House Site Pattas
-
టీటీడీ ఉద్యోగులకు పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్
-
ఇళ్ల పట్టాల పంపిణీ.. పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
-
ఇవి ఇళ్ల పట్టాలు మాత్రమే కాదు.. సామాజిక న్యాయ పత్రాలు: సీఎం జగన్
Updates ►అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్ ► సీఆర్డీఏ పరిధిలో 50, 703 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ►ఈ కార్యక్రమానికి దేశ చరిత్రలో ప్రత్యేకత ఉంది: ►పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని వేల పోరాటాలు దేశంలో చాలా జరిగాయి ►కాని, ప్రభుత్వం పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి సుదీర్ఘ న్యాయపోరాటం చేసి, సుప్రీంకోర్టుకు వెళ్లిమరీ.. 50వేల మందికి ఇళ్లస్థలాలు ఇవ్వడం ఒక చారిత్రక ఘటన ►ఎక్కడైనా ఇలాంటివి చూస్తే… ఆశ్చర్యం కలుగుతోంది ►ఇళ్లస్థలాలు ఇవ్వకుండా మారీచులు, రాక్షసులు అడ్డుపడ్డారు ►ఈ ప్రాంతంలో గజం ధర రమారమి ఎంత అని అడిగాను ►ఈ మధ్యకాలంలో జరిగిన వేలంలో గజం ఇక్కడ రూ.17వేలకు అమ్ముడుపోయిందని చెప్పారు ►రూ.7-10 లక్షల ఇంటి స్థలం నా అక్క చెల్లెమ్మల పేర్లమీద రిజిస్ట్రేషన్ జరగబోతోంది ►ఇది నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది ►సామాజిక న్యాయ పత్రాలుగా.. ఈ ఇంటి పట్టాలు ఇస్తున్నాం ►ఇదే అమరావతి.. ఇకమీదట ఒక సామాజిక అమరావతి అవుతుంది ►ఈ అమరావతి ఇకపై మన అందరి అమరావతి అవుతుంది ►మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని 1400 ఎకరాల్లో 50వేల మందికిపైగా నా పేద అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇస్తున్నాం: ►25 లే అవుట్లలో ఇంటి పట్టాలు ఇస్తున్నాం ►వారంరోజులపాటు ఈ పండుగ కార్యక్రమం జరుగుతోంది ►ప్రతి లే అవుట్ దగ్గరకు లబ్ధిదారులను తీసుకెళ్లి.. వారికిస్తున్న ఇంటి స్థలం చూపించి.. ఇంటి పట్టా ఇస్తాం ►అక్కడే ఫోటో తీసుకుని.. చిక్కటి చిరునువ్వులు వారి ముఖంలో చూసేలా కార్యక్రమం జియో ట్యాగింగ్ తీసుకుని.. వారంరోజుల్లో ఈ కార్యక్రమాలు పూర్తవుతాయి:- ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తాం ►జులై 8న, వైయస్సార్ జయంతి రోజున ఇళ్ల స్థలాల్లో ఇల్లుమంజూరుచేసి.. ఇల్లు కట్టించే కార్యక్రమం మొదలవుతుంది ►ఇప్పటికే ల్యాండ్ లెవలింగ్, సరిహద్దు రాళ్లను పాతడం, అంతర్గత రోడ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యిది ►ఇళ్ల నిర్మాణంపై లబ్ధిదారులకు మూడు ఆప్షన్లు ఇస్తాం ►తము తాముగా కట్టుకుంటామంటే.. రూ.1.8లక్షలు బ్యాంకుల ఖాతాల్లో వేస్తాం ►రెండో ఆప్షన్‌గా వారికి కావాల్సిన సిమెంటు, ఇసుక, స్టీల్ లాంటి నిర్మాణ సామగ్రి అందిస్తాం. నిర్మాణకూలి వారి ఖాతాల్లోకి నేరుగా జమచేస్తాం ►ఆప్షన్ -3గా… ప్రభుత్వమే కట్టించాలని అడిగితే.. చిరునవ్వుతో స్వీకరించి.. ఆ ఇళ్లను ప్రభుత్వమే నిర్మించిన ఇస్తుంది ►ఇందులో అక్క చెల్లెమ్మలు ఏ ఆప్షన్ తీసుకున్నా.. పర్వాలేదు ►ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఇసుక పూర్తిగా అందజేయడం జరుగుతుంది ►సిమెంటు, స్టీల్, డోర్ ఫ్రేములు అన్నీ కూడా తక్కువ రేటుకే అందరికీ అందించడం జరుగుతుంది ►మార్కెట్లో రేట్లకన్నా.. తక్కువ రేట్లకు ప్రభుత్వం అందిస్తుంది ►నాణ్యత విషయలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడ్డంలేదు ►రూ.35వేలు చొప్పున రుణాలు లబ్ధిదారులకు బ్యాంకులనుంచి ఇప్పిస్తున్నాం. పావలావడ్డీకే ఈ రుణాలు ఇప్పిస్తున్నాం ►ఇల్లు పూర్తైన తర్వాత ఇంటి విలువ.. ప్రాంతాన్ని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకూ ఉంటుంది. ►రూ.2-3 లక్షల కోట్లు మీ అన్నగా, మీ బిడ్డగా.. అక్క చెల్లెమ్మల చేతిలో పెడుతున్నాను ►గతంలో ఇలాంటి ఆలోచనలు.. గత ప్రభుత్వం ఎప్పుడైనా చూశారా? ►సీఆర్డీయే ప్రాంతంలో 5,024 మందికి పూర్తైన టిడ్కో ఇళ్లను కూడా అందిస్తున్నాం ►300 చదరపు అడుగులు ఫ్లాటు కట్టడానికి అయ్యు విలువ దాదాపుగా రూ.5.75లక్షలు అవుతోంది. మౌలిక సదుపాయాలకోసం రూ.1 లక్ష అవుతుంది ►కేంద్ర ప్రభుత్వం లక్షన్నర ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం లక్షన్నర ఇస్తే.. మిగిలిన డబ్బును బ్యాంకులనుంచి అప్పుగా తీసుకుని… 20 ఏళ్లపాటు ఆ లబ్ధిదారుడు కట్టుకుంటూ పోవాలి ►మొత్తంగా రూ.7.2లక్షలు చెల్లించాల్సి ఉంటుంది పేదవాడు ►మరి ఇది పేదవాడికి ఇచ్చినట్టేనా ►చంద్రబాబు చెప్పినట్టు…. టిడ్కో ఇళ్లను పేదవాడికి ఇచ్చినట్టేనా? ►మరి మీ అన్న ఏంచేశాడు ►ఆ ఫ్లాటును పేదవాళ్లకు పూర్తిగా రూ.1కే అక్క చెల్లెమ్మల పేరుమీ రాసిచ్చాడు ►కాని చంద్రబాబు, వారి గజ దొంగల ముఠాకు, ఎల్లోమీడియా వక్రభాష్యాలు చెప్తూనే ఉంది ►చంద్రబాబు తన పాలనలో ఒక్క ఇంటి పట్టాకూడా ఇవ్వలేదు ►గతంలో చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి, అందర్నీ మోసం చేశాడు ►ఎన్నికలకు దగ్గరపడే కొద్దీ.. మళ్లీ ఒక మేనిఫెస్టో అంటాడు ►సామాజిక వర్గాలు మీద మోసపూరిత ప్రేమ చూపిస్తాడు ►వారికోసమే మేనిఫెస్టో అని చంద్రబాబు అంటాడు ►మోసం చేసేవాడ్ని ఎప్పుడూ కూడా నమ్మకండి ►నరకాసురుడినైనా నమ్మొచ్చు కాని, నారా చంద్రబాబునాయుడ్ని మాత్రం నమ్మకూడదు ►2014 -2019 వరకూ ఒక ఇళ్లపట్టా కూడా చంద్రబాబు ఇవ్వలేదు ►కోవిడ్ కష్టాలున్నా… రెండేళ్లు రాష్ట్రాన్ని వెంటాడినా, రాష్ట్రానికి వచ్చే వనరులు తగ్గినా.. మీ బిడ్డ మాత్రం.. .మాకున్న కష్టంకన్నా.. మీ కష్టం ఎక్కువే అని భావించి మీ బిడ్డ పరిగెట్టాడు ►కోవిడ్ సమయంలో కూడా 30 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చాం ►ఆర్థికంగా ఎన్ని సవాళ్లైనా వచ్చినా సరే.. నవరత్నాల్లోని ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చాం ►ఇచ్చిన ప్రతీ వాగ్దానం కూడా అమలు చేశాం ►మేనిఫెస్టోలో 98శాతం వాగ్దానాలను అమలు చేశాం ►ఇళ్ల నిర్మాణాలను దశలవారీగా నిర్మించుకుంటూ ముందుకు సాగుతున్నాం ►ఈ నాలుగేళ్ల మీ బిడ్డ పరిపాలనలో ఒక్క రూపాయి అవినీతి, వివక్ష లేదు ►మా అక్క చెల్ల్మెల కుటుంబాల ఖాతాల్లోకి రూ.2.11లక్షల కోట్లు జమచేశాం ►చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వీరందరికీ, ఒక దత్తపుత్రుడు దోచుకున్నారు. వీరంతా గజ దొంగల ముఠా ►అప్పుల వృద్ధిరేటు చూస్తే… గత ప్రభుత్వం కన్నా.. తక్కవే ►మరి చంద్రబాబు హయాంలో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు జరగలేదు? ►వారికి మంచి చేసే ఉద్దేశం లేదు ►వారి దృష్టిలో అధికారంలోకి రావడం అంటే.. దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి ►వారి దారుణాలను రాయరు, చూపరు, ప్రశ్నిస్తామన్న వాళ్లు ప్రశ్నించరు ►ఇదీ చంద్రబాబు హయాంలో మాయ ►ఈరోజు కులాల మధ్య యుద్ధం జరగడంలేదు, జరుగుతున్నది క్లాస్ వార్ ►ఒకవైపు పేదవాడు ఉంటే.. మరోవైపే పేదవాళ్లకు మంచి జరగకూడదని పెత్తందార్లు యుద్ధం చేస్తున్నారు ►పేదవాడికి ఇళ్లస్థలాలు ఇస్తామంటే కోర్టుల వరకూ వెళ్లి యుద్ధం చేస్తారు ►సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని వాదనలు చేశారు ►జగన్ మాదిరిగా పాలన చేస్తే.. రాష్ట్రం శ్రీలంక పోతుందని ఎల్లోమీడియాలో రాస్తారు.. చూపుతారు ►పేదల బ్రతులకు మారాలని పరితపిస్తున్న ప్రభుత్వం మనది ►ప్రతికాలనీలో అంగన్వాడీ, ప్రైమరీ స్కూల్, విలేజ్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, పార్కులు కూడా రాబోతున్నాయి ►నవులూరిలోని లేక్‌ను కూడా అభివృద్ధిచేస్తున్నాం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులు హర్షం ►ఇళ్ల పట్టాలు రావడంతో లబ్ధిదారుల్లో సంతోషం ►సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం ►ఇది పేదల ప్రభుత్వం ►మా కోసం సీఎం జగన్ పోరాటం చేశారు ►దుష్టశక్తుల కుట్రలను సీఎం జగన్ తిప్పికొట్టారు ►సీఎం జగన్ హామీ ఇస్తే అమలు చేసి తీరతారు ►రూ. లక్షల విలువైన భూములను ఇస్తున్నారు ►గత ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదు ►పేదలకు భూములు రాకుండా దుష్టశక్తులు అడ్డుకున్నాయి ►దుష్టశక్తులకు తగిన బుద్ధి చెప్తాం మంత్రి జోగి రమేష్ కామెంట్స్ ►చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్ ►చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా పేదలే గెలిచారు ►పేదల తరఫున పోరాటం చేసి విజయం సాధించాం మంత్రి మేరుగు నాగార్జున కామెంట్స్ ►సామాజికి న్యాయానికి పండుగ రోజు ►ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాధ్యాయం ►రైతుల ముసుగులో చంద్రబాబు కుట్రలు పన్నారు ►రైతులను నిలువునా ముంచిన వ్యక్తి చంద్రబాబు ►గతంలో ఇళ్ల పట్టాల కోసం వామపక్షాలు ధర్నాలు చేసేవి ►ఇప్పుడు వామపక్షాలు ఎక్కడున్నాయి మంత్రి ఆదిమూలపు సురేష్ కామెంట్స్ ►50 వేల పట్టాలను అందించే శుభ ఘడియలు ఇవి ►ఇళ్ల స్థలాలతో పాటు ఊళ్లే నిర్మిస్తున్న గొప్ప కార్యక్రమం ►పేదల కోసం సీఎం జగన్ ఎంత దూరమైనా వెళతారు ►పేదలంటే చంద్రబాబుకు పగ ►పేదవాడి సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేశారు ►సీఎం జగన్ బలమైన సంకల్పం ముందు కుట్రలు పటాపంచలు ►ఈ ఏడాది 2.63 లక్షల టిడ్కో ఇళ్లు అందిస్తాం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) కామెంట్స్ ►పేదలంటే చంద్రబాబుకు చులకన ►అమరావతిలో పేదలు ఉండకూడదని ఇళ్ల పట్టాలను చంద్రబాబు అడ్డుకున్నారు ►రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ►ఇళ్ల పట్టాలతో అమరావతిలో పేదల కలను నిజం చేశారు సీఎం జగన్ ►చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా నా పేదలే గెలిచారు ►వెంకటపాలెం చేరుకున్న సీఎం జగన్ ►సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) పరిధిలో 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్న సీఎం జగన్ ►గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఏర్పాటుచేసిన వేదిక వద్ద ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఈ పట్టాలు అందజేత ►ఈ ప్రాంతంలో 1,402.58 ఎకరాల్లో ఆర్–5 జోన్ ఏర్పాటుచేసి 50,793 ప్లాట్లను సిద్ధంచేశారు. ►వీటితో పాటు సీఆర్డీఏ ప్రాంతంలో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి అందజేస్తారు. ►ఈ పట్టాల పంపిణీ కార్యక్రమానికి లబ్ధిదారులకు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది వివిధ శాఖ అధికారులు, యానిమేటర్లు, డ్వాక్రా మహిళలు ఆహ్వానం. రూ.2 వేల కోట్లతో కాలనీల నిర్మాణం ఇక సీఆర్డీఏ పరిధిలో సిద్ధంచేసిన 25 లేఅవుట్లలో గుంటూరు జిల్లాకు చెందిన 23,762 మంది, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 27,031 మంది నిరుపేద లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ప్రతి ప్లాట్‌కు హద్దులు నిర్ణయిస్తూ 80 వేల హద్దు రాళ్లు ఏర్పాటుచేశారు. అంతర్గత రవాణా కోసం 95.16 కి.మీ పరిధిలో గ్రావెల్ రోడ్లు వేశారు. లేఅవుట్లు, సభ ఏర్పాట్ల పరిశీలన మరోవైపు.. లేఅవుట్లు, సభ ఏర్పాట్లను మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, విడదల రజిని, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, ప్రణాళికా బోర్డు వీసీ మల్లాది విష్ణు, పురపాలిక శాఖ ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మీ, సీఆర్డీయే కమిషనర్ వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్‌రెడ్డి, గృహ నిర్మాణ సంస్థ ఎండీ శ్రీలక్ష్మీ, జేసీ జీ. రాజకుమారి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవి, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌లు పరిశీలించారు. టిడ్కో లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ నిడమర్రు, మందడం, అనంతవరం, దొండపాడు, ఐనవోలు, పెనుమాక, తుళ్లూరు, నవులూరులో అన్ని వసతులతో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా సీఎం జగన్ నేడు పంపిణీ చేయనున్నారు. ♦ రాష్ట్రవ్యాప్తంగా 1,43,000 మంది నిరుపేద లబ్ధిదారులకు 300 చ.అడుగుల టిడ్కో ఇళ్లను అన్ని హక్కులతో కేవలం రూ.1కే రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. తద్వారా వారికి రూ.9,406 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ♦ ఇదే ఇంటికి గత టీడీపీ ప్రభుత్వం అసలు, వడ్డీతో కలిపి రూ.7.20 లక్షలు చెల్లించాల్సిన దుస్థితిని కల్పించింది. ఆ భారం లేకుండా కేవలం రూ.1కే ఇప్పుడు ఇవ్వడం గమనార్హం. ♦ దీంతోపాటు ఇతర టిడ్కో లబ్ధిదారులు చెల్లించాల్సిన ముందస్తు వాటా సొమ్ములో 50 శాతం రాయితీ కూడా ఇచ్చింది. ♦ ఇక 365 చ.అ. లబ్ధిదారులు ఒకొక్కరికి రూ.25 వేల చొప్పున 44,304 మందికి, 430 చ.అ. లబ్ధిదారులకు రూ.50 వేల చొప్పున 74,312 మందికి మేలు చేసింది. ♦ తద్వారా వారు చెల్లించాల్సిన రూ.482 కోట్ల భారాన్ని కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం భరించింది. ♦ టిడ్కో ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ఒక్కో లబ్ధిదారునికి రూ.60 వేల లబ్ధిచేకూరింది. ♦ అలాగే, 2.62 లక్షల మంది టిడ్కో లబ్ధిదారులకు సబ్సిడీ రూపంలో రూ.14,514 కోట్లు, ఉచిత రిజిస్ట్రేషన్ల కోసం మరో రూ.1,200 కోట్లు, మౌలిక సదుపాయాలకు రూ.3,000 కోట్లు మొత్తం రూ.18,714 కోట్ల లబ్ధిని రాష్ట్ర ప్రభుత్వం చేకూర్చింది. ♦ కానీ, గత టీడీపీ ప్రభుత్వం ఈ టిడ్కో ఇళ్లలో మంచినీటి సదుపాయాలు, రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను నిర్లక్ష్యం చేస్తే, ప్రస్తుత జగన్ ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలతో ఇళ్లను అందిస్తోంది. ♦ ఇక ఈ ఇళ్ల పట్టాలు పంపిణీలో ఏమైనా ఇబ్బందులుంటే 1902 టోల్‌ఫ్రీ నంబర్లో సంప్రదించవచ్చు. -
అమరావతిలో నేడు పట్టాల పండుగ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధు గుంటూరు/ తాడికొండ: సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) పరిధిలో 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం (నేడు) ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటాయపాలెంలో ఏర్పాటుచేసిన వేదిక వద్ద ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఈ పట్టాలను అందజేయనున్నారు. ఈ ప్రాంతంలో 1,402.58 ఎకరాల్లో ఆర్–5 జోన్ ఏర్పాటుచేసి 50,793 ప్లాట్లను సిద్ధంచేశారు. వీటితో పాటు సీఆర్డీఏ ప్రాంతంలో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి అందజేస్తారు. ఈ పట్టాల పంపిణీ కార్యక్రమానికి లబ్ధిదారులకు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది వివిధ శాఖ అధికారులు, యానిమేటర్లు, డ్వాక్రా మహిళలు ఆహ్వానం అందించారు. వారి ఇళ్లకు వెళ్లి బొట్టుపెట్టి మరీ కార్యక్రమానికి రావాలని పిలిచారు. రూ.2 వేల కోట్లతో కాలనీల నిర్మాణం ఇక సీఆర్డీఏ పరిధిలో సిద్ధంచేసిన 25 లేఅవుట్లలో గుంటూరు జిల్లాకు చెందిన 23,762 మంది, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 27,031 మంది నిరుపేద లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ప్రతి ప్లాట్‌కు హద్దులు నిర్ణయిస్తూ 80 వేల హద్దు రాళ్లు ఏర్పాటుచేశారు. అంతర్గత రవాణా కోసం 95.16 కి.మీ పరిధిలో గ్రావెల్ రోడ్లు వేశారు. లేఅవుట్లు, సభ ఏర్పాట్ల పరిశీలన మరోవైపు.. లేఅవుట్లు, సభ ఏర్పాట్లను మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, విడదల రజిని, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, ప్రణాళికా బోర్డు వీసీ మల్లాది విష్ణు, పురపాలిక శాఖ ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మీ, సీఆర్డీయే కమిషనర్ వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్‌రెడ్డి, గృహ నిర్మాణ సంస్థ ఎండీ శ్రీలక్ష్మీ, జేసీ జీ. రాజకుమారి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవి, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌లు పరిశీలించారు. టిడ్కో లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ నిడమర్రు, మందడం, అనంతవరం, దొండపాడు, ఐనవోలు, పెనుమాక, తుళ్లూరు, నవులూరులో అన్ని వసతులతో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా సీఎం జగన్ నేడు పంపిణీ చేయనున్నారు. ♦ రాష్ట్రవ్యాప్తంగా 1,43,000 మంది నిరుపేద లబ్ధిదారులకు 300 చ.అడుగుల టిడ్కో ఇళ్లను అన్ని హక్కులతో కేవలం రూ.1కే రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. తద్వారా వారికి రూ.9,406 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ♦ ఇదే ఇంటికి గత టీడీపీ ప్రభుత్వం అసలు, వడ్డీతో కలిపి రూ.7.20 లక్షలు చెల్లించాల్సిన దుస్థితిని కల్పించింది. ఆ భారం లేకుండా కేవలం రూ.1కే ఇప్పుడు ఇవ్వడం గమనార్హం. ♦ దీంతోపాటు ఇతర టిడ్కో లబ్ధిదారులు చెల్లించాల్సిన ముందస్తు వాటా సొమ్ములో 50 శాతం రాయితీ కూడా ఇచ్చింది. ♦ ఇక 365 చ.అ. లబ్ధిదారులు ఒకొక్కరికి రూ.25 వేల చొప్పున 44,304 మందికి, 430 చ.అ. లబ్ధిదారులకు రూ.50 వేల చొప్పున 74,312 మందికి మేలు చేసింది. ♦ తద్వారా వారు చెల్లించాల్సిన రూ.482 కోట్ల భారాన్ని కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం భరించింది. ♦ టిడ్కో ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ఒక్కో లబ్ధిదారునికి రూ.60 వేల లబ్ధిచేకూరింది. ♦ అలాగే, 2.62 లక్షల మంది టిడ్కో లబ్ధిదారులకు సబ్సిడీ రూపంలో రూ.14,514 కోట్లు, ఉచిత రిజిస్ట్రేషన్ల కోసం మరో రూ.1,200 కోట్లు, మౌలిక సదుపాయాలకు రూ.3,000 కోట్లు మొత్తం రూ.18,714 కోట్ల లబ్ధిని రాష్ట్ర ప్రభుత్వం చేకూర్చింది. ♦ కానీ, గత టీడీపీ ప్రభుత్వం ఈ టిడ్కో ఇళ్లలో మంచినీటి సదుపాయాలు, రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను నిర్లక్ష్యం చేస్తే, ప్రస్తుత జగన్ ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలతో ఇళ్లను అందిస్తోంది. ♦ ఇక ఈ ఇళ్ల పట్టాలు పంపిణీలో ఏమైనా ఇబ్బందులుంటే 1902 టోల్‌ఫ్రీ నంబర్లో సంప్రదించవచ్చు. సీఎం పర్యటన ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉ.9.50 గంటలకుతాడేపల్లి నుంచి బయల్దేరి వెంకటాయపాలెం చేరుకుంటారు. లేఅవుట్స్‌కు సంబంధించిన ఫొటో గ్యాలరీని తిలకిస్తారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులర్పిస్తారు. జిల్లా కలెక్టర్, లబ్ధిదారులు, ఇతర వక్తలు మాట్లాడిన తర్వాత సీఎం జగన్ బహిరంగసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పేదలకు పట్టాలు పంపిణీ చేస్తారు. తిరిగి మ.12.30కు ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: ఓవరాక్షన్ సరే!.. అప్పుడేమైంది గురివింద బాబు? -
క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తమ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారని తెలిపారు. గురువారం బీఆర్కేఆర్ భవన్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో ప్రముఖ షూటర్ ఈషా సింగ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగిలయ్యలకు ఒక్కొక్కరికి 600 గజాల ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అందజేశారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. షూటర్ ఈషా సింగ్, బాక్సర్ నిఖత్ జరీన్‌లు వివిధ క్రీడాపోటీల్లో తెలంగాణ ప్రతిభను చాటి చెప్పారని, వారికి రూ. 2 కోట్ల చొప్పున ప్రభుత్వ నజరానాతో పాటు 600 చదరపు గజాల ఇంటి స్థలాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి గౌరవిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం త్వరలో నూతన స్పోర్ట్స్ పాలసీని తీసుకురానున్నట్లు వెల్లడించారు. పాలమూరుకు చెందిన కిన్నెర కళాకారుడు మొగిలయ్య ప్రతిభను తెలంగాణ ప్రభుత్వమే తొలుత గుర్తించి గౌరవించిందని అన్నారు. ఆయనకు కుటుంబ పోషణకోసం నెలకు రూ. 10 వేలు ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. కిన్నెర కళను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన తరువాతే కేంద్రం మొగిలయ్యకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించిందన్నారు. ఈ సందర్భంగా కోటి రూపాయల నజరానాతో పాటు ఇంటి స్థలం పట్టా పత్రాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని.. తదనుగుణంగా ఆయన కోరుకున్న చోట ఇంటి స్థలం ఇస్తున్నామని తెలిపారు. కాగా, తన కళను గుర్తించి గౌరవించడంతో పాటు ఇంటి స్థలం, కోటి రూపాయలు ఇచ్చిన మహనీయుడు కేసీఆర్ అని కిన్నెర మొగిలయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. కొందరికి జూబ్లీహిల్స్.. మొగిలయ్యకు బీఎన్ రెడ్డి నగర్‌లోనా? పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర కళాకారుడు మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయింపుపై అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు అసహనానికి గురయ్యారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా బాలరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు చెప్పకుండానే మొగిలయ్యకు ఇంటి స్థలం పంపిణీ చేశారని, స్థానిక శాసనసభ్యుడిగా స్థలం పంపిణీ కార్యక్రమం గురించి తనకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జాతి, ఖ్యాతిని జాతీయ.. అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన క్రీడాకారులు, కళాకారులకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో స్థలాలు ఇచ్చారని, మొగిలయ్యకు మాత్రం బీఎన్‌రెడ్డి నగర్లో ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. అయితే, తదనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో తనకు విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం గురించి తనకు ముందస్తు సమాచారం లేకపోవడంపై మాత్రమే మంత్రి సహాయక సిబ్బందిపై తాను ఆగ్రహం వ్యక్తం చేశానని బీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. -
జర్నలిస్టులకు గుడ్‌న్యూస్.. ఇళ్ల స్థలాల కేటాయింపుకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. హైదరాబాద్ జర్నలిస్టులు సుదీర్ఘకాలంగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నారు. జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసులో విచారణ జరిగింది. జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు 12 ఏళ క్రితం ప్రభుత్వాన్ని స్థలాన్ని కేటాయించింది. ఐఏఎస్, ఐపీఎస్‌ల గురించి నేను మాట్లాడటం లేదు. ఓ చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బందిపడాలి?. రూ.8వేల నుంచి రూ.50వేల వరకు జీతం తీసుకునే 8వేల మంది జర్నలిస్టుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నాం. చదవండి: (జర్నలిస్టులకు సుప్రీంకోర్టు తీపికబురు.. మంత్రి కేటీఆర్ ట్వీట్) వారికి భూమి కేటాయించారు. కానీ అభివృద్ధి చేయలేదు. వారంతా కలిసి స్థలం కోసం రూ.1.33 కోట్లు డిపాజిట్ చేశారు. జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోవడానికి మేం అనుమతిస్తున్నాం. వారి స్థలంలో నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో బెంచ్ ముందు లిస్ట్ చేయాలని సీజేఐ ఎన్వీ రమణ ఆదేశించారు. చదవండి: (స్కాట్లాండ్లో పలమనేరు విద్యార్థి మృతి) -
AP: రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ షురూ
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకం రెండో దశ కింద పీఎంఏవై–వైఎస్సార్ గ్రామీణ్‌లో భాగంగా 1,79,060 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖతో కూడిన పట్టాల పంపిణీని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు చేపట్టారు. చదవండి: పరిశ్రమలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. ఈ నెల 17వ తేదీ నాటికి పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, సీఎం రాసిన లేఖలను పంపిణీ చేశారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, కొయ్యలగూడెంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పాడేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. -
మూడు దశాబ్దాల టీటీడీ ఉద్యోగుల కల నెరవేర్చిన సీఎం జగన్
TTD Employees House Sites, సాక్షి, తిరుపతి: ఇళ్ల స్థలాల కోసం మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న టీటీడీ ఉద్యోగుల కల త్వరలో సాకారం కానుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మరో మూడు నెలల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామన్నారు. ఇందుకోసం వడమాలపేట మండలం పాదిర్వేడు అరణ్యం గ్రామంలో సేకరించిన 300.22 ఎకరాల భూమికి సంబంధించి చెల్లించాల్సిన రూ.61.63 కోట్ల మొత్తాన్ని గురువారం టీటీడీ చైర్మన్.. కలెక్టర్ హరినారాయణన్‌కు అందజేశారు. శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ 5,518 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు మార్గం సుగమం అయ్యిందన్నారు. వైఎస్సార్ హయాంలోనే ఇళ్ల స్థలాల విషయమై అప్పటి బోర్డులో తీర్మానం చేశారని, అయితే కొందరు కోర్టుకు వెళ్లడంతో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరిందన్నారు. భవిష్యత్‌లో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ధర్మకర్తల మండలి హౌస్ బిల్డింగ్ సొసైటీని ఏర్పాటు చేసుకోవాలని ఉద్యోగులకు సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తదితరులున్నారు. చదవండి: (ఏపీ సీఎం పథకాలు భేష్.. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశంస) -
రమ్య కుటుంబానికి ఐదు సెంట్ల ఇంటిపట్టా అందజేత
-
ఏపీ: రమ్య కుటుంబానికి ఐదు సెంట్ల ఇంటిపట్టా అందజేత
సాక్షి, గుంటూరు: రమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబానికి ఐదు సెంట్ల నివాస స్థలానికి సంబంధించిన పట్టాను శనివారం సుచరిత అందజేశారు. హోంమంత్రి వెంట ఎమ్మెల్యేలు మేరుగు నాగార్జున, ముస్తఫా, మద్దాలి గిరిధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఉన్నారు. (చదవండి: AP: మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు.. అప్లై చేయండి) ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ, రమ్య కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారని, రమ్య సోదరి మౌనికకు డిగ్రీ పూర్తయ్యేంత వరకు ఆగకుండా వెంటనే ఉద్యోగం కల్పించాలని సీఎం ఆదేశించారన్నారు. రమ్య హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. అందరూ దిశ యాప్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. పాలడుగు ఘటనలో పోలీసు విచారణ జరుగుతుందని నిందితులను పట్టుకోగానే మీడియా ముందు పోలీసులు ప్రవేశపెడతారన్నారు. విచారణ దశలో పూర్తి వివరాలను వెల్లడిస్తే నిందితులు తప్పించుకునే అవకాశం ఉందని, ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోందని మంత్రి సుచరిత వెల్లడించారు. చదవండి: పొలం వివాదం: సెల్ఫీ వీడియోలపై స్పందించిన సీఎంవో -
90 రోజుల్లో పట్టా అందించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసిన వ్యక్తి అర్హుడని తేలితే 90 రోజుల్లోగా ఇంటి స్థలం పట్టా అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇంటి పట్టా కోసం దరఖాస్తు అందుకున్న తొలి 12 రోజుల్లో వలంటీర్, గ్రామ సచివాలయ సిబ్బంది భౌతికంగా వెరిఫికేషన్ పూర్తి చేయాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 30,06,673 ఇళ్లపట్టాలకు గానూ 26,21,049 పట్టల పంపిణీ జరిగిందని, మిగిలిన వాటిని కూడా రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తంగా 87.17 శాతం పట్టాల పంపిణీ జరగ్గా, కాలనీల్లో 90.28 శాతం పంపిణీ పూర్తైందన్నారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇళ్ల స్థలాల పట్టాల కేటాయింపు, పంపిణీ అన్నది నిరంతర కార్యక్రమమని, దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి: సీఎం జగన్) ఈ సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ► సోషల్ ఆడిట్ ద్వారా లబ్దిదారులను గుర్తించాలి. ► నిర్మాణాల్లో ఏక రూపత, నాణ్యత కోసం చర్యలు తీసుకోవాలి. ► ఒక కాలనీలో కల్పిస్తున్న సదుపాయాలు, వాటి నిర్మాణ రీతులు తదితర అంశాలపై పూర్తి వివరాలు నివేదించాలి. ► వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పించాలి. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయండి. ► డంపింగ్ యార్డుల్లో బయో మైనింగ్ చేయాలి. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ మొదలుపెట్టాలి. పనుల పురోగతి: వైయస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకుంటున్న చర్యలను సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. మార్చి 31 నాటికి వాటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వివిధ ప్రభుత్వ శాఖలు అందులో భాగస్వాములవుతాయని అధికారులు తెలిపారు. ఇక సీఎం ఆదేశాల ప్రకారం వైఎస్సార్ జగనన్న కాలనీల్లో జనాభాను అనుసరించి అంగన్వాడీ కేంద్రాలు, వైఎస్సార్ క్లినిక్కులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్లు, బస్టాపులు తదితర నిర్మాణాలపై అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి వై.శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (చదవండి: ఇళ్ల పట్టాల పంపీణీలో మనమే నంబర్1) -
ఆ దేవుడే జగనన్న రూపంలో వచ్చాడు
సాక్షి, బాపట్లటౌన్: ‘‘నాది బాపట్ల మండలం, నరసాయపాలెం గ్రామం. నేను నరసాయపాలెం–కంకటపాలెం వెళ్లే దారిలో 25 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నా. నాకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. పిల్లలు పుట్టిన ఐదేళ్లకే నా భర్త అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటినుంచి ఇద్దరు పిల్లలను పెట్టుకొని కాలువకట్ట పక్కనే గుడిసెలో నివశిస్తూ ఉన్నాను. రెక్కల కష్టం మీదనే నా కూతురు, కొడుకుకు పెళ్లిళ్లు చేశాను. దేవుడికి కూడా నా మీద జాలి లేకుండా పోయింది. నా కొడుకుకు పెళ్లి చేసిన తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు. మనుడు పుట్టిన నాలుగేళ్లకే నా కొడుకు చనిపోయాడు. చిన్నప్పటి నుంచి మగ దిక్కులేని సంసారాన్ని ఈదుకొస్తున్నప్పటికీ నాకున్న ఏకైక కొడుకును కూడా దేవుడు పొట్టన పెట్టుకున్నాడు. అప్పటినుంచి నేను, నా కోడలు అదే కాలువకట్ట వెంబడి నివాసం ఉంటూ కాయకష్టం చేసుకుని బతుకుతున్నాం. గడిచిన 20 ఏళ్లుగా వచ్చిన ప్రతి నాయకుడికీ, అధికారికీ నా బాధ చెప్పుకుంటూనే ఉన్నాను. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం మాలాంటి పేదలందరిని గుర్తించి అధికారులే మా ఇంటికి వచ్చి నీకు స్థలాన్ని కేటాయిస్తున్నామని చెప్పడమే కాకుండా, నా పేరుతో రిజిస్ట్రేషన్ చేసి, మాకు కేటాయించిన స్థలాల్లో రోడ్లు పోసి, మెరకలు తోలి మరీ పట్టాలు ఇచ్చారు. ఇల్లు కూడా కట్టిస్తామని చెబుతున్నారు. మాలాంటి పేదల బతుకులు మార్చేందుకు ఆ దేవుడే జగన్మోహన్రెడ్డి రూపంలో ఈ రాష్ట్రానికి వచ్చాడన్నంత సంతోషంగా ఉంది. మేము బతికినంతకాలం ఆయన చేసిన మేలు మరువం.’’ బాపట్ల మండలం నరసాయపాలెంకు చెందిన నంగనం పద్మ భావోద్వేగం ఇది. -
‘దుర్మార్గ ఆలోచనలకు చంద్రబాబు ఆద్యుడు’
సాక్షి, గన్నవరం: ప్రతిపక్షనేత చంద్రబాబు కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక కూల్చిన రోజే.. రాష్ట్ర ప్రజలకు సొంత ఇళ్లు కట్టించి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. గురువారం కృష్ణా జిల్లా గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో జరిగిన ‘నవరత్నాలు-పేదలకు ఇళ్లు’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. 2631 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. (చదవండి: చంద్రబాబుపై పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం) ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇస్తే.. పునాదులు కదులుతాయని ప్రతిపక్షాలు కుట్రపన్నాయని దుయ్యబట్టారు. 25 కోట్లు ఖర్చు చేసి హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో లాయర్లను పెట్టి రిజిస్ట్రేషన్లు చేయడానికి వీల్లేదని స్టే తీసుకువచ్చారని మండిపడ్డారు. దుర్మార్గపు ఆలోచనలు చేయడంలో చంద్రబాబు ఆద్యుడు. ఆయనకి కొన్ని డబ్బా చానల్స్ వత్తాసు పలుకుతూ హడావుడి చేస్తున్నాయని కొడాలి నాని ధ్వజమెత్తారు.(చదవండి: ‘బాబు మత రాజకీయాలు.. పతనం తప్పదు..’) అవన్నీ మెండుగా ఉన్న వ్యక్తి సీఎం జగన్: ఎంపీ బాలశౌరి చర్రితలో నిలిచిపోయే కార్యక్రమాలు చేయాలంటే, గుండె ధైర్యం, కృషి, పట్టుదల ఉండాలని,అవన్నీ మెండుగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఎంపీ బాలశౌరి అన్నారు. దివంగత మహానేత వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి పేదల గుండె చప్పుడు అయ్యారని, నేడు సీఎం వైఎస్ జగన్.. పేదల సొంతింటి కల నెరవేర్చి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు చేయాలంటే ఒక్క వైఎస్సార్ కుటుంబానికే సాధ్యమన్నారు. వైఎస్సార్ 1 రూపాయికే వైద్యం చేసి.. వృత్తికే వన్నె తీసుకువస్తే.. సీఎం జగన్ 1 రూపాయికే 30 లక్షల 70 వేలు టిడ్కో ఇళ్లు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు: ఎమ్మెల్యే వంశీ పేదల సొంతింటి కలను సీఎం వైఎస్ జగన్ సాకారం చేస్తున్నారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో గొప్పలు కోసం లక్ష పట్టాలు అని డబ్బా కొట్టుకొని స్థలం చూపించలేకపోయారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. అందరికీ స్థలం,ఇల్లు నిర్మించి ఇస్తున్నారన్నారు. భవిష్యత్తు తరాల కోసం ఆలోచించేవారే అసలైన నాయకుడన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు.. పసుపు-కుంకుమ పేరు చెప్పి ప్రజల దగ్గరకు వెళ్తే చిత్తుగా ఓడించారని ఎద్దేవా చేశారు. చెప్పింది చేసే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని వల్లభనేని వంశీ అన్నారు. -
ఇళ్ల పట్టాల పంపీణీలో మనమే నంబర్1
సంక్షేమం అర్హులందరి పరమవుతోంది. పైరవీలకు చోటులేకుండానే లబ్ధి కలుగుతోంది. సర్కారు ఆదేశిస్తోంది... అధికార యంత్రాంగం పరుగులు తీస్తోంది. లబ్ధిదారుల మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. జిల్లాలో పట్టాల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. కలలో కూడా ఊహించని విధంగా నిలువనీడ కల్పిస్తున్న ప్రభుత్వానికి ప్రతి కుటుంబం మోకరిల్లుతోంది. పథకాల పంపిణీలో ఎప్పుడూ ముందుండే జిల్లా ఈ కార్యక్రమంలోనూ తన స్థానాన్ని పదిల పర్చుకుంది. ప్రస్తుతానికి ఇళ్ల పట్టాల పంపిణీలో మొదటిస్థానంలో నిలిచింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచింది. నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా పేదలకు శాశ్వతంగా ఆవాసాలను కల్పించే పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. జిల్లాలో గత నెల 25న ప్రారంభమైన పట్టాల పంపిణీ కార్యక్రమం, 30న ముఖ్యమంత్రి రాకతో మరింత ఊపందుకొని, ప్రస్తుతం జోరుగా కొనసాగుతోంది. కొన్ని పెద్ద కాలనీలు మినహా, సుమారు 78శాతం జగనన్న కాలనీల్లో పట్టాల పంపిణీ ఇప్పటికే పూర్తయ్యింది. ఎన్నో ఏళ్లుగా నిరుపేదలు కంటున్న కలలను నిజం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఉత్తుర్వుల మేరకు, మంత్రుల సూచనలకు అనుగుణంగా పట్టాల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతోంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యేలు, మంత్రుల చేత పట్టాల పంపి ణీ ఉత్సాహంగా సాగుతోంది. విజయనగరం నియోజకవర్గంలో డిసెంబర్ 30న జరిగిన కార్యక్రమంలో, ముఖ్యమంత్రి వై,ఎస్.జగన్మోహనరెడ్డి పాల్గొని స్వయంగా పట్టాలను పంపిణీ చేయడం ద్వారా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్లలో ఒకటైన గుంకలాం లేఅవుట్లో 12,301 ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలోని ఇతర ప్రజాప్రతినిధులంతా రోజూ ఉత్సాహంగా పట్టాలను పంపిణీ చేస్తూ, పేదల ఆశలను నిజం చేస్తున్నారు. చాలాచోట్ల పట్టాలతోపాటు ఇళ్లను కూడా ప్రభుత్వం మంజూరు చేయడంతో, మరోవైపు లబ్ధిదారులు పునాదులు తవ్వేందుకు కూడా సన్నద్ధమ వుతున్నారు. 40వేల మందికి పంపిణీ పూర్తి పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద జిల్లాలో 72,625 మంది ఇళ్ల పట్టాలు పొందేందుకు అర్హులుగా గుర్తించారు. వీరిలో 4వ తేదీ నాటికి 39,772 మందికి పట్టాలు పంపిణీ చేశారు. కొన్నిచోట్ల జగనన్న కాలనీల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మల్యేలు పట్టాలు పంపిణీ చేస్తుండగా, మరికొన్ని చోట్ల వలంటీర్లే ఇంటింటికీ వెళ్లి మరీ, లబ్ధిదారులకు భద్రంగా పట్టాలు అందజేస్తున్నారు. టిడ్కో ఇళ్లకు సంబంధించి జిల్లాలో 8,048 మందిని అర్హులుగా గుర్తించగా, వీరిలో 5,207 మందికి ఇప్పటికే వాటికి సంబంధించిన పత్రాలను అందజేశారు. 911 కాలనీల్లో పట్టాల పంపిణీ పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద పట్టాల పంపిణీకోసం జిల్లాలో 1164 లేఅవుట్లను రూపొందించి, జగనన్న కాలనీలను అన్ని హంగులతో ఏర్పాటుకు సిద్దం చేయగా, వీటిలో 911 కాలనీల్లో ఇప్పటికే పట్టాల పంపిణీ పూర్తయింది. ఆక్ర మిత స్థలాల రెగ్యులైజషన్, పొజిషన్ పట్టాలకు 25,274 మందిని అర్హులుగా గుర్తించగా, 19,572 మందికి అందజేశారు. కోర్టు కేసుల కారణంగా పెండింగ్‌లో ఉన్న పట్టాల పంపిణీకి సంబంధించి, 47శాతం మందికి ఇప్పటికే లేఖలను అందజేశారు. సుదీర్ఘ నిరీక్షణ తరువాత తమ సొంతింటి కల సాకారం అవుతుండటంతో, లబ్ధిదారుల ఇళ్లలో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టయ్యింది. 20 వరకూ పట్టాల పంపిణీ పట్టాల పంపిణీ కార్యక్రమానికి తొలుత జనవరి 7ను గడువు తేదీగా నిర్ధారించగా తాజాగా 20వ తేదీ వరకు పొడిగిస్తున్న ట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ లోగా శత శాతం ఇళ్ళ పట్టాలు, గృహాల పంపిణీ పూర్తి చేస్తాం. జగనన్న కాలనీల్లో సామాజిక వసతులు కల్పించి, మురికి వాడలు లేని కాలనీలుగా తీర్చి దిద్దుతాం. ముఖ్యమంత్రి ఆశయం మేరకు అన్ని రకాల వసతులను కల్పించి, మోడల్ హౌసింగ్‌ను నిర్మిస్తాం. – డాక్టర్ ఎం.హరిజవహర్ లాల్, జిల్లా కలెక్టర్ రాష్ట్రంలో అతి పెద్దవాటిలో ఒకటైన గుంకలాం లే అవుట్ -
టీడీపీ దుర్మార్గంగా మాట్లాడుతోంది: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: పేదలకు ఉచితంగా ఇళ్లు అందిస్తుంటే టీడీపీ దుర్మార్గంగా మాట్లాడుతోందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వాంబే కాలనీలోని 60వ డివిజన్లో అర్హులైన 2,533 మందికి ఇళ్ల పట్ఠాల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం జోనల్ కమిషనర్ సమైలా, ఎమ్మార్వో దుర్గా ప్రసాద్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 'అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. సీఎం జగన్ రాష్ట్రంలో పేద ప్రజలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. 386 మందికి టిడ్కో ఇల్లు ఇస్తున్నాం. టీడీపీ ఇళ్ల విషయంలో దుర్మార్గంగా మాట్లాడుతోంది. వాంబే కాలనీలో మినీ బస్టాండ్ వస్తుంది. లే అవుట్లు నగరంలో విలీనం చేస్తాం. చదవండి: (‘మేనిఫెస్టో గొప్పతనం సీఎం జగన్ పాలనలోనే అర్థమైంది’) గతంలో 28 వేల ఇళ్లు ఇచ్చిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కింది. టీడీపీ ప్రజాప్రతినిధులు టిడ్కో విషయంలో ప్రజలను మోసం చేశారు. టీడీపీ నేతలు 12,000 మంది దగ్గర డబ్బులు వసూలు చేశారు. పేదలకు సెంట్ స్థలం ఇస్తున్నాం. నగరంలో 1,600 మందికి ఇళ్ల పట్టాలు రెగ్యులరైజ్ చేస్తున్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో కొత్తగా 525 పెన్షన్లు ఇచ్చాము. 45 నుంచి 65 ఏళ్ల లోపు ఉన్న వారికి సీఎం జగన్ చేయూతను ఇచ్చారు. రాష్ట్రంలో సీఎం విద్యకు పెద్దపీట వేస్తున్నారు. వాంబే కాలనీలో రూ. 4 కోట్ల పనులు జరుగుతున్నాయి. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారు. టీడీపీ నేతలు మత రాజకీయాలు చేస్తున్నారు, అది సరికాదు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. చదవండి: (త్వరలోనే అసలు రంగు బయటపడుతుంది’) -
కూల్చే సంస్కృతి టీడీపీదే: జయరామ్
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం వెనుక చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుల మతాలకతీతంగా పరిపాలన చేస్తున్నారని తెలిపారు. సీఎం ఏ పథకం ప్రవేశపెట్టిన.. ఇలాంటి కుట్రలు చంద్రబాబు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ‘‘సీఎం జగన్ పాలన దేవుడిచ్చిన వరం. అందుకే తొలిరోజు నుండి రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. విగ్రహాలు ధ్వంసం చేస్తున్న చంద్రబాబుకి దేవుడు తగిన బుద్ధి చెప్తారని’’ మంత్రి గుమ్మనూరు జయరామ్’’ అన్నారు.(చదవండి: విగ్రహాల ధ్వంసం: దీని వెనక ఉన్నది టీడీపీనే) ఆ చావులకు కారణం చంద్రబాబే: మోపిదేవి గుంటూరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గడచిన 18 నెలల్లో ఎక్కడ కూడా ఒక ఆలయాన్ని కూల్చిన ఘటన లేదని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ‘‘కూల్చే సంస్కృతి టీడీపీది. నిలబెట్టే సంస్కృతి వైఎస్సార్సీపీ ప్రభుత్వానిది. పుష్కరాలు లాంటి పవిత్రమైన కార్యక్రమాలను కూడా స్వార్థానికి వాడుకుని 29 మందికి చావుకు చంద్రబాబు కారణమయ్యారు. పుష్కరాల పేరుతో 43 పురాతన దేవాలయాలు కూల్చిన సంస్కృతిని చంద్రబాబు ప్రభుత్వానిదని’’ దుయ్యబట్టారు. (చదవండి: వీళ్లు అసలు మనుషులేనా: సీఎం జగన్) ఎంతో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య తగాదాలు పెట్టడం మానుకోవాలని మోపిదేవి హితవు పలికారు. లేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రామతీర్థం ఘటనకు కారణం ఎవరో త్వరలోనే తెలుస్తోందని, తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. టిడ్కో పేరుతో టీడీపీ నేతలు దోచుకున్నారు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ: టీడీపీ నేతలు టిడ్కో పేరుతో 12,000 మంది దగ్గర డబ్బులు దోచుకున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. సోమవారం ఆయన సత్యనారాయణ పురం 47వ డివిజన్లలో 50 మందికి టిడ్కో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల విషయంలో అవినీతి జరిగిందన్నారు. గత టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు టిడ్కో ఇళ్ల పేరుతో ఫొటో స్టాట్ వేల రూపాయలకు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధితులకు డబ్బులు ఇచ్చామని, వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశామని మల్లాది విష్ణు వివరించారు. -
ఇళ్ల పట్టాల పంపిణీతో పండగ వాతావరణం..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పండుగ వాతావరణంలో ఇళ్ల పట్టాలు పంపిణీ జరుగుతోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలోనే సమర్థమంతమైన పాలన అందిస్తున్న సీఎంల్లో జగన్ ఒకరు.. అన్ని వర్గాలను ఆదుకుంటున్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రధాని మోదీ మన్ననలను సీఎం జగన్ పొందారన్నారు. మరో 30 ఏళ్లపాటు జగన్ పాలన ఉండేలా ప్రజలు ఆశీస్సులు ఇవ్వాలని కోరారు.విద్య, వైద్యం, వ్యవసాయానికి సీఎం జగన్ పెద్దపీట వేశారన్నారు. గత ప్రభుత్వంలో రైతులు వలస కూలీలుగా బాధలు పడ్డారని, రాష్ట్రంలో రైతులను సీఎం జగన్ రైతు భరోసాతో ఆదుకుంటున్నారని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు.(చదవండి: ‘ఆ భయంతోనే కులమతాల మధ్య చిచ్చు..’) -
‘ఆ భయంతోనే కులమతాల మధ్య చిచ్చు..’
సాక్షి, గుంటూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఉనికి కోల్పోతామన్న భయంతోనే రాష్ట్రంలో ప్రతిపక్షం కులాల మధ్య చిచ్చు పెడుతోందని హోంమంత్రి మేకతోటి సుచరిత నిప్పులు చెరిగారు. ఆదివారం ఆమె గుంటూరు జిల్లా పేరేచర్లలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అశాంతి సృష్టించేందుకు ప్రతిపక్షం చేస్తున్న పనులు దురదృష్టకరమన్నారు. ‘‘ఇంత పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తున్నది ఒక్క జగన్ ప్రభుత్వమే. గుడిసెలు లేని రాష్ట్రం కావాలన్నదే మహానేత దివంగత వైఎస్సార్ ఆలోచన. పేదవారికి సొంతింటి కల నెరవేర్చాలన్నది సీఎం వైఎస్ జగన్ సంకల్పం. లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ దేశంలో చరిత్రగా నిలిచిపోతుంది. ప్రతి మహిళను లక్షాధికారి చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దే. ఆయన గొప్ప చరిత్రకు శ్రీకారం చుట్టారు. భూములు కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని’’ సుచరిత పేర్కొన్నారు. (చదవండి: లోకేష్‌ను హెచ్చరించిన మంత్రి కొడాలి) కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాల పంపిణీ: శ్రీరంగనాథరాజు కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్ పేరేచర్లలో ఏర్పాటు చేశామన్నారు. పేరేచర్లలో 18,482 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశామని తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీని ప్రతిపక్ష నేత కేసులు వేసి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు చరిత్ర హీనుడుగా నిలిచిపోతారని ధ్వజమెత్తారు. పేరేచర్ల లేఅవుట్‌ను మోడల్ లేఆవుట్గా తీర్చిదిద్దుతామని, రూ.7 వేల కోట్లతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి శ్రీరంగనాథరాజు వెల్లడించారు.(చదవండి: రామతీర్థం ఆలయాన్ని పరిశీలించిన మంత్రులు) ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబుకు ఇష్టం ఉండదు: మోపిదేవి నవరత్నాల్లో ప్రధానమైన పథకం ఇళ్ల పట్టాల పంపిణీ అని వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. పాదయాత్రలో పేదల కష్టాలను వైఎస్ జగన్ చూశారని, ప్రజలంతా ఆనందంగా ఉండాలన్నదే ఆయన ఆలోచన అని పేర్కొన్నారు. అర్హులైన అందరికీ ఇళ్ల పట్టాల ద్వారా ఆస్తి హక్కు కల్పిస్తున్నామని, ఏడాదిన్నర కాలంలోనే అన్ని హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే చంద్రబాబు.. కులమతాల పేరుతో గొడవ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబుకు ఇష్టం ఉండదని మోపిదేవి ధ్వజమెత్తారు. -
ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన అవినాష్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు పెద్ద పీట వేశారని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుపరిపాలన అందిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ అన్నారు. రాష్ట్రంలో అర్హులైన వారికి ఉచితంగా ఇల్లు ఇస్తున్నారన్నారు. మహిళల పేర్లతో ఇళ్ల పట్టాలిస్తున్నామని తెలిపారు. ఆదివారం ఆయన యనమాలకుదురులో మెగా టౌన్షిప్లో అర్హులైన మూడు వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 634 మందికి టిడ్కో ఇళ్ల పత్రాలు పంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దమ్మున్న నాయకుడు సీఎం జగన్ పేద ప్రజలకు అండగా ఉన్నారని అభయమిచ్చారు. సీఎం జగన్ 30 లక్షల మందికి ఇల్లు ఇచ్చారని తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాలిస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు హామీలకే పరిమితమైతే సీఎం జగన్ పాదయాత్రలో చెప్పిన హామీలు నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. ఇక తూర్పు నియోజకవర్గంలో 30 వేల మందికి అమ్మ ఒడి వస్తుందన్నారు. (చదవండి: ప్రధాని ప్రశంసలు సైతం దక్కాయి: దేవినేని అవినాష్) -
‘సీఎం జగన్ చెప్పారంటే.. చేస్తారంతే’
సాక్షి, పశ్చిమగోదావరి: ప్రజల సమస్యలు తీర్చడానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలను ప్రవేశపెట్టారని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారన్నారు. ‘‘ఇప్పటికే దశలు వారీగా బ్రాందీ షాపులను తగ్గిస్తున్నారు. రాబోయే కాలంలో పూర్తిగా బ్రాందీ షాపులను నిర్మూలన చేస్తారు. మద్యానికి బానిసలయినా కుటుంబంలో పిల్లలు కార్మికులుగా చేస్తున్నారు. దాన్ని అధిగమించడానికి ‘అమ్మ ఒడి’ పథకం రూపుదిద్దుకుంది.(చదవండి: విద్యుత్ సంస్థలు లాభాల బాట: బాలినేని) సీఎం జగన్ చెప్పారంటే.. చేస్తారంతే. పేదవారి సొంతింటి కలను నెరవేర్చారు. సుమారు 10 కోట్ల రూపాయలతో 30 లక్షల 54 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇల్లు లేని వారు దరఖాస్తు చేసుకుంటే.. 90 రోజుల్లో ఇల్లు కట్టించి ఇస్తాం. ఇప్పటికే సీఎం జగన్ 95 శాతం హామీలను అమలు చేశారని’’ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.(చదవండి:‘ఆ వాహనాలు.. ముంబై తర్వాత ఏపీలోనే..’) -
ఇన్నాళ్లకు కల తీరింది..
సాక్షి, దెందులూరు: పాదయాత్ర సమయంలో ఊరూరా నిరుపేద గూడు గోడు విన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. పేదలు సొంత ఇల్లు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నట్లు తెలుసుకుని “నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ వారికి అండగా నిలవాలని నిశ్చయించుకున్నారు. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే అర్హులు ఎంతమంది ఉంటే అందరికీ ఉచితంగా స్థలం ఇవ్వడమే కాక ఇంటిని నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా డిసెంబర్ 25వ తేదీ నుంచి రాష్ట్రమంతా అట్టహాసంగా ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభమైంది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా జిల్లాలో 1,70,699 మందికి సొంత ఇంటి కల నెరవేరింది. అంతే కాకుండా ఇంటి పట్టాతో పాటు ఇల్లు నిర్మాణానికి ఒక్కొక్కరికి 1,80,000 రూపాయలు నిధులు ఉచితంగా మంజూరు చేస్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరిట మంజూరు పత్రాలు సైతం అందజేస్తున్నారు. ఇళ్ల నిర్మాణ విషయమై లబ్ధిదారులకు మూడు అవకాశాలు ఇచ్చారు. ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వడం, లబ్ధిదారుడే ఇల్లు నిర్మించుకుంటే నిధులు మంజూరు చేయడంతో సగం ధరకే మెటీరియల్‌కు సంబంధించి నిధులు బ్యాంక్ ఖాతాకు జమ చేస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి చొరవతో ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు ఆదర్శ గృహాల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే కొందరు లబ్ధిదారులు కొత్త ఇళ్లల్లోకి మకాం మార్చడం విశేషం. ఇంటి నిర్మాణం ఇలా.. ప్రతి ఇంట్లో వసారా, కిచెన్, రెండు బెడ్రూమ్లు, బాత్రూమ్, శ్లాబ్, ఇంటిపై వాటర్ ట్యాంక్ ఏర్పాటుతో నిర్మాణం చేసేట్లు గృహ నిర్మాణ శాఖ రూపొందించింది. సీఎం మరో నజరానా ఈ పథకానికి మరింత వన్నె తెచ్చేలా ప్రతి లబ్దిదారునికి ఉచితంగా రెండు ప్యాన్లు రెండు ట్యూబ్లైట్లను ప్రభుత్వమే సరఫరా చేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఇన్నాళ్లకు కల తీరింది సొంత ఇంటిలో ఉండాలన్న నా కలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి నెరవేర్చారు. ఇంటి నిర్మాణం చేసి ప్రభుత్వం నాకు అందజేయటం, కుటుంబ సభ్యులతో మేము సొంత ఇంటిలో ఉండటం ఎన్నటికీ మరచిపోలేని విషయం. సీఎం, ఎమ్మెల్యేలకు రుణపడి ఉంటాం. – తొంటా సరస్వతి, లబ్ధిదారురాలు, పెదవేగి ఇల్లు నిర్మించి అప్పగించాం పెదవేగిలో మోడల్ హౌస్ నిర్మించి లబ్ధిదారునికి అప్పగించాం. లబ్ధిదారుడు గృహ ప్రవేశం చేసి కుటుంబ సభ్యులతో ఆ ఇంటిలో నివాసం ఉండటం చాలా సంతోషంగా ఉంది. గృహ నిర్మాణాలపై లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తయ్యేందుకు సహకరించాలి. ఇళ్ల పట్టా, నిర్మాణ మంజూరు పత్రాలు ఒకేసారి అందజేస్తున్నాం. – కొఠారు అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్యే సమష్టి కృషితో ఇళ్ల నిర్మాణం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యే, జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారుల సమష్టి సహాయ, సహకారాలు, సూచనలతో ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తాం. అధికారుల పర్యవేక్షణలో, పూర్తిస్థాయి నాణ్యతా ప్రమాణాలతో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. – పి.రామచంద్రారెడ్డి, హౌసింగ్ పీడీ సమష్టి కృషితో ఇళ్ల నిర్మాణం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యే, జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారుల సమష్టి సహాయ, సహకారాలు, సూచనలతో ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తాం. అధికారుల పర్యవేక్షణలో, పూర్తిస్థాయి నాణ్యతా ప్రమాణాలతో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. – పి.రామచంద్రారెడ్డి, హౌసింగ్ పీడీ -
2020పై సంక్షేమ సంతకం
ప్రజలు 2020ని కరోనా నామ సంవత్సరమని పిలుచుకున్నారు. ఈ ఏడాది ఆద్యంతం ‘కరోనా’ పేరు వినిపించని రోజంటూ లేదనడం అతిశయోక్తి కాదు. అందరి నోటా అదే మాట. అయితే ఇంతటి మహమ్మారి కోరలు చాచి, తన ప్రతాపాన్ని చూపినా.. రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా కుంటుబడక పోవడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. కరోనా తొలి రోజుల్లో పలు దఫాలుగా ప్రజలకు ఉచితంగా రేషన్ పంపిణీ మొదలు ప్రస్తుతం కొనసాగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ వరకు సంక్షేమం కొత్తపుంతలు తొక్కింది. హైకోర్టు తీర్పులు, ఎల్జీ ప్రమాదం, వరదలు, నివర్ తుపాన్, ఏలూరు ఘటనలు ఆందోళన కలిగించాయి. ఉద్యోగుల కల సాకారం ► ప్రభుత్వంలో విలీనం కావడమనేది ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల ఎన్నో ఏళ్ల కల. ఈ కలను సాకారం చేస్తామని చెప్పిన వైఎస్ జగన్.. అధికారంలోకి రాగానే ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించారు. ప్రత్యేకంగా ఓ కమిటీ వేశారు. అన్ని విషయాలను కూలంకషంగా అధ్యయనం చేసిన ఆ కమిటీ.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనప్పటికీ, ఇచ్చిన మాట నిలుపుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకు జనవరి 1వ తేదీన 51 వేల మందికి పైగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనమయ్యారు. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ► వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చేలా ప్రభుత్వం అడుగులు ముందుకేసింది. ► చిన్నారులను బడికి పంపించిన ప్రతి తల్లికీ ఏటా రూ.15 వేలు జమ చేసే విప్లవాత్మక పథకం ‘అమ్మ ఒడి’కి శ్రీకారం చుట్టారు. పేద పిల్లల చదువుకు ఊతమిచ్చే పథకమిది. ► అన్నదాతలకు అండగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. ► అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులకు అసెంబ్లీ ఆమోదం. సీఆర్డీఏ రద్దుకు గ్రీన్‌సిగ్నల్. హైపవర్ కమిటీ నివేదికను ఆమోదించిన కేబినెట్. శాసనమండలిలో నిబంధనలకు విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి మూడు రాజధానుల బిల్లు. శాసనమండలి రద్దుకు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో 536 సేవలు. ► కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం అందజేసే ‘కాపునేస్తం’ పథకం అమలు. ప్రతి జిల్లాలో కోవిడ్ ఆస్పత్రులు ► ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మన రాష్ట్రానికీ పాకింది. నెల్లూరులో తొలి కేసు నమోదైంది. అంతకు ముందు నుంచే రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ప్రతి జిల్లాలో ఒక కోవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. టెస్ట్, ట్రేస్, ట్రీట్.. అంటూ భారీ స్థాయిలో పరీక్షలకు శ్రీకారం చుట్టింది. ఖర్చుకు వెరవక పెద్ద ఎత్తున టెస్ట్ కిట్లకు ఆర్డర్ చేసింది. కరోనా సోకిన వారిని గుర్తించి ఐసోలేట్ చేయడం, లేదా ఆస్పత్రికి తరలించడాన్ని వేగవంతం చేసింది. కోవిడ్ ఆస్పత్రుల్లో సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంది. కరోనా మరణాల శాతం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి బలవర్థక ఆహారం అందించింది. ఒక్కమాటలో చెప్పాలంటే కరోనాను ఎదుర్కొనే విషయంలో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ప్రధాని మోదీ ప్రశంసలు పొందింది. ► స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు మించరాదని హైకోర్టు తీర్పు. కరోనా వైరస్ వల్ల ఎన్నికలను వాయిదా వేసిన స్టేట్ ఎన్నికల కమిషన్. ► రాష్ట్రంలో లాక్డౌన్ అమలు.. ఓటాన్ అకౌంట్ పద్దు ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం. రూ. కోటి పరిహారం ► విశాఖపట్నం సమీపంలోని ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరీన్ గ్యాస్ లీకేజి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరిగితే.. నిమిషాల వ్యవధిలో పదుల సంఖ్యలో అంబులెన్స్‌లు ఘటన స్థలికి చేరుకుని బాధితులను ఆస్పత్రులకు తరలించాయి. ఈ ఘటనలో 12 మంది మృతుల కుటుంబాలకు, బాధితులకు ఇదివరకెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్థిక సహాయం ప్రకటించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.కోటి, వెంటిలేటర్‌పై ఉన్న వారికి రూ.10 లక్షలు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.లక్ష, ఆస్పత్రిలో చేరి ప్రాథమిక వైద్యం పొంది డిశ్చార్జ్ అయిన వారికి రూ.25 వేలు, ప్రభావిత గ్రామాల ప్రజలందరికీ రూ.10 వేల చొప్పున సాయం అందజేశారు. ► మద్యపాన నియంత్రణ చర్యలలో భాగంగా మద్యం ధరలు 75 శాతం పెంపు. మద్యం, ఇసుక అక్రమాల కట్టడికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ఏర్పాటుకు సీఎం ఆదేశం. ► వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేసే ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ పథకం ప్రారంభం. ► ఆర్టీసీ సర్వీసులు పాక్షికంగా పునః ప్రారంభం. చిన్న తరహా పరిశ్రమలకు రూ.1,100 కోట్లతో రీస్టార్ట్ ప్యాకేజీ అమలు. ► ఎన్నికల కమిషనర్‌గా కనగరాజ్ నియామకానికి సంబంధించిన ఆర్డినెన్స్ రద్దు.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కొనసాగింపు. ► రాష్ట్ర వ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎం జగన్. నిమ్మగడ్డ రహస్య మంతనాలు ► రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హోటల్లో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌లతో రహస్య మంతనాలు సాగించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తించాయి. రాజ్యంగబద్ధ పదవిలో ఉన్న ఓ ఉన్నతాధికారి టీడీపీ పెద్దల ఆదేశాల మేరకే వ్యవహరిస్తున్నారని అప్పటికే ఆరోపణలున్నాయి. కరోనా కేసులు పదుల సంఖ్యలో కూడా లేని సమయంలో ఎన్నికలు వాయిదా వేయడం, టీడీపీ పెద్దల సూచన మేరకే రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేయడం తెలిసిందే. ► సీ ఓటర్, ఐఏఎన్ఎస్ సర్వేలో.. దేశంలో టాప్–5 సీఎంల జాబితాలో వైఎస్ జగన్‌కు చోటు. ► వైఎస్సార్ వాహన మిత్ర, జగనన్న చేదోడు, కాపు నేస్తం పథకాలు ప్రారంభం. ► నిర్ణీత వ్యవధిలో పథకాల మంజూరు. ► గత ప్రభుత్వ అవకతవకలను నిర్ధారించిన మంత్రివర్గ ఉప సంఘం. సీబీఐతో విచారణకు సిఫార్సు. ► ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు అరెస్టు. ► పదవ తరగతి, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు. విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్టు ప్రకటించిన ప్రభుత్వం. ప్రజారోగ్య రథయాత్ర 2020 జూలై ► ప్రాణాపాయంలో ఉన్న వారి పాలిట సంజీవని అయిన 108, 104 అంబులెన్స్‌లు మళ్లీ కుయ్ కుయ్ అంటూ కొత్తగా రోడ్డెక్కాయి. ఏకంగా 1,088 అంబులెన్స్‌లను సీఎం వైఎస్ జగన్ విజయవాడ బెంజ్ సర్కిల్లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ప్రతి మండలానికి ఒక 108, ఒక 104 అంబులెన్స్‌లను కేటాయించారు. చిన్నారుల కోసం 26 నియోనేటల్ అంబులెన్స్‌లు కూడా ప్రారంభించారు. ► ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ ప్రారంభం. 50,449 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం. ► హత్య కేసులో టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు. ► 57 లక్షల మంది రైతులకు సున్నా వడ్డీ సొమ్ము బకాయిలు రూ.1,150 కోట్లు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ► నేతన్న నేస్తం పథకం కింద మగ్గం ఉన్న ప్రతి చేనేతకు రూ.24 వేల వంతున ఆర్థిక సాయం చేసింది. ► వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ వర్తించేలా పశ్చిమగోదావరి జిల్లాలో మోడల్‌గా అమలు చేసిన పథకాన్ని మరో ఆరు జిల్లాలకు ప్రభుత్వం విస్తరించింది. ► అమూల్‌తో ప్రభుత్వం ఒప్పందం. ► మంత్రివర్గంలో మార్పులు. కొత్తగా వేణుగోపాలకృష్ణ, అప్పలరాజుకు చోటు. ► రాజమండ్రిలో దళితుడికి శిరోముండనం కేసులో పోలీసులపై వేటు. ► మూడు రాజధానులకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. రమేష్ కోవిడ్ సెంటర్లో మృత్యు కీలలు 2020 ఆగస్టు ► విజయవాడలోని ప్రైవేటు కోవిడ్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రమేష్ ఆసుపత్రికి అనుబంధంగా నిర్వహించిన కోవిడ్ సెంటర్లో ఈ ప్రమాదం కారణంగా 10 మంది మృతి చెందారు. 18 మందికి గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఆస్పత్రి యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అనంతరం ఈ కేసు దర్యాప్తునకు మార్గం సుగమమైంది. ► విశాఖ షిప్ యార్డులో భారీ క్రేన్ కుప్పకూలిన ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. ► ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు(77) మృతి చెందారు. ► ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సొంత రాష్ట్రంలో ప్రజాదరణలో తొలి స్థానం దక్కించుకున్నారు. ► విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ నేత పెనుమత్స సాంబశివరాజు (88) మృతి చెందారు. ► వైఎస్సార్ చేయూత కింద 23 లక్షల మంది మహిళలకు తొలి విడతగా రూ.18,750 చొప్పున జమ చేశారు.ఈ పథకం కింద నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు అందజేస్తారు. ► రిలయన్స్ రిటైల్ – జియో, అల్లానలతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. అర్హులందరికీ పింఛన్లు 2020 ఫిబ్రవరి ► ఒకప్పుడు వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్ పొందాలంటే అదో పెద్ద ప్రహసనం. అధికార పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతూ వారి దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వంలో అయితే జన్మభూమి కమిటీలదే పెత్తనం. లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి. ఇంకా దారుణం ఏమిటంటే ఎవరైనా పింఛన్‌దారు మరణిస్తే వారి స్థానంలో కొత్త వారికి ఇచ్చేవారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పార్టీ, కులం, మతం, ప్రాంతం.. చూడకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా పింఛన్లు మంజూరు చేశారు. వలంటీర్ల ద్వారా నేరుగా ఇంటి వద్దే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ► మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇస్తూ రాజమహేంద్రవరంలో సీఎం వైఎస్ జగన్ ‘దిశ’ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. ► 1.42 కోట్ల కుటుంబాలకు క్యూఆర్ కోడ్‌తో కూడిన హెల్త్ కార్డుల జారీకి శ్రీకారం. మూడవ దశ కంటి వెలుగులో భాగంగా అవ్వా తాతలకు కంటి పరీక్షలు. ► రాజధాని భూ అక్రమాలపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేస్తూ నిర్ణయం. ► ఐటీఐ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులకు జగనన్న వసతి దీవెన అమలు. ఆపదలో అండగా.. 2020 ఏప్రిల్ ► కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో 1.42 కోట్ల కుటుంబాల ఆరోగ్య పరిస్థితిపై మూడో విడత సర్వేకు సీఎం జగన్ ఆదేశించారు. సచివాలయ వ్యవస్థ సహకారంతో ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహించింది. లాక్డౌన్ వల్ల పేదలు ఇబ్బంది పడకుండా బియ్యం కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1000 చొప్పున ఆర్థిక సహాయం అందజేసింది. పేదలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ చేసింది. ప్రభుత్వ సిబ్బందితో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులను ఆరు నెలల పాటు ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనాను నిర్ధారించే ర్యాపిడ్ కిట్లు దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో తయారీకి శ్రీకారం చుట్టారు. లాక్డౌన్ నేపథ్యంలో ఫోన్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందజేసే సరికొత్త ‘టెలీ మెడిసిన్’ వ్యవస్థ ప్రారంభమైంది. కరోనా శాంపిల్స్ సేకరణకు మొబైల్ కియోస్కులు ఏర్పాటయ్యాయి. ► రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్ కనగరాజ్ నియామకం. ► ధాన్యం కొనుగోళ్లకు కొత్తగా 810 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ► మెకానిక్ షాపు, పరిశ్రమలు, ఈ కామర్స్ కార్యకలాపాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు. కరోనా టెస్టులలో ఏపీకి ఫస్ట్ ప్లేస్. ► సున్నా వడ్డీ పథకం కింద పొదుపు సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు జమ చేసిన సీఎం. ► అదనంగా జిల్లాకు ఒక్కొక్కరు చొప్పున జాయింట్ కలెక్టర్ల నియామకం. ఆర్థిక ఏడాదిలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి. గ్యాగ్ ఆర్డర్‌పై దేశ వ్యాప్తంగా నిరసనలు 2020 సెప్టెంబర్ ► అమరావతి భూ కుంభకోణంపై దర్యాప్తును ఆపాలని, భూ కుంభకోణంపై ఎలాంటి వార్తలు రాయొద్దని, ప్రసారం చేయొద్దని హైకోర్టు ఉత్తర్వులివ్వడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఏసీబీ దర్యాప్తు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ విషయమై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. ప్రముఖ జర్నలిస్టులు, న్యాయ కోవిదులు హైకోర్టు తీర్పును తప్పు పట్టారు. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరారు. ఈ విషయమై సీఎం జగన్ ఏకంగా సీజేఐకి లేఖ రాశారు. ► ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో ఏపీకి ప్రథమ స్థానం. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ పథకాలను సీఎం ప్రారంభించారు. ► గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, తిరుపతి వైఎస్సార్ సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు, విలక్షణ నటుడు జయప్రకాష్‌రెడ్డి మృతి. ► అంతర్వేది రథం దగ్ధం ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం నిర్ణయం. ► ఏపీ పోలీస్ సేవా యాప్, వైఎస్సార్ జలకళ ప్రారంభం. జగనన్న విద్యాకానుక 2020 అక్టోబర్ ► రాష్ట్రంలో 43 లక్షల మంది విద్యార్థులకు రూ.650 కోట్ల ఖర్చుతో జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ పథకం కింద టెక్ట్స్ పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగ్, మూడు జతల యూనిఫాం, బూట్లు, రెండు జతల సాక్సులు, టై, బెల్టు అందించారు. ఈ పథకం వల్ల తల్లిదండ్రులకు సగటున రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు లబ్ధి కలిగింది. ► 24 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. 1.53 లక్షల మంది గిరిజన రైతులకు ఆర్వోఎఫ్ఆర్ కింద 3.12 లక్షల ఎకరాల భూమిని సీఎం పంపిణీ చేశారు. ► పోలీసుల దర్యాప్తులను అడ్డుకుంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ప్రాథమిక దశలోనే దర్యాప్తులను అడ్డుకోవడం సరికాదని సుప్రీంకోర్టు స్టే. ► 1.41 లక్షల కుటుంబాలకు వైఎస్సార్ ఉచిత బీమా పథకం ప్రారంభం. రైతు భరోసా పథకం కింద 50.47 లక్షల మంది రైతులకు రూ.6,797 కోట్లు సాయం. వైఎస్సార్ బడుగు వికాసం ప్రారంభం. చిరు వ్యాపారులకు భరోసా 2020 నవంబర్ ► రోడ్డు పక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు, తలపై బరువు మోస్తూ వీధుల్లో తిరిగి అమ్ముకునే వారు, చేతి వృత్తుల వారు పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతుంటారు. వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పు తీసుకుని వచ్చిన ఆదాయంలో అత్యధికంగా తిరిగి వారికే చెల్లిస్తుంటారు. తన పాదయాత్రలో ఈ కష్టాలను దగ్గరుండి చూసిన వైఎస్ జగన్.. వారికి అండగా ఉండేందుకు రూ.10 వేలు వడ్డీ లేని రుణం మంజూరు చేశారు. వలంటీర్ల ద్వారా దరఖాస్తులు తీసుకుని వారికి బ్యాంకుల నుంచి రుణం మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నారు. రూ.1,000 కోట్లతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ► కరోనా కారణంగా ఆగిపోయిన స్కూళ్లు ప్రారంభం. ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ సహా 2,434 వ్యాధులకు ఉచితంగా చికిత్స చేసేందుకు శ్రీకారం. ► వైఎస్సార్ చేయూత రెండో దశలో రూ.510.01 కోట్ల సాయం. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 14.58 లక్షల మంది రైతులకు రూ. 510 కోట్లు జమ. ► రూ.3 వేల కోట్ల ఖర్చుతో ఫిషింగ్ హార్బర్లు, పోర్టులకు శంకుస్థాపన చేసిన సీఎం. ► అమరావతి భూ కుంభకోణాలపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను నిలిపి వేస్తూ రాష్ట్ర హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే. ► నివర్ తుపాన్ వల్ల పంటలకు నష్టం. వేగవంతంగా నష్టం అంచనా. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. ఏలూరులో కలకలం 2020 డిసెంబర్ ► పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కారణం తెలియకుండా పలువురు ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. వందలాది మంది ఉన్నట్టుండి మూర్ఛతో పడిపోతూ ఆస్పత్రుల పాలయ్యారు. బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. కేంద్ర వైద్య బృందం, రాష్ట్ర వైద్యులు విస్తృతంగా పరిశోధనలు చేశారు. అందరికీ మంచి వైద్యం అందించడంతో వెనువెంటనే కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. ► ఏపీ అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టు ప్రారంభం. ‘జగనన్న జీవ క్రాంతి’ పథకం కింద 4.69 లక్షల మంది మహిళలకు ఆవులు, గేదెల యూనిట్లు. ► హైకోర్టు సీజేగా జస్టిస్ ఏకే గోస్వామి. ► 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం. ► సమగ్ర భూ రీ సర్వే, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభం. వైఎస్సార్ రైతు భరోసా తుది విడతగా రూ.1,120 కోట్లు జమ. నివర్ తుపాన్ నష్ట పరిహారం కింద రూ.646 కోట్లు చెల్లింపు. -
ఇక్కడే సంక్రాంతి... ఇప్పుడే సంతోషం
ముగ్గులేస్తాం..గొబ్బెమ్మలు పెడతాం..ఇక్కడే సంక్రాంతి చేసుకుంటాం రోజంతా ఇక్కడే గడుపుతాం..ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో అవధుల్లేని ఆనందం తమ బతుకు చిత్రం మారిపోతుందనే విశ్వాసం జగనన్నను తమ గుండెల్లో పెట్టుకుంటామంటూ ఉద్వేగం – ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన ‘మేం ఈసారి సంక్రాంతి పండుగ ఇక్కడే చేసుకుంటాం. ముగ్గులేసి, గొబ్బెమ్మలు పెడతాం. రోజంతా ఇక్కడే గడుపుతాం. ఇంత ఆనందాన్ని జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు..’ ఉప్పొంగుతున్న సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ వణుకూరు దళితవాడ మహిళలు చేసిన వ్యాఖ్యలివి. ‘ఇన్నాల్టికి నిజమైన సంక్రాంతి చూస్తున్నాం బాబూ...’ అని వనిత అంటుండగానే, ‘మేం ఇక లక్షాధికారులం..’ అంది మరియమ్మ. ‘ఇన్నాళ్టికి బతుకు మీదే నమ్మకం వచ్చింది సార్...’ అంటూ తన కూతుర్ని హత్తుకుంది లలిత. సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్ళు’ పథకం వారిలో కోటి ఆశలు రేకెత్తిస్తోంది. జీవితంపై నమ్మకం పెంచుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే వారి బతుకు చిత్రాన్నే మార్చేస్తోంది. పనికెళ్ళకపోతే పస్తులుండే పేదల ఊరు వణుకూరు. విజయవాడకు కూతవేటు దూరంలో ఉండే ఈ గ్రామం ఇప్పుడు సంబరాల్లో మునిగితేలుతోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా ఈ గ్రామంలో దాదాపు 18 వేల పైచిలుకు ఇళ్ళ స్థలాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వణుకూరుతో పాటు విజయవాడలోని పలు ప్రాంతాల లబ్ధిదారుల కోసం ఇక్కడ దాదాపు 400 ఎకరాల్లో స్థలాలు ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ బృందం అక్కడ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళింది. ఇళ్ల స్థలాల్లో ఉన్నవారితో పాటు వణుకూరు గ్రామస్తులు కొందర్ని పలుకరించింది. మా పేదరికం పోయింది.. వణుకూరుకు సరిగ్గా అర కిలోమీటర్ దూరంలోనే ఉన్న ఆ ప్రాంతానికి పొద్దున్నుంచీ సూర్యాస్తమయం వరకు ఇళ్ల స్థలాల లబ్ధిదారులు వచ్చి పోతూనే ఉన్నారు. ‘మీరు ఎక్కడ్నుంచి? ఏం చేస్తారు? మీ ఫోన్ నంబర్ ఇవ్వండి?’ అంటూ ఒకర్నొకరు పరిచయం చేసుకుంటున్నారు. ప్లాట్ల దగ్గర నిలబడి సెల్ఫీలు దిగుతున్నారు. ఎవరికి ఏ ప్లాట్ ఇస్తారో తెలియదుగానీ లబ్ధిదారులు మాత్రం అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి అది తమ ఊరని మురిసిపోతున్నారు. విజయవాడలో టైలర్ పనిచేసే బొడుగు దీప్తి కుటుంబ సమేతంగా అక్కడి వచ్చింది. ‘ఈ సంక్రాంతితో మా పేదరికం పోయింది. ఇంతమందితో కలసి ఇక్కడ గొప్పగా బతుకుతాననే నమ్మకం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది..’ అని ఆనందంతో చెప్పింది. 12 ఏళ్ళ చిన్నారి నిహారిక తన తండ్రితో సెల్ఫీ దిగుతూ .. ‘పూరిగుడిసెలో నా పుస్తకాలు తడిచిపోయేవి. సొంత ఇల్లు వచ్చాక నా బుక్స్ అన్నీ ఓ షెల్ఫ్‌లో పెట్టుకుంటా. రోజూ దాబా మీదకెక్కి చదువుకుంటా..’ అంటూ ముసిముసి నవ్వులు నవ్వింది. జగనన్నే మాకు దేవుడు ‘మనకి ప్లాటొచ్చిందమ్మా... పండక్కి రండి’ అంటూ ఆటోనగర్‌లో ఉంటున్న వీరన్న తన అల్లుడికి ఫోన్ చేసి ఆనందం పంచుకున్నాడు. కొత్త ప్లాట్ల దగ్గర వాట్సాప్ వీడియో కాల్లో ఆ ప్రాంతాన్ని చూపించాడు. ‘మాకు జగనన్నే దేవుడు... అందుకే వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నాం’ అని టెన్త్ చదువుతున్న సంకల్ప తన వద్ద ఉన్న ఫోన్ చూపిస్తూ చెప్పింది. ‘ఇంతకాలం మురికివాడలో బతుకు .. ఇప్పుడిక కొత్త వెలుగు’ అంటూ సంజయ్ అక్కడి పరిసరాలను ఫోన్లో చిత్రీకరించాడు. ఇన్నాళ్లకు ఇల్లొచ్చింది.. ‘ఇదయ్యా ఇప్పటిదాకా మా బతుకు’ .. వణుకూరు ఎస్సీ కాలనీలో తన గుడిసె చూపిస్తూ చెప్పింది బుర్రె ప్రసన్న. గడ్డితో కప్పుకోవడమే కష్టంగా ఉన్న ఆ గుడిసెలోనే ఆ కుటుంబం ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటోంది. ఇల్లివ్వమని కొన్నేళ్ళుగా నేతల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని చెప్పిందామె. తన అత్త బతికుండగా సొంతింటి కోసమే తపించిందని, ‘ఈ ప్రభుత్వం వచ్చాక ఇల్లొచ్చింది. ఆమె బతికుంటే మురిసిపోయేది’ అని కన్నీళ్ళు దిగమింగుకుంటూ చెప్పింది. మరో రెండు అడుగులు వేస్తే కృపారావు ఇల్లు కన్పించింది. చుట్టూ పిచ్చి మొక్కలు. అటు వెళ్తుంటే పందులెదురొచ్చాయి. ఇంట్లోకి పాములు రావడం సర్వసాధారణమంట. ఇదే విషయమై కృపారావును కదిలిస్తే.. ’మాకేంటి సార్... ఇప్పుడు మాకు ప్లాట్ వచ్చింది. మా బాధలన్నీ తీరిపోయాయి’ అంటూ తన భార్య వనిత పడుతున్న ఆనందాన్ని పదేపదే చెప్పారు. ప్రభుత్వం భరోసా ఇచ్చింది ఆటో నడిపే నేను ఇంటి అద్దె కట్టడానికే కష్టపడుతున్నా. ఇక ఎదిగే పిల్లలకు ఏమిస్తాననే మనాది ఇప్పటిదాకా ఉండేది. ఇప్పుడు నామీద నాకే నమ్మకం వచ్చింది. కాదు ప్రభుత్వం ఆ నమ్మకం కల్పించింది. ఇలాంటి వాతావరణంలో ఇల్లు వస్తుందని ఊహించుకుంటేనే చెప్పలేని ఆనందం కలుగుతోంది. ఇక్కడ నుంచి పోరంకికి ఆటో నడుపుకుంటా. – కామినేని సాంబయ్య, ఆటో డ్రైవర్ నమ్మకాన్ని జగనన్న నిజం చేశాడు పొద్దస్తమానం టైలరింగ్‌తో కష్టపడే నా భార్య, నేను ఎప్పటికైనా సొంతింట్లో ఉంటామా? అన్పించేది. కానీ జగనన్న ఎన్నికల్లో చెప్పినప్పుడే నమ్మకం కలిగింది. ఇప్పుడు అది నిజమైంది. – బొడుగు లోకేష్, ఆర్టీసీ కాలనీ పేరు రాసుకెళ్లారు.. ఇల్లొచ్చిందని చెప్పారు ఎన్నో ఏళ్లుగా కన్పించిన ప్రతి నాయకుడినీ ఇంటి కోసం వేడుకున్నాం. ఎవరూ కనికరించలేదు. ఇటీవల గ్రామ వాలంటీర్ ఇంటికొచ్చి పేరు రాసుకెళ్ళారు. తర్వాత నీకు ఇల్లొచ్చిందని చెప్పారు. ప్రజల కోసం పనిచేసే జగనన్నను మా గుండెల్లో పెట్టుకుని పూజిస్తాం. –బుర్రె ప్రసన్న, వణుకూరు ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది ఎలాంటి రాజకీయ ఒత్తిడీ లేకుండా మా చేతుల మీదుగా పేదవాళ్ళను లబ్ధిదారులుగా ఎంపిక చేయడం చాలా సంతృప్తిగా ఉంది. ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. – సాయి దీప్తి, వలంటీర్ పట్టాల పండుగ.. ఆనందం నిండగ.. రాష్ట్రవ్యాప్తంగా ఆరో రోజూ ఇళ్ల పట్టాల పంపిణీ ‘అందరికీ చోటు ఇస్తేనే అది సమాజం అనిపించుకుంటుంది. అందరికీ మంచి చేస్తేనే అది ప్రభుత్వం అనిపించుకుంటుంది. అన్ని కులాలు, మతాలు ఉంటేనే రాజధాని అవుతుంది. అటువంటి సమాజాన్ని, ప్రభుత్వాన్ని, రాజధానిని మీ అందరి చల్లని దీవెనలతో నిరి్మంచుకుందాం’ అంటూ సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ ఆరో రోజైన బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగింది. పట్టాలు అందుకున్న అక్కచెల్లెమ్మలు.. ఎన్నో ఏళ్లుగా కలగానే మిగిలిన సొంతిల్లు ఇన్నాళ్లకు దక్కిందంటూ భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్ జిల్లాలో బుధవారం 6,223 మందికి ఇళ్ల పట్టాలివ్వగా..ఇప్పటివరకు పట్టాలు అందుకున్న వారి సంఖ్య 50,809కి చేరింది. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో బుధవారం 4,598 మందికి పట్టాలను అందజేశారు. కర్నూలు జిల్లాలో బుధవారం 8,023 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో బుధవారం 3,451 ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారం 5,331 మందికి ఇళ్ల పట్టాలు, 309 మందికి టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. మంత్రి గౌతంరెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో బుధవారం 3,727 మందికి పట్టాలు అందజేయగా.. ఇప్పటివరకు 23,695 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందారు. కొత్తపట్నం మండలం అల్లూరులో హౌసింగ్ కాలనీ నిర్మాణానికి మంత్రి బాలినేని భూమి పూజ చేశారు. గుంటూరు జిల్లాలో బుధవారం 13,909 మందికి ఇళ్ల పట్టాలు, 262 మందికి టిడ్కో ఇళ్లకు పత్రాలు అందజేశారు. జిల్లాలో ఇప్పటివరకు 57,325 ఇంటి పట్టాలు, 287 టిడ్కో ఇళ్లు పంపిణీ చేశారు. హోం మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో బుధవారం 8,642 మందికి ఇళ్ల పట్టాలను ఇవ్వగా.. ఇప్పటివరకు పట్టాలు పొందిన వారి సంఖ్య 55,428కు చేరింది. మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం జరిగిన కార్యక్రమంలో 7,637 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. ఇప్పటి వరకు 56,372 మంది లబ్ధి పొందారు. కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బుధవారం 5,704 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా.. ఇప్పటివరకు లబ్ధి పొందిన వారి సంఖ్య 54,542కు చేరింది. మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో బుధవారం 3,764 మందికి పట్టాల్ని పంపిణీ చేయగా..ఇప్పటివరకు లబి్ధదారుల సంఖ్య 29,764కు చేరింది. విశాఖ జిల్లాలో బుధవారం 30,444 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి పట్టాలు అందజేశారు. టీడీపీకి ఓటేసినా..జగనన్న పట్టా ఇచ్చారు నేను వైఎస్సార్సీపీకి ఓటేయలేదు. ఎప్పుడూ టీడీపీకే ఓటేశా. మా నాన్న, భర్త తెలుగుదేశం పార్టీయే. అయినా మాకు ఇల్లు రాలేదు. జగనన్న మాకు ఇంటి పట్టా ఇచ్చి.. ఇల్లు కూడా కట్టిస్తున్నారు. వైఎస్సార్ చేయూత పథకం కింద ఇప్పటికే రూ.18,750 వచ్చాయి. నూతిలో కప్పలా మనం ఉన్నదే ప్రపంచం కాదని నా భర్తకు చెబుతా. గొప్ప నాయకుడిని దేవుడిచ్చాడని చెబుతా. – షేక్ సరోజిని, 23వ వార్డు, తెనాలి -
న్యాయమే నెగ్గుతుంది: సీఎం జగన్
ప్రతి కుటుంబం ఆలోచన చేయాలి... ఏడాది గడిచిపోయింది. క్యాలెండర్ మారుతోంది. 2020 తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకునే సమయం వచ్చింది. ఈ ప్రభుత్వం మాకేమిచ్చింది? గత సర్కారుతో పోలిస్తే ఎంత మంచి జరిగిందని ప్రతి కుటుంబం ఆలోచన చేయాలి. మీ బిడ్డ మీకు మంచి చేశాడు. రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలో కూడా లేని విధంగా ఎన్నో చేశాడు. పేదలకు, రైతులకు, అక్క చెల్లెమ్మలకు, విద్యార్థులకు, అవ్వా తాతలకు, వందల సామాజిక వర్గాలకు కనీవిని ఎరగని విధంగా ఉపయోగపడ్డా. మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఈ మాటలు గర్వంగా చెబుతున్నా. వీళ్లసలు మనుషులేనా..? చంద్రబాబు, ఆయన సహచరులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ కోర్టుల్లో కేసులు వేయడం, స్టేలు తేవడంతో 30.75 లక్షల మందిలో 10% అంటే 3.74 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతున్నాం. పట్టాల పంపిణీకి ముందురోజైన 24న కూడా కోర్టులో పిల్ వేశారంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో చూడండి. నా సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా స్టే తెచ్చారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అడ్డుకుంటున్న వీరసలు మనుషులేనా? అనిపిస్తుంది. జాప్యం వల్ల ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఇప్పుడు డి–పట్టాలతో ఇస్తున్నాం. న్యాయపరమైన అడ్డంకులు తొలగిన వెంటనే సర్వహక్కులతో అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తాం. అక్కచెల్లెమ్మలకు విలువైన ఆస్తి... ఇదే లేఅవుట్లో మనం ఇస్తున్న భూమి విలువ రూ.3 లక్షలు ఉంటుందని కలెక్టర్ చెప్పారు. రేపు ఇక్కడ ఇల్లు కట్టి అభివృద్ధి చేస్తే కనీసం ఏడెనిమిది లక్షల రూపాయల ఆస్తి అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టినట్లు అవుతుంది. ఇంటికి నలుగురు చొప్పున లెక్కేసుకున్నా ఇక్కడ దాదాపు 45 వేల మంది ఉండబోతున్నారు. అంటే ఒక నగర పంచాయతీ ఏర్పడబోతోంది. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, విజయనగరం: సంక్రాంతి ముందే వచ్చిందన్నట్లుగా పేదలకు విలువైన స్థిరాస్తిని అందించే ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా విజయనగరం జిల్లా గుంకలాంలో 397.36 ఎకరాల విస్తీర్ణంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన సువిశాల లేఅవుట్‌ను బుధవారం ఆయన విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. విశాఖ నుంచి హెలికాఫ్టర్‌లో వచ్చిన ముఖ్యమంత్రి జగన్ లే అవుట్ అంతా చక్కర్లు కొట్టి తిలకించారు. అనంతరం వైఎస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. 12,301 మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో పాటు తొలిదశలో నిర్మించనున్న గృహ నిర్మాణ పనులను ప్రారంభించి బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. భారీ ఎత్తున హాజరైన లబ్ధిదారులు అడుగడుగునా అడ్డంకులు ‘‘అమరావతిలో 54 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే డెమొగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందంటూ చంద్రబాబు నాయుడు, ఆయన మనుషులు కోర్టుల్లో కేసులు వేస్తే స్టే ఇచ్చాయి. నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తోంది. కులాల మధ్య విభేదాలు ఏమిటి? వారు దాన్ని చూపిస్తూ కేసులు వేయడం ఏమిటి? కోర్టులు స్టే ఇవ్వడం ఏమిటి? అని. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత దారుణమైన పరిస్థితులున్నాయో. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన విశాఖలో 1.80 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ల్యాండ్ పూలింగ్‌లో భూములు సేకరించాం. ఆ భూములు ఇచ్చిన వారు ఏ అభ్యంతరం లేకుండా భూములు ఇచ్చారు. కానీ ఆ భూములతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి కోర్టులో కేసులు వేయడం, వాటిపై స్టే రావడం చాలా బాధనిపిస్తోంది. రాజమండ్రిలో భూములను ప్రభుత్వమే ప్రజల నుంచి కొనుగోలు చేసింది. అవి ఆవ భూములు కాకపోయినా ఎవరో కేసు వేయడం, స్టే రావడంతో 27 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు అవరోధం ఏర్పడింది. 1978లో 44వ సవరణ ద్వారా ఆస్తిహక్కును చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. అంటే ఇల్లు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. అది చట్టబద్దమైన హక్కు. అయినా కోర్టులకు వెళ్లడం, స్టేలు ఇవ్వడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. బాధ కూడా అనిపిస్తోంది. ఇంత భారీగా ఇళ్ల నిర్మాణంతో ఎంతోమందికి పని దొరుకుతుంది. కనీసం 30 రకాల వృత్తుల వారికి ఉపాధి లభిస్తుంది. ముడి పదార్థాల వినియోగంతో ఆర్థికంగా కూడా బూస్ట్ వస్తుంది. త్వరలోనే మిగిలిపోయిన 3.74 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందిస్తాం. దేవుడి ఆశీర్వాదం, మీ చల్లని దీవెనలు నాకు తోడుగా ఉన్నాయి. మహిళకు ఇంటి స్థలం పట్టా అందజేస్తున్న సీఎం జగన్ చెప్పిన దానికంటే మిన్నగా.. అక్క చెల్లెమ్మలకు 25 లక్షల ఇళ్లు కట్టించి వారి పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. అంతకంటే ఎక్కువగా 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలిస్తున్నాం. తొలివిడత 15.60 లక్షల ఇళ్లు మొదలు పెడుతున్నాం. రూ.7 వేల కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. మిగిలిన 12.70 లక్షల ఇళ్లు వచ్చే ఏడాది ప్రారంభిస్తాం. . రాష్ట్రవ్యాప్తంగా 68,361 ఎకరాలలో చేసిన లేఅవుట్లు, ప్లాట్ల మార్కెట్ విలువ దాదాపు రూ.25,530 కోట్లు ఉంటుంది. నవరత్నాల సిరి ధాన్యం బస్తాలపై నవరత్నాలను పేర్కొంటూ రూపొందించిన ఎడ్లబండి సభలో విశేషంగా ఆకట్టుకుంది. నాలుగు జిల్లాల జనాభా.. గత ప్రభుత్వం చివరి రెండేళ్లలో అక్కడో ఇక్కడో మొక్కుబడిగా ఇళ్లు కడితే మనం ఇవాళ ఏకంగా ఊళ్లు కడుతున్నాం. కొన్ని చోట్ల అవి పట్టణాలు కూడా. మన ప్రభుత్వం దాదాపు 31 లక్షల కుటుంబాలకు ఇళ్లు కట్టిస్తోంది. అంటే ఒక కుటుంబంలో సగటున నలుగురు ఉంటారనుకుంటే దాదాపు 1.24 కోట్ల మందికి ఇంటి సదుపాయం కలుగుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతోపాటు కడపను కూడా కలిపితేనేగానీ అంత మంది ఉండరు. ఏ రకంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారనేది మీదే నిర్ణయం. మూడు రకాల ఆప్షన్లలో మీకు నచ్చింది వలంటీర్‌కు చెప్పండి. బాబు స్కీమ్ కావాలన్నది ఒకే ఒక్కడు దాదాపు 2.62 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తాం. 300 చదరపు అడుగుల ఫ్లాట్ ఖర్చును ప్రభుత్వమే పూర్తిగా భరించి కేవలం ఒక్క రూపాయికే పేదలకు ఇస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.43 లక్షల టిడ్కో ఇళ్లకు సంబంధించి ఏ స్కీమ్ కావాలని ఆప్షన్లు కోరితే కేవలం ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీమ్ కావాలన్నారు. అది కూడా ఏదో పొరపాటున అయి ఉంటుంది. ఆయన కోరిక ప్రకారమే ఆయనకు ఆ స్కీమ్, మిగిలిన వారికి జగనన్న స్కీమ్ వర్తింపచేస్తాం. 365, 430 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులకు కూడా రాయితీ ఇస్తున్నాం. వారు కట్టాల్సిన ముందస్తు వాటాలో 50 శాతం ప్రభుత్వం భరిస్తోంది. ఇలా అదనంగా రూ.4,287 కోట్ల భారం పడినా మీ బిడ్డగా చిరునవ్వుతో భరిస్తున్నాం’’ భారీగా హాజరైన లబ్ధిదారులు.. డిప్యూటీ సీఎంలు పుష్పశ్రీవాణి, ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స, చెరుకువాడ, ముత్తంశెట్టి, వెలంపల్లి, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీలు బెల్లాన, మాధవి, సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు భారీగా లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయనగరానికి వరాలు ► రూ.180 కోట్లతో కురుపాం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ పనులు త్వరలో ప్రారంభం. ► సాలూరులో ట్రైబల్ వర్సిటీ పనులు త్వరలోనే మొదలు. ► విజయనగరంలో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణానికి జనవరిలో టెండర్లు. మార్చిలో పనులు. ► ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రెండో దశకు రూ.4,134 కోట్లకు టెండర్లు. పనులు పూర్తి చేసి కచ్చితంగా 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు. ► గజపతినగరం బ్రాంచి కాలువతో సహా తోటపల్లిలో అన్ని పనులను రూ.471 కోట్లతో ప్రాధాన్యతగా చేపట్టి రెండేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం. ► తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టుకు మరో రూ.620 కోట్లు. రెండేళ్లలో పనులు పూర్తి. ► వెంగళరాయ ప్రాజెక్టు కింద 5 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీళ్లు. ఏడాది లోపే పనులు పూర్తి. ► రాముడి వలస, లోచర్ల ఎత్తిపోతల పథకాల పనులు ఏడాదిలోగా పూర్తి. ► గుంకలాంలో అన్ని మౌలిక వసతులతో 18 నెలల్లోనే గృహ నిర్మాణాలు పూర్తి. ఎవరిస్తారన్నా ఇలా..? ‘‘కూలి పనిచేసే నా భర్త చనిపోవడంతో టైలరింగ్ చేసుకుంటూ బతుకుతున్నా. నాకొక పాప ఉంది. సొంతిల్లు లేకపోవటంతో 20 ఏళ్లలో 12 సార్లు అద్దె ఇళ్లు మారాల్సి వచ్చింది. జగనన్న నా ఇంటి కలను నేరవేర్చటమే కాకుండా చేదోడు పథకం కింద రూ.18,750, వైఎస్సార్ ఆసరా రూ.4 వేలు, పింఛన్ రూ.2,250 చొప్పున నాకు సంవత్సరం మొత్తంలో రూ.60 వేలు పైన ఇచ్చారు. ఎవరిస్తారన్నా ఇలా? నాకు, నా కుమార్తెకు మీరున్నారన్న ధైర్యంతో బతుకుతాం’’ –కొమరగిరి రత్నకుమారి, పద్మావతినగర్, విజయనగరం -
ప్రభుత్వం కడుతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు: సీఎం జగన్
సాక్షి, విజయనగరం : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఆస్తి, స్థిరాస్తి అందించే మహాయజ్ఞాన్ని ప్రారంభించామని, 18 నెలల్లో 95 శాతం హామీలు నెరవేర్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ పేదలకు ఇళ్ల పట్టాలు.. రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షలకు పైగా ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టామని తెలిపారు. పేదలకు 2.20 లక్షల టిడ్కో ఇళ్లను కట్టిస్తున్నామని వెల్లడించారు. 35.70లక్షల ఇళ్లను రెండు దశల్లో పూర్తి చేస్తామన్నారు. బుధవారం విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా 'నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన గుంకలాంలోని ‘వైఎస్సార్ జగనన్న కాలనీ’ పైలాన్‌ను ఆవిష్కరించారు. ( చదవండి : వైఎస్సార్ జగనన్న కాలనీ పైలాన్ ఆవిష్కరించిన సీఎం జగన్ ) ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘అక్కచెల్లెమ్మలకు మంచి చేసే అవకాశం దక్కింది. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మహిళలకు, రైతులకు, విద్యార్ధులకు.. అక్కచెల్లెమ్మలకు, వందల సామాజిక వర్గాలకు అండగా నిలిచా. 50 లక్షలకు పైగా రైతులకు రైతు భరోసా సాయం అందించాం. 62 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్.. వారి ఇంటి వద్దకే అందించేలా గొప్ప కార్యక్రమం చేపట్టాం. 15 లక్షలకు పైగా విద్యార్ధుల చదువులకు తోడుగా నిలబడ్డా. రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ అందించి అండగా నిలబడ్డా. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా 1.30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం’’ అని అన్నారు. ప్రభుత్వం కడుతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు ప్రభుత్వం కడుతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు. కొత్తగా 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీలు నిర్మించబోతున్నాం. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. గుంకలాం లేఅవుట్లో 12,301 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇస్తాం. గుంకలాంలో చిన్న నగర పంచాయతీ ఏర్పడబోతుంది. కుల, మత, పార్టీలకతీతంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టాం. గ్రామ/వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా డిస్ప్లే చేస్తున్నాం. ఇళ్ల పట్టాలను నిరంతర ప్రక్రియగా మార్చాం. అర్హులైనవారు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో.. ఇంటి స్థలం కేటాయించేలా ఆదేశాలు ఇచ్చాం. తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సహా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. లే అవుట్ విస్తీర్ణం బట్టి పార్క్‌లు, అంగన్వాడీలు, విలేజ్ క్లీనిక్‌లు, ఆర్బీకేలు ఏర్పాటు.. 224 చదరపు అడుగుల నుంచి 340 చదరపు అడుగులకు విస్తీర్ణం పెంచాం. ఒక రూపాయికే టిడ్కో ఇళ్లు 300 చదరపు అడుగులు ఉన్న టిడ్కో ఇళ్లను ఒక రూపాయికే అందిస్తున్నాం. టిడ్కో ఇళ్లను పూర్తిచేసేందుకు రూ.9వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. లక్షా 43వేల మంది టిడ్కో లబ్ధిదారుల్లో ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీం కావాలన్నారు. 365, 430 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లల్లో.. 50శాతం లబ్ధిదారుల వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనివల్ల రూ.4,250 కోట్లు ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చాం. మొదటి ఆప్షన్లో నిర్మాణ సామాగ్రి, లేబర్ ఛార్జీలను లబ్ధిదారులకు ఇస్తాం. రెండో ఆప్షన్లో నిర్మాణ ఖర్చులను పురోగతి వారీగా డబ్బులు చెల్లిస్తాం. మూడో ఆప్షన్లో పూర్తిగా ఇంటి నిర్మాణం చేసి లబ్ధిదారులకు అందిస్తాం. చంద్రబాబు అండ్ కో కుట్రలతో రిజిస్ట్రేషన్లు జరగలేదు లబ్ధిదారుల పేరుతోనే ఇంటి రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాం. చంద్రబాబు అండ్ కో కుట్రలతో రిజిస్ట్రేషన్లు జరగలేదు. లబ్ధిదారులకు కేవలం 'డి' పట్టాలు మాత్రమే ఇస్తున్నాం. న్యాయపరమైన చిక్కులు తొలిగిపోగానే లబ్ధిదారులకు అన్ని హక్కులు కల్పిస్తాం. డిసెంబర్ 25న ఇళ్ల పట్టాలు పంచుతామని తెలిసి 24న కోర్టుకు వెళ్లారు. చంద్రబాబు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో దీన్ని బట్టే తెలుస్తుంది. పులివెందులలో ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టు ద్వారా స్టే తెచ్చారు. అమరావతిలో 54 వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. విశాఖలో 1.84 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సంకల్పించాం..ల్యాండ్ పూలింగ్‌కు సంబంధంలేనివారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. రాజమండ్రిలో ఆవా భూముల పేరుతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. ప్రభుత్వ భూములను కూడా పేదలకు కేటాయించకుండా అడ్డుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణం ద్వారా 30 రకాల వృత్తిదారులకు ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. చంద్రబాబు, అనుచరుల పిటిషన్ల వల్ల 10% ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం కాగానే మిగిలిన వారందరికీ ఇళ్ల స్థలాలు.. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును చట్టబద్ధ హక్కుగా మార్చారు. పేదలకు ఆస్తి హక్కు కల్పించే ప్రయత్నం చేస్తుంటే కోర్టుకెళ్లి అడ్డుకుంటున్నారు. విజయనగరంలో మెడికల్ కాలేజీకి జనవరిలో టెండర్లు.. మార్చి నాటికి మెడికల్ కాలేజీ నిర్మాణం చేపడతాం. రెండేళ్లలో తోటపల్లి, తారకరామ తీర్ధసాగరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. ఏడాదిలోగా రాముడువలస లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేస్తాం.\