YSR Jagananna Illa Pattalu
-
మా సొంత ఇంటి కలను నిజం చేసినందుకు జగనన్నకు ధన్యవాదాలు
-
పేదల సొంతింటి కల జగనన్నతో సాకారం
-
ప్రతి పేదవాడికి ఒక ఇల్లు కల్పించాలన్నది మన జగనన్న ప్రభుత్వ లక్ష్యం
-
ఏది నిజం?: చూడు బాబూ... ఇవిగో ఇళ్లు.. కలలోనైనా ఇది ఊహించారా?
72 ఏళ్ల వయసు. 45 ఏళ్ల రాజకీయ జీవితం. 14 ఏళ్ల ముఖ్యమంత్రిత్వం. కానీ ప్రజలకు చేసిందేంటి? ఓ సెల్ఫీ ఛాలెంజ్!!. మేం లక్షల ఇళ్లు కట్టాం? మీరెన్ని కట్టారో చెప్పండంటూ ప్రభుత్వానికో సవాలు!!. ఏం... తెలీదా చంద్రబాబు గారూ? ఈ రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదలుండకూడదనే దృఢ సంకల్పంతో ఒకేసారి 30.25 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వటం మీరు కలలోనైనా ఊహించారా?.. మీ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా అందరికీ నీడ కల్పిస్తే బాగుంటుందనే ఆలోచన కూడా రాలేదెందుకు? 30.25 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలివ్వటమే కాక... అందులో 21.25 లక్షల ఇకుపైగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతిచ్చి ఆరంభించటం చరిత్ర ఎరుగని వాస్తవం కాదా? స్థలాలిచ్చి రెండున్నరేళ్లు కూడా తిరక్కుండానే... ఈ నెలాఖరుకల్లా 5 లక్షల మంది ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేస్తున్నారంటే... ఆ గృహ యజమానులంతా మీకెన్ని సెల్ఫీ చాలెంచ్లు విసరాలి? మీ 14 ఏళ్ల పాలనలో కట్టని ఇళ్లు ఈ రెండున్నరేళ్లలోనే పూర్తయ్యాయంటే... మీకు ఇంకా ఈ దౌర్భాగ్యపు రాజకీయాలు అవసరమా? 30.25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు. వీటికోసం 17, 005 వైఎస్సార్, జగనన్న కాలనీల రూపం ఏకంగా ఊళ్లే రూపుదిద్దుకుంటున్నాయి. ఒక్కో ప్లాటూ కనీసం రూ.2.50 లక్షలనుకున్నా ఏకంగా రూ.75 వేల కోట్లు. పైపెచ్చు ఇంటికి రూ.1.8 లక్షల సాయం. ఉచిత ఇసుక, సబ్సిడీ సిమెంటు, మెటీరియల్స్ రూపంలో మరో రూ.55వేలు అదనం. అంటే ప్రతి ఇంటికోసం అందజేస్తున్న సాయం రూ.2.35 లక్షలు. అంటే 70వేల కోట్లకు పైనే. ఇవికాక ఈ కాలనీల మౌలిక సదుపాయాల కోసం దశలవారీగా పెడుతున్న ఖర్చు ఏకంగా రూ.33వేల కోట్లు. అంటే మొత్తంగా ఈ గృహ యజ్ఞం కోసం చేస్తున్న ఖర్చు ఏకంగా 1.78 లక్షల కోట్లు. ఇంతటి బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకోవాలంటే... అందరికీ నిలువ నీడ కల్పించాలన్న ఆశయం ఎంత బలంగా ఉండాలి? వాస్తవరూపం దాలుస్తున్న ఆ ఆశయబలం ముందు మీ జిత్తులమారి రాజకీయాలు సరితూగుతాయనే అనుకుంటున్నారా? విజయవాడ రూరల్ మండలంలో జక్కంపూడినే తీసుకుందాం. అక్కడ పూరి గుడిసెల్లో తలదాచుకుంటున్న గిరిజన కుటుంబాలు... వర్షం పడితే కొండ మీద నుంచి గుడిసెల్లోకి పారే వరద నీరు... దోమలు, కీటకాలు, తేళ్లు, పాముల సంచారంతో బిక్కు బిక్కుమంటూ గడిపే కుటుంబాలు... ఇవన్నీ చంద్రబాబు నాయుడి పాలనలో అక్కడి వారందరికీ అనుభవం. అసలు అలాంటి ప్రాంతమొకటి ఉన్నదని, అక్కడి గిరిజన కుటుంబాలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాయనే విషయమే నారా వారి దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు అక్కడో ఊరు రూపుదిద్దుకుంటోంది. ఎందుకంటే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాగానే... ఇళ్ల నిర్మాణానికి అనుగుణంగా ఆ ప్రాంతాన్ని చదును చేసి, వరద ముప్పు లేకుండా తీర్చిదిద్దింది. ఎన్నో ఏళ్లుగా అక్కడ ఉంటున్నవారికి స్థలాలు ఇవ్వడంతో పాటు ఒక్క రూపాయి కూడా భారం మోపకుండా ప్రభుత్వమే పూర్తిగా ఇళ్లను నిర్మించి ఇచ్చింది. తమ బతుకు చిత్రాన్ని ముఖ్యమంత్రి జగన్ మార్చేశారని చెబుతున్న రోజు కూలీ తలుపుల కవితలాంటి స్థానికుల భావోద్వేగం ముందు బాబు సెల్ఫీలు ఎన్ని సరితూగుతాయి? షమీ కుటుంబంలో సంబరం షేక్ షమీ భర్త రసూల్ కూలి పనులు చేస్తాడు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నివసిస్తున్న ఈ కుటుంబం ఇంటద్దె కోసం నెలకు రూ.3 వేలు చెల్లిస్తోంది. రసూల్ సంపాదన ఇంటద్దె, ముగ్గురు పిల్లల పోషణకు చాలక నానా అవస్థలూ తప్పడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పసుమర్రు వద్ద వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరైంది. సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే రసూల్ కూలి పనులు మానాలి. అందుకని ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇచ్చే ఆప్షన్‌ను ఎంచుకున్నారు. ప్రస్తుతం స్లాబ్ దశ పూర్తయింది. త్వరలో ఆ కుటుంబం సొంతింట్లోకి మారనుంది. ఎలాంటి ప్రయాస లేకుండా తమకు స్థలం, ఇల్లు వచ్చిందని చెబుతున్న షమీ సంతోషం ముందు... చంద్రబాబు రాజకీయాలు ఎన్నయినా దిగదుడుపే కదా? లేఅవుట్‌కు వెళ్లి సొంతింటిని చూసుకున్నప్పుడు ఒక్కోసారి ఇదంతా కలేమో అనిపిస్తుందని భావోద్వేగంతో చెబుతుంది షమీ. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ కర్నూలు జిల్లా నందవరం మండలం కొత్త కైరవాడి గ్రామానికి చెందిన కురువ సరోజమ్మ చాలా ఏళ్లుగా గుడిసెలోనే జీవిస్తోంది. వ్యవసాయ కూలీ పనులకు వెళ్లే సరోజమ్మ గతంలో చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నా సొంతింటి కల నెరవేరలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అందించింది. ఇటీవలే సొంతింట్లోకి మారారు. ‘అద్దె కట్టుకునే స్థోమత లేక చాలా ఏళ్లు గుడిసెలోనే ఉన్నాం. వర్షాలకు తడుస్తూ, చలికి వణుకుతూ ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాం. భగవంతుడు మా మొర ఆలకించాడు. అందుకే సీఎం జగన్ ఇళ్ల పథకం ప్రవేశపెట్టారు. ఈరోజు దర్జాగా సొంతింట్లో ఉంటున్నాం’ అంటున్న సరోజమ్మ ఆనందాన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదేమో!!. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఏకంగా 30.25 లక్షల మంది పేద మహిళలకు 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. అసలింతటి విలువైన స్థలాన్ని ప్రజలకు అందించటమే ఓ చరిత్ర. వేరెవరైనా అయితే అంతమందికి స్థలాలిచ్చామని ఘనంగా ప్రచారం చేసుకోవటంతో పాటు... అక్కడితో వదిలిపెట్టేసేవారు. కానీ వై.ఎస్.జగన్ ఓ అడుగు ముందుకేశారు. స్థలాలివ్వటంతో సరిపెట్టకుండా వెనువెంటనే దశలవారీగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం 21.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. సొంతింటి ద్వారా ఒకో పేదింటి అక్క చెల్లెమ్మల చేతికి రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే స్థిరాస్తి అందుతోంది. తద్వారా రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల మేర సంపద సృష్టి జరుగుతోంది. ఇటు ఇళ్ల నిర్మాణం.. అటు సదుపాయాలు రెండు దశల్లో 21.25 లక్షలకుపైగా (టిడ్కో ఇళ్లతో కలిపి) గృహ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. 20.28 లక్షల ఇళ్ల నిర్మాణాలు (95 శాతం) వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే 3,37,631 గృహ నిర్మాణాలు పూర్తయి గృహ ప్రవేశాలు జరిగాయి. మరో 1.27 లక్షల ఇళ్లు పైకప్పు, ఆపై దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటి నిర్మాణం ఈ నెలాఖర్లోగా పూర్తయి... వారూ గృహ ప్రవేశాలకు సిద్ధమవుతున్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 28,377, విజయనగరంలో 27,895, శ్రీకాకుళంలో 23,611 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 2020 డిసెంబర్లో ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరుసటి ఏడాది నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. రెండున్నరేళ్ల వ్యవధిలో ఐదు లక్షల వరకూ ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయి. ఒకవైపు ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతూనే మరోవైపు కనీస సదుపాయాల కల్పన పనులను ప్రభుత్వం కొనసాగిస్తోంది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు చకచకా కరెంట్, నీటి సరఫరా కనెక్షన్లను సమకూరుస్తోంది. ప్రభుత్వమే నిర్మించి ఇస్తోంది ప్రభుత్వం ఉచితంగా స్థలాన్ని అందించడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు, తక్కువ ధరలకు నిర్మాణ సామగ్రి సమకూరుస్తుండగా కొందరు నిరుపేద లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి సంకోచించారు. దీంతో వీరి కోసం ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇచ్చే ఆప్షన్–3ని ప్రవేశపెట్టారు. 3.27 లక్షల మంది లబ్ధిదారులు ఈ ఆప్షన్–3 ఎంచుకున్నారు. లబ్ధిదారులను గ్రూపులుగా చేసి, వారికి లాభాపేక్ష లేని నిర్మాణ సంస్థలను ఎంపిక చేసి అనుసంధానించడం ద్వారా ఆప్షన్–3 ఇళ్లను నిర్మిస్తున్నారు. 3.03 లక్షల ఇళ్లు పునాది, ఆపై దశలో నిర్మాణంలో ఉన్నాయి. 1,923 ఇళ్లు లింటెల్ లెవెల్, 12,252 ఇళ్లు స్లాబ్ దశలో నిర్మాణంలో ఉన్నాయి. షీర్ వాల్ టెక్నాలజీతో చకచకా నా భర్త హోల్‌సేల్ మెడికల్ షాపులో సేల్స్‌మెన్‌గా చేస్తారు. చాలా ఏళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. గతంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక వెంటనే స్థలం మంజూరు చేయడంతో పాటు ఇంటి నిర్మాణానికి అనుమతులిచ్చారు. నా భర్త పనిచేసే చోట పెద్దగా సెలవులివ్వరు. నేను ఇంటి వద్ద చిన్న వ్యాపారం చేస్తుంటా. మాకున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇవ్వాలని కోరాం. షీర్వాల్ టెక్నాలజీ విధానంలో మా ఇంటిని నిర్మిస్తున్నారు. స్లాబ్ అయిపోయింది. వేగంగా ఇంటి నిర్మాణం పూర్తవుతోంది. ఈ జన్మకు సొంతిల్లు అనేది ఉంటుందో ఉండదోనని ఆవేదన చెందేవాళ్లం. ముఖ్యమంత్రి జగన్ మా కలను నెరవేర్చారు. నా బిడ్డ చదువు కోసం అమ్మ ఒడి కింద సాయం కూడా అందిస్తున్నారు. ఇంకా పలు రకాలుగా ప్రభుత్వం మాకు అండగా నిలుస్తోంది. – జి.శోభారాణి, ఆప్షన్–3 లబ్ధిదారురాలు, అమలాపురం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వివక్ష లేకుండా మంజూరు గత ఏడాది డిసెంబర్ 15న ప్రభుత్వం ఇచ్చిన సొంతింటికి మారాం. కరెంట్, నీటి కనెక్షన్.. ఇలా అన్ని వసతులనూ కల్పించారు. వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన నేను గత ప్రభుత్వంలో ఇంటి పట్టా కోసం దరఖాస్తు చేసుకున్నా టీడీపీ సానుభూతిపరులకే ఇచ్చారు తప్ప రాజకీయాలతో సంబంధం లేని మాకెవ్వరికీ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కులం, మతం, పార్టీలు చూడకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్థలం మంజూరు చేసింది. ఇంటిని కూడా నిర్మిస్తున్నారు. – ఎం.హరిత, ఆరూరు ఎస్టీ కాలనీ, నిండ్ర మండలం, చిత్తూరు జిల్లా అంతా కలలా.. ఆర్నెల్లలోనే నాకు 11 ఏళ్ల క్రితం పెళ్లయింది. అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. వడ్రంగి పని చేసే నా భర్త సంపాదనతో కుటుంబ పోషణే భారంగా ఉండేది. గత ప్రభుత్వ హయాంలో తహశీల్దార్ ఆఫీస్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఇంటి స్థలం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక వలంటీర్ ఇంటి వద్దకే వచ్చి దరఖాస్తు తీసుకున్నారు. కొద్ది రోజులకే స్థలం మంజూరైంది. ఆర్నెల్లలో సొంతిల్లు కట్టుకున్నాం. అంతా కలలా ఉంది. సొంతింట్లో ఉంటున్నామంటే నాకే నమ్మకం కలగటం లేదు. – నాగేశ్వరమ్మ, శనివారపుపేట జగనన్నకాలనీ ఏలూరు రూ.9 లక్షల విలువైన స్థలం ఇచ్చారు మా గ్రామం జాతీయ రహదారి 26ని అనుకుని ఉండటంతో సెంట్ స్థలం రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షలు పలుకుతోంది. అంత విలువైన స్థలాన్ని ప్రభుత్వం మాకు ఉచితంగా ఇచ్చింది. నిర్మాణం పూర్తవడంతో గత ఫిబ్రవరిలో గృహ ప్రవేశం చేసి సొంతింట్లో ఉంటున్నాం. – బోడసింగి సీత, బోడసింగి పేట గ్రామం, బొండపల్లి మండలం, విజయనగరం జిల్లా -
జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ. 32 కోట్లు ఖర్చు
-
ఇళ్ల నిర్మాణం పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
-
రంగనాథ్ అన్న చాలా అద్భుతంగా చేశారు: సీఎం వైఎస్ జగన్
-
ఒక్కో మహిళా చేతిలో రూ.4 లక్షలు నుంచి 10 లక్షలు..
-
నా పులివెందులపైనే కుట్ర చేశాడు: సీఎం వైఎస్ జగన్
-
జగనన్న కాలనీలో గృహప్రవేశం
సాక్షి, పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరు మండలంలోని యర్రగుంటపల్లె లే అవుట్‌లోని జగనన్న కాలనీలో ఒక లబ్ధిదారు గృహప్రవేశం చేశారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’లో భాగంగా పీలేరు పట్టణానికి చెందిన రెడ్డిరాణి, రెడ్డీశ్వర్‌రెడ్డి దంపతులకు ఇల్లు మంజూరైంది. స్థానిక తిరుపతి రోడ్డు మార్గంలోని జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం చేపట్టి 2 నెలల్లో పూర్తిచేశారు. ఆదివారం వైఎస్సార్ సీపీ మండల నాయకుడు కంభం సతీష్‌రెడ్డి చేతుల మీదుగా గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ రెడ్డిరాణి, రెడ్డీశ్వర్రెడ్డిలను ఆదర్శంగా తీసుకుని మిగిలిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు జగన్మోహన్రెడ్డి, హబీబ్‌బాషా, ఎంపీటీసీ సభ్యుడు అమరనాథరెడ్డి, నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, ఉదయ్‌కుమార్, వినోద్‌కుమార్, భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: కేటాయింపులకు లోబడే ప్రాజెక్ట్‌ల నిర్మాణం: మంత్రి అనిల్ ఏపీ: 2008 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ సొంతింటి కల నెరవేరింది ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని మాకు సొంతింటి కల నెరవేరింది. కొన్నేళ్లుగా సొంతిళ్లు లేకపోవడంతో అద్దె ఇంట్లో ఉంటూ ఇబ్బందులు ఎదుర్కొన్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో భాగంగా మాకు ఇల్లు మంజూరైంది. జగనన్న కాలనీలో మా ఇంట్లోకి గృహప్రవేశం చేయడం చాలా సంతోషంగా ఉంది. – రెడ్డిరాణి -
‘అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం’
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని మంత్రి శ్రీరంగనాథ రాజు స్పష్టం చేశారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు, జగనన్న కాలనీలపై మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సాఆర్ జగనన్న కాలనీలను .. మోడల్ కాలనీలుగా తయారు చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా, ఏపీలో రూ.33 వేల కోట్లతో మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే, ఈపథకంలో అర్హులై ఉండి కూడా.. ఇంటిపట్టా రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏపీలోని ప్రతి గ్రామంలో పార్టీల కతీతంగా, ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చదవండి: ‘‘స్పందన"పై కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ -
‘ఏపీలో మరో 17వేల జగనన్న కాలనీలు రాబోతున్నాయి’
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌లో మరో 17 వేల జగనన్న కాలనీలు రాబోతున్నాయని మంత్రి శ్రీ రంగనాథ రాజు తెలిపారు. పేదలందరికీ ఇళ్లు, జగనన్న కాలనీలపై మంత్రి రంగనాథరాజు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి విడతలో విజయనగరం జిల్లాలో 98వేల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లోని ప్రతి కుటుంబంలో ఆర్ధికవృద్ధి పెరుగుతుందని, పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇల్లు మంజూరు అవుతాయని భరోసానిచ్చారు. చదవండి: ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాకు సాగునీరు భూకబ్జాలో కొత్త కోణం: దళితుల భూమి వదల్లేదు -
YS Jagan: ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం..
ఎకానమీకి బూస్ట్... కోవిడ్ సమయంలో ఈ ఇళ్ల నిర్మాణం ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది. ఎందుకంటే కార్మికులకు సొంత ఇళ్ల వద్దే పెద్ద ఎత్తున ఉపాధి దొరుకుతుంది. కార్పెంటర్లు, ప్లంబర్లు లాంటి రకరకాల వృత్తుల వారికి దీర్ఘకాలం ఉపాధి లభిస్తుంది. స్టీల్, సిమెంట్ తదితర గృహ నిర్మాణ సామగ్రి కొనుగోలు చేయడం వల్ల వ్యాపార లావాదేవీలు సజావుగా కొనసాగి ఎకానమీ బూస్ట్ అవుతుంది. కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యం ఇవ్వాలి. ఇళ్ల నిర్మాణంలో లెవలింగ్ చాలా ముఖ్యం. దాదాపు 1.95 లక్షల ప్లాట్లకు ఈ సమస్య ఉంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ – జగనన్న కాలనీల్లో జూన్ 1వ తేదీన తొలిదశ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో ఇళ్ల నిర్మాణ కార్యకలాపాలు చేపట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థకు వృద్ధి చేకూర్చడమే కాకుండా కార్మికులకు పెద్ద ఎత్తున పని దొరుకుతుందని.. స్టీల్, సిమెంట్ ఇతర మెటీరియల్ కొనుగోళ్లతో వ్యాపార లావాదేవీలు సాఫీగా కొనసాగుతాయని సీఎం పేర్కొన్నారు. కర్ఫ్యూ సమయంలోనూ ఈ పనులేవీ ఆగకూడదని, మధ్యాహ్నం 12 వరకు యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించాలని సూచించారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’, వైఎస్సార్–జగనన్న కాలనీల్లో వసతుల కల్పన, టిడ్కో ఇళ్ల నిర్మాణాలపై సీఎం బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల పనులేవీ ఆగకూడదు.. జగనన్న కాలనీలలో జూన్ 1న ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి. ఆ మేరకు ఈనెల 25 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆ పనులేవీ ఆగకూడదు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు యథావిథిగా కార్యకలాపాలు కొనసాగించాలి. ఇళ్ల నిర్మాణానికి నీరు, విద్యుత్ కీలకం కాబట్టి వెంటనే ఆ ఏర్పాట్లు చేసుకోవాలి. మోడల్‌హౌస్ తప్పనిసరి.. ప్రతి లేఅవుట్లో తప్పనిసరిగా ఒక మోడల్ హౌస్ నిర్మించి సమగ్ర నివేదిక తెప్పించుకోవాలి. ఎక్కడైనా నిర్మాణ వ్యయం అంచనాను మించి పోయిందా? ఇంకా ఎక్కడైనా వ్యయాన్ని నియంత్రించవచ్చా? ఇంకా బాగా ఇంటి నిర్మాణం ఎలా చేయవచ్చు..? లాంటి అంశాలను ఆ నివేదిక ఆధారంగా సమీక్షించాలి. సొంతంగా కట్టుకుంటే మెటీరియల్.. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో స్టీల్ వినియోగం తగ్గి రేట్లలో తేడా వచ్చే వీలుంది. నిజానికి స్టీల్ ఫ్యాక్టరీలు ఆక్సిజన్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నాయి కాబట్టి ఉత్పత్తి ఆగదు. మనకు 7.50 లక్షల టన్నుల స్టీల్ కావాలి. స్టీల్ కంపెనీలతో ప్రత్యేకంగా మాట్లాడండి. ఎవరైనా సొంతంగా ఇల్లు నిర్మించుకుంటామంటే కాదనవద్దు. వారికి కావాల్సిన మెటీరియల్ తప్పనిసరిగా అందించాలి. అన్ని వసతులు ఉండాలి.. కేవలం ఇళ్లు నిర్మించడమే కాదు. తగిన మౌలిక వసతులు కూడా కల్పించాలి. లేఅవుట్ పక్కాగా ఉండాలి. సీసీ రోడ్లు, భూగర్భ సీసీ డ్రెయిన్లు, నీటి సరఫరా (జేజేఎం), విద్యుదీకరణ, ఇంటర్నెట్ లాంటివి మౌలిక వసతుల్లో ముఖ్యమైన కాంపోనెంట్స్. కరెంటు, నీటి సరఫరాతో పాటు రోడ్లు కూడా నిర్మించాలి. అవి లేకపోతే ఆ ఇళ్లలోకి ఎవరూ రారు. భూగర్భ కేబుల్ వ్యవస్థ.. భవిష్యత్తులో అంతా భూగర్భ కేబుల్ వ్యవస్థే. ఒక్కసారి వేసిన తర్వాత పెద్దగా సమస్యలు కూడా ఉండవు. నీటి పైపులైన్లు, విద్యుత్ కేబుళ్లు, ఇతర కేబుళ్లు కూడా భవిష్యత్తులో పూర్తిగా భూగర్భంలోనే వేయబోతున్నారు. ఆ పనులు చేసేటప్పుడు లోతు, నీరు, విద్యుత్, ఇంటర్నెట్ కేబుళ్ల మధ్య దూరం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త పడాలి. కేంద్రాన్ని అదనపు నిధులు కోరదాం.. ఈ స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా నిధులు కోరదాం. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో కేంద్రం ఎలాగూ వాటా ఇస్తోంది. ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో ఇళ్లు నిర్మిస్తోంది కాబట్టి అదనపు నిధుల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేద్దాం. టిడ్కో ఇళ్లపై పెయింటింగ్స్ తప్పనిసరిగా వేయాలి. వాటిని అన్ని వసతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. ఏడాదిలో ఇళ్లు పూర్తి రాష్ట్రంలో చేపట్టిన వివిధ ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల వివరాలపై సమావేశంలో అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వైఎస్సార్ అర్బన్–బీఎల్సీ తొలి దశ కింద మొత్తం 15,60,227 ఇళ్లు మంజూరు కాగా కోర్టు వివాదాల్లో 71,502 ఇళ్లు ఉన్నాయని, అందువల్ల వాటికి ప్రత్యామ్నాయం కోరుతూ లేఖ రాసినట్లు వెల్లడించారు. మిగిలిన 14,88,725 ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు మంజూరు ప్రక్రియ కూడా పూర్తి చేశామని తెలిపారు. ఇప్పటికే 13,71,592 ఇళ్లకు సంబంధించి వెబ్సైట్లో మ్యాపింగ్ జరిగిందని వివరించారు. ఒక లే అవుట్లో పనులన్నీ ఒకే కంపెనీకి అప్పగిస్తే సమన్వయ లోపం, డూప్లికేషన్‌కు తావు ఉండదని అధికారులు ప్రతిపాదించారు. 81,040 టిడ్కో ఇళ్లు 90 శాతం పూర్తి జగనన్న లేఅవుట్లలో పనులు ఈ జూన్‌లో మొదలు పెట్టి సెప్టెంబరు నాటికి బేస్మెంట్, డిసెంబరు నాటికి గోడల నిర్మాణాలు, వచ్చే ఏడాది జూన్ నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. టిడ్కో ఇళ్లలో 81,040 దాదాపు పూర్తయ్యే దశ (90 శాతం పనులు)లో ఉండగా మరో 71,448 ఇళ్లు 75 శాతం పూర్తయ్యాయని చెప్పారు. సమీక్షలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ నారాయణ భరత్‌గుప్తాతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల నిర్మాణం
వైఎస్సార్ జగనన్న కాలనీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉండేలా చూడాలి. రోడ్ల నిర్మాణం జనాభాకు అనుగుణంగా ఉండాలి. ఒకసారి అన్ని లేఅవుట్లను మళ్లీ పరిశీలించి అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలి. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. నిధుల కొరత లేకుండా చూసుకుంటూ, వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి. ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న కాలనీలు ఆదర్శంగా ఉండాలే తప్ప, ఎట్టి పరిస్థితుల్లో మురికి వాడలుగా మారకూడదని సీఎం వైఎస్ జగన్ అధికారులకు స్పష్టం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదలకు ఇళ్లు ఇస్తున్నామని, అవి సౌకర్యవంతంగా ఉండాలని చెప్పారు. కాలనీల సుందరీకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రతి లేఅవు ట్ను మళ్లీ పరిశీలించి అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. పేదలకు ఇళ్ల నిర్మాణంపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సకాలంలో నిధులు విడుదలయ్యేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఏయే సమయాల్లో ఏ మేరకు నిధులు విడుదల చేయాలన్న దానిపై ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇందువల్ల పేదల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా ముందుకు సాగుతాయని చెప్పారు. లబ్ధిదారులందరితో ఆప్షన్లు తీసుకోవాలి ►తొలి విడతలో దాదాపు 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. మూడు ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఇప్పటికే 83 శాతం మంది లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నందున, మిగతా వారి నుంచి కూడా వెంటనే ఆప్షన్లు స్వీకరించాలి. ►3 ఆప్షన్లలో లబ్ధిదారులు ఏ ఆప్షన్ ఎంచుకున్నా, వారికి సబ్సిడీపై సిమెంట్, స్టీల్ అందించాలి. బయట మార్కెట్లో కన్నా తక్కువ ధరకే లభిస్తున్నందన ఆ అవకాశం అందరికీ వర్తింపచేయాలి. సామగ్రి అందరికీ అందుబాటులో ఉంచాలి. ►దీనివల్ల తామే ఇళ్లు కట్టుకుంటామంటూ ఆప్షన్ ఎంచుకున్న వారికి లబ్ధి చేకూరుతుంది. ఏ ఆప్షన్ ఎంపిక చేసుకున్నా, వారికి తక్కువ ధరలకు సామగ్రి లభ్యం అయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. దీనివల్ల లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. ►కాలనీల్లో జనాభాకు తగినట్టుగా రోడ్లు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు ఉండాలి. కాలనీల డిజైనింగ్, మౌలిక సదుపాయాల విషయంలో ఇంకా ఏవైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటే వెంటనే ఆ పనులు పూర్తి చేయాలి. మంచి మొక్కలు నాటాలి ►వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ప్రతి 2 వేల జనాభాకు అంగన్వాడీ కేంద్రం ఉండాలి. 1500 నుంచి 5 వేల ఇళ్లకు లైబ్రరీ అందుబాటులో ఉండాలి. పార్కులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ►కాలనీల్లో మొక్కలు నాటే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఏవంటే అవి కాకుండా ఆహ్లాదం, ఆరోగ్యాన్ని అందించే మొక్కలను నాటాలి. మంచి వృక్ష జాతులను ఎంచుకోవాలి. ఇంటి ముందు నుంచి వీధి రోడ్లు, కాలనీ ప్రధాన రోడ్ల వరకు మొక్కలను నాటడానికి మార్కింగ్ వేసుకోవాలి. ►అన్ని ఇళ్లను జియో ట్యాగింగ్ చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. సమీక్షలో మంత్రులు బొత్స, చెరుకువాడ, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు. మధ్యతరగతి ప్రజల కాలనీల డిజైన్లు పరీశీలన పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి ప్రజలకు సరసమైన ధరలకు ప్లాట్లు ఇవ్వడం ద్వారా ఏర్పాటు కానున్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలన్న దానిపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా కాలనీల డిజైన్లను ఆయన పరీశీలించారు. రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలనీల్లో పారిశుధ్యం, పరిశుభ్రత విషయంలో ఉత్తమ విధానాలను అనుసరించాలని సూచించారు. -
చరిత్రలో లేని విధంగా ఇళ్లు నిర్మాణం : సీఎం జగన్
సాక్షి, అమరావతి: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదలకు ఇళ్లు ఇస్తున్నామని.. సౌకర్యవంతంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు. వైఎస్సార్ జగనన్న కాలనీలు ఆదర్శంగా ఉండాలే తప్ప, మురికివాడలుగా మారకూడదని స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సకాలంలో నిధులు విడుదలయ్యేలా కార్యాచరణ వేసుకోవాలని సీఎం తెలిపారు. సుందరీకరణపై ప్రత్యేక శ్రద్ద పెట్టండి, ప్రతీ ఒక్క లేఔట్‌ను రీవిజిట్ చేసి దానికి తగిన విధంగా అందంగా, అహ్లాదంగా తీర్చిదిద్దాలని చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు, కాలనీల్లో కల్పించనున్న మౌలిక సదుపాయాలపై సమగ్రంగా సమీక్షించారు. మౌలిక సదుపాయాల విషయంలో పలు సూచనలు చేశారు. 15 లక్షల ఇళ్ల నిర్మాణం ఇళ్ల నిర్మాణానికి ఏయే సమయాల్లో ఎంత నిధులు విడుదలచేయాలన్నదానిపై ఒక ప్రణాళిక వేయాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనివల్ల పేదలకు ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా ముందుకు సాగుతాయని పేర్కొన్నారు. తొలి విడతలో దాదాపు 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మూడు ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఇప్పటికి 83 శాతం లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. మిగతా వారినుంచి కూడా వెంటనే ఆప్షన్లు స్వీకరించాలని సీఎం తెలిపారు. మూడు ఆప్షన్లలో ఏ ఆప్షన్ ఎంచుకున్నా.. లబ్ధిదారుకు రాయితీపై సిమెంటు, స్టీల్‌ను అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిర్మాణ సామగ్రి కూడా అందరికీ అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. మంచి జీవన ప్రమాణాలు ఉండాలి అన్ని ఇళ్లనూ జియో ట్యాగింగ్ చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎక్కడా నిధుల కొరత లేకుండా చూడాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని, వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందాలని ఆకాంక్షించారు. రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, పార్క్‌లు ఇతరత్రా మౌలిక సదుపాయాలు ఉండాలని స్పష్టం చేశారు. కొత్తగా నిర్మాణం కానున్న కాలనీల్లో ప్రతి 2 వేల జనాభాకు అంగన్వాడీ ఉండాలని, ప్రతి 1,500 నుంచి 5వేల ఇళ్లకు గ్రంథాలయం అందుబాటులో ఉండాలని తెలిపారు. పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి ప్రజలకు సరసమైన ధరలకు ప్లాట్లు ఇవ్వడం ద్వారా ఏర్పాటు కానున్న కాలనీల్లో కూడా మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలనే అంశంపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా కాలనీల డిజైన్లను సీఎం పరిశీలించారు. కాలనీల్లో ఆహ్లాదం ఆరోగ్యం అందించే మొక్కలను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్‌కుమార్ ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రతీప్ కుమార్, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, స్టేట్ హౌజింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: ప్లాంట్‌పై అసెంబ్లీ తీర్మానం చేస్తాం: సీఎం జగన్ ఉన్నత విద్యకు కొత్త రూపు: సీఎం జగన్ -
ఇళ్ల స్థలాల మంజూరు నిరంతర ప్రక్రియ
30,06,673 ఇళ్ల స్థలాల పట్టాలకు గాను ఇప్పటి వరకు 26,21,049 పట్టాల పంపిణీ పూర్తి చేశారు. అంటే 87.17 శాతం పట్టాల పంపిణీ పూర్తి అయింది. ప్రత్యేకంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఏకంగా 90.28 శాతం పట్టాల పంపిణీ పూర్తయింది. మిగిలిన వాటిని రెండు మూడు రోజుల్లో పంపిణీ చేయాలి. సాక్షి, అమరావతి: ఇళ్ల స్థలాల పట్టాల కేటాయింపు, పంపిణీ అన్నది నిరంతర కార్యక్రమం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దీనిని నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ఇంటి స్థలం పట్టా కోసం దరఖాస్తు అందుకున్న రెండు మూడు వారాల్లో భౌతిక తనిఖీ, అర్హతల పరిశీలన, సోషల్ ఆడిట్ ప్రక్రియనంతా పూర్తి చేయాల్సిన బాధ్యత వలంటీర్, గ్రామ సచివాలయ సిబ్బందిదేనని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన వారు అర్హులని తేలితే కచ్చితంగా 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టా ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ పురోగతితో పాటు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకుంటున్న చర్యలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సామాజిక తనిఖీల ద్వారా లబ్ధిదారులను గుర్తించాలన్నారు. నిర్మాణాల్లో ఏక రూపత, నాణ్యత కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో కల్పిస్తున్న సదుపాయాలు, వాటి నిర్మాణ రీతులు తదితర అంశాలపై పూర్తి వివరాలను ఆయా కాలనీల వారీగా వేర్వేరుగా నివేదించాలని చెప్పారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పించాలని, ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. డంపింగ్ యార్డుల్లో బయో మైనింగ్ చేయాలని, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను మొదలు పెట్టాలని ఆయన సూచించారు. ఇళ్ల పట్టాల పంపిణీపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మౌలిక సదుపాయాలపై డీపీఆర్ ► వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. మార్చి 31 నాటికి ఈ కాలనీల్లో కల్పించే మౌలిక సదుపాయాలకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేస్తామని తెలిపారు. ► వివిధ ప్రభుత్వ శాఖలు ఇందులో భాగస్వాములవుతాయని చెప్పారు. కాలనీల్లో జనాభాను అనుసరించి అంగన్వాడీ కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్లు, బస్టాపులు తదితర నిర్మాణాలపై అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. ► ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
90 రోజుల్లో పట్టా అందించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసిన వ్యక్తి అర్హుడని తేలితే 90 రోజుల్లోగా ఇంటి స్థలం పట్టా అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇంటి పట్టా కోసం దరఖాస్తు అందుకున్న తొలి 12 రోజుల్లో వలంటీర్, గ్రామ సచివాలయ సిబ్బంది భౌతికంగా వెరిఫికేషన్ పూర్తి చేయాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 30,06,673 ఇళ్లపట్టాలకు గానూ 26,21,049 పట్టల పంపిణీ జరిగిందని, మిగిలిన వాటిని కూడా రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తంగా 87.17 శాతం పట్టాల పంపిణీ జరగ్గా, కాలనీల్లో 90.28 శాతం పంపిణీ పూర్తైందన్నారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇళ్ల స్థలాల పట్టాల కేటాయింపు, పంపిణీ అన్నది నిరంతర కార్యక్రమమని, దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి: సీఎం జగన్) ఈ సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ► సోషల్ ఆడిట్ ద్వారా లబ్దిదారులను గుర్తించాలి. ► నిర్మాణాల్లో ఏక రూపత, నాణ్యత కోసం చర్యలు తీసుకోవాలి. ► ఒక కాలనీలో కల్పిస్తున్న సదుపాయాలు, వాటి నిర్మాణ రీతులు తదితర అంశాలపై పూర్తి వివరాలు నివేదించాలి. ► వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పించాలి. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయండి. ► డంపింగ్ యార్డుల్లో బయో మైనింగ్ చేయాలి. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ మొదలుపెట్టాలి. పనుల పురోగతి: వైయస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకుంటున్న చర్యలను సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. మార్చి 31 నాటికి వాటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వివిధ ప్రభుత్వ శాఖలు అందులో భాగస్వాములవుతాయని అధికారులు తెలిపారు. ఇక సీఎం ఆదేశాల ప్రకారం వైఎస్సార్ జగనన్న కాలనీల్లో జనాభాను అనుసరించి అంగన్వాడీ కేంద్రాలు, వైఎస్సార్ క్లినిక్కులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్లు, బస్టాపులు తదితర నిర్మాణాలపై అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి వై.శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (చదవండి: ఇళ్ల పట్టాల పంపీణీలో మనమే నంబర్1) -
ఊరూరా ఇంటి పట్టాల జాతర
సాక్షి నెట్వర్క్: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఇళ్ల పట్టాలు, టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం 27వ రోజైన బుధవారం ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 30.75 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, టిడ్కో గృహాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుండటంతో అక్కచెల్లెమ్మల ఆనందం అవధులు దాటుతోంది. ఎక్కడికక్కడ లబ్ధిదారులు తమకు కేటాయించిన స్థలాలను చూసుకునేందుకు లేఅవుట్ల వద్దకు బంధుమిత్రులతో కలిసి వస్తుండటంతో అక్కడ కోలాహలం జాతరను తలపిస్తోంది. తమకు కేటాయించిన స్థలాల వద్ద ఎవరికి వారు సెల్ఫీలు దిగుతుండగా.. కొందరైతే పట్టాలు అందుకున్న వెంటనే శంకుస్థాపన చేసుకుంటున్నారు. వైఎస్సార్ జిల్లాలో బుధవారం ఒక్కరోజే 1,818 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు జిల్లాలో 1,03,026 మంది ఇళ్ల పట్టాలు పొందారు. చిత్తూరు జిల్లాలో 58,122 మందికి పట్టాలు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ద్వారకానాథరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, ఎంఎస్ బాబు, నవాజ్ బాషా పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారం 2,396 మంది ఇళ్ల స్థలాలు, 1,077 మంది టిడ్కో ఇళ్ల పత్రాలు అందుకున్నారు. ప్రకాశం జిల్లాలో బుధవారం ఒక్కరోజే 4,973 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా.. ఇప్పటివరకు మొత్తం 70,949 మందికి లబ్ధి కలిగింది. మరో 4,252 మందికి టిడ్కో ఇంటి పత్రాలు అందజేశారు. ఒంగోలు మండలం కరవదిలో జగనన్న కాలనీ వద్ద ముగ్గు వేస్తున్న గ్రామస్తులు గుంటూరు జిల్లాలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ మోపిదేవి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, అన్నాబత్తుని శివకుమార్, కిలారి రోశయ్య పట్టాలను పంపిణీ చేశారు. కృష్ణా జిల్లాలో బుధవారం 651 మంది ఇంటి పట్టాలు అందుకున్నారు. పశి్చమగోదావరి జిల్లాలో 662 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో 318 మందికి పట్టాల పంపిణీ చేయగా.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో బుధవారం 2,263 మంది పట్టాలు అందుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 85,689 మందికి లబ్ధి చేకూరింది. శ్రీకాకుళం జిల్లాలో బుధవారం ఒక్కరోజే 1,187 ఇళ్ల పట్టాలు అందజేయగా.. ఇప్పటివరకు 62 వేల మందికి పైగా లబ్ధి పొందారు. -
సమగ్ర భూ సర్వేలో వైఎస్సార్ జగనన్న కాలనీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేదల కోసం కొత్తగా నిర్మించనున్న వైఎస్సార్ జగనన్న కాలనీలను కూడా సమగ్ర భూ సర్వేలో చేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మ్యాపుల తయారీలో ఈ కాలనీలను పరిగణనలోకి తీసుకోవాలని, ప్రతి ఇంటికీ యూనిక్ ఐడీ నంబరు ఇవ్వాలని సూచించారు. ఒక గ్రామంలో సమగ్ర భూ సర్వే పూర్తయిన తర్వాత సంబంధిత గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమగ్ర భూ సర్వే ప్రక్రియకు సంబంధించి సర్వేయర్ నుంచి జేసీ వరకూ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) లు ఉండాలని, వారు కచ్చితంగా బాధ్యత వహించాలన్నారు. మొబైల్ ట్రిబ్యునల్స్‌పై ఎస్ఓపీలను రూపొందించాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమర్ధత పెంపొందించేందుకు శిక్షణ, పరీక్షలు నిర్వహించాలన్నారు. లంచాలకు తావులేని వ్యవస్థను తెచ్చే ప్రయత్నంలో భాగంగానే సరికొత్త విధానాలని తెలిపారు. సచివాలయ సిబ్బంది సర్వేలో పాల్గొంటున్న సమయంలో రోజూ కనీసం 2 గంటల పాటు ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 30వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. పరీక్షలతో మెరుగైన పనితీరు.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సంబంధిత అంశాల్లో పరిజ్ఞానం, సమర్థత పెంచేందుకు క్రమం తప్పకుండా అవగాహన కార్యక్రమాలు, శిక్షణ, పరీక్షలు నిర్వహించాల్సిందిగా సీఎం సూచించారు. పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యే వరకూ శిక్షణ ఇవ్వడం వల్ల పనితీరులో సమర్థత పెరిగి ప్రజా సమస్యల పరిష్కారంలో మెరుగైన ప్రతిభ కనపరుస్తారన్నారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కార్యాచరణను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పనితీరును గ్రామ సచివాలయాల సిబ్బంది స్వయంగా పరిశీలించి నేర్చుకునేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే సిబ్బంది సందేహాల నివృత్తికి నిపుణులు, సీనియర్ అధికారులతో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 30 వరకూ ఇళ్ల పట్టాల పంపిణీ పొడిగింపు.. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి నేరుగా పట్టా పత్రం అందిస్తున్నామని, ఇంటి స్థలం ఎక్కడుందో చూపిస్తున్నామని దీనికి కొంత సమయం పడుతోందని అధికారులు వివరించారు. లబ్ధిదారులకు సంతృప్తి కలిగేలా కార్యక్రమం కొనసాగాలని, ఇళ్ల పట్టాల పంపిణీని జవనరి నెలాఖరు వరకూ పొడిగించాలని సీఎం సూచించారు. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియని, అర్హులైన వారికి దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా పట్టా ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని సీఎం పేర్కొన్నారు. ఈ విధానం సమర్థంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దఫాలుగా సర్వే సిబ్బందికి శిక్షణ సమగ్ర సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి దఫాలుగా శిక్షణ ఇస్తున్నామని, రెండో స్థాయిలో 92 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని అధికారులు వివరించారు. మిగిలినవారికి అవగాహన కల్పించేలా, పరిజ్ఞానం పెంచేలా శిక్షణ ఇస్తున్నామని, ఫిబ్రవరిలో మూడో స్థాయి పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సీఎం సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, సీఎం ముఖ్య సలహాదారు నీలం సాహ్ని, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఎం.గిరిజా శంకర్, సర్వే, సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్ధ జైన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నెలాఖరు వరకు ఇళ్ల పట్టాల పంపిణీ: సీఎం
సాక్షి, అమరావతి: దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ 90 రోజుల్లోగా పట్టా ఇస్తామని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ విధానం సమర్థవంతంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీని జవనరి నెలాఖరు వరకూ పొడిగించనున్నట్లు తెలిపారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకంపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, సీఎస్ ఆదిత్యనాద్ దాస్, సీఎం ముఖ్య సలహాదారు నీలం సాహ్ని, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఎం గిరిజా శంకర్, సర్వే, సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్ధ జైన్ సహా ఇతర ఉన్నతాధికారులు ఈ సమవేశంలో పాల్గొన్నారు. సర్వే సిబ్బందికి శిక్షణ ఈ సందర్భంగా సమగ్ర సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ‘ఇప్పటికే రెండు స్థాయిల్లో పరీక్షలు నిర్వహించాం.ఇందులో 92శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మిగిలిన వారికి అవగాహన కల్పించేలా, పరిజ్ఞానం పెంచేలా శిక్షణ ఇస్తున్నాం. ఫిబ్రవరిలో మూడో స్థాయి పరీక్షలు నిర్వహిస్తాం’’ అని పేర్కొన్నారు. ఇందుకు స్పందనగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు సంబంధిత అంశాలపై సమర్థతను పెంచడానికి అవగాహన, శిక్షణ, పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. క్రమం తప్పకుండా ఈ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సంబంధిత అంశాల్లో పరిజ్ఞానం, సమర్థత పెంచడమే లక్ష్యం కావాలని దిశా నిర్దేశం చేశారు. అదే విధంగా.. పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యేంతవరకూ వారికి శిక్షణ ఇవ్వడంతో పాటు, సంబంధిత అంశాల్లో పరిజ్ఞానం పెంచేలా ప్రణాళిక ఉండాలని సూచించారు. తద్వారా పనితీరులో సమర్థత కనబరుస్తారని పేర్కొన్నారు. ఇక పేదలకు కొత్తగా నిర్మించనున్న కాలనీలను కూడా సర్వేలో భాగంగా తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ‘‘మ్యాపుల తయారీలో వీటినీ పరిగణలోకి తీసుకోవాలి. కాలనీల్లో ప్రతి ఇంటికీ కూడా యూనిక్ ఐడీ నంబరు ఇవ్వాలి. సర్వేకు గ్రామ సచివాలయ సిబ్బంది వెళ్తున్న సందర్బంలో ప్రతిరోజూ కనీసం 2 గంటల పాటు ప్రజల ఫిర్యాదులు స్వీకరణ, వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాలి’’ అని సూచించారు. రిజిష్ట్రార్ కేంద్రాలుగా సచివాలయాలు గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కార్యాచరణను అధికారులు ముఖ్యమంత్రికి వివరించగా.. ఒక గ్రామంలో సమగ్ర భూ సర్వే పూర్తైన తర్వాత సంబంధిత గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం కావాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లోని సిబ్బంది రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పనితీరును స్వయంగా చూసి నేర్చుకునేలా కార్యాచరణ ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎప్పటికప్పుడు సిబ్బందికి వచ్చే సందేహాలను నివృత్తి చేయడానికి నిపుణులు, సీనియర్ అధికారులతో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. దీనివల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు లేకుండా నిబంధనల ప్రకారం చేసే అవకాశం సిబ్బందికి ఉంటుంది. ఇప్పటికే ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం ఉంది, ఇదికూడా కొనసాగేలా తగిన చర్యలు తీసుకోవాలి’’ అని ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఓపీ సర్వేయరు నుంచి జేసీ వరకూ ఈ ప్రక్రియపై కచ్చితమైన ఎస్ఓపీలు ఉండాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. లంచాలకు తావులేని వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నంలో భాగమే సరికొత్త వ్యవస్థలు అని, మొబైల్ ట్రైబ్యునల్స్‌పైన కూడా ఎస్ఓపీలను తయారుచేయాలని ఆదేశించారు. జనవరి 30 వరకూ ఇళ్ల పట్టాల పంపిణీ పొడిగింపు: సీఎం ఇక ఇళ్లపట్టాలకు సంబంధించి... ప్రతి లబ్ధిదారునికి నేరుగా పట్టా పత్రం అందిస్తున్నామని, తన ఇంటి స్థలం ఎక్కడో చూపిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇందుకు బదులుగా.. లబ్ధిదారులకు సంతృప్తి కలిగించేలా కార్యక్రమం కొనసాగించాలని సీఎం జగన్ సూచించారు. ‘‘ఇళ్ల పట్టాల పంపిణీని జవనరి నెలాఖరు వరకూ పొడిగించాలి. ఇదొక నిరంతర ప్రక్రియ. ఈ విధానం సమర్థవంతంగా కొనసాగాలి. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోండి’ అని ఆదేశించారు. -
‘పట్టా’భిషేకాల కోలాహలం
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇంటి స్థల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన సంబరాలు అక్కచెల్లెమ్మల సంతోషాల మధ్య ఉత్సాహపూరితంగా, కోలాహలంగా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పేదలంతా ఇళ్ల స్థల పట్టాలు తీసుకుంటూ.. దశాబ్దాల నుంచి కలగానే మిగిలిపోయిన సొంతిల్లు సాకారమవుతున్న వేళ ఆనందంతో భూమి పూజల్లో పాల్గొంటున్నారు. శంకుస్థాపనల సందర్భంగా జగనన్న కాలనీలను అరటి పిలకలు, మామిడి తోరణాలతో అలంకరిస్తున్నారు. పట్టాల పంపిణీ, శంకుస్థాపన సందర్భంగా కాలనీలకు వస్తున్న ప్రజాప్రతినిధులకు మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలుకుతున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలో పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన లబ్ధిదారులు 80 శాతం కాలనీల్లో పట్టాల పంపిణీ పూర్తి గత నెల 25వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కొమరగిరి వైఎస్సార్ జగనన్న కాలనీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయగా.. అప్పటినుంచి ప్రతిరోజూ రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా ఈ కార్యక్రమాలు పండుగలా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో సోమవారం నాటికి 21.96 లక్షల మందికి ఇళ్ల స్థలాలు/టిడ్కో ఇళ్ల పంపిణీ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 17,054 వైఎస్సార్ జగనన్న కాలనీలను రూపొందించగా.. 13,595 కాలనీల్లో పట్టాలు పంపిణీ చేశారు. అంటే 80 శాతం కాలనీల్లో పట్టాల పంపిణీ ప్రక్రియ పూర్తయింది. కోర్టు కేసులున్న చోట్ల త్వరగా వాటిని పరిష్కరించి లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వనున్నారు. కోర్టు కేసులు ఉన్నచోట్ల ఎంపికైన 3.79 లక్షల మంది లబ్ధిదారులకు లేఖలు అందజేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో సోమవారం నాటికి 2.95 లక్షల మందికి లేఖలు ఇచ్చారు. మహాక్రతువు ముందుకే.. రాష్ట్రంలో ఇళ్లు్ల లేని పేదలందరికీ వచ్చే మూడేళ్లలో గృహ సౌకర్యం కల్పించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకుని మహా క్రతువుకు శ్రీకారం చుట్టి ప్రజల్లో సంతోషం నింపారు. రాష్ట్రంలో ఏ ఒక్క పేదకూ ఇల్లులేని పరిస్థితి లేకుండా చేయాలని ఉక్కు సంకల్పం పెట్టుకున్న ఆయన ఇళ్ల నిర్మాణాన్ని కూడా స్వల్పకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి సంకల్ప సాధన కోసం అధికార యంత్రాంగం 30.76 లక్షల మందిని ఇళ్ల పట్టాల కోసం ఎంపిక చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,460 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. కొత్తగా దాదాపు అదే సంఖ్యలో కొత్త కాలనీలను ప్రణాళికాబద్ధంగా రూపొందించింది. ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం సకల సౌకర్యాలతో రూపొందించిన 17,054 వైఎస్సార్ జగనన్న కాలనీలు భవిష్యత్‌లో సకల సౌకర్యాలతో కూడిన ప్రణాళికాబద్ధమైన గ్రామాలు, పట్టణాలు, నగరాలుగా విలసిల్లనున్నాయి. సకల సదుపాయాలతో.. కాలనీల్లో చక్కటి రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ సదుపాయాలతోపాటు ఉద్యాన వనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలు తదితరాల కోసం ప్రత్యేకంగా స్థలాలు కేటాయించారు. ఎక్కడా వంకర్లు లేకుండా సరళరేఖల్లా ఇళ్లు ఉండనున్నాయి. కొత్తగా రూపొందించిన వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 24 చోట్ల 5వేలకు పైగా ఇళ్లు రానున్నాయి. ఒక్కో ఇంట్లో సగటున నలుగురు జనాభా లెక్కవేసుకుంటే 24 కాలనీల్లో ఒక్కోచోట కనీసం 20 వేల చొప్పున జనాభా ఉండనున్నారు. విజయనగరం జిల్లా గుంకలాం, తూర్పు గోదావరి జిల్లా కొమరగిరి, గుంటూరు జిల్లా పేరేచెర్ల లాంటి కాలనీల్లో తొమ్మిది వేల పైగా ఇళ్లు రూపుదిద్దుకోనున్నాయి. ఇళ్ల నిర్మాణం పూర్తయి గృహప్రవేశాలు చేసేసరికే ఇవి పట్టణాలు కానున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో అనువైన ప్రాంతాల్లో స్థలాలు కేటాయించడంతోపాటు ఇళ్లు కట్టుకోవడానికి వీలుగా వారికి నచ్చేవిధంగా ఐచ్ఛికాలు ఇవ్వడంతో లబ్ధిదారుల మోముల్లో చెప్పలేనంత సంతోషం కనిపిస్తోంది. వారంతా ఆనందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను వేనోళ్ల ఆశీర్వదిస్తున్నారు. -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని భారతదేశంలో అతిపెద్ద కార్యక్రమంగా నిలిపినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం యలమంచిలిలో ఆయన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'యలమంచిలి నియోజకవర్గంలో 7,200 ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు చేస్తున్న కార్యక్రమాలు అనిర్వచనీయం. ఇలాంటి ముఖ్యమంత్రి మరో 25 సంవత్సరాలు ఉండాలని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలి. సీఎం మహిళా పక్షపాతిగా నిరూపించుకుంటూ వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడుతున్నారు. అవినీతి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు' అని విజయసాయిరెడ్డి అన్నారు. చదవండి: ('పుత్రరత్నం కోసం ఏ ఉన్మాద చర్యకైనా సిద్ధమే') -
'టీడీపీ త్వరలో కనుమరుగవుతుంది'
సాక్షి, విశాఖపట్నం: ప్రతి పేదవాడికి ఇళ్లు ఉండాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. భీమిలి నియోజవర్గం తగరపువలసలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, సరగడం చినఅప్పలనాయుడు, చింతకాయల సన్యాసిపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా జరుగుతుంది. ఒక పైసా అవినీతి లేకుండా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు. చంద్రబాబు మంచి కార్యక్రమాలు చేయడు, చేసే వారికి అడ్డుపడతారు. పార్టీలకు అతీతంగా ఇళ్ల పట్టాలు పంపిణీ జరుగుతంది. ప్రతిపేదవాడికి ఇళ్లు ఉండాలనేది సీఎం జగన్ లక్ష్యం. చదవండి: ('టీడీపీ నేతలు పడగొట్టి బీజేపీపై నెడుతున్నారు') ఇళ్ల పట్టాల పంపిణీ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారు. మతానికి రాజకీయ రంగు పులుముతున్న వ్యక్తి చంద్రబాబు. 40 దేవాలయాలను పడగొట్టిన వ్యక్తి చంద్రబాబు. దేవుళ్ల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. టీడీపీ త్వరలో కనుమరుగవుతుంది. రాబోయే రోజుల్లో టీడీపీ డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు' అని మంత్రి అవంతి పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు ఇళ్ల స్థలమే కాదు ఇళ్లు కూడా కట్టించి ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. అవినీతికి తావులేకుండా ఇళ్లపట్టాల పంపిణీ జరుగుతుంది. టీడీపీ నేతలు పూర్తిగా అవినీతిలో కురుకుపోయారు. పేదవాడి సొంతింటి కలను సీఎం నెరవేరుస్తున్నారు. మహిళా పక్షపాతి సీఎం జగన్' అని విజయసాయిరెడ్డి అన్నారు. -
ఇళ్ల పట్టాల పంపీణీలో మనమే నంబర్1
సంక్షేమం అర్హులందరి పరమవుతోంది. పైరవీలకు చోటులేకుండానే లబ్ధి కలుగుతోంది. సర్కారు ఆదేశిస్తోంది... అధికార యంత్రాంగం పరుగులు తీస్తోంది. లబ్ధిదారుల మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. జిల్లాలో పట్టాల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. కలలో కూడా ఊహించని విధంగా నిలువనీడ కల్పిస్తున్న ప్రభుత్వానికి ప్రతి కుటుంబం మోకరిల్లుతోంది. పథకాల పంపిణీలో ఎప్పుడూ ముందుండే జిల్లా ఈ కార్యక్రమంలోనూ తన స్థానాన్ని పదిల పర్చుకుంది. ప్రస్తుతానికి ఇళ్ల పట్టాల పంపిణీలో మొదటిస్థానంలో నిలిచింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచింది. నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా పేదలకు శాశ్వతంగా ఆవాసాలను కల్పించే పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. జిల్లాలో గత నెల 25న ప్రారంభమైన పట్టాల పంపిణీ కార్యక్రమం, 30న ముఖ్యమంత్రి రాకతో మరింత ఊపందుకొని, ప్రస్తుతం జోరుగా కొనసాగుతోంది. కొన్ని పెద్ద కాలనీలు మినహా, సుమారు 78శాతం జగనన్న కాలనీల్లో పట్టాల పంపిణీ ఇప్పటికే పూర్తయ్యింది. ఎన్నో ఏళ్లుగా నిరుపేదలు కంటున్న కలలను నిజం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఉత్తుర్వుల మేరకు, మంత్రుల సూచనలకు అనుగుణంగా పట్టాల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతోంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యేలు, మంత్రుల చేత పట్టాల పంపి ణీ ఉత్సాహంగా సాగుతోంది. విజయనగరం నియోజకవర్గంలో డిసెంబర్ 30న జరిగిన కార్యక్రమంలో, ముఖ్యమంత్రి వై,ఎస్.జగన్మోహనరెడ్డి పాల్గొని స్వయంగా పట్టాలను పంపిణీ చేయడం ద్వారా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్లలో ఒకటైన గుంకలాం లేఅవుట్లో 12,301 ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలోని ఇతర ప్రజాప్రతినిధులంతా రోజూ ఉత్సాహంగా పట్టాలను పంపిణీ చేస్తూ, పేదల ఆశలను నిజం చేస్తున్నారు. చాలాచోట్ల పట్టాలతోపాటు ఇళ్లను కూడా ప్రభుత్వం మంజూరు చేయడంతో, మరోవైపు లబ్ధిదారులు పునాదులు తవ్వేందుకు కూడా సన్నద్ధమ వుతున్నారు. 40వేల మందికి పంపిణీ పూర్తి పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద జిల్లాలో 72,625 మంది ఇళ్ల పట్టాలు పొందేందుకు అర్హులుగా గుర్తించారు. వీరిలో 4వ తేదీ నాటికి 39,772 మందికి పట్టాలు పంపిణీ చేశారు. కొన్నిచోట్ల జగనన్న కాలనీల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మల్యేలు పట్టాలు పంపిణీ చేస్తుండగా, మరికొన్ని చోట్ల వలంటీర్లే ఇంటింటికీ వెళ్లి మరీ, లబ్ధిదారులకు భద్రంగా పట్టాలు అందజేస్తున్నారు. టిడ్కో ఇళ్లకు సంబంధించి జిల్లాలో 8,048 మందిని అర్హులుగా గుర్తించగా, వీరిలో 5,207 మందికి ఇప్పటికే వాటికి సంబంధించిన పత్రాలను అందజేశారు. 911 కాలనీల్లో పట్టాల పంపిణీ పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద పట్టాల పంపిణీకోసం జిల్లాలో 1164 లేఅవుట్లను రూపొందించి, జగనన్న కాలనీలను అన్ని హంగులతో ఏర్పాటుకు సిద్దం చేయగా, వీటిలో 911 కాలనీల్లో ఇప్పటికే పట్టాల పంపిణీ పూర్తయింది. ఆక్ర మిత స్థలాల రెగ్యులైజషన్, పొజిషన్ పట్టాలకు 25,274 మందిని అర్హులుగా గుర్తించగా, 19,572 మందికి అందజేశారు. కోర్టు కేసుల కారణంగా పెండింగ్‌లో ఉన్న పట్టాల పంపిణీకి సంబంధించి, 47శాతం మందికి ఇప్పటికే లేఖలను అందజేశారు. సుదీర్ఘ నిరీక్షణ తరువాత తమ సొంతింటి కల సాకారం అవుతుండటంతో, లబ్ధిదారుల ఇళ్లలో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టయ్యింది. 20 వరకూ పట్టాల పంపిణీ పట్టాల పంపిణీ కార్యక్రమానికి తొలుత జనవరి 7ను గడువు తేదీగా నిర్ధారించగా తాజాగా 20వ తేదీ వరకు పొడిగిస్తున్న ట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ లోగా శత శాతం ఇళ్ళ పట్టాలు, గృహాల పంపిణీ పూర్తి చేస్తాం. జగనన్న కాలనీల్లో సామాజిక వసతులు కల్పించి, మురికి వాడలు లేని కాలనీలుగా తీర్చి దిద్దుతాం. ముఖ్యమంత్రి ఆశయం మేరకు అన్ని రకాల వసతులను కల్పించి, మోడల్ హౌసింగ్‌ను నిర్మిస్తాం. – డాక్టర్ ఎం.హరిజవహర్ లాల్, జిల్లా కలెక్టర్ రాష్ట్రంలో అతి పెద్దవాటిలో ఒకటైన గుంకలాం లే అవుట్ -
కాలనీల నిర్మాణంలో చెరగని సంతకం
వైఎస్సార్ జగనన్న కాలనీల నిర్మాణంలో మన సంతకం కనిపించాలి. మనం పోయిన తర్వాత కూడా ఈ కాలనీలు ఉంటాయి. మన పేర్లు చిర స్థాయిగా నిలిచిపోతాయి. కాలనీల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండాలి. రోడ్లను వినూత్న రీతిలో నిర్మించాలి. ఎలివేషన్ బాగుండాలి. వీధి దీపాలు, కరెంటు స్తంభాల ఏర్పాటులో కూడా వినూత్న పద్ధతులను అనుసరించాలి. ప్రతి కాలనీ వెలుపల బస్టాప్ ఉండాలి. దీనిని అధునాతనంగా తీర్చిదిద్దాలి. కాలనీ ఎంట్రన్స్ వినూత్న రీతిలో.. పెద్ద పెద్ద లేఅవుట్స్‌లో ఎలా ఉంటాయో.. అలా ఉండాలి. ఒక పద్ధతి ప్రకారం మంచి మొక్కలు నాటాలి. ఈ కాలనీలను మురికి వాడలుగా మార్చే పరిస్థితి తలెత్తకుండా ఈ విషయాలన్నింటిపై కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలి. సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయే గొప్ప కార్యక్రమం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ప్రజలు ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను దీవిస్తున్నారని చెప్పారు. మన సంతకం కనిపించేలా అన్ని సౌకర్యాలతో వైఎస్సార్ జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలు, నాణ్యత అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రతి కలెక్టర్ పేరు చరిత్రలో నిలిచిపోతుందని, అక్కచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం కనిపిస్తోందని చెప్పారు. వారందరి దీవెనలు మీకు లభిస్తాయని, తనతో పాటు మీ అందరికీ ఈ సంతోషం ఉంటుందన్నారు. లబ్ధిదారుకి నేరుగా ఇంటి స్థలం పట్టా అందించడమే కాకుండా, ఆ స్థలం ఎక్కడ ఉందో కూడా వెంటనే చూపిస్తున్నామని.. అందుకే ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభ కార్యక్రమాన్ని ఈ నెల 20వరకు పొడిగిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 39 శాతం ఇళ్ల స్థలాల పంపిణీ పూర్తయిందన్నారు. 17 వేలకు పైగా ఉన్న వైఎస్సార్ జగనన్న కాలనీలకు గాను 9,668 కాలనీల్లో ఇళ్లస్థలాల పంపిణీ జరిగిందని, మిగిలిన వాటికి కూడా ఆయా లేఅవుట్లలోనే ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పారు. పెండింగ్ కేసులు వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. సీఎం జగన్మోహన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు పారదర్శకంగా ప్రక్రియ పాలనలో పారదర్శకతను ఒకస్థాయికి తీసుకెళ్లాం. దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇంటి పట్టా ఇస్తామని చెప్పాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ఈ విషయం కనిపించేలా బోర్డు పెట్టాం. రేషన్ కార్డు 10 రోజుల్లో, పెన్షన్ కార్డు 10 రోజుల్లో, ఆరోగ్యశ్రీ 20 రోజుల్లో, ఇంటి స్థలం పట్టా 90 రోజుల్లో ఇస్తామని చెప్పాం. కలెక్టర్లు నిరీ్ణత సమయంలోగా దరఖాస్తులను పరిశీలించి, అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలి. మనం సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేస్తున్నాం. అర్హులందరికీ తప్పకుండా ఇంటి పట్టా రావాలి. దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి నిబంధనలను చూసుకుంటూ నిర్ణీత కాలంలోగా పట్టా ఇవ్వాలి. లే అవుట్లు – మౌలిక వసతులు లే అవుట్లలో ఇంటి నిర్మాణాలు కొనసాగించడం ఒక కార్యక్రమమైతే, మౌలిక సదుపాయాలు కల్పించడం మరో కార్యక్రమం. రోడ్లు, విద్యుత్, తాగునీరు లాంటి కనీస సదుపాయాలు కల్పించాలి. కాలనీ పరిమాణం బట్టి ఇతర సామాజిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. స్కూళ్లు, అంగన్వాడీలు, పార్కులు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్ లాంటివి రావాలి. కాలనీ పరిమాణం, జనాభాను బట్టి వీటిని ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించి ఎస్వోపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) తయారు చేయాలి. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేసరికి మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలి. ఒక లే అవుట్లో పనులు ప్రారంభించాక అవన్నీ పూర్తి కావాలి. కాలనీలో పనులు మొదలుపెట్టిన తర్వాత అందులో అన్ని ఇళ్లనూ పూర్తి చేయాలి. ఒకవేళ అదనంగా ఇళ్లు మంజూరు చేయాల్సి వస్తే.. వెంటనే ప్రణాళిక రూపొందించుకుని నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుందాం. కలెక్టర్లు సవాల్‌గా తీసుకోవాలి భవిష్యత్ తరాలు మన పేర్లను గుర్తుంచుకునేలా కాలనీల నిర్మాణం జరగాలి. డిజైన్లు, ఇతరత్రా అంశాలపై ఇప్పటికే కొన్ని సూచనలు చేశాను. కలెక్టర్లు దీన్ని సవాల్‌గా తీసుకోవాలి. మీ సమర్థతను చూపించుకునే అవకాశం ఇది. కాస్త ధ్యాస పెట్టగలిగితే మంచి కాలనీలు వస్తాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి వ్యవస్థలను కల్పించడంపై ఇప్పుడే దృష్టి పెట్టాలి. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారుల ఆప్షన్ వెంటనే తీసుకోవాలి. ఆప్షన్లు తీసుకునే కార్యక్రమం 20 నాటికి పూర్తి కావాలి. ఏకకాలంలో మ్యాపింగ్, జియో ట్యాగింగ్ ఎన్ఆర్ఈజీఎస్ (నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్–జాతీయ ఉపాధి హామీ పథకం)కింద లబ్ధిదారులకు జాబ్ కార్డులిచ్చి, వారి పేరుతో బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించాలి. పేమెంట్ల విడుదలకు ఏపీ హౌసింగ్ వెబ్‌సైట్‌ను వినియోగించుకోవాలి. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మ్యాపింగ్, జియోట్యాగింగ్ ఒకేసారి సమాంతరంగా పూర్తి చేయాలి. నీరు, విద్యుత్ ముఖ్యం నీటి సరఫరా, విద్యుత్ చాలా ముఖ్యమైన అంశాలు. వీటికి మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కలెక్టర్లు క్రమం తప్పకుండా సమీక్షలు చేయాలి. కాలనీల్లో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలపై డీపీఆర్‌లు తయారు చేయాలి. చాలా పెద్ద పెద్ద కాలనీలున్నాయి. కొన్నిచోట్ల నగర పంచాయతీలు చేస్తున్నాం. మురుగు నీటిని శుద్ధిచేసే ప్లాంట్ల కోసం కూడా డీపీఆర్‌లు తయారు చేయాలి. ప్రతి కాలనీలో ఒక మోడల్ హౌస్‌ను కట్టండి. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇళ్ల నిర్మాణంలో వినియోగించే మెటీరియల్ నాణ్యత చాలా ముఖ్యం. పేద వాళ్ల నుంచి ఎవరైనా అవినీతికి పాల్పడితే అది క్షమించరాని నేరం. అవినీతి జరిగితే పేదవాళ్ల ఉసురు తగులుతుంది. ప్రతి అధికారికీ కలెక్టర్లు ఈ విషయం తెలియజేయాలి. మనం చేసిన పనుల ద్వారా మనకు సంతృప్తి మిగలాలి. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ఇంట్లో విద్యుత్ సరఫరా కోసం వాడే వైరు, ప్రతి వస్తువు నాణ్యతతో ఉండాలి. ఇళ్ల నిర్మాణం జరుగుతున్న కాలనీ వరకు ఇసుక, ఇతర వస్తువుల సరఫరా జరిగేలా చూడాలి. మెటీరియల్‌కు సంబంధించి 20వ తేదీ నాటికి టెండర్లు పూర్తి చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. పంపిణీ ఆగిన చోట లబ్ధిదారులకు లేఖలు రాయండి ‘గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని, వలంటీర్ల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. వారికి మంచి శిక్షణ ఇవ్వండి. వీరి సేవలను వినియోగించుకోవడంపై ఎస్వోపీ తయారు చేయండి. డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సేవలనూ వినియోగించుకోవాలి. కోర్టు కేసుల వల్ల స్థలాల పంపిణీ ఆగిపోయిన ప్రాంతాల్లో లబి్ధదారుల మనసులో అలజడి ఉంటుంది. వారికి భరోసా కల్పించేలా లేఖలు ఇవ్వాలి. కేసులు పరిష్కారం కాగానే వారికి వెంటనే ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పాలి’ అని సీఎం అన్నారు. సమీక్షలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు నీలంసాహ్ని పాల్గొన్నారు. -
టీడీపీ దుర్మార్గంగా మాట్లాడుతోంది: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: పేదలకు ఉచితంగా ఇళ్లు అందిస్తుంటే టీడీపీ దుర్మార్గంగా మాట్లాడుతోందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వాంబే కాలనీలోని 60వ డివిజన్లో అర్హులైన 2,533 మందికి ఇళ్ల పట్ఠాల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం జోనల్ కమిషనర్ సమైలా, ఎమ్మార్వో దుర్గా ప్రసాద్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 'అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. సీఎం జగన్ రాష్ట్రంలో పేద ప్రజలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. 386 మందికి టిడ్కో ఇల్లు ఇస్తున్నాం. టీడీపీ ఇళ్ల విషయంలో దుర్మార్గంగా మాట్లాడుతోంది. వాంబే కాలనీలో మినీ బస్టాండ్ వస్తుంది. లే అవుట్లు నగరంలో విలీనం చేస్తాం. చదవండి: (‘మేనిఫెస్టో గొప్పతనం సీఎం జగన్ పాలనలోనే అర్థమైంది’) గతంలో 28 వేల ఇళ్లు ఇచ్చిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కింది. టీడీపీ ప్రజాప్రతినిధులు టిడ్కో విషయంలో ప్రజలను మోసం చేశారు. టీడీపీ నేతలు 12,000 మంది దగ్గర డబ్బులు వసూలు చేశారు. పేదలకు సెంట్ స్థలం ఇస్తున్నాం. నగరంలో 1,600 మందికి ఇళ్ల పట్టాలు రెగ్యులరైజ్ చేస్తున్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో కొత్తగా 525 పెన్షన్లు ఇచ్చాము. 45 నుంచి 65 ఏళ్ల లోపు ఉన్న వారికి సీఎం జగన్ చేయూతను ఇచ్చారు. రాష్ట్రంలో సీఎం విద్యకు పెద్దపీట వేస్తున్నారు. వాంబే కాలనీలో రూ. 4 కోట్ల పనులు జరుగుతున్నాయి. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారు. టీడీపీ నేతలు మత రాజకీయాలు చేస్తున్నారు, అది సరికాదు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. చదవండి: (త్వరలోనే అసలు రంగు బయటపడుతుంది’) -
పేదవాళ్ల ఉసురు తగులుతుంది: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభం కార్యక్రమం జనవరి 20 వరకూ కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ 39 శాతం ఇళ్లస్థలాలు పంపిణీ పూర్తైందని పేర్కొన్నారు. 17వేలకు పైగా కాలనీల్లోని 9,668 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్లస్థలాల పంపిణీ జరిగిందని, మిగిలిన వాటిని కూడా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పాలనలో పారదర్శకతను తారస్థాయికి తీసుకుని వెళ్లామని, ఇక ముందు కూడా దీనిని కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ మంగళవారం సమీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా.. ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభ అంశంపై జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు.(చదవండి: ధాన్యం సేకరించిన పక్షంలోగా చెల్లింపులు) మౌలిక సదుపాయాలు కల్పించాలి ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... ‘‘ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గొప్ప కార్యక్రమం జరిగింది. ప్రతి కలెక్టర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అక్కచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం కనిపిస్తోంది. వారి అందరి దీవెనలు మీకు లభిస్తాయి. నాతోపాటు, మీ అందరికీ కూడా ఈ సంతోషం ఉంటుంది. లే అవుట్స్‌లో ఇంటి నిర్మాణాలు కొనసాగించడం ఒక కార్యక్రమమైతే, వాటిలో మౌలిక సదుపాయలు కల్పించడం మరొక కార్యక్రమం. రోడ్లు, కరెంటు, తాగునీరు.. లాంటి కనీస సౌకర్యాలు కల్పించాలి. కాలనీ పరిమాణాన్ని బట్టి.. ఇతర సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా పెట్టాలి. స్కూళ్లు, అంగన్వాడీలు, పార్కులు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్ లాంటివి రావాలి. కాలనీ పరిమాణం, జనాభా బట్టి వీటిని ఏర్పాటు చేయాలి. ఇందుకు సంబంధించి ఎస్ఓపీని తయారు చేయాలి. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేసరికి అవన్నీపూర్తి కావాలి. ఒక లే అవుట్లో పనులు ప్రారంభించిన తర్వాత అవన్నీ పూర్తికావాలి. కాలనీలో పనులు మొదలుపెట్టిన తర్వాత అందులో ఉన్న అన్ని ఇళ్లనూ పూర్తిచేయాలి. ఒకవేళ అదనంగా ఇళ్ల నిర్మాణాన్ని మంజూరు చేయాల్సి వస్తే.. వెంటనే దానికి అనుగుణంగా మంజూరుచేసి కాలనీలో అన్ని ఇళ్లనూ పూర్తిచేసేలా చర్యలు తీసుకుందాం’’ అని దిశా నిర్దేశం చేశారు. ఆహ్లాదకర వాతావరణం ఉండాలి: సీఎం జగన్ వైఎస్సార్ జగనన్న కాలనీలను మురికివాడలుగా మార్చే పరిస్థితి ఉండకూడదని, ప్రతిచోటా ఆహ్లాదకర వాతావరణం ఉండాలని సీఎం జగన్ అన్నారు. రోడ్లను వినూత్న రీతిలో నిర్మించి, బాగా ఎలివేట్ చేయాలని సూచించారు. వీధి దీపాలు, కరెంటు స్తంభాల ఏర్పాటులో కూడా వినూత్న పద్ధతులను అనుసరించాలని, కాలనీలు కట్టేటప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్లు శ్రద్ధపెట్టి అన్ని పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. డిజైన్లు, ఇతరత్రా అంశాలపై ఇప్పటికే కొన్ని సూచనలు చేశానని, కలెక్టర్లు దీన్ని సవాల్‌గా తీసుకుని, సమర్థతను నిరూపించుకోవాలని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడితే పేదవాళ్ల ఉసురు తగులుతుంది ప్రతి కాలనీ వెలుపల బస్టాప్ ఉండాలి. బస్టాప్‌ను కూడా హైటెక్ రీతిలో తీర్చిదిద్దాలి. కాలనీ ఎంట్రన్స్కూడా వినూత్నరీతిలో ఉండాలి. పెద్ద పెద్ద లేఅవుట్స్‌లో ఎలా ఉంటాయో.. అలాంటివి ఉండాలి. చెట్లు నాటాలి.. ఒక పద్ధతి ప్రకారం నాటాలి. కాలనీల నిర్మాణంలో మన సంతకం కనిపించాలి. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లాంటి వ్యవస్థలను ఇప్పుడే కల్పించడంపై దృష్టిపెట్టాలి. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులనుంచి ఆప్షన్లను వెంటనే తీసుకోవాలి. ఇది త్వరగా చేస్తేనే మనం చేయదగ్గ పనులకు కార్యాచరణ పూర్తవుతుంది. ఆప్షన్లు తీసుకునే కార్యక్రమం కూడా 20వ తేదీ నాటికి పూర్తికావాలి. మ్యాపింగ్, జియో ట్యాగింగ్ కూడా ఏకకాలంలో పూర్తిచేయాలి ఎన్ఆర్ఇజీఎస్ కింద లబ్ధిదారులకు జాబ్‌కార్డులు ఇవ్వడం, వారి పేరుతో బ్యాంకు అక్కౌంట్లను ప్రారంభించడం పూర్తిచేయాలి. పేమెంట్ల విడుదలకు ఏపీ హౌసింగ్ వెబ్‌సైట్‌ను వినియోగించుకోండి. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నీటి సరఫరా, కరెంటు చాలా ముఖ్యమైన అంశాలు.. మొదటగా వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కలెక్టర్లు క్రమం తప్పకుండా రివ్యూలు చేపట్టాలి. కాలనీల్లో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలపై డీపీఆర్‌లు తయారుచేయాలి. చాలా పెద్ద పెద్ద కాలనీలు ఇవి.. కొన్ని చోట్ల నగర పంచాయతీలు చేస్తున్నాం. మురుగునీటిని శుద్ధిచేసే ప్లాంట్లకోసం కూడా డీపీఆర్‌లు తయారుచేయాలి. ప్రతి కాలనీలోనూ ఒక మోడల్ హౌస్‌ను కట్టండి. ఇళ్ల నిర్మాణంలో వినియోగించే మెటీరియల్ నాణ్యత చాలా ముఖ్యమైనది పేదవాళ్ల నుంచి ఎవరైనా అవినీతికి పాల్పడితే అది క్షమించరాని నేరం. అవినీతి జరిగితే పేదవాళ్ల ఉసురు తగులుతుంది. ప్రతి అధికారికీ కలెక్టర్లు కమ్యూనికేట్ చేయాలి. ఇంట్లో కరెంటు సరఫరా కోసం వాడే వైరు కూడా క్వాలిటీతో ఉండాలి. ఇళ్ల నిర్మాణం జరుగుతున్న కాలనీ వరకూ ఇసుక సరఫరా జరిగేలా చూడండి. అలాగే మెటల్ సరఫరా కూడా చూసుకోండి. మెటీరియల్‌కు సంబంధించి టెండర్లను 20వ తేదీనాటికి పూర్తిచేసేలా కలెక్టర్లు చర్యలుతీసుకోవాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బందిని, వాలంటీర్ల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. వారికి మంచి శిక్షణ ఇవ్వండి. వీరి సేవలను వినియోగించుకోవడంపై ఎస్ఓపీని తయారుచేయండి. డిజిటల్ అసిస్టెంట్లను, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను, వాలంటీర్లను సేవలను వినియోగించుకోవాలి. -
ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన అవినాష్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు పెద్ద పీట వేశారని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుపరిపాలన అందిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ అన్నారు. రాష్ట్రంలో అర్హులైన వారికి ఉచితంగా ఇల్లు ఇస్తున్నారన్నారు. మహిళల పేర్లతో ఇళ్ల పట్టాలిస్తున్నామని తెలిపారు. ఆదివారం ఆయన యనమాలకుదురులో మెగా టౌన్షిప్లో అర్హులైన మూడు వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 634 మందికి టిడ్కో ఇళ్ల పత్రాలు పంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దమ్మున్న నాయకుడు సీఎం జగన్ పేద ప్రజలకు అండగా ఉన్నారని అభయమిచ్చారు. సీఎం జగన్ 30 లక్షల మందికి ఇల్లు ఇచ్చారని తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాలిస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు హామీలకే పరిమితమైతే సీఎం జగన్ పాదయాత్రలో చెప్పిన హామీలు నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. ఇక తూర్పు నియోజకవర్గంలో 30 వేల మందికి అమ్మ ఒడి వస్తుందన్నారు. (చదవండి: ప్రధాని ప్రశంసలు సైతం దక్కాయి: దేవినేని అవినాష్) -
‘ఎంత బలవంతులైనా ఢీకొట్టే వ్యక్తిగా చూపిస్తుంది’
సాక్షి, కృష్ణా : నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలినాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయయూర్తి రాకేష్ కుమార్ జడ్జిమెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. పదవీ విరమణ చేసి వెళ్లిన న్యాయమూర్తి రాకేష్ కుమార్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి గూగుల్ సెర్చ్ చేస్తే ఏదో వస్తుందని అంటున్నారని, కానీ తను సెర్చ్ చేస్తే ఆయన కుటుంబ నేపథ్యం వస్తోందన్నారు. 2009లో రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకు, అవతలి వైపు ఎంత బలవంతులు ఉన్నా ఢీ కొట్టే వ్యక్తిగా చూపిస్తుందని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన వ్యక్తిగా గూగుల్‌లో కనపడుతుందన్నారు. ‘‘చూసే వాళ్ళు ఏది కావాలంటే అదే గూగుల్‌లో వస్తుంది. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి గుగూల్ సెర్చ్ చేస్తే ఏదో వచ్చిందని ఆర్డర్ కాపీలో పెట్టాడు. గూగుల్‌లో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పేరు నొక్కినా అదే వస్తుంది. అయితే తాము వెదికితే మాత్రం సీఎం జగన్ ఎవరి ముందు తలవంచరు. దేశ చరిత్రలో నలభై సంవత్సరాల చరిత్ర గల పార్టీలతో ఆయన ఢీకొట్టినట్లు మాకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఏ మంచి పనిచేసినా అడ్డం పడాలనే దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఎంతమంది కలిసి అడ్డుపడ్డా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతి హమీని అమలు చేస్తారు. సీఎం జగన్ రాష్ట్రంలో ప్రజలను, దేవుడిని, దివంగత నేత రాజశేఖరరెడ్డిని నమ్మి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. దేవుడి ఆశీస్సులు తో పాటు మీ ఆశీస్సులతో నిజాయితీగా, అవినీతి లేని పాలన చేస్తున్నారు. దేవుడి ఆశీస్సులు, రాజశేఖరరెడ్డి ఆశీస్సులు ఎప్పుడూ సీఎంకు ఉంటాయి. మీ అందరి దీవెనలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఉండాలి. రాష్ట్రంలోకి చాలామంది వస్తుంటారు, పోతుంటారు. వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నారు. ‘‘సీఎం వైఎస్ జగన్ మీ కోసమే ఉన్నారు. ఇచ్చిన ప్రతి వాగ్ధానం అమలు చేస్తారు’’ అని ప్రజలకు హామీ ఇచ్చారు. -
టీడీపీ నేతల విమర్శలు పట్టించుకోం: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ : దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని తెలిపారు. భారీ ఎత్తున ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ 384 చదరపు స్థలం ఇస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 23,24,25 డివిజన్‌కు సంబంధించిన 1024 మందికి ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జోనల్ కమిషనర్ సుమైలా, ఎమ్మార్వో జయశ్రీ గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ సుమైలా మాట్లాడుతూ.. 18,19,20 డివిజన్లోని 3280 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. అర్హులైన వారందరికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సీఎం జగన్ అధికారంలోకి రాగానే ఇళ్ల పట్టాలు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు సీఎం జగన్ పెద్దపీట వేశారన్నారు. మహిళలు పేరు మీద ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో 27 వేల జేఎన్ఆర్యూఎం ఇల్లులు ఇచ్చారని తెలిపారు. గత పాలనలో టీడీపీ నేతలు ఇళ్ల స్థలాల విషయంలో ప్రజలను మోసం చేశారని మల్లాది విష్ణు విమర్శించారు. లక్షా 80 వేలు ఇళ్ల కట్టడానికి మంజూరు చేశామని, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు తాము పట్టించుకోమన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలోని పేదవాడి పక్షాన ఉన్నారని, 30 వేల మందికి ఇళ్ల ఇస్తున్నామని తెలిపారు. ‘సీఎం జగన్ ఊళ్లు నిర్మిస్తున్నారు. నగరాన్ని విస్తరిస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గలో 30 వేల ఇల్లు ఇస్తున్నాం. టీడీపీ నేతలు ప్రజలను మోసం చేశారు. జన్మ భూమి కమిటీలు పెట్టి ప్రజలను తప్పుదోవలో నడిపించారు. సెంట్రల్ నియోజకవర్గలో 24.602 పెన్షన్లు ఇస్తున్నాం. 525 మందికి రేపు ఉదయం నుం,ఇ కొత్త పెన్షన్లను ఇస్తున్నాం. రాష్ట్రంలో టీడీపీని ప్రజలు తిరస్కరించిన బుద్ధి రాలేదు. టీడీపీ నేతలు జూమ్ మీటింగ్స్‌కే పరిమితం. సీఎం జగన్ రాష్ట్రంలోని విద్యా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ రాజకీయాల ప్రజలు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రజల వద్దకు వచ్చింది. అంబేడ్కర్ కాలనీలోని 177 ఇళ్ల పట్టాలు రెగ్యులర్ చేస్తున్నాం. టీడీపీ నేతలు టిడ్కో ఇళ్ల విషయంలో12.000 వేల మంది దగ్గర నుండి 25.000 50.000 వేలు వసూలు చేశారు. టీడీపీ నేతలు టిడ్కో ఇళ్ల విషయంలో ప్రజలను మోసం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో సీఎం జగన్ ముందు అడుగులో ఉన్నారు’. అని తెలిపారు -
ఇన్నాళ్లకు కల తీరింది..
సాక్షి, దెందులూరు: పాదయాత్ర సమయంలో ఊరూరా నిరుపేద గూడు గోడు విన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. పేదలు సొంత ఇల్లు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నట్లు తెలుసుకుని “నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ వారికి అండగా నిలవాలని నిశ్చయించుకున్నారు. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే అర్హులు ఎంతమంది ఉంటే అందరికీ ఉచితంగా స్థలం ఇవ్వడమే కాక ఇంటిని నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా డిసెంబర్ 25వ తేదీ నుంచి రాష్ట్రమంతా అట్టహాసంగా ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభమైంది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా జిల్లాలో 1,70,699 మందికి సొంత ఇంటి కల నెరవేరింది. అంతే కాకుండా ఇంటి పట్టాతో పాటు ఇల్లు నిర్మాణానికి ఒక్కొక్కరికి 1,80,000 రూపాయలు నిధులు ఉచితంగా మంజూరు చేస్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరిట మంజూరు పత్రాలు సైతం అందజేస్తున్నారు. ఇళ్ల నిర్మాణ విషయమై లబ్ధిదారులకు మూడు అవకాశాలు ఇచ్చారు. ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వడం, లబ్ధిదారుడే ఇల్లు నిర్మించుకుంటే నిధులు మంజూరు చేయడంతో సగం ధరకే మెటీరియల్‌కు సంబంధించి నిధులు బ్యాంక్ ఖాతాకు జమ చేస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి చొరవతో ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు ఆదర్శ గృహాల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే కొందరు లబ్ధిదారులు కొత్త ఇళ్లల్లోకి మకాం మార్చడం విశేషం. ఇంటి నిర్మాణం ఇలా.. ప్రతి ఇంట్లో వసారా, కిచెన్, రెండు బెడ్రూమ్లు, బాత్రూమ్, శ్లాబ్, ఇంటిపై వాటర్ ట్యాంక్ ఏర్పాటుతో నిర్మాణం చేసేట్లు గృహ నిర్మాణ శాఖ రూపొందించింది. సీఎం మరో నజరానా ఈ పథకానికి మరింత వన్నె తెచ్చేలా ప్రతి లబ్దిదారునికి ఉచితంగా రెండు ప్యాన్లు రెండు ట్యూబ్లైట్లను ప్రభుత్వమే సరఫరా చేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఇన్నాళ్లకు కల తీరింది సొంత ఇంటిలో ఉండాలన్న నా కలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి నెరవేర్చారు. ఇంటి నిర్మాణం చేసి ప్రభుత్వం నాకు అందజేయటం, కుటుంబ సభ్యులతో మేము సొంత ఇంటిలో ఉండటం ఎన్నటికీ మరచిపోలేని విషయం. సీఎం, ఎమ్మెల్యేలకు రుణపడి ఉంటాం. – తొంటా సరస్వతి, లబ్ధిదారురాలు, పెదవేగి ఇల్లు నిర్మించి అప్పగించాం పెదవేగిలో మోడల్ హౌస్ నిర్మించి లబ్ధిదారునికి అప్పగించాం. లబ్ధిదారుడు గృహ ప్రవేశం చేసి కుటుంబ సభ్యులతో ఆ ఇంటిలో నివాసం ఉండటం చాలా సంతోషంగా ఉంది. గృహ నిర్మాణాలపై లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తయ్యేందుకు సహకరించాలి. ఇళ్ల పట్టా, నిర్మాణ మంజూరు పత్రాలు ఒకేసారి అందజేస్తున్నాం. – కొఠారు అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్యే సమష్టి కృషితో ఇళ్ల నిర్మాణం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యే, జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారుల సమష్టి సహాయ, సహకారాలు, సూచనలతో ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తాం. అధికారుల పర్యవేక్షణలో, పూర్తిస్థాయి నాణ్యతా ప్రమాణాలతో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. – పి.రామచంద్రారెడ్డి, హౌసింగ్ పీడీ సమష్టి కృషితో ఇళ్ల నిర్మాణం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యే, జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారుల సమష్టి సహాయ, సహకారాలు, సూచనలతో ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తాం. అధికారుల పర్యవేక్షణలో, పూర్తిస్థాయి నాణ్యతా ప్రమాణాలతో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. – పి.రామచంద్రారెడ్డి, హౌసింగ్ పీడీ -
న్యాయమే నెగ్గుతుంది: సీఎం జగన్
ప్రతి కుటుంబం ఆలోచన చేయాలి... ఏడాది గడిచిపోయింది. క్యాలెండర్ మారుతోంది. 2020 తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకునే సమయం వచ్చింది. ఈ ప్రభుత్వం మాకేమిచ్చింది? గత సర్కారుతో పోలిస్తే ఎంత మంచి జరిగిందని ప్రతి కుటుంబం ఆలోచన చేయాలి. మీ బిడ్డ మీకు మంచి చేశాడు. రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలో కూడా లేని విధంగా ఎన్నో చేశాడు. పేదలకు, రైతులకు, అక్క చెల్లెమ్మలకు, విద్యార్థులకు, అవ్వా తాతలకు, వందల సామాజిక వర్గాలకు కనీవిని ఎరగని విధంగా ఉపయోగపడ్డా. మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఈ మాటలు గర్వంగా చెబుతున్నా. వీళ్లసలు మనుషులేనా..? చంద్రబాబు, ఆయన సహచరులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ కోర్టుల్లో కేసులు వేయడం, స్టేలు తేవడంతో 30.75 లక్షల మందిలో 10% అంటే 3.74 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతున్నాం. పట్టాల పంపిణీకి ముందురోజైన 24న కూడా కోర్టులో పిల్ వేశారంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో చూడండి. నా సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా స్టే తెచ్చారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అడ్డుకుంటున్న వీరసలు మనుషులేనా? అనిపిస్తుంది. జాప్యం వల్ల ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఇప్పుడు డి–పట్టాలతో ఇస్తున్నాం. న్యాయపరమైన అడ్డంకులు తొలగిన వెంటనే సర్వహక్కులతో అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తాం. అక్కచెల్లెమ్మలకు విలువైన ఆస్తి... ఇదే లేఅవుట్లో మనం ఇస్తున్న భూమి విలువ రూ.3 లక్షలు ఉంటుందని కలెక్టర్ చెప్పారు. రేపు ఇక్కడ ఇల్లు కట్టి అభివృద్ధి చేస్తే కనీసం ఏడెనిమిది లక్షల రూపాయల ఆస్తి అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టినట్లు అవుతుంది. ఇంటికి నలుగురు చొప్పున లెక్కేసుకున్నా ఇక్కడ దాదాపు 45 వేల మంది ఉండబోతున్నారు. అంటే ఒక నగర పంచాయతీ ఏర్పడబోతోంది. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, విజయనగరం: సంక్రాంతి ముందే వచ్చిందన్నట్లుగా పేదలకు విలువైన స్థిరాస్తిని అందించే ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా విజయనగరం జిల్లా గుంకలాంలో 397.36 ఎకరాల విస్తీర్ణంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన సువిశాల లేఅవుట్‌ను బుధవారం ఆయన విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. విశాఖ నుంచి హెలికాఫ్టర్‌లో వచ్చిన ముఖ్యమంత్రి జగన్ లే అవుట్ అంతా చక్కర్లు కొట్టి తిలకించారు. అనంతరం వైఎస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. 12,301 మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో పాటు తొలిదశలో నిర్మించనున్న గృహ నిర్మాణ పనులను ప్రారంభించి బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. భారీ ఎత్తున హాజరైన లబ్ధిదారులు అడుగడుగునా అడ్డంకులు ‘‘అమరావతిలో 54 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే డెమొగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందంటూ చంద్రబాబు నాయుడు, ఆయన మనుషులు కోర్టుల్లో కేసులు వేస్తే స్టే ఇచ్చాయి. నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తోంది. కులాల మధ్య విభేదాలు ఏమిటి? వారు దాన్ని చూపిస్తూ కేసులు వేయడం ఏమిటి? కోర్టులు స్టే ఇవ్వడం ఏమిటి? అని. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత దారుణమైన పరిస్థితులున్నాయో. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన విశాఖలో 1.80 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ల్యాండ్ పూలింగ్‌లో భూములు సేకరించాం. ఆ భూములు ఇచ్చిన వారు ఏ అభ్యంతరం లేకుండా భూములు ఇచ్చారు. కానీ ఆ భూములతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి కోర్టులో కేసులు వేయడం, వాటిపై స్టే రావడం చాలా బాధనిపిస్తోంది. రాజమండ్రిలో భూములను ప్రభుత్వమే ప్రజల నుంచి కొనుగోలు చేసింది. అవి ఆవ భూములు కాకపోయినా ఎవరో కేసు వేయడం, స్టే రావడంతో 27 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు అవరోధం ఏర్పడింది. 1978లో 44వ సవరణ ద్వారా ఆస్తిహక్కును చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. అంటే ఇల్లు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. అది చట్టబద్దమైన హక్కు. అయినా కోర్టులకు వెళ్లడం, స్టేలు ఇవ్వడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. బాధ కూడా అనిపిస్తోంది. ఇంత భారీగా ఇళ్ల నిర్మాణంతో ఎంతోమందికి పని దొరుకుతుంది. కనీసం 30 రకాల వృత్తుల వారికి ఉపాధి లభిస్తుంది. ముడి పదార్థాల వినియోగంతో ఆర్థికంగా కూడా బూస్ట్ వస్తుంది. త్వరలోనే మిగిలిపోయిన 3.74 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందిస్తాం. దేవుడి ఆశీర్వాదం, మీ చల్లని దీవెనలు నాకు తోడుగా ఉన్నాయి. మహిళకు ఇంటి స్థలం పట్టా అందజేస్తున్న సీఎం జగన్ చెప్పిన దానికంటే మిన్నగా.. అక్క చెల్లెమ్మలకు 25 లక్షల ఇళ్లు కట్టించి వారి పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. అంతకంటే ఎక్కువగా 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలిస్తున్నాం. తొలివిడత 15.60 లక్షల ఇళ్లు మొదలు పెడుతున్నాం. రూ.7 వేల కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. మిగిలిన 12.70 లక్షల ఇళ్లు వచ్చే ఏడాది ప్రారంభిస్తాం. . రాష్ట్రవ్యాప్తంగా 68,361 ఎకరాలలో చేసిన లేఅవుట్లు, ప్లాట్ల మార్కెట్ విలువ దాదాపు రూ.25,530 కోట్లు ఉంటుంది. నవరత్నాల సిరి ధాన్యం బస్తాలపై నవరత్నాలను పేర్కొంటూ రూపొందించిన ఎడ్లబండి సభలో విశేషంగా ఆకట్టుకుంది. నాలుగు జిల్లాల జనాభా.. గత ప్రభుత్వం చివరి రెండేళ్లలో అక్కడో ఇక్కడో మొక్కుబడిగా ఇళ్లు కడితే మనం ఇవాళ ఏకంగా ఊళ్లు కడుతున్నాం. కొన్ని చోట్ల అవి పట్టణాలు కూడా. మన ప్రభుత్వం దాదాపు 31 లక్షల కుటుంబాలకు ఇళ్లు కట్టిస్తోంది. అంటే ఒక కుటుంబంలో సగటున నలుగురు ఉంటారనుకుంటే దాదాపు 1.24 కోట్ల మందికి ఇంటి సదుపాయం కలుగుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతోపాటు కడపను కూడా కలిపితేనేగానీ అంత మంది ఉండరు. ఏ రకంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారనేది మీదే నిర్ణయం. మూడు రకాల ఆప్షన్లలో మీకు నచ్చింది వలంటీర్‌కు చెప్పండి. బాబు స్కీమ్ కావాలన్నది ఒకే ఒక్కడు దాదాపు 2.62 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తాం. 300 చదరపు అడుగుల ఫ్లాట్ ఖర్చును ప్రభుత్వమే పూర్తిగా భరించి కేవలం ఒక్క రూపాయికే పేదలకు ఇస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.43 లక్షల టిడ్కో ఇళ్లకు సంబంధించి ఏ స్కీమ్ కావాలని ఆప్షన్లు కోరితే కేవలం ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీమ్ కావాలన్నారు. అది కూడా ఏదో పొరపాటున అయి ఉంటుంది. ఆయన కోరిక ప్రకారమే ఆయనకు ఆ స్కీమ్, మిగిలిన వారికి జగనన్న స్కీమ్ వర్తింపచేస్తాం. 365, 430 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులకు కూడా రాయితీ ఇస్తున్నాం. వారు కట్టాల్సిన ముందస్తు వాటాలో 50 శాతం ప్రభుత్వం భరిస్తోంది. ఇలా అదనంగా రూ.4,287 కోట్ల భారం పడినా మీ బిడ్డగా చిరునవ్వుతో భరిస్తున్నాం’’ భారీగా హాజరైన లబ్ధిదారులు.. డిప్యూటీ సీఎంలు పుష్పశ్రీవాణి, ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స, చెరుకువాడ, ముత్తంశెట్టి, వెలంపల్లి, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీలు బెల్లాన, మాధవి, సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు భారీగా లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయనగరానికి వరాలు ► రూ.180 కోట్లతో కురుపాం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ పనులు త్వరలో ప్రారంభం. ► సాలూరులో ట్రైబల్ వర్సిటీ పనులు త్వరలోనే మొదలు. ► విజయనగరంలో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణానికి జనవరిలో టెండర్లు. మార్చిలో పనులు. ► ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రెండో దశకు రూ.4,134 కోట్లకు టెండర్లు. పనులు పూర్తి చేసి కచ్చితంగా 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు. ► గజపతినగరం బ్రాంచి కాలువతో సహా తోటపల్లిలో అన్ని పనులను రూ.471 కోట్లతో ప్రాధాన్యతగా చేపట్టి రెండేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం. ► తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టుకు మరో రూ.620 కోట్లు. రెండేళ్లలో పనులు పూర్తి. ► వెంగళరాయ ప్రాజెక్టు కింద 5 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీళ్లు. ఏడాది లోపే పనులు పూర్తి. ► రాముడి వలస, లోచర్ల ఎత్తిపోతల పథకాల పనులు ఏడాదిలోగా పూర్తి. ► గుంకలాంలో అన్ని మౌలిక వసతులతో 18 నెలల్లోనే గృహ నిర్మాణాలు పూర్తి. ఎవరిస్తారన్నా ఇలా..? ‘‘కూలి పనిచేసే నా భర్త చనిపోవడంతో టైలరింగ్ చేసుకుంటూ బతుకుతున్నా. నాకొక పాప ఉంది. సొంతిల్లు లేకపోవటంతో 20 ఏళ్లలో 12 సార్లు అద్దె ఇళ్లు మారాల్సి వచ్చింది. జగనన్న నా ఇంటి కలను నేరవేర్చటమే కాకుండా చేదోడు పథకం కింద రూ.18,750, వైఎస్సార్ ఆసరా రూ.4 వేలు, పింఛన్ రూ.2,250 చొప్పున నాకు సంవత్సరం మొత్తంలో రూ.60 వేలు పైన ఇచ్చారు. ఎవరిస్తారన్నా ఇలా? నాకు, నా కుమార్తెకు మీరున్నారన్న ధైర్యంతో బతుకుతాం’’ –కొమరగిరి రత్నకుమారి, పద్మావతినగర్, విజయనగరం -
చంద్రబాబు ఉస్కో .. పవన్ డిస్కో: నాని
సాక్షి. కృష్ణా: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. కృష్ణా జిల్లా నందివాడలో బుధవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పవన్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులు చాలామంది ఉంటారని, వాళ్ళు ఏం మాట్లాడతారో ప్రజలకు తెలుసని అన్నారు. మైకు పట్టుకొని ఊగిపోతూ తోడలు మెడలు నలపుకుంటూ ఎదో వాగితే వినేందుకు జనం పిచ్చివాళ్ళు కాదని దుయ్యబట్టారు. చంద్రబాబుకు అపద వస్తే కాపాడటానికి మాత్రమే రోడ్డు మీదకు వచ్చి నోటికి వచ్చినట్లు వాగుతావని ఎద్దేవా చేశారు. మేము ఎమైనా అంటే బూతులు తిడుతున్నామని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఒక్కమాట అన్న కూడా మేము పదిమాటలు అంటామని ధీటుగా సమాధానమిచ్చారు. నువ్వు నన్ను బూతులు మంత్రి అంటావో ఇంకా ఎమైనా అంటావో డోంట్ కేర్. ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, దేనికైనా సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు. చదవండి: ‘మంత్రులకు పవన్ క్షమాపణ చెప్పాలి’ ‘మాకు వార్నింగ్ ఇచ్చే స్థాయి నీకు లేదు. నువ్వు, నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వచ్చినా ఏం చేయలేదు. ప్యాకేజీ తీసుకుని సొల్లు కబుర్లు చెప్తున్నాడు. చంద్రబాబు ఉస్కో అనగానే.. పవన్ డిస్కో అంటూ వస్తాడు. నువ్వు కొట్టగానే పదిమంది ఎగిరిపడటానికి ఇది సినిమా కాదు. నీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు. నష్టపోయిన రైతులకు ముప్పై అయిదువేలు ఇవ్వాలంటున్నావు. 80లక్షల మంది రైతులకు ఎంత ఇవ్వాలో తెలుసా. చంద్రబాబు నాయుడు ఏదో రాసిస్తే అది పట్టుకొచ్చి పిచ్చోడిలా వాగుతావు. జనం నవ్వు కుంటున్నారు. రైతులకు అప్పులు మాఫీ చేస్తానన్న చంద్రబాబుతో తిరిగావు. అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు మోసం చేస్తే చొక్కా ఎందుకు పట్టుకోలేదు. చంద్రబాబు నాయుడు విధానాల వల్లనే రైతులు నష్టపోయారు తప్ప మా వల్ల కాదు. నష్టపోయిన రైతులకు నెలరోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. పూర్తిగా తడిసి, రంగుమారి తినటానికి పనికిరాని ధాన్యాన్ని సివిల్ సప్లయ్ శాఖ ద్వారా రైతుల దగ్గర కొంటున్నాం. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం: అర్హులందరికీ సొంతింటి కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పేదలకు స్థలాలతో పాటు ఇళ్ళు కట్టిస్తామని భరోసానిచ్చారు. ఇళ్ల స్థలాల కోసమే రూ. పదివేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని, ఇళ్ళను కూడా ప్రభుత్వమే కట్టిస్తుందన్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత తెలుగు దేశం పార్టీకి లేదని విమర్శించారు. లోకేష్ ఒక పప్పు బాయి అని, లోకేష్‌కు రైతుల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. రైతులకు అన్ని రకాలుగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున కొనుగోలు చేసిన చరిత్ర సీఎం జగన్‌ది అని ప్రశంసించారు. గతంలో నా డబ్బులు అయిదు కోట్లు దొరికాయని టీడీపీ ఆరోపించిందని, లీగల్ నోటీసులు ఇస్తే సమాధానం కూడా లేదని అన్నారు. జూమ్‌లో ఉన్న బాబు పొద్దు పోక మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో దక్షిణ నియోజక వర్గం పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు అధికంగా పాల్గొనగా.. మంత్రి అవంతి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, కమిషనర్ డాక్టర్ సృజన హాజరయ్యారు. కాగా దేశ చరిత్రలోనే ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ సువర్ణ అధ్యాయమని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. పేదల పట్టాల పంపిణీ చూసి టీడీపీ నాయకులు ఓర్వ లేక పోతున్నారన్నారు. -
తండ్రి ప్రాణం నిలబెడితే.. కొడుకు నీడనిచ్చాడు
సాక్షి, మంగళగిరి: ‘నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి నా భర్తకు ప్రాణం పోస్తే నేడు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్క రూపాయికే ఇల్లు ఇచ్చి నీడ కల్పించార’ని గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణానికి చెందిన అన్నం మంగమ్మ, వెంకటేశ్వరరావు దంపతులు భావోద్వేగానికి గురయ్యారు. పట్టణంలోని పీఎంఏవై వైఎస్సార్ జగనన్న నగర్లో మంగళవారం టిడ్కో ఇళ్ల పంపిణీలో భాగంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) లబ్ధిదారులకు సేల్ అగ్రిమెంట్లు అందజేశారు. అపార్ట్మెంట్లోని బీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్లో వృద్ధ దంపతులు అన్నం మంగమ్మ, వెంకటేశ్వరరావుల వద్దకు ఆయన వచ్చినప్పుడు వారు కన్నీరు పెట్టుకున్నారు. 2008లో తనకు గుండెపోటు రాగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా రూ.3 లక్షల విలువయ్యే గుండె ఆపరేషన్‌ను కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచితంగా చేయించి, ప్రాణం నిలబెట్టారని చెప్పారు. నేడు రూ.20 లక్షల విలువయ్యే ఇంటిని ఆ మహానుభావుడి కుమారుడు, సీఎం వైఎస్ జగన్ ఒక్క రూపాయికే ఇచ్చి నీడ కల్పించారని ఆనందభాష్పాలతో చెప్పారు. మగ్గం నేస్తూ వచ్చిన ఆదాయం కుటుంబ పోషణ, అద్దెలకు అంతంత మాత్రంగానే సరిపోయేదన్నారు. వైఎస్సార్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. చదవండి: (దేశానికే ఏపీ ఆదర్శం అంటూ ప్రశంసలు) ఇంటి పట్టా అందుకున్న కంఠమనేని శ్రీనివాసరావు చంద్రబాబు వద్ద ఎన్నోసార్లు మొత్తుకున్నాం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చిలువూరులో ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలంలో పట్టాలు ఇవ్వాలని చంద్రబాబునాయుడు దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లాం. ఒకసారి పేదలందరం కలిసి ఇళ్లు వేసినా, వాటిని కూల్చివేశారు. టీడీపీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలో పని చేస్తున్నా. ఇలాంటి సంక్షేమ పథకాలను ఎప్పుడూ చూడలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయడం ఆనందించదగ్గ విషయం. – కంఠమనేని శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ కార్యకర్త, చిలువూరు, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా -
దళితుల్లో చిచ్చుకు టీడీపీ కుట్ర
సాక్షి, అమరావతి: ‘విభజించు.. పాలించు’ విధానంతో దుష్ట రాజకీయాలు చేయడంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు బ్రిటీష్ పాలకులను మించిపోతున్నారు. ఇప్పటికే అధికారం కోల్పోయి నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్న ఆయన రాజకీయ పబ్బం గడుపుకునేందుకు దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారు. రాజధానిలో దళితులు, బీసీలు ఉండటానికి వీల్లేదని, అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని కోర్టుకు వెళ్లి మరీ అడ్డుకుంటున్న టీడీపీనే.. ప్రస్తుతం అమరావతిలో దళితుల మధ్య విభేదాలను రాజేస్తూ మరో కుట్రకు తెరతీసింది. వెలగపూడిలో టీడీపీ కుట్రతో జరిగిన ఘర్షణలో ఓ దళిత మహిళ చనిపోయిన ఉదంతాన్ని అడ్డం పెట్టుకుని దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబు పన్నాగం పన్నుతున్నారు. దళితులు ఐక్యంగా ఉంటే టీడీపీకి నష్టమని.. ► దళితులు ఐక్యంగా ఉంటూ రాష్ట్రంలో రాజకీయంగా బలీయ శక్తిగా ఉండటాన్ని ప్రతిపక్షత నేత చంద్రబాబు సహించలేకపోతున్నారు. రాష్ట్రంలో దళితులు సమష్టిగా దాదాపు 18 శాతం ఓట్లు కలిగి ఉన్నారు. ఇంత పెద్ద ఓటు బ్యాంకు వైఎస్సార్సీపీకి సంప్రదాయంగా బలమైన మద్దతుదారుగా ఉంది. ► 2019లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అఖండ విజయానికి వెన్నుదన్నుగా నిలిచింది. దళితులు ఐక్యంగా ఉంటే మునుముందు తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని చంద్రబాబుకు బోధపడింది. అందుకే దళితులను విభజించేందుకు చంద్రబాబు కుట్రకు తెర తీశారు. వెలగపూడిలో టీడీపీ దిగజారుడు రాజకీయం ► గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో దళితుల మధ్య తలెత్తిన చిన్న వివాదాన్ని టీడీపీ కుట్రపూరితంగా రెచ్చగొట్టింది. చంద్రబాబు కనుసన్నల్లో టీడీపీ నేతలు ఆ గ్రామంలో ఇరువర్గాల మధ్య వివాదానికి ఆజ్యం పోశారు. ► ఆ గ్రామంలోని దళితవాడలో సిమెంట్ రోడ్డు.. ఆర్చ్ నిర్మాణం విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన అభిప్రాయ బేధాలను క్రిస్మస్ తర్వాత సామరస్యంగా పరిష్కరించుకోవాలనే ఏకాభిప్రాయానికి వచ్చాయి. దీన్ని టీడీపీ సహించలేకపోయింది. ► ఈ అంశాన్ని ఘర్షణలకు దారితీసేంత తీవ్ర వివాదంగా మలచాలని టీడీపీ అధినాయకత్వం తమ పార్టీ నేతలకు స్పష్టం చేసింది. దాంతో టీడీపీకి చెందిన న్యాయవాది జడారి శ్రావణ్ కుమార్, మరికొందరు పార్టీ నేతలు, కార్యకర్తలు రంగంలోకి దిగి, ఆజ్యం పోసి రెచ్చగొట్టారు. దీంతో ఆదివారం రాత్రి ఇరువర్గాలు పరస్పరం కర్రలతో దాడులకు పాల్పడ్డాయి. ఎనిమిది మంది గాయపడగా, వారిలో మరియమ్మ అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. శవ రాజకీయాలు చేస్తున్న టీడీపీ ► తాము రాజేసిన చిచ్చుతో ఓ అమాయక దళిత మహిళ ప్రాణాలు కోల్పోయినప్పటికీ చంద్రబాబు శాంతించలేదు. మరియమ్మ మృతదేహాంతో వెలగపూడిలో టీడీపీ నేతలు ధర్నా చేశారు. హోంమంత్రి సుచరిత, తదితరులు గ్రామంలో పర్యటించి సర్ది చెప్పడంతో పోస్టుమార్టంకు మరియమ్మ కుటుంబ సభ్యులు సమ్మతించారు. ► అనంతరం అంత్యక్రియలు చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు సిద్ధపడుతుండగా టీడీపీ నేతలు వారిని ప్రభావితం చేసి ఆమె మృతదేహంతో సోమవారం తుళ్లూరు–వెలగపూడి రోడ్డుపై ధర్నాకు దిగారు. ఇది టీడీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ► ఈ కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ నందిగాం సురేశ్‌ను ఏ–1గా చేర్చాలని, ఎఫ్ఐఆర్ కాపీ తమకు చూపించాలని అసంబద్ధ డిమాండ్‌తో టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారుడుతనం ప్రదర్శిస్తోంది. ఈ కేసును విచారించి ఎంపీ నందిగాం సురేశ్ పాత్ర ఉన్నట్టు తేలితే ఆయన పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తామని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ప్రకటించారు. ► కానీ టీడీపీ నేత జడారి శ్రవణ్ కుమార్, ఆయన అనుచరులు మాత్రం అందుకు సమ్మతించకుండా ధర్నా కొనసాగిస్తుండటం టీడీపీ ఉద్దేశాన్ని తేటతెల్లం చేస్తోంది. ► శవపేటికలో పెట్టిన మరియమ్మ మృతదేహాన్ని వెలగపూడి–తుళ్లూరు రోడ్డులో దించి మరీ టీడీపీ ధర్నా కొనసాగిస్తుండటం బాధాకరమని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం మధ్యలో మృతదేహాన్ని దించరాదని చెబుతున్నారు. తొలి నుంచీ బాబు దళిత వ్యతిరేకి ► చంద్రబాబు ఆది నుంచి దళితుల పట్ల వ్యతిరేకంగానే ఉన్నారు. 1995–2004లో, 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చాక కూడా తీరు మారలేదు. ‘ఎవరైనా దళితులుగా పుట్టాలనుకుంటారా?’ అని వ్యాఖ్యానించడం తెలిసిందే. ► అమరావతిలో దళితుల ఎసైన్ట్ భూములను తన బినామీల పేరిట తక్కువ ధరకు కొల్లగొట్టారు. అక్కడ దళితులను లేకుండా చేయాలని కుట్ర పన్నారు. ఇది గ్రహించే దళితులతో సహా అన్ని వర్గాల వారు అమరావతి పరిధిలోని మంగళగిరి (లోకేశ్ ఓడిపోయారు), తాడికొండ నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించినా బాబు మారలేదు. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమరావతిలో 54 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయిస్తే.. వీరిలో ఎక్కువ మంది దళితులు ఉండటంతో టీడీపీ కోర్టును ఆశ్రయించి అడ్డుకుంది. ‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే అమరావతిలో ‘సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది’ అని నిస్సిగ్గుగా వాదించింది. తక్షణం స్పందించిన ప్రభుత్వం ► వెలగపూడిలో ఘర్షణలపై ప్రభుత్వం తక్షణం స్పందించింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఘర్షణలను నివారించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ నందిగాం సురేశ్, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, రాష్ట్ర రెల్లి కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్‌రావు తదితరులు వెలగపూడిలో పర్యటించారు. ► మరియమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. దళితులు అంతా ఒకటే కుటుంబమని చెప్పి అందరం ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మరియమ్మ కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ.10 లక్షలు ఇచ్చారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ► గాయపడిన వారికి పూర్తి చికిత్స అందిస్తామని, అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. దాడులను నివారించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తుళ్లూరు సీఐ ధర్మేంద్ర బాబును వీఆర్‌కు పంపుతూ గుంటూరు రేంజ్ డీఐజీ డాక్టర్ త్రివిక్రమ వర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెలగపూడిలో రాళ్లు, కర్రలతో పరస్పర దాడులు సాక్షి, గుంటూరు/తాడికొండ: వెలగపూడి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామంలో ఇటీవల సిమెంట్ రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డుకు ప్రారంభంలో ఆర్చ్ ఏర్పాటు చేసి, బాబూ జగ్జీవన్‌రామ్ కాలనీగా నామకరణం చేయాలని ఓ వర్గం ప్రయత్నిస్తోంది. అయితే రోడ్డుకు ప్రారంభంలో ఉన్న గృహాల వారు (మరో వర్గం) దీన్ని వ్యతిరేకించడంతో నాలుగు రోజులుగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి రెండు వర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది గాయపడ్డారు. ఐదుగురిని తాడేపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి, ఇద్దరిని అమరావతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరియమ్మను తొలుత గుంటూరు జీజీహెచ్‌కు తరలించి, మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించింది. మరియమ్మ మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆమె కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు సోమవారం తుళ్లూరు – వెలగపూడి ప్రధాన రహదారిపై మృతదేహంతో నిరసన చేపట్టారు. వివాదం ముదరడానికి ఓ కారకుడైన తుళ్లూరు సీఐ ధర్మేంద్రబాబును సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం : హోం మంత్రి సుచరిత గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలో అలజడులకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. మరియమ్మ మృతి విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించారని, బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తక్షణ సాయం కింద రూ.10 లక్షలు అందించాల్సిందిగా ఆదేశించారని తెలిపారు. ఎస్సీలను విడగొట్టాలని చూస్తున్న చంద్రబాబు మాయలో పడొద్దని కోరారు. మహానేతలైన అంబేడ్కర్, జగ్జీవన్రామ్లను ఆదర్శంగా తీసుకుందామని చెప్పారు. గ్రామంలో శాంతి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుందని తెలిపారు. తుళ్లూరు ప్రాంతంలో పోలీస్ అధికారులపై వస్తున్న ఫిర్యాదులపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు. అర్ధరాత్రి వెలగపూడి బయల్దేరిన హోం మంత్రి తాము పేర్కొన్న వారి పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేసి ప్రతిని అందించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన పోలీస్ అధికారులు ప్రాథమిక సమాచారం మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, నిష్పక్షపాతంగా విచారణ చేసి సాంకేతిక ఆధారాలు సేకరించి బాధ్యులైన ప్రతి ఒక్కరిని కేసులో చేర్చుతామని ఎస్పీ విశాల్ గున్నీ చెప్పారు. అయినప్పటికీ రాత్రి 11 గంటలైనా ఆందోళన విరమించలేదు. దీంతో హోం మంత్రి 11.30 గంటల ప్రాంతంలో వెలగపూడికి వెళ్లారు. -
రాష్ట్రంలో గృహశోభ
సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రమంతటా ఇళ్ల పట్టాలు, నిర్మాణాల పండుగ జరుగుతోందని.. వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ మొదలు కొత్త సంవత్సరం, సంక్రాంతి వరకు ఇది కొనసాగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 30.75 లక్షల ఇళ్ల స్థల పట్టాల పంపిణీతో పాటు, రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణం, మరో 2.62 లక్షల టిడ్కో ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా సోమవారం ఆయన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరులో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో పాటు తొలి దశలో నిర్మించనున్న ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ‘తొలి దశలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్లలో చిత్తూరు జిల్లాలో 1,78,840 ఇళ్లు ఉన్నాయి. ఈ జిల్లాలో 2.50 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. ఊరందూరు లేఅవుట్లో ఏకంగా 6,232 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తున్నాం. ఇక్కడ ప్లాన్ చాలా చక్కగా ఉంది. ఇక్కడే ఆర్బీకే కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, ఆటో స్టాండ్, వైఎస్సార్ జనతా బజార్, కల్యాణ మండపాలు, వార్డు సచివాలయం, పార్కులు, ప్రభుత్వ పాఠశాలలు రానున్నాయి’ అని చెప్పారు. ఇక్కడ మార్కెట్ రేటు ప్రకారం ఒక్కో ప్లాటు విలువ రూ.7 లక్షలు ఉంటుందన్నారు. ఒక అన్నగా, తమ్ముడిగా అక్కచెల్లెమ్మలకు ఈ ఆస్తిని ఇస్తున్నానని, ఇందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాను ► ‘‘అక్క చెల్లెమ్మలకు అన్ని విధాలా అండగా ఉంటానని మాట ఇచ్చాను. 18 నెలలుగా ఆ దిశగా అడుగులు వేస్తున్నాను. అమ్మ ఒడి పథకం ద్వారా దాదాపు 43 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.6,352 కోట్లు వారి చేతిలో పెట్టాం. విద్యా దీవెన పథకం ద్వారా 18.52 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.4 వేల కోట్లు ఇచ్చాం. వసతి దీవెన కింద 15.56 లక్షల తల్లులకు రూ.1,221 కోట్లు ఇచ్చాం. ► ఆసరా కింద పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు తొలి ఏడాదిలో 87.74 లక్షల మందికి రూ.6,792 కోట్లు ఇచ్చాం. చేయూతలో వారి చేయి పట్టుకుని నడిపిస్తూ 24.55 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,604 కోట్లు చేతికి అందించాం. పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకంలో 87 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.1,400 కోట్లు ఇచ్చాం. కాపు నేస్తం పథకంలో 3.28 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.492 కోట్లు ఇచ్చాం. ఆ కష్టాలు స్వయంగా చూశాను ► నా సుదీర్ఘ 3,648 కి.మీ పాదయాత్రలో సొంతిల్లు లేని వారి కష్టాలు స్వయంగా చూశాను. 25 లక్షల ఇళ్లు కట్టి ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పాం. కానీ ఇవాళ దాదాపు 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు, ఇల్లు కూడా కట్టించి ఇస్తున్నాం. మొత్తంగా 1.24 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది. ► ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఇంటి స్థలం ఇస్తాం. తర్వాత ఇల్లు కట్టిస్తాం. ఊళ్లు రాబోతున్నాయి ► 17 వేల రెవెన్యూ గ్రామాల్లో 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల లేఅవుట్లు వేసి, గతంలోలా 224 చదరపు అడుగుల్లో కాకుండా, 340 చదరపు అడుగుల్లో ఇళ్లు కట్టిస్తున్నామంటే అవి కాలనీలు కావు.. ఊళ్లు రాబోతున్నాయి. ఈ ఇళ్లలో మౌలిక సదుపాయాల కోసం రూ.7 వేల కోట్లకు పైగా వ్యయం చేస్తున్నాం. ► రాష్ట్ర వ్యాప్తంగా 68,361 ఎకరాల్లో వేసిన లేఅవుట్లు, ప్లాట్ల మార్కెట్ విలువ దాదాపు రూ.25,530 కోట్లు. అంత ఆస్తిని 30.75 లక్షల మంది అక్క చెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం. ప్రతి ఇంట్లో ఒక బెడ్రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, వరండా, టాయిలెట్, పైన సింటెక్స్ ట్యాంక్ ఉంటాయి. రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, మరో రెండు ఎల్ఈడీ లైట్లు కూడా ఉంటాయి. కాలనీల్లో 13 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టాం. ఇళ్ల నిర్మాణం.. టిడ్కో ఇళ్లు ► తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం పనులు కూడా మొదలయ్యాయి. మిగిలిన 12.70 లక్షల ఇళ్లు వచ్చే ఏడాది మొదలు పెడతాం. ఇవి కాక 2.62 లక్షల టిడ్కో ఇళ్లు అక్క చెల్లెమ్మలకు ఇవ్వబోతున్నాం. ఇందుకు దాదాపు రూ.9,500 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ► టిడ్కో ఇళ్లలో 300 చదరపు అడుగుల ఇంటిని కేవలం ఒక్క రూపాయికే సేల్ అగ్రిమెంట్ ఇస్తున్నాం. ఒక్క రూపాయికే ఇల్లు ఇచ్చే జగనన్న స్కీమ్ కావాలా? లేక రూ.7.20 లక్షలు చెల్లించే చంద్రబాబు స్కీమ్ కావాలా? అని రాష్ట్ర వ్యాప్తంగా ఆప్షన్ కోరితే ఒకే ఒక్కరు చంద్రబాబు స్కీమ్ కోరారు. ► 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులకు కూడా వారు కట్టాల్సిన ముందస్తు వాటాలో 50 శాతం ప్రభుత్వం భరిస్తోంది. మొత్తంగా టిడ్కో ఇళ్లకు ప్రభుత్వంపై అదనంగా దాదాపు రూ.4,287 కోట్ల భారం పడుతున్నా చిరునవ్వుతో భరిస్తున్నాం. ఎందరికో ఉపాధి.. ఆర్థిక పురోగతి ► ఇల్లు నిర్మాణం అంటే, ముగ్గు పోసి పునాదులు తవ్వడంతో అయిపోదు. తాపీ మేస్త్రీలు, కూలీలు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్లు, వెల్డర్లు, ఆటో వాళ్లు.. ఇలా 30 రకాల వృత్తుల వారు లక్షలాది మందికి లబ్ధి కలుగుతుంది. ► తొలి దశలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్లకు 69.70 లక్షల టన్నుల సిమెంట్, 7.4 లక్షల టన్నుల స్టీల్, 310 లక్షల టన్నుల ఇసుక, 235 కోట్ల ఇటుకలు, 223 కోట్ల మెట్రిక్ టన్నుల మెటల్ వాడుతున్నారు. వ్యవస్థలో ఆర్థికంగా బూస్ట్ వస్తుంది’’ సీఎం జగన్ అన్నారు. ► అనంతరం లబ్ధిదారులు పుష్ప, జ్యోతి, ధనలక్ష్మి, సృజనీ, రజియాలకు సీఎం ఇంటి పట్టాలు అందజేశారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు, ఊరందూరు లేఅవుట్లోని మోడల్ హౌస్‌ను సంబంధిత లబ్ధిదారురాలికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు ధర్మాన కృష్ణదాస్, నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీరంగనాథరాజు, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బియ్యపు మదుసూధనరెడ్డి, భూమన, రోజా, చెవిరెడ్డి, పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అక్కడ పేదలకు స్థలాలు ఇవ్వకూడదా? ► అమరావతిలో 54 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధమైతే, డెమొగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ (కులపరమైన అసమతుల్యం) వస్తుందని చంద్రబాబు మనుషులు కొందరు కొన్ని చోట్ల కోర్టుకు వెళితే, కోర్టు స్టే ఇచ్చింది. దీంతో 3.74 లక్షల పట్టాలు ఇవ్వలేకపోతున్నాం. ► విశాఖపట్నంలో 1.80 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన వారు ఏ అభ్యంతరం తెలుపలేదు. వాటితో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి వాటిపై స్టే తీసుకొచ్చారు. రాజమండ్రిలో ఆవ భూములు అని చెప్పి స్టే తెచ్చారు. దాని వల్ల 27 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలంటే అవరోధం ఏర్పడింది. ► నా సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా స్టే తెచ్చారు దుర్మార్గులు, రాక్షసులు. అవి ఏపీఐఐసీ భూములని, మైనింగ్ భూములంటూ కోర్టుకు పోయారు. 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ మేరకు ఇల్లు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. అయినా కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారు. వీళ్లందరికీ దేవుడు మొట్టికాయలు వేస్తాడు. న్యాయం జరుగుతుంది. త్వరలో మిగిలిపోయిన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం. అన్నా మీరు విన్నారు.. ఆదుకున్నారు అన్నా.. నా పేరు పుష్ప. మా ఆయన తిరుమల్‌రావు కూలీ పని చేస్తాడు. మాకిద్దరు చిన్న పిల్లలు. మాకు సొంతిల్లు లేదు. దీంతో నా బిడ్డ పురిటి సమయంలో ఎన్నో కష్టాలు పడ్డాము. నాకు అన్నదమ్ములు లేరు. ఈ పరిస్థితిలో సొంత అన్నలా ఆదుకుంటూ మీరు నాకు ఇంటి పట్టా ఇస్తున్నారు. మీ వల్ల నాలాగే రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరూ సంతోషంగా ఉన్నారు. మీ పాదయాత్రలో ‘నేను విన్నాను.. నేను ఉన్నాను..’ అని చెప్పారు. ఇప్పుడు ఆ మాట నిలుపుకుంటూ నవరత్నాలతో మమ్మల్ని ఆదుకుంటున్నారు. అమ్మ ఒడి, విద్యాకానుక, వైఎస్సార్ ఆసరా, చేయూత ఇలా ఒక్కటేమిటి.. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఇళ్ల పట్టా ఇవ్వడం గొప్ప కార్యక్రమం. ఏ ప్రభుత్వం ఇలా 30 లక్షల మందికి పైగా స్థలాలిచ్చి, ఇళ్లు కట్టించడం లేదు. పైగా మా (మహిళలు) పేరుతోనే ఇస్తున్నారు. – పుష్ప, ఏర్పేడు, చిత్తూరు మాకు అడ్రస్ ఇచ్చారన్నా.. నా పేరు జ్యోతి. మాకు ఇద్దరు పిల్లలు. నాకు ఆరేళ్లప్పుడే మా అమ్మ చనిపోయింది. పదేళ్లప్పుడు నాన్న చనిపోయాడు. అలాంటి నాకు ‘నేను ఉన్నాను చెల్లెమ్మా’ అంటూ అమ్మ ప్రేమను, నాన్న అనురాగాన్ని పంచుతూ ఇంటికి యజమానిని చేస్తున్నారు. అన్నా.. మేము చెరువు కట్టపై ఉంటున్నాం. వానకు, ఎండకు ఇబ్బందులు పడుతున్నాం. ఇన్నాళ్లూ ఎవరూ ఏమీ చేయలేదు. నా ఊరు ఇది అని చెప్పుకునేందుకు అడ్రస్ లేని వాళ్లం. అటువంటి సమయంలో మీరు మాకు అడ్రస్ ఇచ్చారు. ఇప్పుడు నా ఊరుపేరు ‘జే సిటీ’. నా ఇంటి నంబర్ 305. (భావోద్వేగానికి లోనవుతూ) నాలాగే ఆ కట్టపై ఉన్న మరో 25 మందికి ఇంటి స్థలాలు ఇచ్చారు. ఇళ్లు కట్టిస్తున్నారు. ‘నీకేమి మీ అన్న ఉన్నాడు. ఇంటికి మహరాణిని చేశాడు. మీ అమ్మను ఏమైనా అంటే వాళ్ల అన్నకు చెబుతుంది’ అని మా ఆయన మా బిడ్డతో అంటున్నాడు. మీ వల్లే నాకు ఈ గౌరవం. పండుగ అంటే ఇదే అన్నా. – జ్యోతి, అమ్మపాలెం చెరువు కట్ట అన్ని పథకాల్లో అక్కచెల్లెమ్మలకే ప్రాధాన్యత ఇస్తూ ఎక్కడా అవినీతి, వివక్షకు తావు లేకుండా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్చు జమ చేశాం. ఇళ్ల స్థలాలు, ఇళ్లు కూడా అక్కచెల్లెమ్మల పేరుతోనే ఇస్తున్నాం. ఆలయ ట్రస్టు బోర్డు పదవులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ పోస్టులు, బీసీ కార్పొరేషన్లలో, రాజకీయ నియామకాల్లో 50 శాతం వారికే చెందాలని చట్టాలు చేశాం. ఇది మీ అందరి ప్రభుత్వం.. మీ అన్న ప్రభుత్వం.. మీ తమ్ముడి ప్రభుత్వం.. అని గర్వంగా చెబుతున్నాను. సీఎం వైఎస్ జగన్ -
రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పండుగ: సీఎం జగన్
-
నా ఇంటి నెంబరు 305..
సాక్షి, చిత్తూరు: ఆంధ్రపదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పథకం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలు, పేదల పక్షపాతి అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అక్కాచెల్లెమ్మలు ధన్యవాదాలు చెబుతున్నారు. ఒక అన్నలా తమకు అండగా ఉంటున్నందుకు రుణపడి ఉంటామంటూ అభిమానం చాటుకుంటున్నారు. కాగా చిత్తూరు జిల్లాలోని ఊరందూరులో వైఎస్సార్ జగనన్న కాలనీలో 167 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో కూడి 6,232 ప్లాట్లు వేశారు. వీటిలో 4,299 ప్లాట్లను పట్టణ పేదలకు, 465 శ్రీకాళహస్తి రూరల్, 1,468 ప్లాట్లు ఏర్పేడు రూరల్ ప్రాంతాలకు చెందిన పేదలకు కేటాయించారు. తొలివిడతలో భాగంగా 5,548 ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ సోమవారం శ్రీకారం చుట్టారు. ఇళ్ల స్థలాల పంపిణీ, వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్దిదారులు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఏర్పేడు మండలానికి చెందిన పుష్ప మాట్లాడుతూ.. ప్రభుత్వం పథకాల ద్వారా తమ కుటుంబమంతా లబ్ది పొందినట్లు పేర్కొన్నారు. ‘‘ అన్నా నా పేరు పుష్ప.. మా ఆయన తిరుమల్‌రావు.. కూలీపని చేస్తాడు.. మాకిద్దరు చిన్న పిల్లలు వాళ్లను చూసుకుంటూ నేను ఇంట్లోనే ఉంటా. మాకు సొంతిళ్లు లేదు. ఈ కారణంగా నా పురిటి సమయంలో ఎన్నో కష్టాలు పడ్డాము. బిడ్డను ఎత్తుకుని అద్దెంటికి వెళ్తే వెళ్లగొట్టారు. నాకు అన్నాదమ్ముళ్లు లేరు. అమ్మకు అక్కా, నేనే. ఆనాడు ఎంత బాధ పడ్డానో నేడు అంతకంటే ఎక్కువ సంతోపడుతున్నాను. మా అన్న నాకు ఇంటి పట్టా ఇస్తున్నాడు. నాలాగే రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలందరూ సంతోషంగా ఉన్నారు. పాదయాత్రలో భాగంగా నేను విన్నాను ఉన్నాను చేస్తాను అని చెప్పారు. నవరత్నాలు ఒక్కొక్కటిటా నెరవేరుస్తున్నారు. అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, చేయూత, జగనన్న విద్యాకానుక ఇలా ఒక్కటేమిటి పేదలకు లబ్ది చేకూరేలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అన్నింటిలో పేదలకు ఇళ్ల పట్టా ఇవ్వడం అత్యంత గొప్పది. ఏ ప్రభుత్వం ఇలా 30 లక్షలకు పైగా ఇళ్లు కట్టివ్వడం లేదు. మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తున్న మీకు రుణపడి ఉంటాం’’ అని ఉద్వేగానికి గురయ్యారు.(చదవండి: ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు: సీఎం జగన్) వేదిక మీద మాట్లాడుతున్న పుష్ప నా ఇంటి నెంబరు 305.. జ్యోతి కన్నీటిపర్యంతం ‘‘అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి మాకు ఇద్దరు పిల్లలు. అన్నా.. పండుగ అంటే ఇదేనన్నా. మాకోసం ముందుగానే సంక్రాంతి పండుగ తీసుకువచ్చారు. ఉగాదికే పట్టాలు రావాల్సింది. మాకోసం ఎన్నో అవాంతరాలు దాటి నేడు కలను సాకారం చేశారు. ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. నాకు ఆరేళ్లప్పుడే మా అమ్మ చనిపోయంది. పదేళ్లప్పుడు నాన్న చనిపోయాడు. అలాంటి నాకు నేను ఉన్నాను చెల్లెమ్మా అంటూ అమ్మ ప్రేమను, నాన్న అనురాగాన్ని పంచుతూ ఇంటికి యజమానిని చేస్తున్నారు. ఎల్లప్పుడూ నీకు రుణపడి ఉంటా. మేం చెరువు కట్టమీద ఉంటాం. సొంతస్థలం లేదు. అడ్రస్ లేని నాకు అడ్రస్ ఇచ్చారు. ఇక్కడ.. 305 నా ఇంటి నెంబరు. ఇన్నాళ్లు వానకు తడిసేవాళ్లం. ఎండకు ఎండేవాళ్లం. ఏ నాయకుడు మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కానీ నువ్వు కరోనా సమయంలో కూడా మమ్మల్ని ఎంతగానో ఆదుకున్నావు. మా ఇంట్లో వాళ్లందరం ప్రభుత్వ పథకాలు పొందుతున్నాం. నాకు తల్లీదండ్రీ నువ్వే అన్నా. ఒక విషయం చెప్పనా అన్నా.. నన్ను సరదాకైనా మా ఆయన ఒక్క మాట అనడం లేదు. ‘‘మీకేమమ్మా మీ అన్న ఉన్నాడు. ఇంటికి మహరాణిని చేశాడు’’అంటాడు. అమ్మను ఏమైనా అంటే వాళ్ల అన్నకు చెబుతుంది అని నా బిడ్డకు చెప్తాడు. నాకు ఇంతటి గౌరవం కల్పించినందుకు పాదాభివందనాలు చేస్తున్నా. కట్టమీద ఉన్న అందరికీ ఇళ్లు వచ్చాయి. అందరి తరఫున కృతజ్ఞతలు. మా అన్నే అధికారంలో ఉండాలి. మన బిడ్డల తరంలో కూడా అన్నే ఉండాలా. కష్టం మన ఇంటి గడప కూడా దాటనివ్వకుండా చూస్తాడు’’ అంటూ కన్నీటి పర్యమంతమయ్యారు. -
ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు: సీఎం జగన్
సాక్షి, చిత్తూరు: శ్రీకాళహస్తి(మం) ఊరందూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 'నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు' పథకం ప్రారంభించారు. ఊరందూరులో 'నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు' పైలాన్‌ని ఆవిష్కరించారు. తొలి విడతలో నిర్మించనున్న ఇళ్ల పనులను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర వ్యాప్తంగా నేడు పండుగ జరుగుతోంది. సొంతిళ్లు లేని నిరుపేదల్లో చిరునవ్వు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 30.75లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నాం. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నాం. శ్రీకాళహస్తిలో 7 లక్షల రూపాయల విలువైన ప్లాట్‌ను అక్కాచెల్లెమ్మలకు ఇస్తున్నాం’ అన్నారు. అమ్మ ఒడి, చేయూత, వసతి దీవెన వంటి పథకాల ద్వారా నేరుగా మహిళలకే నగదు అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. అవినీతికి తావు లేకుండా నేరుగా అక్కాచెల్లెమ్మల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం అన్నారు సీఎం జగన్. అలానే ఇళ్ల పట్టాలను నిరంతర ప్రక్రియగా మార్చామని.. అర్హులైనవారు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో.. ఇంటి స్థలం కేటాయించేలా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సహా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. లే అవుట్ విస్తీర్ణం బట్టి పార్క్‌లు, అంగన్వాడీలు, విలేజ్ క్లీనిక్‌లు, ఆర్బీకేలు ఏర్పాటు చేస్తాం. 224 చదరపు అడుగుల నుంచి 340 చదరపు అడుగులకు విస్తీర్ణం పెంచాం. 300 చదరపు అడుగులు ఉన్న టిడ్కో ఇళ్లను ఒక రూపాయికే అందిస్తున్నాం. టిడ్కో ఇళ్లను పూర్తి చేసేందుకు 9వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నాం’ అన్నారు. (చదవండి: ఇళ్లు.. పుష్కలంగా నీళ్లు) ‘లక్షా 43వేల మంది టిడ్కో లబ్ధిదారుల్లో ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీం కావాలన్నారు. 365, 430 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లల్లో.. 50శాతం లబ్ధిదారుల వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనివల్ల ప్రభుత్వంపై 4,250 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది’ అన్నారు సీఎం జగన్. ఇక ‘ఇళ్ల స్థలాల పంపిణీలో కులం, మతం, పార్టీ వంటి బేధాలు చూడలేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటిని అందిస్తున్నాం. పారదర్శకతలో భాగంగా లబ్దిదారుల జాబితాను గ్రామ సచివాలయంలో పెడుతున్నాం’ అని తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చాం ఇక ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చామన్నారు సీఎం జగన్. మొదటి ఆప్షన్లో నిర్మాణ సామాగ్రి, లేబర్ ఛార్జీలను లబ్ధిదారులకు ఇస్తాం. రెండో ఆప్షన్లో నిర్మాణ ఖర్చులను పురోగతి వారీగా డబ్బులు చెల్లిస్తాం. మూడో ఆప్షన్లో పూర్తిగా ప్రభుత్వమే ఇంటి నిర్మాణం చేసి లబ్ధిదారులకు అందిస్తాం అని తెలిపారు. లబ్ధిదారుల పేరుతోనే ఇంటి రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాం అన్నారు. చంద్రబాబు అండ్ కో కుట్రలతో రిజిస్ట్రేషన్లు జరగలేదని తెలిపారు. ప్రస్తుతం లబ్ధిదారులకు కేవలం 'డి' పట్టాలు మాత్రమే ఇస్తున్నామని.. న్యాయపరమైన చిక్కులు తొలగిపోగానే లబ్ధిదారులకు అన్ని హక్కులు కల్పిస్తామన్నారు. డిసెంబర్ 25న ఇళ్ల పట్టాలు పంచుతామని తెలిసి 24న కోర్టుకు వెళ్లారు.. చంద్రబాబు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో దీన్ని బట్టే తెలుస్తుందని జగన్ మండి పడ్డారు. (చదవండి: ఒక అద్భుతం... ఓ ఆశ్చర్యం!) పులివెందులలో ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టు ద్వారా స్టే తెచ్చారు. అమరావతిలో 54వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. విశాఖలో 1.84లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇద్దామనుకుంటే.. ఇళ్ల పట్టాల కోసం ల్యాండ్ పూలింగ్ చేస్తే భూమి ఇచ్చినవారికి.. లబ్ధిదారులకి సంబంధం లేని వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. రాజమండ్రిలో ఆవా భూముల పేరుతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. ప్రభుత్వ భూములను కూడా పేదలకు కేటాయించకుండా అడ్డుకుంటున్నారు. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం కాగానే మిగిలిన వారందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. -
చిత్తూరు: సీఎం జగన్ ఇళ్ల పట్టాల పైలాన్ ఆవిష్కరణ
సాక్షి, చిత్తూరు: శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పథకాన్ని సోమవారం ప్రారంభించారు. పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసి.. వైఎస్సార్ జగనన్న కాలనీలో తొలి విడతలో నిర్మించనున్న ఇళ్ల నిర్మాణ పనులను పనులను సీఎం ప్రారంభించారు. అంతకుముందు 'నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు' పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ జరుగుతోందని అన్నారు. సొంతిళ్లు లేని నిరుపేదల్లో చిరునవ్వు కనిపిస్తోందని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 30.75లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నామని అన్నారు. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నామని తెలిపారు. కాగా, ఊరందూరులో వైఎస్సార్ జగనన్న కాలనీలో 167 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో కూడి 6,232 ప్లాట్లు వేశారు. వీటిలో 4,299 ప్లాట్లను పట్టణ పేదలకు, 465 శ్రీకాళహస్తి రూరల్, 1,468 ప్లాట్లు ఏర్పేడు రూరల్ ప్రాంతాలకు చెందిన పేదలకు కేటాయించారు. తొలివిడతలో భాగంగా 5,548 ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి సోమవారం శ్రీకారం చుట్టారు. కాలనీని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు 8,600 మొక్కలు నాటారు. -
నేడు చిత్తూరు జిల్లాకు సీఎం జగన్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ సోమవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 9.30కు తాడేపల్లి నుంచి చిత్తూరు జిల్లాకు బయలుదేరతారు. 11.20కి ఊరందూరు చేరుకొని పైలాన్ ఆవిష్కరించి, పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తారు. అనంతరం వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తారు. అనంతరం అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు. తిరిగి మధ్యాహ్నం 2.50 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. కాగా, ఊరందూరులో వైఎస్సార్ జగనన్న కాలనీలో 167 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో 6,232 ప్లాట్లు వేశారు. వీటిలో 4,299 ప్లాట్లను పట్టణ పేదలకు, 465 శ్రీకాళహస్తి రూరల్, 1,468 ప్లాట్లు ఏర్పేడు రూరల్ ప్రాంతాలకు చెందిన పేదలకు కేటాయించారు. తొలివిడతలో భాగంగా 5,548 ఇళ్ల నిర్మాణానికి సోమవారమే శ్రీకారం చుట్టనున్నారు. కాలనీని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు 8,600 మొక్కలు నాటారు. -
కళ్ల నిండా ఆనందం
ఊరూ వాడా ఒకటే చర్చ.. ఎక్కడ నలుగురు గుమిగూడి ఉన్నా అదే మాటలు.. ‘సుబ్బమ్మత్తా.. నీ స్థలం ఎక్కడ? రాములమ్మా నీ ప్లాటెక్కడే? శ్రీదేవొదినా నీక్కూడా స్థలం వచ్చిందా?’ అంటూ చర్చోపచర్చలు. పేర్లు మారినా మూడు రోజులుగా ఊరూరా ఇవే సంభాషణలు. దేశంలోనే ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల క్రితం ఏకంగా 30.70 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టడం చర్చనీయాంశమైంది. ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కూడా ఉచితంగా కట్టించి ఇస్తామని ప్రకటించడం పట్ల లబ్ధిదారులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. సొంతింటి కల ఇంత త్వరగా సాకారం అవుతుందని అనుకోలేదని చెబుతున్నారు. అద్దె కోసం ఇతర ఖర్చులు తగ్గించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నామని, ఇకపై ఈ కష్టం ఉండదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జీవితంలో సొంతింట్లో ఉండగలమా.. అనే ప్రశ్న వేధించేదని, జగన్ పుణ్యమా అని ఇక ఆ ప్రశ్నకు తావేలేదని ఆనందం నిండిన కళ్లతో చెబుతున్నారు. పేదల సంక్షేమం కోసం పరితపిస్తున్న జననేతకు వారి గుండెల్లో గూడు కట్టుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి పట్టా అందుకుని సొంతింటి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన లబ్ధిదారుల మనోగతాలు ఇలా ఉన్నాయి. – సాక్షి నెట్వర్క్ నా మనవడు జగన్ వల్లే సొంతిల్లు మాది కాకినాడ. నా భర్త సత్యనారాయణ కాలం చేశారు. మాకు ముగ్గురు పిల్లలు. సొంతంగా ఇల్లు లేదు. అవసాన దశకు చేరుకున్న నేను జీవితంలో సొంతిల్లు చూస్తాననుకోలేదు. ఎన్నికల్లో అవ్వాతాతలను ఆదుకుంటానని నా మనవడు జగన్ చెప్పిన మాటలు ఇవాళ అక్షరాలా నిజం చేశాడు. అధికారంలోకి రాగానే పింఛన్ ఇచ్చాడు. ఇప్పుడు స్థలం ఇచ్చి, ఇల్లు కట్టిస్తున్నాడు. వలంటీర్ వచ్చి.. అవ్వా నీకు ఇల్లు మంజూరైందని చెప్పగానే నా జీవితకాల కల నెరవేరినట్లైంది. – అడపా నాగసుగుణ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా 12 సార్లు అర్జీ పెట్టినా రానిది.. 14 ఏళ్ల కిందట పొట్ట చేత పట్టుకుని ఈ గ్రామానికి వచ్చాం. అప్పట్నుంచి ఇంటి స్థలం కోసం 12 సార్లు అర్జీ పెట్టాను. అయినా ప్రయోజనం లేకపోయింది. సీఎం జగన్ చలువతో ఒక్క దరఖాస్తుతో ప్లాటు మంజూరైంది. అంతా కలగా ఉంది. స్థలం ఇవ్వటంతో పాటు ఇల్లు కట్టి ఇస్తున్న సీఎం వైఎస్ జగన్ మేలును ఎప్పటికీ మరువలేము. – తన్నీరు రమాదేవి, వీరపనేనిగూడెం, కృష్ణా జిల్లా ఇన్నాళ్లూ తిరిగి తిరిగి అలసిపోయాం సొంతింట్లో ఉండాలనేది మా కల. దాని కోసం చేయని ప్రయత్నం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు దరఖాస్తు ఇచ్చామో లెక్కలేదు. జన్మభూమి కమిటీలు, నాయకుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాం. కానీ ఫలితం లేదు. ఇంటి స్థలం మాకు లేదని వలంటీర్‌కు చెప్పాను. ఇంటి స్థలం మంజూరయ్యేలా చేశారు. ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తుందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. – దోనిపర్తి శ్రీదేవి, మైపాడు, ఇందుకూరుపేట మండలం, నెల్లూరు జిల్లా ఇప్పుడు ఆ భయం లేదు పదేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఎవరూ చేయని మేలును సీఎం జగన్ చేశారు. ఇంటి అద్దెలు చెల్లించలేక, పిల్లలను చదివించుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ ఆలోచన మళ్లీ రాలేదు. ఆ భయం లేదు. మా పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్నాం. ఇప్పుడు ఇంటి స్థలం ఒక్కసారి దరఖాస్తు చేయగానే వచ్చింది. – విజయలక్ష్మి, దండోరా కాలనీ, కడప చెప్పలేనంత ఆనందంగా ఉంది బతుకుదెరువు కోసం పదేళ్ల కిందట ఎస్.కోట వచ్చాం. అద్దెలు కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఎప్పటికైనా సొంత ఇల్లు ఒకటి ఉంటే బావుంటుందని కలలు కనేవారం. ఇప్పుడు నాకు ఇంటి స్థలం ఇచ్చారు. కట్టుకోలేమన్న వారికి ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుందని జగన్ అన్న చెబుతున్నారు. ఆయన మాట చెప్పారంటే అది శాసనం. మాకు సొంత ఇల్లు వస్తుందన్న ఊహే చెప్పలేనంత ఆనందంగా ఉంది. మా కల నిజం చేసిన జగనన్నను ఎప్పటికీ మరచిపోం. – సింహాద్రి సంతోషి, ఎస్.కోట, విజయనగరం జిల్లా టీడీపీ వాళ్లమైనప్పటికీ ఇల్లు మంజూరు నా భర్త ఓ ప్రైవేట్ స్కూల్లో వాచ్మెన్. తిరుపతి శివజ్యోతి నగర్లో 40 ఏళ్లుగా కాపురం ఉంటున్నాం. అనేకసార్లు ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఫలితం లేదు. ఇప్పుడు వార్డు వలంటీర్ మా ఇంటికి వచ్చి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలివ్వాలని అడిగారు. ఇన్నేళ్లు రాని ఇంటి పట్టా ఇప్పుడు వస్తుందా..? అనుకున్నాను. వలంటీర్ బలవంతంగా దరఖాస్తు చేయించింది. ఎవరి సిఫార్సు లేకుండానే ఇల్లు కూడా మంజూరవడంతో ఆశ్చర్యపోయాం. కొన్నేళ్లుగా టీడీపీ సానుభూతిపరురాలుగా ఉన్న నాకు సీఎం జగన్ వల్లే స్థలం వచ్చింది. ఇల్లు కూడా కట్టిస్తున్నారంటే ఆనందంగా ఉంది. చిరకాల స్వప్నం నెరవేర్చారు. – ఎన్.వనజాక్షి, శివజ్యోతినగర్, తిరుపతి నిజంగా ఇది పేదల ప్రభుత్వం రోడ్డు పక్కనున్న ప్రభుత్వ స్థలంలో తాటాకు పాక వేసుకుని జీవిస్తున్నాం. భర్త చనిపోయి పదేళ్లవుతుంది. కూతురుతో కలసి పాకలోనే ఉంటున్నాం. టిడ్కో ఇంటికి దరఖాస్తు చేసుకున్నాను. ప్రభుత్వం రూపాయికే ఇల్లు మంజూరు చేసింది. టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇంటికి 20 ఏళ్లు పాటు బ్యాంకు రుణం చెల్లించాలని చెప్పితే జగన్ ఒక్క రూపాయి కడితే చాలని చెప్పారు. ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడంతో ఆనందంగా ఉంది. నిజంగా ఇది పేదల ప్రభుత్వం. – మాకిరెడ్డి రమణమ్మ, నర్సీపట్నం మున్సిపాలిటీ, విశాఖ జిల్లా అన్నలా ఆదుకుంటున్నాడు పేదరికంతో కన్న తల్లిదండ్రులు కూడా ఇవ్వలేని ఇంటి స్థలం జగనన్న ఇచ్చారు. సొంత అన్నలా ఆడపడుచులను ఆదుకుంటున్నారు. 30 ఏళ్లుగా ఇంటి స్థలం కోసం ఎన్నో అర్జీలు పెట్టినా పట్టించుకోలేదు. జగనన్న ప్రభుత్వంలో దరఖాస్తు పెట్టిన వెంటనే ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేశారు. పేదల గుండెల్లో సీఎం జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారు. – చందన భాస్కరలక్ష్మి, దేవరపల్లి, పశ్చిమగోదావరి జిల్లా ఇన్నాళ్లూ ఒకే ఇంట్లో మూడు కుటుంబాలు ఇప్పట్లో సొంత ఇల్లు వచ్చే అవకాశం లభిస్తుందని అనుకోలేదు. మూడు కుటుంబాల వాళ్లం ఒకే ఇంటిలో నివాసముంటున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. విడిగా అద్దె ఇంట్లో ఉండాలంటే మా ఆదాయం సరిపోవటం లేదు. ఈ కష్టాల నుంచి గట్టెక్కే మార్గం లేదా అని అనుకుంటున్న సమయంలో సీఎం జగన్ చెప్పడంతో ఇంటి స్థలానికి దరఖాస్తు పెట్టుకున్నా. నాకు ఇంటి స్థలం పట్టా మంజూరైంది. ఇల్లు కూడా కట్టించి ఇస్తామన్నారు. మా ఊహలను నిజం చేసిన జగనన్నకు రుణపడి ఉంటాం. – కె.శారద, చినగంజాం, ప్రకాశం జిల్లా దేవుడే జగనన్న రూపంలో వచ్చాడు మాది చాలా పేదరికం. 20 ఏళ్ల క్రితం నా భర్తను కిడ్నీ వ్యాధి మహమ్మారి కబళించింది. పిల్లలతో అద్దె ఇంటిలో ఉంటూ కూలి పనులు చేసుకుని బతుకు సాగిస్తున్నా. గత ప్రభుత్వంలో ఇంటి స్థలం కోసం కాళ్లరిగేలా తిరిగినా రాలేదు. కూలి డబ్బులు అద్దెలకు పోస్తే నా పిల్లల భవిష్యత్ ఏమవుతుందోనని మదన పడేదాన్ని. జగనన్న ప్రభుత్వం వచ్చింది. వలంటీర్ వచ్చి ఇంటి స్థలం మంజూరవుతుందని వివరాలు తీసుకుని వెళ్లారు. తర్వాత నాకు ఇల్లు మంజూరైందని చెప్పగానే ఆనందం వేసింది. ఆ దేవుడే జగనన్న రూపంలో వచ్చాడు. ఆయనకు ఎల్లవేళలా రుణపడి ఉంటాం. – జోగి మోహిని, గుణుపల్లి, వజ్రపుకొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా ఇది మా కుటుంబానికి తొలి ఆస్తి నా పేరు షేక్ నసీమా. 25 ఏళ్లుగా కుటుంబం మొత్తం అద్దె ఇంట్లోనే సర్దుకుపోతున్నాం. గతంలో ఎన్నోసార్లు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దరఖాస్తు చేసిన వెంటనే ఇంటి పట్టా మంజూరు చేశారు. ఇది మా కుటుంబానికి చేకూరిన తొలి ఆస్తి. ఇల్లు కూడా ప్రభుత్వమే కట్టించి ఇస్తుండటం పట్ల ఆనందంగా ఉంది. సీఎం జగన్ చెప్పినవన్నీ చేసుకుపోతున్నాడు. – షేక్ çనసీమా, చిలకలూరిపేట, గుంటూరు జిల్లా జీవితాంతం గుడిసె తప్పదనుకున్నాం కూలికి పోతే తప్ప పూట గడవని పరిస్థితి. గ్రామంలో వేరేవారి స్థలంలో గుడిసె వేసుకొని జీవనం సాగిస్తున్నాం. జీవితాంతం ఇదే గుడిసెలో కాలం ఈడ్చాలని అనుకునే వాళ్లం. నా భర్త హనుమంతప్ప, నలుగురు పిల్లలు ప్రతి రోజూ కూలికి పోయి జీవనం గడుపుతున్నాం. జీవితంలో సొంతిల్లు కట్టుకోలేమనే భావనతో ఉన్న మాకు సీఎం జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారు. ఇంటి పట్టా అందుకున్న వేళ మా ఆనందం చెప్పలేం. ఇప్పుడు ఇల్లు కూడా కట్టిస్తామని చెబుతుంటే సంతోషంతో మాటలు రావడం లేదు. – అయ్యమ్మ, పెద్ద తుంబళం గ్రామం, కర్నూలు జిల్లా చిత్తూరు జిల్లా ఊరందూరులో ప్రజలకు ఇచ్చేందుకు సిద్ధం చేసిన లేఅవుట్ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం తాళ్లకోడు వద్ద వేసిన లే అవుట్ విజయనగరం జిల్లా గుంకలాం వద్ద పేదల కోసం ఏర్పాటు చేసిన ఇళ్ల స్థలాలు -
ఇళ్లు.. పుష్కలంగా నీళ్లు
సాక్షి, అమరావతి: ప్రస్తుతం పట్టాలు పంపిణీ జరుగుతున్న వైఎస్సార్ జగనన్న కాలనీలన్నింటిలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించడానికి ముందే నీటి వసతి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలి ఇల్లు నిర్మాణ పనులు మొదలు పెట్టే సమయానికి.. అక్కడ ఇళ్ల సంఖ్య ఆధారంగా అవసరమైన మేరకు బోర్ల తవ్వకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బోరు తవ్విన చోట నీటిని నిల్వ ఉంచడానికి వీలుగా పెద్ద పెద్ద నీటి తొట్టెలు లేదా ప్లాస్టిక్ ట్యాంక్‌లను ఏర్పాటు చేయబోతోంది. ఇతరత్రా అవసరమైన మౌలిక వసతులు కల్పించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీలలో లే అవుట్లు వేసి, 30.76 లక్షల కుటుంబాలకు మహిళల పేరిట ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి దశలో 15.60 లక్షల ఇళ్లను నిర్మించే ప్రక్రియను కూడా శుక్రవారం సీఎం జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మార్చి 15 నాటికి పూర్తి ► లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ప్రతి కాలనీలో నీటి వసతిని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ► గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొదటి దశలో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఎంపిక చేసిన దాదాపు 8,000 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో నీటి వసతి కల్పనకు గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్యూఎస్) శాఖ రూ.641 కోట్లు, మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ రూ.279 కోట్లు కేటాయించింది. మొత్తంగా రూ.920 కోట్లు నీటి వసతి కోసం ప్రభుత్వం వెచ్చించనుంది. ► గృహ నిర్మాణ శాఖ నుంచి ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు ఇళ్ల స్థలాల వివరాలను సేకరించి.. ఎన్ని బోర్లు ఏర్పాటు చేయాలన్న దానిపై అంచనాలు తయారు చేసే పనులు ఇప్పటికే ప్రారంభించినట్టు ఆర్డబ్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ► మొదటి దశకు ఎంపిక చేసిన వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మార్చి 15 నాటికి నీటి వసతి కల్పించాలని ఆర్డబ్ల్యూఎస్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జనవరి మొదటి వారం కల్లా జిల్లాల వారీగా ఏయే కాలనీలలో ఎన్ని బోర్లు అవసరం అన్న దానిపై అంచనాలు సిద్ధం అవుతాయని ఆర్డబ్ల్యూఎస్ సీఈ సంజీవరెడ్డి చెప్పారు. పట్టణ కాలనీల్లో పబ్లిక్ హెల్త్.. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డబ్ల్యూఎస్ వైఎస్సార్ జగనన్న కాలనీల్లో నీటి వసతి కల్పించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డబ్ల్యూఎస్ ద్వారా, పట్టణ ప్రాంతాల్లో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా పనులు చేపడుతున్నాం. సీఎం ఆదేశాల మేరకు మార్చి 15 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో నిర్ధేశించుకున్న కాలనీలన్నింటికి నీటి వసతి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. – ఆర్.వి.కృష్ణారెడ్డి, ఈఎన్సీ, ఆర్డబ్ల్యూఎస్ పట్టణాల్లోని కాలనీల్లో నీటి వసతికి రూ.279 కోట్లు వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నీటి సరఫరా కోసం తొలిదశలో పట్టణ ప్రాంతాల్లోని ఎంపిక చేసిన కాలనీల్లో ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నాం. బోర్లు వేయడంతో పాటు నీటి సరఫరాకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు రూ.279 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఈమేరకు టెండర్లు పిలవడానికి రంగం సిద్ధం చేసింది. – చంద్రయ్య, ఈఎన్సీ, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం -
రెండో రోజునా.. ‘పట్టా’భిషేకం
సాక్షి నెట్వర్క్: ‘అందరికీ చోటు ఇస్తేనే అది సమాజం అనిపించుకుంటుంది. అందరికీ మంచి చేస్తేనే అది ప్రభుత్వం అనిపించుకుంటుంది. అన్ని కులాలు, మతాలు ఉంటేనే రాజధాని అవుతుంది. అటువంటి సమాజాన్ని, ప్రభుత్వాన్ని, రాజధానిని మీ అందరి చల్లని దీవెనలతో నిర్మించుకుందాం’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రెండో రోజైన శనివారం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగింది. పట్టాలు అందుకున్న అక్కచెల్లెమ్మలు ఎన్నో ఏళ్లుగా కలగానే మిగిలిన సొంతిల్లు ఇన్నాళ్లకు దక్కటంతో ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. జానెడు జాగా కోసం ఎన్నో ఏళ్లుగా పడిగాపులు పడుతున్న తమకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలు అందించి తమ కన్నీళ్లు తుడిచారంటూ కృతజ్ఞతలు తెలిపారు. పలుచోట్ల జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రెండో రోజూ అదే ఉత్సాహం శ్రీకాకుళం జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో శనివారం 5,095 మంది మహిళలకు పట్టాలు అందజేశారు. ఆమదాలవలస నియోజకవర్గం పురుషోత్తంపురంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మందస మండలంలో మంత్రి సీదిరి అప్పలరాజు చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను పంపిణీ జరిగింది. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి విజయనగరం జిల్లా జియ్యమ్మవలస, కొమరాడలో పట్టాలను పంపిణీ చేశారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గరివిడిలో, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి బలిజిపేటలో పట్టాలు అందజేశారు. విశాఖ జిల్లాలో 4,274 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు, 133 మందికి టిడ్కో ఇళ్లు అందజేశారు. తూర్పు గోదావరి జిల్లాలో 22 మండలాల పరిధిలోని 90 గ్రామాల్లో 13,522 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీలు వంగా గీత, మార్గాని భరత్‌రామ్, చింతా అనురాధ, పార్టీ విప్ దాడిశెట్టి రాజా, ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, ఏపీ పీయూసీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 10,874 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. మంత్రులు ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో 9,503 మందికి పట్టాలు అందజేశారు. మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, కొడాలి నాని, ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో 10,300 మందికి ఎమ్మెల్యేలు, అధికారులు పట్టాలు పంపిణీ చేశారు. ప్రత్తిపాడులో పట్టాలు పంపిణీ చేసేందుకు వెళ్లిన హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితను లబ్ధిదారులు గుర్రపు బగ్గీపై ఎక్కించి భారీ ఊరేగింపుగా ప్లాట్లు పంపిణీ చేసే స్థలం వరకు తీసుకువెళ్లారు. కర్నూలు జిల్లాలో 7,298 మంది మహిళలకు పట్టాలను అందజేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, శాసన మండలి విప్ గంగుల ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో 7,471 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లాలో 5,727 పట్టాలను పంపిణీ చేసినట్టు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు రెడ్డెప్ప, మిధున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఆరణి శ్రీనివాసులు, ఆదిమూలం, వెంకటేగౌడ, ఎంఎస్ బాబు, నవాజ్ బాషా పాల్గొన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 6,646 మందికి పట్టాలు పంపిణీ చేశారు. వైఎస్సార్ జిల్లాలో శనివారం 18,380 మందికి పట్టాలు అందజేశారు. డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్‌బాషా. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ జకియాఖానమ్, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, కలెక్టర్ హరికిరణ్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో రెండో రోజైన శనివారం 990 మందికి పట్టాలు పంపిణీ చేశారు. పదేళ్ల సర్వీసులో ఇలాంటి అభివృద్ధి చూడలేదు నేను సర్వీసులో చేరి పది సంవత్సరాలు కావస్తోంది. ఇలాంటి అభివృద్ధిని చూడలేదు. సీఎం వైఎస్ జగన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ విధంగా పేదలకు సేవ చేయడంలో ఎంతో సంతృప్తి లభిస్తోంది. నారాయణ భరత్‌గుప్త, కలెక్టర్, చిత్తూరు తూ.గోదావరి జిల్లా కొమరగిరిలో ఇళ్ల పట్టాలు అందుకునేందుకు భారీ సంఖ్యలో వచ్చిన మహిళలు చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాంపల్లెలో ఇళ్ల పట్టాల పంపిణీ సభకు హాజరైన లబ్ధిదారులు -
జగన్ బాత్రూమ్ను లోకేశ్ కడిగాడా?
సాక్షి, గుడ్లవల్లేరు (గుడివాడ): పేదలకు ప్రభుత్వం నిర్మించే ఇళ్లను సీఎం వైఎస్ జగన్ ఇంటి బాత్రూమ్తో పోల్చిన లోకేశ్.. ఎప్పుడైనా ఆ బాత్రూమ్ను కడిగాడా? అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. పేదలకు నిర్మించే ఇంటి ని బాత్రూమ్తో పోల్చటంతో పేదలంటే లోకేశ్‌కు ఎంత చులకనో అర్ధమవుతోందన్నారు. గుడ్లవల్లేరులో శనివారం ఇళ్ల పట్టాలను అందించి, గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేసే కార్యక్రమానికి మంత్రి కొడాలితోపాటు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి హాజరయ్యారు. ఎవరి బాత్రూమ్ ఎంత ఉందో కొలిచే దుస్థితిలో బాబు, లోకేశ్ ఉన్నారని ఎద్దేవా చేశారు. పేదలపై అంత కడుపు మంట ఎందుకని కొడాలి నాని ప్రశ్నించారు. బాబు ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్‌లో ఒక్కో ఇంటి వైశాల్యం 244 చదరపు అడుగులుంటే, జగన్ ఇచ్చే ఇంటి వైశాల్యం 340 చదరపు అడుగులుందన్నారు. వైఎస్సార్ భూసేకరణ.. పట్టాలిస్తున్న జగన్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 12 ఏళ్ల కిందట గుడ్లవల్లేరులో 31 ఎకరాలను ఇళ్ల స్థలాలకు భూసేకరణ చేస్తే.. ఇప్పుడు అక్కడ వైఎస్ జగన్ వాటికి పట్టాలిచ్చి ఇళ్లను నిర్మిస్తున్నారని కొడాలి నాని అన్నారు. వైఎస్ మరణానంతరం, కిరణ్, రోశయ్య, చంద్రబాబు ఈ ప్రాంతానికి ఐదు పైసలు కూడా ఖర్చు పెట్టడంగాని ఒక్క ఇంటి పట్టా ఇవ్వడంగాని చేయలేకపోయారన్నారు. -
ఒక అద్భుతం... ఓ ఆశ్చర్యం!
విశ్వరహస్య పేటిక గుట్టుమట్లు తెలిసిన రెండే రెండు శక్తులు టైమ్ అండ్ స్పేస్. ఆ రెండు శక్తులపై అదుపు సాధించడం ఇప్పటిదాకా మనిషికి సాధ్యం కానే లేదు. అందుబాటులో ఉన్న జ్ఞానం మేరకు అవి ఆదిమధ్యాంత రహితాలు. అందువలన కాలమూ, స్థలమూ అనే ఆ శక్తులు మనకు దైవ సమానాలు. కాలయానం ఒక అనంతగమనం. ఆ గమనంలో రెండువేల ఇరవై అనే సంవత్సరం ఒక లిప్తపాటు. మానవాళి చేసిన తప్పిదాలకు గాను ఆ లిప్తపాటు కాలం విధించిన శిక్ష మనకు ఓ పదేళ్ల జైలుశిక్షతో సమానం. ఎందుకంటే, రెండువేల ఇరవైలో మన ఆర్థిక రంగానికి కోవిడ్ చేసిన గాయం మరో పదేళ్లపాటు బాధిస్తుందని నిపుణులు చెబుతున్నారు గనుక. ఒక్క మన దేశంలోనే లక్షలకొలది చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. చిరు వ్యాపారులు చితికిపోయారు. ఆతిథ్య నిర్మాణ రంగాలు కుదేలైనాయి. కోట్లాదిమంది ఉపాధి, ఉద్యోగాలను కోల్పో యారు. వారంతా యుద్ధంలో ఓడిపోయి గాయపడిన సైనికుల మాదిరిగా కనిపించారు. నెత్తురోడే పాదాలతో నడక పందెంలో పాల్గొంటున్నట్టుగా నడిచారు. వారి తిరోగమన యాత్ర నెలల తరబడి సాగింది. కోవిడ్ నామ సంవత్సరంగా పరిణమించిన రెండువేల ఇరవై మన జీవన గమనాలను కూడా దారి మళ్లించింది. విద్యారంగం ఆన్‌లైన్‌గా మారింది. లేదా అటకెక్కింది. ఉద్యోగాల్లో కొన్ని ఆన్‌లైన్‌కే పరిమితమైపోయాయి. చెప్పుకుంటూపోతే చాలా మార్పులను మోసుకొచ్చింది ఈ సంవత్సరం. ఏడాది పొడవునా నెత్తుటి మరకల్ని చేసినప్పటికీ, పోతూపోతూ కొన్ని మెరుపుల్ని కూడా వెలిగించింది. భారతదేశానికి సంబంధించినంత వరకు ఈ సంవత్సరం చివరి రోజుల్లో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ఒక ఆశ్చర్యం మొలకెత్తింది. అద్భుతం ఆంధ్రప్రదేశ్‌లో, ఆశ్చర్యం ఢిల్లీ సరిహద్దుల్లో. క్రిస్మస్ పర్వదినం, వైకుంఠ ఏకాదశి జమిలిగా వచ్చిన డిసెంబర్ 25వ తేదీనాడు 30 లక్షల మందికి పైగా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల పట్టాలను ప్రదానం చేయడాన్ని ప్రారంభించారు. రెండు వారాల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఇంత స్వల్పకాలంలో ఇన్ని లక్షలమందికి ఇళ్ల పట్టాలివ్వడమే ఒక ప్రపంచ రికార్డు. ఆ రికార్డుకు మించి ఇక్కడొక విప్లవాత్మక పరిణామం చోటుచేసుకున్నది. ఆ పట్టాలన్నీ మహిళల పేరుమీదనే ప్రదానం చేయడం ఆ పరిణామం. మరో మూడేళ్లలో వారందరికీ నయాపైసా ఖర్చులేకుండా ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వ బోతున్నది. మహిళా లోకాన్ని ఉద్దేశించి మాట్లాడే ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘నా అక్క చెల్లెమ్మలు’ అంటూ ఆప్యాయంగా సంబోధిస్తారు. ‘అనగనగా ఒక అన్నయ్య, తాను తోబుట్టువులుగా భావించే 30 లక్షలమందికి వారి లైఫ్‌టైమ్ కలల్ని నెరవేర్చే కానుకల్ని ఆడబిడ్డ కట్నంగా ఏకకాలంలో సమకూర్చాడు...’ అని భవిష్యత్తులో తరతరాలు ఈ వృత్తాంతాన్ని కథలుగా చెప్పుకునేంత కీలక పరిణామం ఇది. సమాన హక్కుల కోసం, ఆస్తిలో వాటా కోసం, సమానమైన పనికి పురుషులతో సమానంగా జీతం కోసం, బండెడు ఇంటి చాకిరీకి కనీస గుర్తింపు కోసం, ఆత్మగౌరవం కోసం మహిళలు పడుతున్న తపన ఏనాటిది? ఆ తపన క్రియాశీలక ఉద్యమ రూపం దాల్చి కూడా ఆరు దశాబ్దాలు కావస్తున్నది. ఈ ఆరు దశాబ్దాల ప్రస్థానంలో మహిళలకు లభించిన అతిపెద్ద విజయం ఇదే. ఆస్తిని సమకూర్చడం మాత్రమే కాదు. ఆ ఆస్తి దానవిక్రయాది సమస్త హక్కులతో భుక్తమైనప్పుడే నిజమైన ఆస్తిగా పరిగణన పొందుతుందని ముఖ్యమంత్రి భావించారు. అందుకోసం పక్కాగా రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లనే ఆడపడుచులకు అందజేసేలా ప్రణాళికను తయారు చేసుకున్నారు. అయితే ఈ కార్యక్రమం అమలైతే ముఖ్యమంత్రికి మంచి పేరొస్తుందన్న ఒకే ఒక దుగ్ధతో తెలుగుదేశం పార్టీ అధినేత కోర్టుల్లో కుంటిసాకులతో పిటిషన్లు వేయించారు. కోర్టు కూడా రాజ్యాంగబద్ధమైన హక్కుల్ని, సామాజిక న్యాయాన్ని చూడకుండా సాకుల ఆధారంగా స్టేలు ఇవ్వడం ఒక విషాదం. అయినప్పటికీ న్యాయస్థానాల్లో పోరాడి పక్కా రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను అందజేస్తామని, ఈలోగా అక్కచెల్లెమ్మలకు డి–పట్టాలను అందజేయడాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడిదొక పెద్ద సందడి. గొప్ప పండుగ సందడి. క్రిస్మస్, వైకుంఠ ఏకాదశితో ప్రారంభమై సంక్రాంతి సీజన్ వరకు రెండు వారాలపాటు ఇళ్ల పండుగ కొనసాగబోతున్నది. వైఎస్సార్ జగనన్న కాలనీల పేరుతో రూపొందుతున్న ఈ ఇళ్లు నిజానికి కాలనీలు మాత్రమే కాదు.. కొత్త ఊళ్లు. ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడమే కాదు, ఇళ్లను నిర్మించి ఇవ్వడం, మౌలిక సదుపాయాలన్నింటినీ ప్రభుత్వ ఖర్చుతో కల్పించడం ద్వారా 17,005 కొత్త ఊళ్లనే జగన్ ప్రభుత్వం నిర్మించబోతున్నది. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కలిపి ఇప్పటికే ఉన్న గ్రామాల సంఖ్య 17,128. అంతకు సమానమైన సంఖ్యలో కొత్త గ్రామాల నిర్మాణాన్ని ప్రభుత్వం తలకెత్తు కున్నది. ఏ దేశ చరిత్రలోనైనా ఈ రికార్డు నభూతో నభవిష్యతి. ఈ కొత్త గ్రామాల్లో ఇళ్లన్నీ మహిళల పేర్ల మీదనే ఉంటాయి కనుక రాష్ట్రంలోని సగం గ్రామాలకు మహిళలే మహరాణులన్నమాట. ‘గృహిణి’ అనే మాటకు సార్థకత చేకూరనున్నది. కొత్త ఊళ్లలో జనాభా ప్రాతిపదికన ఇరవైకి పైగా మునిసిపాలిటీల స్థాయిని అందుకునే అవకాశం ఉన్నది. ఇళ్ల నిర్మాణాలు పూర్తయి, మౌలిక వసతులన్నీ సమకూరిన తర్వాత మరో నాలుగేళ్లలో ఇళ్ల మార్కెట్ విలువ ఇబ్బడిముబ్బడిగా పెరగబోతున్నది. ఒక్కో ఇల్లు హీనపక్షం ఎనిమిది నుంచి పదిలక్షల కిమ్మత్తు చేయవచ్చు. అంటే ఇప్పుడు నిర్మించబోతున్న ఊళ్లు పూర్తయ్యేసరికి మూడు లక్షల కోట్ల విలువ చేస్తాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు తన అక్కచెల్లె మ్మలకు ఆడపడుచు లాంఛనంగా అందజేస్తున్న కానుక ఖరీదు అక్షరాల త్రీ ట్రిలియన్ రూపీస్! ప్రతి మహిళను లక్షాధికారిని చేయడం తన కల అని డాక్టర్ రాజశేఖరరెడ్డి గారు అనేవారు. రాబోయే కొద్దికాలంలోనే సుమారు పది లక్షల ఖరీదు చేసే ఇళ్లకు యజమానులుగా 30 లక్షలమంది మహిళలు ‘మిలియనీర్లు’ కాబోతున్నారు. ఇంటి యాజమాన్యంతోపాటు పిల్లల భవిష్యత్తును నిర్ణయించడంలో కూడా తల్లులదే కీలకపాత్ర కాబోతున్నది. అమ్మఒడి పథకం మహిళలకు ఈ ప్రివిలేజ్‌ను కల్పించింది. మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయడం కోసం నామినేటెడ్ గౌరవ పదవుల్లోనూ, నామినేషన్‌పై చేసే కాంట్రాక్టు పనుల్లోనూ 50 శాతం మహిళల హక్కుగా చట్టబద్ధం చేశారు. తాగుబోతు భర్తల ఆగడాల నుంచి విముక్తి చేయడంకోసం మద్య నియంత్రణ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలుచేస్తున్నారు. మహిళలపై పోకిరీల ఆగడాలకు ముకుతాడు వేయడానికి దేశంలోనే తొలిసారిగా ‘దిశ’ చట్టాన్ని తీసుకొని వచ్చారు. 45 నుంచి 60 యేళ్ల మధ్య వయసున్న ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు వైఎస్సార్ ఆసరా కింద ఏటా 18,750 రూపాయలను నాలుగేళ్లపాటు ఇస్తున్నారు. చంద్రబాబు పాలనలో డ్వాక్రా సంఘాలు బ్యాంకులకు బకాయిపడిన 27 వేల కోట్ల రూపాయలను దశలవారీగా జగన్ ప్రభుత్వం సంఘాలకు చెల్లిస్తున్నది. ఫలితంగా 8 లక్షల 71 వేల డ్వాక్రా సంఘాలు ప్రయోజనం పొందాయి. సున్నా వడ్డీ పథకం కింద కూడా జగన్ ప్రభుత్వం చెల్లింపులు చేసింది. ఈ ప్రోత్సాహాల కారణంగానే పొదుపు ఉద్యమంలో ఏపీ డ్వాక్రా సంఘాలు దేశంలోనే అగ్రభాగాన నిలబడ్డాయని నాబార్డ్ నివేదిక చాటిచెప్పింది. మహిళా సాధికారత కోసం జరిగే కృషిలో నిస్సందేహంగా వైఎస్ జగన్ ప్రభుత్వం అగ్రస్థానంలో ఉన్నది. ఇక ఏపీ మహిళాలోకం నిండైన ఆత్మ విశ్వాసంతో కొత్త సంవత్సరాన్ని స్వాగతించవచ్చు. ఢిల్లీ సరిహద్దులను పంజాబ్ రైతులు దిగ్బంధం చేయడం ప్రారంభించి నెలరోజులు దాటింది. వారికి క్రమంగా హరి యాణా, పశ్చిమ యూపీ రైతులు కూడా తోడయ్యారు. సహజంగానే రాజకీయ పక్షాలు కూడా ప్రవేశించాయి. ఢిల్లీ నుంచి హరియాణాకు, రాజస్తాన్‌కు, యూపీకి దారితీసే రహదారులు నెలరోజులుగా ఆందోళనకారుల అధీనంలోనే ఉన్నాయి. ఏడెనిమిది క్యాంపులుగా రైతులు ఆందోళనకు దిగారు. దీర్ఘకాలంపాటు ఆందోళన కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లనూ వారు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన మూడు చట్టాలను బేషరతుగా రద్దుచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా రెండు అంశాల్లో పంజాబ్ రైతులు భయ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. కొత్త చట్టాల ఫలితంగా భవిష్యత్తులో కనీస మద్దతు ధర రద్దవుతుందని మొదటి భయం. మండీ (మార్కెట్) వ్యవస్థ అంతరించి కార్పొరేట్ కంపెనీల పెత్తనం పెరుగుతుందని రెండో భయం. ఈ రెండూ కచ్చితంగా కొనసాగుతాయని ప్రభుత్వం గట్టిగా హామీ ఇచ్చింది. అయినా రైతులు నమ్మడం లేదు. ఇందుకు కారణం ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టడమేనని ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఇక్కడ చర్చ ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాల్లోని గుణదోషాల గురించి కానీ, రైతుల కోర్కెల్లోని ఉచితానుచితాల గురించి కానీ కాదు. ఇందిరాగాంధీ ప్రభుత్వం తర్వాత అంతటి బలమైన ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది. ప్రతిపక్షం పూర్తిగా నిర్వీర్యమై, నిస్తేజమైన స్థితిలో ఉన్నది. ఇటువంటి పరిస్థితిలో బలమైన కేంద్ర సర్కార్‌ను లెక్క చేయకుండా రైతాంగం తెగించి శాంతియుత సమరానికి దిగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఈ తెగింపు ఈ దేశ ప్రజాస్వామ్య పునాదుల మీద నమ్మకాన్ని కలిగిస్తున్నది. మన ప్రజాస్వామ్యం భవిష్యత్తు మీద ఆశను ఎర్రకోటపై ఎగురుతున్న జాతీయ పతాకమంత ఎత్తున నిలబెడుతున్నది. ప్రతిపక్షం కునారిల్లినంతమాత్రాన ప్రశ్నించే గొంతుక మూగబోదనే సింహకంఠనాదం ఆ రైతుల నినాదాల్లో ప్రతిధ్వనిస్తున్నది. ఈ దేశంలో అత్యధిక జనాభాకు ఆశ్రయం కల్పిస్తూ కూడా నానాటికీ సంక్షోభంలో కూరుకుపోతున్నది వ్యవసాయ రంగమేనని అందరూ అంగీకరిస్తారు. రైతుకు వ్యవసాయం లాభసాటిగా లేదని కూడా అంగీకరిస్తారు. అయినా రైతులు ఆందోళనకు దిగడం చాలా అరుదు. ‘‘అలుగుటయే ఎరుంగని మహా మహితాత్ముడు అజాతశత్రువే అలిగిన నాడు...’’ ఏమవు తుంది? అజాతశత్రువు ఇప్పుడు అలిగాడు. ఫలితం... ఎదురులేదనుకున్న మోదీ సర్కార్ మోకాళ్లపై కూర్చుని రైతులను బతిమిలాడుతున్నది. బుజ్జగిస్తున్నది. ఈ ఆందోళనకు ఒక అర్థవంతమైన ముగింపు తక్షణ అవసరం. ముగింపు ఎలా ఉన్నా ప్రశ్నించే గొంతుక జీవించే ఉంటుందన్న ఒక్క ఆశ చాలు... కొత్త సంవత్సరాన్ని స్వేచ్ఛగా శ్వాసించడానికి! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
సెంటు స్థలం ఇవ్వని వారికి విమర్శించే హక్కుందా?
సాక్షి, తాడేపల్లి : విప్లవాత్మక ఆలోచన చేసి పేదలందరికీ ఇల్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే చెందుతుందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన శనివారం మాట్లాడుతూ.. ఇళ్ల పట్టాల పంపిణీ కేవలం సంక్షేమ కార్యక్రమం కాదని, ఒక ఆర్థిక కార్యక్రమం కూడా అని పేర్కొన్నారు. దీని ద్వారా ఎంతో మందికి ఉపాధి కలగనుందని తెలిపారు. కరోనా పరిస్థితుల్లో సంక్షేమం అందిస్తూ ఆర్థిక పరిపుష్టికి కృషి చేస్తున్నారు. దీని ద్వారా 20 కోట్ల మందికి పనిదినాలు దొరుకుతాయన్నారు. దీనిని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. వారు జీవితంలో ఇలాంటి విప్లవాత్మక కార్యక్రమం చేపట్టారా.. అని ప్రశ్నించారు. అసలు ఒక సెంటు స్థలం అయినా ఇవ్వని వారికి ఈ రోజు విమర్శించే హక్కు ఉందా అని మండిపడ్డారు. చదవండి: ‘పేదలకు ఇళ్లు.. ఆయనకొచ్చిన నష్టమేమిటి?’ అమరావతిలో పేద వారికి ఇల్లు ఇస్తామంటే సామాజిక అసమతుల్యత అన్నది మీరు కాదా. మీకు చిత్త శుద్ధి ఉంటే.. ఎలాంటి దురుద్దేశం లేకపోతే ఆ కేసును ఉపసంహరించుకోండి. పేదలకు ఇళ్ళు ఇద్దాం.ఇల్లు అనేది ఒక ఆత్మగౌరవం...సామాజిక స్థితి పెరుగుతుంది...అది మీకు ఇష్టం లేదా...? ఈ ఇళ్ల కోసమే కదా ఆందోళనలు చేసింది. ఒక ముఖ్యమంత్రి నేను ఇస్తాను అంటే వ్యతిరేకిస్తారా. కనీసం ఇలాంటి పోరాటాలు చేసిన కమ్యూనిస్టులు అయినా అభినందలు తెలపండి. ఇళ్ల పట్టాలపై స్టే తెచ్చిన వారంతా ఉపసంహరించుకోండి. లేదంటే మీరు చరిత్ర హీనులుగా మిగులుతారు. మీరు రైతులను బెదిరించి భూములు తీసుకున్నారు...మా జగన్ గారు చట్టప్రకారం 2013 యాక్ట్ ప్రకారం సేకరించారు. చదవండి: సొంతింటి కల సాకారం -
సొంతింటి కల సాకారం
కొమరగిరి నుంచి సాక్షి ప్రతినిధి : క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఏకంగా 30.75 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కోటి 24 లక్షల మందికి మేలు చేకూరే ఈ కార్యక్రమం వల్ల లక్షలాది మంది అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు చూడగలుగుతున్నానని చెప్పారు. శుక్రవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో వైఎస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్లో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పైలాన్ ఆవిష్కరించి, పేదలకు నిర్మించి ఇచ్చే ఇంటి మోడల్‌ను సందర్శించారు. అనంతరం లబ్ధిదారులనుఉద్దేశించి మాట్లాడారు. రూ.50,940 కోట్లతో రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్లు నిర్మిస్తామని, తొలి దశ కింద 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఇవాళే శ్రీకారం చుడుతున్నామన్నారు. వీటి విలువ అక్షరాలా రూ.28 వేల కోట్లు అని, వీటితో పాటు 2.62 లక్షల టిడ్కో ఇళ్లకు కూడా సేల్ అగ్రిమెంట్ ఇవ్వబోతున్నామని చెప్పారు. రెండో విడతలో మిగిలిన 12.70 లక్షల ఇళ్ల నిర్మాణం వచ్చే ఏడాది మొదలవుతుందన్నారు. ‘ఒక్కసారి ఈ లేఅవుట్లు చూస్తుంటే, ఇక్కడ వైఎస్సార్ జగనన్న కాలనీలు కాదు.. ఏకంగా ఊళ్లు రాబోతున్నాయి. అక్షరాలా 16,681 ఇళ్ల స్థలాల పట్టాలు. వాటిలో వైఎస్సార్ జనతా బజార్, వైఎస్సార్ క్లినిక్, బస్టాప్, అంగన్వాడీ కేంద్రం, ఫంక్షన్ హాలు, ప్రైమరీ స్కూల్, హైస్కూల్, కమ్యూనిటీ హాలు, పార్కుల వంటివి కాలనీ సైజును బట్టి ఏర్పాటవుతాయి’ అని వివరించారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఒక్కో ప్లాటు విలువ రూ.4 లక్షలు ► ఇప్పుడు ఈ లేఅవుట్లోని ఒక్కో ప్లాటు మార్కెట్ విలువ రూ.4 లక్షలు. అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా నాతో దేవుడు ఇంత మంచి కార్యక్రమం చేయిçస్తున్నాడు. ఇంతకన్నా భాగ్యం ఏముంటుంది?. ► సొంత ఇల్లు లేని వారి బాధ నాకు తెలుసు. నా సుదీర్ఘ 3,648 కి.మీ. పాదయాత్రలో ప్రతి అడుగులోనూ చూశాను. ఆ పరిస్థితి మార్చాలని గట్టిగా సంకల్పం చేసుకున్నాను. పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తామని మేనిఫెస్టోలో చెప్పాను. ► మనకు ఓటు వేయకపోయినా సరే అర్హత ఉంటే ఇవ్వాలని దిశా నిర్దేశం చేశాం. చెప్పిన దానికి మించి 30.75 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు, ఇళ్లు కూడా కట్టించి ఇవ్వబోతున్నామని మీ బిడ్డగా గర్వంగా చెబుతున్నా. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు ► రాష్ట్రంలో 13 వేల గ్రామ పంచాయతీలు ఉంటే, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీలు వస్తున్నాయి. ఈ కాలనీల్లో లేఅవుట్లు వేసి ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా, తాగు నీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి అన్ని సదుపాయాలు కల్పించబోతున్నాం. వాటికి మరో రూ.7 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా. ► గతంలో 224 చదరపు అడుగుల ఇల్లు మాత్రమే కడితే, ఇవాళ 340 అడుగుల్లో లబ్ధిదారులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు కట్టించి ఇస్తున్నాం. మొత్తం 68,361 ఎకరాల్లో లేఅవుట్లు వేసి, ప్లాట్లు చేసి అక్క చెల్లెమ్మలకు ఇవ్వబోతున్నాం. వాటి మార్కెట్ విలువ అక్షరాలా రూ.25,530 కోట్లు. పట్టణ ప్రాంతాల్లో సెంటు నుంచి సెంటున్నర వరకు, గ్రామీణ ప్రాంతాల్లో కచ్చితంగా 1.5 సెంట్ల భూమి ఇస్తున్నాం. ► ఇంట్లో ఒక బెడ్రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, వరండా, టాయిలెట్, పైన సింటెక్స్ ట్యాంక్, ఇంట్లో రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, మరో రెండు ఎల్ఈడీ లైట్లు కూడా ఉంటాయి. కాలనీల్లో 13 లక్షల మొక్కలు నాటిస్తాం. రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనుకున్నా.. ► ఇల్లు కట్టించి ఇచ్చాక 5 ఏళ్లకు ఆ అక్క చెల్లెమ్మలకు అవసరమై ఆ ఇల్లు అమ్ముకోవాలన్నా లేదా ఇంటిపై రుణం పొందాలన్నా అన్ని హక్కులు ఉండేలా పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలనుకున్నాను. అయితే కొందరి కుట్రలు, కుతంత్రాల వల్ల జాప్యం జరుగుతోంది. ► న్యాయపరమైన అడ్డంకులు తొలగిన వెంటనే, డి–ఫామ్ పట్టాల స్థానంలో సర్వ హక్కులతో అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేయించి ఇస్తాం. ఇందు కోసం ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా పోరాడుతుంది. కొందరి దుర్బుద్ధి వల్ల ఈ పట్టాల పంపిణీ ఇప్పటికే పలు మార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ► మన 18 నెలల పాలన కాలంలో ఏకంగా రూ.77 వేల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇలా మేలు జరుగుతోంటే పసుపు పార్టీల ముఖాలు ఎరుపు రంగుకు ఎలా మారుతున్నాయో మీరంతా చూస్తున్నారు. టిడ్కో ఇళ్లు (ఫ్లాట్లు) ► టిడ్కో ఇళ్లకు (ఫ్లాట్లు) గత ప్రభుత్వం రూ.3 వేల కోట్లు బకాయి పెట్టి, సగంలో వదిలేసి పోయింది. 2.62 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేసి అందిస్తాము. వాటిని పూర్తి చేయడానికి మరో రూ.9,500 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ► ఈ టిడ్కో ఇళ్లలో 300 చదరపు అడుగుల ఇంటిని కేవలం ఒక్క రూపాయికి ఇచ్చే జగనన్న స్కీమ్ కావాలా? లేక మొత్తం రూ.7.20 లక్షలు చెల్లించే చంద్రబాబు స్కీమ్ కావాలా? అని రాష్ట్ర వ్యాప్తంగా ఆప్షన్ కోరితే ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీమ్ కావాలన్నాడు. ఆయన కోరిక ప్రకారం ఆయనకు ఆ స్కీమ్. మిగిలిన వారికి జగనన్న స్కీమ్ ఇస్తాం. ► 300 చదరపు అడుగుల ఇంటిని కేవలం ఒక్క రూపాయికే ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.3,805 కోట్ల భారం పడుతోంది. 365, 430 అడుగుల ఇళ్ల లబ్ధిదారులు వారు కట్టాల్సిన ముందస్తు వాటాలో 50 శాతం ప్రభుత్వం భరిస్తుండటం వల్ల ప్రభుత్వంపై రూ.485 కోట్లు భారం పడుతోంది. అయినా చిరునవ్వుతో భరిస్తున్నాం. చట్టబద్ధమైన హక్కు ► 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. అంటే ఇల్లు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. అయినా కోర్టులకు వెళ్లడం, అవి స్టేలు ఇవ్వడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ► ఇల్లు ఇవ్వడం ద్వారా తరతరాలుగా అణచివేతకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలే కాకుండా, పేదరికంలో మరిగిపోయిన అగ్రకులాలకు చెందిన వారికి సామాజిక గౌరవాన్ని, హోదాను, ఆర్థిక, ఆరోగ్య, భద్రత, మొత్తంగా మా ఇల్లు అనే భావాన్ని కలగజేస్తున్నాం. ► అనంతరం ఇంటి స్థలం పట్టా (డి–ఫామ్ పట్టా), ఇంటికి సంబంధించిన నిర్మాణం మంజూరు పేపరు, టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు సీఎం అందజేశారు. కొమరగిరి లేఅవుట్లోని మోడల్ హౌస్‌ను సంబంధిత లబ్ధిదారురాలికి అందజేశారు. ► పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అధ్యక్షతన జరిగిన ఈ సభలో డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, పి.విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. 30 రకాల వృత్తుల వారికి ఉపాధి 8 ఇల్లు నిర్మాణం అంటే, ముగ్గు పోసి పునాదులు తవ్వడంతో అయిపోదు. ఇన్ని ఇళ్లు కట్టడం అంటే రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందన్నది చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. తాపీ మేస్త్రి మొదలు.. కూలీలు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్లు, వెల్డర్లు.. ఇలా కనీసం 30 రకాల వృత్తుల వారికి ఉపాధి దొరుకుతుంది. 8 తొలి దశలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్లకు 69.70 లక్షల టన్నుల సిమెంట్, 7.4 లక్షల టన్నుల స్టీల్, 310 లక్షల టన్నుల ఇసుక, 235 కోట్ల ఇటుకలు, 223 కోట్ల మెట్రిక్ టన్నుల మెటల్ వాడుతున్నారు. వ్యవస్థలో ఆర్థికంగా బూస్ట్ వస్తుంది. లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. ఇంటి నిర్మాణానికి అక్కచెల్లెమ్మలకు మూడు ఆప్షన్లు ఆప్షన్ 1 : ప్రభుత్వం చూపిన నమూనా మేరకు అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామగ్రి ప్రభుత్వం సరఫరా చేస్తుంది. లేబర్ చార్జీలు మీ చేతికి ఇస్తాం. మీరే దగ్గరుండి ఇల్లు కట్టించుకోవచ్చు. ఆప్షన్ 2 : లబ్ధిదారులే ఇంటి సామగ్రి తెచ్చుకుని ఇల్లు కట్టుకోవచ్చు. పనుల పురోగతిని బట్టి దశల వారీగా డబ్బులు మీ చేతికి ఇస్తాం. ఆప్షన్ 3 : ప్రభుత్వమే స్వయంగా మంచి మెటీరియల్‌తో ఇల్లు కట్టించి ఇస్తుంది. ఇందులో ఏ ఆప్షన్ తీసుకున్నా ఫరవాలేదు. వలంటీర్ల సహాయంతో మీకు కేటాయించిన స్థలం వద్ద ఉండండి. అధికారులు మీ దగ్గరకు వచ్చి మీకు డి–ఫామ్ పట్టాలు ఇస్తారు. మీ ఫొటోలు తీస్తారు. మీరు ఏ విధానంలో ఇల్లు కావాలో ఆ ఆప్షన్‌కు టిక్ చేసి ఇవ్వండి. ఇంకా అర్హులెవరైనా మిగిలిపోయి ఉంటే దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో కేటాయిస్తాం. ఇది నాకు దేవుడిచ్చిన వరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ‘పాదయాత్ర సమయంలో సొంతిల్లు లేని నిరుపేదల కష్టాన్ని కళ్లారా చూశాను. వారి సొంతింటి కలను నెరవేరుస్తానని నాడు మాట ఇచ్చా’నని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈరోజు అక్షరాలా 30.75 లక్షల ఇంటి స్థల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం, అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు చూడడం దేవుడిచ్చిన అదృష్టంగా, వరంగా భావిస్తున్నట్లు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. అలాగే, రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ జగన్ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం రోజున ముక్కోటి దేవతల ఆశీస్సులతో ప్రతి కుటుంబం ఆనందం, ఆరోగ్యాలతో విలసిల్లాలని ప్రార్థిస్తున్నానన్నారు. అంతేకాక.. సాటి మనుషులపట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువులపట్ల క్షమ వంటి క్రీస్తు సందేశాలు మనల్ని సన్మార్గంలో నడిపించాలని, రాష్ట్ర ప్రజలపై క్రీస్తు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. మా జీవితంలో నిజమైన పండుగ అద్దె ఇంట్లో 16 ఏళ్లుగా ఉంటూ ఎన్నో కష్టాలు పడుతున్న మా కుటుంబానికి నేడు నిజమైన పండుగ వచ్చింది. సంక్రాంతి, దసరా వంటి పండుగలు ఏటా వస్తాయి. కానీ ఎన్నో ఏళ్ల నుంచి కలలు కంటున్న ఇంటి స్థలం, సొంత ఇల్లు నేడు సీఎం జగన్ అన్న ఇస్తుంటే మా జీవితంలో ఇదే నిజమైన పండుగ. నా భర్తకు రూ.6 వేల జీతం. ఇద్దరు పిల్లలతో సంసారాన్ని నెట్టుకొస్తున్నాం. ఇంటికి అమ్మా నాన్నలను కూడా పిలవలేని పరిస్థితి. గత ప్రభుత్వంలో ఇంటి స్థలం కోసం కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేదు. ఇప్పుడు దరఖాస్తు చేయగానే ఇంటి స్థలం వచ్చింది. మా సొంత అన్నే వచ్చి ఈ స్థలం ఇచ్చినట్లుంది. సీఎం జగనన్న రుణం తీర్చుకోలేనిది. – రామశెట్టి నాగమల్లేశ్వరి, 3వ వార్డు, కాకినాడ మీరే మా దేవుడు సీఎం జగనన్నా.. మీరు మా కుటుంబానికి దేవుడు. మా కలను నిజం చేస్తూ ఇంటి స్థలాన్ని అందించారు. మేము చాలా పేదోళ్లం. ఏటా ఇంటి అద్దె రూ.500 పెంచుతుంటే, ఆ డబ్బులతో మమ్మల్ని చదివించాలని తక్కువ అద్దెకు దొరికే ఇళ్ల కోసం మా అమ్మ ఎన్నో వీధులు తిరిగిన రోజులు కళ్లెదుట మెదలుతున్నాయి. పెళ్లయ్యాక ఓ రోజు ఇంటి యజమాని మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమన్నాడు. చిన్న బాబును ఎత్తుకుని అద్దె ఇంటి కోసం వీధి వీధి తిరిగాం. ఇకపై ఆ కష్టాలు ఉండవన్నా. పిలిచి ఇంటి స్థలం మహిళల పేరుతోనే ఇస్తున్నారు. మీకు కోటి వందనాలన్నా. – పెంకే నాగ భవాని, బర్మా కాలనీ, 7వ వార్డు, కాకినాడ అందరికి చోటు ఇస్తేనే అది సమాజం అనిపించుకుంటుంది. అందరికి మంచి చేస్తేనే అది ప్రభుత్వం అని అనిపించుకుంటుంది. అన్ని కులాలు, మతాలు ఉంటేనే రాజధాని అవుతుంది. అటువంటి సమాజాన్ని, ప్రభుత్వాన్ని, రాజధానిని మీ అందరి చల్లని దీవెనలతో నిర్మించుకుందాం. 2011 లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4.95 కోట్లు. ఇప్పుడు దాదాపు 31 లక్షల ఇళ్ల స్థలాలు అక్క చెల్లెమ్మల చేతిలో పెడుతున్నామంటే, ఒక్కో ఇంట్లో సగటున నలుగురిని లెక్కేసుకున్నా దాదాపు 1.24 కోట్ల మందికి మేలు చేస్తున్నాం. ఇదే తూర్పు గోదావరి జనాభా 51.54 లక్షలు. గుంటూరు జిల్లా జనాభా 48.88 లక్షలు. కడప, శ్రీకాకుళం జిల్లాలు కూడా కలిపితే 1.24 కోట్ల మంది. అంటే ఏ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతోందో ఆలోచించండి. 175 నియోజక వర్గాల్లో నేటి నుంచి 15 రోజులు పాటు ఇళ్ల పండుగ జరగబోతోందని సగర్వంగా చెబుతున్నా. – సీఎం వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లా కొమరగిరిలో పట్టాల ప్రారంభ కార్యక్రమం సభకు భారీగా హాజరైన మహిళలు తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో జరిగిన బహిరంగ సభలో ఇళ్ల స్థలాల లేఔట్‌ను చూపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఇళ్ల పట్టాల లేఔట్లో లబ్ధిదారులు సభ ప్రాంగణం సమీపంలో నమూనా ఇంటిని పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్; తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో జరిగిన బహిరంగ సభ ప్రాంగణం సమీపంలో ఇళ్ల స్థలాల పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్ -
ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
-
పేద మహిళలను లక్షాధికారులను చేశారు
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో పేదవాడి సొంతింటి కల నెరవేరిందని, లబ్ధిదారులు ఇళ్ల స్థలాలు చూసి ఆనందంతో మురిసిపోతున్నారని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేదవాడు ఎక్కడా ఒక సెంటు భూమి కూడా కొనలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి సమయంలో సీఎం వైఎస్ జగన్ పేదలందరికీ గొప్ప అవకాశం ఇచ్చారని ప్రశంసించారు. తూర్పు గోదావరిలోని కొమరగిరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. (చదవండి: 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాల పంపిణీ) ఈ సందర్భంగా హోం మంత్రి సుచరిత శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహిళలను లక్షాధికారులను చేయాలని ఎప్పుడూ అంటూ ఉండేవారని గుర్తు చేశారు. సీఎం జగన్ దాదాపు ముప్పై ఒక్క లక్షల మంది పేద మహిళలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి వారిని ఒకేసారి లక్షాధికారులను చేశారని ప్రశంసించారు. గత ప్రభుత్వం మాత్రం సెంటు భూమి కూడా ఎవరికీ ఇవ్వలేదని మండిపడ్డారు. (చదవండి: ఏమిటీ చిల్లర ఆరోపణలు?) -
పేదవాడికి ఇళ్లు ఇవ్వడం తప్పా?: బొత్స
సాక్షి, విజయనగరం: గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకున్నవారికి అర్హత ఉంటే తొంభై రోజుల్లో ఇంటి స్థలం వస్తుందని మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పేదలకు పట్టాలివ్వడమే కాక, ఇళ్లు కట్టేందుకు లక్షా ఎనభై వేల రూపాయలు ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. చీపురుపల్లిలో 475 మందికి పట్టాలు వచ్చాయని పేర్కొన్నారు. ఎండకు ఎండి, వర్షానికి తడిచి అద్దె ఇంట్లో ఉంటూ కష్టపడే వారి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలాకాలంగా తపనపడుతున్నారని చెప్పారు. పేద వాడికి ఇళ్లు ఇస్తామంటే కోర్టుకెళ్తున్నారు.. పేదవాడికి ఇళ్లు ఇవ్వడం తప్పా? అని ప్రశ్నించారు. పేదవాడి జీవన విధానంలో మార్పు తీసుకురావడం కోసం వైఎస్ జగన్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. (చదవండి: ఇళ్ల నిర్మాణం ద్వారా కోటి మందికి మేలు) మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. "కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఇళ్లే తప్ప తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఇళ్ల ఊసే ఎత్తలేదు. దోపిడి, అవినీతి చేయకుండా ఉంటే తిరిగి ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది. కానీ మాకు అధికారం ఇచ్చారంటే ఆ పార్టీ ఎంత అవినీతినికి పాల్పడిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ప్రభుత్వం భూసర్వే చేస్తే చంద్రబాబు నానా మాటలు అంటున్నారు. ఎక్కడ నుంచో ఎవరో వచ్చి మీ భూమి పట్టుకు పోతారని చెబుతున్నారు. ఇది సిగ్గు చేటు. మీ భూమికి ప్రభుత్వం భరోసా కల్పిస్తుంది. ఎక్కడా లేని విధంగా సర్వే చేయించే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. ఎవరి ప్రమేయం లేకుండా ఇప్పుడు అన్ని పథకాలు అందరికి అందుతుంటే చంద్రబాబు కనీసం మర్యాద కేకుండా మాట్లాడుతున్నారు" (చదవండి: పీలా చెరలో రూ. 300 కోట్లు ప్రభుత్వ భూమి) "బాబు అయిదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఎవరికీ ఎలాంటి లబ్ధి చేకూరకుండా కేవలం వాళ్ల తాబేదారులకు మాత్రమే అన్ని పథకాలు ఇచ్చేవారు. వైఎస్ఆర్.. ఆరోగ్య శ్రీ పథకం పెట్టి ఎవ్వరూ ఇబ్బంది పడకుండా వైద్యం చేయింకునే విధంగా రూపకల్పన చేశారు. దీనిని మరింత సులభతరం చేసి మరిన్ని వ్యాధులకు వైద్యం చేయించునే అవకాశాన్ని సీఎం జగన్ కల్పించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఓట్లడిగిన చంద్రబాబు చివరికి ఇవ్వకుండా మోసం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత విడతల వారిగా ఇస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి విడత రావల్సిన డబ్బును ఇచ్చారు. పెన్షన్ ఇప్పుడు ఇంటికొచ్చి ఇస్తున్నారు. గ్రామ సచివాలయంలలో లక్షా యాభై వేల ఉద్యోగాలు వచ్చాయి. వీరంతా పరీక్షలు రాసి పారదర్శకంగా ఎంపికయ్యారు" అని బొత్స పేర్కొన్నారు. -
నాడు టీడీపీ నేతలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు..
సాక్షి, కృష్ణా జిల్లా: పేదవాడి కల నేడు సాకామైందని, తమకూ ఇల్లు ఉంది అన్న భరోసాతో తలెత్తుకొని తిరిగే పరిస్థితిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించారని మంత్రి పేర్ని నాని అన్నారు. ఒక్క పైసా ఖర్చు, అప్పు లేకుండా ఇల్లు కట్టిస్తున్న ఏకైక వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. ప్రజారంజక పాలన అందించటంలో ఆయన తన తండ్రిని మించి పోయారని, రాష్ట్రంలో పదిహేడు వేల కొత్త ఊళ్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం గాజులపేటలో పేదల ఇంటి స్థలాల లే అవుట్ వద్ద జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ‘‘6800 కోట్లు విద్యుత్, నీటి సరఫరాకే కేటాయించారు. శత్రువైనా పేదవాడైతే లబ్ది చేకూర్చాలని చెప్పిన గొప్ప వ్యక్తిత్వం ఆయనది. అటువంటి వ్యక్తి కొలువులో పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నా. పేదలు వస్తే తమ కుల ప్రాబల్యం తగ్గుతుందనే అమరావతిలో ఇంటి పట్టాలను కోర్టుకెళ్ళి టీడీపీ అడ్డుకుంది. మైలవరంలోని పాత్రికేయులందరికీ కూడా సొంతింటి కల సాకారం చేస్తాం’’ అని తెలిపారు.(చదవండి: నేటి నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పండగ: సీఎం జగన్) నాడు టీడీపీ నేతలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు: ఎమ్మెల్యే గత ప్రభుత్వం నివాసయోగ్యం కాని చోట పట్టాలు ఇచ్చి జనాన్ని మభ్యపెట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమానికి బాటలు పడ్డాయని, నేడు అవినీతి, రెకమండేషన్, పార్టీలతో పని లేకుండా అర్హులందరికీ ఇంటి స్థలాల పట్టాల పంపిణీ జరుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. అయితే టీడీపీ నేతలకు ఇవేమీ కనిపించడం లేదని, కుల పత్రికను అడ్డుపెట్టుకుని ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఎన్నికల్లో ఓటు కోసం మైలవరం ప్రజలను మాజీ మంత్రి దేవినేని ఉమా మోసం చేశాడు. ఇంటి స్థలాలకోసం వెళ్లిన మహిళలపై టీడీపీ నేతలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు . ఇప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంటే ఓర్చుకోలేక రాష్ట్ర అభివృద్ధికి ,సంక్షేమానికి అడుగడుగునా అడ్డు తగులుతున్నారు’’ అని టీడీపీ నాయకుల తీరును ఎండగట్టారు. ఇక కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలో 3,02,420 మందికి ఇంటిపట్టాలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ‘‘ఇంతమందికి ఒకేసారి పట్టాలు ఇవ్వటం చారిత్రక ఘట్టం. 29696 మందికి టిడ్కో ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. తొలి విడతలో 1 .67 లక్షల ఇళ్లనిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టాం’’ అని పేర్కొన్నారు. -
‘సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు’
సాక్షి, నెల్లూరు : ఈ రోజు(శుక్రవారం) ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగ్గ రోజని, ఒకే రోజు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొనియాడారు. శుక్రవారం నెల్లూరు నగర జాతీయ రహదారి వద్ద ఉన్న లేఅవుట్లో పేద మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ గత ప్రభుత్వం ఐదేళ్లలో 2 లక్షల ఇళ్లు ప్రారంభించింది.. వాటిని పూర్తి చేయలేదు. ఇంటి స్థలాల కేటాయింపులో కులం, మతం చూడలేదు. సిపార్సులు అసలు లేవు, అర్హులైన అందరికి ఇళ్లు ఇస్తున్నాము. టీడీపీ కుట్ర రాజకీయాల వల్లే ఇంటి పట్టాల పంపిణీ జాప్యం అయింది. ( నేటి నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పండగ: సీఎం జగన్) మాట ఇస్తే తప్పని గొప్ప నేత.. మహిళలకు ప్రభుత్వంలో పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మహిళలు నీరాజనం పలుకుతున్నారు. గతంలో టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ పేదలను దోచుకోవాలని చూసింది. కానీ, ముఖ్యమంత్రి ఉచితంగా అదే టిడ్కో ఇళ్లు ఇస్తున్నారు. ప్రభుత్వం 14 వేల ఇళ్లు ఇవాళ ఒక రూపాయకే ఇస్తోంది. ఇంటి స్థలాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదు. నగర పరిధిలో 14 వేల ఇంటి పట్టాలు ఇస్తున్నాం. 8 వేల ఇళ్ల నిర్మాణం కూడా చేపడతాం. 70 కోట్లతో పెన్నా బ్యారేజీకి అటు ఇటుగా బండ్ కడతాం.. వరద వచ్చినా కాలనీలకు ప్రమాదం లేకుండా చేస్తా’’మని అన్నారు. -
నేటి నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పండగ: సీఎం జగన్
సాక్షి, తూర్పు గోదావరి: సొంతిల్లు లేని పేదల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానని, ఆ కారణం చేతనే ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పేదల సొంతింటి కల నెరవేరుస్తానని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలోనే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎం జగన్ తెలిపారు. దీనిలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కొమరగిరిలో ఇళ్లు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. ఈ పథకం కింద మొదటి దశలో 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టనుండగా రెండు దశల్లో 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ఉచితంగా పూర్తి చేసిస్తామని చెప్పారు. 175 నియోజకవర్గాల్లో నేటి నుంచి 15 రోజుల పాటు పండగలా పట్టాల పంపిణీ చేపడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికిపైగా అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ పర్వదినాన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. (చదవండి: పేదలకు పట్టాభిషేకం) పేదల కష్టాలను కళ్లారా చూశాను. పాదయాత్రలో పేదల కష్టాలు దగ్గరుండి చూశానని, సొంతిల్లు లేని వారి కష్టాలను కళ్లారా చూశానని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఐదేళ్లలో 30.75 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామన్నారు. దీనివల్ల దాదాపు కోటి 24 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుందని వ్యాఖ్యానించారు. కుల, మత, రాజకీయాలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు మొక్కుబడిగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించిందని, మన ప్రభుత్వం కొత్త గ్రామాలను నిర్మించబోతుందన్నారు. ఇవాళ ఇళ్లు మాత్రమే కాకుండా ఊర్లు కడుతున్నామని చెప్పారు. పేదల కోసం సుప్రీం కోర్టులో పోరాడుతాం "అమరావతిలో 54వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామంటే సామాజిక అసమతుల్యం వస్తుందంటూ టీడీపీ కోర్టుకెళ్లింది. చంద్రబాబు, అనుచరుల పిటిషన్ల వల్ల 10% ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. నిన్న కూడా హైకోర్టులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై పిల్ దాఖలు చేశారు. పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం సుప్రీం కోర్టులో పోరాడుతుంది. త్వరలోనే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఒక కులం ఉండకూడదని ఎవరైనా అంటారా? అందరూ కలిసి ఉండలేనప్పుడు అది రాజధాని ఎలా అవుతుంది? అందరికీ చోటు ఉంటేనే అది సమాజం అవుతుంది. అందరికీ మంచి చేస్తేనే అది ప్రభుత్వం అవుతుంది. 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లలో జగనన్న స్కీమ్ కావాలా? చంద్రబాబు స్కీమ్ కావాలా? అని సర్వే చేశాం. 1.43 లక్షల మందిలో కేవలం ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీమ్ అడిగారు. ఆ ఒక్కరికి చంద్రబాబు స్కీమ్‌లోనే ఇల్లు ఇస్తాం. మిగిలిన వారందరికీ జగనన్న స్కీమ్‌లో ఒక్క రూపాయికే ఇల్లు అందిస్తాం" అని సీఎం జగన్ అన్నారు. (చదవండి: ముందు లిమిటెడ్.. తరువాత రెగ్యులర్ డీఎస్సీ) సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ► రాష్ట్ర వ్యాప్తంగా 2.62 లక్షల టిడ్కో ఇళ్లకు సేల్ అగ్రిమెంట్లు. ► ఈరోజు 30లక్షల మందికి పైగా పేదలకు సొంతింటి కల నిజం చేశాం. ► ఇళ్ల నిర్మాణం ద్వారా కోటి మందికిపైగా మేలు జరుగుతుంది. ► కొత్తగా 17వేల వైఎస్ఆర్ జగనన్న కాలనీలు రాబోతున్నాయి. ► కొత్త కాలనీల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం. ► కాలనీల్లో పార్క్‌లు, కమ్యూనిటీహాల్స్, విలేజ్ క్లీనిక్‌లు, అంగన్వాడీలు ఏర్పాటు చేస్తాం. ► 224 చదరపు అడుగుల నుంచి 340 చదరపు అడుగులకు విస్తీర్ణం పెంచాం. ► ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు కూడా కట్టించి ఇస్తాం. ► లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాలని ఆశ పడ్డా కొంత మంది కోర్టుకెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియను అడ్డుకున్నారు ► కోర్టు అడ్డంకులు తొలగగానే లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాం. ► గత ప్రభుత్వంలో పెద్దలు ఏ రకంగా రాజకీయాలు చేశారో చూశాం. ► ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదాలు పడటానికి రాజకీయ దురుద్దేశాలే కారణం. ► పేదలకు మేలు జరుగుతుంటే పసుపు పార్టీల మొహాలు ఎరుపు రంగుకు మారుతున్నాయి. ► 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును చట్టబద్ధ హక్కుగా మార్చారు. ► పేదలకు ఆస్తి హక్కు కల్పించే ప్రయత్నం చేస్తుంటే కోర్టుకెళ్లి అడ్డుకుంటున్నారు. -
పైలాన్ ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలోని వైఎస్సార్ జగనన్న కాలనీలో మోడల్ హౌస్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా "నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు" పైలాన్‌ను ఆవిష్కరించారు. మరికాసేపట్లో లక్షలాది మంది ఎదురు చూస్తున్న ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో 30 లక్షల మందికి పైగా నివాస స్థల పట్టాలను అందజేయనున్నారు. ఈ ఇళ్ల నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేయాలని సంకల్పించిన ప్రభుత్వ లక్ష్యంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా మన ప్రభుత్వం వస్తే 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్ ప్రకటించారు. సీఎం అయ్యాక ఏకంగా 30.75 లక్షల మందికి పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయడం విశేషం. (చదవండి: పేదలకు పట్టాభిషేకం) చదవండి: ఆ కంపెనీతో 2 వేల మందికి ఉపాధి: సీఎం జగన్