
విశాఖపట్నం, సాక్షి: స్టీల్ ప్లాంట్ వద్ద కేంద్ర మంత్రి కుమారస్వామికి నిరసన సెగ తగిలింది. మరో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి ఆయన ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. అయితే దీక్షా శిబిరం ముందు నుంచే ఆయన వెళ్లగా.. కార్మికులు ఒక్కసారిగా నినాదాలకు దిగారు. ‘‘సెయిల్‌లో ఉక్కు పరిశ్రమ విలీనం.. సొంతంగా గనులు కేటాయించాలి’’ అంటూ కుమారస్వామిని ఉద్దేశించి అరిచారు. అయితే ఆ ఆందోళనను పట్టించుకోకుండా కుమారస్వామి ముందుకు వెళ్లారు.
ఆరు నెలలుగా జీతాలు అందని కార్మికులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర మంత్రుల పర్యటన సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో కార్మికులు నిరసన తెలిపారు. స్టీల్ ప్లాంట్ నిర్వహణపై అధికారులతో కాసేపట్లో కేంద్ర మంత్రులు సమీక్ష జరపనున్నారు. అయితే ఆ మీటింగ్‌కు కార్మిక సంఘాలను ఆహ్వానిస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. తమకు ఎలాంటి సమాచారం లేదని సంఘాల నేతలు చెబుతున్నారు.
కాన్వాయ్‌లో ప్రమాదం
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మలు సందర్శిస్తున్నారు. అయితే అంతకుముందు కేంద్రమంత్రుల కాన్వాయ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం షీలా నగర్ వద్ద కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానితో మరోకటి ఢీ కొట్టాయి. దీంతో మూడు కార్లు దెబ్బ తిన్నాయి. ధ్వంసమైన కారులో ఒకటి మాజీ ఎంపీ జీవీఎల్‌కు చెందిన కారు ఉన్నట్లు తెలుస్తోంది.

Comments
Please login to add a commentAdd a comment