Published
Sat, Aug 13 2016 9:55 PM
| Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
627 చెరువుల పునరుద్ధరణ పూర్తి
రెండో దశలో 627 చెరువుల్లో మిషన్‌పనులు
జిల్లా నీటిపారుదలశాఖ ఎస్‌ఈ గంగాధర్
నిజాంసాగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం కింద జిల్లాలో మొదటి దశలో 627 చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని జిల్లా నీటిపారుదలశాఖ ఎస్‌ఈ గంగాధర్ తెలిపారు. మొదటి దశలో చెరువుల పునరుద్ధరణ పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు రూ. 174 కోట్లు చెల్లించామన్నారు. శనివారం నిజాంసాగర్ అతిథి గృహం వద్ద రెస్ట్‌హౌస్ మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి దశ మిషన్ కాకతీయ పథకం కింద 658 చెరువుల్లో పునరుద్ధరణ పనులు చేపట్టామన్నారు. రెండో దశ కింద 649 చెరువులకు గాను రూ. 176 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో 2,811 చెరువులకు గాను 237 చెరువులు పూర్తి స్థాయి నీటినితో నిండాయన్నారు. 169 చెరువులు వరదనీటితో పొంగిపొర్లాయని ఆయన చెప్పారు. 567 చెరువులు 75 శాతం, 534 చెరువులు 50 శాతం, 1,306 చెరువులు 25 శాతం నీటితో నిండాయని తెలిపారు. జిల్లాలోని 148 చెరువులను త్రిబుల్ ఆర్ కింద ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. అందులో 51 చెరువులకు ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలిపిందన్నారు. ఆయన వెంట నీటిపారుదల డిప్యూటి ఈఈ సురేశ్‌బాబు, ఏఈ బాసిద్ తదితరులున్నారు.