సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ కార్యకర్తకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. విశాఖ తూర్పు నియోజకవర్గం తొమ్మిదో వార్డుకు చెందిన ఉమ్మడి అప్పారావుకు రూ.50 వేలు ఆర్థిక సహాయం చేశారు. అప్పారావుకు వైవీ సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్, మేయర్ హరి వెంకటకుమారి చెక్కును అందజేశారు.
కాగా.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చిలకలపూడి ఎన్టీఆర్ కాలనీకి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త మిద్దె బాబీ, అతని భార్యపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఇంట్లోని సామగ్రి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. గాయపడిన బాబీ దంపతులు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నా టీడీపీ శ్రేణులు బెదిరించాయి. ఈ ఘటనపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేర్ని కిట్టు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారి పరిస్థితిని పార్టీ అధిష్టానానికి వివరించారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పంపిన రూ.50 వేల చెక్కును పేర్ని కిట్టు, నగర మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ.. బాధితుడికి శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ శీలం భారతి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment