సాక్షి, విజయవాడ : దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని తెలిపారు. భారీ ఎత్తున ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ 384 చదరపు స్థలం ఇస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 23,24,25 డివిజన్‌కు సంబంధించిన 1024 మందికి ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జోనల్ కమిషనర్ సుమైలా, ఎమ్మార్వో జయశ్రీ గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ సుమైలా మాట్లాడుతూ.. 18,19,20 డివిజన్‌లోని 3280 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. అర్హులైన వారందరికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామన్నారు.
ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సీఎం జగన్ అధికారంలోకి రాగానే ఇళ్ల పట్టాలు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు సీఎం జగన్ పెద్దపీట వేశారన్నారు. మహిళలు పేరు మీద ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో 27 వేల జేఎన్‌ఆర్‌యూఎం ఇల్లులు ఇచ్చారని తెలిపారు. గత పాలనలో టీడీపీ నేతలు ఇళ్ల స్థలాల విషయంలో ప్రజలను మోసం చేశారని మల్లాది విష్ణు విమర్శించారు. లక్షా 80 వేలు ఇళ్ల కట్టడానికి మంజూరు చేశామని, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు తాము పట్టించుకోమన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలోని పేదవాడి పక్షాన ఉన్నారని, 30 వేల మందికి ఇళ్ల ఇస్తున్నామని తెలిపారు.
‘సీఎం జగన్ ఊళ్లు నిర్మిస్తున్నారు. నగరాన్ని విస్తరిస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గలో 30 వేల ఇల్లు ఇస్తున్నాం. టీడీపీ నేతలు ప్రజలను మోసం చేశారు. జన్మ భూమి కమిటీలు పెట్టి ప్రజలను తప్పుదోవలో నడిపించారు. సెంట్రల్ నియోజకవర్గలో 24.602 పెన్షన్లు ఇస్తున్నాం. 525 మందికి రేపు ఉదయం నుం,ఇ కొత్త పెన్షన్లను ఇస్తున్నాం. రాష్ట్రంలో టీడీపీని ప్రజలు తిరస్కరించిన బుద్ధి రాలేదు. టీడీపీ నేతలు జూమ్ మీటింగ్స్‌కే పరిమితం. సీఎం జగన్ రాష్ట్రంలోని విద్యా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ రాజకీయాల ప్రజలు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రజల వద్దకు వచ్చింది. అంబేడ్కర్ కాలనీలోని 177 ఇళ్ల పట్టాలు రెగ్యులర్ చేస్తున్నాం. టీడీపీ నేతలు టిడ్కో ఇళ్ల విషయంలో12.000 వేల మంది దగ్గర నుండి 25.000 50.000 వేలు వసూలు చేశారు. టీడీపీ నేతలు టిడ్కో ఇళ్ల విషయంలో ప్రజలను మోసం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో సీఎం జగన్ ముందు అడుగులో ఉన్నారు’. అని తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment