second phase
-
116 కి.మీ. 80స్టేషన్లు..
సాక్షి, హైదరాబాద్: రెండోదశలో భాగంగా మొత్తం ఆరు కారిడార్లలో 116.2 కిలోమీటర్ల మేర 80కు పైగా స్టేషన్లతో మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఎయిర్‌పోర్ట్‌తో పాటు, కొత్తగా ప్రతిపాదించిన ఫోర్త్‌సిటీతో సహా నగరంలోని వివిధ మార్గాల్లో మెట్రో సేవలను విస్తరించనున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెండోదశ ప్రాజెక్టు డీపీఆర్‌లకు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి వెల్లడించారు. 40 కి.మీ పొడవుతో కొత్తగా ప్రతిపాదిస్తున్న ఎయిర్పోర్ట్ టూ ఫోర్త్ సిటీ కారిడార్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) మినహా మిగతా ఐదు కారిడార్ల డీపీఆర్‌లను త్వరలోనే కేంద్రానికి సమరి్పంచనున్నట్లు తెలిపారు.ఎయిర్పోర్ట్ టూ ఫోర్త్ సిటీ డీపీఆర్ ఆకర్షణీయమైన ఫీచర్లతో రూపుదిద్దుకుంటోందని, మరికొద్ది నెలల్లో దీన్ని కేంద్రం అనుమతి కోసం పంపుతామని చెప్పారు. ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్లో మార్పు చేస్తూ కొత్తగా డీపీఆర్ సిద్ధం చేసినట్లు వివరించారు. మెట్రో రైలు రెండోదశపై ఆదివారం బేగంపేట్ మెట్రో భవన్లో ఆయన సవివరమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. ట్రాఫిక్ అధ్యయనం ‘రెండోదశకు సంబంధించి హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలోప్రస్తుతం ట్రాఫిక్ అధ్యయనం కొనసాగుతోంది. త్వరలో రూపొందించనున్న ట్రాఫిక్ అధ్యయన నివేదికను (కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ) కూడా పరిగణనలోకి తీసుకోనున్నాం. రెండోదశ మెట్రో మార్గాలలో ట్రాఫిక్ అంచనాలను సీఎంపీతో క్రాస్‌చెక్ చేయనున్నాం. రెండో దశ డీపీఆర్‌లకు కేంద్రం నుంచి ఆమోదం పొందేందుకు ఇది తప్పనిసరి. ఎయిర్పోర్ట్ రూట్‌కు సంబంధించి అలైన్మెంట్లో కొంత మార్పు చేశాం. గతంలో మైలార్‌దేవ్‌పల్లి నుంచి నేరుగా ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదించగా, ప్రస్తుతం దాన్ని ఆరాంఘర్ నుంచి 44వ నంబర్ జాతీయ రహదారి (బెంగళూరు హైవే)లోని కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా డీపీఆర్‌ను ఖరారు చేస్తున్నాం..’అని ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. ఇతర ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. భూగర్భంలో మెట్రో రైల్ నాగోల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సుమారు 36 కిలోమీటర్ల మార్గంలో నిర్మించనున్న నాలుగో కారిడార్ ఎల్బీనగర్, కర్మన్‌ఘాట్, ఒవైసీ ఆసుపత్రి, డీఆర్డీఓ, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, ఆరాంఘర్, కొత్త హైకోర్టు మీదుగా శంషాబాద్ జంక్షన్ నుంచి సాగుతుంది. రాయదుర్గం నుంచి నాగోల్ వరకు, మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న కారిడార్లు.. ఎయిర్‌పోర్టు మార్గంలో నాగోల్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట స్టేషన్ల వద్ద అనుసంధానమవుతాయి. మొత్తం 36.6 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో రూట్లో 35 కిలోమీటర్లు ఎలివేట్ చేయనున్నారు. 1.6 కిలోమీటర్ల వరకు మెట్రోలైన్ భూగర్భంలో నిర్మిస్తారు. ఎయిర్పోర్ట్ స్టేషన్ కూడా భూగర్భంలోనే ఉంటుంది. ఈ రూట్లో 24 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ⇒ ఐదవ కారిడార్‌లో ఇప్పుడు ఉన్న రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి కోకాపేట్ నియోపొలిస్ వరకు కొత్తగా లైన్ నిర్మించనున్నారు. ఇది బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్ రామ్‌గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ నియోపోలిస్ వరకు ఉంటుంది. ఇది పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. ఈ 11.6 కిలోమీటర్ల మార్గంలో 8 స్టేషన్లు నిర్మించే అవకాశం ఉంది.⇒ ఆరో కారిడార్‌లో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న రూట్‌ను గతంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు విస్తరించాలని ప్రతిపాదించారు. తాజాగా ఈ మార్గాన్ని చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. ఇది ఎంజీబీఎస్ నుంచి ఓల్డ్ సిటీలోని మండి రోడ్ మీదుగా దారుల్íÙఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్‌నుమా మీదుగా చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సాలార్జంగ్ మ్యూజియం, చారి్మనార్లు ఈ కారిడార్‌కు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, అక్కడ నిర్మించే స్టేషన్లకు ఆ పేర్లే పెట్టనున్నారు. రోడ్ల విస్తరణ ⇒ ప్రస్తుతం దారుల్íÙఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ మధ్య ఉన్న 60 అడుగుల రోడ్డు, శాలిబండ జంక్షన్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఉన్న 80 అడుగుల రోడ్లను 100 అడుగులకు విస్తరించనున్నారు. స్టేషన్లు ఉండే ప్రాంతాల్లో మాత్రం 120 అడుగులకు విస్తరిస్తారు. పాతబస్తీ మెట్రో అలైన్మెంట్, రోడ్డు విస్తరణ నేపథ్యంలో సుమారు 1,100 నిర్మాణాలను తొలగించే అవకాశంఉంది. ఆరో కారిడార్‌లో 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటన్నింటికీ తగిన ఇంజనీరింగ్ పరిష్కారాలతో, మెట్రో పిల్లర్ స్థానాలను సర్దుబాటు చేయనున్నారు. ఈ రూట్లో మొత్తం 6 స్టేషన్లు ఉంటాయి. ⇒ ఏడవ కారిడార్‌లో మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి పటాన్చెరు వరకు 13.4 కిలోమీటర్ల మేర లైన్ నిర్మించనున్నారు. మియాపూర్ నుంచి ఆలి్వన్ క్రాస్‌రోడ్స్, మదీనాగూడ, చందానగర్, బీహెచ్ఈఎల్, ఇక్రిసాట్ మీదుగా ఇది వెళుతుంది. ఈ రూట్లో సుమారు 10 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. ⇒ ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు నిర్మించనున్న 8వ కారిడార్ 7.1 కిలోమీటర్ల వరకు ఉంటుంది. చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, ఆర్టీసీ కాలనీల మీదుగా హయత్‌నగర్ వరకు నిర్మిస్తారు. సుమారు 6 స్టేషన్లు ఉంటాయి. ఇది కూడా పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. 9వ కారిడార్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫోర్త్‌సిటీలోని స్కిల్స్ యూనివర్సిటీ వరకు ఉంటుంది. ⇒ రెండోదశ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ..32,237 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా. ఇందులో 40 కిలోమీటర్ల ఫోర్త్‌సిటీ మెట్రోకే రూ.8 వేల కోట్ల వరకు ఖర్చు కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా మెట్రో రెండో దశ చేపట్టనున్నారు.రెండో దశ కారిడార్లు ఇవీ (కిలో మీటర్లలో)కారిడార్ – 4 నాగోల్ – ఎయిర్పోర్ట్ 36.6కారిడార్ – 5 రాయదుర్గం–కోకాపేట్ నియోపొలిస్ 11.6కారిడార్ – 6 ఎంజీబీఎస్ –చాంద్రాయణగుట్ట (ఓల్డ్ సిటీ కారిడార్) 7.5కారిడార్ – 7 మియాపూర్ – పటాన్చెరు 13.4కారిడార్ – 8 ఎల్బీనగర్–హయత్ నగర్ 7.1కారిడార్ – 9 ఎయిర్పోర్ట్– ఫోర్త్ సిటీ (స్కిల్స్ యూనివర్సిటీ) 40 -
రత్న భండార్‌లో రెండో సర్వే ప్రారంభం
పూరీ: భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్ఐ) ఒడిశా పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భండార్‌లో శనివారం మధ్యాహ్నం రెండో దఫా టెక్నికల్ సర్వే ప్రారంభించింది. మూడు రోజులపాటు ఈ సర్వే కొనసాగుతుందని, మధ్యాహ్నం ఒంటి నుంచి సాయంత్రం 6 గంటల ద్వారా భక్తులను ఆలయంలోకి అనుతించబోమని శ్రీజగన్నాథ్ ఆలయ పరిపాలనా విభాగం అధికారులు వెల్లడించారు. సర్వే జరుగుతున్న సమయంలో ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు. రత్న భండార్‌లో రహస్య గది గానీ, సొరంగం గానీ ఉన్నా యా? అనేది తేల్చబోతున్నామని రత్న భండార్ ఇన్వెంటరీ కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ చెప్పారు. ఈ సర్వే కోసం అత్యాధునిక రాడార్‌ను ఉపయోగిస్తున్న ట్లు వివరించారు. రత్న భండార్‌లో మొదటి దఫా సర్వే ఇప్పటికే పూర్తయ్యింది. -
‘స్టార్ చంద్రు’.. రెండో దశ పోలింగ్‌లో రిచ్ ఈయనే..
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ శుక్రవారం జరుగుతోంది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలు , కర్ణాటకలోని 28 స్థానాలకు గాను 14, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో 8 సీట్లు, మధ్యప్రదేశ్‌లో 6 సీట్లు, అస్సాం, బీహార్లలో 5 సీట్లకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్లో మూడు సీట్లు, మణిపూర్, త్రిపుర, జమ్మూకశ్మీర్‌లలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతోంది.అత్యంత ధనిక అభ్యర్థులు వీళ్లే..అభ్యర్థుల ఎలక్షన్ అఫిడవిట్లపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ చేసిన విశ్లేషణ ప్రకారం.. 'స్టార్ చంద్రు'గా ప్రసిద్ధి చెందిన కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు వెంకటరమణే గౌడ ఫేజ్ 2 పోలింగ్‌లో అత్యంత ధనవంతుడు. హెచ్డీ కుమారస్వామిపై పోటీ చేస్తున్న ఈయన రూ.622 కోట్ల ఆస్తులను ప్రకటించారు .ఇక రూ. 593 కోట్లతో రెండవ అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు ప్రస్తుత కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్. ఈయన కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు.మథుర లోక్‌సభ స్థానం నుంచి మళ్లీ పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ హేమమాలిని రూ. 278 కోట్ల ఆస్తులతో మూడో అత్యంత ధనిక అభ్యర్థిగా ఉన్నారు.మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత సంజయ్ శర్మ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన రూ.232 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించారు .కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నారు. ఆయన ప్రకటించిన మొత్తం ఆస్తులు రూ.217.21 కోట్లు.వీళ్లే పేద అభ్యర్థులుమహారాష్ట్రలోని నాందేడ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న లక్ష్మణ్ నాగోరావ్ పాటిల్ రెండో దశలో అత్యల్ప ఆస్తులు కలిగిన అభ్యర్థిగా నిలిచారు. ఆయన కేవలం రూ.500 విలువైన ఆస్తులను ప్రకటించారు.రెండో స్థానంలో కేరళలోని కాసరగోడ్ నుండి పోటీ చేస్తున్న మరొక స్వతంత్ర అభ్యర్థి రాజేశ్వరి కేఆర్ రూ.1,000 విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. అమరావతి (SC) నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ప్రవేశించిన పృథ్వీసామ్రాట్ ముకిందరావ్ దీప్వాన్ష్ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. ఈయన మొత్తం ఆస్తులు రూ.1,400. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న దళిత క్రాంతి దళ్ నాయకుడు షహనాజ్ బానో రూ. 2,000 ఆస్తులను ప్రకటించారు. కేరళలోని కొట్టాయం నుండి సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) తరపున పోటీ చేస్తున్న వీపీ కొచుమోన్ రూ.2,230 ఆస్తులతో జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నారు. -
మూగబోయిన మైకులు..రెండో దశ పోలింగ్‌కు కౌంట్‌డౌన్
న్యూఢిల్లీ,సాక్షి: రెండో విడత లోక్‌సభ ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 స్థానాల్లో ఓట్ల పండుగకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. రాహుల్ గాంధీ, శశి థరూర్, హేమామాలిని తదితరులు సెకండ్ ఫేజ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. లోక్‌సభ ఎన్నికల రెండో దశ ప్రచారానికి బుధవారం(ఏప్రిల్24) సాయంత్రం తెరపడింది. దాదాపు నెల రోజులుగా హోరెత్తిన మైకులు మూగబోయాయి. దేశవ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనుండగా.. శుక్రవారం(ఏప్రిల్26) రెండో దశ పోలింగ్ జరగనుంది. 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల కమిషన్.ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం రెండో దశలో 89 ఎంపీ స్థానాలకు పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే, మధ్యప్రదేశ్‌లోని బేతుల్ నుంచి బరిలోకి దిగిన బీఎస్పీ అభ్యర్థి అశోక్ భలవి మరణంతో ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది. కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలకు రెండో విడతలో ఒకేసారి పోలింగ్ జరగనుంది.కర్ణాటకలో 14, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, అసోం, బిహార్‌లో ఐదేసి, ఛత్తీస్‌గఢ్, బెంగాల్లో మూడు, మణిపుర్, త్రిపుర, జమ్ముకశ్మీర్‌లో ఒక్కో స్థానానికి పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘంకాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, శశి థరూర్, కేంద్రమంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, గజేంద్ర సింగ్ షెకావత్, లోక్‌సభ మాజీ స్పీకర్ ఓంబిర్లా, వంచిత్ బహుజన్ అఘాడీ చీఫ్ ప్రకాశ్ అంబేడ్కర్, టీవీ రాముడు అరుణ్ గోవిల్, బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని, నటి నవనీత్ కౌర్ రాణా సహా పలువురు ప్రముఖులు రెండో దశ బరిలో ఉన్నారు.వరుసగా రెండోసారి కేరళలోని వయనాడ్ నుంచి లోక్‌సభకు పోటీచేస్తున్నారు రాహుల్ గాంధీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్, సీపీఐ అభ్యర్థి అన్నీ రాజాతో తలపడుతున్నారు. ఏప్రిల్19న తొలి దశ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. లోక్‌సభ బరిలో అఖిలేశ్.. మళ్లీ అక్కడి నుంచే -
Bharat Nyay Yatra: రాహుల్ గాంధీ ‘భారత్ న్యాయ యాత్ర’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరో సుదీర్ఘయాత్రకు సన్నద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ నూతన జవసత్వాలు అందించే దిశగా రెండో విడత యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ‘భారత్ న్యాయ యాత్ర’ పేరిట తూర్పున మణిపూర్ నుంచి పశ్చిమాన మహారాష్ట్ర వరకు పాదయాత్ర జరుగనుందని కాంగ్రెస్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. వచ్చే ఏడాది జనవరి 14న మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ప్రారంభం కానున్న ఈ యాత్ర 67 రోజుల పాటు కొనసాగి, మార్చి 20వ తేదీన మహారాష్ట్ర రాజధాని ముంబైలో ముగుస్తుంది. దేశ ప్రజలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయాన్ని అందించడమే ధ్యేయంగా రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తెలిపారు. ఈ యాత్రను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంఫాల్‌లో జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం షెడ్యూల్ ఖరారు చేసింది. రెండో విడత యాత్ర చేపట్టాలని రాహుల్ గాం«దీని కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నెల 21న ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించిన సంగతి తెలిసిందే. చాలావరకు బస్సు యాత్ర.. అవసరమైన చోట పాదయాత్ర రాహుల్ గాంధీ తన తొలి విడత భారత్ జోడో యాత్రను 2022 సెపె్టంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభించారు. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 136 రోజులపాటు 3,970 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేశారు. ఈ ఏడాది జనవరి 30న జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో యాత్ర ముగిసింది. మొదటి యాత్రకు కొంత భిన్నంగా చాలావరకు బస్సు ద్వారా భారత్ న్యాయ యాత్ర చేపట్టనున్నప్పటికీ, అవసరమైన చోట పాదయాత్ర సైతం ఉంటుందని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ యాత్ర 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల మీదుగా మొత్తం 6,200 కిలోమీటర్ల మేర సాగనుంది. మణిపూర్‌లో ప్రారంభమై నాగాలాండ్, అస్సాం, మేఘాలయా, పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాల మీదుగా కొనసాగి మహారాష్ట్రలో ముగియనుంది. భారత్ జోడోయాత్ర 136 రోజులపాటు 3,970 కిలోమీటర్లు జరిగింది. భారత్ న్యాయ యాత్ర 67 రోజుల్లోనే 6,200 కిలోమీటర్లు సాగనుంది. ఈశాన్య రాష్ట్రాల ప్రజల గాయాలు మాన్పాలన్నదే ఆకాంక్ష ఇటీవల నెలల తరబడి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్న మణిపూర్ నుంచి యాత్రను ప్రారంభిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందన్న సందేశాన్ని ప్రజలకు చేరవేయడమే కాంగ్రెస్ పెద్దల ఉద్దేశమని తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల ప్రజల గాయాలను మాన్పాలన్నదే తమ ఆకాంక్ష అని కాంగ్రెస్ అగ్రనేత కె.సి.వేణుగోపాల్ వివరించారు. యాత్ర సందర్భంగా 12 బహిరంగ సభల్లో రాహుల్ ప్రసంగిస్తారు. 100కుపైగా స్ట్రీట్–కార్నర్ సమావేశాలు ఉంటాయి. 13 ప్రెస్ కాన్ఫరెన్స్‌లు సైతం నిర్వహిస్తారు. మహిళలు, యువతతోపాటు అణగారిన వర్గాల ప్రజలతో ముఖాముఖి భేటీ అవుతారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న మహారాష్ట్రలోని నాగపూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జైరామ్ రమేశ్ తెలిపారు. ఈ సభకు హమ్ తయ్యార్ హూ(మేము సిద్ధంగా ఉన్నాం) అని నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. -
తొలి విడత బస్సు యాత్ర విజయవంతం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: తొలి విడత సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతమైందని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 175 నియోజకవర్గాల్లో ఈ నెల 30 వరకు రెండో విడత బస్సు యాత్ర జరగనుందన్నారు. ఇవాళ నరసన్నపేట నుంచి రెండో విడత యాత్ర మొదలవుతుందన్నారు. నాలుగున్నరేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రజల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. 70 శాతం పథకాలు బీసీ,ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాలకు ఈ ప్రభుత్వం అందించిందన్నారు. ‘‘సామాజిక సాధికార యాత్రలో నాడు-నేడు పనులను పరిశీలిస్తున్నాం. ఎక్కడైనా లోపాలుంటే సరి చేయాలని చెబుతున్నాం. జనసేన నాయకుల విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన పనిలేదు. నాడు-నేడుపై బురద జల్లే పనిలో జనసేనలో ఉంది. ఎన్ని పార్టీలు కలిసినా రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే విజయం’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. చదవండి: టీడీపీ ఖాతాలోకి రూ.27 కోట్ల స్కిల్ స్కామ్ నిధులు -
‘దళిత బంధు’కు ఆదరణ కరువు
సాక్షి,సిటీబ్యూరో: దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకానికి ఆదరణ కరువైంది. రెండో విడతలో యూనిట్ల సంఖ్య పెరిగినా... నిరుద్యోగ యువత ఆసక్తి కరువైంది. దరఖాస్తులు ఆహా్వనిస్తే కనీసం కేటాయించిన యూనిట్లకు సరిపడ దరఖాస్తులు కూడా రాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. మొదటి విడతలో అసెంబ్లీ నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్దిదారులను ఎంపిక చేసి యూనిట్లను మంజూరు చేయడంతో గ్రౌండింగ్ కూడా పూర్తైంది. నియోజవకవర్గానికి 1,100 యూనిట్లు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండో విడతలో ఒక్కో నియోజకవర్గంలో 1,100 చొప్పున యూనిట్లు కేటాయించారు. గత మూడు, నాలుగు నెలలుగా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలకు గాను 16, 500 యూనిట్లు కేటాయించగా, ఇప్పటి వరకు కేవలం 13 వేల దరఖాస్తులకు మించి రాలేదని తెలుస్తోంది. కొన్ని దరఖాస్తులు నేరుగా రాగా, మరికొన్నింటిని ఎమ్మెల్యేలు సిఫార్సు చేశారు. అయినప్పటికీ యూనిట్ల కేటాయింపునకు అనుగుణంగా దరఖాస్తుల సంఖ్య పెరగలేదు. విచారణ అంతంతే... రెండో విడత దరఖాస్తుల విచారణ సైతం అంతంత మాత్రంగా తయారైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ అధికారులతో సమీక్ష సమావేశాలు జరిపిన ప్రతిసారీ దళిత బంధు దరఖాస్తులపై విచారణ వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నా.. ప్రక్రియ మాత్రం ముందుకు మాత్రం సాగడం లేదు. ఈ పథకం కింద యూనిట్‌కు రూ.10 లక్షల అందిస్తారు. అయినప్పటికీ దరఖాస్తుల తాకిడి లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. -
సిమ్లా కాదు బెంగళూరు
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా చేతులు కలిపిన ప్రతిపక్ష పార్టీలు రెండో విడతగా బెంగళూరులో సమావేశం కానున్నాయి. తొలుత సిమ్లాలో భేటీ నిర్వహించాలని భావించినప్పటికీ వేదికను బెంగళూరుకి మార్చారు. జులై 13, 14 తేదీలలో విపక్షాల భేటీ ఉంటుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వెల్లడించారు. పట్నాలో జరిగిన తొలి సమావేశంలో 17 పార్టీలు కలసి కట్టుగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సారి సమావేశంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజా సమస్యలపై పోరుబాట, లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఉమ్మడి ఎజెండా, సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై చర్చించనున్నారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన శరద్ పవార్ పట్నా సమావేశం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో అసహనం పెరిగిపోయిందని ఆరోపించారు. ఉమ్మడి పౌరస్మృతి మన దేశానికి అవసరమని ప్రధాని వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్న సమయంలో యూసీసీపై తమ పార్టీ ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. వివిధ వర్గాలు, మత సంస్థలతో చర్చించాక తుది నిర్ణయం వెల్లడిస్తామన్నారు. యూసీసీ కంటే ముందు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని పవార్ డిమాండ్ చేశారు. -
AP: సచివాలయాల ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: రెండో విడత నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారికి కూడా ప్రొబేషన్ ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 సంవత్సరంలో జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వీరు ప్రస్తుతం రూ.15 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్నారు. ప్రొబేషన్ ఖరారు అనంతరం దాదాపు రెట్టింపు జీతం అందుకుంటారు. గ్రామ వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల విభాగాల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రొబేషన్ ఖరారైన గ్రేడ్ –5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు ఆడ్మిని్రస్టేటివ్ సెక్రటరీలు ఇప్పుడు కనీస బేసిక్ వేతనం రూ.23,120 కాగా, డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకున్న తర్వాత రూ. 29,598 అందుకుంటారు. మిగిలిన 17 విభాగాల ఉద్యోగులు ఇప్పుడు కనీస బేసిక్ వేతనం రూ.22,460కు డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకొని రూ. 28,753 అందుకుంటారని అధికారవర్గాలు తెలిపాయి. పట్టణ ప్రాంతాల్లో హెచ్ఆర్ఏ స్లాబు ప్రకారం కొంత మందికి కొంచెం ఎక్కువ వేతనం వస్తుంది. పెరిగిన వేతనాలు మే 1 నుంచి (అంటే జూన్ ఒకటిన ఉద్యోగులకు అందే జీతం) అమలులోకి వస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రొబేషన్ ఖరారు ఉత్తర్వుల విడుదల నేపథ్యంలో.. జిల్లాల్లో వేర్వేరుగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అర్హులైన ఉద్యోగుల జాబితాలతో కూడిన ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. నిబంధనల ప్రకారం.. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి, డిపార్ట్మెంట్ టెస్టులో ఉత్తీర్ణత సాధించి, ఎటువంటి నేర చరిత్ర లేదని పోలీసు రిపోర్టుల్లో తేలిన వారికి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రొబేషన్ ఖరారు ప్రక్రియ కొనసాగుతుంది. 1.34 లక్షల మందికి కొత్త ఉద్యోగాలిచ్చిన సీఎం జగన్ సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన రోజునే ప్రజల గడపవద్దకే ప్రభుత్వపాలన తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దీని ద్వారా 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) విధానంలో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో 1,26,728 ఉద్యోగాలకు, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మరో 9,600 ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలకు 2019 జూలైలో నోటిఫికేషన్ జారీచేశారు. నాలుగు నెలల్లోనే రాత పరీక్షలు, నియామక ప్రక్రియ పూర్తిచేశారు. పంచాయతీరాజ్‌శాఖ నోటిఫికేషన్ ద్వారా 1,05,497 మంది ఉద్యోగాలు పొందగా.. అందులో నిబంధల ప్రకారం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి, డిపార్ట్మెంట్ టెస్టు పాసైన 1,00,724 మంది (ఎనర్జీ అసిస్టెంట్లు కాకుండా)కి గత ఏడాది జూన్ నెలాఖరుకే ప్రభుత్వం ప్రొబేషన్ ఖరారు చేసింది. వారందరికీ గత ఏడాది జూలై ఒకటి నుంచి పే–స్కేలుతో కూడిన వేతనాలను ఇస్తోంది. మొదటి విడత నోటిఫికేషన్ ద్వారా భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులకు వెంటనే 2020లో నోటిఫికేసన్ జారీ చేయగా, మరో 12,837 మంది ఉద్యోగాలు పొందారు. వీరు ఇప్పుడు ప్రొబేషన్ పొంది మే 1 నుంచి పే స్కేలుతో కూడిన వేతనాలు అందుకోబోతున్నారు. మొదటి విడత ఉద్యోగుల్లో మిగిలినవారు నిబంధనల ప్రకారం అర్హత పొందిన వెంటనే ప్రొబేషన్ పొందుతారని అధికారులు వెల్లడించారు. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపిన సీఎం జగన్ గ్రామ, వార్డు సచివాలయాలు సృష్టించి ఒకే విడతలో 1.34 లక్షల ఉద్యోగాలిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు. సీఎం జగన్‌కు మేమెప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం. – గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు, అదనపు ప్రధాన కార్యదర్శి బి.ఆర్.ఆర్. కిషోర్, వర్కింగ్ ప్రెసిడెంట్ విప్పర్తి నిఖిల్ కృష్ణ సీఎం జగన్ రుణం తీర్చుకుంటాం.. ఉద్యోగ సంఘాల హర్షం గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండోవిడత ఉద్యోగాలు పొందిన వారికీ ప్రొబేషన్ ఖరారు చేసినందుకు ఉద్యోగసంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ప్రభుత్వానికి, సీఎం జగన్మోహన్రెడ్డికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మీద ముఖ్యమంత్రి జగన్‌కున్న అభిమానానికి ఈ నిర్ణయాలే నిదర్శనమని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలందించి ప్రభుత్వ ప్రతిష్ట పెరిగేలా సచివాలయాల ఉద్యోగులు కష్టపడి పని చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రుణం తీర్చుకుంటారని చెప్పారు. చదవండి: ఇంటింటా అభిమానం.. 55 లక్షల కుటుంబాల ప్రజలు మిస్డ్కాల్స్ వన్స్ ఎగైన్ థాంక్యూ సీఎం సార్ రెండో విడత నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వన్స్ ఎగైన్ థాంక్యూ సీఎం సార్. – గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జాని పాషా, ప్రధాన కార్యదర్శి పుట్టి రత్నం, ఉపాధ్యక్షులు జి.హరీంద్ర, కె.రామకృష్ణా రెడ్డి, కె.కిరణ్ -
హైదరాబాద్ మెట్రోపై ఎందుకు వివక్ష?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశపై కేంద్రం చేతులెత్తేయడం తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ పక్షపాత ధోరణికి నిదర్శనమని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత రద్దీ కలిగిన హైదరాబాద్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ సాధ్యం కాదంటోందని పేర్కొన్నారు. మంగళవారం ‘సాక్షి’లో ‘మెట్రో రెండోదశ దూరమే! ’శీర్షికన ప్రచురితమైన కథనంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. మెట్రో రెండోదశపై కేంద్రం తీరును తప్పుపడుతూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరీకి కేటీఆర్ లేఖ రాశారు. గాం«దీనగర్, కొచ్చి, బెంగళూరు, చెన్నై వంటి నగరా లతోపాటు చాలా తక్కువ జనాభా కలిగిన లక్నో, వారణాసి, కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, మీరట్ వంటి ఉత్తరప్రదేశ్‌లోని చిన్న పట్టణాలకు కూడా మెట్రో ప్రాజెక్టులను కేటాయించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. జనాభారద్దీ తక్కువగా ఉన్న ఇలాంటి నగరాలకు మెట్రో రైల్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్న కేంద్రం, హైదరాబాద్‌కి మాత్రం మెట్రోరైల్ విస్తరణార్హత లేదని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఇది కచ్చితంగా తెలంగాణ, హైదరాబాద్ నగరం పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న పక్షపాతమేనని, కేంద్రానిది సవతి తల్లి ప్రేమ అని కేటీఆర్ విమర్శించారు. పూర్తి సమాచారంతో డీపీఆర్ ఇచ్చాం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు మెట్రో రైల్ రెండవ దశకు అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని డీటెయిల్డ్ ప్లానింగ్ రిపోర్ట్(డీపీఆర్)ను అందించినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ, పీహెచ్‌డీటీ గణాంకాలు, ఇతర అర్హతలు, సానుకూలతలను కేంద్రం దృష్టికి తీసుకువచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన అన్ని రకాల సమాచారం అందించినా, తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెబుతున్న నేపథ్యంలో మరోసారి సమగ్ర సమాచారాన్ని, అన్ని రకాల పత్రాలను నివేదికలను కేంద్రానికి పంపుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు వాటిని జతచేశారు. కేంద్ర మంత్రి స్పందన నిరాశాజనకం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండవ దశ ప్రాధాన్యతను కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీని వ్యక్తిగతంగా కలిసి వివరించేందుకు తాను ప్రయత్నించానని కేటీఆర్ వివరించారు. కాగా, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. అయితే కేంద్రమంత్రి పూరీ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌పై సాధ్యమైనంత త్వరలో సరైన నిర్ణయం తీసుకొంటారని, తెలంగాణకు ప్రాజెక్టులు కేటాయిస్తారని ఆశించానని కేటీఆర్ తెలిపారు. -
పీఎల్ఐ పథకంలో రిలయన్స్
న్యూఢిల్లీ: సోలార్ ఫొటోవోల్టాయిక్ తయారీ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వ ప్రకటిత ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం రెండో దశలో 11 కంపెనీలకు చోటు లభించింది. వీటిలో రిలయన్స్, ఫస్ట్ సోలార్, ఇండోసోల్ తదితరాలున్నాయి. మొత్తం 39,600 మెగావాట్ల సామర్థ్యంగల ప్రాజెక్టులను ప్రభుత్వం కేటాయించింది. పథకంలో భాగంగా ఇందుకు రూ. 14,007 కోట్లు వెచ్చించనుంది. అత్యధిక సామర్థ్యంగల సోలార్ పీవీ మాడ్యూల్స్ రెండో దశలో భాగంగా విద్యుత్ శాఖ తాజా ప్రాజెక్టులను కేటాయించింది. వీటిలో 7,400 మెగావాట్లు 2024 అక్టోబర్‌కల్లా ప్రారంభంకావచ్చని అంచనా. ఈ బాటలో 2025 ఏప్రిల్‌కల్లా 16,800 మెగావాట్లు, 2026 ఏప్రిల్‌కు మరో 15,400 మెగావాట్లు సిద్ధంకానున్నట్లు అంచనా. వెరసి రెండో దశలో భాగంగా మొత్తం రూ. 93,041 కోట్ల పెట్టుబడులు లభించనున్నాయి. అంతేకాకుండా 1,01,487 ఉద్యోగాల సృష్టికి అవకాశముంది. వీటిలో 35,010 ఉద్యోగాలు ప్రత్యక్షంగా, 66,477 పరోక్షంగా లభించే వీలుంది. కంపెనీల వివరాలు పాలీసిలికాన్, ఇన్గాట్ వేఫర్స్, సోలార్ సెల్స్, మాడ్యూల్ బాస్కెట్లో రిలయన్స్, ఇండోసోల్ విడిగా 6,000 మెగావాట్ల చొప్పున ప్రాజెక్టులను పొందాయి. ఈ బాటలో ఫస్ట్ సోలార్ 3,400 మెగావాట్లను పొందింది. వేఫర్స్, సోలార్ సెల్స్, మాడ్యూల్స్ బాస్కెట్లో వారీ 6,000 మెగావాట్లు, రీన్యూ 4,800 మెగావాట్లు, అవాడా 3,000 మెగావాట్లు, గ్రూ 2,000 మెగావాట్లు, జేఎస్‌డబ్ల్యూ 1,000 మెగావాట్ల ప్రాజెక్టులు పొందాయి. ఇక సోలార్ సెల్స్, మాడ్యూల్స్‌లో టాటా పవర్ సోలార్ 4,000 మెగావాట్లు, విక్రమ్ 2,400 మెగావాట్లు, యాంపిన్ 1,000 మెగావాట్లు చొప్పున ప్రాజెక్టులు అందుకున్నాయి. హైటెక్నాలజీతో.. హై టెక్నాలజీ సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీ వేల్యూ చైన్‌లో దేశం బలపడుతున్నట్లు పీఎల్ఐ పథ కం విజయంపై స్పందిస్తూ విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు. తాజా సామర్థ్య విస్తరణ ద్వారా సోలార్ తయారీ రంగంలో దేశం స్వావలంబన దిశగా భారీ అడుగులు వేస్తున్నట్లు తెలియజేశా రు. కాగా.. పథకం తొలి దశలో భాగంగా 2022 నవంబర్–డిసెంబర్లో 8,737 మెగావాట్ల సమీకృత సామర్థ్య ప్రాజెక్టులను కేటాయించింది. వెరసి పీ ఎల్ఐ పథకం రెండు దశల్లో కలిపి మొత్తం 48,337 మెగావాట్ల ప్రాజెక్టులు కేటాయించింది. రూ. 18,500 కోట్లకుపైగా ఆర్థిక మద్దతు ప్రకటించింది. -
కంటి ‘వెలుగు’ కావాలి!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం రెండో విడత మొదలవనుండటంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. గతంలో కంటి పరీక్షలు చేసినప్పుడు ఇచ్చిన అద్దాలు ఇప్పుడు పనిచేయడం లేదని, కొత్తవి ఇవ్వాలన్న విజ్ఞప్తులతోపాటు.. ఆపరేషన్లు అవసరమయ్యే వారికి వెంటనే చేయించేలా ఏర్పాట్లు చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. కేవలం పరీక్షలు జరిపి అద్దాలు, మందులతో సరిపెట్టవద్దని.. శస్త్రచికిత్స చేయించాలని బాధితులు కోరుతున్నారు. ఘనంగా ప్రారంభించినా.. రాష్ట్రంలో ప్రజల దృష్టి సమస్యలను నివారించేందుకు ప్రభుత్వం 2018 ఆగస్టు 15న ‘కంటి వెలుగు’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్ర జనాభాలో 25% మంది ఏదో ఒక స్థాయిలో కంటి సమస్యలతో బాధపడుతున్నారన్న విషయాన్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, వార్డులు, పట్టణాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎనిమిది మందితో కూడిన వైద్యబృందాలు పరీక్షలు చేపట్టాయి. రూ.196.79 కోట్ల వ్యయంతో 826కిపైగా బృందాలతో నాలుగున్నర నెలలపాటు కార్యక్రమం కొనసాగింది. తొలిరోజున 1,09,000 మందిని పరీక్షించారు. గరిష్టంగా ఒక రోజున లక్షన్నర మందికి కంటి పరీక్షలు చేశారు. మొత్తంగా 38 లక్షల మందికిపైగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో అవసరమైన వారికి అద్దాలు, మందులు ఇచ్చారు. ఆరున్నర లక్షల మందికిపైగా శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. ఇందులో మూడో వంతు మందికి ఆపరేషన్లు చేసినా.. ఆస్పత్రుల్లో సిబ్బంది, పరికరాలు, మౌలిక సదుపాయాల కొరత కారణంగా మిగతా వారికి నిర్వహించలేకపోయారు. ఈసారి ఆపరేషన్లు చేస్తారా? ‘కంటి వెలుగు’ పథకం రెండో విడత ఈనెల 18న ఖమ్మం వేదికగా మొదలుకానుంది. శస్త్రచికిత్సలు అవసరమయ్యే పలు రకాల కంటి వ్యాధులతో బాధపడేవారు ఈసారి తమకు ఊరట లభిస్తుందనుకున్నా.. అధికారుల తీరుతో ఆందోళన నెలకొంది. ‘కంటి వెలుగు’కు సంబంధించిన ప్రకటనల్లో, వివరాల్లో ఎక్కడా శస్త్రచికిత్సల ప్రస్తావన రావడం లేదు. గతంలో చేసిన పరీక్షల ప్రకారమే నాలుగున్నర లక్షల మందికిపైగా శస్త్రచికిత్సల కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి దానికి అదనంగా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అందువల్ల ఆపరేషన్లు చేయించే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు వయసు మీద పడుతున్న కొద్దీ కంటి సమస్యలు తీవ్రమవుతుంటాయని, అందువల్ల ఏటా కంటి పరీక్షలు నిర్వహించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. మసకబారుతున్న చూపు! క్రితంసారి ఇచ్చిన కంటి అద్దాల్లో చాలామందికి ఇప్పుడవి పనిచేయడం లేదు. వారిలో చూపు మసకబారి దృష్టి లోపాలు పెరిగిపోతున్నాయి. వీరిలో కొందరు శస్త్రచికిత్స అవసరమైన స్థితికి చేరినట్టు అంచనా. కంటిచూపు బాధితుల్లో అధికులు పేద, మధ్య తరగతివారే. వీరిలో కొందరు అప్పోసప్పో చేసి ప్రైవేటులో చికిత్స చేయించుకుంటున్నా.. చాలామందికి ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేక అంధత్వం బారిన పడుతున్నారు. అప్పుడిచ్చిన అద్దాలు సరిగా పనిచేయట్లేదు.. ప్రభుత్వం కంటి వెలుగు పథకం కింద కంటి అద్దాలు ఇచ్చింది. అయితే కొన్నిరోజుల నుంచి అవి సరిగా పనిచేయట్లేదు. సరిగా కనిపించడం లేదు. ఆ అద్దాలు పెట్టుకోవట్లేదు. కొత్త అద్దాలు ఇవ్వాలి. – తోకునూరి నర్సమ్మ, చింతపల్లి, సీరోలు మండలం, మహబూబాబాద్ జిల్లా ఈసారైనా ఆపరేషన్ చేస్తారో..లేదో! నాకు ఒక కన్ను పూర్తిగా కనిపించదు. తొలివిడత కంటి వెలుగు కార్యక్రమంలో డాక్టర్లు పరీక్షించి.. ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇంతవరకు చేయలేదు. చాలా ఇబ్బంది అవుతోంది. ఈసారి చేయిస్తామని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడైనా అవుతుందో లేదో.. – రంగమ్మ, సోంపురం, కేటీదొడ్డి, జోగుళాంబ గద్వాల జిల్లా కంటి వెలుగుకు సహకరిస్తాం ప్రభుత్వం పేదల కోసం మంచి కార్య క్రమం చేపట్టింది. దృష్టి సమస్యలతో బాధపడుతున్న వారికి కంటి పరీక్షలు నిర్వ హించి అద్దాలు ఇవ్వడం అభినందనీయం. ప్రభుత్వం పిలిస్తే ప్రైవేటుగా ప్రాక్టీసు చేస్తున్న వేలమంది ఆప్తా ల్మాలజిస్టులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తరఫున స్వచ్ఛందంగా కంటివెలుగులో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. – డాక్టర్ బీఎన్ రావు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు -
75 బృందాలు..100 రోజులు
సాక్షి,మేడ్చల్ జిల్లా: రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. వచ్చే నెల 18న కార్యక్రమం ప్రారంభం కానుండగా, ఇప్పటికే గ్రామీణ, పట్టణ జనాభాకు అనుగుణంగా వైద్య బృందాల నియామకం పూర్తయింది. ఈ మేరకు నేత్ర వైద్య సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్లను తాత్కాలిక పద్ధతిలో నియమించారు. వంద రోజుల పాటు నిర్వహించే కంటివెలుగుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. వారానికి అయిదు రోజుల పాటు నిర్దేశించిన కేంద్రాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. 2018లో మొదటి విడత కంటివెలుగు నిర్వహించిన సమయంలో పరీక్షలు నిర్వహించి దృష్టి లోపం ఉన్నవారిలో కొందరికే శస్త్రచికిత్స చేశారు. ఈసారైనా శస్త్రచికిత్స చేసి కంటి అద్దాలు పంపిణీ చేస్తారని కంటి రోగులు ఆశిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి శస్త్రచికిత్స చేసేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఒక్కో బృందంలో ముగ్గురు.. మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో 27,75,067 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 40 డివిజన్ల పరిధిలో 20,92,711 మందికి పరీక్షలు చేపట్టాలని నిర్ణయించగా, ఇందుకు 43 బృందాలను నియమించారు. జిల్లాలోని బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్,నిజాంపేట నగర పాలక సంస్థలు , మేడ్చల్, గుండ్లపోచంపల్లి ,దుండిగల్ ,కొంపల్లి, తూముకుంట, నాగారం, దమ్మాయిగూడ, ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీ పరిధిలో మొత్తంగా 289 డివిజన్లు/ వార్డులు ఉండగా, 5,36,567 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యంతో 18 బృందాలను నియమించారు. అలాగే, 61 గ్రామ పంచాయతీల్లో సుమారు 1,45,789 జనాభా ఉన్నట్లు వైద్య శాఖ అధికారులు అంచనా వేసి, 10 బృందాలను నియమించారు. జిల్లావ్యాప్తంగా మొత్తంగా 75 బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో వైద్యుడు, నేత్ర వైద్య సహాయకుడు, ఆపరేటర్ ఉంటారు. వీరికి స్థానికంగా ఉండే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు సహకరిస్తారు. ఇటీవలే వైద్య బృందాలకు శిక్షణ ఇచ్చారు. సెలవు దినాలు మినహా వారానికి అయిదు రోజుల చొప్పున 100 రోజుల పాటు వైద్య పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షించే పరికరాలను, ఆటో రిఫ్రాక్టర్(ఏఆర్) మీటర్లను ప్రభుత్వం సమకూరుస్తుంది. నిరంతరాయంగా శిబిరాలు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కంటివెలుగు కార్యక్రమం నిర్వహణకు వైద్యఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. ఇటీవలి కాలంలో కంటి సంబంధిత సమస్యలతో బాధ పడే వారి సంఖ్య పెరిగిన నేపథ్యంలో కంటివెలుగు కార్యక్రమం అధికారులు చెబుతున్నారు. వైద్య పరీక్షలతో సరిపెట్టకుండా లోపాలున్న ఇకపై నిరంతరాయంగా కొనసాగుతుందని వారందరికీ శస్త్రచికిత్స నిర్వహిస్తేనే పేదలకు ప్రయోజనం కలగనుంది. ఈసారైనా శస్త్రచికిత్సలు జరిగేనా.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో తొలి విడతలో 1,27,146 మందిని పరీక్షించగా 82,157 మందికి మాత్రమే కంటి అద్దాలు అందజేశారు. జిల్లాలో 42,148 మందికి అధిక దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించటంతోపాటు కంటి ఆపరేషన్లు చేయాలని నిర్ణయించినప్పటికిని, 545 మందికి మాత్రమే కంటి ఆపరేషన్లు చేశారు. మిగతా వారందరికి విడతల వారిగా శస్త్రచికిత్సలు చేస్తామని చెప్పినా ఆచరణకు నోచుకోలేదు.బాధితులు శస్త్రచికిత్స కోసం అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ప్రతి ఒక్కరికీ పరీక్షలు.. జిల్లాలో కంటివెలుగు నిర్వహణ కోసం వైద్య బృందాలను నియమించాం. పరికరాలు, ఇతర వనరులపై ప్రభుత్వానికి నివేదించాం. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి -
నరసన్నపేట పర్యటనకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, శ్రీకాకుళం(నరసన్నపేట): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 23న నరసన్నపేటకు రానున్నారని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్‌లు తెలిపారు. తొలుత 25న వస్తారని అనుకున్నా రెండు రోజులు ముందుగానే పర్యటన ఖ రారైందని వీరు తెలిపారు. ఈ మేరకు గురువారం హెలీప్యాడ్, సభాస్థలి కోసం కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, ఎస్పీ జీఆర్ రాధికలతో కలిసి ఎమ్మెల్యే కృష్ణదాస్ స్థల పరిశీలన చేశారు. అనంతరం జూనియర్ కళాశాల మైదానం వద్ద విలేకరులతో మాట్లాడారు. 23 ఉదయం 10గంటలకు జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష (రీసర్వే) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని ప్రకటించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సీఎం బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, జమ్ము వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జమ్ము కూడలి నుంచి మెయిన్ రోడ్డు మీదుగా కళాశాల మైదానం వరకూ సీఎం రోడ్ షో ఉంటుందని అన్నారు. సభా ఏర్పాట్లను గురువారం రాత్రి నుంచే ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతి, ఆర్డీఓ బి.శాంతి, ఎంపీపీ ఆరంగి మురళి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు చింతు రామారావు, నరసన్నపేట సర్పంచ్ బూరల్లి శంకర్ పాల్గొన్నారు. చదవండి: (హైకోర్టు ఆదేశాలు.. మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ విచారణ) -
మళ్లీ కంటి వెలుగు.. జనవరి 18 నుంచి షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. కంటి వెలుగు అమలు తీరు, నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానాల నమూనాల పరిశీలన, ప్రజారోగ్యం, వైద్యం అంశాలపై సీఎం కేసీఆర్ గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదల కన్నుల్లో వెలుగులు నింపాం ‘గతంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నది. ముఖ్యంగా కంటి చూపు కోల్పోయిన పేదలైన వృద్ధులకు ఈ పథకం ద్వారా కంటి చూపు లభించింది. రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లు అందించింది. తద్వారా వారు పొందిన ఆనందానికి అవధులు లేవు. పేదల కన్నుల్లో వెలుగులు నింపి వారి ఆనందాన్ని పంచుకోవడం గొప్ప విషయం. అందువల్ల మరోసారి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు పథకం కింద ఉచితంగా నేత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారందరికీ ఉచితంగానే కంటి అద్దాలు కూడా అందిస్తాం’ అని సీఎం తెలిపారు. ఇందుకు అవసరమైన సిబ్బందిని, కళ్లద్దాలు, పరికరాలు ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, వి.శ్రీని వాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, సబితాఇంద్రా రెడ్డి, ఎమ్మెల్యేలు ఎ.జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, కంచర్ల భూపాల్ రెడ్డి, జి.విఠల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజే శ్వర్‌రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, ప్రభు త్వ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇదీ చదవండి: బుల్లెట్ ప్రూఫ్‌తో సీఎం ఛాంబర్.. అత్యాధునిక హంగులతో నూతన సచివాలయం -
CM Jagan: 25న నరసన్నపేటకు సీఎం వైఎస్ జగన్!
సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25న శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. నరసన్నపేట నియోజకవర్గంలో ఏదో ఒక చోట జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష (రీ సర్వే) రెండో విడత పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనకు సంబంధించి సీసీఎల్ఏ నుంచి కలెక్టర్ శ్రీ కేష్ బి.లాఠకర్‌కు ప్రాథమిక సమాచారం చేరింది. ఇదే అంశంపై శనివారం సాయంత్రం నరసన్నపేట ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌తో కలెక్టర్ లాఠకర్తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాల విషయాన్ని ఈ సందర్భంగా చర్చించారు. తామరాపల్లిలో సభ నిర్వహణకు అనువుగా ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. సభ నిర్వహణ ఏర్పాట్లు, హెలీ పాడ్, తదితర అంశాలను సోమవారం మధ్యాహ్నం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించారు. డిసెంబర్ నెలాఖరులో భావనపాడు పోర్టుకు శంకుస్థాపన, ఉద్దానం మంచినీటి పథకం ప్రారంభోత్సవానికి కూడా ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలను కూడా కలెక్టర్‌తో కలిసి చర్చించారు. ఈ భేటీలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, రాజాపు అప్పన్న, ముద్దాడ బైరాగి నాయుడు, చింతు రామారావు, కణితి కృష్ణారావు, త్రినాథ్ తదితరులు ఉన్నారు. చదవండి: (పిల్ల సైకోలను పోగేసుకొచ్చి.. వారు తిరగబడితే పరుగెడుతున్నారు: జోగి రమేష్) -
టెక్స్టైల్స్ రంగానికి రెండో విడత పీఎల్ఐ
న్యూఢిల్లీ: టెక్స్టైల్స్ రంగానికి రెండో విడత ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) పరిశీలిస్తున్నట్టు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. టెక్స్టైల్స్ ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న చైనా, వియత్నాం దేశాలతో పోటీపడేందుకు ఇది పరిశ్రమకు మద్దతుగా నిలుస్తుందని. టెక్స్టైల్స్ రంగానికి ప్రకటించిన పీఎల్ఐ పథకం పనితీరుపై ఆ శాఖ వ్యవహరాలను చూస్తున్న గోయల్ సమీక్షించారు. టెక్స్టైల్స్ పీఎల్ఐ 2.0 ప్రకటించానికి ముందు భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమ అంతర్జాతీయ మార్కెట్లో బలమైన పోటీనిచ్చే విధంగా పీఎల్ఐ 2.0ని రూపొందించాలన్నారు. అధిక విలువ కలిగిన ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని పరిశ్రమకు సూచించారు. ఉపాధి అవకాశాల కల్పనకు, ఎగుమతులు, వృద్ధి బలోపేతానికి తగినన్ని సామర్థ్యాలు టెక్స్టైల్స్ పరిశ్రమకు ఉన్నట్టు చెప్పారు. -
తెరపైకి మెట్రో నియో, రెండో దశ, బీఆర్టీఎస్
సాక్షి, హైదరాబాద్: జెట్ స్పీడ్‌తో విస్తరిస్తోన్న గ్రేటర్ సిటీ ప్రజారవాణా వ్యవస్థలో మెట్రో శకం మొదలైంది. ఆధునిక రవాణా సదుపాయాల కల్పన ద్వారానే ట్రా‘ఫికర్’ తగ్గించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెట్రో నియో, రెండోదశ ప్రాజెక్టులతో పాటు కేవలం బస్సులే ప్రత్యేక మార్గంలో రాకపోకలు సాగించేందుకు వీలుగా బీఆర్టీఎస్ ప్రాజెక్టులు చేపట్టాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఆ దిశగా సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ.. వీటిని పట్టాలెక్కించేందుకు నిధుల లేమి శాపంగా పరిణమిస్తోంది. నగరంలో వ్యక్తిగత వాహనాల సంఖ్య 75 లక్షలకు చేరువ కావడం, ప్రజా రవాణా వ్యవస్థ వినియోగం 40 శాతానికి మించకపోవడంతో రహదారులపై నిత్యం ట్రాఫిక్ నరకం సిటీజన్లకు పట్టపగలే చుక్కలు చూపుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా నిలుస్తూ.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు దిక్సూచిగా మారిన పలు ప్రాజెక్టులు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. మెట్రో నియో ఇలా... మెట్రో నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి మెట్రో నియో చక్కటి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధానంలో మెట్రో ప్రాజెక్టు తరహాలోనే రహదారి మధ్యలో పిల్లర్లు ఏర్పాటుచేసి దానిపై రహదారిని ఏర్పాటు చేస్తారు. దీన్ని ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ సిస్టం (ఈబీఆర్టీఎస్) లేదా మెట్రో నియో మార్గం అని పిలుస్తారు. ఈ మార్గంలో కేవలం బ్యాటరీ బస్సులు మాత్రమే నడపాల్సి ఉంటుంది. ట్రాఫిక్రద్దీ అధికంగా ఉండే ఐటీ కారిడార్ సహా పలు రూట్లలో ఇది అనువైన ప్రాజెక్టు. ఈ రూట్లో అన్ని రకాల వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉన్నప్పటికీ.. కేవలం ప్రజారవాణా వ్యవస్థలో భాగమైన బ్యాటరీ బస్సులను మాత్రమే అనుమతించాలి. దీంతో ట్రాఫిక్ చిక్కులు, కాలుష్య ఆనవాళ్లు ఉండవు. ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం బయలుదేరిన వారు ట్రాఫిక్ చిక్కులు లేకుండా సమయానికి గమ్యస్థానం చేరుకునే వీలుంటుంది. నగరంలో కేపీహెచ్‌బీ–ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్– కోకాపేట్ మార్గంలో సుమారు రూ.300 కోట్ల అంచనా వ్యయంతో మెట్రోనియో ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్రం తాజాగా అనుమతించడం గమనార్హం. బీఆర్టీఎస్ సైతం.. అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉండే రహదారులను విస్తరించి.. ఈ రహదారికి మధ్యలో కేవలం బస్సులు మాత్రమే రాకపోకలు సాగించేందుకు వీలుగా రెండు లేన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒకవైపు బస్సులు రావడానికి, మరోవైపు వెళ్లడానికి ఈ మార్గం అనువుగా ఉంటుంది. బీఆర్టీఎస్ ఏర్పాటుకు కిలోమీటర్‌కు రూ.110 కోట్లు వ్యయం అవుతుంది. శివారు ప్రాంతాల్లో ఆస్తుల సేకరణ అవసరం ఉండని కారణంగా కిలోమీటరుకు రూ.20 కోట్లు ఖర్చు చేసి బీఆర్టీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. రెండో దశ మార్గం ఇదీ.. ప్రస్తుతం ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్– ఎంజీబీఎస్, నాగోల్– రాయదుర్గం మార్గాల్లో 69.2 కి.మీ మేర మెట్రో అందుబాటులో ఉంది. నగరంలో సుమారు 270 కి.మీ మార్గంలో మెట్రో ఏర్పాటు చేయాల్సి ఉందని గతంలో లీ అసోసియేట్స్ నివేదిక స్పష్టంచేసింది. (క్లిక్ చేయండి: నగరంపై ‘కారు’ మబ్బులు!) ఈ నివేదిక మేరకు మెట్రో రెండోదశ మార్గాలను.. రాయదుర్గం– శంషాబాద్ విమానాశ్రయం, ఎంజీబీఎస్–ఫలక్‌నుమా, బీహెచ్ఈఎల్– గచ్చిబౌలి– లక్డీకాపూల్, నాగోల్– ఎల్బీనగర్, బీహెచ్ఈఎల్–పటాన్చెరు, జేఎన్టీయూ– ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, బీహెచ్ఈఎల్–పటాన్చెరు, ఎల్బీనగర్– అబ్దుల్లాపూర్‌మెట్, జేబీఎస్– కూకట్పల్లి వై జంక్షన్, తార్నాక– కీసర–ఓఆర్ఆర్, నానక్‌రాంగూడ– బీహెచ్ఈఎల్, బోయిన్పల్లి– మేడ్చల్, ఎల్బీనగర్–చాంద్రాయణగుట్ట– శంషాబాద్, ఎంజీబీఎస్–ఘట్కేసర్ మార్గాలున్నాయి. ఒక కిలోమీటరు మార్గంలో మెట్రో ప్రాజెక్టు పూర్తిచేసేందుకు రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. ఇంత మొత్తం వ్యయం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. పబ్లిక్– ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టేందుకు సైతం ఏ సంస్థా ముందుకు రాకడంలేదు. -
28న టీ–హబ్ రెండో దశ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రం ‘టీ–హబ్’రెండో దశను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. రాయదుర్గంలోని టీ–హబ్ భవనంలో ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీ–హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాస్‌రావు అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో ప్రసంగాలు, చర్చాగోష్టులు ఉంటాయి. డ్రాయిన్ బాక్స్, మీషో, స్విగ్గీ, ప్రిస్టిన్‌కేర్, డెలివరీ వంటి యూనికార్న్ సంస్థలు, సిక్వోయా క్యాపిటల్, యాక్సెల్, కలారీ క్యాపిటల్స్ వంటి వెంచర్ క్యాపిటలిస్టు సంస్థలు, సాప్, మారుతి సుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు టీ–హబ్ రెండో దశ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 2016లో టీ–హబ్ రెండో దశకు శంకుస్థాపన చేయగా 2020 నాటికి అందుబాటులోకి వస్తుందని భావించారు. అయితే కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో నిర్మాణం ఆలస్యం అయింది. ఇటీవల పనులు పూర్తి కావడంతో ఈ నెల 28న ప్రారంభించేందుకు ఐటీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
AP: రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ షురూ
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకం రెండో దశ కింద పీఎంఏవై–వైఎస్సార్ గ్రామీణ్‌లో భాగంగా 1,79,060 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖతో కూడిన పట్టాల పంపిణీని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు చేపట్టారు. చదవండి: పరిశ్రమలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. ఈ నెల 17వ తేదీ నాటికి పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, సీఎం రాసిన లేఖలను పంపిణీ చేశారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, కొయ్యలగూడెంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పాడేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. -
బీజేపీని ఇరుకున పెట్టెందుకు కాంగ్రెస్ వ్యూహాం
-
మణిపూర్‌లో కొనసాగుతున్న రెండో విడత పోలింగ్
-
11 జిల్లాల్లో రెండోవిడత జ్వర సర్వే షురూ
సాక్షి, హైదరాబాద్: రెండోవిడత ఇంటింటి జ్వర సర్వే 11 జిల్లాల్లో ఆదివారం ప్రారంభమైంది. జగిత్యాల, కామారెడ్డి, నాగర్‌కర్నూలు, నారాయణపేట, నిర్మల్, వనపర్తి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో సిబ్బంది ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో మొదటి విడత సర్వే పూర్తికాగానే మొదలుపెడతారని పేర్కొంది. సర్వేలో భాగంగా కరోనా లక్షణాలున్నవారిని గుర్తించి కిట్లు అందజేస్తుండటంతో ఎక్కడికక్కడే వ్యాప్తిని కట్టడి చేయగలుగుతున్నారు. రోగుల పరిస్థితి తీవ్రం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. సెకండ్ వేవ్‌లో మూడు, నాలుగుసార్లు కూడా జ్వర సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. అప్పుడు ఏకంగా 8 లక్షల మందికి మెడికల్ కిట్లు అందజేశారు. ఇప్పుడు కూడా అవసరాన్ని బట్టి పలు విడతలుగా జ్వర సర్వే చేపడతామని అధికారులు తెలిపారు. ఈ నెల 21 నుంచి 29 వరకూ జరిగిన మొదటి విడత సర్వేలో రాష్ట్రంలో కేవలం 9 రోజుల వ్యవధిలోనే 4,00,283 మందిలో కరోనా లక్షణాలున్నట్లుగా గుర్తించారు. వీరిలో అందరికీ కరోనా అని నిర్ధారణ కాకపోయినా, 3,97,898 మందికి మెడికల్ కిట్లు అందజేశారు. -
అక్టోబర్ 7న ఒంగోలుకు సీఎం జగన్
సాక్షి, ఒంగోలు: వైఎస్సార్ ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఈనెల 7వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంగోలు రానున్నారని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎం కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో ముందుగా పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలోని క్రీడా మైదానాన్ని మంత్రి బాలినేని, తలశిల రఘురాం, సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ వకుల్ జిందాల్, కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మలికాగర్గ్ సోమవారం పరిశీలించారు. అనంతరం క్రీడా మైదానంలో సీఎం కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో వారు చర్చించారు. క్రీడా మైదానంలో దక్షిణ భాగంలో ముఖ్యమంత్రి సభావేదిక ఉండాలన్నారు. 23 నెలల తరువాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు వస్తుండడంతో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావించాలన్నారు. పీవీఆర్ గ్రౌండ్‌ను పరిశీలిస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పక్కన సీఎం కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం, సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ వకుల్ జిందాల్, కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మలికాగర్గ్ మహిళల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్, ఎస్పీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని విజయవంతం చేయాలన్నారు. ఉదయం 9 గంటలకు మహిళలు పీవీఆర్ ఉన్నత పాఠశాలలో ఉండేలా చూడాలన్నారు. కోవిడ్ నిబంధనలు అనుసరించి 20 వేల మంది కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో హెలిపాడ్ ఏర్పాట్లు, వేదిక వద్దకు సీఎం వచ్చే రూటుకు ఆర్అండ్బీ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలు మార్గానికి అడ్డు రాకుండా సీఎంకు అభివాదం చేసేందుకు వీలుగా బ్యారికేడ్ల ఏర్పాటుకు సంబంధించి పలు సూచనలు చేశారు. హెలిపాడ్ నుంచి సభా ప్రాంగణానికి వచ్చే ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం మాట్లాడుతూ వైఎస్సార్ ఆసరా రెండో విడతలో మహిళలకు నగదు పంపిణీ కార్యక్రమం ఒంగోలులో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జిల్లాకు వచ్చి దాదాపు రెండేళ్లవుతున్నందున విజయవంతం చేసే బాధ్యత మహిళలపై ఉందన్నారు. కేవలం రెండు రోజుల సమయంలో సభా ఏర్పాట్ల విషయంపై కొందరు అనుమానం వ్యక్తం చేయగా ‘ఒంగోలులో వాసన్న ఉన్నాడు కదా చూసుకుంటాడు’ అని సీఎం జగన్మోహన్రెడ్డి అన్నట్లు తలశిల తెలిపారు. కోవిడ్ రెండు టీకాలు వేయించుకుంటేనే అనుమతి: కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ రెండు టీకాలు వేయించుకున్న వారినే కార్యక్రమానికి అనుమతిస్తామన్నారు. ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటు చేయాలని, నగరంలో విద్యుత్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీలు నియమించాలని, కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రికి వివరించారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాలతోపాటు రైతు భరోసా కేంద్రాల్లోను సీఎం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈవో ఎండీ ఇంతియాజ్, ఎస్పీ మలికాగర్గ్, జేసీలు జేవీ మురళి, కె.కృష్ణవేణి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, డీఆర్వో ఎస్.సరళావందనం, లిడ్ క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, డీఆర్డీఏ పీడీ బాబూరావు, మెప్మా పీడీ టి.రవికుమార్, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. సీఎం పర్యటన ఇలా సీఎం పర్యటన షెడ్యూల్‌ను కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మీడియాకు విడుదల చేశారు. ఉదయం 9.55 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద నుంచి హెలికాప్టర్లో బయల్దేరతారు. 10.35 గంటలకు ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కాలేజీలో హెలికాప్టర్ దిగుతారు. 10.45 గంటలకు హెలిపాడ్ నుంచి బయల్దేరి 11 గంటలకు సభాస్థలి అయిన ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. పది నిముషాలపాటు స్టాల్స్‌ను పరిశీలిస్తారు. 11.15 గంటలకు జ్యోతి ప్రజ్వలన, డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. 11.25 గంటలకు మంత్రుల ప్రసంగాలు, 11.40 నుంచి 12 గంటల వరకు లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి కార్యక్రమం, అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగం ఉంటుంది. 12.30 గంటలకు వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభిస్తారు. 12.40 గంటలకు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్‌తో కార్యక్రమం ముగుస్తుంది. 12.45 గంటలకు సభాస్థలి వద్ద నుంచి కారులో హెలిపాడ్‌కు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకుంటారు. 1.05 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి 1.50 గంటకు తాడేపల్లిలోని నివాసానికి సీఎం చేరుకుంటారు. -
ఐపీఎల్లో కొత్త రూల్.. బ్యాట్స్మెన్లకు ఫంక్షన్, బౌలర్లకు టెన్షన్
ముంబై: కరోనా కారణంగా అర్థంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 మ్యాచ్‌లకు సన్నాహాలు మొదలయ్యాయి. యూఏఈ వేదికగా లీగ్‌లో మిగిలిపోయిన 31 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే రెండో దశ లీగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఈ మెగా టోర్నీ సెకెండ్ హాఫ్ జరగనుంది. అయితే ఐపీఎల్ తొలి దశ సందర్భంగా ఎదురైన సమస్యలకు చెక్ పెట్టేందుకు బీసీసీఐ తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని రెండో దశ ఐపీఎల్ కోసం సరికొత్త రూల్‌ను తీసుకొచ్చింది. ఎవరైనా ఆటగాడు బంతిని స్టాండ్స్‌లోకి బాదితే.. ఆ బంతిని తిరిగి ఉపయోగించవద్దనే నిబంధనను తెరపైకి తెచ్చింది. మైదానం ఆవల పడే బంతులను ఇతరులు తాకే అవకాశం ఉన్నందున, తిరిగి అదే బంతిని వాడితే కరోనా సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆ బంతి స్థానంలో కొత్త బంతిని వినియోగించాలని బీసీసీఐ ప్రతిపాదించింది. ఐపీఎల్ సెకెండ్ ఫేస్ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతిస్తున్నందున ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా, బీసీసీఐ ప్రతిపాదించిన ఈ కొత్త రూల్ బ్యాట్స్మెన్లకు ఫంక్షన్, బౌలర్లకు టెన్షన్ అన్న చందంగా మారింది. ఎందుకంటే కొత్తబంతి హార్డ్‌గా ఉంటూ సులువుగా బ్యాట్‌పైకి వస్తుంది. పైగా యూఏఈ పిచ్‌లు స్పిన్నర్లకు సహకరిస్తాయి. అయితే ఈ నిబంధన కారణంగా కొత్త బంతి వచ్చిన ప్రతీసారి బౌలర్లు దానికి అనుగుణంగా బౌల్ చేయాల్సి ఉంటుంది. దీంతో బౌలర్లకు బంతిపై పట్టుచిక్కకుండా పోతుంది. ఇది బ్యాట్స్‌మెన్‌కు అడ్వాంటేజ్‌గా మారుతుంది. అందుకే ఈ నిబంధన బౌలర్లకు పెద్ద శిక్షేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. -
రేపే కాపు నేస్తం రెండో విడుత.. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ. 15 వేలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాపు నేస్తం పథకం అమలుకు రంగం సిద్ధమైంది. గతేడాది శ్రీకారం చుట్టుకున్న ఈ పథకం ఈ ఏడాది కూడా అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన కాపు, బలిజ, ఒంటరి, తెలగ పేద మహిళలకు ఈ పథకం వరం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చి నవెంటనే కాపు పేద మహిళలకు ఆపన్న హస్తం అందించనున్నట్లు ప్రకటించారు. తానిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వెంటనే కసరత్తు చేయించారు. గత ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం పేరిట పథకానికి తొలి అడుగు వేశారు. ఈ సామాజిక వర్గంలోని పేద మహిళల మోమున చిరునవ్వులు పూయించారు. ఈ ఏడాదీ వాస్తవానికి కరోనా పరిస్థితి వీడలేదు. ఆర్థిక పరిస్థితులూ సహకరించకున్నా రెండో ఏడాది వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అమలుపై సీఎం నిబద్ధత ప్రదర్శిస్తున్నారు. పథకాన్ని సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం మహిళల ఖాతాల్లోకి వైఎస్సార్ కాపునేస్తం సొమ్ములు నేరుగా జమకానున్నాయి. రెండో ఏడాది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 3,27,244 మంది అక్కాచెల్లెమ్మలకు రూ.490.86 కోట్ల ఆర్థికసాయం అందనుంది. పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్‌ఇన్‌కంబర్డ్ ఖాతాల్లో నగదు జమ కానుంది. ప్రతి ఏటా రూ.15వేల చొప్పున అయిదేళ్లలో రూ.75వేల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందించనుంది. -
మహిళల ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల వయసు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.18,750 చొప్పున ఆర్థిక సహాయం అందించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మంగళవారం క్యాంపు కార్యాలయంలో వరుసగా రెండో ఏడాది 23,14,342 మంది మహిళలకు రూ.4,339.39 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మట్లాడుతూ.. వైఎస్ఆర్ చేయూత ద్వారా 23.14 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని, మహిళల ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ చేశామన్నారు. 45-60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 సాయం అందిస్తున్నామని తెలిపారు. కుటుంబానికి మహిళలే రథసారధులు నాలుగేళ్లలో రూ.75వేల చొప్పున సాయం చేసే గొప్ప కార్యక్రమం అని, ప్రతి కుటుంబానికి మహిళలే రథసారధులు సీఎం జగన్ అన్నారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా రెండేళ్లలో రూ.9వేల కోట్ల సాయం, ఆర్ధిక సాయంతో పాటు జీవనోపాధికి తోడ్పాటు అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. అమూల్, రిలయన్స్, పీ అండ్ జీ, ఐటీసీ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని, 78వేల మంది అక్కచెల్లెమ్మలు కిరాణా షాపులు పెట్టుకోగలిగారని సీఎం జగన్ తెలిపారు. లక్షా 19వేల మహిళలు ఆవులు, గేదెలు కొనుగోలు చేశారని, లీటర్ పాలకు అదనంగా రూ.15 వరకు లబ్ధి జరిగేలా కార్యాచరణ చేపట్టామని తెలిపారు. కంపెనీలు, బ్యాంకులతో లబ్ధిదారుల అనుసంధానంపై కాల్ సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కేబినెట్లోనూ మహిళలకు ప్రాధాన్యత కేబినెట్లోనూ మహిళలకు ప్రాధాన్యతఇచ్చామని, దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు నామినేటెడ్ పదవులను కేటాయించామని సీఎం జగన్ అన్నారు. ప్రతి రంగంలో అధిక శాతం మహిళలకు ప్రాతినిథ్యం కల్పించామని, వారి కోసం దిశ, అభయం యాప్ తీసుకొచ్చామని తెలిపారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేశామని, వారి రక్షణకై దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసులను నియమించామని, వారికోసం ప్రత్యేకంగా 900 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేశామని సీఎం జగన్ చెప్పారు. 45 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున వరుసగా నాలుగేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. నాలుగేళ్లలో ఈ పథకం ద్వారా మహిళలకు దాదాపు రూ.19,000 కోట్లు అందజేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. మొదటి, రెండో విడతలో కలిపి రూ.8,943 కోట్ల మొత్తం అక్క చెల్లెమ్మలకు అందజేసినట్లు అయింది. ఇప్పటికే 78వేల మందికి ఏపీ ప్రభుత్వం కిరాణా షాపులు పెట్టించింది. కిరాణా షాపుల ద్వారా ఒక్కో మహిళకు రూ.10వేల వరకు అదనపు ఆదాయం రానుంది. 1,90,517 మందికి ప్రభుత్వం గేదెలు, ఆవులు, మేకలు అందించింది. లీటర్ పాలకు అదనంగా రూ.5 నుంచి రూ.15 వరకు లబ్ధి చేకూరుతోంది. ఈ పథకం ద్వారా అందజేసే డబ్బులను ఉపయోగించుకోవడంలో మహిళలకు పూర్తి స్వేచ్ఛనిస్తూనే వారి జీవనోపాధి మార్గాలను మెరుగుపరుచుకునేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందజేస్తోంది. ఈ ఆర్థిక సహాయంతో మహిళలు కిరాణా షాపులతోపాటు గేదెలు, ఆవులు, మేకలు లాంటి జీవనోపాధి మార్గాలను ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణం పొందేందుకు తోడ్పాటు అందజేస్తారు. ఈ వ్యాపారాలలో మహిళలకు ఎక్కువ లాభాలు దక్కేలా అమూల్, హెచ్‌యూఎల్, రిలయెన్స్, పీఅండ్‌జీ, ఐటీసీ లాంటి దిగ్గజ సంస్ధలు, బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు వర్చువల్ విధానంలో పాల్గొనేలా ప్రతి గ్రామంలోని రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల కార్యాలయం నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: పటిష్ట యంత్రాంగంతో రికార్డు స్థాయి వ్యాక్సినేషన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ -
నేడు అక్క చెల్లెమ్మలకు రెండో విడత ‘చేయూత’
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45 – 60 ఏళ్ల వయసు అక్క చెల్లెమ్మలకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.18,750 చొప్పున నేడు ఆర్థిక సహాయం అందజేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు వర్చువల్ విధానంలో పాల్గొనేలా ప్రతి గ్రామంలోని రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల కార్యాలయం నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరవుతారు. రెండేళ్లలో రూ.8,943.52 కోట్లు సాయం.. 45 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ. 18,750 చొప్పున వరుసగా నాలుగేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. నాలుగేళ్లలో ఈ పథకం ద్వారా మహిళలకు దాదాపు రూ.19,000 కోట్లు అందజేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇందులో భాగంగా వరుసగా రెండో ఏడాది 23,14,342 మంది మహిళలకు రూ.4,339.39 కోట్ల ఆర్ధిక సాయాన్ని మంగళవారం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తద్వారా మొదటి, రెండో విడతలో కలిపి రూ.8,943 కోట్ల మొత్తం అక్క చెల్లెమ్మలకు అందజేసినట్లు అవుతుంది. సాయం సద్వినియోగం... ఈ పథకం ద్వారా అందజేసే డబ్బులను ఉపయోగించుకోవడంలో మహిళలకు పూర్తి స్వేచ్ఛనిస్తూనే వారి జీవనోపాధి మార్గాలను మెరుగుపరుచుకునేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందజేస్తోంది. ఈ ఆర్థిక సహాయంతో మహిళలు కిరాణా షాపులతోపాటు గేదెలు, ఆవులు, మేకలు లాంటి జీవనోపాధి మార్గాలను ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణం పొందేందుకు తోడ్పాటు అందజేస్తారు. కిరాణా షాపులు, పాడి పశువులు, జీవాల పెంపకంతో... వైఎస్సార్ చేయూత ద్వారా తొలి ఏడాది అందజేసిన సాయంతో ఇప్పటికే 78,000 మంది కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకోగా 1,90,517 మంది అక్కచెల్లెమ్మలు ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం చేపట్టి కుటుంబ ఆదాయాన్ని పెంపొందించుకున్నారు. ఈ వ్యాపారాలలో మహిళలకు ఎక్కువ లాభాలు దక్కేలా అమూల్, హెచ్‌యూఎల్, రిలయెన్స్, పీఅండ్‌జీ, ఐటీసీ లాంటి దిగ్గజ సంస్ధలు, బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే. కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకున్న మహిళలకు మార్కెట్ ధర కన్నా కంటే తక్కువకే ఆయా సంస్థలు తమ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాయి. పాడి గేదెలు, ఆవులు కొనుగోలు చేయడానికి సహాయం చేస్తూనే అమూల్‌తో భాగస్వామ్యం ద్వారా ఇప్పుడు మార్కెట్లో ఇస్తున్న ధర కన్నా లీటర్ పాలపై రూ. 5 నుంచి రూ. 15 వరకు మహిళలకు అదనపు ఆదాయం సమకూరేలా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అదనంగా లబ్ధి... ►ఇప్పటికే ప్రతి నెలా సామాజిక పింఛన్లు అందుకుంటున్న 45 – 60 ఏళ్ల వయసు కలిగిన ఆరు లక్షల మందికిపైగా ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు తమ కాళ్లపై నిలబడేందుకు పింఛన్‌కు అదనంగా వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ధి చేకూర్చనున్నారు. ►60 ఏళ్ల లోపు వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల ప్రయోజనం కోసం వైఎస్సార్ చేయూత పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అర్హత ఉంటే 60 ఏళ్ల తర్వాత వారికి పెన్షన్ మంజూరు చేసేలా పింఛను అర్హత వయసును వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే తగ్గించిన విషయం తెలిసిందే. అంతకుముందు వృద్ధాప్య పింఛనుకు 65 ఏళ్లు కనీస అర్హతగా ఉన్న వయసును ఈ ప్రభుత్వం 60 ఏళ్లకు తగ్గించింది. -
రెండో విడతలో ప్రధానికి టీకా!
న్యూఢిల్లీ: రెండో విడత వ్యాక్సినేషన్లో 50 ఏళ్ల వయస్సు పైబడిన ప్రజా ప్రతినిధులకు టీకా వేసే అవకాశముంది. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సహా మెజారిటీ కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రుల్లో అత్యధికులు, ఇతర ప్రముఖ ప్రజా ప్రతినిధులు ఈ కేటగిరీలోకి రానున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికు లు, పోలీసులు.. తదితర కోవిడ్–19 పై పోరాటంలో ముందుండి పోరాడిన యోధులకు జనవరి 16 నుంచి ప్రారంభమైన తొలి విడత వ్యాక్సినేషన్లో టీకా వేస్తున్న విషయం తెలిసిందే. తొలి విడతలో వ్యాక్సిన్ పొందేందుకు తొందరపడవద్దని వ్యాక్సి నేషన్ కార్యక్రమం ప్రారంభించే ముందు ప్రధాని మోదీ మంత్రులు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. టీకా లబ్ధిదారులతో నేడు మాటామంతీ ఉత్తర ప్రదేశ్‌లోని సొంత నియోజకవర్గం వారణాసిలో కోవిడ్ టీకా తీసుకున్నవారు, టీకా వేస్తున్నవారితో నేడు(శుక్రవారం) ప్రధానమంత్రి మోదీ మాట్లాడనున్నారు. టీకాకు సంబంధించి వారి అనుభవాలను ప్రధాని తెలుసుకుంటారని, ఈ కార్యక్రమం వర్చువల్‌గా జరుగుతుందని ప్రధాని కార్యాలయం తెలిపింది. టీకాపై అపోహలొద్దు: హర్షవర్ధన్ కరోనా టీకాలు సురక్షితమైనవి, సమర్ధవం తమైనవని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పునరుద్ఘాటించారు. టీకా వేసుకోవడం వల్ల కోవిడ్–19 వ్యాధి వ్యాప్తి తగ్గి, క్రమంగా అంతరించిపోతుందని పేర్కొన్నారు. టీకాపై అపోహలను తొలగించేందుకు ఉద్దేశించిన పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు. టీకా కావాలంటూ ప్రపంచవ్యాప్తంగా దేశాలు మనల్ని కోరుతున్నాయి. కానీ, మన దేశంలోని కొందరు మాత్రం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం టీకా సమర్ధతపై అపోహలను ప్రచారం చేస్తున్నారు’ అన్నారు. -
'వైఎస్ఆర్ చేయూత' రెండో విడత ప్రారంభం
-
'వైఎస్ఆర్ చేయూత' రెండో విడత ప్రారంభం
-
'వైఎస్ఆర్ చేయూత' రెండో విడత ప్రారంభం
సాక్షి, తాడేపల్లి: 'వైఎస్ఆర్ చేయూత' రెండో విడత సాయం కార్యక్రమాన్ని తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమీషనరేట్ కార్యాలయంలో గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ చేయూత’ మొదటి దశలో 21 లక్షల మంది మహిళలకు రూ. 4 వేల కోట్లు వారి ఖాతాల్లో జమచేశామని తెలిపారు. రెండో విడతలో భాగంగా 2.72 లక్షల మంది మహిళలకు రూ.510.01 కోట్లు అందజేస్తున్నామని తెలిపారు. 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు లబ్ధి చేకూరనుందని ఆయన పేర్కొన్నారు. ఏటా రూ.18,750 చొప్పున నాలుగు ఏళ్లకు రూ.75,000 ఆర్ధిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఈ పధకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పధకం మహిళలకు ఓ వరమని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు గొప్ప సాయం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రముఖ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకొని మహిళలుకు చేయూతనిస్తోందని పేర్కొన్నారు. -
కంటినిండా కాంక్షలతో...
బిహార్‌లో కీలకమైన రెండో విడత పోలింగ్ ముగిసింది. చివరిదైన మూడో విడతకు సాగే క్రమంలో రాజకీయ చిత్రం స్పష్టమౌతోంది. ఎన్నికల ప్రకటన ముందున్న నిశ్చింత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్లో లేదిప్పుడు. విమర్శలకు కేంద్రబిందువు అవుతున్న ఆయన ప్రతిష్ట ఇదివరకెపుడూ లేనంతగా తగ్గుతోంది. పరిస్థితి గమనిస్తున్న పాలక ఎన్డీయే తరచూ వ్యూహాలకు పదును పెట్టాల్సి వస్తోంది. అంతర్గత స్పర్థ వీడి ఐక్యంగా ఉంటే తప్ప ప్రత్యర్థిపై ఆధిక్యత లభించదని గుర్తించినట్టు వారి దిద్దుబాటు చర్యలే నిదర్శనం. ఎన్డీయే భాగస్వాములు బీజేపీ, జేడీ(యూ) పొద్దుపోయాక సయోధ్య రాగం అందుకున్నాయి. విపక్ష ఆర్జేడీ నాయకుడు, ‘మహాఘట్బంధన్’ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్‌కు జనాదరణ పెరుగుతోంది. ఫలితమెలా ఉన్నా... సామాజిక న్యాయ రాజకీయాలకు దేశంలో అంతేవాసిగా మిగిలిన బిహార్‌లోనూ రాజకీయ ముఖచిత్రం మారే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే, నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ పయనం తర్వాత కొత్తబాట పట్టిన వైనం. తరం మారుతున్న గట్టి సంకేతం! రామ్మనోహర్ లోహియా సిద్దాంతాలకు, జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వానికి ప్రభావితులై, సామాజికన్యాయ రాజకీయాల భిన్న పార్శా్వ లకు ప్రాతినిధ్యం వహించిన నాటి యువప్రతినిధుల్లో ఒకరు, లాలూ ప్రసాద్ యాదవ్ (72) శిక్షపడ్డ ఖైదీగా నేడు జైళ్లో ఉన్నారు. దళితవర్గ నేత రామ్‌విలాస్ పాశ్వాన్ (74) ఎన్నికల ప్రక్రియ మధ్యలోనే మరణించారు. మూడో ముఖ్యుడు నితీష్కుమారు (69) మూడు విడతలు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు విమర్శల సుడిగుండంలో చిక్కుకున్నారు. ప్రత్యర్థులు, వేర్పడ్డ లోక్‌జనశక్తి పార్టీయే కాదు, భాగస్వామ్య పక్షం బీజేపీ కూడా ఆయనపై విమర్శలకు దిగుతోంది. ఇప్పుడు గోడపై తన నీడతోనూ నితీష్‌కు పోరే! బిహార్‌లో ఎన్నికల ఎజెండా, రాజకీయ సమీకరణాల స్వరూపం మారింది. మలివిడత పోలింగ్ రోజే ఒక ప్రచార ర్యాలీలో సీఎం నితీష్‌పైకి సభికుల్లోంచి ఓ వ్యక్తి ఏదో విసిరేశాడు. నిరసన వ్యక్త మైంది. ‘ఇంకా వేయండి...’ అంటూ నిరసన తీవ్రత తగ్గించే యత్నం చేసిన నితీష్, ఆ వ్యక్తిని ఏమీ అనొద్దని పోలీసులను వారించారు. కొత్త సాంకేతికత సంతరించుకున్న సంప్రదాయ మీడియా, ఇటీవలే బలోపేతమైన సామాజిక మాధ్యమరంగం బిహార్ ప్రజానీకం ఆశల్ని, ఆకాంక్షల్ని కొత్త ఎత్తుల్లోకి తీసుకువెళ్లాయి. చెప్పింది వినడం, ప్రసంగాలకు ప్రభావితమయ్యే స్థాయిలోనే స్పందించే దశను బిహారీలు దాటేస్తున్నారు. ఆశించడం, వాటి కోసం ప్రశ్నించడం, తదనుగుణంగా ప్రతిస్పం దించడం వారిలో మొదలైనట్టు బిహార్ సమాజంలో కొత్త వాసన వెలువడుతోంది. ఇది సరికొత్త రాజ కీయాల్ని నిర్వచిస్తోంది. ఈ మర్మమెరిగిన వాడిలా యువతరం ప్రతినిధి తేజస్వి యాదవ్ వ్యూహా త్మకంగా వ్యవహరిస్తున్నారు. పదిలక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల హామీ ఇచ్చి, చిన్న వయసు లోనే బిహార్ జీవనాడి పట్టుకున్న విజ్ఞత కనబరిచారు. అది ఆచరణ సాధ్యం కాదని ఎద్దేవా చేసి నాలుక్కరుచుకున్న ఎన్డీయే, జనస్పందనకు తలొగ్గి, తాము 19 లక్షల ఉద్యోగాలిస్తామని తేజస్వీ పన్నిన ఎజెండాలోకి జారింది. ఎన్డీయే నుంచి విడిపోయి, నితీష్‌పై విమర్శ బాణాలెక్కుపెడుతున్న ఎల్జేపీ యువనేత చిరాగ్ పాశ్వాన్, బీజేపీతో నెరపుతున్న సఖ్యతపై సందేహాలున్నాయి. ప్రధానంగా జేడీ(యు) అభ్యర్థులపైనే అగ్రకులాల వాళ్లను ఎల్జేపీ పోటీకి దింపింది. నితీష్‌ను–ఆయన గెలుచు కునే స్థానాల సంఖ్యను అదుపులో ఉంచేందుకు ఇది బీజేపీ పరోక్ష ఎత్తుగడనా? అనే అనుమా నాలున్నాయి. మొదటికే మోసం తెచ్చే సంకేతాలొచ్చేసరికి, చివరి పాదంలో సయోధ్య యత్నాలు ముమ్మరం చేశారు. ఎన్డీయే బలహీనమవుతున్న క్రమంలోనే మహాఘట్బంధన్ బలపడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. యూపీయే పెద్దన్నగా కాంగ్రెస్ పార్టీ ప్రభావం బిహార్‌లో సున్నా! రాహుల్ గాంధీలో ప్రచార ఆసక్తీ కనబడటం లేదు. పైపెచ్చు, పొత్తుల్లో కాంగ్రెస్‌కు కేటాయించిన స్థానాల్లోనే ఎన్డీయే కూటమి ధీమాగా ఉంది. మూడు దశాబ్దాల్లో... లాలూప్రసాద్ యాదవ్ కేంద్రబిందువు కాని బిహార్ తొలి ఎన్నికలివి. పరిస్థితి వికటించి లాలూ ఇవాళ జైళ్లో ఉండవచ్చు! కానీ, సామాజిక న్యాయం– లౌకికతత్వం ఇరు సుగా... బిహార్‌ను రాజకీయ ప్రయోగశాల చేశారనే పేరుందాయనకు. సరిగ్గా 30 ఏళ్లకింద, 23 అక్టో బర్ 1990న రామ రథయాత్రను నిలువరించి, అడ్వాణీని అరెస్టు చేయడం అప్పట్లో సంచలనం. సామాజికన్యాయం–హిందుత్వల మధ్య సైద్ధాంతిక పోరు అలా బలపడింది. తర్వాత ఎన్నో రాజ కీయ బంధాలు, కూటములు, సమీకరణాలు బిహార్‌నే కాదు, మొత్తం దేశాన్నే ముంచెత్తాయి. తేజ స్వీకి వాళ్ల తండ్రి లాలూ వారసత్వం ఆస్తి కాదు, భారమని రాజకీయ పండితులు విశ్లేషిస్తారు. ఆయన హయాంలో అగ్రవర్ణ ఆధిపత్యం, రాజకీయ హింస, నేరాలు, అవినీతి ప్రబలి... చివరకాయన జైలు చేరడం చూస్తే నిజమే అనిపిస్తుంది. కానీ, ఓబీసీ, దళిత, మైనారిటీ వర్గాలను ఏకం చేసి ఆయన ఏర్పాటు చేసిన భూమికపైన, లాలూ పేరు తీసుకోకుండానే తేజస్వీ అల్లుకుంటున్న కొత్త రాజకీ యాలు ఆసక్తికరంగా ఉన్నాయి. నిరుద్యోగం బిహార్‌లో ప్రధాన సమస్య. కోటికి పైగా బిహారీలు వలస కూలీలుగా భారతదేశమంతా విస్తరించి ఉంటారు. మొన్న కోవిడ్ లాక్డౌన్లో సుమారు 23 లక్షల మంది స్వస్థలాలకు చేరారు. అత్యధికులు వేల కిలోమీటర్లు కనాకష్టంగా నడిచొచ్చారు. గుర్రుగా ఉన్న వారూ, వారి కుటుంబాలు నేడు ఉద్యోగాలు, ఉపాధి కోసం గాఢమైన ఆకాంక్షలతో ఉన్నారు. ఎంత పెద్ద పేరున్నా... ప్రార్థించే పెదవుల కన్నా, పని చేసే చేతుల కోసం బిహారీలు నిరీక్షిం చడం కొత్త పోకడ. జనం ఆశల్ని చదివి, యువ రాజకీయ నాయకులు హూందాగా మాట్లాడటం సరి కొత్త మార్పు. బిహార్ ఎన్నికల్లో 42 శాతం పోటీదారులు 25–40 సంవత్సరాల యువత కావడం ఆశావహం! ఓటర్లు బిహార్ రాజకీయాల్ని ఏ తీరాలకు చేరుస్తారో ఈ నెల 10 ఫలితాల్లో తేలాల్సిందే! -
నేటి నుంచి రెండో విడత పార్లమెంటు సమావేశాలు
-
ప్రగతి మంత్రం.. పల్లె చిత్రం
సాక్షి, హైదరాబాద్: ప్రగతి మంత్రం ఫలించింది. పల్లెచిత్రం మారింది. హరితహారమే లక్ష్యంగా పారిశుద్ధ్య నిర్వహణే కర్తవ్యంగా రాష్ట్రంలోని 12,751 పంచాయతీల్లో సాగిన రెండోవిడత పల్లె ప్రగతి కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. అక్షరాస్యతలోనూ ఆదర్శ రాష్ట్రంగా నిలవాలని భావించిన ప్రభుత్వం.. ‘ఈచ్ వన్ టీచ్ వన్’నినా దం కింద తొలిసారి గ్రామ పంచాయతీల్లో 25,03,901 మంది వయోజనులను నిరక్షరాస్యులుగా గుర్తిం చింది. ఇందులో అత్యధికంగా నారాయణపేట జిల్లాలో 1,54,804, నల్లగొండ జిల్లాలో 1,47,054 మంది వయోజన నిరక్షరాస్యులు ఉం డగా, యాదాద్రి జిల్లాలో 1,32,412 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో 1,21,847 మంది, నిర్మల్ జిల్లాలో 1,20,597 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారి కోసం సర్కారు అక్షర యజ్ఞం చేపట్టనుంది. దశాబ్దాలుగా సమస్యల వలయంలో చిక్కుకొని కునారిల్లుతున్న గ్రామీణ ప్రాం తాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా విస్తృతంగా అభివృద్ధి, అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడం ఈసారి విశేషం. తొలిరోజు గ్రామ సభల్లో వార్షిక ప్రణాళిక, పంచా యతీ ఆదాయ వ్యయాలు, తొలి విడత పల్లెప్రగతి నివేదికను గ్రామస్తుల ముందుంచడం ద్వారా పంచాయతీ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే ప్రయత్నం చేశారు. గ్రామ సభలు, పాదయాత్రలు, శ్రమదానాలు, పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల హడావుడితో గత 11 రోజులు పల్లెల్లో సందడి వాతావరణం కనిపించింది. పరిసరాల పరిశుభ్రత, పిచ్చిమొక్కల తొలగింపు, వైకుంఠధామాలు, కంపోస్టు యార్డు, శాశ్వత నర్సరీలకు స్థలాలను గుర్తించారు. పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 51 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాయి. దాతల సహకారం... పల్లె దాటినా సొంతూరిపై మమకారంతో సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చిన పలువురు దాతలు పల్లె ప్రగతికి ఇతోధికంగా సహకారం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు స్పందించి 15,739 మంది దాతృత్వంతో ముందుకొచ్చారు. వీరంతా రూ. 11.64 కోట్ల విరాళాలను అందజేశారు. మరింత ఆర్థిక సాయం అందించేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పల్లెల సత్వర సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటివరకు వివిధ పద్దుల కింద రూ. 1,475.28 కోట్లు విడుదల చేయగా ఈ నిధులకు దాతల సాయం చేదోడువాదోడుగా నిలవడంతో అభివృద్ధి పట్టాలెక్కనుంది. పల్లెసీమలకు సమస్యల నుంచి విముక్తి లభించనుంది. మొత్తం గ్రామ పంచాయతీలు : 12,751 గ్రామీణ జనాభా : 2.03 కోట్లు గ్రామ సభలు నిర్వహించిన పంచాయతీలు : 12,749 భాగస్వామ్యమైన ప్రజలు : 7,02,563 -
ముగిసిన తెలంగాణ రెండో విడత పరిషత్ ఎన్నికలు
-
నేడు రెండోవిడత ప్రచారానికి తెర
సాక్షి, హైదరాబాద్: రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. రెండో విడతలో భాగంగా ఈ నెల 10న (శుక్రవారం) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఓటింగ్ సమయం ముగియడానికి 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంది. 179 జెడ్పీటీసీ స్థానాలకు 805 మంది, 1,850 ఎంపీటీసీ స్థానాలకు 6,146 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రెండో విడతలో ఒక జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, అందులో ఒక్క ఎంపీటీసీ మినహా మిగతా స్థానాలన్నీ టీఆర్ఎస్ గెలుచుకుంది. జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్–179, కాంగ్రెస్–177, బీజేపీ–148, టీడీపీ–60, సీపీఐ–20, సీపీఎం–19, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలు, రాష్ట్రంలో ఎస్ఈసీ వద్ద రిజిస్టర్ అయిన పార్టీలు–40, ఇండిపెండెంట్ అభ్యర్థులు–162 మంది బరిలో నిలిచారు. ఎంపీటీసీ స్థానాల విషయానికొస్తే టీఆర్ఎస్–1,848, కాంగ్రెస్–1,698, బీజేపీ–895, టీడీపీ–173, సీపీఐ–87, సీపీఎం–92, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలు, రాష్ట్రంలో ఎస్ఈసీ వద్ద రిజిస్టర్ అయిన పార్టీలు–101, ఇండిపెండెంట్ అభ్యర్థులు–1,249 మంది పోటీలో ఉన్నారు. ‘రెండో విడత’కు సర్వం సిద్ధం శుక్రవారం జరగనున్న రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆయా ప్రాదేశికవర్గ నియోజకవర్గాల వారీగా బ్యాలెట్ పత్రాలను విడదీసి పోలింగ్‌కు సిద్ధం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల సంఖ్యకు తగ్గట్టు అవసరమైన మేర బ్యాలెట్బాక్సులు సిద్ధం చేసుకోవడంతో పాటు ఎన్నికల సిబ్బందికి డ్యూటీల కేటాయింపు, బందోబస్తు, ఎన్నికల సరంజామాను అందుబాటులో పెట్టుకుంటున్నారు. ఈ నెల 14న జరగనున్న మూడో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో రాజకీయపార్టీలు, ఇండింపెండెంట్ల వారీగా పోటీచేసే అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయింపుతో ఈ విడతకు సంబంధించి రాజకీయపార్టీలు, అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంటోంది. 12వతేదీ సాయంత్రం 5 గంటల లోపు తుది విడత ఎన్నికల ప్రచారాన్ని పార్టీలు, అభ్యర్థులు ముగించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని 5 జెడ్పీటీసీ, 42ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడతలోనే ఎన్నికలు పూర్తయ్యాయి. మిగతా జిల్లాలకు రెండు, మూడో విడతల్లో ఎన్నికలుంటాయి. -
ఆశావహుల క్యూ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తొలి విడత ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల దాఖలు, పరిశీలన ప్రక్రియ పూర్తయింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 24 జెడ్పీటీసీ స్థానాలకు టీఆర్ఎస్ నుంచి అత్యధికంగా 93, కాంగ్రెస్ నుంచి 54, బీజేపీ నుంచి 36 మంది బీ ఫారాలు తమకే వస్తాయనే ధీమాతో నామినేషన్లు దాఖలు చేశారు. ఇటు 294 ఎంపీటీసీ స్థానాలకు 1,911 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో అత్యధిక నామినేషన్లు టీఆర్ఎస్ అభ్యర్థులవే కావడం విశేషం. మరోవైపు నేటినుంచి ప్రారంభం కానున్న రెండో విడత, తర్వాత జరిగే మూడో విడత నామినేషన్ల పర్వంలోనూ గులాబీ పార్టీ తరఫున బరిలో ఉండేందుకు ఇలాంటి పోటీ నెలకొంటుందని టీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో ప్రాదేశిక ఎన్నికల ఫలితాలపై గులాబీ పార్టీ ఇప్పటికే పూర్తి ధీమాతో ఉంది. అయితే టీఆర్ఎస్లో పోటెత్తుతోన్న ఆశావహులతో పార్టీనే నమ్ముకుని పని చేస్తోన్న కార్యకర్తల్లో ఎవరికి బీ ఫారాలు ఇవ్వాలో తెలియక గులాబీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలే ఖరారు చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యేలు తమ క్యాంపు కార్యాలయాల్లో ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. జెడ్పీ చైర్మన్ గిరీకీ తీవ్ర పోటీ ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లా పరిషత్‌ల పరిధుల్లో టీఆర్ఎస్ నుంచి చాలా మంది ఆశావహులు పోటీ పడుతుంటే.. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి ఇంకా ఎవరి పేర్లు ప్రచారంలోకి రాలేదు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి పేరును టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే ఖరారు చేసింది. నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి మాజీ మంత్రి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పి.రాములు కుమారుడు భరత్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భార్య అమలతో పాటు జిల్లాకు చెందిన కోళ్ల వెంకటేష్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ వీరిలో ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనే చర్చ జరుగుతోంది. నారాయణపేట జిల్లా నుంచి డీసీఎంఎస్ చైర్మన్ నిజాంపాష, మద్దూర్‌కు చెందిన జెడ్పీ మాజీ కో–ఆప్షన్ సభ్యుడు మహ్మద్ సలీం, కృష్ణ మండలానికి చెందిన శివరాజ్ పాటిల్, సీనియర్ నాయకుడు ఎల్కోటి నారాయణరెడ్డి ఆశావహులు రేసులో ఉన్నారు. వనపర్తి జిల్లా నుంచి పెద్దమందడి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మెఘారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డితో పాటు విష్ణువర్ధన్‌రెడ్డి జెడ్పీ చైర్మన్ గిరిలో ముందజలో ఉన్నట్లు తెలుస్తోంది. గద్వాల జిల్లాలో మానవపాడు మండలానికి చెందిన సరితతో పాటు గట్టు భీముడు సతీమణి పేరు కూడా ప్రచారంలో ఉంది. అలంపూర్ నియోజకవర్గం నుండి పలువురు సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల తర్వాత జెడ్పీ చైర్మన్, చైర్పర్సన్ల అభ్యర్థులను ప్రకటించే వీలుంది కాబట్టి అప్పటి వరకు వేచి చూద్దామనే ఆలోచనతో ఆశావహులున్నారు. ∙కాంగ్రెస్ పార్టీలోనూ జెడ్పీ చైర్మన్ అభ్యర్థుల వేట కొనసాగుతుంది. మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్ రేసులో రంగారెడ్డి గూడకు చెందిన దుష్యంత్‌రెడ్డి పేరును పార్టీ ఖరారు చేసింది. ఆయన నవాబ్‌పేట జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ భార్య డాక్టర్ అనురాధ పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. నారాయణపేట జిల్లా ఉట్కూర్‌కు చెందిన సూరయ్యగౌడ్ పేరు కూడా ప్రచారంలో ఉంది. వనపర్తి జిల్లాలో అభ్యర్థుల వేటలో ఆ పార్టీ నాయకత్వం ముమ్మరంగా వేటకొనసాగిస్తోంది. బీజేపీ పార్టీ నుంచి జెడ్పీ చైర్మన్ల రేసులో ఎవరెవరు ఉన్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ఎవరి పేర్లు కూడా కనీసం ప్రచారంలోనూ రాలేదు. ఆ రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకం అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు త్వరలోనే జరగనున్న ప్రాదేశిక ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇప్పటికే వలసల పార్టీగా పేరొందిన కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్ధమవుతోన్న అభ్యర్థుల్లో గెలిచిన తర్వాత ఎవరు కారెక్కుతారో అనే ఆందోళన హస్తం నేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలా మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు హస్తానికి చెయ్యిచ్చి కారెక్కిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఎన్నికల్లో గెలిచే ప్రతి అభ్యర్ధి పార్టీ వీడకుండా ఏం చేయాలో అనే దానిపై కాంగ్రెస్ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. ఇటు బీజేపీ సైతం ఉమ్మడి జిల్లాలో పట్టుకోసం పాకులాడుతోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డీకే అరుణతో పాటు టీఆర్ఎస్ పార్టీకి చెందిన పాలమూరు ఎంపీ జితేందర్‌రెడ్డి సైతం కాషాయ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు ఇంకా పలువురు నేతలు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. అయితే ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటేనే గానీ భవిష్యత్‌లో ఉమ్మడి జిల్లాలో పార్టీకి మనుగడ లేని పరిస్థితి నెలకొంది. దీంతో అరుణ, జితేందర్‌రెడ్డి తమతమ అభ్యర్థుల గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. -
‘రెండు’కు రెడీ..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రెండో విడత నామినేషన్ల స్వీకరణ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం బుధవారం పూర్తి కావడంతో రెండో విడత నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మే 10వ తేదీన జరిగే రెండో విడత ఎన్నికల్లో 6 జెడ్పీటీసీ, 85 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుండగా.. ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 29వ తేదీన అధికారులు అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించనున్నారు. తిరస్కరణకు గురైన అభ్యర్థులు 30వ తేదీన తగిన ఆధారాలతో అధికారులకు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. మే 2వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదేరోజు బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. మే 10వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే ప్రధాన రాజకీయ పక్షాలు పరిషత్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాయి. అభ్యర్థుల ఎంపిక.. నామినేషన్లు వేయించడంపై కసరత్తు చేస్తున్నాయి. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో గ్రామాల్లో ఇప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కింది. రెండో విడతలో ఎన్నికలు జరిగే మండలాలివే.. మండలం : ఏన్కూరు ఎంపీటీసీ స్థానాలు–10.. బురదరాఘవాపురం, భద్రుతండా, ఏన్కూరు–1, ఏన్కూరు–2, జన్నారం, కేసుపల్లి, రేపల్లెవాడ, శ్రీరామగిరి, టీఎల్.పేట, తిమ్మారావుపేట. మండలం : కల్లూరు ఎంపీటీసీ స్థానాలు–18.. బాతుపల్లి, చండ్రుపట్ల, చెన్నూరు–1, చెన్నూరు–2, చిన్నకోరుకొండి, కల్లూరు–1, కల్లూరు–2, కల్లూరు–3, కప్పలబంధం, లింగాల, మర్లపాడు, ముచ్చవరం, నారాయణపురం, పెద్దకోరుకొండి, పేరువంచ, పుల్లయ్య బంజర, తాళ్లూరు, ఎర్రబోయినపల్లి. మండలం : పెనుబల్లి ఎంపీటీసీ స్థానాలు–15.. చింతగూడెం, గణేష్‌పాడు, గౌరారం, కరాయిగూడెం, కోండ్రుపాడు, కుప్పెనకుంట్ల, లంకపల్లి, లింగగూడెం, మండాలపాడు, పెనుబల్లి, రామచంద్రరావు బంజర, టేకులపల్లి, తాళ్లపెంట, వీఎం.బంజర, ఏరుగట్ల. మండలం : సత్తుపల్లి ఎంపీటీసీ స్థానాలు–13.. బేతుపల్లి, బుగ్గపాడు, చెరుకుపల్లి, గంగారం, కాకర్లపల్లి, కిష్టాపురం, కిష్టారం, రామగోవిందాపురం, రామనగరం, రేజర్ల, రుద్రాక్షపల్లి, సిద్ధారం, తుంబూరు. మండలం : తల్లాడ ఎంపీటీసీ స్థానాలు–16.. అన్నారుగూడెం–1, అన్నారుగూడెం–2, బిల్లుపాడు, కలకొడిమ, కొడవటిమెట్ట, కుర్నవల్లి, మల్లారం, మిట్టపల్లి, ముద్దునూరు, నూతనకల్, పినపాక, రామానుజవరం, తల్లాడ–1, తల్లాడ–2, తల్లాడ–3, వెంగన్నపేట. మండలం : వేంసూరు ఎంపీటీసీ స్థానాలు–13.. అడసర్లపాడు, భీమవరం, చౌడవరం, దుద్దెపుడి, జయలక్ష్మీపురం, కల్లూరుగూడెం, కందుకూరు, కుంచపర్తి, లచ్చన్నగూడెం, మర్లపాడు, రామన్నపాలెం, వి.వెంకటాపురం, వేంసూరు. -
లోక్‌సభ అభ్యర్థి కారుపై దుండగులు దాడి
-
రెండో విడత ఎన్నికల్లో 61.12శాతం పోలింగ్
► దేశవ్యాప్తంగా నేడు జరిగిన రెండో విడత ఎన్నికల్లో 61.12శాతం పోలింగ్ నమోదైంది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 95లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. అస్సాంలో 73.32, బీహార్ 58.14, ఛత్తీస్‌ఘడ్ 68.70, జమ్మూ కశ్మీర్ 43.37, కర్ణాటక 61.80, మహారాష్ట్ర 55.37, మణిపూర్ 74.69, ఒడిశా 57.41, పుదుచ్చేరి 72.40, తమిళనాడు 61.52, ఉత్తర ప్రదేశ్ 58.12, పశ్చిమ బెంగాల్లో 75.27 శాతం నమోదైంది. ►దేశవ్యాప్తంగా రెండో విడత లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 95 స్థానాల్లో నేడు పోలింగ్ జరిగింది. ఒక కేంద్రపాలిత ప్రాంతం, 11 రాష్ట్రాల్లో ఎన్నికల జరగిగాయి. పలువురు రాజకీయ ప్రముఖులు రెండో దఫా ఓటింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ► కర్ణాటక ప్రముఖ పర్యావరణవేత్త, పద్మ అవార్డు గ్రహిత సాలుమరద తిమ్మక్క(107) ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెంగళూరు రూరల్ పార్లమెంట నియోజకవర్గంలో ఆమె ఓటు వేశారు. సాలుమరద తిమ్మక్క కర్ణాటకకు చెందిన పర్యావరణవేత్త. ఈమె హులికుల్ నుండి కుడుర్ వరకు ఉన్న జాతీయ రహదారి పక్కన నాలుగు కిలోమీటర్ల మేర 384 మర్రి చెట్లు పెంచడం ద్వారా జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందారు. ►అక్కడక్కడ చెదురు మదురు ఘటనలు మినహా దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు తమిళనాడులో 47 శాతం పోలింగ్ జరిగింది. ఉత్తరప్రదేశ్లోలో 50.39 శాతం, కర్ణాటకలో 49.25, పశ్చిమ బెంగాల్లో 60, బీహార్ 49.25, అసోం 49.28, ఛత్తీస్‌గఢ్ 59.72, మహారాష్ట్ర 49.5, ఒడిశాలో 45, మణిపూర్‌లో 68.75, కశ్మీర్లో 38.5 శాతంగా పోలింగ్ నమోదైంది. ►ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.కుటుంబ సభ్యులతో కలిసి రాజ్‌నంద్‌గాన్ నియోజకవర్గంలో ఓటు వేశారు. ►పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో కొంతమంది దుండగులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. గుంపులుగా వచ్చి అలర్లు సృష్టించారు. అప్రమత్తమైన పోలీసులు లాఠీచార్జ్ చేసి అల్లరిముకలను చెదరగొట్టారు. ►తన నియోజకవర్గంలో దొంగ ఓట్లు వేస్తున్నారని ఉత్తరప్రదేశ్‌లోని అంరోహ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కన్వార్ సింగ్ తన్వార్ ఆరోపించారు. బుర్ఖాలు ధరించి వస్తున్న వారిని సరిగా తనిఖీ చేయడం లేదని ఆరోపించారు. బుర్ఖా ధరించి ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తిని పట్టుకున్నట్టు తాను విన్నానని చెప్పారు. ఫతేపూర్ సిక్రీలోని మంగోలి కాలా గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. తమ గ్రామానికి మంచినీటి వసతి కల్పించనందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 41వ నంబర్ పోలింగ్ బూత్‌లో మధ్యాహ్నం వరకు ఓటు వేసేందుకు ఎవరూ రాలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. ►మండ్య జిల్లా, మద్దూరు తాళూకా దొడ్డహసనకరెలో స్వతంత్ర అభ్యర్థి సుమలతా అంబరీష్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. దొడ్డహసనకరెలో మండ్య లోకసభ అభ్యర్థులు సుమలత, నిఖిల్ గౌడ అభిమానుల మధ్య తీవ్రవివాదం చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తేచ్చే ప్రయత్నం చేసినప్పటికి గొడవ సద్దుమణగలేదు. మంత్రి డీకే శివకుమార్ దొడ్డ హలహల్లిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటుడు దర్శన్ బెంగళూరులోని ఆర్‌ఆర్‌నగర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►పశ్చిమ బెంగాల్ సీపీఎం నేత, రాయ్‌గంజ్ లోక్‌సభ అభ్యర్థి మహ్మద్ సలీమ్ కారుపై దుండగులు దాడి చేశారు. పశ్చిమ బెంగాల్ ఇస్లామాపూర్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ రాళ్ల దాడి వెనుక టీఎంసీ హస్తం ఉందని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు. తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తన కుటుంబసభ్యులతో కలిసి క్యూలైన్లో నిలబడి, ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►బీజేపీ ఎంపీ అభ్యర్థి కన్వర్ సింగ్ తన్వర్ అమోరాలో దొంగ ఓటింగ్ జరుగుతోందని ఆరోపించారు. బుర్కాలో ఉన్న వారిని పరీక్షించటం లేదని, మగవాళ్లు బుర్కాలో వచ్చి దొంగ ఓట్లు వేసినట్లు విన్నానన్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దారామయ్య మైసూర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► రాష్ట్రాల వారీగా ఉదయం 11గంటల వరకు ఉత్తరప్రదేశ్ 24.31%, బీహార్ 18.97%, అస్సాం 26.39%, ఛత్తీస్‌ఘడ్ 26.2%,తమిళనాడు 30.62% పోలింగ్ నమోదైంది. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా శ్రీనగర్‌లోని మున్సిబాగ్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► పశ్చిమ బెంగాల్ రాయ్గంజ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ సందర్భంగా అల్లరిమూకలు రెచ్చిపోవటంతో పరిస్థితులు అదుపుతప్పాయి. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అల్లరి మూకల్ని చెదరగొట్టారు. దీంతో ఆగ్రహించిన అల్లరిమూకలు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిపై టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లతో గాల్లోకి కాల్పులు జరిపారు. ►మధుర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రత్యర్ధి పార్టీలపై నిప్పులు చెరిగారు తన వల్లే మధురలో అభివృద్ధి జరిగిందని అన్నారు. ఎస్పీ, బీఎస్పీలు ఒకరిని ఒకరు తిట్టుకోవటానికే పనికొస్తాయంటూ ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో మోదీ ప్రభావం కచ్చితంగా ఉందని అన్నారామె. ఒరిస్సాలోని అస్కా నియోజకవర్గంలోని కన్సమారి పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేయటానికి క్యూలైన్లో నిల్చుని ఉన్న 95ఏళ్ల వృద్ధుడు అక్కడే ప్రాణాలు విడిచాడు. ►మాజీ భారత ప్రధాని హెచ్డీ దేవె గౌడ, ఆయన సతీమణి హస్సన్లోని పదువాలహిప్పేలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అస్సాం సిల్చర్ సిట్టింగ్ ఎంపీ, సిల్చర్ లోక్‌సభ అభ్యర్థి సుష్మితా దేవ్ తన కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాశ్మీర్లో అప్పుడే పెళ్లైన ఓ జంట పెళ్లి మండపం నుంచి నేరుగా పోలింగ్ బూత్ వద్దకు చేరుకుని ఓటు వేశారు. పెళ్లి బట్టల్లో ఉన్న ఈ జంటను చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా వారి సామాజిక స్ప్రహను పలువురు ప్రశంసించారు. ►ఛత్తీస్‌ఘడ్‌లోని కంకెర్లో బూత్ నెంబర్ 186లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి గుండెపోటుతో పోలింగ్ బూత్‌లోనే ప్రాణాలు విడిచాడు. యూపీ కాంగ్రెస్ ఛీఫ్, ఫతేపూర్ సిక్రి అభ్యర్థి రాజ్ గబ్బర్ రాధ బల్లబ్ ఇంటర్ కాలేజీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►దేశవ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 13.48 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రాల వారీగా అసోం 11.6%, ఉత్తరప్రదేశ్ 10.76%, ఛత్తీస్‌ఘడ్ 10.42%, తమిళనాడు 13.48%, మణిపూర్ 14.99%, బీహార్ 12.07% పోలింగ్ నమోదైంది. ►కర్నాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య అనిత, కొడుకు నిఖిల్‌తో కలిసి రాంనగర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. నిఖిల్ మాండ్యా లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ►చెన్నైలోని తెనంపేటలో ఎస్ఐఈటీ కాలేజీ సెంటర్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఓటు వేశారు. తిరువాన్మియూరు ప్రభుత్వ పాఠశాలలో నటులు అజిత్, విజయ్‌లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి జి పరమేశ్వర ఆయన భార్య కన్నిక పరమేశ్వరి తుంకూరులోని కొరతగిరేలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ హొసబలే శేషాద్రిపురంలోని బూత్‌నెంబర్ 45లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎంలు మొరాయించటం కారణంగా ఒరిస్సాలోని పలు పోలింగ్ స్టేషన్లలలో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. సమస్యను పరిష్కరించిన అనంతరం పోలింగ్ యధావిధిగా కొనసాగింది. ►ఒరిస్సాలోని కందమాల్ అటవీ ప్రాంతంలో నక్సల్స్ రెచ్చిపోయారు. పోలింగ్ సిబ్బంది లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో సంజుక్తా అనే పోలింగ్ ఏజెంట్ ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ►నటులు సూర్య, కార్తిలు కుటుంబంతో కలిసి చెన్నైలోని టీనగర్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ బెంగళూరు సెంట్రల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రకాశ్ రాజ్ స్వతంత్ర అభ్యర్థిగా బెంగళూరు సెంట్రల్‌నుంచి లోక్‌సభ బరిలో ఉన్న విషయం తెలిసిందే. డీఎంకే నాయకురాలు, తుత్తుకుడి లోక్‌సభ అభ్యర్థి కనిమొళి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►పుదుచ్చేరి ముఖ్యమంత్రి వీ నారాయణస్వామి, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మణిపుర్ గవర్నర్ నజ్మా హెపుల్లా ఇంపాల్‌లో తన ఓటు హక్కునువినియోగించుకున్నారు. ►తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి క్యూలైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోకనాయకుడు కమల్‌హాసన్ ఆయన కుమార్తె శృతి హాసన్‌లు సైతం ఓటు హక్కు వినియోగించుకోవటానికి సాధారణ పౌరులతో పాటు క్యూలైన్లో నిల్చున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్, నటుడు విజయ్ ఆంటోని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధురైలో ఉత్సవాల కారణంగా రాత్రి 8గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు ఎన్నికల డీజీపీ అశుతోష్ శుక్లా దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►కాంగ్రెస్ నేత చిదంబరం భార్య నలిని చిదంబరం, కుమారుడు కార్తి చిదంబరం ఆయన భార్య శ్రీనిధి రంగరాజన్ కారైకుడిలోని శివగంగలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల కారణంగా తమిళనాడులో సినిమా ధియేటర్లు మూతపడ్డాయి. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరులోని జయానగర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించటం కారణంగా పోలింగ్ ఇంకా ప్రారంభంకాలేదు. ►ఈ ఉదయం సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూపర్ స్టార్ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోగానే ఆయన్ని చూడడానికి అభిమానులంతా ఎగబడ్డారు. రజనీ పోలింగ్ కేంద్రంలోకి అడుగుపెట్టగానే అక్కడి అధికారులు లేచి నిలబడ్డారు. కాంగ్రెస్ నేత చిదంబంరం తమిళనాడులోని కారైకుడి శివగంగలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ నేత సుశీల్‌కుమార్ షిండే మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అస్సాంలోని సిల్చార్‌లో వీవీప్యాట్ మొరాయించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు దాన్ని బాగుచేసే పనిలోపడ్డారు ►దేశవ్యాప్తంగా రెండో విడత లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమైంది. మొత్తం 95 స్థానాల్లో నేడు పోలింగ్ జరగనుంది. ఒక కేంద్రపాలిత ప్రాంతం, 11 రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. పలువురు రాజకీయ ప్రముఖులు రెండో దఫా ఓటింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండో దశ పోలింగ్‌లో మొత్తంగా 1,600 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తంగా 15.8 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభంమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్ర 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా భద్రతాబలగాలు మోహరించాయి. -
కారు జోరు
-
రెండో విడత పంచాయితీ ఎన్నికలలోనూ టీఆర్ఎస్ జోరు
-
పంచాయతీ ఎన్నికల రెండవ విడతలోనూ టీఆర్ఎస్దే హవా!
-
రెండో విడతలోనూ టీఆర్ఎస్దే హవా!
సాక్షి, హైదరాబాద్ : రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెల్లడి మొదలుకాగానే కారు జోరు చూపిస్తోంది. 3 వేల 341 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు దూసుకెళ్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో మొదటి విడతలో మాదిరే కారు స్పీడును కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులతో సహ ఏ పార్టీ అందుకోలేకపోతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 733 టీఆర్ఎస్ మద్దతుదారులు, 70 కాంగ్రెస్ మద్దతుదారులు, ఇతరులు 119 స్థానాల్లో గెలుపొందారు. మరో రెండు గంటల్లో పూర్తి స్థాయి ఫలితాలు రానున్నాయి. జిల్లాలు టీఆర్ఎస్ కాంగ్రెస్ టీడీపీ బీజేపీ ఇతరులు ఆదిలాబాద్ 9 11 0 0 51 భద్రాద్రి 21 5 2 0 8 జగిత్యాల 22 3 0 0 7 జనగామ 30 2 0 0 2 జయశంకర్ 14 6 2 0 2 జోగులాంబ 15 1 0 0 3 కామారెడ్డి 70 26 0 0 13 కరీంనగర్ 10 1 0 0 4 ఖమ్మం 58 4 5 0 8 కొమరం భీం 26 5 0 1 3 మహబూబాబాద్ 49 5 0 0 0 మహబూబ్ నగర్ 71 6 0 0 15 మంచిర్యాల 24 4 0 0 3 మెదక్ 61 5 0 0 5 మేడ్చల్ 7 0 0 0 0 నాగర్ కర్నూల్ 19 2 0 0 0 నల్గొండ 51 1 0 0 0 నిర్మల్ 21 4 0 0 0 నిజామాబాద్ 31 2 0 0 1 పెద్దపల్లి 7 1 0 0 1 రాజన్న 16 0 0 0 0 సంగారెడ్డి 49 2 1 0 0 సిద్దిపేట 18 0 0 0 0 సూర్యాపేట 24 0 0 0 5 వికారాబాద్ 12 1 0 0 5 వనపర్తి 17 0 0 0 4 వరంగల్ రూరల్ 31 2 0 0 0 వరంగల్ అర్బన్ 2 0 0 0 0 యాదాద్రి 17 0 0 0 0 -
తెలంగాణలో నేడు రెండో విడత పంచాయితీ ఎన్నికలు
-
ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
-
ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న తుది దశ పోలింగ్
రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లో తుది దశ పోలింగ్ కొనసాగుతుంది. 19 జిల్లాలోని 72 నియోజకవర్గాలకు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 90 స్థానాలు ఉన్నా చత్తీస్‌గఢ్ అసెంబ్లీకి తొలి దశలో 18 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టుల పిలుపు నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈసీ మొత్తం 19,296 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రమణ్‌సింగ్ ప్రభుత్వంలోని 9 మంది మంత్రులు, స్పీకర్‌తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ భూపేశ్ బఘేల్, అజిత్ జోగి సహా ఇరు పార్టీల కీలక నేతల భవిష్యత్ నేడు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఛత్తీస్‌గఢ్‌లో నాలుగోసారి అధికారం చేపట్టాలని బీజేపీ, 15 ఏళ్లుగా కొనసాగుతున్న విపక్ష హోదాను అధికార పక్షంగా మార్చుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బీఎస్పీ, అజిత్ జోగికి చెందిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్, సీపీఐల కూటమి కూడా విజయంపై ఆశలు పెట్టుకుంది. కాగా, 72 స్థానాల్లో 1,079 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
55 వేల షెల్ కంపెనీలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: మనీలాండరింగ్, అక్రమ లావాదేవీలు జరిపుతున్న డొల్లపై కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా ఝళిపించింది. రెండో దఫా ఏరివేతలో భాగంగా 55 వేల షెల్ కంపెనీలను ముసుగు కంపెనీలు) రద్దు చేసినట్టు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఇదే క్రమంలో విచారణలో ఉన్న మరిన్ని కంపెనీలపైనా నిర్ణయం తీసుకుంటామని కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి పి.పి.చౌదరి వెల్లడించారు. మొదటి విడతలో 2015-17 మధ్య రెండేళ్ల కాలంలో 2.26 లక్షల షెల్ కంపెనీల్ని రద్దు చేసిన కేంద్రం తాజాగా మరో 55 వేల షెల్ కంపెనీలపై వేటు వేసింది. రెండవ దశలో ఇప్పటికే 55 వేల కంపెనీల నమోదును రద్దు చేశామని, అనేక కంపెనీలు దర్యాప్తులో ఉన్నాయని చెప్పారు. రెండేళ్లుగా పైనాన్షియల్ స్టేట్ మెంట్స్ గానీ వార్షిక నివేదికలు గానీ సమర్పించని 2.26 లక్షల కంపెనీలను రద్దు చేశారు. అవి పని చేయని కంపెనీలే కాదు.. ఒకే గదిలో, ఒకే చిరునామాపై అనేక కంపెనీలు రిజిస్టరై ఉన్నట్టు గుర్తించారు. అలాంటివాటిలో 400 పైగా బోగస్ కంపెనీలు ఉన్నాయని మంత్రి చెప్పారు. షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్, డ్రగ్ ఫండింగ్.. ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని అనుమానించిన ప్రభుత్వం.. షెల్ కంపెనీలకు షాకిచ్చింది. ఇందుకోసం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ), ఇతర పరిశోధనా సంస్థలు రంగంలోకి దిగినట్టు తెలిపారు. -
నేటి నుంచి కాంగ్రెస్ రెండో విడత యాత్ర
సాక్షి, హైదరాబాద్ : క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపడం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడం కోసం రాష్ట్ర కాంగ్రెస్ చేపట్టిన బస్సుయాత్ర రెండో విడత ఆదివారం నుంచి ప్రారంభమవుతోంది. తొలివిడతలో భాగంగా ఫిబ్రవరి 26న చేవెళ్లలో చేపట్టిన బస్సుయాత్ర.. మార్చి 3న హుజూరాబాద్‌లో ముగిసింది. మధ్యలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగిన నేపథ్యంలో.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రెండో విడత యాత్రను చేపట్టాలని టీపీసీసీ నిర్ణయించింది. అనుకున్న కార్యాచరణ ప్రకారం.. ఆదివారం రామగుండంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో రెండో విడత బస్సు యాత్ర మొదలవనుంది. అధికార టీఆర్ఎస్ను ఎండగడుతూ.. రామగుండంలో మొదలయ్యే కాంగ్రెస్ బస్సు యాత్ర ఏప్రిల్ 2న పెద్దపల్లి, 3న మంథని, భూపాలపల్లి, 4న స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, 5న నర్సంపేట్, 6న పరకాల, వరంగల్ వెస్ట్, 7న ఇల్లెందు, పినపాక, 8న డోర్నకల్, మహబూబాబాద్, 9న భద్రాచలం ఆలయ దర్శనం, వెంకటాపురం మీటింగ్, ములుగులో యాత్ర, 10న వర్ధన్నపేట, వరంగల్ ఈస్ట్లలో కొనసాగుతుంది. వరంగల్‌లోనే రెండో విడత యాత్ర ముగింపు సభ నిర్వహించనున్నట్టు టీపీసీసీ ప్రకటించింది. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ.. కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం అందిం చేలా ఈ బస్సుయాత్రను చేపట్టినట్టు నేతలు చెబుతున్నారు. రెండో విడత ముగిశాక 2, 3 రోజుల విరామం అనంతరం మరో విడత బస్సుయాత్రను చేపట్టనున్నారు. -
‘మెట్రో’ రెండో దశకు నిధుల వేట!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో మెట్రో రెండో దశపై ఆశలు చిగురిస్తున్నాయి. పెట్టుబడుల కోసం దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో మున్సిపల్ మంత్రి కేటీఆర్ బృందం విస్తృతంగా పర్యటిస్తోంది. తాజాగా మెట్రో రెండో దశకు ఆర్థిక సహకారం అందించడంతోపాటు పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ప్రముఖ ప్రైవేటు రవాణా రంగ సంస్థ ఎంఐటీ–ఎస్‌యూఐతో ఈ బృందం సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు ప్రభుత్వ పరంగా చేయాల్సిన వ్యయానికి సంబంధించి నిధుల సమీకరణకు జపనీస్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీతోనూ చర్చించినట్లు సమాచారం. రెండో దశ కింద సుమారు ఏడు మార్గాల్లో 81 కి.మీ. మార్గంలో ప్రాజెక్టును చేపట్టాలని గతంలో నిర్ణయించిన విషయం విదితమే. రెండో దశ ప్రాజెక్టు వ్యయం, భూసేకరణకు రూ.20 వేల కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కాగా ప్రస్తుతం మొదటి దశలోని నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఫలక్‌నుమా కారిడార్ల (72 కి.మీ.)లో మెట్రో ప్రాజెక్టును చేపట్టిన విషయం విదితమే. వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ, ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించాయి. రెండో దశపై ఎల్అండ్టీ విముఖత? మొదటి దశ పనులు చేపట్టిన ఎల్అండ్టీ రెండోదశ ప్రాజెక్టు చేపట్టేందుకు విముఖత చూపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే మొదటి దశలో పెరిగిన అంచనా వ్యయం రూ.3 వేల కోట్లను ప్రభుత్వం తమకు చెల్లించాలని ఈ సంస్థ పట్టుబడుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి తాము మొదటి దశ పనుల పూర్తిపైనే దృష్టి సారించినట్లు ఎల్అండ్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నిధుల కోసం అన్వేషణ... మెట్రో రెండో దశనుసైతం పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టేందుకు ఆసక్తిగల సంస్థలను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇదే క్రమంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం విదేశాల్లో పర్యటిస్తోన్న కేటీఆర్ బృందం జపనీస్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ (జైకా), ఎంఐటీ–ఎస్‌యూఐతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. అయితే దీనిపై ఆ సంస్థలు ఎలా స్పందించాయన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ జైకా బ్యాంకు రుణ మంజూరుకు అంగీకరిస్తే రాష్ట్ర ఆర్థిక శాఖ ఆ బ్యాంకుకు పూచీకత్తు(కౌంటర్ గ్యారంటీ) ఇవ్వాల్సి ఉంటుంది. వడివడిగా ప్రతిపాదనలు రెడీ... ఏడాది క్రితం మెట్రో రెండోదశ ప్రతిపాదిత మార్గాల్లో ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ సహ, నగర మెట్రో ప్రాజెక్టు అధికారుల బృందం పలు మార్గాల్లో సర్వే చేపట్టి ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతమున్న మెట్రో కారిడార్‌ను శంషాబాద్ విమానాశ్ర యం వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో అధికారులు ఆ దిశగా ప్రణాళికలు రూపొందించిన విషయం విదితమే. అయితే ప్రభుత్వ ఆదేశాలు, క్షేత్రస్థాయి పరిశీలన, సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించే క్రమంలో ప్రతిపాదిత మార్గాల్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలున్నాయి. రెండోదశ.. ప్రతిపాదిత రూట్లు: 7 దూరం: 81 కి.మీ.(సుమారు) అంచనా వ్యయం: సుమారు రూ.20 వేల కోట్లు మార్గాలివే... 1.నాగోల్–ఎల్బీనగర్: 5 కి.మీ. 2.ఎల్బీనగర్–హయత్‌నగర్: 7 కి.మీ. 3.ఎల్బీనగర్–ఫలక్‌నుమా–శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం: 20 కి.మీ. 4.మియాపూర్–పటాన్చెరు: 15 కి.మీ. 5.రాయదుర్గం–శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం: 20 కి.మీ. 6.తార్నాక–ఈసీఐఎల్: 7 కి.మీ. 7.జేబీఎస్–మౌలాలి: 7 కి.మీ. -
ఎడ్‌సెట్ రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించండి
సాక్షి, హైదరాబాద్: ఎడ్‌సెట్ రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డికి టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తి చేశారు. మంగళవారం పాపిరెడ్డితో బీఎడ్ కాలేజీ యాజమాన్య ప్రతినిధులు, కోదండరాం సమావేశమయ్యారు. 11 కొత్త కాలేజీల అనుమతి విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నందున రెండో దశ కౌన్సెలింగ్ ఉండకపోవచ్చని పాపిరెడ్డి వెల్లడించినట్లు యాజమాన్య సంఘాల ప్రతినిధి కత్తి రాందాస్ తెలిపారు. ఆ కాలేజీలను మినహాయించి మిగతా కాలేజీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించాలని కోదండరాం కోరారు. -
‘త్వరలో టీ హబ్ రెండోదశ ప్రారంభం’
హైదరాబాద్: టీ హబ్ రెండో దశను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలోని సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్లో శనివారం జరిగిన టీహబ్ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ యువత ఆలోచనలు రెక్కలు తొడిగాయని.. టీహబ్ వల్ల ఎందరో ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారని అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా నగరంలో ఇంక్యుబేషన్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, నాస్కామ్ చైర్మన్ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సొరంగానికి మంగళం
–ప్రత్యామ్నాయంగా ఎత్తిపోతల పథకం –నిర్మాణ వ్యయం రూ.200కోట్ల అంచనా –నాలుగు నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళిక –అవుకు అనుభవంతో తాజా నిర్ణయం బి.కొత్తకోట: హంద్రీ–నీవా రెండోదశ ప్రాజెక్టు ద్వారా రెండుజిల్లాలకు నీటిని అందించేందుకు అడ్డంకిగా మారుతున్న సొరంగం పనులను వదిలేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రెండుసార్లు టెండర్లు నిర్వహించినా∙కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో కొత్తగా ఎత్తిపోతల పథకాన్ని తెరమీదకు తెచ్చింది. దీనిని నిర్మించే దిశగా ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది. సొరంగం పనులు చేపట్టినా మరిన్ని ఇబ్బందులు ఎదురైతే ఎదుర్కొవడం అటుంచితే కాలయాపన తప్పదన్న భావంతో ఎత్తిపోతల ప«థకానికి పథక రచన చేసింది. సొరంగం అడ్డంకిగా మారిని నేపథ్యంలో హంద్రీనీవా ప్రాజెక్టు ఉన్నతస్థాయి అధికారులు ప్రత్యామ్నాయ పథకం రూపొందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా ఇచ్చిన ఆదేశాలతో ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. అంచనా అమాంతం పెరిగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్దమండ్యం మండలంలోని గొళ్లపల్లె నుంచి వైఎస్సార్‌కడపజిల్లా చిన్నమండ్యం మండలం కొటగడ్డకాలనీ వరకు ప్రధానకాలువలో భాగంగా 5.1కిలోమీటర్ల సొరంగ మార్గంలో కష్టతరమైన 2.1కిలోమీటర్ల పనికి మొదటిసారి నిర్వహించిన టెండర్లకు మ్యాక్స్ ఇన్ఫ్రా ఒక్కటే టెండర్ వేయడం దాన్ని ప్రభుత్వం రద్దు చేయడం జరగ్గా, రెండోసారి టెండర్లకు ఒక్కరూ పాల్గొనలేదు. కర్నూలుజిల్లాలో అవుకు సొరంగం పనుల అనుభవంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. అవుకులో ఇప్పటికీ 140మీటర్ల సొరంగం పనులు చేయలేని స్థితిలో ఉన్నారు. అక్కడి పరిస్థితే ఇక్కడి టన్నల్‌లో కనిపిస్తున్న కారణంగానే ఎత్తిపోతల ప£ý కంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. రూ.200కోట్ల అంచనాతో ఎత్తిపోతలు ప్రధానకాలువపై 506 కిలో మీటరు నుంచి 511 కిలోమీటరు మధ్యలో 5.1సొరంగం పనులు చేయాలి. ఇందులో సమస్యాత్మకంగా మారిన సొరంగం పని 506కిమీ వద్ద ప్రారంభౖమవుతుంది. ఇక్కడినుంచి 2.1కిలోమీటర్ల పనులు చేయాలి. దీనికి ప్రత్యామ్నాయంగా 506కిమీ వద్ద ఒక ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తారు. ఇక్కడ భూమి సముద్రమట్టానికి 30మీటర్ల ఎత్తుంది. ఎత్తిపోతల పథకం నుంచి 508.5కిలోమీటరు వరకు 2.5 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం ప్రారంభమై 511కిలోమీటరు వద్ద ఇప్పటికే పూర్తయిన కాలువలో పైప్‌లైన్ కలుస్తుంది. ఈ కాలువనుంచి నీరు వైఎస్సార్‌జిల్లాలోని శ్రీనివాసపురం, జిల్లాలోని అడవిపల్లె రిజర్వాయర్లకు వెళ్తుంది. ఈ పనిచేపట్టేందుకు తాత్కాలిక అంచనా ప్రకారంరూ.200కోట్లు అవుతుందని నిర్ణయించారు. మోటార్లు, పంపులు, ౖపైప్‌లైన్ పనులు, మట్టి, కాంక్రీట్ పనులు కలుపుకొని అంచనాలు తయారుచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జనవరిలోగా పూర్తిచేసేలా .. వచ్చే జనవరి నాటికి ఎత్తిపోతల పథకం సిద్ధం చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం. భవన నిర్మాణ పనులు పూర్తిచేస్తే మోటార్ల విషయంలో అదనంగా అందుబాటులోని వాటిని వినియోగించుకోవచ్చని ఆలోచన. ప్రధాన కాలువపైనున్న ఎం–1, ఎం–2, ఎం–3 ఎత్తిపోతల పథకాలకు అదనపు మోటార్లున్నాయి, వీటిలో ఒక్కొక్కటి చొప్పున మూడింటిని తీసుకొచ్చి పెద్దమండ్యం ఎత్తిపోతల పథకానికి అమర్చి నీటిని ఎత్తిపోయాలని చూస్తోంది. అంచనాల ప్రతిపాదన, ప్రభుత్వ ఆమోదం, టెండర్ల నిర్వహణ చర్యలను వేగవంతం అయ్యేలా చూస్తున్నారు. రూ.28కోట్ల నుంచి పెరుగుతూ.. వాస్తవంగా 20ప్యాకేజీలోని 5.1కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వేందుకు 2006లో రూ.47.57కోట్లతో ఎకేఆర్కోస్టల్కు అప్పగించారు. ఈ కంపెనీ రూ.18.97కోట్ల విలువైన 630మీటర్ల సొరంగం పనులతో చేతులుదులుపుకొంది. మిగిలిన రూ.28.6కోట్ల పనులను 20ఎ ప్యాకేజీగా 2015లో ఆర్‌కేఇన్‌ఫ్రా సంస్థకు ఒప్పంద విలువతో అప్పగించగా రూ.3.6కోట్ల విలువైన 800మీటర్ల సొరంగం పనులుచేసి వదిలేసింది. మిగిలిన 3.5కిలోమీటర్ల సొరంగం పనుల్లో 2.1కిలోమీటర్ల పనులను 20బీ ప్యాకే జి కింద రూ.16.77కోట్ల పనికి రూ.70.82కోట్లకు పెంచి టెండర్లు నిర్వహించినా కాంట్రాక్టర్లు ముందుకురాలేదు. -
627 చెరువుల పునరుద్ధరణ పూర్తి
రెండో దశలో 627 చెరువుల్లో మిషన్పనులు జిల్లా నీటిపారుదలశాఖ ఎస్ఈ గంగాధర్ నిజాంసాగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం కింద జిల్లాలో మొదటి దశలో 627 చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని జిల్లా నీటిపారుదలశాఖ ఎస్ఈ గంగాధర్ తెలిపారు. మొదటి దశలో చెరువుల పునరుద్ధరణ పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు రూ. 174 కోట్లు చెల్లించామన్నారు. శనివారం నిజాంసాగర్ అతిథి గృహం వద్ద రెస్ట్‌హౌస్ మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి దశ మిషన్ కాకతీయ పథకం కింద 658 చెరువుల్లో పునరుద్ధరణ పనులు చేపట్టామన్నారు. రెండో దశ కింద 649 చెరువులకు గాను రూ. 176 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో 2,811 చెరువులకు గాను 237 చెరువులు పూర్తి స్థాయి నీటినితో నిండాయన్నారు. 169 చెరువులు వరదనీటితో పొంగిపొర్లాయని ఆయన చెప్పారు. 567 చెరువులు 75 శాతం, 534 చెరువులు 50 శాతం, 1,306 చెరువులు 25 శాతం నీటితో నిండాయని తెలిపారు. జిల్లాలోని 148 చెరువులను త్రిబుల్ ఆర్ కింద ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. అందులో 51 చెరువులకు ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలిపిందన్నారు. ఆయన వెంట నీటిపారుదల డిప్యూటి ఈఈ సురేశ్‌బాబు, ఏఈ బాసిద్ తదితరులున్నారు. -
మిషన్‌కాకతీయ ఫైనల్ బిల్లులివ్వండి
ఫేజ్ 2 కింద చెరువులు పూర్తి చేయండి వర్షాలు తగ్గితే మైనర్ పనులు చేపట్టండి మిషన్‌కాకతీయ ఎస్ఈ పీఏ వెంకటకృష్ణ తిమ్మాపూర్: జిల్లాలో మిషన్ కాకతీయ ఫేజ్–1 కింద చెరువుల పనులు పూర్తిచేసి వాటికి సంబంధించి ఫైనల్ బిల్లులివ్వాలని మిషన్‌కాకతీయ ఎస్ఈ పీఏ వెంకటకృష్ణ ఇంజినీర్లను ఆదేశించారు. జిల్లాలో మిషన్ కాకతీయ చెరువులకు జియో ట్యాగింగ్‌పై ఇంజినీర్లకు శిక్షణ అనంతరం పనులపై డివిజన్ల వారీగా ఎల్ఎండీలోని ఏసీఈ ఆఫీస్‌లో బుధవారం సమీక్ష జరిపారు. ఎస్ఈ మాట్లాడుతూ మిషన్ కాకతీయ ఫేజ్–1కింద జిల్లాలో 823 చెరువులకు రూ.311కోట్లు మంజూరైతే 720 పూర్తిచేసి రూ.90కోట్లు చెల్లించినట్లు తెలిపారు. మిగతావి త్వరగా పూర్తిచేసి వాటి ఫైనల్ బిల్లులు చెల్లించాలని సూచించారు. మిషన్‌కాకతీయ ఫేజ్–2 కింద 1081 చెరువులకు ప్రభుత్వం అనుమతిస్తే రూ.468 కోట్లకు మంజూరు ఇచ్చామని, 1,050 చెరువులు ప్రారంభించగా వంద చెరువుల పనులు పూర్తయినట్లు తెలిపారు. చెరువుల్లో 95లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీసినట్లు పేర్కొన్నారు. వర్షాలతో పనులు ఆలస్యమవుతున్నా వర్షాలు లేనప్పుడు మైనర్ పనులు చేపట్టాలని సూచించారు. జియో ట్యాగింగ్‌పై శిక్షణ మిషన్ కాకతీయలో పనిచేస్తున్న ఇంజినీర్లకు బుధవారం మండలంలోని పలు చెరువుల వద్ద క్షేత్రస్థాయిలో, ఎల్ఎండీలోని ఎస్ఈ ఆఫీస్‌లో నిపుణులు కౌశిక్, శర్మ, నాయుడు, అజయ్ శిక్షణ ఇచ్చారు. చెరువుల పూర్తి వివరాలు, పేర్లను మొబైల్లో నమోదు చేస్తే ఆ చెరువుకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక యూనిక్ ఐడీ నెంబర్ ఇస్తారని, దీని ద్వారా పేర్లు ఎన్ని ఉన్నా ఒక చెరువుకు ఒకే నంబర్ ఉంటుందని, డూప్లికేషన్ జరిగే అవకాశం ఉండదన్నారు. చెరువుల పనులను ఫొటో చేసి అందులో అప్లోడ్ చేస్తూ ఎక్కడైనా చూసుకోవచ్చని తెలిపారు. జియో నంబర్ ద్వారా భవిష్యత్తులో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందన్నారు. చెరువుల జియో ట్యాగింగ్‌ని ఈ నెల 10తేదీలోగా పూర్తి చేయాలని ఇంజినీర్లను ఎస్ఈ ఆదేశించారు. ఈఈలు శ్రీనివాస్‌గుప్త, వివిధ డివిజన్ల ఈఈలు, డీఈఈలు, జేఈలు పాల్గొన్నారు. -
తెరపైకి ఔటర్ రింగ్ రోడ్డు
♦ రెండో దశకింద వచ్చే ఏడాదిలో పనులు ♦ జాతీయ రహదారికి అనుసంధానం ♦ గతంలోనే ప్రకటించిన సీఎం కేసీఆర్ ♦ రూపుదిద్దుకుంటున్న మాస్టర్ ప్లాన్ నిజామాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు మరోసారి తెరపైకి వచ్చింది. రెండో దశ కింద వచ్చే ఏడాది రింగ్ రోడ్డు పనులు రూపుదిద్దుకోనున్నాయి. మున్సిపల్ అధికారులు ప్రణాళికను ఏడాది కిందటే అందజేయగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేసి డిచ్పల్లి వద్ద జాతీయ రహదారికి అనుసంధానం చేస్తారు. నిజామాబాద్‌అర్బన్ : నిజామాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణలోని గజ్వెల్, వరంగల్, ఖమ్మం జిల్లాలో రింగ్ రోడ్ల పనులు ఈ ఏడాది చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండో దశ కింద కరీంనగర్, నిజామాబాద్‌లో వచ్చే ఏడాది రింగ్ రోడ్లు రూపుదిద్దుకోనున్నాయి. ఇదివరకే ఈ నిర్మాణాలకు సంబంధించి నిజామాబాద్ మున్సిపల్ అధికారులు ప్రణాళికను ఏడాది కిందటే ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నగరానికి ఇదివరకే బైపాస్ రోడ్డుతో కాస్త ఉపశమనంగా ఉండగా రింగ్‌రోడ్డు నిర్మాణంతో మరింత సౌకర్యం కలుగుతుంది. ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి. నిజామాబాద్ నగరంలో 3.20 లక్షల జనాభా ఉండగా 50 డివిజన్లు ఉన్నాయి. సుమారు 1,100 కాలనీలు ఉన్నాయి. రోజురోజుకూ నగర శివారు ప్రాంతాల్లో నివాస గృహాలు వేగవంతంగా పెరుగుతున్నాయి. పట్టణం విస్తరిస్తోంది. దీనికి అనుగుణంగా రోడ్ల నిర్మాణాలు చేపట్టడం, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడడం కోసం స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక ఔటర్‌రింగ్‌రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. 2014లో జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశంలో సైతం జిల్లాకు తక్షణమే రింగ్‌రోడ్డు అవసరమని దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ రహదారి డిచ్‌పల్లివైపు నుంచి వెళ్తుండడం, జిల్లా కేంద్రానికి అనుసంధానం లేకపోవడం ఏమిటని సీఎం ఈ సందర్భంగా ప్రశ్నించారు. అలాకాకుండా పట్టణానికి రింగ్ రోడ్డు ఏర్పాటు చేసి డిచ్పల్లి వద్ద జాతీయ రహదారికి అనుసంధానం చేస్తామని ఆ నాడు సమావేశంలో హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది అర్బన్ పట్టణానికి రింగ్ రోడ్డు నిర్మిస్తామని సీఎం ప్రకటించడంలో ఆశలు రెకెత్తిస్తున్నాయి. రింగ్‌రోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య తీరనుంది. ప్రస్తుతం బైపాస్ రోడ్డు అందుబాటులో ఉన్నా రోడ్డు పూర్తికాకపోగా, అర్సపల్లి వద్ద అసౌకర్యం ఉండడంతో భారీ వాహనాలు సైతం కొన్ని నగరం గుండా వెళుతున్నాయి. కంఠేశ్వర్ వైపు బైపాస్ రోడ్డు ఉన్నా వినాయక్‌నగర్, నాగారం వైపు ప్రత్యామ్నాయ రోడ్డు అందుబాటులో లేదు. రింగ్‌రోడ్డు ఏర్పడితే నగరం చుట్టూ శివారు ప్రాంతాల గుండా అన్ని ప్రాంతాలకు సౌకర్య వంతంగా వెళ్లేందుకు వీలు కలుగుతుంది. నగరంలోని అర్సపల్లి, బోధన్ రోడ్డు వైపు శివారు ప్రాంతం, ఆర్మూర్ రోడ్డు వైపు ఆర్టీసీ కాలనీ, ముబారక్‌నగర్ కాలనీ వైపు రద్దీగా ఉంటుంది. నాగారంలోని ఆర్టీఏ ఆఫీసు వరకు, వినాయక్‌నగర్‌లోని బోర్గాం వరకు నగరం విస్తరించింది. ఈ ప్రాంతాల గుండా రింగ్‌రోడ్డును నిర్మిస్తూ జాతీయ రహదారికి అనుసంధానం చేసే అవకాశం ఉంది. ఇదివరకే వినాయక్‌నగర్‌లో బైపాస్ రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది. దీనిని ఔటర్‌రింగ్‌రోడ్డు నిర్మాణంలో భాగంగా అధికారులు ఏమి చేయాలన్నది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే పట్టణ జనాభాను ప్రాంతాలను పరిశీలించి ఔటర్‌రింగ్‌రోడ్డు నిర్మాణానికి సంబంధించి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు. మొదట పరిశీలన చేసి రింగ్ రోడ్డు నిర్మాణంపై తుది నివేదికను తయారు చేస్తారు. ఈప్రక్రియ చేపట్టాలంటే మరో ఏడాది ఆగాల్సిందే. ఏడాదిలోపు ఈ ప్రక్రియను చేపట్టి పనుల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు పట్టణానికి మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుంటోంది. మున్సిపాల్ కార్పొరేషన్ నగరానికి కొత మాస్టర్ ప్లాన్‌ను రూపొందించేందుకు ఇదివరకే ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ప్రస్తుతం మాస్టర్‌ప్లాన్ రూపుదిద్దుకుంటోంది. ఇందులోనే ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి విధి విధానాలు ఉండనున్నాయి. వీటిని కూడా అధికారులు పరిశీలించనున్నారు. మాస్టర్ ప్లాన్ నివేదికను బేసిక్‌గా చేసుకొని ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణం ఉంటుందని అధికాారులు పేర్కొంటున్నారు. -
బెంగాల్ లో ముగిసిన రెండో దశ పోలింగ్
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివారం రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో విడతలో భారీ పోలింగ్ నమోదైంది. చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని అధికారులు చెప్పారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ నిర్వహించారు. అలీపురుందర్, జల్పౌగురి,నార్త్ దీనాజ్ పూర్, సౌత్ దీనాజ్ పూర్, డార్జీలింగ్, మాండ్లా జిల్లాల్లో పోలింగ్ జరిగింది. కడపటి సమాచారం మేరకు దాదాపు 80 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. ఈ రోజు 56 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించారు. 33 మంది మహిళా అభ్యర్థులతో సహా మొత్తం 383 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. -
రెండో విడత గోల్డ్ బాండ్లతో రూ.726 కోట్లు
తొలి విడతకన్నా మూడు రెట్లు అధికం న్యూఢిల్లీ: రెండవ విడత గోల్డ్ బాండ్ల జారీ ద్వారా కేంద్రం రూ.726 కోట్లు సమీకరించింది. మొత్తం 2,790 కేజీలకు సబ్స్క్రిప్షన్లు రావటంతో ఈ నిధులు సమకూరినట్లు ఆర్థిక కార్యదర్శి శక్తికాంత దాస్ ట్వీట్ చేశారు. మొదటి విడతలో సమీకరించిన మొత్తం కన్నా ఇది మూడు రెట్లు అధికమన్నారు. నవంబర్‌లో జారీ అయిన తొలి విడత స్కీమ్‌లో 916 కేజీలకు సంబంధించి రూ.246 కోట్లు సమీకరించటం తెలిసిందే. రెండవ దఫాలో 3.16 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు దాస్ తెలిపారు. గత దఫా ఈ దరఖాస్తుల సంఖ్య 62,169గా ఉంది. తొలి విడతతో పోలిస్తే రెండో దఫాలో మంచి స్పందన వచ్చినట్లు దాస్ తెలిపారు. రెండవ విడత ఆఫర్ జనవరి 18న ప్రారంభమై, జనవరి 22న ముగియటం తెలిసిందే. ఫిబ్రవరి 8న ఇందుకు సంబంధించి బాండ్లను కేటాయిస్తారు. క్రమంగా ఈ పథకాలకు ప్రజాదరణ లభిస్తున్న విషయం తాజా బాండ్ల జారీతో వెల్లడయిందని దాస్ వివరించారు. కాగా ఇందుకు సంబంధించి ప్రస్తుతానికి అందిన సమాచారం... ప్రాథమికమైనదేనని, మరింత సమాచారం అందాల్సి ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ ఇష్యూకు సంబంధించి 99.9 స్వచ్ఛత ఉన్న గ్రాము ధర రూ.2,600. గోల్డ్ బాండ్లపై ప్రభుత్వం 2.75 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ ఏడాది జవనరి 11-15 తేదీల్లోని 99.9 స్వచ్ఛత బంగారం ధర సగటు ఆధారంగా బాండ్ల ధరను నిర్ణయించారు. లక్ష్యం కష్టమే!: గోల్డ్ బాండ్ పథకం ద్వారా మార్చికి రూ.15,000 కోట్లు సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడం అసాధ్యమని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రభుత్వ మార్కెట్ రుణ సమీకరణ కార్యక్రమంలో గోల్డ్ బాండ్ స్కీమ్ భాగంగా ఉంది. తొలి దశకన్నా రెండవ దశ కొంత మెరుగైన ఫలితం కనబడటం ప్రభుత్వానికి ఊరటనిచ్చే అంశం. -
మళ్లీ గోల్డ్ బాండ్లు..
స్కీమ్ రెండవ విడత ప్రారంభం ♦ జనవరి 22న ఇష్యూకు ముగింపు ♦ 99.9 ప్యూరిటీ గ్రాముకు రూ.2,600 ♦ వార్షిక వడ్డీరేటు 2.75 శాతం ముంబై: రెండవ విడత సావరిన్ గోల్డ్ పథకం సోమవారం ప్రారంభమైంది. 22వ తేదీ (శుక్రవారం) వరకూ ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఇష్యూకు సంబంధించి 99.9 స్వచ్ఛత ధర గ్రాముకు రూ.2,600గా ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన సంగతి తెలిసిందే. గోల్డ్ బాండ్లపై ప్రభుత్వం 2.75 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ ఏడాది జనవరి 11-15 తేదీల్లోని 99.9 స్వచ్ఛత బంగారం ధర సగటు ఆధారంగా బాండ్ల ధర నిర్ణయం జరిగింది. గోల్డ్ బాండ్లు కొనుగోలు చేయాలని భావించే ఇన్వెస్టర్లు జనవరి 18 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, స్టాక్ హోల్డింగ్స్ కార్పొరేషన్లలో ఇందుకు సంబంధించి దరఖాస్తులను ప్రత్యక్షంగాకానీ లేదా ఏజెంట్ల ద్వారా దాఖలు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు చూస్తే... బంగారం బాండ్ల మంజూరు ప్రక్రియ ఫిబ్రవరి 8 నుంచి ఉంటుంది. నవంబర్ 5 నుంచి 20వ తేదీ వరకూ సాగిన... తొలి విడత గోల్డ్ బాండ్ల ధర (గ్రాముకు రూ.2,684)తో పోలిస్తే ప్రసుత్తం గోల్డ్ బాండ్ల ధర గ్రాముకు రూ.84 తక్కువగా ఉంది. {పజలు 2 గ్రాముల నుంచి 500 గ్రాముల పరిమాణం వరకు బాండ్లను కొనుగోలు చే యవచ్చు. ఒక వ్యక్తి ఏడాదిలో 500 గ్రాములకు మించిన విలువగల పసిడి బాండ్లు కొనుగోలు చేయడానికి వీలులేదు. బంగారం బాండ్ల జారీ ఫిబ్రవరి 8న. మెచ్యూరిటీ కాలం- జారీ తేదీ నుంచి 8 ఏళ్లు. బంగారం బాండ్లపై వచ్చిన వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. ఐదేళ్ల నుంచే ముందస్తు నగదు మార్పిడి అమల్లో ఉంటుంది. బాండ్ మెచ్యూరిటీ సమయంలో ఉన్న ధరకు అనుగుణంగా అందుకు సమానమైన పసిడి లేదా నగదు విలువను ఇన్వెస్టర్ పొందవచ్చు. రుణాలు పొందడానికి హామీగా బాండ్లను వినియోగించుకోవచ్చు. సెంట్రల్ బ్యాంక్ నోటిఫై చేసిన తేదీ నుంచీ బాండ్లు ట్రేడయ్యే అవకాశం ఉంది. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మినహాయింపులు వర్తిస్తాయి. నిధుల సమీకరణ లక్ష్యం కష్టమే..! గోల్డ్ బాండ్ పథకం ద్వారా మార్చి నాటికి రూ.15,000 కోట్లు సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఈ లక్ష్యాన్ని సాధించడం అసాధ్యమని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రభుత్వ మార్కెట్ రుణ సమీకరణ కార్యక్రమంలో గోల్డ్ బాండ్ స్కీమ్ భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. నవంబర్‌లో ప్రారంభమైన తొలి విడత గోల్డ్ బాండ్ల మంజూరు ప్రక్రియలో ప్రజల నుంచి 62,169 దరఖాస్తులు వచ్చాయి. రూ.246 కోట్ల విలువైన 916 కిలోల బంగారు బాండ్లు కొనుగోలు చేశారు. లక్ష్యంతో పోల్చితే ఈ సమీకరణ తక్కువే కావడం గమనార్హం. పసిడి డిపాజిట్ స్కీమ్‌లో సోమనాథ్ దేవాలయ బంగారం! అహ్మదాబాద్: గోల్డ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడులు పెట్టడానికి గుజరాత్‌కు చెందిన ప్రముఖ సోమనాథ్ దేవాలయం ట్రస్ట్ సిద్ధమయ్యింది. దేవాలయానికి సంబంధించి రోజూవారీ వినియోగించకుండా ఉంటున్న పసిడిని డిపాజిట్ పథకంలో పెట్టుబడిగా పెట్టాలని ట్రస్ట్ నిర్ణయించింది. దేవాలయం ట్రస్టీ సభ్యుల్లో ప్రధాని నరేంద్రమోదీ కూడా ఉన్నారు. స్వచ్ఛత, ఆభరణాల పసిడి కలిసి ప్రస్తుతం దేవాలయం వద్ద దాదాపు 35 కేజీల పసిడి ఉంది. ఇందులో రోజువారీగా వినియోగించని పసిడిని (స్వచ్ఛత) వేరుచేసి డిపాజిట్ చేయాలని ప్రధాని మోదీ నివాసంలో ఈ నెల 12న జరిగిన ట్రస్టీ సభ్యుల సమావేశం నిర్ణయించినట్లు ట్రస్ట్ సెక్రటరీ పీకే లాహిరి సోమవారం తెలిపారు. ఇది కార్యరూపం దాల్చితే పసిడి డిపాజిట్ పథకంలో చేరిన మొట్టమొదటి దేవాలయంగా గుజరాత్ సోమనాథ్ దేవాలయం నిలవనుంది. కేంద్రం ప్రవేశపెట్టిన రెండు పసిడి పథకాల్లో బాండ్స్‌తో పాటు పసిడి డిపాజిట్ కూడా ఒకటి. అయితే డిపాజిట్ స్కీమ్‌కు ప్రజల నుంచి పెద్దగా స్పందన లభించలేదు. -
ఈ నెల 18న రెండో దశ గోల్డ్ బాండ్ పథకం
న్యూఢిల్లీ: రెండో విడత గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ఈ నెల 18న బ్యాంకులు ప్రారంభిస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 22 వరకూ ఈ గోల్డ్ బాండ్ స్కీమ్ ఉంటుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో ప్రారంభమైన మొదటి విడత గోల్డ్‌బాండ్ స్కీమ్‌లో రూ.246 కోట్ల విలువైన 915.95 కేజీల బంగారం బాండ్లను బ్యాంకులు జారీ చేశాయి. ఈ పథకానికి మంచి స్పందన వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. -
అక్టోబర్ 1 నుంచి రెండో విడత పరామర్శయాత్ర
-
అక్టోబర్‌లో కరీంనగర్ రెండో విడత యాత్ర
-
అక్టోబర్‌లో కరీంనగర్ రెండో విడత యాత్ర
సాక్షి, హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి తరఫున పరామర్శిస్తున్న ఆయన సోదరి షర్మిల... అక్టోబర్ 1వ తేదీ నుంచి కరీంనగర్ జిల్లాలో రెండో విడత పరామర్శయాత్ర చేస్తారని ఆ పార్టీ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలి పారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 1 నుంచి 3 వరకు కరీం నగర్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర నిర్వహిస్తారని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడ మండలం వర్కోలులో ఈ యాత్ర ప్రారంభమవుతుందని... 3న మధ్యాహ్నం సమయానికి 18 కుటుంబాలను కలుసుకుంటారని చెప్పారు. 3న సాయంత్రం ఆదిలాబాద్ జిల్లాలోకి షర్మిల అడుగుపెడతారని చెప్పారు. ఆ జిల్లాలో నిర్మల్ నియోజకవర్గం దిలావార్‌పూర్‌లో యాత్ర ప్రారంభించి 5వ తేదీ వరకు కొనసాగిస్తారని, పది కుటుంబాలను కలుసుకుంటారని వెల్లడించారు. 5వ తేదీన సాయంత్రం నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించి 6వ తేదీ వరకు 19 కుటుంబాలను పరామర్శిస్తారని చెప్పారు. షర్మిల ఇప్పటివరకు తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 169 కుటుంబాలను పరామర్శించి, భరోసా కల్పిం చారని చెప్పారు. ఈ యాత్రలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 5,114 కిలోమీటర్లు ప్రయాణించారన్నారు. -
ఐలయ్య కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
7 నుంచి వరంగల్‌లో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
-
7 నుంచి వరంగల్‌లో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక గుండెపగిలి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సోమవారం నుంచి వరంగల్ జిల్లాలో రెండోవిడత పరామర్శ యాత్ర చేపడుతున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆమె యాత్ర ఉంటుంది. ఈ యాత్ర షెడ్యూలును కొండా రాఘవరెడ్డి, బీష్మా రవీందర్, మహేందర్ రెడ్డి తదితరులు శనివారం వరంగల్ జిల్లాలోని తొర్రూరులో విడుదల చేశారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 31 మంది కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. -
‘మాఫీ’పై పేచీ!
రుణమాఫీలో లబ్ధిదారుల జాబితాను మరోమారు క్షుణ్ణంగా పరిశీలించాలని యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటి కే రెండుసార్లు లబ్ధిదారుల ఎంపికను సమీక్షించిన అధికారులు తాజాగా ప్రత్యేక బృందాలతో కొన్ని బ్యాంకులను ఎంపిక చేసుకుని పరిశీలన చేయనున్నారు. ఈ క్రమంలో అవకతవకలు బయటపడితే మరింత లోతుకు వెళ్లి అధ్యయనం చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా ఈనెల 30లోగా పరిశీలన పూర్తిచేసి నివేదికలను ప్రభుత్వానికి సమ ర్పించేలా చర్యలు చేపట్టారు. మొదటిసారి చేసిన క్షేత్రపరిశీలనలో 3,936 మంది రైతులను అనర్హులుగా గుర్తించిన అధికారులు.. ఈ సారి ఎంతమందిని గుర్తిస్తారో చూడాలి. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో రుణమాఫీ పథకంతో 2,08,425 మంది రైతులు లబ్ధి పొందారు. వాస్తవానికి మొదటిసారి ఎంపిక చేసిన సమయంలో 2,12,361 మంది రుణమాఫీకి అర్హత సాధించారు. అయితే క్షేత్రపరిశీలనకు ఉపక్రమించిన అధికారులు 3,936 మంది అనర్హులున్నట్లు గుర్తించి.. ఆ మేరకు వారికి ఇచ్చే మాఫీని వెనక్కు తీసుకున్నారు. దీంతో తొలివిడత రూ.258.16 కోట్లు మంజూరుకాగా.. లబ్ధిదారులకు మాత్రం రూ.251.20 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. మిగతా నిధులను ప్రభుత్వానికి వెనక్కు ఇచ్చారు. తాజాగా లబ్ధిదారుల స్థితిని మళ్లీ పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10 శాతం పరిశీలన.. ప్రస్తుతం రుణమాఫీకి సంబంధించి లబ్ధిదారులందరి వివరాలను పరిశీలించడం సులభం కాదు. ఈ నేపథ్యంలో జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటుచేసి ర్యాండమ్‌గా పరిశీలన చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం ఇందుకు ప్రత్యేకంగా బ్యాంకు అధికారులు, ఆడిట్ అధికారులతో బృందాలను ఏర్పాటు చేసింది. ఎక్కువ మొత్తంలో లబ్ధిదారులున్న బ్యాంకులను ఎంపిక చేసుకుని.. 10శాతం లబ్ధిదారులు కవర్అయ్యేలా పరిశీలన చేయనున్నారు. ఈ క్రమంలో అక్రమార్కులు తేలితే వారి అర్హతను రద్దు చేయనున్నారు. ఈమేరకు గురువారం సచివాలయం నుంచి వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కలెక్టర్ రఘునందన్‌రావును ఆదేశించారు. ఈ నివేదికలు సమర్పించిన తర్వాతే రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. -
రెండో విడత రుణమాఫీకి ఆర్థికశాఖ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రైతులకు రెండో విడత రుణమాఫీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు వ్యవసాయశాఖ, బ్యాంకర్లు పంపిన ప్రతిపాదనను అంగీకరించింది. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా ఇప్పటికీ రెండో విడత రుణమాఫీ సొమ్ము విడుదలపై సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను పంపడంతో ఆర్థికశాఖ ఆమోదం తెలిపిందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఇదే విషయంపై శుక్రవారం వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సంబంధిత శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి, సంచాలకులు ప్రియదర్శిని సహా రాష్ట్రస్థాయి బ్యాంకర్లు, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మొదటి విడత రుణమాఫీకి సంబంధించిన అంశాలపై సమీక్ష జరిపారు. ఇప్పటివరకు బ్యాంకులు పూర్తిస్థాయిలో వినియోగపత్రాలు (యూసీ) అందజేయకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తంచేసినట్లు తెలిసింది. యూసీలు రాకుంటే రెండో విడత రుణమాఫీ సొమ్ము విడుదల చేయడం సాంకేతిక ఇబ్బందులకు దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు. -
2017 నాటికి పూర్తి చేయండి
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ రెండోదశను జూన్-డిసెంబర్ 2017 నాటికి పూర్తి చేయాలని అధికారులను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆదేశించారు. తెలంగాణలోని పలు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై మంత్రి సోమవారం పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ద.మ.రైల్వే జీఎం శ్రీవాత్సవ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నిర్మల, జలమండలి ఎండీ జగదీశ్వర్లు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ అండర్‌బ్రిడ్జిలు, పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ ప్రాజెక్టులపై ద.మ. రైల్వే జీఎంతో సమీక్షించారు. ఎంఎంటీఎస్ రెండోదశ పనులు చర్లపల్లి-ఘట్కేసర్, బొల్లారం-మేడ్చల్ మార్గాల్లో ఊపందుకున్నాయని జీఎం కేంద్ర మంత్రికి తెలిపారు. సనత్‌నగర్-అమ్ముగూడా మార్గంలో పనులు చేపట్టేందుకు నాలుగు ఎకరాల రక్షణ శాఖ స్థలం సేకరణలో జాప్యం అవుతోందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఫలక్‌నుమా-ఉందానగర్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఎంఎంటీఎస్ విస్తరణకు జీఎంఆర్ సంస్థ అంగీకరించడం లేదని తెలపగా సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ రైల్వే విస్తరణ పనులు మార్చి 2016 నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ పథకం పూర్తికి రూ.50 కోట్ల మేర నిధుల విడుదలకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే గోదావరి మంచినీటి పథకంలో భాగంగా చేపట్టిన పైప్‌లైన్ పనులకు మెట్టుగూడా రైల్వే క్రాసింగ్ వద్ద అనుమతులు మంజూరు చేయించాలని జలమండలి మేనేజింగ్ డెరైక్టర్ ఎం.జగదీశ్వర్ మంత్రిని కోరారు. అమృత్ పథకం కింద మూసీ ప్రక్షాళన రెండోదశను చేపట్టేందుకు పట్టణాభివృద్ధి శాఖపై ఒత్తిడి తేవాలని జలమండలి ఎండీ జగదీశ్వర్ కోరగా.. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతానని మంత్రి హామీ ఇచ్చారు. -
ఎర్రచందనం రెండో విడత వేలం
హైదరాబాద్: అటవీ శాఖ గిడ్డంగుల్లో నిల్వ ఉన్న ఎర్రచందనం దుంగలను వచ్చే ఏడాదిలోగా ఎగుమతి చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సూత్రపాయ ఆమోదం తెలిపింది. 8,584 టన్నుల ఎర్రచందనం ఎగుమతికి కేంద్ర ప్రభుత్వ అధీనంలోని డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌ఏ) ఇచ్చిన గడువు ఈనెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రెండో విడత ఎర్రచందనం దుంగల విక్రయానికి ఈ - టెండర్లు నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర అటవీ శాఖ దుంగల ఎగుమతికి అదనపు గడువు కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మూడు రోజుల కిందట ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి (పీసీసీఎఫ్) ఏవీ జోసెఫ్ కేంద్ర అటవీ పర్యావరణశాఖ మంత్రితోనూ, డీజీఎఫ్‌ఏ అధికారులతోనూ ఈ అంశంపై చర్చించారు. దీంతో మరో ఏడాది గడువు పొడిగించేందుకు డీజీఎఫ్‌ఏ అంగీకరించింది. ఈ నేపథ్యంలో 3500 టన్నుల ఎర్రచందనం విక్రయానికి వచ్చే నెల మొదటి వారంలో రెండో విడత ఈ టెండరు ప్రకటన జారీ చేస్తామని రాష్ట్ర అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి మురళీకృష్ణ తెలిపారు. టెండర్లు నిర్వహించేందుకు వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో నిర్ధారించిన ఎర్రచందనం దుంగలను డ్రెస్సింగ్ చేసి గోదాముల్లో సిద్ధంగా ఉంచామని ఆయన 'సాక్షి' కి తెలిపారు. టెండరు ప్రకటన జారీ చేసేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ఫైలు పంపామని, ఆమోదం రాగానే నోటిఫికేషన్ జారీ చేస్తామని వివరించారు. -
రెండో దశ రుణమాఫీకి రూ.2,375 కోట్లు
హైదరాబద్: రెండో దశ రైతు రుణ మాఫీ కోసం రూ. 2,375 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రైతు సాధికారిక సంస్థకు ఈ నిధులను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల మొదట్లో సెక్యూరిటీల విక్రయం ద్వారా సమీకరించిన వెయ్యి కోట్ల రూపాయల రుణాన్ని.. రెండో దశ రుణ మాఫీ కోసం ఆర్థిక శాఖ అప్పట్లోనే రైతు సాధికారిక సంస్థకు ఇచ్చింది. -
రెండో విడత రుణమాఫీలో వాయిదాల పర్వం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో రెండో విడత రుణమాఫీపై వాయిదాల పర్వం కొనసాగుతోంది. మొదటి విడత రుణమాఫీ ఇచ్చినప్పటికీ రెండో విడత రుణమాఫీకి మాత్రం ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతోంది. దీనికి తోడు రుణమాఫీ గడువును మరో వారం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా సమాచారం ప్రకారం...రుణమాఫీకి ఈ నెల 21 వరకు గడువు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 21 వ తేదీన మంత్రులందరూ కలిసి రుణమాఫీపై బ్యాంకర్లతో సమావేశం కానున్నారు. -
నేడు కశ్మీర్,జార్ఖండ్‌లలో రెండో విడత పోలింగ్
-
రేపట్నుంచి మోదీ రెండో విడత ప్రచారం
జమ్మూ:జమ్మూ కాశ్మీర్ రెండో విడత ఎన్నికల ప్రచారానికి బీజేపీ సన్నద్ధమయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి ఎన్నికల ర్యాలీలో పాల్గొనబోతున్నట్లు బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. పూంచ్, ఉదమ్ పూర్ జిల్లాలో మోదీ ప్రచారం నిర్వహిస్తారని..ఈ ర్యాలీలకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతారని బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 22 వ తేదీన నరేంద్ర మోదీ కిస్త్ వార్ పట్టణంలో జరిగిన ర్యాలీకి నలభై వేలమందికి పైగా ప్రజలు హాజరయ్యారని.. రెండో విడతలో అంతకంటే అధిక సంఖ్యలో తమకు ప్రజా మద్దతు లభిస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
అనంతపురంలో పోలీసుల ఓవరాక్షన్
-
జెడ్పీటీసీ, ఎంపీటీసీ రెండోవిడత పోలింగ్
-
ఈశాన్య రాష్ట్రాల్లో నేడు రెండో విడత పోలింగ్
-
ఇదీ ప్రాదేశిక షెడ్యూల్
నల్లగొండ, న్యూస్‌లైన్ ప్రాదేశిక ఎన్నికల షెడ్యూల్ ఎట్టకేలకు ఖరారైంది. వివిధ కారణాల దృష్ట్యా ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించాలని జిల్లా అధికారులు ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు పంపారు. ఈ మేర కు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి గురువారం ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. కానీ తొలుత ప్రతిపాదించిన ప్రకారం కాకుండా ఎన్నికల తేదీల్లో మార్పులు చేశారు. మొదటి విడత పోలింగ్ యధావిధిగానే ఏప్రిల్ 6 తేదీన నిర్వహిస్తారు. రెండో విడత పోలింగ్ మాత్రం ఏప్రిల్ 8న కాకుండా 11వ తేదీకి వాయిదా వేశారు. 8న శ్రీరామనవమి పండుగ ఉన్నందున రెండో విడత పోలింగ్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 11న కాకుండా మే 7 తేదీ తర్వాత నిర్వహించాలని నిర్ణయించారు. ప్రాదేశిక ఎన్నికల ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడకుండా ఉండేందుకు ఈ మార్పు చేయాల్సి వచ్చింది. మే 7 తేదీ నాటికి సార్వత్రిక ఎన్నికలు పూర్త్తవుతాయి. -
ఛత్తీస్‌గఢ్‌లో మందకొడిగా పోలింగ్
ఛత్తీస్‌గఢ్ శాసనసభకు నేడు జరుగుతున్న రెండవ లేక తుది దశ పోలింగ్‌లో ఈ రోజు మధ్యాహ్నం వరకు నాలుగు మిలియన్ల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారగా, మరికొన్ని చోట్ల చాలా అత్యల్పంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగి బరిలో నిలిచిన మర్వాహి నియోజకవర్గంలో దాదాపు 40 శాతం మందికి పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మహాసంముంద్ జిల్లాలోని సరైపల్లి నియోజకవర్గంలో ఓట్లర్లు అత్యల్పంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. రాష్ట్రంలో బిలాస్పూర్ నగరంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ మినహా రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి చెదురుమదురు ఘటనలు చోటు చేసుకోలేదు. మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. అందులోభాగంగా దాదాపు 3 వేల పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అలాగే ఎక్కడికక్కడ భద్రత దళాలను మోహరించింది. ఛత్తీస్‌గఢ్‌లో నగర, గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు మధ్యాహ్నం నాటికి 13.9 మిలియన్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో 6.83 మంది మహిళలు ఉన్నారు. నేడు జరుగుతున్న రెండవ దశలో 72 శాసనసభ నియోజకవర్గాల్లో 843 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే నవంబర్ 11న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన మొదటి దశ ఎన్నికలను ఎన్నికల సంఘం నిర్వహించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 8వ తేదీన అభ్యర్థులు భవితవ్యం తెలనుంది.