
న్యూఢిల్లీ: రెండో విడత వ్యాక్సినేషన్‌లో 50 ఏళ్ల వయస్సు పైబడిన ప్రజా ప్రతినిధులకు టీకా వేసే అవకాశముంది. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సహా మెజారిటీ కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రుల్లో అత్యధికులు, ఇతర ప్రముఖ ప్రజా ప్రతినిధులు ఈ కేటగిరీలోకి రానున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికు లు, పోలీసులు.. తదితర కోవిడ్–19 పై పోరాటంలో ముందుండి పోరాడిన యోధులకు జనవరి 16 నుంచి ప్రారంభమైన తొలి విడత వ్యాక్సినేషన్‌లో టీకా వేస్తున్న విషయం తెలిసిందే. తొలి విడతలో వ్యాక్సిన్ పొందేందుకు తొందరపడవద్దని వ్యాక్సి నేషన్ కార్యక్రమం ప్రారంభించే ముందు ప్రధాని మోదీ మంత్రులు, ప్రజా ప్రతినిధులకు సూచించారు.
టీకా లబ్ధిదారులతో నేడు మాటామంతీ
ఉత్తర ప్రదేశ్‌లోని సొంత నియోజకవర్గం వారణాసిలో కోవిడ్ టీకా తీసుకున్నవారు, టీకా వేస్తున్నవారితో నేడు(శుక్రవారం) ప్రధానమంత్రి మోదీ మాట్లాడనున్నారు. టీకాకు సంబంధించి వారి అనుభవాలను ప్రధాని తెలుసుకుంటారని, ఈ కార్యక్రమం వర్చువల్‌గా జరుగుతుందని ప్రధాని కార్యాలయం తెలిపింది.
టీకాపై అపోహలొద్దు: హర్షవర్ధన్
కరోనా టీకాలు సురక్షితమైనవి, సమర్ధవం తమైనవని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పునరుద్ఘాటించారు. టీకా వేసుకోవడం వల్ల కోవిడ్–19 వ్యాధి వ్యాప్తి తగ్గి, క్రమంగా అంతరించిపోతుందని పేర్కొన్నారు. టీకాపై అపోహలను తొలగించేందుకు ఉద్దేశించిన పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు. టీకా కావాలంటూ ప్రపంచవ్యాప్తంగా దేశాలు మనల్ని కోరుతున్నాయి. కానీ, మన దేశంలోని కొందరు మాత్రం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం టీకా సమర్ధతపై అపోహలను ప్రచారం చేస్తున్నారు’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment