ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కిరండూల్ గనులనుంచి వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు వచ్చే ఐరన్‌ఓర్‌రేక్స్‌ను అన్‌లోడ్ చేసేందుకు ప్లాంట్‌ఆవిర్భావం నుంచి టిప్లార్ (మిషన్)నేవినియోగిస్తున్నారు. కానీ ఇటీవలతొలిసారిగా ఓ మంత్రి తోడల్లుడికి చెందినఏజెన్సీకి ఎటువంటి టెండర్లు లేకుండా 70వేల టన్నుల రేక్స్ అన్‌లోడ్ కాంట్రాక్టునుఅప్పజెప్పారు. స్టీల్‌ప్లాంట్ సొంత సామర్ధ్యంతోఅయ్యే ఆ పనిని.. మంత్రి బంధువుకుకాంట్రాక్టు అప్పజెప్పిన వివాదాస్పద వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ పనివిలువ అక్షరాలా రూ.కోటి పాతిక లక్షలు..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్‌ప్లాంట్)లో గత 30 ఏళ్లుగా ఇతర రాష్ట్రాల్లోని గనుల నుంచి వచ్చే ఐరన్ ఓర్ రేక్స్‌ను అన్‌లోడ్ చేసేందుకు టిప్లార్‌నే వినియోగిస్తూ వస్తున్నారు. 56 వ్యాగన్లను ఒక రేక్‌గా పరిగణిస్తుంటారు. రోజుకు సగటున 15 నుంచి 20 రేక్‌ల వరకు వస్తుంటాయి. టిప్లార్ ద్వారా రేక్‌లోని ప్రతి వ్యాగన్‌ను కట్ చేసి మెకానికల్‌గా బంకర్‌లో వేస్తారు. ఐరన్ ఓర్ ఫైన్స్ (పౌడర్)తో కూడిన రేక్‌లను కూడా ఇదే మాదిరి అన్‌లోడ్ చేస్తుంటారు.
ప్లాంట్ ఆవిర్భావం నుంచి ఐరన్ ఓర్ రేక్స్‌ను అన్‌లోడ్ చేసే విధానం ఇదే. కానీ స్టీల్‌ప్లాంట్‌లోని రా మెటీరియల్ డిపార్ట్‌మెంట్ (ఆర్‌ఎండీ) అధికారులు ఇటీవల ఓ మంత్రి బంధువుతో కుమ్మక్కై తొలిసారిగా మ్యాన్యువల్ అన్‌లోడ్ కాంట్రాక్టు ఇచ్చేశారు. కనీసం టెండర్లు కూడా పిలవకుండా, ప్లాంట్ యాజమాన్యం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఏకపక్షంగా మంత్రి తోడల్లుడికి చెందిన ట్రాన్స్‌పోర్ట్ అండ్ హ్యాండ్లర్స్‌కు అన్‌లోడ్ పనులు కట్టబెట్టేశారు. టన్నుకు రూ.157, జీఎస్టీకి రూ.18 చొప్పున సుమారు రూ.కోటి పాతిక లక్షల విలువైన కాంట్రాక్టును ఇచ్చేశారు. తీరా కాంట్రాక్టు పని పూర్తయిన తర్వాత బిల్లులు మంజూరు చేయమని పత్రాలు ఉన్నతాధికారులకు పంపిస్తే.. స్టీల్‌ప్లాంట్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ కొర్రీ పెట్టింది. కనీసంగా టెండర్లు లేకుండా ఏకపక్షంగా ఓ కాంట్రాక్టు సంస్థతో ఎందుకు చేయించారంటూ వెనక్కి పంపించింది.
ఆ సెటిల్‌మెంట్‌కు కృతజ్ఞతగానేనా..?
కనీసం టెండర్ కూడా లేకుండా అడ్డగోలుగా ఐరన్ ఓర్ రేక్స్ మ్యాన్యువల్ అన్‌లోడ్ చేయించిన వ్యవహారంలో రా మెటీరియల్‌డిపార్ట్‌మెంట్ (ఆర్‌ఎండీ)లో ముడి పదార్ధాల సరఫరాను పర్యవేక్షించే అధికారే సూత్రధారిగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. సదరు అధికారి ఆ మధ్యన అగనంపూడిలో నిబంధనలకు విరుద్ధంగా ఓ బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపట్టగా కార్పొరేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆ విషయమై ఆ అధికారి మంత్రిని సంప్రదించగా... ఆ అక్రమ నిర్మాణం జోలికి పోవొద్దంటూ జీవీఎంసీ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. అందుకు కృతజ్ఞతగానే సదరు అధికారి మంత్రి తోడల్లుడికి చెందిన ట్రాన్స్‌పోర్ట్ అండ్ హ్యాండ్లర్స్‌కు అడ్డగోలుగా కాంట్రాక్టు కట్టబెట్టినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment