సాక్షి, ఢిల్లీ : సుజనా చౌదరి ఒక డుప్లికేట్ లీడర్ అంటూ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఫైర్ అయ్యారు. చంద్రబాబు అజెండా మోయడానికే నీవు బీజేపీలో చేరిన మాట వాస్తవం కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు. నీకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా ? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమిత్ షాతో జరిపిన చర్చలకు సంబంధించిన వివరాలను గోడదూకిన నీలాంటి వారికి చెప్పే అర్హత లేదని విమర్శించారు. దీనికి సంబంధించి అధికారికంగా వెల్లడించే హక్కు కేంద్ర ప్రభుత్వానికే ఉంటుదన్న విషయం ఎలా మరిచిపోయావంటూ ప్రశ్నించారు.
సుజనా చౌదరీ ఒకప్పుడు ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా ధర్మదీక్ష పోరాటాలు చేసారు. అలాంటిది ఇప్పుడు అదే పార్టీలో చేరి ఢిల్లీలో కూర్చొని చంద్రబాబు ఏజెంట్‌లా వ్యవహరిస్తూ విషపు కూతలు కూస్తున్నారంటూ మండిపడ్డారు. సుజనా ఒక డుప్లికేట్ లీడర్ అని, ఆయన మాటలకు ఎక్కడా విలువ లేదని, ఎథిక్స్ కమిటీకి ఫిర్యాధు చేస్తామని తెలిపారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా చౌదరీ లాంటి వాళ్లు చట్ట సభల్లోకి రాకుండా పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెడతాం అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment