లీడర్లకు ట్యాబ్‌లు అందిస్తున్న అధికారులు
రామాయంపేట(మెదక్) : మహిళా సంఘాలను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో పాటు, ఆర్థిక çపరిపుష్టి సాధించడానికి వీలుగా గ్రూపు లీడర్లకు ట్యాబ్‌లు అందజేస్తున్నామని స్త్రీశక్తి జోనల్ మేనేజర్ సంజీవరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఐకేపీ భవనంలో వివిధ గ్రూపుల లీడర్లకు ట్యాబ్‌లు అందించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈట్యాబ్‌లు కేవలం రుణప్రక్రియతోపాటు సంఘాల కార్యక్రమాలకు మాత్రమే వినియోగపడుతాయన్నారు.
సభ్యులకు రూ. 25 వేలనుంచి రూ. లక్ష వరకు రుణాలిస్తున్నామన్నారు. ఇందుకు రూ. మూడు లక్షలకు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భవిష్యత్తులో సంఘాలకు మరిన్ని పథకాలు అనుసంధానించనున్నారని ఆయన పేర్కొన్నారు. తన పరిధిలో ఉన్న మెదక్, వరంగల్ అర్బన్, జనగాం, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో మొత్తం మూడు వేల సంఘాలుండగా, మొత్తం నాలుగున్నర లక్షల మంది సభ్యులున్నారని సంజివరెడ్డి పేర్కొన్నారు.
2016 నుంచి ఇప్పటి వరకు వడ్డీలేని రుణం (వీఎల్‌ఆర్) మంజూరు కాలేదని, కాగా రికవరీ మాత్రం 98.8 శాతం ఉందన్నారు. 2018–19లో జోన్ పరిధిలో రూ.421 కోట్లమేర రుణాలిచ్చామని, ప్రతి సభ్యురాలికి రూ. 25 వేల ఉచిత భీమా వర్తిస్తుందని జోన్ మేనేజర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రూపుల లీడర్లకు ట్యాబ్‌ల పనితీరుపై సంఘం రిజీనల్ మేనేజర్ అనంతకిశోర్ శిక్షణ ఇచ్చారు.
సమావేశంలో స్థానిక ఏపీఎం సత్యం, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మంజూల, జిల్లా మేనేజర్ వరలక్ష్మి, సీసీలు కిషన్, మల్లేశం, శ్రీనివాసరెడ్డి, స్వరూప, లక్ష్మి, అమృత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment