సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆపన్నులకు మరోసారి అండగా నిలిచారు. ఆయన గురువారం చింతపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు సీఎంను కలిసి తమ కష్టాలు చెప్పుకొన్నారు. వారి పరిస్థితులను తెలుసుకున్న సీఎం.. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
వెంటనే తగిన సాయం చేసి వారిని ఆదుకోవాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌ను ఆదేశించారు. దీంతో ఆయన వెంటనే ముగ్గురు బాధితులకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.3 లక్షలను వారి ఖాతాల్లో శుక్రవారం జమ చేశారు.
కండరాల వ్యాధితో బాధపడుతున్న చింతపల్లి మండలం గుమ్మడిగొండకు చెందిన అడిగర్ల రమ్యశ్రీ, బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న చింతపల్లి గ్రామానికి చెందిన పంపోతి కొండబాబు, పెరాలసిస్‌తో బాధపడుతున్న చింతపల్లి మండలం దిబ్బగరువుకు చెందిన మోరి కృష్ణవేణిలు ఈ సందర్భంగా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశించిన 24 గంటల వ్యవధిలోనే ఆర్థిక సాయం వారి అకౌంట్లలో జమవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ‘చింతకాయల’కు చెంపదెబ్బలు రాల్తాయ్!
Comments
Please login to add a commentAdd a comment