
కరీంనగర్ సిటీ: నేటి యువత చదువుకుంటూనే.. జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ముందుకు సాగుతున్నారు. విద్య, ఉద్యోగం, జీవితంలో స్థిరపడడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ప్రేమ పెళ్లి వద్దు..పెద్దలు కుదిర్చిన పెళ్లి ముద్దు అంటున్నారు. మరికొందరు సరైన సమయంలో వివాహం జరగాలని చెబుతున్నారు. ప్రేమికుల దినోత్సవం నేపథ్యంలో కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం డిబేట్ నిర్వహించగా.. వారి అభిప్రాయాలు వెల్లడించారు.
అర్థం చేసుకుంటే బెటర్
ప్రేమ వివాహాలతో ఎదుటి వారి వ్యక్తిత్వం, ప్రవర్తన ముందుగానే తెలుసుకోవచ్చు. వారిపై మనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. వారితో వివాహబంధం ముందుకు సాగుతుందా లేదా తెలుస్తుంది. కొంతవరకూ ప్రేమపెళ్లిలు మంచివే. ఏ బంధం అయినా అర్థం చేసుకుని సర్దుకుపోతే నిలుస్తుంది.– శ్రీజ, విద్యార్థిని
పెద్దలు కుదిర్చినదే..
పెద్దలు అన్ని రకాలుగా మంచిగానే ఆలోచిస్తారు కాబట్టి వారి నిర్ణయం బలంగా ఉంటుందని నా నమ్మకం. వివాహ బంధంలో ఏదైనా సమస్యలు వచ్చినా పెద్దలు ముందుకు వచ్చి పరిష్కరిస్తారు. జీవితంలో మంచి సపోర్టుగా ఉంటారు. పెద్దలను విస్మరించి కొందరు ప్రేమ పేరుతో మోసపోతున్నారు.– వినోద, విద్యార్థిని
ప్రేమ వివాహాలపై 110మంది యువతులను వివిధ ప్రశ్నలు అడుగగా.. వెల్లడించిన అభిప్రాయాలు
టీనేజీ ప్రేమపై మీ అభిప్రాయం
65- ఆకర్షణ మాత్రమే
45 -టీనేజ్‌లో ప్రేమ అవసరం లేదు
85- కెరియర్ ఫస్ట్
సరైన సమయంలో పెళ్లి అవసరం ప్రేమపై సోషల్ మీడియా ప్రభావం ఉందా?
80-చాలా ఉంది
ఎలాంటి ప్రభావం లేదు-30
60 - పెద్దలు కుదిర్చింది
ప్రేమ వివాహం ప్రేమించి పెద్దలను ఒప్పించాలి- 30
ఇదీ చదవండి: Valentine's Day పబ్లిక్ టాక్.. లవ్‌లో పడితే జాగ్రత్త.. భయ్యా!
ఒప్పించి.. మెప్పించాలి
ఒక మనిషి గురించి పూర్తిగా అర్థం చేసుకుని, వారి గురించి పెద్దలకు వివరించి ఒప్పించాలి. ప్రేమించి పెద్దల సహకారంతో వివాహం చేసుకుంటే జీవితం అనందంగా ఉంటుంది. ఉన్నత చదువులతో జీవితం ఆర్థికంగా నిలదొక్కుకుంటేనే ఏదైనా సాధ్యం. పెద్దలు చేసిన పెళ్లిలు సైతం విడిపోతున్నాయి కదా.
– భానుమతి, విద్యార్థిని
కుటుంబ జోక్యంతోనే
పెద్దలు కుదిర్చిన, ప్రేమ పెళ్లి ఏదైనా దంపతుల మధ్య కుటుంబాల జోక్యంతో విడిపోతున్నాయి. చాలా వరకూ అమ్మాయి ఇంటి వద్ద పెరిగిన విధంగానే అత్తవారింట్లో ఉండాలని అనుకుంటారు. కాని అలా ఉండదు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు కావాలి. అబ్బాయిలు కూడా నమ్మి వచ్చిన వారిని మంచిగా చూసుకోవాలి. – సిరిచందన, విద్యార్థిని
Comments
Please login to add a commentAdd a comment