నెల్లూరు(నవాబుపేట), న్యూస్‌లైన్: వారిద్దరూ ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మతాలు వేరుకావడంతో ఇరు కుటుం బాలు పెళ్లికి అంగీకరించలేదు. అమ్మాయికి ఆమె కుటుంబం బలవంతంగా మరో యువకుడితో పెళ్లి చేసింది. ఆ పెళ్లి ఇష్టం లేని యువతి రెండు రోజులకే ఇంటి నుంచి వెళ్లిపోయి స్నేహితుడినే పెళ్లాడింది. పెద్దల నుంచి బెదిరింపులు రావడంతో వారిద్దరూ ఆదివారం నెల్లూరు ఐదో నగర పోలీసులను ఆశ్రయించారు.
కొండాయపాళెం గేటు వనంతోపు సెంటర్‌కు చెందిన చెందిన షేక్ షరీఫ్ కొయ్యపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెం దిన భారతితో అతనికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మతాలు వేరుకావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించ లేదు. మనస్తాపానికి గురైన భారతి ఆత్మహత్యాయత్నం చేసింది.
అత్రిలో చికిత్స పొంది కోలుకుంది. అనంతరం ఆమెకు తల్లిదండ్రులు బలవంతంగా మరో యువకుడితో గత నెల 25వ తేదీ పెళ్లి చేశారు. ఆ పెళ్లి ఇష్టం లేని భారతి 27వ తేదీ రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అదే రోజు జొన్నవాడలోని కామాక్షితాయి సన్నిధిలో షరీఫ్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరూ ఆది వారం ములుమూడి బస్టాండ్ ప్రాంతంలో ఉన్నారనే సమాచారం అందుకున్న భారతి కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని దాడికి యత్నించారు. వారి నుంచి తప్పించుకుని రక్షణ కల్పించాలని కోరుతూ ఐదో నగర పోలీసులను ఆశ్రయించారు.
రక్షణ కోరిన ప్రేమజంట
Published Mon, Sep 2 2013 4:41 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM
Advertisement
Advertisement