girl family
-
మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్.. పిఠాపురం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల పిఠాపురంలో అత్యాచారానికి గురైన దళిత బాలిక కుటుంబానికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందించారు. బాధిత కుటుంబానికి పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీతా, జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ఆ చెక్కు అందజేశారు.కూటమి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయి: వంగా గీతఅనంతరం పిఠాపురంలో జరిగిన ఆ పార్టీ ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు. కూటమి పాలనలో చిన్నారులు, మహిళలపై దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నాయని వంగా గీతా మండిపడ్డారు. మహిళలకు భద్రత, ధైర్యం కల్పించాలని వంగా గీత అన్నారు. వైఎస్సార్సీపీని సంస్ధగతంగా పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ఇచ్చినా హమీలను అమలు చేయలేదు. ఇచ్చిన హమీలను నూరు శాతం వైఎస్ జగన్ అమలు చేశారు. కూటమి సర్కార్.. ప్రజలను నమ్మించి హమీలు అమలు చేయకపోవడం అన్యాయం’’ అని ఆమె దుయ్యబట్టారు.మంచి చేసి ఓడిపోయిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ: కురసాల కన్నబాబుప్రజలకు మంచి చేసి ఓడిపోయిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ. నేరుగా ప్రజలకు సేవలందించాలని బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశమంతా చూసేలా వలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. చంద్రబాబులా అబద్దపు హమీలు జగన్ ఇవ్వలేదు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. కులం, మతం చూడకుండా అర్హులకు పథకాలు అందించిన ఘనత వైఎస్సార్సీపీదే. చంద్రబాబూ.. రుషికొండ ప్యాలెస్ కాదు.. పలాసలో నిర్మించిన ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ చూడండీ. పాడేరులో కట్టిన మెడికల్ కళాశాల.. ఉప్పాడలో కట్టిన ఫిషింగ్ హర్బర్‌ను కూడా చూడాలి...అమరావతిలో మీరు కట్టిన సచివాలయానికి ఖర్చు ఎంతో చెప్పండి. కూటమీ ప్రభుత్వంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. దుర్మార్గమైన పరిస్ధితులు వచ్చాయి. పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో.. పోలీసుల పని తీరు ఏలా ఉందో చెప్పారు. ఇసుక, శాంతి భద్రతల సమస్యలు నాకు సంబంధం లేదంటే కుదరదు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు ఎక్కడపడితే అక్కడ అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకువెళ్తున్నారో తెలియదు. అయినా పోలీసులు పని బాగోలేదని కూటమి నాయకులు చెబుతున్నారు. గోతులు పూడ్చడానికి కూడా శంకుస్ధాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబే. చంద్రబాబు ప్రచారం పీక్‌లో ఉంటుంది. వాస్తవం కింద ఉంటుంది.ఇదీ చదవండి: నిజంగా పవన్‌కు ఆ ధైర్యం ఉందా? -
మరోసారి మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్
సాక్షి, అనకాపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఈ నెల 6 తేదీన రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో బాలిక హత్యకు గురవ్వగా, బాలిక కుటుంబాన్ని ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.బాలిక కుటుంబానికి వైఎస్ జగన్ రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. వైఎస్సార్సీపీ నేత సుకుమార్ వర్మ బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఇప్పటికే బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు ధైర్యం చెప్పారు.కాగా, సొంత జిల్లాలో బాలికను ఒక యువకుడు పాశవికంగా కత్తితో పొడిచి చంపినా.. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పట్టించుకోలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. బాలిక మృతదేహం ఆస్పత్రిలో ఉన్న సమయంలో పక్కనే జరిగిన ఒక సన్మాన కార్యక్రమానికి హాజరైన ఆమె.. బాలిక కుటుంబ సభ్యులను కనీసం పరామర్శించలేదు. బాధిత కుటుంబానికి ధైర్యం కూడా చెప్పకపోవడంపట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి.మరోవైపు, టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. రాజ్యాంగ వ్యవస్థలు కూప్పకూలిపోయాయి. యంత్రాంగం నిస్తేజంగా మారిపోయింది. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి కార్యకర్తలు స్వైరవిహారం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. అత్యంత అనాగరిక సంఘటనలు జరుగుతున్నాయి. అమానవీయ, అమానుష ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. -
రెండెళ్ల ప్రేమ.. పాయిజన్ తాగిన యువకుడు..
సాక్షి, కొత్తగూడెంటౌన్ (ఖమ్మం): ప్రేమించిన అమ్మాయి దూరమైందని, అమ్మాయి తరఫువారు పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు పాయిజన్ తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తగూడెం పెనగడప గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. చుంచుపల్లి మండలం అంబేడ్కర్‌నగర్ గ్రామానికి చెందిన ఏసుపాక గణేశ్ (22) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వారి కుటుంబ సభ్యులను అడుగగా వారు నిరాకరించారు. మనస్తాపానికి గురైన గణేశ్ పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గణేశ్ తల్లి స్వరూప ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్ల కిందట గణేశ్.. సదరు అమ్మాయి ప్రేమించుకున్నారని, పెద్ద మనుషుల సమక్షంలో ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామని అమ్మాయి కుటుంబ సభ్యులు మాట ఇచ్చి తప్పారని చెప్పింది. తన కుమారుడిని ఇష్టం వచ్చినట్లు తిట్టి పెళ్లి చేయమని చెప్పారని, ఊరిని వదిలిపోవాలని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గణేశ్ బుధవారం రాత్రి పాయిజన్ తాగి పడిపోగా స్నేహితులు ఆస్పత్రిలో చేర్పించారని, గురువారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ గణేశ్ మృతిచెందాడని స్వరూప వెల్లడించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సత్యనారాయణ తెలిపారు. చదవండి: Madhya Pradesh: డెయిరీ ముసుగులో వ్యభిచార దందా.. -
మైనర్ బాలిక కుటుంబంపై నాటు తుపాకీతో కాల్పులు
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం కడప నత్తంలో నాటు తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. మైనర్ బాలిక కోసం ఓ యువకుడి నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. వివరాల్లో వెళ్తే.. కడప నత్తం గ్రామంలో చాంద్ భాషా అనే యువకుడు తనతో ఫోన్ మాట్లాడాలంటూ.. ఓ మైనర్ బాలికను తరచూ వేధిస్తున్నాడు. అతనితో ఫోన్ మాట్లాడటానికి ఆ బాలిక నిరాకరించి, వేధింపుల గురించి తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో కోపం పెంచుకున్న ఆ యువకుడు అర్ధరాత్రి సమయంలో బాలిక నివాసం వద్దకు వచ్చి నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. బాలిక తల్లిదండ్రులు కాల్పుల నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: దారుణం: భార్య, ఆమె ప్రియుడిపై కత్తి, బండరాళ్లతో.. -
రక్షణ కోరిన ప్రేమజంట
నెల్లూరు(నవాబుపేట), న్యూస్‌లైన్: వారిద్దరూ ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మతాలు వేరుకావడంతో ఇరు కుటుం బాలు పెళ్లికి అంగీకరించలేదు. అమ్మాయికి ఆమె కుటుంబం బలవంతంగా మరో యువకుడితో పెళ్లి చేసింది. ఆ పెళ్లి ఇష్టం లేని యువతి రెండు రోజులకే ఇంటి నుంచి వెళ్లిపోయి స్నేహితుడినే పెళ్లాడింది. పెద్దల నుంచి బెదిరింపులు రావడంతో వారిద్దరూ ఆదివారం నెల్లూరు ఐదో నగర పోలీసులను ఆశ్రయించారు. కొండాయపాళెం గేటు వనంతోపు సెంటర్‌కు చెందిన చెందిన షేక్ షరీఫ్ కొయ్యపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెం దిన భారతితో అతనికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మతాలు వేరుకావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించ లేదు. మనస్తాపానికి గురైన భారతి ఆత్మహత్యాయత్నం చేసింది. అత్రిలో చికిత్స పొంది కోలుకుంది. అనంతరం ఆమెకు తల్లిదండ్రులు బలవంతంగా మరో యువకుడితో గత నెల 25వ తేదీ పెళ్లి చేశారు. ఆ పెళ్లి ఇష్టం లేని భారతి 27వ తేదీ రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అదే రోజు జొన్నవాడలోని కామాక్షితాయి సన్నిధిలో షరీఫ్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరూ ఆది వారం ములుమూడి బస్టాండ్ ప్రాంతంలో ఉన్నారనే సమాచారం అందుకున్న భారతి కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని దాడికి యత్నించారు. వారి నుంచి తప్పించుకుని రక్షణ కల్పించాలని కోరుతూ ఐదో నగర పోలీసులను ఆశ్రయించారు.