chintapalli
-
మన్యంలో మంచుతెరలు
సాక్షి, పాడేరు:మన్యంలో రెండు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ముందస్తు చలిగాలుల వ్యాప్తితో మన్యం వాసులు ఉదయం, సాయంత్రం చలిబారిన పడుతున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా శీతాకాలం రాకముందే మన్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో బుధవారం 16.5 డిగ్రీలు, గురువారం 17 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు రోజులుగా పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 18 డిగ్రీలు, అరకులోయ కాఫీ బోర్డులో 18.7 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.దట్టంగా పొగమంచుఏజెన్సీలోని అన్ని ప్రాంతాల్లోనూ పొగమంచు దట్టంగా కురుస్తోంది. వేకువజామున ఉదయం 8 గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు. పొగమంచు తీవ్రతతో వాహన చోదకులు పగటిపూట కూడా హెడ్లైట్లు ఆన్ చేసుకుని వాహనాలు నడుపుతున్నారు. తుపాను ప్రభావంతోనే..తుపాను కారణంగా ఏజెన్సీలో చలిగాలులు అధికమయ్యాయి. నవంబర్ మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతాయి. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా చలితీవ్రత అధికంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిసెంబర్ నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలలోపు పడిపోయే అవకాశం ఉంది. – డాక్టర్ అప్పలస్వామి, ఏడీఆర్, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం -
సైబీరియన్ కొంగలు ఎక్కడ ?
-
సీఎం జగన్ పెద్ద మనసు.. ఆపన్నులకు అండగా..
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆపన్నులకు మరోసారి అండగా నిలిచారు. ఆయన గురువారం చింతపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు సీఎంను కలిసి తమ కష్టాలు చెప్పుకొన్నారు. వారి పరిస్థితులను తెలుసుకున్న సీఎం.. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వెంటనే తగిన సాయం చేసి వారిని ఆదుకోవాలని కలెక్టర్ సుమిత్కుమార్ను ఆదేశించారు. దీంతో ఆయన వెంటనే ముగ్గురు బాధితులకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.3 లక్షలను వారి ఖాతాల్లో శుక్రవారం జమ చేశారు. కండరాల వ్యాధితో బాధపడుతున్న చింతపల్లి మండలం గుమ్మడిగొండకు చెందిన అడిగర్ల రమ్యశ్రీ, బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న చింతపల్లి గ్రామానికి చెందిన పంపోతి కొండబాబు, పెరాలసిస్‌తో బాధపడుతున్న చింతపల్లి మండలం దిబ్బగరువుకు చెందిన మోరి కృష్ణవేణిలు ఈ సందర్భంగా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశించిన 24 గంటల వ్యవధిలోనే ఆర్థిక సాయం వారి అకౌంట్లలో జమవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: ‘చింతకాయల’కు చెంపదెబ్బలు రాల్తాయ్! -
చింతపల్లిని వణికిస్తున్న చలిపులి
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): జిల్లాలోని ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకులోయ, చింతపల్లిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 7 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 8.3 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రోజుల వ్యవధిలోనే భారీగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో గిరిజనులు వణికిపోయారు. పాడేరు మండలం మినుములూరులో 11డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ అంతటా పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 10 గంటలకు కూడా మంచు తెరలు అలుముకుంటున్నాయి. చింతపల్లితో పాటు లంబసింగి, గూడెంకొత్తవీధి ప్రాంతాల్లో ప్రయాణికులు కూడా చలి తీవ్రతకు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. -
చింతపల్లి: ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
CM YS Jagan Birthday Celebrations:విద్యార్థుల మధ్య ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు (ఫొటోలు)
-
AP CM YS Jagan Chintapalli Tour: జగన్ నినాదాలతో హోరెత్తిన చింతపల్లి (ఫొటోలు)
-
పేదలకు మంచి చేస్తుంటే ఎందుకీ కడుపు మంట: సీఎం జగన్
సాక్షి, అల్లూరి జిల్లా: విద్యార్థులకు మంచి చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారని, విద్యార్థులకు చెడు చేస్తున్నామంటూ తప్పుడు రాతలు రాశారంటూ ఎల్లో మీడియాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘‘గిట్టని వాళ్లు జగన్ దుబారా చేస్తున్నాడంటూ మాట్లాడుతున్నారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా పేదలకు ఈ స్థాయిలో ఖర్చుచేయలేదు. ఖర్చు చేసే ప్రతీ రూపాయి భావితరాల కోసమే’’ అని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎనిమిదో తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్ పంపిణీ చేపట్టింది. పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తాచాటాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం మేరకు రూ.620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ గల 4,34,185 ట్యాబ్స్‌ను 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి సీఎం జగన్.. గురువారం ఈ పంపిణీని ప్రారంభించారు. ‘‘పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే. విద్యార్థులకు మంచి చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారు. విద్యార్థులకు చెడు చేస్తున్నామంటూ తప్పుడు రాతలు రాశారు. పేద విద్యార్థులపై విషం కక్కొద్దని చెబుతున్నా. దిగజారుడు రాతలు రాయొద్దని చెబుతున్నా. పేద పిల్లల చేతిలో ట్యాబ్‌లు ఉంటే చెడిపోతారంట. పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదవద్దా?. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు అంతరించుకుపోతుందట. పేదలకు మంచి చేస్తుంటే మీకెందుకు ఈ కడుపుమంట. పేదల పిల్లలకు మంచి చేస్తుంటే కొందరు ఏడుస్తున్నారు. ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలతో యుద్ధం చేస్తున్నాం’’ అంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. నాకు కొండంత అండ అడవితల్లి బిడ్డలు దేవుడుదయ మీ అందరి చల్లని దీవెనలతో ఈ రోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడ నుంచి చేస్తున్నాం. నా గిరిపుత్రుల స్వచ్చమైన మనసులు మధ్య నాకు కొండంత అండగా నిలబడే అడవితల్లి బిడ్డల మధ్య, పేదల బిడ్డల బంగారు భవిష్యత్ కోసం ఒక గొప్ప కార్యక్రమం ఇవాల ఇక్కడ నుంచి జరుగుతుంది. ఈ మంచి కార్యక్రమం నా పుట్టిన రోజున మీ అందరి ఆశీస్సులు కోరుతూ... మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతల మధ్య జరుపుకోవడం దేవుడి నాకిచ్చిన అదృష్టం. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా చిట్టితల్లులు, పిల్లలు, నా అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు, సోదరులు, స్నేహితులు మధ్య ఈ కార్యక్రమం జరుపుకుంటూ.. మీ అందరి ప్రేమానురాగాలకు హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. మన పిల్లలే మన భవిష్యత్– మన వెలుగు ఈ రోజు ఇక్కడ నా ఎదుట ఉన్న పిల్లలు, రాష్ట్రంలో ప్రతి ఇంట ఉన్న పిల్లలు.. వీరే మన భవిష్యత్. వీరంతా మన వెలుగులు. వీరంతా మన తర్వాత, మనం వెళ్లిపోయిన తర్వాత కూడా మన రాష్ట్ర భవిష్యత్తును నిలిపే మన వారసులు. వీరి భవిష్యత్తు గురించి ఆలోచించి.. మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రపంచంలో పోటీపడే పరిస్థితిలోకి రావాలి. ఆ పోటీలో మన పిల్లలు గెలవాలని ఆశిస్తూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే 55 నెలలుగా ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చే దిశగా పడింది. అందులో భాగంగానే వరుసగా రెండో ఏడాది ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న 8వతరగతి పిల్లలకు ట్యాబులిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజులు ట్యాబుల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా 10 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే ప్రతిమండలాన్ని సందర్శిస్తూ...ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా 10 రోజులపాటు 8వతరగతి పిల్లలకు ట్యాబులిచ్చే కార్యక్రమం జరుగుతుంది. ట్యాబుల పంపిణీ దశాబ్దంలోనే గొప్ప మార్పు ఇవాళ మనం ఇచ్చేవి కేవలం ట్యాబులు మాత్రమే కాదు. ప్రతి చెల్లెమ్మకూ ఒక మంచి అన్నగా, ప్రతి పిల్లాడికి,పాపకు ఒక మంచి మేనమామగా మన పిల్లలు మీద, మన పేద కుటుంబాల మీద మమకారంతో, తరతరాల పేదరికం సంకెళ్లు తెంచేందుకు, భవిష్యత్తును మార్చేందుకు తీసుకొస్తున్న అనేక గొప్ప మార్పుల్లో ఈ ట్యాబులు పంపిణీ కూడా గొప్ప మార్పుగా రాబోయే దశాబ్దకాలంలో నిల్చిపోతుంది. ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ బడులలో చదువుతున్న 8వతరగతి పిల్లలకు 4,34,185 మందికి రూ.620 కోట్లు ఖర్చు చేస్తూ మన పిల్లల చేతుల్లో ట్యాబులు పెడుతున్నాం. డిజిటల్‌విప్లవంలో భాగంగానే గతేడాది కూడా నా పుట్టిన రోజున రూ.686 కోట్లతో 5.18లక్షల ట్యాబులను పిల్లలకు, చదువులు చెబుతున్న టీచర్లకు పంపిణీ చేసాం. పిల్లలకు అవసరమైన బైజూస్ కంటెంట్‌ను కూడా ప్రతి ట్యాబులోనూ ఆఫ్‌లైన్‌లో సైతం పనిచేసేటట్టుగా అప్లోడ్ చేసి మరి ట్యాబులు పంపిణీ చేస్తున్నాం. ప్రతి పిల్లాడికి పాఠాలన్నీ పూర్తిగా, సులభంగా అర్ధం అయ్యేటట్టుగా, కష్టాన్ని తగ్గించేటట్టుగా బైజూస్ కంటెంట్ లోడ్ చేసి పిల్లలకు అండగా నిలబడుతున్నాం. ఈ ట్యాబుల విషయంలో నేను పిల్లలకు చెబుతున్నా.. ట్యాబులు రిపేరుకు వస్తే ఎవరూ కంగారుపడకండి. మీ హెడ్ మాష్టారు దగ్గరికి వెళ్లి చెడిపోయిందని రిపేరుకిచ్చినా, లేదా తల్లిదండ్రులతో పాటు గ్రామసచివాలయం దగ్గరకు వెళ్లి ఇచ్చినా రెండు చోట్ల రశీదు ఇస్తారు. వారం రోజుల్లోనే మీ ట్యాబ్ రిపేరు చేసి ఇస్తారు.ఒకవేళ రిపేరు చేయలేకపోతే ఇంకో ట్యాబు మీ చేతిలో పెడతారు. ఈ ట్యాబుల విషయానికొస్తే... ఇవి సెక్యూర్డ్ మొబైల్ డివైస్ మేనేజిమెంట్ అనే సాప్ట్వేర్ పెడ్డడం జరిగింది. దీనివల్ల పిల్లలు పాఠాలు, లెర్నింగ్‌కు సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు. పిల్లలు ఏం చూశారు, ఏం చదివారు అన్నది టీచర్లకు, తల్లిదండ్రులకు ఈ సాప్ట్వేర్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు ఎలాంటి ఆందోళన, భయాలు అవసరం లేదు. ఈ ట్యాబులన్నీ పిల్లలకు వాళ్ల చదువుల్లో మంచిచేసే ఒక గొప్ప ఇంధనంగా ఉంటుందని చెబుతున్నాను. రూ.33వేల ఖరీదు చేసే ట్యాబ్, కంటెంట్ ఉచితంగానే ఒక్కో పిల్లాడు చేతిలో పెడుతున్న ఈ ట్యాబ్ మార్కెట్ విలువ రూ.17,500. దీనికి తోడూ బైజూస్ కంటెంట్‌ను ఇస్తున్నాం. ఎవరైనా శ్రీమంతులు పిల్లలు వెళ్లి బైజూస్ కంటెంట్‌ను కొనుగోలు చేసి, డౌన్లోడ్ చేసుకోవాలంటే రూ.15వేలు కడితే తప్ప డౌన్లోడ్ చేసుకోలేని పరిస్ధితి. అలాంటి ఈ కంటెంటెన్ ఉచితంగా డౌన్లోడ్ చేసి, ఈ ట్యాబులుతో సహా ఇస్తున్నాం. ఇవాళ 8వతరగతి విద్యార్ధి తన చేతిలో పెట్టుకున్న ఈ ట్యాబ్, కంటెంట్ విలువతో కలుపుకుంటే రూ.33వేలు విలువ చేస్తుంది. మన పిల్లలు ప్రపంచంలోనే నంబర్‌వన్ కావాలని.. ఈ పిల్లలందరినీ ఇంత ఖర్చు చేసి ఈ పిల్లల చేతుల్లో ఎందుకు పెడుతున్నామంటే.. నా పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలవాలన్న తలంపుతో వాళ్ల మేనమామగా ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఒకవైపు ట్యాబుల పంపిణీ చేస్తూనే.. మరోవైపున ప్రతి స్కూళ్లో 6వతరగతి నుంచి పైబడిన ప్రతి తరగతి గదినీ డిజిటలైజ్ చేసే కార్యక్రమంలో అడుగులు వేగంగా పడుతున్నాయి. నాడు నేడు పూర్తి చేసుకున్న 6వతరగతి నుంచి 12వతరగతి వరకు ఉన్న ప్రతి తరగది గదిలోనూ ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానెల్స్(ఐఎఫ్పి)లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి తరగతిగదినీ డిజిటలైజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. నాడు– నేడుతో సమూల మార్పులు ఇందులో భాగంగా నాడు నేడు మొదటిదశ పూర్తి చేసుకున్న స్కూళ్లలో 15,715 స్కూళ్లలో 6వతరగతి ఆపై ఉన్న 32,213 క్లాస్‌రూంలలో ఇప్పటికే ఐఎఫ్‌పిలు పెట్టి డిజిటలైజ్ చేశాం. అదే విధంగా 1 నుంచి 5వతరగతి వరకు స్కూళ్లలో ఇంగ్లిషు ల్యాబ్‌లు తీసుకువచ్చాం. వాటన్నింటిలోనూ స్మార్ట్ టీవీలు ఏర్పాటులో భాగంగా .. దాదాపు 10,038 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశాం. ఈ ఐఎఫ్‌పీలు, క్లాస్‌రూంల డిజిటౖలñ జేషన్ కోసం మొదటిదఫాలో చేసిన ఖర్చు రూ.427 కోట్లు. నాడు–నేడు రెండో దఫా పనులు ఇవాళ వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడకి రాకముందు అధికారులను అడిగాను. రెండోదఫా నాడు–నేడు పనులు పూర్తి చేసి అక్కడ ఐఎఫ్పి ప్యానెల్స్ బిగించి 6వతరగతి నుంచి ఈ పైచిలుకు తరగతిగదులను డిజిటలైజ్ చేయడానికి ఎంత టైం పడుతుందని అడిగాను. దాదాపు మరో 31,884 తరగతి గదులు 6వతరగతి ఆ పై తరగతిగదులన్నీ డిజిటలైజ్ అయి, పూర్తిగా 62,097 తరగతిగదులన్నీ డిజిటలైజ్ అయ్యే కార్యక్రమం జనవరి 30 నాటికి పూర్తవుతుందని చెప్పారు. సందేహాల నివృత్తికి యాప్‌లు సైతం ప్రతి తరగతి గదిని డిజిటలైజ్ చేయడమే కాకుండా ఎస్.డి కార్డు, ఆండ్రాయిడ్ బాక్సులన్నింటితో పాటు ఐఎఫ్పి ప్యానెల్స్ ఉన్నచోట బైజూస్ కంటెంట్ కూడా అప్లోడ్ చేసి ఉంటుంది. అంటే పిల్లలకు బైజూస్ కంటెంట్‌తో కూడిన పాఠాలను తరగతిగదిలో నేర్పుతారు. ఇవే పాఠాలను వాళ్లకున్న ట్యాబులలో కూడా ఉంతాయి. దీనివల్ల పిల్లలకు కన్ఫ్యూజన్ ఉండదు. మెరుగ్గా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా ఈ ట్యాబులున్నప్పుడు, ఈ పాఠాలలో పిజిక్స్, మేథ్స్ బయాలజీ, ఇంగ్లిషు సబ్జెక్టులో పిల్లలకు సందేహాలు వస్తే.. వాటిని నివృత్తి చేసుకోవడం ఎలా ? ఎవరు చెప్తారు ? అన్న సందేహం ప్రతి పిల్లాడికి, తల్లిదండ్రులకూ ఉంటుంది. అందుకనే ఈ సారి పిల్లలకిచ్చే ఈ ట్యాబులలో ఒక యాప్‌ను కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. డౌట్ క్లియరెన్స్ బాట్ అనే యాప్‌ను డౌన్లోడ్ చేయడం జరిగింది. దీన్ని వాడుకుని పిల్లలు తమ సందేహాలను చెప్పినా, టైప్ చేసినా వాటిని నివృత్తి చేసుకునే సౌలభ్యం ఉండేలా యాప్‌ను డౌన్లోడ్ చేశాం. ఇంత ధ్యాసపెట్టి పిల్లలు ఏం చదువుతున్నారు? ఎలా చదువుతున్నారు? ట్యాబులలో ఏం ఉంది? ఇంకా ఎలా దాన్ని పిల్లలకు ఉపయోగపడేలా మెరుగుపర్చాలి. పిల్లలకు సులభంగా అర్ధమయ్యేలా చేయాలి అని ఆలోచన చేస్తూ తాపత్రయపడుతూ... మీ పిల్లల గురించి ఆలోచనచేసే మీ బిడ్డ ప్రభుత్వం, ఆ పిల్లలకైతే మేనమామ ప్రభుత్వం ఇక్కడ ఉంది. ఈ సందేహాల నివృత్తి కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను వాడుకునేలా తీసుకొచ్చే కార్యక్రమమూ జరుగుతుంది. అంతే కాకుండా రాబోయే రోజుల్లో పిల్లలు ఇంకా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశ్యంతో ఇతర విదేశీ భాషలను నేర్చుకునేదానికి వీలుగా డ్యుయోలింగో యాప్ అనే కొత్త యాప్‌ను చేర్చాం. దానివల్ల పిల్లలు విదేశీభాషను నేర్చుకునే అవకాశం ఉంది. ఈ ట్యాబు పిల్లలకు తోడుగా ఉండే ఒక ట్యూటర్‌గా అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ప్రపంచంలో మన పిల్లలే బెస్ట్ కావాలన్న తపనతో మరో ముఖ్యవిషయం కూడా చెప్పాలి. పిల్లలందరూ ఆంధ్రరాష్ట్రంలో బెస్ట్‌గా చూడాలని కాదు నేను పోటీపడుతున్నది.. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే నా పిల్లలు బెస్ట్‌గా ఉండాలని, చూస్తున్నాను. దానికోసం ప్రయత్నిస్తున్నాను. అందుకోసం ప్రాథమిక స్ధాయి.. అంటే 3వ తరగతి నుంచే మన పిల్లలకు తర్ఫీదు ఇచ్చి టోఫెల్ పరీక్షకకు వాళ్లను సిద్ధం చేసేలా.. అమెరికాకు చెందిన టోఫెల్ నిర్వాహణా సంస్ధ ఈటీఎస్(ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్)తో ఒప్పందం కూడా చేసుకున్నాం. ఈ రోజు టోఫెల్‌ను ఒక సబ్జెక్టుగా ఒక పీరియడ్ కేటాయిస్తూ 3వతరగతి నుంచి ప్రతి క్లాసులోనూ టీచ్ చేస్తూ.... కరిక్యులమ్‌లో తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది. టెక్నాలజీని అందిపుచ్చుకునే దిశగా మరో 15–20 సంవత్సరాల తర్వాత పరిస్థితుల వేగంగా మారుతున్నాయి. మారుతున్న పరిస్థితిలకు అనుగుణంగా మనం కూడా వేగంగా అడుగులు వేయాలి. టెక్నాలజీ మారుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా మన బ్రతుల్లోకి వస్తుంది. రానున్న 20 సంవత్సరాలలో మనం చేస్తున్న ఈ ఉద్యోగాలన్నీ పూర్తిగా కనుమరుగైపోతాయని చెప్తున్నారు. ఆ రకంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. టెక్నాలజీ కూడా పెరుగుతుంది. మనంకూడా దీనికి అగుణంగా అడుగులు వేయాలి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మన పిల్లలనే ప్రిపేర్ చేస్తున్నాం. వచ్చే సంవత్సరం నుంచి 8వ తరగతి నుంచి ఫ్యూచర్ స్కిల్స్ అనే సబ్జెక్టును ప్రవేశపెడుతున్నాం. అందులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, మెటావర్స్, డేటా ఎనలెటిక్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, వర్టువల్ రియాలటీ, అగ్మెంటెడ్ రియాలటీ, ఫైనాన్షియల్ లిటరసీ వంటి అంశాలన్నీ పిల్లలకు పరిచయం చేసేలా... వారిని పోటీ ప్రపంచంలో గట్టిగా నిలబడేలా మంచి సంకల్పంతో ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్టును తీసుకువస్తున్నాం. సంబంధిత ట్యూటర్ల నియామకానికి కూడా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటువంటి సబ్జెక్టులను ఎలా బోధించాలి ? ఎటువంటి ట్యూటర్లు కావాలన్న దిశగా ఆడుగులు పడుతున్నాయి. ఐబీ సిలబస్ దిశగా విద్యారంగంలో భవిష్యత్తు ప్రపంచంలో మన పిల్లలు నిలబడేలా ఉంచేందుకు ఐబీ సిలబస్‌ను రాబోయే రోజుల్లో తీసుకువస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న మన పిల్లలు నేరుగా విదేశీ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా ఈ సిలబస్‌ను తీసుకువస్తున్నాం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సులభంగా ఉద్యోగావకాశాలు పొందుతారు. దీనికోసం ఐబీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాబోయే రోజుల్లో ఐబీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తూ.. కరిక్యులమ్‌లో మార్పులు తీసుకువస్తూ ఐబీ సర్టిఫికేట్ తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకు వస్తూ సంయుక్త సర్టిఫికెషన్ తీసుకువచ్చేలా మార్పులు. ఇవాళ మన బడులన్నీ ఎలా ఉన్నాయి ? గతంలో మన స్కూళ్లు ఎలా ఉండేవి ? మీ బిడ్డ అధికారంలోకి వచ్చి తర్వాత ఈ 55 నెలల కాలంలో మన స్కూళ్లు ఎలా ఉన్నాయో చూడాలని కోరుతున్నాను. ఇవాళ మన ప్రభుత్వ బడులు, పిల్లలకిచ్చే ట్యాబులు, నాడు నేడుతో బడుల బాగుమీద పెట్టే మనసు, పిల్లలకిచ్చే జగనన్న విద్యాకానుక మీద ఆరాటం కానీ, జగనన్న గోరుముద్ద మీద చూపిస్తున్న ధ్యాస కానీ, పిల్లలను బడికి పంపించాలి, ఆ తల్లుల పిల్లలకు తోడుగా ఉండాలని, ఆ పిల్లల కోసం, తల్లుల కోసం ఆలోచన చేస్తూ తీసుకొచ్చిన వైఎస్సార్ అమ్మఒడి పథకం కానివ్వండి.. పిల్లల కోసం ఆలోచన చేస్తూ తెలుగుమీడియం బడులను మార్చుతూ ఇంగ్లిషు మీడియం తీసుకునిరావడంతో పాటు పిల్లలకు పూర్తిగా అర్ధమయ్యేందుకు ఒక పేజీ ఇంగ్లిషు, మరో పేజీ తెలుగు ఉండేలా బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్ తీసుకువచ్చాం. ప్రయివేటుబడులలో పెద్దవాల్లు, శ్రీమంతులు మాత్రమే కొనుగోలు చేసి ఏకంగా రూ.15వేలు ఏడాదికి ఖర్చుచేస్తే తప్ప అందుబాటులోకి రాని బైజూస్ కంటెంట్‌ను ఇవాళ మన పిల్లలకు ఇవ్వడం కానీ.. 6వతరగతి ఆపై తరగతులకు సంబంధించి ప్రభుత్వ బడులలో ప్రతి తరగతిగదిని డిజిటలైజ్ చేస్తూ.. పిల్లలకు సులభంగా పాఠాలు అర్ధమయ్యేలా చేస్తున్నాం. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిషు మీడియంకు మారడంతో పాటు అదొక్కటే సరిపోదని సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు మన బడుల్లో జరుగుతున్న ప్రయాణం వరకు.. మంచి ఆలోచనలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా ఈ 55 నెలల మీ బిడ్డ పరిపాలనలో ప్రతి స్కూల్లోనూ కనిపిస్తున్నాయి. ప్రభుత్వ బడులతో ప్రైవేట్ స్కూళ్లు పోటీపడే పరిస్థితి ప్రైవేటు స్కూళ్లు గవర్నమెంట్ స్కూళ్లు కన్నా మెరుగ్గా ఉంటాయనే నానుడి పోయి.. ఇవాళ ప్రైవేటు స్కూళ్లన్నీకూడా ప్రభుత్వ స్కూళ్లతో పోటీపడే పరిస్థితి వచ్చిందా ? లేదా ? ప్రభుత్వ బడుల్లో బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్, ప్రతి తరగతి గదికి ఐఎఫ్‌పిలు ఏర్పాటు, 8వతరగతిలో ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబు అందించడం, నాడు నేడుతో మారుతున్న స్కూళ్లు వంటి కార్యక్రమాలు చేయడంతో ప్రైవేటు బడులు వాటికోసం గవర్నమెంటు బడులతో పోటీపడే పరిస్థితి మీ బిడ్డ పరిపాలనలో జరుగుతుంది. జగన్ దుబారాగా డబ్బులు ఖర్చుచేస్తున్నారని గిట్టని వారు అంటున్నారు. మేం చేసే ప్రతి పైసాకూడా మానవవనరుల అభివృద్ధి కోసం పెడుతున్నాం. రేపటి భవిష్యత్తుమీద ప్రతి పైసాకూడా పెడుతున్నాం. పిల్లలు అందరికీ కూడా ఇవ్వగలిగే ఆస్తి చదువులు మాత్రమే. అది కూడా నాణ్యతతో కూడిన విద్య ఇవ్వగలిగితే.. వాళ్ల జీవితం, భవిష్యత్తు మారుతుంది. అప్పుడే పేదరికం ఆటోమేటిక్‌గా పక్కకు పోయే పరిస్ధితి వస్తుందని గట్టిగా నమ్మాం కాబట్టే ఇంత వేగంగా అడుగులు పడుతున్నాయి. మన మీద దుర్బిద్ధితో బురద జల్లుతున్నారు ఇలా పేదల పిల్లల చదువులు మీద దేశచరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం పెట్టనంత దృష్టి పెట్టి.. పేద తల్లిదండ్రుల తరపున వారి బిడ్డల కోసం మార్పులు తీసుకువస్తున్న మన ప్రభుత్వంమీద దుర్భిద్ధితో, దురుద్దేశంతో బురదజల్లుతున్నారు. పేదరికం నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలని మీ జగన్ ఆరాటపడుతుంటే... మంచేస్తున్న ప్రభుత్వం మీద బురదజల్లుతున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, చంద్రబాబు, దత్తపుత్రుడు వీరు ఎంతగా దిగజారి మాట్లాడుతున్నారో మీ అందరికీ తెలుసు. పేద పిల్లలకు ట్యాబులు ఇవ్వనే ఇవ్వకూడదని వారంతా చెప్తున్నారు. ట్యాబులు చేతిలో ఉంటే.. పిల్లలు చెడిపోతున్నారని రాస్తున్నారు. మన ప్రభుత్వ బడులలో చదువుకునే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ పేద వర్గాలకు చెందిన పిల్లలుమీద తప్పుడు రాతలు రాస్తున్నారు. ఏవేవో వీడియోలు చూస్తున్నారని, ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారని, చెడిపోతున్నారని పిల్లలకు ట్యాబులు ఇవ్వొద్దని ప్రతిరోజూ పనిగట్టుకుని నాపై విమర్శలు చేస్తున్నారు. అది పేపరా.. పేపరుకు పట్టిన పీడా జగన్ బర్త్‌డే బహుమతి.. చెడగొడుతోంది మతి, గాడితప్పుతున్న బైజూస్ ట్యాబ్ చదువులు, ఇతర వీడియోలు ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడుతున్న పిల్లలు, వెనక్కి తీసుకోవాలంటూ తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు, అయినా వాడాల్సిందేనంటున్న జగన్ సర్కార్ అని ఈనాడులో రాశారు. ఇది పేపరా.. పేపరుకు పట్టిన పీడా. దీన్ని ఈనాడు అంటారు. ఇలాంటి పేపర్‌ను చదవొచ్చా. నేను ఆ పత్రిక యాజమాన్యాన్ని, ఆ పత్రికను సమర్థించే రాజకీయ పార్టీలను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను. ఇంతగా దిగజారి రాతలు రాయకండి అని వీళ్లకు చెప్తున్నాను. ఇంతగా దిగజారి మాటలు మాట్లాడకండి అని చెప్తున్నాను. పేదవర్గాల పిల్లలమీద ఇంతగా విషం కక్కకండి అని చెప్తున్నాను. పేద పిల్లలకు మంచి జరుగుతుంటే.. ఇంత కడుపుమంట వద్దండీ అని చెప్తున్నాను. మీ పిల్లలు, మీ మనవళ్ల చేతిలో ఏమో ట్యాబులు ఉండొచ్చు, ల్యాప్‌ట్యాపులు ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్లు కూడా ఉండొచ్చు. కాని పేదల చేతుల్లో మాత్రం ట్యాబులు ఉండకూడదు, ల్యాప్‌ట్యాపులు ఉండకూడదు, స్మార్ట్ ఫోన్లు ఉండకూడదు. నిజంగా ఇది సరైన పోకడేనా అని ప్రశ్నిస్తున్నాను. మీ పిల్లల చేతులలో ఇవన్నీ ఉంటే చెడిపోరు, కాని పేదల పిల్లల చేతుల్లో మాత్రం ట్యాబులు, ల్యాప్టాపులు, స్మార్ట్ ఫోన్లు ఉంటే మాత్రం ఉంటే చెడిపోతారు.మీ పిల్లలు, మనవళ్లేమో ఇంగ్లిషు మీడియంలోనే చదవాలి, కాని పేద పిల్లలు ఇంగ్లిషు మీడియం బడులకు వెళ్లకూడదు, ఇంగ్లిషు చదవకూడదు. పేదపిల్లలు ఇంగ్లిష్ మీడియం మాత్రం చదవకూడదు. పేద పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదివితే తెలుగుభాష అంతరించిపోతుంది అంట?. కాని వాళ్ల పిల్లలు, వాళ్ల మనవళ్లు మాత్రం ఇంగ్లిషులోనే చదవాలి. ఇది ధర్మమేనా? ఆలోచన చేయండి. ఇలాంటి ఆలోచనలు, దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి రాజకీయాలతో మీ బిడ్డ యుద్ధంచేస్తున్నాడు. ఎంత మోసానికైనా వెనకడుగు వేయని దుష్టచతుష్టయం ఈ రోజు మీరంతా ఇవన్నీ చూస్తున్నారు. ఒకవైపు జగన్ ఫొటోకు పది తలకాయలు పెట్టి రాష్ట్రం అంతా అప్పులు పాలై పోయిందని రాస్తారు. మరి జగన్ హయాంలో రాష్ట్రం అప్పులు పాలయిపోతుందంటారు. మరోవైపు చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి.. ఆరు గ్యారంటీలు అని చెపుతాడు. వాటిని వీళ్లు పతాక శీర్షికల్లో బ్రహ్మాండంగా రాస్తారు. వాళ్లు ఇస్తానన్నవి, ఇవ్వక తప్పని పెన్షన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ అన్నీ కలిపితే.. జగన్ ఇచ్చేవాటికన్నా, వాళ్లు చెప్తున్నవి మూడింతలు ఎక్కువ. ఎంత మోసానికైనా వాళ్లు వెనకడుగు వేయరు. గతంలో 2014–19 వరకూ వాళ్లే పరిపాలన చేశారు. ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఇదే దత్తపుత్రుడు ఉన్నారు. ఆ రోజుల్లో రూ.87,612 కోట్ల రైతు రుణమాఫీ చేస్తానన్నారు, వాళ్లనూ మోసంచేశారు. పొదుపు సంఘాల రుణాలు మాఫీచేస్తానన్నారు, వాళ్లనీ మోసం చేశారు. ఇంటింటికీ జాబు ఇస్తాను. జాబు రావాలంటే బాబు రావాలన్నారు, జాబు ఇవ్వకపోతే రూ.2వేల నిరుద్యోగభృతి, అంటే ఐదేళ్లలో ప్రతి ఇంటికీ రూ.1లక్ష. ఒక్కరికంటే ఒక్కరికి ఇచ్చిన పాపాన పోలేదు. ఇంత దారుణంగా అడ్డగోలుగా 2014 నుంచి 2019 వరకు ఎవ్వరినీ వదలకుండా మోసం చేశారు. అవ్వాతాలనూ, రైతులను, పిల్లలను, అక్క చెల్లెమ్మలను మోసంచేశారు. చివరకు వారి మేనిఫెస్టోను ఎవ్వరికీ కనిపించకుండా.. ఇంటర్ నెట్లో ఉంటే ప్రజలు ఎక్కడ కొడతారేమోనని దాన్ని నెట్లో నుంచి కూడా తీసేశారు. ఈ రోజు మీ బిడ్డ పరిపాలనలో ఎన్నికల ప్రణాళికను భగవద్గీతగానూ, ఖురాన్‌గానూ, బైబిల్‌గానూ భావించి మేనిఫెస్టోలో చెప్పిన 99.5శాతం వాగ్దానాలను అమలు చేశాం. ప్రజలంతా ఆలోచన చేయాలి. ఈ రోజు మీ బిడ్డ 55 నెలల పాలనలో మీ బిడ్డ బటన్ నొక్కాతున్నాడు. రూ.2.40లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతున్నాయి. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఆలోచన చేయండి. మీ బిడ్డ ఇలా ఎలా చేయగలుగుతున్నాడు. గతంలో పరిపాలన చేసిన వాళఅలు ఎందుక్లు మీ బిడ్డలా ఎందుకు చేయలేకపోయారు. అప్పులు గురించి విమర్శిస్తున్నారు... అప్పులు గురించి విమర్శలు చేస్తున్నారు. అప్పుల్లో పెరుగుదల అప్పటికన్నా.. ఈ ప్రభుత్వంలో తక్కువే. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్ అప్పులు పెరుగుదుల అప్పటి కన్నా ఇప్పుడు తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు. చంద్రబాబు హయాంలో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేయలేకపోయాడు. అప్పట్లో గజదొంగల ముఠా రాజ్యం... కారణం అప్పట్లో ఒక గజదొంగల ముఠా రాజ్యాన్ని పరిపాలన చేసింది. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు, జన్మభూమి కమిటీల నుంచి మొదలుపెడితే రాష్ట్రంలో ఇసుక నుంచి మొదలుకుని మద్యం, స్కిల్ స్కామ్ నుంచి పైబర్ గ్రిడ్ వరకు ఏది ముట్టుకున్నా దోచుకోవడం, దాన్ని పంచుకోవడం, తినుకోవడమే. ఆ రోజు ఎందుకు జరగలేదు, ఈ ప్రభుత్వంలో ఇన్ని కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయో ప్రజలంతా ఆలోచన చేయాలి. మీ బిడ్డ హయాంలో 31లక్షల ఇళ్లపట్టాలు అందులో 22 ఇళ్ల లక్షల ఇళ్ల నిర్మాణాలు మీ బిడ్డ హయాంలో ఎందుకు జరిగించగలుగుతున్నాడు, చంద్రబాబు హయాంలో జరగలేదో ఆలోచన చేయండి. మీ బిడ్డ హయాంలో వ్యవసాయం మారుతుంది, గ్రామాలన్నీ మారి ప్రతి గ్రామంలోనూ సచివాలయ వ్యవస్ధ, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌తో వాలంటీర్ వ్యవస్ధ ప్రతి ఇంటికి వచ్చి ఒకటో తేదీన సెలవైనా.. ఉదయాన్నే వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ అవ్వా,తాతల చేతుల్లో పెన్షన్ ఎలా పెట్టగలుగుతున్నారో ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో ఇంకా బురద జల్లుతారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ బురద జల్లుతారు. ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు. ఇంకా ఎక్కువ అబద్దాలు చెబుతారు. గుర్తుపెట్టుకొండి. ఎవరైతే మీకు మంచిచేశారో.. వారిని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మీ బిడ్డ మీ కళ్ల ముందు నిలబడి మీ కళ్లలోకి చూసి చెప్పగలుగుతున్నాను.. మీకు మంచి జరిగితే మాత్రం.. మీ బిడ్డకు మీరు తోడుగా నిలబడాలని కోరుతున్నాను. మీ బిడ్డకు వాళ్ల మాదిరిగా ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తోడుగా ఉండకపోవచ్చు. ఒక దత్తపుత్రుడి అండ ఉండకపోవచ్చు. కానీ మీ బిడ్డ వాళ్లను నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన ఉన్న దేవుడ్ని, కింద ఉన్న మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాను. మీకు మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోండి. మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా, అండగా నిలబడండి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే... మళ్లీ మోసం చేసేందుకు వీళ్లంతా బయల్దేరారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తామంటారు. జగన్ ట్యాబ్ మాత్రమే ఇచ్చాడు. మేం ఒక బెంజికారు ఇస్తామంటారు. దయచేసి మోసపోవద్దని ప్రజలను కోరుతున్నాను నా చెల్లెమ్మ కొన్ని పనులు మంజూరు చేయమని అడిగింది నా చెల్లెమ్మ భాగ్యలక్ష్మి ఈ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని పనుల మంజూరు కోసం అడిగింది. బీటీ రోడ్లు, బ్రిడ్జిలు కోసం అడిగింది. అన్నింటినీ యుద్ధప్రాతిపదినక మంజూరు చేసి, అడుగులు వేగంగా వేయిస్తాను. ట్రైబల్ ప్రాంతాన్ని ఒక్కసారి చూస్తే ఆశ్చర్యం కలిగించే మార్పులు కనిపిస్తున్నాయి. సాలూరులో మొట్టమొదటసారిగా ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం వేగంగా జరుగుతోంది. పార్వతీపురం, నర్సీపట్నం, పాడేరులో మూడు మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. ఐటీడీఏ పరిధిలో పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరం, బుట్టాయిగూడెం, డోర్నాలలో కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం వేగంగా జరుగుతుంది. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ వేగంగా నిర్మాణం జరుగుతుంది. ఇవన్నీ గతంలో లేనివి కేవలం ఈ 55 నెలల్లో మీ బిడ్డ హయాంలో మాత్రమే జరుగుతున్నాయని మరొక్కసారి గుర్తుపెట్టుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నానని సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ ఎడ్యుకేషన్..ఘనత మన సీఎం జగన్ దే
-
చింతపల్లిలో 11, అరకులో 12.3 డిగ్రీలు
సాక్షి,పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 9 గంటల వరకు పాడేరు, చింతపల్లి, అరకులోయ ప్రాంతాల్లో మంచుతెరలు వీడటంలేదు. ఘాట్ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా లైట్ల వెలుగులో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఉష్ణోగ్రతలూ రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో శనివారం 15.5 డిగ్రీలు నమోదు కాగా ఆదివారం 4.5 డిగ్రీలు తగ్గి 11 డిగ్రీలు నమోదైంది. అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 12.3 డిగ్రీలు, పాడేరు మండలంలోని మినుములూరు కేంద్ర కాఫీ బోర్డు వద్ద 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు కాఫీబోర్డు వర్గాలు తెలిపాయి. ఆయా ప్రాంతాల్లో సాయంత్రం నుంచి చలిగాలులు విజృంభిస్తున్నాయి. మంచు అందాలకు ఫిదా... జిల్లా వ్యాప్తంగా చలిగాలుల తీవ్రత ఉన్నప్పటికీ మంచు అందాలను తిలకించేందుకు పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చి అందాలను వీక్షిస్తూ పరవశిస్తున్నారు. మారేడుమిల్లి ప్రాంతంలోని గుడిసె, చింతపల్లి మండలంలోని లంబసింగిలోని చెరువులవెనం, పాడేరు మండలంలోని వంజంగి హిల్స్, హుకుంపేట మండలంలోని సీతమ్మకొండ, అరకులోయ మండలంలోని మాడగడ హిల్స్ ప్రాంతాలకు వేకువజామునే చేరుకుని పొగమంచు, సూర్యోదయం, మేఘాల అందాలను వీక్షిస్తున్నారు. -
చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్
-
AP Cold Waves: విశాఖ ఏజెన్సీ చరిత్రలో తొలిసారి!
దేశం వ్యాప్తంగా కోల్డ్‌వేవ్ ప్రభావం కనిపిస్తోంది. చలి దెబ్బకు తెలుగు రాష్ట్రాలు గజగజలాడిపోతున్నాయి. ఏపీలోనూ చలి పంజా విసురుతోంది. మొదటిసారిగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో మునుపెన్నడూ లేనంత అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. మరో 3 రోజులు ఇదే తీవ్రతతో పరిస్థితి కొనసాగవచ్చని, చిన్నపిల్లలు.. వృద్ధులు.. శ్వాసకోశ సంబంధిత సమస్యలున్న వాళ్లు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా) : చలి పులి పంజాకు రాష్ట్రం గజగజా వణికిపోతోంది. కోల్డ్ వేవ్ ప్రభావం రాష్ట్రాన్ని తాకడంతో మునుపెన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి గాలుల తీవ్రత పెరిగింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోయాయి. అక్కడ సాధారణం కంటె 3 నుంచి 5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆంధ్రా కశ్మీర్‌గా అభివర్ణించే ‘చింతపల్లి’తో పాటు హుకుంపేట, జి.మాడుగుల మండలం కుంతలం, గూడెం కొత్తవీధి మండలం జీకే వీధిలో అత్యల్పంగా 1.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతకు ముందు ఆ రికార్డు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌గా ఉండేది!. డుంబ్రిగూడ మండల కేంద్రం, పెదబయలు మండలం గంపరాయిలో 2.6, హుకుంపేట మండలం కొక్కిసలో 2.7, ముంచంగిపుట్టు మండలం గొర్రెలమెట్టలో 2.8, పెదబయలులో 2.9, పాడేరులో 3.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఇక్కడ అత్యల్పంగా 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తొలిసారిగా ఇప్పుడు 1.5 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు, పర్యాటకులు ఆశ్చర్యపోతున్నారు. బయటకు రావడానికే బెంబేలెత్తిపోతున్నారు. అరకు తదితర ప్రాంతాల్లోనూ పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. విజయవాడలో ఆదివారం ఉదయం 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రాన్నీ కోల్డ్‌వేవ్ తాకినట్టే.. ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో కోల్డ్ వేవ్ ప్రభావం ఉంటుందని ప్రకటించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటె 5 నుంచి 6 డిగ్రీలు పడిపోతే కోల్డ్ వేవ్‌గా పరిగణిస్తారు. ఆంధ్రా ఊటీగా పేరున్న అరకు ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో 3 నుంచి 5 డిగ్రీలు పడిపోయాయి. దీంతో కోల్డ్ వేవ్ మన రాష్ట్రాన్ని తాకినట్లే వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. బంగ్లాదేశ్‌లో ఉన్న అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్(వాతావరణంలోని ఎత్తయిన ప్రదేశాల్లో వీచే గాలులు), పశ్చిమ గాలుల ప్రభావంతో కోల్డ్‌వేవ్ కొనసాగుతోంది. మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. మరీ ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. -
పదవి నుంచి చింతపల్లి ఎంపీపీ తొలగింపు
చింతపల్లి రూరల్ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : చింతపల్లి ఎంపీపీ వంతాల బాబూరావును పదవి నుంచి తొలగించాలని ఉమ్మడి విశాఖ జిల్లా ఎన్నికల అథారిటీ నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిషత్ ఎన్నికల సమయంలో ఎంపీపీ ఎన్నికల్లో 20 మంది ఎంపీటీసీల్లో 9 మంది ఇండిపెండెంట్లు బాబూరావును బలపర్చగా, మరో 9 మంది వైఎస్సార్సీపీ అభ్యర్థి అనూషదేవిని బలపర్చారు. ఇద్దరికీ సమానంగా సభ్యుల మద్దతు రావడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీంద్రనాథ్ లాటరీ తీశారు. డ్రాలో బాబూరావుకు ఎంపీపీ పదవి వరించింది. ఎన్నికల నామినేషన్ దాఖలు సమయంలో బాబూరావు ఆయనపై ఉన్న కేసుల వివరాలను నమోదు చేయలేదని అనూషదేవి కోర్టును ఆశ్రయించడంతో పాడేరు సబ్ కలెక్టర్ విచారణ జరిపారు. బాబూరావుపై కేసులు ఉన్నట్టు తేలడంతో పదవికి అనర్హుడిగా పేర్కొంటూ ఎంపీపీ పదవి నుంచి తొలగించాలని ఎన్నికల అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ కోరాబు అనూషదేవిని ఎంపీపీ పదవి వరించనుంది. (క్లిక్ చేయండి: విచ్చలవిడిగా రంగురాళ్ల తవ్వకాలు.. ప్రమాదం అని తెలిసినా..) -
అక్కడ చెట్లకు డబ్బులు కాస్తాయ్!
చింతపల్లి(పశ్చిమగోదావరి జిల్లా): డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా... అంటూ చాలామంది వ్యంగ్యంగా అంటుంటారు. కానీ, చాలా దేశాల్లో డబ్బులను చెట్ల నుంచే తయారు చేస్తారు. మన దేశంలో చెట్ల నుంచి కరెన్సీ నోట్లు తయారు చేయకపోయినా... ఇందుకోసం ఉపయోగించే అరుదైన ఆల్పైన్స్ వృక్షాలు మాత్రం మన దగ్గర దశాబ్దాలుగా పెరుగుతున్నాయి. చదవండి: శ్రీకాకుళం జిల్లాలో ఎర్ర చీమల దండయాత్ర.. హడలిపోతున్న జనం.. వాటిలో అల్లూరి జిల్లాలోని చింతపల్లి ప్రాంతం కూడా ఒకటి. కొన్ని దశాబ్దాల కిందట అటవీ శాఖ ఆధ్వర్యంలో పరిశోధనల కోసం చింతపల్లి మండలంలోని కృష్ణాపురం, చిన్నగెడ్డ అటవీ ప్రాంతాల్లో 20 హెక్టార్లలో ఆల్పైన్స్ మొక్కలను శాస్త్రవేత్తలు నాటారు. ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండటంతో చెట్లు బాగా పెరిగాయి. దీంతో మరో పది హెక్టార్లకు ఆల్పైన్స్ మొక్కల సాగును విస్తరించారు. అమెరికా, కెనడా వంటి దేశాల్లో... అమెరికా, స్విట్జర్లాండ్, కెనడా వంటి దేశాల్లో ఆల్ పైన్స్ వృక్షాల కలప నుంచే కరెన్సీ నోట్లు తయారు చేస్తారు. ఆయా దేశాల్లో మెత్తని స్వభావం కలిగిన ఆల్పైన్స్ వృక్షాలు ఎక్కువగా పెరుగుతాయి. అందువల్ల కరెన్సీ నోట్ల తయారీకి పూర్తిగా వీటిపైనే ఆధారపడతారని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మన దేశంలో ఆల్పైన్స్ వృక్షాల పెంపకం తక్కువగా ఉండడం వల్ల నగదు తయారీకి ఉపయోగించడం లేదు. కరెన్సీ తయారీకి సంబంధించిన యంత్ర సామగ్రి కూడా అందుబాటులో లేదు. దీంతో ఈ కలపను ఫర్నిచర్, ఇళ్లలో కబోర్డులు, ఫ్లోరింగ్, అలంకరణ వస్తువుల తయారీ వంటి వాటికి వినియోగిస్తున్నారు. పర్యాటకులకు కనువిందు... మన దేశంలో హిమాలయాలు, పశ్చిమ కనుమలు, రాష్ట్రంలోని చింతపల్లిలో గల ఎత్తయిన చల్లని వాతావరణం కలిగిన ప్రాంతాల్లో మాత్రమే ఆల్పైన్స్ చెట్లు పెరుగుతాయి. చాలా ఎత్తుగా ఉండే ఈ చెట్లు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. వేసవిలో సేదదీరేందుకు అనువుగా ఉంటాయి. చింతపల్లి ప్రాంతం అనువైనది ఎత్తయిన పర్వత శ్రేణి ప్రాంతంలో ఉన్న చింతపల్లి అటవీ ఏరియాలో ఆల్పైన్స్ చెట్లను పెంచేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మన దేశంలో తక్కువ ప్రాంతాల్లో ఈ చెట్లు పెంచడం వల్ల కరెన్సీ తయారీకి సరిపడా కలప ఉత్పత్తి కావడం లేదు. దీంతో కరెన్సీ తయారీకి ఉపయోగించడం లేదు. విదేశాల్లో ఎక్కువగా ఈ చెట్ల కలప ద్వారానే కరెన్సీ నోట్లు తయారు చేస్తారు. – శ్రీనివాసరావు, అటవీ శాఖ రేంజ్ అధికారి, చింతపల్లి -
అల్లూరి తొలి దాడికి వందేళ్లు
సాక్షి, అమరావతి/చింతపల్లి/చింతపల్లి రూరల్: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విల్లంబులు ఎక్కుపెట్టి.. చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై మెరుపు దాడి చేసిన ఘటనకు సరిగ్గా వందేళ్లు నిండాయి. 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై అల్లూరి తన బృందంతో తొలి దాడి జరిపారు. నాటి వీరోచిత ఘట్టాన్ని స్మరించుకుంటూ సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో సభ జరగబోతోంది. చింతపల్లితో మొదలుపెట్టి.. మన్యంలో గిరిజనులపై బ్రిటిష్ సేనలు సాగిస్తున్న దౌర్జన్యాలను ఎదురించాలంటే.. సాయుధ పోరాటమే శరణ్యమనే నిర్ణయానికి వచ్చాడు అల్లూరి సీతారామరాజు. మన్యానికే చెందిన గంటం దొర, మల్లు దొర, మొట్టడం వీరయ్యదొర, కంకిపాటి ఎండు పడాలు, సంకోజి ముక్కడు, వేగిరాజు సత్యనారాయణరాజు (అగ్గిరాజు), గోకిరి ఎర్రేసు (మాకవరం), బొంకుల మోదిగాడు వంటి 150 మందికి పైగా వీరులతో బృందాన్ని ఏర్పాటు చేశాడు. తొలుత చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి చేయాలని 1922 ఆగస్టు 19న నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడటంతో మన్యంలో తిరుగుబాటు మొదలైంది. ఈ దాడిలో 11 తుపాకులు, 5 కత్తులు, 1,390 తుపాకీ గుళ్లు, 14 బాయ్నెట్లను ఆ బృందం ఎత్తుకెళ్లింది. ఆగస్టు 23న రాత్రి కృష్ణదేవిపేట, ఆగస్టు 24న రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపైనా అల్లూరి బృందం దాడి చేసింది. ఆ మూడు పోలీస్ స్టేషన్ల నుంచి మొత్తం 26 తుపాకులు, 2,500కు పైగా మందుగుండు సామగ్రిని అల్లూరి బృందం ఎత్తుకెళ్లింది. దీంతో ఆగ్రహించిన బ్రిటిష్ పాలకులు మన్యంలో విప్లవ దళాన్ని అంతం చేయడానికి కబార్డు, హైటర్ అనే అధికారులను చింతపల్లి ప్రాంతానికి పంపించింది. ఆ ఇద్దరు అధికారులను రామరాజు దళం గెరిల్లా యుద్ధరీతిలో సెప్టెంబర్ 24న హతమార్చింది. ఆ తరువాత ఆక్టోబర్ 15న ముందుగానే సమాచారం ఇచ్చి మరీ అడ్డతీగల పోలీస్ స్టేషన్‌పై అల్లూరి బృందం దాడి చేయడం అత్యంత సాహసోపేతమైనదిగా గుర్తింపు పొందింది. అక్టోబర్ 19న రంపచోడవరం స్టేషన్‌ను పట్టపగలే ముట్టడించారు. ఆ తరువాత 1923 ఏప్రిల్ 17న అన్నవరం పోలీస్ స్టేషన్, 1923 జూన్ 10న మల్కన్‌గిరి పోలీస్ స్టేషన్, ట్రెజరీ, సెప్టెంబర్ 22న పాడేరు పోలీస్ స్టేషన్‌పైన దాడులు జరిగాయి. కాగా, కొయ్యూరు గ్రామ సమీపంలో ఏటి ఒడ్డున స్నానం చేస్తున్న రామరాజును 1924 మే 7న బ్రిటిష్ పోలీసులు బంధించగా.. మేజర్ గుడాల్ తుపాకీతో కాల్చి చంపాడు. నేడు భారీ బహిరంగ సభ చింతపల్లి స్టేషన్‌పై అల్లూరి బృందం దాడిచేసి వందేళ్లయిన సందర్భంగా సోమవారం చింతపల్లిలోని డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టిగుళ్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. సభకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరు కానున్నారు. -
అరక దున్నిన అత్త.. విత్తనాలు వేసిన కోడళ్లు!
వ్యవసాయంలో మహిళల శ్రమే అధికమైనా... రైతు అనగానే నెత్తిన తలపాగ, చేతిలో అరకతో ఓ పురుష రూపం గుర్తుకొస్తుంది. దాన్ని బ్రేక్ చేశారు నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీశైలమ్మ. చింతపల్లి మండలం కుర్రంపల్లిలో గురువారం ఆమె అరక దున్నుతుండగా, తన ఇద్దరు కోడళ్లు విత్తనాలు వేస్తూ కనిపించారు. శ్రీశైలమ్మ భర్త రామచంద్రం సామాజిక కార్యకర్త. వారికి ఆరుగురు కుమారులు. ఇద్దరు ఆర్మీలో ఉన్నారు. నలుగురు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా శ్రీశైలమ్మ భర్తతోపాటు వ్యవసాయ పనులు చేస్తూ స్ఫూర్తినిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, చింతపల్లి (దేవరకొండ) ‘ఆశ’క్తిగా ఖోఖో ఆదిలాబాద్ డైట్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్‌లతో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న గురువారం ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన క్రీడా వస్తువులు, మైదానాన్ని పరిశీలించి వెళ్లిపోయారు. అనంతరం విధి నిర్వహణలో భాగంగా అక్కడే ఉన్న ఆశ వర్కర్లు ఖోఖో ఆడారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శైలజ వారితో కలిసి ఉత్సాహంగా ఖోఖో ఆడుతూ కనిపించారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ పిల్లల్ని పలకరించి.. కలిసి భోజనం.. గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తీగలవేణి హైస్కూల్లో కలెక్టర్ కె.శశాంక విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం తీగలవేణికి హాజరైన కలెక్టర్ ‘మన ఊరు – మన బడి’లో ఎంపికైన జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించారు. మధ్యాహ్న భోజన సమయం కావడంతో పిల్లలు ప్లేట్లు పట్టుకొని బారులు తీరారు. కలెక్టర్ శశాంక వారితో మాట్లాడిన అనంతరం వంటకాలను పరిశీలించారు. ‘రోజూ రుచికరంగా వండి పెడుతున్నారా? నేను మీతో కలిసి భోజనం చేయొచ్చా’.. అని కలెక్టర్ కోరగా.. సార్... రండి అంటూ పిల్లలు ఆనందంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ వారితో కూర్చుని భోజనం చేశారు. ‘వంటలు బాగానే ఉన్నాయి. ఇలాగే చేయండి’.. అని అన్నారు. (క్లిక్: గోళీ అంత గుడ్డు.. వావ్.. మూన్!) -
కాలం ఎంతగామారింది.. తాచేరు వయా ‘ఫోన్ పే’మెంట్!
చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా): కాలం ఎంతగామారింది.. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గిరిజనులు తమ సంప్రదాయ పండగలకు వినియోగిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏటా ఈ నెలలో ఇటుకల పండగ నిర్వహిస్తారు. అందులో భాగంగా ప్రధాన రహదారుల్లో గేట్లు ఏర్పాటు చేసి వాహన చోదకుల వద్ద తాచేరు (డబ్బులు) వసూలు చేస్తుంటారు. చదవండి: హిజ్రాల అందాల పోటీలు.. సందడే సందడి అయితే చిల్లర లేదని చెప్పి కొందరు వాహనచోదకులు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో గిరిజన మహిళలు, యువతులు గేట్ల వద్ద ఫోన్ పేకు సంబంధించిన క్యూ ఆర్ కోడ్ స్కానర్‌ను ఉపయోగించి తాచేరు వసూలు చేస్తున్నారు. పురుషులు వేటకు అడవి బాట పడుతుండడంతో మహిళలే ఈ పనిలో నిమగ్నమవుతారు. ఒకప్పుడు ఫోన్లో సంభాషించడమే అంతగా తెలియని గిరిజనులు ఇప్పుడు స్కానర్ ద్వారా తాచేరు వసూలు చేయడం చూసి మైదాన ప్రాంతాలకు చెందిన వాహన చోదకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. -
ఇటు వ్యవసాయం.. అటు పూలసాగు
చింతపల్లి: అల్లూరి సీతారామరాజు జిల్లాకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తలమానికంగా నిలవనుంది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధికి పరిశోధన కేంద్రం ఎనలేని కృషి చేస్తోంది. మొన్నటి వరకు నూతన వంగడాలపైనే పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఇప్పుడు వివిధ రకాల పూల సాగును కూడా ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు. మంచి ఫలితాలు వస్తుండడంతో గిరిజన రైతులను ప్రోత్సహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1985లో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇక్కడ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన 36 మండలాల్లోని ఉన్నత పర్వత శ్రేణి గిరిజన మండలాల్లో వ్యవసాయ అభివృద్ధి చేయాలన్నది ప్రధాన ఉద్దేశం. కొత్త పంటలపై పరిశోధనలు చేయడంతో పాటు పొలాలకు వెళ్లి పంటలకు ఆశించే తెగుళ్లు, వాటి నివారణ పద్ధతులపై సలహాలు, సూచనలు అందిస్తున్నారు. కొత్త పంటల సాగుకు గిరిజనులను ప్రోత్సహిస్తున్నారు. సంప్రదాయేతర పంటలైన గోధుమ, బార్లీ, లిన్సీడ్, బఠానీ, పొద్దు తిరుగుడు, వేరుశనగ, ఆవాలు వంటి పంటలపై పరిశోధనలు జరిపి మంచి ఫలితాలు సాధించారు. ఈ పంటల సాగుకు గిరిజనులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.9 లక్షలతో సంచార వ్యవసాయ ప్రయోగశాల వాహనాన్ని కొనుగోలు చేశారు. ఆయా గ్రామాల్లో బుల్లి తెరపై పంటలు, వాటికి ఆశించే తెగుళ్లు, నివారణ పద్ధతులపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నారు. మానవ రహిత ఆటోమెటిక్ శాటిలైట్ వెదర్ స్టేషన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఇక్కడ వా తావరణ పరిస్థితులు, గాలిలో తేమ శాతం తెలుసుకుని.. ఏ పంటకు ఏ రకమైన తెగుళ్లు సోకే అవకాశముందో ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆన్లైన్లో వాతావరణ సమాచారం వాతావరణ విభాగం శాస్త్రవేత్తగా సౌజన్యను నియమించారు. పరిశోధన కేంద్రంలోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆటోమెటిక్ శాటిలైట్ వెదర్ స్టేషన్ ద్వారా ప్రతి రోజూ నమోదైన వాతావరణ వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. వాతావరణ వివరాలు నేరుగా న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి పంపిస్తున్నారు. వెంటనే ఆన్లైన్లో ఈ వివరాలు పొందుపరుస్తున్నారు. ఐఎండీ వెబ్సైట్ హోం పేజీలోని ఏడబ్ల్యూఎస్ అబ్జర్వేషన్‌లోకి వెళ్లి ఉష్ణోగ్రతలు తెలుసుకోవచ్చు. గుబాళించిన పూల సాగు మార్కెట్లో అలంకరణ పూలకు మంచి డిమాండ్ ఉంది. విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలు ఇతర రాష్ట్రాల నుంచి కట్ ఫ్లవర్లను దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పూలసాగుపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. గ్లాడియోస్, బంతి, జెర్బెరాలో వైట్‌హౌస్, సన్‌వ్యాలీ ఫోర్స్ తదితర రకాల పూలను ప్రయోగాత్మకంగా సాగు చేపట్టి మంచి దిగుబడులు సాధించారు. శీతల వాతావరణంలో ఈ పూలను సాగు చేయవచ్చు. గిరిజనులను ప్రోత్సహిస్తాం వ్యవసాయ పంటలతో పాటు పూల సాగుకు గిరిజనులను ప్రోత్సహిస్తాం. మైదాన ప్రాంతాల్లో కట్‌ఫ్లవర్స్‌కు మంచి డిమాండ్ ఉంది. గిరిజనులు అందిపుచ్చుకుంటే మంచి లాభాలు సాధించవచ్చు. – డాక్టర్ అనురాధ, ఏడీఆర్, చింతపల్లి పరిశోధన స్థానం -
వరుడు లేకుండా చిన్నారులకు పెళ్లి
చింతపల్లి (పాడేరు): ఆడ పిల్లలు పుడితే ఆ గిరిజనుల ఆనందానికి హద్దులు ఉండవు. అల్లారుముద్దుగా పెంచుకుంటారు. ముచ్చటగా మూడు సార్లు పెళ్లి కూడా చేస్తారు. ఆడపిల్లలకు పెళ్లికి ముందు బాల్యంలో ఒకసారి, యుక్తవయసు వచ్చాక మరోసారి పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి తంతు నిర్వహించడం వారి ఆచారం. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో నివసించే మాలి జాతి గిరిజనుల్లో ఈ ఆచారం కొనసాగుతోంది. సోమవారం చింతపల్లి మండలంలోని చౌడుపల్లిలో 27 మంది ఐదేళ్లలోపు బాలికలకు వరుడు లేకుండా సామూహిక వివాహాలు జరిపించారు. గ్రామ సమీపంలో రాటలు వేసి, వాటికి కుండలను అమర్చి, పెళ్లి పందిరి నిర్మించారు. చిన్నారులకు కొత్త చీరలు కట్టి పెళ్లికూతురు వలె ముస్తాబు చేసి తల్లిదండ్రులు, బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసారు. అనంతరం భారీ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బాల్యంలో పెళ్లిళ్లు చేయడం మాలి తెగ గిరిజనులకు తరతరాలుగా వస్తోన్న ఆనవాయితీ. ఏజెన్సీలో కూరగాయలు సాగు చేసేందుకు ఒడిశా నుంచి వలస వచ్చిన ఈ గిరిజనుల భిన్నమైన ఆచారం అందరినీ ఆకట్టుకుంటోంది. -
37 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం
గూడెంకొత్తవీధి/డుంబ్రిగుడ/కొయ్యూరు: విశాఖ ఏజెన్సీలో మంగళవారం 37 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. గూడెంకొత్తవీధి మండలంలోని జర్రెల, జి.కె.వీధి పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. జర్రెల పంచాయతీలోని పలు గ్రామాల్లో సర్పంచ్ వీరోజి నాగరాజు ఆధ్వర్యంలో సుమారు 5 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. జి.కె.వీధి పంచాయతీలోని బి.కొత్తూరు, డి.కొత్తూరు గ్రామాల పరిధిలో జి.కె.వీధి సీఐ అశోక్‌కుమార్, ఎస్ఐ షమీర్ ఆధ్వర్యంలో 20 ఎకరాలలో గంజాయి తోటలను ధ్వంసం చేసి మొక్కలకు నిప్పంటించారు. చింతపల్లి మండలంలోని అన్నవరం స్టేషన్ పరిధిలో గచ్చిపల్లి సమీపంలోని సుమారు 6 ఎకరాల్లోని గంజాయి తోటలను ఎస్ఐ ప్రశాంత్‌కుమార్ సమక్షంలో ధ్వంసం చేశారు. డుంబ్రిగుడ మండలం కితలంగి పంచాయతీ కొంతుగుడ గ్రామంలో ఎస్ఐ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో 6 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. 46 కిలోల గంజాయి పట్టివేత గొలుగొండ ఎస్ఈబీ సీఐ రాజారావు ఆధ్వర్యంలో మంగళవారం డౌనూరు పంచాయతీ తురబాలగెడ్డ వద్ద 46 కిలోల గంజాయిని పట్టుకున్నారు. విశాఖ ఏజెన్సీ చింతపల్లి ప్రాంతం నుంచి టాటా నానో కారులో గంజాయి ప్యాకెట్లను తీసుకెళ్తుండగా ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ.లక్ష వరకు ఉంటుంది. కారు, ద్విచక్ర వాహనం, నాలుగు ఫోన్లు, రూ.1,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. డుంబ్రిగుడకు చెందిన బి.రాజారావును, పాములవాకకు చెందిన సీహెచ్ నానిబాబు, హుకుంపేటకు చెందిన జి.రంగారావు, వి.రాజులను అరెస్టు చేశామని సీఐ తెలిపారు. -
అల్లూరి పేరిట పోస్టల్ కవర్
చింతపల్లి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చరిత్ర భావితరాలకు ఆదర్శనీయమని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై అల్లూరి సీతారామరాజు దాడి చేసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా తపాలా శాఖ ఆదివారం విశాఖ జిల్లా చింతపల్లిలో అల్లూరి పేరిట పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించింది. తొలుత ఎంపీ, ఎమ్మెల్యే, తపాలా శాఖ అధికారులు పాత బస్టాండ్ నుంచి సెయింట్ ఆన్స్ స్కూల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించారు. అల్లూరి పోరాట చరిత్ర భావితరాలకు గుర్తుండాలనే లక్ష్యంతోనే పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించినట్టు విశాఖ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డాక్టర్ ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. అల్లూరి దాడి చేసిన ప్రతి పోలీసు స్టేషన్‌కు ఒకటి చొప్పున పోస్టల్ కవర్‌ను విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ తమర్భ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ మన్యంలో వలిసెల సోయగం విలసిల్లేలా..
సాక్షి, విశాఖపట్నం: మంచు తెరల మధ్య పసుపు వర్ణంతో మెరిసిపోయే వలిసె పూలు ప్రకృతి కాంతకు స్వర్ణ కాంతులద్దుతాయి. విశాఖ మన్యానికొచ్చే పర్యాటకుల మనసులను ఇట్టే దోచుకుంటాయి. ఏటవాలు కొండ ప్రాంతాల నడుమ చల్లని వాతావరణంలో పెరిగే వలిసె తోటలు కొన్నేళ్లుగా కనుమరుగవుతున్నాయి. గిరిజన రైతుల సంప్రదాయ పంట అయిన వలిసెల సాగు రెండు దశాబ్దాల్లో నాలుగో వంతుకు పడిపోయింది. అత్యధికంగా తేనె ఉండే వలిసె పూల సాగు తగ్గడంతో తేనెటీగలకు కష్టకాలం వచ్చింది. తేనె సేకరణపైనా తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వలిసె తోటలకు పూర్వ వైభవం తెచ్చేందుకు చింతపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిశోధనలు చేపట్టింది. వలిసె తోటల మాతృ ప్రదేశం ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా. వందల ఏళ్ల క్రితమే మన్యంలోకి వచ్చి గిరిజనుల సంప్రదాయ పంటగా మారింది. విశాఖ మన్యంలోని అరుకు లోయ, పాడేరు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, అనంతగిరి, జి.మాడుగుల, చింతపల్లి ప్రాంతాలతోపాటు విజయనగరం జిల్లాలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, పాచిపెంట, శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట, తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో వలిసెల సాగు ఉండేది. తర్వాత కాలంలో విశాఖ మన్యానికే పరిమితమైంది. ఇక్కడ కూడా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం 2003–04లో 16 వేల హెక్టార్లకు పరిమితమైన వలిసెల సాగు క్రమేపీ తగ్గుతూ 2020–21 నాటికి 3,695 హెక్టార్లకు పడిపోయింది. వలిసె ఉపయోగాలివీ.. వలిసె పూలలో తేనె అధికంగా ఉంటుంది. తోటల్లో ఎకరానికి వంద చొప్పున తేనె పెట్టెల చొప్పున ఉంచి తేనెటీగల సాయంతో గిరిజనులు తేనెను సేకరిస్తారు. ఒక్కో పెట్టె నుంచి 35–40 కిలోల చొప్పున తేనె దిగుబడి వస్తుంది. వలిసె గింజల నుంచి వంటనూనె తీస్తారు. దీనిని గిరిజనులు ఇళ్లల్లో వినియోగిస్తుంటారు. ఈ నూనెను కాస్మొటిక్స్, పెయింటింగ్స్ తయారీలోనూ వినియోగిస్తున్నారు. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే వలిసె గింజలను కోళ్లు, పక్షుల దాణా తయారీలోనూ మిశ్రమంగా వాడతారు. తగ్గిపోవడానికి కారణాలు విశాఖ మన్యంలో నీరు నిలవని ఏటవాలు కొండ ప్రాంతాలు, చల్లని వాతావరణం వలిసెల సాగుకు అత్యంత అనుకూలం. పరిమాణం, రంగు, సాగు కాలంలో తేడాను బట్టి 30 రకాల వరకూ ఉన్నాయి. వలిసె గింజల దిగుబడులు తగ్గిపోవడం, రైతులకు పెద్దగా గిట్టుబాటు కాకపోవడం, భూసారం తగ్గడం వంటి పరిస్థితులు వలిసె తోటల సాగు తగ్గడానికి కారణమయ్యాయి. ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్లకు మించి వలిసె గింజల దిగుబడి రావడం లేదు. ఆకాశ పందిరి, బంగారు తీగ అనే కలుపు మొక్కలను నిరోధించడం కష్టమవుతోంది. గిరిజన రైతులు వలిసె విత్తనాలను తామే తయారుచేసుకోవడం వల్ల నాణ్యత లోపించి పంట దెబ్బతిని దిగుబడులు పెద్దగా ఉండటం లేదు. దీంతో వారంతా ప్రత్యామ్నాయ ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపడంతో సాగు విస్తీర్ణం క్రమేపీ తగ్గిపోయింది. పూర్వ వైభవానికి కృషి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.విష్ణువర్దన్‌రెడ్డి గతంలో భారతీయ నూనెగింజల పరిశోధన కేంద్రం (ఐఐవోఆర్) డైరెక్టర్‌గా ఉన్నప్పుడు వలిసెలకు పూర్వ వైభవం తేవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన చొరవతో వలిసెలపై చింతపల్లిలో నాలుగేళ్ల పరిశోధన ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.69 లక్షలు మంజూరు చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో సాగవుతున్న 1,800 రకాల వలిసెల మూల విత్తనాలను న్యూఢిల్లీలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ రిసోర్సెస్ నుంచి చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రానికి తీసుకొచ్చారు. మన్యంలో వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనువైన, వివిధ తెగుళ్లను తట్టుకొని స్వల్ప కాలంలో అధిక దిగుబడిని ఇచ్చే మేలు రకం విత్తనాలను ఇక్కడి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు పాడేరు ఐటీడీఏతో పాటు సంజీవని స్వచ్ఛంద సంస్థ గిరిజన రైతులను ప్రోత్సహిస్తోంది. సాగు, సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించడమే గాక టార్పాలిన్లు, కోత పరికరాలు అందజేస్తుంది. రెండు లాభదాయక రకాల అభివృద్ధి మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ పరిసర ప్రాంతాల్లో మంచి దిగుబడి ఇస్తున్న జేఎన్ఎస్–26, జేఎన్ఎస్–28 రకాల మూల విత్తనాలను తెచ్చాం. మన్యం పరిస్థితులకు అనుగుణంగా ఉండే వీటిని ఇక్కడ అభివృద్ధి చేశాం. ఎకరానికి రెండు కిలోల విత్తనాలు వేస్తే ఆరేడు క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుంది. ఈ విత్తనాలను ఉచితంగా గిరిజన రైతులకు త్వరలోనే ఇస్తాం. ఇలా కనీసం వంద రకాల మేలు రకం విత్తనాలను అభివృద్ధి చేయాలనేది లక్ష్యం. గిరిజన రైతులను వలిసెల సాగు వైపు అన్నివిధాలా ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నాం. – డాక్టర్ గుత్తా రామారావు, సహాయ పరిశోధన సంచాలకులు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం -
పోస్టాఫీస్‌లో సొత్తు స్వాహా..!
సాక్షి, చింతపల్లి (దేవరకొండ): ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సొమ్మును కాపాడాల్సిన అధికారే జిల్లా స్థాయి అధికారుల కళ్లు కప్పి రూ.33లక్షల లక్షలను స్వాహా చేశాడు. ఈ ఘటన మండల కేంద్రంలోని తపాలా కార్యాలయంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. చింతపల్లి మండల తపాలా కార్యాలయం పరిధిలోని చింతపల్లి, నసర్లపల్లి, గడియగౌరారం, వింజమూరు, కుర్రంపల్లి, మధనాపురం, తక్కెళ్లపల్లి గ్రామాల్లో తపాలా సేవలు అందుతున్నాయి. ఇటీవల మండల కేంద్రానికి ఎస్పీఎంగా వచ్చిన ఓ ఉద్యోగి గ్రామాల్లోని బీపీఎంలకు తక్కువ నగదు ఇచ్చి ఎక్కువ నగదు ఇచ్చినట్లుగా రికార్డుల్లో నమోదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామాల్లో బీపీఎంలు ఉపాధి హామీ, పెన్షన్ తదితర సేవలు అందిస్తుంటారు. అయితే వీరికి మండల కేంద్రంలోని తపాలా కార్యాలయం నుంచి నిత్యం లావాదేవీలు కొనసాగుతుంటాయి. ఇదే అదునుగా భావించిన తపాలా కార్యాలయం ఎస్పీఎం, బిపిఎంలకు ఎక్కువ నగదు ఇచ్చినట్లుగా రికార్డుల్లో నమోదు చేసి బీపీఎంలకు మాత్రం తక్కువ నగదు ఇచ్చి జిల్లా అధికారులకు ఎక్కువ డబ్బులు ఇచ్చినట్లుగా తెలిపాడు. ఇదిలా ఉండగా జిల్లా స్థాయి అధికారులు కూడా గ్రామ బీపీఎంలు ఇచ్చే రికార్డులను సరిపోల్చుతారు. దీంతో రూ.33లక్షల సొమ్ము తేడా రావడంతో తీరా ఎస్పీఎం సొమ్ము స్వాహా చేసినట్లు గుర్తించారు. చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు ప్రభుత్వ సొమ్మును కాపాడాల్సిన బాధ్యత కలిగిన అధికారి రూ.33లక్షల సొమ్మును స్వాహా చేయగా గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేపట్టడమే కాకుండా అధికారులు అక్రమార్కున్ని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం బయటకు చెప్పకుండా విచారణ చేసి స్వాహా అయిన సొమ్మును రికవరీ చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో అధికారిని కాపాడే ప్రయత్నంలో జిల్లా అధికారులు ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆగిన ఆసరా పెన్షన్లు గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్‌ను తపాలా కార్యాలయం నుంచి పంపిణీ చేస్తోంది. చింతపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు ఈనెల మొదటి వారం నుంచే ఆసరా పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉండగా కార్యాలయానికి రావాల్సిన పెన్షన్ ఇప్పటికీ జమ కాలేదు. దీంతో దసరా పండుగ సందర్భంగా ఆసరా అందక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. సెలవుల్లో ఎస్పీఎం తపాలా కార్యాలయంలో అవినీతికి పాల్పడిన సంబంధిత అధికారి గత వారం రోజుల నుంచి సెలవుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతికి పాల్పడిన అధికారిపై జిల్లా అధికారులు విచారణ నిర్వహించి అక్రమాలకు పాల్పడినట్లు ఇప్పటికే తేల్చారు. ఈ విషయం బయటికి పొక్కకుండా జిల్లా అధికారులు జాగ్రత పడుతున్నట్లు సమాచారం. అధికారుల సూచన మేరకే సదరు ఉద్యోగి సెలవుల్లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
విధి మిగిల్చిన విషాదం
నాలుగేళ్ల క్రితమే కన్నవారిని పోగొట్టుకొని అనాథలయ్యారు ఆ సోదరులు.. నిలిచేందుకు నిలువ నీడా కూడా లేదు.. అన్న కరెంటు రిపేర్ చేస్తూ తమ్ముడిని పోషిస్తున్నాడు.. తల్లిదండ్రులను కోల్పోయి నా అనే వారు లేకుండా విధివంచితులుగా బతుకీడుస్తున్నారు.. ఓ వ్యవసాయ పొలంలో ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అన్న మృతి చెందడంతో తమ్ముడు ఒంటరివాడయ్యాడు. చింతపల్లి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి ఈ విషాదకర ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. సాక్షి, చింతపల్లి (నల్గొండ) : మండల కేంద్రానికి చెందిన చింతపల్లి విష్ణు, భాగ్యమ్మ దంపతులకు సాయి, ప్రవీణ్ ఇద్దరు కుమారులు. తల్లి దండ్రుల అకాల మృతితో అన్న సాయి కరెంటు మరమ్మతు పనులు చేస్తూ తమ్ముడిని పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే సాయి(20) ఆదివారం రాత్రి మండల కేంద్రంలోని ఓ వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ సరఫరా లేకపోవడంతో మరమ్మతులు చేసేందుకు వెళ్లాడు. అక్కడ విద్యుత్ సరఫరా సరిగా లేదని గమనించిన సాయి నేరుగా ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గుౖరై అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన స్థానికులు అతడిని దేవరకొండ ఆస్పత్రికి తరలించగా అప్పటికే సాయి మృతిచెం దినట్లు వైద్యులు తెలి పారు. సాయి తమ్ముడు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నాలుగేళ్ల క్రితం.. చింతపల్లి విష్ణు, భాగ్యమ్మ దంపతులకు కూలీ లుగా జీవనం సాగించే వారు. తండ్రి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, తల్లి భాగ్యమ్మ మూడేళ్లుగా చెరువుగట్టు దేవస్థానంలో ఉంటూ అక్కడే అనారోగ్యానికి గురై మృతి చెం దింది. వీరికి కనీసం ఉండేందుకు సొంత ఇల్లు కూడా లేదు. దీంతో తల్లిదండ్రుల మృతదేహాలను గ్రామంలోని శివాలయం సమీ పంలో టెంటు వేసి దహనసంస్కారాలు నిర్వహించా రు. ప్రస్తుతం సాయికి నా అనే వాళ్లు ఎవ రూ లే రు. నేరుగా శ్మశానవాటికకే మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్తుల ఆందోళన మండల కేంద్రంలోని సమీపంలో సాయి మృతి చెందిన విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు దేవరకొండలోని బంధువుల సహాయంతో సోమవారం వ్యవసాయ క్షేత్రానికి సాయి మృతదేహాన్ని తీసుకొచ్చి న్యాయం చేయాలని ధర్నాకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం అందుకున్న నాంపల్లి సీఐ గౌరినాయుడు ఘటన స్థలానికి చేరుకొని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీనివ్వడంతో సమస్య సద్దుమణిగింది. అందుబాటులో ఉండని విద్యుత్ అధికారులు మండల కేంద్రంలో విద్యుత్ అధికారులు అందుబాటులోఉండని కారణంగానే విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానిక ప్రజా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ సిబ్బంది హైదరాబాద్‌లో ఉంటుండడంతో విద్యుత్ మరమ్మతులు చేసేందుకు ఎవరూ అందుబాటులో ఉండని కారణంగా ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. సాయి మృతికి విద్యుత్ అధికారులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మరమ్మతులు చేయాలని విద్యుత్ అధికారులను కోరినా స్పందించక పోవడంతోనే ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి నట్లు వ్యవసాయ క్షేత్రం యజమాని పేర్కొంటున్నాడు. కంటతడి పెట్టిన గ్రామస్తులు మండల కేంద్రానికి చెందిన సాయి మృతితో గ్రామస్తులు కంటతడి పెట్టారు. సాయికి ఉన్న ఒక్కగానొక్క ప్రవీణ్ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది. ప్రవీణ్‌కు నా అనే వారు లేకపోవడంతో గ్రామస్తులు ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. -
చింతపల్లిగూడ గేట వద్ద గర్భిణీ మృతదేహం