సాక్షి, అనకాపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఈ నెల 6 తేదీన రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో బాలిక హత్యకు గురవ్వగా, బాలిక కుటుంబాన్ని ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
బాలిక కుటుంబానికి వైఎస్ జగన్ రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. వైఎస్సార్‌సీపీ నేత సుకుమార్ వర్మ బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఇప్పటికే బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు ధైర్యం చెప్పారు.
కాగా, సొంత జిల్లాలో బాలికను ఒక యువకుడు పాశవికంగా కత్తితో పొడిచి చంపినా.. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పట్టించుకోలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. బాలిక మృతదేహం ఆస్పత్రిలో ఉన్న సమయంలో పక్కనే జరిగిన ఒక సన్మాన కార్యక్రమానికి హాజరైన ఆమె.. బాలిక కుటుంబ సభ్యులను కనీసం పరామర్శించలేదు. బాధిత కుటుంబానికి ధైర్యం కూడా చెప్పకపోవడంపట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి.
మరోవైపు, టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. రాజ్యాంగ వ్యవస్థలు కూప్పకూలిపోయాయి. యంత్రాంగం నిస్తేజంగా మారిపోయింది. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి కార్యకర్తలు స్వైరవిహారం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. అత్యంత అనాగరిక సంఘటనలు జరుగుతున్నాయి. అమానవీయ, అమానుష ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment