
సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలోని వైఎస్సార్ జగనన్న కాలనీలో మోడల్ హౌస్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా "నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు" పైలాన్‌ను ఆవిష్కరించారు. మరికాసేపట్లో లక్షలాది మంది ఎదురు చూస్తున్న ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో 30 లక్షల మందికి పైగా నివాస స్థల పట్టాలను అందజేయనున్నారు. ఈ ఇళ్ల నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేయాలని సంకల్పించిన ప్రభుత్వ లక్ష్యంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా మన ప్రభుత్వం వస్తే 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్ ప్రకటించారు. సీఎం అయ్యాక ఏకంగా 30.75 లక్షల మందికి పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయడం విశేషం. (చదవండి: పేదలకు పట్టాభిషేకం)
Comments
Please login to add a commentAdd a comment