![Archaeological Survey of India will conduct a technical survey of the Ratna Bhandar](/styles/webp/s3/article_images/2024/09/22/JAGANNATH-TEMPLE.jpg.webp?itok=Td2QQ_0p)
పూరీ: భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్‌ఐ) ఒడిశా పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భండార్‌లో శనివారం మధ్యాహ్నం రెండో దఫా టెక్నికల్ సర్వే ప్రారంభించింది. మూడు రోజులపాటు ఈ సర్వే కొనసాగుతుందని, మధ్యాహ్నం ఒంటి నుంచి సాయంత్రం 6 గంటల ద్వారా భక్తులను ఆలయంలోకి అనుతించబోమని శ్రీజగన్నాథ్ ఆలయ పరిపాలనా విభాగం అధికారులు వెల్లడించారు.
సర్వే జరుగుతున్న సమయంలో ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు. రత్న భండార్‌లో రహస్య గది గానీ, సొరంగం గానీ ఉన్నా యా? అనేది తేల్చబోతున్నామని రత్న భండార్ ఇన్వెంటరీ కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ చెప్పారు. ఈ సర్వే కోసం అత్యాధునిక రాడార్‌ను ఉపయోగిస్తున్న ట్లు వివరించారు. రత్న భండార్‌లో మొదటి దఫా సర్వే ఇప్పటికే పూర్తయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment