
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటించనున్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
పర్యటన వివరాలు..
ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. 11.00 నుంచి 1.00 వరకు 8 వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
చదవండి: (AP CM YS Jagan: ఒకే ఒక్కడై విజేతగా.. జగన్ అంటే సాహసం)