బాక్సైట్ తవ్వకాలపై తీర్మానం | The decision on bauxite mining | Sakshi
Sakshi News home page

బాక్సైట్ తవ్వకాలపై తీర్మానం

Published Thu, Oct 22 2015 7:30 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

The decision on bauxite mining

బాక్సైట్ తవ్వకాలకు వ్యతికేకంగా 20 గ్రామాల ప్రజలు ఏకమయ్యారు. చింతపల్లి మండలం బలపం అటవీ ప్రాంతంలో సమావేశమయ్యారు. 1/70 చట్టాన్ని అమలు పరచాలని ఈ సమావేశంలో ప్రజలు తీర్మానించారు. బాక్సైట్ గనుల్లో గుణపాలు దించితే.. తమ పదవులకు రాజీనామా చేస్తామంటూ ప్రజాప్రతినిధులు ప్రతిన బూనారు. ఈ కార్యక్రమంలో బాక్సైట్ చింతపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన 20 గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
కాగా.. ఇటీవల బాక్సైట్ తవ్వకాలను ఆపాలంటూ.. తెలుగు దేశం పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను మావోయిస్టులు అరెస్టు చేసిన సంగతితెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రజా ప్రతినిధులు, ప్రజలు బాక్సైట్ మైనింగ్ కి వ్యతిరేకంగా తీర్మానం చేయడం జిల్లా వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement