
సాక్షి, విశాఖ: వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు ఉద్యోగులు పిలుపునిచ్చారు. ప్లాంట్ ప్రైవేటీకరణ, కార్మికుల తొలగింపునకు నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పలుచోట్ల కార్మికుల నిరసనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు ప్లాంట్ ప్రైవేటీకరణ, కార్మికుల తొలగింపునకు నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నారు. ఆందోళన అనంతరం జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం అందించనున్నారు అఖిలపక్ష కార్మిక సంఘాలు. అయితే, గాజువాకలో నిరసన చేసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మరోవైపు.. నిరసనలకు ఇలాంటి ఆంక్షలు ఎన్నడూ లేవని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో కుర్మన్నపాలెం దీక్ష శిభిరంలోనే నిరసన చేపట్టాలని పోరాట కమిటీ నిర్ణయించింది.
