Sujana Choudary (YS Choudary)
-
మనీలాండరింగ్ కేసులో సుజనా చౌదరికి ఎదురు దెబ్బ
ఢిల్లీ : ఈడీ మనీలాండరింగ్ కేసులో బీజేపీ విజయవాడ పశ్చిమ నియోజక వర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరికి ఎదురు దెబ్బ తగిలింది. బెస్త్ అండ్ క్రాప్టన్ కేసును క్వాష్ చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ని సుప్రీం కోర్టు డిస్మీస్ చేసింది. చైన్నై ఈడీ కోర్టులో తేల్చుకోవాలని సూచించింది. ఇదే కేసులో సీబీఐ సుజనా చౌదరిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
సుజన చౌదరి ఎక్కడ ? పవన్ కళ్యాణ్ మోసం చేశాడు..!
-
'ఏంటిది సుజనా'..?
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తీరు స్థానిక ఓటర్లలో గుబులు రేపుతోంది. ఈ నియోజకవర్గంలో ముస్లిం, ఆర్యవైశ్య, నగర సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. తాజాగా ఆయన వీరితో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు.ఈ సమావేశాల్లో ‘నా ఎదుగుదలకు మీరే కారణం.. మీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి’అంటూ తెగ ఊదరగొట్టారు. దీంతో సమావేశాలకు వెళ్లిన వారంతా ఒకటే మాట.. బ్యాంకులు లూటీ చేసి, ఆ డబ్బుతో ఎన్నికలకో పార్టీ మారే సుజనా ఎదుగుదలకు తామెలా కారణమవుతామని మిత్రులతో గుసగుసలాడుకుంటున్నారు. కొంపదీసి ఈయన ఎగ్గొట్టిన బ్యాంకు రుణాల బకాయిల్ని తమ నెత్తిన రుద్దుతారేమోనని భయపడుతున్నారట.ఇవి చదవండి: 'గ్లాస్ గుచ్చుకుంది'..! -
పశ్చిమంలో సుజనా ప్రైవేట్ సైన్యం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీచేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనాచౌదరి ఎన్నికల్లో గెలుపు కోసం డబ్బు పంపిణీకి తెరతీశారు. ఇందు కోసం తన ప్రైవేట్ సైన్యాన్ని విజయవాడ నగరంలో మోహరించారు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని గుర్తించిన ఆయన ఏదో విధంగా గెలవాలని భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా సుజనాచౌదరితో పాటుగా తెలుగుదేశం నాయకులు భారీ ప్రణాళిక రూపొందించారు. నియోజకవర్గంలో సుజనాకు మద్దతు లేని ప్రాంతాల్లో తన సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను మోహరించారు. కొత్త వ్యక్తులు నియోజకవర్గంలో డబ్బుల కట్టల పట్టుకొని తిరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.డివిజన్లవారీగా బాధ్యతలునియోజకవర్గంలో ఓట్లను కొనుగోలు చేయడానికి తన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు 200 మందిని సుజనాచౌదరి నగరంలో దింపారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. డివిజన్‌కు పది మంది వరకూ తమ ఉద్యోగుల ద్వారా నగదు పంపిణీ చేయాలని ఆయన భావిస్తున్నారని సమాచారం. అందుకు అనుగుణంగా ఉద్యోగులకు ఆయా డివిజన్ల బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ ఓట్లను కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ఆ వర్గాలు అధికంగా ఉన్న డివిజన్లను ఎంపిక చేససుకొని వాటిపై దృష్టిని పెడుతున్నారు. ఇప్పటికే కొంత మంది నాయకులను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారని సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు. ఇంత అడ్డగోలుగా నాయకులు అమ్ముడుపోవటం ఇప్పుడే చూస్తున్నామని వారు ఆవేదన వ్యక్తంచేశారు.హోటళ్లు ఫుల్నగరంలోని పలు ప్రాంతాల్లో సుజనా సైన్యం బస చేస్తోంది. నిడమానురులోని సుజనా సొంత నివాసంలో కొద్దిమంది షెల్టర్ తీసుకోగా అధిక శాతం మంది వన్‌టౌన్, గొల్లపూడి, బెంజిసర్కిల్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లలో తిష్టవేశారు. ఒక సామాజికవర్గానికి చెందిన దుకాణాలు, హోటళ్ల ద్వారా వారు నగదును బయటకు తరలిస్తున్నారని సమా చారం. ఎంత మొత్తం వెచ్చించైనా ఓట్లు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా మైనార్టీ, దళిత వర్గాలు నివసించే ప్రాంతాల్లో ఆయా స్థానిక నాయకుల నుంచి ఓటరు లిస్టులను దగ్గర ఉంచుకొని కొనుగోలు చేయాల్సిన ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఆ దిశగా పావులు కదుపుతున్నారు.సుజనాచౌదరిని తరిమికొడతాం తమ ఓట్లను కొనుగోలు చేస్తామంటూ తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూసే సుజనాచౌదరిని తరిమికొడతామని దళిత, మైనార్టీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. సుజనాచౌదరి నగరానికి వచ్చినప్పటి నుంచి దళితులు, మైనార్టీల ఓట్లు కొంటామని మాట్లాడుతున్నా రని వారు చెబుతున్నారు. తమ ఓట్లు కొనుగోలు చేసి తద్వారా గెలుస్తానని పదేపదే మాట్లాడటం తమను దిగజార్చటమేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. సుజనాచౌదరి వంటి నేతలకు ఓటు ద్వారా తమ సత్తా చూపుతామని వారు హెచ్చరిస్తున్నారు. -
చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!
-
సుజనా చౌదరికి కేశినేని శ్వేత కౌంటర్..
-
సుద్దపూస సుజనా ఒక బ్యాంకు దొంగ..!
-
సుజనా చౌదరి అఫిడవిట్ పై అనుమానాలు..కేశినేని నాని డిమాండ్
-
సుజనా అప్పుల లెక్క తీయండి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు, విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ వై. సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియకు రిజల్యూషన్ ప్రొఫెషనల్‌గా మలిగి మధుసూదన రెడ్డిని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ నియమించింది. సుజనా చౌదరి అప్పుల లెక్కలు తీయాలని ఆదేశించింది. సుజనా చౌదరి దివాలా పరిష్కార ప్రక్రియకు ఇప్పటికే అంగీకరించిన ఎస్‌సీఎల్‌టీ.. ఆ తీర్పు పూర్తి ప్రతిని తాజాగా విడుదల చేసింది. దివాలా ప్రక్రియ ముగిసే వరకు సుజనా (రుణ గ్రహీత) ఆస్తుల క్రయవిక్రయాలు, ఇతరుల పేరిట బదిలీ చేయడం లాంటివి చెల్లవని తేల్చిచెప్పింది. దివాలా ప్రక్రియ అంతా ఎలా నిర్వహించాలో ఎన్సీఎల్టీ జ్యుడిషియల్ సభ్యుడు రాజీవ్ భరద్వాజ్, టెక్నికల్ సభ్యుడు సంజయ్‌పూరి ధర్మాసనం రిజల్యూషన్ ప్రొఫెషనల్‌కు స్పష్టంగా వివరించింది. దివాలా ప్రక్రియకు వెళ్లిన స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎస్బీఐకి రూ. 562,84,30,310 (అసలు, వడ్డీ కలిపి) రుణ బకాయి పడిందని, దీనికి సుజనా చౌదరి వ్యక్తిగతంగా గ్యారెంటీ ఇచ్చినందున, ఆయనను దివాలాదారునిగా ప్రకటించి, రుణ పరిష్కార ప్రక్రియ ప్రారంభించాలని కోరుతూ బ్యాంకు 2021లో ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. దీనిపై విచారించిన ఎన్సీఎల్టీ మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషల్ (ఐఆర్పీ)గా మధుసూదన్ రెడ్డిని నియమించింది. వ్యకిగత హామీదారుకు రుణాల చెల్లింపు కోసం బ్యాంక్ సమయం ఇచ్చిందని, అయినా చెల్లించడంలో ఆయన విఫలమయ్యారని ఐఆర్పీ నివేదిక అందజేశారు. పిటిషన్‌ను అనుమతించి దివాలా ప్రక్రియను ప్రారంభించవచ్చని చెప్పారు. ఈ నివేదికను పరిశీలించి, ఇరుపక్షాల వాదనలు విన్న ఎన్సీఎల్టీ తీర్పు వెలువరించింది. తీర్పులో ప్రధానాంశాలు.. సుజనా చౌదరిపై దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభిస్తున్నాం. ఆయన వ్యక్తిగత హామీదారుగా ఉన్నందున అన్ని అప్పులపై 180 రోజుల పాటు మారటోరియం వర్తిస్తుంది. ఈ సమయంలో ఆయన తన ఆస్తుల క్రయవిక్రయాలు, ఇతరులకు బదిలీ వంటి లావాదేవీలు నిషేధం. మా ఉత్తర్వుల కాపీ ఎన్సీఎల్టీ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన 7 రోజుల్లోగా సుజనాకు అప్పులు ఇచ్చిన వారి నుంచి వివరాలు కోరుతూ రిజల్యూషన్ ప్రొఫెషనల్ పూర్తి వివరాలతో పబ్లిక్ నోటీస్ జారీ చేయాలి. వ్యక్తిగత హామీదారు సుజనా, కార్పొరేట్ రుణగ్రహీత స్ప్లెండిడ్ కంపెనీ ఉంటున్న రాష్ట్రంలో విస్తృత సర్కులేషన్ ఉన్న ఆంగ్ల, మాతృ భాష (తెలుగు) పత్రికల్లో ఈ నోటీసులు ప్రచురించాలి. ఆ తర్వాత రుణ దాతలు క్లెయిమ్‌లు సమర్పించేందుకు 21 రోజుల సమయం ఇవ్వాలి. 30 రోజుల్లోగా రిజల్యూషన్ ప్రొఫెషనల్ రుణదాతల జాబితా, ఇతర వివరాలన్నీ సిద్ధం చేయాలి. రుణదాతలకు ఎలా చెల్లింపులు చేస్తారో సుజనా నివేదిక ఇవ్వాలి. రుణదాతల జాబితా, సుజనా నివేదికను ఎన్సీఎల్టీ బెంచ్ (అడ్జ్యుడికేటింగ్ అథారిటీ)కి రిజల్యూషన్ ప్రొఫెషనల్ అందజేస్తారు. చివరి క్లెయిమ్ అందిన 21 రోజుల్లోగా ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలి. అప్పటి నుంచి 28 రోజుల్లోగా రిజల్యూషన్ ప్రొఫెషనల్ రుణదాతలతో సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ సమావేశం అవసరం లేదని రిజల్యూషన్ ప్రొఫెషనల్ సిఫార్సు చేస్తే, దానికి కారణాలను తెలపాలి. సుజనా నివేదికను రుణదాతలకు అందజేసి, వారి అభిప్రాయం తీసుకుని, ఆ వివరాలను ఎన్సీఎల్టీకి సమర్పించాలి’ అని పేర్కొంది. సుజనా చెల్లింపుల విధానానికి రుణదాతలు అంగీకరిస్తే అంతటితో ప్రక్రియ ముగుస్తుంది. లేదంటే ఆస్తులు వేలం వేసి చెల్లించేలా దివాలా ప్రక్రియ ముందుకు వెళ్లనుంది. -
సుజనా చౌదరి భారీ మోసం...ఆస్తులు వేలం !
-
సుజనా చౌదరి ఆస్తి విలువ 34 లక్షలు...కొమ్మినేని సంచలన విషయాలు
-
సుజనా చౌదరి వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టారు
-
సుజనా చౌదరికి షాక్
-
సుజనా చౌదరి దివాలా
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, మాజీ ఎంపీ, ఎన్డీఏ కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దివాళా పరిష్కారకర్త (రెజల్యూషన్ ప్రొఫెషనల్)ను నియమిస్తూ.. ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఆయన ఆస్తుల క్రయవిక్రయాలను నిలిపివేసింది. దివాలా ప్రక్రియకు వెళ్లిన స్లె్పండిడ్ మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎస్బీఐలో రూ. 500 కోట్లకు రుణం తీసుకుంది. దీనికి సుజనా చౌదరి వ్యక్తిగతంగా గ్యారెంటీ ఇచ్చారు. దీంతో సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియ ప్రారంభించి, పరిష్కారాన్ని చేపట్టాలని ఎస్బీఐ 2021లో ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసింది. ఆయన ఆస్తుల మదింపు చేపట్టి, వేలం ద్వారా ఎస్బీఐ రుణాలను చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌పై ఎన్సీఎల్టీ జ్యుడిషియల్ సభ్యుడు రాజీవ్ భరద్వాజ్, టెక్నికల్ సభ్యుడు సంజయ్ పూరి బెంచ్ విచారణ జరిపి, తాజా ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వీవీఎస్ఎన్ రాజు వాదనలు వినిపించారు. రుణదాతకు ఏదైనా కంపెనీ, వ్యక్తులు రుణాన్ని ఎగవేసినప్పుడు దానికి వ్యక్తిగతంగా గ్యారెంటీ ఉన్న వాళ్లు బాధ్యత వహించాలని చట్టం చెబుతోందన్నారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని పలు తీర్పుల సందర్భంగా చెప్పిందన్నారు. హామీదారుగా ఉన్న సుజనా చౌదరి తప్పకుండా బాధ్యత వహించేలా ఆదేశాలివ్వాలని కోరారు. సుజనా తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడం, మధ్యంతర పరిష్కార ప్రక్రియ (ఐఆర్పీ) ఇచ్చిన నివేదికను పరిశీలించిన బెంచ్.. సుజనా వ్యక్తిగత దివాలా ప్రక్రియకు అనుమతించింది. దీంతో బీజేపీ నేతకు షాక్ తగిలినట్లయింది. దీని ప్రకారం దివాలా ప్రక్రియను ప్రారంభించేందుకు పరిష్కారకర్తను నియమిస్తారని, ఆయన సుజనా అప్పులు, ఆస్తులను పరిశీలించి, ఆయా రుణదాతలకు ఇవ్వాల్సిన నిష్పత్తి మేరకు పరిష్కారాన్ని సూచిస్తారని సమాచారం. -
చౌదరికి 3డీ సినిమా ఖాయం!
అవును, సుజనా కోసం బీసీలు బలయ్యారు. ముస్లిం మైనార్టీలు మోసపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకే చెందిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులను పక్కా ప్రణాళికతో బలి పశువుల్ని చేశారు. పార్ట్నర్ పవన్‌తో పోతిన వెంకట మహేష్ ను పొడిపించేశారు. పెత్తందారీ పోకడలకు ప్రతీకగా ప్రత్యేక గుర్తింపు పొందిన చౌదరి (సుజనాను బాబుతో సహా టీడీపీలోని ముఖ్యులు సైతం చౌదరి అనే సంభోదిస్తుంటారు) కోసం బాబు తమను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఫణంగా పెట్టేశారని ప శ్చిమలోని బీసీ, మైనార్టీ నాయకులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారని నిప్పులు చెరుగుతున్నారు. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని ఆక్రమించేసుకున్నాక చంద్రబాబు విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక ఆప్షన్‌గా ఎంచుకున్నారు. అక్కడి నేతలు సొంతంగా బలపడకుండా చూసుకోవడంలో జాగ్రత్త పడుతున్నట్లు ప్రతి ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలు నిర్ధారిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం అనంతరం ఒంటరిగా పోటీ చేసింది తక్కువే. 1998 లోక్‌సభ ఉప ఎన్నిక మొదలు 1999, 2004, 2009, 2014 జనరల్ ఎలక్షన్లలో వామపక్షాలు, బీజేపీ, మహాకూటమి, జనసేనలతో టీడీపీ కూటమి కట్టి తలపడింది. 2019లో నేరుగా పోటీ అన్నట్లు కలరింగ్ ఇచ్చినా, జనసేనతో లోపాయికారీ ఒప్పందం లేకపోలేదు. 2004, 2009, 2019 ఎన్నికల్లో తలపడిన టీడీపీ ఓటమి చెందింది. 1983లో మాత్రమే టీడీపీ నుంచి బి.ఎస్.జయరాజ్ పోటీచేసి సీపీఐ అభ్యర్థిపై గెలుపొందారు. కాగా సైద్ధాంతికంగా భిన్న ధృవాలైన సీపీఐ, బీజేపీలకు ప శ్చిమ సీటును కేటాయించడం బాబుకే సాధ్యమైంది. తరచూ ఇంఛార్జిల మార్పుతో ఏమార్పు పశ్చిమలో సంస్థాగతంగా పార్టీ బలపడక పోవడానికి, నిలకడగా ఏ ఒక్కరికీ నాయకత్వాన్ని అప్పగించక పోవడానికి.. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం బాబుకు లేకపోవడమే. కూటమి కట్టినప్పుడల్లా ప శ్చిమ సీటును ఇతరులకు కేటాయించడం బాబుకు పరిపాటి. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలతో పాటు పోటీ చేసి ఓడిన బీసీలు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా (దూదేకుల), మైనార్టీ వర్గానికి చెందిన జలీల్‌ఖాన్, ఆయన కూతురు షబనా ఖాతూన్, మొహమ్మద్ ఫతావుల్లా, ఎంఎస్ బేగ్ తదితర నాయకులు టీడీపీ నుంచి ఉన్నారు. వీరిలో ఎవరికి వారికి నియోజకవర్గ ఇంఛార్జి స్థాయి నీదే అనడం, ఆ తర్వాత కొంత కాలానికి పక్కన పెట్టేయడం చంద్రబాబుకు ఇక్కడ చెల్లుబాటయ్యింది. ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ను అడ్డుగా పెట్టి.. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)ను దాదాపు రెండన్నరేళ్లకు పైగా ప శ్చిమ నియోజకవర్గ ఇంఛార్జిగా కొనసాగిస్తూ అదే ప్రాంతానికి చెందిన బుద్ధా వెంకన్న, జలీల్‌ఖాన్, నాగుల్‌మీరా, ఫతావుల్లా తదితరులను పక్కన పెట్టుకుని వారి చేతనే కేశినేనికి వ్యతిరేకంగా వ్యవహరింపజేయడం బాబుకే చెల్లిందని నగర నేతల ఏకాభిప్రాయం. ముఖ్యంగా కార్పొరేషన్ ఎన్నికల ప్రచారమప్పుడు నగరమంతా నవ్వుకునేలా ముఖ్య నాయకులను వీధుల్లోకి చేర్చి తిట్ల దండకాలను కొనసాగించడం కొసమెరుపు. ఒకే ఎత్తుగడతో అందర్నీ చిత్తు చేయడమనేది బాబు నైజమని ఆ పార్టీలోని సీనియర్లు వల్లెవేసే మాట. పవన్ చేత పోతినను... జనసేన కోసం ఏళ్ల తరబడి పనిచేసిన, గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి 22,367 ఓట్లు పొందిన బీసీ వర్గానికి చెందిన పోతిన వెంకట మహే‹Ùను సుజనా చౌదరి సీటు కోసం తన రాజకీయ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ చేత చంద్రబాబు పొడిపించేశాడని స్థానికంగా వాడ వాడ కోడైకూస్తోంది. చివరి నిమిషం వరకు సీటు ఆశించి మోసపోయిన పోతిన, జనసేనను వీడి వైఎస్సాఆర్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. సుజనా చౌదరి కోటీశ్వరుడైనంత మాత్రాన బీసీలు డబ్బులకు అమ్ముడుపోతారని అనుకోవడం పొరపాటని పోతిన బాహాటంగానే ధ్వజమెత్తారు. ‘ధనికుడైనందున చౌదరిని బీజేపీ అభ్యర్థిగా తాము అంగీకరిస్తామని మా అధినేత అనుకుని ఉండొచ్చు. నోట్లతో ఓటర్లను, భారీ బేరసారాలతో మమ్మల్ని లొంగదీసుకోవచ్చనే అంచనాకు వచ్చి ఉండొచ్చు. సమకాలీన రాజకీయాల్లోని లోతుపాతులు మాకూ తెలిసొచ్చా యి. పెత్తందారు పచ్చనోట్లకు పేదలు, మాబోటి నాయకులందరూ లొంగి పోతారనుకోవడం పొరపాటని ‘పెద్దలు’ గ్రహించేలా గుణపాఠం నేర్పుతాం’ అని టీడీపీ, జనసేనల్లోని బీసీ, మైనార్టీల నేతలు చెబుతున్నారు. ‘వాళ్లు చేయాల్సింది చేశారు.. మేం చేయగలిగింది చేసి చూపిస్తాం’ అని వేర్వేరుగా ‘సాక్షి’తో వారు మనసులో మాట వెలిబుచ్చారు. సుజనా మాటకు నాని అడ్డుచెప్పరనే.. బీజేపీలోకి సుజనాను పంపింది, ఇప్పుడు ఆ పార్టీ తరఫున ప శ్చిమ సీటును కేటాయించిందీ బాబు అనేది జనమెరిగిన సత్యం. పొత్తు కుదరక ముందు వరకు.. సుజనా చౌదరి విజయవాడ లోక్‌సభ అభ్యర్థి అని పచ్చమీడియా, సోషల్ మీడియా ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. సుజనా, కేశినేనిల మధ్య సాన్నిహిత్యం మెండుగా ఉన్నందున, చౌదరి మాటను నాని జవదాటరనేది బాబు నమ్మకం. బహుశా ఆ దృష్ట్యానే కేశినేనిని పశ్చిమ ఇంఛార్జిగా కొనసాగిస్తూ బీసీలు, మైనార్టీలను దూరంచేసే ప్రణాళికను బాబు అమలు పరిచారు. కాకపోతే ఊహించని రీతిలో బాబు ఎత్తులను చిత్తు చేస్తూ నాని టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
టీడీపీలో ప్రమోషన్ ఎక్కువ.. పని తక్కువ..!
-
సేనానిని నమ్ముకో.. ఉన్నదంతా అమ్ముకో !
తమ్ముణ్ణి సినిమాకు తీసుకెళ్లావ్..నన్నుతీసుకెళ్లలేదు..వాడికి కొత్త బట్టలు కొన్నావు,సైకిల్ కొన్నావ్..నాకు కొనలేదు అని పిల్లలు అలుగుతుంటారు..అలాంటప్పుడు తల్లి, తండ్రి వాణ్ని దగ్గరకు తీసి ఒరేయ్ చిన్నోడా అది కాదురా.. వాడికి సైకిల్ కొన్నాను కదా... నీకూ కొంటాను.. నీకు ఇంకోటి కొంటాను.. వాణ్ని సినిమాకు తీసుకెళ్ళాను కదా.. నువ్వు బాధపడకు నిన్ను జాతరకు తీసుకెళ్తాను... బాధపడకు... అని ఓదార్చాలి... అదే కుటుంబం బాధ్యత. అదే విధంగా పార్టీలో ఉన్నవాళ్లందరికీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు.. అలాంటప్పుడు పిలిచి ఇదిగోవయ్యా.. నువ్వు బాగానే కష్టపడ్డావు కానీ నీకు నేను టికెట్ ఇవ్వలేకపోతున్నాను.. దానికి ఏవేవో కారణాలు ఉన్నాయ్.. కాబట్టి ఏమీ అనుకోకు.. పార్టీ కోసం పని చేయండి.. గెలిస్తే మిమ్మల్ని తప్పక గౌరవిస్తాం అని చెప్పాల్సిన బాధ్యత పార్టీ అధినేత మీద ఉంటుంది. కానీ జనసేనాని వీటన్నిటికీ అతీతంగా ఉంటారు.. టికెట్లు తనకు నచ్చినవాళ్లకు ఇచ్చుకుంటారు. తిరుపతిలో కిరణ్ రాయల్ కావచ్చు.. విజయవాడ వెస్ట్ లో పోతిన మహేష్..ఇలా ఎన్నో జిల్లాల్లో ఎంతోమంది పవన్ కోసం పదేళ్లుగా పని చేస్తూ లక్షలు, కోట్లు తగలేశారు. ఇన్నేళ్ళుగా వాళ్ళను వాడుకుని అక్కడ పార్టీ ఉనికిలోకి వచ్చాక.. ప్రజల్లో కాస్త గుర్తింపు వచ్చాక అక్కడి సీటును వేరేవాళ్లకు ఇచ్చుకోవడం, ఇదేమంటే పొత్తు ధర్మం అని, త్యాగాలకు సిద్ధం కావాలని సమర్థించుకోవడం పవన్ కు అలవాటుగా మారింది. పోతిన మహేష్ టికెట్ బీజేపీకి అంటే సుజనా చౌదరికి ఇవ్వడానికి వెనుక కోట్లు చేతులుమారాయని అంటున్నారు. ఇదిలా ఉండగా ఇలా పవన్‌ను నమ్ముకుని బికారులు అయిపోయినవాళ్లు రాష్ట్రవ్యాప్తంగా పదులసంఖ్యలోనే ఉన్నారు అయితే ఏనాడూ.. పవన్ అలా నష్టపోయిన లేదా మోసపోయినవాళ్లను పిలిచి వాళ్ళతో మాడ్లాడడం కానీ... వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా..హామీ కానీ ఇచ్చినట్లు వినలేదు. మాకు పవన్ మద్దతుగా ఉంటామన్నారు అని ఇంతవరకూ ఏ ఒక్క నాయకుడూ చెప్పలేదు. ఆంటే ఆయనది అంతా తన ఇష్టానుసారం. తనకు నచ్చినవాళ్లకు టికెట్లు ఇచ్చుకోవడం.. ఆయన్ను నమ్ముకుని మునిగిపోయినవాళ్లు పోవడం.. అంతే తప్ప...కనీసం వాళ్ళ బాధను చెప్పుకోవడానికి కూడా పార్టీలో ఇంకో వ్యక్తి, ఇంకో నాయకుడు లేకపోవడం ఇక్కడ దారుణం. దీంతో బాధితుల రోదన అరణ్య రోదన అవుతోంది తప్ప వాళ్ళ గోడు వినేవాళ్ళు లేకుండాపోయారు. దీంతో ఎక్కడికక్కడ జిల్లాలు.. నియోజకవర్గాల్లో పార్టీని మోసి మోసపోయిన జనసేన నాయకులంతా ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తూ తమ దారితాము చూసుకుంటున్నారు. తాను పిఠాపురంలో గెలిస్తే చాలు..పార్టీ మొత్తం ఏమైపోయినా ఫర్లేదు...అనే భావనలో పవన్ ఉండడంతో క్యాడర్ సైతం మెల్లగా సైడ్ అయిపోతున్నారు. --సిమ్మాదిరప్పన్న -
హారతి ఇచ్చుకో.. వెయ్యి పుచ్చుకో!
గాందీనగర్ (విజయవాడసెంట్రల్): టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనాచౌదరి, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఎన్నికల తాయిలాలకు తెరతీశారు. ఇందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. హారతి పట్టు, వెయ్యి కొట్టు అన్న చందంగా తొలిరోజు వీరి ప్రచారం సాగింది. శనివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానిపురంలోని 40, 41 డివిజన్ల నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనాచౌదరి, టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ పర్యటనలో మహిళలు హారతులు పట్టి, కొబ్బరికాయలు కొట్టారు. హారతి పళ్లానికి రూ.వెయ్యి, టెంకాయ కొట్టినందుకు రూ. వెయ్యి చొప్పున సుజనా చౌదరి, కేశినేని చిన్ని మహిళలకు తాయిలాలు అందజేశారు. ప్రచారంలో మహిళలు వరుసగా నిలబడడం అభ్యర్థులకు హారతులు పట్టడం తంతుగా మారింది. హారతులు పట్టిస్తూ కొబ్బరి కాయలు కొట్టిస్తూ అభ్యర్థులు యథేచ్ఛగా నగదు పంపిణీ చేశారు. కూటమి అభ్యర్థుల ప్రచారం కాస్ట్లీగా మార్చేశారు. తొలిరోజే ఇలా ఉంటే ఎన్నికల వరకు ఇంకెంత విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తారో.. ఇంకెన్ని వినూత్న మార్గాలు ఎంచుకుని డబ్బులు పంచుతారో అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఒక సామాన్యుడిపై బీజేపీ తరపున ఎన్నికల బరిలో దిగిన సుజానా చౌదరి ప్రచారం ప్రారంభం రోజే డబ్బులు వెదజల్లడం చూసి ఈ ఎన్నికలు పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధమేనని పలువురు చర్చించుకుంటున్నారు. హారతి పట్టించుకుంటూ పళ్లంలో రూ. వెయ్యి చొప్పున వేస్తూ సుజనా చౌదరి కోడ్ ఉల్లంఘించారు. అనర్హులుగా ప్రకటించాలి పశ్చిమ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసిన తెలుగుదేశం విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాధ్ (చిన్ని), విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిలను పోటీకి అనర్హులుగా ప్రకటించాలని వైఎస్సార్సీపీ నాయకులు ఆకుల శ్రీనివాస్‌కుమార్ ఓ ప్రకటనలో ఎన్నికల సంఘాన్ని కోరారు. భవానిపురం ప్రాంతంలో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు హారతుల పేరుతో డబ్బులు వేసి ఆశ చూపారన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. -
Pawan Kalyan: పక్కలో బల్లెం
పదేళ్లుగా ఆయన వెంట ఉన్నా. జనసేన కోసం ఎంతో కష్టపడ్డా. కష్టకాలంలోనూ పార్టీని వీడకుండా పని చేశా. పవన్ కల్యాణ్‌పై నమ్మకం ఉంది. సీటు గ్యారెంటీగా నాకే వస్తుంది.. టికెట్ ఆశలు సన్నగిల్లుతున్న సమయంలో అప్పటికే రెండుసార్లు పవన్‌ను కలిసిన తర్వాత కూడా జనసేన నేత పోతిన వెంకట మహేష్ మీడియా ముఖంగా భావోద్వేగంగా మాటలివి. కానీ, చివరకు ఏం మిగిలింది?.. విజయవాడ వెస్ట్ సీటును ఆఖరిగా బీజేపీ ఎగరేసుకుపోయింది. గత రెండు నెలలుగా ఏపీ రాజకీయాల్లో విజయవాడ వెస్ట్ పరిణామాలు వాడీవేడిగా సాగాయి. అప్పటికే పొత్తు ప్రకటన చేసినా.. ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేనలు ఇక్కడి సీటు తమదేనంటూ ప్రకటించుకున్నాయి. టీడీపీ నేతలు జలీల్‌ఖాన్, బుద్దా వెంకన్నలు ఎవరికివారే ఆత్మీయ సమావేశాలు, ర్యాలీలతో తమ బలప్రదర్శనలు కొనసాగించుకుంటూ వచ్చారు. అయితే.. ఈలోపే విజయవాడ వెస్ట్ సీటు ఆలోచన వదులుకోవాలని, అది జనసేనకు కేటాయిస్తామని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. మొదటిసారి.. పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ వెళ్లొచ్చనే చర్చా మొదలైంది. దీంతో జలీల్‌ఖాన్ ఒక అడుగు ముందుకేసి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు. విజయవాడ వెస్ట్ సీటును తనకు వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ టైంలో ‘చూద్దాం’ అని పవన్ జలీల్‌ఖాన్‌తో చెప్పారనే విషయం బయటకు పొక్కింది. దీంతో జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ కాస్త ఆందోళనకు లోనయ్యారు. వెంటనే పవన్ కల్యాణ్‌ను కలిశారు. పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ టికెట్‌పై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. పవన్ ఇచ్చిన భరోసాతో సీటు కచ్చితంగా తనకే వస్తుందని పాపం పోతిన మహేష్ భావించారు. రెండో జాబితాలో కచ్చితంగా తన పేరు ఉంటుందని బహిరంగంగా ప్రకటించుకున్నారు కూడా. కానీ, టీడీపీ బదులు బీజేపీ రూపంలో టికెట్ గండాన్ని.. చంద్రబాబు తెర వెనుక జరిపిన కుట్రల్ని ఆయన పసిగట్టలేకపోయారు. రెండోసారి.. కానీ ఇంతలో టీడీపీ-జనసేనతో బీజేపీ కూడా పొత్తు కూడాయి. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు తీసుకుంది. ఆ సమయంలోనే విజయవాడ వెస్ట్‌పై బీజేపీ నేతలు కన్నేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెస్ట్ సీటు తమకే కావాలని బీజేపీ పట్టింది. దీంతో పోటీ కోసం అంతా సిద్ధం చేసుకున్న మహేష్.. ఆగ్రహానికి లోనయ్యారు. మళ్లీ పవన్ కల్యాణ్‌ను కలిశారు. టికెట్‌పై ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని.. కంగారు పడొద్దంటూ పవన్ మరోసారి అభయం ఇవ్వడంతో మహేష్ మెత్తబడ్డారు. కానీ, అప్పటికే వెస్ట్ సీటుపై నిర్ణయం జరిగిపోయింది!. బీజేపీ నేత వ్యాఖ్యలతో కన్ఫర్మ్ విజయవాడ వెస్ట్ సీటు తమదే అని ప్రకటిస్తూ.. గత గురువారం నాడు బీజేపీ విజయవాడ వెస్ట్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ.. వెస్ట్ సీటు ఎవరికి కేటాయించాలనే దానిపై ఇప్పటికే చర్చలు ముగిశాయని వెల్లడించారు. పార్టీ డిసైడ్ అయిపోయిందని.. అభ్యర్థి ఎవరనేదే తేలాల్సి ఉందని ప్రకటన చేశారు. దీంతో.. మహేష్ మళ్లీ ఆందోళనకు దిగారు. అయినా నమ్మకమే! ఈసారి ఏకంగా.. తన కార్యాలయంలోనే మహేష్ ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు. ఆ సమయంలో.. ‘‘పార్టీకి విధేయుడిగా, పదేళ్లు నాకు నమ్మకస్తుడిగా ఉన్న నీకు.. విజయవాడ వెస్ట్ సీటు ఖాయం అని పవన్ కల్యాణ్ మాటిచ్చారు. తాజా సమావేశంలోనూ ఆయన అదే మాట అన్నారు. ఆయన తన మాట నిలబెట్టుకుంటారని నమ్ముతున్నా. జనసేన పార్టీ తప్ప ఎవరికీ సీటు ఇచ్చినా వైఎస్సార్సీపీతో పోటీ పడలేరు. ఒకవేళ ఇక్కడి సీటు బీజేపీకే వెళ్తే.. అది కచ్ఛితంగా వైఎస్సార్సీపీకి అనుకూలిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. ఒకవేళ పవన్ మాట నిలబెట్టుకోలేకపోతే? అనే ప్రశ్నకు.. ఒకవేళ బీజేపీ సుజనా చౌదరికే గనుక టికెట్ ఇస్తే రెబల్‌గా పోటీ చేస్తా.. అదీ పవన్ ఫొటోతోనే అని. తమ సత్తా చూపించుకునేందుకు కొత్త తరం నేతలకు కూడా అవకాశాలు దక్కాలి కదా అని వ్యాఖ్యానించారు. కానీ.. మూడోసారీ.. చివరకు విజయవాడ వెస్ట్‌లో జన సైనికుల ఆశలు అడియాశలయ్యాయి. బీజేపీ జాబితాలో టికెట్ సుజనా చౌదరికే వెళ్లింది. అయినా విజయవాడ వెస్ట్ సీటుపై పోతిన వెంకట మహేష్ పట్టువీడడం లేదు. జనసేనకు ఇవ్వాల్సిందేనంటూ ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించారు. మరోవైపు.. బీజేపీ అభ్యర్థుల ప్రకటనకు రెండ్రోజుల ముందు మూడోసారి మహేష్‌ను పిలిపించుకున్న పవన్.. బుజ్జగింపులకు దిగారు. అధికారంలోకి వస్తే కీలక పదవి ఇస్తామంటూ ఆశ పెడుతున్నారు. కానీ, మహేష్ ససేమీరా అంటున్నారు. ఇక.. ఈ విషయం తెలిసి పవన్ పై మండిపడుతున్న విజయవాడ వెస్ట్ జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్ వల్ల నిజంగా కాలేదా? కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించడం న్యాయం అని చెబుతున్న మహేష్‌కు.. పవన్ మాత్రం అన్యాయం చేశారు. అయితే.. టీడీపీ-బీజేపీల బలవంతపు పొత్తు కోసం విశ్వప్రయత్నం చేసిన పవన్.. మధ్యలో పొత్తులు, సీట్ల పంపకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తుల కోసం మధ్యవర్తిత్వం వహించడం వల్ల చాలా కోల్పోవాల్సి వచ్చిందని, పొత్తుల కోసం చాలా త్యాగాలు చేశామని చెప్పుకొచ్చారు. మరి అంతగా బాధపడిపోయిన పవన్.. పార్టీకి విధేయులుగా ఉన్నవాళ్లకు కాకుండా జంప్‌జిలానీలకు ఒకట్రెండు సీట్లు ఇచ్చిన పవన్.. విజయవాడ వెస్ట్ సీటు విషయంలో బీజేపీని ఒప్పించలేకపోయారా?.. నమ్మకంగా ఉన్న మహేష్‌కు టికెట్ ఇప్పించలేకపోయారా? అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు జనసైనికులిప్పుడు. సీటు మహేష్కేనంటూ నమ్మించి మోసం చేశారని.. పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం చేస్తూ వెన్నుపోటులో చంద్రబాబునే మించిపోయారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాబు పాచికేనా? విజయవాడ వెస్ట్ టికెట్ విషయంలో పంతం నెగ్గించుకున్న బీజేపీ.. అభ్యర్థి విషయంలో మాత్రం ‘రాజీ’ పడిందా?. వక్కల గడ్డ భాస్కరరావు, జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, బొబ్బురి శ్రీరాంలాంటి వాళ్లు పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్లు.. నమ్మకస్తులు ఉన్నా.. సుజనా చౌదరికే టికెట్ ఎందుకు ఇచ్చారు? పేర్ల పరిశీలనలో ఏం జరిగింది?.. అని బీజేపీ సీనియర్లు చర్చించుకుంటున్నారు. ఎంపీ సీట్ల విషయంలో చక్రం తిప్పిన చంద్రబాబే.. బీజేపీలో ఉన్న తన సన్నిహితుడు సుజనా చౌదరికే విజయవాడ వెస్ట్ నియోజక వర్గం టికెట్ దక్కేలా చేశారనే టాక్ బలంగా వినిపిస్తోందిప్పుడు. -
చంద్రబాబు పాచిక.. తెరపైకి సుజనా చౌదరి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ పొత్తుల కల్లోలం కుదిపేస్తోంది. ఇటు ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ వెస్ట్, అటు కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గాల్లో వర్గ విభేదాల తుపాను అతలాకుతలం చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన పది రోజుల తరువాత కూడా ఇప్పటికీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఏ పార్టీలు పోటీ చేస్తాయి? ఆ పార్టీల తరఫున అభ్యర్థులు ఎవరన్నది స్పష్టం కాకపోవడంతో టీడీపీ కూటమి గందరగోళంలో పడింది. ఇదే అదనుగా ఆ మూడు పార్టీల నేతలు తమ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి, అల్టిమేటం జారీ చేస్తున్నారు. బాబు స్కెచ్.. పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తున్నట్లుగా తొలుత చెప్పారు. దీంతో జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ తానే అభ్యర్థినంటూ ప్రచారాన్ని మొదలుపెట్టారు. కానీ ఆయనకు బీజేపీ షాక్ ఇచ్చింది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం తమకే కేటాయించాలని పట్టుబట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ నియోజక వర్గాన్ని బీజేపీకి కేటాయించడానికి సుముఖత చూపారు. మరోవైపు బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై తర్జన భర్జనలు సాగాయి. వైశ్య సామాజిక వర్గం నుంచి వక్కల గడ్డ భాస్కరరావు, బీసీ నగరాలు సామాజికవర్గం నుంచి అట్లూరి శ్రీరాం, బొబ్బురి శ్రీరాం టికెట్ల రేసులో ఉన్నామంటూ ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఇంతలో చంద్రబాబు మరోసారి తన పాచిక వేశారు. బీజేపీలో ఉన్న తన సన్నిహితుడు సుజనా చౌదరిని విజయవాడ వెస్ట్ నియోజక వర్గం నుంచి పోటీ చేయించాలని పావులు కదిపారు. సుజనా చౌదరి పోటీ చేస్తే, టీడీపీలో పోటీ చేసినట్లుగానే భావించాల్సింటుంది. ఈ పరిణామాలపై మొదటి నుంచి బీజేపీలో కొనసాగుతున్న నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి కమ్మ సామాజిక నేతలు సుజనా చౌదరి పోటీ చేస్తే ఓటమి ఖాయమని తేల్చి చెబుతున్నారు. బీజేపీలో టికెట్ల లొల్లి ఇలా కొనసాగుతుండగా, మరోవైపు జనసేన నేత పోతిన మహేష్ తనకు టికెట్ కేటాయించకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని తేల్చి చెప్పడంతో విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో కూటమి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. అవనిగడ్డలో అయోమయం.. మరోవైపు కృష్ణా జిల్లా అవనిగడ్డలో కూడా పొత్తుల పంచాయితీ తెగలేదు. అవనిగడ్డ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించాలని ఇప్పటికే నిర్ణయించారు. అయితే ఆ పార్టీ తరఫున ఎవరు పోటీచేస్తారనే దానిపై స్పష్టత కొరవడింది. ఇటీవల జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి, జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, కాంట్రాక్టర్ వికృతి శ్రీను, టికెట్ కోసం పోటీ పడుతున్నారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పష్టత ఇవ్వకపోవడంతో ఆ పార్టీలో అయోమయం నెలకొంది. మరోవైపు కొత్తగా పార్టీలో చేరబోయే నేతకు అవనిగడ్డ నియోజక వర్గాన్ని కేటాయిస్తారనే ప్రచారం ఊపందుకొంది. ఇదిలా ఉండగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్ తాజాగా పార్టీపై ధ్వజం ఎత్తారు. అవనిగడ్డ నియోజక వర్గాన్ని జనసేనకు కేటాయిస్తే సహించేది లేదని ఆయన వర్గీయులు స్పష్టం చేశారు. టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారని కూడా తేల్చి చెప్పారు. ఈ పరిణామాలతో అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన, టీడీపీల మధ్య పీటముడి మరింత బిగుసుకుంది. ఈ పరిణామాలతో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి కుదేలు కావడం ఖాయమన్నది తేలిపోయింది. -
ఏలూరు ఎంపీ సీటుపై బీజేపీలో రగులుతున్న అసంతృప్తి
-
Sujana : మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు
సాక్షి, అమరావతి: సుజనా చౌదరికి చెందిన మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపును నేషనల్ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ నిలిపివేస్తున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘన్‌పూర్‌లోని మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట సుజనా చౌదరీ ఈ కాలేజీ ఏర్పాటు చేశారు. 2002లో ఏర్పాటు చేసిన ఈ కాలేజీ కింద ఏటా వంద మెడికల్ అడ్మిషన్లు యూనివర్సిటీ కౌన్సిలింగ్ ద్వారా కేటాయించేవారు. ఫిబ్రవరి 2017 నుంచి సీట్ల సంఖ్య 150కి పెరిగింది. ఈ కాలేజీ పలు అక్రమాలకు పాల్పడినట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) గుర్తించింది. 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ మెడికల్ కాలేజీని 2001-02లో నిర్మించగా 2012-13 విద్యా సంవత్సరం నుంచి ఈ కాలేజీలో మెడికల్ ఆడ్మిషన్లకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతించింది. ప్రస్తుతం ఈ కాలేజీలో 750 మంది MBBS విద్యార్థులు, 150 మంది PG విద్యార్థులు ఉన్నారు. మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉన్న ఆస్పత్రికి రోజూ ఔట్ పేషేంట్లు వస్తారు. ఆస్పత్రిలో 13 డిపార్ట్ మెంట్లు ఉన్నాయి. ప్రతీ ఏటా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని నేషనల్ మెడికల్ కమిషన్ వివిధ మెడికల్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంది. ఈ తనిఖీల్లో భాగంగా కాలేజీల్లో మౌలిక సదుపాయాలు సరిగా ఉన్నాయా? విద్యార్థుల సంఖ్యకు సరిపడా అధ్యాపకులు ఉన్నారా? కాలేజీల్లో ఉన్న టీచింగ్ ఆస్పత్రులకు పేషేంట్లు వస్తున్నారా? అన్న విషయాలను నేషనల్ మెడికల్ కమిషన్ టీం పరిశీలించింది. సుజనాకు సంబంధించిన ఈ మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పలు ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా మేనేజ్ మెంట్ వ్యవహరిస్తున్నట్టు తేలింది. దీంతో MCI ఈ కాలేజీకి నోటీసులిచ్చినట్టు తెలిసింది. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో కాలేజీ గుర్తింపు రద్దు చేసినట్టు సమాచారం. చదవండి: కీలక పరిణామం.. భారీగా ‘మార్గదర్శి’ చరాస్తుల జప్తు! -
Sujana Chowdary: చెన్నై ఈడీ కోర్టుకు మాజీ ఎంపీ సుజనాచౌదరి
సాక్షి, చెన్నై: బ్యాంక్‌లను మోసం చేసిన కేసులో మాజీ ఎంపీ, బీజేపీ నేత సుజనాచౌదరి శుక్రవారం చెన్నైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టుకు హాజరయ్యారు. 20 నిమిషాల విచారణ అనంతరం ఆయన కోర్టు నుంచి వెళ్లిపోయారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ల నుంచి తన సంస్థలకు రుణాలు పొందేందుకు సుజనాచౌదరి అడ్డదారులు తొక్కినట్లు వచ్చిన ఆరోపణలతో గతంలో ఈడీ రంగంలోకి దిగింది. ఆయన రూ.400 కోట్ల మేరకు బ్యాంకులను మోసం చేసినట్లు బెంగళూరులోని ఆర్థికనేరాల పరిశోధన విభాగం కేసు నమోదు చేసింది. ఈ కేసు చెన్నై జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ఈడీ కోర్టులో విచారణలో ఉంది. గతంలో ఇదే కోర్టు విచారణకు సుజనాహాజరు కావడం, ఈ కేసులో అరెస్టు, క్షణాల్లో బెయిల్ వ్యవహారాలు జరిగిపోవడం వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కోర్టు సమన్ల మేరకు శుక్రవారం 11 గంటల సమయంలో మళ్లీ అదే కోర్టు విచారణకు సుజనాచౌదరి హాజరయ్యారు. తన న్యాయవాదులు, ముఖ్య సన్నిహితులతో కలిసి కోర్టులోకి వెళ్లారు. 20 నిమిషాల పాటు కోర్టు న్యాయాధికారి అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చినట్టు సమాచారం. అనంతరం ఆగమేఘాలపై బయటకు వచ్చి కారులో వెళ్లిపోయారు. ఈ సమయంలో కొందరు మీడియా ప్రతినిధులు ఆయన ఫొటోలు, వీడియో చిత్రీకరించే యత్నం చేయగా తన చేతులను అడ్డుపెట్టుకున్నారు. ఆయన్ను ప్రశ్నించే యత్నం చేయగా.. మౌనంగా వెళ్లిపోయారు. -
చెన్నై ఆర్థిక నేరాల విభాగం కోర్టుకు సుజనా చౌదరి
-
ఇలాంటి సమయంలో కూడా టీడీపీ దిగజారుడు రాజకీయాలు మానట్లేదు: ఎమ్మెల్యే పార్థసారధి
-
బీజేపీలో దొరికిపోయిన టీడీపీ ఎంపీలు
-
గుట్టుగా కోర్టుకు సుజనా
సాక్షి ప్రతినిధి, చెన్నై: మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో భారతీయ జనతా పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి కోర్టుకు హాజరయ్యారు. తప్పుడు పత్రాలను సమర్పించి బ్యాంకుల నుంచి వందలకోట్ల రూపాయలను రుణాలుగా పొంది ఎగవేయడంతో ఈడీ ఈ కేసు నమోదు చేసింది. చెన్నై జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న ప్రజాప్రతినిధుల కోర్టుకు సుజనా చౌదరి శనివారం ఉదయం 11.10 గంటలకు న్యాయవాదులు, మరికొందరితో కలిసి వచ్చారు. ఈ కేసులో ఆయన ఆరో నిందితునిగా ఉన్నారు. గతంలో ఇదే కేసులో ఆయన వివిధ కారణాలతో దాదాపు పలుమార్లు విచారణకు గైర్హాజరయ్యారు. తాజాగా అక్టోబర్ 29న చెన్నైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టుకు సుజనా హాజరుకావాల్సి ఉండగా.. ఆ రోజు కూడా ఆయన రాలేదు. శనివారం మందీ మార్బలంతో ఆయన కోర్టుకు చేరుకున్నారు. ఉదయం సుమారు 11.20 నిమిషాలకు లోనికి వెళ్లిన ఆయన మధ్యాహ్నం 12.45 గంటలకు బయటకు వచ్చారు. ప్రత్యేక అనుమతితో అత్యంత గోప్యంగా ఢిల్లీ నుంచి వచ్చిన సుజనాకు ఈ కేసులో వెనువెంటనే బెయిల్ మంజూరయినట్లు తెలిసింది. దౌర్జన్యంగా వీడియో దృశ్యాల తొలగింపు కాగా సుజనాచౌదరి కోర్టు మొదటి అంతస్తులోకి న్యాయవాదులతో కలిసి వస్తున్న దృశ్యాలను ‘సాక్షి’ ప్రతినిధి సెల్ఫోన్లో వీడియో తీశారు. ఈ విషయాన్ని పసిగట్టిన సుజనా వాటిని తొలగించాల్సిందిగా న్యాయవాదులను పురమాయించారు. నలుగురు న్యాయవాదులు సాక్షి ప్రతినిధిని చుట్టుముట్టి సెల్ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలను తొలగించాల్సిందిగా కోరారు. మీ విధులు మీరు నిర్వర్తిస్తున్నట్లే.. నా విధులు నిర్వర్తించడం నా కర్తవ్యం, అడ్డుకునే హక్కు మీకు లేదని విలేకరి వాదించినా వినిపించుకోలేదు. దౌర్జన్యంగా సెల్‌ఫోన్‌ను లాక్కుని మరీ వీడియోను డిలీట్ చేశారు. -
సుజనా చౌదరిని వదిలేదే లేదంటున్న సిబిఐ
-
సుజనా విదేశీ పర్యటన.. బ్యాంకింగ్ వర్గాల ఆందోళన
సాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకుని పారిపోయిన విజయ్‌మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ బాటలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి విదేశాలకు వెళ్తుండటంపై బ్యాంకింగ్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే విజయ్‌మాల్యా, నీరవ్ మోదీ, చోక్సీలు రుణాలు ఎగ్గొటి విదేశాల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న విధంగానే సుజనా చేయనున్నాడా అన్నదే వారి ఆందోళనకు కారణం. ప్రజలు డిపాజిట్ల రూపంలో దాచుకున్న సొమ్మును ఎగ్గొట్టిన వారిపై వేగంగా చర్యలు తీసుకోకుండా అమెరికా పర్యటనకు అనుమతించడాన్ని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి బీఎస్ రాంబాబు తీవ్రంగా తప్పుబట్టారు. సుజనా చౌదరిని జూలై 12 నుంచి ఆగస్టు 11 వరకు అమెరికా పర్యటనకు అనుమతిస్తూ తెలంగాణ హైకోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. డొల్ల కంపెనీలకు రూ.5,700 కోట్లు బ్యాంకుల నుంచి సుజనా గ్రూపు రూ.5,700 కోట్ల రుణాలు తీసుకుని ఆ మొత్తాన్ని డొల్ల కంపెనీల ద్వారా మనీల్యాండరింగ్ విధానంలో నగదును తరలించినట్లు సీబీఐ స్వయంగా చార్జీషీటులో నమోదు చేయడమే కాక ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలియజేసింది. సుజనా సంస్థల్లో జరిపిన సోదాల్లో 126 సూట్‌కేస్ కంపెనీలకు చెందిన ఒరిజనల్ పాన్‌కార్డులు, 278 రబ్బర్ స్టాంపులు, ఖాళీ లెటర్‌హెడ్స్‌తోపాటు కీలక డాక్యుమెంట్లు లభించాయని తెలిపింది. వీటిని పరిశీలిస్తే ఇక్కడ నుంచే బినామీ కంపెనీల లావాదేవీలను నిర్వహించనట్లు ప్రాథమికంగా నిర్థారణ అయ్యిందని సీబీఐ స్పష్టంచేసింది. అంతేకాక.. కేసు విచారణలో భాగంగా సుజనా చౌదరికి 2019లో నోటీసులు జారీచేయగా దర్యాప్తునకు సహకరించడంలేదని కూడా కోర్టుకు తెలిపింది. -
‘సుజనా’ సహకరించలేదు.. హైకోర్టుకు తెలిపిన సీబీఐ
సాక్షి, హైదరాబాద్: సుజనా గ్రూపు కంపెనీలు అనేక బ్యాంకుల నుంచి దాదాపు రూ.5 వేల కోట్ల అక్రమ రుణాలు తీసుకుని అనేక షెల్ కంపెనీలకు తరలించాయంటూ హైకోర్టుకు సీబీఐ నివేదించింది. కేసు విచారణలో భాగంగా సుజనా గ్రూపు కంపెనీల చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వై.సుజనాచౌదరికి 2019లో నోటీసులు జారీ చేయగా రెండు పర్యాయాలు హాజరైనా దర్యాప్తు అధికారి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని పేర్కొంది. సుజనా గ్రూప్ కంపెనీల్లో సోదాలు జరపగా అనేక ఒరిజినల్ పాన్‌కార్డులు, 278 రబ్బర్ స్టాంపులు, ఖాళీ లెటర్‌హెడ్స్‌తోపాటు కీలక డాక్యుమెంట్లు లభించాయని తెలిపింది. వీటిని పరిశీలిస్తే అనేక బినామీ, డమ్మీ కంపెనీలను ఇక్కడి నుంచే నడిపిస్తున్నట్లుగా ప్రాథమికంగా తేలిందని పేర్కొంది. సుజనాచౌదరి ఇంటిలోనూ బ్యాంకు రుణాల కీలక సమాచారం లభించిందని తెలిపింది. సీబీఐ అధికారులు తనకు లుక్ఔట్ సర్క్యులర్ (ఎల్వోసీ) జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ సుజనాచౌదరి గతేడాది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసింది. ఓ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన మధ్యం తర పిటిషన్‌ను న్యాయమూర్తి ఇటీవల విచారించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ ఈ నెల 12 నుంచి ఆగస్టు 11 వరకు సుజనాచౌదరి అమెరికాలో పర్యటించేందుకు అనుమతినిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అనేక అక్రమాలు వెలుగుచూశాయి... ‘బెస్ట్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్టు లిమిటెడ్ అనే క అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాల ను బట్టి తెలుస్తోంది. సుజనాచౌదరికి అమెరికా తోపాటు అనేక దేశాల్లో సబ్సిడరీ కంపెనీలున్నాయి. వీరికి చెందిన షెల్ కంపెనీలు అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యం లో ఆయన అమెరికా వెళ్లేందుకు అనుమతిస్తే అక్క డి కంపెనీల ప్రతినిధులను కలిసేందుకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఎఫ్ఐఆర్లో తన పేరు లేదు కాబట్టి ఈ కేసుతో నాకు సంబంధం లేదని సుజనా అనడానికి వీల్లేదు. ఎఫ్ఐఆర్లో అన్ని వివరాలు ఉండాల్సిన అవసరం లేదు. మరిన్ని ఆధారాలు సేకరించిన తర్వాత మరోసారి విచారించాల్సి ఉం ది. ఈ దశలో అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇస్తే దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలిగే అవకాశముంది’ అని సీబీఐ వివరించింది. అయితే ఆయన అమెరికాకు వెళ్లేందుకు న్యాయమూర్తి అనుమతిస్తూ తిరిగి వచ్చిన వెంటనే సీబీఐ అధికారులకు సమాచారం ఇవ్వాలని సుజనాను ఆదేశించారు. తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేశారు. -
హైకోర్టును ఆశ్రయించిన కేంద్ర మాజీ కేంద్ర మంత్రి
సాక్షి, అమరావతి: లుక్ అవుట్ నోటీసుల నేపథ్యంలో తాను అమెరికాకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. జులై రెండోవారంలో జరుగబోయే ఓ సదస్సుకు హాజరయ్యేందుకు తాను అక్కడికి వెళ్లాల్సి ఉందని, అందుకే తన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే సుజనా చేసిన అపీల్‌ను కోర్టు తోసిపుచ్చింది. అమెరికా నుంచి అందిన ఆహ్వానం సమర్పించకుండా అత్యవసర విచారణ ఎలా చేపడతారని మందలించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను జులై 7కి వాయిదా వేసింది. మరోవైపు బెస్ట్ అండ్ క్రాంప్టన్ కేసులో సుజనాకు జారీ చేసిన సీబీఐ నోటీసులపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసు విషయమై అవసరమైతే మళ్లీ పిలుస్తామని న్యాయస్థానం పేర్కొంది. -
సుజనాకు చెన్నై కోర్టు సమన్లు
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరికి మనీ ల్యాండరింగ్ చట్టం కింద చెన్నై కోర్టు నోటీసులు జారీ చేసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రూ.133 కోట్లు, ఆంధ్రా బ్యాంక్‌ను రూ.71 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకును రూ.159 కోట్లు.. మొత్తం రూ.363 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఈనెల 12న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (బీసీఈపీఎల్) డైరెక్టర్లు, ఆయన నేతృత్వంలోని పలు కంపెనీలకు కూడా నోటీసులు జారీ చేసింది. సుజనా .. అక్రమాల ఖజానా సుజనా చౌదరి ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్వహిస్తున్న వాటిలో బీసీఈపీఎల్, సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్, సుజనా మెటల్ ప్రొడక్డ్, సుజనా టవర్స్ వంటి లిస్టెడ్ కంపెనీలతో పాటు మరో 126 ఇతర కంపెనీలు ఉన్నాయి. బార్టోనిక్స్ కూడా లిస్టెడ్ కంపెనీయే. సుజనా నేతృత్వంలోని ఎనిమిది కంపెనీలు (సుజనా యూనివర్శల్, సుజనా మెటల్ ప్రొడక్ట్స్, సుజనా టవర్స్, విజయ్ హోం అప్లయన్సెస్, బార్టోనిక్స్, మెడ్‌సిటీ, లక్ష్మీగాయత్రి, బెస్ట్ అండ్ క్రాంప్టన్) తప్ప మిగిలినవన్నీ షెల్ (డొల్ల) కంపెనీలే. ఇవి సర్క్యులర్ ట్రేడింగ్, బుక్ బిల్డింగ్, మనీ లాండరింగ్, పన్ను ఎగవేత వంటి అక్రమ కార్యకలాపాలలో దిట్టలు. ఆ సంస్థల్లో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపించి సుజనా గ్రూపు సంస్థలు వివిధ జాతీయ, ప్రైవేటు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి మొత్తం రూ.5,700 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నాయి. అయితే సుజనా చౌదరి సంస్థల ఆస్తుల విలువ రూ.132 కోట్లకు మించదనే సమాచారంతో ఈ గ్రూపు కంపెనీల (లిస్టెడ్ కంపెనీలు) వాటాలను కొన్న షేర్ హోల్డర్లు భారీగా నష్టపోయారు. సీబీఐ విచారణలో సుజానా దోపిడీ రట్టు డొల్ల కంపెనీల పేర్లతో రుణం తీసుకుని చెల్లించకుండా మోసం చేశారంటూ సుజనా చౌదరిపై బెంగళూరులోని సీబీఐ కార్యాలయంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ల నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం ఫిర్యాదు చేసింది. కాగితంపై మాత్రమే కన్పించే పరిశ్రమల్లో చేయని ఉత్పత్తిని చేసినట్లు చూపి, భారీగా పన్నులు చెల్లిస్తున్నట్లు చూపి పలు బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న సుజానా చౌదరి వాటిని సూట్ కేసు కంపెనీల ద్వారా దారిమళ్లించి దోచేశారని సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుజనా చౌదరి కంపెనీల కేసు నమోదు చేసి విచారణ చేసింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో సుజానా చౌదరికి చెందిన కంపెనీలు, ఇళ్లు, ఆయా సంస్థల డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఒక్క హైదరాబాద్ నాగార్జున హిల్స్‌లోని సుజానా చౌదరి ఇంట్లోనే 126 సూట్ కేసు కంపెనీలకు సంబంధించిన రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. బ్యాంకులను మోసం చేసి తీసుకున్న రుణాన్ని సూట్ కేసు కంపెనీల ద్వారా దారిమళ్లించి మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ తేల్చింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ల బ్యాంకుల నుంచే రూ.363 కోట్లు కొల్లగొట్టి మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు తేల్చి.. చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును విచారణకు చేపట్టిన చెన్నై కోర్టు.. సుజనా చౌదరి, ఆ సంస్థల డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. బ్యాంకులను కొల్లగొట్టడంలో ఘనుడు ► సుజనా గ్రూపునకు చెందిన రెండు ప్రధాన కంపెనీలు (సుజనా యూనివర్శల్, సుజనా టవర్స్) కలిపి రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా)కు రూ.920 కోట్లు మేర రుణాలు ఎగవేశాయి. ► సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన హెస్టియా హోల్డింగ్స్ లిమిటెడ్, నువాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థలు మారిషస్ కమర్షియల్ బ్యాంకు నుంచి రూ.107 కోట్లు రుణం తీసుకుని చెల్లించకుండా బోర్డు తిప్పేశాయి. ఈ రుణానికి, సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ భారతదేశంలోని ఆ సంస్థలకు రుణాలు ఇచ్చిన బ్యాంకుల కన్సార్షియంకు సమాచారం ఇవ్వకుండానే కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చింది. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మారిషస్ కమర్షియల్ బ్యాంకు పిటిషన్ దాఖలు చేసింది. ► బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్టŠస్ లిమిటెడ్ పేరుతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.304 కోట్ల రుణం తీసుకోవడానికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సుజానా గ్రూపు సమర్పించడంపై సీబీఐకి ఆ బ్యాంకు తాజాగా ఫిర్యాదు చేసింది. ► సుజానా గ్రూపు సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, కస్ట్‌మ్స్, ఇన్కమ్ ట్యాక్సుల రూపంలో రూ.962 కోట్లు ఎగ్గొట్టడంపై కేసుల విచారణ వివిధ దశల్లో ఉంది. దోపిడీ సొమ్ముతో భారీగా భూముల కొనుగోలు బ్యాంకుల నుంచి దోచేసిన సొమ్ముతో దేశ, విదేశాల్లో సుజానా చౌదరి భారీ ఎత్తున ఆస్తులు పోగేశారు. చంద్రబాబుకు సయామీ కవల అయిన సుజనా చౌదరి 2014లో రాజధానిపై ప్రకటన వెలువడక ముందే.. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా సీఆర్డీఏ పరిధిలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారు. బ్యాంకులను దోచేసిన సొమ్ముతోనే సుజానా ఈ ఆస్తులను కొన్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. సుజనా చౌదరి ఏర్పాటు చేసిన 126 కంపెనీల్లో ఒకటైన శివసత్య పిగ్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సీఆర్డీఏ పరిధిలోని చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో సర్వే నంబర్లు 432–1, 403–5, 433, 434, 402–1ఏ, 429, 428, 412, 410–2, 427–2, 413, 415, 416, 431, 437, 399–7, 404–11, 407–4లలో 110.6 ఎకరాల భూమిని రైతుల నుంచి తక్కువ ధరకు ఎకరం రూ.5 లక్షల చొప్పున కొనుగోలు చేస్తూ అగ్రిమెంట్ చేసుకున్నారు. 2018లో తన సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సోదరుడు యలమంచిలి జతిన్ కుమార్ పేరుతో ఏర్పాటు చేసిన శివజ్యోతి ఫ్లైకాన్ బ్లాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సర్వే నంబర్లు 404–1, 404–5, 404–6లో 11.56 ఎకరాలను ఎకరం రూ.5 లక్షల చొప్పున కొనుగోలు చేసి 2014లోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కుటుంబ సభ్యులు, షెల్ కంపెనీల పేర్లతో రాజధాని ప్రాంతంలో 623.12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు ఈడీ నిగ్గు తేల్చడం గమనార్హం. ఈ అక్రమాల నుంచి బయటపడేందుకే చంద్రబాబు సూచనల మేరకు బీజేపీలో సుజానా చేరారనే అనుమానాలు ఉన్నాయి. -
సుజనా చౌదరికి ఈడీ నోటీసులు
న్యూఢిల్లీ: బ్యాంకుల వద్ద రుణాలను తీసుకుని చెల్లించకుండా మోసం చేసిన కేసులో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనా చౌదరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12వ తేదీన విచారణకు హాజరుకావాలని సుజనాకు ఈడీ నోటీసులు అందించింది. డొల్ల కంపెనీలతో సుజనా రూ.కోట్లు కొల్లగొట్టినట్టు అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. రూ.5,700 కోట్ల మేర బ్యాంకులను మోసం చేశారనే అభియోగాలపై ఈడీ కేసులు నమోదు చేసింది. కేంద్రమంత్రిగా ఉన్న సమయంలోనే సుజనా అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయి. ఇప్పటికే ఆయనపై మూడు ఎఫ్ఐఆర్లు సీబీఐ నమోదు చేసింది. వీటి ఆధారంగా 2018లో సుజనాపై ఈడీ సోదాలు జరిపింది. 126 షెల్ కంపెనీలు సృష్టించి సుజనా రూ.కోట్లు కొల్లగొట్టినట్టు ఆధారాలు సేకరించింది. వాటిలో సెంట్రల్ బ్యాంకును రూ.133 కోట్లు, ఆంధ్రా బ్యాంకును రూ.71 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకుకు రూ.159 కోట్లు సుజనా మోసం చేసినట్టు అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈనెల 12వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ కేసులు విచారిస్తున్న చెన్నెలోని సెషన్స్ కోర్టు నోటీసులు పంపించింది. -
నేను తెలుగు ప్రజల కజిన్‌ను: కేంద్ర మాజీ మంత్రి
హైదరాబాద్: తాను తెలుగు ప్రజలకు కజిన్ అని.. ఇక్కడ నుంచి తనకు రాజ్యసభ సీటు లభించింది అని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సురేశ్ ప్రభు గుర్తుచేసుకున్నారు. విశాఖ జోన్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం ప్రకటించామని, దీనిపై ఎంపీలు పరిశీలిస్తున్నారని తెలిపారు. పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ప్రజల పన్నులతోనే నడుస్తాయని అన్నారు. ప్రైవేటైజేషన్ అంటే షేర్ హోల్డర్స్‌కు మంచి లాభాలు ఇవ్వడానికేనని వివరించారు. స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుందని ప్రకటించారు. ప్రాణాలు అర్పించి కార్మాగారం తెచ్చారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన బీజేపీ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ చరిత్రలో 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రాత్మకమని.. రెండంకెల వృద్ధి సాధ్యమని సురేశ్ ప్రభు తెలిపారు. బడ్జెట్ కరోనా కారణంగా వచ్చిన ఇబ్బంది ఎప్పుడూ రాలేదని గుర్తుచేశారు. ఈయూ, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలపై కరోనా ప్రభావం చూపిందని చెప్పారు. వృద్ధి రేటు కూడా తగ్గిందని.. ఈ బడ్జెట్ కొత్త వేవ్ తీసుకుని వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి వస్తుంది అని భావిస్తున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం రెండింతలు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రూ.16.57లక్షల కోట్లు వ్యవసాయానికి కేటాయించారని వెల్లడించారు. సూక్ష్మ సేద్యం కోసం, ఈనామ్ ద్వారా మార్కెట్ సదుపాయాలు పెంచారని సురేష్ ప్రభు చెప్పుకొచ్చారు. రక్షణకు తాము మొదటి నుంచి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. చర్చల ద్వారానే రైతు సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఒకే మార్కెట్ దేశంలో రైతులకు ఉపయోగమని, ప్రభుత్వం వారితో చర్చించేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. రైతులకు తాము వ్యతిరేకం కాదని.. వారిని గౌరవిస్తామని సురేశ్ ప్రభు పేర్కొన్నారు. -
సుజనా, మురళీ మోహన్ ఆశీస్సులు తీసుకోలేదా?
సాక్షి, విజయవాడ : ప్రతి అంశాన్ని టీడీపీ, ఎల్లో మీడియా రాజకీయం చేయాలని చూస్తోందని బ్రాహ్మణ కార్పొరేట్ చైర్మన్, ఎమ్యెల్యే మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అన్ని మఠాలు, స్వామిజీలను ప్రభుత్వం గౌరవిస్తుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నాం. స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినాన్ని కూడా టీడీపీ రాజకీయం చేస్తోంది. 2016లో స్వరూపానందేంద్ర జన్మదిన వేడుకలపై గత టీడీపీ ప్రభుత్వం సర్య్కులర్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం అలాగే లేఖ రాసింది. మఠాలు, స్వామిజీల అంశాలను కూడా టీడీపీ రాజకీయం చేయాలని చూస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఒకలా.. అధికారం లేనప్పుడు మరోలా వ్యవహరిస్తోంది. (చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదు: మల్లాది) మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టాలని టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి పనిచేసే ప్రభుత్వం మాది. గత టీడీపీ ప్రభుత్వం చేసినప్పుడు.. మేం చేస్తే తప్పు ఎలా అవుతుంది?. బూట్లు వేసుకుని పూజలు చేసిన చరిత్ర టీడీపీ నేతలది. యనమల రామకృష్ణుడు దిగజారి మాట్లుడుతున్నారు. గతంలో యనమల రామకృష్ణుడు స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారా లేదా? అప్పట్లో శారదా పీఠం వెళ్లి సుజనా చౌదరి, మురళీ మోహన్ స్వామిజీ ఆశీస్సులు తీసుకోలేదా?. చంద్రబాబు డైరెక్షన్లో సీపీఐ రామకృష్ణ మాట్లాడుతున్నారు. స్వామీజీలకు పార్టీలతో సంబంధం ఉండదు. వారికి రాజకీయాలు అంటగట్టడం సమంజం కాదు. వరుస ఓటములతో యనమలకు బుద్ధి మందగించింది. యనమల రామకృష్ణుడు ప్రెస్ నోట్లకే పరిమితం అయ్యారు. తెలంగాణా లో ఆ రాష్ట్ర ప్రభుత్వం వందల ఎకరాలు శారదా పీఠంకు రాసిచ్చింది. మేం అలా రాసి ఇవ్వలేదు. మా ప్రభుత్వం హిందూ ధర్మాన్ని కాపాడుతోంది. హిందూ ధర్మాన్ని శారదా పీఠం అధినేత స్వరూపానంద సరస్వతి కాపాడుతున్నారు. స్వామీజీలు ఆయా రాజకీయ పార్టీల కండువాలు కప్పుకోవడం వారి ఇష్టం.’ అని అన్నారు. -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సుజనా అడ్డగింత
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మాజీ నేత (ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు), రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరిని (సుజనా చౌదరి) ఢిల్లీలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. గురువారం ఆయన అమెరికా వెళ్తుండగా... ఆయనపై ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయి ఉన్న కారణంగా అధికారులు నిలిపేసి... దేశం దాటి వెళ్లకూడదంటూ వెనక్కి పంపేశారు. నిజానికి బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజినీరింగ్ సంస్థకు సంబంధించి జరిగిన ఫ్రాడ్ వ్యవహారంలో 2016 ఏప్రిల్ 27న సుజనా చౌదరిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఆ తరవాత విచారణ జరుగుతూ వస్తోంది. ఇందులో భాగంగా ఆయన దేశం దాటి వెళ్లిపోకుండా గత ఏడాది జూన్ 18న సీబీఐ లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. రకరకాల డొల్ల కంపెనీలను పెట్టి, లేని టర్నోవర్‌ను చూపించి... వాటి ఆధారంగా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని, దాదాపు 10వేల కోట్లు ఎగ్గొట్టిన వ్యవహారంలోనూ సుజనా నిందితుడు. తమకు అప్పు ఎగవేశారంటూ గతంలో మారిషస్ బ్యాంకు ఏకంగా ఇండియాకు వచ్చి మరీ ఇక్కడ కేసు దాఖలు చేసింది. కోర్టులో పిటిషన్; అనుమతి మంజూరు ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్న నేపథ్యంలో తనను అమెరికా వెళ్లేందుకు అనుమతించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన సుజనా చౌదరికి అక్కడ ఊరట లభించింది. అమెరికా వెళ్లేందుకు అనుమతిస్తూనే... భారత్‌కు తిరిగి వచ్చే తేదీని సీబీఐకి ఇవ్వాలని, భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత సీబీఐకి సమాచారం అందించాలని షరతు విధించింది. న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికాలోని సుజనాచౌదరి బంధువు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ఆయన్ను చూసేందుకు వెళుతున్నారు కనుక అనుమతించాలంటూ సుజనా తరఫున సీనియర్ న్యాయవాది మాథూర్ హౌస్ మోషన్ దాఖలు చేసి వాదనలు వినిపించారు. గతేడాది జూన్ 18న సీబీఐ లుక్ఔట్ నోటీసులు జారీచేసిందని, దీని గడువు ఏడాది మాత్రమేనని మాథూర్ తెలిపారు. అయితే దీని గడువును మరో ఏడాది పొడిగించామని సీబీఐ స్పెషల్ పీపీ సురేందర్ చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్నాక న్యాయమూర్తి అనుమతి మంజూరు చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. -
ఎంపీ సుజనా చౌదరికి షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి అధికారులు షాకిచ్చారు. బ్యాంక్ కుంభకోణం కేసులో అతనిపై లుక్అవుట్ నోటీసులు జారీచేశారు. దీంతో అమెరికాకు బయలుదేరిన సుజనాను శుక్రవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. లుక్ అవుట్ నోటీసుల ఆధారంగా ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని నిలిపివేశారు. మరోవైపు తాజా నోటీసులపై ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనను అక్రమంగా అడ్డుకున్నారని, లుక్ఔట్ నోటీసులు రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.322.03 కోట్ల రుణం ఎగవేతకు పాల్పడ్డ విషయం తెలిసిందే. వడ్డీతో కలిపి రూ.400.84 కోట్లకు చేరుకోవడంతో వేలానికి నోటీసు ఇచ్చింది. తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా సుజనా చౌదరి స్పందించకపోవడంతో తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకు సిద్ధమైంది. సుజనా చౌదరిపై 2018లోనే మూడు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. 2018లో సుజనా ఆస్తులను బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలానికి పెట్టింది. ఈ క్రమంలోనే ఫెరారీ, బెంజ్ కార్లను స్వాధీనం చేసుకుంది. ఫిబ్రవరిలో సుజనా కార్యాలయాలపై సీబీఐ దాడులు సైతం నిర్వహించింది. హైకోర్టులో సుజనాపై మారిషస్ బ్యాంకులు పిటిషన్ దాఖలు చేశారు. అలాగే షెల్ కంపెనీల ద్వారా మనీ ల్యాండరింగ్ చేసినట్టు అభియోగాలు కూడా ఉన్నాయి. (వేలానికి సుజనా చౌదరి ఆస్తులు) సుజనా చౌదరి ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్వహిస్తున్న వాటిలో సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్, సుజనా మెటల్ ప్రొడక్ట్, సుజనా టవర్స్ లాంటి లిస్టెడ్ కంపెనీలతోపాటు మరో 102 ఇతర కంపెనీలున్నాయి. సుజనా పరోక్షంగా నడిపించే బార్ర్‌టోనిక్స్ కూడా లిస్టెడ్ కంపెనీయే. మరో 4 కంపెనీలు (విజయ్ హోం అప్లయన్సెస్, మెడ్‌సిటీ, లక్ష్మీగాయత్రి, బెస్ట్ అండ్ కాంప్ట్రాన్) మినహా మిగిలినవన్నీ షెల్ కంపెనీలే. ఇవి సర్క్యులర్ ట్రేడింగ్, బుక్ బిల్డింగ్, మనీ ల్యాండరింగ్, పన్ను ఎగవేత కార్యకలాపాలలో దిట్ట. సుజనా గ్రూపు సంస్థలు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.8,000 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నాయి. అయితే సుజనా సంస్థల ఆస్తుల విలువ రూ.132 కోట్లకు మించదని చెబుతున్నారు. -
సుజనాకు ఝలక్ ఇచ్చిన ఏపీ బీజేపీ
-
సుజనాకు ఝలక్ ఇచ్చిన ఏపీ బీజేపీ
సాక్షి, విజయవాడ/న్యూఢిల్లీ : రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఏపీ బీజేపీ గట్టి ఝలక్ ఇచ్చింది. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది. రాజధాని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమన్న సుజనా చౌదరి వ్యాఖ్యలు పార్టీ వైఖరికి విరుద్ధమని తెలిపింది. సుజనాచౌదరి వెల్లడించిన అభిప్రాయాలకు పార్టీకి సంబంధం లేదని పేర్కొంది. రాజధానిపై కేంద్రం సరైన సమయంలో స్పందిస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని.. పార్టీ అభిప్రాయాన్ని ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారని ట్విటర్లో పేర్కొంది.(కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు) ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ వెళ్లిన సోము వీర్రాజు.. పార్టీ నాయకులును కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు పార్టీ ఎజెండా, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. పార్టీలో భిన్న స్వరాలను గట్టిగా హ్యాండిల్ చేస్తామని తేల్చిచెప్పారు. బీజేపీ నేతలు తనకు దగ్గరవుతున్నారంటూ చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇస్తున్నారని, ఇదంతా ఆయన ఆడే రాజకీయ చదరంగమని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆటలో తాము సైతం కొత్త ఎత్తుగడలు వేస్తామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనా విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతంగా ముందుకు తీసుకెళతామని ప్రకటించారు.(సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తా) -
‘పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం దారుణం’
సాక్షి, తిరుపతి: రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అనైతిక కార్యక్రమాలకు పాల్పడటం దారుణమని ఏపీఐఐసీ చైర్పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌లతో.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కలవడం వెనుక కుట్ర ఉందని రోజా విమర్శించారు. దీనిని ఎల్లో మీడియా ఎందుకు ప్రశ్నించలేదని ఆమె నిలదీశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన పత్రికలో ఇలాంటి వార్తలు రాయరని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోయాలని ఎల్లోమీడియా చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాదరణ ఉన్న ప్రభుత్వాన్ని ఎన్ని కుట్రలు చేసినా ఏమీ చేయలేవన్నారు. కాపులకు కొండంత అండగా సీఎం జగన్ ఉన్నారని, చంద్రబాబులో మార్పు రాకపోతే వచ్చే ఎన్నికల్లో మూడు సీట్లు కూడా రావని ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. (‘వైఎస్సార్ యాప్’ను ప్రారంభించిన సీఎం జగన్) -
వర్ల ఎందుకు భుజాలపై ఎత్తుకున్నారు?
సాక్షి, అమరావతి : రాజకీయ నాయకులతో రహస్య భేటీలు జరిపే ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నిష్పక్షపాతంగా ఎలా ఉంటారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సన్నిహితులుగా ముద్రపడ్డ బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లతో రహస్యంగా భేటీ కావడం పెద్ద ఎత్తున అనుమానాలకు తావిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ట్విటర్ వేదికగా ఈ భేటీపై స్పందించిన సజ్జల.. నిమ్మగడ్డ, టీడీపీ బంధంపై పలు విమర్శలు చేశారు. (చదవండి : హైదరాబాద్ స్టార్ హోటల్లో గూడుపుఠాణి!) స్టార్ హోట్ల్లో రహస్య భేటీలో పాల్గొన్న ముగ్గురు చెప్తున సమాధానాలు.. తాడిచెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడ గడ్డికోసం అన్నట్టు ఉన్నాయని ఎద్దేవా చేశారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆరో ఫ్లోర్ వరకూ లిఫ్ట్‌లో వెళ్లి అక్కడనుంచి 8వ ఫ్లోర్‌కు లిఫ్ట్ వరకూ నడుచుకుని వెళ్లి వారితో ఎందుకు భేటీ అయ్యారని ప్రశ్నించారు. సుజనా, కామినేనిలు బీజేపీ మనుషులని టీడీపీ చెప్తున్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికే ఈ సమావేశం పెట్టుకున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య తన భుజాల మీదకు ఎందుకు ఎత్తుకున్నారు అని సూటిగా ప్రశ్నించారు. ‘ఇలాంటి పన్నాగాలు చేసే నిమ్మగడ్డ నిష్పక్షపాతంగా ఎలా వ్యవహరించగలరు?. బీజేపీ ముసుగు వేసుకున్న టీడీపీ నాయకులతో భేటీ కుమ్మక్కు కాదా?. స్థానిక ఎన్నికల్లో నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా వ్యవహరించలేదా?. స్టార్ హోటల్లో జరిగిన రహస్య భేటీని కోర్టుల దృష్టికి తీసుకెళ్లాల్సిన అసరం లేదంటారా’ అని సజ్జల ప్రశ్నించారు. సుజనా, కామినేని బీజేపీ మనుషులన్న టీడీపీ, కేంద్రానికి విజ్ఞాపనపత్రం తయారుచేయడానికే మీటింగు పెట్టుకున్నారంటూ ఈ రహస్యభేటీని టీడీపీ @JaiTDP వర్లరామయ్య తన భుజాలమీదకు ఎందుకు ఎత్తుకున్నారు? ఇలాంటి పన్నాగాలు చేసే నిమ్మగడ్డ నిష్పక్షపాతంగా ఎలా ఉంటారు? (2/3) — Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) June 24, 2020 -
‘నిమ్మగడ్డ రమేష్ వివరణ ఇవ్వాలి’
సాక్షి, విజయవాడ: ఎన్నికల కమిషనర్ నియామకం వివాదంగా మారి కోర్టుకెక్కిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బీజేపీ నాయకులను ప్రత్యేకంగా కలవడం అనేక అనుమానాలకు తావిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు ఎటువంటి అపోహలకు అవకాశం ఇవ్వకుండా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిజాయితీగా ఉండడమే కాదు.. అలా ఉన్నట్టు కూడా వ్యవహరించాలని విమర్శించారు. లేనిపక్షంలో ప్రజల్లో రాజ్యాంగ సంస్థల పట్ల విశ్వసనీయత దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. (హైదరాబాద్ స్టార్ హోటల్లో గూడుపుఠాణి!) ఈ మేరకు బుధవారం మధు మాట్లాడుతూ.. ‘‘ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ల మధ్య సమావేశం జరిగినట్లు వార్త బయటకు వచ్చింది. ఈ అంశంపై ప్రజల్లో గందరగోళం ఏర్పడింది. దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇవ్వాలి’’ అని డిమాండ్ చేశారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఈనెల 13న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌తో రహస్యంగా భేటీ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో ఈ సమావేశం జరిగింది. (ఆ ముగ్గురి వ్యాపార లావాదేవీలు ఏమై ఉంటాయబ్బా?) ఇక ఇందుకు సంబంధించిన వీడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఇదిలా ఉండగా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సర్వీసు నిబంధనలు, పదవీ కాలాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్, కొత్త ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ లేవనెత్తిన అంశాలకు రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
'బాబు హైదరాబాద్‌లో చేస్తున్న గలీజు పనులివే'
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హైదరాబాద్‌లోని ఓ హోటల్లో బీజేపీ నాయకులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లతో భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'నిమ్మగడ్డ రమేష్, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి... వీరు ముగ్గురూ స్టార్ హోటల్ కేంద్రంగా చేయగల వ్యాపార లావాదేవీలు ఏమై ఉంటాయబ్బా?' అంటూ పేర్కొన్నారు. చదవండి: బయటపడ్డ నిమ్మగడ్డ.. ఉలిక్కిపడ్డ టీడీపీ కాగా మరో ట్వీట్లో.. 'బాబు హైదరాబాద్‌లో చేస్తున్న గలీజు పనులివే. గోతులు తవ్వడం, చీకటి వ్యాపారాలు, మ్యానిప్యులేషన్లు, వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో మునిగి తేలుతుంటాడు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని విజయవంతంగా సమాధి చేసి, దళారి స్థాయికి పతనమయ్యాడు. అధికారం దరిదాపుల్లోకి ఎప్పటికీ రాలేడు' అంటూ చంద్రబాబుపై విజయసాయి రెడ్డి మండిపడ్డారు. చదవండి: హైదరాబాద్ స్టార్ హోటల్లో గూడుపుఠాణి! -
బయటపడ్డ నిమ్మగడ్డ.. ఉలిక్కిపడ్డ టీడీపీ
సాక్షి, అమరావతి: నిమ్మగడ్డ రమేష్‌కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ల రహస్య సమావేశం బట్టబయలు కావడంతో టీడీపీ ఉలిక్కిపడింది. నిమ్మగడ్డను ఉపయోగించుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెర వెనుక వ్యవహారాలు నడిపిన నేపథ్యంలో తమ గుట్టు రట్టు అయిందని టీడీపీ అధినాయకత్వంలో ఆందోళన మొదలైంది. నిమ్మగడ్డ పూర్తిగా తమ అధినేత కనుసన్నల్లో పని చేశారని, ఆయన తరపున కోర్టు కేసులను కూడా టీడీపీ నేతలే నడిపిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ చేస్తున్న ఆరోపణలు ఈ రహస్య భేటీతో నిజమని నిర్ధారణ అయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఆ పార్టీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఆధారాలతో అడ్డంగా దొరికిపోయినట్లే నిమ్మగడ్డతో అనైతిక సంబంధం నెరుపుతూ చిక్కామని టీడీపీ నేతలు వాపోతున్నారు. బీజేపీలో ఉన్నా బాబు సన్నిహితులే.. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నా వారిద్దరూ చంద్రబాబు సన్నిహితులనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా నిమ్మగడ్డతో సమావేశం కావడం, అందులో తమ అగ్రనేత ఆన్లైన్ ద్వారా పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో ఖండించడానికి సైతం టీడీపీ నేతలు ముందుకు రావట్లేదు. ‘ఫేస్‌టైమ్’ ద్వారా టీడీపీ అగ్రనేత ఈ రహస్య సమావేశంలో పాల్గొన్నట్లు వెల్లడి కావడంపై ఆ పార్టీలో కలకలం మొదలైంది. రహస్య సమావేశం దృశ్యాలు బయటకు రావడంతో నిమ్మగడ్డ వ్యవహారంలో తాము చేస్తున్న వాదన అబద్ధమని ప్రజలకు తెలిసిపోయిందని, తెర వెనుక జరిపిన రాజకీయం బెడిసికొట్టి ఎదురుదెబ్బ తగిలిందనే ఆవేదన ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. నోరు మెదపని నేతలు.. ఈ రహస్య సమావేశం మంగళవారం ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినా సాయంత్రం వరకూ టీడీపీ నాయకులు నోరు మెదపలేదు. సాధారణంగా ఏ విషయంపైనైనా మూకుమ్మడిగా మీడియా ముందుకు వచ్చి హడావుడి చేసే ఆ పార్టీ నేతలు ఈసారి స్పందించేందుకు ముందుకురాలేదు. సాయంత్రానికి వ్యూహాత్మకంగా దళిత నేత వర్ల రామయ్యను రంగంలోకి దించి మాట్లాడించారు. మాజీ మంత్రులు, చంద్రబాబు కోటరీ వ్యక్తులు, అధికార ప్రతినిధులెవరూ ఈ అంశంపై స్పందించలేదు. కాగా, కొన్నాళ్లుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్ కేంద్రంగా రాజకీయం నడుపుతున్నారు. ఇప్పుడు కూడా అదే హోట్ల్లో నిమ్మగడ్డ, సుజనా, కామినేని శ్రీనివాస్‌లు భేటీ అయ్యారు. -
హైదరాబాద్ స్టార్ హోటల్లో గూడుపుఠాణి!
అది హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్.. ఉదయం 10.47 గంటలు.. టక్ చేసుకుని ఫోన్లో మాట్లాడుతూ వేగంగా నడుస్తున్న ఓ వ్యక్తి అక్కడకు చేరుకోగానే స్వాగతం పలికి థర్మల్ స్క్రీనింగ్‌తో టెంపరేచర్ పరిశీలించారు. అనంతరం ఆయన లిప్ట్ ఎక్కి 8వ అంతస్తులోని గదిలోకి వెళ్లారు. ఆ వెంటనే తెల్ల దుస్తులు ధరించిన మరొకరు నింపాదిగా చేతులను శానిటైజ్ చేసుకుని అదే విధంగా గదిలోకి చేరుకున్నారు. చివరిగా వచ్చిన మూడో వ్యక్తి మాత్రం 6వ అంతస్తు దాకా లిఫ్ట్ వాడినా అక్కడ్నుంచి నడుచుకుంటూ 8వ అంతస్తులోని గదిలోకి ప్రవేశించారు. ఆ గదిలో.. ముగ్గురు మిత్రుల మధ్య గంటన్నర పాటు రహస్య మంతనాలు సాగాయి. అనంతరం ఒక్కొక్కరే అక్కడి నుంచి నిష్క్రమించారు... సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారానికి సంబంధించి కోర్టులో వివాదాలు కొనసాగుతున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు బీజేపీ నేతలు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను రహస్యంగా కలిసిన దృశ్యాలు వెలుగులోకి రావడం పెను సంచలనం కలిగిస్తోంది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో ఈనెల 13వ తేదీన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లు గుట్టుగా నిమ్మగడ్డతో సమావేశమయ్యారు. ఈ ముగ్గురు నేతల రహస్య సమావేశం దాదాపు గంటన్నరకుపైగా కొనసాగింది. ఈ దృశ్యాలు మంగళవారం పలు చానళ్లలో ప్రసారమయ్యాయి. టీడీపీ అగ్రనేత కూడా ‘ఫేస్‌టైమ్’ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. మిత్రుడనా... ఫిర్యాదుకా? ఈ రహస్య భేటీపై మీడియాలో దుమారం రేగడంతో నిమ్మగడ్డ తమ కుటుంబానికి చిరకాల మిత్రుడని, ఇటీవల పరిణామాలు, విధి నిర్వహణకు సంబంధించిన విషయాలపై ఆయనతో చర్చించలేదని, కామినేనితో పార్టీ వ్యవహారాలపై మాట్లాడానని సుజనా పేర్కొనగా.. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకే నిమ్మగడ్డ సుజనాను కలసినట్లు టీడీపీ నేత వర్ల రామయ్య ప్రకటించడం గమనార్హం. ఎస్ఈసీ వివాదానికి సంబంధించి నిమ్మగడ్డ దాఖలు చేసిన కేసులో కామినేని శ్రీనివాస్ ఆయనకు అనుకూలంగా పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తూ నిమ్మగడ్డ కేంద్రానికి లేఖ రాసినట్లు వెలుగులోకి రావడం తెలిసిందే. ఈ లేఖ టీడీపీ కార్యాలయంలోనే తయారైందనే ఆరోపణలున్నాయి. ఒకరి తరువాత ఒకరుగా గదిలోకి... హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్లో ఈనెల 13వతేదీన ఉదయం 10.45 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య ముగ్గురు నేతలు ఒక్కొక్కరిగా చేరుకొని సుమారు గంటన్నర సేపు రహస్య మంతనాలు సాగించినట్టు ఆ వీడియో దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. తొలుత రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి హోటల్‌కు చేరుకోగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే కామినేని శ్రీనివాసరావు, నిమ్మగడ్డ రమేష్కుమార్లు వేర్వేరుగా సుజనా గదిలోకి వెళ్లారు. సమావేశానికి ముందు ఈ ముగ్గురు నేతలకు ఓ వ్యక్తి హోటల్ ప్రవేశద్వారం వద్ద స్వాగతం పలికి గది వద్దకు తోడ్కొని వెళ్లారు. రహస్య మంతనాల అనంతరం వారంతా విడివిడిగా హోటల్ నుంచి వెళ్లిపోయారు. ఆన్లైన్లో పాల్గొన్న టీడీపీ అగ్రనేత? రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగి వివాదంలో ఇరుక్కుపోయిన వ్యక్తితో బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణాల ఎగవేత కేసును ఎదుర్కొంటూ టీడీపీ నుంచి ఫిరాయించి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన కామినేని గంటన్నరసేపు రహస్యంగా మంతనాలు సాగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. బీజేపీలో కొనసాగుతున్నా వీరిద్దరూ అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం. మరోవైపు వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నట్లుగా టీడీపీకి చెందిన అగ్రనేత కూడా ‘ఫేస్ టైమ్’ ద్వారా ఈ సమావేశంలో ఆన్లైన్లో పాల్గొన్నట్లు సమాచారం. వీరంతా కలసి రహస్య మంతనాలు సాగించడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలన్న కుట్ర దాగి ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అడ్డుకుంటూ దురుద్దేశపూరితంగా... రాష్ట్ర ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా, ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేయడం, పలు సంక్షేమ పథకాలను అడ్డుకోవడంతో పాటు తనకు రక్షణ లేదంటూ శాంతి భద్రతలపై సందేహాలు రేకెత్తించేలా నిమ్మగడ్డ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నిమ్మగడ్డను ఎస్ఈసీగా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్థానిక ఎన్నికలను వాయిదా వేసి టీడీపీకి అనుకూలంగా దురుద్దేశపూరితంగా వ్యవహరించినట్లు వైఎస్సార్ సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజాదరణను ఓర్వలేక కుతంత్రాలు.. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది వ్యవధిలోనే 90 శాతం హామీలను అమలు చేసింది. కేవలం ఒకే ఒక్క ఏడాదిలో ప్రజలకు వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా రూ.42 వేల కోట్లకుపైగా లబ్ధి చేకూర్చింది. ప్రభుత్వం అమలు చేయనున్న వివిధ పథకాలు, కార్యక్రమాల షెడ్యూల్ వివరాలను క్యాలెండర్‌తో సహా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఇవన్నీ చూసి తట్టుకోలేని విపక్ష నేతలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు తెరవెనుక కుట్రలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే తాజా సమావేశం జరిగినట్లు విశ్లేషిస్తున్నారు. భేటీతో పార్టీకి సంబంధం లేదన్న బీజేపీ నిమ్మగడ్డతో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావు భేటీ కావడంపై తమ పార్టీకి ఏ సంబంధం లేదని బీజేపీ పేర్కొంది. అదంతా వారు వ్యక్తిగతంగా నిర్వహించుకున్న సమావేశమని ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య నేత వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డతో సంప్రదింపులు జరపాలని పార్టీ ఎలాంటి సూచనలు చేయలేదని స్పష్టం చేశారు. లిఫ్ట్‌లో ఇద్దరు... నడుచుకుంటూ నిమ్మగడ్డ! సుజనా చౌదరి 13వతేదీ ఉదయం 10.47 గంటలకు హోటల్లోని ఎంఎల్ అపార్ట్మెంట్ వైపు నుంచి ఒంటరిగా ప్రవేశించారు. అక్కడికి సమీపంలోని లిప్టు ద్వారా హోటల్ 8వ ఫ్లోర్‌కు చేరుకొని కారిడార్‌లో నడుచుకుంటూ 10.48 గంటలకు మంతనాల కోసం ముందుగా బుక్ చేసుకున్న గదిలోకి వెళ్లారు. కామినేని శ్రీనివాసరావు ఉదయం 11.23 గంటలకు హోటల్లోకి సుజనా ప్రవేశించిన దారి నుంచే వెళ్లారు. మంతనాలకు ముందు ముగ్గురు నేతలకు హోటల్ వద్ద స్వాగతం పలికిన వ్యక్తితో కలిసి కామినేని లిప్టు ద్వారా 8వ అంతస్తుకు చేరుకుని కారిడార్‌లో నడుచుకుంటూ 11.26 గంటలకు సుజనా గది వద్దకు చేరుకున్నారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మాత్రం ఆ దారిలో కాకుండా హోటల్ మెయిన్ ఎంట్రన్స్ ద్వారా ప్రవేశించి గ్రౌండ్ ఫ్లోరు నుంచి లిప్టులో 11.45 గంటలకు హోటల్ 6వ అంతస్తుకు చేరుకుని ఎల్ షేప్ కారిడార్లలో నడుచుకుంటూ 8వ అంతస్తుకు వెళ్లారు. స్వాగతం పలికిన వ్యక్తి వెంట రాగా 11.48 గంటలకు సుజనా రూంకు చేరుకున్నారు. సుమారు గంటన్నర పాటు సమావేశం తరువాత ముగ్గురు నేతలు భేటీ ముగించుకొని తొలుత మధ్యాహ్నం 1.03 గంటలకు కామినేని గది నుంచి బయటకు వచ్చారు. 1.13 నిమిషాలకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆ గది నుంచి వెలుపలకు రాగా ఆఖరున 1.32 గంటలకు సుజనా చౌదరి ఆ గది నుంచి బయటకు వచ్చారు. రాజ్యాంగ పదవి స్థాయిని దిగజార్చారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి హుందాగా ఉండాలి. ఇతరులకు ఆదర్శప్రాయంగా మెలగాలి. ఎన్నికల కమిషనర్ వ్యవహారం న్యాయస్థానాల్లో ఉన్నప్పుడు, రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ వ్యక్తి రాజకీయ నాయకులను కలవడం ఏంటి?! ఆ పోస్టు స్థాయిని దిగజార్చినట్లయింది. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు, న్యాయమూర్తులతో సహా ఎవరూ కూడా వారి పరిధి, నియమావళిని అతిక్రమించకూడదు. వీడియోను చూస్తే నిమ్మగడ్డ రమేష్ రాజకీయ నేతలతో సమావేశం అయినట్లు కనిపిస్తోంది. ఏం మాట్లాడలేదన్నా ఎవరు నమ్ముతారు? కోవిడ్ వల్ల హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి పనిచేస్తానని నిమ్మగడ్డ అప్పట్లో ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉండి ఆయన చేస్తున్న పనులు ఇవేనా!? – సర్వా సత్యనారాయణ ప్రసాద్, హైకోర్టు సీనియర్ న్యాయవాది ప్రజల్లో అనేక అనుమానాలున్నాయి రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు మచ్చలేకుండా ఉండాలి. పక్షపాత ధోరణితో ఉండకూడదు.. ఉన్నట్లు అనిపించకూడదు. రాజకీయంగా ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రజల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కానీ, నిమ్మగడ్డ రమేష్ కలిసింది ఎవరిని? వాళ్లేమీ బీజేపీలో పుట్టి పెరిగిన నేతలు కాదు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలున్న వాళ్లూ కాదు. టీడీపీ నుంచి వెళ్లి బీజేపీలో చేరిన వ్యక్తి ఒకరు.. టీడీపీ సర్కారులో మంత్రిగా పనిచేసిన వ్యక్తి మరొకరు. కలిసిన వ్యక్తేమో టీడీపీ హయాంలో నియమితులైన వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో కలుసుకున్నారంటే ఏం అనుకోవాలి? దీనిపై వాళ్లు ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా ప్రయోజనంలేదు. ఈ ముగ్గురి కలయికపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయి. – చిత్తర్వు నాగేశ్వరరావు, హైకోర్టు సీనియర్ న్యాయవాది ఈయన నిమ్మగడ్డ రమేశ్ నిమ్మగడ్డ రమేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. ‘రాజ్యాంగ బద్ధమైన’ పదవిలో ఉంటూ ముఖ్యమంత్రిపై నిందలు మోపుతూ కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలతో పదవిని కోల్పోయి కోర్టుకెక్కారు. దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లను ఈయన తరఫున వాదించడానికి నియమించారు. ఎవరు నియమించారన్నది జగమెరిగిన సత్యం. ఇతను సుజనా చౌదరి చంద్రబాబు నమ్మిన బంటుగా సుజనా చౌదరి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గత ఏడాది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన మరుక్షణమే చంద్రబాబు సలహా మేరకు బీజేపీలో చేరారు. చంద్రబాబు తరఫున పనులు చక్కబెడుతూ లాబీయింగ్ చేస్తున్నారు. ఈయన గారు 7 వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు తరఫున ‘లెక్కలు’ చూసే వాళ్లలో ఈయన ముఖ్యుడని చెబుతుంటారు. ఇదిగో కామినేని శ్రీనివాస్ టీడీపీ అధినేత చంద్రబాబుకు కామినేని శ్రీనివాస్ బాగా సన్నిహితుడు. చంద్రబాబు సూచన మేరకే 2014 ఎన్నికలప్పుడు బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకుని పోటీ చేశారు. చంద్రబాబు ఇతన్ని మంత్రిగా కూడా తీసుకున్నారు. పేరుకు బీజేపీ అయినప్పటికీ చంద్రబాబు తరఫునే పని చేస్తుంటారు. ఇటీవల ఆయన సూచన మేరకే నిమ్మగడ్డ రమేశ్ తరఫున కోర్టులో పిటిషన్ వేశారు. నిమ్మగడ్డపై దాఖలైన ఈ వ్యాజ్యాన్ని విచారిస్తాం సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నియామకం రాష్ట్ర మంత్రి మండలి సిఫారసు మేరకు జరగడానికి వీల్లేదని, ఎస్ఈసీ నియామకం పూర్తిగా రాష్ట్ర గవర్నర్ విచక్షణ మేరకే జరగాలంటూ హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో అసలు ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ నియామకమే చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ పిటిషన్ దాఖలుపై రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలతో ధర్మాసనం విభేదించింది. ఈ పిటిషన్‌పై తాము విచారణ జరుపుతామంటూ తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత కుమారిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. నిమ్మగడ్డ రమేశ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ 2016లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో 11ను కొట్టేయాలని గుంటూరు జిల్లా ఉప్పలపాడుకు చెందిన సంగం శ్రీకాంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంత్రిమండలి సిఫారసు మేరకు ఎన్నికల కమిషనర్ నియామకం కావడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పినందున, ఏ అధికారంతో ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతున్నారో నిమ్మగడ్డ రమేశ్‌ను వివరణ కోరాలంటూ కో వారెంట్ రూపంలో శ్రీకాంత్‌రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ నెల మొదటి వారంలోనే ఈ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ హైకోర్టు రిజిస్ట్రీ ఈ వ్యాజ్యం దాఖలుపై పలు అభ్యంతరాలు లేవనెత్తి నంబర్ కేటాయించలేదు. పిటిషన్ విచారణార్హతపై అభ్యంతరం లేవనెత్తే అధికారం రిజిస్ట్రీకి లేదంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది శశిభూషణ్‌రావు రిజిస్ట్రీ వర్గాలకు ఘాటు లేఖ పంపారు. -
అందుకు ఈ రహస్య భేటీ నిదర్శనం: ఉదయభాను
సాక్షి, కృష్ణా: ముగ్గురు చౌదరీల రహస్య భేటీకి చంద్రబాబు నాయుడే సూత్రధారి అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్, బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరిల రహస్య భేటీ వెనక కుట్రకోణం ఉందన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ బయటపడటంతో నిమ్మగడ్డ బండారం బట్టబయలైందన్నారు. చంద్రబాబు చేతుల్లో నిమ్మగడ్డ కీలుబొమ్మగా మారాడన్న అనుమానం నిజమని తేలిందని పేర్కొన్నారు. తప్పుడు పనులు చేస్తున్న నిమ్మగడ్డ రమేష్‌పై తక్షణమే విచారణ జరిపించాలన్నారు. (నిమ్మగడ్డతో భేటీ: బీజేపీ నేతలపై అధిష్టానం ఫైర్) ఇక సుజనా, కామినేని బీజేపీలో ఉంటూ టీడీపీ కోసం పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు నిపుణుడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మనుషులను వాడుకొని వదిలేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన లేఖపై నిమ్మగడ్డ రమేష్ సంతకం చేశారనేందుకు రహస్య భేటీ ఓ నిదర్శనమని స్పష్టం చేశారు. చంద్రబాబు మాటలు వినే నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను అనైతికంగా వాయిదా వేశారని మరోసారి ప్రస్తావించారు. (వారితో మాట్లాడిన నాలుగో వ్యక్తి ఎవరు?) -
ఎవరి మీద కుట్ర చేసేందుకు మంతనాలు?
సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిజస్వరూపం కోసం తాము చెబితే ఎవరూ నమ్మలేదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కానీ ఇప్పుడు ఆయన అసలు స్వరూపం బయటపడిందన్నారు. మంగళవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. "హం తుమ్ ఏక్ కమరేమే" అన్నట్లుగా అందరు ఒకే గదిలో కూర్చుని నిమ్మగడ్డ ఎవరితో మంతనాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎవరి మీద కుట్ర చేసేందుకు ప్రైవేటు హోటల్స్‌లో కలిశారని నిలదీశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖ్యాతి, పరపతిని కుదించాలని ప్రయత్నం చేస్తున్నారని, ఆ కుట్రలో భాగంగానే కలిశారన్న విషయం బయటపడిందని తెలిపారు. (వారితో మాట్లాడిన నాలుగో వ్యక్తి ఎవరు?) "బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరితో కలిసి ఉండడంతో నిమ్మగడ్డ నిజ స్వరూపం బయట పడింది. నిమ్మగడ్డ రమేష్ ఇప్పటికీ సచ్చీలుడని చెబుతారా? నిమ్మగడ్డ కోసం చెబితే కోర్డుల నుంచి మాకు నోటీసులు ఇస్తున్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడు చేసిన కుట్రే. బాబు కుట్ర ఎజెండా ప్రజలకు తెలిసింది. చంద్రబాబు అండ్ కో ఆడుతున్న డ్రామాలో నిమ్మగడ్డ ఒక పాత్రధారి అని బయట పడింది" అని మంత్రి పేర్కొన్నారు. (నిమ్మగడ్డతో రహస్య భేటీపై బీజేపీ అసంతృప్తి) -
'ఇంత నీచ రాజకీయాలు ఎప్పుడు చూడలేదు'
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి రహస్యంగా భేటీ కావడంపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. మంగళవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..' చంద్రబాబు అడుగడుగునా కుట్రలకు పాల్పడుతున్నారు. ఇంత నీచమైన రాజకీయాలు గతంలో ఎపుడూ చూడలేదు. మూడు రాజధానుల ప్రకటన తర్వాత భారీగా కుట్రలు పన్నుతున్నారు. నేరుగా మాతో యుద్దం చేసే ధైర్యం లేక దొడ్డిదారిన వస్తున్నారు. విశాఖలో భూ అక్రమాలు జరిగాయని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరినా నిరూపించలేకపోయారు. మీ కుట్రలకి ఇక చెల్లు. మీరెన్నికుట్రలకు పాల్పడినా మేము రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తాం. నిమ్మగడ్డ రమేష్ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన కుట్రలేంటో బయటపడాలి.(రహస్య భేటీ కుట్రను ఛేదిస్తాం: ఆదిమూలపు) మాకు తెలిసింది ఒక్కటే ప్రజలకి సేవ చేయడం... ప్రజల మెప్పు పొందడం...మళ్లీ ఎన్నికలకి వెళ్లడం.నీచ రాజకీయాలకి పాల్పడితే చూస్తూ ఊరుకోం.ఏడాది కాలంలో 90 శాతానికి పైగా హామీలు నెరవేర్చడంతో చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. చంద్రబాబు కుట్ర స్వభావాన్ని మార్చుకోకుండా ప్రభుత్వంపై తప్పుడుగా బురద జల్లాలని చూస్తున్నారు.కుట్రలతో వ్యవస్ధలని అదుపులో పెట్టుకుని రాష్ట్రాభివృద్దిని అడ్డుకోవడం తగదు. గత ఏడాది కాలంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ఎక్కడున్నారు. ఏడాదిగా బయటకి రాని వ్యక్తి ఇపుడు ఎందుకు వచ్చారు. తన అనుచరుడు కిషోర్‌ను సిఐడి పోలీసులు అరెస్ట్ చేస్తే ఎందుకు సిఐడి ఆఫీస్‌కి వచ్చావు. ఈ కేసులో తన పేరు ఎక్కడ బయటపడుతుందోననే భయంతోనే గంటా బయటకి వచ్చారే తప్ప కిషోర్ పై ప్రేమతో మాత్రం సిఐడి కార్యాలయానికి రాలేదు. కుట్రల వెనుక ఎవరున్నా .. అన్ని సాక్ష్యాదారాలతోనే నిందితులను సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు' అంటూ ధ్వజమెత్తారు.(వారితో మాట్లాడిన నాలుగో వ్యక్తి ఎవరు?) కాగా, రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈనెల 13న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌తో రహస్యంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో ఈ భేటీ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, తమ పార్టీ నేతలు నిమ్మగడ్డతో భేటీ కావడం పట్ల బీజేపీ అధిష్టానం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
‘ఆ భేటీ వెనుక కుట్ర దాగుంది’
సాక్షి అమరావతి: నిమ్మగడ్డ రమేష్ కుమార్ రహస్య సమావేశం వెనుక కుట్ర దాగుందని మంత్రి ఆదిమూలపు సురేష్ అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు వ్యవస్థలను మేనేజ్ చెయ్యడమే పని అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావుతో ఎలా భేటీ అవుతారని ప్రశ్నించారు. సచివాలయంలో మంత్రి ఆదిమూలపు మంగళవారం మాట్లాడారు. ‘చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్‌ని పావుగా వాడి మా ప్రభుత్వం పై కుట్రలు చేస్తున్నాడు. దళిత జడ్జిని మేం ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తే ఇందుకేనా అడ్డుకున్నది? దళిత ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా కుట్ర జరిగింది. నిమ్మగడ్డ, సుజనా, కామినేని రహస్య భేటీకి సంబంధించిన వీడియోలతో మొత్తం కుట్ర బయటపడింది. ఆ రహస్య భేటీలో ఏం జరిగిందో విచారిస్తాం. దీని వెనుకగల కుట్రను ఛేదిస్తాం. సుప్రీం కోర్టుకి కూడా వాస్తవాలు తెలియపరుస్తాం’అని మంత్రి అన్నారు. (చదవండి: నిమ్మగడ్డతో రహస్య భేటీపై బీజేపీ అసంతృప్తి) కాగా, రాష్ట్ర మాజీ సీఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈనెల 13న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌తో రహస్యంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో ఈ భేటీ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, తమ పార్టీ నేతలు నిమ్మగడ్డతో భేటీ కావడం పట్ల బీజేపీ అధిష్టానం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. (చదవండి: వారితో మాట్లాడిన నాలుగో వ్యక్తి ఎవరు?) -
‘రహస్య భేటీ సూత్రధారి చంద్రబాబే’
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి రహస్యంగా భేటీ కావడంపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ముగ్గురు కలిసి ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఈ రహస్య భేటీకి చంద్రబాబు నాయుడే సూత్రధారి అని ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిమ్మగడ్డ దుర్మార్గపు మనస్తత్వం ఈ భేటీతో బయటపడిందన్నారు. (చదవండి : ఇద్దరు నేతలతో నిమ్మగడ్డ రహస్య భేటీ) తప్పుడు పనులు చేస్తున్న నిమ్మగడ్డ తక్షణమే అరెస్టు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సుజనా, కామినేని బీజేపీలో ఉంటూ టీడీపీ కోసం పని చేస్తున్నారని విమర్శించారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించడంతో చంద్రబాబు ఎక్స్పర్ట్ అని, వాడుకొని వదిలేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, నిమ్మగడ్డ కలిసి ప్రభుత్వంకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వ్యవస్థల్లోకి సొంత మనుషులను చొప్పించడం, ఆవ్యవస్థలను అనైతికంగా వాడుకోవడం చంద్రబాబకు బాగా అలవాటైందని మండిపడ్డారు. టీడీపీ నుంచి వచ్చిన లేఖపై నిమ్మగడ్డ రమేష్ సంతకం చేశారని ఆరోపించారు. హోటల్ భేటీలో ముగ్గురు కలిసి ఎవరితో మాట్లాడారో తెలపాలని డిమాండ్ చేశారు. ఈ ముగ్గురు నేతల భేటీపై చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. నిమ్మగడ్డ బండారం బయట పెట్టేందుకు ఎంత దూరమైన వెళ్తామని అంబటి పేర్కొన్నారు. (చదవండి : నిమ్మగడ్డతో భేటీ: బీజేపీ నేతలపై అధిష్టానం ఫైర్ ) -
వారితో మాట్లాడిన నాలుగో వ్యక్తి ఎవరు?
సాక్షి, అమరావతి : టీడీపీ సానుభూతిపరుడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హైదరాబాద్‌లోని ఓ హోటల్లో బీజేపీ నాయకులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లతో భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. పార్క్ హయత్‌లో దుష్ట చతుష్టయంలోని ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారని.. వారితో మాట్లాడిన నాలుగో బిగ్ బాస్ ఎవరని ప్రశ్నించారు. అతి త్వరలో మరిన్ని వివరాలు.. అని పేర్కొన్నారు.(చదవండి : నిమ్మగడ్డతో భేటీ: బీజేపీ నేతలపై అధిష్టానం ఫైర్) ‘పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం. దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారు. ఫేస్ టైం లో మాట్లాడిన నాలుగో బిగ్ బాస్ ఎవరు?. మరిన్ని వివరాలు అతి త్వరలో...’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కాగా, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారంటూ నిమ్మగడ్డపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఇరువురు నేతలతో ఈ నెల 13 ఆయన భేటీ కావడం పలు ఆ ఆరోపణలకు బలం చేకూర్చింది. నిమ్మగడ్డ టీడీపీ సానుభూతిపరుడంటూ తొలి నుంచి వస్తున్న వార్తలు నిజమేనా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది.మరోవైపు రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో వీరు భేటీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.(చదవండి : ఇద్దరు నేతలతో నిమ్మగడ్డ రహస్య భేటీ) చంద్రబాబు కుట్రలో భాగం : మంత్రి వెల్లంపల్లి ఈ భేటీకి సంబంధించి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఏమిటనేది ఈ వీడియోతో తెలిపోందన్నారు. ఇన్నాళ్లుగా వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్నవి ఆరోపణలు కావని, నిజాలని రుజువైందన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుట్రలో ఇదంతా భాగమని విమర్శించారు. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లు బీజేపీ నేతలు కాదని.. వారు బాబు జనతా పార్టీ నాయకులను ఎద్దేవా చేశారు. వారిపై బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరారు. నిమ్మగడ్డ నిజ స్వరూపాన్ని కోర్టులకు వివరస్తామని తెలిపారు. -
నిమ్మగడ్డతో భేటీ: బీజేపీ నేతలపై అధిష్టానం ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి భేటీ కావడంపై ఆ పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేయడం సరికాదని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.నిమ్మగడ్డ వ్యవహరంపై బహిరంగంగా పోరాటం చేయమన్నామే తప్ప కుట్రలు చేయమని చెప్పలేదన్నారు. హోటళ్లలో రాజకీయ నేతలలతో చర్చించాల్సిన అవసరం నిమ్మగడ్డకు ఏంటని ప్రశ్నించారు. నిమ్మగడ్డ విశ్వసనీయతపై ప్రశ్నలు వచ్చిన సమయంలో ఈ భేటీలు దేనికి నిదర్శనమని నిలదీశారు. మొదటి నుంచి ఆకాశ చంద్రన్న ఉత్తరాలతో నిమ్మగడ్డ అనుమానస్పదంగా ఉన్నారని, హోటల్ భేటీతో ఇది రుజువైందని సదరు నేత వ్యాఖ్యానించారు.(ఇద్దరు నేతలతో నిమ్మగడ్డ రహస్య భేటీ) కాగా, మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈనెల 13న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌తో రహస్యంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో ఈ భేటీ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
చంద్రబాబు సన్నిహితులతో నిమ్మగడ్డ భేటీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌లతో రమేష్ కుమార్ ఇటీవల భేటీ కావడం సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో ఈనెల 13న ఉదయం 10:40 గంటలకు వీరి ముగ్గురి భేటీ జరిగింది. దాదాపు గంటన్నర పాటు వీరి సమావేశం సాగింది. దీనికి సంబంధిన వీడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలతో నిమ్మగడ్డ చర్చలు జరపడం రాజకీయ వర్గల్లో విస్తృత చర్చకు దారితీసింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో వీరు భేటీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. (నిమ్మగడ్డకు సుప్రీంకోర్టు నోటీసులు) కాగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రమేష్ కుమార్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే చంద్రబాబు సహచరులతో రహస్యంగా సమావేశం కావడం ఆ ఆరోపణలకు మరింత బలం చేకూరుతోంది. దీనిపై రాజకీయ వర్గాల్లో భిన్న కథనాలు వెలువడుతున్నాయి. నిమ్మగడ్డ టీడీపీ సానుభూతిపరుడంటూ తొలి నుంచి వస్తున్న వార్తలు నిజమేనా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. మరోవైపు చంద్రబాబు డైరెక్షన్లోనే వీరి సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ('నిమ్మగడ్డ'ను నియంత్రించండి) -
కన్నా.. కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్?
సాక్షి, విశాఖపట్నం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కాణిపాకం వినాయకస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తారా అంటూ కన్నా విసిరిన సవాలుపై స్పందిస్తూ.. తాను దేవుడిపై ప్రమాణం చేసేందుకు సిద్దంగా ఉన్నానని విజయసాయిరెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే కన్నా, బీజేపీ ఎంపీ సుజనా చౌదరిలు కూడా ప్రమాణం చేస్తారా అని నిలదీశారు. తాజాగా కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్ అంటూ కన్నా లక్ష్మీ నారాయణను విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. అలాగే కేంద్ర పార్టీ పంపిన నిధుల్లో రూ. 30 కోట్లు నొక్కేశాడని ఎన్నికల తర్వాత కన్నాపై అధిష్టానం ఆగ్రహం చేసినట్టు అప్పట్లో పత్రికల్లో వచ్చిన వార్తలను విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. స్థానికంగా సమీకరించిన విరాళాలు కూడా దారి మళ్లాయని ఢిల్లీకి ఫిర్యాదులు అందాయని తెలిపారు. కన్నాతో పాటుగా కొత్తగా చేరిన నేతలు.. ఈ నిధులను పంచుకున్నట్టు బీజేపీ పెద్దలకు తెలుసునని పేర్కొన్నారు. మరో ట్వీట్లో ‘టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు చీమ కుడితే.. బీజేపీలో ఉన్న సుజనా, సున్నా గిలగిలలాడతారు. బానిసత్వం, బ్రోకరిజం నేర్పించిన విశ్వాసం అది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు బాబు కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. అందుకే బాబు ఉస్కో అనకముందే భౌభౌమంటాయి.ఎప్పుడు ఏ విధంగా విషం చల్లాలో దేశం ఆఫీసే కమాండ్స్ ఇస్తుంది’ అని విజయసాయిరెడ్డి తెలిపారు. కన్నా... కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్...? @klnbjp — Vijayasai Reddy V (@VSReddy_MP) April 22, 2020 కేంద్ర పార్టీ పంపిన నిధుల్లో 30 కోట్లు నొక్కేశాడని ఎలక్షన్ల తర్వాత కన్నాపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అప్పట్లో పత్రికలు రాశాయి. స్థానికంగా సమీకరించిన విరాళాలూ దారి మళ్లాయని ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. కన్నా తో కొత్తగా చేరిన నేతలు ఈ నిధులు పంచుకున్నట్టు పెద్దలకు తెలుసు. pic.twitter.com/B3sUlBrwUC — Vijayasai Reddy V (@VSReddy_MP) April 22, 2020 చంద్రబాబుకు చీమ కుడితే బిజెపీలో ఉన్న సుజనా, సున్నా గిలగిలలాడతారు. బానిసత్వం, బ్రోకరిజం నేర్పించిన విశ్వాసం అది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు బాబు కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. అందుకే బాబు ఉస్కో అనకముందే భౌభౌమంటాయి. ఎప్పుడు ఏవిధంగా విషం చల్లాలో దేశం ఆఫీసే కమాండ్స్ ఇస్తుంది. — Vijayasai Reddy V (@VSReddy_MP) April 22, 2020 చదవండి : ‘కన్నా’పై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా -
‘నేనెప్పుడూ అవినీతికి పాల్పడలేదు’
సాక్షి, విశాఖపట్నం : గతి భారతి ఫౌండేషన్ ద్వారా కొందరు స్నేహితుల సహాయంతో ప్రజలకు సహాయం చేస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. డబ్బుల కోసం తాము ఫౌండేషన్ నడపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. తనెప్పుడూ అసత్య ఆరోపణలు చేయ్యలేదని, అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. ఇందుకు ఏ ఆలయం వద్దనైనా ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు. ఎప్పుడూ తెలిసి అవినీతి చెయ్యలేదని ప్రమాణం చేసి చెప్పారు. (పోలీసుల కోసం ఉన్నంతలోనే ఉదారత.. ) ప్రస్తుతం కొన్ని బ్యాంకులు విలీనం చెయ్యడం.. ఆర్థికంగా చితికి పోవడం లాంటి దుస్థితి సుజనా చౌదరి లాంటి వ్యక్తుల వల్లే జరుగుతుందని విజయసాయిరెడ్డి విమర్శించారు. సుజనా చౌదరి రింగ్ ఎంట్రీలు చేసి ఎలా బోగస్ కంపెనీలు సృష్టించారో ఆధారాలతో సహా రుజువు చేయగలనని స్పష్టం చేశారు. కేంద్రంతో రాష్ట్రానికి మంచి సంబంధాలు ఉన్నా.. కన్నా లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తులు పార్టీని తప్పుదారి పట్టిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులు కన్నా లక్ష్మీనారాయణ ఎంత వరకు దుర్వినియోగం చేశారో తాను లెక్కల్లో చెప్పగలనని అన్నారు. రూ.20 కోట్లకు కన్నా అమ్ముడు పోయారని చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామన్నారు. (జర్నలిస్ట్ మిత్రులు జాగ్రత్తగా ఉండాలి: కవిత) కేంద్రం ఇచ్చిన ఎన్నికల నిధులు గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి ఎంత దారి మల్లించారో తన దగ్గర లెక్కలు ఉన్నాయన్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారంతా బీజేపీకి నష్టం కలిగిస్తున్నారని, కళ్లు ముసుకొని పిల్లి పాలు తాగి ఎవరూ చూడలేదని అనుకుంటుందని.. సుజనా, కన్నా లాంటి అవినీతి పరులు ఇప్పుడు అలాగే వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. (కరోనా : నడిచి..నడిచి..ఇంటికి చేరబోతుండగా ) -
కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా?
సాక్షి, అమరావతి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ఇమేజ్ పెరిగినా రాష్ట్రంలో ఆ పార్టీ ఎదగకపోవడానికి చంద్రబాబుకు అమ్ముడుపోయిన కన్నా లాంటివారే కారణమని’ సోమవారం ట్వీట్ చేశారు. ‘బాబు ప్యాకేజీ ఆఫర్ అవసాన దశలో ఉన్నవారినీ లేపి కూర్చోపెడుతుంది. మొదటి నుంచి బీజేపీలో ఉన్నవారు... కన్నాలాంటి జంబూకాలను వదిలించుకోవాలి’ అని సూచించారు. ‘మళ్లీ అడుగుతున్నా...కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా? లేదా? టీజేపీ (టీడీపీ జాకాల్స్ పార్టీ) వారు కాకుండా బీజేపీ వారు నా మీద విమర్శలు చేస్తే సమాధానం ఇస్తా.’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. (‘అధికారం కోల్పోయినా.. సీఎం అనే భ్రమలోనే..’) చదవండి: ‘మనవడితో ఆడుకోక.. ఈ చిటికెలెందుకు? -
‘వారు జైలుకెళ్లితే చూడాలని ఉంది’
సాక్షి, రాజమండ్రి: గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని పడిపడి దోచుకున్నారని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి విమర్శించారు. సోమవారం ఆమె తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ భూములపై గత ప్రభుత్వం సిట్ వేసి చిన్న ఉద్యోగులను బలిచేశారన్నారు. సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన సిట్ ద్వారా వాస్తవాలు వెల్లడవుతాయన్నారు. సిట్ అధికారులు, కేంద్ర బృందాలు సమన్వయంతో పకడ్బందీగా పనిచేస్తారని తెలిపారు. ‘చంద్రబాబు, అచ్చెన్నాయుడు, సుజనా నాయుడు జైలుకి వెళ్లడం చూడాలని ఉంది. మళ్లీ తాను అధికారంలోకి వస్తే చంద్రబాబుని అండమాన్ జైలు పంపించాలని ఉందని ఎన్టీఆర్ అంటుండే వారు. ఆ రోజులు త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నా’ అంటూ లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు తెలుగుకు పూర్వవైభవం తీసుకువస్తాం.. ప్రాచీన తెలుగుకు పూర్వవైభవం తీసుకువస్తామని లక్ష్మీపార్వతి తెలిపారు. తెలుగు సాహిత్య పీఠాన్ని యూనివర్శిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆంగ్లంతో పాటు తెలుగును కచ్చితంగా బోధించాలని ప్రైవేటు విద్యాసంస్థలకు ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. తెలుగు అకాడమీ ద్వారా తెలుగు భాషాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. విద్యార్ధులను అన్నిరంగాలలో తీర్చిదిద్దడానికే తెలుగుతో పాటు ఆంగ్ల భాషకు సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె తెలిపారు. ఆ స్థలాలను తీసుకోవడం లేదు: ఎంపీ మార్గాని భరత్ తెలుగు సాహిత్య పీఠం స్థలాన్ని పేదల ఇళ్ళ స్థలాలకు తీసుకోవడం లేదని ఎంపీ మార్గాని భరత్‌రామ్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు యూనివర్శిటీ అక్కడే ఉంటుందని.. విద్యార్థులు తక్కువ ఉన్నందున ఖాళీగా ఉన్న స్థలాన్ని అధికారులు పరిశీలించారంతేనని పేర్కొన్నారు. విద్యాసంస్థలు, దేవాదాయ శాఖ భూములు ఇళ్ల స్థలాలకు సేకరించవద్దని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. తెలుగు యూనివర్శిటీకి పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పారు. త్వరలోనే వీసీని నియమిస్తామని సీఎం చెప్పారని తెలిపారు. తెలుగు యూనివర్శిటీలో జ్యోతిష్యం, వాస్తు వంటి విభాగాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తెలుగు యూనివర్శిటీలో 1.2 ఎకరాలను చంద్రబాబు హయాంలో ప్రైవేట్ గ్యాస్ సంస్థకు ఇచ్చారని ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. -
దారి మళ్లించిన నిధులతో దర్జా!
సాక్షి, అమరావతి: కేంద్ర మాజీ మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి, ఆయన సోదరుడు జతిన్‌కుమార్ ‘సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’ విస్తరణకు తీసుకున్న రూ.322.03 కోట్ల రుణాన్ని దారి మళ్లించి సీఆర్డీఏ పరిధిలో కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్‌కు వినియోగించారని బ్యాంక్ ఆఫ్ ఇండియా సీబీఐకి ఫిర్యాదు చేసింది. రుణాన్ని తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా స్పందించకుండా మోసం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. వడ్డీతో కలిపి రుణం రూ.400.84 కోట్లకు చేరుకుందని, దీన్ని రికవరీ చేసేందుకు తనఖా ఆస్తులను మార్చి 23న ఈ–ఆక్షన్ విధానంలో వేలం వేస్తున్నామని తెలిపింది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రుణాన్ని దారి మళ్లించిన సుజనా చౌదరి, జతిన్‌కుమార్ తదితరులపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. గతంలోనే మరో బ్యాంకు ఫిర్యాదు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రెండు నెలల క్రితం ఇదే తరహాలో సుజానా చౌదరిపై ఫిర్యాదు చేసింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజ్జెక్ట్ లిమిటెడ్ పేరుతో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రూ.304 కోట్ల రుణం తీసుకుని మోసగించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ఫిర్యాదుపై సీబీఐ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపేందుకు సీబీఐ సిద్ధమైంది. విచారణలో పలు కేసులు.. చంద్రబాబుకు సన్నిహితుడైన సుజనా చౌదరి తప్పుడు పత్రాలతో జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు టోపీ పెట్టి రూ.8 వేల కోట్లకుపైగా రుణాలు తీసుకున్నారు. ఇందులో అధిక శాతం నిధులను 2004 నుంచి 2014 వరకు టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబుకు అందజేసినట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. సుజనా ఆర్థిక నేరాలపై పలు కేసులు విచారణలో ఉన్నాయి. ఆర్థిక నేరగాడైన సుజనా చౌదరిని చంద్రబాబు రాజ్యసభకు పంపడంతోపాటు 2014లో కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కేలా చేశారు. బ్యాంకును బురిడీ కొట్టించిన నిధులతో.. రాజధాని ప్రాంతంపై చంద్రబాబు నుంచి ముందే సమాచారం అందుకున్న సుజానా చౌదరి తన కంపెనీలు, సోదరుడు జతిన్‌కుమార్, కుటుంబ సభ్యుల పేర్లతో చౌకగా వేలాది ఎకరాలను సొంతం చేసుకున్నారు. అధిక శాతం భూములకు అడ్వాన్సులు ఇచ్చి అగ్రిమెంట్లు చేయించుకుని రాజధాని ప్రకటన వెలువడిన తర్వాత 2016, 2017, 2018లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తాను కేంద్ర సహాయ మంత్రిగా ఉండటంతో బ్యాంకు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి షెల్ కంపెనీల పేర్లతో భారీగా రుణాలు తీసుకున్నారు. 13.95 శాతం వడ్డీపై అక్టోబర్ 26, 2018న బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.322.03 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ డబ్బులతో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను విస్తరిస్తానని బ్యాంక్‌కు హామీ ఇచ్చారు. రుణానికి జతిన్‌కుమార్, స్నేహితుడు గొట్టిముక్కుల శ్రీనివాసరాజు, షెల్ కంపెనీలతో గ్యారంటీ ఇప్పించారు. అయితే ఈ డబ్బులను కంపెనీ విస్తరణకు కాకుండా రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోలుకు వినియోగించుకున్నారు. ఆధారాలతో సీబీఐకి బ్యాంకు ఫిర్యాదు.. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో సుజనా చౌదరి ఏర్పాటు చేసిన 120 కంపెనీల్లో ఒకటైన శివసత్య పిగ్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సర్వే నెంబర్లు 432–1, 403–5, 433, 434, 402–1ఏ, 429, 428, 412, 410–2, 427–2, 413, 415, 416, 431, 437, 399–7, 404–11, 407–4లలో 110.6 ఎకరాల భూమిని రాజధాని ప్రకటన వెలువడక ముందే తక్కువ ధరకు కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేసుకున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద తీసుకున్న రుణాన్ని మళ్లించి 2018 నవంబర్ 13న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సీఆర్డీఏ పరిధిలో 623.12 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా ఈ నిధులను మళ్లించినట్లు గుర్తించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధారాలతో సీబీఐకి ఫిర్యాదు చేసింది. -
వేలానికి సుజనా చౌదరి ఆస్తులు
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సన్నిహితుడు, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆస్తుల వేలానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. ఆ బ్యాంక్ నుంచి 2018 అక్టోబర్ 26వతేదీన రూ.322.03 కోట్లను 13.95 శాతం వడ్డీపై తీసుకున్న యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి సంస్థ సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రుణాన్ని తిరిగి చెల్లించకుండా మొండికేస్తోంది. అసలు, వడ్డీ కలిపి ఈ ఏడాది ఫిబ్రవరి 20 నాటికి రుణం రూ.400.84 కోట్లకు చేరింది. తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా సుజనా చౌదరి స్పందించకపోవడంతో తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకు గురువారం నోటీసు జారీ చేసింది. ఆన్లైన్లో బిడ్ల దాఖలుకు తుది గడువు మార్చి 21గా పేర్కొంది. ఈ–ఆక్షన్ విధానంలో ఆస్తులను మార్చి 23న 11.30 నుంచి 12.30 గంటల మధ్య వేలం వేస్తామని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించడంతో సుజానా అక్రమాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. (తాతా.. గిఫ్ట్ ఎలా ఇచ్చావు?) సుజనా చౌదరి ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్వహిస్తున్న వాటిలో సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్, సుజనా మెటల్ ప్రొడక్ట్, సుజనా టవర్స్ లాంటి లిస్టెడ్ కంపెనీలతోపాటు మరో 102 ఇతర కంపెనీలున్నాయి. సుజనా పరోక్షంగా నడిపించే బార్ర్‌టోనిక్స్ కూడా లిస్టెడ్ కంపెనీయే. మరో 4 కంపెనీలు (విజయ్ హోం అప్లయన్సెస్, మెడ్‌సిటీ, లక్ష్మీగాయత్రి, బెస్ట్ అండ్ కాంప్ట్రాన్) మినహా మిగిలినవన్నీ షెల్ కంపెనీలే. ఇవి సర్క్యులర్ ట్రేడింగ్, బుక్ బిల్డింగ్, మనీ ల్యాండరింగ్, పన్ను ఎగవేత కార్యకలాపాలలో దిట్ట. సుజనా గ్రూపు సంస్థలు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.8,000 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నాయి. అయితే సుజనా సంస్థల ఆస్తుల విలువ రూ.132 కోట్లకు మించదని చెబుతున్నారు. (మా కుటుంబ నికర ఆస్తులు రూ.102.48కోట్లు) బ్యాంకులను కొల్లగొట్టడంలో ఘనుడు.. ⇒సుజనా గ్రూప్ ప్రధాన కంపెనీలు రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా)కు రూ.920 కోట్ల మేర రుణాలు ఎగవేశాయి. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ హెస్టియా లిమిటెడ్, నువాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థలు మారిషస్ కమర్షియల్ బ్యాంకుల నుంచి రూ.107 కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా బోర్డు తిప్పేశాయి. ఈ రుణానికి సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చింది. ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో మారిషస్ కమర్షియల్ బ్యాంకు పిటిషన్ దాఖలు చేసింది. (సుజనా చౌదరి నివాసంలో సీబీఐ సోదాలు) ⇒బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పేరుతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.304 కోట్ల రుణం పొందేందుకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సమర్పించడంపై సుజానా గ్రూపుపై సీబీఐకి బ్యాంకు తాజాగా ఫిర్యాదు చేసింది. ⇒సుజానా గ్రూపు సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, ఐటీ రూపంలో రూ.962 కోట్లను ఎగ్గొట్టడంపై కేసుల విచారణ వివిధ దశల్లో ఉంది. ⇒ఇవన్నీ పరిశీలిస్తే సుజానా గ్రూపు బ్యాంకు రుణాలను భారీగా ఎగ్గొట్టి మనీ ల్యాండరింగ్‌తో కొత్త సంస్థలను ఏర్పాటు చేసుకుని నిధులను దారిమళ్లించినట్లు స్పష్టమవుతోంది. దోచేసిన సొమ్ముతో భూ దందా ⇒చంద్రబాబుకు సన్నిహితుడైన సుజనా చౌదరి 2014లో రాజధానిపై ప్రకటన వెలువడక ముందే ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా సీఆర్డీఏ పరిధిలో భారీగా భూములు కొనుగోలు చేశారు. బ్యాంకులను దోచేసిన సొమ్ముతోనే సుజనా ఆస్తులను పోగేసుకున్నారనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. ⇒సీఆర్డీఏ పరిధిలోని చందర్లపాడు మండలం గుడిమెట్లలో సుజనా చౌదరి ఏర్పాటు చేసిన 120 కంపెనీల్లో ఒకటైన శివసత్య పిగ్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 110.6 ఎకరాలను రాజధాని ప్రకటన వెలువడక ముందే రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ అగ్రిమెంట్ చేసుకున్నారు. 2018లో తన సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ⇒సుజనా సోదరుడు యలమంచిలి జతిన్ కుమార్ ఏర్పాటు చేసిన శివజ్యోతి ఫ్లైకాన్ బ్లాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 11.56 ఎకరాలను రాజధాని ప్రకటన వెలువడక ముందే కొనుగోలు చేశారు. ⇒కుటుంబ సభ్యులు, షెల్ కంపెనీల పేర్లతో రాజధాని ప్రాంతంలో సుజనా 623.12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు ఈడీ నిగ్గు తేల్చడం గమనార్హం. -
సుజనాకు మరో భారీ షాక్
సాక్షి, అమరావతి : చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరికి మరోసారి భారీ షాక్ తగిలింది. ఆయన పవర్ ఆఫ్ అటార్నీగా ఉన్న పలు ఆస్తులను వేలం వేయనున్నట్టు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మార్చి 23, 2020న ఈ వేలం పాట జరగనుంది. మార్చి 20న సుజనా ఆస్తులను తనిఖీ చేసుకోవచ్చన్న బ్యాంకు.. మొత్తం రూ.400 కోట్ల 84లక్షల 35వేల బకాయి ఉన్నట్టు తెలిపింది. తీసుకున్న రుణ బకాయిలు చెల్లించకపోవడంతో.. ఆ సంస్థ తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయనున్నట్లు బ్యాంక్ నోటీసుల్లో తెలిపింది. రుణం జమానతు ఇచ్చిన వ్యక్తులు, సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు బ్యాంక్ చెబుతోంది. బ్యాంకు ఆఫ్ ఇండియాలో సుజనా యునివర్సల్ ఇండస్ట్రీస్ కంపెనీ పేరుతో 320 కోట్ల మొత్తం రుణం తీసుకున్నారు. రుణానికి గ్యారంటీ దారులుగా సుజనా చౌదరి, మరో 11మంది ఉన్నారు. సుజనా క్యాపిటల్ సర్వీసెస్, సుజనా పంప్స్&మోటార్స్, స్ల్పెండెడ్ మెటల్ ప్రొడక్ట్స్, న్యూకాన్ టవర్స్ తదితర కంపెనీలు గ్యారంటీగా ఉన్నాయి. బ్యాంకును మోసగించిన కేసులో 2018లో మూడు కేసులు నమోదు కాగా.. ఇప్పటికే నాగార్జునహిల్స్‌లోని సుజనా కార్యాలయాలపై సీబీఐ దాడులు జరిగాయి. సీబీఐతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉమ్మడి సోదాలు జరిగాయి. మొత్తమ్మీద రూ.5700 కోట్ల మేర బ్యాంకులకు సుజనా కంపెనీలు టోపీ పెట్టినట్టు గుర్తించాయి. ఆ సోదాల్లో ఏకంగా 126 షెల్ కంపెనీలు గుర్తించారు. ఫెరారీ, బెంజ్, రేంజ్ రోవర్ కార్లను కూడా అప్పట్లో అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. వేలం పాట కింద సుజనా ఆస్తుల విలువలను బ్యాంక్ పేర్కొంది. తమిళనాడులో వై.శివలింగప్రసాద్ పేరుతో 6300 చదరపు అడుగుల భూమి, శ్రీపెరంబూదూరులో ఎస్.టి.ప్రసాద్ పేరుతో 7560 చదరపు అడుగుల భూమి, శ్రీపెరంబూదూరులో శివరామకృష్ణ పేరుతో 7700 చదరపు అడుగుల భూమి, కొలుత్తువంచెర్రీ గ్రామంలో వైఎస్ చౌదరి పేరుతో 7700చదరపు అడుగుల భూములను వేలం వేస్తామని బ్యాంకు ప్రకటించింది. అన్ని ఆస్తులకు పవర్ ఆఫ్ అటార్నీగా సుజనా చౌదరి ఒక్కరే ఉండడం గమనార్హం. -
సుజనాకు షాక్ : ఆస్తులను వేలం
-
‘మనుషులు వేరు కానీ, ఆ ఇద్దరి మనసులు ఒకటే’
-
‘మనుషులు వేరు కానీ, ఆ ఇద్దరి మనసులు ఒకటే’
సాక్షి, విశాఖపట్నం : రాజధాని మారితే తన భూముల రేట్లు తగ్గిపోతాయనే భయంతో చంద్రబాబు నాయుడు ఆందోళనలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రాజధాని తరలిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడా చెప్పలేదన్నారు. తన భూముల ధరలు పడిపోతాయనే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. మహిళలను ముందు పెట్టుకొని ఒక శిఖండిలా చంద్రబాబు ఉద్యమాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్లు కాలయాపన చేసి ఇప్పుడు జోలె పట్టుకొని అడుక్కోవడం సిగ్గు చేటన్నారు. ప్రజల్లో సానుభూతి కోసం చంద్రబాబు పాకులాడుతున్నారని విమర్శించారు. 40 అనుభవం అనుకునే చంద్రబాబు తీరు ఇదేనా అని ప్రశ్నించారు. ఊసరవెళ్లి కూడా సిగ్గుపడేలా చంద్రబాబు తీరు ఉందని ఎద్దేవా చేశారు. 13జిల్లాల అభివృద్ధి చంద్రబాబుకు అవసరం లేదా అని ప్రశ్నించారు. తన వర్గం కోసం, తన బినామీల కోసం చంద్రబాబు ఆందోళనలు చేస్తున్నారే తప్ప ప్రజల కోసం కాదన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి సీపీఐకి అవసరం లేదా? సీపీఐ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు ఏరకంగా మద్దతు పలుకుతారని ఎమ్మెల్యే అమర్నాథ్ ప్రశ్నించారు. కమ్యూనిస్టులు టీడీపీ కార్యకర్తలుగా మారిపోయారని విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి సీపీఐకి అవసరం లేదా అని ప్రశ్నించారు. చద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మనుషులు వేరు కానీ, మనసులు మాత్రం ఒకటే అన్నారు. సుజనా తీగ లాగితే.. సుజన డొంక కదులుతుంది రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. దేశ ప్రతిష్టను కించపరిచేలా సుజనా మాట్లాడారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాని తెలిపారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీలాగా సుజనా కూడా దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సుజనా చౌదరి తీగ లాగితే.. చంద్రబాబు డొంక కదులుతుందన్నారు. శివరామకృష్ణన్ కమిటీ కూడా అన్ని ప్రాంతాల అభివృద్ధే కావాలన్నదని గుర్తుచేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. సీఎం జగన్ నిర్ణయాలకు ప్రజలంతా మద్దతుగా ఉండాలని ఎమ్మెల్యే అమర్నాథ్ కోరారు. -
'బాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు'
సాక్షి, విజయవాడ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి, విభజన చట్టంలోని అంశాలు అమలు కాకపోవడానికి చంద్రబాబే ప్రధాన కారకుడని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మండిపడ్డారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం గత ఐదేళ్లలో టీడీపీ నేతలు రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారని విమర్శించారు. మేము అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని చూస్తుంటే బీజేపీ నేతలకు బాధ ఎందుకు కలుగుతుందో తనకు అర్థం కావడం లేదన్నారు. కాషాయ కండువా కప్పుకున్న సుజనాచౌదరి అమరావతి ముసుగులో ఐదేళ్లలో టీడీపీ చేసిన అక్రమాలు వెలికి తీస్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ మూబు ముక్కలయిందని పొంతనలేని వ్యాఖ్యలు చేస్తూ సుజనా ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారని తెలిపారు. పూటకో మాట మాట్లాడే పవన్‌కి జనం తీర్పు ఇచ్చిన తర్వాత కూడా బుద్ధి రాలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు అండ్ కో చేస్తున్న కుట్రలను ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. పత్రికలను అడ్డం పెట్టుకొని అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజాభిప్రాయమే మాకు శిరోధార్యమని, అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్ అంతిమ లక్ష్యమని మల్లాది విష్ణు వెల్లడించారు. (ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి) -
ఎంపీ సుజానాపై ఎమ్మెల్యే గుడివాడ ఫైర్
-
‘సుజనాపై దేశ ద్రోహం కేసు పెట్టాలి’
సాక్షి, విశాఖపట్నం : దేశం విడిచిపోతానంటూ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. దేశం గురించి ఇలా మాట్లాడడం సిగ్గు చేటన్నారు. శనివారం ఆయన సుజనా చౌదరిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగాన్ని అవమానపరిచే రీతిలో మాట్లాడిన సుజనాపై దేశ ద్రోహం కింద కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. అలాగే సుజనా పాస్‌పోర్టును సీజ్ చేయాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. చంద్రబాబును కాపాడుకోవడానికి తనతో పాటు, బినామీల ఆస్తులను కాపాడుకోవడానికే దేశాన్ని కించపరిచే రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రూ. పదివేల కోట్లను బ్యాంకులకు ఎగనామం పెట్టి.. విజయమాల్యా, నీరవ్ మోదీ తరహాలో సుజనా కూడా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చదవండి : సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు సుజనా... తొందరపడకు.. -
సుజనా... తొందరపడకు..
సాక్షి, విజయవాడ : రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరిపై వ్యవసాయ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ఒక ఎంపీగా ఉంటూ దేశం వదిలి వెళ్లిపోతానని అనడం సిగ్గు చేటన్నారు. రాజధాని పేరుతో ఎన్ని వేల కోట్లు కుంభకోణం చేశారో సుజనా మాటలను చూస్తే అర్థమవుతుందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని పేరుతో సుజనా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. అందుకే ఇప్పుడు మరో దేశానికి కాందిశీకుడిగా పోతానంటూ దేశాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. (చదవండి : సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు) దోపిడి చేసిన వాళ్లు చాలా మంది దేశం వదిలి వెళ్లారని.. సుజనా కూడా అలాగే పారిపోదామనుకుంటున్నారని విమర్శించారు. సుజనా చౌదరి తొందరపడవద్దని..త్వరలోనే ఆయన దోపిడీ అంతా బయటపెడతామన్నారు. కేసులకు భయపడే సుజనా బీజేపీలోకి వెళ్లాడని ఆరోపించారు. విశాఖ రాజధాని కావాలని ఎవరు అడిగారని చంద్రబాబు అంటూన్నారు.. మరి అమరావతి రాజధాని కావాలని ప్రజలు ఏమైనా ఉద్యమాలు చేశారా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కావడం చంద్రబాబుకు ఇష్టం లేదా అని నిలదీశారు. చంద్రబాబు మాటలు విని అమరావతి రైతులు మోసపోవద్దని కోరారు. పవన్.. ఒక నాయకుడేనా? బినామీల కోసం చంద్రబాబు నాయుడు బస్సుయాత్ర చేస్తున్నారని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతల మాటలు విని అమరావతి రైతులు మోసపోవద్దని కోరారు. చంద్రబాబు చెప్పు చేతుల్లో నడిచే పవన్ కల్యాణ్ ఒక నాయకుడేనా అని ఎద్దేవా చేశారు. రాజధానిని వెంటనే విశాఖకు తరలించాలన్నారు. అమరావతిలోని బినామీలను బయటకు తీసి.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లను జైల్లో వేయాలని ఎమ్మెల్యే ద్వారంపుడి డిమాండ్ చేశారు. -
దేశాన్ని అవమానపరిచిన సుజనా చౌదరి
-
సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: దేశం విడిచిపోతానంటూ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో కొనసాగుతూ దేశాన్ని అవమానించేలా మాట్లాడారు. మరో దేశానికి కాందిశీకుడిగా పోతానంటూ ప్రకటన చేశారు. అసలు ఇక్కడ పౌరుడిగా ఉండటమే దండగని పేర్కొన్నారు. శరణార్థులుగా వేరే చోటకి వెళ్లిపోవడం మేలు అన్నారు. ఈ దేశంలో ఉండటమే అనవసరమని... మీ అందరూ కలిసి రావాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తూ ఊరుకుంటే నేరాలు, ఘోరాలు పెరిగిపోతాయని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఏదో జరిగిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా తనకు మద్దతుగా నిలవాలని కోరారు. కాగా వివిధ బ్యాంకులకు కోట్ల రూపాయల మేర నష్టం చేకూర్చినట్లు సుజనా చౌదరిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయనకు చెందిన విలువైన ఆస్తులను ఈడీ ఇప్పటికే జప్తు చేసింది. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి ఆర్థిక నేరాలు, ఆయన అక్రమ కంపెనీలు, మనీ లాండరింగ్ వ్యవహారాలు, వ్యాపార కుంభకోణాలపై విచారణ జరపాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఇందుకు బదులిస్తూ రాష్ట్రపతి కార్యాలయం.. ఆ లేఖను హోం మంత్రిత్వ శాఖకు పంపింది. ఈ క్రమంలో హోం మంత్రిత్వ శాఖ సదరు లేఖను సంబంధిత శాఖలకు పంపించింది. దీంతో సుజనా అక్రమాస్తులపై విచారణకు రంగం సిద్ధమైనట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన సుజనా చౌదరి టీడీపీని వీడి.. బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. -
సొంత అజెండాతో సుజనా,కన్నా
-
కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన నువ్వా మాట్లాడేది
-
సుజనా.. నోరు అదుపులో పెట్టుకో
పొన్నూరు: ‘సుజనాచౌదరీ.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు.. చేతిలో బీజేపీ జెండా పట్టుకుని, జేబులో టీడీపీ కండువా పెట్టుకుని మాట్లాడొద్దు’ అని వైఎస్సార్సీపీ పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య హెచ్చరించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రూ.వేల కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన సుజనా.. రాష్ట్రంపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడటానికి సిగ్గుండాలన్నారు. సుజనా తన రాజకీయ గురువు చంద్రబాబు కోసం కొత్త పల్లకీ ఎత్తుకున్నారన్నారు. అమరావతి రాజధానిగా రాక ముందు పేద వర్గాల నుంచి అతి తక్కువ ధరలకు భూములు బెదిరించి తీసుకున్నది మీరు కాదా? అని ప్రశ్నించారు. అసైన్డ్ భూములు ప్రజల నుంచి తీసుకోవటానికి జీవో తీసుకువచ్చింది మీ నాయకుడు చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అమరావతిలో భూములు కొనుగోలు చేశారన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నారన్నారు. దానికి మేధావులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుంటే చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. -
'బాబుకు ఈ ఏడాది ఏడుపుగొట్టు నామసంవత్సరం'
సాక్షి,తాడేపల్లి : 2019 సంవత్సరం చంద్రబాబుకు ఏడుపుగొట్టు నామ సంవత్సరమని, ఆయనకు ఈ ఏడాది ఏడ్పులు, పెడబొబ్బలతోనే గడిచిందని ఎమ్మెల్యే జోగి రమేశ్ ఎద్దేవా చేశారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకనే నిత్యం ఏడుస్తున్నాడని తెలిపారు. సీఎం జగన్ శాసనసభలో చారిత్రక చాట్టాలను ప్రవేశపెడితే ఆయన సహించలేకపోతున్నారని అందుకే అసెంబ్లీ నుంచి ఏడుస్తూ బయటకు వెళ్లేవారని పేర్కొన్నారు. దిశ బిల్లు, మహిళ రిజర్వేషన్లు, బడుగు బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే అభినందించకుండా ఏడుస్తూ బయటకు వెళ్లిపోయింది నీవు కాదా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను జగన్ 80 నుంచి 90 శాతం అమలు చేశారని అందులో రైతు భరోసా, అమ్మ ఒడి వంటి కార్యక్రమాలు ఉన్నాయని గుర్తు చేశారు. మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ఇస్తున్నామని, అలాగే పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువును అందజేస్తామంటే బాబు ఎందుకు అడ్డుపడుతున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 'రాజధాని ప్రాంతంలో పుట్టినవాడిగా చంద్రబాబును ఒక ప్రశ్న అడుగుతున్న.. గత ఐదేళ్ల కాలంలో సీఎంగా పనిచేసిన మీరు అమరావతికి ఏం చేశారో చెప్పండి'. ఈ ఐదేళ్లలో బాబు కేవలం తన మాటలతో అరచేతిలో స్వర్గం చూపించాడు తప్ప చేసిందేమి లేదని దుయ్యబట్టారు. సుజనా చౌదరి పచ్చి మోసగాడు, ప్రజల దనాన్ని కొల్లగొట్టిన మాయగాడని జోగి రమేశ్ వెల్లడించారు. సుజనా చౌదరి పేరుకే బీజేపీ నాయకుడని కానీ పరోక్షంగా ఆయన ఇంకా టీడీపీలోనే ఉన్నారని, అందుకే బాబు తన చిలుకపలుకులను సుజనా నోటి ద్వారా పలికిస్తున్నారని విమర్శించారు. బ్యాంకుల నుంచి వేలకోట్లు దొంగతనం చేసిన సుజనా చౌదరి లాంటి వ్యక్తికి వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదని పేర్కొన్నారు. (బాబు చూపిన రాజధాని గ్రాఫిక్స్ సాధ్యం కాదు : కొడాలి నాని) -
పార్టీ మారినా టీడీపీకి భజన చేస్తున్నారు..
సాక్షి, విశాఖపట్నం : రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి టీడీపీ కోవర్టుగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. బీజేపీలోకి ఫిరాయించినా కూడా టీడీపీకి భజనా చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన అమర్నాథ్.. సుజనా చౌదరి ఎంపీగా ఉంటూ పెద్ద ఎత్తున అవినీతి పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. రాజధానిపై ఆయనకు కనీస అవగహన కూడా లేదని, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాలంలో జరిగిన అవినీతిని సుజనా మర్చిపోయారా అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో అమరావతిని చంద్రబాబు ప్రైవేటు కంపెనీగా మార్చారని ధ్వజమెత్తారు. మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఉత్తరాంధ్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని అమర్నాథ్ అభిప్రాయపడ్డారు. రాజధానిపై ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు స్పందించకుంటే చరిత్ర ద్రోహులుగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. స్థానిక ప్రజలకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారని, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. -
పార్టీ మారినా టీడీపీకి భజన చేస్తున్నారు..
-
సుజనాకు రాష్ట్రపతి షాక్
-
సుజనా ఆర్థిక నేరాలపై స్పందించిన రాష్ట్రపతి
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరి(సుజనా చౌదరి) ఆర్థిక నేరాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి సెప్టెంబర్ 26న రాసిన లేఖ పట్ల రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ స్పందించారు. ఈ లేఖ రాష్ట్రపతి సచివాలయం నుంచి నవంబర్ 6న కేంద్ర హోం శాఖకు వెళ్లింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ విజయసాయిరెడ్డి రాసిన లేఖను, రాష్ట్రపతి కార్యాలయం నోట్‌తో వచి్చన లేఖను కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ కార్యదర్శికి, కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శికి పంపింది. తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరింది. ఈ మేరకు హోంశాఖ అండర్ సెక్రెటరీ అశోక్ కుమార్ పాల్ విజయసాయిరెడ్డికి ఒక లేఖ పంపారు. దీంతో సుజనా చౌదరి అక్రమాలపై సంబంధిత శాఖలు విచారణకు సిద్ధమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సుజనా చౌదరి అంతర్జాతీయ స్కామ్‌స్టర్, మానీలాండరర్, మోసపూరిత కంపెనీలను సృష్టించడంలో ఆరితేరిన వ్యక్తి అని విజయసాయిరెడ్డి తన లేఖలో ఆరోపించారు. సుజనా చౌదరిపై ఉన్న ఆరోపణలను రాష్ట్రపతికి రాసిన లేఖలో వి.విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. సుజనా చౌదరి మోసాలివీ... ►సుజనా చౌదరి ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్వహిస్తున్న వాటిలో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్, సుజనా మెటల్ ప్రొడక్ట్స్, సుజనా టవర్స్‌తోపాటు మరో 102 కంపెనీలు ఉన్నాయి. వీటిలో ఒకటైన బార్ర్‌టోనిక్స్ పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీ. 8 కంపెనీలు తప్ప మిగిలినవన్నీ షెల్(డొల్ల) కంపెనీలే. ఇవి సర్క్యులర్ ట్రేడింగ్, బుక్ బిల్డింగ్, మనీ లాండరింగ్, పన్ను ఎగవేత కార్యకలాపాలతో సంబంధం ఉన్నవి. ►ఈ 8 కంపెనీల్లో 50 శాతం వ్యాపారం భారత్‌లోని షెల్ కంపెనీల ద్వారా జరుగుతున్నదే. మరో 20–25 శాతం వ్యాపారం సుజనా గ్రూపు పరోక్షంగా నిర్వహిస్తున్న విదేశీ షెల్ కంపెనీల ద్వారా జరుగుతోంది. ►సుజనా గ్రూపు ప్రస్తుతం వివిధ బ్యాంకులు, ఆరి్థక సంస్థలకు రూ.8 వేల కోట్లకుపైగా చెల్లించాల్సి ఉండగా, మార్కెట్లో ఆ గ్రూపు ఆస్తుల విలువ రూ.132 కోట్లు కూడా లేదు. ఫలితంగా ఈ గ్రూపు కంపెనీల షేర్లు కొన్నవారు భారీగా నష్టపోయారు. ►సుజనా గ్రూపునకు చెందిన బిగ్ బ్రదర్స్‌గా పిలిచే రెండు ప్రధాన కంపెనీలు (సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్, సుజనా టవర్స్) కలిపి రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులకు(సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా) రూ.920 కోట్లు మేర రుణాలు ఎగవేశాయి. ►ఈ రెండు కంపెనీలతోపాటు సుజనా గ్రూపు నడుపుతున్న మరో పెద్ద సంస్థ సుజనా మెటల్ ప్రొడక్టŠస్. ఈ సంస్థ 2014 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.38 కోట్ల నష్టాన్ని చూపగా, సుజనా యూనివర్సల్ రూ.6.3 కోట్ల నష్టాన్ని చూపింది. సుజనా టవర్స్ మాత్రం రూ.1.8 కోట్ల స్వల్ప నికర లాభం చూపింది. ►2011–2014 ఆరి్థక సంవత్సరాల మధ్య సుజనా టవర్స్ రుణ భారం రూ.565 కోట్ల నుంచి రూ.1,750 కోట్లకు చేరినట్టుగా పుస్తకాల్లో చూపారు. అదే సమయంలో మార్కెట్ కాపిటలైజేషన్ రూ.1,534 కోట్ల నుంచి రూ.37 కోట్లకు తరిగిపోయింది. సింగపూర్ కేంద్రంగా అవినీతి బాగోతం సుజనా చౌదరికి చెందిన గ్రూపు ప్రస్తుతం సింగపూర్ కేంద్రంగా ‘ఇంట్రాసియా’ పేరుతో అంతర్జాతీయ కంపెనీల గ్రూపును నిర్వహిస్తోంది. ఈ గ్రూపు కింద బిస్ట్రోలియా అసియా, మ్యాగ్నమ్ ఎంటర్‌ప్రైజస్, సన్ ట్రేడింగ్ లిమిటెడ్, మైక్రోపార్ట్ ఇంటర్నేషనల్, బీజింగ్ గ్రేట్ ఫారŠూచ్యన్ ఇంటర్నేషనల్, రోడియం రీసోర్సస్, పీఏసీ వెంచర్స్ పీటీఈ లిమిటెడ్, ఏపీఐఈఎస్ వెంచర్స్ పీటీఈ లిమిటెడ్, స్కైవెల్ గ్రూప్, పోలిలక్స్ ఇంటర్నేషనల్, మాంటన్ రిసోర్సస్ పీటీఈ లిమిటెడ్, ట్రయంప్ అగ్రి పీటీఈ లిమిటెడ్, అగ్రిట్రేడ్ ఇంటర్నేషనల్ పీటీఈ లిమిటెడ్, దీప్ పోకెట్స్ ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో పలు కంపెనీలను నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీలను కేవలం రికార్డుల్లో చూపిస్తూ అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు పొందడం, అనంతరం సుజనా చౌదరికి చెందిన ఇతర కంపెనీలకు నిధులు మళ్లించడమే లక్ష్యంగా వ్యవహారాలు సాగించారు. అందుకోసం సింగపూర్ కేంద్రంగా పక్కా పన్నాగం అమలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార లావాదేవీలు సాగించినట్లు రికార్డుల్లో చూపించాయి. అనంతరం ఆ కంపెనీలన్నీ తమ వ్యాపారాలను బీమా చేయించుకున్నాయి. ఈ బీమాను చూపించి అంతర్జాతీయ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొందాయి. అనంతరం ఆ నిధులను సుజనా చౌదరి వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించారు. అలా అటు అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీలను, ఇటు అంతర్జాతీయ బ్యాంకులను సుజనా చౌదరి మోసగించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రుణం సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన హెస్టియా హోల్డిండ్ లిమిటెడ్, నువాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థలు మారిషస్ కమర్షియల్ బ్యాంకుల నుంచి రూ.107 కోట్ల రుణం తీసుకుని.. తిరిగి చెల్లించకుండా బోర్డు తిప్పేశాయి. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మారిషస్ కమర్షియల్ బ్యాంకు పిటిషన్ దాఖలు చేసింది. ►సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన నువాన్స్ హోల్డింగ్స్‌తో(హాంకాంగ్) సంబంధం ఉన్న సెలెన్ హోల్డింగ్స్ ఏఎఫ్ఆర్ ఆసియా బ్యాంకు నుంచి 5 మిలియన్ డాలర్లును 2011న జూలైలో రుణంగా తీసుకుంది. ఆ తర్వాత స్టాండర్డ్ బ్యాంక్–మారిషస్ నుంచి 12 మిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. ►బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్టŠస్ లిమిటెడ్ పేరుతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.304 కోట్ల రుణం తీసుకోవడానికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సుజానా గ్రూపు సమర్చించడంపై సీబీఐకి ఆ బ్యాంకు తాజాగా ఫిర్యాదు చేసింది. ►సుజనా గ్రూపు సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, ఇన్కమ్ ట్యాక్సుల రూపంలో రూ.962 కోట్లు చెల్లించకుండా ఎగ్గొట్టడంపై కేసుల విచారణ వివిధ దశల్లో ఉంది. -
విజయసాయిరెడ్డి లేఖకు రాష్ట్రపతి స్పందన
-
సుజనా అక్రమాలపై విచారణకు రంగం సిద్ధం!
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అక్రమ వ్యవహారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పందించారు. విజయసాయిరెడ్డి లేఖకు బదులిస్తూ రాష్ట్రపతి కార్యాలయం.. ఆ లేఖను హోం మంత్రిత్వ శాఖకు పంపింది. ఈ క్రమంలో హోం మంత్రిత్వ శాఖ సదరు లేఖను సంబంధిత శాఖలకు పంపించింది. దీంతో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి వ్యవహారాలపై ఏ క్షణంలోనైనా విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. కాగా వివిధ బ్యాంకులకు కోట్ల రూపాయల మేర నష్టం చేకూర్చినట్లు సుజనా చౌదరిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయనకు చెందిన విలువైన ఆస్తులను ఈడీ ఇప్పటికే జప్తు చేసింది. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి ఆర్థిక నేరాలు, ఆయన అక్రమ కంపెనీలు, మనీ లాండరింగ్ వ్యవహారాలు, వ్యాపార కుంభకోణాలపై విచారణ జరపాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. కాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన సుజనా చౌదరి టీడీపీని వీడి.. బీజేపీలో చేరడంతో స్వప్రయోజనాల కోసమే ఆయన బీజేపీలో చేరారంటూ విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. -
అందుకే ఆయన బట్టలు చించుకుంటున్నారు!
సాక్షి, అమరావతి: మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలపై ఆయన ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అమరావతిలో రాజధాని, భోగాపురం ఎయిర్ పోర్టు, ఇంకా ఏదయినా ప్రకటనకు ముందే తన వాళ్లకు సమాచారం ఇచ్చి చంద్రబాబు ఇన్ సైడర్ ట్రేడింగుకు పాల్పడ్డారు. అది ఆయన పేటెంట్. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని రావడం ఇష్టం లేని దత్తపుత్రుడు, పచ్చపార్టీ నేతలు వైఎస్సార్ సీపీపై నిందలు వేస్తున్నారు’ అని మండిపడ్డారు. ‘రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న వారంతా... అమరావతిని అధికారికంగా ప్రకటించకముందే చంద్రబాబు నాయుడు బంధువులు, బినామీలు, పచ్చ మాఫియా వేల ఎకరాలు ఎలా కొన్నారో అర్థం చేసుకోవాలి. రాజధాని వస్తుందని అందరికీ ఒకే రోజు కల వచ్చిందా’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదే విధంగా రాజధాని అంశంపై ఎంపీ సుజనా చౌదరి వ్యవహార శైలిపై విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు... ‘ రాష్ట్రాల రాజధానుల ఎంపిక కేంద్రం పరిధిలో ఉండదని చట్టసభల సభ్యులందరికీ తెలుసు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కూడా ఈ విషయం స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు కోవర్టు సుజనా చౌదరి మాత్రం కేంద్రం చూస్తూ ఊరుకోదని బట్టలు చింపుకుంటున్నాడు. అసలు విషయమేమిటంటే అమరావతిలో ఆయన భూములున్నాయి’ అని ట్విటర్లో పేర్కొన్నారు.(3 రాజధానులు: జీవీఎల్ కీలక వ్యాఖ్యలు) -
సీఎం జగన్ అంగీకరిస్తే సుజనా మా పార్టీలోకి...
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగీకరిస్తే సుజనా చౌదరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని అనుకుంటున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ప్రధానమంత్రిని కలిసినంత మాత్రాన బీజేపీతో టచ్‌లో ఉన్నారని అనడం భావ్యం కాదని ఆయన పేర్కరొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ఎవరూ కూడా పార్టీ మారరని స్పష్టం చేశారు. అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని ఎంపీ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. 20మంది టీడీపీ ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకువెళ్లాలని ఆయన ఈ సందర్భంగా సుజనా చౌదరికి సూచించారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని సుజనా చౌదరి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేనందునే తాను వివరణ ఇస్తున్నానని అన్నారు. ఊహాజనితంగా మాట్లాడటం సబుబు కాదని, ఎవరైనా టచ్‌లో ఉంటే వారి పేర్లు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్‌పై ప్రజల్లో బలమైన విశ్వాసం ఉందన్నారు. పరిణితి చెందిన ఏ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దూరం కారని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కాగా టీ కప్పులో తుఫాన్‌లాంటి ఘటనలు జరిగాయని, తెలుగు భాషపై దుమారం చెలరేగిందని, నిన్న ముఖ్యమంత్రిని కలిసి వివరణ ఇచ్చినట్లు రఘురామకృష్ణంరాజు అన్నారు. -
దమ్ముంటే ఒక్క పేరు చెప్పు
సాక్షి, న్యూఢిల్లీ: సుజనా చౌదరి నోరు అదుపులో పెట్టుకోవాలని, ఆయనలా బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన చరిత్ర తమది కాదని వైఎస్సార్ సీపీ ఎంపీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ఎంపీలు తనతో టచ్‌లో ఉన్నారంటూ కారుకూతలు కూస్తే సహించేది లేదని, దమ్ముంటే ఒక్క ఎంపీ పేరు చెప్పాలని వారు సవాల్ విసిరారు. శుక్రవారం ఢిల్లీలో వైఎస్సార్ సీపీ ఎంపీలు ఎన్.రెడ్డప్ప, నందిగం సురేష్, దుర్గాప్రసాద్, తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, సత్యవతి, గొడ్డేటి మాధవిలు మీడియాతో మాట్లాడుతూ సుజనా వ్యాఖ్యల్ని తూర్పారబట్టారు. బీజేపీలో చేరి చంద్రబాబు కోవర్టులా పనిచేస్తున్నారని.. అసలు సుజనా ఒరిజినల్ బీజేపీనా? డూప్లికేటా? అని ప్రశ్నించారు. చచ్చిన టీడీపీని బతికించేందుకు సుజనా చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని, అతని గురించి ఎవర్ని అడిగినా బ్యాంకు దొంగనే చెబుతారని ఎద్దేవా చేశారు. సుజనా, సీఎం రమేష్‌లను నమ్ముకొని ఏపీలో రాజకీయాలు చేయాలనుకుంటే కుక్క తోక పట్టుకొని సముద్రాన్ని ఈదినట్లేనని.. బ్యాంకులకు రూ. 6 వేల కోట్లు ఎగ్గొట్టిన సుజనా చౌదరి వాటిని చెల్లించాక మాట్లాడాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక హద్దుదాటి ఆరోపణలు చేస్తున్నారని, వైఎస్ జగన్ తలుపులు తెరిస్తే టీడీపీ ఖాళీ అవుతుందని వారు హెచ్చరించారు. ఒక పార్టీ తరఫున ఎన్నికై మరో పార్టీలో చేరిన సుజనా గురించి ఎవర్ని అడిగినా బ్యాంకు దొంగే అని చెబుతారని వ్యాఖ్యానించారు. మరో 15 ఏళ్లు జగనే సీఎం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ.. ఎన్నికల్లో తమకు వైఎస్ జగన్మోహన్రెడ్డి టికెట్టిచ్చారని, కొన ఊపిరి ఉన్నంతవరకూ జగన్ వెంటే తాము నడుస్తామని వైఎస్సార్సీపీ ఎంపీలు స్పష్టం చేశారు. ‘విరాళాలు ఇచ్చి ఎంపీ పదవిని కొనుక్కున్న సుజనా చౌదరికి వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత లేదు. మరో 15 ఏళ్లు ఆయనే సీఎంగా ఉంటారు’ అని పేర్కొన్నారు. సుజనా.. బ్యాంకుల లూటీ ఎలాగో ప్రెస్‌మీట్ పెట్టండి! ట్విట్టర్లో విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సాక్షి, అమరావతి: సుజనాచౌదరి ప్రెస్‌మీట్ చూస్తే భారతీయ జనతా పార్టీ(బీజేపీ) వేరు.. అందులో ఉన్న ‘బాబు జనాల పార్టీ’(బీజేపీ) వేరని అందరికీ మరోసారి అర్థమైందంటూ ట్విట్టర్లో వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘సుజనా వారి మాయా సామ్రాజ్యం మీద ఒకప్పుడు వరుస కథనాలతో మోతెక్కించిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు సుజనా చౌదరిని జస్టిస్ చౌదరిగా చూపించేందుకు ప్రెస్‌మీట్‌ను లైవ్‌లో మోతెక్కించింది. దానికి కారణం.. పబ్లిక్ ఇంట్రెస్టా? లేక పబ్లిక్‌గా తెలిసిపోయిన ఇంట్రెస్టా?. అవినీతి మీద చంద్రబాబు.. ఆకలి మీద లోకేష్ నాయుడు.. అక్రమాలపై అచ్చెన్నాయుడు.. మహిళా రక్షణ మీద చింతమనేని.. సంస్కారం మీద ఉమా.. స్పీకర్ పదవి ఔన్నత్యం మీద యనమల లెక్చర్ ఇస్తే ఎలా ఉంటుందో.. ఏపీ ప్రయోజనాలపై మీరు ప్రెస్మీట్లు పెడితే అలాగే ఉంటుంది. బ్యాంకుల లూటీపై మీరు ముంచేసిన బ్యాంకుల అధికారులతో ప్రెస్‌మీట్ పెట్టండి’ అని ట్వీట్ చేశారు. -
‘సుజనా చౌదిరిలా గోడ దూకి వెళ్లే వారెవరూ లేరు’
సాక్షి, విశాఖపట్నం : సుజనా చౌదరిలాగా దొడ్డి దారిన గోడ దూకి వెళ్లే ఎంపీలు తమ దగ్గర లేరని మత్స్యశాఖా మంత్రి మోపిదేవి వెంకట రమణ స్పష్టం చేశారు. సుజనా చౌదరి చేసిన కామెంట్లపై స్పందించిన మంత్రి మోపిదేవి శుక్రవారం కౌంటర్ ఇచ్చారు. మంత్రి మోపిదేవి మాట్లాడుతూ.. ప్రలోభాలకులోనై పార్టీని వీడి వేరే పార్టీలోకి వెళ్లే నాయకులు తమ పార్టీలో లేరంటూ వ్యాఖ్యానించారు. తమ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఒక్క ఎంపీ కూడా కదలరని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రమని, వెంకటేశ్వరస్వామి సన్నిధిని ఆర్ధిక వనరుగా భావించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. టీటీడీ బోర్డు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చు కానీ, వాటిపై పూర్తి సమాచారం లేకుండా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. -
లోకేష్‌కు అంత సీన్ లేదు: కొడాలి నాని
.సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి నారా లోకేష్‌కు లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘లోకేష్ తిన్నది అరక్క నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అతడిని మించిన సైకో ఎవరూ లేరు. మంత్రి పదవి కోసం చంద్రబాబును సోఫాలో పడుకోబెట్టి ఒత్తిడి తెచ్చిన సైకో. వైఎస్సార్ కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. లోకేష్ తిన్నది అరక్క నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. లోకేష్ తాత గురించి తిరుపతిలో ఎవరిని అడిగినా చెబుతారు. ఇక చంద్రబాబు రాష్ట్రాన్ని దోచేసిన దొంగ. ఎంపీ సుజనా చౌదరి బ్రోకర్లా మాట్లాడుతున్నారు. బ్యాంకులకు కన్నాలేసిన దొంగ ఆయన. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు బీజేపీలోకి వెళ్లాల్సిన ఖర్మ పట్టలేదు.’ అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. -
మేము ఉడుత పిల్లలం కాదు... పులి పిల్లలం..
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి బురద జల్లడం మానుకోవాలని అనంతపురం వైఎస్సార్ సీపీ ఎంపీ తలారి రంగయ్య హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సుజనా చౌదరి మోసాలపై ఏడాది కిందట బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సుజనా చరిత్ర బీజేపీ నేతలే బయటపెట్టారని, పార్టీ మారినా ఆయన టీడీపీకి మేలు చేసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘ఉలిక్కి పడటానికి మేము ఉడుత పిల్లలం కాదు...పులి పిల్లలం. సుజనా నీకు ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారు. వార్డు మెంబర్‌గా గెలవని నువ్వు..మాపై విమర్శలా?. బ్యాంకులకు కన్నాలు వేయడమే నీ పని’ అని ఎంపీ తలారి రంగయ్య ధ్వజమెత్తారు. టీడీపీ టచ్ అందరికీ ప్రమాదం.. విరాళాలు ఇచ్చి ఎంపీ పదవి కొనుకున్న సుజనా చౌదరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత లేదని ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ వ్యాఖ్యలు చేశారు. ‘బ్యాంకులు లూటీ చేసిన నీకు రాజ్యాంగంపై నమ్మకం ఉందా?. డొల్ల కంపెనీలు పెట్టి బ్యాంకుల డబ్బు తీసుకు వెళ్లిన దొంగ. పారదర్శకత, జవాబుదారితనం పాలన అందిస్తున్న నేత వైఎస్ జగన్. టీడీపీ భవిష్యత్ సర్వ నాశనం చేసినవారిలో సుజనా చౌదరి నెంబర్ వన్. సుజనా చౌదరి మేక్ ఇన్ ఇండియా కాదు...స్పాయిల్ ఆఫ్ ఇండియా. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చైర్మన్ పదవులు, రిజర్వేషన్లు ఇచ్చిన ఘటన సీఎం జగన్‌ది. వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి ఎంట్రీ లేకపోవడంతో టీడీపీ నేతలు బీజేపీ పంచన చేరుతున్నారు. మరో పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా జగన్ ఉంటారు. కలిసి కష్టాలు పంచుకున్నాం. ఆయనతో మేము ఉంటున్నాం. టీడీపీ టచ్ తగిలి కాంగ్రెస్ సర్వ నాశనం అయింది. తెలుగుదేశం పార్టీ టచ్ అందరికీ ప్రమాదమే’ అంటూ ఎంపీ విమర్శలు గుప్పించారు. చదవండి: మేము తలుపులు తెరిస్తే టీడీపీ ఖాళీ సుజనా చంద్రబాబు ఏజెంట్... ఎంపీ సుజనా చౌదరిని నమ్ముకుంటే కుక్కను పట్టుకుని గోదారి ఈదినట్లేనని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. యూనివర్సిటీ భూములను అమ్మినట్లు నిరూపించకపోతే సుజనా పార్లమెంట్ వద్ద ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఇంగ్లీష్ విద్యను దూరం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని, ఊరికే అభాండాలు వేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని ఎంపీ గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. పార్టీ మారిన సుజనా చౌదరి ఇప్పటికీ చంద్రబాబు ఏజెంట్ అని అన్నారు. టీడీపీ ఎందుకు మాట్లాడం లేదు.. కార్పొరేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఉంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు మాట్లాడటం లేదని వైఎస్సార్ సీపీ ఎంపీ సత్యవతి సూటిగా ప్రశ్నించారు. ప్రజలంతా ఇంగ్లీష్ మీడియం కావాలని అంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇంగ్లీష్ మీడియం కోసం ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారని, అలా అని తెలుగు భాషను ప్రభుత్వం విస్మరించడం లేదన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడితే మూల్యం తప్పదని ఆమె అన్నారు. తెలుగు భాష గురించి మాట్లాడిన వాళ్లు ఎప్పుడైనా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారా అని, సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాలపై మాట్లాడే అర్హత సుజనా చౌదరికి లేదని అరకు ఎంపీ మాధవి పేర్కొన్నారు. -
వాటిలో చంద్రబాబు దిట్ట: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ బాబు.. ఇద్దరూ యూ టర్న్‌కు అలవాటు పడ్డారని మంత్రి పేర్నినాని ధ్వజమెత్తారు. మొన్నటి వరకు ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబు నేడు ఇంగ్లీష్‌ను తానే తీసుకువచ్చానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. శుక్రవారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు తాను నమ్మిన సిద్ధాంతం యూ టర్న్‌లో దిట్ట అని, తండ్రి లాగే తనయుడు కూడా యూ టర్న్‌కు అలవాటు పడ్డాడని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని నేరుగా ఎదుర్కొనే దైర్యం లేక మత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేసే గుంటనక్క రాజకీయాలను ప్రజలు నమ్మరని మంత్రి పేర్కొన్నారు. ఇంటి దొంగలను బీజేపీ ఎప్పుడు పట్టుకుంటుందో ఇంగ్లీష్ మీడియంలో తెలుగు ఉండదని ఎవరు చెప్పారని మంత్రి ప్రశ్నించారు. ఇంగ్లీష్ మీడియంపై ప్రజల నుంచి మద్దతు రావడంతో బాబు యూటర్న్ తీసుకొని మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబును ఆయన కుమారుడు, మనవడు, కోడలు ఇంగ్లీష్ చదువుకోలేదా అని ప్రజలు నిలదీస్తున్నారన్నారు. ఇంగ్లీష్ మీడియంపై రాద్దంతం చేసి చంద్రబాబు నవ్వులపాలయ్యారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ నాయుడు, లోకేష్ ది యూ టర్న్ జీవితమేనని వ్యాఖ్యానించారు. పిల్లిలా ఉన్న చంద్రబాబును పులిగా చూపించాలని ఎల్లో మీడియా ఎంత ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మడం లేదని చురకలు అంటించారు. చంద్రబాబు ఎన్ని అబద్దాలు చెప్పిన ఎల్లో మీడియా మొదట పేజీల్లో ప్రచురిస్తుందన్నారు. సుజనా చౌదరి పార్టీ మారిన తరువాత సుజనా కాల్ డేటా పరిశీలిస్తే చంద్రబాబుతో ఎన్ని సార్లు మాట్లాడారో తెలుస్తుందన్నారు. సుజనా చౌదరి వంటి ఇంటి దొంగలను బీజేపీ ఎప్పుడు పట్టుకుంటుందో చూడాలని, కేంద్రం నిర్వహించే విశ్వవిద్యాలయంలో ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో చెబుతున్నారని ప్రశ్నించారు. సుజనా బీజేపీలోకి ఎందుకు వెళ్లారు.. సుజనా చౌదరి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారని, హజ్ యాత్రకు వెళ్ళినప్పుడు చంద్రబాబు డబ్బులిస్తే సుజనా చౌదరి ఎందుకు ప్రశ్నించలేదని పేర్ని నాని నిలదీశారు. బ్యాంకులను సైతం లూటీ చేసిన ఘనత సుజనా చౌదరిది... సుజనా చౌదరి ఎందుకు టీడీపీతో టచ్‌లో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతల ఇంటికి సుజనా చౌదరి ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని.. మోదీ గొప్పతనం గురించి సుజనా చౌదరి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అసలు బీజేపీలోకి సుజనా ఎందుకు వెళ్లారో చెప్పాలని, టీడీపీ నేతలు ప్రభుత్వ కార్యాలయాలు, అన్న క్యాంటీన్లకు పసుపు రంగు వేస్తే పవన్ నాయుడు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. మిషనరీ పాఠశాలలో తనకు దేశ భక్తి నేర్పారని చెప్పుకునే పవన్ కళ్యాణ్ వీటిపై ఎందుకు ప్రశ్నించలేదని వ్యాఖ్యానించారు. చదవండి : ‘సహకార రంగాన్ని బాబు పూర్తిగా నాశనం చేశారు’ అలాగే.. ‘దివంగత ఎన్టీఆర్ పార్టీని పెట్టినప్పుడు టీడీపీని బంగాళాఖాతంలో కలుపుతానని చెప్పిన చంద్రబాబు యూటర్న్ తీసుకొని టీడీపీలో చేరారు. బీజేపీతో పొత్తు పెట్టుకొనని చెప్పి యూ టర్న్ తీసుకొని మళ్ళీ పొత్తు పెట్టున్నాడు. ఎన్టీఆర్ ఫొటో అవసరం లేదని చెప్పి ..ఎన్టీఆర్ చనిపోయిన తరువాత ఓట్లు కోసం యూటర్న్ తీసుకొని ఆయన ఫొటో పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు. ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పి యూ టర్న్ తీసుకున్న వ్యక్తి చంద్రబాబు. టీడీపీకి వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు సోనియా, మమతా, స్టాలిన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన చంద్రబాబు ఇప్పుడు వారిని మర్చిపోయారు. ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ, అమిత్ షాను తిట్టిన చంద్రబాబు ఎన్నికల తరువాత యూ టర్న్ తీసుకొని మళ్ళీ వాళ్ళను పొగుడుతున్నారు. పవన్ నాయుడు కోసం టీడీపీ అభ్యర్థిని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు’ అని చంద్రబాబు తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
మేము తలుపులు తెరిస్తే టీడీపీ ఖాళీ
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బీజేపీతో తమ పార్టీ ఎంపీలు ఎవరు టచ్‌లో ఉన్నారో చెప్పాలని సవాల్ విసిరారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు శుక్రవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో టీడీపీపై నిప్పులు చెరిగారు. తమ పార్టీ ఎంపీలపై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తలుపులు తెరిస్తే టీడీపీ ఖాళీ అవుతుంది. సీఎం జగన్ అనుకుంటే అర్థగంటలో అందరూ వైఎస్సార్ సీపీలోకి వచ్చేస్తారు. కానీ అటువంటి పనులకు తమ నాయకుడు దూరం. బీజేపీతో వైఎస్సార్ సీపీ ఎంపీలు ఎవరు టచ్‌లో ఉన్నారో చెప్పాలి. బీజేపీలో ఉన్న సుజనా చౌదరి ఇంకా టీడీపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అయిదు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి టీడీపీకి కనిపించడం లేదా?. ఇసుక అమ్ముకుని బతికిన ఘటన టీడీపీది. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ప్రజలంతా జగన్ పాలన శభాష్ అంటున్నారు. సుజనా చౌదరి ఎవరూ అంటే బ్యాంక్ దొంగ అని అందరూ అంటారు. గూగుల్‌లో సెర్చ్ చేసినా బ్యాంక్ దొంగ అనే వస్తుంది. ఆయన తన పబ్బం గడుపుకోవడానికి వైఎస్సార్ సీపీ ఎంపీలపై నిందలు వేస్తున్నారు. బ్యాంకులకు రూ.6 వేలకోట్లు ఎగ్గొట్టిన దానిపై సుజనా చౌదరి మాట్లాడాలి. మా కొన ఊపిరి ఉన్నంతవరకూ వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటాం. ఏ మాత్రం స్తోమత లేని మమ్మల్ని ఎంపీలుగా వైఎస్ జగన్ గెలిపించారు. మాపై పత్రికల్లో అన్యాయంగా, అక్రమంగా, అబద్ధాలు రాస్తూనే ఉన్నారు. రాధాకృష్ణ పేపర్ సర్క్యులేషన్ పెంచుకోవడానికి అబద్ధాలు ప్రచారం చేయొద్దు అని హితవు పలికారు. సుజనా చౌదరి నీతులు చెప్పడం మానుకో.. వైఎస్సార్ సీపీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ... ‘ఎంగిలి మెతుకులు తిని సుజనా చౌదరి మాట్లాడవద్దు. ఏపీలో టీడీపీ చచ్చిపోయింది. భవిష్యత్‌లో బతికే అవకాశమే లేదు. ఇంగ్లీష్ మీడియంపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. బీజేపీలో ఉంటూ టీడీపీ నాయకుడిలా సుజనా చౌదరి ఎలా మాట్లాడతారు?. మేము రెండు పూటలా తిండి కోరుకునేవాళ్లం. మీకులా బ్యాంకులకు కన్నాలు వేసేవాళ్లం కాదు. పైసా ఖర్చు చేయకుండా మేం ఎన్నికల్లో గెలిచాం. ఏపీని సూట్‌కేసుల చంద్రబాబు దోచుకున్నారు. మీ పాలనలో అమరావతిలో ఒక్క శాశ్వత భవనం ఎందుకు కట్టలేదు. సుజనా చౌదరి పార్టీ మారినా...చంద్రబాబు కోవర్టుగా పని చేస్తున్నారు. చనిపోతున్న టీడీపీని బతికించుకునేందుకు బీజేపీలో చేరారు. పోలవరం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. బ్యాంకులను మోసం చేసిన చౌదరి నీతులు చెప్పడం మానుకో. అరెస్ట్‌ల భయంతో బీజేపీ నేతల కాళ్లు మొక్కి ఆ పార్టీలో చేరారు. జైలుకు వెళ్లకుండా నిన్ను నువ్వ కాపాడుకో. మా మీద ఫోకస్ కాకుండా నీ పని చూసుకో. తమతో టచ్‌లో ఉన్నారని అవాకులు చెవాకులు పేలితే తీవ్ర పరిణామాలు తప్పవు. పేదవాడికి టికెట్ ఇచ్చి గెలిపించిన నాయకుడు వైఎస్ జగన్. ఆయన ఆశయ సాధనకు పని చేస్తాం’ అని తెలిపారు. -
సుజనా చౌదరిపై విజయసాయిరెడ్డి ఫైర్
సాక్షి, అమరావతి : ఎంపీ సుజనా చౌదరి పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే భారతీయ జనతా పార్టీ(బీజేపి) వేరు... అందులో ఉన్న బాబు జనాల పార్టీ(బీజేపి) వేరు అని అందరికీ మరోసారి బాగా అర్థమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు టచ్‌లో ఉన్నారంటూ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ’అవినీతి మీద చంద్రబాబు నాయుడు, ఆకలి మీద లోకేష్ నాయిడు, ఇసుక అక్రమాల మీద అచ్చెం నాయుడు, మహిళా రక్షణ మీద చింతమనేని, సంస్కారం మీద ఉమా, స్పీకర్ పదవి ఔన్నత్యం మీద యనమల లెక్చర్ ఇస్తే ఎలా ఉంటుందో... బ్యాంకు లూటీల భజనా చౌదరి ఏపీ ప్రయోజనాల గురుంచి ప్రెస్మీట్లు పెడితే కూడా అలాగే ఉంటుంది’ అని ఎద్దేవా చేశారు. ‘ఈసారి సుజనా చౌదరి వెరైటీ ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది. విలేకర్లను కాకుండా తాను వేల కోట్ల మేర ముంచేసిన అర డజను బ్యాంకుల అధికారుల్ని ఎదుట కూర్చోపెట్టి వారి ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తే... ఆయన పార్టీ ఎందుకు మారాడో, చంద్రబాబు ఆయనను ఎందుకు పార్టీ మార్చాడో అన్నీ అర్ధమవుతాయి’ అని చురకలు అంటించారు. ఇక ఎల్లో మీడియా తీరును ప్రస్తావిస్తూ... ‘"సుజనా వారి మాయా సామ్రాజ్యం" మీద ఒకప్పుడు మొదటి పేజీలో వరస కథనాలతో మోతెక్కించిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు... సుజనా చౌదరిని జస్టిస్ చౌదరిగా చూపించేందుకు నిన్న ప్రెస్ మీట్‌ను లైవ్‌లో, లైవ్ స్ట్రీమింగ్‌లో మోతెక్కించిందంటే... కారణం పబ్లిక్ ఇంట్రెస్టా? లేక పబ్లిక్‌గా తెలిసిపోయిన ఇంట్రెస్టా?’ అని విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా బ్యాంకులకు కోట్ల రూపాయల మేర నష్టం చేకూర్చినట్లు సుజనా చౌదరిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన సుజనా చౌదరి టీడీపీని వీడి.. బీజేపీలో చేరారు. ఈ క్రమంలో స్వప్రయోజనాల కోసమే ఆయన బీజేపీలో చేరారంటూ విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
ప్రకాశం జిల్లా టీడీపీ పై బీజేపీ కన్ను!
-
చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు ఝలక్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు ఝలక్ ఇచ్చారు. ఇసుకపై ప్రభుత్వ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు కనీస స్పందన కరువైంది. జిల్లాలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండగా ఏ ఒక్కరూ నిరసన దీక్షలో పాల్గొనకుండా ముఖం చాటేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు సైతం నిరసన దీక్షలు చేపట్టలేదు. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు సైతం గైర్హాజరు కావడంపై ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు జిల్లాలోనే ఉన్నప్పటికీ నిరసన దీక్షలు చేపట్టి దాఖలాలు లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. టీడీపీ ఓటమిపాలైన తరువాత పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాలకు అనేక మంది ముఖ్య నేతలు డుమ్మా కొడుతుండటంతో టీడీపీ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తల్లో అంతర్మథనం నెలకొంది. జిల్లాలో శుక్రవారం టీడీపీ నేతల నిరసన దీక్షలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇసుక విధానంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీక్షల్లో పాల్గొనాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో టీడీపీ అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పిలుపును పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. ఇసుక విషయంలో ప్రభుత్వం నిజంగా విఫలం చెంది ఉంటే టీడీపీ నేతలతోపాటు భవన నిర్మాణ కారి్మకులు సైతం వీరి నిరసన దీక్షలకు మద్దతు తెలిపేవారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా ఇసుకను తవ్వేసి కోట్ల రూపాయలు దోచేసిన విషయం అందరికీ తెలిసిందే. దీన్ని నివారించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్న విషయం టీడీపీ నేతలకూ తెలుసు. అందుకే చంద్రబాబునాయుడు ఎంత గొంతు చించుకున్నా సొంత పార్టీ నేతలే స్పందించని దయనీయ పరిస్థితి. ప్రకాశం జిల్లాలో జిల్లా కేంద్రంతోపాటు రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నప్పటికీ ఏ ఒక్కచోట నిరసన దీక్షా శిబిరాలు ఏర్పాటు చేయలేదు. జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో సైతం టీడీపీ ఛోటా నేతలు 20 మంది కార్యకర్తలతో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చి నిరసన కార్యక్రమాన్ని ముగించారు. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని నియోజకవర్గాలకు పార్టీ బాధ్యులుగా ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, మాజీ మంత్రి, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జి శిద్దా రాఘవరావు, అద్దంకి, పర్చూరు, చీరాల, కొండపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, కరణం బలరాం, డోలా బాల వీరాంజనేయస్వామిలు సైతం ముఖం చాటేశారు. కందుకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక్క కనిగిరి నియోజకవర్గంలో మాత్రం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డి తహసీల్దార్ కార్యాలయం వద్ద కొద్దిసేపు నిరసన తెలిపి వెళ్లిపోయారు. అక్కడ మినహా ఏ ఒక్క నియోజకవర్గంలోనూ కనీసం వినతిపత్రం ఇచ్చిన దాఖలాలు కూడా లేవంటే టీడీపీ నేతలకు చంద్రబాబు ఇచ్చిన పిలుపుపై ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్కాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని నియోజకవర్గాలకు టీడీపీ బాధ్యులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, పిడతల సాయికల్పనా రెడ్డిలు మాత్రం మార్కాపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. టీడీపీ నేతలు జిల్లాలోని మూడు చోట్ల చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి ఎటువంటి మద్దతు లభించలేదు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కారి్మకులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణా జరగకుండా తీసుకుంటున్న చర్యలను అర్థం చేసుకున్నారు కాబట్టే వారి నుంచి టీడీపీ నేతలకు ఎటువంటి మద్దతు లభించలేదనేది రుజువైంది. టీడీపీ నేతలు తూతూమంత్రంగా నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు సొంతపార్టీ నేతలే డుమ్మా కొట్టడం చూస్తుంటే ఇసుక పాలసీపై వారిలో ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పనవసరం లేదు. మొత్తానికి నిరసన కార్యక్రమాలకు టీడీపీ ముఖ్యనేతలంతా గైర్హాజరు కావడంతో ఉన్న పరువు కాస్తా పోయిందని టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేత సుజనా చౌదరితో కరణం విందు రాజకీయం బీజేపీ నేత సుజనా చౌదరితో టీడీపీ ఎమ్మెల్యే సాగించిన విందు రాజకీయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇసుక సరఫరాపై ప్రభుత్వ తీరుకు నిరసనగా రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపు కరణం బలరాం పట్టించుకోలేదు. ఒంగోలు నగరంలోనే ఉన్నప్పటికీ జిల్లా కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొనని ఆయన బీజేపీ నేత సుజనా చౌదరితో కలిసి ఒంగోలు నగరంలోని ఓ టీడీపీ నాయకుని ఇంటిలో విందు ఆరగించడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి లేని తీరిక బీజేపీ నేతతో భోజనం చేయడానికి ఎలా వచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు. భోజనం అనంతరం సుజనా చౌదరితో బలరాం రహస్య మంతనాలు సాగించినట్లు సమాచారం. -
'సుజనాచౌదరి ఒక డుప్లికేట్ లీడర్'
సాక్షి, ఢిల్లీ : సుజనా చౌదరి ఒక డుప్లికేట్ లీడర్ అంటూ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఫైర్ అయ్యారు. చంద్రబాబు అజెండా మోయడానికే నీవు బీజేపీలో చేరిన మాట వాస్తవం కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు. నీకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా ? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమిత్ షాతో జరిపిన చర్చలకు సంబంధించిన వివరాలను గోడదూకిన నీలాంటి వారికి చెప్పే అర్హత లేదని విమర్శించారు. దీనికి సంబంధించి అధికారికంగా వెల్లడించే హక్కు కేంద్ర ప్రభుత్వానికే ఉంటుదన్న విషయం ఎలా మరిచిపోయావంటూ ప్రశ్నించారు. సుజనా చౌదరీ ఒకప్పుడు ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా ధర్మదీక్ష పోరాటాలు చేసారు. అలాంటిది ఇప్పుడు అదే పార్టీలో చేరి ఢిల్లీలో కూర్చొని చంద్రబాబు ఏజెంట్లా వ్యవహరిస్తూ విషపు కూతలు కూస్తున్నారంటూ మండిపడ్డారు. సుజనా ఒక డుప్లికేట్ లీడర్ అని, ఆయన మాటలకు ఎక్కడా విలువ లేదని, ఎథిక్స్ కమిటీకి ఫిర్యాధు చేస్తామని తెలిపారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా చౌదరీ లాంటి వాళ్లు చట్ట సభల్లోకి రాకుండా పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెడతాం అని పేర్కొన్నారు. -
సుజనాచౌదరిని కలిసిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని
-
సుజనా చౌదరితో వల్లభనేని వంశీ భేటీ
-
సుజనా చౌదరితో ఎమ్మెల్యే వంశీ భేటీ
సాక్షి, గుంటూరు : కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో భేటీ అయ్యారు. గత కొంతకాలంగా వంశీ పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో సుజనాని కలవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే గతంలో కూడా ఎమ్మెల్యే వంశీ టీడీపీ వీడతారనే ప్రచారం జరిగింది. తాజాగా వీరిద్ధరి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఎమ్మెల్యే వంశీ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా ఇటీవల ఏపీలో పర్యటించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని కూడా వంశీ కలిశారు. దీంతో అప్పటి నుంచే ఆయన పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. గతంలో సుజనా చౌదరి కూడా బీజేపీలో చేరాలంటూ వంశీని ఆహ్వానించినట్లు మీడియాలో వచ్చిన వార్తలను తోసిపుచ్చారు ఇక సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ నేతలు పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలతో పాటు, పార్టీ నేతలు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. రెండు రోజుల క్రితం మాజీమంత్రి, టీడీపీ నేత ఆదినారాయణరెడ్డి కూడా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు వంశీపై నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
దేవతల యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టు..
సాక్షి, తాడేపల్లి: అవినీతిరహిత పరిపాలన అందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం పని చేస్తున్నారని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రాన్ని 14 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు మాత్రం ప్రతిక్షణం సీఎం వైఎస్ జగన్ మీద బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నారని, ఒకవైపు చంద్రబాబు విషం కక్కుతుండగా.. మరోవైపు ఎల్లో మీడియా దానికి వంతపాడుతోందని మండిపడ్డారు. చంద్రబాబు పిల్లిలా అరిస్తే పులిలా గాండ్రించారని ఎల్లో మీడియా మొదటి పేజీలో వార్తలు రాస్తోందని, దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులను అడ్డుకున్నట్లు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి పనులు చేస్తుంటే.. చంద్రబాబు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆయన గురువారం తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఎల్లో మీడియా సాయంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తండీ కొడుకులు ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు తన పాలనలో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతిని అరికడతామని సీఎం వైఎస్ జగన్ చెప్పారని, రివర్స్ టెండరింగ్ అద్భుతమైన విజయం సాధించిందన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా పొలవరంలో 780 కోట్ల ప్రజా ధనాన్ని సీఎం ఆదా చేశారని కొనియాడారు. పీపీఏల ద్వారా ఏడాదికి రూ. 2,500 కోట్లు నష్టం ప్రభుత్వానికి వస్తుందని, పీపీఏల్లో వందల కోట్లు కమీషన్ పేర్లతో నొక్కేశారని అంబటి పేర్కొన్నారు. రూ. 87వేల కోట్ల రైతు రుణాలను రూ. 24వేలకోట్లకు కుదించి.. అందులో రూ.15వేల కోట్ల రుణాలు మాత్రమే చంద్రబాబు తనహయాంలో మాఫీచేశారని, 4, 5 విడతల రుణమాఫీ నిధులు ఇవ్వకుండా చంద్రబాబు రైతులను మోసం చేశారని అంబటి మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీకి సీఎం వైఎస్ జగన్‌కు ఏమి సంబంధమని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ గ్రామస్వరాజ్యంవైపు అడుగులు వేస్తుంటే.. గ్రామసచివాలయాల పరీక్షల పేపర్ లీక్ అయిందని ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు వీలుగా సీఎం వైఎస్ జగన్ రూపకల్పన చేశారని వివరించారు. బాబుకు సిగ్గు అనిపించడం లేదా? లింగమనేని గెస్ట్‌హౌస్‌లో చంద్రబాబు ఎందుకు ఉన్నారు? ఆయన సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదని అంబటి ప్రశ్నించారు. అనుమతి లేని అక్రమ నివాసంలో ఆయన ఎందుకు ఉంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబుకు అక్రమ ఇంట్లో ఉండటం సిగ్గు అనిపించడం లేదా అని నిలదీశారు. చంద్రబాబు వెంటనే ఆ అక్రమ ఇంటి నుంచి మారి ఆదర్శమైన రాజకీయ నాయకుడిగా మారాలని సూచించారు. కమలవనంలో పచ్చ పుష్పం సుజనా చౌదరి కమలవనంలో ఉన్న పచ్చ పుష్పమని ఎద్దేవా చేశారు. ఇంకా టీడీపీ నేతగానే సుజనా చౌదరి మాట్లాడుతున్నారని, రివర్స్ టెండరింగ్‌లో రూపాయలు వందల కోట్లు మిగిలిన సంగతి సుజనా చౌదరికి కనిపించడం లేదా అని నిలదీశారు. గతంలో మేఘ కంపెనీకి చంద్రబాబు కాంట్రాక్టులు ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. -
‘చంద్రబాబు అక్కడ ఎందుకు ఉంటున్నాడో అర్థం కావట్లే’
సాక్షి, న్యూఢిల్లీ : కృష్ణా కరకట్టపై నివాసం ఉంటున్న చంద్రబాబు ఇంకా ఎందుకు అక్కడ ఉంటున్నాడో అర్థం కావడం లేదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. కరకట్టపై చంద్రబాబు తన నివాసాన్ని వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. తానైతే ఆ ఇంట్లో అసలు ఉండేవాడిని కాదని తేల్చి చెప్పారు. ఆ నిర్మాణాన్ని ప్రభుత్వం కూల్చి వేస్తే బాబు సానుభూతి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌లో ప్రజాధనం ఆదా చేయడం మంచి విషయమని ప్రశంసించారు. అయితే ఈ విధానంతో అవినీతిని ఏ రకంగా ఆదా చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని సుజనా చౌదరి కోరారు. -
రాజధానిపై భిన్నస్వరాలు
-
జమిలి ఎన్నికలు: చంద్రబాబు ఎమ్మెల్యే మాత్రమే
సాక్షి, విజయవాడ : మూడేళ్లలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశముందంటూ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. జమిలి ఎన్నికలపై మాట్లాడే స్థాయిలో చంద్రబాబు లేరని, ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని సుజనా పేర్కొన్నారు. జమిలి ఎన్నికలపై తనకు సమాచారం లేదని తెలిపారు. పోలవరంపై కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని, ఆ తర్వాత టీడీపీ హయాంలోనూ కాలయాపన జరగడం వల్ల ట్రాక్ తప్పిందని సుజనా పేర్కొన్నారు. -
బాబుకు హృదయ కాలేయంగా మారాడు!
సాక్షి, అమరావతి : మోసాలు చేయడంలో ఆరితేరిన ఎంపీ సుజనా చౌదరి చంద్రబాబుకు హృదయ కాలేయంగా మారిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. అమరావతిలో తనకు సెంటు భూమి కూడా లేదని సుజనా చౌదరి బుకాయిస్తున్నారని మండిపడ్డారు. బ్యాంకులకు ఆరు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఈడీకి అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా ఆయన ఇలాగే దబాయించారని గుర్తుచేశారు. ఆ కంపెనీలతో తనకేం సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారని..ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కాగా టీడీపీ సీనియర్ నేత, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన సుజనా చౌదరి ఇటీవలే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈగ వాలకుండా చూస్తోంది.. అధికారంలో ఉన్నన్నాళ్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దోపిడీ బయట పడకుండా కాపాడిన ఎల్లో మీడియా ఇప్పటికీ బానిసత్వం కొనసాగిస్తూనే ఉందని విజయసాయిరెడ్డి విమర్శించారు. అసెంబ్లీ దొంగ కోడెల, ఆయన దూడల మీద ఇప్పటికీ ఈగ వాలకుండా చూసుకుంటోందని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా అనే మూడు కన్ను తెరుచుకుందని... మీరెంతగా నిజాలు దాయాలని ప్రయత్నించినా అది రెప్ప వాల్చదని ట్విటర్ వేదికగా ఎల్లో మీడియా తీరును ఎండగట్టారు. అదేవిధంగా..‘తొమ్మిదేళ్ల పదవీ కాలంలో హైదరాబాదును నిర్మించానని జబ్బలు చర్చుకునే పెద్దమనిషి 5 ఏళ్లలో అమరావతిలో 4 తాత్కాలిక భవనాలకు మించి ఎందుకు కట్టించలేక పోయారో చెప్పరు. అక్కడా, ఇక్కడా ఆయన బినామీలతో చేయించింది రియల్ వ్యాపారమే. అదే అభివృద్ధి అంటూ ప్రచారం చేస్తారు’ అని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అవినీతి సామ్రాట్లు
-
సెంటు భూమి లేదా.. మరి ఇవి ఎవరివి?
-
సుజనా.. భూ ఖజానా
సాక్షి, అమరావతి: సుజనా చౌదరి అలియాస్ యలమంచిలి సత్యనారాయణ చౌదరి.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సయామీ కవల. జాతీయ బ్యాంకులకు రూ.ఆరు వేల కోట్లకు పైగా ఎగ్గొట్టిన ఘనుడు! రాజధాని ప్రాంతంలో తనకుగానీ తన కుటుంబ సభ్యులకుగానీ ఒక్క సెంటు భూమి కూడా లేదని బుకాయిస్తున్నారు. సెంటు కాదు.. ఏకంగా 623.12 ఎకరాల భూములు సొంతం చేసుకున్నది మాత్రం నిజం! సుజనా చౌదరి తన కుటుంబ సభ్యులు, షెల్ కంపెనీల పేర్లతో అమరావతి ప్రాంతంలో 623.12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు గత ఎన్నికల ముందు విచారణలో స్వయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నిగ్గు తేల్చింది. టీడీపీ అధికారం కోల్పోయిన తక్షణమే చంద్రబాబు కనుసైగతో బీజేపీలో చేరిన సుజనా ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తాము, తమ సన్నిహితులు రైతుల నుంచి తక్కువ ధరకు కాజేసిన రూ.లక్ష కోట్ల విలువైన భూములను కాపాడుకునేందుకు యత్నిస్తున్నారనేది తాజా పరిణామాలతో స్పష్టంగా తెలుస్తోంది. చదవండి: ఏపీ రాజధానిపై మహాకుట్ర! భూ దోపిడీ ముగిశాక తాపీగా ప్రకటన రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు అధికారంలో ఉండగా అదిగో రాజధాని.. ఇదిగో రాజధాని అంటూ లీకులిచ్చారు. ఈ సమయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా సుజనా తదితర టీడీపీ నేతలు రాజధానిలో రైతుల నుంచి తక్కువ ధరలకే భూములను కొనుగోలు చేశారు. ఈ భూ దోపిడీ ముగిశాక 2014 సెప్టెంబరు 4న శాసనసభలో చంద్రబాబు రాజధానిపై తాపీగా ప్రకటన చేశారు. రాజధానిలో తనకు సెంటు కూడా స్థలం లేదంటున్న సుజనా తన బినామీలు, సన్నిహితుల పేర్లతో కృష్ణా, గుంటూరు జిల్లాలో కొనుగోలు చేసిన భూముల చిట్టా చూస్తే కళ్లు తిరగడం ఖాయం..! సెంటు భూమి లేదా.. మరి ఇవి ఎవరివి? - కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో సుజనా చౌదరి ఏర్పాటు చేసిన 120 కంపెనీల్లో ఒకటైన శివసత్య పిగ్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సర్వే నెంబర్లు 432–1, 403–5, 433, 434, 402–1ఏ, 429, 428, 412, 410–2, 427–2, 413, 415, 416, 431, 437, 399–7, 404–11, 407–4లలో 110.6 ఎకరాలను రాజధాని ప్రకటన వెలువడక ముందే ఎకరం రూ.ఐదు లక్షల చొప్పున కొనుగోలు చేస్తూ అగ్రిమెంట్ చేసుకున్నారు. రాజధాని ప్రకటన వెలువడ్డాక గుడిమెట్లలో ఎకరం రూ.50 లక్షలకుపైగా పలుకుతోంది. ఈ లెక్కన రూ.50 కోట్లకుపైగా సుజనా చౌదరి దోచుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ భూములను 2018లో సుజనా తన సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సుజనా సోదరుడు యలమంచిలి జతిన్ కుమార్ పేరుతో ఏర్పాటు చేసిన శివజ్యోతి ఫ్లైకాన్ బ్లాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సర్వే నెంబర్లు 404–1, 404–5, 404–6లలో 11.56 ఎకరాలను రాజధాని ప్రకటన రాకముందే ఎకరం రూ.5 లక్షల చొప్పున కొనుగోలు చేసి 2014లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గమనార్హం. - నందిగామ మండలం చందాపురంలో ఎస్జేకే బయోటెక్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సుజనా చౌదరి సర్వే నెంబర్లు 6–1ఏ, 7–1, 8–1, 9–2ఏ, 6–2, 6–3ఏ, 8–1, 9–1ఏ, 9–1సీ, 9–1డీలలో 87 ఎకరాల భూమిని రాజధాని ప్రకటన వెలువడక ముందే రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేసుకున్నారు. 2018లో తన సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. - సుజనా సోదరుడు యలమంచిలి జతిన్ కుమార్ తన సోదరుడి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసే హర్షానంద పేరుతో శ్రీ కళింగ గ్రీన్‌టెక్ కెమికల్స్ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ పేరుతో రాజధాని ప్రకటనకు ముందే కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో సర్వే నెంబర్లు 399–7, 402–1ఏ, 403–4, 5, 6, 404–1, 5, 6, 9బీ, 11, 12, 410–2, 412, 413, 415, 416, 417–4, 427–2, 428–1, 2, 429, 431, 432–1, 433, 434, 437లలో 126.44 ఎకరాల భూమిని ఎకరం రూ.ఐదు లక్షల చొప్పున కొనుగోలు చేశారు. అంటే రైతులను మోసం చేసి రూ.56.89 కోట్ల మేర లబ్ధి పొందినట్లు విశదమవుతోంది. వాటికి సమీపంలోనే ఉన్న 130 ఎకరాల అటవీ భూములును కబ్జా చేయడానికి పావులు కదుపుతున్నారు. - సుజనా తన సోదరుడి కుమారుడు యలమంచిలి సుధీర్ పేరుతో కంచికచర్ల మండలం మొగులూరులో సర్వే నెంబరు 88–1, 88–2ఏలో ఎకరం, 115–3, 116–3, 91–3, 98–2, 97–1, 90–4, 92–1, 88–3, 100, 91–1, 97–2ఏ, 58, 69–2, 102–4, 101–2బీ, 89–2 తదితర చోట్ల 36 ఎకరాలను రాజధాని ప్రకటన వెలువడక ముందే అగ్రిమెంట్ చేసుకుని తరువాత రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. - కంచికర్ల మండలం బత్తినపాడులో యలమంచిలి సుధీర్ పేరుతో 38–1, 22–1, 39–1ఏ, 20–1ఏ1, 50–1బీ, 21–2ఏ, 59–1బీ తదితర సర్వే నెంబర్లలో 25 ఎకరాలను రాజధాని ప్రకటన వెలువడక ముందే తక్కువ ధరకే అగ్రిమెంట్ చేసుకుని 2015లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. - తాడికొండ మండలం రావెలలో సుజనా తన సమీప బంధువు యలమంచిలి ఝాన్సీ లక్ష్మి పేరుతో సర్వే నెంబర్ 295లో 1.26 ఎకరాలను రాజధాని ప్రకటన వెలువడక ముందే తక్కువ ధరకు కొనుగోలు చేసి 2015లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. - యడ్లపాడు మండలం యడ్లపాడు గ్రామంలో 461–ఈ, 459, 460, 461–ఏ, 460–1డీ, 461–ఎఫ్, 460–ఎఫ్లలో ఎనిమిది ఎకరాలను రాజధాని ప్రకటన వెలువడక ముందే సుజనా తన సమీప బంధువు యలమంచిలి ఝాన్సీ లక్ష్మి పేరుతో తక్కువ ధరకే కొనుగోలు చేసి 2015లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. - మంగళగిరి మండలం నవులూరు సర్వే నెంబరు 364–3ఏ, 370–బి1, 371–ఏ1లో 1.2 ఎకరాలు, సర్వే నెంబర్లు 364–3ఈ, 371–ఏ2లో 0.60 ఎకరాలను సుజనా తన సమీప బంధువు యలమంచిలి రత్నకుమారి పేరుతో కొనుగోలు చేశారు. - నందిగామ మండలం అడవిపావులపాడులో సత్యవతి బయోలైఫ్ సైన్సెస్ పేరుతో సర్వే నెంబరు 174–3, 174–5, 176–2లో 19.5 ఎకరాల భూమిని రాజధాని ప్రకటన వెలువడక ముందు సుజనా రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేశారు. - సుజనా తన సోదరుడు యలమంచిలి శివలింగప్రసాద్ పేరుతో పెనుగంచిప్రోలు మండలం కొనకంచిలో సర్వే నెంబర్లు 40, 41–2ఏ, 41–2సీలలో 4.385 ఎకరాలు, వీరులపాడు మండలం వెల్లంకిలో సర్వే నెంబర్లు 251–1, 251–2లో 1.99 ఎకరాలు భూమిని రాజధాని ప్రకటన వెలువడక ముందే తక్కువ ధరకు కొన్నారు. - సుజనా తన సోదరుడి కుమార్తె యలమంచిలి రుషికన్య పేరుతో వీరులపాడు మండలం గోకరాజుపల్లిలో సర్వే నెంబర్లు 15–04, 7–2, 7–3బీ, 7–3సీ, 8.2ఏ, 9–1బీ, 9–2బీలలో రాజధాని ప్రకటన వెలువడక ముందే తక్కువ ధరకు 14.07 ఎకరాలను కొన్నారు. - వీరులపాడు మండలం పొన్నవరంను దత్తత తీసుకున్న సుజనా అక్కడ తన తండ్రి వై.జనార్దనరావు పేరుతో సర్వే నెంబరు 38–1, 40లలో 13.39 ఎకరాలు, సోదరుడు వై.శివరామకృష్ణ పేరుతో సర్వే నెంబరు 41లో 3.5 ఎకరాలు, సోదరుడు వై.శివలింగ ప్రసాద్ పేరుతో సర్వే నెంబరు 78లో 4.03 ఎకరాలు, తన భార్య యలమంచిలి సుశీలాకుమారి పేరుతో సర్వే నెంబరు 38–2లో 6.14 ఎకరాలు వెరసి 31.09 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. - బాపులపాడు మండలం కనుమోలులో సుజనా తన సమీప బంధువులు యలమంచిలి ఝాన్సీ లక్ష్మి పేరుతో సర్వే నెంబరు 330లో 2.9 ఎకరాలు, సర్వే నెంబర్లు 331, 303, 325, 332లలో 19.11 వెరసి 22.01 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇదే మండలం అరుగొలనులో ఝాన్సీ లక్ష్మి, యలమంచిలి రాఘవేందర్‌ల పేరుతో 196, 199, 192, 181 సర్వే నెంబర్లలో 13 ఎకరాలు, యలమంచిలి కిరణ్‌కుమార్ పేరుతో 180, 181, 196, 199, 192, 352 తదితర సర్వే నెంబర్లలో 20 ఎకరాలు, యలమంచిలి రత్నకుమార్ పేరుతో 180, 196, 352, 199, 192, 181లలో 18 ఎకరాల భూమిని రాజధాని ప్రకటన వెలువడక ముందే సుజనా చౌకగా కొనుగోలు చేశారు. - కంకిపాడు మండలం గొడవర్రులో విజయ ప్రదాత అగ్రో ఇండస్ట్రీస్ పేరుతో 256, 257, 235, 273, 123, 260 తదితర సర్వే నెంబర్లలో 80 ఎకరాలు, సమీప బంధువు యలమంచిలి రామకృష్ణ పేరుతో 34.37 ఎకరాలు, యలమంచిలి రంజిత్ పేరుతో 6 ఎకరాలు, యలమంచిలి సంపత్ పేరుతో 43.97 ఎకరాలను రాజధాని ప్రకటన వెలువడక ముందే రైతుల నుంచి సుజనా తక్కువ ధరకు కొట్టేశారు. - కృష్ణా జిల్లా పెనమలూరులో యలమంచిలి సంపత్, యలమంచిలి రామకృష్ణ పేర్లతో సర్వే నెంబరు 188, 188–2, 188–3లో 1.36 ఎకరాలు, విజయప్రదాత ఆగ్రో ఇండస్ట్రీస్ పేరుతో 2.73 ఎకరాలను రాజధాని ప్రకటన వెలువడక ముందే తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసి 2015లో సుజనా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. -
‘పెయిడ్ ఆర్టిస్టులతో టీడీపీ తప్పుడు ప్రచారం’
సాక్షి, విజయవాడ : రాజధానిపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాజధాని ప్రాంత రైతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర రాజధాని ఒక ప్రాంతానికికో, ఒక సామాజిక వర్గానికో లేదా రాజకీయ నాయకుల సొంతం కాదని మరోసారి పునరుద్ఘాటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడూతూ.. ప్రాంతాల మధ్య తారతమ్యం రాకూడదనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమతమని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. రాజధాని అనేది ఐదు కోట్ల ప్రజానికానికి సంబంధించిన అంశమని, ఒక కులానికో, ప్రాంతానికో పరిమితం కాదని తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెలిపారు. టీడీపీ నేతలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. వరద సమయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ముంపు నుంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామన్నారు. రైతులకు చిన్న కష్టం వచ్చిన తమ ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. పెయిడ్ ఆర్టిస్టులతో టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ అంశం దొరుకుతుందా.. దాన్ని రాజకీయం చేసి లబ్ధిపొందుదామా అని ప్రతిపక్షం చూస్తుంది. కృష్ణా, పెన్నానది ప్రాంతంలో వరదలు వచ్చాయి. అన్ని శాఖలు సమన్వయంతో అన్ని ప్రాజెక్టులను పర్యవేక్షించుకుంటూ ఎప్పటికప్పుడు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో బేరీజు వేసుకుంటూ ఏ విధమైన నష్టం జరగకుండా కార్యక్రమాలు చేశారు. ఇంత వరదలు వచ్చినా పెయిడ్ ఆర్టిస్టులతో ఏ విధంగా విషప్రచారం చేయించారో చూశాం. చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంటే.. హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. వరదలు ఆగిపోయిన తరువాత వచ్చి పర్యటించినా ప్రజల నుంచి స్పందన లేదు. అయినప్పటికీ కార్యకర్తలను పెట్టుకొని ప్రభుత్వంపై నిందలు వేసి వెళ్లిపోయారు. బాబుకు బురదజల్లే ప్రయత్నం తప్ప బాధ్యత లేదు వైఎస్ జగన్ ప్రభుత్వం బాధ్యతాయుత ప్రభుత్వం. రైతుకు ఏ చిన్న కష్టం వచ్చినా ప్రభుత్వం సహించలేదు. ఏ కార్యక్రమం చేసినా అదే నేపథ్యంలో చేపడుతున్నాం. రైతుకు కష్టం కలిగించే ప్రయత్నం ప్రభుత్వం ఎప్పుడూ చేయదు. నా ఇల్లు ముంచడానికే ప్రయత్నం చేశారని ఆరోపణ చేశారు. ఇల్లు ముంచాలని అనుకుంటే అరగంట వరద ఆపితే సరిపోయేదని, కానీ, ప్రభుత్వం ఎవరికీ కష్టం కలిగించే ప్రయత్నం చేయదన్నారు. కృష్ణలంక, భవానీపురం ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేయాలని కోరాం. అలాగే చంద్రబాబు ఇంటికి వరద ప్రమాదం ఉందని ముందే చెప్పాం. దాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తూ, తండ్రీకొడుకులు ట్విటర్లో హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. 40 సంవత్సరాల హిస్టరీ ఇదేనా ’చంద్రబాబూ’ అని బొత్స ప్రశ్నించారు. ప్రభుత్వంపై బురదజల్లాలనే ప్రయత్నం తప్ప బాధ్యత లేదని, చంద్రబాబు ఇంకెప్పుడు తెలుసుకుంటారో తెలియడం లేదన్నారు. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం మాట్లాడుతుంటే సుజనా చౌదరి కూడా అదే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. విషయం ఏదైనా ఉంటే సూటిగా, బాధ్యతగా మాట్లాడాలని సుజనా చౌదరికి సూచించారు. రాజధాని ప్రాంతంలో భూముల్లేవంటూ సుజనా అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. సుజనాచౌదరి అల్లుడు జితిన్‌కుమార్ పేరుతో ఉన్న కలింగ గ్రీన్ టెక్ కంపెనీ పేరుమీద 110 ఎకరాలు ఉన్నాయన్నారు. సుజనా చౌదరికి ఉన్న 120 కంపెనీల్లో ఇది ఒకటని చెప్పారు. చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో 110 ఎకరాలు ఉందన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆయన సోదరుడి కుమార్తె యలమంచిలి రుషికన్య పేరుమీద వీర్లపాడు మండలం గోకరాజుపాలెంలో 14 ఎకరాలు ఉందన్నారు. ఒక్క ఎకరా చూపించమన్న సుజనా చౌదరికి 124 ఎకరాలు వారి కుటుంబాల పేరు మీద ఉన్నట్లు చూపించానన్నారు. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసి తెలంగాణలో పెట్టుబడులు చూస్తున్నామని యనమల రామకృష్ణుడు, హైదరాబాద్‌లో రియలెస్టేట్ చేస్తున్నామని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబులా రియలెస్టేట్ వ్యాపారం చేయడం తమకు రాదన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అక్రమాలకు తావుండదని మంత్రి పేర్కొన్నారు. -
పోలవరంపై టీడీపీవి అసత్య ప్రచారాలు: అనిల్ కుమార్
-
‘బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్ట్ ఆయనే’
సాక్షి, అమరావతి: సొంత ప్రయోజనాలు కోసం పాకులాడే సుజనా చౌదరి.. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించడం విస్మయం కలిగిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య(సీఆర్) అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సుజానా చౌదరి బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్ట్ అని ఆరోపించారు. సుజనా లాంటి వారు పక్కన చేరి చంద్రబాబును ముంచేశారన్నారు. ప్రభుత్వం చేస్తోన్న ప్రతి పనిని మేనిఫెస్టోలో చెప్పే చేశామని తెలిపారు. అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులు రాలేదని.. వచ్చుంటే ప్రజలపై మరింత భారం పడేదన్నారు. పీపీఏలను సమీక్ష చేస్తే తప్పేంటన్నారు. చంద్రబాబు ప్రజల గురించి ఆలోచిస్తారా, కార్పొరేట్ల గురించి ఆలోచిస్తారా అని ప్రశ్నించారు. పీపీఏల సమీక్ష జరిగితే కార్పొరేట్ కంపెనీలు ఇచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేయాలని చంద్రబాబుకు భయమా అని ఎద్దేవా చేశారు. డెవిల్స్ అడ్వకేటుగా ఉండొద్దు పీపుల్స్ అడ్వకేటుగా ఉండాలి కానీ.. డెవిల్స్ అడ్వకేటుగా ఉండకూడదని చంద్రబాబుకు హితవు పలికారు. అన్నక్యాంటీన్లు మేడిపండులాగా ఉన్నాయని.. తవ్వేకొద్దీ దోపిడీ బయటపడుతుండటంతో ప్రక్షాళన చేస్తున్నామన్నారు. దోపిడీని అరికడుతుంటే హర్షించాల్సిన బీజేపీ.. విమర్శలు చేయడం సరికాదన్నారు. నిన్నటి వరకు చంద్రబాబును విమర్శించిన బీజేపీ ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతుందో అర్ధం కావడం లేదన్నారు. టీడీపీ కాళ్లు చేతులు విరిగాయి కాబట్టి ఆ గ్యాపులో దూరేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ ఎదగాలని ప్రయత్నించడంలో తప్పు లేదని.. కాని ఎకనమిక్ టెర్రరిస్టులను, ఫ్యాక్షన్ లీడర్లను బీజేపీ చేర్చుకుంటోందని రామచంద్రయ్య ఆక్షేపించారు. -
ఆయన ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్నారా?
సాక్షి, విజయవాడ : పోలవరం ప్రాజెక్ట్ పనులను నిలిపివేశామని టీడీపీ అసత్య ప్రచారాన్ని నీటి పారుదల శాఖమంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఖండించారు. శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా పోలవరంపై పూర్తి స్పష్టత ఇచ్చారని ఆయన తెలిపారు. పోలవరం ఒక్కటే కాదని, నిబంధనలకు విరుద్దంగా అంచనాలు పెంచి ఖరారు చేసిన ప్రతి ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆయన సోమవారం విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు అసలు పోలవరం ఊసే ఎత్తలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మహోన్నత ఉద్దేశంతో పోలవరానికి శ్రీకారం చుట్టారు. గడిచిన అయిదేళ్లలో కూడా చంద్రబాబు పాలనలో పోలవరం ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగాయి. మూడేళ్ల పాటు పనులు చేయకుండా ఎన్నికల ముందు పోలవరం వద్ద హడావిడి చేసి షో చేశారు. పనుల కంటే ప్రచారంపైనే చంద్రబాబు ఎక్కువ శ్రద్ధ పెట్టారు. పబ్లిసిటీ పిచ్చితో రూ.200 కోట్లు వృధా చేశారు. చంద్రబాబు పోలవరం నిర్వాసితుల పునరావాసం గురించి ఏమైనా పట్టించుకున్నారా?. పునరావాసానికి ఇంకా సుమారు రూ.30వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. పునరావాస విషయంలో మేం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. చదవండి: పారదర్శకం.. శరవేగం.. వరద కారణంగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పనులు ప్రారంభించే అవకాశం లేదు. టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. రీ టెండరింగ్ నిర్వహించిన పనులను నవంబర్ నుంచి పారదర్శకంగా జరిగేలా చేస్తాం. వైఎస్సార్ పునాది వేసిన పోలవరాన్ని ఆయన తనయుడు వైఎస్ జగన్ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారు. దైవ నిర్ణయం కాబట్టే టీడీపీ హయాంలో పనులు ముందుకు సాగలేదు. ఎంపీ సుజనా చౌదరి వ్యవహారం చూస్తే విస్మయం కలుగుతోంది. ఆయన ఇంకా టీడీపీ నేతగానే కొనసాగుతున్నారా అనే అనుమానం కలుగుతోంది. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ ఆపేయాలని సుజనా చౌదరి చెప్పడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు తన అయిదేళ్ల పాలనలో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. అవినీతి సొమ్ము మూటగట్టుకుని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. చంద్రబాబు సర్కార్ చేసిన తప్పులను సరిదిద్ది పాలనను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి భేటీ అవుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు కావల్సిన నిధులు అడుగుతారు. ఈ విషయంలో చంద్రబాబుకు చింత అనవసరం. రివర్స్ టెండరింగుకు వెళ్తే తమ దోపిడీ బయటపడుతుందని టీడీపీకి భయమా?. సెప్టెంబర్ నాటికి కొత్త ఏజెన్సీలకు పనులు అప్పగిస్తాం. ప్రీ-క్లోజర్ విషయాన్ని పీపీఏకు, కేంద్రానికి నోట్ పంపాం. ఇక ఓ విధంగా లేబర్ కాంట్రాక్ట్ పనులు చేసిందని చెప్పాలని, నిబంధనల ప్రకారమే నోటీసులు ఇచ్చాం. కాఫర్ డ్యామ్ మునిగే పరిస్థితికి వచ్చింది. స్పిల్ వే మునిగిపోయింది. నవయుగకు ఇంకా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఏముంది?. ఆ కంపెనీకి నష్ట పరిహారం చెల్లించడం దేనికి?. డీజిల్, సిమెంట్, స్టీల్ ఖర్చులు ప్రభుత్వమే పెట్టింది. నవయుగ కేవలం లేబర్ కాంట్రాక్ట్ మాత్రమే చేసింది. బిల్లులన్నీ వెరిఫై చేస్తున్నాం. 60 సీ కింద కాంట్రాక్ట్ మార్పిడి జరిగిన సందర్భంలో ట్రాన్స్‌ట్రాయ్‌కి ఇచ్చిన డబ్బులను కూడా రికవరీ చేస్తాం. ఏదీ వదిలిపెట్టం’ అని స్పష్టం చేశారు. -
బాబును కేంద్రం జైలులో పెడుతుందని అనుకోను
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కేంద్ర ప్రభుత్వం జైలులో పెడుతుందని తాను అనుకోవడం లేదని ఇటీవల టీడీపీని వీడి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఏదైనా అంశంలో నిజాయితీగా విచారణ జరిపిస్తే చెప్పలేమన్నారు. బీజేపీలో చేరిన తర్వాత రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందా లేదా అన్నది విచారణ జరిపిస్తే గానీ చెప్పలేమని, అయితే పాలన మాత్రం గాడి తప్పిందని చెప్పగలనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం అన్యాయం చేయలేదన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని నిధులను మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిందని చెప్పారు. ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని, ఇప్పుడు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఇస్తానన్న ప్యాకేజీని తీసుకుంటే రాష్ట్ర అభివృద్ధికి మంచిదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఈ నెల 24న పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత రాష్ట్రమంతటా పర్యటిస్తానని చెప్పారు. విజయవాడకు వచ్చిన సుజనా చౌదరికి ఆయన అభిమానులు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ... ఎన్నికల ముందు రాష్ట్రంలో జరిగినవి ధర్మపోరాటాలు కాదు అధర్మ పోరాటాలు అని అన్నారు. విజయవాడలో సుజనా చౌదరి సన్మాన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హాజరు కాలేదు. చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం: సునీల్ దేవ్‌ధర్ వచ్చే రెండేళ్లలో అవినీతి చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవ్‌ధర్ అన్నారు. విజయవాడలో సుజనా చౌదరి సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో గత ఐదేళ్లలో టీడీపీ నేతలు కోట్ల రూపాయలు లూటీ చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీని దుష్ట కాంగ్రెస్ అనేవారని గుర్తుచేశారు. చంద్రబాబు తన మామ ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కావడంతోపాటు కాంగ్రెస్ పార్టీతోనూ కలిసిపోయారని విమర్శించారు. చంద్రబాబు బీజేపీ సహకారం లేకుండా ఎప్పుడూ అధికారంలోకి రాలేదన్నారు. -
నా ఫ్లెక్సీలో ఎన్టీఆర్ ఫొటో.. తప్పేముంది?
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి పథంలో నడపడంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి చెయ్యని విధంగా కేంద్రం ఏపీకి సాయం చేసిందని తెలిపారు. కానీ దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైందని చెప్పారు. తన ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్ ఫొటో ఎవరు పెట్టారో తెలియదని పేర్కొన్నారు. ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్ ఫొటో పెట్టడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఆదివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారమే తాను టీడీపీని వీడి బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై ఇప్పుడే ఆరోపణలు చేయడం సరైన పద్దతి కాదన్నారు. ఏపీలో నాయకుల వలసలను ప్రోత్సహించడం బీజేపీ ఉద్దేశం కాదన్నారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకనే ఏపీ అభివృద్ధి చెందలేదని వ్యాఖ్యానించారు. గతంలో బీజేపీపై తాను రాజకీయ విమర్శలు చేయలేదని.. టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయం మేరకే మాట్లాడాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్ల పాలన అంశాలపై త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. పక్క రాష్ట్రాల్లో రాజకీయ అస్థిరత కారణంగా ప్రభుత్వాలు కూలిపోతున్నాయని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమస్యలను బీజేపీకి అపాదించడం సరైన పద్దతి కాదని పేర్కొన్నారు. -
చంద్రబాబుకు చెప్పినా వినలేదు: సుజనా
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి టీడీపీ విమర్శలు గుప్పించారు. బీజేపీలో చేరిన అనంతరం తొలిసారి విజయవాడ వచ్చిన ఆయన ఆదివారం పార్టీ ఆత్మీయ సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ..‘కేంద్ర ప్రభుత్వం విషయంలో టీడీపీ చేసింది ధర్మ పోరాటాలు కాదు. అది అధర్మ పోరాటం. ధర్మపోరాట దీక్షలపై చంద్రబాబు నాయుడుకు వద్దని చెప్పినా వినలేదు. కొందరు నేతల మాటలు విని అధర్మ పోరాట దీక్షలు చేశారు. పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికి కట్టుబడి ఆనాడు బహిరంగంగా మాట్లాడలేకపోయాను. ఇప్పటివరకూ పరోక్ష రాజకీయాల్లో ఉన్నాను. బీజేపీలో చేరాక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నాను. ప్రపంచ దేశాల ముందు దేహీ అనే ప్రధానులే ఉన్నారు కానీ భారతదేశం గొప్పతనాన్ని చాటింది ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ నిర్ణయాలు ఏపీ అభివృద్ధి వైపే ఉన్నాయి. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయం అవ్వాలనే నేను భారతీయ జనతా పార్టీలో చేరాను.’అని చెప్పుకొచ్చారు. -
బొల్లినేని గాంధీకి సీబీఐ నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : ఆదాయానికిమించి ఆస్తులు ఆరోపణలతో అడ్డంగా దొరికిపోయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాజీ అధికారి, జీఎస్టీ సూపరింటెండెంట్ బొల్లినేని శ్రీనివాస గాంధీకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆయన ఆదాయానికి మించి విచ్చలవిడిగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన సీబీఐ అధికారులు నిన్న ఏకకాలంలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. కాగా జీఎస్టీ పన్ను ఎగవేత విభాగం సూపరింటెండెంట్‌గా కూడా ఆయన పలు కంపెనీలను ఇబ్బందులకు గురిచేశారన్న ఆరోపణలతో వీటిపై కూడా సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అలాగే హై ప్రొఫైల్ కేసులను డీల్ చేయడంలో పాటు, సీరియస్ కేసులను... చిన్న కేసులుగా మార్చి ఆ కేసులను మూసివేయడంలో ఘనాపాటీ అని ఆరోపణలు వెల్లువెత్తాయి. చదవండి: సీబీఐకి బుక్కయిన బొల్లినేని గాంధీ భారీ బ్యాంక్ ఫ్రాడ్ కేసులైన ఫోనిక్స్ గ్రూప్, ముసద్దీలాల్ జువెల్లరీ, లాంకో గ్రూప్, సుజనా గ్రూప్, క్యూ సిటీ గ్రూప్ కేసులను డీల్ చేసి... నిందితులకు సహకరించారని బొల్లినేని గాంధీపై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయన డీల్ చేసిన ఏ కేసు కూడా ఓ కొలిక్కి రానివ్వరంటూ ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే పూర్తి ఆధారాలున్నా కూడా సుజనా కంపెనీలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న ఫిర్యాదులు గాంధీపై వెల్లువెత్తాయి. ఇదే రీతిలో పలు కంపెనీల విషయంలోనూ గాంధీ చూసీచూడనట్లు వ్యవహరించారని.. ఫైళ్లను తారుమారు చేశారని కేంద్ర ఆర్థిక శాఖకు గతంలోనే పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను కాపాడిన నేపథ్యంలోనే గాంధీ ఇంత భారీస్థాయిలో అక్రమాస్తులను కూడబెట్టినట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. -
కేసుల భయంతోనే!
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేతకు కుడి, ఎడమలుగా చెప్పుకునే ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ముందస్తు ప్రణాళికలో భాగంగానే బీజేపీలో చేరినట్లు తెలుగు తమ్ముళ్లే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఈడీ, ఆదాయపన్ను కేసులతోపాటు రాజధానిలో కొనుగోలు చేసిన రూ.వందల కోట్ల విలువైన భూములను కాపాడుకోవడానికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పంచన చేరారంటున్నారు. బ్యాంకుల నుంచి రూ.6,000 కోట్ల మేర రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ పూర్తి ఆధారాలను సేకరించడంతో అరెస్ట్‌ల భయంతోనే ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి సుజనా చౌదరి ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపినట్లు ఆ పార్టీ నేతలు అంటున్నారు. దొంగ కంపెనీల పేరు మీద తీసుకున్న రూ.364 కోట్ల రుణాలు ఎటువంటి వ్యాపార లావాదేవీలు జరపకుండానే హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్‌కు చేరినట్లు ఈడీ దర్యాప్తులో తేలడంతో వైస్రాయ్ హోటల్‌కు చెందిన రూ.315 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఇప్పుడు ఈ మొత్తం వైస్రాయ్ హోటల్ నుంచి చివరకు ఎక్కడకు చేరిందన్న అంశం వెల్లడి కావాల్సి ఉంది. ఈ కేసులో ఇక అరెస్ట్ తప్పకపోవడంతో పాటు కుంభకోణం వెనుక ఉన్న పెద్ద వ్యక్తులు బయటకు వస్తారన్న భయంతోనే బీజేపీ పెద్దలు అమిత్ షా, రాంమాధవ్‌లతో సంప్రదింపులు జరిపారని, దీనికి ప్రధాని మోదీ ఆమోదముద్ర వేయడంతో సుజనా చౌదరి బీజేపీలో చేరారంటున్నారు. సీఎం రమేష్ కూడా రిత్విక్ ఇన్ఫ్రా పేరిట దొంగ ఇన్వాయిస్లు సృష్టించి రూ.800 కోట్ల నిధులను డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించినట్లు ఐటీ శాఖ అధికారులకు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ కేసులో సీఎం రమేష్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు అరెస్ట్ చేయడమే మిగిలింది. రాజధానిపై విచారణ భయంతో.. రాజధానిగా అమరావతిని ప్రకటించడం వెనుక పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లు, కేటాయింపులపై సమీక్ష చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో బాబు బినామీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాజధాని ప్రాంతం వివరాలను చంద్రబాబు ముందుగానే తన అనుయాయులకు లీక్ చేసి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయించినట్లు ఆరోపణలు రావడం తెలిసిందే. రాజధాని ప్రకటన వెలువడక ముందే సుజనా చౌదరి 700 ఎకరాలు, సీఎం రమేష్ 500 ఎకరాల వరకు బినామీల పేరుతో కొనుగోలు చేసినట్లు తెలుగు తమ్ముళ్లే బహిరంగంగా చెబుతున్నారు. టీజీ వెంకటేష్, గరికపాటి మోహనరావులు కూడా రాజధానికి చుట్టుపక్కల పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. వీరి వ్యాపారాలు కూడా ప్రస్తుతం సమస్యల్లో ఉన్నాయి. ఇప్పుడు రాజధాని భూములపై విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయన్న భయం వీరిని వెంటాడుతోంది. -
ఆ నలుగురిపై అనర్హత వేటు వేయండి..
సాక్షి, న్యూఢిల్లీ : పార్టీ మారిన నలుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు టీడీపీ నేతలు శుక్రవారం ఫిర్యాదు చేశారు. బీజేపీలో టీడీపీ రాజ్యసభాపక్షం విలీనం చెల్లదని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్, తోట సీతా రామలక్ష్మి, ఎంపీలు గల్లా జయదేవ్, కింజారపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని తదితరులు ఉప రాష్ట్రపతిని కలిశారు. విలీనం అంశాన్ని తప్పుబట్టిన వారు ....పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం పార్టీ మారినవారిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తాము విలీనం కోరుతూ ఎలాంటి తీర్మానం చేయలేదని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ పేర్కొన్నారు. మరోవైపు పార్టీ మారిన ఎంపీలు బీజేపీ సభ్యులే అంటూ రాజ్యసభ వెబ్సైట్లో అధికారికంగా పేర్కొన్న విషయం విదితమే. చదవండి: రాజ్యసభలో టీడీపీ ఎంపీలు ఇద్దరే.. టీడీపీ రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనం -
రాజ్యసభలో టీడీపీ ఎంపీలు ఇద్దరే..
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనానికి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోద ముద్ర వేశారు. దీంతో రాజ్యసభ వెబ్సైట్లో బీజేపీ సభ్యుల జాబితాలో టీడీపీ ఎంపీల పేర్లు అధికారికంగా నమోదు అయ్యాయి. దీంతో టీడీపీ రాజ్యసభ సభ్యులుగా తోట సీతా రామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్ పేర్లను మాత్రమే చూపుతోంది. మరోవైపు విలీనం చెల్లదంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు. కాగా టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనం చేస్తూ తీర్మానించిన లేఖను ఆ పార్టీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్ నిన్న వెంకయ్య నాయుడు నివాసానికి వెళ్లి అందచేసిన విషయం తెలిసిందే. అనంతరం ఎంపీలు సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ గురువారం సాయంత్రం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో వీరి చేరికల కార్యక్రమం జరిగింది. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా వారికి పార్టీ కండువా కప్పి.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసినట్టు ప్రకటించారు. అయితే, కాలికి గాయం కావడంతో గరికపాటి మోహన్‌రావు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. చదవండి: టీడీపీ రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనం -
‘చంద్రబాబు తప్పుడు లెక్కలు వేసుకున్నారు’
న్యూఢిల్లీ : ఎన్నికల్లో ప్రజా నాడిని గమనించడం వల్లనే తాము బీజేపీలో చేరామని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తెలిపారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడంపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తప్పుడు లెక్కలు వేసుకున్నారని అభిప్రాయపడ్డారు. గురువారం టీడీపీకి చెందిన మరో ముగ్గురు రాజ్యసభ సభ్యులతో కలిసి సుజనా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావద్దని తాను చంద్రబాబు నాయుడుకి చెప్పినట్టు వెల్లడించారు. కానీ ఆయన రాజకీయ వ్యుహం అంటూ ఎన్డీయేను వీడారని.. బహుశా చంద్రబాబు తప్పుడు లెక్కలు వేసుకున్నారని తెలిపారు. టీడీపీని వీడినందకు బాధగా ఉందని వ్యాఖ్యానించిన సుజనా.. టీడీపీకి తిరిగి పూర్వ వైభవం రావాలని కోరుకునే వ్యక్తుల్లో తాను మొదటివాడినని విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేలో మూడున్నరేళ్లు మంత్రిగా పనిచేశానని.. ప్రధాని మోదీ పనితీరును దగ్గర నుంచి చూశానని అన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమే.. రాష్ట్రానికి కేంద్రం ఎంత చేయగలదో అంత చేయడానికి నాటి కేంద్ర ప్రభుత్వం సిద్దపడిందని సుజనా గుర్తుచేశారు. ప్రత్యేక హోదా అనేది తన దృష్టిలో ముగిసిన అధ్యాయమని పేర్కొన్నారు. ఆర్థిక కేసులకు, రాజకీయాలకు సంబంధం లేదని అన్నారు. ఈ మధ్య కాలంలో తనపై వచ్చినవి కేవలం ఆరోపణలు మాత్రమేనని చెప్పారు. -
బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ ఎంపీలు
-
మనసు మార్చుకున్న ఎంపీ సీతా రామలక్ష్మి
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతా రామలక్ష్మి చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్‌రావుతో పాటు సీతా రామలక్ష్మి కూడా బీజేపీలో చేరతారని వార్తలు వెలువడ్డా...అనూహ్యంగా ఆమె వెనక్కి తగ్గారు. దీంతో టీడీపీ రాజ్యసభ సభ్యుల్లో ప్రస్తుతానికి సీతా రామలక్ష్మితో పాటు రవీంద్రకుమార్ మాత్రమే మిగలారు. చదవండి: రాజ్యసభలో టీడీపీ ఖాళీ! రాజ్యసభలో టీడీపీపీ బీజేపీలో విలీనం జ్యసభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీని తక్షణమే బీజేపీలో విలీనం చేయాలంటూ ఎంపీ సుజనా చౌదరి నేతృత్వంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు తీర్మానం లేఖను ఉప రాష్ట్రపతికి అందచేశారు. 10వ షెడ్యూల్‌ను అనుసరించి విలీనం చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంతో ప్రేరణ పొందామని, దేశ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని పార్టీని విలీనం చేస్తున్నట్లు టీడీపీ ఎంపీలు తెలిపారు. ఇక నుంచి తమను బీజేపీ ఎంపీలుగా గుర్తించాలని, తమ పార్టీ విలీనం అంగీకరించాలని బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాశామంటూ తీర్మానం ప్రతిపై ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్‌రావు సంతకం చేశారు. లెజిస్లేటివ్ పార్టీలో రెండింట మూడొంతులు ఫిరాయిస్తే విలీనం లాంఛనమే. రాజ్యసభ చైర్మన్‌ను కలిసి విలీనం లేఖను ఇచ్చిన అనంతరం నలుగురు ఎంపీలు బీజేపీ కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. -
బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు గురువారం బీజేపీలో చేరారు. తెలుగుదేశం ఎంపీలైన సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ గురువారం సాయంత్రం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో వీరి చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా వారికి పార్టీ కండువా కప్పి.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసినట్టు ప్రకటించారు. అయితే, కాలికి గాయం కావడంతో గరికపాటి మోహన్‌రావు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని, కానీ, బీజేపీలో చేరేందుకు సమ్మతి తెలుపుతూ ఆయన కూడా పత్రం పంపించారని, దీంతో ఆయనను కూడా పార్టీలోకి చేర్చుకుంటున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధి, ప్రగతి.. అమిత్ షా నేతృత్వంలో బీజేపీ సాధిస్తున్న విజయాలను చూసి.. ఏపీ ప్రయోజనాల కోసం బీజేపీ చేరాలని చాలాకాలంగా నలుగురు టీడీపీ ఎంపీలు భావిస్తూ వచ్చారని, ఇందులో భాగంగా టీడీపీ రాజ్యసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తామని తమను వారు కోరారని తెలిపారు. ఇందుకు ప్రధాని మోదీ, అమిత్ షా సమ్మతించారని, ఈ మేరకు విలీన పత్రాన్ని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి అందజేశామని తెలిపారు. విలీనం పూర్తికావడంతో ఇకపై వీరు బీజేపీ ఎంపీలుగా మారిపోయారని తెలిపారు. బీజేపీ సానుకూల రాజకీయాలను విశ్వసిస్తోందని, సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్న నినాదం ధ్యేయంగా తాము ముందుకు సాగుతామన్నారు. వీరి చేరికల వల్ల ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. సుజనా చౌదరి మాట్లాడుతూ.. ఇటీవల ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజల అభీష్టం ఎలా ఉందో స్పష్టమైందని, దీనిని గమనించి.. దేశ నిర్మాణంలో భాగం కావాలని, ఏపీ ప్రయోజనాల కోసం కృషి చేయాలని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అంతకుముందు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడును టీడీపీ ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు నలుగురి సంతకాలతో కూడిన లేఖను రాజ్యసభ చైర్మన్‌కు అందజేశారు. జాతి ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలు తమను ఆకర్షించాయని, అందువల్ల ఆయన నాయకత్వంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తమ లేఖలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ 4వ పేరాగ్రాఫ్‌లో పేర్కొన్న అంశాలను అనుసరించి తమ పార్టీ సభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు తెలిపారు. నలుగురు ఎంపీలు బీజేపీలో చేరడంతో రాజ్యసభలో టీడీపీ దాదాపు ఖాళీ అయింది. రాజ్యసభలో టీడీపీకి ప్రస్తుతం సీతారామలక్ష్మీ, రవీంద్రకుమార్ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
వారం క్రితమే చంద్రబాబును కలిశా...
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ధ్రువీకరించారు. తాను బీజేపీలో చేరబోతున్నట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు. గతంలో తాను బీజేపీ యూత్ వింగ్‌లో సభ్యుడినని టీజీ వెంకటేశ్ తెలిపారు. అప్పటి నుంచే తనకు బీజేపీతో అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. పార్టీ మార్పుపై ఇప్పటికే ఎంపీలు సంతకాలు చేసి తాము రాజ్యసభ చైర్మన్‌కు అందచేశామన్నారు. తమను బీజేపీలో విలీనం చేయాలని లేదా ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశామన్నారు. వారం క్రితమే చంద్రబాబు నాయుడుని కలిశానని, అయితే పార్టీని వీడొద్దని ఆయన చెప్పారన్నారు. ప్రజా నిర్ణయంలో పాటు, తమ ప్రాంత అభివృద్ధి మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేశ్ కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో రాజ్యసభలో టీడీపీ ఎంపీలు ఆరుగురు ఉండగా...నలుగురు బీజేపీలో చేరనుండటంతో ఇక ఇద్దరే మిగిలారు. చదవండి: టీడీపీలో భారీ సంక్షోభం! -
భారీ షాక్; రాజ్యసభలో టీడీపీ ఖాళీ!
సాక్షి, న్యూఢిల్లీ : మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా మారింది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి తేరుకోకముందే ఆ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు ఆ పార్టీని వీడారు. రాజ్యసభ సభ్యులు ఎంపీలు సుజనా సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు బీజేపీలో చేరనున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభలో తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుకు విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు నలుగురి సంతకాలతో కూడిన లేఖను రాజ్యసభ చైర్మన్‌కు అందజేశారు. జాతి ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలు తమను ఆకర్షించాయని లేఖలో పేర్కొన్నారు. ఈ కారణంగా ఆయన నాయకత్వంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ 4 వ పేరగ్రాఫ్లో పేర్కొన్న అంశాలను అనుసరించి తమ పార్టీ సభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి ఇక ఇద్దరు రాజ్యసభ సభ్యులు మాత్రమే మిగిలారు. కాగా విజయవాడ ఎంపీ కేశినేని కూడా టీడీపీని వీడి బీజేపీలో చేరతారని ఢిల్లీ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా... తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో టీడీపీ కాపు నేతలు రహస్యంగా సమావేశమైన సంగతి తెలిసిందే. దాదాపు 20 మంది మాజీ ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే పార్టీ ఓటమికి గల కారణాలను సమీక్షించేందుకే సమావేశమయ్యామని వారు చెబుతున్నా.. పార్టీలో అంతర్గత సంక్షోభానికి ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదే విధంగా చంద్రబాబు సూచనల మేరకే తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
టీడీపీలో భారీ సంక్షోభం!
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైంది. నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి వీడనున్నారని ఢిల్లీ నుంచి తాజా సమాచారం. బీజేపీలో చేరే యోచనలో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు రాజ్యసభలో తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడిని స్వయంగా కలిసి కోరనున్నారు. దీనిపై ఈ సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. తోట సీతారామలక్ష్మి కూడా టీడీపీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ రాజ్యసభ సభ్యుల్లో రవీంద్రకుమార్ మినహా మిగిలిన వారందరూ బీజేపీలో చేరాలని నిర్ణయించినట్లు సమాచారం. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా బీజేపీలో చేరతారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు రహస్యంగా సమావేశమయ్యారు. దాదాపు 20 మంది మాజీ ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో దేని గురించి చర్చించారనేది వెల్లడి కాలేదు. (చదవండి: నిట్టనిలువుగా చీలనున్న టీడీపీపీ) -
షెల్ కంపెనీలపై ఆరా?...
-
రెండో రోజూ ‘సుజనా’పై సీబీఐ దాడులు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిపై సీబీఐ దాడులు రెండోరోజు ఆదివారం కూడా కొనసాగాయి. శనివారం దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లో 12 చోట్ల దాడులు నిర్వహించి పలు కీలక పత్రాలు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. శనివారం రాత్రి సీబీఐ అధికారులు సీజ్ చేసిన నాగార్జున హిల్స్‌లోని సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కార్యాలయంతోపాటు, సుజనా నివాసంలో ఆదివారం కూడా సోదాలు కొనసాగాయి. ముందురోజు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల తాలూకు వివరాలపై కంపెనీలోని పలువురు డైరెక్టర్లను ప్రశ్నించినట్లు తెలిసింది. ఆదివారం తనిఖీల్లో బ్యాంకింగ్ ఫ్రాడ్ సెల్ టీం సభ్యులు కూడా పాల్గొన్నారు. బెంగళూరు, ఢిల్లీ నుంచి వచ్చిన దాదాపు 30 మందికిపైగా అధికారులు ఈ సోదాల్లో పాల్`గొన్నారు. షెల్ కంపెనీలపై ఆరా?... సుజనా గ్రూపునకు చెందిన షెల్ కంపెనీలపై సీబీఐ ఆరా తీసినట్లు తెలిసింది. బెస్ట్ క్రాంప్ట్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీఈపీఎల్) కంపెనీ, సుజనా గ్రూప్‌నకు చెందింది. దీన్ని సుజనా చౌదరి సీబీఐ మాజీ చీఫ్ విజయరామారావు కుమారుడితో కలసి ఏర్పాటు చేశారు. 2010 నుంచి 2013 మధ్య బ్యాంకుల కన్సార్టియం నుంచి దాదాపుగా రూ.315 కోట్ల మేర రుణం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మొత్తంలో ఆంధ్రాబ్యాంకు రూ.71 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు రూ.120 కోట్లు, సెంట్రల్ బ్యాంకు రూ.124 కోట్ల చొప్పున రుణాలు మంజూరు చేశాయి. గంగాస్టీల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ లిమిటెడ్, తేజస్విని ఇంజనీరింగ్ లిమిటెడ్, ఫ్యూచర్‌టెక్ ఇండస్ట్రీస్ కంపెనీల పేర ఈ రుణాలు తీసుకున్నట్లు సమాచారం. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి అయితే, వాటి నుంచి వివిధ డొల్ల కంపెనీలకు రుణాలు మళ్లించినట్లు గుర్తించిన సీబీఐ వాటి చిరునామాలపై ఆరా తీసిందని తెలిసింది. వాటి యజమానులు, చిరునామాలు, ఆఫీసు కార్యాలయాలు ఎక్కడున్నాయి? అన్న సమాచారం కోసం ప్రయత్నించినట్లు సమాచారం. ఆంధ్రాబ్యాంకు తమకు రావాల్సిన రూ.71 కోట్ల కేసులో చేసిన ఫిర్యాదు ఆధారంగా తాజాగా దాడులు జరిగాయి. ఇదే వ్యవహారంలో మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై ఏప్రిల్‌లో దాడులు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూ.315 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. -
నేడు మరోసారి సుజనా చౌదరి కంపెనీల్లో సోదాలు
సాక్షి, హైదరాబాద్ : బ్యాంకు రుణాల ఎగవేత కేసులో టీడీపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు శనివారం దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా నేడు మరోసారి సుజనా చౌదరికి చెందిన కంపెనీల్లో సోదాలు కొనసాగుతాయని సీబీఐ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. నిన్న బెంగళూరు నుంచి వచ్చిన అధికారులు బృందాలుగా విడిపోయి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కలిపి మొత్తం 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. పలు హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకోవడంతోపాటు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సూజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకొని ఎగవేసిన కేసులో సీబీఐ అధికారులతోపాటు బ్యాంకింగ్ ఫ్రాడ్ సెల్ టీం సభ్యులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. నకిలీ బిల్లులు సృష్టించి పెద్ద ఎత్తున బ్యాంకుల నుంచి పొందిన నిధులను ఇతర మార్గాల్లో డొల్ల కంపెనీలకు తరలించినట్లు సుజనా చౌదరిపై సీబీఐ అభియోగాలు నమోదు చేయడం తెలిసిందే. ఏం జరిగిందంటే? బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (బీసీఈపీఎల్) కంపెనీ సుజనా గ్రూప్‌నకు చెందింది. దీన్ని సుజనా చౌదరి సీబీఐ మాజీ చీఫ్ విజయ రామారావు కుమారుడితో కలసి ఏర్పాటు చేశారు. చెన్నైలోని ఆంధ్రా బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకుల నుంచి 2010 నుంచి 2013 మధ్యకాలంలో రూ. 364 కోట్లు రుణం తీసుకుంది. బీసీఈపీఎల్‌కు రుణం ఇచ్చేందుకు ఈ బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పడ్డాయి. ఈ మొత్తంలో ఆంధ్రా బ్యాంకు రూ. 71 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు నుంచి రూ. 120 కోట్లు, సెంట్రల్ బ్యాంకు నుంచి రూ. 124 కోట్లు తీసుకున్నారు. ఈ రుణాలను గంగా స్టీల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ లిమిటెడ్, తేజస్విని ఇంజనీరింగ్ లిమిటెడ్, ఫ్యూచర్ టెక్ ఇండస్ట్రీస్ కంపెనీలకు బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు సీబీఐ ఆధారాలు, పత్రాలు సేకరించింది. ప్రస్తుత దాడులు ఆంధ్రా బ్యాంకుకు సంబంధించి రూ. 71 కోట్ల ఎగవేతకు సంబంధించినవి కావడం విశేషం. చదవండి : సుజనా ఇంట్లో సీబీఐ సోదాలు -
హైదరాబాద్‌లోని సుజనా గ్రూప్ కార్యాలయం సీజ్
-
సుజనా ఇంట్లో సీబీఐ సోదాలు
సాక్షి, హైదరాబాద్ : బ్యాంకు రుణాల ఎగవేత కేసులో టీడీపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. బెంగళూరు నుంచి వచ్చిన అధికారులు బృందాలుగా విడిపోయి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కలిపి మొత్తం 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. పలు హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకోవడంతోపాటు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సూజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఉదయం 8 గంటలకు మొదలైన సోదాలు రాత్రి 11 గంటలకు ముగిశాయి. బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకొని ఎగవేసిన కేసులో సీబీఐ అధికారులతోపాటు బ్యాంకింగ్ ఫ్రాడ్ సెల్ టీం సభ్యులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. నకిలీ బిల్లులు సృష్టించి పెద్ద ఎత్తున బ్యాంకుల నుంచి పొందిన నిధులను ఇతర మార్గాల్లో డొల్ల కంపెనీలకు తరలించినట్లు సుజనా చౌదరిపై సీబీఐ అభియోగాలు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసులో మనీలాండరింగ్ కింద ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేస్తోంది. అయితే తాజాగా జరిగిన దాడులు మాత్రం సీబీఐ ఇటీవల సుజనాపై నమోదు చేసిన మరో కేసుకు సంబంధించినవి కావడం గమనార్హం. ఇందుకు సంబం«ధించి నలుగురు డైరెక్టర్లు శ్రీనివాస కల్యాణ్‌రావు, వెంకట రమణారెడ్డి, సుధాకర్‌రెడ్డి, రామకృష్ణ వర్మను అదుపులోకి తీసుకొని విచారించారు. హైదరాబాద్‌లోని సుజనా గ్రూప్ కార్యాలయాన్ని సీజ్ చేసిన దృశ్యం, సుజనా ఇంట్లో తనిఖీల అనంతరం తిరిగి వెళ్తున్న సీబీఐ అధికారులు ఏం జరిగిందంటే? బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (బీసీఈపీఎల్) కంపెనీ సుజనా గ్రూప్‌నకు చెందింది. దీన్ని సుజనా చౌదరి సీబీఐ మాజీ చీఫ్ విజయ రామారావు కుమారుడితో కలసి ఏర్పాటు చేశారు. చెన్నైలోని ఆంధ్రా బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, కార్పొరేషన్æ బ్యాంకుల నుంచి 2010 నుంచి 2013 మధ్యకాలంలో రూ. 364 కోట్లు రుణం తీసుకుంది. బీసీఈపీఎల్‌కు రుణం ఇచ్చేందుకు ఈ బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పడ్డాయి. ఈ మొత్తంలో ఆంధ్రా బ్యాంకు రూ. 71 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు నుంచి రూ. 120 కోట్లు, సెంట్రల్ బ్యాంకు నుంచి రూ. 124 కోట్లు తీసుకున్నారు. ఈ రుణాలను గంగా స్టీల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ లిమిటెడ్, తేజస్విని ఇంజనీరింగ్ లిమిటెడ్, ఫ్యూచర్ టెక్ ఇండస్ట్రీస్ కంపెనీలకు బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు సీబీఐ ఆధారాలు, పత్రాలు సేకరించింది. ప్రస్తుత దాడులు ఆంధ్రా బ్యాంకుకు సంబంధించి రూ. 71 కోట్ల ఎగవేతకు సంబంధించినవి కావడం విశేషం. అన్నీ డొల్ల కంపెనీలే... బ్యాంకు రుణాన్ని ఎగవేసిన కేసులో బ్యాం కుల ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. కాకులమర్రి శ్రీనివాసరావుతో కలిపి ఐదుగురు డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్‌పై సీబీ ఐ కేసులో నిందితులుగా చేర్చింది. బ్యాంకు రుణాల రూపంలో పొందిన మొత్తాన్ని సుజ నా బినామీ కంపెనీలకు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి బదిలీ చేసినట్లు సీబీఐ విచారణలో గుర్తించింది. ఇందుకోసం పలు డొల్ల కంపెనీలను సృష్టించినట్లు, మనీలాండరింగ్ జరిగిన ట్లు తేల్చింది. దీంతో మనీలాండ రింగ్ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి బదిలీ చేసింది. సుజనా గ్రూప్‌లో భారీగా డొల్ల కం పెనీలున్నట్లు ఈడీకీ ఆధారాలు లభించాయి. సుజనా సృష్టించిన వైస్రాయ్ హోటల్స్ అండ్ మహల్ హోటల్‌కు పొందిన రుణంలో నుంచి నగదును బదిలీ చేశారు. దీంతో వైస్రాయ్ హోటల్స్ అండ్ మహల్ హో టల్‌కు చెందిన రూ. 315 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఏప్రిల్‌లో అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ యా క్ట్ ప్రకారం హైదరా బాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరులోని ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
సుజనా చౌదరి నివాసంలో సీబీఐ సోదాలు
-
సుజనా చౌదరి నివాసంలో సీబీఐ సోదాలు
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత సుజనా చౌదరి నివాసంతో పాటు, కార్యాలయాల్లోనూ సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక నుంచి వచ్చిన సీబీఐ అధికారులు పంజాగుట్ట నాగార్జున సర్కిల్లోని సుజనా చౌదరి కార్యాలయంలో శనివారం ఉదయం నుంచి తనిఖీలు జరుపుతున్నారు. నగరంలో మొత్తం మూడుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. బ్రాంకింగ్ ప్రాడ్ సెల్ టీమ్ సభ్యులు కూడా సోదాలు చేశారు. ఇందుకు సంబంధించి నలుగురు సుజనా గ్రూప్ డైరెక్టర్లను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస కళ్యాణ్‌రావు, వెంకట రమణారెడ్డి, సుధాకర్ రెడ్డి, రామకృష్ణ వర్మను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా,’బెస్ట్ అండ్ కాంప్టన్’ పేరుతో మాజీ సీబీఐ డైరెక్టర్ విజయరామారావ్ కుమారుడితో కలిసి సుజనా వ్యాపారం చేశారు. కంపెనీ పేరుతో అక్రమంగా రుణాలు తీసుకోగా, గతంలోనే ఈడీతో పాటు సీబీఐ కూడా కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సుజనా గ్రూపు ట్యాక్స్ కన్సల్టెంట్‌ను అరెస్ట్ చేశాం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మాజీమంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరికి చెందిన కంపెనీలకు ట్యాక్స్ కన్సల్టెంట్ ఎన్.ఎస్.అయ్యంగార్ను అరెస్ట్ చేసినట్లు జీఎస్టీ అధికారులు శనివారం హైకోర్టుకు నివేదించారు. తన భర్త అయ్యంగార్ను జీఎస్టీ అధికారులు తీసుకెళ్లారని, అయితే, ఆయన ఆచూకీ తెలియడం లేదని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ ఎన్.విజయలక్ష్మీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. హౌస్ మోషన్ రూపంలో అత్యవసరంగా దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ, సీజీఎస్టీ అధికారి శ్రీనివాస్ గాంధీ, డిప్యూటీ కమిషనర్ సుధారాణిలు ఈ నెల 2న ఉదయం 7.30 గంటల సమయంలో అయ్యంగార్ ఇంటికి వచ్చి, ఆయనను వారివెంట తీసుకెళ్లారని చెప్పారు. మధ్యాహ్నంకల్లా పంపిస్తామని చెప్పారని, అయితే ఇప్పటివరకు ఆయన ఆచూకీ తెలియడం లేదని కోర్టుకు నివేదించారు. పిటిషనర్ భర్తను జీఎస్టీ అధికారులు అక్రమంగా నిర్బంధించారని వాదించగా జీఎస్టీ తరఫు న్యాయవాది బి.నర్సింహశర్మ తోసిపుచ్చారు. అయ్యంగార్ను అక్రమంగా నిర్బంధించలేదని తెలిపారు. విచారణ నిమిత్తం తీసుకొచ్చామని, విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. సుజనా గ్రూపు కంపెనీల జీఎస్టీ ఎగవేతలో అయ్యంగార్ పాత్ర ఉన్నట్లు తేలిందని, అందుకే అతన్ని అరెస్ట్ చేశామమన్నారు. ఆయనను కోర్టు రిమాండ్‌కు పంపిందని వివరించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, పిటిషనర్ భర్తను అరెస్ట్ చేసినప్పుడు, ఇక ఈ వ్యా జ్యంలో విచారించేందుకు ఏమీలేదని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. -
సీబీఐ ముందు హాజరుకావాల్సిందే
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో తమ ముందు హాజరుకావాలంటూ సీబీఐ ఇచ్చిన నోటీసులను గౌరవించి తీరాల్సిందేనని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)కి హైకోర్టు స్పష్టం చేసింది. అయితే సీబీఐ నిర్దేశించిన మే 4న కాకుండా మే 27, 28 తేదీల్లో సీబీఐ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు బెంగళూరులోని సీబీఐ అధికారుల ముందు హాజరు కావాలని పేర్కొంది. ఆ రెండు రోజుల్లో విచారణ పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఇవ్వాలని సూచించింది. అధికారుల విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని సుజనాకు స్పష్టం చేసింది. విచారణ సమయంలో న్యాయవాది వెంట ఉంచుకోవచ్చని పేర్కొంది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద విచారణ పేరుతో సుజనా చౌదరిని అరెస్ట్ చేయడం గానీ, శారీరకగా, మానసికంగా వేధింపులకు గానీ గురిచేయొద్దని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. సీబీఐ తనకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరుతూ సుజనా చౌదరి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ అమర్నాథ్గౌడ్ విచారణ జరిపారు. ప్రాథమిక ఆధారాలున్నాయి.. సీబీఐ న్యాయవాది కె.సురేందర్ వాదనలు వినిపిస్తూ, సీఆర్పీసీ సెక్షన్160, 161 కింద నోటీసులు ఇచ్చినప్పుడు, విచారణను ఎదుర్కోవడానికి నిరాకరించడానికి వీల్లేదన్నారు. తాము సీఆర్పీసీ సెక్షన్ 41 కింద జరుపుతున్న విచారణ కాదన్నారు. సుజనా గ్రూపు కంపెనీల వ్యవహారాలకు సంబంధిం చిదర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. కాగితాలపైనే లావాదేవీలు చూపినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయన్నారు. అందుకే పిటిషనర్‌కు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ దశలో ఈ కేసు పూర్వాపరాల గురించి ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయట్లేదన్నారు. సీబీఐ చెప్పిన మే 4న కాకుండా, ఈ నెల 27, 28 తేదీల్లో ఆ సంస్థ ముందు హాజరు కావాలని సీబీఐని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధం లేదు.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. చెన్నైకి చెందిన బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజ్టెక్ట్స్ కంపెనీకి కానీ, ఆ కంపెనీ అధికారులతో కానీ సుజనా చౌదరికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు ఇచ్చిన నోటీసులకు సంబంధించి సీబీఐని పిటిషనర్ మరింత సమాచారం, అలాగే ఎఫ్ఐఆర్ కాపీ కోరుతూ లేఖ రాశారన్నారు. అయితే సీబీఐ నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. ఎన్నికల దృష్ట్యా మే 19వ తేదీ వరకు అందుబాటులో ఉండలేనని సీబీఐకి చెప్పారన్నారు. -
సీబీఐ నోటీసులపై హైకోర్టుకు సుజనా
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ టీడీపీ ఎంపీ సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ నోటీసులకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ నిలిపేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐలను ప్రతివాదులుగా చేర్చారు. 2017లో నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా స్టేట్మెంట్ ఇచ్చేందుకు తమ ముందు హాజరు కావాలంటూ సీబీఐ ఈ నెల 22, 27 తేదీల్లో నోటీసులు జారీ చేసిందని సుజనా పిటిషన్లో పేర్కొన్నారు. చెన్నైకి చెందిన బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్, ఆ కంపెనీ అధికారులతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఆ కంపెనీపై నమోదు చేసిన కేసులో తనను హాజరు కావాలని సీబీఐ ఎందుకు నోటీసులు జారీ చేసిందో అర్థం కావట్లేదన్నారు. ఈ నోటీసుల ద్వారానే తనకు బెస్ట్ అండ్ క్రాంప్టన్‌తోపాటు మరికొందరు వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తప్పుడు ఖాతాలతో తరలించారన్న ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసిందన్నారు. కేవలం ఖాతా పుస్తకాల్లో అమ్మకాలు, కొనుగోళ్లు జరిగినట్లు చూపి బ్యాంకులను రూ.72 కోట్ల మేర మోసం చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోందన్నారు. తన ప్రతిష్టను దెబ్బ తీసే చర్యల్లో భాగంగానే ఈ నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. -
సీబీఐ నోటీసులపై హైకోర్టుకు సుజనా
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో తమ ముందు విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ నోటీసులకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ నిలిపేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐలను ప్రతివాదులుగా చేర్చారు. 2017లో నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా స్టేట్మెంట్ ఇచ్చేందుకు తమ ముందు హాజరు కావాలంటూ సీబీఐ ఈ నెల 22, 27వ తేదీల్లో నోటీసులు జారీ చేసిందని సుజనా పిటిషన్లో పేర్కొన్నారు. చెన్నైకి చెందిన బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్, ఆ కంపెనీ అధికారులతోగానీ తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఆ కంపెనీలో తాను వాటాదారు కాదని, డైరెక్టర్ కూడా కాదన్నారు. ఆ కంపెనీపై నమోదు చేసిన కేసులో తనను హాజరు కావాలని సీబీఐ ఎందుకు నోటీసులు జారీ చేసిందో అర్థం కావట్లేదన్నారు. ఈ నోటీసుల ద్వారానే తనకు బెస్ట్ అండ్ క్రాంప్టన్‌తోపాటు మరికొందరు వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందని పేర్కొన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తప్పుడు ఖాతాలతో తరలించారన్న ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసిందన్నారు. కేవలం ఖాతా పుస్తకాల్లో అమ్మకాలు, కొనుగోళ్లు జరిగినట్లు చూపి బ్యాంకులను రూ. 72 కోట్ల మేర మోసం చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోందన్నారు. తన ప్రతిష్టను దెబ్బ తీసే చర్యల్లో భాగంగానే ఈ నోటీసులు జారీ అయ్యాయని సుజనా ఆరోపించారు. ఆ కంపెనీతో తనకు సంబంధం లేదని చెప్పినా సీబీఐ తనకు మరో నోటీసు పంపిందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని హైకోర్టును కోరారు. -
సీబీఐ విచారణకు సుజనా డుమ్మా
సాక్షి, బెంగళూరు/అమరావతి: బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో సీబీఐ విచారణకు కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి డుమ్మా కొట్టారు. బెంగళూరులోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా గురువారం సుజనాకు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సుజనా గ్రూపునకు చెందిన ఎలక్ట్రికల్ పరికరాల ఉత్పత్తి సంస్థ బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్టŠస్ లిమిటెడ్ (బీసీఈపీఎల్) ఉద్దేశపూర్వకంగా తమను రూ. 71 కోట్ల మేర మోసం చేసిందంటూ ఆంధ్రా బ్యాంకు 2017లో ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం నోటీసులు అందుకున్న సుజనా శుక్రవారం బెంగళూరుకు చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. తన సన్నిహితులు, న్యాయవాదులతో చర్చిస్తూ అలాగే ఉండిపోయినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. తనకు ఆరోగ్యం సరిగా లేదని, విచారణ హాజరుకు మినహాయింపు ఇవ్వాలని తన న్యాయవాదుల ద్వారా సీబీఐతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. వారి విజ్ఞప్తికి సీబీఐ నుంచి ఎలాంటి సమాధానం అందకపోవడంతో ఆయన హాజరు కాకుండా మిన్నకుండి పోయారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి తనను అరెస్టు చేస్తారనే భయంతోనే విచారణకు హాజరుకాలేదనే వార్తలు గుప్పుమన్నాయి. అరెస్టు అయితే ఆ తర్వాత శని, ఆదివారాలు సెలవు ఉన్నందువల్ల బెయిల్ కోసం సోమవారం వరకు వేచి ఉండాల్సి వస్తుందనే ఇలా చేశారని తెలుస్తోంది. ఇదే కేసులో బీసీఈపీఎల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కాకులమర్రి శ్రీనివాస కల్యాణరావుతో సహా ఇతర ఎండీలకు సీబీఐ నోటీసులు జారీ చేయగా వారు కూడా గైర్హాజరయ్యారు. విచారణకు గైర్హాజరీ విషయంలో సుజనా చౌదరిగానీ, ఇతరత్రా సంబంధికులు కానీ తమతో సంప్రదింపులు జరపలేదని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. పక్కా ఆధారాలు సేకరించిన సీబీఐ, ఈడీ వివిధ బ్యాంకుల నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని సుజనా చౌదరి ఎగ్గొట్టినట్లు నిర్ధారించిన ఈడీ, సీబీఐలు అందుకు పక్కా ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఒక్కో బ్యాంకు నుంచి తీసుకున్న రుణం డొల్ల కంపెనీల ద్వారా చివరకు ఎవరి వద్దకు చేరాయనే దానిపై విశ్లేషణ చేసే పనిలో సీబీఐ ఉంది. ఇటీవల బీసీఈపీఎల్ కేసుకు సంబంధించి వైస్రాయ్ హోటల్స్‌కు చెందిన రూ. 315 కోట్లు ఈడీ జప్తు చేసింది. హైదరాబాద్‌లోని సుజనా ప్రధాన కార్యాలయంలో చేసిన సోదాల్లో వివిధ డొల్ల కంపెనీలకు చెందిన 124 రబ్బరు స్టాంపులు దొరికాయి. లబ్ధి పొందిన బినామీ కంపెనీలు, వివిధ రుణదాతలు, వ్యాపార సంస్థలకు చెందిన వివరాలు లభించాయి. వీటి ఆధారంగా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు సుజనా చౌదరి, అతని బినామీలకు ఎలా చేరిందన్న దానిపై దర్యాప్తు సంస్థలు ఆధారాలు సేకరించాయి. దీని తర్వాతనే చౌదరిని విచారణకు హాజరవ్వాలంటూ సీబీఐ సమన్లు జారీ చేసింది. శుక్రవారం హాజరుకాకపోవడంతో మరోసారి సుజనానే స్వయంగా హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని, దానికి కూడా స్పందించకపోతే అరెస్ట్ వారెంటు జారీ చేసే అవకాశముందని సీబీఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. -
సుజనాకు సీబీఐ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రుణాల ఎగవేత కేసులో కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నోటీసులు జారీ చేసింది. శుక్రవారం బెంగళూరులోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సుజనా గ్రూప్‌నకు చెందిన ఎలక్ట్రికల్ పరికరాల ఉత్పత్తి సంస్థ బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఉద్దేశపూర్వకంగా తమను రూ. 71 కోట్ల మేరకు మోసం చేసిందంటూ ఆంధ్రా బ్యాంకు 2017లో ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది. చెన్నై కేంద్రంగా నడిచిన ఈ కంపెనీలో కాకులమర్రి శ్రీనివాస కల్యాణరావు సహా ఐదుగురు మేనేజింగ్ డైరెక్టర్ల పేర్లను సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చింది. భారత శిక్షా స్మృతిలోని నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ తదితర సెక్షన్ల కింద కంపెనీపై అభియోగాలు మోపింది. ఇదీ నేపథ్యం.. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (బీసీఈపీఎల్) చెన్నైలోని ఆంధ్రా బ్యాంకుతోపాటు సెంట్రల్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులతో కూడిన కన్సార్షియం నుంచి 2010 నుంచి 2013 మధ్య రూ. 364 కోట్ల రుణం తీసుకుంది. వాటిలో ఆంధ్రా బ్యాం కు నుంచి పొందిన రూ. 71 కోట్లను బీసీఈపీఎల్ కొనుగోళ్లు, విక్రయాలు జరిపినట్లు నకిలీ ఎంట్రీలు సృష్టించి తద్వారా ఆ సొమ్మును కుట్రపూరితంగా డొల్ల కంపెనీల్లోకి బదిలీ చేసుకుంది. ఈ విషయాన్ని పసిగట్టిన ఆంధ్రా బ్యాంకు చేసిన ఫిర్యాదుతో నమోదైన కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంబించింది. బ్యాంకు రుణాల నిధులను సుజనా... బినామీ కంపెనీలకు బదిలీ చేసినట్లు గుర్తించింది. ఇందుకోసం పలు డొల్ల కంపెనీలను ఆయన సృష్టించినట్లు, పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగినట్లు కూడా తేల్చింది. దీంతో కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి బదిలీ చేసింది. ఈ క్రమంలోనే సుజనా గ్రూప్‌లో పెద్ద మొత్తంలో డొల్ల కంపెనీలున్నట్లు ఈడీకి సైతం ఆధారాలు లభించాయి. సుజనా సృష్టించిన వైస్రాయ్ హోటల్స్ అండ్ మహల్ హోటల్ పొందిన రుణంలో నుంచి నగదును బదిలీ చేశారు. దీంతో వైస్రాయ్ హోటల్స్ అండ్ మహల్ హోటల్‌కు చెందిన రూ. 315 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరులోని సంస్థ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ సందర్భంగా పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, విలువైన పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈడీ దాడుల్లో భాగంగా హైదరాబాద్ పంజాగుట్ట నాగార్జునహిల్స్‌లోని సుజనా కంపెనీలో ఈడీ అధికారులకు 124 రబ్బరు స్టాంపులు దొరికాయి. -
సీబీఐ సమన్లపై స్పందించిన సుజనా
న్యూఢిల్లీ : సీబీఐ తనకు సమన్లు జారీ చేయడంపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి స్పందించారు. సీబీఐ సమన్లలో పేర్కొన్నట్లుగా బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ కంపెనీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు ఆ కంపెనీ గురించి తనకు ఏమాత్రం తెలియదని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ వ్యవహారంలో బ్యాంకులకు కోట్ల రూపాయల నష్టం చేకూర్చినట్లు 2017లో సుజనా చౌదరిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ బెంగళూరు బ్రాంచ్ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించిన సుజనా చౌదరి... ‘ సుజనా గ్రూప్ పేరిట లిస్ట్ అయిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, స్ల్పెండిడ్ మెటల్ ప్రాడక్ట్స్ లిమిటెడ్, న్యూయాన్ టవర్స్ లిమిటెడ్ కంపెనీల్లో 2003 నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో మాత్రమే కొనసాగాను. అక్టోబరు 2014 వరకు ఈ కంపెనీల్లో ఏవిధమైన యాజమాన్య బాధ్యతలు చేపట్టలేదు. అక్టోబరు తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో కూడా కొనసాగలేదు. ఇక బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ వ్యవహారంలో సీబీఐ నాకు సమన్లు చేసింది. ఆ కంపెనీతో నాకు ఎటువంటి సంబంధం లేదు’ అని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సుజనా చౌదరికి చెందిన రూ. రూ.315 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీఈపీఎల్), దాని అధికారులపై సీబీఐ దాఖలు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఈ చర్య తీసుకుంది. ఆ సంస్థ అధికారులు 2010-2013లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లను ‘మోసగించడానికి’ నేరపూరిత కుట్రకు పాల్పడటంతో బ్యాంకులకు రూ.364 కోట్ల మేర నష్టం కలిగినట్లు ఈడీ పేర్కొంది. టీడీపీకి ఆర్థిక వనరుగా పేరొందిన సుజనా కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో కొంతకాలం మంత్రిగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయనపై ఇప్పటికే డీఆర్ఐ, ఫెమా, సీబీఐ కేసులు ఉన్నాయి. -
సుజనా చౌదరికి సమన్లు జారీ చేసిన సీబీఐ
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీమంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరికి సీబీఐ గురువారం సమన్లు జారీ చేసింది. 2017లో నమోదు చేసిన కేసులో ఆయనకు సీబీఐ బెంగళూరు బ్రాంచ్ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ వ్యవహారంలో బ్యాంకులకు రూ.కోట్ల నష్టం చేకూర్చినట్లు సుజనా చౌదరిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఆయన రేపు మధ్యాహ్నం బెంగళూరు సీబీఐ అధికారుల ముందు హాజరు కానున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సుజనా చౌదరికి చెందిన రూ. రూ.315 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీఈపీఎల్), దాని అధికారులపై సీబీఐ దాఖలు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఈ చర్య తీసుకుంది. ఆ సంస్థ అధికారులు 2010-2013లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లను ‘మోసగించడానికి’ నేరపూరిత కుట్రకు పాల్పడటంతో బ్యాంకులకు రూ.364 కోట్ల మేర నష్టం కలిగినట్లు ఈడీ పేర్కొంది. టీడీపీకి ఆర్థిక వనరుగా పేరొందిన సుజనా కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో కొంతకాలం మంత్రిగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయనపై ఇప్పటికే డీఆర్ఐ, ఫెమా, సీబీఐ కేసులు ఉన్నాయి. -
సుజనాకు బిగ్ షాక్
-
సీఎం బినామీ సుజనాకు షాక్
సాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బినామీ సుజనా చౌదరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాక్ ఇచ్చింది. సుజనా గ్రూపు కంపెనీ బెస్ట్ అండ్ కాంప్ట్రన్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీఈపీఎల్)పై నమోదైన మనీ లాండరింగ్ కేసులో హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్స్‌కు చెందిన రూ.315 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను జప్తు చేసినట్లు ఈడీ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందని పేర్కొంది. కాగా సుజనా గ్రూపు.. మహల్ హోటల్స్ పేరిట ఒక డొల్ల కంపెనీని సృష్టించి తీసుకున్న రుణం మొత్తాన్ని దొంగ లావాదేవీల రూపంలో వైస్రాయ్ హోటల్స్‌కు తరలించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. వైస్రాయ్ హోటల్స్, మహల్ హోటల్స్ మధ్య వ్యాపార లావాదేవీలు జరిగినట్లుగా ఒప్పందాలు కుదుర్చుకొని ఈ మొత్తాన్ని వైస్రాయ్ హోటల్స్‌కు చేరవేశారు. రూ.315 కోట్లు మహల్ హోటల్స్ నుంచి వచ్చినట్లు విచారణలో వైస్రాయ్ హోటల్స్ అంగీకరించింది. మొత్తం రూ.6,000 కోట్లు ఎగవేత సుజనాచౌదరి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను.. డొల్ల కంపెనీలు సృష్టించి, దొంగ ఇన్వాయిస్ల ద్వారా జరగని లావేదేవీలు జరిగినట్లు చూపించి సొంత ఖాతాల్లోకి బదలాయించుకున్నట్లు తేలింది. ఈ విధంగా ఇప్పటివరకు వివిధ బ్యాంకుల నుంచి రూ.6,000 కోట్ల రుణాలు తీసుకుని చెల్లించకుండా ఎగ్గొట్టినట్లు తేలింది. బెంగళూరులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదుతో తీగ లాగితే మొత్తం డొంక కదిలింది. బీసీఈపీఎల్ రూ.364 కోట్ల విలువైన రుణాలు తీసుకొని ఎగ్గొట్టిందంటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులతో కలసి బెంగళూరులో ఫిర్యాదు చేసింది. దీంతో 2010–2013 కాలంలో ఈ సంస్థ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టినట్లుగా.. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. తదనంతరం చెన్నై, న్యూఢిల్లీ, హైదరాబాద్‌ల్లో ఉన్న సుజనా గ్రూపునకు చెదిన కంపెనీలు, నివాసాల్లో చేసిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పంజాగుట్టలోని సుజనా కార్యాలయంలో చేసిన సోదాల్లో వివిధ డొల్ల కంపెనీలకు చెందిన 124 రబ్బరు స్టాంపులు దొరికాయి. అలాగే బీసీఈపీఎల్‌కు చెందిన రబ్బరు స్టాంపుతో పాటు, ఈ రుణం ద్వారా లబ్ధిపొందిన కంపెనీలు, వివిధ రుణదాతలు, వ్యాపార సంస్థలకు చెందిన రబ్బరు స్టాంపులు దొరికాయి. కాగా సుజనాచౌదరి పెద్దమొత్తంలో తీసుకున్న రుణాలు ఎక్కడికి తరలించారు? ఎవరు లబ్ధి పొందారు అనేది ఈడీ తదుపరి విచారణలో తేలాల్సి ఉంది. -
సుజనా చౌదరికి భారీ షాక్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. బ్యాంకులను మోసగించిన కేసులో రూ.315 కోట్ల విలువైన వైస్రాయ్ హోటల్స్ ఆస్తులను జప్తు చేసింది. షెల్ కంపెనీల పేరుతో బ్యాంకులకు రూ. 364 కోట్లకు కుచ్చుటోపీ పెట్టినట్టు గుర్తించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈమేరకు చర్య తీసుకుంది. మనీ ల్యాండరింగ్ 2002 చట్టప్రకారం హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్స్ ఆస్తులను అటాచ్ చేసింది. పెద్ద డొల్ల కంపెనీలు సృష్టించి నకిలీ ఆస్తులు, బోగస్ ఇన్వాయిస్లతో బ్యాంకులను సుజనా గ్రూప్ బురిడీ కొట్టించినట్టు ఈడీ విచారణలో వెల్లడైంది. చైన్నలోని ఆంధ్రా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బును షెల్ కంపెనీలకు తరలించి అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. మహల్ హోటల్ అనే డొల్ల కంపెనీని సృష్టించి దీని నుంచి డబ్బును వైస్రాయ్ హోటల్ లిమిటెడ్‌కు తరలించినట్టు దర్యాప్తులో తెలిసింది. పంజాగుట్ట నాగార్జున హిల్స్‌లోని సుజనా గ్రూప్ కార్యాలయం నుంచి కీలక పత్రాలను ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డొల్ల కంపెనీలకు చెందిన 124 నకిలీ రబ్బరు స్టాంపులను కూడా గుర్తించారు. (చదవండి: ‘సుజనా’ క్రియేటివ్స్.. మాయారాజ్యం) -
సుజనా చౌదరికి ఈడీ భారీ షాక్
-
ఆర్థిక నేరగాళ్లకు టీడీపీ అడ్డా
సాక్షి, అమరావతి: వ్యాపారవేత్తల ముసుగులో బ్యాంకులకు టోపీ పెడుతున్న వారికి తెలుగుదేశం పార్టీ అడ్డాగా మారింది. రుణాలు, పన్నులు ఎగ్గొట్టిన వారికే చంద్రబాబు.. ప్రభుత్వ పదవుల్లో పెద్దపీట వేశారు. ప్రజల సొమ్మును అడ్డంగా దోచేసిన వారినే దగ్గరకు తీసుకుంటూ అండగా నిలుస్తూ వచ్చారు. ఈ మధ్య కాలంలో దేశంలో ఏ మోసాన్ని వెలికితీసినా వాటి మూలాలు టీడీపీ దగ్గరకే చేరుతున్నాయి. టీడీపీ కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేశ్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆర్థిక మోసాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టడంతో పాటు వ్యాపారాలు చేయకుండానే పన్ను రాయితీలు పొందడంలో వీరిని మించిన ఘనాపాఠీలు లేరు. వీరే కాదు మంత్రులుగా చెలామణి అవుతున్న గంటా శ్రీనివాసరావు, ఆదినారాయణ రెడ్డితో పాటు ఎంపీ రాయపాటి సాంబశివరావు, బీద మస్తానరావు, వాకాటి నారాయణరెడ్డి, బొల్లినేని కృష్ణయ్య, వైస్రాయ్ ప్రభాకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి.. ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే టీడీపీలోని గజదొంగల లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. ‘సుజనా’.. రూ.వేల కోట్లు తినేశాడు బ్యాంకుల నుంచి రూ.6,000 కోట్ల రుణాలు తీసుకొని మోసం చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుగుతుండగా.. సుజనా చౌదరి మోసాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రూ.1,289 కోట్ల మోసం బయటపడింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అనేక డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి ఎటువంటి వ్యాపారాలు చేయకుండానే రూ.1,289 కోట్లకు ఇన్వాయిస్లను రూపొందించారు. ఈ మొత్తంపై రూ.224 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను తీసుకున్నారు. అంతే కాకుండా ఈ దొంగ ఇన్వాయిస్లను చూపించి బ్యాంకుల నుంచి రూ.700 కోట్ల రుణాలు తీసుకున్నారు. జీఎస్టీ విభాగం చేసిన దర్యాప్తులో ఈ మోసం బయటపడటంతో ఇప్పటికే ఈ గ్రూపునకు చెందిన డైరెక్టర్లలో కొందర్ని అరెస్ట్ చేశారు. చివరకు బ్యాంకు రుణాలు తీర్చడం లేదని సుజనా చౌదరికి తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఉన్న స్టీల్ ప్లాంటును బ్యాంకులు సీజ్ చేశాయి. విదేశీ బ్యాంకులను సైతం మోసం చేసిన చరిత్ర సుజనా చౌదరి సొంతం. మారిషస్ బ్యాంక్ నుంచి రూ.100 కోట్ల రుణం తీసుకున్న సుజనా చౌదరి ఆ మొత్తం చెల్లించకుండా తప్పించుకొని తిరిగారు. దీంతో ఆ బ్యాంక్ వాళ్లు హైదరాబాద్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో న్యాయస్థానం ఏకంగా అరెస్ట్ వారెంట్లు కూడా జారీ చేసింది. అయినా కూడా సీఎం చంద్రబాబు పట్టుబట్టి సుజనా చౌదరికి గతంలో కేంద్ర మంత్రి పదవి ఇప్పించుకున్నారు. అక్రమ లావాదేవీలకు కేరాఫ్ ‘సీఎం’ రమేశ్ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, బినామీగా పేరు పొందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అక్రమ లావాదేవీల గుట్టును ఆదాయ పన్ను శాఖ రట్టు చేసింది. సబ్ కాంట్రాక్టర్ల ముసుగులో పనులేమీ చేయకుండానే దాదాపు రూ.800 కోట్ల నిధులను సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. పనులేమీ చేయకుండానే బిల్లులు మంజూరు చేయించుకున్నాడు. వాటిని చిరునామాల్లేని కంపెనీల్లోకి మళ్లించి.. ఆ కంపెనీల నుంచి నగదును వెనక్కి తీసుకోవడం సీఎం రమేశ్‌కు వెన్నతో పెట్టిన విద్య. రమేశ్‌కు చెందిన నిర్మాణ రంగ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సుమారు రూ.800 కోట్ల నిధులను వివిధ కంపెనీల ద్వారా దారి మళ్లించినట్లు ఐటీ శాఖ అధికారులకు స్పష్టమైన ఆధారాలు లభించాయి. గత ఆరేళ్లలో ఎడ్కో(ఇండియా) అనే సబ్ కాంట్రాక్టర్‌కు రూ.12 కోట్లు చెల్లించినట్లు పుస్తకాల్లో చూపించగా.. రికార్డుల్లో పేర్కొన్న నాలుగు చిరునామాల్లో కూడా ఈ కంపెనీ ఆనవాళ్లు దొరకలేదు. పైగా రిత్విక్ ప్రాజెక్టులో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న సాయిబాబా వద్ద ఎడ్కో కంపెనీకి చెందిన స్టాంపులు దొరకడంతో గుట్టు రట్టయ్యింది. ఇలా దొంగ వ్యాపారాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని టీడీపీకి ఇస్తుండటంతో ఆయన్ని చంద్రబాబు వరుసగా రెండో సారి కూడా రాజ్యసభకు పంపించారు. బకాయిల ‘గంటా’ మంత్రి గంటా శ్రీనివాసరావుకు సంబంధించిన ప్రత్యూష గ్రూప్ కంపెనీలు వివిధ బ్యాంకులకు వడ్డీతో కలిపి రూ.196.51 కోట్ల మేర బకాయిలు పడ్డాయి. రూ.141 కోట్ల రుణం తీసుకొని ఇప్పటి వరకు ఒక్క వాయిదా కూడా చెల్లించకపోవడంతో ఇండియన్ బ్యాంకు ప్రత్యూష గ్రూప్‌కు చెందిన ఆస్తుల స్వాధీనానికి రంగంలోకి దిగింది. ఈ రుణానికి గంటా శ్రీనివాసరావు హామీ ఉండటంతో మంత్రికి చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు పత్రికా ప్రకటనలు కూడా జారీ చేసింది. ఇప్పుడు ఈ బకాయిల విలువ రూ.203.62 కోట్లకు చేరింది. దీంతో మంత్రికి చెందిన మరిన్ని ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు రంగంలోకి దిగాయి. రాయపాటి ఇంటి ముందు బ్యాంక్ సిబ్బంది ధర్నాలు.. ఇక టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఏకంగా వివిధ బ్యాంకుల నుంచి రూ.4,300 కోట్ల రుణాలు తీసుకొని.. వాటిని తిరిగి చెల్లించలేదు. దీంతో కెనరా బ్యాంకు రూ.735 కోట్ల రుణానికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగులైతే తామిచ్చిన రూ.434 కోట్ల రుణం తిరిగి చెల్లించాలంటూ రాయపాటి ఇంటి ముందు ఏకంగా ధర్నాలు చేశారు. పైగా ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును నిర్మించే సత్తా రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌కి లేదని అందరూ మొత్తుకున్నా కూడా చంద్రబాబు ఆ కంపెనీకి అండగా నిలబడ్డారు. ‘ఆది’ రాకతో ‘కేశవరెడ్డి’ కేసు మూలకు.. బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ప్రముఖ ఆర్థిక మోసాల్లో కేశవరెడ్డి స్కూల్ డిపాజిట్ల స్కీం ఒకటి. పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్ల రూపంలో రూ.700 కోట్లకు పైగా నగదు సేకరించి కేశవరెడ్డి నాగిరెడ్డి బోర్డు తిప్పేశారు. ఈ కేసును బూచిగా చూపించి కేశవరెడ్డి వియ్యంకుడైన ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి చేర్చుకొని మంత్రినే చేశారు. దీంతో ఈ కేసు వెలుగులోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా డిపాజిట్‌దారులకు ఇప్పటికీ ఒక్క పైసా కూడా రాలేదు. ‘వైస్రాయ్’ ప్రభాకరరెడ్డి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు వెన్నుపోటుకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ‘వైస్రాయ్’ ప్రభాకర్‌రెడ్డి కూడా పెద్ద ఎత్తున బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టాడు. దీంతో ఆయన ఆస్తుల స్వాధీనానికి బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. రూ.310 కోట్ల రుణం చెల్లించకపోవడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ బెంగళూరులోని ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది. రూ.వందల కోట్లు ఎగవేసిన ‘వాకాటి’ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డికి చెందిన వీఎన్ఆర్ ఇన్ఫ్రా, పవర్‌టెక్, లాజిస్టిక్స్ కంపెనీలు వివిధ బ్యాంకుల నుంచి రూ.529.34 కోట్ల రుణాలు తీసుకొని తిరిగి చెల్లించటం లేదు. దీంతో ఈ రుణాలకు హామీగా ఉన్న వాకాటి నారాయణరెడ్డికి చెందిన స్థిరాస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు బ్యాంకులు ప్రకటించాయి. దీనిపై డెట్ రికవరీ ట్రిబ్యునల్.. ఈ ఆస్తులు అమ్మి రుణం తీర్చడానికి ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పాలంటూ తాజాగా నోటీసులు జారీ చేసింది. మరోవైపు తప్పుడు పత్రాలిచ్చి రుణం తీసుకున్నారంటూ బ్యాంకులు సీబీఐని ఆశ్రయించాయి. దీంతో కేసు నమోదు చేసిన సీబీఐ వాకాటి ఇంటిపై దాడులు కూడా నిర్వహించింది. చెప్పుకుంటూ పోతే ఎందరో ఎగవేతదారులు.. బోర్డులు తిప్పిసి రూ.వేల కోట్ల మేర మోసం చేసిన ఘనులు టీడీపీలో చాలా మందే ఉన్నారు. శేఖర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, బొల్లినేని కృష్ణయ్య వంటి వారితో పాటు.. టీడీపీకి పరోక్షంగా మద్దతిస్తున్న కంపెనీలు కూడా రూ.వందలాది కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టాయి. వీటిలో బి.శీనయ్య కంపెనీ, సోమా కనస్ట్రక్షన్స్, మిక్ ఎలక్ట్రానిక్స్, బార్ట్రానిక్స్, నంది గ్రూపు, ప్రొగ్రెసివ్ కన్స్ట్రక్షన్, వెలగపూడి స్టీల్స్, టోటెమ్ ఇన్ఫ్రా ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. రూ.వేల కోట్లకు ‘నామా’ టీడీపీలో నిన్నమొన్నటి వరకు కీలక నేతగా ఉన్న నామా నాగేశ్వరరావుది కూడా ‘దొంగ’ చరిత్రనే. మధుకాన్ ప్రాజెక్ట్స్ చేపట్టిన ఎన్‌హెచ్–33 ప్రాజెక్టులో రూ.264.01 కోట్లను పక్కకు తరలించడం ద్వారా సీబీఐకి అడ్డంగా దొరికిపోయారు. రూ.1,655 కోట్ల విలువైన రాంచి–జంషెడ్పూర్ జాతీయ రహదారికి చెందిన ప్రాజెక్టులో.. బ్యాంకుల నుంచి మోసపూరితంగా రూ.1,029.39 కోట్ల రుణాలు తీసుకున్నాడు. అందులోంచి రూ.264.01 కోట్లను దారి మళ్లించినట్లు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ గుర్తించింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగి కంపెనీకి చెందిన ముగ్గురు డైరెక్టర్లపై కేసులు నమోదు చేయడమే కాకుండా.. బ్యాంకు రుణాలకు గ్యారంటీగా పెట్టిన రూ.73.95 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ‘మధుకాన్’ మోసాలను ముందే గుర్తించిన ప్రపంచ బ్యాంకు తన ప్రాజెక్టుల నుంచి ఈ సంస్థను నిషేధిస్తూ గతేడాది నిర్ణయం తీసుకుంది. -
ప్రత్యేక హోదాకు వెన్నుపోటు
-
టీడీపీ నేత సుజనాచౌదరికి జీఎస్టీ ఉచ్చు
-
‘చంద్రబాబుది వికృత రాజకీయ విన్యాస క్రీడ’
సాక్షి, అమరావతి : ప్యాకేజీకి రైట్ రైట్ అన్న చంద్రబాబు.. తర్వాత యూటర్న్ తీసుకున్నారని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సుదీశ్ రాంభొట్ల అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రధాని మోదీ సభ విజయవంతం కావడంతో ఏం చేయాలో పాలుపోక చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఖర్చుతో ఢిల్లీ దీక్ష కోసం రైల్వే శాఖకు జీవో విడుదల చేశారన్నారు. దీక్షలో పాల్గొనే తమ నాయకుల కోసం సిగ్గు లేకుండా ఏసీ హోటళ్లు బుక్ చేశారని మండిపడ్డారు. బాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. చంద్రబాబుది వికృత రాజకీయ విన్యాస క్రీడ అని, కొత్త బూచిని చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుజనా చౌదరి, చంద్రబాబు అదే మేలు అన్నారు ప్యాకేజీకి ఒప్పుకొన్న చంద్రబాబు ప్రస్తుతం హోదా రాగం పాడుతున్నారని సుదీశ్ రాంభొట్ల ఎద్దేవా చేశారు. ‘అప్పుడు నీతి ఆయోగ్ లో 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు. ఈశాన్య రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని అదనపు బెనిఫిట్ ఇవ్వాలని ఆగష్టు 2016లో నీతి ఆయోగ్ చెప్పింది. ఆ సమయంలో ప్యాకేజీ మేలు అని సీఎం చంద్రబాబు, సుజనా చౌదరి అన్నారు. పైగా ప్యాకేజీకి మించింది ఏముంటుంది అన్నారు. ప్యాకేజీ చట్టబద్దత కోసం కృషి చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. మాతో కలిసి ఉన్నపుడు ఇలా ఎన్నో ప్రకటనలు చేశారు. మాతో కలిసి ఉన్నప్పుడు మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పుడు కొత్తరాగం అందుకున్నారు’అని వ్యాఖ్యానించారు. -
అన్నం కూడా పెట్టకుండా విచారించారు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారణ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు తనకు ఆహారం కూడా ఇవ్వలేదని తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు యలమంచిలి సుజనాచౌదరి బుధవారం ఢిల్లీ హైకోర్టుకు నివేదించారు. విరామ సమయంలో భోజనం ఇచ్చేందుకు ఈడీ అధికారులు నిరాకరించారని ఆరోపించారు. ఉదయం పదకొండన్నర గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తనను అధికారులు విచారించారని, ఇలా వరుసగా రెండు రోజుల పాటు సాగిందని పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ అది నిజమే అయితే మానవహక్కుల ఉల్లంఘనే అవుతుందన్నారు. అయితే సుజనాచౌదరి ఆరోపణలను ఈడీ తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. ఆహారం అందజేయబోతే చౌదరి తిరస్కరించారని, అరటిపండు మాత్రం తిన్నారని కోర్టుకు వివరించారు. చౌదరి తరఫు న్యాయవాది స్పందిస్తూ తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని, వీటిపై అఫిడవిట్ కూడా దాఖలు చేస్తామని చెప్పారు. ఇందుకు అంగీకరించిన కోర్టు చౌదరి దాఖలుచేసే అఫిడవిట్‌కు స్పందించాలని ఈడీ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
డొల్ల కంపెనీలపై సుజనాను ప్రశ్నించిన ఈడీ
సాక్షి, చెన్నై : బ్యాంకులకు రూ 6000 కోట్ల మేర రుణాల ఎగవేత కేసులో టీడీపీ రాజ్యసభ ఎంపీ, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన సుజనా చౌదరిని ఈడీ అధికారులు మంగళవారం రెండో రోజూ సుదీర్ఘంగా విచారించారు. విచారణలో భాగంగా నిన్న సుజనాను లంచ్‌కు అనుమతించిన అధికారులు మంగళవారం మాత్రం మధ్యాహ్న భోజన విరామానికి బయటకు అనుమతించలేదు. సీబీఐ నమోదు చేసిన మూడు కేసుల్లో బ్యాంకులకు రుణాల ఎగవేతపైనే ఈడీ అధికారులు సుజనాను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. నిధుల మళ్లింపుపై ఆరా.. విదేశాలకు నిదుల తరలింపుపై అధికారులు ఆయనను ప్రశ్నించారు. 120 డొల్ల కంపెనీల ఏర్పాటు, వాటి ద్వారా నిధుల తరలింపుపైనా ఈడీ అధికారులు సుజనాను పలు కోణాల్లో ప్రశ్నించి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. కాగా, బ్యాంకుల నుంచి అడ్డగోలుగా రుణాలు పొందేందుకు సుజనా ఏకంగా 126 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా రూ.6,000 కోట్ల రుణాలు తీసుకొని వాటిని షెల్ కంపెనీల ద్వారా బినామీ సంస్ధలకు బదలాయించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై పగడ్బందీగా ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు మరింత లోతుగా విచారించేందుకు చెన్నైలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సుజనా చౌదరిని ఆదేశించారు. ఈడీ విచారణను తప్పించుకునేందుకు సుజనా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవటంతో తాజాగా చెన్నై నుంగంబాక్కంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయమైన శాస్త్రి భవన్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు సుజనా హాజరయ్యారు. ఇక ఈడీ కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధుల కంటపడకుండా ఉండేందుకు సుజనా చౌదరి ప్రయత్నించారు. -
‘ఈడీ’ ఎదుట హాజరైన సుజనా
సాక్షి ప్రతినిధి, చెన్నై: బ్యాంకులకు రూ.6,000 కోట్ల మేర రుణాలను ఎగ్గొట్టిన కేసులో టీడీపీ రాజ్యసభ సభ్యుడు, సీఎం చంద్రబాబు సన్నిహితుడైన వై.సుజనా చౌదరి సోమవారం చెన్నైలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణకు హాజరు కావాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సుజనా ఉదయం 11 గంటల సమయంలో తన వ్యక్తిగత సహాయకుడు, న్యాయవాదితో కలసి ఖరీదైన లగ్జరీ కారులో వచ్చారు. సుజనా చౌదరిని ఈడీ కార్యాలయంలో అధికారులు మూడున్నర గంటలకు పైగా విచారించారు. రుణాలకు సంబంధించి సుజనా చౌదరి సమాధానాలను పరిశీలించిన అనంతరం మరోసారి విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది. మీడియాపై చిందులు ఎవరి కంట పడకుండా ఈడీ కార్యాలయానికి చేరుకోవాలన్న ప్రయత్నం విఫలం కావటంతో మీడియాపై సుజనా చిందులు తొక్కారు. కారులో వేగంగా ఈడీ కార్యాలయ ప్రాంగణంలోకి చేరుకుని వడివడిగా నడుస్తూ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుజనా తిరిగి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చి కారులో కూర్చున్నారు. మీడియాతో మాట్లాడకుండా వేగంగా నిష్క్రమించారు. డొల్ల కంపెనీలతో రుణాల ఎగవేత సుజనా ఏకంగా 126 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా రూ.6,000 కోట్ల రుణాలు తీసుకొని ఎగ్గొట్టడం తెలిసిందే. ఈ వ్యవహారంపై పగడ్బందీగా ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు మరింత లోతుగా విచారించేందుకు చెన్నైలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సుజనా చౌదరిని ఆదేశించడం తెలిసిందే. దీన్ని తప్పించుకునేందుకు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవటంతో తాజాగా చెన్నై నుంగంబాక్కంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయమైన శాస్త్రి భవన్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు సుజనా హాజరయ్యారు. -
మీడియాపై సుజనా రుసరుస
చెన్నై : వేల కోట్ల రుణాలు కొల్లగొట్టి బ్యాంకులకు టోకరా వేసిన కేసులో టీడీపీ రాజ్యసభ ఎంపీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. బ్యాంకుల నుంచి రుణాల ద్వారా సేకరించిన మొత్తాలను దారిమళ్లించిన వైనంపై ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించినట్టు సమాచారం. డొల్ల కంపెనీలపైనా ఈడీ అధికారులు పలు కోణాల్లో సుజనాను ప్రశ్నించినట్టు తెలిసింది. ఈడీ విచారణ ముగిసిన అనంతరం సుజనా చౌదరిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా సమాధానం ఇవ్వలేక వారిపై చిందులు తొక్కారు. ఎప్పటిలాగానే తన సహజసిద్ధ దబాయింపు ధోరణితో తాను నిజాయితీపరుడినని చెప్పుకునేందుకు ప్రయత్నించారు. బ్యాంకుల ఫిర్యాదు మేరకు సుజనా చౌదరి కంపెనీలపై ఈడీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. సుజనా చౌదరి మొత్తం 126 డొల్ల కంపెనీలు సృష్టించి.. బ్యాంకుల నుంచి ఏకంగా రూ. 7500 కోట్లు కొల్లగొట్టారని ఈడీ వెల్లడించింది. ఇప్పటికే సుజనా చౌదరి అక్రమాలపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. కాగా, ఈడీ జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని సుజనా చౌదరి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గత శుక్రవారం దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ ధర్మాసనం పిటీషనర్ వాదనలతో ఏకీభవించలేదు. దీంతో పిటిషన్‌ను కొట్టివేస్తూ.. డిసెంబర్ 3న ఈడీ ముందు సుజనా చౌదరి వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశించింది. -
ఈడీ ఎదుట హాజరైన సుజనా చౌదరి
సాక్షి, చెన్నై : బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన కేసులో టీడీపీ రాజ్యసభ సభ్యుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరి సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. బ్యాంకుల ఫిర్యాదు మేరకు సుజనా చౌదరి కంపెనీలపై ఈడీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. సుజనా చౌదరి మొత్తం 126 డొల్ల కంపెనీలు సృష్టించి.. బ్యాంకుల నుంచి ఏకంగా రూ. 7500 కోట్లు కొల్లగొట్టారని ఈడీ వెల్లడించింది. ఇప్పటికే సుజనా చౌదరి అక్రమాలపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. కాగా, ఈడీ జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని సుజనా చౌదరి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గత శుక్రవారం దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ ధర్మాసనం పిటీషనర్ వాదనలతో ఏకీభవించలేదు. దీంతో పిటిషన్‌ను కొట్టివేస్తూ.. డిసెంబర్ 3న ఈడీ ముందు సుజనా చౌదరి వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశించింది. -
ఈడీ ముందు హాజరు కావాల్సిందే...
సాక్షి, హైదరాబాద్: తమ ముందు హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జారీ చేసిన సమన్లను గౌరవించాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి(సుజనా చౌదరి)కి ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సమన్ల ప్రకారం డిసెంబర్ 3న ఈడీ ముందు హాజరు కావాల్సిందేనని ఆయనకు తేల్చిచెప్పింది. అయితే సుజనాపై కఠిన చర్యలేవీ తీసుకోవద్దని ఈడీకి సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ముక్తా గుప్తా శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తమ నుంచి తీసుకున్న రూ.364 కోట్ల అప్పును చెల్లించకుండా ఎగవేశారంటూ కార్పొరేషన్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఇటీవల హైదరాబాద్‌లోని సుజనాచౌదరి కార్యాలయం, నివాసంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం, అనేక కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. అలాగే సుజనా గ్రూప్ కింద 120 సూట్‌కేసు కంపెనీలున్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు.. రూ.5,700 కోట్ల మేరకు రుణాలు ఎగవేసినట్లు గుర్తించి, అందుకు సంబంధించిన కీలక పత్రాలనూ స్వాధీనం చేసుకున్నారు. సూట్‌కేసు కంపెనీల పేరిట ఆరు ఖరీదైన కార్లు రిజిస్టరైనట్లు గుర్తించి వాటినీ జప్తు చేశారు. ఈ నేపథ్యంలో స్వయంగా తమ ముందు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు. ఈ సమన్లను కొట్టేయాలని అభ్యర్థిస్తూ సుజనాచౌదరి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ ముక్తా గుప్తా శుక్రవారం విచారించారు. వాస్తవాలు తెలుసుకునేందుకే సమన్లు.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈడీ నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్)లో సుజనాచౌదరి పేరు లేదన్నారు. అందువల్ల ఆయనకు జారీచేసిన సమన్లు చట్టప్రకారం చెల్లవన్నారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడంతో కేంద్రప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని, అందులో భాగంగానే సుజనాపై ఈడీ దాడులు జరిగాయని చెప్పారు. ఈ వాదనలను కేంద్రప్రభుత్వ న్యాయవాది అనిల్ సోనీ తోసిపుచ్చారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్టస్ లిమిటెడ్‌లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించిన సందర్భంగా ఆ కంపెనీ డైరెక్టర్లు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సుజనాచౌదరి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయన్నారు. సోదాల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వాస్తవాలను తెలుసుకునేందుకు ఆయనకు సమన్లు ఇచ్చినట్టు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. డిసెంబర్ 3న ఈడీ ముందు హాజరు కావాల్సిందేనని సుజనాచౌదరిని ఆదేశించారు. అయితే సుజనాపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఈడీకి స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర ఆర్థిక శాఖను ఆదేశిస్తూ విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేశారు. -
‘తండ్రి పేరు’తోనూ సుజనా అక్రమాలు
సాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి రూ.6,000 కోట్లు రుణాలు తీసుకుని మోసం చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో.. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి చేసిన పాత మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అనేక డొల్ల కంపెనీలను సృష్టించి వ్యాపారం చేయకుండానే వేల కోట్ల లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు చూపించి బ్యాంకులను మోసం చేసిన సుజనా చౌదరి ఇప్పుడు ఏకంగా తండ్రి పేరును కూడా మార్చి రెండు డైరక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్లు(డిన్) తీసుకున్న వైనం తాజాగా బయటకొచ్చింది. వై. సత్యనారాయణ చౌదరి(సుజనా చౌదరి) తన తండ్రి వై.జనార్ధనరావు పేరు మీద నిబంధనలకు విరుద్ధంగా రిజిష్ట్రార్ ఆప్ కంపెనీస్(ఆర్వోసీ) నుంచి ఈ రెండు డిన్ నంబర్లు పొందారు. పేరు చివరన కేవలం రెండు అక్షరాలు మార్చి ఒకే ఇంటి చిరునామా, పాన్ నంబర్లతో ఈ రెండు డిన్ నంబర్లను తీసుకున్నారు. వైఎస్ చౌదరి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న చిరునామా, పాన్ నంబర్లతోనే వైఎస్ జనార్ధనరావు, వైఎస్ జనార్ధనరెడ్డి పేరు మీద వీటిని పొందారు. దీనిపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన న్యాయవాదులు 2016 ఫిబ్రవరిలో ఆర్వోసీకి ఫిర్యాదు చేశారు. ఆ తరువాత ఇక్కడి న్యాయవాది ఇమన్నేని రామారావు కూడా ఫిర్యాదు చేయడంతో ఆర్వోసీలో కదలిక వచ్చింది. ఈ ఫిర్యాదుపై ఆర్వోసీ అధికారులు దర్యాప్తు చేపట్టగా రెండు డిన్ నంబర్లను కలిగివున్న విషయం బహిర్గతమైంది. దీంతో వైఎస్ జనార్ధనరెడ్డి పేరు మీద 2006లో తీసుకున్న డిన్ను ఈ ఏడాది సెప్టెంబర్ 15న రద్దు చేశారు. కాగా, ఈ డిన్ నంబర్‌కు సంబంధించిన డైరెక్టర్ వరుసగా ఫైలింగ్ చేయకపోవడంతో డియాక్టివేట్ అయినట్లు ఆర్వోసీ అధికారులు చెపుతున్నారు. అయిత ఒకసారి డిన్ జారీ చేస్తే అది జీవితకాలం ఉంటుందని, ఇలా ఎందుకు డియాక్టివేట్ చేశారో అర్థం కావట్లేదని చార్టర్డ్ అకౌంటెంట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక వ్యక్తి ఒకే డిన్ కలిగి ఉండాలి.. కంపెనీల చట్టం ప్రకారం వివిధ కంపెనీల్లో డైరెక్టర్‌గా చేరేవారికి ఒక డిన్ నంబర్‌ను ఇస్తారు. దీన్ని రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్వోసీ) జారీ చేస్తుంది. డైరెక్టర్ కంపెనీ మారినా డిన్ నంబర్ మారదు. ఎన్ని కంపెనీల్లో ఉన్నా సరే తెలుసుకోవచ్చు. కంపెనీల చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒకే డిన్ కలిగి ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ కలిగి ఉంటే కంపెనీల చట్టంలోని సెక్షన్ 266ఏ నిబంధనను అతిక్రమించినట్లే. దీనికి గరిష్టంగా ఆరునెలల జైలుశిక్ష లేదా రూ.5,000 లేదా ఈ రెండు కలిపి కూడా విధించే అవకాశముంది. బ్యాంకులను మోసం చేసిన సుజనా చౌదరి.. ఏకంగా తండ్రి పేరును సైతం మార్చి డిన్ నంబర్లు తీసుకోవడం వెలుగు చూడడంతో రాబోయే రోజుల్లో ఆయన మోసాలు ఇంకా ఎన్ని బయటకు వస్తాయోనని చార్టర్డ్ అకౌంటెంట్లు వ్యాఖ్యానిస్తున్నారు.