
సాక్షి, విజయవాడ: పేదలకు ఉచితంగా ఇళ్లు అందిస్తుంటే టీడీపీ దుర్మార్గంగా మాట్లాడుతోందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వాంబే కాలనీలోని 60వ డివిజన్‌లో అర్హులైన 2,533 మందికి ఇళ్ల పట్ఠాల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం జోనల్ కమిషనర్ సమైలా, ఎమ్మార్వో దుర్గా ప్రసాద్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 'అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. సీఎం జగన్ రాష్ట్రంలో పేద ప్రజలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. 386 మందికి టిడ్కో ఇల్లు ఇస్తున్నాం. టీడీపీ ఇళ్ల విషయంలో దుర్మార్గంగా మాట్లాడుతోంది. వాంబే కాలనీలో మినీ బస్టాండ్ వస్తుంది. లే అవుట్‌లు నగరంలో విలీనం చేస్తాం. చదవండి: (‘మేనిఫెస్టో గొప్పతనం సీఎం జగన్ పాలనలోనే అర్థమైంది’)
గతంలో 28 వేల ఇళ్లు ఇచ్చిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కింది. టీడీపీ ప్రజాప్రతినిధులు టిడ్కో విషయంలో ప్రజలను మోసం చేశారు. టీడీపీ నేతలు 12,000 మంది దగ్గర డబ్బులు వసూలు చేశారు. పేదలకు సెంట్ స్థలం ఇస్తున్నాం. నగరంలో 1,600 మందికి ఇళ్ల పట్టాలు రెగ్యులరైజ్ చేస్తున్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో కొత్తగా 525 పెన్షన్లు ఇచ్చాము. 45 నుంచి 65 ఏళ్ల లోపు ఉన్న వారికి సీఎం జగన్ చేయూతను ఇచ్చారు. రాష్ట్రంలో సీఎం విద్యకు పెద్దపీట వేస్తున్నారు. వాంబే కాలనీలో రూ. 4 కోట్ల పనులు జరుగుతున్నాయి. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారు. టీడీపీ నేతలు మత రాజకీయాలు చేస్తున్నారు, అది సరికాదు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. చదవండి: (త్వరలోనే అసలు రంగు బయటపడుతుంది’)
Comments
Please login to add a commentAdd a comment