![TTD Employees to Get House Sites in 3 Months: YV Subbareddy - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/1/ttd.jpg.webp?itok=txr6uUMz)
చెక్కును చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు అందిస్తున్న వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి తదితరులు
TTD Employees House Sites, సాక్షి, తిరుపతి: ఇళ్ల స్థలాల కోసం మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న టీటీడీ ఉద్యోగుల కల త్వరలో సాకారం కానుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మరో మూడు నెలల్లో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామన్నారు. ఇందుకోసం వడమాలపేట మండలం పాదిర్వేడు అరణ్యం గ్రామంలో సేకరించిన 300.22 ఎకరాల భూమికి సంబంధించి చెల్లించాల్సిన రూ.61.63 కోట్ల మొత్తాన్ని గురువారం టీటీడీ చైర్మన్.. కలెక్టర్ హరినారాయణన్‌కు అందజేశారు.
శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ 5,518 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు మార్గం సుగమం అయ్యిందన్నారు. వైఎస్సార్ హయాంలోనే ఇళ్ల స్థలాల విషయమై అప్పటి బోర్డులో తీర్మానం చేశారని, అయితే కొందరు కోర్టుకు వెళ్లడంతో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరిందన్నారు. భవిష్యత్‌లో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ధర్మకర్తల మండలి హౌస్ బిల్డింగ్ సొసైటీని ఏర్పాటు చేసుకోవాలని ఉద్యోగులకు సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తదితరులున్నారు.
చదవండి: (ఏపీ సీఎం పథకాలు భేష్.. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశంస)
Comments
Please login to add a commentAdd a comment