‘సీఎం జగన్‌ చెప్పారంటే.. చేస్తారంతే’ | Perni Nani Said 95 Percent Of Guarantees Have Been Implemented | Sakshi
Sakshi News home page

ఇప్పటికే 95 శాతం హామీలు అమలు

Published Thu, Dec 31 2020 4:22 PM | Last Updated on Thu, Dec 31 2020 4:44 PM

Perni Nani Said 95 Percent Of Guarantees Have Been Implemented - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: ప్రజల సమస్యలు తీర్చడానికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలను ప్రవేశపెట్టారని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారన్నారు. ‘‘ఇప్పటికే దశలు వారీగా బ్రాందీ షాపులను తగ్గిస్తున్నారు. రాబోయే కాలంలో పూర్తిగా బ్రాందీ షాపులను నిర్మూలన చేస్తారు. మద్యానికి బానిసలయినా కుటుంబంలో పిల్లలు కార్మికులుగా చేస్తున్నారు. దాన్ని అధిగమించడానికి ‘అమ్మ ఒడి’ పథకం రూపుదిద్దుకుంది.(చదవండి: విద్యుత్‌ సంస్థలు లాభాల బాట: బాలినేని)

సీఎం జగన్‌ చెప్పారంటే.. చేస్తారంతే. పేదవారి సొంతింటి కలను నెరవేర్చారు. సుమారు 10 కోట్ల రూపాయలతో 30 లక్షల 54 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇల్లు లేని వారు దరఖాస్తు చేసుకుంటే.. 90 రోజుల్లో ఇల్లు కట్టించి ఇస్తాం. ఇప్పటికే సీఎం జగన్‌ 95 శాతం హామీలను అమలు చేశారని’’ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.(చదవండి:‘ఆ వాహనాలు.. ముంబై తర్వాత ఏపీలోనే..’)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement