మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలి: సీఎం జగన్‌ | Tabs Distribution: CM Jagan Alluri Sitarama Raju District Tour Updates | Sakshi
Sakshi News home page

మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలి: సీఎం జగన్‌

Published Thu, Dec 21 2023 9:33 AM | Last Updated on Thu, Dec 21 2023 1:53 PM

Tabs Distribution: CM Jagan Alluri Sitarama Raju District Tour Updates - Sakshi

Updates:

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం: సీఎం జగన్‌
అడవి తల్లి బిడ్డల మధ్య గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నాం
మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలి
మన రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది
8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌ల పంపిణీ 10 రోజుల పాటు చేస్తాం
ప్రతీ ఎమ్మెల్యే ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు
మీ మేనమామగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చా
రూ.620 కోట్లతో 4 లక్షల 34 వేల 185 మంది విద్యార్థులకు ట్యాబ్‌లు
55 నెలలుగా ప్రతీ అడుగు విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా పడింది
పిల్లలకు అవసరమైన బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లు
 

విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం జగన్‌
ట్యాబ్‌లలో చదువుకు సంబంధించిన అంశాలే ఉంటాయి
తల్లిదండ్రులకు ఎలాంటి భయాలు అవసరం లేదు
ట్యాబ్‌లలో సమస్య తలెత్తితే ప్రభుత్వమే రిపేర్‌ చేయిస్తుంది
రిపేర్‌ కాకుంటే కొత్త ట్యాబ్‌ అందజేస్తాం
ప్రతీ క్లాస్‌ రూమ్‌ను అత్యుత్తమ ప్రమాణాలతో తీర్చిదిద్దాం
మేం అందిస్తున్న ట్యాబ్‌ మార్కెట్‌ విలువ రూ.17,500
రూ.15,500 విలువైన బైజూస్‌ కంటెంట్‌ను ఉచితంగా ఇస్తున్నాం
ట్యాబ్‌ల పంపిణీతో ప్రతీ విద్యార్థికీ రూ.33వేల లబ్ధి

నాడు-నేడు రెండో దశ పనులు వేగంగా జరుగుతున్నాయి: సీఎం జగన్‌
త్వరలోనే పనులన్నీ పూర్తి చేస్తాం
మన పిల్లలు ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఎదగాలి
ప్రతీ తరగతి గదిని డిజిటలైజ్‌ చేస్తున్నాం
ట్యాబ్‌తో పిల్లలకు చదువు సులభతరమవుతుంది
మన పిల్లలు ప్రపంచంలోనే దిబెస్ట్‌గా ఉండాలనేదే నా ఆకాంక్ష
వైఎస్సార్‌ అమ్మ ఒడి విద్యార్థుల తల్లిదండ్రులకు ఓ వరం
పేద విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చాం
పిల్లలకు ఇచ్చే ఈ ట్యాబ్ వారికి ట్యూటర్‌గా ఉంటుంది
టోఫెల్‌ పరీక్షకు కూడా మన పిల్లలను తీర్చిదిద్దాలి

అమ్మ ఒడితో మాకు ఎంతో మేలు జరిగింది: విద్యార్థిని
పేద విద్యార్థులకు సీఎం జగన్‌ అండగా నిలిచారు
పేదరికం చదువుకు ఆటంకం కాకూడదన్న జగన్‌ ఆలోచన అద్భుతం
గిరిజన ప్రజల పక్షపాతి సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం
స్కూల్స్‌ రూపురేఖలు మారాయంటే జగనన్నే కారణం

విద్యారంగంలో సీఎం జగన్‌ విప్లవాత్మక మార్పులు తెచ్చారు: ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
నాడు-నేడుతో ప్రభుత్వ స్కూల్స్‌ రూపురేఖలు మారిపోయాయి
సీఎం జగన్‌ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు
పేద విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌ల పంపిణీ ఓ విప్లవాత్మక నిర్ణయం
సీఎం జగన్‌ పేద విద్యార్థులకు డిజిటల్‌ విద్యను అందుబాటులోకి తెచ్చారు.

విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించిన సీఎం జగన్‌
డిజిటల్‌ లెర్నింగ్‌ స్టాల్స్‌ పరిశీలించిన సీఎం
కాసేపట్లో ప్రభుత్వ విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్న సీఎం

చింతపల్లి చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్
కాసేపట్లో‌ 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్న సీఎం

విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్‌
కాసేపట్లో హెలికాప్టర్‌లో చింతపల్లి బయలుదేరనున్న సీఎం

చింతపల్లి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్‌
కాసేపట్లో‌ 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్న సీఎం

  పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తాచాటాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం మేరకు రూ.620 కోట్ల వ్యయంతో బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌ గల 4,34,185 ట్యాబ్స్‌ను 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం ఈ పంపిణీని ప్రారంభించారు.

దాదాపు రూ.17,500కు పైగా మార్కెట్‌ విలువ గల ఒక్కో ట్యాబ్‌.. రూ.15,500 విలువ గల బైజూస్‌ కంటెంట్‌తో కలిపి ప్రతి విద్యార్థికీ రూ.33వేల మేర లబ్ధి చేకూరనుంది. ఇప్పుడిచ్చే ట్యాబ్స్‌తో కలిపి రెండేళ్లలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి రూ.1,305.74 కోట్ల విలువైన 9,52,925 ట్యాబ్‌లను ప్రభుత్వం అందించింది. వీటిల్లో ఎనిమిదో తరగతితో పాటు, 9, 10 తరగతుల బైజూస్‌ కంటెంట్‌ను కూడా లోడ్‌ చేయడంతో పాటు ఇంటర్మీడియట్‌ కంటెంట్‌ కూడా అప్‌లోడ్‌ చేసేందుకు వీలుగా ట్యాబ్‌ సామర్థ్యాన్ని 256 జీబీకి పెంచి అందిస్తున్నారు. ఇక గత ఏడాది విద్యార్థులు, ఉపాధ్యాయులకు 5,18,740 ట్యాబ్స్‌ను పంపిణీ చేశారు. 

ఉచిత ట్యాబ్‌లో ఉన్నత కంటెంట్‌..
ప్రతి ట్యాబ్‌లోను ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లిష్‌, టోఫెల్‌ ప్రిపరేషన్‌లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు జనరేటివ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ‘డౌట్‌ క్లియరెన్స్‌’ అప్లికేషన్‌ ఉంది.  
విద్యార్థులు సులభంగా విదేశీ భాషలు నేర్చుకునేందుకు వీలుగా ‘డ్యులింగో’ యాప్‌ను సైతం ఇన్‌స్టాల్‌ చేసి, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో సైతం పనిచేసేలా ఏర్పాటుచేశారు.  
ప్రస్తుతం 4 నుంచి 10వ తరగతి వరకు ఉచితంగా అందిస్తున్న రూ.15,500 విలువైన బైజూస్‌ కంటెంట్‌ను ఇకపై ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు సైతం అందించనున్నారు.  
తద్వారా 34.3 లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. 
ఈ ట్యాబ్‌ల మెమరీ సామర్థ్యం పెంచడంతో పా­టు ట్యాబ్‌ సంరక్షణకు రగ్డ్‌ కేస్, టెంపర్డ్‌ గ్లాస్‌ వంటి హంగులు సైతం సమకూర్చారు.  
► అవాంఛనీయ సైట్లు, యాప్స్‌ను నిరోధించే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రక్షణతో పాటు మూడేళ్ల వారంటీతో వీటిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement