Bandar
-
బందరు ఇలాకా.. మంత్రి తాలూకా..!
సాక్షి, మచిలీపట్నం: బందరు మొత్తం.. మంత్రి గారి తాలూకా అన్నవిధంగా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తార్కాణం బందరు సర్వజన ప్రభుత్వాస్పత్రి. ‘డాక్టర్‌గారూ.. నేను బందరు ఎమ్మెల్యే గారి తాలూకా.. ఆయన మంత్రిగారు కూడా..’ అంటూ మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి డాక్టర్లపై వత్తిళ్లు పెంచుతున్నారు రోగుల సహాయకులుగా వచ్చే కొందరు నేతలు. అంతే కాకుండా వారు.. డాక్టర్లు చెప్పిన టెస్ట్‌లు కాకుండా ఎలాంటి పరీక్షలు రాయాలో కూడా ఆ నేతలే సూచిస్తున్నారు. మరి కొందరు సహాయకుల పేరుతో వచ్చే చోటామోటా నేతలు ఇంకాస్త ముందుకు వెళ్లి.. అవసరం లేకపోయినా అడ్మిట్ చేసుకోవాలని, వార్డులో బెడ్స్ వసతి కల్పించాలని ఒత్తిళ్లకు గురి చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.వాళ్లు చెప్పినట్టే చేయాలట..రోగులకు అవసరం మేరకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తారు. ఇది వైద్యుల వృత్తి. దీనికి భిన్నంగా ఉంది మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో. అధికార పార్టీ నాయకులు కొంతమంది.. ఎక్స్‌రేలాంటి చిన్న చిన్న టెస్టులు చాలన్న చోట ఎమ్మారై, సీటీస్కాన్ లాంటివి చేయించాలని చెబుతుండటంతో వైద్యుల్లో చర్చగా మారింది. ‘డాక్టర్లం మేము కదా.. అది అవసరం లేదు అంటే.. ప్రభుత్వం మాది మేం చెప్పినట్లు వైద్యం చేయండి’ అంటూ గుర్రుమంటున్నారని ఇక్కడి వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏదైనా జరిగితే ఊరుకోం..డాక్టర్ గారు.. ఈయన మాకు కావాల్సిన మనిషి. ఏదైనా జరిగితే ఊరుకోం అంటూ వైద్యులతో హెచ్చరిస్తున్నట్లు మాట్లాడటం ఆసుపత్రిలో చర్చనీయాంశమైంది. మరోవైపు కొంతమంది మద్యం తాగి వచ్చి మహిళా వైద్యులు, నర్సులపై కూడా దురుసుగా ప్రవర్తించిన సందర్భాలున్నాయి.ఎస్పీకి చెప్పినా ఫలితం లేదుప్రభుత్వాస్పత్రిలో అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఆసుపత్రి అవుట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదులు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అది తమ డ్యూటీ కాదని, కేవలం ప్రమాదాలు, ఇతర ఘటనలతో వచ్చే ఎంఎల్సీ కేసులను చూసుకోవడమే అని అవుట్‌పోస్ట్ పోలీసులు చెబుతున్నట్లు సమాచారం. దీంతో ఇటీవలే డీఎస్పీతో పాటు ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని కొందరు డాక్టర్లు వాపోతున్నారు. ఇటీవల ‘తమ మచిలీపట్నం ఆసుపత్రిలో రాజకీయ ఒత్తిళ్లు బాగా పెరిగాయని, ఎమ్మెల్యే తాలుకా’ అంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు డాక్టర్లు అనడం గమనార్హం. ప్రతి రోజూ 800 మంది వరకు ఓపీ, నిత్యం 600 మంది వరకు ఇన్ పేషెంట్స్ ఉంటున్నారని, సిఫార్సులు లేకపోయినా ప్రతి రోగికి ఒకే తరహాలో వైద్యం అందిస్తున్నామని వైద్యులు అంటున్నారు. -
రత్న భండార్‌లో రెండో సర్వే ప్రారంభం
పూరీ: భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్ఐ) ఒడిశా పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భండార్‌లో శనివారం మధ్యాహ్నం రెండో దఫా టెక్నికల్ సర్వే ప్రారంభించింది. మూడు రోజులపాటు ఈ సర్వే కొనసాగుతుందని, మధ్యాహ్నం ఒంటి నుంచి సాయంత్రం 6 గంటల ద్వారా భక్తులను ఆలయంలోకి అనుతించబోమని శ్రీజగన్నాథ్ ఆలయ పరిపాలనా విభాగం అధికారులు వెల్లడించారు. సర్వే జరుగుతున్న సమయంలో ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు. రత్న భండార్‌లో రహస్య గది గానీ, సొరంగం గానీ ఉన్నా యా? అనేది తేల్చబోతున్నామని రత్న భండార్ ఇన్వెంటరీ కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ చెప్పారు. ఈ సర్వే కోసం అత్యాధునిక రాడార్‌ను ఉపయోగిస్తున్న ట్లు వివరించారు. రత్న భండార్‌లో మొదటి దఫా సర్వే ఇప్పటికే పూర్తయ్యింది. -
పేర్ని కిట్టు ఎలక్షన్ క్యాంపెయిన్ బందరులో దుమ్మురేపిన పేర్నినాని
-
హరికథే ఆమె కథ
14వ ఏట నుంచి డి.ఉమామహేశ్వరి హరికథ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. 'సంస్కృతం’లో హరికథ చెప్పగలిగే ఏకైక మహిళా భాగవతారిణి.తెలుగులో ఆమె చెప్పే హరికథలకు విశేష అభిమానులు ఉన్నారు.ప్రతిష్ఠాత్మక సంగీత్ నాటక్ అకాడెమీ పురస్కారాన్ని న్యూఢిల్లీలో నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు.అక్కడి రబీంద్ర భవన్లో ఫిబ్రవరి 24న ప్రదర్శన ఇవ్వనున్నారు.ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే... ‘‘మాది బందర్ (మచిలీపట్నం). మా నాన్న లాలాజీ రావు నాదస్వర విద్వాంసుడు. వేములవాడ దేవస్థానంలో 30 ఏళ్ల పా టు నాదస్వర వాదన చేశాడాయన. మేము వేములవాడలో ఉన్నా అవకాశం దొరికినప్పుడల్లా బందర్‌కు తీసుకెళ్లేవాడు. అక్కడ నేను హరికథలు వినేదాన్ని. మా చిన్నప్పుడు కోట సచ్చిదానంద శాస్త్రిలాంటి వారు 40 రోజుల పా టు మహాభారతం చెప్పేవారు. జనం విరగబడేవారు. సినిమాహాళ్ల యజమానులొచ్చి హరికథను ముగించమని, జనం సినిమాలకు రావడం లేదని బతిమిలాడేవారు. అలా హరికథ నా మనసులో ముద్ర వేసింది. హరికథా గురుకులంలో... తూ.గో.జిల్లా కపిలేశ్వరపురంలో జమీందారు సత్యనారాయణ గారు, వారి శ్రీమతి రాజరాజేశ్వరి గారు డాన్స్ స్కూల్ స్థాపించాలనుకున్నారు. కాని నటరాజ రామకృష్ణ గారు ఇది తెలిసి డాన్స్ స్కూల్స్ చాలా ఉన్నాయి హరికథ కళ అంతరించిపోతోంది... దాని కోసం స్కూల్ తెరువు అనంటే రాజావారు తన తండ్రి పేరున శ్రీ సర్వరాయ హరికథా గురుకులం స్థాపించారు. మా నాన్న ఇది తెలిసి నన్ను అక్కడ చేర్పించారు. 14 ఏళ్ల వయసులో అక్కడ చేరి ఆదిభట్ల నారాయణదాసు ఏ సంప్రదాయం హరికథకు స్థిరపరిచారో ఆ సంప్రదాయంలోనే నేర్చుకున్నాను. నాతో పా టు మరో 40 మంది అమ్మాయిలు హరికథను నేర్చుకున్నారు. హరికథ చెప్పాలంటే సంగీతం, సాహిత్యం, నృత్యం, సంస్కృతం, తెలుగు తెలిసి ఉండాలి. ఆటా పా టా మాట... వీటిని మేటిగా మేళవిస్తూ రక్తి కట్టేలా కథ చెప్పాలి. గురువుల దయవల్ల నేను నేర్చుకోగలిగాను. విజయనగరం సంస్కృత పా ఠశాలలో నా తొలి ప్రదర్శన ఇచ్చాను. సంస్కృతంలో హరికథ తెలుగులో హరికథలు చాలామంది చెబుతారు. కాని అవి తెలుగువారికి మాత్రమే పరిమితం. దేశంలో వేద విద్యను సంస్కృతంలో అభ్యసిస్తున్నవారు, సంస్కృత స్కాలర్లు, టీచర్లు, ఆ భాష ప్రేమికులు చాలామంది ఉన్నారు. వారి కోసం సంస్కృతంలో హరికథలు చెప్తే బాగుండునని అనుకున్నాను. ఎన్.పి.హెచ్.కృష్ణమాచార్యులు గారు కాళిదాసు కావ్యాలను హరికథలుగా రాసి ఇచ్చారు. ఉజ్జయినిలో సంస్కృత పండితుల ఎదుట ‘అభిజ్ఞాన శాకుంతలం’ చెప్పడంతో నేను ఆ భాషలో చెప్పే తొలి మహిళను అయ్యాను. కుమార సంభవం, రఘువంశం, ఆది శంకరాచార్య, గీత గోవిందం, భక్త జయదేవ... వీటిని హరికథలుగా సంస్కృతంలో చెబుతున్నాను. 1993లో హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ వేదిక్ కాన్ఫరెన్స్ జరిగితే హాజరయ్యి సంస్కృతంలో హరికథ చెప్పాను. ప్రశంసలుపొందాను. భక్తిమార్గం కొందరు సినిమా పా టలను కలిపి హరికథలు చెబుతుంటారు. అది నా మార్గం కాదు. సరిగా హరికథ చెప్తే నేటికీ ప్రేక్షకులు ఎందరో వస్తున్నారు. నా దగ్గరకు వచ్చిన ఔత్సాహికులకు ఈ కళను నేర్పిస్తున్నాను. ఆదిభట్ల గారి మునిమనవరాళ్లకు నేర్పించాను. కాని ఈ కళ కోసం మరింత జరగాల్సి ఉంది. భర్తతో కలిసి మా ఆయన కళాకృష్ణ ప్రసిద్ధ నాట్యకారుడు. మాకు కొడుకు, కూతురు ఉన్నారు. మేమిద్దరం శక్తి ఉన్నంత కాలం మా కళను ప్రదర్శిస్తూ కొత్త తరాలకు నేర్పిస్తూ ఉండాలని నిశ్చయించుకున్నాం.’’ -
అద్వితీయ నగరాలు బెజవాడ, బందరు
మచిలీపట్నం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైర్మన్‌గా వ్యవహరించే ‘నీతి ఆయోగ్’ దేశంలోని 7 రాష్ట్రాల్లో గల 12 నగరాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా.. వాటిలో ఏపీ నుంచి మచిలీపట్నం, విజయవాడ నగరాలకూ చోటు దక్కింది. తెలంగాణ రాష్ట్రం నుంచి నల్గొండ, వరంగల్ నగరాలకు చోటు దక్కింది. నగరాల అభివృద్ధికి ఏషియన్ డెవలెప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) నిధులు సమకూర్చేందుకు నీతి ఆయోగ్ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం నిర్వహించే వర్క్‌షాప్‌నకు హాజరుకావాల్సిందిగా నీతి ఆయోగ్ నుంచి మచిలీపట్నం, విజయవాడ నగరపాలక సంస్థల మేయర్లు, కమిషనర్లకు ఆహ్వానం అందింది. దీంతో ఇరు నగరాల ప్రతినిధులు హస్తినకు పయనమయ్యారు. నగర సర్వతోముఖాభివృద్ధికి ఏం చేయాలనే దానిపై నీతి ఆయోగ్ ప్రతినిధులకు సమగ్ర నివేదికలు అందించనున్నారు. బందరు వ్యూ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటంలో కీలకంగా పనిచేస్తూ, దేశంలో అత్యున్నతమైన ‘నీతి ఆయోగ్’ ముందు ప్రసంగించే అవకాశం దక్కటంతో నగర ప్రథమ మహిళలుగా అభివృద్ధిలో తమ భాగస్వామ్యాన్ని చాటేందుకు మచిలీపట్నం, విజయవాడ మేయర్లు సిద్ధమయ్యారు. ఇక్కడ ఉన్న సహజ వనరులు, వీటి వినియోగంతో పరిశ్రమలు ఏర్పడితే యువతకు కలిగే ఉపాధి వంటి అంశాలపై వీరు ఇచ్చే ప్రజెంటేషన్ మేరకు భవిష్యత్‌లో రెండు నగరాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయనుంది. ఈ ప్రక్రియ పూర్తయితే రాష్ట్రంలోని మచిలీపట్నం, విజయవాడ నగరాలకు దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు లభిస్తుంది. చారిత్రక నగరం బందరు చారిత్రక నేపథ్యం గల బందరుకు దేశంలోనే రెండో మునిసిపాలిటీగా అవతరించిన ఘనత ఉంది. కానీ.. గత పాలకుల నిర్వాకంతో నగరాభివృద్ధి తిరోగమనంలో ఉంది. బందరు అభివృద్ధిపై గత పాలకులు ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాంత ప్రాశస్త్యం, ఇక్కడ గల సహజ వనరుల వినియోగం ద్వారా సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని భావించి ఇప్పటికే తగిన కార్యాచరణకు సిద్ధమైంది. సముద్ర తీరప్రాంతం ఉన్నందున ఇప్పటికే రూ.348 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బందరు పోర్టు నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం ప్రకటించి, అందుకు అనుగుణంగా భూసేకరణ ప్రక్రియ చేపట్టింది. పోర్టు నిర్మాణం పూర్తయితే తెలంగాణ రాష్ట్రం నుంచి సైతం ఎగుమతులు చేసేందుకు బందరు కేంద్రం కానుంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 12 నగరాల్లో బందరుకు చోటు కల్పించారు. సుస్థిరాభివృద్ధిలో విజయవాడ ముందంజ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో విజయవాడ నగరం ముందు వరుసలో ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నగరం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి వైపు దూసుకెళుతోంది. వివిధ అంశాలను ప్రాతిపదికగా తీసుకున్న నీతి ఆయోగ్ ప్రతినిధులు దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయవాడను దేశంలోనే బ్రాండ్ అంబాసిడర్ నగరంగా గుర్తింపు పొందేందుకు ఏం చేయాలనే దానిపై చర్చించి.. అందుకు అవసరమైన నిధులు మంజూరు చేసేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. -
ఉదయపూర్‌లో ఘనంగా ఎంపీ బాలశౌరి కుమారుని వివాహం
సాక్షి, కృష్ణాజిల్లా: ఈ మధ్య కాలంలో సెలెబ్రిటీల వివాహాలన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ రూపంలో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మచిలీపట్నం ఎం.పి. బాలశౌరి కుమారుడు అనుదీప్ వివాహం రాజస్థాన్ ఉదయపూర్‌లోని ప్రముఖ ప్యాలెస్ నందు వధువు స్నికితతో సోమవారం తెల్లవారు జామున ఘనంగా జరిగింది. రెండు రోజులు పాటు జరిగిన ఈ వేడుకలలో భాగంగా సంగీత్, హల్ది, పెండ్లి కొడుకు, పెళ్లి కూతురు రిసెప్షన్ తో పాటు వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగి ఆహుతులను అలరించాయి. ఈ వేడుకలో సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు సతీ సమేతంగా హాజరై నూతన వధూవరులను అశ్వీరదించారు. రాష్ట్ర మంత్రి పేర్ని నానితో పాటు, అరకు ఎం.పి.మాధవి, రాజ్యసభ సభ్యులు సీ.ఎం.రమేష్, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, శాసన సభ్యులు పార్థ సారధి, అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, జోగి రమేష్, రెడ్డి శాంతి, గ్రీన్ కో ఎండీ చలమల శెట్టి గోపి, ఏఎంఆర్ గ్రూప్ అధినేత మహేశ్ రెడ్డి, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు శ్రీనివాస నాయుడు, విడుదల కుమార స్వామి, భైరా దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
3 వేలు పెడితే ఒంటినిండా ‘బంగారం’!
మహేష్ ఇంట్లో రేపు ఫంక్షన్.. బంధువులతో ఇంటి లోగిలి కళకళలాడుతోంది.. మహేష్ కూతురు మాత్రం ఒక మూల కూర్చొని మూతి మూడు వంకర్లు తిప్పుతోంది.. మహేష్ పెదాలపై చిరునవ్వు కనిపిస్తున్నా.. మనసులో ఆందోళన ముఖంలో స్పష్టంగా తెలుస్తోంది.. కూతురు అడిగిన నగలు తేవడానికి తగిన డబ్బు లేదు.. ఏం చేద్దామా అని ఒకటే ఆలోచన.. ఇంతలో తళుక్కుమంటూ ఐడియా తట్టింది.. వెంటనే బందరులోని చిలకలపూడి వెళ్లాడు.. బడ్జెట్‌కు తగ్గట్టు, కూతురికి నప్పేట్టు నగలు తీసుకున్నాడు.. ఆ నగల ధగధగలతో ఫంక్షన్లో మహేష్ కూతురు మిలమిలా మెరిసిపోయింది.. మహేష్ మనసు ఆనందంతో మురిసిపోయింది. ఇదీ చిలకలపూడి ఇమిటేషన్ జ్యూయలరీ ప్రత్యేకత. అది నిజంగా కొత్త ‘బంగారు’ లోకమే.. కోవిడ్‌తో కుదేలైన ఈ వ్యాపారం.. ప్రభుత్వ ప్రోత్సాహంతో మళ్లీ కాంతులీనుతోంది. మచిలీపట్నం: రోల్డ్‌గోల్డ్ నగల తయరీకి బందరు ఖ్యాతి గడించింది. బందరు కేంద్రంగా వందల ఏళ్లుగా సాగుతున్న ఈ పరిశ్రమ ఏడాదికి రూ. 100 కోట్లకు పైగా వ్యాపారం చేస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమపై ఆధారపడి 30 వేల మంది జీవనోపాధి పొందుతున్నారు. కోవిడ్‌తో కుదేలైనా బందరు బంగారం మళ్లీ కాంతులీనుతోంది. కోవిడ్ వైరస్ తగ్గుముఖం పట్టడం, సాధారణ జన జీవనానికి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయటంతో రోల్డ్‌గోల్డ్ పరిశ్రమలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. ఇదీ చరిత్ర.. రోలింగ్ మెషిన్ల మీద రోల్ చేయగా వచ్చిన మెటీరియల్‌తో చేసిన నగలు కనుక వీటిని రోల్డ్ గోల్డ్ నగలు అంటారు. ఈ రోల్డ్ గోల్డ్ పరిశ్రమకు పితామహుడుగా గుడివాడ మోటూరుకు చెందిన కమ్మిలి వెంకటరత్నంను పరిగణిస్తారు. ఈయన 1902లో బందరు చిలకలపూడిలో కవరింగ్ గోల్డ్ పరిశ్రమను ప్రారంభించాడు. ఆ తర్వాత అంచలంచెలుగా పరిశ్రమ అభివృద్ధి చెందగా.. 1982లో మచిలీపట్నం గోల్డ్ కవరింగ్ అండ్ ప్లేటింగ్ జ్యూయలరీ మ్యానుఫ్యాక్చరింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రారంభమైంది. ఈ క్రమంలో పరిశ్రమను ప్రభుత్వం గుర్తించి మచిలీపట్నం శివారు పోతేపల్లిలో ‘మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూయలరీ పార్క్’ పేరుతో అభివృద్ధి చేసింది. ప్రస్తుతం దీని పరిధిలో 240 యూనిట్లు ఉన్నాయి. మళ్లీ కాంతులు.. ► కోవిడ్ ప్రభావంతో దాదాపు పది నెలల పాటు పూర్తిగా మూతపడిన నగల తయారీ పరిశ్రమ నెమ్మదిగా కోలుకుంటోంది. ప్రస్తుతం 90 యూనిట్లలో నగల తయారీ జరుగుతుంది. ►ప్రత్యక్షంగా, పరోక్షంగా పది వేల మంది దీనిలో భాగస్వాములవుతున్నారు. దీంతో ప్రతి రోజూ రూ.50 లక్షల మేర విలువ గల బంగారు నగలను తయారు చేస్తూ, ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ►రోల్డ్గోల్ నగలను కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచే కాకుండా, పొరుగున ఉన్న తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా కొనుగోలు దారులు వస్తున్నారు. ఇక్కడ నుంచి నగలు తీసుకెళ్లి వారి వారి ప్రాంతాలో దుకాణాలు నిర్వహించుకొని విక్రయిస్తుంటారు. అ‘నగ’నగా చిలకలపూడి.. బందరు లడ్డూ, బాదం పాలుతో పాటు రోల్డ్‌గోల్డ్ నగల తయారీకి బందరు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. రోల్డ్‌గోల్డ్ నగల తయారీతో పాటు, వాటిని విక్రయించేందుకు దుకాణాలు సైతం ఇక్కడ వందలాదిగా వెలిశాయి. బందరులోని ఏ వీధిలో చూసిన రోల్డ్‌గోల్డ్ నగల దుకాణాలు దర్శనమిస్తాయి. చిలకలపూడిలో ప్రతి ఇల్లూ ఓ జ్యూయలరీ పరిశ్రమే. రూ.3 వేలు పెడితే ఒంటినిండా బంగారం.. ప్రస్తుతం బంగారం ధర సామాన్యులకు అందుబాటులేని పరిస్థితి. అంతో, ఇంతో ఆర్థికంగా ఉన్నా, మార్కెట్లో ట్రెండ్‌కు అనుగుణంగా వచ్చిన మోడల్స్ కొనుగోలు చేయటం కష్టంగానే మారుతోంది. అందుకనే సామాన్యుల నుంచి ధనిక వర్గాల వారు వరకు వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలపై ఆసక్తి చూపుతారు. బందరులో రూ. 3 వేలు పెడితే ఒంటినిండా నగలు వేసుకోవచ్చు. గ్యారెంటీ లేనివి ఒక నెల, గ్యారంటీ ఆభరణాలు ఆరు నెలల పాటు ఫంక్షన్లు, పెళ్లిలో సింగారించుకుని జిగేల్మనచ్చు. రాయితీ లేకుంటే మూతే.. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన రోల్డ్‌గోల్డ్ పరిశ్రమను కోవిడ్ కోలుకోలేని దెబ్బతీసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ రాయితీ పరిశ్రమ నిలబడేలా చేసింది. ప్రస్తుతం గతంతో పోల్చితే 60 శాతం మేర వ్యాపారం సాగుతోంది. పది నెలల పూర్తిగా మూసివేశాం. ఆ కాలానికి కార్మికులను ఆదుకునేలా ప్రభుత్వం సాయం చేస్తే బాగుంటుంది. అన్నివర్గాల వారిని ఆదుకుంటున్న ప్రభుత్వం రోల్డ్‌గోల్డ్ పరిశ్రమలోని కార్మికులను కూడా ఆదుకోవాలి. – అంకెం జితేంద్ర కుమార్, అసోసియేషన్ కార్యదర్శి పదేళ్లుగా ఇదే వ్యాపారం పదేళ్లుగా రోల్డ్‌గోల్డ్ నగల విక్రయం చేస్తున్నాం. దుకాణాన్ని నేనే చూసుకుంటాను. భర్త సాయంతో పాటు, మరో ఇద్దరికి జీతం ఇచ్చి షాపులో పెట్టుకున్నాం. ఇప్పుడైతే రోజుకు రూ.15 నుంచి రూ.20 వేలు వరకు అమ్మకం సాగుతోంది. కోవిడ్ ముందైతే రూ.30 వేలు వరకు అమ్మడుపోయేవి. అన్నీ పోను రోజుకు వెయ్యి వరకు మిగులుతోంది. మంచి మోడల్స్ కొనుగోలుకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. – మారుబోయిన శివాని, చిలకలపూడి తోడ్పాటు ఇస్తున్న ప్రభుత్వ రాయితీ.. ఎన్నో ఏళ్లుగా రోల్డ్‌గోల్డ్ పరిశ్రమను నమ్ముకుని వేలాది మంది జీవనం సాగిస్తున్నారు. కానీ వీరి సమస్యలను పాలకులెవ్వరూ పట్టించుకోలేదు. పాదయాత్ర సమయంలో బందరు వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రోల్డ్‌గోల్డ్ పరిశ్రమను చూసి, తాము అధికారంలోకి వస్తే అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే రోల్డ్‌గోల్డ్ యూనిట్లకు విద్యుత్ రాయితీ ప్రకటించారు. యూనిట్ విద్యుత్ వినియోగంపై వాస్తవంగా అయితే రూ. 9.50 చెల్లించాల్సి ఉంది. కానీ రోల్డ్గోల్ నగల తయారీదారులకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.6 రాయితీ కల్పించింది. దీంతో పరిశ్రమ పురోభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. -
బందరు రోడ్డులో ర్యాలీకి అనుమతి లేదు
-
అనుమతి లేని ర్యాలీలో ఎవరూ పాల్గొనవద్దు
సాక్షి, విజయవాడ: నేడు బందర్ రోడ్డులో జరగనున్న ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించి సాధారణ జనానికి ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం విజయవాడలో సిటీ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. బందర్ రోడ్డులో విద్య, వైద్య, వ్యాపార అవసరాల కోసం ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారన్నారు. పైగా బందర్ రోడ్డుకు ఆనుకుని ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున ర్యాలీ తీస్తే మరింత ఇబ్బంది ఎదురవుతుందని పేర్కొన్నారు. జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చేసే ప్రజా ఉద్యమాలకు పోలీసు శాఖ సహకరిస్తుందని సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ర్యాలీలకు అనుమతిచ్చిన రోడ్డులో నిరసనలు తెలిపితే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే ప్రజలకు ఇబ్బంది కలిగించే నిరసనలకు మాత్రం ఎలాంటి అనుమతి ఉండదన్నారు. బందర్ రోడ్డులో జరిగే అనుమతి లేని ర్యాలీలో ఎవరూ పాల్గొనవద్దని హెచ్చరించారు. బెజవాడలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నాయన్నారు. కాగా అమరావతి పరిరక్షణ సమితి, జాయింట్ యాక్షన్ కమిటీ శుక్రవారం బందర్ రోడ్డులో ర్యాలీ తలపెట్టిన విషయం తెలిసిందే. చదవండి: నీకెందుకు డబ్బులు వేయాలి? -
బందరు ఫిషింగ్ హార్బర్‌కు మహర్దశ!
సాక్షి, అమరావతి: బందరు ఫిషింగ్ హార్బర్‌కు మహర్దశ పట్టనుంది. గత కొన్నేళ్లుగా అలంకారప్రాయంగా మారిన హార్బర్ అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించింది. హార్బర్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి రూ. 280 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసింది. సముద్ర ముఖద్వారం వద్ద తరచూ ఇసుక మేటలు వేస్తుండటంతో అన్ని వేళల్లో మర పడవలు వేటకు వెళ్లే అవకాశాలు ఉండటం లేదు. కేవలం సముద్రానికి పోటు వచ్చిన సమయంలోనే వేటకు వెళ్లే వీలు ఉండటంతో నిర్వాహకులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకసారి మర పడవ ఒడ్డుకు వస్తే మళ్లీ సముద్రానికి పోటు వచ్చినప్పుడు మాత్రమే వేటకు వెళ్లే అవకాశం ఉంటోంది. ఇలా పోటు వచ్చినప్పుడే సముద్రంలోకి వెళ్లాలంటే కనీసం 12 గంటల పాటు నిర్వాహకులు ఒడ్డున నిరీక్షించాల్సి వస్తోంది. పదేళ్ల క్రితం గిలకలదిండిలో రూ.4.70 కోట్లతో నిర్మించిన హార్బర్‌తో నిర్వాహకులకు పెద్దగా లబ్ధి చేకూరడం లేదు నాడు సముద్ర ముఖద్వారం వద్ద ఇసుక మేటల తొలగింపునకు పూర్తి స్థాయి చర్యలు తీసుకోలేదు. ఇసుక మేటలు ఏర్పడే పరిస్థితులున్న హార్బర్ల వద్ద నిత్యం డ్రెడ్జింగ్ నిర్వహించాలని నిపుణులు సూచించినా.. ఆ కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఇసుక మేటల సమస్య యథాతథంగానే ఉండటంతో మర పడవల నిర్వాహకులు బందరు ఫిషింగ్ హార్బర్ నుంచి కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం హార్బర్లకు తరలివెళ్లిపోతున్నారు. హార్బర్లోని సమస్యలను బందరు ఎమ్మెల్యే, మంత్రి పేర్ని నాని, మరో మంత్రి మోపిదేవి వెంకట రమణారావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. అన్ని సౌకర్యాల కల్పన బందరు హార్బర్లో ప్రస్తుత పరిస్థితులు, హార్బర్ విస్తరణకు చేపట్టాల్సిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాల అంచనాలపై డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక) రూపొందించే బాధ్యతను వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (వ్యాప్కోస్)కి అప్పగించారు. ఈ సంస్థ.. సముద్ర ముఖద్వారం వద్ద ఇసుక మేటల తొలగింపుతోపాటు ఎగుమతి, దిగుమతి సౌకర్యాలు, పరిపాలనా భవనం, మత్స్యకారులకు విశ్రాంతి గదులు, రేడియో కమ్యూనికేషన్ టవర్, బోట్ బిల్డింగ్, ఐస్ ప్లాంట్లు, దాదాపు 350 మర పడవలు లంగరు వేసుకోవడానికి అనువుగా కీవాల్ విస్తరణ, రక్షిత మంచినీటి సరఫరా, తదితర సౌకర్యాల కల్పనకు అంచనాలు రూపొందిస్తోంది. అన్ని అనుమతులు వచ్చాక హార్బర్ విస్తరణకు టెండర్లు ఆహ్వానించనున్నామని మంత్రి మోపిదేవి వెంకట రమణారావు తెలిపారు. -
కృష్ణ.. కృష్ణా!
సాక్షి,మచిలీపట్నం : జిల్లాకు తలమానికంగా నిలవాల్సిన కృష్ణా యూనివర్సిటీ గత పాలకుల నిర్వాకంతో గాడి తప్పింది. టీడీపీ ప్రభుత్వ పాలనలో కొంతమంది ప్రజా ప్రతినిధులు సాగించిన రాజకీయ క్రీడతో యూనివర్సిటీ బ్రష్టు పట్టిపోయింది. చదువుల వాడగా కీర్తిగాంచిన కృష్ణా జిల్లాలో ఉన్నత విద్యను కూడా చేరువలోకి తీసుకొచ్చేందుకు మచిలీపట్నం కేంద్రంగా దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కృష్ణా యూనివర్సిటీ నెలకొల్పారు. ప్రస్తుతం యూనివర్సిటీలో పాలన గందరగోళ పరిస్థితుల్లోకి జారిపోయింది. కృష్ణా యూనివర్సిటీ బందరులోని ఆంధ్ర జాతీయ కళాశాల (ఏజే కాలేజీ) ప్రాంగణంలో 2008 అక్టోబర్ 13న యూనివర్సిటీ అకడమిక్, పరిపాలనాపరమైన కార్యకలాపాలను ప్రారంభించింది. దశాబ్ధకాలం ముగిసినప్పటికీ, పాలనా పురోభివృద్ధి ఒక అడుగు ముందుకు మూడడుగులు వెనక్కి అన్న చందంగా ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నింటినీ రాజకీయ వేదికలుగా ఉపయోగించుకున్న క్రమంలో మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ కూడా వారి చర్యలకు బలైపోవాల్సి వచ్చింది. పాలనా వ్యవహారాలను చక్కదిద్దే వర్సిటీ వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్ వంటి కీలక పోస్టుల్లో తమకు అనుకూలంగా ఉన్న వారికి ఇంచార్జి హోదాలను కట్టబెట్టడంతో పాలన పూర్తిగా పక్కదారి పట్టింది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కావటంతో ఇప్పటి వరకు అడ్డగోలు పాలన సాగించిన ఒక్కొక్కరు పలాయనం చిత్తగించే క్రమంలో రాజీనామా బాట పట్టినప్పటికీ, వారి పాలనలో సాగించిన అడ్డగోలు విధానాల వల్ల వ్యవస్థ పూర్తిగా నాశనమైపోయింది. ఆ ప్రభావం కృష్ణా యూనివర్సిటీపై కూడా పడింది. ప్రస్తుతం వర్సిటీ దిక్కులేనదైంది. ప్రొఫెసర్లకు అందని వేతనాలు.. యూనివర్సిటీలో పని చేస్తున్న ప్రొఫెసర్లకు మూడు నెలలుగా వేతనాలు అందలేదు. రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేసే 22 మందికి ఏప్రిల్ నెల నుంచి జీతాలు చెల్లించాల్సి ఉంది. వేతనాలపై ఆధారపడి, ఇక్కడ పని చేస్తున్న ప్రొఫెసర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వర్సిటీ పాలనాధికారుల నిర్వాకం వల్ల తమ కుటుంబాలు పస్తులతో ఉండాల్సి వస్తోందని, పిల్లలను పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించే సమయంలో ఇటువంటి పరిస్థితులు దాపురించటం మనో వేదనకు గురి చేస్తోందని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ సీనియర్ ప్రొఫెసర్ ఆవేదన వెలిబుచ్చారు. నూజివీడు ట్రిపుల్ ఐటీకి వీసీగా వ్యవహరించిన వేగేశ్న రామచంద్రరాజు కృష్ణా యూనివర్సిటీకి కూడా ఇంచార్జి వైస్ చాన్స్‌లర్‌గా ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పదవీ యోగం దక్కించుకున్న ఆయన, రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కావటంతో రాజీనామా చేశారు. దీంతో కృష్ణా యూనివర్సిటీకి ప్రస్తుతం ఇంచార్జి వీసీ కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఇంచార్జి రిజిస్ట్రార్‌గా ఉన్న అధికారి సైతం దీనిపై ఏ మాత్రం పట్టించుకోవటం లేదని ప్రొఫెసర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నూతన భవనాలు వినియోగంలోకి వచ్చేనా.. యూనివర్సిటీకి సుమారు రూ.80 కోట్ల వ్యయంతో పట్టణానికి సమీపంలోని రుద్రవరంలో శాశ్వత భవనాలను నిర్మించారు. ఇవి పూర్తి అయినప్పటికీ, వాటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు మాత్రం వర్సిటీ అధికారులు దృష్టి సారించటం లేదు. నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్‌కు రూ.10 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉండటంతో, ఆ భవనాలను వర్సిటి అధికారులకు అప్పగించనట్లుగా తెలిసింది. పరిస్థితి ఇలా ఉంటే, ఎన్నికల గిమ్మిక్కుల్లో భాగంగా ఫిబ్రవరి 7న మచిలీపట్నం వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వర్సిటీ భవనాలను ప్రారంభించేయటం గమనార్హం. 102 ఎకరాల విస్తీర్ణం వర్సిటీ కోసమని కేటాయించగా, ఇందులో నిర్మాణాలు మాత్రం సరైన రీతిలో చేపట్టకపోవటంతో వర్సిటీ కార్యకలాపాలకు సవ్యంగా ఉపయోగపడతాయా అనే సందేహాలు సైతం ఉన్నాయి. విశాలమైన స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ, అపార్ట్మెంట్ మాదిరే దీనిని నిర్మించారని, దీని వల్ల భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తుతాయని వర్సిటీ అధికారులు బాహాటంగానే అంటున్నారు. -
బందరు రోడ్డు @120
కృష్ణాజిల్లా, పెనమలూరు : విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి బందరు రోడ్డును పాత చెక్ పోస్టు నుంచి సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీ వరకు 120 అడుగులు విస్తరించాలని చేపట్టిన సర్వే పూర్తి అయ్యింది. సీఆర్డీఏ అధికారులు పాత చెక్ పోస్టు నుంచి కాలేజీ వరకు 120 అడుగుల విస్తరణకు మార్కింగ్ ఇచ్చారు. బందరు రోడ్డు ఈ ప్రాంతంలో ప్రస్తుతం 80 అడుగులే ఎన్హెచ్ఐ అ«ధికారులు విస్తరించారు. అయితే ఇది ట్రాఫిక్ అవసరాలకు చాలదని సీఆర్డీఏ అధికారులు రంగంలోకి దిగారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం బందరు రోడ్డును 120 అడుగులు విస్తరించాల్సి ఉంది. దీంతో ఇప్పుడు ఉన్న 80 అడుగుల రోడ్డును 120 అడుగులుగా విస్తరించనున్నారు. దీనికి అయ్యే ఖర్చు సీఆర్డీఏ భరించనుంది. సర్వే చేపట్టిన సీఆర్డీఏ అధికారులు.. పాత చెక్‌పోస్టు నుంచి సిద్దార్థ కాలేజీ వరకు బందరు రోడ్డును 120 అడుగులుగా విస్తరిస్తే ఎన్ని భవనాలు తొలగించాలి, భూమి ఎంతవరకు తీసుకోవాలనే విషయమే సీఆర్డీఏ కొద్ది రోజులుగా చేపట్టిన సర్వే ప్రక్రియ పూర్తయింది. బందరు రోడ్డుకు ఇరుపక్కల 10 అడుగుల నుంచి 15 అడుగుల వరకు భూమి అవసరం ఉంది. అలాగే 120 అడుగుల లోపు ఉన్న భవనాల జాబితా కూడా సిద్ధం చేశారు. 120 అడుగుల వరకు మార్కింగ్ ఇచ్చి అక్కడ వరకు ఉన్న ఆ భవనాలను తొలగిస్తారు. సీఆర్డీఏ అధికారులు దీనికై కొలతలు కొలిచి మార్కింగ్ కూడా ఇచ్చారు.. యజమానులకు బాండ్లు జారీ.. బందరు రోడ్డు విస్తరణకు భూ సేకరణ లేకుండా బాండ్లు ఇవ్వటానికి సీఆర్డీఏ రంగం సిద్ధం చేస్తోంది. భూ, భవన యజమానులకు 1 : 4 నిష్పత్తి లెక్కన ఒక గజం భూమికి నాలుగు గజాల విలువ చేసే బాండ్లు జారీ చేయనుంది. గతంతో పోలిస్తే బాండ్ల నిష్పత్తి పెంచారు. దీంతో భూ, భవన యజమానులను ఆకర్షించి వివాదాలు లేకుండా రోడ్డు విస్తరణ చేయాలని ఆలోచనలో సీఆర్డీఏ ఉంది. నేడు సమావేశం.. కాగా భూ, భవన యజమానులతో సీఆర్డీఏ కమిషనర్ గురువారం సమావేశం నిర్వహించనున్నారు. భూ, భవన యజమానులు కొంత అసంతృప్తిగా ఉండటంతో వారితో సమావేశం నిర్వహించి బాండ్ల వివరాలు తెలిపి సహకరించాలని సీఆర్డీఏ అధికారులు కోరనున్నారు. కాగా పటమట పరిధిలో బందరు రోడ్డు విస్తరణ పనులకు కార్పొరేషన్ త్వరలో సన్నాహాలు చేపట్టనుంది. యజమానులు సహకరించాలి.. బందరు రోడ్డు సిద్దార్థ కాలేజీ వరకు 150 అడుగులు విస్తరించారు. కాలేజీ నుంచి చెక్‌పోస్టు వరకు రోడ్డు 80 అడుగులే ఉంది. ట్రాఫిక్ సమస్యలు వస్తాయని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ ప్రకారం 120 అడుగులు విస్తరించనున్నాం. భూ, భవన యజమానులు సహకరించాలి.– గుమ్మడి ప్రసాద్, టీపీవో -
రుధిర తర్పణం
మచిలీపట్నం : మొహర్రం సందర్భంగా ‘యా హుస్సేన్... యా ఆలీ..’ అనే నినాదాలతో స్థానిక కోనేరుసెంటరు బుధవారం మార్మోగింది. మహ్మద్ ప్రవక్త మనుమడు ఇమాం హుస్సేన్, ఆయన 72 మంది అనుచరుల త్యాగాన్ని స్మరిస్తూ ముస్లింలు రక్తం చిందించారు. మచిలీపట్నంలోని వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు కోనేరుసెంటరుకు చేరుకుని ఇమాం హుస్సేన్, ఆయన అనుచరులు కర్భలా మైదానంలో ప్రాణత్యాగం చేసిన వైనాన్ని స్మరించుకున్నారు. తొలుత గిరియోహజరత్ హజ్జత్ (చిన్నపార్టీ) సభ్యులు చింతచెట్టు సెంటరులోని సాహెబ్ పంజా నుంచి రాజుపేట మీదుగా కోనేరుసెంటరు వరకు జుల్జనా (ర్యాలీ) నిర్వహించారు. కోనేరుసెంటరులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన మస్జిదా ఇమానే గురువు జమానా పేషిమా నమాజ్ చేశారు. కర్బలా మైదానంలో ఇమామ్ హుస్సేన్, ఆయన 72 మంది అనుచరులు ధర్మయుద్ధం చేసిన తీరు, ప్రవక్తకు ఆయన అనుచరులకు మూడురోజులపాటు తాగునీరు ఇవ్వకుండా హింసించిన విధానాన్ని గురువు వివరించారు. చిన్న పార్టీ కోనేరుసెంటరును వీడిన అనంతరం ఇనగుదురుపేటలోని బారేమాం పంజా నుంచి గిరియోహజరత్‌హజ్జత్(పెద్ద పార్టీ) సభ్యులు ఇనుగుదురుపేట నుంచి ర్యాలీగా బయలుదేరి జవ్వారుపేట, బుట్టాయిపేట, వల్లూరిరాజా సెంటరు మీదుగా కోనేరుసెంటరు వరకు జుల్జనా నిర్వహించారు. అలనాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ ... పవిత్రయుద్ధంలో మరణించిన ఇమాం హుస్సేన్ మృతదేహం తీసుకొచ్చేందుకు ఆయన కుమార్తె బీసకీనా శవపేటికను అలంకరించి తీసుకువెళ్లడాన్ని గుర్తు చేస్తూ యువతులు, చిన్నారులు శవపేటికను మోసుకుంటూ కోనేరుసెంటరుకు వచ్చారు. ఇమాం హుస్సేన్ మరణానంతరం నాటి యుద్ధ వాతావరణం(జుల్జనా)ను గుర్తుకు తెస్తూ గుర్రాలపై వస్త్రాలు, కత్తులను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి పీర్లను ఊరేగింపుగా కోనేరుసెంటరుకు తీసుకువచ్చారు. మళ్లీ వాటిని ఊరేగింపుగా తీసుకువెళ్లి పంజాల వద్ద ప్రతిష్టించారు. సంప్రదాయం ప్రకారం రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దట్టీ సమర్పించారు. శాసనసభ మాజీ డెప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, మున్సిపల్ చెర్మన్ మోటమర్రి వెంకటబాబాప్రసాద్ ,షేక్ అచ్చాబా, అహ్మద్ హుస్సేన్, ఖాజాబేగ్, సయ్యద్‌ఖాజా, ఇలియాస్‌పాషా, మౌలాలి పాల్గొన్నారు. డీఎస్పీ శ్రావణ్‌కుమార్, పలువురు సీఐలు, ఎస్‌లు బందోబస్తును పర్యవేక్షించారు. -
బందరులో జగన్ పర్యటన
-
రేపు బందరులో జగన్ పర్యటన
మచిలీపట్నం : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం బందరు మండలంలో పర్యటిస్తారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, అధికార ప్రతినిధి పేర్ని నాని ఒక ప్రకటనలో తెలిపారు. పోర్టు, అనుబంధ పరిశ్రమల కోసం ప్రభుత్వం 30వేల ఎకరాల భూమిని సేకరిస్తామని చెప్ప టం, ఇప్పటికే 14వేల ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీచేసిన నేపథ్యంలో రైతుల్లో ఆందోళన నెలకొం దని, అనుబంధ పరిశ్రమలకు భూములు ఇచ్చేది లేదని రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారికి మద్దతు తెలిపేందుకు జగన్ వస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని, 9.30 గంటలకు కరగ్రహారంలోని ఫరీద్‌బాబా దర్గా వద్ద, 11.30 గంటలకు తుమ్మలచెరువు వినాయకుడి గుడి సెంటరులో రైతులతో జగన్ మాట్లాడతారని వివరించారు. 1.30 గంటలకు పొట్లపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద రైతులతో సమావేశమవుతారని తెలిపారు. -
బందరులో మెరిసిన ‘ప్రిన్స్’
ప్రముఖ సినీ హీరో మహేష్‌బాబు శనివారం నగరానికి వచ్చారు. బందరు రోడ్డులోని హోటల్ గేట్‌వేలో ఓ ప్రయివేటు సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మధ్నాహం 12.30 గంటలకు వచ్చిన మహేష్ రెండు గంటలు ఇక్కడే ఉన్నారు. అనంతరం నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. మహేష్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో హోటల్ వద్ద కోలా హలం నెలకొంది. -
బందరు దశాదిశ మార్చేస్తాం : ఉమ
బందరుకు పూర్వవైభవం తెచ్చేదిశగా టీడీపీ ప్రభుత్వం కృషిచేస్తుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. త్వరలో బందరు దశాదిశ మారిపోతాయని చెప్పారు. మచిలీ పట్నంలో మంగళవారం జరిగిన జన్మభూమి సభలో ఆయన మాట్లాడుతూ పోర్టు నిర్మాణం త్వరలో జరుగుతుందని, రూ.20 వేల కోట్లతో ఆయిల్ రిఫైనరీ కంపెనీ ఏర్పాటుకాబోతోందని చెప్పారు. మచిలీపట్నం టౌన్ : బందరుకు పూర్వవైభవం తెచ్చే దిశగా చంద్రబాబునాయుడు నాయకత్వలోని టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. మంగళవారం జన్మభూమి- మాఊరు కార్యక్రమం 38వ వార్డులో జరిగింది. సభకు హాజరైన మంత్రి ఉమా మాట్లాడుతూ బందరు పోర్టు నిర్మాణం త్వరలోనే జరుగనుందన్నారు. దీంతో పాటు రూ.20 వేల కోట్లతో ఆయిల్ రిఫైనరీ కంపెనీ ఏర్పాటు కాబోతుందని చెప్పారు. దీనికి అనుబంధంగా పలు పరిశ్రమలు వస్తాయని తెలిపారు. దీంతో ఈ ప్రాంతానికి చెందిన వందలాది మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. త్వరలోనే ఈ ప్రాంత దశా దిశ పూర్తిగా మారిపోనుందన్నారు. బందరును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. సముద్రతీరంలోని భూముల్లో సరుగుడు మొక్కలు పెంచి సముద్రగాలుల నుంచి ఈ ప్రాంతాన్ని రక్షించే చర్యలు చేపడతామన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతు, డ్వాక్రా మహిళల రుణాలను మాపీ చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పట్టణంలోని 37, 38 వార్డుల్లో జరిగిన జన్మభూమి సభల్లోనూ ఇరువురు మంత్రులు పాల్గొని పింఛన్లు అందజేశారు. ఆయా వార్డుల్లోని అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహించిన గర్భిణిల సామూహిక సీమంతాల కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొని ఆశీస్సులందజేశారు. కౌన్సిలర్లు లంకా సూరిబాబు, పల్లపాటి సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా మున్సిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, వైస్‌చైర్మన్ పి.కాశీవిశ్వనాధం, టీడీపీ జిల్లా కన్వీనర్ బచ్చుల అర్జునుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థమాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మున్సిపల్ కమిషనర్ ఎ.మారుతీదివాకర్, బందరు ఆర్డీవో పి. సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. సాధికారిత సంస్థ పేరిట మరో రూ.7వేల కోట్లు ... నిమ్మకూరు(పామర్రు) : రైతు రుణ మాఫీల కోసం ఏర్పాటు చేసిన రైతు సాధికారితా సంస్థ పేరిట బ్యాంకులో గతంలోనే రూ. 5వేల కోట్లు వేశామని దీనికి తోడుగా మరోక రూ.7వేల కోట్లను వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. నిమ్మకూరు గ్రామంలో జన్మభూమి-మాఊరు కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేసిన ఘనత దివంగత మహానేత ఎన్టీఆర్ దేనన్నారు. వచ్చే నెల నుంచి పింఛన్లను బ్యాంకుల ద్వారా అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నూతన రాజధాని ఏర్పాటుకు అందరూ తమ వంతు సహకారాన్ని అందజేయాలని కోరారు. గ్రామ సర్పంచి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ పొట్లూరి శశి, ఎంపీపీ దగ్గుపాటి ఉష, టీడీపీ నేత వర్ల రామయ్య తదితరలు పాల్గొన్నారు. -
ఏ ప్రాంతం అనువైనదైతే అక్కడే రాజధాని:సుజనా చౌదరి
విజయవాడ: రాజధానికి ఏది అనువైన ప్రాంతం అని భావిస్తే అక్కడే రాజధాని ఏర్పడుతుందని టిడిపి ఎంపి సుజనా చౌదరి చెప్పారు. పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కరసరత్తు జరుగుతోంది. రాజధానిని సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాజధానికి సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ తనకు బందరులోనూ, కంచికచర్లలోనూ భూములు ఉన్నాయని తెలిపారు. తన భూములు ఉన్న చోట రాజధాని ఏర్పాటు అయితే అవవచ్చునని అన్నారు. శాస్త్రీయంగా రాజధానికి ఏది అనువైన ప్రదేశం అని తేలుతుందో అక్కడే రాజధాని నిర్మాణం జరుగుతుందని చెప్పారు. రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ** -
బందరులో లంగరేసేదెవరు?
మచిలీపట్నానికి చారిత్రక గుర్తింపు ఉంది. వందల ఏళ్ల క్రితం నుంచే వర్తక కేంద్రంగా వర్ధిల్లుతోంది. రాజకీయంగానూ ఇక్కడ భిన్న వాతావరణం ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఈ లోక్‌సభ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం బాగా వేడెక్కింది. నాలుగు పార్టీల తరఫున అభ్యర్థులు బరిలోకి దిగి...అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన పోటీ మాత్రం వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్యే నడుస్తోంది. యిర్రింకి ఉమామహేశ్వరరావు-మచిలీపట్నం, మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, టీడీపీ తరఫున కొనకళ్ల నారాయణరావు, కాంగ్రెస్ నుంచి శిష్ట్లా రమేష్, జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ) అభ్యర్థిగా కమ్మిలి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. సానుకూల పవనాలు... సమైక్యాంధ్ర నినాదంతో పోరు సాగించిన వైఎస్సార్ సీపీకి ప్రజల్లో సానుకూల పవనాలు వీస్తున్నాయి. ‘సమైక్య’ పరిరక్షణకు పోరాడిన వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే ప్రజలకు మేలు జరుగుతుందని భావించిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఇటీవల వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ అభ్యర్థిగా ఆయన... వైఎస్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే వాటిని సమర్థవంతంగా కొనసాగిస్తారని తెలియజేస్తున్నారు. ఇందుకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. కాగా, పార్థసారథి తండ్రి కొలుసు పెద రెడ్డయ్య గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పనిచేశారు. జిల్లాలో ఏకైక మంత్రిగా పనిచేసిన పార్థసారథికి కూడా అన్ని వర్గాల ప్రజల్లో ఆదరణ ఉంది. సామాజికంగానూ పట్టుంది. ప్రజల ఆశీస్సులు, ఆదరణతో పార్లమెంటులో అడుగుపెడతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే జోష్‌తో ప్రచారం నిర్వహిస్తున్నారు. కొనకళ్ల డీలా... బందరు లోక్‌సభ స్థానంలో మారిన రాజకీయ సమీకరణలతో టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావు డీలా పడ్డారు. గత ఎన్నికల్లో ఆయనకు సామాజిక సమీకరణలు కలిసిరావడంతో ఎంపీగా గెలిచారు. అయితే, ఐదేళ్లలో నియోజకవర్గాన్ని చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారు. గతంలో ఆయనకు ఓట్లు తెచ్చి పెట్టిన గుడివాడ, గన్నవరం, అవనిగడ్డ, పెనమలూరు అసెంబ్లీ సెగ్మెంట్లలో సైతం సీన్ మారింది. అక్కడ పార్టీకి సానుకూల పరిస్థితి లేకపోవడం కొనకళ్లను ఆందోళనకు గురిచేస్తోంది. కాంగ్రెస్ ఖాళీ.. ఆదరణ లేని జేఎస్పీ రాష్ట్ర విభజన సెగతో బందరులో కాంగ్రెస్ అడ్రెస్ గల్లంతైంది. జాతీయ పార్టీగా సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌కు ఇక్కడ సరైన అభ్యర్థి దొరకలేదు. విధిలేక గుడివాడకు చెందిన శిష్ట్లా రమేష్‌కు టికెట్ ఇచ్చింది. ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అప్పట్లో పోటీ ఎక్కువగా ఉండటంతో టికెట్ దక్కలేదు. గత మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున చైర్మన్ అభ్యర్థిగానూ తెరపైకి వచ్చారు. 23వ వార్డులో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక జేఎస్పీ అభ్యర్థి కమ్మిలి శ్రీనివాస్ ప్రచారంలో కాంగ్రెస్ కంటే కాస్త ముందున్నా..రేసులో మాత్రం వెనుకబడిపోయారు. ఇదీ చరిత్ర మచిలీపట్నం లోక్‌సభ స్థానంలో ఓటర్ల తీర్పు విలక్షణంగా ఉంటుంది. గతంలో ఇది ఎన్నోసార్లు రుజువైంది. రాజకీయ ఉద్దండులుగా పేరొందిన మోటూరు హనుమంతరావు(సీపీఎం), మండలి వెంకటకృష్ణారావు, వడ్డే శోభనాద్రీశ్వరరావు, కావూరు సాంబశివరావు, అంబటి బ్రహ్మణయ్య, బూరగడ్డ నిరంజన్‌రావు వంటి వారికి సైతం ఇక్కడ ఓటమి తప్పలేదు. ఒకమారు సినీనటుడు కైకాల సత్యనారాయణ(1996-టీడీపీ)ను ఆదరించిన ఓటర్లు.. మరోమారు సినీగ్లామర్ సైతం పనిచేయదంటూ తిరస్కరించారు. ఇక్కడి నుంచి మూడు పర్యాయాలు(1984,1989,1998) ఎంపీగా గెలిచిన కావూరు సాంబశివరావు గత రెండు పర్యాయాలు ఏలూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాగే మాగంటి అంకినీడు ఇక్కడి నుంచి రెండు సార్లు(1977, 1980) ఎంపీగా గెలిచారు. ఆయన గుడివాడ లోక్‌సభ స్థానం నుంచి కూడా మూడు పర్యాయాలు ఎన్నికై రికార్డు సృష్టించారు. మచిలీపట్నం లోకసభ స్థానం ఏర్పడిన తొలి ఎన్నికల(1952)లో సీపీఐ అభ్యర్థి సనకా బుచ్చికోటయ్య గెలుపొందారు. గాంధేయవాదిగా పేరున్న మండలి వెంకట కృష్ణారావు(కాంగ్రెస్)ను ఇక్కడి ప్రజలు 1957లో పార్లమెంటుకు పంపారు. ఆయన 1962లోనూ పోటీచేసి, ఇండిపెండెంట్ అభ్యర్థి మండల వెంకటస్వామి చేతిలో ఓడిపోయారు. యార్లగడ్డ అంకినీడు ప్రసాద్(1967 -కాంగ్రెస్), మేడూరి నాగేశ్వరరావు(1971-కాంగ్రెస్), కొలుసు పెదరెడ్డయ్య(1991-టీడీపీ), అంబటి బ్రాహ్మణయ్య (1999-టీడీపీ), బాడిగ రామకృష్ణ (2004-కాంగ్రెస్), కొనకళ్ల నారాయణరావు (2009-టీడీపీ) ను కూడా బందరు ప్రజలు ఆదరించారు. అసెంబ్లీ సెగ్మెంట్లు .. బలాబలాలు బందరు తాజా మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన హ్యాట్రిక్ దిశగా సాగిపోతున్నారు. నానికి నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉంది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. ఇది కలిసొచ్చే అంశం. టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రకు ప్రజలతో సంబంధాలు తక్కువ. కాంగ్రెస్ నుంచి చలమలశెట్టి ఆదికిరణ్, జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున గనిపిశెట్టి గోపాల్ పోటీ చేస్తున్నారు. వీరి ప్రభావం పెద్దగా కన్పించడం లేదు. పెడన అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన కుటుంబానికి నియోజకవర్గంలో పట్టుంది. సొంత కేడర్ కూడా ఉండటం కలిసొచ్చే అంశం. టీడీపీ నుంచి మాజీ చీఫ్ విప్ కె.వెంకట్రావు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పిన్నెంటి విశ్వేశ్వరరావు, జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున వాకా వాసుదేవరావు బరిలో నిలిచారు. గుడివాడ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) రంగంలోకి దిగారు. ‘హ్యాట్రిక్’ కొట్టేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ మంచి క్రేజ్ ఉంది. టీడీపీ అభ్యర్థిగా రావి వెంకటేశ్వరరావు బరిలో ఉన్నారు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా చేశారు. ఆ తర్వాత ప్రజలకు అందుబాటులో లేరు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అట్లూరి సుబ్బారావు నుంచి పోటీ నామమాత్రమే. గన్నవరం వైఎస్ మిత్రుడు, ప్రముఖ వైద్యుడు దుట్టా రామచంద్రరావు వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఖరీదైన వైద్యాన్ని సైతం పేదలకు తక్కువ ఖర్చుతో అందించి మన్ననలు అందుకున్నారు. వల్లభనేని వంశీమోహన్ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వివాదాస్పదుడిగా పేరుగాంచారు. ఇది ప్రతికూలంగా మారే అవకాశముంది. సుంకర పద్మశ్రీ కాంగ్రెస్ తరపున, బోయపాడి సౌజన్య జేఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు. పెనమలూరు జెడ్పీ మాజీ చైర్మన్ దివంగత కుక్కల నాగేశ్వరరావు కుమారుడు కేవీఆర్ విద్యాసాగర్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన యువకుడు, విద్యావంతుడు. ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నారు. తండ్రి హయాంలో చేసిన అభివృద్ధి కూడా లాభించనుంది. బోడే ప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. చలసాని పండు అనుచరుడిగా మెలిగిన ఆయన అనూహ్యంగా టికెట్ దక్కించుకున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ వైబీబీ రాజేంద్ర ప్రసాద్, చలసాని పండు సతీమణి పద్మావతి వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. నేరెళ్ల శోభన్‌బాబు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పామర్రు వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఉప్పులేటి కల్పన ఉన్నత విద్యావంతురాలు. లెక్చరర్ ఉద్యోగాన్ని సైతం వదులుకుని సమత స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నారు. టీడీపీ తరఫున వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు. ఆయన ప్రజలకు అందుబాటులో ఉండరనే ఆరోపణ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే డీవై దాసు, జేఎస్పీ తరఫున పాలడుగు డేవిడ్‌రాజు బరిలోకి దిగారు. అవనిగడ్డ వైఎస్సార్ సీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్‌బాబు మొదట్నుంచీ అట్టడుగు వర్గాలకు అండగా ఉన్నారు. దివిసీమ అభివృద్ధి కోసం కృషి చేశారు. ఉలిగడ్డ, పెనుమూరు వారధి, మత్స్యకారుల సంక్షేమం కోసం అనేకసార్లు పోరాడారు. టీడీపీ అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ బరిలో ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ వారు వెంట వెళ్లడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా మత్తి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. సమ్‌థింగ్ స్పెషల్ ఇక్కడ ఓడినా, గెలిచినా.. వేరే చోట ఓకే! బందరు లోక్‌సభ స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ పోటీ చేసి ఓడిన, గెలిచిన నేతలు మరోచోట మెరిశారు. అలాంటి వారిలో మండలి వెంకట కృష్ణారావు, అంబటి బ్రాహ్మణయ్య, వడ్డే శోభనాద్రీశ్వరరావు, కేపీ రెడ్డియ్య, సనకా బుచ్చికోటయ్య, కావూరు సాంబశివరావు వంటి వారున్నారు. వీరు అటూ ఇటూ మారి ఎంపీ, ఎమ్మెల్యే పదవులు చేపట్టారు. జనం మాట అమ్మఒడి అందరికీ వరం అమ్మఒడి పథకం అందరికీ వరం. ఈ పథకం వల్ల ప్రతి పేదింట్లో పిల్లలు ధీమాగా పెద్ద చదువులు చదువుతారు. జగన్మోహన్రెడ్డి మొదటి సంతకంతోనే మహిళల తలరాతలు మారతాయి. అందుకే జగనన్న ముఖ్యమంత్రి అయితేనే సువర్ణయుగం సాధ్యపడుతుంది. - కాటి విశాలి, గుడివాడ పేదలకెంతో ప్రయోజనం జగన్మోహన్రెడ్డి ఐదు సంతకాలు పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయి. అమ్మఒడి వల్ల పేదల పిల్లలు పనులు మాని బడికి వెళతారు. పింఛన్ల పెంపు వల్ల వృద్ధులకు, వికలాంగులకు ఆసరా లభిస్తుంది. డ్వాక్రా రుణాల మాఫీ వల్ల మహిళలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. - దిరిశం బాలకోటయ్య, దిరిశంవాని దళితవాడ (ఘంటసాల) 24 గంటల్లో కార్డు.. చాలా గ్రేట్ ‘ఊరూరా జనసేవా కేంద్రాలు’ ఆలోచన అద్భుతం. వీటి ద్వారా 24 గంటల్లో రేషన్ కార్డు, పింఛన్లు లాంటివి మంజూరు చేయడం చాలా గొప్ప విషయం. పేదలు వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. గ్రామాల్లోనే ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేస్తే ఈ బాధ తప్పుతుంది. - శీరం సురేష్, పెడన నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు వైఎస్ హయాం నాటి సువర్ణయుగాన్ని తెస్తానని జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. ఆయన సీఎం అయితేనే నా లాంటి యువత జీవి తాల్లో వెలుగులు నిండుతాయి. యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే కార్యక్రమాలను వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో పొందుపరచటం ఆనందంగా ఉంది. - కొసనం రవితేజ, మచిలీపట్నం వైఎస్ పాలనలో ఈ కష్టాల్లేవ్! వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన చాలా బాగుండేది. ప్రజలకు ఏ కష్టాలూ లేకుండా చూసుకున్నారు. ముఖ్యంగా అప్పట్లో ‘గ్యాస్’ కష్టాలను ఏ రోజూ చూడలేదు. సిలిండర్లు కచ్చితంగా ఇచ్చేవారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచినప్పుడు కూడా ప్రజలపై భారం పడకుండా చూశారు. పెంచిన మొత్తాన్ని ప్రభుత్వమే భరించేలా చొరవ తీసుకున్నారు. ఇప్పుడు ఆ మహానుభావుడు లేడు. గ్యాస్ కష్టాలు మామూలై పోయాయి. ఆధార్‌కార్డు, బ్యాంకు లింకేజీ అంటూ లేనిపోని నిబంధనలు పెట్టారు. గ్యాస్ కొనలేకపోతున్నాం. మళ్లీ కట్టెల పొయ్యినే నమ్ముకోవాల్సి వస్తోంది. - శేషమ్మ,పెదయాదర, బందరు మండలం -
బందరులో ముంబై పోలీసుల విచారణ
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య హత్య కేసుపై ముంబై పోలీసులు మచిలీపట్నంలో సోమవారం విచారణ నిర్వహించారు. ఈ కేసు విచారణ కోసం కంజూర్ పోలీస్‌స్టేషన్ సీఐ అశోక్, కోలీ, ఠాకూర్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఇక్కడికి వచ్చారు. స్థానిక పోలీసులకు కూడా తెలియకుండా పట్టణంలోని పలు ప్రాంతాల్లో తిరిగి అనూహ్యతో పాటు రైల్వేస్టేషన్లో నడిచి వెళ్లిన వ్యక్తి ఫొటో చూపి ‘ఈ వ్యక్తి ఈ ప్రాంతానికి చెందిన వాడేనా’ అంటూ ఆరా తీశారు. అనంతరం అనూహ్య తండ్రి ప్రసాద్ ఇంటికి వెళ్లి పోలీసులు రైల్వేస్టేషన్ సీసీ టీవీ నుంచి తీసుకున్న ఫుటేజీలను చూపి.. ‘అనూహ్యతో నడిచి వెళుతున్న వ్యక్తి మీకు తెలుసా లేదా, అనూహ్యతో పాటు నడిచి వెళ్లేది హేమంతేనా?’ అని ప్రశ్నించారు. అనూహ్యతో పాటు రైల్వేస్టేషన్లో నడిచి వెళ్లే వ్యక్తి హేమంత్ కాదని అనూహ్య తండ్రి ప్రసాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హేమంత్ తమ కుటుంబ సభ్యుల్లో ఒకడని, అసలు దోషులను వదిలేసి హేమంత్‌ను అనుమానించటం సరికాదని వారికి సూచించారు. అనూహ్య హత్య కేసులో పలువురిని అనుమానిస్తున్నామని, వారందరినీ విచారణ చేస్తామని, అందులో హేమంత్ కూడా ఒకరని చెప్పి వెళ్లిపోయారు. ఐదు బృందాల గాలింపు... అనూహ్య హత్య కేసులో నిందితుల ఆచూకీ కోసం ఐదు పోలీసు బృందాలు వివిధ ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు కంజూర్ పోలీస్ స్టేషన్ సీఐ అశోక్ విలేకరులకు తెలిపారు. అనూహ్య హత్య ఘటనపై కుంజూర్ పోలీస్‌స్టేషన్‌లోనే కేసు నమోదైందన్నారు. మచిలీపట్నంలో ఒక బృందం, హైదరాబాదులో రెండు బృందాలు అనూహ్య హత్య కేసులో నిందితులను కనుగొనేందుకు పర్యటిస్తున్నాయని ఆయన చెప్పారు. కుంజుమార్గ్ రైల్వేస్టేషన్‌లోని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా అనూహ్యకు సమపంలో నడిచి వెళ్లే వ్యక్తి ఈ ప్రాంతానికి చెందిన వాడా, ఎవరికైనా ఇక్కడి వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయా అనే అంశంపై విచారణ చేసేందుకు వచ్చామన్నారు. 300 మందిని విచారించాం... అనూహ్య హత్యకేసులో ఇప్పటికి 300 మందిని విచారించామని సీఐ చెప్పారు. అనూహ్య స్నేహితుడు హేమంత్‌తో పాటు మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని ఆయన వివరించారు. మరో రెండు రోజుల పాటు ఈ ప్రాంతంలో ఉండి వివరాలు సేకరిస్తామన్నారు. బందరు డీఎస్పీ కేవీ శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ మురళీధర్, మచిలీపట్నం ఎస్సై శ్రీహరిలతో ముంబై నుంచి వచ్చిన పోలీసు బృందం సంప్రదింపులు జరుపుతోంది. -
సీట్ల లొల్లి...
=పెడనపై కొనకళ్ల కన్ను =బందరు ఎంపీ సీటుకు పోటీచేయాలని కాగితకు బుజ్జగింపు =సుజనాచౌదరి రాజేసిన సీటు తుపాను =ఒకే సామాజికవర్గంలో రేపిన వివాదం =జిల్లా టీడీపీలో సీటు పాట్లు సాక్షి ప్రతినిధి, విజయవాడ : గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ సిట్టింగ్‌లు పదిలమైన చోటు కోసం వెదుకులాట మొదలెట్టారు. ఉన్న సీటు దక్కుతుందన్న గ్యారంటీ లేకపోవడంతో కొత్త చోటు కోసం గాలం వేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నేతలను ఓటమి భయం వెంటాడుతోంది. దీంతో జిల్లా టీడీపీలో సీట్ల లొల్లి మళ్లీ మొదలైంది. తాజాగా బందరు పార్లమెంటు నియోజకవర్గం కేంద్రంగా సీటు తుపానుకు బీజం పడింది. ఇందుకు ఇటీవల జిల్లాకు టీడీపీ పరిశీలకుడిగా వచ్చిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి నెరపిన మధ్యవర్తిత్వం కొత్త దుమారానికి దారితీసింది. గత నెల 15న జిల్లా పార్టీ పరిశీలనకు వచ్చిన సుజనాచౌదరి లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం ఉన్న ఇన్చార్జిలు, సిట్టింగ్లతో మంత్రాగం నెరిపారు. అదే క్రమంలో తనకు ఇష్టులైన కొందరు నేతలను కొత్త చోటుకు సీటు రిజర్వ్ చేసి పెట్టేలా వ్యూహాన్ని రచించారు. ఇప్పటికే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి సేవలందిస్తున్న వారంతా వేరొకరికి తమ సీటు ఇవ్వాలనేసరికి సుజనా చౌదరి తీరుపై గుర్రుగా ఉన్నారు. ఒకే సామాజికవర్గంలో కొత్త చిచ్చు... మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని సుజనాచౌదరి చేసిన ప్రతిపాదన ఒకే సామాజికవర్గంలో కొత్త చిచ్చు రాజేస్తోంది. గత 15 రోజులుగా నివురుగప్పిన నిప్పులా రాజుకుంటున్న ఆ వివాదం నేతల మధ్య అంతరాన్ని పెంచేదిగా మారిందని పలువురు టీడీపీ నేతలే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం మారిన రాజకీయాల్లో బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ మరోసారి నెగ్గుకురావడంపై అనుమానం వ్యక్తంచేసిన సుజనాచౌదరి చేసిన ప్రతిపాదన వివాదాస్పదమైంది. కొనకళ్లను పెడన నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపేందుకు సుజనాచౌదరి ఎత్తులు వేసినట్టు సమాచారం. దీంతో ఇప్పటికే పెడన టీడీపీ సీటుపై ఆశలు పెట్టుకున్న మాజీ విప్ కాగిత వెంకట్రావును అక్కడి నుంచి తప్పించేందుకు వ్యూహాన్ని పన్నినట్టు వినికిడి. కాగితను బందరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సూచించిన సుజనా పెడన నియోజకవర్గం నుంచి కొనకళ్ల నారాయణరావుకు అవకాశం ఇవ్వాలని కోరినట్టు విశ్వసనీయ సమాచారం. ఎంపీ కొనకళ్ల జిల్లా పార్టీ పరిశీలకుడిగా తెచ్చుకున్న సుజనాచౌదరి ఏ ఉద్దేశంతో కాగితను ఎంపీగా పోటీ చేయాలని చెప్పారన్నది తెలిసిన పార్టీ శ్రేణులు కంగుతిన్నారు. దీంతో పెడన పైనే ఆశలు పెట్టుకున్న కాగిత వెంకట్రావు ఎంపీగా పోటీ చేయడం అంటే రాజకీయంగా కనుమరుగు కావడమేనని ఆయన అనుచరులు ఆవేదన చెందుతున్నారు. సుజనాచౌదరి పెట్టిన ఈ కొత్త మెలిక విషయమై చంద్రబాబు వద్దే పంచాయతీ పెట్టాలని కాగిత అనుచరులు మండిపడుతున్నారు. ఆంతర్యమేమిటో.. సామాజికవర్గాల సమీకరణ నేపథ్యంలో మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా అనూహ్యంగా తెరమీదకు వచ్చిన కొనకళ్ల నారాయణరావు గెలుపులో అనేక అంశాలు కలిసివచ్చాయి. అటు తరువాత పార్టీలో నిబద్ధత కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన ఎంపీగా అనుకున్నంత గుర్తింపు పొందలేకపోయారు. దీనికితోడు మారిన రాజకీయ సమీకరణలతో గత ఎన్నికల మాదిరిగా ఈసారి కలిసివచ్చే అవకాశం లేదని గుర్తించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బందరు, పెడన, పామర్రు, అవనిగడ్డ వంటి అసెంబ్లీ నియోజకవర్గాలు అంతగా కలిసి రాకపోయినా ఆయనకు గుడివాడ, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ మెజార్టీలు వచ్చాయి. అప్పట్లో కొడాలి నాని, మరికొందరు నేతల ఇమేజ్, కృషి కొనకళ్ల నారాయణరావుకు కలిసి వచ్చింది. గతంలో బాగా కలిసి వచ్చిన నియోజకవర్గాలు ఇప్పుడు వైఎస్సార్సీపీకి కంచుకోటలుగా మారాయి. దీంతో ఎంపీగా అవకాశాలు సన్నగిల్లిన కొనకళ్ల నారాయణరావు ఎత్తుగడ గానే పెడనపై కన్నేసినట్టు తెలిసింది. దీనివల్ల తక్కువ ఖర్చుతో బయటపడవచ్చన్నది ఆయన ఆంతర్యంగా ప్రచారం జరుగుతోంది. కొనకళ్ల కోసం అదే సామాజిక వర్గానికి చెందిన కాగితను దెబ్బతీస్తే పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పలువురు నేతలు చంద్రబాబు దృష్టికి తెచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. మొత్తానికి ఈ సీట్ల లొల్లి ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.