మానవత్వం చాటుకున్న వైఎస్‌ జగన్‌.. పిఠాపురం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం | YS Jagan Financial Assistance Of Rs 5 Lakh To The Girl Family In Pithapuram | Sakshi
Sakshi News home page

మానవత్వం చాటుకున్న వైఎస్‌ జగన్‌.. పిఠాపురం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

Nov 6 2024 7:29 PM | Updated on Nov 6 2024 9:02 PM

YS Jagan Financial Assistance Of Rs 5 Lakh To The Girl Family In Pithapuram

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల పిఠాపురంలో అత్యాచారానికి గురైన దళిత బాలిక కుటుంబానికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందించారు. బాధిత కుటుంబానికి పిఠాపురం వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ వంగా గీతా, జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ఆ చెక్కు అందజేశారు.

కూటమి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయి: వంగా గీత
అనంతరం పిఠాపురంలో జరిగిన ఆ పార్టీ ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు. కూటమి పాలనలో చిన్నారులు, మహిళలపై దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నాయని వంగా గీతా మండిపడ్డారు. మహిళలకు భద్రత, ధైర్యం కల్పించాలని వంగా గీత అన్నారు. వైఎస్సార్‌సీపీని సంస్ధగతంగా పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ఇచ్చినా హమీలను అమలు చేయలేదు. ఇచ్చిన హమీలను నూరు శాతం వైఎస్ జగన్ అమలు చేశారు. కూటమి సర్కార్‌.. ప్రజలను నమ్మించి హమీలు అమలు చేయకపోవడం అన్యాయం’’ అని ఆమె దుయ్యబట్టారు.

మంచి చేసి ఓడిపోయిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ: కురసాల కన్నబాబు
ప్రజలకు మంచి చేసి ఓడిపోయిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ. నేరుగా ప్రజలకు సేవలందించాలని బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశమంతా చూసేలా వలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. చంద్రబాబులా అబద్దపు హమీలు జగన్ ఇవ్వలేదు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. కులం, మతం చూడకుండా అర్హులకు పథకాలు అందించిన ఘనత వైఎస్సార్‌సీపీదే. చంద్రబాబూ.. రుషికొండ ప్యాలెస్  కాదు.. పలాసలో నిర్మించిన ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ చూడండీ. పాడేరులో కట్టిన మెడికల్ కళాశాల.. ఉప్పాడలో కట్టిన ఫిషింగ్ హర్బర్‌ను కూడా చూడాలి.

..అమరావతిలో మీరు కట్టిన సచివాలయానికి ఖర్చు ఎంతో చెప్పండి. కూటమీ ప్రభుత్వంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. దుర్మార్గమైన పరిస్ధితులు వచ్చాయి. పవన్ కల్యాణ్‌ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో.. పోలీసుల పని తీరు ఏలా ఉందో చెప్పారు. ఇసుక, శాంతి భద్రతల సమస్యలు నాకు సంబంధం లేదంటే కుదరదు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు ఎక్కడపడితే అక్కడ అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకువెళ్తున్నారో తెలియదు. అయినా పోలీసులు పని బాగోలేదని కూటమి నాయకులు చెబుతున్నారు. గోతులు పూడ్చడానికి కూడా శంకుస్ధాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబే. చంద్రబాబు ప్రచారం పీక్‌లో ఉంటుంది. వాస్తవం కింద ఉంటుంది.

ఇదీ చదవండి: నిజంగా పవన్‌కు ఆ ధైర్యం ఉందా?

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement