రెండేళ్ల ప్రేమ.. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడంతో.. | Lovers Suicide Over Parents Not Accept Their Marriage Karnataka | Sakshi
Sakshi News home page

రెండేళ్ల ప్రేమ.. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడంతో..

Published Thu, Apr 7 2022 7:47 AM | Last Updated on Thu, Apr 7 2022 8:30 AM

Lovers Suicide Over Parents Not Accept Their Marriage Karnataka - Sakshi

సావిత్రి, బసవరాజు (ఫైల్‌)

హుబ్లీ(బెంగళూరు): పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ధార్వాడ జిల్లా, నవలగుంద తాలూకా, గడేహాళకు చెందిన సావిత్రి(22), బసవరాజు(24)లు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమకు వివాహం చేయాలని పెద్దలను కోరగా కులాలు వేరు కావడంతో అంగీకరించలేదు. దీనికితోడు అమ్మాయి తల్లిదండ్రులు కొత్త పెళ్లి సంబంధం చూస్తున్నారు. దీంతో ప్రేమజంట మంగళవారం విషం సేవించింది.  తాలూకా ఆస్పత్రికి తరలిస్తుండగా సావిత్రి మార్గం మధ్యలో మృతి చెందింది. బసవరాజు చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. నవలగుంద పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.  

మరో ఘటనలో..
క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌
సాక్షి,బళ్లారి: నగరంలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తుండగా కౌల్‌బజార్‌ పోలీసులు బుధవారం మెరుపుదాడులు నిర్వహించారు. కోట ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ జావేద్‌(22) వెంకటరమణ నగర్‌కు చెందిన ప్రకాష్‌ (27), బసవకుంటకు చెందిన విజయ్‌కుమార్‌ (22),కృష్ణమూర్తి(42)లను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.1.13 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

చదవండి: యువకుని హత్య.. ముదురుతున్న రాజకీయ వివాదం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement