balashouri
-
కేంద్ర కేబినెట్లో తెలుగు రాష్ట్రాలకే పెద్దపీట!
ఢిల్లీ: కేంద్రంలో కొలువుదీరబోయే ఎన్డీయే ప్రభుత్వ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ తన స్థానాల్ని డబుల్ చేసుకోగా.. ఏపీలోనూ కూటమి ద్వారా మంచి ఫలితాన్నే రాబట్టుకోగలిగింది. దీంతో తెలంగాణ నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి, అలాగే ఏపీ నుంచి ఐదారుగురికి కేబినెట్లో చోటు దక్కవచ్చనే సంకేతాలు అందుతున్నాయి.తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అయితే బీసీ కోటాలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు మంత్రి పదవి దక్కవచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఇక.. మహిళా కోటాలో మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణకు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఇక.. కేంద్ర కేబినెట్లో బెర్త్ ఆశిస్తున్న ఈటల రాజేందర్‌కు.. తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించవచ్చనే చర్చ ఆ పార్టీలో నడుస్తోంది.ఏపీ బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి, సీఎం రమేష్‌కు మంత్రివర్గంలో చాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి బాలశౌరికి సహయ మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కూటమిలో కీలకంగా మారిన టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు, రాయలసీమ నుంచి పార్థసారధికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది.మంత్రివర్గ కూర్పుపై కొనసాగుతున్న కసరత్తు..ఎన్డీయే భాగస్వామి పక్షాల అధినేతలతో విడివిడిగా శుక్రవారం జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు. మంత్రివర్గంలో కోరుకుంటున్న పదవులు, స్థానాలపై నేతలు చర్చించారు. ఇవాళ కూడా మంతివర్గ కూర్పుపై కసరత్తు కొనసాగుతోంది. టీడీపీ, జేడీ(యూ)కు అధిక ప్రాధాన్యం కలిగిన శాఖలు దక్కే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేబినెట్లో ఛాన్స్ లభించనుంది. మరో ఇద్దరికి సహాయ మంత్రి పదవులు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గం రేసులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఉన్నారు.రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే మంత్రిత్వ శాఖలు తీసుకుంటామని టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు అన్నారు. పట్టణాభివృద్ధి, జలవనరుల శాఖ, పరిశ్రమల శాఖలను టీడీపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక.. జనసేన నుంచి బాలశౌరికి సహాయ మంత్రి అవకాశం లభించనున్నట్లు సమాచారం. ఏపీ బీజేపీ కోటాలో పురందేశ్వరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. మంత్రి పదవి కోసం ముమ్మరంగా సీఎం రమేష్ లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో ఎన్డీయే పక్ష పార్టీలు భాగస్వామ్యం కానున్నాయి. కీలకమైన హోమ్, ఆర్థిక, రక్షణ విదేశాంగ శాఖలు బీజేపీకే కేటాయించనున్నట్లు సమాచారం. మూడు మంత్రి పదవులు, రెండు సహాయ మంత్రి పదవులను టీడీపీ కోరుతున్నట్లు తెలుస్తోంది.టీడీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. జేడీ(యూ) మూడు మంత్రి పదవులు కోరుతున్నట్లు తెలుస్తోంది. శివసేన, ఎన్సీపీ, ఆర్ఎల్డీకి ఒక్కొక్క మంత్రి పదవి కేటాయించనున్నట్లు సమాచారం. దీంతో పాటు బీహార్ ప్రత్యేక హోదా ప్రకటించాలని సీఎం నితీశ్ కుమార్ కోరుతున్నారు. -
మచిలీపట్నం జనసేన లోక్‌సభ అభ్యర్థి ప్రకటన
కృష్ణా, సాక్షి: పెండింగ్ ఎంపీ సీటుకు జనసేన అభ్యర్థిని ప్రకటించింది. ముందు నుంచి ఊహించినట్లే జనసేన తరఫు నుంచి మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి తంగెనళ్ల ఉదయ శ్రీనివాస్ పోటీ చేస్తారని పవన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి పొత్తులో భాగంగా.. జనసేన 21 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ సీట్లు తీసుకుంది. ఇప్పటికే ఒక లోక్‌సభ, 18 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించగా.. పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల కసరత్తును ముమ్మరం చేసింది. తాజాగా బాలశౌరిని మచిలీపట్నం పార్లమెంట్ స్థానపు అభ్యర్థిగా ప్రకటించింది. వైఎస్సార్సీపీ తరఫున 2019లో ఎంపీగా నెగ్గిన వల్లభనేని బాలశౌరి.. ఈ ఏడాది జనవరి 14న పార్టీని వీడారు. ఫిబ్రవరి 4వ తేదీన జనసేనలో చేరారు. అప్పటి నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే.. పెండింగ్‌లో ఉన్న మూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థుల కోసం పవన్ మల్లగుల్లాలు పడుతున్నారు. విశాఖ సౌత్ సీటును వంశీ యాదవ్‌కు కేటాయిస్తారని తొలి నుంచి ప్రచారం జరుతోంది. అయితే వంశీకి సీటు ఇవ్వొద్దంటూ అక్కడి జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయినా ఆ వలస నేతకే ఇవ్వాలని పవన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు పెండింగ్‌లో ఉన్న అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లకు ధనబలం ఉన్న నేతలను ఎంపిక చేయాలని పవన్ భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆయా స్థానాల్లో ఇప్పటికే పవన్ వాయిస్‌తో ఐవీఆర్ఎస్ సర్వేలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థుల్ని ప్రకటించే చాన్స్ ఉంది. -
నారా లోకేష్‌ను దాచేసినట్లున్నారు: మంత్రి అంబటి
ఇచ్చిన హామీలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలబెట్టుకోలేపోయింది అనే ఓ అసత్యాన్ని పదే పదే చెప్పే ప్రయత్నం టీడీపీ చేస్తుంది. కానీ, దేశంలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్సీపీనే. ఇది రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ తెలుసు అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఉద్ఘాటించారు. సోమవారం అసెంబ్లీ పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘2014-19 వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేశారు. ఇది బాబు-జగన్ మధ్య ఉన్న తేడా. ఈ ఎన్నికలకు మా మేనిఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నాం. చంద్రబాబు 2014లో ఇచ్చిన మేనిఫెస్టో ఏకంగా అదృశ్యమైపోయింది. వెబ్ సైట్ లో లేదు. మేనిఫెస్టోలను మాయం చేసిన తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు.. మేనిఫెస్టోలో హామీలను అమలు చేసి ప్రతి ఇంటికి మేనిఫెస్టోను తీసుకెళ్ళి ఇచ్చిన వ్యక్తిత్వం కలిగిన నాయకుడు జగన్. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్ గారు. అందుకే మరల తిరిగి ఓటు అడగడానికి వెళ్తున్నాం, సిద్దమయ్యాం.. మా టార్గెట్ 175. 175 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించి తిరిగి అధికారంలోకి రావాలని టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తున్నాం. దానికి సంబంధించి అనేక మార్పులు చేర్పులు చేసే కార్యక్రమం చేస్తున్నాం. మేము మేనిఫెస్టో అమలు చేయలేదని అసత్య ఆరోపణలు చేస్తున్న టీడీపీకి దమ్ముంటే 2014 మేనిఫెస్టోను తీసుకొచ్చి మాట్లాడాలి.. మా మేనిఫెస్టోని పట్టుకుని మాట్లాడే దమ్ము, ధైర్యం మాకు ఉంది. సీట్లు, నోట్ల ముష్టి కోసం వెళ్ళాడా? చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ ఉదయం, సాయంత్రం వెళ్లి వచ్చాడంటా! ప్యాకేజీ ముష్ఠి కోసం వెళ్ళాడా? సీట్లు ముష్ఠి కోసం వెళ్లాడా?. జనసేన నాయకులు, కార్యకర్తలకు ఒక్కటే చెబుతున్నా... కుక్క తోక పట్టుకుని గోదారి ఈదకండి. చంద్రబాబు మాట విని పవన్ కల్యాణ్ కార్యకర్తల్ని ముంచుతాడు. చంద్రబాబు మీకు ముష్ఠి వేస్తాడు, ఆ ముష్ఠి తీసుకునే పరిస్థితి తప్ప గత్యంతరం లేని పరిస్థితి మీకు ఉంది. రోజు తిరగడమే పని తప్ప ఫలితం ఉండదు. చంద్రబాబు 20-25 సీట్లు ఇవ్వడమే గగనం. ఇది అందరికి తెలిసిన సత్యం. జనసేన కార్యకర్తలు ఆలోచించుకోవాలి, మీరు మోసపోతున్నారు. జన విజయం తథ్యం సక్సెస్ ఫుల్ సీఎంగా జగన్ గారు రాష్ట్ర చరిత్రలో నిలబడపోతున్నారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు రెండో సారి ఏ విధంగా నిలబడ్డాడో, ఆ విధంగా మళ్ళీ గెలిచి సీఎంగా జగన్ గారు రికార్డ్ సృష్టించబోతున్నారు. ఎన్ని పద్మవ్యూహాలు పన్నినా ఎందరు కలిసి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని చీలికలు చేసినా, చరిత్రలో నిలబడే విజయాన్ని జగన్ గారు సాధించబోతున్నారు. జగన్ గారు సుపరిపాలన చూసి రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరూ కదలడం లేదు టీడీపీ-జనసేన ఏదేదో మాట్లాడతారు.. అసలు వారు ఇంతవరకు సిద్దమే కాలేదు,ఇంకా భేటీలలోనే ఉన్నారు. మేము సిద్దం అయ్యాము, దూసుకుపోతున్నాం. వాళ్లు సీట్లు, నోట్లు లెక్కేసుకునే పరిస్థితిలోనే ఉన్నారు. కనపడినవాళ్ళందరినీ.. రా కదలిరా అంటున్నారు కానీ, ఎవరు కదిలొచ్చే పరిస్థితి లేదు.. అందుకే జాయింట్ గా మీటింగ్ లు పెడతారంటా.. సినిమా యాక్టర్ ను చూడడానికి వచ్చిన వాళ్ళందరికి చంద్రబాబు ఉపన్యాసం చెబుతారంటా. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు తీసుకువెళ్ళినట్టు.. పవన్ కల్యాణ్ ను తీసుకెళ్ళి జనాల్ని పోగేసేకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ బయటకు వచ్చినా.. రాకపోయినా.. చిత్రంగా లోకేష్ ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు, దాచేసినట్టున్నారు.. ఆయన్ను బయటకు పంపిస్తే టీడీపీ ఔట్ అని చెప్పినట్టున్నారు. లోకేష్ ను దాచేసినా, బయట పెట్టినా టీడీపీ ఔటే.. ఇది వాస్తవం.. పాదయాత్ర చేసిన వీరుడు, సూరుడు అని చెప్పిన లోకేష్ ను తీసుకెళ్ళి పక్కనపెట్టారు .. మీరు పొత్తులు పెట్టుకున్నా, కూటమి కట్టినా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని పక్కనపెట్టబోతున్నారు. బాలశౌరి ఒక బఫూన్.. త్వరలో అది తెలుస్తుంది మా పార్టీలో టికెట్ లేని బఫూన్ లు వేరే పార్టీలో చేరతారు, ఇక్కడ టికెట్ లేదని చెప్పిన తర్వాత బఫూన్ బాలశౌరి వెళ్లి అక్కడ చేరాడు, కొద్దిగా ఓవర్ గా మాట్లాడాడు.. ఓవరాక్షన్ చేస్తేనే తప్ప అక్కడ గుర్తించమన్నట్టున్నారు. చాలా ప్రగల్భాలు పలికాడు.. చాలా ఓవరాక్షన్ చేశాడు. పవన్ కల్యాణ్ బాలశౌరిని ఉద్దేశించి.. ‘ఇప్పటి వరకు అక్కడుండి ఏంటి ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడు, వీడిని నమ్మొచ్చా?’ అన్నాడు.. బాలశౌరి జీవిత చరిత్ర అంతా మాకు తెలుసు. 2004 నుంచి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి, తెనాలి పార్లమెంట్ లో పోటీ చేసిన దగ్గర నుంచి బాలశౌరి గురించి తెలుసు. బాలశౌరి పుట్టుక దగ్గర నుంచి నేటి వరకు అన్నీ తెలుసు. ఇక్కడ తంతే వెళ్ళి జనసేన ఆఫీస్ లో పడ్డాడు. అన్యాయాలు, అక్రమాలు చేసిన బఫూన్ బాలశౌరి. అన్యాయాలు, అక్రమాలు చేశాడు కాబట్టే టికెట్ రిజెక్ట్ చేశారు. టికెట్ రిజెక్ట్ చేస్తే జనసేన ఆఫీసులో తేలాడు. .. ఇప్పుడు వైఎస్ జగన్‌ను దూషించే కార్యక్రమం చేస్తున్నాడు. బాలశౌరిని నమ్మోచ్చా? అని పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ అనుకున్నారంటా? బాలశౌరిని ఎవరూ నమ్మరు.. ఎవరినైనా ముంచిపోయే తత్వమే బాలశౌరిది. గత్యంతరం లేక బందరు టికెట్ ఇవ్వొచ్చు ఏమో!. బాలశౌరిది ముంచిపోయే తత్వమని మనకన్నా నాదెండ్ల మనోహర్ కి, పవన్ కల్యాణ్ కు బాగా తెలుసు, రాబోయే కాలంలో మీరే చూస్తారు. ఏపీ ప్రజలది కృష్ణావతారం.. తనది అర్జునుడు పాత్ర అని సిద్ధం సభల్లో వైఎస్ జగన్ చెప్పగానే వాళ్ళకి ఎంతగా గుచ్చుకుందో?. దుష్టచతుష్టయం పద్మవ్యూహాలను, పన్నే పన్నాగాలను ఛేదించుకుని రాగలిగే వీరుడు.. అర్జునుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని మంత్రి అంబటి అన్నారు. -
కృష్ణా జిల్లాలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ
-
లద్దాక్‌లో పర్యటించిన ఎంపీ బాలశౌరి
చిలకలపూడి: కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాక్‌లో పార్లమెంట్ సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్ హోదాలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సోమవారం పర్యటించారు. ఆ రాష్ట్ర డీఐజీ, ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) ఉన్నతాధికారులతో పలు అంశాలపై ఆయన చర్చించారు. లద్దాక్‌లో ఉన్నతాధికారులతో ఎంపీ బాలశౌరి -
‘పేదలకు ఇళ్లు.. ఆయనకొచ్చిన నష్టమేమిటి?’
సాక్షి, కృష్ణా జిల్లా: ఏపీ వ్యాప్తంగా రెండో రోజు ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగుతుంది. బాపులపాడు మండలం ఏ. సీతారాంపురంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇళ్ల పట్టాలను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గన్నవరం నియోజకవర్గంలో 25,500 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చంద్రబాబుకు మనసురాలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొమ్మిది వేల కోట్లు వెచ్చించి భూములను కొనుగోలు చేసి పేదలకు ఇస్తున్నారని తెలిపారు. ఇళ్ల స్థలాల సేకరణలో అవినీతి జరిగితే టీడీపీ నేతలు నిరూపించవచ్చని ఆయన సవాల్ విసిరారు. ‘‘చంద్రబాబు హయాంలో పేదలకు ఇళ్లు ఇవ్వలేకపోయారు. ఇచ్చేవారిని అడ్డుకుంటున్నారు. పేదలకు ఇళ్లు ఇస్తే చంద్రబాబుకి నష్టం ఏమిటి ? సీఎం వైఎస్ జగన్.. టీడీపీ వారికి సైతం ఇళ్లపట్టాలు ఇస్తున్నారు. చంద్రబాబుకి ప్రజలు సంతోషంగా ఉండటం ఇష్టం లేదు. ఆయన పోలవరం కట్టకుండానే భజనలు చేయించుకున్నారు. మనువడికి పోలవరం చూపించేందుకు డబ్బులు ఖర్చు చేశారు. 14 ఏళ్ళు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఏమి చేశారో చెప్పాలని’’ వల్లభనేని వంశీ ప్రశ్నించారు. వంగవీటి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కొడాలి, ఎంపీ బాలశౌరి గుడ్లవల్లేరులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, ఎంపీ బాలశౌరి పాల్గొన్నారు. గుడ్లవల్లేరు మండలంలో 2700 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గాదేపూడిలో వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని మంత్రి కొడాలి నాని, ఎంపీ బాలశౌరి ఆవిష్కరించారు. మోహనరంగా వర్ధంతి సందర్భంగా నివాళర్పించారు. మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా మరణించి 32 సంవత్సరాలయినా ఇంకా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారన్నారు. ఆయన బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడ్డారని తెలిపారు. కుల,మత,పార్టీలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్న వంగవీటి.. చరిత్రలో నిలిచిపోయారని కొడాలి నాని అన్నారు. -
డిసెంబర్ 25 చరిత్రలో గుర్తుండిపోతుంది
సాక్షి, కృష్ణా: భారత దేశ రాజకీయ చరిత్రలోనే డిసెంబర్ 25 గుర్తుండిపోతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇళ్ల పట్టాల పంపిణీతో రాష్ట్రంలో 1 కోటి 40 లక్షల మంది లబ్ధి పొందనున్నారని పేర్కొన్నారు. పెడన నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగి రమేష్, ఎంపీ బాలశౌరి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ.. పెడన నియోజకవర్గంలో 7600 మంది ప్రజల సొంతింటి కల నెరవేరనుందన్నారు. ఒక్క పెడన పట్టణంలోనే 2500 మంది ఇళ్ల పట్టాలు పొందారని చెప్పారు. పేదల బతుకుల్లో వెలుగులు నింపిన వ్యక్తి వైఎస్ జగన్ అని కీర్తించారు. (చదవండి: నేటి నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పండగ: సీఎం జగన్) బాబుకు ఇంకా బుద్ధి రాలేదు కోర్టుల ద్వారా స్టేలతో పట్టాలను అడ్డుకోవాలని చూశారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు మీద జోగి రమేష్ ధ్వజమెత్తారు. బాబు శిఖండిలా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూశారని మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం తప్పా? అని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితమైనా బాబుకు బుద్ధి రాలేదని విమర్శించారు. రాజధానిలో లక్షల కోట్లు పెడితేనే రాష్ట్ర అభివృద్ధి ఎలా అవుతుందని నిలదీశారు. బాబును తరిమికొడతాం అని హెచ్చరించారు. సొంతింటి కల సాకారమవుతోంది మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. పేదవాడికి సొంతిల్లు ఒక కల అని, దానిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజం చేశారన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ కన్నా ఎక్కువగా ఇళ్ల పట్టాలను మంజూరు చేశారని తెలిపారు. 31 లక్షల మంది పేదల కలను సీఎం జగన్ సాకారం చేశారన్నారు. 340 చదరపు అడుగుల ఇంటిని ఒక్క రూపాయికి ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది అని ఉద్ఘాటించారు. (చదవండి: రాయపాటి లూటీలో బాబు వాటా ఎంత?) -
పార్లమెంటులో కీలక బాధ్యతలు స్వీకరించిన ఎంపీ బాలశౌరి
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంటు సబ్ ఆర్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్‌గా మచిలీపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంటు లోని అనెక్సీ భవన్లో గురువారం ఎంపీ బాలశౌరి ఆధ్వర్యంలో అధికారులు ఆర్సీ తివారి, రంగారాజన్ భేటీ అయ్యారు. లెజిస్లేషన్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన బాలశౌరికి సాదర స్వాగతం పలికిన అధికారులు సమావేశ వివరాలను తెలిపారు. చదవండి: మరోసారి సత్తాచాటిన ఏపీ పోలీస్ శాఖ -
ప్రధాని మోదీకి ఎంపీ బాలశౌరి లేఖ
సాక్షి, న్యూ ఢిల్లీ : కరోనా నేపథ్యంలో భారీగా నష్టాలను చవిచూసే టూరిజం, ట్రావెల్, పౌల్ట్రీ రంగాలను ఆదుకోవడానికి తగిన ప్రోత్సాహకాలను ప్రకటించాలని మచిలీపట్నం వైఎస్సార్ సీపీ ఎంపీ బాలశౌరి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న ఈ సమయంలో ప్రస్తుత 2019-20 ఆర్ధిక సంవత్సరం ముగింపును మార్చి 31కి బదులుగా ఏప్రిల్ 30కి పొడిగించేటట్లు ఆర్డినెన్సు తేవాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఎంపీ బాలశౌరి ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ లేఖలో.. వ్యక్తిగతంగా కట్టవలసిన చెల్లింపులైన గృహ ఋణాలు, వ్యక్తిగత రుణాల విషయంలో కూడా కొంత వెసులుబాటు కల్పించాలన్నారు. ( ఏపీ.. ఇంటర్ చివరి పరీక్ష వాయిదా) చిన్న మధ్య తరగతి సంస్థల నగదు చెల్లింపుల విషయంలో జీఎస్టీ రేట్లను తగ్గించడంతో పాటు పన్ను చెల్లింపు కాలవ్యవధిని కనీసం 60 రోజులకు పెంచాలని, జీఎస్టీ ఇతర పన్ను చెల్లింపుల విషయంలో గడువు తేదీలను పోడిగించాలని కోరారు. రోజువారీ కూలీపై ఆధారపడిన కుటుంబాలకు, వారి ఇళ్లకే నిత్యావసర సరుకులను అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. చట్ట బద్ధమైన అన్ని పన్ను చెల్లింపుల విషయంలో ప్రస్తుతమున్న అన్ని తేదీలను తప్పనిసరిగా పొడిగించాలని విన్నవించారు. ( ఈ నెలాఖరు వరకు ఏపీ లాక్డౌన్ : సీఎం జగన్ ) -
'సుజనాచౌదరి ఒక డుప్లికేట్ లీడర్'
సాక్షి, ఢిల్లీ : సుజనా చౌదరి ఒక డుప్లికేట్ లీడర్ అంటూ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఫైర్ అయ్యారు. చంద్రబాబు అజెండా మోయడానికే నీవు బీజేపీలో చేరిన మాట వాస్తవం కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు. నీకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా ? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమిత్ షాతో జరిపిన చర్చలకు సంబంధించిన వివరాలను గోడదూకిన నీలాంటి వారికి చెప్పే అర్హత లేదని విమర్శించారు. దీనికి సంబంధించి అధికారికంగా వెల్లడించే హక్కు కేంద్ర ప్రభుత్వానికే ఉంటుదన్న విషయం ఎలా మరిచిపోయావంటూ ప్రశ్నించారు. సుజనా చౌదరీ ఒకప్పుడు ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా ధర్మదీక్ష పోరాటాలు చేసారు. అలాంటిది ఇప్పుడు అదే పార్టీలో చేరి ఢిల్లీలో కూర్చొని చంద్రబాబు ఏజెంట్లా వ్యవహరిస్తూ విషపు కూతలు కూస్తున్నారంటూ మండిపడ్డారు. సుజనా ఒక డుప్లికేట్ లీడర్ అని, ఆయన మాటలకు ఎక్కడా విలువ లేదని, ఎథిక్స్ కమిటీకి ఫిర్యాధు చేస్తామని తెలిపారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా చౌదరీ లాంటి వాళ్లు చట్ట సభల్లోకి రాకుండా పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెడతాం అని పేర్కొన్నారు. -
సకుటుంబ సమేతం.. ఎన్నికల ప్రచారం
సాక్షి, మచిలీపట్నం : మనం సాధారణంగా ఏ పెళ్లిలోనో కుటుంబ సభ్యులంతా కలవడం చూస్తుంటాం. ఏ జాతరలోనో అయినవాళ్లంతా ఒక్కటై సందడి చేస్తుండటం గమనిస్తుంటాం. సార్వత్రిక ఎన్నికల పుణ్యమా అని ప్రస్తుతం ఆ పరిస్థితి అన్నిచోట్ల కనిపిస్తోంది. జిల్లాలోని అనేక పల్లెల్లో ఎన్నికల్లో పోటీ చేసే వారి కుటుంబ సభ్యులు సందడి చేస్తున్నారు. ఎవరికి వారు తమ వారిని గెలిపించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇళ్లకెళ్లి పలకరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. పోలింగ్‌కు సమయం తక్కువగా ఉండటం, తిరగాల్సిన మండలాలు, పల్లెలు ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులు తమతో పాటు కుటుంబ సభ్యులనూ రంగంలోకి దించారు. వారు అభ్యర్థి తరఫున ప్రతినిధిగా వెళ్తూ క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. రోజుకో మార్గాన్ని ఎంచుకోవడం అందులో సమయానుకూలంగా పల్లెలను నిర్దేశించుకొని ఆ మేరకు ఓట్ల అభ్యర్థన చేస్తున్నారు. ఎండలను సైతం లెక్కచేయకుండా కొన్నిచోట్ల తమ బిడ్డల గెలుపు కోసం తల్లిదండ్రులు, భార్యలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామం మంచిదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సమాజంలో ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఇంటి వద్దకు వెళితే ప్రజలు పడుతున్న బాధలు, వారి జీవన విధానంపై అవగాహన వస్తుందని అంటున్నారు. ఇప్పటి వరకు ఉన్నత చదువులు, ఇతర దేశాల్లో ఉంటూ రాజకీయాలపై అవగాహన లేని వారు సైతం ప్రస్తుత ఎన్నికల ప్రచారం చేస్తుండటంతో రాజకీయాలపై కొద్దోగొప్పో అవగాహన వచ్చే అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారు. బందరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, అసెంబ్లీ అభ్యర్థి పేర్ని నాని తనయులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రతి పల్లె తిరుగుతూ పార్టీ మేనిఫెస్టో, నవరత్నాల ద్వారా ప్రజలకు చేకూరే లాభం, వైఎస్సార్ సీపీ ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఇంటి గడప తడుతూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర తరఫున ఆయన సతీమణి, జనసేన అభ్యర్థి తరఫున అతని కుమారుడు ప్రచారం చేస్తున్నారు. పెడన నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి జోగి రమేష్ కొడుకు రాజీవ్ సైతం ప్రచారం నిర్వహిస్తున్నారు. రాత్రిళ్లు మంతనాలు జరుపుతున్నారు. టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకునేలా చురుకైన పాత్రపోషిస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు తరఫున తనయుడు వికాస్, కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వెళుతున్నారు. వైఎస్సార్ సీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పీవీపీ కుటుంబ సభ్యులు సైతం ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజల వద్దకు వెళ్తున్నారు. రోజంతా ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు జిల్లాలో 16 అసెంబ్లీ, 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా.. అన్ని చోట్ల ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని పార్టీల అభ్యర్థులకు చెందిన కుటుంబ సభ్యులు ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో గ్రామాన్ని ఎంచుకొని క్షేత్రస్థాయి వరకు వెళ్తున్నారు. ఉదయం 6 నుంచి ప్రచార పర్వం ప్రారంభిస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 నుంచి 11 గంటల వరకు నిరాటంకంగా సాగిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ పరిస్థితి కాస్త తక్కువగా ఉన్నా.. ఈ సారి ఈ తంతు ఎక్కువైంది. త్వరలో జరగబోయే ఎన్నికలు అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారడంతో బంధువులను రంగంలోకి దింపుతున్నారు. -
ఎమ్మెల్యేల కొనుగోలుపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: వివిధ అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న సీఎం చంద్రబాబు.. వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలుపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ బాలశౌరి డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో కూడా శ్వేతపత్రం ద్వారా ప్రకటించాలన్నారు. చంద్రబాబు ప్రకటించిన శ్వేతపత్రాలన్నీ దొంగవేనని విమర్శిచారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలోని ఎన్నో సంస్థలు చంద్రబాబు అవినీతి పాలన గురించి ప్రస్తావించాయని, వాటిపై కూడా శ్వేతపత్రం ప్రకటిస్తే బాగుంటుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదన్నారు. అసలు ఆ అవసరమే లేదన్నారు. ఒంటరిగా పోటీ చేసే సత్తా వైఎస్ జగన్‌కు ఉందని, కానీ చంద్రబాబు ఇంతవరకు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లింది లేదన్నారు. భావం కరెక్టుగా ఉంది... : తెలంగాణ సీఎం కేసీఆర్ తనను ఏదో అన్నారని చంద్రబాబు గింజుకుంటున్నారని, తన పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బహిరంగ సభలో మాట్లాడిన భాష విని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కూర్చున్నప్పుడు చంద్రబాబు విజ్ఞత ఏమైందని మండిపడ్డారు. కేసీఆర్ భాషలో తేడా ఉండవచ్చు కానీ, భావం మాత్రం కరెక్టుగా చెప్పారన్నారు. పబ్లిక్ మీటింగ్‌ల్లో జేసీతో పలుమార్లు వైఎస్ జగన్‌ను తిట్టించింది గుర్తులేదా? జేసీ జుగుప్సాకరం గా మాట్లాడుతుంటే ఎందుకు అడ్డుచెప్పలేదని సీఎం బాబును నిలదీశారు.