యాబ్‌లు
కరన్‌కోట్ : స్వయం సహాయక సంఘాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఆర్థిక వ్యవహారాలతో పాటు కార్యకలాపాలను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ట్యాబ్‌లను అందజేసింది. జిల్లాలో 322 గ్రామసంఘాలకు అధికారులు ట్యాబ్‌లను అందించారు. విడతల వారీగా జిల్లాలోని అన్ని సంఘాలకు వీటిని అందజేయనున్నారు. ట్యాబ్‌లు పంపిణీ చేసిన సంఘాలకు అర్థిక లావాదేవీల నిర్వహణ తీరుపై అధికారులు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ట్యాబ్‌ల ద్వారా రుణం నేరుగా సభ్యురాలికే చేరుతుంది. మరికొన్ని రోజుల్లో ట్యాబ్‌లకు సంఘం సభ్యులందరినీ ఐరిస్ పరిజ్ఞానం ద్వారా అనుసంధానం చేసి వాటి ఆధారంగానే లావాదేవీలు కొనసాగించేలా ప్రణాళిక రూపొందించారు. ట్యాబ్‌లో నమోదు చేసిన కనుబొమ్మను పోలితేనే ఆ సభ్యురాలి ఖాతాలోకి రుణం చేరుతుంది. ట్యాబ్‌ల పంపిణీ ద్వారా రుణాల కోసం మహిళా సంఘాల సభ్యులు పనులు వదులుకొని బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగకుండా ఉపశమనం లభించనుంది. రుణం అవసరరమున్న వారి దరఖాస్తులు, ఫొటోలు, ఫోన్‌నెంబర్, ఆధార్ నెంబర్, బ్యాంకు అకౌంట్ తదితర వివరాలను ట్యాబ్‌ల్లోనే నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆ వివరాలను పరిశీలించి రుణాన్ని మంజూరు చేస్తారు. అనంతరం సంతకాలను ట్యాబ్‌ల ద్వారానే తీసుకుని రుణాల్ని అందజేస్తారు. రుణం తీసుకొన్న తరువాత ప్రతినెలా చెల్లించాల్సిన, చెల్లించిన సొమ్ము, వివరాలను అందులోనే నమోదు చేయాలి. ట్యాబ్‌ల ఆపరేటింగ్ బాధ్యతలను గ్రామ సంఘాల అధ్యక్షురాలు, కోశాధికారి, కార్యదర్శులు చూస్తారు. ఈ విధానం ద్వారా రుణాలు దుర్వినియోగమయ్యే ప్రమాదముండదని అధికారులు అంటున్నారు. అదేవిధంగా కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారి వరకు గ్రామానికి సంబంధించిన వివరాలు క్షణాల్లో తెలుసుకునే వీలు కలిగింది. గ్రేడింగ్ ఆధారంగా కేటాయింపు.. ఇప్పటికే సంఘాల పనితీరుకు ఇస్తున్న గ్రేడింగ్ ఆధారంగానే ట్యాబ్‌లను కేటాయించారు. 11 అంశాలకు 100 మార్కులతో గ్రేడింగ్ ఇచ్చి, 100 మార్కుల్లో 85 నుంచి 100 సాధించిన వారికి (ఎ) గ్రేడ్, 70 నుంచి 85 (బీ), 60 నుంచి 70 (సీ), 50 నుంచి 60 (డీ), 50 కంటే తక్కువ మార్కులు సాధించిన వారికి (ఈ) గ్రేడ్లను ఇస్తున్నారు. ఇందులో ఏ, బీ, సీ గ్రేడ్లు సాధించిన సంఘాలకు ట్యాబ్‌లను కేటాయించారు. జిల్లాలో అర్హత సాధించిన వీవోలకు విడతల వారీగా వీటిని పంపిణీ చేస్తున్నారు. -
కరెంట్‌కు ఇక పక్కా లెక్క
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ బిల్లు ఎంతొచ్చింది.. ఎన్ని నెలల నుంచి కరెంట్ బిల్లు చెల్లింపు జరగకుండా పెండింగ్‌లో ఉంది.. విద్యుత్ మీటర్ ఏ విధంగా నమోదైంది.. విద్యుత్ వినియోగం పల్లెల్లో ఎలా ఉంటోంది.. ఇప్పటి వరకు ఈ వివరాలను తెలుసుకోవాలంటే విద్యుత్ సిబ్బంది సమీపంలోని విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లి తెలుసుకోవాల్సి వచ్చేది. సాధారణ వినియోగదారులే కాకుండా విద్యుత్ శాఖలో పని చేసే ఉద్యోగులదీ ఇదే పరిస్థితి. ఏ సమాచారం కావాలన్నా ఉన్నత స్థాయి అధికారులను అభ్యర్థించాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ప్రతి శాఖలోనూ సాంకేతికత ద్వారా సేవలు సులభతరమయ్యేలా విద్యుత్ శాఖ కసరత్తును ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎస్పీడీసీఎల్ రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పారదర్శకమైన సేవలను అందించేందుకు ఒక అడుగు ముందుకేస్తోంది. ఈ క్రమంలో ఎస్పీడీసీఎల్ పరిధిలోని అన్ని జిల్లాలకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాకు 1262 ట్యాబ్‌లను సరఫరా చేసింది. ట్యాబ్‌ల వినియోగం ఇలా.. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న అన్ని ఉద్యోగులు, సిబ్బందికి ట్యాబ్‌లను పంపిణీ చేయాలనేది విద్యుత్ శాఖ ప్రధాన ఉద్దేశం. ఏఎల్ఎం, జేఎల్ఎం, లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, ఫోర్‌మెన్ స్థాయిలో ఈ ట్యాబ్‌లను అందిస్తారు. విద్యుత్ సబ్స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న ఆపరేటర్లకు వీటిని అందించనున్నారు. వీటి ద్వారా ఇక క్ష్రేత్ర స్థాయిలో విద్యుత్ వినియోగదారుడు బిల్లు చెల్లించకుండా డీ లిస్టులో ఉండే సమాచారం, సబ్స్టేషన్లలో లైన్‌లాస్, ఎనర్జీ, అంతరాయాలు, విద్యుత్ వినియోగం లాంటి అంశాలను తెలుసుకోవడంతో పాటు ఏయే వినియోగదారుడు ఏ నెల ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో తెలుసుకునే వీలు కలుగుతుంది. జిల్లాలోని మొత్తం 254 సబ్స్టేషన్ల పరిధిలోని సిబ్బందికి అందజేసేలా ప్రణాళికలను రూపొందించారు. సిమ్‌కార్డులు మంజూరు కాక ప్రక్రియలో జాప్యం 4జీ సిమ్‌కార్డులు ఇంకా మంజూరు కాకపోవడంతో పంపిణీ ప్రక్రియలో కొంత ఆలస్యమవుతోంది. ట్యాబ్‌లు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యలు, శాఖాపరమైన ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. ట్యాబ్‌ల వినియోగంపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు విద్యుత్ శాఖ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో త్వరలో కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సిమ్‌లు అందగానే ట్యాబ్‌లను పంపిణీ చేసి, ట్యాబ్‌ల విలువ మొత్తాన్ని సిబ్బంది జీతాల్లో విడతల వారీగా కోత వేసేలా అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. -
మహిళా సంఘాలకు ట్యాబ్‌ల పంపిణీ
రామాయంపేట(మెదక్) : మహిళా సంఘాలను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో పాటు, ఆర్థిక çపరిపుష్టి సాధించడానికి వీలుగా గ్రూపు లీడర్లకు ట్యాబ్‌లు అందజేస్తున్నామని స్త్రీశక్తి జోనల్ మేనేజర్ సంజీవరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఐకేపీ భవనంలో వివిధ గ్రూపుల లీడర్లకు ట్యాబ్‌లు అందించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈట్యాబ్‌లు కేవలం రుణప్రక్రియతోపాటు సంఘాల కార్యక్రమాలకు మాత్రమే వినియోగపడుతాయన్నారు. సభ్యులకు రూ. 25 వేలనుంచి రూ. లక్ష వరకు రుణాలిస్తున్నామన్నారు. ఇందుకు రూ. మూడు లక్షలకు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భవిష్యత్తులో సంఘాలకు మరిన్ని పథకాలు అనుసంధానించనున్నారని ఆయన పేర్కొన్నారు. తన పరిధిలో ఉన్న మెదక్, వరంగల్ అర్బన్, జనగాం, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో మొత్తం మూడు వేల సంఘాలుండగా, మొత్తం నాలుగున్నర లక్షల మంది సభ్యులున్నారని సంజివరెడ్డి పేర్కొన్నారు. 2016 నుంచి ఇప్పటి వరకు వడ్డీలేని రుణం (వీఎల్ఆర్) మంజూరు కాలేదని, కాగా రికవరీ మాత్రం 98.8 శాతం ఉందన్నారు. 2018–19లో జోన్ పరిధిలో రూ.421 కోట్లమేర రుణాలిచ్చామని, ప్రతి సభ్యురాలికి రూ. 25 వేల ఉచిత భీమా వర్తిస్తుందని జోన్ మేనేజర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రూపుల లీడర్లకు ట్యాబ్‌ల పనితీరుపై సంఘం రిజీనల్ మేనేజర్ అనంతకిశోర్ శిక్షణ ఇచ్చారు. సమావేశంలో స్థానిక ఏపీఎం సత్యం, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మంజూల, జిల్లా మేనేజర్ వరలక్ష్మి, సీసీలు కిషన్, మల్లేశం, శ్రీనివాసరెడ్డి, స్వరూప, లక్ష్మి, అమృత తదితరులు పాల్గొన్నారు. -
ఈ–జీ వైద్యం
ఖమ్మం వైద్యవిభాగం: ఆధునిక సాంకేతికతను వైద్యసేవలకు విస్తృతపరచడంలో కూడా వినియోగిస్తూ సత్ఫలితాలు సాధించే దిశగా వైద్యశాఖ అడుగులేస్తోంది. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించే ఏఎన్ఎంలకు ట్యాబ్‌లు పంపిణీ చేసింది. ఊళ్లలో వ్యాధుల గుర్తింపు, అందిస్తున్న వైద్యసేవల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసే వెసులుబాటు లభించింది. తద్వారా ఉన్నతాధికారులు అప్రమత్తమై.. తగిన సూచనలు, జాగ్రత్తలు వివరించే అవకాశాలు లభిస్తున్నాయి. ట్యాబ్‌ల ద్వారా పాటలు, వీడియోలు, పుస్తకాలు చూపిస్తూ ముఖ్యంగా తల్లులకు, పిల్లలకు ఆరోగ్య కార్యక్రమాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కాన్పులప్పుడు ఏం చేయాలి..? పిల్లల టీకాలు ఎప్పుడు, ఎక్కడ వేస్తారు..? వీటి ద్వారా కలిగే ప్రయోజనాలను ట్యాబ్‌ల ద్వారా వివరిస్తున్నారు. 224 మందికి ట్యాబ్‌లపై శిక్షణ.. జిల్లాలో 224 సబ్ సెంటర్లలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు ఇటీవల ట్యాబ్‌లు అందజేసి, వీటి వినియోగంపై శిక్షణ కూడా కల్పించారు. సిమ్ కార్డులు అందించి, వివరాల నమోదును ఎలా పొందుపరచాలనే విషయాలు బోధించారు. భవిష్యత్‌లో ఆరోగ్య శాఖలో గల అన్ని సేవల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని, పారదర్శకంగా ఉండాలనే భావనతో ముందుకు సాగుతున్నారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు, కేసులు, కమ్యూనికేబుల్, నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులను కూడా ఈ ట్యాబ్‌లలో పొందుపరచనున్నారు. కాన్పు అనంతరం కేసీఆర్ కిట్‌ను సత్వరం అందజేసి.. ఆ ఫొటోను వెంటనే ఆన్లైన్లో పంపుతున్నారు. ఆస్పత్రులకు కావాల్సిన మందులెన్ని..? ఉన్న వాటిని ఎలా వినియోగిస్తున్నారు..? అనే వివరాలు కూడా ట్యాబ్‌ల ద్వారా తెలుసుకుంటున్నారు. ఏఎన్ఎంలకు ట్యాబ్‌ల పంపిణీతో గ్రామాల్లో అందుతున్న వైద్యసేవల వివరాలు ఎప్పటికప్పుడు తెలుస్తుండడంతో ఇకపై జిల్లావ్యాప్తంగా 185 మంది సెకండ్ ఏఎన్ఎంలకు కూడా ట్యాబ్‌లు అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆన్లైన్లో నమోదయ్యే వివరాలు ఇలా.. గ్రామాల్లో మాతా,శిశు వైద్యసేవల గురించి గర్భిణులు, బాలింతల ఆరోగ్య జాగ్రత్తలు చిన్నపిల్లల టీకాలు, ఆరోగ్య సేవలు రికార్డులు, రిజిష్టర్లలో రాసే విషయాలన్నీ ఇక ట్యాబ్‌లోనే ఉన్నతాధికారులకు ఆన్లైన్లోనే వివరణ జిల్లా అధికారులు నేరుగా సమీక్షించే అవకాశం పారదర్శకంగా వైద్యసేవలు.. ట్యాబ్‌లు అందజేశాక.. గ్రామాల్లో ఎలాంటి వైద్యం అందిస్తున్నారనే వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతున్నాం. అవసరమైన మందులను సకాలంలో సరఫరా చేసేందుకు ఆస్కారం ఏర్పడింది. ప్రస్తుతం మంచి ఫలితాలు వస్తున్నాయి. త్వరలో రెండో ఏఎన్ఎంలకు కూడా ట్యాబ్‌లు ఇస్తాం. – నీలోహన, ఎన్హెచ్ఎం డీపీఓ -
ట్యాబ్‌ల పంపిణీకి ఓకే
- అంగీకరించిననగర పాలక సంస్థ - అనవసర ఖర్చంటున్న విపక్షాలు - విద్యార్థులు చదువుకోడానికే అంటున్న బీఎంసీ ముంబై: నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అంగీకరించింది. ప్రతిపాదనను బీఎంసీ స్టాండింగ్ కమిటీ బుధవారం ఆమోదించింది. అయితే ఇది అనవసరమైన ఖర్చని.. వైఫై, 3జీ సేవలు లేకుండా ట్యాబ్‌లు ఎలా పనిచేస్తాయని ఇతర పార్టీలు వ్యతిరేకించాయి. ‘ ఇంటర్నెట్ లేకుండా ట్యాబ్లెట్ పంపిణీ చేయడం నిజంగా హాస్యాస్పదం. ట్యాబ్లెట్లు పంపిణీ చేస్తామంటూ శివసేన నిధుల్ని వృథా చేస్తోంది. ముంబైని వైఫై నగరంగా తీర్చి దిద్దాలనుకుంటున్న సేన విద్యార్థులు చదువుకుంటున్న మున్సిపల్ పాఠశాలల్లో ఎందుకు ఆ సదుపాయం కల్పించడంలేదు’ అని బీఎంసీలో ఎంఎన్ఎస్ నాయకుడు సందీప్ దేశ్‌పాండే ప్రశ్నించారు. యువసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే గత వారం ప్రధాని మోదీని కలసి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ, డిజిటల్ ఇండియా ప్రచారానికి అది ఎలా ఉపయోగపడతుందన్న విషయాన్ని వివరించారు. సిలబస్, నోట్స్ కలిగిన ట్యాబ్‌లు విద్యార్థులు చదువుకోడానికి ఎంతో ఉపకరిస్తాయని, వారికి పుస్తకాల భారం కూడా తగ్గిస్తాయని ఠాక్రే, ఇతర శివసేన ఎంపీలు చెప్పారు. మరోవైపు ప్రాజెక్టును వెంటనే నిలిపేయాలని, పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా చాలా ఉన్నాయని ఎన్సీపీ ముంబై అధ్యక్షుడు సచిన్ ఆహిర్ అన్నారు. వర్షాకాలంలో బీఎంసీ పాఠశాలల్లోకి నీరు చేరుతోందన్నారు. ట్యాబ్‌లు ఉపయోగించుకోడానికి వారికి సరైన అవగాహన లేదన్నారు. బీఎంసీ ఈ విధంగా ధన్నాన్ని ఎందుకు వృథా చేస్తోందో తనకు అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. అయితే బీఎంసీ మాత్రం భిన్న వాదనలు వినిపిస్తోంది.