హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో రెండో విడత రుణమాఫీపై వాయిదాల పర్వం కొనసాగుతోంది. మొదటి విడత రుణమాఫీ ఇచ్చినప్పటికీ రెండో విడత రుణమాఫీకి మాత్రం ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతోంది. దీనికి తోడు రుణమాఫీ గడువును మరో వారం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా సమాచారం ప్రకారం...రుణమాఫీకి ఈ నెల 21 వరకు గడువు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 21 వ తేదీన మంత్రులందరూ కలిసి రుణమాఫీపై బ్యాంకర్లతో సమావేశం కానున్నారు.