సాక్షి, కృష్ణా: భారత దేశ రాజకీయ చరిత్రలోనే డిసెంబర్ 25 గుర్తుండిపోతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇళ్ల పట్టాల పంపిణీతో రాష్ట్రంలో 1 కోటి 40 లక్షల మంది లబ్ధి పొందనున్నారని పేర్కొన్నారు. పెడన నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగి రమేష్, ఎంపీ బాలశౌరి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ.. పెడన నియోజకవర్గంలో 7600 మంది ప్రజల సొంతింటి కల నెరవేరనుందన్నారు. ఒక్క పెడన పట్టణంలోనే 2500 మంది ఇళ్ల పట్టాలు పొందారని చెప్పారు. పేదల బతుకుల్లో వెలుగులు నింపిన వ్యక్తి వైఎస్ జగన్ అని కీర్తించారు. (చదవండి: నేటి నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పండగ: సీఎం జగన్)
బాబుకు ఇంకా బుద్ధి రాలేదు
కోర్టుల ద్వారా స్టేలతో పట్టాలను అడ్డుకోవాలని చూశారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు మీద జోగి రమేష్ ధ్వజమెత్తారు. బాబు శిఖండిలా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూశారని మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం తప్పా? అని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితమైనా బాబుకు బుద్ధి రాలేదని విమర్శించారు. రాజధానిలో లక్షల కోట్లు పెడితేనే రాష్ట్ర అభివృద్ధి ఎలా అవుతుందని నిలదీశారు. బాబును తరిమికొడతాం అని హెచ్చరించారు.
సొంతింటి కల సాకారమవుతోంది
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. పేదవాడికి సొంతిల్లు ఒక కల అని, దానిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిజం చేశారన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ కన్నా ఎక్కువగా ఇళ్ల పట్టాలను మంజూరు చేశారని తెలిపారు. 31 లక్షల మంది పేదల కలను సీఎం జగన్ సాకారం చేశారన్నారు. 340 చదరపు అడుగుల ఇంటిని ఒక్క రూపాయికి ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది అని ఉద్ఘాటించారు. (చదవండి: రాయపాటి లూటీలో బాబు వాటా ఎంత?)
Comments
Please login to add a commentAdd a comment