
సాక్షి,అమరావతి: సీఎం జగన్ ఈ నెల 21న (గురువారం) అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు. 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు అందజేసి, అనంతరం జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.
ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి చింతపల్లి మండలం చౌడుపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి చింతపల్లి చేరుకుని గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో మాట్లాడి ట్యాబ్‌లు అందజేయనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment