సాక్షి, విశాఖపట్నం: ప్రతి పేదవాడికి ఇళ్లు ఉండాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. భీమిలి నియోజవర్గం తగరపువలసలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, సరగడం చినఅప్పలనాయుడు, చింతకాయల సన్యాసిపాత్రుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా జరుగుతుంది. ఒక పైసా అవినీతి లేకుండా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు. చంద్రబాబు మంచి కార్యక్రమాలు చేయడు, చేసే వారికి అడ్డుపడతారు. పార్టీలకు అతీతంగా ఇళ్ల పట్టాలు పంపిణీ జరుగుతంది. ప్రతిపేదవాడికి ఇళ్లు ఉండాలనేది సీఎం జగన్ లక్ష్యం. చదవండి: ('టీడీపీ నేతలు పడగొట్టి బీజేపీపై నెడుతున్నారు')
ఇళ్ల పట్టాల పంపిణీ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారు. మతానికి రాజకీయ రంగు పులుముతున్న వ్యక్తి చంద్రబాబు. 40 దేవాలయాలను పడగొట్టిన వ్యక్తి చంద్రబాబు. దేవుళ్ల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. టీడీపీ త్వరలో కనుమరుగవుతుంది. రాబోయే రోజుల్లో టీడీపీ డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు' అని మంత్రి అవంతి పేర్కొన్నారు.
కార్యక్రమంలో మంత్రి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు ఇళ్ల స్థలమే కాదు ఇళ్లు కూడా కట్టించి ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. అవినీతికి తావులేకుండా ఇళ్లపట్టాల పంపిణీ జరుగుతుంది. టీడీపీ నేతలు పూర్తిగా అవినీతిలో కురుకుపోయారు. పేదవాడి సొంతింటి కలను సీఎం నెరవేరుస్తున్నారు. మహిళా పక్షపాతి సీఎం జగన్' అని విజయసాయిరెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment