ఏ ప్రాంతం అనువైనదైతే అక్కడే రాజధాని:సుజనా చౌదరి | I have lands in Kanchikacharla and Bandar: Sujana chowdary | Sakshi
Sakshi News home page

ఏ ప్రాంతం అనువైనదైతే అక్కడే రాజధాని:సుజనా చౌదరి

Published Sat, Sep 20 2014 3:20 PM | Last Updated on Sun, Sep 2 2018 5:11 PM

సుజనా చౌదరి - Sakshi

సుజనా చౌదరి

విజయవాడ: రాజధానికి ఏది అనువైన ప్రాంతం అని భావిస్తే అక్కడే రాజధాని ఏర్పడుతుందని టిడిపి ఎంపి సుజనా చౌదరి చెప్పారు. పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కరసరత్తు జరుగుతోంది.  రాజధానిని సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

రాజధానికి సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ తనకు బందరులోనూ, కంచికచర్లలోనూ భూములు ఉన్నాయని తెలిపారు. తన భూములు ఉన్న చోట రాజధాని ఏర్పాటు అయితే అవవచ్చునని అన్నారు. శాస్త్రీయంగా రాజధానికి ఏది అనువైన ప్రదేశం అని తేలుతుందో అక్కడే రాజధాని నిర్మాణం జరుగుతుందని చెప్పారు. రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement