రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ఖుషి. ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. అయితే ఓ షోలో పాల్గొన్న విజయ్ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
(ఇది చదవండి: సమంత, విజయ్ 'ఖుషి'.. క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది!)
తాజాగా విజయ్ పాల్గొన్న టీవీ షోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోలో పాల్గొన్న విజయ్‌ను యాంకర్ అతని పెళ్లి గురించి ప్రశ్నించింది. అయితే దీనికి విజయ్ క్రేజీ ఆన్సరిచ్చారు. మా ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు. అమ్మ, నాన్న కూడా మనవళ్లు కావాలని అడుగుతున్నారు. కానీ నాకు ఇప్పుడే మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం లేదంటూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం తన పెళ్లి గురించి విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి.
కాగా.. ఇటీవల ఖుషి ట్రైలర్ లాంచ్ సందర్భంగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. రెండేళ్లలో పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పేశాడు. విజయ్ దేవరకొండ, సమంతా నటించిన ఖుషి చిత్రం ప్రేమ కథ చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలోజయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, లక్ష్మి, రోహిణి, అలీ, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతమందించారు.
(ఇది చదవండి: ఖుషి రెమ్యునరేషన్.. ఒక్కొక్కరు అన్ని కోట్లు తీసుకున్నారా?)
Comments
Please login to add a commentAdd a comment