YSR Housing Scheme
-
ఇళ్లు కాదు.. ఊళ్లు: అవధులు లేని సంతోషం.. సీఎం జగన్ మేలు మరిచిపోలేం..
ఒకప్పుడు పేదల కోసం ఇళ్లు నిర్మిస్తున్నారని అనేవారు.. ఇప్పుడు ఆ వాక్యం మారిపోయింది. వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన తర్వాత పేదల కోసం ఇళ్లు కాదు.. ఏకంగా ఊళ్లు నిర్మిస్తున్నారు.. ఆ ఊళ్లు కూడా వేయి కాదు రెండు వేలు కాదు.. ఏకంగా 17 వేల దాకా రాబోతున్నాయి. దీన్నే పేదలందరికీ ఇళ్ల పథకం అంటారు.. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా వాటిలో ఉచితంగా ఇళ్లు కట్టిస్తున్నారు. దాంతో ఈ పథకం రెండు దశలు పూర్తయ్యేలోగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 31 లక్షల కుటుంబాల సొంత ఇంటి కల నెరవేరబోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రతి విషయంలోనూ నాణ్యత వుండేలా చూస్తున్నారు. ఎక్కడికక్కడ చకచకా పనులు జరిగిపోతున్నాయి. చదవండి: ఏపీ ప్రభుత్వ సంకల్పం.. పింఛను నుంచి ఇంటి పట్టాల దాకా ప్రజా సంకల్ప యాత్రలో ఇల్లులేని నిరు పేదల కష్టాలు చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ.. అధికారంలోకి రాగానే పేదలందరికీ ఇళ్ల పథకం మొదలుపెట్టారు. ఇప్పటికే ప్రభుత్వం లక్షలాది మంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చింది. కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం పనులు జరిగిపోతున్నాయి. అద్దె ఇళ్లలో వుంటూ నెల నెలా అద్దెలు కట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నవారు, గుడిసెల్లో నివసిస్తూ పక్కా ఇంటి కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నవారు ఇప్పుడు తమ తమ ఇంటి నిర్మాణాల్లో బిజీ అయిపోయారు. నిర్మాణం పూర్తి కాగానే శుభ ఘడియలు చూసుకొని గృహ ప్రవేశం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పల్లపు ఆనందపురంలో ఇంతకాల అద్దె ఇంట్లో నివసిస్తున్న ప్రసాద్ దంపతులు ఈ మధ్యనే ఈ ఇంట్లోకి వచ్చారు. మేస్త్రీ పని చేసే ప్రసాద్ ఆ పని ద్వారా పది మందికి ఇళ్లు కట్టిస్తున్నారు తప్ప ఇంతకాలం ఈయనకంటూ సొంత ఇళ్లు వుండేది కాదు. ఇదే గ్రామంలో వేయి రూపాయలు అద్దె చెల్లిస్తూ అద్దె ఇంట్లో నివసిస్తూ వుండేవాడు. ఒక వైపు అద్దె బాధలు, మరో వైపు అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఇక సొంతంగా ఇళ్లు కట్టుకోవడం కష్టమనుకుంటున్న దశలో వీరికి శుభవార్త అందింది. చదవండి: విప్లవాత్మక నిర్ణయం.. వారి కళ్లలో ఆనందం వివాహమైన తర్వాత ఎనిమిదేళ్లుగా నానా ఇబ్బందులు పడ్డ ఈ జంట ఇప్పుడు కాస్త ధైర్యంగా సంతోషంగా వుంది. పేదలు అందరికీ ఇళ్ల పథకం కింద గ్రామంలో ప్రధాన రహదారికి ఆనుకొని విలువైన స్థలం కేటాయించారని ...అందులో ఇళ్లు కట్టుకోవడానికి సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు అందరూ కలిసి చక్కగా సహకరించారని నాగిని చెబుతున్నారు. ప్రసాద్ స్వయంగా మేస్త్రీ కావడంతో నిర్మాణ పని కూడా చాలా సులువుగా, అందంగా జరిగిపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాలు సమాజంలోని పేదలకు చక్కగా ఉపయోపడుతున్నాయని మహిళలు మరింత బాగా లబ్ధి పొందుతున్నారని నాగిని చెబుతోంది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మంచాల గ్రామంలో వీర్ల వెంకయ్య, సామ్రాజ్యం దంపతులు జీవిస్తున్నారు. వీరిని చూస్తే తెలుస్తుంది. వీరు ఎంత పేదవారో.. ఈ పేద దంపతులు ప్రస్తుతం నివసిస్తున్న ఈ గుడిసె శిథిలావస్థకు చేరుకుంది. కూలీ పనులు చేసుకునే వీరయ్య దంపతులు చెరువుకట్ట పక్కనే గుడిసె వేసుకొని దశాబ్దాలుగా ఇక్కడే జీవిస్తున్నారు. ఇదే గుడిసెలోనే కొడుకు కోడలు మనుమడు మనుమరాలు కూడా వీరితోనే వుంటున్నారు. వర్షం వస్తే గడిసెలోకి నీరు వస్తుంది. గట్టిగా గాలి వస్తే పై కప్పు ఎగిరిపోతుంది..అయినా సరే గత్యంతరం లేని పరిస్థితుల్లో నలభైసంవత్సరాలుగా ఇలాగే కాలం గడిపిన వీరయ్య దంపతులకు వైఎస్ జగన్ పాలనలో మంచిరోజులు వచ్చాయి. ఎందుకంటే వీరికోసం ఇదిగో మనం చూస్తున్న ఈ నాణ్యమైన విలువైన పక్కా గృహం సిద్దమవుతోంది. గ్రామవార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ఇలాంటి పేదల జీవితాలు మారిపోతున్నాయనడానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాలంటీర్లు స్వయంగా వీరి దగ్గరకు వచ్చి వీరికొచ్చే పథకాలను వివరించి వీరికి మార్గదర్శనం చేస్తున్నారు. వీర్ల వెంకయ్య విషయంలో కూడా ఇదే జరిగింది.. మీకు స్థలమొస్తోంది. అందులో ఇళ్లు కడతారు అని గతంలో చెప్పినప్పుడు ఈ పేద దంపతులు నమ్మలేదు. కానీ చేతికి పట్టా రావడం, ఆ పట్టా తాలూకా స్థలంలో ఇళ్లు కడుతుండడం చూసేసరికి వీరికి ఇది కలా నిజామా అనిపిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఎంతో ఉన్నతమైన పథకం పేదలందరికీ ఇళ్ల పథకం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నరదశాబ్దాలు అవుతున్న ఈ తరుణంలో ఇంకా గుడిసెల్లోనే నివసించే పేదలు కనిపించడం దురదృష్టకరం. వీరి జీవితాల్లో మార్పులు తేవాలని వీరు నాణ్యమైన జీవితాలు గడపాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహా సంకల్పం. ఈ మంచాల గ్రామాన్నే తీసుకుంటే ఈ గ్రామంలో ఇళ్లు లేని పేద కుటుంబాలు 76 వున్నాయి. వీరికోసం కోటి రూపాయలు ఖర్చు చేసి ఎకరం 86 సెంట్ల భూమిని కొనుగోలు చేసి ఆ తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ ఇళ్లు నిర్మించారు. ప్రస్తుతం మౌలిక సదుపాయాలను కల్పించే పనిని చేస్తున్నారు. త్వరలో వీర్ల వెంకయ్య కుటుంబంతోపాటు ఇతర లబ్ధిదారులు ఈ ఇళ్లలో గృహ ప్రవేశం చేయనున్నారు. కూలీ పనులు చేసుకునేవారు సంపాదించే కూలీడబ్బులు ఏ రోజుకు ఆ రోజు పొట్టపోసుకోవడానికే సరిపోతోంది.. ఎంతో కొంత మిగిలితే ఆ మిగిలిన డబ్బు అత్యవసర సమయాల్లో ఖర్చయిపోతుంటుంది. దాంతో ఇలాంటి వేలాది కుటుంబాలు సొంతంగా ఇళ్లు కట్టుకోవడమనేది కలలో జరిగే విషయమే. ఇలాంటప్పుడే ప్రభుత్వం అండదండలందించి పథకాలందించి వీరిని అన్ని విధాలా బలోపేతం చేయాలి. వీరి తలరాతలు మార్చాల్సి వుంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అదే పని జరుగుతోంది. లక్షలాది కుటుంబాలు అభివృద్ధి బాటలో పడ్డాయి. అటు పథకాల ద్వారా ఇటు సొంతిళ్ల ద్వారా వేలాది కుటుంబాలు దారిద్య్ర రేఖను దాటబోతున్నాయి. ఇంతకాలం పడ్డ కష్టాలు ఒక్కటొక్కటిగా తొలగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్షలాది రూపాయల విలువైన ఆస్తికి మహిళలు యజమానులవుతున్నారు. మహిళా సాధికారతకు సరికొత్త నిర్వచనం ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ సర్కార్ వేస్తున్న అడుగులు లక్షలాది కుటుంబాల్లో వెలుగు దీపాలవుతున్నాయి. ఇది పైలా అప్పారావు, భవాని దంపతుల ఇల్లు. పేదలందరికీ ఇళ్ల పథకం కింద వీరు నిర్మించుకున్న గృహమిది. విశాఖనగరం శ్రీనివాసనగర్‌లో రోడ్డు పక్కనే ఈ ఇల్లు వుంది. ఇంతకాలం అద్దె ఇంట్లో వున్న అప్పారావు దంపతులు ఇప్పుడు తమకంటూ సొంత ఇల్లు సంపాదించుకున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఇల్లు కట్టుకోలేమో అనే బెంగతో చాలా కాలంపాటు తీవ్ర మానసిక వేదన అనుభవించిన వీరు ఇప్పుడు సంతోషంగా వున్నారు. విశాఖలాంటి మహానగరంలో ఒక చిన్న గూడు లభించదనే ఆనందం ఈ చిన్న కుటుంబంలో స్పష్టంగా కనిపిస్తోంది. అప్పారావు భవానీలది కులాంతర వివాహం. దాంతో వీరు కొంతకాలంపాటు తమ పెద్దవాళ్ల కోపానికి గురయి ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఇరు వైపు కుటుంబాలనుంచి సమస్యలు లేవు. అదే సమయంలో ఈ జంటకు సొంత ఇల్లు సమకూరింది. పిల్లలకు అమ్మ ఒడి పథకం కూడా అందుతోంది. ఇంటినిర్మాణ సమయంలో వచ్చిన సమస్యల్ని వైఎస్సార్ సీపీ నేతలు, గ్రామవార్డు సచివాలయాల సిబ్బంది అందరూ కలిసి పరిష్కరించారని భవానీ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. విశాఖ జిల్లా నుంచి చిత్తూరు జిల్లాకు వద్దాం..మనం చూస్తున్న ఈ జగనన్న ఇళ్ల కాలనీ తవణంపల్లి మండలం అరగొండలో వుంది. ఎటు చూసినా చకచకాఇళ్ల నిర్మాణం జరిగిపోతోంది. స్థానికంగా ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న నూరుల్లా చాలా కాలంగా అద్దె ఇంట్లోనే వుండేవాడు. ఆటో మీద వచ్చే ఆదాయంనుంచే అద్దె కట్టుకుంటూ మిగిలిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు. ఈ పేద కుటుంబం బతకడమే కష్టంగా వున్న తరుణంలో పేదలందరికీ ఇళ్ల పథకం అందుబాటులోకి వచ్చింది. నూరుల్లా భార్య హసీనా పేరు మీద స్థలం, ఇళ్లు వచ్చాయి. అరగొండలోనే జయరాజ్, వనిత దంపతులు తమ ఇంటిని నిర్మించుకుంటూ కనిపించారు. వీరిది కూడా పేద కుటుంబమే ..జయరాజ్ పెయింటర్‌గా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్లు రావడంతో ఈ దంపతులిద్దరూ కలిసి తామే దగ్గరుండి కట్టుకుంటున్నారు. కుదిరిన మేరకు పనులన్నీ చకచకా చేసుకుంటున్నారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణం పండగలాగా కొనసాగుతోంది. ప్రభుత్వం అన్నీ సమకూరుస్తుండడంతో, నిర్మాణానికి కావాల్సిన నీటి సౌకర్యం కూడా కల్పించడంతో ఎక్కడికక్కడ పనులు సులువుగానే జరిగిపోతున్నాయి. ఇక్కడ ఇళ్లు కట్టుకుంటున్న వారిలో కవిత కుటుంబం కూడా వుంది. కవిత భర్త సతీష్ తోపుడు బండి పెట్టుకొని ఉపాధిపొందుతున్నారు. ఇలాంటి ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలదాకా నిర్మాణమవుతున్నాయి. వీటిని కట్టడంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇతర ముఖ్య అధికారులు సమన్వయంతో పని చేస్తూ ఈ పనులు నాణ్యంగా కొనసాగేలా చూస్తున్నారు. వేలాది జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పన కూడా చకచకా సాగిపోతోంది. ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞం కారణంగా వేలాది కుటుంబాలకు సొంత ఇళ్లు రావడమే కాకుండా లక్షలాదిమందికి ఉపాధి పనులు కూడా లభిస్తున్నాయి. -
6 వేలకు పైగా ఎకరాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు: మంత్రి అవంతి శ్రీనివాస్
-
జగనన్న కాలనీలను పరిశీలించిన మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు
-
కళ్ల నిండా ఆనందం.. సందడిగా ఇళ్ల పట్టాల పంపిణీ
-
నిరుపేదల గృహాల కోసం 5 శాతం భూమి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేట్ లేఅవుట్లలో 5 శాతం భూమిని నిరుపేదల గృహాల కోసం వైఎస్సార్, జగనన్న హౌసింగ్ ప్రాజెక్ట్‌కు కేటాయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి సోమవారం గెజిట్ విడుదల చేశారు. ప్రైవేట్ లేఅవుట్ యజమానులు, అభివృద్ధిదారులు 5 శాతం భూమిని సంబంధిత జిల్లా కలెక్టర్‌కు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి: ఇరిగేషన్ పనులకు మాత్రమే.. ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసే లేఅవుట్లో 5 శాతం స్థలం కేటాయించడానికి ఇష్టం లేకపోతే.. అదే లేఅవుట్‌కు 3 కి.మీ పరిధిలో మరో చోట ఆ మేరకు భూమిని కేటాయించవచ్చు. లేని పక్షంలో 5 శాతం భూమి ధరను సంబంధిత మున్సిపాలిటీకి/పట్టణ అభివృద్ధి సంస్థకు చెల్లించవచ్చు. -
ఏపీలో పేదల ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పేదలందరికీ ఇళ్లు’ నిర్మాణ పథకానికి మార్గం సుగమమైంది. రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు పథకంపై హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ మంగళవారం రద్దు చేసింది. దీంతో ఇళ్ల స్థలాలపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను పిటిషనర్లు వెనక్కి తీసుకున్నారు. కాగా, గత నెల 8వ తేదీన పేదలందరికీ స్థలాలు పథకంలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పిచ్చిన విషయం తెలిసిందే. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. -
మహిళలకేనా ఇళ్ల పట్టాలు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ సొంత గూడు కల్పించాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘పేదలందరికీ ఇళ్లు’ పథకానికి హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ పథకం కింద లబ్దిదారులకు ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని స్పష్టంచేసింది. 25 లక్షల ఇళ్ల పట్టాల మంజూరు నిమిత్తం పలు మార్గదర్శకాలతో 2019 ఆగస్టు 19న ప్రభుత్వం జారీ చేసిన జీవో 367లో... ఇళ్ల పట్టాల కేటాయింపు బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ (బీఎస్‌వో)–21లోని నిబంధనలు, అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్ట నిబంధనల ప్రకారం జరగాలని చెబుతున్న 3వ మార్గదర్శకాన్ని హైకోర్టు చట్ట విరుద్ధంగా ప్రకటించింది. దాన్ని కొట్టేసింది. అలాగే ఇళ్ల పట్టాల మంజూరు విషయంలో అదనపు మార్గదర్శకాలతో 2019 డిసెంబర్ 2న జారీ చేసిన జీవో 488లోని 10,11,12వ క్లాజులను సైతం కొట్టేసింది. మార్గదర్శకాలను సవరిస్తూ 2020 మార్చి 31న జారీ చేసిన జీవో 99లోని క్లాజ్ బీ (కేటాయింపు ధర), క్లాజ్ సీ (ఇంటి నిర్మాణం)లను కూడా చట్ట విరుద్దమంటూ కొట్టేసింది. ఈ చట్టాలు ఒక దానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నాయంది. లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను కన్వేయన్స్ డీడ్ రూపంలో ఇచ్చిన నేపథ్యంలో ఆ డీడ్లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీఎస్‌వో–21, అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్ట నిబంధనలను అనుసరించి చట్ట ప్రకారం లబ్దిదారులకు డీ–ఫాం పట్టా ఇవ్వాలని ఆదేశించింది. అలాగే పట్టాలు మహిళలకే ఇవ్వాలన్న జీవో 367లోని 2వ మార్గదర్శకాన్ని చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిస్తూ దానిని కొట్టేసింది.పట్టాలను అర్హతల ఆధారంగా పురుషులకు, ట్రాన్స్జెండర్లకు సైతం ఇవ్వాలంది. చదవండి: (CM YS Jagan: రైతులకు మంచి ధర రావాలి) సెంటున్నర స్థలంతో చాలా ఇబ్బందులు... సకల సదుపాయాలూ ఉన్న కాలనీలను ఏర్పాటు చేస్తూ... ఆ కాలనీల్లో లబ్దిదారులకు మునిసిపల్ ప్రాంతాలైతే ఒక సెంటు, గ్రామ పంచాయతీల పరిధిలోనైతే ఒకటిన్నర సెంటు స్థలాన్ని ఇంటి నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం కేటాయించింది. అయితే ఇది ఎంత మాత్రం సరిపోదని హైకోర్టు పేర్కొంది. ‘‘దీనివల్ల ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు. అగ్నిప్రమాదాల నుంచి రక్షణ ఉండదు. తాగునీటి సమస్యలుంటాయి. మౌలిక సదుపాయాలు ఉండవు. మురుగు నీరు కూడా బయటకు వెళ్లదు. ఇళ్ల స్థలాలు కేటాయించే ముందు ప్రభుత్వం ఈ ఇబ్బందుల గురించి అధ్యయనం చేసి ఉండాలి. కానీ ప్రభుత్వం ఈ రోజు వరకు అలాంటి అధ్యయనమేదీ చేయలేదు. ఈ అధ్యయనం కోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖలకు చెందిన నిపుణులతో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ తీర్పు కాపీ అందుకున్న నెల రోజుల్లో ఈ కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ తరువాత నెల రోజుల్లో కమిటీ నివేదిక సమర్పించాలి. దాన్ని రెండు స్థానిక పత్రికల్లో ప్రచురించి, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, ఆ తరువాతనే ‘పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ఖరారు చేయాలి’’ అని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఖరారుకు ముందు పర్యావరణ ప్రభావం, ఆరోగ్య సమస్యలు, స్థల విస్తీర్ణం పెంపుదల, తగ్గింపు, అవసరమైతే మరింత భూమిని సేకరించడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలంది. అప్పటి వరకు లబ్దిదారులకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది. మహిళలకు ఇళ్ల స్థలాలు కేటాయించడానికి కోర్టు వ్యతిరేకమేమీ కాదని, కానీ కేవలం మహిళలకే కేటాయించడం వివక్ష చూపడమే అవుతుందని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి శుక్రవారం 108 పేజీల తీర్పునిచ్చారు. జీవో 367, జీవో 488, జీవో 99లను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా, తెనాలికి చెందిన పొదిలి శివ మురళి మరో 128 మంది 2020 డిసెంబర్లో హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సత్యనారాయణమూర్తి శుక్రవారం తన తీర్పు వెలువరించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల వల్ల రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఆ విధాన నిర్ణయాల విషయంలో న్యాయస్థానాలు తప్పనిసరిగా జోక్యం చేసుకోవాలని తీర్పులో పేర్కొన్నారు. చదవండి: (విద్యుత్ సంక్షోభంపై తక్షణం స్పందించండి) ఐదేళ్ల తరువాత ఇంటిని అమ్ముకోవచ్చుననడం సరికాదు... ఐదేళ్ల తరువాత ఇంటిని అమ్ముకునేందుకు అనుమతినివ్వటాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. ఐదేళ్ల తరువాత ఇంటిని అమ్ముకునేందుకు అనుమతినివ్వడం పేదలందరికీ ఇళ్లు పథకం ఉద్దేశానికి వ్యతిరేకమన్నారు. ఇంటిని అమ్ముకునేందుకు అనుమతినివ్వడం వల్ల ఐదేళ్ల తరువాత ఆ ఇంటి యజమాని తిరిగి ఇల్లు లేని వ్యక్తి అవుతారన్నారు. ఇది పేదలందరికీ ఇళ్ల పథకం ఉద్దేశం ఎంత మాత్రం కాదన్నారు. ఇళ్లు లేని వ్యక్తుల ప్రయోజనాన్ని ఆశించి తీసుకొచ్చిన నిబంధన ఎంత మాత్రం కాదన్నారు. అందువల్ల జీవో 488లోని 10,11,12 మార్గదర్శకాలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి కొట్టేస్తున్నట్లు తన తీర్పులో తెలిపారు. ఇరుకైన ఇళ్లు ఇస్తూ పేదల భవిష్యత్తును సమాధి చేస్తోంది... ఇళ్ల స్థలాలు కేటాయించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలన్నారు. ‘‘అత్యధికులు సరైన వాతావరణం ఉన్న ఇళ్లలో ఉండటం లేదు. ఇలాంటి వారంతా కూడా ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు పలు రిస్క్‌లు ఎదుర్కొంటున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే ముందు ప్రభుత్వం ఈ రిస్క్‌లను పరిగణనలోకి తీసుకోలేదు. అంతేకాక ప్రభుత్వం కేటాయించిన ఈ ఒక సెంటు భూమి లబ్దిదారుల పిల్లల ఉద్దరణకు ఎంత మాత్రం సరిపోదు. పిల్లలు సరైన ఇంటిలో పెరగకపోవటం మానవ హక్కుల ఉల్లంఘనే. లబ్దిదారుల భవిష్యత్తును, మానసిక, ఆధ్యాత్మిక, ఆర్థిక, విద్యా, భావోద్వేగ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తగిన వసతిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం అలాంటి వాతావరణం లేని ఇళ్లను ఇస్తూ పేదల భవిష్యత్తును సమాధి చేస్తోంది. ఇరుకైన ఇళ్లలో నివాసం ఉండటంతో పలు అంశాల్లో వారి అభివృద్ధి, పురోగతి మృగ్యమైపోతుంది. చిన్న ఇంటిలో పిల్లలు, వృద్ధులు స్వేచ్ఛగా తిరిగేందుకు ఆస్కారం ఉండదు.’ అని జస్టిస్ సత్యనారాయణ అన్నారు. అప్పీల్‌కు నిర్ణయం... ఈ తీర్పుపై ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. పేదలందరికీ ఇళ్ల పథకంలోని సదుద్దేశాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో ఈ తీర్పు విఫలమైందని ధర్మాసనానికి నివేదించనుంది. ఈ తీర్పు వల్ల లక్షల మంది లబ్దిదారులు ఇబ్బంది పడతారని, అందువల్ల దీనిపై స్టే ఇవ్వాలని కోరనుంది. విడాకులు తీసుకుంటే భర్త సంగతేంటి? పెళ్లి కాని పురుషులు, భార్య చనిపోయిన వారు, పిల్లలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇళ్ల స్థలాలు పొందేందుకు అనర్హులవుతారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ‘‘ఇల్లు కేటాయించిన మహిళ భర్త నుంచి విడాకులు తీసుకున్నప్పుడు ఆ భర్త ఇల్లు లేని వ్యక్తి అవుతాడు. ఇలాంటి పరిస్థితిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది. మహిళలకు మాత్రమే ఇంటి స్థలం మంజూరు చేయడం వివక్ష చూçపడమే. ట్రాన్స్జెండర్లు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. యాచన చేస్తూ, ఎలాంటి వసతి లేకుండా బతుకుతున్నారు. సమాజం నుంచి వారు చాలా అవమానాలను ఎదుర్కొంటుంటారు. స్త్రీ, పురుషులతో సమానంగా వీరికీ హక్కులున్నాయి. ట్రాన్స్జెండర్లకు ఇళ్ల స్థలాన్ని తిరస్కరించడం రాజ్యాంగ ఉల్లంఘనే. అందువల్ల మహిళలతో పాటు పురుషులు, ట్రాన్స్జెండర్లకు సైతం స్థలాలు ఇవ్వాలి. పేదలందరికీ ఇళ్ల పథకం ఉద్దేశం ఇళ్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వడమే తప్ప, మహిళలకు ఇవ్వడమన్నది కాదు. ఇళ్ల స్థలాలను కేవలం మహిళలకే ఇవ్వడంలో ఎంత మాత్రం హేతుబద్ధత లేదు. 100 శాతం మహిళలకే కేటాయించడం సమానత్వపు హక్కును హరించడమే’’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
జగనన్న కాలనీల్లో వేగంగా కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణాలు
-
పేదలందరికీ ఇల్లు, ఇంటి స్థలాల పంపిణీపై సీఎం జగన్ సమీక్ష
-
పేదల ఇళ్లపై పచ్చ పార్టీ నేతల కుట్ర
-
రాష్ట్రంలో 33 లక్షల ఇళ్ల నిర్మాణం : మంత్రి చెరుకువాడ
-
జగనన్న కాలనిల్లో ముమ్మరంగా ఇళ్ల శంకుస్థాపనలు
-
ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్
-
పేదల ఇళ్లపై చంద్రబాబు నీచ రాజకీయాలు: వెల్లంపల్లి
-
అన్ని జిల్లాలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణ శంకుస్థాపనలు
-
పేదలందరికీ సొంతిళ్లు
-
పేదలందరికీ సొంతిళ్లు.. ఇదీ నా కల: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది నా కల. దీన్ని విజయవంతం చేయాలని నేను తపన పడుతున్నాను. నా కల నిజం కావాలంటే మీ అందరి సహకారం కావాలి. నా కల మీ అందరి కల కావాలి. మనందరి కలతో పేదవాడి కల సాకారం కావాలి. అప్పుడే పేదల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం దిగ్విజయమవుతుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పేదలకు అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందించాలన్నదే మన లక్ష్యం కావాలని పేర్కొన్నారు. రూరల్, అర్బన్ కలిపి 9,024 లే అవుట్లలోని జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా అన్ని లే అవుట్లలో పేదల ఇళ్ల నిర్మాణ పనుల ప్రారంభానికి అవసరమైన మౌలిక సదుపాయాలను వారం రోజుల్లో కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. నీళ్లు, కరెంటు సౌకర్యాల ఏర్పాటులో ఏమైనా సమస్యలు ఉంటే శరవేగంగా పరిష్కరించాలని చెప్పారు. వీటిపై మరింత ధ్యాస పెట్టలన్నారు. ఇళ్ల నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని రవాణా చార్జీలు సహా ఇతరత్రా రేట్లు అమాంతం పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశం మొత్తం మన వైపు చూస్తోంది రూ.34 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం అన్నది ఒక కల అని, గతంలో రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ మౌలిక సదుపాయాల కల్పనకు ఈ స్థాయిలో ఖర్చు చేసిన దాఖలాలు లేవని సీఎం జగన్ చెప్పారు. ఇంత పెద్ద లక్ష్యం గురించి గతంలో ఎవరూ ఆలోచించలేదని, దేవుడి దయ వల్ల ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. దేశం మొత్తం మనవైపు చూస్తోందన్నారు. అవినీతికి తావు లేకుండా నాణ్యతకు పెద్ద పీట వేయాలని ఆదేశించారు. మనసా, వాచా, కర్మణా.. ఈ పనుల పట్ల అధికారులు అంకిత భావాన్ని ప్రదర్శించాలని, అప్పుడే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతామని చెప్పారు. పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీలను మురికివాడలుగా కాకుండా, మంచి ప్రమాణాలున్న ఆవాసాలుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఇందుకు పై స్థాయి నుంచి కింది స్థాయి అధికారి వరకూ సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. నాణ్యతపై ఫిర్యాదులు, సలహాలకు ప్రత్యేక నంబరు కేటాయించాలని ఆదేశించారు. అవినీతికి తావులేని, నాణ్యతతో కూడిన పనులు చేయాలని, ఇందులో భాగంగా ప్రతి లేఅవుట్లో ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. దీని ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్‌పై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి.. ► జగనన్న కాలనీల్లో మ్యాపింగ్, జియో ట్యాగింగ్, జాబ్‌కార్డుల జారీ, రిజిస్ట్రేషన్ పనులు అన్ని చోట్ల దాదాపుగా పూర్తి కావొచ్చాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 3.03 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. జూలై 10 నాటికి 7 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అవుతాయన్నారు. ► ఆప్షన్లో భాగంగా ప్రభుత్వం కట్టే ఇళ్లు శ్రావణ మాసం ప్రారంభం కాగానే మొ దలు పెట్టి.. 2022 జూన్ నాటికి మొదటి విడత నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ► నాణ్యత నిర్ధారణ కోసం ఇంజనీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఐఐటీలు, ఇతర సంస్థల సహకారంతో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ► టిడ్కో ఇళ్లకు సంబంధించి దాదాపు రూ.10 వేల కోట్లతో 18 నెలల్లో 2,08,160 యూనిట్లు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ -
జగనన్న కాలనీలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా జోరుగా ఇళ్ల నిర్మాణాలు
-
ఏపీ వ్యాప్తంగా జోరుగా ఇళ్ల నిర్మాణాలు
-
పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తున్న ఏపీ ప్రభుత్వం
-
గృహయజ్ఞం
-
రేపటి నుంచి వారం రోజుల పాటు ఇళ్ల నిర్మాణ మహోత్సవాలు
-
వైఎస్సార్, జగనన్న స్మార్ట్ టౌన్ పథకం కింద ఇళ్ల స్థలాలు
-
90 రోజుల్లో పట్టా అందించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసిన వ్యక్తి అర్హుడని తేలితే 90 రోజుల్లోగా ఇంటి స్థలం పట్టా అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇంటి పట్టా కోసం దరఖాస్తు అందుకున్న తొలి 12 రోజుల్లో వలంటీర్, గ్రామ సచివాలయ సిబ్బంది భౌతికంగా వెరిఫికేషన్ పూర్తి చేయాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 30,06,673 ఇళ్లపట్టాలకు గానూ 26,21,049 పట్టల పంపిణీ జరిగిందని, మిగిలిన వాటిని కూడా రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తంగా 87.17 శాతం పట్టాల పంపిణీ జరగ్గా, కాలనీల్లో 90.28 శాతం పంపిణీ పూర్తైందన్నారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇళ్ల స్థలాల పట్టాల కేటాయింపు, పంపిణీ అన్నది నిరంతర కార్యక్రమమని, దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి: సీఎం జగన్) ఈ సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ► సోషల్ ఆడిట్ ద్వారా లబ్దిదారులను గుర్తించాలి. ► నిర్మాణాల్లో ఏక రూపత, నాణ్యత కోసం చర్యలు తీసుకోవాలి. ► ఒక కాలనీలో కల్పిస్తున్న సదుపాయాలు, వాటి నిర్మాణ రీతులు తదితర అంశాలపై పూర్తి వివరాలు నివేదించాలి. ► వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పించాలి. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయండి. ► డంపింగ్ యార్డుల్లో బయో మైనింగ్ చేయాలి. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ మొదలుపెట్టాలి. పనుల పురోగతి: వైయస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకుంటున్న చర్యలను సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. మార్చి 31 నాటికి వాటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వివిధ ప్రభుత్వ శాఖలు అందులో భాగస్వాములవుతాయని అధికారులు తెలిపారు. ఇక సీఎం ఆదేశాల ప్రకారం వైఎస్సార్ జగనన్న కాలనీల్లో జనాభాను అనుసరించి అంగన్వాడీ కేంద్రాలు, వైఎస్సార్ క్లినిక్కులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్లు, బస్టాపులు తదితర నిర్మాణాలపై అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి వై.శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (చదవండి: ఇళ్ల పట్టాల పంపీణీలో మనమే నంబర్1)