Srinivasa Varma Bhupathiraju
-
విశాఖ: స్టీల్ ప్లాంట్ వద్ద కుమారస్వామికి నిరసన సెగ
విశాఖపట్నం, సాక్షి: స్టీల్ ప్లాంట్ వద్ద కేంద్ర మంత్రి కుమారస్వామికి నిరసన సెగ తగిలింది. మరో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి ఆయన ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. అయితే దీక్షా శిబిరం ముందు నుంచే ఆయన వెళ్లగా.. కార్మికులు ఒక్కసారిగా నినాదాలకు దిగారు. ‘‘సెయిల్‌లో ఉక్కు పరిశ్రమ విలీనం.. సొంతంగా గనులు కేటాయించాలి’’ అంటూ కుమారస్వామిని ఉద్దేశించి అరిచారు. అయితే ఆ ఆందోళనను పట్టించుకోకుండా కుమారస్వామి ముందుకు వెళ్లారు. ఆరు నెలలుగా జీతాలు అందని కార్మికులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర మంత్రుల పర్యటన సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో కార్మికులు నిరసన తెలిపారు. స్టీల్ ప్లాంట్ నిర్వహణపై అధికారులతో కాసేపట్లో కేంద్ర మంత్రులు సమీక్ష జరపనున్నారు. అయితే ఆ మీటింగ్‌కు కార్మిక సంఘాలను ఆహ్వానిస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. తమకు ఎలాంటి సమాచారం లేదని సంఘాల నేతలు చెబుతున్నారు. కాన్వాయ్‌లో ప్రమాదం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మలు సందర్శిస్తున్నారు. అయితే అంతకుముందు కేంద్రమంత్రుల కాన్వాయ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం షీలా నగర్ వద్ద కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానితో మరోకటి ఢీ కొట్టాయి. దీంతో మూడు కార్లు దెబ్బ తిన్నాయి. ధ్వంసమైన కారులో ఒకటి మాజీ ఎంపీ జీవీఎల్‌కు చెందిన కారు ఉన్నట్లు తెలుస్తోంది. -
ఎల్లో మీడియాపై కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ సంచలన కామెంట్స్
-
టీడీపీకి ఎంతకాలం తోక పార్టీగా ఉంటాం
ఏలూరు అర్బన్ : ‘జిల్లాలో టీడీపీకి ఎంతకాలం తోక పార్టీగా ఉంటాం.. పార్టీ బలోపేతానికి శ్రేణులు ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి’ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతి రాజు శ్రీనివాసవర్మ అన్నారు. మంగళవారం స్థానిక ఖండ్రికగూడెం పంచాయతీ పరిధిలో నిర్వహించిన ఏలూరు, దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో భాగస్వాములమైనా ప్రజావ్యతిరేక నిర్ణయాలను సమర్ధించబోమని, ప్రజల ఆకాంక్షలకు తగినవిధంగా ప్రజాపోరాటాలకు సైతం వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రధాని మోడీ ప్రభంజనంతో యువత పార్టీలో పనిచేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తోందని అన్నారు. మోడీ ఆలోచనలకు అనుగుణంగా యువతను పార్టీలోకి ఆహ్వానించి పార్టీని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కార్యకర్తలు రానున్న 2019 ఎన్నికలే లక్ష్యంగా పనిచేసి బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ఇప్పటినుంచే కృషి చేయాలని కోరారు. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, జిల్లా శాఖ అధ్యక్షురాలు లక్కోజు సుజాత, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దాని దుర్గారావు, కార్యదర్శి కురెళ్ల సుధాకరకృష్ణ, నాయకులు కత్తి రాము, పులి శ్రీరాములు, తపన ఫౌండేషన్ అధినేత గారపాటి చౌదరి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కైరం అప్పారావు పాల్గొన్నారు.