public representatives
-
ప్రజా ప్రతినిధులే ఫైనల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో స్థానిక ప్రజాప్రతినిధులే కీలక పాత్ర పోషించనున్నారు. లబ్ధిదారులను అధికారులు ప్రాథమికంగా ఎంపిక చేసిన తర్వాత జిల్లాల ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసులతో తుది జాబితా సిద్ధం కానుంది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలు, కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ షురూ కానుంది. దీంతో గురువారం నుంచి దాదాపుగా అన్ని ప్రధాన ప్రభుత్వ శాఖలు రంగంలోకి దిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు ఇచ్చిన సూచనలతో అధికార యంత్రాంగం క్షేత్రస్థాయికి తరలివెళ్లింది. రెవెన్యూ, వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్, ఎంఏయూడీ, హౌసింగ్ విభాగాల అధికారులు, సిబ్బంది అర్హులను గుర్తించడంలో బిజీగా ఉన్నారు. ఈ ప్రక్రియ ఈనెల 20వ తేదీ వరకు కొనసాగనుంది. 21, 22 తేదీల్లో గ్రామ సభలు, పట్టణాల్లో వార్డు సభలు నిర్వహించనున్నారు. అర్హులు, అనర్హుల జాబితాను ఈ సభల్లో ప్రకటించే అవకాశం ఉంది. 23, 24 తేదీల్లో జిల్లా స్థాయిల్లో తుది జాబితా సిద్ధం కానుంది. తుది జాబితాను రూపొందించే క్రమంలో ప్రజా ప్రతినిధుల నిర్ణయం కీలకం కానుంది. స్థానికంగా ఉన్న రాజకీయ, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ అర్హుల ఎంపికలో ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించనున్నారు. ఎమ్మెల్యేల సిఫారసులతో తుదిరూపు దిద్దుకున్న జాబితా ఇన్చార్జి మంత్రి ఆమోదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి వెళుతుంది. ఆ జాబితా ప్రకారమే 26వ తేదీన లబ్ధిదారుల ప్రకటన ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు చెపుతున్నాయి. భూభారతిలోకి సాగు యోగ్యం కాని భూములు రైతుభరోసా పథకం కింద సీజన్‌కు రూ. 6,000 చొప్పున వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతుభరోసా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో సాగు యోగ్యం కాని భూములను గుర్తించేందుకు ప్రస్తుతం ఫీల్డ్ సర్వే జరుగుతోంది. సాగు యోగ్యం కాని భూములను రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మండల వ్యవసాయ విస్తరణాధికారులు పరిశీలించి, భూ భారతి పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. 20వ తేదీ వరకు ఈ ప్రక్రియ పూర్తి చేసి గ్రామసభల్లో నివేదిస్తారు. గ్రామసభల్లో వచ్చే విజ్ఞాపనల ఆధారంగా స్థానిక ఎమ్మెల్యే ఆమోదంతోనే అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నారు. రేషన్‌కార్డు ఆధారంగా కుటుంబం గుర్తింపు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలుగా నమోదై ఉండి సంవత్సరంలో కనీసం 20 రోజుల పాటు వ్యవసాయ కూలీగా పనిచేసిన వారి కుటుంబాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులని ప్రభుత్వం పేర్కొంది. ఒక కుటుంబంలో ఎంత మంది కూలీలు ఉన్నా, ఆ కుటుంబం మొత్తానికి కలిపి ఒక్కో సీజన్‌కు రూ.6 వేల చొప్పున రెండు సీజన్లకు ఏటా రూ.12 వేలు ఈ పథకం కింద చెల్లించనున్నారు. ఈ మేరకు అర్హత కలిగిన కుటుంబాలను గుర్తించే పనిలో అధికారులున్నారు. అయితే కుటుంబాన్ని నిర్ధారించేందుకు రేషన్‌కార్డునే ప్రామాణికంగా తీసుకోనున్నట్లు తెలిసింది. అయితే రేషన్‌కార్డులు గత కొన్నేళ్లుగా అప్డేట్ కాకపోవడంతో కుటుంబంలోని వారికి పెళ్లిళ్లై, వేర్వేరు కుటుంబాల్లో నివసించే పక్షంలో వారిని గుర్తించడంలో గ్రామసభలు కీలకం కానున్నాయి. ఇక్కడ వచ్చిన ఫిర్యాదులు, సూచనలను కూడా స్థానిక ఎమ్మెల్యేల దృష్టికే తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అర్హులందరికీ రేషన్‌కార్డులు! ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుటుంబ సర్వేలో ఏ కుటుంబానికి రేషన్‌కార్డు లేదనేది సిబ్బంది నమోదు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 20 లక్షల కుటుంబాలు కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురు చూస్తుండగా, కార్డుల్లో పేర్ల చేర్పుల కోసం లక్షలాది మంది వెయిటింగ్లో ఉన్నారు. ఎమ్మెల్యేలకు రేషన్‌కార్డుల అంశం కీలకం కాబట్టి అర్హులైన వారందరికీ ఇప్పించేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఓ ప్రజా ప్రతినిధి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లతోనే తిప్పలు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రతి నియోజకవర్గంలో కొత్తగా ఇళ్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఇప్పటికే ఫీల్డ్ సర్వే కూడా పూర్తయింది. లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. కాగా ఒక్కో గ్రామం నుంచి ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారనేదే ప్రధాన సమస్యగా మారనుంది. ఇప్పటికే సొంత స్థలం ఉన్న వారికి తొలి ప్రాధాన్యత అని ప్రభుత్వం చెప్పడంతో ఎమ్మెల్యే విచక్షణ మేరకు ఆయా నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ప్రజా ప్రతినిధులకే కుచ్చుటోపి
సాక్షి, హైదరాబాద్ : ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శినంటూ ప్రజా ప్రతినిధులనే మోసం చేస్తున్న ఘరానా మోసగాణ్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ ఎస్ మట్టం రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తోట బాలాజీ నాయుడు అలియాస్ మల్లారెడ్డి/ దాసరి అనిల్ కుమార్ మై నేత.కామ్ వెబ్సైట్ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్ నంబర్లు సేకరించేవాడు. వారికి ఫోన్ చేసి ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా పరిచయం చేసుకునేవాడు. ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించనుందని, గ్రాంట్‌ను విడుదల చేయనుందని వివరించేవాడు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కావాలని కోరేవాడు. నిజమేనని నమ్మిన ప్రజా ప్రతినిధులు బాలాజీ నాయుడు సూచించిన మ్యూల్ బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీ చేసేవారు. ఆ తర్వాతి నుంచి ఫోన్ స్విఛాఫ్ చేసేవాడు. ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి.. కొత్త ప్రభుత్వం రుణ పథకాన్ని ప్రారంభిస్తుందని, తనతో పాటు వంద మంది సభ్యులు పాల్గొనాల్సి ఉంటుందని సూచించాడు. నిజమేనని నమ్మిన సదరు శాసనసభ సభ్యుడు రూ.3.60 లక్షలు నిందితుడు సూచించిన మ్యూల్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశారు. నగదు విత్‌డ్రా చేసిన తర్వాత నిందితుడు కాల్స్ చేయడం మానేశాడు. దీంతో మోసపోయామని గ్రహించిన ఎమ్మెల్యే సూచన మేరకు తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడు బాలాజీని అరెస్టు చేశారు.లంచం కేసులో దొరికే, జాబ్ పోయే.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తోట బాలాజీ నాయుడు 2008లో రామగుండంలోని ఎనీ్టపీసీలో ఏఈగా ఉద్యోగంలో చేరాడు. చేరిన ఏడాది కాలంలోనే 2009 ఫిబ్రవరిలో ఓ ఎమ్మెల్యే పీఏ నుంచి లంచం తీసుకుంటుండగా.. సీబీఐ చేతికి చిక్కాడు. దీంతో బాలాజీని అరెస్టు చేసి, రిమాండ్ నిమిత్తం కరీంనగర్ జైలుకు తరలించారు. దీంతో ఎనీ్టపీసీ సంస్థ బాలాజీని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. జైలు నుంచి బయటికి వచ్చిన కొంత కాలం తర్వాత బాలాజీ మళ్లీ విశాఖ పరవాడ సింహాద్రీ పవర్ ప్లాంట్‌లో తిరిగి ఉద్యోగంలో చేరాడు. కానీ, అతని ప్రవృత్తిలో మార్పు రాకపోవడంతో 2009లో అతన్ని సరీ్వస్ నుంచి తొలగించారు. ఇక అక్కడ్నుంచి మోసాలకు పాల్పడటే వృత్తిగా ఎంచుకున్నాడు. బాలాజీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 37 కేసులున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతని చేతిలో మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. -
ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల్లో విచారణకు ప్రత్యేక బెంచ్‌లు
న్యూఢిల్లీ: ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల్లో విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో విచారణను వేగవంతం చేయడానికి ప్రత్యేక ధర్మాసనాలు(బెంచ్‌లు) ఏర్పాటు చేయాలని హైకోర్టులను ఆదేశించింది. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై 5 వేలకుపైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారణ మందకొడిగా సాగుతోంది. తీవ్రమైన నేరాలకు పాల్పడేవారిని జీవిత కాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని సీనియర్ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల్లో విచారణను వేగంగా పూర్తిచేయడానికి కచి్చతమైన మార్గదర్శకాలు జారీ చేయడం క్లిష్టమైన ప్రక్రియ అని అభిప్రాయపడింది. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను వేగంగా పరిష్కరించే బాధ్యతను హైకోర్టులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమనల్ కేసుల విచారణకు కొన్ని మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఇలాంటి కేసుల వివరాలను జిల్లా కోర్టులు, ప్రత్యేక కోర్టుల నుంచి సేకరించి, హైకోర్టు వెబ్సైట్లో పొందుపర్చాలని తెలియజేసింది. తీవ్రమైన నేరాల విషయంలో విచారణను వాయిదా వేయకూడదని ట్రయల్ కోర్టులకు తేల్చిచెప్పింది. క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారానికి వెబ్‌సైట్‌ను, సాంకేతిక పరిజ్ఞానాన్ని సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. ప్రజాప్రతినిధులు తీవ్ర నేరాలను పాల్పడినట్లు అభియోగాలు నిరూపితమైతే ఎంపీ లేదా ఎమ్మెల్యే ఎన్నికల్లో వారు పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించడంపై విచారణ జరుపుతున్నామని స్ప ష్టం చేసింది. ఈ అంశంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలియజేసింది. -
చదువురానివారు నాయకులైతే దేశం బాగుపడదు.. అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: అనకాడమీ సంస్థకు చెందిన ఒక లెక్చరర్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన విద్యార్థులతో వచ్చే ఎన్నికల్లో చదువుకున్న వారికి ఓటు వేయమని అభ్యర్ధించాడు. దీంతో ఆ సంస్థ క్లాస్రూమ్ వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకునే వేదిక కాదని చెబుతూ అతడిపై వేటు వేసింది. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందిస్తూ లెక్చరర్ చెప్పిన దాంట్లో తప్పేముందన్నారు. కరణ్ సంగ్వాన్ అనకాడమీలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్ ద్వారా ఆయన తన విద్యార్థులకు ఎన్నికల్లో విద్యావంతులైన అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయాలని ఓ వీడియోలో కోరారు. దీంతో ఆగ్రహించిన ఆ సంస్థ సహ యజమాని రోమన్ సైనీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనపై వేటు వేస్తున్నట్లు ప్రకటిస్తూ X వేదికగా ట్వీట్ చేశారు. దీనిపై సంగ్వాన్ స్పందిస్తూ.. గత కొద్ది రోజులుగా నాకు సంబంధించిన ఒక వీడియో వివాదాస్పదంగా మారింది. నా తోపాటు జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధపడుతున్న నా విద్యార్థులు కూడా ఆ వీడియో వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 19న దానిపై వివరణ ఇస్తానని వెల్లడించారు. సంస్థ సహ యజమాని రోమా సైనీ X వేదికగా ఏమని రాశారంటే.. మా సంస్థకు చాలా కచ్చితమైన నియమ నిబంధనలున్నాయి. విద్యార్ధులకు నిశ్పాక్షిక జ్ఞానాన్ని అందించడమే మా కర్తవ్యం. క్లాస్రూమ్ అనేది వ్యక్తిగత అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకునే వేదిక కాదు. అవి విద్యార్ధులపై తప్పుడు ప్రభావం చూపుతాయి. సంస్థ నిబంధనలను ఉల్లంఘించినందుకు కారం సంగ్వాన్ ను విధుల నుండి తొలగించామని తెలియజేశారు. ఈ ఉదంతంపై సాక్షాత్తు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందిస్తూ.. చదువుకున్న వ్యక్తికి ఓటు వేయమని అడగడం కూడా తప్పేనా? ఎవరైనా నిరక్షరాస్యులు ఉంటే వారిని నేను వ్యక్తిగతంగా గౌరవిస్తాను. కానీ ప్రజాప్రతినిధులు నిరక్షరాస్యులు కాకూడదు. ఇసి సైన్స్ అండ్ టెక్నాలజీ దూసుకెళ్తోన్న తరం. చదువురాని వారి ఆధునిక భారత దేశాన్ని నిర్మించలేరని అన్నారు. क्या पढ़े लिखे लोगों को वोट देने की अपील करना अपराध है? यदि कोई अनपढ़ है, व्यक्तिगत तौर पर मैं उसका सम्मान करता हूँ। लेकिन जनप्रतिनिधि अनपढ़ नहीं हो सकते। ये साइंस और टेक्नोलॉजी का ज़माना है। 21वीं सदी के आधुनिक भारत का निर्माण अनपढ़ जनप्रतिनिधि कभी नहीं कर सकते। https://t.co/YPX4OCoRoZ — Arvind Kejriwal (@ArvindKejriwal) August 17, 2023 ఇది కూడా చదవండి: నెహ్రూ గొప్పదనం ఆయన పేరులో లేదు.. రాహుల్ గాంధీ -
ఇది మీ ప్రభుత్వం: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వమని.. బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీల ప్రభుత్వం అని సీఎం వైఎస్ జగన్ ముస్లిం ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులకు స్పష్టం చేశారు. ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వం మీ మనసు నొప్పించేలా ఎప్పుడూ వ్యవహరించదని చెప్పారు. ఉమ్మడి పౌరస్మృతి అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి డ్రాఫ్ట్ రాలేదని, అందులో ఏ అంశాలు ఉన్నాయో కూడా ఎవరికీ తెలియదన్నారు. అయితే మీడియాలో, పలుచోట్ల విపరీతంగా చర్చ నడుస్తోందని, అది చూసి ముస్లింలు పెద్ద స్థాయిలో తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. బుధవారం ఆయన ముస్లిం ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక రాష్ట్రానికి పాలకుడిగా, సీఎం స్థాయిలో తాను ఉన్నానని, ఇలాంటి పరిస్థితుల్లో మీ రే ఉంటే ఏం చేసేవారో ఆలోచించి సలహాలు ఇ వ్వాలని కోరారు. ముస్లిం ఆడబిడ్డల హక్కుల పరిరక్షణ విషయంలో ముస్లింలే వ్యతిరేకంగా ఉన్నారంటూ ప్రచారం నడుస్తోందని, ఇలాంటి దాన్ని మత పెద్దలుగా మీరు తిప్పికొట్టాలని సూచించారు. ఒకే కడుపున పుట్టిన బిడ్డల విషయంలో ఏతండ్రి, తల్లి అయినా ఎందుకు భేద భావాలు చూపుతారని, మ హిళలకు సమాన హక్కుల విషయంలో ఏ మాత్రం రాజీ లేదనే విషయాన్ని మనందరం స్పష్టం చేద్దామని పిలుపునిచ్చారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. అపార్థాలకు తావివ్వరాదు భారత్ చాలా విభిన్నమైనది. ఇక్కడ అనేక మతాలు, కులాలు, వర్గాలు ఉన్నాయి. ఒకే మతంలో ఉన్న ప లు కులాలు, వర్గాలకూ పలు రకాల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలున్నాయి. వారి వారి మత గ్రంథాలు, విశ్వాసాలు, ఆచరించే సంప్రదాయాల ఆధారంగా వారికి వారి పర్సనల్ లా బోర్డులున్నాయి. ఏ నియమమైనా, ఏ నిబంధన అయినా సాఫీగా తీసుకురావాలనుకున్నప్పుడు నేరుగా ప్రభుత్వాలు కాకుండా ఆయా మతాలకు చెందిన సంస్థలు, పర్సనల్ లా బోర్డుల ద్వారానే చేయాలి. ఎందుకంటే వాటి మీద పూర్తి అవగాహన వారికే ఉంటుంది కాబట్టి. అప్పుడే అపార్థాలకు తావుండదు. మార్పులు అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు, లా కమిషన్, కేంద్రం.. అందరూ కలిసి, మతాలకు చెందిన సంస్థలు, వారి పర్సనల్ లా బోర్డ్స్‌తో మమేకమై ముందుకు సాగాలి. ఇలా కాకుండా వేరే పద్ధతిలో జరిగితే, అది ఇంత భిన్నత్వం ఉన్న భారత్‌లో తగదు. ముస్లింలకు సీఎం అండగా ఉంటానన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీతో పౌరస్మృతి విషయంలో ముస్లిం మైనార్టీలకు భరోసా లభించిందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద ముస్లిం ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి పౌరస్మృతి అంశంపై తమ అభిప్రాయాలను సీఎంతో పంచుకున్నామని చెప్పారు. మూడు గంటల పాటు సీఎంతో సమావేశమై చర్చించామని తెలిపారు. యూసీసీ (యూనిఫాం సివిల్ కోడ్) ముస్లింలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం గురించి మత పెద్దలు సీఎంకు వివరించారన్నారు. ముస్లింలకు నష్టం జరగకుండా తాను ముందుండి పోరాడతానని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. ముస్లింలకు నష్టం కలిగేలా ఉంటే పార్లమెంట్లో యూసీసీ బిల్లును వ్యతిరేకిస్తామని చెప్పారని తెలిపారు. సీఎం నిర్ణయంతో మత పెద్దలు సంతోషం వ్యక్తం చేశారన్నారు. సమావేశంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు రూఫుల్లా, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ ఇసాక్ బాషా పాల్గొన్నారు. -
జయహో బీసీ సభకు తరలి వచ్చిన ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు
-
శ్రీకాకుళం టు అమరావతి
సాక్షి, విశాఖపట్నం: పాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్ర భవిష్యత్తు బంగారుమయమవుతుందని ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు ముక్తకంఠంతో చాటి చెప్పారు. ప్రాంతీయ విభేదాలకు సున్నితంగా తెరదించి మూడు రాజధానులకు మద్దతిస్తూ రాష్ట్రమంతా ఏకతాటిపై నిలిచేలా శాంతియుతంగా ఉద్యమాలను నిర్వహించే సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర వాసులు శ్రీకాకుళం నుంచి అమరావతి వరకూ పాదయాత్ర చేపట్టి కేవలం 29 గ్రామాలు ముఖ్యమా? లేక రాష్ట్రమంతటా అభివృద్ధి జరగడం ముఖ్యమా? అనే అంశంపై ప్రతి గడపలోనూ చర్చ జరిగేందుకు సమాయత్తమవ్వాలని పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన ఉత్తరాంధ్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తరాంధ్ర మేధావుల ఆధ్వర్యంలో ఆదివారం విశాఖలోని గాదిరాజు ప్యాలెస్‌లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ మాజీ ఉపకులపతి హనుమంతు లజపతిరాయ్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో ఉపముఖ్యమంత్రులు పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్ససత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్తో పాటు ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డా.బీవీ సత్యవతి, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, వంశీకృష్ణ శ్రీనివాస్, దుంపల రవీంద్రబాబు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, డైరెక్టర్లు, మేధావి వర్గాల ప్రతినిధులు, ఉద్యోగ, న్యాయవాద, వైద్య, అధ్యాపక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, అమరజీవి పొట్టి శ్రీరాములు, తెలుగుతల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలి పంచవర్ష ప్రణాళికలోనే.. మద్రాస్ నుంచి విడిపోయిన సమయంలో తొలుత విశాఖనే రాజధానిగా ప్రతిపాదించారు. దీనికి 61 మంది ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. చివరి నిమిషంలో కర్నూలుకు మార్చారు. వికేంద్రీకరణ భావన ఇప్పటిది కాదు. 1951 మొదటి పంచవర్ష ప్రణాళికలో వికేంద్రీకరణ అంశాన్ని మూడో లక్ష్యంగా పేర్కొన్నారు. ఇప్పటికైనా మూడు రాజధానులను ఏర్పాటు చేయకుంటే భవిష్యత్తులో రాష్ట్రం మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన అందరిలో ఉంది. ఒకేచోట రాజధాని ఉంటే ప్రకృతి విపత్తులు వస్తే మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది. ఉక్రెయిన్ రాజధాని విషయంలోనూ ఇటీవల అదే జరిగింది. – ప్రొ.హనుమంతు లజపతిరాయ్, మాజీ ఉపకులపతి 29 గ్రామాలా.. రాష్ట్రాభివృద్ధా? రాజధానిగా అమరావతి పనికిరాదని అన్ని కమిటీలు చెప్పాయి. 29 గ్రామాలు ముఖ్యమా? లేక రాష్ట్రం మొత్తం ముఖ్యమా? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. 19 దేశాల్లో, 13 రాష్ట్రాల్లో రాజధాని వికేంద్రీకరణ జరిగింది. హైకోర్టు సీట్ ఒకచోట, బెంచ్ ఒక చోట ఉన్న రాష్ట్రాలు, దేశాలు చాలా ఉన్నాయి. ఎమ్మెల్యే క్వార్టర్లు కాకుండా మూడు చోట్లా ఎమ్మెల్యే హాస్టళ్లు నిర్మించాలి. – ప్రొ.బాలమోహన్‌దాస్, నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ విశాఖ రెడీమేడ్ రాజధాని విశాఖ మహా నగరం అన్ని సదుపాయాలున్న రెడీమేడ్ క్యాపిటల్. అతి తక్కువ ఖర్చుతో రాజధానిని ఏర్పాటు చేయవచ్చు. దీన్ని ఎవరూ కాదనే ప్రసక్తే ఉండదు. టూరిజం, ఇండస్ట్రియల్, ఎడ్యుకేషన్ పరంగా ప్రధాన నగరం. ఇలాంటి నగరాన్ని విడిచిపెట్టి రాజధాని ఎక్కడో ఉండటం సరికాదు. మూడు రాజధానులే సబబు. ప్రభుత్వ నిర్ణయం పర్ఫెక్ట్. – జీఎస్ఎన్ రాజు, సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ 70 ఏళ్లుగా ఉత్తరాంధ్రపై నిర్లక్ష్యం అన్ని ప్రాంతాలు, మతాల వారికి విశాఖ భద్రమైన నగరం. ముఖ్యమంత్రి నిర్ణయానికి పూర్తి మద్దతు పలుకుతున్నాం. వైజాగ్‌లో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయాలని గతంలో 200 రోజుల పాటు పోరాటం చేశాం. రాజధానితో పాటు బెంచ్ కూడా నెలకొల్పాలి. – కృష్ణమోహన్, బార్‌కౌన్సిల్ సభ్యుడు సులువుగా అభివృద్ధి రాష్ట్ర ప్రగతికి ఏది మంచిదో ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ దానికే మద్దతిస్తుంటుంది. వికేంద్రీకరణతో ఎన్నో ప్రయోజనాలుంటాయి. రాష్ట్రం మొత్తం ప్రగతి పథంలో పయనించేందుకు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిందే. విశాఖ అన్నింటికంటే పెద్ద నగరం. దీన్ని అభివృద్ధి చేయడం చాలా తేలిక. ఒక రాజధానిని పునాదుల నుంచి అభివృద్ధి చేయాలంటే చాలా శ్రమతో కూడుకున్నది. హైదరాబాద్‌తో పోటీ పడాలంటే కచ్చితంగా విశాఖకే సాధ్యమవుతుంది. పరిశ్రమలు, ఐటీ సంస్థలు రావాలంటే విశాఖ కార్యనిర్వాహక రాజధాని కావాల్సిందే. దీనివల్ల వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ ముందుకెళ్తాయి. – పైడా కృష్ణప్రసాద్, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు సంక్షోభ రాష్ట్రంపై మరింత భారం అమరావతి నిర్మాణంతో ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఏపీకి ఎలాంటి ఉపయోగం ఉండదు. పుత్రజయని రాజధానిగా మలేషియా నిర్మించింది. అక్కడ ఇప్పటికీ ప్రజలు నివసించడం లేదు. అమరావతి కూడా అదే మాదిరిగా మారుతుంది. ఇలాంటి సదస్సులతో ప్రజలను చైతన్యం చేయాలి. శ్రీకాకుళం నుంచి అమరావతికి యాత్ర చేపట్టాలి. – శివశంకర్, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక కన్వీనర్ ఉద్యమంలో ముందుంటాం.. విశాఖను రాజధానిగా ప్రతి ఒక్కరూ పరిగణించాలి. సీఎం నిర్ణయంతో మూడు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకుంటాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై గ్రామస్థాయి నుంచి అవగాహన కల్పించాలి. రాజధానిగా విశాఖకు సంబంధించిన ఏ ఉద్యమంలోనైనా మా ఉద్యోగుల సంఘం ముందు వరుసలో ఉంటుంది. – పోలాకి శ్రీనివాసరావు, ఏపీ ఎలక్ట్రికల్ బీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు భావితరాలు క్షమించవు.. విశాఖను రెండో ముంబైగా పోలుస్తూ హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందే కీలక ప్రాంతమని దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ గతంలోనే చెప్పారు. అలాంటి నగరాన్ని వదిలేసి ఎక్కడో రాజధాని ఏర్పాటు తప్పిదమే. ఇప్పటికే హైదరాబాద్‌లో అన్నీ అభివృద్ధి చేసి ఒక తప్పు చేశాం. మరోసారి పునరావృతం చేస్తే భావితరాలు క్షమించవు. – షంషుద్దీన్, ముస్లిం సంఘాల ప్రతినిధి అందరి నగరం విశాఖ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. గత ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటే విభజన తర్వాత ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి కాదు. దేశంలో అన్ని ప్రాంతాలకు చెందిన వారు విశాఖలో నివసిస్తున్నారు. – పల్లవి, ఏయూ చీఫ్ వార్డెన్, స్పోర్ట్స్ డైరెక్టర్ పాదయాత్ర ఎవరి కోసం.? అమరావతి రైతుల పాదయాత్ర ఎవరి కోసం? లోకేష్‌ను సీఎం చేయాలనే దుర్భుద్ధితో చంద్రబాబు ఈ పాదయాత్ర చేయిస్తున్నారు. మూడు రాజధానులు ఏర్పడితే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుంది. – పాకా సత్యనారాయణ, న్యాయవాది విద్వేషాలను రెచ్చగొడుతున్నారు.. అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తూ 729 రోజులుగా మందడంలో నిరసన కార్యక్రమా లు చేస్తున్నాం. చంద్రబాబుకు పేదల అభివృద్ధి ఇష్టం లేదు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని అడ్డుకుని కోర్టులో పిల్‌వేశారు. దుర్భుద్ధితో పాదయాత్రలు నిర్వహిస్తూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. –పెరికె వరప్రసాద్, దళిత జేఏసీ నాయకుడు బాబు బినామీల యాత్ర అది చంద్రబాబు బినామీల యాత్ర. విశాఖ పరిపాలన రాజధానిగా మారితే ఉత్తరాంధ్రలో వలసలు ఆగిపోతాయి. గతంలో చంద్రబాబును విశాఖ ఎయిర్‌పోర్టు నుంచే వెనక్కి పంపించాం. పాదయాత్రను కూడా అదేమాదిరిగా తిప్పికొట్టాలి. – కాంతారావు, ఏయూ విద్యార్థి జేఏసీ నాయకుడు నాడు.. దొంగ లెక్కలతో రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని రాజ్యాంగంలో అంబేడ్కర్ స్పష్టం చేశారు. 2014–15లో రాజధానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడితే 42 శాతం మంది విశాఖకు మద్దతిచ్చారు. 22 శాతం మంది విజయవాడ, 25 శాతం గుంటూరుకు మద్దతిచ్చారు. మిగిలిన వారు ఇతర ప్రాంతాల్ని ఎంపిక చేశారు. నాడు విశాఖను రాజధానిగా ఎందుకు ఎంపిక చేయలేదని చంద్రబాబు, నారాయణను నిలదీస్తే గుంటూరు, విజయవాడ కలిపి 47 శాతం అయిందంటూ దొంగ లెక్కలు చెప్పారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే రూ.లక్ష కోట్లు అవసరం. అంత డబ్బుతో 200 మెడికల్ కాలేజీలు, 200 స్టీల్ ప్లాంట్లు వస్తాయి. సీఎం జగన్ నిర్ణయానికి అంతా మద్దతు పలకాలి. – వాసుపల్లి గణేష్‌కుమార్, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే క్షుద్రశక్తులు.. వెన్నుపోటు రాజకీయాలు రూ.3 లక్షల కోట్లు రెవెన్యూ వచ్చే విశాఖకు రాజధానిగా అన్ని హక్కులున్నాయి. కొన్ని క్షుద్రశక్తులు, ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారు. నెత్తిపై తన్నేవారిని చూస్తూ ఊరుకోలేం. ఉద్యమాల పురిటిగడ్డ ఉత్తరాంధ్రలో శాంతియుతంగా పోరాడతాం. – కరణం ధర్మశ్రీ, చోడవరం ఎమ్మెల్యే విస్తృతంగా చాటి చెప్పాలి.. వికేంద్రీకరణ ద్వారా ఉత్తరాంధ్రకు ఒనగూరే, ప్రయోజనం, మూడు రాజధానుల ఏర్పాటుతో రాష్ట్రవ్యాప్తంగా జరిగే అభివృద్ధిపై ప్రజలకు విస్తృతంగా తెలియచేయాలి. మేధావులు ఈ తరహా సదస్సులను నిర్వహించాలి. రాజకీయ అజెండాతో చేపట్టిన పాదయాత్ర లాంటి కార్యక్రమాలను విరమించుకోవాలని ఈ వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం. ప్రాంతాల మధ్య చిచ్చు రగిల్చే చర్యలకు సున్నితంగా తెర దించాలని భావిస్తున్నాం. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి -
మీ వెంటే మేమంతా
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ప్రజా సంక్షేమానికై అహర్నిశలూ శ్రమిస్తున్న జగనన్న వెంటే తామంతా నడుస్తామని నాయకులతో ప్రజలు చెబుతున్నారు. అన్ని జిల్లాల్లో బుధవారం ఈ కార్యక్రమం వేడుకగా సాగింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. సమస్యలు తమ దృష్టికి వస్తే అక్కడికక్కడే పరిష్కరించారు. మేనిఫెస్టోలో అన్ని హామీలను నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించారు. -
గడప గడపకు మన ప్రభుత్వం: వాడవాడలా వేడుకగా
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. అన్ని జిల్లాల్లో ఆదివారం ఈ కార్యక్రమం వేడుకగా సాగింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఏమైనా సమస్యలు తమ దృష్టికి వస్తే అక్కడికక్కడే పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్‌కి తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రజాప్రతినిధులను ప్రజలు దీవిస్తున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించారు. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఉత్సాహంగా సాగింది. ఇందులో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా తమకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధుల వద్ద పలువురు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇళ్లకు వస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులకు ప్రజలు వాడవాడనా ఎదురేగి స్వాగతం పలికారు. సంక్షేమాభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళుతున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని దీవించారు. -
గడప గడపకూ భరోసా
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ఆదివారం ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లగా వారికి ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమకు అండగా నిలుస్తున్నాయని, ఆర్థికంగా భరోసా కల్పిస్తు న్నాయని చెప్పారు. వైఎస్ జగన్ పాలనలో తామంతా చాలా సంతోషంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారు. సీఎం వైఎస్ జగన్‌కు తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆనందంగా తెలియజేశారు. -
గడప గడపకూ భరోసా
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ఆదివారం ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లగా వారికి ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమకు అండగా నిలుస్తున్నాయని, ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నాయని చెప్పారు. వైఎస్ జగన్ పాలనలో తామంతా చాలా సంతోషంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారు. సీఎం వైఎస్ జగన్‌కు తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆనందంగా తెలియజేశారు. – సాక్షి, నెట్వర్క్ -
సర్పంచ్ల సమస్యలపై కమలం పోరు
సాక్షి, హైదరాబాద్: గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టం చేసి రాజకీయంగా బలపడేందుకు బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని అనేకమంది సర్పంచ్‌లు విధులు, నిధులు, అధికారాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం, బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడటం పార్టీకి బాగా కలిసొస్తుందనే అంచనాకు వచ్చింది. కొంతకాలంగా బిల్లులు రాకపోవడం వల్ల సర్పంచ్‌లు మొదలు వివిధస్థాయిల ప్రజాప్రతినిధులు సమస్యలు ఎదుర్కొంటున్నట్టు మీడియాలో వార్తలు వస్తుండటంతో ఈ దిశలో కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన నేపథ్యంలో గ్రామస్థాయిలో అధికార టీఆర్ఎస్ తీరును ఎండగట్టేందుకు ఇదే సరైన సమయమని నిర్థారణకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ల సమస్యలపై పోరాటం చేయడం ద్వారా స్థానికసంస్థల్లో సర్కార్‌పై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవచ్చని భావిస్తోంది. స్థానిక సంస్థలపై వివిధ రూపాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆధిపత్య ధోరణిని ఎండగట్టి గ్రామస్థాయి నుంచి పట్టు సాధించాలని నిర్ణయించింది. త్వరలో గవర్నర్‌కు వినతిపత్రం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని సర్పంచ్ల సమస్యలను త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో పార్టీ నేతలు, పలువురు సర్పంచ్‌లతో కలసి గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్‌కు వినతిపత్రం సమర్పించాలని రాష్ట్రపార్టీ నిర్ణయించింది. రాష్ట్రస్థాయిలో గవర్నర్ దృష్టికి సమస్యలను తీసుకెళ్లడంతోపాటు దీనికి కొనసాగింపుగా అన్ని జిల్లాల్లోని కలెక్టర్లకు సర్పంచ్‌లతో కలసి బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇతరముఖ్యనేతలు మెమోరాండం సమర్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల రెండోవారంలోగా సర్పంచ్ల సమస్యలపై లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద సర్పంచ్‌లతో కలసి సంజయ్ రెండుగంటల మౌనదీక్ష చేపట్టేలా కార్యక్రమం రూపొందిస్తున్నారు. దీనికి కొనసాగింపుగా రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహణ కోసం సర్పంచ్‌లు, పార్టీనేతలతో కమిటీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. -
ఎంపీలు, మాజీలు, వారసుల చూపు అటే..!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయముంది. అయితే ముందస్తు ఎన్నికలు జరగవచ్చనే ప్రచారం జరుగుతోంది. దీంతో అన్ని పారీ్టలూ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతూ కార్యాచరణకు దిగుతున్నాయి. ఇదే క్రమంలో ఆరు నెలలకు ముందే నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ టికెట్ ఆశావహులు తమ నియోజకవర్గాలను పదిలం చేసుకునే పనిలో పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అసెంబ్లీ బరిలో ఉండాలని, తమ అదృష్టం పరీక్షించుకోవాలనే ధ్యేయంతో ఇప్పటినుంచే ఆయా స్థానాల్లో కరీ్చఫ్లు వేసుకుంటూ ఇటు అధిష్టానానికి, అటు పార్టీ కేడర్‌కు సంకేతాలిస్తున్నారు. మాజీ ఎంపీలు.. మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎంపీలు..ప్రస్తుత ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, పార్టీల జిల్లా అధ్యక్షులు ఇతరులతో పాటు కొత్తగా అసెంబ్లీ బరిలోకి దిగాలనుకునే వారు కూడా తమతమ నియోజకవర్గాలపై దృష్టి కేంద్రీకరించి కార్యక్రమాలు చేపడుతున్నారు. అవసరమైతే పార్టీ మారైనా సరే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కొందరు పట్టుదలతో ఉన్నారు. రాష్ట్రంలోని మూడు రాజకీయ పక్షాలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు పలువురు ఎలాగైనా పార్టీ బీ–ఫారం తెచ్చుకునేలా పావులు కదుపుతున్నారు. నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గద్వాల జిల్లాలో.. జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్‌ను టీఆర్ఎస్ నుంచి జడ్పీ చైర్పర్సన్ సరిత ఆశిస్తున్నారు. ఆలంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని మాజీ ఎంపీ మంద జగన్నాథం భావిస్తున్నారు. కొల్లాపూర్ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన జూపల్లి కృష్ణారావు తాను మళ్లీ అక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్తున్నారు. అవసరమైతే పార్టీ మారేందుకు కూడా సిద్ధమవుతున్నారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తె స్నిగ్ధారెడ్డి గద్వాలఅసెంబ్లీపై కరీ్చఫ్ వేశారు. డీకే అరుణ గద్వాల లేదా మహబూబ్‌నగర్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి మక్తల్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్‌లో.. ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈసారి వీలైతే అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. బీజేపీకి చెందిన ముఖ్య నేతలంతా ఇదే ఆలోచనలో ఉన్నారు. ముందుగా అసెంబ్లీకి పోటీ చేసి ఆ తర్వాత పరిస్థితిని బట్టి పార్లమెంటుకు పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఎంపీ అరవింద్ ఆర్మూర్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. బాల్కొండ నుంచి మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లికార్జున్‌రెడ్డి.. తాను బీజేపీ నుంచి పోటీ చేస్తానని కేడర్‌కు చెపుతున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా ఆర్మూర్ లేదా నిజామాబాద్ అర్బన్ స్థానాలపై కరీ్చఫ్ వేశారు. అయితే.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఆర్మూర్ నుంచి పోటీ చేయించాలని అక్కడి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రతిపాదిస్తుండటం గమనార్హం. గతంలో జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసిన కలకుంట్ల మదన్మోహన్రావు ఈసారి ఎల్లారెడ్డి అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఖమ్మంలో.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాను పాలేరు నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తానని ఇటీవల స్పష్టం చేశారు. అయితే అక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్లిన కందాల ఉపేందర్‌రెడ్డి ఉండడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. గతంలో సత్తుపల్లిలో కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన సండ్ర వెంకటవీరయ్యపై మళ్లీ పోటీ చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత సంభాని చంద్రశేఖర్ సిద్ధమవుతున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు ఈసారి టీఆర్ఎస్ టికెట్ అనుమానమే అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు శిబిరం ఈసారి టికెట్ తమదేనని చెప్పుకుంటోంది. మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. నల్లగొండలో.. ప్రస్తుత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈసారి నల్లగొండ అసెంబ్లీ నుంచే పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా హుజూర్నగర్ అసెంబ్లీ నుంచి మళ్లీ పోటీ చేయనున్నారు. భువనగిరి ఎంపీగా పోటీ చేసిన ఓడిపోయిన టీఆర్ఎస్ నేత డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ ఈసారి మునుగోడు లేదా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నుంచి బరిలో ఉంటాననే సంకేతాలు ఇస్తున్నారు. ఈమేరకు ఆయా నియోజకవర్గాల్లో తరచూ పర్యటిస్తున్నారు. యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి ఆ పార్టీ నుంచి భువనగిరి అసెంబ్లీ స్థానంపై కరీ్చఫ్ వేశారు. ఆదిలాబాద్‌లో.. ఆదిలాబాద్ జడ్పీ చైర్ పర్సన్ రాథోడ్ జనార్దన్ టీఆర్ఎస్ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెపుతున్నారు. మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ బెల్లంపల్లి నుంచి, బోథ్ నుంచి మాజీ ఎంపీ గొడం నగేశ్ సై అంటున్నారు. మాజీ ఎంపీ వేణుగోపాలాచారి ముథోల్ అసెంబ్లీ స్థానం కరీ్చఫ్ వేయగా, బీజేపీ నుంచి ఎంపీగా ఉన్న సోయం బాపూరావు కూడా ముథోల్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం వీరంతా ఆయా నియోజకవర్గాల్లో పర్యటనలు, కార్యక్రమాలు చేస్తూ పోటీలో ఉన్నట్టు సంకేతాలిస్తున్నారు. కరీంనగర్లో.. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ వేములవాడ అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మాజీ ఎంపీ వివేక్ కూడా ధర్మపురి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. మంథనిలో పీవీ నర్సింహారావు కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి టీఆర్ఎస్ నుంచి బరిలో ఉంటారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి జగిత్యాల నుంచి కాంగ్రెస్ టికెట్‌పై మరోమారు బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రంగారెడ్డిలో.. మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పక్షాన పోటీ చేయాలని హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డిలు ఆసక్తితో ఉన్నారు. ఇక్కడి నుంచి మంత్రి సబిత ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ టికెట్ తమకేనని కేడర్‌కు చెప్పుకుంటున్నారు. కల్వకుర్తి సీటుపై ప్రస్తుత ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలు ఇద్దరూ కరీ్చఫ్ వేసుకుని కూర్చున్నారు. ఇలావుండగా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి షాద్‌నగర్ అసెంబ్లీ బీజేపీ టికెట్ తనకేననే ధీమాతో ఉన్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కార్యరంగంలోకి దిగి పనిచేస్తున్నారు. సునీతా మహేందర్‌రెడ్డి పరిగి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. కిషన్‌రెడ్డి పోటీలో లేనిపక్షంలో ఇబ్రహీంపట్నం నుంచి పోటీకి కుమారుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ మహిపాల్ కాంగ్రెస్ తరఫున చేవెళ్ల లేదా ఎంపీ కోమటిరెడ్డి ఆశీస్సులతో నల్లగొండ జిల్లా నకిరేకల్ నుంచి పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు. రెండు చోట్లా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లో.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. అంబర్‌పేట అసెంబ్లీ నుంచి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి సనత్‌నగర్ నుంచి ఆ పార్టీ తరఫున పోటీకి సిద్ధమవుతున్నారు. ఖైరతాబాద్ అసెంబ్లీ నుంచి టీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేస్తానని మాజీ సీఎల్పీ నేత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి సంకేతాలిస్తున్నారు. -
గడప గడపనా సందడి..
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోన్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం సోమవారం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి ఊరూరా మంచి స్పందన కనిపిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేస్తోన్న పథకాలను వివరించారు. బుక్లెట్లు పంపిణీ చేశారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అక్కడికక్కడే పరిష్కార మార్గాలు సూచించారు. ఇకపై కూడా ఇదే రీతిలో సంక్షేమాభివృద్ధి కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వంలోనూ తాము ఇంతగా లబ్ధి పొందలేదని పెద్ద సంఖ్యలో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని చెప్పారు. -
గడప గడపనా అపూర్వ ఆదరణ
సాక్షి నెట్వర్క్: ప్రతి ఇంటా ఘన స్వాగతం.. ఆత్మీయ పలకరింపుల నడుమ ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం 18వ రోజైన శనివారం సందడిగా సాగింది. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధుల రాకతో ఊరూరా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. లబ్ధిదారులకు సీఎం జగన్ రాసిన లేఖలను ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి అందించారు. సమస్యలను తెలుసుకుంటూ అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. -
AP: హోరెత్తిన సామాజిక భేరి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/పీఎన్‌కాలనీ/రణస్థలం /జి.సిగడాం/శ్రీకాకుళం రూరల్/నెలిమర్ల/డెంకాడ: సామాజిక సంక్షేమ కెరటాలతో ఉత్తరాంధ్ర ఉప్పొంగింది. రాజ్యాధికారంలో భాగస్వాములైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలను తిలకించి నాగావళి మురిసిపోయింది. ఆయా వర్గాలకు సామాజిక న్యాయాన్ని చేకూరుస్తూ రాజకీయ సాధికారత దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృఢ సంకల్పంతో తీసుకున్న నిర్ణయాలను వివరిస్తున్న ప్రజా ప్రతినిధులకు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. సామాజిక మహా విప్లవంతో దేశంలో పెను మార్పులకు సీఎం జగన్ ఆద్యుడిగా నిలిచారని, విశాల దృక్పథంతో తీసుకున్న నిర్ణయాల వల్ల రాజ్యాధికార బదిలీ జరిగి అన్ని స్థాయిల్లోనూ సామాజిక న్యాయం అమలు జరుగుతోందని పేర్కొంటున్నారు. ఏడు రోడ్ల కూడలి నుంచి ప్రారంభం ‘సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర’కు జనవాహిని పోటెత్తడంతో సిక్కోలు జాతరను తలపించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలను వివరిస్తూ 17 మంది మంత్రులతో కూడిన బృందం ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్రను గురువారం శ్రీకాకుళంలో ఏడు రోడ్ల కూడలి నుంచి ప్రారంభించింది. దారి పొడవునా ప్రజల దీవెనలతో పలు ప్రాంతాల మీదుగా మండుటెండలోనూ తొలిరోజు యాత్ర ఉత్సాహభరితంగా సాగింది. అయితే వర్షం కారణంగా సాయంత్రం విజయనగరంలో నిర్వహించాల్సిన బహిరంగ సభ రద్దైంది. అప్పటికే సభా ప్రాంగణానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సభ నిర్వహణకు సరిగ్గా అరగంట ముందు వర్షం కురవడంతో అనివార్య పరిస్థితుల్లో ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా రద్దు చేయాలని నిర్ణయించారు. అశేష జనవాహిని మధ్య సాగుతున్న బస్సుయాత్ర కిక్కిరిసిన రహదారులు మంత్రులు తొలుత శ్రీకాకుళంలో స్థానిక హోటల్లో మీడియాతో సమావేశం అనంతరం ఏడు రోడ్ల కూడలిలో దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి మాట్లాడి బస్సు యాత్ర ప్రారంభించారు. అంతకుముందు ప్రారంభ స్థలం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, బాబూ జగ్జీవన్‌రావ్, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, కొమురం భీమ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బస్సు యాత్ర సందర్భంగా శ్రీకాకుళం ప్రధాన రహదారులు కిక్కిరిసిపోయాయి. సామాజిక న్యాయభేరి రథానికి ముందు వేలాది మోటార్ బైక్‌ల ర్యాలీ కొనసాగింది. దీంతో కిలోమీటర్ల మేర కోలాహలం నెలకొంది. ప్రజలను కలుసుకుంటూ.. శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్ వద్ద ప్రారంభమైన బస్సు యాత్ర బైపాస్, చిలకపాలెం, సుభద్రాపురం, రణస్థలం, పైడిభీమవరం మీదుగా విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. దారిపొడవునా మంత్రులు ప్రజల్ని కలుసుకుని పలుచోట్ల మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఈ ప్రభుత్వం ఎంత మేలు చేసింది? రాజ్యాధికారంలో ఎలా భాగస్వాములను చేసిందో వివరించారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా ప్రతి పల్లె కదలి రావడంతో చిలకపాలెం, రణస్థలం జనసంద్రమైంది. విజయనగరం జిల్లాలో కందివలస, అగ్రహారం, కుమిలి, ముంగినాపల్లి, గుణుపూరుపేట, జమ్ము మీదుగా విజయనగరంలోకి బస్సు యాత్ర ప్రవేశించింది. సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడుతున్న మంత్రులు అణగదొక్కిన బాబు.. టీడీపీ రథ చక్రాలు ఇప్పటికే కూలిపోయాయని, రానున్న రోజుల్లో ఆనవాలు కూడా ఉండదని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున హెచ్చరించారు. చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అణగదొక్కారన్నారు. భావితరాలు గర్వించే విధంగా సీఎం జగన్ దళితుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్ మూడేళ్లలో చేకూర్చిన సంక్షేమం, కేబినెట్, స్థానిక సంస్థలు కార్పొరేషన్లలో ఎన్ని అవకాశాలు కల్పించారో తెలియజేసేందుకే యాత్ర చేపట్టామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అయితే సామాజిక న్యాయ నిర్మాత సీఎం వైఎస్ జగన్ అని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, హోంమంత్రి తానేటి వనిత శ్రీకాకుళం జిల్లా చిలకపాలెంలో పేర్కొన్నారు. సంక్షేమ పథకాల్లో 80 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకే అందించిన ఘనత జగనన్న ప్రభుత్వానిదని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ చెప్పారు. సంక్షేమ పథకాల్లో ఎక్కువ శాతం మహిళలకే దక్కాయని మంత్రి విడదల రజిని ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో బస్సు యాత్ర సందర్భంగా గుర్తు చేశారు. ఎలాంటి ఉద్యమాలు అవసరం లేకుండా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ అమలు చేస్తున్న కార్యక్రమాలన్నీ సామాజిక న్యాయం వైపు నడిపిస్తున్నాయని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. చివరకు రాజ్యసభ పదవుల్లో సైతం సామాజిక న్యాయం చేకూరిందన్నారు. ఈ మేలును ఓ వర్గం మీడియా ప్రజలకు చెప్పడం లేదని, బస్సు యాత్ర ద్వారా వాస్తవాలు వివరిస్తున్నామని చెప్పారు. డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, అంజాద్ బాషా, కె.నారాయణస్వామి, మంత్రులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, కారుమూరు వెంకట నాగేశ్వరరావు, గుమ్మనూరు జయరాం, ఎంవీ ఉషశ్రీచరణ్లు తదితరులు యాత్రలో పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న మంత్రులు ఇన్నాళ్లకు సాకారం – మంత్రి ధర్మాన పాలనలో బడుగులను భాగస్వాములుగా చేయాలని స్వాతంత్య్ర కాలం నుంచి పోరాటం జరుగుతోందని, ఇన్నేళ్లకు సీఎం జగన్ సాకారం చేశారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. 25 మంది మంత్రుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 17 మందికి స్థానం కల్పించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. బస్సుయాత్ర సందర్భంగా శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో 80 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలేనని చెప్పారు. తమ ప్రభుత్వంలో ఒక్క రూపాయైనా అవినీతి జరిగిందని రుజువు చేయగలరా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. అంబేడ్కర్ స్ఫూర్తితో సీఎం జగన్ పాలన: మంత్రి బొత్స డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో సీఎం జగన్ పాలన కొనసాగుతోందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సామాజికంగా నూతన ఒరవడి రావాలంటే బడుగు, బలహీన వర్గాలను పైకి తీసుకురావాలన్నారు. వేదికపై ఏర్పాటు చేసిన మహనీయుల విగ్రహాలు చంద్రబాబు ఆటలు సాగవు –మంత్రి సీదిరి అప్పలరాజు వెనుకబడిన కులాలకు ప్రాధాన్యమిచ్చి రాజ్యాధికారం కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని మంత్రులు బూడి ముత్యాలనాయుడు, సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు.స్వాతంత్య్రం వచ్చిన తరువాత చరిత్రలో తొలిసారిగా ఓ మత్స్యకార నేతను రాజ్యసభకు సీఎం పంపించారన్నారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు ప్రతిపాదిస్తే చంద్రబాబు అండ్ కో అల్లర్లు సృష్టిస్తున్నారని, వారి ఆటలు సాగవని మంత్రి సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. -
‘గడప’లో ఘన స్వాగతం
సాక్షి, అమరావతి, నెట్వర్క్: ప్రతి ఇంటా ఘన స్వాగతం.. ఆత్మీయ ఆదరణ.. ఆప్యాయతతో కూడిన పలకరింపులతో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం రెండో రోజైన గురువారం వేడుకగా కొనసాగింది. స్థానిక ప్రజా ప్రతినిధుల రాకతో ఊరూరా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. సంక్షేమ, అభివృద్ధి పథకాలను పారదర్శకంగా సంతృప్త స్థాయిలో తమ గడప వద్దకే చేరవేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజానీకం నిండు మనసుతో ఆశీర్వదిస్తోంది. పింఛన్ల నుంచి ఫీజుల దాకా.. ఇళ్ల పట్టాల నుంచి అమ్మ ఒడి వరకు మూడేళ్లలోనే 95% హామీలను నెరవేర్చి ప్రజల చెంతకు చేరుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. లబ్ధిదారులకు సీఎం రాసిన లేఖలను ప్రజా ప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి అందిస్తున్నారు. సమస్యలను తెలుసుకుంటూ అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తుండటంతో మంచి స్పందన లభిస్తోంది. సచివాలయాల సిబ్బందితో కలసి వలంటీర్లు పర్యటనల్లో పాల్గొంటున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వైఎస్సార్ కడప జిల్లాలో రెండో రోజు కూడా కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో కష్టాలు తీరిన ఆనందం ప్రజల్లో కనిపిస్తోందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గురువారం సచివాలయం వద్ద మీడియాతో పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తమ వద్దకు వస్తున్న నాయకులకు ప్రజలు నీరాజనం పడుతున్నారని చెప్పారు. తప్పనిసరిగా బుక్‌లెట్స్‌తో వెళ్లాలి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి ఇంటింటా విశేష ఆదరణ లభిస్తున్నట్లు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి సమాచారంతో తప్పనిసరిగా బుక్‌లెట్స్‌తో శాసనసభ్యులు, సమన్వయకర్తలు ఇంటింటికీ వెళ్లాలని సూచించింది. తగినంత సమయాన్ని కేటాయించి ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరంగా తెలియచేసి ఆయా కుటుంబాలకు అందుతున్న లబ్ధిని మరోసారి వివరించాలని తెలిపింది. వారితో మిస్డ్ కాల్ చేయించాలని, ఇంకా ఏమైనా సమస్యలుంటే నోట్ చేయాలని సూచించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. -
పార్టీ నిర్ణయాలకు అంతా కట్టుబడి ఉండాలి
చోడవరం (అనకాపల్లి జిల్లా): వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం చోడవరంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి స్థానం కల్పించకపోవడంతో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధపడటంతో వారందర్నీ ఎమ్మెల్యే నివారించారు. పదవులు వస్తుంటాయి, పోతుంటాయని.. ప్రజలకు ఎప్పుడూ సేవచేసే అదృష్టం వచ్చినప్పుడు దానికి న్యాయం చేయాలన్నారు. వివిధ సమీకరణాల వల్ల తనకు మంత్రి వర్గంలో స్థానం దక్కకపోయినప్పటికీ సీఎం జగన్మోహన్రెడ్డి అభిమానం తనపైన, నియోజకవర్గ ప్రజలపైన ఎప్పుడూ ఉంటుందన్నారు. పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా అంకిత భావంతో రానున్న రోజుల్లో పార్టీ అభివృద్ధికి మరింత పనిచేయాలన్నారు. సమావేశంలో జెడ్పీటీసీలు మారిశెట్టి విజయశ్రీకాంత్, దొండా రాంబాబు, పోతల లక్ష్మీశ్రీనివాస్, తలారి రమణమ్మ, ఎంపీపీ గాడి కాసు, యర్రంశెట్టి శ్రీనివాసరావు, పైల రాజు, మండల అధ్యక్షులు పల్లా నర్సింగరావు, మడ్డు అప్పలనాయుడు, కంచిపాటి జగన్నాథరావు, కొళ్లిమళ్ల అచ్చెంనాయుడు, డీసీసీబీ డైరెక్టర్ మూడెడ్ల శంకరరావు, విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మే నెలలో గడపగడపకు ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి: గడపగడపకు ఎమ్మెల్యే కార్యక్రమం మే లో ప్రారంభమవుతుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈలోపు సచివాలయాల పరిధిలో సమస్యలను, ప్రభుత్వ పథకాలు ఎలా ప్రజలకు అందుతున్నాయనే విషయాలు తెలుసుకుని ఉంటే బాగుంటుందన్నారు. గడపగడపకు కార్యక్రమం పునాది వలంటీర్ల సత్కారసభలోనే పడాలన్నారు. ప్లీనరీ తర్వాత పార్టీ కార్యక్రమాలు బాగా పెరుగుతాయని చెప్పారు. సచివాలయాల పరిధిలో సూక్ష్మస్థాయి పరిశీలన ద్వారా పార్టీ శ్రేణుల పనితీరు, అసంతృప్తులు, గ్యాప్ ఎక్కడ ఉంది, వాటిని ఏ విధంగా సరిదిద్దుకుని ముందుకెళ్లాలనే అంశాలపై పూర్తి అవగాహన రావచ్చన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, నగర మేయర్లతో బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాల డెలివరీ మెకానిజం ఏ విధంగా జరుగుతోందో తెలుసుకునేందుకు వలంటీర్లకు పురస్కారాలు అందించి సత్కరించే కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, మునిసిపల్ చైర్మన్లతో సమన్వయం చేసుకుని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సచివాలయాల సంఖ్యను బట్టి ఈ కార్యక్రమాల షెడ్యూల్ రూపొందించుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులను కూడా సమాయత్తం చేసుకోవాలన్నారు. సీఎం జగన్ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా సిన్సియారిటీ, హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ కోరుకుంటున్నారన్నారు. ప్రజలకు అందే సేవల విషయంలో లోపాలుంటే సరిదిద్దుకోవచ్చన్నారు. వలంటీర్లకు పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసే సమావేశాల ద్వారా లోపాలను గుర్తించి పరిష్కారాలు కనుగొనవచ్చని చెప్పారు. నియోజకవర్గాల్లో భవిష్యత్తు కార్యక్రమాలకు ఈ సమావేశాలు ఉపయోగపడతాయన్నారు. ఇక నుంచి ప్రతి కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల పరిధిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవులు పొందినవారు, పార్టీ నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. అసంతృప్తులు ఉంటే వారిలో స్తబ్ధత తొలగించి అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేలు తీసుకోవాలని చెప్పారు. వారికి ప్రేరణ కలిగించాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జీలదేనని పేర్కొన్నారు. బూత్ కమిటీలపై పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు 20 రోజుల్లో సమాచారం పంపాలని ఆయన కోరారు. -
రంగంలోకి సీనియర్ ఐపీఎస్
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో నిందితులు, గత దర్యాప్తు అధికారులు కలిసి చేసిన కుట్రను మరింత కొనసాగించేందుకు కొందరు పెద్దలు సిద్ధం కావడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. బినామీ ఆస్తులను గుర్తించి వాటిని జప్తు చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో అగ్రిగోల్డ్ పెద్దలు మధ్యవర్తులతో మళ్లీ వాటిని చేతుల్లోకి తెచ్చుకుంటున్నారు. ఈ వ్యవహారంలో పోలీస్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తిలా పాపం తలా పిడికెడు లెక్కన కేసును తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన్ను కాపాడేందుకు కంకణం... అగ్రిగోల్డ్ కేసులో బినామీ ఆస్తులను గుర్తించకపోవడం, అటాచ్మెంట్ చేయకుండా ఉండేందుకు గత దర్యాప్తు అధికారికి చేరిన రూ. కోటి వ్యవహారంలో ఇప్పుడు ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి రంగంలోకి దిగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు వచ్చిన అధికారిపై విచారణకు ఆదేశాలివ్వాల్సింది పోయి వెనకేసుకొస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై పోలీస్ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. బినామీ ఆస్తులు కొనుగోలు వ్యక్తికి...: అగ్రిగోల్డ్‌కు సంబంధించిన బినామీ ఆస్తులను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని ఏడాది తిరగకుండానే 200 శాతం ఎక్కువ ధరకు అమ్మకం సాగించిన ఓ మాజీ కానిస్టేబుల్‌ను కాపాడేందుకు రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగడం ఇప్పుడు మరింత సంచలనం రేపుతోంది. ఆయనతోపాటు దక్షిణ తెలంగాణకు చెందిన మరో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి సైతం రంగంలోకి దిగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. బినామీ ఆస్తులు రిజిస్ట్రేషన్‌తోపాటు చేతులు మారకుండా ఉండేందుకు ఐజీ (స్టాంపులు–రిజిస్ట్రేషన్)కి సీఐడీ రాసిన లేఖను వెనక్కి తీసుకునేందుకు సైతం ఈ ఇద్దరు ప్రజాప్రతినిధులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఓ మాజీ కానిస్టేబుల్‌కు బడా రాజకీయ నాయకులతో సంబంధం ఏమిటన్న దా నిపై ఇప్పుడు పోలీస్ పెద్దలు ఆరా తీస్తున్నట్టు తెలి సింది. బినామీ ఆస్తుల బదలాయింపులకు, వారికి సంబంధం ఏమిటన్న అంశాలపై కూపీలాగే పనిలో పోలీస్ పెద్దలున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మధ్యవర్తుల పేరిట అగ్రిగోల్డ్ పెద్దలు... అగ్రిగోల్డ్ సంస్థ నుంచి డబ్బులు పెట్టుబడిగా పెట్టించి బినామీ కంపెనీలపై భారీగా భూములు కూడబెట్టిన అగ్రిగోల్డ్ పెద్దలు వాటిని తిరిగి చేతికి వచ్చేలా చేసుకోవడంలో మధ్యవర్తులను ఉపయోగించుకున్నట్టు సీఐడీ దర్యాప్తులో తేలింది. తక్కువ ధరకే బినామీ కంపెనీల పేరిట ఉన్న భూములను అమ్మకం జరిపించి, కొద్ది రోజుల వ్యవధిలోనే మరో మధ్యవర్తి కంపెనీకి ఆ భూములను రేటు పెంచి కొనుగోలు చేసేలా ఇటు గత దర్యాప్తు అధికారులను, అటు ప్రజాప్రతినిధులను అగ్రిగోల్డ్ పెద్దలు ఉపయోగించుకుంటున్నట్టు సీఐడీ పునర్విచారణలో వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. -
AP: ‘సంపూర్ణ గృహ హక్కు’పై విస్తృత ప్రచారం
సాక్షి, అమరావతి: ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకంపై ప్రజల్లో (లబ్ధిదారుల్లో) విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రజాప్రతినిధులు అంతా చొరవ చూపాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ పథకానికి సంబంధించి ఏకకాల పరిష్కారం (వన్ టైమ్ సెటిల్మెంట్)పై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిసెంబర్ 21వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ఈలోగా నియోజకవర్గాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రజాప్రతినిధులను కోరారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద రాష్ట్రంలో 51,08,000 మంది లబ్ధిదారులు ఉండగా వీరిలో 39.7 లక్షల మంది రుణగ్రహీతలు, 12.1 లక్షల మంది ఇతరులు (రుణాలు తీసుకోని వారు) ఉన్నారు. డబ్బుల కోసం కాదు: మంత్రి బొత్స దివంగత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించినట్లు మంత్రి బొత్స చెప్పారు. గతంలో ప్రభుత్వం డబ్బులిచ్చి ఇళ్లు నిర్మించిన వారికి వన్ టైమ్ సెటిల్మెంట్ వర్తిస్తుందని తెలిపారు. డబ్బుల కోసం ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. పొదుపు సంఘాల మహిళలకు దీనిపై పెద్దఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. మండల, మునిసిపల్ సమావేశాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. 50 లక్షల మందికి ప్రయోజనం: సజ్జల రాష్ట్రంలో సుమారు 50 లక్షల మందికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంతో ప్రయోజనం చేకూరనుందని ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున గృహ వసతి కల్పిస్తోందని, దీనిపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేలా కృషి చేయాలని ప్రజాప్రతినిధులను కోరారు. రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ 100% మినహాయింపు: అజయ్‌జైన్ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు యూజర్ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీ నుంచి వంద శాతం మినహాయింపు కల్పించినట్లు గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చన్నారు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా బ్యాంకు రుణాలను కూడా పొందే వెసులుబాటు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, అంజాద్ బాషా, మంత్రులు సీదిరి అప్పలరాజు, ముత్తంశెట్టి శ్రీనివాస్, వెలంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేశ్, కురసాల కన్నబాబు, సీహెచ్ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, గృహ నిర్మాణ సంస్థ అధ్యక్షుడు దొరబాబు, ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
సీతక్కపై నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఓ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకానందున ఆమెకు కోర్టు వారెంట్ జారీ చేసింది. ఈనెల 9లోగా ఈ వారెంట్‌ను అమలు చేయాలని ములుగు పోలీసులను కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా, వేర్వేరు కేసుల్లో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డిలకు సమన్లు జారీ కాగా, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, మచ్చా నాగేశ్వరరావులు కోర్టుకు హాజరయ్యారు. -
రెండో విడతలో ప్రధానికి టీకా!
న్యూఢిల్లీ: రెండో విడత వ్యాక్సినేషన్లో 50 ఏళ్ల వయస్సు పైబడిన ప్రజా ప్రతినిధులకు టీకా వేసే అవకాశముంది. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సహా మెజారిటీ కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రుల్లో అత్యధికులు, ఇతర ప్రముఖ ప్రజా ప్రతినిధులు ఈ కేటగిరీలోకి రానున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికు లు, పోలీసులు.. తదితర కోవిడ్–19 పై పోరాటంలో ముందుండి పోరాడిన యోధులకు జనవరి 16 నుంచి ప్రారంభమైన తొలి విడత వ్యాక్సినేషన్లో టీకా వేస్తున్న విషయం తెలిసిందే. తొలి విడతలో వ్యాక్సిన్ పొందేందుకు తొందరపడవద్దని వ్యాక్సి నేషన్ కార్యక్రమం ప్రారంభించే ముందు ప్రధాని మోదీ మంత్రులు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. టీకా లబ్ధిదారులతో నేడు మాటామంతీ ఉత్తర ప్రదేశ్‌లోని సొంత నియోజకవర్గం వారణాసిలో కోవిడ్ టీకా తీసుకున్నవారు, టీకా వేస్తున్నవారితో నేడు(శుక్రవారం) ప్రధానమంత్రి మోదీ మాట్లాడనున్నారు. టీకాకు సంబంధించి వారి అనుభవాలను ప్రధాని తెలుసుకుంటారని, ఈ కార్యక్రమం వర్చువల్‌గా జరుగుతుందని ప్రధాని కార్యాలయం తెలిపింది. టీకాపై అపోహలొద్దు: హర్షవర్ధన్ కరోనా టీకాలు సురక్షితమైనవి, సమర్ధవం తమైనవని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పునరుద్ఘాటించారు. టీకా వేసుకోవడం వల్ల కోవిడ్–19 వ్యాధి వ్యాప్తి తగ్గి, క్రమంగా అంతరించిపోతుందని పేర్కొన్నారు. టీకాపై అపోహలను తొలగించేందుకు ఉద్దేశించిన పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు. టీకా కావాలంటూ ప్రపంచవ్యాప్తంగా దేశాలు మనల్ని కోరుతున్నాయి. కానీ, మన దేశంలోని కొందరు మాత్రం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం టీకా సమర్ధతపై అపోహలను ప్రచారం చేస్తున్నారు’ అన్నారు. -
హుందాతనం మరవొద్దు
కేవాడియా/సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల విశ్వాసం పొంది, ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు చట్టసభల్లో హుందాగా వ్యవహరిం చాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారు. పార్లమెంట్లో, శాసన సభల్లో అర్థవంతమైన, ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. అన్‌పార్లమెంటరీ పదజాలానికి దూరంగా ఉండాలని కోరారు. క్రమశిక్షణారాహిత్యం, అనుచితమైన పదప్రయోగం ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తాయని అన్నారు. రాష్ట్రపతి కోవింద్ బుధవారం గుజరాత్‌లోని కేవాడియా పట్టణంలో 80వ ఆలిండియా ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో మాట్లాడారు. చట్టసభల్లో ఆరోగ్యకరమైన చర్చలు జరిగేలా స్పీకర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి సూచించారు. బడుగుల అభివృద్ధే పరమావధి కావాలి చట్టసభల పనితీరుపై సామాన్య ప్రజల్లో అవగాహన పెరిగిందని, వారి ఆకాంక్షలు సైతం పెరుగుతున్నాయని రాష్ట్రపతి కోవింద్ గుర్తుచేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఇరు పక్షాల మధ్య పరస్పర అవగాహన, సహకారం, ఆలోచనలు పంచుకోవడం చాలా అవసరమని వెల్లడించారు. అణగారిన, వెనుకబడిన వర్గాల అభివృద్ధే ప్రభుత్వాల పరమావధి కావాలని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం ప్రకటించారు. వ్యవస్థల మధ్య భేదాభిప్రాయాలు సహజమే: ఓం బిర్లా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ వ్యవస్థల మధ్య భేదాభిప్రాయాలు సహజమేనని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య నిబంధనలు పాటిస్తూ ఈ భేదాభిప్రాయాలను తొలగించుకోవాలని అన్నారు. ప్రిసైడింగ్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఒకదానికొకటి సహకరించుకోవాలని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు పనిచేసేలా రాజ్యాంగం పునాదులు వేసిందని అన్నారు. ప్రజాప్రతినిధులుగా మనమంతా ప్రజల బాగు కోసమే పని చేయాలని స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువలను కచ్చితంగా పాటించాలని ఓం బిర్లా పేర్కొన్నారు. మూడు వ్యవస్థలు కలిసి పని చేయాలి: వెంకయ్య ప్రజాస్వామ్యం వెలుగులు విరజిమ్మాలంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య పరస్పర సహకారం అవసరమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు వాటి పరిధిలో కలిసి పనిచేయాలని కోరారు. సామాజిక, ఆర్థిక వ్యవహారాల్లో çకోర్టులు చరిత్రాత్మక తీర్పులు వెలువరించాయని అన్నారు. అయితే, శాసన, కార్యనిర్వా హక వ్యవస్థల్లో కోర్టులు అనవసరంగా కలుగజేసుకుంటున్నాయన్న వాదనలు ఉన్నాయని వెల్లడించారు. చట్టసభల్లో తరచుగా జరుగుతున్న ఘటనలపై వెంకయ్య ఆందోళన వ్యక్తం చేశారు. మూడు ‘డి’లు.. డిబేట్, డిస్కస్, డిసైడ్కు ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉండాలని కోరారు. -
ప్రజాప్రతినిధులపై భారీగా క్రిమినల్ కేసులు
న్యూఢిల్లీ: ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులపై గత రెండేళ్లుగా క్రిమినల్ కేసులు భారీగా పెరిగాయని ఒక నివేదిక తెలిపింది. ఈ ఏడాది మార్చి నాటికి సిట్టింగ్, మాజీ ప్రజా ప్రతినిధులపై 4,442 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉండగా ప్రస్తుతం 4,859కు చేరుకున్నట్లు వివరించింది. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల విచారణ రెండేళ్లుగా వేగవంతమైనప్పటికీ పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయని న్యాయవాదులు విజయ్ హన్సారియా, స్నేహ కలిట సోమవారం సుప్రీంకోర్టు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ‘హైకోర్టులు సూక్ష్మస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి, ఇలాంటి కేసులను సత్వరమే పరిష్కరించాలి. ఇందుకోసం ప్రతి జిల్లాలోనూ సెషన్స్, మెజిస్టీరియల్ స్థాయి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కొన్ని హైకోర్టులు కోరుతున్నాయి. ప్రతి కోర్టుకు నోడల్ ప్రాసిక్యూషన్ అధికారి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయా హైకోర్టులు లేఖలు కూడా రాశాయి. సాక్షులకు రక్షణ, భద్రత కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్ల కల్పనలో నిధుల కొరత సమస్యగా మారిందని హైకోర్టులు చెప్పాయి’ అని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటికే పనిచేస్తున్న బెంగళూరు, అలహాబాద్ ప్రత్యేక కోర్టుల్లో విచారణ కేసుల సంఖ్య ఎక్కువగా ఉందనీ, ఇలాంటి చోట్ల అదనంగా కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
ప్రజా ప్రతినిధులకు కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్ : సీజనల్ వ్యాధుల బారినుంచి కుటుంబాలను, పట్టణాలను, ప్రజలను కాపాడుకోవాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులను కలిసికట్టుగా ఎదుర్కొందామంటూ ఆదివారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పోరేషన్ ఛైర్మన్లు, మున్సిపల్ ఛైర్ పర్సన్లకు ఆయన లేఖ రాశారు. ఆ లేఖలో.. ‘‘ ప్రతి ఆదివారం- పది గంటలకి- పది నిమిషాలు’’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వారికి పిలుపునిచ్చారు. పురపాలక శాఖ చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలన్నారు. సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు పకడ్బందీ ప్రణాళికతో పురపాలక శాఖ ముందుకు వెళ్తోందని తెలిపారు. పురపాలక శాఖ కార్యక్రమాలతో కలిసి రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
ఇంటికెళ్లండి ప్లీజ్..!
సాక్షిప్రతినిధి, తిరుపతి: కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ప్రజలు గుంపులుగా చేరకూడదంటూ 144 సెక్షన్ విధించింది. నిత్యావసరాల కొనుగోలుకు మాత్రం ఇంటికి ఒకరికి నిర్దేశిత సమయంలో వెసులుబాటు కల్పించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంచార వాహనాలతో ముమ్మరంగా ప్రచారం సాగిస్తోంది. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని, సామాజిక దూరం పాటించాలని పోలీసులు కోరుతున్నారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు సైతం పంపిస్తున్నారు. అప్పటికీ రోడ్లపైకి వస్తున్న వారికి కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కల్పించేందుకు పోలీసులతో కలిసి ప్రజాప్రతినిధులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇంటి పట్టున ఉండండి, ముంచుకొస్తున్న ముప్పును గుర్తించండి అంటూ చేతులు జోడించి అభ్యర్థిస్తున్నారు. ఇతర దేశాల్లో ఏర్పడిన విపత్కర పరిస్థితులను అర్థం చేసుకుని అప్రమత్తంగా వ్యవహరించాలని విన్నవిస్తున్నారు. (అమెరికా: 4 నెలల్లో 81 వేల కరోనా మరణాలు? ) జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, పోలీసులు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోలు సమయంలో మార్కెట్లు, దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించాలని కౌన్సెలింగ్ ఇస్తున్నారు. రోడ్డుపైకి వచ్చిన వారిని ఎక్కడికక్కడ అడ్డుకుని బాధ్యతను గుర్తుచేస్తున్నారు. జిల్లా మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను సమాయత్తం చేస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నిత్యం నగరంలో పర్యటిస్తూ వీధుల్లో సంచరిస్తున్న వారిని ఇళ్లకు వెళ్లాలని సూచిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన నియోజకవర్గంలోని అన్ని ఇళ్లకు సుమారు 3.40లక్షల శానిటైజర్స్ పంపిణీ చేశారు. నగరి ఎమ్మెల్యే ఆర్కేరోజా, పీలేరు శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డి తమ ప్రాంతాల్లోని ప్రజలకు మాస్క్‌లను పంపిణీ చేసి కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల లండన్ నుంచి శ్రీకాళహస్తికి వచ్చిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి వెంటనే అప్రమత్తమయ్యారు. పట్టణంలో హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. అలాగే నియోజకవర్గవ్యాప్తంగా శానిటైజర్స్‌ను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. చిత్తూరు, సత్యవేడు, పలమనేరు, పూతలపట్టు, తంబళ్లపల్లె, మదనపల్లె ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, కోనేటి ఆదిమూలం, వెంకటేగౌడ, ఎంఎస్ బాబు, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, నవాజ్‌బాషా ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. -
చిన్న వయసులోనే.. పెద్ద రికార్డు
మన దేశంలో లోక్‌సభ ఎంపీగా, అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రాజ్యాంగం నిర్దేశించిన కనీస వయసు 25 సంవత్సరాలు. అయితే 25 ఏళ్లకే ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టి పలువురు రికార్డు సృష్టించారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యేలుగా..: 2009లో ఆంధప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం నుంచి సీపీఐ తరఫున గెలిచిన బాణోతు చంద్రావతి వయసు అప్పటికి 25 ఏళ్లు మాత్రమే. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆమె విశాఖలో మెడిసిన్ ఫైనలియర్ పూర్తి చేశారు. తాత బీక్యానాయక్ సీపీఐలో చురుకుగా పనిచేసేవారు. పార్టీకి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆ కుటుంబం నుంచి ఎవరికైనా టికెట్ ఇవ్వాలని పార్టీ భావించింది. దీంతో చంద్రావతికి టికెట్ దక్కింది. చిన్న వయసులోనే మంత్రిగా సుష్మా స్వరాజ్ రికార్డు..: చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన వారిలో సుష్మా స్వరాజ్ ఒకరు. ఆమె 1977లో 25 ఏళ్ల వయసులోనే హరియాణా నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే 25 ఏళ్లకే మంత్రి పదవి చేపట్టారు. 1962లో రాజస్తాన్‌లోని బార్మర్ నుంచి ఉమేద్‌సింగ్ , 2012లో ఉత్తరప్రదేశ్‌లోని సదర్ నియోజకవర్గం నుంచి అరుణ్ వర్మ 25 ఏళ్లకే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 29 ఏళ్లకే సీఎంగా..: దేశంలో అతిచిన్న వయసులో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించింది ఎం.ఓ.హసన్ ఫరూక్ మరికర్. 1967లో 29 ఏళ్లకే ఆయన పుదుచ్చేరి సీఎంగా పనిచేశారు. ఆ తర్వాతి స్థానాల్లో ప్రేమ్ ఖండూ 36 ఏళ్లకు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, హేమంత్ సోరెన్ 37 ఏళ్లకు జార్ఖండ్ సీఎంగా, అఖిలేశ్ యాదవ్ 38 ఏళ్లకే యూపీ సీఎంగా పనిచేశారు. చిన్నవయసులోనే ఎంపీగా దుష్యంత్..: దేశంలో అతిపిన్న వయసులో ఎంపీగా గెలుపొందిన ఘనత దుష్యంత్ చౌతాలాకు దక్కింది. ఐఎన్ఎల్డీ నుంచి 2014లో హరియాణాలోని హిసార్ నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయ్‌పై గెలుపొందారు. ఎంపీ అయ్యేనాటికి వయసు 25 ఏళ్లు మాత్రమే. దుష్యంత్ మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనవడు కాగా.. హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు మనువడు. ఉంగాండా నుంచి 19 ఏళ్లకే ఎంపీ..: ప్రపంచంలోనే అతి పిన్న వయసుగల ఎంపీని ఎన్నుకున్న ఘనత ఆఫ్రికా దేశమైన ఉగాండాకు దక్కింది. ఉగాండాకు చెందిన ప్రోస్కోవియా ఓరోమయిట్ హైస్కూలు పూర్తవుతూనే నేరుగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2012లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించేనాటికి ఆమె వయసు 19 ఏళ్లు మాత్రమే. 31 ఏళ్లకే దేశ ప్రధానిగా..: చిన్న వయసులోనే ఒక దేశాధినేతగా ఎన్నికై సెబాస్టియన్ కర్జ్ రికార్డు సృష్టించారు. 2017 డిసెంబర్లో 31 ఏళ్లకే ఆయన ఆస్ట్రియా చాన్సలర్ పదవిని అధిష్టించారు. – సాక్షి, ఎలక్షన్ డెస్క్ -
ఆ ప్రజాప్రతినిధులను వదిలిపెట్టం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తమ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోడి పందేలు ఆడిన ప్రజాప్రతినిధులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. వారి హోదాలు, చిరునామాలతో సహా పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా గుంటూరు జిల్లాలో కోడి పందేలు ఆడిన తెలుగుదేశం పార్టీకి చెందిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు దేవినేని మల్లికార్జునరావు, ముమ్మనేని వెంకట సుబ్బయ్యలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అధికార పార్టీ నేతలకు నోటీసులు సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ దాఖలైన మరో పిటిషన్‌పై ధర్మాసనం స్పందించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. వీరితోపాటు పోలీసులు, రెవెన్యూ అధికారులకు సైతం నోటీసులిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. -
మూఢనమ్మకాలు నమ్ముతారా.. అయితే జాగ్రత్త !
వరంగల్: మూఢ నమ్మకాలను నమ్మొద్దని ప్రభుత్వం పెద్దెత్తున ప్రచారం చేస్తున్నా.. శాసనసభలో చట్టాలు చేసే ప్రజాప్రతినిధులే జాతకాలు చెప్పే కోయ దొరల మాయమాటలకు లొంగిపోయి లక్షల రూపాయలు సమర్పించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల చెవిలో పూలు పెట్టి పూజల పేరిట లక్షల రూపాయలను వసూలు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూజలు, యాగాల పేరిట జాతకాలు చెప్పే కోయదొరలు తమ వద్ద నుంచి లక్షల రూపాయాలు వసూలు చేశారని హన్మకొండ నక్కలగుట్ట ప్రాంతంలోని ప్రజాప్రతినిధి బంధువులు నగరంలోని ఒక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలగులోకి వచ్చింది.తమ బంధువు అయినా ప్రజాప్రతినిధికి అత్యున్నత పదవీ వచ్చేందుకు రూ.57 లక్షలను వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. దీన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని సదరు ప్రజాప్రతినిధి పోపలీసులకు సిఫారసు చేసినట్లు సమాచారం. ఈ మేరకు వరంగల్ ప్రాంతానికి చెందిన వాస్తు, గ్రహ పూజలు చేసే కోయదొరలను ఆదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని పోలీసు అధికారుల ఏర్పుటు చేసినట్లు తెలిసింది. గతంలో వారి కుంటుబ సభ్యులకు పూజలు చేయడం వల్ల పలు శుభాలు జరడగంతో వీరి మాటలు నమ్మి లక్షల్లో డబ్బులు ఇచ్చి మోసపోయినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కాశీలో పూజలు, అక్కడి పూజారులకు వేలల్లో డబ్బులు ఇచ్చేందుకు పలువురు కోయదొరలు దఫాల వారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా హిమాలయాల్లో సైతం పూజలు చేయాలని కోరడంతో ఒకే సారి లక్షల్లో డబ్బులు వారికి అప్పగించినట్లు ఫిర్యాదులో పేర్కొనట్టు తెలిసింది. ఈ మోసానికి పాల్పడిన కోయదొరలను పోలీసులు ఆదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. -
ప్రజా ప్రతినిధుల అండతోనే భూదందా
-
ప్రజా ప్రతినిధుల అండతోనే భూదందా
- మంత్రి అయ్యన్నపాత్రుడు - నా స్నేహితుడూ భూమిని ఆక్రమించుకుంటానన్నాడు సాక్షి, విశాఖపట్నం: ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల అండదండలతోనే విశాఖలో భూ దందా యథేచ్ఛగా కొనసాగుతోందని రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ప్రవాసాం ధ్రులు ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ముతో విశాఖలో భూములు కొనుగోలు చేస్తే.. భూ బకాసురులు వాటిని ఆక్రమిం చుకుంటూ వారిని ముప్పుతిప్పలు పెడుతు న్నారని చెప్పారు. ‘విశాఖలో భూ దందా సాగుతోందంట కదా? రాజకీయ అండదం డలుంటే ఎక్కడైనా సరే, ప్రభుత్వ భూములైనా దర్జాగా కబ్జా చేయొచ్చట కదా.. మీరు కాస్త మద్దతుగా ఉంటే నేనో రెండెకరాలు ఆక్రమించుకుంటానంటూ ఓ స్నేహితుడు నన్నడిగాడు. ఆయన మాటలు వింటుంటే విశాఖలో భూములు ఎంత ఈజీగా కబ్జా చేయొచ్చో అర్ధమవుతోంది’ అని అయ్యన్న అన్నారు. విశాఖ వుడా చిల్డ్రన్స్ థియేటర్లో శుక్రవారం జరిగిన నవనిర్మాణ దీక్ష సభలో ఆయన మాట్లాడారు. ఆర్ అండ్ బీ సీఈ గంగాధర్ రూ.150 కోట్ల అక్రమాస్తులతో ఏసీబీకి దొరికిపోయారని, ఒక సీఈకి ఇంత సంపాదన అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. భూదందాను బట్టబయలు చేసిన కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జేసీ సృజన, పోలీస్ కమిషనర్ యోగానంద్‌లను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. -
ప్రజాప్రతినిధులకు గుణపాఠం
విశ్లేషణ రాజకీయాలు, అక్రమార్జన కోసం రాజకీయం చేయడం పౌర జీవితం పాలిట శాపం. అవి నగరాలను, పట్టణాలను జీవింపశక్యం కానివిగా చేశాయి. అక్రమ నిర్మాణాలు, అధ్వానమైన రోడ్లు వగైరాలు ఈ అనర్థాన్ని కళ్లకు కడుతుంటాయి. కొత్త నవీ ముంబై కమిషనర్‌గా నియమితులైన తుకారాం ముండే ఉదయం నడకకు వెళ్లిన ప్పుడు పౌరులు తమ సమస్యలు వినిపిస్తూ ఉంటే నిర్ఘాంతపో వాల్సి వచ్చింది. అధ్వానమైన ఫుట్‌పాత్‌లు, బస్సు సర్వీసులు, నీటి సరఫరా, మురుగు కాలు వలు, చెత్త, మురికివాడలు వగైరా... వారు ఏకరువు పెట్టిన సమస్యలను వార్డు కార్యాలయాలకు లేదా కార్పొరేటర్ల ద్వారా కార్పొరేషన్‌కు చెబితే సరిపోతుంది. కానీ ఎక్కడో ఏదో తప్పు జగిందని అనిపిస్తోంది. ఒకటి, కార్పొరేషన్ ఆ నగరం కోసం లేదా నగర పౌరుల కోసం పనిచేయడం లేదు. ప్రజలకూ, వారు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులకు మధ్య బంధం తెగిపోయింది. స్థానిక ఎన్నికల్లో నగరం పట్ల చిత్తశుద్ధికి తప్ప భావజాలానికి తావు లేదు. అయినా ప్రజా ప్రతినిధులు వచ్చే మునిసిపల్ ఎన్ని కల్లో నగర సంక్షేమంపైగాక, తమ భావజాలంపై ఆధారపడి ఓట్లు అడుక్కోవడమో లేక కొనుక్కోవడమో చేస్తారని అనిపిస్తోంది. కాబట్టే ముండే రోజువారీ కాలి నడక కాస్తా అధికారిక విధుల్లో భాగంగా మారిపోయింది. పౌర సమస్యల పరిష్కారం కోసం ఆయన చేపట్టిన చర్యలు ఓ అరుదైన పర్యవసానానికి దారి తీశాయి. గత వారంSకమిషనర్‌పై విశ్వాస రాహిత్య తీర్మానానికి అను కూలంగా 104 మంది కార్పొరేటర్లు ఓటు చేయగా, ఆరు గురు మాత్రం ఆయనకు మద్దతు తెలిపారు. ఈ తీర్మా నాన్ని ఆమోదించడంలో అన్ని రాజకీయ పార్టీల కార్పొ రేటర్లు ఒక్కటయ్యారు. అయినా, ఈ తీర్మానం ప్రజాస్వా మిక సంస్థల పరిరక్షణ కోసం చేపట్టిన చర్య అనే వాదనను అంగీకరించను. ఇది నిజానికి, నగర కమిషనర్లు, రాజకీయ వేత్తలు కుమ్మక్కయ్యే తమ పద్ధ్దతుల పరిరక్షణ కోసం చేప ట్టిన చర్య మాత్రమే. ఎనిమిదేళ్ల కంటే తక్కువ కాలంలోనే ఎనిమిది బది లీలను చూసిన కర్తవ్యదీక్షాపరుడైన ఐఏఎస్ అధికారి ముండే... ఈ వ్యవహారం అంతటికీ మూలం ఏమిటనే దాన్ని పట్టుకున్నారు. నిర్దిష్టంగా కేటాయింపులు లేకుండా, స్థూల పద్దుల కింద రూ. 2,000 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించారు. తద్వారా కార్పొరేటర్లకు అనువైన రీతిలో నిధుల మళ్లింపునకు వీలుండేలా చేశారు. మునిసిపల్ చట్టాల ప్రకారం కమిషనర్∙పరిపాలకుడు మాత్రమే, ఇక మేయర్లది నామ మాత్రపు పాత్రే. ముండే నగర పాల కునిగా తన అధికారాలను ఉపయోగించసాగారు. ఐదు నెలల్లో మిన్ను విరిగి మీద పడింది. ఒక స్మారక చిహ్నానికి చలువరాతి తాపడం చేయడానికి రూ. 2 కోట్ల ప్రణాళిక అనవసరమంటూ దాన్ని రద్దు చేశారు. రూ. 167 కోట్ల సోలార్ పార్క్ విషయంలోనూ అదే పని చేశారు. కొను గోలుదారు ఎవరూ లేకుండా దాన్ని చేపట్టడమే అందుకు కారణం. ఆ ప్రాజెక్టు ప్రణాళికలో కొనుగోలుదా రుని వెతికే అంశం సైతం లేదు. కచ్చితమైన చర్యలను చేపట్టడంతో పక్కనే ఉన్న ముంబైలో మునిసిపల్ ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడిన దృష్ట్యా ముండే కొరతగా ఉన్న నిధులను పౌర సదుపాయాలకు మళ్లించాలని నిర్ణ యించారు. పురపాలక సంస్థలు స్థానిక స్వయం పరిపాలనా సంస్థలు. కాబట్టి ఎన్నికైన ప్రజా ప్రతినిధులను పూర్తిగా పక్కన పెట్టేయడం ప్రజాస్వామ్యంలో జరగదగినది కాదు. కానీ, నగరాన్ని, నగర అవసరాలను తక్కువ ప్రాధాన్యం గలవిగా చూడటం ద్వారా కార్పొరేటర్లు తమంతట తామే ఆ పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. వారు అతిశయాన్ని నేర్చుకున్నారు. తమ నగరానికి సేవ చేయాలనే నిబద్ధతకు బదులుగా తమకు అనువైన ప్రత్యేక ప్రయోజన బృందా లను ఏర్పరచుకున్నారు. చాలా ఇతర నగరాలలో కూడా నవీ ముంబై కనిపిస్తుండటం విచారకరం. ముండేపై విశ్వాస రాహిత్య తీర్మానాన్ని కనీసం ఇంతవరకు ముఖ్యమంత్రి ఆమోదించకపోవడం, కమిషనర్‌ను మార్చడం జరగకపోవచ్చని సంకేతించడం సంతోష కరం. మునిసిపల్ చట్టాన్ని అనుసరించి కమిషనర్‌ను నియ మించేది రాష్ట్ర ప్రభుత్వమే. ఎవరిని నియమిస్తారు, ఎంత కాలానికి అనే వాటిని నిర్ణయించేది నగర పాలక సంస్థ కాదు. ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పట్ల ‘‘గౌరవం’’తో ఉండాలని మాత్రమే ముండేకు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా నగరంపై ఆయన తన దృష్టిని కేంద్రీకరిస్తుండటం వల్ల కార్పొరేటర్ల అహాలు తునాతునకలై పోయాయి. మహారాష్ట్రలో ఇంతకు ముందు కూడా కొందరు కమి షనర్లు ముండేలాగానే ప్రజాప్రతినిధులతో ఘర్షణ పడాల్సి వచ్చింది. కార్పొరేటర్లను దూరంగా ఉంచి నిబంధనల ప్రకారం ముంబై కమిషనర్‌గా పనిచేసిన సదాశివ తినాయ్ కార్, పుణెకు సంబంధించి అరుణ్ భాటియా అలాంటి వారే. టీ చంద్రశేఖర్‌కు థానే నగరం కోసం పని చేసినం దుకు విశ్వాస రాహిత్య తీర్మానం బహుమతిగా దక్కింది. రాజకీయాలు, అక్రమార్జన కోసం రాజకీయం చేయడం పౌర జీవితం పాలిట శాపం. అవి నగరాలను, పట్టణాలను జీవింపశక్యం కానివిగా చేశాయి. అక్రమ నిర్మా ణాలు, అధ్వానమైన రోడ్లు వగైరాలు ఈ అనర్థాన్ని కళ్లకు కడుతుంటాయి, అనుభవంలోకి తెస్తుంటాయి. నగర పాలక సంస్థ లక్ష్యాల ప్రాధాన్యాలను మార్చడమే ముండే చేసిన తప్పు. అంతే. ఇది, ‘ప్రజలు ఎన్నుకున్న ప్రతి నిధులకు గుణపాఠం’. ( వ్యాసకర్త : మహేష్ విజాపృకర్ సీనియర్ పాత్రికేయులు mail : mvijapurkar@gmail.com) -
ఆగని కొత్త జిల్లాల నిరసనలు
-
ఆగని కొత్త జిల్లాల నిరసనలు
నారాయణపేట/కొడంగల్ రూరల్: మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేటను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు జిల్లా సాధన సమితి, అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆదివారం నిరసనలు చేపట్టారు. పతంజలి యోగాసమితి ఆధ్వర్యంలో స్థానిక సత్యనారాయణ చౌరస్తాలో ఉదయం ఉద్యమకారులు యోగాసనాలు చేస్తూ వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. నారాయణపేటను జిల్లాగా ప్రకటించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని డప్పులు, డోళ్ల చప్పుళ్లతో జిల్లా వాదన వినిపించారు. కొడంగల్ నియోజకవర్గాన్ని విడదీయకూడదని, మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఉంచాలని తాండూర్- మహబూబ్‌నగర్ ప్రధాన రహదారి పర్సాపూర్ గేటుపై పర్సాపూర్ గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. హైదరాబాద్- కర్ణాటక రహదారి యాద్గిర్, గుల్బర్గా ప్రధాన రహదారిపై రావులపల్లి గ్రామస్తులు రాస్తారోకో చేపట్టడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. నల్లగొండలోనూ విభజన సెగ నల్లగొండ: విభజన నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గుండాల మండలాన్ని యాదాద్రిలోనే ఉంచాలని ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. మోటకొండూరును మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని యాదగిరిగుట్టలో ప్రజాప్రతినిధులు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మేళ్లచెర్వు మండలం దొండపాడును మండలంగా చేయాలని రాస్తారోకో నిర్వహించారు. -
ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలి
నల్లగొండ తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి ఆకు పచ్చ తెలంగాణగా తీర్చిదిద్దాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం 25 లక్షల ఈత చెట్లను నాటాలని తెలిపారు. మొక్కల కొరత ఉన్నందున పొరుగు రాష్ట్రాల నుంచి మొక్కలు తేవడానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జిల్లాలో నర్సరీల్లో మొక్కల కొరత ఉన్నట్లయితే పొరుగు జిల్లాలలో ఉన్న నర్సరీ మొక్కలను అవసరమైన చోటకు తరలించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మాట్లాడుతూ సీఎం ప్రతి రోజు హరితహారం సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి హరితహారం కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సూచించారు. నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇన్చార్జి అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు పని చేయాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున మొక్కలకు నీటి సరఫరా తగ్గినట్లు తెలిపారు. మొక్క సంరక్షణకు ఫెన్సింగ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. అటవీ భూముల్లో మొక్కలు నాటడానికి అనుమతి లేదని తెలియజేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినందున సంబంధిత అటవీ భూములలో వెంటనే మొక్కలు నాటించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హరితహారం కార్యక్రమం నిరంతరం జరిగే ప్రక్రియ అయినందున అనుకూల వాతావరణం ఉన్నప్పుడు మొక్కలు విధిగా నాటించాలని తెలిపారు. కల్యాణలక్ష్మీకి మార్గదర్శకాలు జారీ కల్యాణలక్ష్మీ పథకానికి లబ్ధిదారుల ఎంపిక విధానానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. ఆ మార్గదర్శకాల ప్రకారం సంబంధిత తహసీల్దార్ పరిశీలించి ధ్రువీకరించాలని తెలిపారు. కృష్ణా పుష్కరాల కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కోరారు. జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు 4 కోట్ల 80 లక్షల మొక్కల లక్ష్యంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.. ఇప్పటివరకు ఒక కోటి 61 లక్షల మొక్కలు నాటించామని తెలిపారు. జిల్లాలో ఇంకా 25 లక్షల మొక్కలు అవసరం ఉన్నాయని తెలియజేయగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే జిల్లాకు మొక్కలను పంపిస్తామని పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాల పనులు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. ఇన్చార్జి అధికారులను నియమించి కంట్రోల్ రూమ్‌ల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పుష్కర ఘాట్లను రాష్ట్ర మంత్రులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అటవీ శాఖ అదనపు సీసీఎఫ్ ఫరై్గన్, జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ డాక్టర్. యన్.సత్యనారాయణ, డీఆర్వో రవి, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, డీఎఫ్ఓ తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శ నేతలు
తమ పిల్లలను సర్కారు స్కూలుకు పంపిస్తున్న ప్రజాప్రతినిధులు సాధారణంగా సర్కారు బడంటేనే చిన్నచూపు.. కూలీ పనికి వెళ్లేవారు కూడా తమ పిల్లలను సర్కారు బడికి బదులు ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు.. ఇటువంటి రోజుల్లో కొందరు ప్రజాప్రతినిధులు తమ పిల్లలను సర్కారు బడికి పంపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.. వీరిపై ఈవారం సండేస్పెషల్ వారు ప్రజాప్రతినిధులు.. ఆర్థికంగా, సామాజికంగా పలుకుబడి కలిగినవారే.. పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చదివించే స్థోమత ఉన్నవారే.. అయినా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులతోపాటు ప్రజాప్రతినిధులు కూడా గ్రామాల్లో తిరిగి, విద్యార్థులను సర్కారు బడులకే పంపాలని ప్రచారం చేశారు. తామే ఆదర్శంగా ఉండేందుకు పలువురు ప్రజాప్రతినిధులు తమ పిల్లలను సర్కారు బడికి పంపిస్తున్నారు. ఆదర్శంగా నిలుస్తున్న నేతలపై సండే స్పెషల్.. బీర్కూర్ : తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు బీర్కూర్ ఎంపీపీ మీనా హన్మంతు. ఈనెల 9న గ్రామంలో మన ఊరు-మన బడి కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం కోసం వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఎంపీపీ మీనాహన్మంతు దంపతులు మాట్లాడారు. ఒకటో తరగతిలో తమ కుమారుడు శ్రీహర్షను చేర్పించడానికి అంగీకారం తెలిపారు. పాఠశాల పునఃప్రారంభం రోజు గ్రామంలోని గడివద్ద గల ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. 13న సర్కారు బడిలో అక్షరాభ్యాసం చేయించారు. శనివారం పాఠశాలలో విద్యారుథలకు పాఠ్యపుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తమ కుమారుడిని క్రమం తప్పకుండా సర్కారు బడికి పంపిస్తున్నామన్నారు. తన కుమారుడు అందిరితోపాటే క్యూలో వచ్చి పాఠ్యపుస్తకాలు తీసుకున్నాడని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ప్రజల ఆలోచన విధానంలో మార్పు వస్తుందని, సర్కారు బడులు బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. మొదటినుంచీ.. నాగిరెడ్డిపేట : పోచారం సర్పంచ్ గోపాల్‌గౌడ్ తన కూతురు సాయిభవానిని గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదివిస్తున్నారు. సాయిభవాని ఐదో తరగతి చదువుతోంది. తన కూతురును ఒకటో తరగతినుంచే ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నానని గోపాల్‌గౌడ్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే.. సర్కారు బడి బాగుపడుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఐదేళ్లుగా... సిరికొండ : తూంపల్లి సర్పంచ్ బూస దేవరాజ్ తన కూతురు హేమవర్షికను సర్కారు బడిలో చదివిస్తున్నారు. దేవరాజ్‌కు ఇద్దరు పిల్లలు. కూతురు హేమవర్షిక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. కుమారుడు రిషివర్ధన్‌కు మూడేళ్లు. తన కూతురును ఒకటో తరగతినుంచి సర్కారు బడిలోనే చదివిస్తున్నానని దేవరాజ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై గ్రామస్తులందరికీ నమ్మకం ఉండాలనే తన కూతురును ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నానన్నారు. నమ్మకం పెంచేందుకే.. మాచారెడ్డి : ఘన్పూర్ (ఎం) ఎంపీటీసీ సభ్యుడు ఎడపల్లి శ్రీనివాస్ తమ ఇద్దరు పిల్లలను సర్కారు బడికి పంపిస్తున్నారు. ఆయన కూతురు మేఘనను చుక్కాపూర్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. కుమారుడు కార్తీక్‌ను గ్రామంలోని పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలల్లో చేర్చాలంటున్న ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు.. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే ప్రజలకు నమ్మకం పెరుగుతుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. అందుకే తన పిల్లలను సర్కారు బడికి పంపిస్తున్నానన్నారు. సర్పంచ్ కూతురు.. నిజాంసాగర్ : బూర్గుల్ సర్పంచ్ దుడ్డె అనితా సురేందర్ తన కూతురు షర్మిలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. షర్మిల మూడో తరగతి చదువుతోంది. సర్పంచ్ తన కూతురును ప్రభుత్వ పాఠశాలకు పంపుతుండడంతో గ్రామస్తులూ సర్కారు బడిని ఆదరిస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ తెలిపారు. -
సమన్వయంతో పనిచేయండి
♦ ఇంకుడు గుంతలను విరివిగా నిర్మించాలి: మంత్రి ♦ తాగునీటి సమస్యను రానివ్వంరాష్ట్ర నీటిపారుదల శాఖ ♦ మంత్రి హరీశ్ రావు ప్రజాప్రతినిధులు, ♦ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సంగారెడ్డి జోన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ తెలంగాణలో భాగంగా ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకునేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కరువు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, ప్రతిష్టాత్మకం గా తీసుకున్న వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం, ఉపాధి హామీ, మిషన్ కాకతీయ పనులు, తాగునీటి సరఫరా తదితర అంశాలపై మంత్రి హరీశ్ మంగళవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందు లో కలెక్టర్ రోనాల్డ్ రాస్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రానున్న నెలన్నర రోజు లు చాలా కీలకమైనవని, ఈ రోజుల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బోరు బావులను అద్దెకు తీసుకొని నీటిని అందించాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే ప్రజాప్రతినిధులు, కలెక్టర్, అధికారులకు ప్రతిపాదనలు పంపాలన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టుకుందాం.. ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. వ్యక్తిగత, కమ్యూనిటీ, ఇన్స్టిట్యూట్, ఇంకుడు గుం తల నిర్మాణానికి ప్రభుత్వం రూపకల్పన చేసిం దన్నారు. రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, మెదక్ నియోజకవర్గం మొదటి స్థానంలో, ఖేడ్ చివరి స్థానంలో ఉందన్నారు. ఎంపీడీఓలు యువజన, మహిళా సంఘాలను ప్రోత్సహిస్తూ నిర్మాణంలో భాగస్వామ్యులను చేయాలన్నారు. ఉత్సాహవంతమైన మండల సమాఖ్యకు లక్ష రూపాయల బహుమతి అందజేస్తామన్నారు. మండలంలో వందశాతం నిర్మించిన వాటికి రూ.10 లక్షల ఇన్సెంటివ్, రెండో స్థానంలో ఉంటే రూ.5 లక్షలు, మూడో స్థానంలో నిలిస్తే రూ.లక్ష ప్రోత్సాహకాన్ని అందజేస్తామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 11,485 ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తయిందన్నారు. ఉపాధి కూలీలకు డబ్బులు సకాలంలో చెల్లించని ఏపీడీ, ఏపీఓలపై చర్యలు తప్పవని మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. మిషన్ కాకతీయను వేగవంతం చేయండి... రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మిషన్ కాకతీయ పనులను నాణ్యత, క్యూరింగ్ తో సకాలంలో పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రి ఆదేశించారు. రెండో విడతలో జిల్లాకు 1,679 పనులు మంజూరు కాగా వెయ్యి పనులే ప్రారంభమయ్యాయని, మిగతా పనులు వారం రోజుల్లోగా ప్రారంభించాలన్నా రు. సమీక్షలో ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, రాములునాయక్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, రామలింగారెడ్డి, బాబూమోహన్, మదన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, జేసీ వెంకటరామిరెడ్డి, జెడ్పీ సీఈఓ వర్షిణి, ఏజేసీ వెంకటేశ్వర్లు, డీఆర్ఓ దయానంద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
బాక్సైట్ తవ్వకాలపై తీర్మానం
బాక్సైట్ తవ్వకాలకు వ్యతికేకంగా 20 గ్రామాల ప్రజలు ఏకమయ్యారు. చింతపల్లి మండలం బలపం అటవీ ప్రాంతంలో సమావేశమయ్యారు. 1/70 చట్టాన్ని అమలు పరచాలని ఈ సమావేశంలో ప్రజలు తీర్మానించారు. బాక్సైట్ గనుల్లో గుణపాలు దించితే.. తమ పదవులకు రాజీనామా చేస్తామంటూ ప్రజాప్రతినిధులు ప్రతిన బూనారు. ఈ కార్యక్రమంలో బాక్సైట్ చింతపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన 20 గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. కాగా.. ఇటీవల బాక్సైట్ తవ్వకాలను ఆపాలంటూ.. తెలుగు దేశం పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను మావోయిస్టులు అరెస్టు చేసిన సంగతితెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రజా ప్రతినిధులు, ప్రజలు బాక్సైట్ మైనింగ్ కి వ్యతిరేకంగా తీర్మానం చేయడం జిల్లా వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. -
స్వయం ప్రకటిత ప్రజాప్రతినిధులు..!
సాక్షి, గుంటూరు : ఎమ్మెల్యే, ఎంపీ వంటి ప్రజాప్రతినిధిగా ఎన్నిక అవ్వాలంటే ప్రజలు ఎన్నుకోవాలి. మార్కెట్ వంటి సంస్థలకు చైర్మన్‌గా నియమితులు కావాలంటే సంబంధిత శాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడాలి. కానీ చిలకలూరిపేటకు చెందిన ఓ అధికార పార్టీ నేత, నరసరావుపేటకు చెందిన మండల స్థాయి నాయకులకు ఇవేమీ అవసరం లేదు. వారి పదవులను వారే ప్రకటించుకున్నారు. చిలకలూరిపేట నేత తన స్కార్పియో వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుని దర్జాగా తిరుగుతుండగా, నరసరావుపేట చెందిన నేత ఏకంగా తన ఇన్నోవా వాహనం వెనుక నంబరు ప్లేట్‌కు ఏఎంసీ చైర్మన్ అంటూ స్టిక్కర్ వేసుకుని దర్పం ప్రదర్శిస్తున్నారు. పోలీసులకు గానీ, రవాణాశాఖ అధికారులు గానీ ఇవి కనిపించకపోవడం విశేషం. -
బీటీ కళాశాలకు పూర్వవైభవం తెస్తాం
- శతవార్షికోత్సవంలో ఎమ్మెల్యేలు తిప్పారెడ్డి, చింతల, శంకర్ - యూనివర్సిటీ చేయడానికి కృషిచేస్తామని హామీ మదనపల్లె సిటీ : బీటీ కళాశాలకు పూర్వవైభవం తెస్తామని ముగ్గురు ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. మదనపల్లె పట్టణంలో ఆదివారం సాయంత్రం బీటీ కళాశాల శత వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె ఎమ్మెల్యేలు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, శంకర్‌యాదవ్ పాల్గొన్నారు. మొదట వారు జ్యోతి వెలిగించి ఉత్సవాలను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా సభలో మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ బీటీ కళాశాలకు ఎంతో చరిత్ర ఉందని, ఇలాంటి కళాశాల నేడు దీనస్థితికి చేరుకోవడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలకు పూర్వవైభవం వచ్చేందుకు అందరూ కలిసికట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. శాసనసభ సమావేశాల్లో కళాశాలను యూనివర్సిటీగా చేయాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు తెలిపారు. పీలేరు ఎమ్మెల్యే, కాలేజీ పూర్వ విద్యార్థి చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తాను కాలేజీలో 1981-84లో డిగ్రీ చదివిన విషయాన్ని గుర్తు చేశారు. తాను ఇంతటి స్థాయిలో ఉన్నానంటే కాలేజీనే కారణమని స్పష్టం చేశారు. గతంలో ఉన్న కాలేజీ ప్రస్తుతం దాని ప్రభావం మసకబారడం ఆవేదనకు గురి చేస్తోందన్నారు. కాలేజీ పూర్వవైభవం తీసుకురావాల్సిన బాధ్యత తనపై కూడా ఉందన్నారు. ఈ కళాశాలలో మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డితో పాటు పలువురు చదివిన విషయాన్ని గుర్తు చేశారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్‌యాదవ్ మాట్లాడుతూ కళాశాలను యూనివర్శిటీ స్థాయికి తెచ్చేలా శాసనసభలో తన వాణిని వినిపిస్తామని తెలిపారు. పడమటి మండలాలకు కళాశాలను యూనివర్సిటీ చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్ట కలిగిన బీటీ కళాశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఉన్నత విద్యాశాఖ ఆర్జేడీ పద్మావతి, జోళెంపాళెం మంగమ్మ, కాలేజీ కరస్పాండెంట్ వివేకానంద, ప్రిన్సిపాల్ డాక్టర్ స్వర్ణరాణి, బీసెంట్ ట్రస్టు కార్యదర్శి సుధాకర్, లైజన్ ఆఫీసర్ ప్రసాదరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ భవానీప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు రాజన్, బగ్గిడి గోపాల్, కాలేజీ మాజీ చైర్మన్లు రాందాస్‌చౌదరి, కంభం నాగభూషణరెడ్డి, కళాధర్, సుధాకర్, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్‌బాలాజీ, మాజీ ఎంపీపీ వల్లిగట్ల వెంకటరమణ, కాలేజీ అధ్యాపకులు, పూర్వపు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కాలేజీ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. -
జిల్లా అభివృద్ధికి కృషి చేద్దాం
- డెప్యూటీ సీఎం కడియం శ్రీహరి హన్మకొండ : జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. సో మవారం హన్మకొండలోని ప్రెస్‌క్లబ్ సొంత భ వనాన్ని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్‌తో కలిసి ప్రా రంభించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో వివిధ రంగాల్లో జిల్లా వెనుబడి ఉందని తేలిందని, దీని పునర్మాణానికి కృషి చేద్దామన్నారు. పేద వర్గానికి చెందిన తాను రాజకీయాల్లో నిలదొక్కుకోవడంలో జర్నలిస్టుల సహకారం ఎంతో ఉందన్నారు. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జిల్లా జర్నలిస్టులు పోషించిన పాత్ర అద్వితీయమైనదన్నారు. ప్రెస్‌క్లబ్‌లోఇతర నిర్మాణాలకు నియోజక అభివృద్ధి నిధుల నుంచి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ మాట్లాడు తూ జిల్లా జర్నలిస్టులు ఉత్తేజపూరిత ఉద్యమాన్ని నిర్వహించారన్నారు. ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు మజీథియూ వేజ్‌బోర్డును అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గుంటిపల్లి వెంకట్, కార్యదర్శి దుంపల పవన్, టీఎస్‌యూడబ్ల్యుజే జిల్లా అధ్యక్షుడు పిన్న శివకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొంతు రమేశ్, టీయూడబ్ల్యుజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్, జర్నలిస్టు సంఘాల నాయకులు దాసరి కృష్ణారెడ్డి, కె.మహేందర్, పిట్టల రవీందర్, పీవీ కొండల్రావు పాల్గొన్నారు. -
బడికెళ్లని స్వచ్ఛభారత్ !
చిలకలూరిపేట : స్వచ్ఛభారత్ పేరుతో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ప్రచారం నిర్వహిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ పాఠశాలలు కనిపించినట్టులేదు. మరుగుదొడ్లులేని పాఠశాలలు, ఉన్నా నిరుపయోగంగా మారినవి కొన్నయితే, మరమ్మతులకు నోచనవి ఎన్నో ఉన్నాయి. స్వచ్ఛ భారత్ అంటే కేవలం ఇంటికే పరిమితమైతే రేపటి పౌరులను తీర్చిదిద్దే పాఠశాలల పరిస్థితేంటని తల్లిదండ్రులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. జూన్ రెండో వారంలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని చెబుతున్న సర్కారు మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతోంది. ఉదాహరణకు చిలకలూరిపేట నియోజకవర్గాన్ని పరిశీలిస్తే....పలు ప్రభుత్వ పాఠశాలల్లో రెండేళ్ల కిందట మరుగుదొడ్లు నిర్మించారు. దీంతో 90 శాతం విద్యార్థులకు మరుగు దొడ్ల సౌకర్యం లభించింది. అయితే వీటిని నిర్మించి చేతులు దులుపుకున్న అధికారులు నిర్వహణ బాధ్యతను విస్మరించారు. నీటి వసతి ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో కథ మొదటికి వచ్చింది. నీటి సౌకర్యంలేక అలంకారప్రాయంగా మిగిలాయి. నియోజకవర్గ పరిధిలో మొత్తం 197 ప్రాథమిక పాఠశాలు, 16 ప్రాథమికోన్నత పాఠశాలలు, 25 ఉన్నత పాఠశాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 8 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మరుగుదొడ్డికి వెళ్లాల్సివస్తే స్కూల్ వెలుపల ఉన్న ఖాళీ ప్రదేశాలే దిక్కుగా మారాయి. పాఠశాల ఆవరణలో నిర్మించిన మరుగుదొడ్లు వినియోగానికి నోచుకోకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఇక విద్యార్థినుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. పాఠశాలలకు నీటి వసతి కల్పించకపోవడంతో మధ్యాహ్న భోజన సమయంలోనూ, మరుగుదొడ్లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్నవాటిని పట్టించుకోకుండా మళ్లీ నిర్మాణం... గ్రామీణ ప్రాంతాల మాట అటుంచితే పట్టణంలోని పండరీపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాసంవత్సరం ఆరంభం నుంచి మరుగుదొడ్లు మూతపడే ఉన్నాయి. ఉన్న బోరింగ్ పంపు మరమ్మతులకు గురికావడం, మంచినీటి కుళాయికి మోటార్సౌకర్యం లేకపోవడంతో మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. గోవిందపురం, పోతవరం, కోమటినేనివారిపాలెం తదితర పాఠశాలల్లోనూ, నాదెండ్ల మండలం గణపవరం హెచ్డబ్ల్యూయు ప్రాథమిక పాఠశాలలో నిర్మించిన మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టకుండా కొద్దినెలల కిందట మళ్లీ నిర్మించారు. గతంలో నిర్మించిన మరుగుదొడ్లుకు తలుపులు లేకపోవడం వీటి పక్కనే కంపచెట్లు పెరిగి చిట్టడవిగా మారింది. ఈ మండలంలో 30 పాఠశాలల్లోని మరుగుదొడ్లు నీటి సౌకర్యం, నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి. నాదెండ్ల, సాతులూరు, తూబాడు పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. యడ్లపాడు మండలంలోని లింగారావుపాలెం ఆర్సీఎం పాఠశాలలో ఓవర్‌హెడ్ ట్యాంకర్ లేక మరుగుదొడ్లు మూతపడ్డాయి. నిధులు పెంచితేనే.... నిర్వహణ లోపంతోనే మరుగుదొడ్లు మూతపడుతున్నాయి. వీటిని నిర్మించే క్రమంలో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, నాసిరకం వస్తువులు వినియోగించడంతో ప్రారంభమైన కొన్నిరోజులకే నిరుపయోగంగా మారుతున్నాయి. వీటిని శుభ్రం చేయడానికి ప్రభుత్వం కేవలం 200 రూపాయలు మాత్రమే వెచ్చించాలని చెప్పడం శోచనీయం. నిధులు పెంచి, వీటిని నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. -
టీఆర్ఎస్... శిక్షణ
నల్లగొండ : ప్రభుత్వ పథకాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లడం...శాసనసభ సమావేశాల్లో సభ్యులు వ్యవహరించాల్సిన తీరు గురించి ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. నాగార్జునసాగర్ వేదికగా ప్రజాప్రతినిధులకు తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల 7వ తేదీన శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండగా... అంతకంటే నాలుగు రోజుల ముందుగా అంటే 4, 5 తేదీల్లో ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీలో చాలామంది ప్రజాప్రతినిధులు తొలిసారిగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారే ఉన్నారు. దీంతో ప్రభుత్వం ఏర్పడ్డ నాటినుంచి ప్రవేశపెట్టిన వివిధ రకాల సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారనే అభిప్రాయం పార్టీలో ఉంది. వృద్ధులకు ఆసరా ఫించన్లు, సన్నబియ్యం, మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ వంటి ప్రతిష్టాత్మకమైన పథకాలు ప్రవేశపెట్టారు. దీంట్లో ఆసరా పింఛన్లు రూ.200 నుంచి రూ.వెయ్యికి పెంచినప్పటికీ ప్రజల నుంచి ఇంకా వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ఆహార భద్రత పథకం ద్వారా రూ.1 సన్నబియ్యం అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వాల కంటే భిన్నంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు...ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టడం లో కూడా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందారన్న భావన కేసీఆర్‌లో ఉంది. అదే విధంగా అధికారులతో ప్రజాప్రతినిధుల వ్యవహరించే తీరుపై కూడా విమర్శలు ఉన్నాయి. అవినీతిని అంతమొందిస్తామని సీఎం కేసీఆర్ వేధికల మీద చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి ఆనవాళ్లు ఇంకా కనిపిస్తున్నానే ఉన్నాయి. శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు ఎక్కుపెట్టే సందర్భంగా అధికార పార్టీ తరఫున దీటుగా ఎదుర్కోని పక్షంలో మరింత లోకువయ్యే ప్రమాదం ఉందని గుర్తించిన సీఎం సమావేశాలకు ముందు శిక్షణ తరగతులు నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. కదిలిరానున్న ప్రభుత్వం.. రెండు రోజులపాటు జరిగే ఈ శిక్షణ తరగతులకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్లమెంటరీ కార్యదర్శులు, ప్రభుత్వ సలహాదారులు హాజరుకానున్నారు. మార్చి 3వ తేదీ సాయంత్రం వారంతా సాగర్ చేరకుంటారు. 4, 5 తేదీల్లో శిక్షణ తరగతులు ముగించుకుని 5వ తేదీ రాత్రి తిరుగు ప్రయాణమవుతారు. శిక్షణ తరగతుల ఏర్పాట్ల గురించి జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. -
ఆసరా అక్రమాలకు చెక్
ప్రజాప్రతినిధులకే తొలగింపు బాధ్యతలు సర్కారు నుంచి ప్రత్యేక లేఖలు అనుమానాస్పద వ్యక్తులకు పింఛన్లు కట్ హుజూరాబాద్ : ఆసరా పింఛన్ల ఏరివేతకు రంగం సిద్ధమైంది. పింఛన్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రాగా.. మంజూరుకు కట్టడి చేసినప్పటికీ ఆ తర్వాత అనర్హులకు సైతం లబ్ది చేకూరింది. దీంతో ఆసరా భారం సర్కారుకు తడిసి మోపెడైంది. ఈ నేపథ్యంలో సర్కారు పింఛన్ అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించింది. అనర్హులను తొలగించడానికి చర్యలకు ఉపక్రరించింది. ప్రజాప్రతినిధులకు లేఖలు ఉదాహరణకు జమ్మికుంట మండలం కొత్తపల్లిలో గతంలో 400 పింఛన్లు ఉండగా, ప్రస్తుతం ఆసరా పింఛన్లు 525 మంజూరయ్యాయి. అంటే ఒక్క గ్రామంలోనే సుమారు 125 పింఛన్లు అదనంగా పెరిగాయి. ఇలా జిల్లాలో దాదాపు అన్ని గ్రామాల్లో పింఛన్ల సంఖ్య పెరిగిందే తప్ప తగ్గిన దాఖలాలు అరుదు. పింఛన్ మొత్తం రూ.1000, వికలాంగులకు రూ.1500లకు పెరగడంతోనే పింఛన్‌దారుల సంఖ్య పెరిగిందనే విషయం వేరే చెప్పక్కర్లేదు. తొలుత పైరవీలకు చాన్స్ లేదని కఠినంగా చెప్పినప్పటికీ చివరకు టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులే పైరవీలకు దిగి పింఛన్లు ఇప్పించారు. అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో 30-40శాతం వరకు అనర్హులకు జాబితాలో చోటుదక్కినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో సాక్షాత్తు మంత్రి కేటీఆర్ నుంచి జిల్లాలోని ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డుసభ్యులకు ప్రత్యేకంగా లేఖలు వచ్చాయి. నేరుగా ఫిర్యాదు చేయకున్నా 18002001001 టోల్‌ఫ్రీ నంబర్‌గా ఫోన్ చేసైనా చెప్పవచ్చునని ఆ లేఖలో పేర్కొన్నారు. సదరం సర్టిఫికెట్లపై నిఘా వికలాంగులకు రూ.1500 పింఛన్ వస్తుండటంతో రకరకాల పైరవీలను ఆశ్రయించి సదెరం సర్టిఫికెట్లు సంపాదించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు కూడా అందాయి. ప్రతీ సదరం సర్టిఫికెట్‌పై ముగ్గురు వైద్యులు ఆమోదం తెలపాలి. కాని దాదాపు సగం సర్టిఫికెట్ల మీద వైద్యుల సంతకాలు లేవు. ఇలాంటి సర్టిఫికెట్ల లబ్దిదారులకు పింఛన్లు నిలిపివేయడానికి అధికారులు సన్నద్ధమయ్యారు. తాజాగా హుజూరాబాద్ పట్టణంలో దాదాపు 140 సదెరం సర్టిఫికెట్లను సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాలపై ముగ్గురు వైద్యుల సంతకాలు లేవు. వీరికి పింఛన్లు కూడా నిలిపివేశారు. మరోసారి విచారణ జరిపిన తర్వాత అర్హులని తేలితేనే వీరికి పింఛన్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. -
లంచావతారం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ‘బీబీనగర్ నుంచి మేళ్లచెరువు వరకు... దామరచర్ల నుంచి మర్రిగూడ, మాల్ వరకు... చౌటుప్పల్ నుంచి కోదాడ వరకు... రూటు ఏదయినా జిల్లాలో అవినీతి మాత్రం ‘నా దారి... రహదారి’ అంటోంది. లంచావతారులు ప్రజలను పీడించి డబ్బులు దండుకుంటున్నారు. పింఛన్ కావాలన్నా.. రేషన్‌కార్డు రావాలన్నా... భూమి కొనాలన్నా.. ఇల్లు కట్టుకోవాలన్నా.. సర్టిఫికెట్లు కావాలన్నా.. సంతకాలు కావాలన్నా.. పొలంలో ట్రాన్స్ఫార్మర్ పెట్టాలన్నా.. రైతు పేరిట రుణం ఇవ్వాలన్నా... ఇలా ఏ పనికయినా చేయి తడవనిదే జిల్లాలో పనులు జరగడం లేదు. జిల్లా, మండల అధికారులనుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు... ప్రభుత్వ ఉద్యోగులే కాదు.. ప్రజాప్రతినిధులు కూడా.. ప్రజలకు పనులు చేయాలంటే మాత్రం డబ్బులు అడుగుతున్నారు. ఇదంతా ఏదో కథ చెపుతున్నట్టు కాదు.. ఎలాగూ సమాజంలో అవినీతి ఉంది కదా అని అందరికీ అంటగట్టడం కాదు.. సాక్షాత్తూ జిల్లా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులివీ.. అవినీతి అంటే చంపేస్తానంటూ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఆదివారం వరంగల్‌లో ఇచ్చిన టోల్‌ఫ్రీ నంబర్ 040-23454071కు ఫోన్‌చేసి మరీ వ్యక్తం చేసిన ఆవేదనలివి. రాష్ట్రంలోనే అత్యధికంగా మన జిల్లా నుంచే అవినీతిపై 82 ఫోన్లు వెళ్లాయని అవినీతి నిరోధక శాఖ డీజీ ఏకే.ఖాన్ గత బుధవారం వెల్లడించారు. అయితే, అవినీతిపై జిల్లా ప్రజలు ఎలాంటి ఫిర్యాదులు చేశారన్న దానిపై ‘సాక్షి’ కొంత సమాచారం సేకరించింది. అందులోని వివరాలు, విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఫిర్యాదుదారులిచ్చిన సమాచారం ఆధారంగా జిల్లాలో జరుగుతున్న అవినీతి తంతు ఇది. ఎందెందు వెతికినా... ప్రముఖ సాహితీవేత్త శ్రీశ్రీ తన కవితలో సబ్బుబిళ్ల.. అగ్గిపుల్లా.. కవితకు కాదేదీ అనర్హం అన్నట్టు.. జిల్లాలో ఏ శాఖలో చూసినా అవినీతి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జిల్లావాసులు సీఎం ఇచ్చిన టోల్‌ఫ్రీనంబర్‌కు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తే ఆశ్చర్యం కూడా కలగక మానదు. తాము కూడా ప్రభుత్వ ఉద్యోగులమేనని, అయితే మాకు అదనంగా సెలవులు కావాలన్నా, డీఏ మంజూరు చేయాలన్నా, ఇంక్రిమెంట్లు రావాలన్నా మా ఉన్నతాధికారులు డబ్బులు అడుగుతున్నారని కొందరు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక, సామాన్య ప్రజలు ఇచ్చిన సమాచారాన్ని చూస్తే రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు, ఆర్టీఏ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో ఉండే ఓ ప్రభుత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి కలెక్షన్ వారానికి రూ.2లక్షలు ఉందని, ఆయనకు మొత్తంమీద రూ.50 కోట్లకు పైగా ఆస్తులున్నాయని కూడా ఫిర్యాదు అందింది. ఎక్సైజ్ శాఖలో ఓ అధికారి కలెక్షన్ రాజాగా మారిపోయాడని కూడా ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన పొలంలో ట్రాన్స్ఫార్మర్ పెట్టేందుకు స్థానిక విద్యుత్ అధికారులు తనను లంచం అడుగుతున్నారని ఓ రైతు ఫిర్యాదు చేస్తే, మరో రైతు తనకు బ్యాంకు రుణం ఇచ్చేందుకు కూడా పైసలడుగుతున్నారని టోల్‌ఫ్రీనంబర్‌కు ఫోన్‌చేసి వాపోయాడు. ఇక, మండల కార్యాలయాల్లో పనిచేసే వారు ఇళ్లు మం జూరు చేసేందుకు, పింఛన్లు ఇచ్చేందుకు డబ్బులు అడుగుతున్నారని కొందరు, ఫలానా మండల అధికారికి డబ్బులిస్తే చాలు.. ఏ సర్టిఫికెట్ అయినా ఇచ్చేస్తున్నాడని ఓ వ్యక్తి, భూమి రిజిస్ట్రేషన్‌కు వెళ్తే కార్యాలయంలోని ఉద్యోగులు తనను డబ్బులడిగారని మరో వ్యక్తి ఫిర్యాదులో చెప్పారు. ఇంజినీరింగ్ కళాశాలలు కూడా విద్యార్థుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని, ప్రాజెక్టు ఫీజు, జేఎన్టీయూ ఫీజు పేరుతో అధికంగా తీసుకుంటున్నారని మరో వ్యక్తి సమాచారం ఇవ్వడం గమనార్హం. బంగారుతల్లి పథకం కింద లబ్ధి పొందేందుకు గాను డాక్టర్ సంతకం కావాల్సి ఉందని, అయితే, తన సంతకం కావాలంటే డబ్బులు కావాలని ఆ డాక్టర్ అడుగుతున్నాడని ఓ మహిళ సీఎం ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేసి చెప్పడం గమనార్హం. మొత్తంమీద అవినీతిపై జిల్లా నుంచి వచ్చిన ఫోన్లలో ముగ్గురు మహిళలున్నారు. అయితే, ఇంకో విచిత్రమైన ఫిర్యాదు ఏమిటంటే... తమ గ్రామంలో ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరితే స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, ఇదే సమస్య కోసం అధికారుల వద్దకు వెళితే డబ్బులు అడుగుతున్నారని అటు ఎమ్మెల్యే పనితీరు, ఇటు అధికారుల అవినీతిపై ఓ వ్యక్తి సమాచారమిచ్చారు. పింఛన్లు, రేషన్‌కార్డులకు కూడా.. ఇక, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నట్టు జిల్లాలోని లంచావతారులు పేదల నుంచి డబ్బు గుంజుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్ల పథకం, ఆహారభద్రత కార్డుల పథకం కింద లబ్ధి చేకూర్చేందుకు గాను పైసలు ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. పింఛన్లు, రేషన్‌కార్డులపై సీఎం ఇచ్చిన నంబర్‌కు ఎక్కువ ఫిర్యాదులు రావడం గమనార్హం. వృద్ధాప్య పింఛన్ల నుంచి నీటిపన్ను పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని, కొత్త రేషన్‌కార్డు దరఖాస్తు పూర్తి చేసేందుకు కూడా తనను లంచం అడిగారని, పింఛన్ రావాలంటే డబ్బులివ్వాలని మా సర్పంచ్ చెబుతున్నాడని, మీ పేరు లిస్టులో లేదు.. నా దగ్గర రేషన్ ఇవ్వాలంటే డబ్బులివ్వాలని ఓ రేషన్‌డీలర్ అంటున్నాడని, మండల కార్యాలయాల్లో కూడా డబ్బులిస్తేనే పింఛన్లు, రేషన్‌కార్డులు వస్తున్నాయని పలువురు ఫిర్యాదులు చేయడం గమనార్హం. -
సంస్థానాల విలీనం ‘ఉక్కు’ సంకల్పం
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఘనంగా పటేల్ జయంతి భారీ ర్యాలీ పాల్గొన్న విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కోనేరుసెంటర్(మచిలీపట్నం) : స్వాతంత్య్రం వచ్చిన అనంతరం 554 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయించడంలో ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్‌పటేల్ ప్రధాన పాత్ర పోషించారని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. అలాంటి మహోన్నత వ్యక్తి జీవిత గట్టాలను విద్యార్థులంతా తప్పనిసరిగా తెలుసుకోవాలని ఆయన సూచించారు. సర్ధార్ వల్లభాయ్‌పటేల్ జయంతిని శుక్రవారం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో భారీ ర్యాలీ జరిగింది. ర్యాలీలో బందరు ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, ఎస్పీ జి.విజయ్‌కుమార్, ఏజేసీ బిఎల్.చెన్నకేశవులు, డీఆర్వో ప్రభావతి, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలుత స్థానిక లక్ష్మీటాకీస్సెంటర్లో ప్రజాప్రతినిధులు, అధికారులు వల్లభాయ్‌పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మంత్రి రవీంద్ర ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి రవీంద్ర మాట్లాడుతూ పటేల్ జయంతిని ప్రధాని నరేంద్రమోడి రాష్ట్రీయ ఏక్తా దివస్‌గా పాటించాలని నిర్ణయించడం ప్రశంసనీయమన్నారు. ఎంపీ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ పటేల్ ఆనాటి ప్రధాని నెహ్రూ మంత్రివర్గంలో హోంమంత్రిగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన కారణంగా నేడు భారతదేశం శాంతిసామరస్యాలతో విరాజిల్లుతుందని చెప్పారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ మన రాష్ట్రంలో నిజాం ప్రభుత్వ ఆగడాలను అరికట్టి సైన్యాన్ని దింపి సంస్థానాలకు విలీనం చేయడంలో పటేల్ చేసిన సాహసం మాటలతో కొనియాడలేనిదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఆర్డీవో పి.సాయిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బందరు డీఎస్పీ డాక్టర్ కెవి.శ్రీనివాసరావు, తహశీల్ధార్ బి.నారదముని, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, వైస్‌చైర్మన్ పి.కాశీవిశ్వనాథం, పట్టణంలోని వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన సుమారు 4,000మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజయవాడలో రన్ ఫర్ యూనిటీ.... విజయవాడ : దేశ ఐక్యతా దిశగా కృషి చేసిన వ్యక్తిగా దేశ ప్రథమ ఉప ప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ చరిత్రలో నిలిచిపోయారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. బెంజిసర్కిల్ వద్ద ఈ పరుగును డాక్టర్ కామినేని శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించగా, మూడు వేల మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), ఎమ్మెల్యేలు గద్దే రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరావు, నగర మేయర్ కోనేరు శ్రీధర్, వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీల, జాయింట్ కలెక్టర్ జె.మురళి, సబ్-కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ప్రముఖులు తుర్లపాటి కుటుంబరావు, ఎంసీదాస్, డీఎస్డీవో రామకృష్ణతో పాటు, నలందా, బిషప్ అజరయ్య, మాంటిస్సోరి, నిర్మలా కాన్వెంట్, గౌతమ్ డిగ్రీ కళాశాలల విద్యార్ధులు హాజరయ్యారు. -
‘క్లీన్ పాడేరు’కు శ్రీకారం
పారిశుద్ధ్యంపై సమరభేరి చీపుర్లు పట్టిన ఎమ్మెల్యే, పీఓ, సబ్ కలెక్టర్లు పాడేరు : స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా క్లీన్ పాడేరుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం ఉదయాన్నే పాత బస్టాండుకు చేరుకున్న ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జన్మభూమి ప్రత్యేక అధికారి, అటవీశాఖ కన్సర్వేటర్ భరత్‌కుమార్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్, సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ మల్లికార్జునరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులంతా పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రారంభించారు. వీరంతా తొలుత చీపుర్లు పట్టి రోడ్డును ఊడ్చారు. అంబేద్కర్ సెంటర్ నుంచి మెయిన్‌రోడ్డు, సినిమాహాల్ సెంటర్, మోదమాంబ ఆలయ ప్రాంతాలకు మూడు బృందాలుగా విడిపోయిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులంతా పెద్ద ఎత్తున పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. క్లీన్ పాడేరు-గ్రీన్ పాడేరు పేరిట పట్టణ పురవీధుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలపై అవగాహనకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాల, పలు ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా గాంధీజీ వేషధారణలో రెవెన్యూ ఉద్యోగి అచ్చంనాయుడు, మరో బాలుడు అందర్నీ ఆకట్టుకున్నారు. పాడేరును తీర్చిదిద్దండి : ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాడేరును క్లీన్ పట్టణంగా తీర్చి దిద్దేందుకు ప్రజలంతా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కోరారు. పాతబస్టాండ్ వద్ద ఆమె మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏజెన్సీలో విజయవంతం చేయాలన్నారు. ప్రజలంతా తమ నివాసాలు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పి.నూకరత్నం, ఎంపీపీ వి.ముత్యాలమ్మ, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వంజంగి కాంతమ్మ, ఎంపీటీసీ సభ్యులు కూడి దేవి, కిల్లో చంద్రమోహన్‌కుమార్, చెండా శ్రీదేవి, బొర్రా విజయరాణి, కో-ఆప్షన్‌సభ్యులు ఎండీ తాజుద్దీన్, సర్పంచ్ కె.వెంకటరత్నం, ఎంపీడీఓ కుమార్, వైఎస్సార్ సీపీ నేత పాంగి పాండురంగస్వామి, పార్టీ విద్యార్థి సంఘం నేతలు జి.నిరీక్షణరావు, కె.చిన్న, టీడీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొర్రా నాగరాజు, మాజీ సర్పంచ్ వర్తన పిన్నయ్యదొర, సీడీపీఓ లలితకుమారి, ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ శోభారాణి, ఆదినారాయణ, బీజేపీ నేత కురుసా బొజ్జయ్యలతో పాటు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి
జెడ్పీ తొలి సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు మచిలీపట్నం : రాష్ట్ర విభజన అనతరం తలెత్తిన ఇబ్బందుల నేపథ్యంలో కృష్ణా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడాలని పలువురు ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో జిల్లాకు ప్రత్యేక స్థానం లభించనుందని, అందుకు తగిన విధంగా అభివృద్ధి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. మచిలీపట్నంలోని జెడ్పీ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా పరిషత్ తొలి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు జిల్లా అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. సమావేశాలు అర్థవంతంగా సాగాలి జెడ్పీ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు జిల్లా అభివృద్ధిపై ప్రభావం చూపుతాయి. సమావేశాలు అర్థవంతంగా జరిగేలా నూతనంగా ఎన్నికైన సభ్యులు సహకరించాలి. ప్రజా సమస్యలపై చర్చించి, పరిష్కరించేందుకు జిల్లా పరిషత్ సమావేశమే వేదికగా మారాలి. అనవసర విషయాలను ప్రస్తావించి విలువైన సమయాన్ని వృథా చేయవద్దు. - కొనకళ్ల నారాయణరావు, బందరు ఎంపీ యూపీ పాఠశాలలు రద్దు కావు యూపీ పాఠశాలల్లో 6, 7 తరగతుల్లో 20 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉంటే ఆ పాఠశాలను రద్దు చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ పాఠశాలలను రద్దు చేయకుండా పాఠశాల విద్యా కమిషనర్ ఉషారాణితో మాట్లాడాము. ఉపాధ్యాయులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు యూపీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలి. సిబ్బందిని నియమించాలి. - కేఎస్ లక్ష్మణరావు, ఎమ్మెల్సీ పాత భవనాలు తొలగించాలి ప్రభుత్వ పాఠశాలల్లో సర్వశిక్షా అభియాన్ ద్వారా నూతన భవనాలు నిర్మిస్తున్నారు. వాటిని ప్రారంభించటం లేదు. శిథిలమైన పాఠశాల భవనాలను తొలగించటం లేదు. పాత భవనాలను తొలగించకపోవటంతో వాటిలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ అంశంపై అధికారులు దృష్టిసారించాలి. - ఉప్పులేటి కల్పన, పామర్రు ఎమ్మెల్యే ఇసుక క్వారీలు తెరిపించాలి ఇసుక క్వారీలు చాలా కాలంగా మూతపడి ఉండటంతో నూజివీడు నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి వచ్చే ఇసుకను అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. జిల్లాలోని క్వారీలను తెరిస్తే తక్కువ ధరకే ఇసుక లభించే అవకాశం ఉంది. పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు ఇసుక అందుబాటులో ఉంటే కొంతమేర ఖర్చు తగ్గుతుంది. - మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, నూజివీడు ఎమ్మెల్యే పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి. బందరు పోర్టు నిర్మాణం పూర్తయితే అనుబంధ పరిశ్రమలు స్థాపించడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం రెండు రోజుల పాటు ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దిశగా చర్చలు జరిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు మా వంతు కృషి చేస్తాం. - కేశినేని శ్రీనివాస్(నాని), విజయవాడ ఎంపీ స్థానిక సంస్థలకు అధికారాలివ్వాలి స్థానిక సంస్థలు బలోపేతం కావాలంటే 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం 29 అంశాలను రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు బదలాయించాలి. పురపాలక సంఘాలకు 18 అంశాలను బదలాయించాల్సిన అవసరం ఉంది. మండలాల్లో ఉన్న ఆసుపత్రుల్లో సరైన వైద్యసేవలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీటిపై జిల్లా పరిషత్ సభ్యులు దృష్టిసారించాలి. - బొడ్డు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ చెరువులు అభివృద్ధి చేయండి తూర్పు కృష్ణా వారికే అధిక పదవులు దక్కుతున్నాయి. ఈ సారి కూడా జెడ్పీ చైర్పర్సన్ విషయంలో అదే జరిగింది. పశ్చిమ కృష్ణా ప్రాంతానికి ప్రతి సారీ అన్యాయం జరుగుతోంది. తిరువూరు నియోజకవర్గంలో 300 చెరువులు ఉన్నాయి. వీటిని బాగు చేస్తే నియోజకవర్గంలో వ్యవసాయానికి నీటి కరువు ఉండదు. జిల్లా పరిషత్, ప్రభుత్వం ద్వారా అయినా ఈ చెరువులను అభివృద్ధి చేయాలి. - కంచి రామారావు, డీసీఎంఎస్ చైర్మన్ కీలక నిర్ణయాలు తీసుకోవాలి జిల్లాలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై జెడ్పీ సమావేశాల్లో పూర్తిస్థాయిలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి. నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాలనపై పట్టు సాధించాలి. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. - కొక్కిలిగడ్డ రక్షణ నిధి, తిరువూరు ఎమ్మెల్యే ప్రతిపక్షానికి ప్రాధాన్యత ఇవ్వాలి జిల్లా పరిషత్ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష పాత్రను వైఎస్సార్ సీపీ పోషిస్తుంది. సంప్రదాయానికి విరుద్ధంగా స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. జెడ్పీ చైర్పర్సన్ చదివిన జాబితా ఒకటి, సభ్యులకు ఇచ్చిన జాబితా మరోలా ఉంది. పారదర్శక పాలన అందిస్తామని చెబుతున్న పాలకపక్షం ప్రతిపక్షానికి సమప్రాధాన్యం కల్పించాలి. అప్పుడే ప్రజాసమస్యలపై సముచిత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. - తాతినేని పద్మావతి, జెడ్పీ ప్రతిపక్ష నాయకురాలు నీటిపారుదలపై దృష్టిసారించాలి నీటి పారుదల, డ్రెయినేజీ వ్యవస్థలపై పాలకులు, అధికారులు దృష్టిసారించాలి. జిల్లా అభివృద్ధికి నిధులు తీసుకువచ్చేందుకు మంత్రులు కృషి చేయాలి. ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలి. విద్య, ఆరోగ్యం తదితర అంశాలపైనా దృష్టిసారించాలి. - కాగిత వెంకట్రావు, పెడన ఎమ్మెల్యే -
పరిమితం....సతమతం!
ప్రణాళికల్లో 50 ప్రతిపాదనలకే పరిమితం పంచాయతీలో మూడు, మండలంలో పది పనులు జెడ్పీలో మండలానికి ఒకటి చొప్పున అవకాశం ఇప్పటికే రూ.18 వేల కోట్లకు చేరిన అంచనాలు కుదించిన పనులతో మల్లగుల్లాలు పడుతున్న జెడ్పీ చైర్పర్సన్, అధికారులు సాక్షి ప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ప్రణాళికల్లో పొందుపరిచే ప్రతిపాదనల విషయంలో జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు వచ్చిపడ్డాయి. జిల్లా స్థాయి ప్రణాళికలో చేర్చే అభివృద్ధి పనుల ప్రతిపాదనలను ప్రభుత్వం 50కి పరిమితం చేస్తూ ఆదేశాలు జారీచేయడమే ఇందుకు కారణం. జిల్లాలో 50 మండలాలు ఉన్నాయి. ఈ లెక్కన 50 మంది జెడ్పీటీసీ సభ్యులు ఇచ్చే ఒక్కో ప్రతిపాదనతోనే జిల్లాకు కేటాయించే కోటా పూర్తవుతుంది. ఇది వారికి చిక్కులు తెచ్చిపెట్టగా... పనుల ప్రతిపాదనలను పరిమితం చేయడం వల్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చాన్స్ లేకుండా పోయింది. గ్రామానికి మూడు పనులు... జిల్లాల సమగ్రాభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘మన ఊరు-మన ప్రణాళిక, మన మండలం-మన ప్రణాళిక, మన జిల్లా-మన ప్రణాళిక రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గ్రామ, మండల స్థాయిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించింది. అదేవిధంగా జిల్లాస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి పనుల ప్రతిపాదనలు సేకరించింది. ఈ మేరకు కుప్పలు తెప్పలుగా సిఫార్సులు వచ్చిపడ్డాయి. అభివృద్ధి పనుల అంచనా వ్యయం రూ.18 వేల కోట్లకు చేరింది. ఈ క్రమంలో ప్రణాళికల ప్రతిపాదనల్లో పరిమితి విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా... రాష్ట్ర గ్రామీణాభి వృద్ధిశాఖ నుంచి జిల్లా అధికార యంత్రాంగానికి సూచనలు అందాయి. ఇందుకనుగుణంగా మన ఊరు-మన ప్రణాళికల్లో ప్రతి ఆవాస ప్రాంతానికి మూడు పనులు... మన మండలం-మన ప్రణాళికలో పది పనులను మాత్రమే ప్రతిపాదించే విధంగా వెబ్సైట్లో పొందుపర్చారు. గ్రామ సభలు నిర్వహించిన సమయంలో పనుల ప్రతిపాదనలను మొదటి, రెండో, మూడో ప్రాధాన్యాన్ని బట్టి పేర్కొనాలని ప్రజాప్రతినిధులకు అధికారులు సూచించారు. ఈ లెక్కన మొదటి మూడు ప్రాధాన్యతా క్రమంలోని పనులను మాత్రమే మన ప్రణాళిక వెబ్సైట్లో అప్లోడ్ చేశారన్న మాట. దీంతో గ్రామ సభల్లో ప్రజలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు చేసిన సిఫారసులు నివేదికల్లో చోటుదక్కించుకునే విషయంపై అస్పష్టత నెలకొంది. అంచనా వ్యయం రూ.2,570 కోట్లు మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా జిల్లావ్యాప్తంగా 962 గ్రామ పంచాయతీల్లోని 3,461 ఆవాస ప్రాంతాల్లో మూడు పనుల చొప్పున చేసిన ప్రతిపాదనలకు రూ.2,570 కోట్లు అవసరమవుతాయని అధికారులు నిర్ధారించారు. అదే... గ్రామసభల్లో వచ్చిన అన్ని పనులను అప్లోడ్ చేస్తే ప్రతిపాదనల అంచనా వ్యయం భారీగా పెరిగేది. మండల పరిధిలో పది పనులు.. సర్కారు ఆదేశాల మేరకు మండల స్థాయిలో ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు మొదటి ప్రాధాన్యత ఉన్న పనులను గుర్తించారు. ప్రతి మండంలంలో పది పనులను వెబ్సైట్లోకి అప్లోడ్ చేశారు. మిగిలిన పనులను మండల స్థాయిలోనే రిజర్వ్‌లో పెట్టారు. వ్యయ అంచనా రూ.1,391కోట్లు.. 50 మండలాల పరిధిలోని గ్రామాల్లో మండల పరిషత్ ద్వారా చేపట్టే పనులు ప్రతిపాదనలకు రూ.1391 కోట్లు అవసరమవుతాయని అధికారులు తేల్చారు. మన మండలం-మన ప్రణాళిక కోసం నిర్వహించిన మండల సమావేశాల్లో ఎంపీటీసీ సభ్యులు ప్రతిఒక్కరూ వారి పరిధిలోని గ్రామాల్లో పదుల సంఖ్యకుపైనే అభివృద్ధి పనులను ప్రతిపాదించారు. సర్కారు ఆదేశాల మేరకు మండలానికి పది చొప్పున పనులను ఆయూ ప్రాంత ఎంపీడీఓలు మన ప్రణాళిక వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఖరారుకాని జిల్లా ప్రణాళిక... ఇటీవల జరిగిన జిల్లా ప్రణాళిక సమావేశంలో ప్రతి జెడ్పీటీసీ సభ్యుడు 30 పనులను ప్రతిపాదించాలని ఉప ముఖ్యమంత్రి రాజయ్య సూచించారు. ఈ మేరకు ప్రతి జెడ్పీటీసీ సభ్యుడు తన మండల పరిధిలో 30 పనులను ప్రతిపాదించారు. ఇలా.. కుప్పలుతెప్పలుగా ప్రతిపాదనలు వచ్చిపడ్డారుు. జిల్లాలోని 50 మంది జెడ్పీటీసీ సభ్యులు సుమారు 1,557 పనులను గుర్తించారు. వీటికి సుమారుగా రూ.14 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అరుుతే... మన ప్రణాళిక వెబ్సైట్లో కేవలం 30 పనులు మాత్రమే అప్లోడ్ చేసే అవకాశం ఉంది. ఈ విషయూన్ని ఉప ముఖ్యమంత్రి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. దీంతో ప్రతిపాదనలను చైర్పర్సన్ క్యాంపు కార్యాలయానికి పంపించాలని, వాటిలో నుంచి 30 పనులను ఖరారు చేయాలని రెండు రోజుల క్రితం జిల్లా పరిషత్ అధికారులకు వారు సూచించారు. ఈ పనుల గుర్తింపు కోసం క్యాంపులో కసరత్తు చేస్తున్న క్రమంలోనే గ్రామీణాభివృద్ధి శాఖ గురువారం మరో 20 పనులు అప్లోడ్ చేసే విధంగా వెబ్సైట్లో అవకాశం కల్పించడంతో జిల్లా పరిషత్ అధికారులు కొంతమేర ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని 50 మంది జెడ్పీటీసీ సభ్యులకు ఒక్కొక్క పని ప్రతిపాదించే అవకాశం లభించినట్లయింది. ఈ మేరకు జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులను ఫోన్లో సంప్రదించి మొదటి ప్రాధాన్యత క్రమంలో ఒక పనిని మాత్రమే సూచించాలని జిల్లా పరిషత్ అధికారులు కోరుతున్నారు. ఇలా.. వచ్చిన ప్రతిపాదనల అంచని వ్యయూన్ని లెక్కించి జిల్లా ప్రణాళికలను ఖరారు చేసేందుకు అధికారులు త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. పెద్దలకు నో చాన్స్... జిల్లా ప్రణాళికల్లో భాగంగా తమ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పలు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. జిల్లా ప్రణాళికల్లో 50 పనులకు మాత్రమే అవకాశం ఉండడం వల్ల జెడ్పీటీసీ సభ్యుల ప్రతిపాదనలను మాత్రమే పరిగణనలోకి తీసుకునే అవకాశమున్నట్లు తెలిసింది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వాటిని రాష్ట్ర ప్రణాళికల్లో పొందుపరిచే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
‘మన ప్రణాళిక’ ఆమోదం
- 49 అంశాలకు ప్రాధాన్యం - మరిన్ని అంశాలను చేర్చాలని సూచించిన ప్రజాప్రతినిధులు - ప్రభుత్వానికి నివేదిస్తాం: జెడ్పీచైర్మన్ భాస్కర్ సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు.. మన ప్రణాళిక’కు జిల్లా ప్రణాళిక ఆమోదం తెలిపింది. ఆదివారం జిల్లా జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశం 49 అంశాలకు సంబంధించిన పనులను పొందుపరిచి ఆమోదించింది. వీటిలో తాగునీటికి రూ.1310 కోట్లు, పంచాయతీరాజ్ రోడ్ల కోసం రూ.850కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా తాగునీరు, ఆరోగ్యం, విద్య తదితర అంశాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. జెడ్పీ చైర్మన్ బండారు భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సుదీర్ఘంగా సాగింది. ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు గ్రామస్థాయిలో, 18 నుంచి 23 తేదీ వరకు మండలస్థాయిలో, 23 నుంచి 28వ తేదీ వరకు జిల్లా స్థాయిలో జరిగిన ప్రణాళికలను సర్వసభ్య సమావేశంలో ఆమోదిస్తున్నట్లు జెడ్పీ చైర్మన్ బండారు భాస్కర్ స్పష్టంచేశారు. తాజాగా ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ప్రస్తావించిన అంశాలను కూడా చేర్చి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. సమావేశంలో ముందుగా కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఆ తరువాత తెలంగాణ అమరవీరుల ఆత్మశాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. సభ దృష్టికి సమస్యలు.. సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఆయా నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలను కూడా ప్రణాళికలో చేర్చి పనులు మంజూరు అయ్యేలా చూడాలని కోరారు. సమావేశంలో మొదటగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ... ప్రణాళికలో కాంగ్రెస్‌కు చెందిన ఐదు నియోజకవర్గాల పట్ల వివక్ష చూపించారన్నారు. దీంతో కాసేపు సభలో గందరగోళం నెలకొన్నప్పటికీ వెంటనే అదుపులోకి వచ్చింది. ఆ తర్వాత మిగతా ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు సాయంత్రం వరకు వారి ప్రాంతాల్లో ఉన్న ప్రధానంగా నెలకొన్న తాగునీరు, మరుగుదొడ్లు, రోడ్లనిర్మాణం, విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ సమస్యల చిట్టాను వినిపించారు. మండలాల్లో జెడ్పీటీసీలకు ప్రత్యేకంగా చాంబర్, టోల్గేట్ వద్ద ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. స్పందించిన ఆయన సభ్యుల హామిని కచ్చితంగా అమలుచేస్తామన్నారు. బంగారు తెలంగాణను నిర్మించుకునేందుకు పార్టీలకతీతంగా సహకరించాలని కోరారు. సమగ్ర సర్వేకు ప్రతిఒక్కరూ సహకరించాలి: కలెక్టర్ రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని కోరారు. ఆ ఒక్కరోజు ఎటువంటి పనులు ఉండకుండా అధికారులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ నెల 19న ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించినట్లు చెప్పారు. సర్వే ఆధారంగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం గ్రామాలు, మండలాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని, అందుకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేల గైర్హాజర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు- మన ప్రణాళిక’ ఆమోదం పొందే కార్యక్రమానికి జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు ఏపీ జితేందర్‌రెడ్డి, నంది ఎల్లయ్యతో పాటు టీడీపీ చెందిన నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, కొండగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి గైర్హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ సి.లకా్ష్మరెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, గువ్వల బాల్‌రాజ్, మర్రి జనార్దన్‌రెడ్డి, డీకే అరుణ, జి.చిన్నారెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, వైస్ జెడ్పీ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి, జెడ్పీటీసీసభ్యులు, ఎంపీపీలు, జెడ్పీ సీఈవో రవిందర్ ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రణాళికలో ప్రాధాన్యత అంశాలివే.. పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టాలి. గట్టు మండలంలో వెయ్యి మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు హైదరాబాద్ నుంచి అలంపూర్ దాకా పరిశ్రమల కారిడార్. హైదరాబాద్ నుంచి జడ్చర్ల వరకు డబుల్ రైల్వేలైన్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లో వైద్యకళాశాలల ఏర్పాటు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీరు ప్రాజెక్టులను పూర్తిచేయాలి. కొత్తూరులో డ్రైపోర్ట్. గద్వాల, నారాయణపేటల యందు టెక్స్టైల్ పార్క్‌ల ఏర్పాటు మహబూబ్‌నగర్ లో ఔటర్‌రింగ్ రోడ్డు ఏర్పాటు. పాలమూరు యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్థాయి పెంపు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో 17 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ఏర్పాటు. జిల్లా ఆస్పత్రిని 600 పడకల ఆస్పత్రిగా మార్పు, గద్వాలలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చడం ఆర్డీఎస్ పనులను త్వరతగతిన పూర్తిచేడం తదితర 20 అంశాలకు ప్రణాళికలో చోటుదక్కింది. -
గ్రామాభివృద్ధికి బాటలు
‘సాక్షి’తో కలెక్టర్ గంగాధర కిషన్ - ‘మన ఊరు... మన ప్రణాళిక’కు శ్రీకారం - గ్రామ అవసరాలే ప్రణాళికలు.. 14 అంశాలకు ప్రాధాన్యం - ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో రూపకల్పన - గ్రామస్థాయిలో ఆర్థిక వనరులు గుర్తిస్తాం సాక్షి ప్రతినిధి, వరంగల్ : గ్రామస్తుల భాగస్వామ్యంతో గ్రామాల అవసరాలను గుర్తించి.. అభివృద్ధికి బాటలు వేయడం ప్రధాన లక్ష్యంగా ‘మన ఊరు... మన ప్రణాళిక’ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ నెల 13 నుంచి జిల్లా వ్యాప్తంగా గ్రామ ప్రణాళిక రూపకల్పన ప్రక్రియ ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంపై మండల పరిషత్ కార్యాలయూల్లో ప్రజాప్రతినిధులు, అధికారులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించను న్నారు. జిల్లాలో ప్రస్తుతం గ్రామ అభ్యుదయ అధికారుల వ్యవస్థ అమల్లో ఉంది. గ్రామదర్శిని పేరుతో జిల్లా కలెక్టర్ జి.కిషన్ 2013 నవంబర్లోనే దీన్ని ప్రారంభించారు. గ్రామాల అవసరాలను గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం మొదలైంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు... మన ప్రణాళిక’ సైతం ఇదే విధంగా ఉంది. ఒక్కో గ్రామానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుందని, ఒక్కో గ్రామంలో ఒక్కో రకమైన సమస్య ఉంటుందని, ఊరిని బట్టి అవసరాలు వేరుగా ఉంటాయని, గ్రామస్థుల సూచనలతో గ్రామ ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రణాళికలు రూపొందుతాయని కలెక్టర్ గంగాధర కిషన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు... మన ప్రణాళిక’పై కలెక్టర్ గురువారం ‘సాక్షి ప్రతినిధి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కలెక్టర్ చెప్పిన విషయూలు ఆయన మాటల్లోనే.. ప్రణాళికలో 14 అంశాలు గ్రామస్థాయి ప్రణాళిక రూపకల్పనలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. గ్రామపంచాయతీ పరిధిలోని ప్రధాన గ్రామంలోనే కాకుండా అనుబంధంగా ఉండే ఆవాసాలు(పల్లె, గూడెం, తండాలు)లకు సంబంధించి ప్రత్యేకంగా వివరాలు సేకరిస్తారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సాగునీటి సరఫరా, మహిళా సాధికారత, ఉపాధి, జీవనోపాధుల ప్రణాళిక, మౌలిక సదుపాయాలు, వనరుల సమీకృత వంటికి ప్రాధాన్యం ఇస్తారు. గ్రామ స్థాయి ప్రణాళిక రూపకల్పనకు ఇప్పటికే నమూనా సిద్ధమైంది. గ్రామానికి సంబంధించిన జనాభా గణాంకాలు, మౌలిక సదుపాయాలు, గ్రామంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యాలయం, ఇతర ప్రభుత్వ సంస్థలు, విద్య స్థితిగతులు, వైద్య సదుపాయాలు, ఆరోగ్య ప్రణాళిక, గ్రామపంచాయతీ ఆదాయ వనరులు, ఖర్చులు, సహజ వనరులు, సంక్షేమం- అభివృద్ధి అంశాలు, కొత్తగా అవసరమైన మౌలిక సదుపాయాలు, సహజ వనరుల నిర్వహణపై ప్రతిపాదనలు ప్రణాళికలో ఉంటాయి. వీటన్నింటిలో మళ్లీ సూక్ష్మ స్థాయిలో వివరాలు సేకరించడం, అవవసరాలను గుర్తించడం జరుగుతుంది. అందరి భాగస్వామ్యం మన ఊరు... మన ప్రణాళికలో ప్రజల భాగస్వామ్యమే కీలకంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు గ్రామస్థాయిలో ఈనెల 13 నుంచి 18 వరకు, మండల స్థాయిలో 19నుంచి 23వరకు, జిల్లా స్థాయిలో 24 నుంచి 28 వరకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం. అవసరమైన శిక్షణ కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. గ్రామ అభివృద్ధి, అవసరాలు ప్రాతిపదికగా గ్రామస్థుల సూచనలు మేరకు... సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు, వార్డుమెంబర్లు, వీఆర్వో, గ్రామ కార్యదర్శి, ఇతర శాఖల సిబ్బందితో కలిసి అభ్యుదయ అధికారి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ప్రతి ప్రభుత్వ శాఖ గ్రామస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అన్ని కలిపి గ్రామ ప్రణాళిక ఉంటుంది. ఆ తర్వాత దశలో మండల స్థాయి అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి అంశాలు మండల ప్రణాళికలో ఉంటాయి. జూనియర్ కాలేజీ, రిజర్వాయర్, సంక్షేమ వసతిగృహం, విత్తన సరఫరా కేంద్రం... వంటివి వీటిలో ఉంటాయి. ప్రజలను, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తేనే ప్రతి పని, ప్రణాళికల రూపకల్పన విజయవంతమవుతుంది. నిరుపేద, బడుగు బలహీన వర్గాల ప్రత్యేక అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా ప్రణాళికలు ఉంటాయి. గ్రామస్థాయిలో వనరుల లభ్యత, గ్రామాభివృద్ధికి సూక్ష్మస్థాయి ప్రణాళికలు తయారు చేయడం ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్ని రకాల అభివృద్ధి, సంక్షేమం గ్రామ స్థాయి నుంచి ఆరంభం కావాలి. దీనికి గ్రామ స్థాయిలో సమకూరే ఆర్థిక వనరులను గుర్తిస్తాం. ప్రభుత్వ పరంగా గ్రామాలకు వచ్చే నిధులు, ప్రత్యేక అవసరాలు, ప్రాజెక్టులకు రూపకల్పన వంటివి చూసుకుని ప్రణాళిక రూపొందిస్తాం. అవకాశాలను గుర్తించాలి... మారిన పరిస్థితులతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. వీటిని గుర్తించి అందిపుచ్చుకోవడం ముఖ్యం. అంగన్వాడీ కేంద్రాల్లో కోడి గుడ్డు సరఫరా బాధ్యతలను ప్రయోగాత్మకంగా మహిళా సమాఖ్యలకు అప్పగించాం. మొదట్లో రవాణా పరమైన అంశాలతో కొంత ఆలస్యం జరిగేది. ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. ఇది జిల్లా అంతటా చేస్తే మహిళా సంఘాలకు ,మహిళా సమాఖ్యలకు ఏటా లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఇలాంటివి ఎన్నో ఊన్నాయి. నైపుణ్యంతో మహిళా సాధికారత పెరుగుతుంది. స్థానికంగా ఉన్న అవకాశాలను గుర్తించి ఉపాధి వనరులుగా మార్చే ప్రక్రియ పెరగాలి. గ్రామాల వారీగా ఉన్న ఉపాధి అవకాశాలను గుర్తించాలి. ఒక ఊరి నుంచి బయటికి వస్తున్న సరుకులు, అక్కడికి రవాణా అవుతున్న వాటిని గుర్తించడం వల్ల కొందరికి ఉపాధి కల్పించవచ్చు. ఇలాంటివి పూర్తిగా గ్రామ స్థాయి ప్రజాప్రనిధులు, అధికారుల చొరవతోనే సాధ్యమవుతాయి. వ్యవస్థ అభివృద్ధి కావాలి ప్రభుత్వ పరంగా అధికార యంత్రాంగం పాత్ర కీలకమైనది. కలెక్టర్ ఎవరు ఉన్నారనేది నిమిత్తం లేకుండా... జిల్లా యంత్రాంగం ఒక వ్యవస్థగా ఉండాలి. ఇది పరిపూర్ణంగా అభివృద్ధి చెందాలి. అన్ని స్థాయిల్లోనూ.. అందరిలోనూ జవాబుదారీతనం పెరగాలి. ఏ శాఖకు ప్రాధాన్యం ఇస్తారనే ప్రశ్నలు అర్థం లేనివి. ప్రభుత్వ పరంగా, అధికారిగా అన్ని శాఖలూ కీలకమైనవే. ఫలానా వాటికే ప్రాధాన్యం అనేది సరికాదు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేస్తేనే పరిస్థితి చక్కబడుతుందనే ఆలోచనా విధానం మంచిది కాదు. ప్రభుత్వ శాఖల్లోని అన్ని కార్యాలయాలు, కేంద్రాలను తనిఖీ చేయాలంటే కలెక్టర్‌కు సాధ్యం కాదు.అధికారుల నుంచి మొదలు ఉద్యోగులు, సిబ్బందిలో జవాబుదారీతనం పెరగాలి. ఇలా ఒక వ్యవస్థ అభివృద్ధి చెందితే ఇలాంటి సమస్యలకు తెరపడుతుంది. -
స్థానిక ముహూర్తం
నేడు మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్చైర్మన్ల ఎన్నిక రేపు మండలపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఓటింగ్ 5న జిల్లా పరిషత్‌కు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు విశాఖ రూరల్ : జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంది. స్థానిక పీఠాలపై ప్రజాప్రతినిధులు కొలువుతీరే సమయం ఆసన్నమైంది. మున్సిపల్, ప్రాదేశిక స్థానాలకు అధికార పగ్గాలు చేపట్టే తరుణం రానేవచ్చింది. గురువారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు జిల్లా, మండల పరిషత్‌లతోపాటు, మునిసిపాలిటీలకు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలకు మార్చి 30న ఎన్నికలు జరిగాయి. ఈ రెండింటా టీడీపీ మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. యల మంచిలిలో 24 వార్డులకు టీడీపీకి 21, వైఎస్ఆర్సీపీ మూడింట గెలుపొం దింది. ఇక్కడ రెండో వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన టీడీపీ అభ్యర్థిని పిల్లా రమాకుమారి పేరు చైర్‌పర్సన్‌గా ఖరారైంది. నర్సీపట్నంలో 27 వార్డులకు టీడీపీ 19, వైఎస్ఆర్సీపీ 6, కాంగ్రెస్, సీపీఐ చెరొకటి గెలుచుకున్నాయి. ఇక్కడ 25వ వార్డు నుంచి విజయం సాధించిన చింతకాయల అనితను చైర్మన్ పదవి వరించనుంది. రెండింటా టీడీపీకి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో ఎక్స్ ఆఫీషియో సభ్యులైన ఎమ్మెల్యేలు, ఎంపీల ఓట్లు నామమాత్రం కానున్నాయి. ఉదయం 11 గంటలకు చైర్పర్సన్లను ఎన్నుకోనున్నారు. 4న ఎంపీపీ, 5న జెడ్పీ జిల్లాలో 39 జెడ్పీటీసీ, 654 ఎంపీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. టీడీపీ 24,వైఎస్సార్సీపీ15 జెడ్పీటీసీలను దక్కించుకున్నాయి. మెజారిటీ స్థానాలు పొందిన టీడీపీ జెడ్పీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోనుంది. రాంబిల్లి జెడ్పీటీసీగా గెలుపొందిన లాలం భవాని చైర్పర్సన్ అభ్యర్థినిగా ఆ పార్టీ ప్రకటించింది. ఎంపీటీసీలకు సంబంధించి టీడీపీ 334 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 254, కాంగ్రెస్ 17, సీపీఎం 5, సీపీఐ 3, బీజేపీ, బీఎస్పీ ఒక్కో స్థానంలో గెలవగా, స్వతంత్రులు 39 స్థానాల్లో విజయం సాధించారు. జిల్లాలో ఉన్న 39 మండల పరిషత్‌ల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు 4వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. టీడీపీ 20, వైఎస్ఆర్సీపీ10 మండలాల్లో పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకునే పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. తొమ్మిది మండలాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేదు. హంగ్ పరిస్థితి కొనసాగుతోంది. వీటిల్లో మునగపాక, అరకులోయల్లో టీడీపీ, వైఎస్ఆర్సీపీలు చెరి సగం ఎంపీటీసీలు దక్కడంతో ఇక్కడ టాస్ వేయనున్నారు. మిగిలిన ఏడు మండలాల్లో క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. ఇండిపెండెంట్లు, వామపక్ష, కాంగ్రెస్ పార్టీలవారు కీలకం కానున్నారు. ఏర్పాట్లు పూర్తి ఈ ఎన్నికలకు హాజరుకావాలంటూ జిల్లా కలెక్టర్ సాల్మన్‌ఆరోఖ్యరాజ్ గెలిచిన అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలకు నోటీసులు జారీ చేశారు. ఎంపీపీ ఎన్నికలు ఆయా మండలాల్లో నిర్వహిస్తారు. ముందుగా కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. మండలానికి ఒకరిని ఎన్నుకుం టారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు కో- ఆప్షన్ పూర్తయ్యాక 3 గంటలకు ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. అలాగే 5న కూడా ముందుగా జెడ్పీకి ఇద్దరు కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్పర్సన్ ఎన్నిక అభ్యర్థులు చేతులు ఎత్తే విధానంలో నిర్వహిస్తారు. ఈ ఎన్నికలకు పార్టీలు విప్‌ను జారీ చేయనున్నాయి. ఎంపీపీలకైతే 3వ తేదీ, జెడ్పీకి 4వ తేదీ ఉదయం 11 గంటల్లోగా ప్రిసైడింగ్ అధికారులకు విప్ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. జెడ్పీ చైర్మన్ చాంబర్ ఆధునికీకరణ రెండేళ్లుగా జిల్లా పరిషత్‌కు చైర్మన్ లేకపోవడంతో నాటి నుంచి ఆ చాంబర్ మూతపడే ఉంది. ప్రస్తుతం చైర్పర్సన్ ఎన్నికలు నేపథ్యంలో ఆ చాంబర్‌ను తిరిగి సిద్ధం చేశారు. రెండేళ్లు నిర్వహణ లేకపోవడంతో ఆ చాంబర్ గోడలు, సీలింగ్ పూర్తి పాడయ్యాయి. దీంతో అధికారులు రూ.2.50 లక్షలు వెచ్చించి బాగు చేయించారు. ఏసీ పెట్టించి హంగులు దిద్దారు. -
ఫిరాయిస్తే అనర్హత వేటే
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను {పలోభాలకు గురిచేస్తున్న అధికారపక్షం అనర్హత వేటుతోపాటు ప్రతిష్ట కోల్పోతామని భయపడుతున్న నేతలు సాక్షి, చిత్తూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక పార్టీనుంచి ఎన్నికై... వేరే పార్టీవైపు చూస్తున్నా రా? తస్మాత్ జాగ్రత్త. ఎన్నికైన పార్టీ ఆదేశాలను, విప్‌లను ధిక్కరించే వారిపై తక్షణమే అనర్హత వేటు పడుతుంది. పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు 2003లో పంచాయతీరాజ్ చట్టంలో చేసిన సవరణల వల్ల స్థానిక సంస్థల ప్రతినిధులు, ఎన్నికైన పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే ఆ మరుక్షణమే వారిపై అనర్హత వేటు ఖాయమని చట్టాలు చెబుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ప్రలోభాలు పెట్టే చర్యలు తెరవెనుక సాగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం, ఫిరాయింపు నిరోధక చట్టాలను నిపుణులు ఉటంకిస్తున్నారు. పార్టీ మారే వారికి చట్టంలోని పగడ్బందీ నిబంధనలు షాక్ కొట్టించకమానవని స్పష్టంచేస్తున్నారు. అనర్హత వేటు వల్ల అప్రతిష్ట పాలవ్వడంతోపాటు ప్రజలనుంచి వచ్చే వ్యతిరేకతతో అక్కడితోనే రాజకీయ భవిష్యత్తును కోల్పోయే ప్రమాదమూ తప్పదంటున్నారు. గతంలో ఇలా పార్టీలు మారిన వారు రాజకీయంగా తెరమరుగైన సందర్భాలు అనేకమున్నాయని గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా స్థానికసంస్థల్లో పార్టీల సిద్ధాంతాలను అనుసరించి ప్రజాభిప్రాయం మేరకు నడుచుకున్న వారే ఆ తరువాత కూడా రాజకీయంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నత స్థానాల్లోకి వెళ్లగలిగారు. స్వల్ప కాలిక ప్రయోజనాలకోసం పార్టీలు మారితే ఆ తరువాత దీర్ఘకాలంగా రాజకీయంగా చాలా నష్టపోకతప్పదు. ఇలాంటి తరుణంలో జెడ్పీ స్థానాలను కైవసం చే సుకోవడానికి అధికార పార్టీనేతలు స్థానిక సంస్థల ప్రతినిధులను అనేకరకాల ప్రలోభాలకు గురిచేస్తున్నా నేతలు మాత్రం పునరాలోచనలో పడుతున్నారు. ప్రజల తీర్పును, పార్టీ నిర్ణయాన్ని భవిష్యత్తును పణంగా పెట్టడం పలువురు నేతలకు రుచించడం లేదు. పార్టీని ధికకరిస్తే వెంటనే వేటు పడడం, ఆపై ప్రజలు నిరాదరించడం ఇవన్నీ ఎందుకు? బంగారు భవిష్యత్తును వదులుకోవడమెందుకు? అన్న ఆలోచనలో పడుతున్నారు. అయినా కొన్ని చోట్ల కొంతమంది ఆమాయకులను ఆసరా చేసుకొని అధికారపక్షం వారు చట్టాన్ని వక్రీకరిస్తున్నారు. వారెన్ని చెప్పినా చట్టం పగడ్బందీగా ఉన్నందున అనర్హత వేటు తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఆ పార్టీ జారీ చేసే విప్‌కు అనుకూలంగా ఓటు వేయాలే తప్ప, ధిక్కరిస్తే అనర్హత వేటుకు గురవుతారని తెలియజేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గత శుక్రవారం ప్రత్యేకంగా నోటఫికేషన్ కూడా జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఏముందంటే... రాజీవ్‌గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో అంటే 1985 కాలంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చి, దానిని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో చేర్చారు. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. అటు తరువాత 2003లో అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ చట్టానికి కొన్ని సవరణలు జరిగాయి. చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడు ఎవరైనా కూడా తన పార్టీ స్వభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నప్పుడు అతనికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది. తను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీ సభ్వత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడానికి, ఆ పార్టీకి రాజీనామా సమర్పించడానికి తేడా ఉందని, ఈ రెండూ పదాలు కూడా సమనార్ధాకాలు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి తన పార్టీకి రాజీనామా చేయనప్పటికీ, స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని వదులుకోవచ్చునని తెలిపింది. అదే విధంగా పార్టీ ఆదేశాలకు భిన్నంగా ఏదైనా అంశంపై ఓటింగ్ జరిగినప్పుడు అందులో పాల్గొని ఓటు వేయడం, లేదా ఓటింగ్‌కు గైర్హాజరు కావడం చేసినప్పుడు కూడా ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది. ఒకవేళ సదరు రాజకీయ పార్టీ తమ సభ్యుడి ధిక్కారాన్ని 15 రోజుల్లోపు ఖండించని పక్షంలో అతనికి ఫిరాయింపుల చట్టం వర్తించదు. అంతేకాక ఏ పార్టీ టిక్కెట్ మీద అయితే ఓ సభ్యుడు గెలిచారో, ఆ వ్యక్తి ప్రతిపక్ష నేతను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను రాతపూర్వకంగా కోరే, ఆ వ్యక్తి తన పార్టీ సభ్వత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 2003లో తీసుకువచ్చిన చట్ట సవరణ ప్రకారం పార్టీలోని మూడింట రెండు వంతుల మంది సభ్యులు వేరే పార్టీకి వెళ్లిన సందర్భాన్ని ఫిరాయింపుగా పరిగణించడానికి వీల్లేదు. చట్ట సభలకు ఎన్నికైన వెంటనే ఎవరైనా స్వతంత్ర అభ్యర్థి ఇతర రాజకీయ పార్టీలో చేరితే అతనికీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది. -
ఫిరాయిస్తే అనర్హత వేటే
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేస్తున్న అధికారపక్షం అనర్హత వేటుతో పాటు ప్రతిష్టకోల్పోతామని భయపడుతున్న నేతలు విశాఖ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక పార్టీనుంచి ఎన్నికై... వేరే పార్టీవైపు చూస్తున్నారా...? తస్మాత్ జాగ్రత్త. ఎన్నికైన పార్టీ ఆదేశాలను, విప్‌లను ధిక్కరించే వారిపై తక్షణమే అనర్హత వేటు పడుతుంది. పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు 2003లో పంచాయతీరాజ్ చట్టంలో చేసిన సవరణల వల్ల స్థానిక సంస్థల ప్రతినిధులు, ఎన్నికైన పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే ఆ మరుక్షణమే వారిపై అనర్హత వేటు ఖాయమని చట్టాలు చెబుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ప్రలోభాలు పెట్టే చర్యలు తెరవెనుక సాగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం, ఫిరాయింపు నిరోధక చట్టాలను నిపుణులు ఉటంకిస్తున్నారు. పార్టీ మారే వారికి చట్టంలోని పగడ్బందీ నిబంధనలు షాక్ కొట్టించకమానవని స్పష్టంచేస్తున్నారు. అనర్హత వేటు వల్ల అప్రతిష్టపాలవ్వడంతో పాటు ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతతో అక్కడితోనే రాజకీయ భవిష్యత్తును కోల్పోయే ప్రమాదమూ తప్పదంటున్నారు. గతంలో ఇలా పార్టీలు మారిన వారు రాజకీయంగా తెరమరుగైన సందర్భాలు అనేకమున్నాయని గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా స్థానికసంస్థల్లో పార్టీల సిద్ధాంతాలను అనుసరించి ప్రజాభిప్రాయం మేరకు నడుచుకున్న వారే ఆ తరువాత కూడా రాజకీయంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నత స్థానాల్లోకి వెళ్లగలిగారు. స్వల్ప కాలిక ప్రయోజనాలకోసం పార్టీలు మారితే ఆ తరువాత దీర్ఘకాలంగా రాజకీయంగా చాలా నష్టపోకతప్పదు. ఇలాంటి తరుణంలో జెడ్పీ స్థానాలను కైవసం చే సుకోవడానికి అధికార పార్టీనేతలు స్థానిక సంస్థల ప్రతినిధులను అనేకరకాల ప్రలోభాలకు గురిచేస్తున్నా నేతలు మాత్రం పునరాలోచనలో పడుతున్నారు. ప్రజల తీర్పును, పార్టీ నిర్ణయాన్ని భవిష్యత్తును పణంగా పెట్టడం పలువురు నేతలకు రుచించడం లేదు. పార్టీని ధిక్కరిస్తే వెంటనే వేటు పడడం, ఆపై ప్రజలు నిరాదరించడం ఇవన్నీ ఎందుకు? బంగారు భవిష్యత్తును వదులుకోవడమెందుకు? అన్న ఆలోచనలో పడుతున్నారు. అయినా కొన్ని చోట్ల కొంతమంది ఆమాయకులను ఆసరా చేసుకొని అధికారపక్షం వారు చట్టాన్ని వక్రీకరిస్తున్నారు. వారెన్ని చెప్పినా చట్టం పగడ్బందీగా ఉన్నందున అనర్హత వేటు తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఆ పార్టీ జారీ చేసే విప్‌కు అనుకూలంగా ఓటు వేయాలే తప్ప, ధిక్కరిస్తే అనర్హత వేటుకు గురవుతారని తెలియజేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గత శుక్రవారం ప్రత్యేకంగా నోటఫికేషన్ కూడా జారీ చేసింది. ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఏముందంటే... రాజీవ్‌గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో అంటే 1985 కాలంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చి, దానిని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో చేర్చారు. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. అటు తరువాత 2003లో అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ చట్టానికి కొన్ని సవరణలు జరిగాయి. చట్టసభలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సభ్యుడు ఎవరైనా కూడా తన పార్టీ స్వభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నప్పుడు అతనికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది. తను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీ సభ్వత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడానికి, ఆ పార్టీకి రాజీనామా సమర్పించడానికి తేడా ఉందని, ఈ రెండూ పదాలు కూడా సమనార్ధాకాలు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి తన పార్టీకి రాజీనామా చేయనప్పటికీ, స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని వదులుకోవచ్చునని తెలిపింది. అదే విధంగా పార్టీ ఆదేశాలకు భిన్నంగా ఏదైనా అంశంపై ఓటింగ్ జరిగినప్పుడు అందులో పాల్గొని ఓటు వేయడం, లేదా ఓటింగ్‌కు గైర్హాజరు కావడం చేసినప్పుడు కూడా ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది. ఒకవేళ సదరు రాజకీయ పార్టీ తమ సభ్యుడి ధిక్కారాన్ని 15 రోజుల్లోపు ఖండించని పక్షంలో అతనికి ఫిరాయింపుల చట్టం వర్తించదు. అంతేకాక ఏ పార్టీ టిక్కెట్ మీద అయితే ఓ సభ్యుడు గెలిచారో, ఆ వ్యక్తి ప్రతిపక్ష నేతను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను రాతపూర్వకంగా కోరే ఆ వ్యక్తి తన పార్టీ సభ్వత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 2003లో తీసుకువచ్చిన చట్ట సవరణ ప్రకారం పార్టీలోని మూడింట రెండు వంతుల మంది సభ్యులు వేరే పార్టీకి వెళ్లిన సందర్భాన్ని ఫిరాయింపుగా పరిగణించడానికి వీల్లేదు. చట్ట సభలకు ఎన్నికైన వెంటనే ఎవరైనా స్వతంత్ర అభ్యర్థి ఇతర రాజకీయ పార్టీలో చేరితే అతనికీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది. -
కొత్త.. కొత్తగా..
నేడు ప్రమాణస్వీకారం చేయనున్న నగర ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీలో అడుగిడుతున్నవారే అధికం ఇరవై నాలుగులో పదమూడు మంది కొత్తవారే సాక్షి, సిటీబ్యూరో : కొత్తగా కొలువుదీరుతున్న తెలంగాణ శాసనసభలో మహానగర ప్రజాప్రతినిధులు నేడు శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గతానికి పూర్తి భిన్నంగా ఈ సభలో అత్యధిక సభ్యులు శాసనసభకు కొత్తవారు కావటం విశేషం. మహానగర పరిధిలో మొత్తం అరవైనాలుగు మంది శాసనసభ్యుల్లో పదమూడు మంది తొలిసారి శాసనసభ గడప తొక్కుతున్నవారే. నగరంలో తొమ్మిది స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీలో తలసాని శ్రీనివాసయాదవ్ (సనత్‌నగర్), జి.సాయన్న(కంటోన్మెంట్), ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్)లను మినహాయిస్తే జూబ్లీహిల్స్- గోపీనాథ్, కుత్బుల్లాపూర్- వివేకానంద్, కూకట్పల్లి - కృష్ణారావు, శేరిలింగంపల్లి - గాంధీ, మహేశ్వరం - తీగల కృష్ణారెడ్డి, ఎల్బీనగర్ - ఆర్.కృష్ణయ్యలు శాసనసభకు కొత్తవారే. ఎంఐఎం తరఫున గెలిచిన ఏడుగురిలో జాఫర్ హుస్సేన్ (నాంపల్లి), కౌసర్ మొహినోద్దీన్ (కార్వాన్) తొలిసారిగా ఎన్నికయ్యారు. మిగిలినవారంతా గత సభలో ఉన్నవారే. వీరిలో యాకుత్‌పురా నుంచి విజయం సాధించిన ముంతాజ్‌ఖాన్ వరుసగా ఐదుమార్లు విజయం సాధించి నగరంలో ఓ కొత్త రికార్డ్ సృష్టించారు. ఇక బీజేపీలో అంబర్‌పేట ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి వరసగా మూడవసారి విజయం సాధించగా, ముషీరాబాద్ నుంచి డాక్టర్ లక్ష్మణ్ విజయం సాధించటం ఇది రెండవసారి. గతంలో నగర మేయర్‌గా పనిచేసిన తీగల కృష్ణారెడ్డి ఈ మారు శాసనసభకు వస్తుండగా.. ప్రస్తుత జీహెచ్ఎంసీ కౌన్సిల్లో సభ్యులుగా ఉన్న రాజాసింగ్ (బీజేపీ తరఫున గోషామహల్ నుంచి), జాఫర్ హుస్సేన్ (ఎంఐఎం తరఫున నాంపల్లి నుంచి) తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ నుంచి గెలిచిన ముగ్గురిలో సికింద్రాబాద్ నుంచి తిగుళ్ల పద్మారావు రెండవ సారి విజయం సాధించగా.. మల్కాజిగిరిలో కనకారెడ్డి, పటాన్చెరులో మహిపాల్‌రెడ్డిలు శాసనసభలో తొలిసారి అడుగుపెడుతున్న వారే. -
కౌలురైతుకుదేలు
ఖరీఫ్ ముంచుకొస్తున్నా కౌలు రైతుల గుర్తింపు లేదు రుణ అర్హత కార్డుల జారీ నిల్ అప్పులివ్వని బ్యాంకర్లు పంట రుణ లక్ష్యంలో కానరాని ప్రస్తావన కౌలు రైతులు వడ్డీ వ్యాపారుల ఉచ్చులో విలవిల్లాడుతున్నారు. మూడేళ్లుగా చవిచూసిన నష్టాలను దిగమింగుతూ మళ్లీ సాగుకు సిద్ధమవుతున్న వీరిని పట్టించుకునేవారే లేకుండాపోయారు. ఖరీఫ్ తరముకొస్తున్నా..వీరి గుర్తింపు ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. రుణ అర్హత కార్డులు ఎప్పుడిస్తారో ఎవరికీ స్పష్టత లేదు. పరిస్థితి చూస్తుంటే ఈ సీజన్లో కూడా కౌలు రైతులకు మొండి చెయ్యేలా ఉంది. బ్యాంకుల నుంచి ఒక్క రూపాయి కూడా పంట రుణంగా వచ్చే అవకాశం కనిపించడం లేదు. విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో సుమారు 5 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో సుమారు 70 వేల మంది కౌలు రైతులుగా అంచనా. గత ఖరీఫ్‌లో కేవలం 5336 మందికి మాత్రమే రుణ అర్హత కార్డులు ఇవ్వాలని లక్ష్యాంగా పెట్టుకుని 3,341 మందికి మాత్రమే కార్డులు అందజేశారు. కార్డులున్న అందరికీ రుణాలివ్వాల్సి ఉన్నప్పటికీ కేవలం 287 మందికి రూ.56.1 లక్షలు మాత్రమే ఇచ్చి బ్యాంకులు చేతులు దులుపుకున్నాయి. ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సీజన్‌కు ముందే ఏప్రిల్, మే నెలల్లో రెవెన్యూ అధికారులు కౌలు రైతులను గుర్తించాలి . ఎన్నికలు కారణంగా ఇప్పటి వరకు ఆ ప్రక్రియవైపు దృష్టిసారించలేదు. కొత్త వారి ఎంపిక మాటెలా ఉన్నా పాత వారి కార్డుల రెన్యువల్ గురించి కూడా పట్టించుకునేవారు లేకుండాపోయారు. ఒకవేళ రుణ అర్హతకార్డులు ఇచ్చినా కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి చూపించడం లేదు. కొందరు కార్డులు తీసుకోక ముందే భూయజమానులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. కొత్త కార్డుల జారీలో రెవెన్యూ సిబ్బంది శల్యసారథ్యం, వ్యవసాయశాఖ సహకారం లేకపోవడం తదితర కారణాలనూ ఇక్కడ ఉదహరించవచ్చు. మూడేళ్లుగా ఇదే దుస్థితి. మంగళవారం జిల్లా రుణప్రణాళికను ఆమోదించిన అధికారులు కౌలు రైతులకు ఎంత మందికి ఎంతమేర రుణమిస్తారన్న విషయాన్ని ప్రస్తావించలేదు. అంటే ఈ ఖరీఫ్‌లో వీరికి రుణాలు ఉండవా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బ్యాంకుల కొర్రీలను తట్టుకోలేక అన్నదాతలు ప్రైవేటు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, దిగుబడులు ఆశించిన మేర రాకపోవడం, మదుపులు పెరగడం, ప్రకృతి వైపరిత్యాలతో ప్రతీ ఏటా వీరు నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఈ విషయంపై దృష్టిసారించకపోతే కౌలు రైతులకు ఈ ఖరీఫ్ మరింత భారం అవుతుంది. ఎప్పుడూ అన్యాయమే ప్రభుత్వ పరంగా రాయితీలు కౌలు రైతులకు దక్కడం లేదు. సబ్సిడీ విత్తనాలు, పురుగు మందులు అందకపోవడంతో బహిరంగ మార్కెట్లో వీటిని అధిక ధరలకు కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి. ఈ క్రమంలో నకిలీ, నాసిరకం విత్తనాలు కారణంగా రైతులు భారీగా నష్టపోతున్నారు. విపత్తుల సమయంలో పంటనష్టం పరిహారానికి నోచుకోవడం లేదు. దీనిని పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా చెల్లిస్తుండడంతో కౌలు రైతులు దూరమవుతున్నారు. ఏటా ఇబ్బందులే... నాది మునగపాక. రెండెకరాలు కౌలుకు తీసుకుని చెరకు పండిస్తున్నాను. రోజుల తరబడి ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగి పోరాడితేనే రుణ అర్హత కార్డును ఇచ్చారు. దాని ఆధారంగా ఏడాదికి రూ.35వేలు రుణమివ్వాలి. బ్యాంకువారు కేవలం రూ.17వేలు ఇచ్చారు. మదుపులు పెరగడంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద మరి కొంత తెచ్చాను. వారికి వడ్డీలకు వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. ఏటా ఇదే పరిస్థితి. - పెంటకోట సూరిబాబు, కౌలు రైతు -
ఇంకా వేచి ఉండవలే..
ఎన్నికైనా పదవీ ప్రమాణం లేదు ఎంపీ నుంచి కౌన్సిలర్ వరకు నిరీక్షణ అపాయింటెడ్ డే తరువాతే అధికారపగ్గాలు ఖరారు కాని తేదీలు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ప్రజాప్రతినిధులకు వింత పరిస్థితి ఎదురైంది. ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. విజయానందం ఉన్నా ఇంకా అధికారం చేతికి రాలేదు. కౌన్సిలర్ల నుంచి ఎంపీ విజేతల వరకు అధికార పగ్గాల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. రాష్ట్ర విభజన కారణంగా జూన్ 2 అపాయింటెడ్ డే వరకు ఏ ఒక్కరూ పదవీ ప్రమాణం చేయలేని పరిస్థితి నెలకొంది. ఆ తరువాత కూడా ఎప్పుడు ప్రభుత్వం ఏర్పాటవుతుందో కూడా తెలియని పరిస్థితి. స్థానిక పీఠాలను అధిరోహించే తేదీలు ఇప్పటికీ ఖరారు కాకపోవడంతో విజేతలు అయోమయంతో ఎదురుచూపులు చూస్తున్నారు. వరుసగా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ముందుగా మార్చి 30న నర్పీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. మరో వారం రోజుల్లో వీటి ఓట్ల లెక్కింపు జరుగుతుందన్న సమయంలో వీటి ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై పడతాయని సుప్రీంకోర్టు కౌంటింగ్‌ను వాయిదా వేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆ తరువాత ఏప్రిల్‌లో రెండు దఫాల్లో 39 జెడ్పీటీసీలకు, 656 ఎంపీటీసీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా అదే విధంగా వాయిదా పడ్డాయి. దీంతో ఈ రెండింటికి పోలింగ్ ముగిసినప్పటికీ ఫలితాల కోసం అభ్యర్థులు నెలన్నరపాటు ఉత్కంఠగా ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ తరువాత ఈ నెల 7న సార్వత్రిక ఎన్నికలు జరగగా 16న కౌంటింగ్ ముగిసింది. మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులెవరో తేలిపోయింది. అయితే ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు వీరు అధికారికంగా ఆ హోదాలను అనుభవించలేని వింత పరిస్థితి ఏర్పడింది. రాష్ర్ట విభజన కారణంగా ఈ దఫా ప్రమాణ స్వీకారాలకు జాప్యం జరుగుతోంది. జూన్ 2 తరువాతే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు జూన్ 2న అపాయింటెడ్ డేగా నిర్ణయించారు. అధికారికంగా ఆ రోజుతో రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తవుతుంది. అపాయింటెడ్ డే తరువాతే ప్రజాప్రతినిధులు బాధ్యతలు స్వీకరించాలన్న నిబంధన వారి ఉత్సాహంపై నీళ్లు చల్లింది. రోజుల తరబడి వేచి ఉండేలా చేసింది. జూన్ 2నే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని ముందు భావించారు. అయితే ఇప్పటి వరకు ఆ విషయంపై స్పష్టత లేదు. సీఎం ప్రమాణ స్వీకారం ఎప్పుడు, ఎక్కడన్న విషయం కూడా ఇంకా ఖరారు కాలేదు. దీంతో జిల్లాలో 15 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల నుంచి గెలిచిన అభ్యర్థులు ఆ తేదీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రజాప్రతినిధుల ప్రసన్నం కోసం... గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రమాణ స్వీకారాలు చేయకముందే, అధికార పగ్గాలు చేపట్టక మునుపే వారిని ప్రసన్నం చేసుకోడానికి కొంత మంది అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు అధికారుల పదోన్నతులు, బదిలీలు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అప్పటి వరకు ఎవరికీ బదిలీలకు అవకాశం లేదు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంచి పోస్టింగ్‌ల కోసం ఇప్పటినుంచే ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగితేలుతున్నారు. గెలిచిన వారి ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. స్థానిక అధికారం ఎప్పుడో.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎమ్మెల్యే, ఎంపీలు కొలువుతీరిన తరువాతే వీరి ప్రమాణ స్వీకారాలు ఉండనున్నాయి. అయితే ఆ రోజు ఎప్పుడన్న విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. దీంతో అభ్యర్థులు ఉసూరుమంటూ నిట్టూరుస్తున్నారు. -
ఇంకా ‘కోడా’!
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసినందున ఎన్నికల నియమావళిని సడలించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుమతితో రాసిన ఈ లేఖలో ఆయన, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఎన్నికల నియమావళి అమలులో ఉంటే అనేక ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. గత గురువారం రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. మార్చి 5న అమలులోకి వచ్చిన నియమావళి, వచ్చే నెల 16న ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకు కొనసాగుతుంది. అంటే... ఇంకా దాదాపు నెలకు పైగా ప్రజాప్రతినిధులు విధులకు హాజరయ్యే అవకాశం లేదు. వివిధ శాఖల్లో మంత్రుల సమీక్షలు, బదిలీలు లాంటి వ్యవహారాలు నియమావళి కింద నిషిద్ధం. అంతేకాకుండా మంత్రులు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించ కూడదు. దీని వల్ల అభివృద్ధి పనులు కుంటుపడతాయని కౌశిక్ ముఖర్జీ పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసి, ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచినందున, మంత్రులు సహా ఎవరూ ఓటర్లను ప్రభావితం చేయజాలరని ముఖర్జీ వివరించారు. కనుక వెంటనే నియమావళిని ఎత్తివేసి ప్రభుత్వ పనులకు ఆటంకం కలుగకుండా చూడాలని ఆయన కోరారు. కాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖపై ప్రత్యుత్తరం కోసం ఎదురు చూస్తున్నామని న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర సోమవారం విలేకరులకు తెలిపారు. బీజేపీ డిమాండ్ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసినప్పటికీ, ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున అధికారుల దర్బారు సాగుతోందని బీజేపీ విమర్శించింది. అభివృద్ధి కార్యక్రమాలు కుంటు పడినందున ఎన్నికల కమిషన్ సత్వరమే నియమావళిని సడలించాలని డిమాండ్ చేసింది. పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఉభయ సభల్లో ప్రతిపక్ష నాయకులు జగదీశ్ శెట్టర్, సదానంద గౌడ మాట్లాడుతూ ఈ నెల 17న ఎన్నికలు ముగిశాయని, వచ్చే నెల 16 వరకు నియమావళి అమలులో ఉంటే అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతుందని తెలిపారు. ప్రజాప్రతినిధులు ఏ పని చేయాలన్నా నియమావళి అడ్డు పడుతోందని విమర్శించారు. మంత్రులు అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసే అవకాశం లేదని, తద్వారా పాలన స్తంభించిపోయిందని తెలిపారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు లేఖ కూడా రాస్తామన్నారు. మాజీ మంత్రి ఆర్. అశోక్ మాట్లాడుతూ ముళబాగిలులోని ఓ మసీదులో ఇమ్రాన్ అనే యువకున్ని దారుణంగా హత్య చేయడం తాలిబన్ సంస్కృతికి నిదర్శనమని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తాలిబన్ సంస్కృతి కూడా ప్రవేశించిందని విమర్శించారు. ఈ హత్యను ఘర్షణగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని, ఇందులో పోలీసుల హస్తం కూడా ఉందని ఆయన ఆరోపించారు. -
ఎన్నికల ఏజెంట్లుగా..ప్రజా ప్రతినిధులకు అవకాశం లేదు: ఈసీ
సాక్షి, హైదరాబాద్: ఎలక్షన్ ఏజెంట్లు, పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లుగా మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, మండల, జిల్లా పరిషత్ చైర్మన్లను నియమించడానికి వీల్లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సాయుధ భద్రత ఉన్న ప్రజా ప్రతినిధులను ఎన్నికల ఏజెంట్లుగా నియమించడానికి వీల్లేదని ఎన్నికల సంఘం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భద్రత లేని ప్రజా ప్రతినిధులను ఎన్నికల ఏజెం ట్లుగా నియమించడానికి అవకాశం ఉం దా? అంటూ పుదుచ్చేరి ముఖ్య ఎన్నికల అధికారి స్పష్టత కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. భద్రతతో సంబంధం లేకుండా ప్రజా ప్రతినిధులను ఎన్నికల ఏజెంట్లుగా నియమించడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ అన్ని రాష్ట్రాల సీఈవోలకు ఎన్నికల సంఘం కార్యదర్శి సుమీత్ ముఖర్జీ మంగళవారం లేఖ రాశారు. -
మందమర్రి మున్సిపాల్టీని వీడని గ్రహణం
మందమర్రి రూరల్, న్యూస్‌లైన్ : మందమర్రి మున్సిపాలిటీకి పట్టిన ఎన్నికల గ్రహణం వీడటం లేదు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారిన మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం లేదు. దీంతో పట్టణ అభివృద్ధి కుంటుపడుతోంది. గ్రామ పంచాయతీగా ఉన్న మందమర్రి కొన్ని రాజకీయ కారణాల వల్ల 1993లో నోటిఫైడ్ ఏరియాగా మారింది. ఆ తర్వాత 1995 మే 8వ తేదీన మందమర్రిని గ్రేడ్-3 మున్సిపాలిటీ హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 58 వేల జనాభా ఉన్న మందమర్రి మున్సిపాలిటీలో 32 వేల మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీని 24 వార్డులుగా విభజించి 1998 మే 21వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు ఇచ్చింది. ఇక్కడ చైర్మన్ అభ్యర్థి పదవికి ఎస్సీ మహిళకు రిజర్వేషన్ కేటాయించారు. దీంతో నోటిఫికేషన్ విడుదలై ఎన్నికల కోలాహలం సాగుతున్న సమయంలో ఏజెన్సీ ఏరియాలో ఉన్న మందమర్రి గ్రామ పంచాయతీ 7/70 చట్ట పరిధిలో ఉన్న కారణంగా ఇక్కడ ఎన్నికలు నిలిపేయాలని అప్పటి గ్రామ పంచాయతీ సర్పంచ్ మద్ది రాంచందర్ ప్రభుత్వం తీసుకున్న ఎన్నికల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో రిట్ ఫిటిషన్ దాఖలు చేశారు. ఒక వేళ ఎన్నికలు జరపవలసి వస్తే ఎస్టీలకు మాత్రమే చైర్మన్ పదవి కేటాయించాలని తన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో ఎన్నికలు నిలిపేస్తూ జూన్, 18, 1998న హైకోర్టు స్టే జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తు ఆశానిర్మల కోర్టును ఆశ్రయించారు. కానీ వాది, ప్రతివాదుల తరుఫున ఎవ్వరు కోర్టుకు హాజరు కాకపోవడంతో ఏప్రిల్, 5, 2005లో కేసును డిస్మిస్ చేస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు ప్రకటించింది. ఎన్నికల నిర్వహణపై ఈసీ కేంద్రానికి లేఖ ఫిబ్రవరి, 3, 1999లో మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికల వ్యవ హారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ మున్సిపాలిటీ పరిపాలన కార్యదర్శికి లేఖ ద్వారా వివ రించింది. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీ ఏరియాలో ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించిన విషయాల్లో వివాదాలు వస్తే దాన్ని కేవలం పార్లమెంటు జోక్యం తీసుకుంటుందని, షెడ్యూల్ ఏరియాల విభాగాల చట్టం ప్రకారం బిల్లు ఆమోదించవలసి ఉంటుందని తేల్చి చెప్పింది. దీంతో మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలకు పీటముడి బిగుసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టణ ప్రజలు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు ఎన్నికల కోసం పోరాటాలు చేస్తున్న ప్రయోజనం లేదు. మున్సిపాలిటీకి ఎన్నికలు లేక 16 ఏళ్లు.. జిల్లాలో మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కాగజ్‌నగర్, బెల్లంపలి,్ల బైంసా, మందమర్రితో కలిసి ఏడు మున్సిపాలిటీలు ఉండగా కేవలం మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు లేక 16 ఏళ్లవుతోంది. దీంతో ప్రజా ప్రతినిధులు లేక, ప్రశ్నించే వారు కానరాక మున్సిపాలిటీ పాలనా అస్తవ్యస్తంగా మారింది. అధికారులు తమ ఇష్టారాజ్యాంగా వ్యవహరించడం. అందినంత దండుకోవడం, నిధుల దుర్వినియోగం చేయడంతోపాటు పట్టణ ప్రజలకు కనీస వసతులు కల్పించలేని పరిస్థితులో మందమర్రి మున్సిపాలిటీ కోట్టుమిట్టాడుతుంది. పన్నుల వసూలులో పురోగతి లేక పోవడంతో కార్యాలయానికి ఆదాయం తగ్గింది. ఇప్పటి వరకు మున్సిపాలిటీ కట్టవలసిన విద్యుత్ చార్జీలు రూ.70 లక్షలకు పేరుకుపోయాయి. కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకోంది. 2004లో రూ.24 కోట్ల హ డ్కో నిధులతో ప్రారంభించిన గోదావరి మంచినీటి పథకం ఇప్పటివరకు పూర్తి కాకపోవడంతో పట్టణంలోని హై లేవల్జోన్ ప్రాంతవాసులకు తాగునీరు అందకుండా పోతుంది. వేతనాలను ఇవ్వలేక చాలినంత సిబ్బందిని సమకూర్చుకోలేక పారిశుధ్యం పడకేసింది. రోడ్లు, డ్రెయినేజీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం 3వ గ్రేడ్ మున్సిపాలిటీ అని ప్రకటించినా ఎన్నికలు లేక, ప్రజ లకు కనీస మౌలిక వసతులు అందక మందమర్రి మున్సిపాలిటీ త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతుం ది. ఇప్పటివరకు పదవుల్లో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై సరైన ఒత్తిడి చేయలేక పోవడం వల్లనే ఎన్నికలు జరుగకుండా పోతున్నాయని పట్టణ ప్రజలు భావిస్తున్నారు. వెంటనే ఎన్నికల ప్రక్రియకు తగిన కృషి చేయాలని వారు కోరుతున్నారు. -
ఇక ప్రజా ప్రతినిధులు డమ్మీలే...
అధికారులదే పెత్తనం పాలన అంతా కలెక్టర్ పర్యవేక్షణలోనే జిల్లా ప్రజలు రెండోసారి రాష్ట్రపతి పాలన చూడబోతున్నారు. జై ఆంధ్రా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన నేపథ్యంలో 1973లో రాష్ట్రపతి పాలన విధించారు. తిరిగి రాష్ట్ర విభజన, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా కారణాలను దృష్టిలో ఉంచుకొని శనివారం రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులిచ్చారు. సాక్షి, విజయవాడ : ఇక ప్రజాప్రతినిధులు డమ్మీలుగా మారనున్నారు. రాష్ట్ర అసెంబ్లీని సుషుప్తావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన అమలు చేయాలని రాష్ట్రపతి శనివారం ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయాల కోసం ప్రజలపై రాష్ట్రపతి పాలన రుద్దిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక జిల్లా పాలన మొత్తం కలెక్టర్ చేతిలోకి వెళ్తుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి రాజీనామాతో మంత్రి పార్థసారథి మాజీ మంత్రి అయిపోయారు. ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతున్నందున శనివారం వరకు ఆయనకు ప్రోటోకాల్ కొనసాగించారు. రాష్ట్రపతి పాలన ఆమోదం పొందగానే ప్రభుత్వ వాహనాలు, ఎస్కార్ట్ వెనక్కి తీసుకుంటారు. ఈ నిర్ణయం ఆదివారం నుంచి అమలులోకి రానుంది. ఎమ్మెల్యేలు కూడా పేరుకు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఉంటారు. వీరికి ఎటువంటి హక్కులూ ఉండవు. వేతనం మాత్రం వస్తుంది. ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలలో వీరికి ప్రాధాన్యత ఉండదు. ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే ప్రభుత్వం ఉన్నా ఏ నిర్ణయం తీసుకోలేరు కాబట్టి పెద్దగా తేడా ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసాధారణ పరిస్థితులు ఉంటేగాని పెట్టకూడ ని రాష్ట్రపతి పాలనను ఆంతరంగిక సమస్యల కోసం పెట్టడాన్ని మేధావులు తప్పు పడుతున్నారు. రెండుసార్లూ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో మెజారిటీ ఉండటం గమనార్హం. అంతర్గత కారణాలతోనే.. గతంలో 1973లో రాష్ట్రపతి పాలన పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు.. ఇప్పుడు కూడా అంతర్గత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకుంది. అప్పుడు కృష్ణా కలెక్టర్‌గా సీఎస్ రావు పనిచేస్తే.. ఇప్పుడు రఘునందన్‌రావు ఉన్నారు. అయితే పాలనలో నిత్యం జరిగే వ్యవహారాల్లో పెద్దగా తేడా ఉండదని అధికారులు చెబుతున్నారు. మళ్లీ ప్రభుత్వం వచ్చే వరకు కొత్త ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు ఇవ్వడం మాత్రం సాధ్యం కాదు. అధికారుల బదిలీలు కూడా ఉండవు. అధికారుల నిర్ణయాలను ప్రశ్నించే అవకాశం ఉండదు. మరోవైపు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు కూడా అధికారులపై ఉండవు. 1973లో రాష్ట్రపతి పాలన పెట్టిన సమయంలో జిల్లాలో జైఆంధ్ర ఉద్యమం హింసాత్మక రూపం తీసుకోవడం, ఉద్యమానికి నాయకత్వం వహించిన ఉక్కు కాకాని వెంకటరత్నం మృతి చెందడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కలెక్టర్ సీఎస్ రావు చాకచక్యంగా వ్యవహరించి జిల్లాలో పరిస్థితులు చక్కబడేందుకు కృషి చేశారు. ఆ సమయంలో కాకాని వెంకటరత్నం, మండలి వెంకట కృష్ణారావు, కాజా రామనాధం, దమ్మలపాటి రామారావు, వసంత నాగేశ్వరరావు, ఆసిఫ్ పాషా, అక్కినేని భాస్కరరావు, చనుమోలు వెంకట్రావు, కోట రామయ్య, మేకా రాజా రంగయ్య అప్పారావు వంటి హేమాహేమీలు శాసనసభ్యులుగా ఉన్నారు. -
గ్రేటర్ ‘పెద్ద’లెవరో..!
సాక్షి,సిటీబ్యూరో: తాజా ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వారిలో ఎవరెవరు జీహెచ్ఎంసీ ఎక్స్అఫీషియో సభ్యులు కానున్నారనేది రాజకీయవర్గాల్లో.. జీహెచ్ఎంసీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ పరిధిలోని ప్రజాప్రతినిధులు జీహెచ్ఎంసీ ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉంటారు. తద్వారా వారు జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాలకు హాజరై తమ వాణి వినిపించవచ్చు. ప్రజా సమస్యలను ప్రస్తావించవచ్చు. కొత్తగా ఎన్నికైన ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో కాంగ్రెస్‌కు చెందిన కేవీపీ రామచంద్రరావు, ఎంఏ ఖాన్లు ఇప్పటివరకు జీహెచ్ఎంసీ ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి ఎన్నికైన కేకే కూడా గతంలో కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ ఎక్స్అఫీషియో సభ్యుడిగా కొనసాగారు. రాజ్యసభ సభ్యులు తాము ఏజిల్లాను ఎంపిక చేసుకుంటే ఆ జిల్లాలోని స్థానిక సంస్థల సమావేశాలకు ఎక్స్అఫీషియో సభ్యుల హోదాలో తగిన గౌరవం లభిస్తుంది. తాజా రాజకీయ పరిణామాలతో తిరిగి వీరి లో ఎవరెరు జీహెచ్ంఎసీకి ఎక్స్అఫీషియో సభ్యులు కానున్నారనేది ఆసక్తికరంగా మారింది. కేకే,ఎంఏ ఖాన్లు తిరిగి జీహెచ్ఎంసీ ఎక్స్అఫీషియో సభ్యులయ్యే అవకాశాలున్నాయనేది రాజకీయ పరిశీలకుల అంచనా. మిగతావారి గురించి చెప్పలేమంటున్నారు. హైదరాబాద్ జిల్లాను ఎంపిక చేసుకొని జీహెచ్ంఎసీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా కొనసాగుతున్న వారిలో చిరంజీవి, జైరాంరమేశ్, నంది ఎల్లయ్య,వి.హనుమంతరావు,రాపోలు ఆనందభాస్కర్ , సీఎం రమేశ్‌లున్నారు. -
భద్రాచలంపై ప్రధానికి జిల్లా ప్రజాప్రతినిధుల లేఖ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్ర ప్రాంతంలో కలిపే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కేంద్రానికి విజ్ఞాపనలను తీవ్రతరం చేశారు. ఇప్పటివరకు పార్టీల వారీగా కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్న వీరంతా ఇప్పుడు ఒకే వేదికగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అసెంబ్లీలోని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క చాంబర్లో జిల్లాకు చెందిన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డితోపాటు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలకు చెందిన 13 మంది ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రధాని మన్మోహన్‌కు మూడు పేజీల లేఖ రాశారు. అందులో భద్రాచలం చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. 1674వ సంవత్సరంలో తానీషా సంస్థానంలో తహశీల్దారుగా పనిచేసిన కంచర్ల గోపన్న భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయాన్ని నిర్మించారని, అప్పటి నుంచి 1948 వరకు భద్రాచలం తెలంగాణలోనే అసఫ్‌జాహీల పాలనలోనే ఉందని, ఆ తర్వాత మూడేళ్ల పాటు మాత్రమే కాకినాడలో కలిపారని, మళ్లీ 1959 నవంబర్ నుంచి ఖమ్మంలో కలిపేశారని తెలిపారు. జిల్లాలోని గిరిజన ప్రజల సంస్కృతి సంప్రదాయాలు కూడా తెలంగాణలో భాగంగానే ఉంటాయని, ఒక్క అంగుళం భూమిని కూడా ఖమ్మం జిల్లా నుంచి సీమాంధ్రలో కలపవద్దని ఆ వినతిపత్రంలో కోరారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిర్మించేందుకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను తగ్గించాలని, తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఆరు బ్యారేజీలతో ప్రాజెక్టు నిర్మించుకుంటే పెద్దగా నష్టం లేకుండానే నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చని అందులో సూచించారు. ఈ వినతిపత్రంపై సంతకం చేసిన వారిలో మంత్రి, డిప్యూటీ స్పీకర్‌తో పాటు ఎమ్మెల్యేలు కుంజా సత్యవతి, రేగా కాంతారావు, మిత్రసేన (కాంగ్రెస్), తుమ్మల నాగేశ్వరావు, సండ్రవెంకటవీరయ్య, ఊకె అబ్బయ్య (టీడీపీ), కూనంనేని సాంబశివరావు, చంద్రావతి (సీపీఐ)లతో పాటు ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు ఉన్నారు. -
పండుగ నిధులు.. ఫలహారం!
మేడారంలో కానరాని ముందస్తు ప్రణాళిక సౌకర్యాల పేరుతో ఇష్టారీతిగా పనులు మళ్లీ జాతరకు ‘శాశ్వత’ నిర్మాణాలు కనుమరుగే.. పట్టించుకోని ప్రజా ప్రతినిధులు సాక్షి, హన్మకొండ: మహా జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం శాశ్వత ప్రాతిపదికన మేడారం పరిసర ప్రాంతాల్లో 500కు పైగా మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. వీటిలో సగానికి పైగా మరుగుదొడ్లు ఎప్పటిలాగే స్థానిక రైతుల అనుమతి తీసుకోకుండా వారి వ్యవసాయ పొలాల్లో నిర్మిస్తున్నారు. జాతర తర్వాత.. వచ్చే ఖరీఫ్‌లో రైతులు వాటిని తొలగించి వ్యవసాయం చేస్తారు. కానీ వీటిని శాశ్వత మరుగుదొడ్లుగా అధికార యంత్రాంగం పేర్కొంటున్నది. ఒక్క టాయిలెట్లే కాదు.. మేడారంలో భక్తుల సౌకర్యం పేరుతో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ముందు చూపు కానరావడం లేదు. హడావుడిగా పనులు చేపట్టడం.. అందినకాడికి పర్సంటేజీలు పం చుకోవడం అధికారులు, ప్రజా ప్రతినిధు లకు పరిపాటిగా మారింది. రాష్ట్ర పండుగ అయిన జాతరకు వెచ్చిస్తున్న నిధులు ఫలహారంగా మారుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందుచూపులేని యంత్రాంగం.. ప్రభుత్వం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించినా ఇంతవరకు ప్రత్యేక నిధులు విడుదల చేయలేదు. ప్రతీసారి జిల్లా సాధారణ బడ్జెట్‌తో పాటు గిరిజన ఉప ప్రణాళిక నిధులతో జాతర పనులు చేపడుతున్నారు. అయితే సాధారణ నిధులతో పనులు చేపట్టా ల్సి ఉందని తెలిసినా చివరి నిమిషం వరకు ప్రణాళిక రూపొందించడంలేదు. జాతరకు మూడు నెలల సమయం ఉందనగా నవంబర్‌లో హడావుడిగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ మధ్యటెండర్ల ప్రక్రియ పూర్తవుతుండగా పనులు చేపట్టేం దుకు 30 నుంచి 50 రోజుల సమయమే అందుబాటులో ఉంటోంది. దీంతో జాతర దగ్గరపడుతోంది.. చకచక పనులు పూర్తి చేయాలంటూ నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. ఈ పనుల మధ్యలో జోక్యం చేసుకుంటే జాతర నాటికి పూర్తి కావనే నెపంతో అ టు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. జాతరకు కోటి మంది భక్తులు వస్తారనే అంచనాతో రూ.94 కోట్ల రూపాయల వ్యయంతో కూడిన ప్రతిపాదనలు నవంబర్ లో సిద్ధం చేశారు. డిసెంబర్ నుంచి ఒక్కొక్కటిగా పనులు మొదలుపెట్టారు. పాత పనులకు పాతర.. ఏటూరునాగారం, మల్యాల, దొడ్ల, ఊరట్టం నుంచి ఎడ్లబండ్ల మీదుగా వచ్చే భక్తులకు ఊరట్టం కాజ్వే.. ప్రధాన మార్గం. గత జాతరలో రూ.25 లక్షల తో నిర్మించిన ఈ కాజ్వే గతేడాది వ ర్షాలకు దెబ్బతింది. దీనికి మరమ్మతులు చేయించాల్సిన అధికారులు ఆ విషయాన్ని మరిచారు. అలాగే గతేడాది జాతరకు వచ్చినప్పుడు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమ్మక్క కొలు వై ఉండే చిలకలగుట్ట చుట్టూ ప్రహారీ, ఫెన్సింగ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నవంబర్‌లో రూపొందించి న ప్రతిపాదనలో ఈ విషయాన్ని కూడా అధికారులు పక్కకు పెట్టారు. అలాగే గిరిజన మ్యూజియం నిర్మా ణం ఊసే పట్టించుకో లేదు. అక్కరకు రాని వాటిపై.. ఊరట్టం కాజ్వే మరమ్మతులపై శ్రద్ధ పెట్టని అధికారులు ఎవరూ ఊహించని విధంగా ఊరట్టం నుంచి మల్యాల వరకు ఏటూరునాగారం అభయారణ్యం లో ఉన్న ఎడ్లబండి మార్గాన్ని ఉన్నఫళంగా బీటీగా మార్చేందుకు రోడ్లు భవనాల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అధికారులు ఆమోదించి టెండర్లు పిలిచి 3 కిలోమీటర్ల వరకు మెటల్ పోసిన తర్వాత అటవీశాఖ అధికారులు అడుకున్నారు. అలాగే ఊరట్టం కాజ్వే నుంచి గద్దెలు-జంపన్నవాగు రోడ్డు వరకు పొలాల మధ్య నుంచి రెండు కిలోమీటర్ల పొడవుతో బీటీరోడ్డు నిర్మాణం చేపట్టారు. ముందస్తు సమాచారం లేకుండా పొలాల మధ్య నుంచి రోడ్లు వేయడంతో స్థానిక గిరిజనులు భూములు కోల్పోయారు. రైతుల నుంచి అనుమతి తీసుకోకుండానే వారి పొలాల్లో శాశ్వత మరుగుదొడ్లు అంటూ కట్టడాలు చేపడుతున్నారు. వ్యవసాయ పనులు మొదలై తే శాశ్వత మరుగుదొడ్లలో ఎన్ని వచ్చే జాతర వరకు ఉంటాయనే అంశంపై అధికారులకే స్పష్టత లేదు. జాతర రద్దీ ఎక్కువగా ఉండే జంపన్నవాగు-గద్దెల వరకు ఫోర్‌లేన్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. అందులో భాగంగా జంపన్నవాగుపై రెండో వంతెన నిర్మించారు. కానీ ఫోర్‌లేన్ రోడ్డును మరిచారు. భక్తులకు ఉపయోగపడని పనులు.. 2014 జాతర పేరుతో జిల్లా వ్యాప్తంగా పలు రోడ్లకు మరమ్మతులు, అభివృద్ధి చేస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వంతెనలు నిర్మిస్తామన్నారు. కానీ పస్రా-లింగాల రోడ్డు, చిలకలగుట్ట ఫెన్సింగ్, తూముల వాగు, వట్టివాగు వంతెనలు, ఊరట్టం నుంచి ఆర్అండ్బీ రోడ్డు వరకు సీసీ రోడ్డు వంటి పనులను రూ. 30 కోట్లతో చేపడుతున్నారు. ఈ పనులన్నీ సగ మే పూర్తయ్యాయి. జాతర నాటికి ఈ పనులు పూర్త య్యే అవకాశం లేదు. అలాగే ఎనభైశాతం మరుగుదొడ్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. జిల్లా యం త్రాంగం ముందుచూపుతో వ్యవహరించకపోవడం వల్ల జాతరకు కేటాయించిన నిధుల్లో సుమారు రూ.35 కోట్ల పనులు భక్తులకు ఉపయోగపడ లేదు. పట్టించుకోని మంత్రులు.. పనులు నెమ్మదిగా జరుగుతున్నా మంత్రులు శ్రద్ధ పెట్టడం లేదు. కేంద్రమంత్రి బలరాంనాయక్, జిల్లా మంత్రులు పొన్నాల, సారయ్యలు జాతర పనులపై పూర్తిస్థాయిలో సమీక్ష జరపలేదు. మేడారం పరిసర ప్రాంతాల్లో ఎనభైశాతం జారత పనులు పూర్తయిన తర్వాత మంత్రి పొన్నాల చుట్టపు చూపుగా వచ్చి గం టన్నర సేపు సమీక్ష జరిపి వెళ్లిపోయారు. బలవంతంగా భూమి తీసుకుంటున్నారు. ఊరట్టం కాజ్వే నుంచి దేవతల గద్దెల వరకు అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం నాకున్న భూమిని బలవంతంగా అధికారులు లాక్కుంటున్నారు. పంట భూమిలోంచి రోడ్డును నిర్మించొద్దని ఎంతచెప్పినా అధికారులు మా గోడు పట్టించుకోవడం లేదు. నాకున్న ఎకరం భూమిలో రోడ్డు నిర్మాణంలో సుమారు పది గుంటల భూమిని కోల్పోతున్నాను. రోడ్డు నిర్మిస్తున్నామని అధికారులు చెప్పినప్పటి నుంచి భూమి పోతోందన్న దిగులుతో ఆరోగ్యం క్షీణించింది. అధికారులు.. పోలీసులను అడ్డుపెట్టుకుని గిరిజన రైతుల భూములను రోడ్ల పనుల కోసం గుంజుకుని నష్టాన్ని కలిగిస్తున్నారు. - నాలి సావిత్రి, మాజీ ఉపసర్పంచ్ -
ఇంకా ఎన్ని నెలలో..?
సాక్షి, బళ్లారి : కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పురసభ సభ్యులుగా గెలుపొందిన ప్రజాప్రతినిధులు నెల కాదు.. రెండు నెలలు కాదు ఏకంగా 11 నెలలు కావస్తున్నా అధికార బాధ్యతలు అప్పగించకపోవడంతో వారు ఉత్సవ విగ్రహాల్లా ఉన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా గెలుపొందిన వారు వెంటనే అధికార బాధ్యతలు చేపట్టి తమను గెలిపించిన ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధం అవుతుంటారు. అయితే ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ఏడాది కావస్తున్నప్పటికీ బాధ్యతలు చేపట్టకపోవడంతో చేసేదేమీ లేక మిన్నకుండిపోతున్నారు. బళ్లారి జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే జరిగాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీ, పట్టణ పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కార్పొరేటర్లుగా గెలుపొందిన వారు తమకు అధికార బాధ్యతలు వెంటనే అప్పగిస్తారని ఆశించారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో మేయర్, ఉప మేయర్, మున్సిపాలిటీ, పురసభ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. అప్పటి నుంచి నేటి వరకు స్థానిక సంస్థల తరుపున ప్రజాప్రతినిధులకు గ్రహణం పట్టింది. అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్, ఉపమేయర్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. రాష్ట్రంలో ఉన్న 9 కార్పొరేషన్లలో రెండు కార్పొరేషన్లకు ఎన్నికలు పూర్తి చేశారు. తర్వాత మంగళూరుకు చెందిన ఓ కార్పొరేటర్ మేయర్, ఉపమేయర్ల రిజర్వేషన్ల ప్రక్రియ సక్రమంగా లేదని కోర్టుకు వెళ్లడంతో స్థానిక సంస్థల తరుపున ఎన్నికైన ప్రజాప్రతినిధులందరికీ పదవులు అలంకరణకు శాపమైంది. ప్రజాప్రతినిధులుగా ఎంపికై 11 నెలలైనా ఎలాంటి బాధ్యతలు చేపట్టకపోవడంతో తమను ప్రజలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. కొంత కాలం కోర్టులో నానుతూ వచ్చిన ఈ వ్యవహారం ఎట్టకేలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి రెండు నెలలలోపు మేయర్, ఉపమేయర్లతోపాటు మిగిలిన స్థానిక సంస్థలకు చెందిన రిజర్వేషన్ల ప్రక్రియ సక్రమంగా చేపట్టాలని సూచించడం తెలిసిందే. అయితే రెండు నెలల గడువు ఇవ్వడంతో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే లోక్‌సభ ఎన్నికల తర్వాతనే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయని పేరు చెప్పని ఓ కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశాడు. గెలుపొందిన ప్రజాప్రతినిధులకు బాధ్యతలు లేకపోవడంతో బళ్లారితోపాటు జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటి, పురసభల్లో సమస్యలు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. అధికారులది ఆడిందే ఆట పాడిందే పాటగా మారిందని పలువురు కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
శ్రీవారిసేవలో ప్రముఖులు
-
‘అభివృద్ధి’లో ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం
సాక్షి ప్రతినిధి నిజామాబాద్: అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికోసం మంజూర య్యే నిధులను కమ్యూనిటీ హాళ్లు, కల్వర్టులు, సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు, ప్రహరీలు, ఆలయాలు, ప్రార్థన మంది రాలు, తాగునీటి అవసరాలకోసం వినియోగించవచ్చు. డ్రైనేజీల నిర్మాణం, నీటి ట్యాంకులు, బ్రిడ్జిలు, గ్రామ పంచాయతీ భవనాలు, మైనర్ ఫీడర్ చానల్స్, ట్రాన్స్‌ఫా ర్మర్ల మంజూరు తదితర వాటికోసం కూడా వెచ్చించవచ్చు. వీటితో పాటు అదనంగా కళాశాలలు, పాఠశాలల్లో కంప్యూటర్ల కొనుగోళ్ల కోసం నిధులను వినియోగించుకు నే అవకాశం ఎంపీలకు ఉంది. అభివృద్ధి నిధులు ఇలా ఒక్కో నియోజకవర్గానికి కోటి రూపాయల చొప్పున మంజూరైతే అందులోంచి రూ. 50 లక్షల పనులను స్థానిక ఎమ్మెల్యే నేరుగా ప్రతిపాదించవచ్చు. మిగిలిన మొత్తాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి కోటాగా పరిగణిస్తారు. నిబంధనల మేరకు వీటిని కూడా స్థానిక ఎమ్మెల్యే సిఫారసుల మేరకు ఖర్చు చేస్తారు. కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట అధికార పార్టీ ఈ నిధులను దారి మళ్లిస్తోందన్న ఆరోపణలున్నాయి. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సూచించిన పనులను జిల్లా ఇన్చార్జి మంత్రి మంజూరు చేస్తున్న ట్లు తెలుస్తోంది. ఖజానాలోనే జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటి పరిధిలో 2010-11 నుంచి 2012-13 వరకు రూ. 22.50 కోట్ల నిధులు విడుదలయ్యాయి. అయితే ఎమ్మెల్యేలందరూ కలిపి రూ. 16.52 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగతా రూ. 5.98 కోట్ల నిధులు ఖజానాలోనే మూలుగుతున్నాయి. 2013-14 చివరి ఏడాది కావడంతో నిధులు పూర్తి స్థాయిలో మంజూరు కాలేదు. రూ. 4.50 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. అయినప్పటికీ ఆగమేఘాలపై రూ. 6.07 కోట్ల విలువ చేసే 518 పనులను మంజూరు చేశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ద్వితీయ శ్రేణి నాయకులను సంతృప్తి పరిచేందుకు పెద్దమొత్తంలో పనులు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. బోధన్ లాస్ట్ మూడేళ్లలో ఎమ్మెల్యే కోటా నిధుల వినియోగంలో బోధన్ నియోజక వర్గం అట్టడుగు స్థానంలో ఉంది. మూడేళ్లలో రూ. 2.50 కోట్ల నిధులు విడుదల కాగా వివిధ పనులకోసం రూ. 1.19 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మంత్రి కావడంతో వివిధ పథకాల నుంచి భారీగా ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకున్నారని, అందుకే నియోజకవర్గ నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేకపోయారని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ విప్ సైతం తక్కువగా నిధులను వినియోగించారు. బాల్కొండ నియోజకవర్గంలో ఆయన రూ.1.62 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే మాత్రమే కాస్త మెరుగ్గా(రూ.2.18 కోట్లు) నిధులను ఖర్చు చేశారు. నిధులు తక్కువ.. పనులు ఎక్కువ ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది తక్కువగా నిధులు విడుదలయ్యాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గానికి రూ. 50 లక్షల చొప్పున మాత్రమే వచ్చాయి. అయితే ఎమ్మెల్యేలు మాత్రం విడుదలైన నిధులకన్నా ఎక్కువ పనులను మంజూరు చేయడం గమనార్హం. నిజామాబాద్ అర్బన్‌లో రూ. 92 లక్షలతో 57 పనులు మంజూరు చేశారు. నిజామాబాద్ రూరల్‌లో రూ.89.50 లక్షలతో 96 పనులు, ఆర్మూర్‌లో రూ. 50 లక్షలతో 64 పనులు, కామారెడ్డిలో రూ. 95 లక్షలతో 90 పనులు, ఎల్లారెడ్డిలో రూ. 83 లక్షలతో 73 పనులు, బాన్సువాడలో రూ. 73 లక్షలతో 43 పనులు, జుక్కల్‌లో రూ. 50 లక్షలతో 54 పనులను చేపట్టారు. కాగా ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ నియోజకవర్గమైన బాల్కొండలో రూ. 31.50 లక్షలతో 25 పనులు, మంత్రి సుదర్శన్‌రెడ్డి నియోజకవర్గమైన బోధన్‌లో రూ. 44.50 లక్షలతో 16 పనులను మాత్రమే మంజూరు చేశారు. ఎంపీ రూటు సపరేటు నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ మాత్రం ఇందుకు భిన్నంగా నిధులను ఖర్చు చేశారు. నాలుగేళ్లలో ఎంపీ ల్యాడ్స్ కింద రూ. 11.50 కోట్లు విడుదల కాగా.. ఆయన రూ. 13.47 కోట్ల పనులు మంజూరు చేశారు. 2009-10, 2010-11 సంవత్సరాల్లో రూ. 2 కోట్ల చొప్పున రూ. 4 కోట్లు విడుదలయ్యాయి. 2011-12, 2012-13 సంవత్సరాల్లో ఎంపీ ల్యాడ్స్ కింద ఏడాదికి రూ. 5 కోట్ల చొప్పున రూ. 10 కోట్లు విడుదల కావాల్సి ఉండగా.. రూ. 7.50 కోట్లు మాత్రమే వచ్చాయి. నిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గానికి మొత్తంగా రూ. 11.50 కోట్లు విడుదల కాగా 449 పనుల కోసం రూ. 13.47 కోట్ల నిధులను ఖర్చు చేశారు. -
ప్రయాస ప్రయాణం
=వెయ్యికిపైగా గ్రామాలకు నడవని బస్సులు =ప్రయాణాలకు షేర్ఆటోలే దిక్కు =కొన్ని పల్లెల్లో ట్రాక్టర్లే రవాణా సాధనాలు =నిరుపయోగంగా మారిన రోడ్లు =పలుచోట్ల బస్టాండ్లకు వెళ్లని బస్సులు =ప్రారంభానికి నోచుకోని పుంగనూరు ఆర్టీసీ డిపో =మదనపల్లె బస్టాండ్‌లో సౌకర్యాలు కరువు =ఆదాయమే ప్రామాణికం అంటున్న ఆర్టీసీ బస్సులను నడపకపోవడంతో జిల్లాలోని పల్లె జనానికి పాట్లు తప్పడం లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా షేర్ ఆటోలే దిక్కవుతున్నాయి. పొద్దు పోయిందంటే ఇవీ ఉండవు. ఇక కాలినడకన ఇళ్లకు చేరుకోవాల్సిందే. కొన్ని గ్రామాల్లో ట్రాక్టర్లే రవాణా సాధనాలుగా మారాయి. ఇంకొన్ని మార్గాల్లో చాలీచాలని సర్వీసులు నడుస్తున్నాయి. దీంతో జనానికి బస్సుటాప్ ప్రయాణం తప్పడం లేదు. అదే విధంగా పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్టాండ్లకు బస్సులు వెళ్లడం లేదు. ప్రయాణిలు చెట్ల కిందో, దుకాణాల పక్కనో నిలబడి బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. సాక్షి, చిత్తూరు: జిల్లాలోని 1365 పంచాయతీల్లో 3 వేలకుపైగా గ్రామాలు ఉన్నాయి. వీటిలో వెయ్యికిపైగా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఈ క్రమంలో గ్రామాల నుంచి పట్టణాలకు వస్తున్న రైతు లు, విద్యార్థులు, కూలీలు, చిరు వ్యాపారులు నరకం చూస్తున్నా రు. వీరి గోడు ఆర్టీసీ అధికారులకు పట్టడం లేదు. ఆదాయం బాగా వచ్చే మార్గాల్లో మాత్రమే బస్సులు నడుపుతున్నారు. రోడ్ల సౌకర్యం బాగా ఉన్నా ఆదాయం లేదనే కారణంతో పలు మార్గాల్లో బస్సులు నడపడం లేదు. అధికారుల తీరును ప్రశ్నించే ప్రజాప్రతినిధులు కరువవుతున్నారు. మరోవైపు గ్రామగ్రామా నా షేర్ ఆటోలు దర్శనమిస్తున్నాయి. అత్యాశతో ఆటోడ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారు. ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఫలితంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తిరుపతి ఆర్టీసీ రీజియన్ అధికారులు మాత్రం తమ రికార్డుల్లో బస్సుల్లేని గ్రామాలు 20 నుంచి 30 మాత్రమే ఉన్నాయని చెప్పుకుంటున్నారు. పలమనేరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సుమారు 40 గ్రామాలకు బస్సు, ఇతర రవాణా సదుపాయం లేదు. కేసీపెంట, కీలకపల్లె (గంగవరం), బెరైడ్డిపల్లె మండలంలోని ధర్మపురి, వి.కోట మండలంలోని మావట్టూరు, పెద్దపంజాణి మండలంలోని నాగిరెడ్డిపల్లె, లింగాపురం, పలమనేరు మండలంలోని జగమర్ల యానాదికాలనీ తదితర గ్రామాలకు ఎలాంటి రవాణా సదుపాయమూ లేదు. బెరైడ్డిపల్లెలో ఆర్టీసీ బస్టాండ్ వృథాగా ఉంది. అవసరమైన ప్రాంతాల్లో బస్షెల్టర్లు లేవు. సత్యవేడు నియోజకవర్గంలో ఇరుగులం, ఆంబాకం పంచాయతీలకు తారురోడ్లు ఉన్నా ఆర్టీసీ బస్సులు నడపడం లేదు. ఇరుగులం పంచాయతీకి వెళ్లాలంటే నాలుగు కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. మండల కేంద్రానికి పది కిలోమీటర్ల లోపే ఉన్నా పల్లెవెలుగు బస్సులు తిరగడం లేదు. షేర్ ఆటోలే దిక్కుగా ఉన్నాయి. పుంగనూరు నియోజకవర్గంలోని సుమారు 30 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఎక్కువ మందికి షేర్ ఆటోలే ఆధారమవుతున్నాయి. పుంగనూరులో ఆర్టీసీ బస్టాండ్ 15 ఏళ్లుగా నిరుపయోగంగా ఉంది. పుంగనూరులో డిపో కట్టి నాలుగేళ్లు అవుతున్నా ఇంతవరకు ప్రారంభించలేదు. చౌడేపల్లెలో బస్టాండ్ దూరంగా ఉండడంతో బస్సులు వెళ్లడం లేదు. గోతువారిపల్లె, పాలెంపల్లె, ఈడిగపల్లె, పట్రపల్లె తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. షేర్‌ఆటోలు, ట్రాక్టర్లలో జనం ప్రయాణిస్తున్నారు. హస్తి మండలంలోని ముచ్చివేలు, తొండమనాడు మార్గాల్లో బస్సుల సంఖ్య సరిపోవడంలేదు. ఈ క్రమంలో జనం బస్సుల టాప్‌లపై ప్రయాణిస్తున్నారు. తొట్టంబేడు, చియ్యవరం మార్గంలో బస్సులు సక్రమంగా నడవడం లేదు. విద్యార్థులకు బస్సు పాసులున్నా ఆటోల్లో వెళ్లాల్సిన పరిస్థితి. ఏర్పేడు మండలంలోని పరమాలపల్లె, బండివారిపల్లెలకు బస్సు సౌకర్యం లేదు. ఏర్పేడు తదితర ప్రాంతాల్లో బస్టాండ్లు నిరుపయోగంగా ఉన్నాయి. జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం, పెనుమూరు, జీడీ నెల్లూరు, పాలసముద్రం మండలాల్లో ఎక్కడా ఆర్టీసీ బస్టేషన్లు లేవు. ప్రయాణికులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ రోడ్లపైనే బస్సులు ఎక్కుతున్నారు. ఎస్ఆర్.పురం, కార్వేటినగరం మండలాల్లో బస్ షెల్టర్లు శిథిలావస్థలో ఉన్నాయి. పెనుమూరు మండలంలోని ఎస్.రామాపురం, పోలవరం గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి.కొత్తకోట మండలంలో రూ.3.3 కోట్లతో వడిగలవారిపల్లె-మద్దినాయనపల్లె క్రాస్‌కు రోడ్డు వేశారు. అలాగే రూ.1.79 కోట్లతో ఉలవారిపల్లె- కనికలతోపునకు రోడ్డు నిర్మించారు. కురబలకోట మండలం ఎర్రబల్లె నుంచి తిమ్మనవారిపల్లెకు రూ.80 లక్షలతో రోడ్డు వేశారు. అయితే ఈ గ్రామాలకు బస్సులు నడవడం లేదు. నియోజకవర్గంలోని వంద పల్లెలకు బస్సులు వెళ్లడం లేదు. తిరుపతి-చెన్నై, నాగలాపురం రోడ్లు సమీప గ్రామాలకు మిన హా, ఇతర గ్రామాలకు బస్సులు లేవు. బస్సులులేని గ్రామాలు సుమారు 30 ఉన్నాయి. ఈ గ్రామాల వారికి షేర్ ఆటోలే దిక్కుగా ఉన్నాయి. పొద్దు పోయిందంటే జనం కాలినడకన గ్రామాలకు చేరుకోవాల్సిందే. మదనపల్లె: మండలంలో 306 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఈ పల్లెలకు ఆర్అండ్బీ రోడ్లు 8, పంచాయతీరాజ్‌శాఖ రోడ్లు 70 ఉన్నా బస్సులు నడవడం లేదు. మదనపల్లె ఆర్టీసీ డిపోలోని 250 బస్సుల్లో మదనపల్లె చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు 5 మాత్రమే నడుపుతున్నారు. చిత్తూరు బస్టాండ్‌కు ఆర్టీసీ బస్సులు రావడం లేదు. బస్సుల కోసం జనం చెట్ల కింద, దుకాణాల ముందు రోడ్లు నిలుచుకుంటున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో కుర్చీలు లేవు. కుప్పం: డిపోలో 94 సర్వీసులు తిరుగుతున్నాయి. ఇందులో 30 వరకు పాడయ్యాయి. ఇప్పటికీ 120 గ్రామాలకు బస్సు సర్వీసులు లేవు. రామకుప్పం, గుడిపల్లె మండలాల్లోని ఆర్టీసీ బస్టాండ్లు నిరుపయోగంగా ఉన్నాయి. శాంతిపురంలో బస్‌స్టేషన్ నిర్మాణం శంకుస్థాపనకే పరిమితమైంది. రామకుప్పం, కుప్పం మండలాల్లోని పలు పల్లెలకు బస్సు సర్వీసులను రద్దు చేశారు. పూతలపట్టు: నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆర్టీసీ బస్సులు సక్రమంగా నడవడం లేదు. ఐరాల మండలంలోని కాణిపాకం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ ఇంత వరకు ఆర్టీసీ బస్టాండ్ లేదు. పూతలపట్టులో రోడ్డుపక్కనే బస్టాండ్ నిర్మించినా బస్సులు ఆగడం లేదు. ఈ క్రమంలో ప్రయాణికులకు రోడ్లపైనే ఎదురుచూపులు తప్పడం లేదు. డిపోలో 94 సర్వీసులు తిరుగుతున్నాయి. ఇందులో 30 వరకు పాడయ్యాయి. 120 గ్రామాలకు బస్సు సర్వీసులు లేవు. రామకుప్పం, గుడిపల్లె మండలాల్లోని ఆర్టీసీ బస్టాండ్లు నిరుపయోగంగా ఉన్నాయి. శాంతిపురంలో బస్‌స్టేషన్ నిర్మాణం శంకుస్థాపనకే పరిమితమైంది. రామకుప్పం, కుప్పం మండలాల్లోని పలు పల్లెలకు బస్సు సర్వీసులను రద్దు చేశారు. -
మన సింగరేణి మనకే..
=సీమాంధ్ర కుట్రలకు చెల్లు =ముసాయిదా బిల్లుతో తీరిన సందేహం శ్రీరాంపూర్(ఆదిలాబాద్), న్యూస్‌లైన్ : సింగరేణి సంస్థపై 60 సంవత్సరాల నుంచి సాగిస్తున్న సీమాంధ్ర పెత్తందారీతనం ప్రత్యేక రాష్ట్రంతో పటాపంచలు కానుంది. కంపెనీలో ఎలాగైనా వాటా దక్కించుకునేందుకు.. వనరులను యథేచ్ఛగా దోచుకోవాడానికి ఆ ప్రాంత నేతలు చేసిన కుట్రలకు తెలంగాణ ముసాయిదా బిల్లులో చేర్చిన అంశంతో చెక్ పడింది. బొగ్గు గనుల్లో వాటా కావాలని సీమాంధ్ర పెట్టుబడిదారులు, ప్రజాప్రతినిధులు జీఓఎంపై తీవ్రంగా ఒత్తిడి తెస్తూ ఇంతకాలం లాబీయింగ్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణిపై సీమాంధ్రులకు ఎలాంటి హక్కు లేదని.. అది పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందని సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన టి-ముసాయిదా బిల్లులో తేల్చిచెప్పారు. దీంతో సింగరేణి అంతటా హర్షాతిరేకాలు వ్యక్తవుతున్నాయి. ముసాయిదా బిల్లు 12వ షెడ్యూల్లో బొగ్గు గనుల గురించి విశదీకరించారు. సంస్థలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 51 శాతం, భారత ప్రభుత్వానికి 49 శాతం వాటా కొనసాగుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ వాటా 51 శాతం ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర వాటాగా, మిగిలిన 49 శాతం కేంద్ర ప్రభుత్వ వాటాగా పేర్కొన్నారు. దీంతో సింగరేణి సంస్థ పూర్తిగా తెలంగాణ రాష్ట్రానిదేనని తేలిపోయింది. అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న కోల్‌లింకేజీలు మున్ముందు అలాగే కొనసాగించడం జరుగుతుందని.. ఇందులో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు. కొత్త లింకేజీలుంటే కేంద్ర ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. -
జిల్లాలో హై అలెర్ట్
=పజాప్రతినిధుల ఇళ్లకు బందోబస్తు పెంపు =తిరుపతిలో ఐదు కంపెనీలు, చిత్తూరులో 8 కంపెనీల బలగాలు సాక్షి, తిరుపతి : రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో పోలీసులు జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. జిల్లాలో ఆందోళనలు జరిగే అవకాశం ఉండడంతో, తిరుపతి అర్బన్, చిత్తూరు జిల్లాల ఎస్పీలు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద బందోబస్తు పెంచారు. చిత్తూరు పరిధిలో రెండు కంపెనీల సీఆర్పీఎఫ్, రెండు కంపెనీల ఏపీ స్పెషల్ పోలీసు, నాలుగు కంపెనీల సాయుధ బలగాలను అదనంగా దింపారు. అన్ని పోలీస్ స్టేషన్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. చిత్తూరుకు శుక్రవారం అదనపు బలగాలు వస్తున్నట్లు చిత్తూరు రేంజి అదనపు డీజీ ఆదిత్య త్రిపాఠి తెలిపారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్ని ప్రాంతాల్లోనూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతిలో.. తిరుపతిలో ఇప్పటికే పలు విగ్రహాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద 25కు పైగా పికెట్లు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ సభ్యుడు చింతామోహన్ ఇంటి వద్ద ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐలతో కూడుకున్న ప్రత్యేక బృందాన్ని బందోబస్తు నిమిత్తం ఏర్పాటు చేశారు. గతంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో చింతా మోహన్ పాల్గొనక పోవడంతో ఆయనపై సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన నివాసానికి అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర బాబు ఁసాక్షిరూ.తో మాట్లాడుతూ తమ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశామన్నారు. తిరుపతి అర్బన్ పరిధిలో ఐదు కంపెనీల సాయుధ బలగాలు ఇప్పటికే ఉన్నాయని తెలిపారు. మరో రెండు కంపెనీల బలగాలు శుక్రవారం తిరుపతికి చేరుకుంటాయన్నారు. శుక్రవారం నుంచి జిల్లాలో ఆందోళనలు తీవ్రంగా జరిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, శ్రీకాళహస్తిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. -
ఆదుకోనిఆపద్బంధు
=విధివంచితులకు అందని సాయం =దరఖాస్తు చేసుకున్న వారు 76 మంది =పెండింగ్‌లో ఉన్నవి 41... నర్సంపేటలోనే అధికం =ఏడాదిగా ప్రభుత్వ కార్యాలయూల చుట్టూ ప్రదక్షిణలు =కనికరించని సర్కారు... అధికారులు నర్సంపేట, న్యూస్‌లైన్: అనుకోని పరిస్థితుల్లో కుటుంబ పెద్ద చనిపోతే బాధితులకు సాయమందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆపద్భందు పథకం జిల్లావాసులకు అందని ద్రాక్షగా మారుతోంది. పరిశీలన పేరిట ఇన్సూరెన్స్ కంపెనీలు జాప్యం చేస్తుండడం... అధికారుల నిర్లక్ష్యం... ప్రజాప్రతినిధులు అలసత్వం వెరసి ఆపద్బంధు పథకం లక్ష్యం నీరుగారుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 76 వుంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోగా... 29 వుందికే ఆర్థిక సాయం అందింది. ఆరు దరఖాస్తులు తిరస్కరణకు గురి కాగా... ఇంకా 41 దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వ సాయం కోసం నర్సంపేట డివిజన్లో అత్యధికంగా 19 మంది బాధిత కుటుంబాలు ఏడాదిగా ఎదురుచూస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయూలు చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారుు. తక్కువ నిధుల కేటారుయింపు ఆపద్భందు పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ. లక్ష సాయుం అందించాలి. జిల్లాలో ఏటా 400 వుంది వరకు దరఖాస్తు చేసుకుంటున్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. అయితే అధికారులు క్షేత్రస్థాయిలోనే చాలా వరకు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. 40 నుంచి 50 వుందికి మాత్రమే ఇస్తున్నారు. ఆపద్బంధు కింద ప్రభుత్వ కేటారుయింపులు తక్కువగా ఉండడంతో వారు ఆ మేరకే సరిపుచ్చుతున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన దరఖాస్తుదారులకు వురుసటి సంవత్సరం బడ్జెట్లో ఇస్తున్నావుని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నా... జిల్లాలో అటువంటి ఛాయులు కనిపించడంలేదు. సీఎం సహాయనిధికి మళ్లింపు ఆపద్బంధు పథకం అవులులో చిత్తశుద్ధి లోపించడంతో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న విధివంచితులకు ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదు. ఈ పథకం కింద దరఖాస్తు చేసిన వారిని నిధుల కొరతతో సీఎం సహాయు నిధికి వుళ్లిస్తున్నారు. ఫలితంగా వారు ఆపద్భందు పథకానికి అర్హత కోల్పోతున్నారు. రూ. ఐదు వేల నావువూత్రపు సాయమందుతుండడంతో సదరు కుటుంబాలకు అవి ఏవిధంగా ఉపయోగపడడడం లేదు. పత్తి ఏరుతూ కనిపిస్తున్న ఈ వృద్ధురాలు నల్లబెల్లి మండలం కొడైలుపల్లికి చెందిన ఒదెల సమ్మక్క ఆమె భర్త ఈ ఏడాది మే 17న జరిగినరోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఆమెకు ఇద్దరు కొడుకులు... ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరి కూతుళ్ల వివాహం కాగా... పెద్దకొడుకు వరంగల్‌లో టైలర్ పని నేర్చుకుంటున్నాడు. చిన్న కొడుకు ఆటో ట్రాలీ నడుపుతున్నాడు. భర్త చనిపోయిన నాటి నుంచి కుటుంబ పోషణ కష్టంగా ఉండడంతో రోజూ కూలికి పోతోంది. ఆమె ఆపద్బంధు పథకానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ... ఇప్పటివరకు సాయమందలేదు. దీంతో సమ్మక్క వ్యక్తం చేసిన ఆవేదన ఆమె మాటల్లోనే...‘నా పెనిమిటి పోరుున తర్వాత విధి లేక రూ. 50 వేల అప్పు చేశా... ఆపద్బంధు పైసలు వస్తాయని చెబితే ఇన్నాళ్లు ధైర్యంగా ఉన్నా. అవి వత్త లేవు... ఇవి ఎట్లా తీర్చాలో తెలియడం లేదు.’ -
కాగితాల్లోనే 115 కమ్యూనిటీ హాళ్లు
=కాగితాల్లోనే 115 కమ్యూనిటీ హాళ్లు =పైసలున్నా.. పనులు కావు =ఆశించిన కమీషన్లు లేక పట్టించుకోని కార్పొరేటర్లు =పేదబస్తీలపై నిర్లక్ష్యం =కబ్జా చెరలో పాతహాళ్లు సాక్షి, సిటీబ్యూరో : పేదల బస్తీల్లో పుట్టినరోజులు, తదితర చిన్నచిన్న వేడుకలు, చిన్నచిన్న సంఘాల సమావేశాలు జరుపుకోవాలంటే కమ్యూనిటీ హాళ్లే ఆధారం. ఫంక్షన్‌హాళ్ల ఖర్చులు భరించలేని పేదలు పెళ్లిళ్లకు సైతం వీటినే వినియోగిస్తున్నారు. నగరంలోని దాదాపు 1500 బస్తీల్లోని ప్రజలు వేడుకలకు అవసరమైన కమ్యూనిటీ హాళ్లు లేక అల్లాడుతున్నారు. గతంలో ఉన్న ఎంసీహెచ్ కమ్యూనిటీ హాళ్లు కబ్జాల పరమయ్యాయి. చోటామోటా నేతలు వాటిని తమ సొంత ఆస్తుల్లో కలిపేసుకోవడంతో చిన్నాచితకా ప్రజలు వేడుకలు జరుపుకోవాలంటే కుదరడం లేదు. పేదల అవసరాన్ని గుర్తించిన స్థానిక ప్రజాప్రతినిధులు తమ కార్పొరేటర్ల ఫండ్ నుంచి భారీగానే నిధులను మంజూరు చేయించారు. కానీ.. ఆశించిన కమీషన్లు రాకపోవడంతో వాటి గురించి పట్టించుకోవడం లేదు. దాంతో, కమ్యూనిటీహాళ్ల పనులు ముందుకు కదలడం లేదు. కొందరు కాంట్రాక్టర్లే ఎక్కువ పనులు దక్కించుకుంటూ.. తగిన న్ని వనరులు లేక వాటి నిర్మాణాలు పూర్తి చేయడం లేదు. ఇంకొందరు టెండరులో తక్కువ లెస్తో పనులు దక్కించుకున్నప్పటికీ.. అనంతరం గిట్టుబాటు కావడం లేదని చేతులెత్తేస్తున్నారు. ప్రతి పనిలోనూ కార్పొరేటర్లు, అధికారులకు ముడుపులు చెల్లించాల్సి రావడం.. వీటి నిర్మాణాలతో తమకు పెద్దగా ఆదాయం లేకపోవడంతో వారికి ముడుపులు చెల్లించలేక పనులు వదులుకుంటున్నవారు ఇంకొందరు. ఈ నేపథ్యంలో, కాంట్రాక్టులు పొందినవారు నిర్మాణాలు ప్రారంభించి కొద్దిరోజులకే వాటిని వదిలివేయడం.. ఇంకొందరు అసలు పనులే చేపట్టకపోవడం వంటి కారణాలతో కమ్యూనిటీ హాళ్లు కాగితాలను దాటడం లేదు. నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు ఆ చర్యలు తీసుకోవడం లేదు. కార్పొరేటర్లు సైతం రోడ్డు పనులు.. పారిశుధ్య పనులు, డీసిల్టింగ్ వంటి వాటిల్లో వచ్చే కమీషన్లు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాల్లో రాకపోవడంతో వాటిని పట్టించుకోవడం లేదు. 52 డివిజన్లలో మంజూరైన కమ్యూనిటీ హాళ్లు : 117 నిర్మాణ పనులు ప్రారంభించినవి : 2 కేటాయించిన మొత్తం నిధులు : 8.80 కోట్లు వ్యయం చేసినవి : 7.15 లక్షలు -
గిరుల సిరులు
=ఆదివాసీ సంస్కృతిని చాటిన ఉత్సవ్ =పరిరక్షణకు మంత్రి బాలరాజు పిలుపు =పర్యాటక సర్క్యూట్‌గా అరకులోయ ప్రాంతం =అలరించిన సాంసృ్కతిక కార్యక్రమాలు అరకులోయ/అరకురూరల్: మన్యంలోని ఎత్తయిన కొండలు, లోయలు, జలపాతాలు, ఇతర ప్రకృతి సంపదను కాపాడుకుంటూనే సంప్రదాయలను పరిరక్షించుకోవాలని రాష్ర్ట గిరిజన సంక్షేమశాఖ మంత్రి పి. బాలరాజు పేర్కొన్నారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో గురువారం నుంచి మూడురోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవ్‌ను జ్యోతి వెలిగించి మంత్రి ప్రారంభించారు. రంగురంగుల బెలూన్లను ఎగురవేశారు. కార్యక్రమంలో బాల రాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ఐటీడీఏల పరిధిలోని విభిన్న గిరిజన జాతులను ఒకే విదికపైకి తెచ్చి పరిచయం చేస్తున్నామన్నారు. పర్యాటకులను ఉత్సవ్ అలరిస్తుందన్నారు. థింసా నృత్యం గిరిజనులకు వరమన్నారు. తక్కువ ఖర్చుతో ఏటా ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు అన్ని సదుపాయలతో పాటు,భద్రత వాతావరణం కల్పిస్తేనే ఈ ప్రాంతానికి మంచిపేరు వస్తుందన్నారు. సీలేరు,చింతపల్లి,దారకొండ,పాడేరు,అరకు,అనంతగిరి,లంబసింగి ప్రాంతాలను కలుపుతూ పర్యాటక సర్క్యూట్‌గా ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. అరకులోయకు ప్రత్యేకంగా అద్దాల రైలు ఏర్పాటు చేయాలని కేంద్ర ైరె ల్వేశాఖ మంత్రిని కలిసి విన్నవించినట్లు మంత్రి చెప్పారు. వచ్చే ఏడాది ఉత్సవాలనాటికి ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. పాడేరు ఐటీడీఏ పీవో వినయ్‌చంద్ మాట్లాడుతూ అన్ని గిరిజన జాతుల సంస్కృతులకు ఈ ఉత్సవ్ అద్దం పడుతుందన్నారు. గిరిజన కళలు, సంప్రదాయాలు, ఆహారధాన్యాలు దృశ్య మాలికగా ఉంటాయని అభిప్రాయ పడ్డారు. ఉత్సవ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాష్ట్రంలోని వివిధ ఐటీడీఏల పరిధిలోని కళాబృందాలను ఇక్కడకు తీసుకువచ్చారు. అరకులోయ ప్రధాన రహదారితోపాటు ఉత్సవ్ ప్రాంగణం కళాబృందాల ప్రదర్శనలతో నిండిపోయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అరకులోయ సీఐ మురళీరావు ఆధ్వర్యంలో ఎస్ఐలు కె. కుమారస్వామి, రామకృష్ణలు ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారితోపాటు అన్ని కూడళ్లను నిఘా బృందాలు నిశితంగా పరిశీలించాయి. ప్రాంగణంలో పోలీస్ జాగిలాలతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. స్థానికుల భాగస్వామ్యం ఏదీ : ఎమ్మెల్యేసోమ అరకు గిరిజన ఉత్సవ్‌లో స్థానిక గిరిజన ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం లేకపోవడం శోచనీయమని ఎమ్మెల్యే సోమ విచారం వ్యక్తం చేశారు. స్థానిక సర్పంచ్‌ను ఆహ్వానించి ఈ సభకు అధ్యక్షునిగా చేసి ఉంటే బాగుండేదన్నారు. వేదికపై అధికారులు మినహా స్థానిక ప్రజా ప్రతినిధులు లేక పోవడం బాధాకరమన్నారు. వ్యాపారులు, గిరిజన సంఘాలను ఆహ్వానించి ఉంటే మరింత విజయవంతంగా జరిగేదన్నారు. మంత్రికి ఘనస్వాగతం ఉత్సవ్ ప్రారంభోత్సవానికి అరకులోయ వచ్చిన మంత్రి బాలరాజుకు పర్యాటకశాఖ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అరకులోయ ముఖద్వారం నుంచి వివిధ కళాబృందాలతో పాటు థింసా నృత్యాలతో స్వాగతం పలికి వేదిక వద్దకు తోడ్కొని వెళ్లారు. సుమారు కిలోమీటరు దూరం కాలి నడకన కళాకారులతో కలిసి వేదిక వరకు మంత్రి నడుచుకుని వచ్చారు. ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను, సీడ్ ఫెస్టివల్‌ను తిలకించారు. కార్యక్రమంలో పాడేరు ఆర్డీవో గణపతిరావు, డీడీ మల్లికార్జునరెడ్డి, పర్యాటక శాఖ జీఎం భీమశంకర్, పర్యాటకశాఖ అధికారిణి అనిత, కో-ఆర్డినేటర్ మురళీ పాల్గొన్నారు. -
అజాతశత్రువు ఇకలేరు
=రైతు, వ్యాపారవేత్త, రాజకీయవేత్తగా బహుముఖ సేవలు =హాయ్.. అంటూ పలకరించే ఆత్మీయుడు ఇక సెలవంటూ.. =సామాన్యుడి నుంచి అమాత్యుడి వరకు దిగ్భ్రాంతి =నేడు కేఎన్నార్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ నిండైన విగ్రహం.. నుదుట తిలకం.. గంభీరమైన వ్యక్తిత్వం.. నిష్కల్మష మనస్తత్వం.. చెదరని చిరునవ్వు ఆయనకు ఆభరణం.. అన్నా.. తమ్ముడూ.. అమ్మా.. చెల్లీ.. అంటూ ఆప్యాయపు పిలుపు.. కలుపుగోలుతనం.. ఆయన సొంతం.. అందుకేనేమో ఆయన అజాతశత్రువుగా అందరి అభిమానాన్ని చూరగొన్నారు.. ఆయనే జెడ్పీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకుడు కుక్కల నాగేశ్వరరావు (కేఎన్నార్). ఆయన పంచె కడితే రైతు.. సూటు వేస్తే వ్యాపారవేత్త.. ఖద్దరు చొక్కా, ప్యాంటు ధరిస్తే రాజకీయవేత్త.. ఇలా ఒకే జీవితంలో ఇన్ని రంగాల్లో రాణించి విశేష సేవలు అందించిన ఘనకీర్తి ఆయనది. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపించిన కేఎన్నార్ జిల్లాకు అందించిన బహుముఖ సేవలు విశేషం. అలాంటి అజాతశత్రువు ఇకలేరన్న సంగతి తెలుసుకున్న జిల్లా వాసులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. నిద్ర నుంచే శాశ్వత నిద్రలోకి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, బంధువులు, ఆత్మీయులు, మిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. సాక్షి, మచిలీపట్నం : రైతు కుటుంబానికి చెందిన కేఎన్నార్ (57) వ్యాపారవేత్తగా రాణిస్తూనే రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసుకునేలా జెడ్పీ చైర్మన్ పదవిని నిర్వర్తించారు. జిల్లా వైఎస్సార్సీపీలో క్రియాశీలకపాత్ర పోషిస్తున్న ఆయన రాజకీయంగా మరింత రాణిస్తారని అనుకుంటున్న తరుణంలో హఠాన్మరణం చెందారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో జరిగిన వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో కూడా పాల్గొన్నారు. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన బీసీ ప్రజాప్రతినిధుల సదస్సులోనూ పాల్గొని ‘పంచాయతీ నిధులు-విధులు’ అంశంపై దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడారు. అనంతరం మొవ్వ మండలంలోని తన స్వగ్రామం కోసూరు వచ్చిన ఆయన అక్కడ భోజనం చేసి మచిలీపట్నంలోని మాచవరంలో ఉన్న తన కార్యాలయానికి వచ్చి రాత్రి ఒంటి గంట వరకు కంప్యూటర్లో తన మెయిల్స్ చెక్ చేసుకుని అనంతరం నిద్రపోయారు. ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని, షేవింగ్ చేసుకుని నలతగా ఉందని మళ్లీ పడుకున్నారు. గంట వరకు తనను ఎవరూ లేపవద్దని కార్యాలయ సిబ్బందికి చెప్పారు. ఉదయం 9.30 గంటల సమయంలో కార్యాలయ సహాయకుడు సుఖేష్ వెళ్లి ‘సార్ టిఫిన్ తెమ్మంటారా’ అని అడిగాడు. ‘వద్దు.. కాసేపు పడుకుంటా’ అని చెప్పిన కేఎన్నార్ నిద్రపోయారు. సుమారు 10.30 గంటల సమయంలో పార్టీ పెడన కో ఆర్డినేటర్ ఉప్పాల రాంప్రసాద్ అక్కడికి రావడంతో కేఎన్నార్‌ను నిద్రలేపేందుకు కార్యాలయ సిబ్బంది వెళ్లారు. బెడ్రూంలో మంచానికి, బాత్రూంకు మధ్య అపస్మారక స్థితిలో కేఎన్నార్ పడి ఉండటాన్ని గమనించి వెంటనే వైద్యుడిని తీసుకొచ్చారు. అప్పటికే శరీరం చల్లబడి, పల్స్ కొట్టుకోవడం తగ్గిపోవడంతో హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జిల్లా ప్రభుత్వాస్పపత్రి సూపరింటెండెంట్ సూర్యప్రకాశరావు, డాక్టర్లు రంగరాజన్, వీరంకి రామ్మోహన్, అల్లాడి శ్రీనివాస్, వినయ్‌కుమార్‌లు పరీక్షలు చేసి కేఎన్నార్ గుండెపోటుతో మృతి చెందారని నిర్ధారించారు. తరలివచ్చిన నేతలు... కేఎన్నార్ మృతి విషయాన్ని తెలుసుకుని మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావు, జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి, జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు, ఆర్డీవో పి.సాయిబాబు, జెడ్పీ సీఈవో పి.సుబ్బారావు, మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు, మాజీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, బూరగడ్డ వేదవ్యాస్, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రొండి కృష్ణ, సింహాద్రి రమేష్, ఉప్పాల రాంప్రసాద్, యాసం చిట్టిబాబు, మాదివాడ రాము, నందమూరు శ్రీనివాస్ రత్నాకర్, షేక్ సలార్‌దాదా, బొర్రా విఠల్, కొల్లు రవీంద్ర, బచ్చుల అర్జునుడు, మేకల కుమార్‌బాబులతో పాటు వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆయన మరణవార్త తెలుసుకున్న బంధువులు, మిత్రులు, పార్టీ శ్రేణుల రోదనలతో ఆస్పత్రి ఆవరణ మార్మోగింది. అమ్మ ఒడి నుంచి.. అంతర్జాతీయ స్థాయికి.. అమ్మ ఒడిలో పంచుకున్న అప్యాయతలను మరిచిపోకుండా కేఎన్నార్ అందరితోను అదే అప్యాయతానురాగాలతో మెలిగేవారు. రైతు కుటుంబానికి చెందిన ఆయన స్వశక్తితో ఎదిగి వ్యాపారవేత్తగా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవారు. మొవ్వ మండలం కోసూరు గ్రామానికి చెందిన కుక్కల నాగేశ్వరరావు కుటుంబానికి రాజకీయాలతో అనుబంధం ఉంది. కేఎన్నార్ తల్లి కె.అమ్మగారు కోసూరు సర్పంచ్‌గా విశేష సేవలందించారు. ఎస్కే షిప్పింగ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేసి విశాఖపట్నం ఓడరేవులో సరకులు దిగుమతి చేసుకునే కాంట్రాక్టు పనులను చేస్తూ వ్యాపారవేత్తగా ఎదిగారు. మనదేశంలోని పలు రాష్ట్రాలతో పాటు చెన్నై తదితర దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించారు. 2004లో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిగా మెలిగిన ఆయన 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పిలుపుతో కాంగ్రెస్‌లో చేరారు. అటు తరువాత మొవ్వ జెడ్పీటీసీ సభ్యునిగా గెలుపొంది జెడ్పీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. జెడ్పీ చైర్మన్‌గా ఆయన పదవీకాలంలో 49 మండలాలు ఉన్న జిల్లాలో ఒక్కొక్క మండలంలో రూ.5 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. 2006 జూలై 23 నుంచి 2011 జూలై 22 వరకు ఆయన జెడ్పీ చైర్మన్‌గా కొనసాగారు. ఆయన హయాంలోనే జిల్లా పరిషత్‌కు ఐఎస్వో-9001-2000 అవార్డు దక్కింది. ఆయన హయాంలోనే జిల్లా పరిషత్ ఆవరణలో వైఎస్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను పట్టించుకోకపోవటంతో వైఎస్సార్ సీపీ వైపు మొగ్గుచూపారు. వైఎస్ మాదిరిగా పరిపాలన చేయాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమని భావించిన కేఎన్నార్ 2012 సెప్టెంబర్ 13న పామర్రులో జరిగిన సభలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఎక్కడైనా రెడీ... వ్యాపార, రాజకీయ రంగాల్లో నిత్యం బిజీగా ఉండే కేఎన్నార్ ఒంగోలు గిత్తల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా ఒంగోలు గిత్తల పోటీలు, అందాల ప్రదర్శనలు జరిగితే చాలు అక్కడ తన గిత్తలతో ఆయన పోటీకి రెడీ. సుమారు 25 ఏళ్లుగా ఒంగోలు జాతి పశుపోషణను ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కొనసాగించిన ఆయన తన గిత్తలను పోటీకి దించితే విజయం దక్కాల్సిందే. ఆయన ఒంగోలు ఎద్దు దేశస్థాయి చాంపియన్‌గా నిలిచి ‘ద్రోణాచార్య కోడె’గా అవార్డు పొందింది. అది రెండేళ్ల క్రితం చనిపోయింది. మహానందిలో ఏటా నిర్వహించే భారీ పోటీల్లో గత ఏడాది అత్యధిక ప్రైజ్‌మనీ, బహుమతి సాధించిన రికార్డును ఆయన ఎడ్లు దక్కించుకున్నాయి. టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన భూమన కరుణాకర్‌రెడ్డి చేతులమీదుగా ఉత్తమ గోసంరక్షక అవార్డును అందుకున్నారు. బెస్ట్ సోషల్ వర్కర్‌గా శాసనమండలి చైర్మన్ చక్రపాణి నుంచి ఇందిరా ప్రియదర్శిని అవార్డును స్వీకరించారు. పాలకుల తప్పిదాల వల్లే ఒంగోలు జాతిని కాపాడుకోలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేసేవారు. ఎంతో విశిష్టత, ప్రత్యేకత కలిగిన ఒంగోలు జాతి పశువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెబుతుండేవారు. రాష్ట్ర ఒంగోలు జాతి పశుపోషక పెంపకందారుల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఆయన ఒంగోలుజాతి ఎద్దుల పోటీల్లో తన ఎద్దులను బరిలో దించటమే కాక గిత్తల అందాల ప్రదర్శన, బండలాగుడు, సవారీ పందాల్లోనూ ముందుండేవారు. ఒంగోలు గిత్తల పోటీలు, సంరక్షణకు దివంగత వైఎస్ ఎంతో కృషి చేశారని ఎప్పుడూ గర్వంగా చెప్పే కేఎన్నార్ మృతి ఒంగోలు జాతి సంరక్షణకు తీరనిలోటని చెప్పకతప్పదు. ప్రతిమాటకు ముగింపు గా ఇకపోతే.. అనే ఊతపదాన్ని వాడే ఆయన ఇకలేరని తెలిసిన వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు. శుక్రవారం కోసూరులోని కేఎన్నార్ వ్యవసాయ భూమిలోనే ఆయన అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు. అంత్యక్రియలకు ప్రముఖుల రాక కలెక్టరేట్ : కేఎన్నార్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులు శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి, రెవెన్యూశాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ లాం తాంతియా కుమారి, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు శుక్రవారం ఉదయం కేఎన్నార్ స్వగ్రామమైన కోసూరు చేరుకుని కేఎన్నార్ అంత్యక్రియల్లో పాల్గొంటారు. -
మరో 15 మండలాల్లో కరువు
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలోని మరో 15 మండలాల్లో కరువు ఛాయలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో మూడో విడత జాబితా కింద తాజాగా గుర్తించిన మండలాల వివరాలను కలెక్టర్ కె.రాంగోపాల్ ప్రభుత్వానికి సోమవారం రాత్రి ప్రతిపాదనలు పంపారు. ఫలితంగా జిల్లాలో కరువు మండలాల సంఖ్య 37 నుంచి 52కు చేరుకుంది. తొలి విడతగా 14 మండలాల్లో కరువు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 7న తుది జాబితాను ప్రభుత్వానికి పంపారు. తర్వాత మరో 23 మండలాల్లో కరువు ఛాయలు ఉన్నట్లు గర్తించిన అధికారులు ఈ నెల 11న రెండో జాబితా కింద పంపారు. తాజాగా సోమవారం రాత్రి మరో 15 మండలాల్లో కరువు నెలకొన్నట్లు మూడో జాబితా కింద ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో 66 మండలాలకుగాను 52 మండలాల్లో ఇప్పటి వరకు కరువు ఛాయలు నెలకొన్నట్లు అధికారులు గుర్తించారు. మూడో జాబితాలోని మండలాలివే ఎర్రావారిపాళెం, కురబలకోట, ఐరాల, పలమనే రు, సదుం, వి.కోట, గుర్రంకొండ, గంగవరం, పెనుమూరు,పాకాల, కార్వేటినగరం, బి.ఎన్.కండ్రిగ, చిత్తూరు, బంగారుపాళెం, పెద్దమండ్యం. మూడుసార్లు ఎందుకు పంపారు? శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా జిల్లాలోని కరువు మండలాలను గుర్తించడంలో అధికారులు విఫలమైనట్లు తెలుస్తోంది. కరవు పరిస్థితులు నెలకొన్న ప్రతి ఏటా ఒకటి లేక రెండు దఫాలుగా కరువు మండలాల జాబితాలను ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపుతుంది. అయితే ఈ ఏడాది మూడు దఫాలుగా కరువు మండలాల జాబితాలను ప్రభుత్వానికి నివేదించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరువు మండలాలను గుర్తించడంలో ప్రమాణాలు పాటించడం, తగిన సమయంలో వివిధ రకాలైన సర్వేలు చేపట్టాల్సి ఉంది. రెవెన్యూ, గణాంకాధికారులు, వ్యవసాయశాఖలు సంయుక్తంగా మండల స్థాయిలో నెలకొన్న కరువు పరిస్థితులను గుర్తించాల్సి ఉంది. తొలుత రెవెన్యూ అధికారులు పలు మండలాల్లో కరువు ఛాయలు నెలకొన్నట్లు గుర్తించాలి. దీనిని నిర్ధారించేందుకు గణాంకాధికారులు పంటకోత ప్రయోగాలను నిర్వహించాలి. అయితే ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా అధికారులు ఉద్యమబాట పట్టడంతో పంటకోత ప్రయోగాలను చేపట్టడంలో ఆలస్యమైంది. అలాగే కరువు మండలాలు గుర్తించడంలో వ్యవసాయాధికారుల పాత్ర నామమాత్రంగా మారినట్లు సమాచారం. పంట సాగు, దిగుబడి తదితర వివరాలను అందించడంలో వ్యవసాయాధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు కారణమా? దశలవారీగా కరువు మండలాలను ప్రకటించడంలో రాజకీయ ఒత్తిళ్లూ ఒక కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తమ నియోజకవర్గాల్లోని మండలాల ను కరువు ప్రాంతాలుగా ఎంపిక చేసేందుకు ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెచ్చారనే విమర్శలు లేకపోలేదు. అయితే ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన మండలాల్లో పంట నష్టపోయిన రైతులకు సాధారణ ఎన్నికలలోపు ప్రయోజనం చేకూర్చుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ 14 మండలాలు ఏ పాపం చేశాయి.. జిల్లాలో 66 మండలాలకుగాను ఇప్పటివరకు 52 మండలాల్లో కరువు ఛాయలు నెలకొన్నట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన 14 మండలాలపై సవతి ప్రేమ చూపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మండలాలన్నీ టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉండడమే కారణంగా తెలుస్తోంది. ఈ జాబితాలో రామసముద్రం, శ్రీకాళహస్తి, ఏర్పేడు, సత్యవేడు, నారాయణవనం, వరదయ్యపాళెం, నాగలాపురం, పిచ్చాటూరు, నగరి, పుత్తూరు, వడమాలపేట, నిండ్ర, విజయపురం, పెద్దపంజాణి మండలాలు ఉన్నాయి. ఇక్కడ వర్షపాతం అధికంగా ఉందని, పంటలకు నష్టం జరగలేదనేది అధికారుల వాదనగా ఉంది. -
ఒకే టెండర్!
11 పనులను ఒక్కడికే కట్టబెట్టే పన్నాగం =మేడారం జాతర పనుల్లో రూ. 9.52 కోట్లకు ఎసరు =కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారుల కుమ్మక్కు =10 శాతం ఎక్సెస్‌కు దక్కేలా పావులు =ప్రొసీడింగ్స్ రాకముందే ఒప్పందం ఖరారు తిన్న పాణం ఊరుకోదుగా... అందుకే ఆనవాయితీని కొనసాగించేందుకు పెద్దలు రంగం సిద్ధం చేశారు. మేడారం జాతర నిధులను దిగమింగేందుకు కుమ్మక్కు తంత్రానికి తెరతీశారు. మైనర్ ఇరిగేషన్ శాఖలోరూ. 9.52 కోట్ల పనులకు టెండర్ వేశారు. చిన్న, పెద్ద పనులనే తేడా లేకుండా అన్నింటికీ ఒకే టెండర్ పిలిచేలా... ఆ ఒక్కడికే కట్టబెట్టేలా జిల్లా యంత్రాంగంపై ఒత్తిళ్లు మొదలుపెట్టారు. ఇదే అదునుగా కక్కుర్తి పడ్డారో... ఏమో గానీ అతగాడికి పది శాతం ఎక్సెస్‌కు టెండర్ కట్టబెట్టేలా అధికారులు పావులు కదుపుతున్నారు. ములుగు, న్యూస్‌లైన్ : మేడారం మహాజాతరలో కక్కుర్తి పనులకు తెరతీశారు. కాంట్రాక్టర్లు.. ప్రజాప్రతినిధులు.. అధికారులు కుమ్మక్కై జాతరలో ప్రధాన భూమిక పోషించే స్నానఘట్టాల నిధులపై గురి పెట్టారు. సమయం ముంచుకొస్తుందనే సాకుతో మైనర్ ఇరిగేషన్ శాఖ పనుల్లో షార్ట్ టెండర్‌కు తెరలేపారు. ఈ శాఖ పరిధిలో చేపట్టే సుమారు 11 పనులకు ఒకే టెండర్ పిలిచేందుకు రంగం సిద్ధం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుండి 15వ తేదీ వరకు మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మహాజాతర జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జాతరఅభివృద్ధి పనులకు రూ. 90 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో మైనర్ ఇరిగేషన్ శాఖకు రూ. 9.52 కోట్లు కేటాయించింది. వీటితో జంపన్నవాగుపై స్నానఘట్టాల నిర్మాణం, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, తదితర పనులు చేపట్టాలి. నిబంధనల ప్రకారం రూ. ఐదు లక్షలకు పైబడి విలువైన పనులను టెండర్ పద్ధతిన కట్టబెట్టాలి. ఆ లోపు పనులను నామినేషన్ పద్ధతిన కేటాయించాలి. ఈ లెక్కన 11 పనులకు వేర్వేరుగా టెండర్ పిలవాల్సి ఉన్నప్పటికీ... అధికారులు ఒక్కడికే కట్టబెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. విడివిడిగా పనులు అప్పగిస్తే.. పనుల పర్యవేక్షణ సులువు కావడంతోపాటు త్వరగా పూర్తయ్యే అవకాశమున్నప్పటికీ... వారు ఒకే టెండర్ నిర్వహణకు నిర్ణయం తీసుకోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటి కలెక్టర్ చీవాట్లు పెట్టినా... గత జాతర సమయంలో అప్పటి కలెక్టర్ రాహుల్‌బొజ్జా వేర్వేరుగా టెండర్లు పిలవాలని మైనర్ ఇరిగేషన్ (ఎంఐ) అధికారులను ఆదేశించారు. ఒకే టెండర్ నిర్వహణపై సమీక్ష సమావేశాల్లోఆయన చీవాట్లు పెట్టినా... వారు పట్టించుకోలేదు.. తీరా సమయం దగ్గరపడడంతో చేసేదేమీలేక ఒకే టెండర్‌కు రాహుల్ బొజ్జా అయిష్టంగా ఒప్పుకున్నారు. ఇప్పడు ఆయన బదిలీ కావడం... కొత్త కలెక్టర్ రావడంతో మళ్లీ పాత కథనే కొనసాగించేందుకు అధికారులు సమాయత్తమవడం విశేషం. కాంట్రాక్టర్ల రింగ్ జిల్లాలోని క్లాస్ వన్ కాంట్రాక్టర్లు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ నిర్మాణంలో అనుభవమున్న వారు మాత్రమే టెండర్లో పాల్గొనేందుకు అర్హులు. ఈ మేరకు జిల్లాకు చెందిన ముగ్గురు కాంట్రాక్టర్లు మాత్రమే అర్హులుగా ఉన్నారు. పొరుగు జిల్లా కాంట్రాక్టర్లను స్థానికేతరులు అనే సాకుతో ఇక్కడ టెండర్ వేయనీయకుండా ‘పెద్దసార్ల’తో బెదిరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక జిల్లాకు చెందిన వారు టెండర్లలో రింగ్ అయి ప్రతి జాతరలోనూ ఆ ఒక్కడికే కాంట్రాక్ట్ దక్కేలా సహకరిస్తున్నారు. ఈ సారీ కూడా ఆయనకే మళ్లీ పనులు దక్కేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇబ్బందులే.. జాతరలో మైనర్ ఇరిగేషన్ పనులను ఒకే కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడం ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. గత జాతరలే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.. చిన్న.. పెద్ద పనులన్నీ ఒకే కాంట్రాక్టర్ చేయాల్సి రావడంతో జాతర రేపు మాపు వరకు కూడా కొనసాగాయి. దీంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అంతేకాదు... పనులో నాణ్యతాలోపం కొట్టొచ్చినట్లు కనబడింది. విడివిడిగా టెండర్లు పిలిస్తే ఎక్కువ మంది కాంట్రాక్టర్లు రంగంలోకి దిగి.. లెస్‌కు పలికే అవకాశం ఉంది. ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరనున్నప్పటికీ... అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అందుకేనేమో... మైనర్ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో 1,192 మీటర్ల మేర స్నాఘట్టాల నిర్మాణం, కొత్త బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ఏర్పాటు, పాత బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, పాత ఇన్‌ఫిల్టరేషన్ బావుల మరమ్మతు, కొత్తవాటి ఏర్పాటు, ఇసుక తరలింపు, లెవలింగ్, జంపన్నవాగులో క్రాస్బండ్ల నిర్మాణం, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదుల నిర్మాణం, స్నానఘట్టాల వద్ద బారికేడ్లు, క్లోరినేషన్ తదితర పనులు చేయనున్నారు. ఇవన్నీ ఒకరు చేస్తే.. అతడికి ఏమైనా మిగలడంతోపాటు తమకూ పెద్దమొత్తంలో అందే అవకాశముందని భావిస్తున్న అధికారులు ఒకే టెండర్ నిర్వహణకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు భక్తులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఈ పనులకు విడివిడిగా టెండర్లు పిలిచేలా చర్యలు చేపట్టాలని... నాసిరకం పనులకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని వారు కోరుతున్నారు. ఒకటే టెండర్... ఎంఐ శాఖ పరిధిలోని జాతర పనులన్నింటికీ ఒకే షార్ట్ టెండర్ పిలువనున్నాం. జాతరకు సమయం దగ్గరపడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నాం. పనులకు సంబంధించి ఇంకా ప్రొసీడింగ్స్ వెలువడలేదు. రేపోమాపో వెలువడగానే టెండర్ పిలిచేందుకు చర్యలు తీసుకుంటాం. - రామకృష్ణాచార్యులు, డీఈ, మైనర్ ఇరిగేషన్ -
మమ అనిపిస్తున్నారు..
=తూతూమంత్రంగా ‘రచ్చబండ’ సభలు =లబ్ధిదారుల చేతికందని పింఛన్లు, రేషన్ కూపన్లు =స్థానిక సమస్యలపై వినతుల వెల్లువ =ప్రచారం తప్ప ఒరిగిందేమీ లేదంటున్న విపక్ష నేతలు సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ ప్రచార ఆర్భాటానికి మినహా రచ్చబండ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఒనగూరే ప్రయోజనమేమీ లేదని పలువురు ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. శనివారం నగరంలోని నాలుగుప్రాంతాల్లో మూడోవిడత రచ్చబండ కార్యక్రమాలు తూతూమంత్రంగా జరిగాయి. గత కార్యక్రమాల్లో స్వీకరించిన దరఖాస్తులకు లబ్ధిదారులకు తాజా రచ్చబండలో పెన్షన్లు, రేషన్ కార్డులిస్తామని చెప్పిన అధికారులు కొద్దిమందికి మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో ఎంతో ఆశగా వచ్చిన పలువురు లబ్ధిదారులు ఒట్టి చేతులతో నిరాశగా వెనుదిరిగారు. చంచల్‌గూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగిన రచ్చబండ కార్యక్రమాన్ని టీడీపీ కార్పొరేటర్లు సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి,అస్లాంలు అడ్డుకున్నారు. గత రచ్చబండలో దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంతమందికి అర్హులకు లబ్ధిచేకూరిందో వివరాలు తెలపాలని అధికారులను,ఎమ్మెల్యేను నిలదీయడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. సోమాజిగూడలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పలువురు స్థానికులు మాట్లాడుతూ..గతంలో జరిగిన రచ్చబండలో దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఇప్పటివరకు పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి మంత్రి దానం నాగేందర్ డుమ్మా కొట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెస్ట్‌మారేడుపల్లి నెహ్రూనగర్ కమ్యూనిటీహాల్లో జరిగిన కార్యక్రమాన్ని కేవలం అరగంటలో ముగించి ఎమ్మెల్యే శంకర్రావు వెళ్లిపోయారు. నేతలు ఏమన్నారంటే.. కాచిగూడలోని ఏకేభవన్లో నిర్వహించిన రచ్చబండలో పాల్గొన్న ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రోడ్లపై చెత్త పేరుకుపోయి దుర్వాన వస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ దిడ్డి రాంబాబు మాట్లాడుతూ పింఛన్ల పంపిణీ సంక్రమంగా జరగడం లేదని..దీంతో వృద్ధులు, వికలాంగులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. పెన్షన్ అక్రమాలపై అధికారులు స్పందించి బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. సలీంనగర్ కార్పొరేటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రచ్చబండ వల్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారేకానీ ప్రజలకు ఒరిగిందే మీ లేదన్నారు. రచ్చబండ..ముఖ్యమంత్రి ప్రచారానికే పరిమితమైందని జీహెచ్ఎంసీ టీడీపీ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ప్రజలకు ఇళ్లను కేటాయించపోవడం సరికాదన్నారు. గత రచ్చబండలో తీసుకున్న దరఖాస్తులను అధికారులు బుట్టదాఖలు చేశారన్నారు. -
‘కొట్టుకుపోయిన’ హామీలు
=కోటలు దాటుతున్న మంత్రుల హామీలు =రూ.100 కోట్ల ప్రతిపాదనలు బుట్టదాఖలు =బలహీనమైన కరకట్టలు, గట్లతో వరద ముప్పు =పూడికతో సామర్థ్యం తగ్గుతున్న జలాశయాలు =శాశ్వత నిర్మాణాలపై దృష్టి పెట్టని నేతలు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : భారీ వర్షాలు జిల్లాలో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. బాధితులను ఆదుకుంటామంటున్న అమాత్యుల మాటలు కోటలు దాటుతున్నాయి. హామీలకు అంతులేకుండా పోతోంది. వరద నీరు గ్రామాల్లోకి ఉప్పొంగకుండా చేపట్టాల్సిన నిర్మాణాల ప్రతిపాదనలపై మాత్రం మంత్రులు నోరు మెదపడం లేదు. ప్రభుత్వం వద్ద ఉన్న రూ.100 కోట్ల విలువైన ప్రతిపాదనల ఫైలును కదిలించే ప్రయత్నం చేస్తామని చె ప్పడం లేదు. జల్, లైలా, నీలం, తాజాగా అల్పపీడనం.. ఇలా పేరు ఏదైనా ఏటా భారీ వర్షాలకు జిల్లా కుదేలవుతూనే ఉంది. కాలువలు, చెరువుల్లో పూడికలు తొలగించకపోవడం, శాశ్వత ప్రాతిపదికన పటిష్ట చర్యలు చేపట్టకపోవడంతో వర్షాలప్పుడు ప్రతిసారి గండ్లు పడుతూ వరద నీరు ఊళ్లను ముంచెత్తుతోంది. గట్లు, కరకట్టల నిర్మాణాలకు సుమారు రూ.100 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. శారద, తాండవ, వరాహ జలాశయాలకు రూ.26 కోట్లు మంజూరు చేస్తామని అప్పట్లోనే ముఖ్యమంత్రి హామీ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు రూపాయి కూడా విడుదల చేయలేదు. గతంలో పొలాల్లో వేసిన ఇసుక మేటల్ని ఇప్పటికీ తొలగించలేదు. తాజాగా వర్షాలకు మళ్లీ పొలాల్లోకి వరద నీరు చేరింది. ఏటా వరదలకు వందల గ్రామాలు మునుగుతున్నా.. జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి.బాలరాజు ఈ విషయాలపై కనీసం దృష్టి సారించడం లేదు. భారీగా నష్టం జరిగిన తరువాత మాత్రం మంత్రులిద్దరూ సమీక్షలు, పర్యటనలు పేరుతో హడావుడి చేస్తున్నారు. ప్రజలను ఏమార్చడానికి హామీలు గుప్పిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం జిల్లా అధికారులు నిర్లక్ష్యం కూడా గ్రామీణులను వెంటాడుతోంది. ప్రధానంగా జలాశయాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో వేలాది క్యూసెక్కుల నీరు వృథాగా పోతూ సమీప గ్రామాలను ముంచేస్తోంది. జిల్లాలో తాండవ, రైవాడ, కోనాం, వరాహ, గంభీరంగెడ్డి, మేహాద్రిగెడ్డ, పెద్దేరు జలాశయాలున్నాయి. ఏటా వర్షాలు కురిసినప్పుడు వీటి నుంచి భారీగా నీటిని విడిచిపెడుతున్నారు. జలాశయాల్లో పూడిక తీయకపోవడం వల్ల వీటి ల్లో నీటి నిల్వల సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. కొన్నేళ్లలో ఒక్కసారిగా కూడా పూడిక తీసిన సందర్భాలు లేవు. ఏమాత్రం ఇన్‌ఫ్లో వచ్చి పడినా జలాశయాలు నిండిపోయి ప్రమాదస్థాయికి చేరుతున్నాయి. అలాంటప్పుడు నీటి విడుదలతో లోతట్టు ప్రాంతాల్లోని కింది గ్రామాలు మునుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా పూడికతీతపై మాత్రం దృష్టి సారించడం లేదు. జిల్లాలో నదీ, జలాశయాల కాలువల పరిస్థితి దారుణంగా మారింది. ఏటా వర్షాలకు తీవ్రంగా దెబ్బతింటున్న వాటిని అప్పటికప్పుడు తాత్కాలికంగా పూడ్చడమే గానీ శాశ్వత నిర్మాణాలు కానరావడం లేదు. నదీ పరీవాహక ప్రాంతాల్లో రెండువైపులా ఎత్తుగా గట్టు నిర్మించాల్సి ఉంది. శాశ్వత ప్రాతిపదికన కాంక్రీట్‌తో కాలువలను నిర్మించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ప్రతిపాదనలు లేవు. మట్టితో కాలువలు ఉండటంతో గండ్లు పడుతూ గ్రామాల్లోకి వరద నీరు పోటెత్తుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వరద నష్టాన్ని తగ్గించి గ్రామాలు, పొలాల్లోకి వరద నీరు చేరకుండా ఉంటాలంటే విధిగా శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టాలి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఈ విషయంపై దృష్టి సారించి భవిష్యత్తులో గ్రామాలు మునిగిపోకుండా చెరువులు, కాలువుల గట్లను శాశ్వత ప్రాతిపదికన నిర్మించే ఏర్పాట్లు చేయాలని గ్రామీణులు కోరుతున్నారు. -
జనం నీళ్లల్లో.. మంత్రులు ఇళ్లల్లో..
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : నాలుగు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షంతో జనజీవనం అతలాకుతలమవుతున్నా మన జిల్లా ప్రజాప్రతినిధులు పత్తాకు లేరు. కష్టాల కండగండ్లలో చిక్కుకున్న వారిని ఆదుకునేందుకు నేతలకు తీరికలేకుండా పోయింది. చేతికొచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతిని విలపిస్తున్న అన్నదాతను ఓదార్చే దిక్కు కరువైంది. పూర్తిగా అధికారులు, ఇతర సిబ్బందిపైనే భారం మోపి ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 1,3,423 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ, మిరప, వరి తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 300 ఇళ్లు కూలిపోయాయి. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. సారయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పునియోజకవర్గ పరిధిలో రాధమ్మ అనే మహిళ గోడకూలి మృతిచెందింది. పలు కాలనీలు, ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకుని జనం బిక్కుబిక్కుమంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రైతులను, ప్రజలను ఓదారుస్తూ అధికారుల్లో చలనం తీసుకొచ్చి అవసరమైన చర్యలు చేపట్టడంలో భాగస్వామ్యం కావాల్సిన నాయకులంతా జాడలేకుండా పోయారు. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్, రాష్ర్ట మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, వర్ధన్నపేట, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, మాలోతు కవిత ఇప్పటి వరకు బాధితులను పలకరించిన పాపాన పోలేదు. టీడీపీ నేత, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కొడకండ్ల, రాయపర్తి మండలాల్లో పర్యటించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క కొత్తగూడ మండలంలో, నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి ఖానాపురం మండలంలో పర్యటించారు. డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ మాత్రం జాడలేకుండా పోయారు. టీఆర్ఎస్కు చెందిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ నియోజకవర్గంలోని జలదిగ్బంధ కాలనీల్లో పర్యటించారు. బాధితులకు మంచినీరు, భోజనవసతి ఏర్పాటు చేశారు. పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి గీసుకొండ మండలంలోని మచ్చాపూర్‌లో పర్యటించి రైతులను ఓదార్చారు. ఇక స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య పార్టీ ఎమ్మెల్యేల బృందం పర్యటనలో వరంగల్ మార్కెట్, నర్సంపే ట, గీసుగొండ ప్రాంతాల్లో పాల్గొన్నారు. తన నియోజకవర్గంలో ఇంకా అడుగిడలేదు. కొందరు ప్రజాప్రతినిధులు ఢిల్లీలో ఉంటే మరికొందరు హైదరాబాద్, జిల్లా కేంద్రానికే పరిమితమయ్యారు. నియోజకవర్గాల పర్యటనకు దూరం గా ఉన్నారు. జిల్లాలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు మినహా ఇతరత్రా ప్రజాప్రతినిధులెవరూ లేరు. పరిస్థితి సర్పంచ్ల స్థాయిలో లేదు. స్పందించాల్సిన మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కనీసం స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు రైతు సంఘాలు, ప్రజాసంఘాలు, అక్కడక్కడ టీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలకు చెందిన స్థానిక నాయకులు మాత్రం పర్యటించి రైతులకు కొంతైనా భరోసా కల్పిస్తున్నారు. ఇకనైనా మన ప్రజాప్రతినిధులు స్పందించి, బాధితులకు అండగా నిలిచేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
హై కమాండ్‌ను తిడుతూ.. జై సమైక్యాంధ్ర మంత్రం
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి : పార్టీ పుణ్యమాని తాము ప్రజలకు దూరమయ్యామనే విషయం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు తెలిసొచ్చింది. రాజకీయ భవిష్యత్ చిత్రం 3డీ స్థాయిలో కళ్లెదుటే వీరిని కలవరపెడుతోంది. పార్టీని నమ్ముకుంటే నిండా మునిగినట్టేననే భయం పార్టీ కింది స్థాయి శ్రేణుల్లోనూ ఆవహించింది. ఈనేపథ్యంలో మండల, గ్రామ, డివిజన్ స్థాయి నాయకులు, కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలి? 2009 ఎన్నికల్లో గెలిచిన వారు, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారందరి మనసులో ఈ ప్రశ్న అలజడి సృష్టిస్తోంది. ఆలస్యం చేస్తే మరింత నష్టపోతామని గ్రహించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోనియాను తిడుతూనే మరో వైపు జై సమైక్యాంధ్ర అంటున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై సీమాంధ్ర ప్రజల్లో తిరుగుబాటు రాదనే అభిప్రాయంతో హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి వుంటామని వీరంతా వీర విధేయత ప్రకటించారు. ఒక వేళ జనం ఉద్యమించినా తీవ్ర స్థాయిలో వుండదని అంచనా వేశారు. అంచనాలు తల్లకిందులు అయ్యాయి. అన్ని వర్గాల వారు భాగస్వాములయ్యారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతామని జనం బాహాటంగానే చెబుతున్నారు. దీంతో చోటా నేతలు, కేడర్ కూడా సమైక్యాంధ్రకు కట్టుబడిన పార్టీవైపు పరుగులు తీసేందుకు మానసికంగా సిద్ధమవుతున్నారు. కొందరైతే తమ నాయకులకు ఈ విషయం కుండబద్ధలు కొట్టి మరీ చెప్పారు. దీంతో నేతల్లో అంతర్మథనం మొదలైంది. ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు దారులు వెదుక్కునే పనిలో పడ్డారు. ఆశించిన పార్టీలో బెర్తులు ఖరారు కాని వారు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయం కేడర్‌కు చెబితే వారు చేజారిపోయే ప్రమాదం కనిపిస్తోంది. దీంతో తొందరపడి పార్టీ మారొద్దనీ, సమష్టిగా నిర్ణయం తీసుకుందామంటూ బుజ్జగించే పనిలో పడ్డారు. యలమంచిలి శాసనసభ్యుడు రమణమూర్తి రాజు తొందరపడి పార్టీ మారవద్దనీ కలిసే నిర్ణయం తీసుకుందామని కార్యకర్తలను కోరారు. విశాఖ వెస్ట్ ఎమ్మె ల్యే మళ్ల విజయప్రసాద్ బుధవారం కార్యకర్తల సమావేశం నిర్వహించి కార్యకర్తల అభీష్టం మేరకే నడుకుంటాననీ, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కేడర్‌కు విన్నవించుకున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మశ్రీ కూడా చోడవరం, మాడుగుల నియోజక వర్గాల కేడర్‌తో సమావేశం జరిపి కాంగ్రెస్‌లో కొనసాగడం కష్టమేననే అభిప్రా యం వ్యక్తం చేసి అంతా ఒక తాటి మీదే నడుద్దామబని కేడ ర్ తనను వీడిపోకుండా ఉండేలా జాగ్రత్త పడ్డారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల తాను ప్రజాభీష్టం మేరకు నడుచుకుంటానని ప్రకటించారు. భీమిలి శాసనసభ్యుడు అవంతి శ్రీనివాస్ కూడా కార్యకర్తల అభీష్టం మేరకే రాజకీయ అడుగులు వేస్తానని చెప్పారు. గాజువాక ఎమ్మెల్యే చింతల పూడికి ఒకవైపు సమైక్య సెగ తగలడంతో పాటు, మరో వైపు కేడర్ కూడా పక్క చూపులు చూస్తుండటంతో గురువారం తానే సమైక్యాంధ్ర దీక్షకు దిగారు. మంత్రి గంటాసైతం హై కమాండ్ మీద మెల్లగా విమర్శల బాణాలు వదులుతూ, తాను కూడా పార్టీ మారబోతున్నాననే సంకేతాలు ఇవ్వడం ద్వారా కేడర్‌ను నిలుపుకునే ప్రయత్నంలో పడ్డారు. -
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
న్యూఢిల్లీ: దోషులుగా తేలినా నిక్షేపంగా ప్రజా ప్రతిని ధులుగా కొనసాగడానికి వీలు కల్పిస్తూ కేంద్రం చేసిన వివాదాస్పద ఆర్డినెన్స్‌పై వ్యతిరేకత ఉధృతరూపం దాలుస్తోంది. విపక్షాలకు తోడుగా కేంద్ర మంత్రులు కూడా నిరసన గళం విప్పుతున్నారు. ప్రభుత్వ చర్య ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని అంతం చేస్తుం దని కేంద్ర మంత్రి మిలింద్ దేవ్రా వ్యాఖ్యానించారు. ఏదైనా ఒక కేసులో ఒక ప్రజాప్రతినిధిని దోషిగా కింది కోర్టు ప్రకటిస్తే.. పై కోర్టులో అప్పీలు చేసుకుని స్టే తెచ్చుకోవడానికి మూడు నెలల గడువు ఇచ్చే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. కానీ, దోషులుగా తేలినా పై కోర్టులో అప్పీలు చేసుకుని ప్రజాప్రతినిధులుగా కొనసాగేందుకు వీలు కల్పిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చింది. దీనిపై కేంద్ర మంత్రి దేవ్రా తన అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టాన్ని పక్కన పెట్టి దోషులైన ఎంపీలు, ఎమ్మెల్యేలను వారి పదవులలోనే కొనసాగించేలా అనుమతిస్తే ఇప్పటికే ప్రజాస్వామ్యంపై ప్రజల్లో సడలిన విశ్వాసాన్ని అంతం చేస్తుందంటూ దేవ్రా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ఆర్డినెన్స్‌పై ఏకాభిప్రాయం వస్తే మంచిదంటూ ఇప్పటికే కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆర్డినెన్స్ చట్టవిరుద్ధం: ఆర్డినెన్స్‌పై సంతకం చేయవద్దంటూ బీజేపీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేసింది. అగ్రనేత అద్వానీ, లోక్‌సభలో విపక్ష నేత సుష్మాస్వరాజ్, రాజ్యసభలో విపక్షనేత అరుణ్ జైట్లీ గురువారం రాష్ట్రపతిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. డిమాండ్‌ను పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్రపతి తమకు చెప్పినట్లు సమావేశం అనంతరం సుష్మ మీడియాకు తెలిపారు. మంత్రులకు రాష్ట్రపతి పిలుపు: విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి షిండే, న్యాయ మంత్రి కపిల్ సిబల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పిలిచి ఆర్డినెన్స్‌పై ప్రశ్నలు సంధించారు. ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరంపై ప్రభుత్వ వివరణ వచ్చాక, న్యాయనిపుణుల సలహాలను అనుసరించి నిర్ణయం తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఆర్డినెన్స్‌ను ఆయన వెనక్కి పంపే అవకాశాలు కూడా లేకపోలేదని భావిస్తున్నారు. -
‘అంగన్వాడీ’లో మధ్యాహ్న భోజనం మిథ్యే!
పెడన/బంటుమిల్లి రూరల్, న్యూస్‌లైన్ : అంగనవాడీ కేంద్రాల్లో మధ్యాహ్నభోజన పథకం అమలుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. సరుకులు అందక చాలీచాలనీ మెతుకులతో కాలంవెళ్లదీస్తున్నారు. మొన్నటి వరకు పౌష్టికాహారం అందించిన చిన్నారులకు ఇక నుంచి మధ్యాహ్న భోజనం అందిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. జూలై ఒకటో తేదీ నుంచి నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. కానీ వనరుల లోపంతో క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో చిన్నారులకు, గర్భీణీలకు, బాలింతలకు ఇటు పౌష్టికాహారం (ఎంటీఎఫ్)... అటూ మధ్యాహ్న భోజనం అందకుండా పోపొయింది.జిల్లా వ్యాప్తంగా 3,630 అంగనవాడీ కేంద్రాలు, 208 మినీ సెంటర్లలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలంటూ మాతా శిశు సంక్షేమ శాఖాధికారులు అంగన్వాడీ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో 1.23 లక్షల మందికిపైగా 3 నుంచి 6 ఏళ్లున్న పిల్లలు, బాలింతలు, గర్భీణీ లు లబ్ధిపొందనున్నారు. ప్రభుత్వం అంగనవాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా చేయకపోవటంతో వారే స్వయంగా తమ సొంత నగదు వెచ్చించి సరుకులు కొని స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులతో పథకాన్ని ప్రారంభింపజేశారు. ఆ తర్వాత జూలై, ఆగస్టు నెలలో అధికారులు సరుకులు పంపిణీ చేయకపోవడటంతో ఆ రెండు మాసాలు మళ్లీ పౌష్టికాహారంతోనే సరిపెట్టారు. అరకొర సరుకులు పంపిణీ.... సెప్టెంబర్ మాసంలో మాతా శిశు సంక్షేమ శాఖాధికారులు ఆయా మండలాల పరిధిలో ఉన్న తహశీల్దార్లకు డీడీ కట్టి రేషన్‌ను అంగనవాడీ కేంద్రాలకు సరఫరా చేయాలని కోరారు. దీంతో ఈ నెల నుంచి బియ్యం, పప్పు మాత్రమే పౌర సరఫరా అధికారులు ద్వారా అందజేశారు. పురుగులు పట్టిన బియ్యం, కంది పప్పు ఉడికి ఉడకనిది సరఫరా చేయటంతో, బాలింతలు, చిన్నారులకు, గర్భీణీలకు వాటితో ఏవిధంగా భోజనం వండి వార్చాలని అంగన్వాడీ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. వంటచెరకు మాటేంటి? ఒక్కో అంగనవాడీ కేంద్రంలో 15 నుంచి 20 మంది చిన్నారులుంటారు. వంట చెరకు నిమిత్తం ఒక్కోక్కరికి 20 పైసలు చోప్పున ప్రభుత్వం చెల్లించేందుకు ముందుకు వచ్చింది. నెలలో 25 రోజులకు మాత్రమే ఇస్తుంది. ప్రస్తుతం గ్యాస్ ధర రూ. వెయ్యికు పైగా పలుకుతుంది. దీంతో ప్రభుత్వం ఇచ్చే రేటుకు మధ్యాహ్నభోజనం వండటం సాధ్యం కాదని అంగన్వాడీ కార్యకర్తలు వాపొతున్నారు. అసలే ఇరుకు గదులు... అంగనవాడీ కేంద్రాలు చాలా వరకు ఇరుకు గదుల్లో మగ్గుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వెయ్యి సెంటర్లకు సొంత భవనాలున్నాయి. మిగిలిన కేంద్రాలు అద్దే భవనాల్లో కొనసాగుతున్నాయి. మున్సిపాల్టీల్లో అంగనవాడీ కేంద్రాలకు స్థలాల కొరత వేధించటంతో ప్రైవేటు భవనాల్లో నామమాత్రంగా కొనసాగుతున్నాయి. మూడు నెలలుగా వేతనాల్లేవ్.... మూడు నెలల నుంచి వేతనాలందక సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలకు నెల నెలా అద్దె సకాలంలో చెల్లించకపోతే భవన యజమానులు ఖాళీ చేయాలని వత్తిడి చేస్తున్నారు. దీంతో అప్పు చేసి అంగనవాడీ కేంద్రాల అద్దెలు చెల్లిస్తున్నామని పెడన అంగనవాడీ కార్యకర్తలు వాపాతున్నారు. కాగా పోషకాహారం పంపిణీపై సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం పడింది. అంగన్వాడి కేంద్రాలకు నేటికీ సరుకులు సరఫరా కాకపోవడంతో సెప్టెంబరునెల రేషన్ లబ్ధిదారులకు అందలేదు. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్న కారణంగా ఇండెంట్లు, బిల్లులు తయారుచేసేవారులేక సరుకుల సరఫరా నిలిచిపోయింది. -
భగ్గు మంటున్న గ్రామస్తులు
సాక్షి, సిటీబ్యూరో: శివారు గ్రామపంచాయతీల విలీన ప్రక్రియపై సర్వత్రా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. సర్కారు ఏకపక్ష నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ప్రజాప్రతినిధుల మాట వినకుండా జీహెచ్ఎంసీలో 21 గ్రామాలను విలీనం చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. బుధవారం కూడా పలు గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి. గ్రామ పంచాయతీల రికార్డులను జీహెచ్ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకోకుండా ప్రజలు అడ్డుకున్నారు. ఉదయం నుంచే పంచాయతీ కార్యలయాలకు చేరుకున్నారు. ధర్నాలు చేసి, కార్యాలయాలకు తాళాలు వేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇప్పటికే 625 చ.కి.మీ. విస్తీర్ణంతో ప్రజలకు పలు సమస్యలు సృష్టిస్తున్న జీహెచ్ఎంసీలో ఇతర గ్రామాలను కలపవద్దంటూ సర్వసభ్య సమావేశం తీర్మానించినా.. పచ్చని చేలతో, పంట పొలాలతో ఉన్న తమ గ్రామాల్లో ఎలంటి సదుపాయాలు కల్పించకుండా కేవలం పన్నుల కోసం జీహెచ్ఎంసీలో విలీనం చేయొద్దంటూ ఆయా గ్రామాల ప్రజలు గగ్గోలు పెడుతున్నా.. పట్టించుకోని సర్కారు విలీనం చేస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. దీనిపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 150 డివిజన్లున్న జీహెచ్ఎంసీలో శివారు ప్రజలు తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలకు నోచుకోకున్నా.. భారీగా ఆస్తిపన్ను, భవన నిర్మాణ అనుమతులు, ట్రేడ్‌లెసైన్సు ఫీజులు వంటివి వసూలు చేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. విలీనం ఏ శక్తుల కోసం.. ఎవరి ప్రయోజనాల కోసం చేశారని ప్రశ్నిస్తున్నారు. నగరానికి దగ్గర్లో ఉన్న గ్రామాలను కాదని దూరంగా ఉన్న గ్రామాలను విలీనం చేయడంలో హేతుబద్ధీకరణ ఉందా? అని మండిపడుతున్నారు. ఉదాహరణకు ఉప్పల్ సర్కిల్‌కు దగ్గర్లోని బోడుప్పల్‌ను కాకుండా దూరంగా ఉన్న పర్వతాపూర్, ఫిర్జాదిగూడలను కలపడంలో ఆంతర్యమేంటని ధ్వజమెత్తుతున్నారు. అలాగే మణికొండ, కోకాపేట, గండిపేట, మంచిరేవులను మాత్రం పంచాయతీలుగానే ఉంచినప్పటికీ, వాటికంటే దూరంగా కుగ్రామంగా ఉన్న వట్టినాగులపల్లిని విలీనం చేయడంపై ఆ గ్రామ ప్రజలు శివాలెత్తుతున్నారు. మంగళవారం అధికారులను నిర్బంధించిన ఆ గ్రామస్తులు బుధవారం కూడా ఆందోళనలు కొనసాగించారు. పీర్జాదిగూడ, పర్వతాపూర్లలోనూ రాజకీయాలకతీతంగా ఆందోళనలు చేశారు. పర్వతాపూర్ పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. షోకాజ్ ఏదీ..? 15 గ్రామాల విలీనం జీహెచ్ఎంసీ జనరల్ కౌన్సిల్లో చర్చకు వ చ్చినప్పుడు అంగీకరించేది లేదంటూ పాలకమండలి తిరస్కరించినప్పటికీ, ప్రభుత్వం తన విశేషాధికారాలతో విలీనం చేసింది. అయితే, ఆ తీర్మానాన్ని అంగీకరించని పక్షంలో షోకాజ్ జారీ చేయాల్సి ఉంటుందని నిబంధన లు క్షుణ్ణంగా తెలిసిన ఓ అధికారి తెలిపారు. ఓవైపు.. ఢిల్లీ, ముంబై వంటి కార్పొరేషన్లను పరిపాలనా సౌలభ్యం కోసం అదనపు కార్పొరేషన్లుగా విభజించగా.. ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న జీహెచ్ఎంసీ పరిధిని మరింత పెంచడం.. మరిన్ని సమస్యలు సృష్టించడమేనని మునిసిపల్ పరిపాలనపై అవగాహన ఉన్న వారు చెబుతున్నారు. ప్రత్యేక తెలంగాణ అంశాన్నీ ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. విభజన కోసం ఉద్యమాలు జరుగుతుండగా, అందరూ వద్దంటున్నా విలీనం వెనుక కారణాలేమిటని ప్రశ్నిస్తున్నారు. -
కాంగ్రెస్, టీడీపీదే విభజన పాపం
విజయవాడ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రపై ఢిల్లీలో ఒకమాట, రాష్ట్రంలో మరో మాట మాట్లాడుతున్న కాంగ్రెస్ టీడీపీలకు ఉద్యమించే నైతిక హక్కు లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. తెలుగు ప్రజలందరికీ సమన్యాయం చేయాలని లేకుంటే రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్షకు దిగిన వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డికి మద్దతుగా నగర పాలక సంస్థ స్థాయీ సంఘం మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ నేత జవ్వాది సూర్యనారాయణ (రుద్రయ్య) చేపట్టిన నిరవధిక దీక్ష బుధవారం మూడో రోజుకు చేరింది. దీక్షా శిబిరాన్ని సందర్శించిన వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ చాలా నిసిగ్గుగా వ్యవహరిస్తున్నాయన్నారు. చంద్రబాబునాయుడు ఒకవైపు తెలంగాణాకు మద్దతుగా లేఖ ఇచ్చారని, మరోవైపు ఆ పార్టీ నేతలు ఇక్కడ ప్రజలను మభ్యపెట్టేందుకు పాకులాడుతున్నారని విమర్శించారు. తమ పార్టీ ప్రజాప్రతినిధులు కేంద్ర పాలకుల కుయుక్తులను గమనించి ముందుగానే రాజీనామా చేసి ఉద్యమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో నిరవధిక దీక్షకు దిగితే అత్యంత దారుణంగా ఆ దీక్షను భగ్నం చేశారని చెప్పారు. నేడు తెలుగు ప్రజల ఆకాంక్షను నిలబెట్టేందుకు జగన్మోహనరెడ్డి జైలులో ఆమరణ దీక్ష ప్రారంభించారని తెలిపారు. ఆయనకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు రూపాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయని చెప్పారు. విజయవాడలో జవ్వాది రుద్రయ్య ఆమరణ దీక్షకు దిగడం అభినందనీయమన్నారు. పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్, సెంట్రల్ నియోజకవర్గ కన్వీనర్ పీ.గౌతంరెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజలను విడదీయడానికి కాంగ్రెస్, టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయన్నారు. పార్టీ అధికార ప్రతినిధి దాసీజయప్రకాష్కెనడీ, ప్రచార విభాగ కన్వీనర్ కంది గంగాధరరావు, ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ విశ్వనాధ రవి, వాణిజ్య విభాగ కన్వీనర్ కొనిజేటి రమేష్, నాయకులు దాడి అప్పారావు, కంపా గంగాధరరెడ్డి, మనోజ్‌కొఠారి, వరకాల జోషి, కరిముల్లా, గౌరి, రామిరెడ్డి, మాడెం దుర్గారావు, సుందర్‌పాల్, ముంతాజ్, కడవకొలు కుమారి, మేకల రాణి పాల్గొన్నారు. పలువురి మద్దతు... జవ్వాది రుద్రయ్య దీక్షకు పలువురు సంఘీభావం ప్రకటించారు. విజయవాడ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ నేతలు, వ్యాపారులు భారీ ప్రదర్శనగా దీక్షా శిబిరానికి తరలివచ్చారు. ఆ సంఘం నేతలు ఆరుమళ్ళ వెంకటేశ్వరరెడ్డి, పిన్నిటి రామారావు తదితరులు రిలేదీక్షలో పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతాడ బ్రహ్మనందం జవ్వాదిని పరామర్శించి సంఘీభావాన్ని తెలిపారు. వారితో పాటుగా రిలేదీక్షల్లో మనోజ్‌కొఠారి, దాడి తేజోకుమార్, సరోజనమ్మ, రమణమ్మ , ఆడి సింహచలం, పీ.సత్యనారాయణ, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.