ఛత్తీస్‌గఢ్‌లో తుది దశ పోలింగ్ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 19 జిల్లాలోని 72 నియోజకవర్గాలకు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 90 స్థానాలు ఉన్నా చత్తీస్‌గఢ్ అసెంబ్లీకి తొలి దశలో 18 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టుల పిలుపు నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈసీ మొత్తం 19,296 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రమణ్‌సింగ్ ప్రభుత్వంలోని 9 మంది మంత్రులు, స్పీకర్‌తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ భూపేశ్ బఘేల్, అజిత్ జోగి సహా ఇరు పార్టీల కీలక నేతల భవిష్యత్ నేడు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది.