AP Govt: Allots 5 Percent Land Private Layouts To Jagananna Housing Project - Sakshi
Sakshi News home page

నిరుపేదల గృహాల కోసం 5 శాతం భూమి

Published Tue, Dec 7 2021 10:59 AM | Last Updated on Tue, Dec 7 2021 11:38 AM

AP Govt Allots 5 Percent Land Private Layouts To Jagananna Housing Project - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేట్‌ లేఅవుట్‌లలో 5 శాతం భూమిని నిరుపేదల గృహాల కోసం వైఎస్సార్, జగనన్న హౌసింగ్‌ ప్రాజెక్ట్‌కు కేటాయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి సోమవారం గెజిట్‌ విడుదల చేశారు. ప్రైవేట్‌ లేఅవుట్‌ యజమానులు, అభివృద్ధిదారులు 5 శాతం భూమిని సంబంధిత జిల్లా కలెక్టర్‌కు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

చదవండి: ఇరిగేషన్‌ పనులకు మాత్రమే..

ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసే లేఅవుట్‌లో 5 శాతం స్థలం కేటాయించడానికి ఇష్టం లేకపోతే.. అదే లేఅవుట్‌కు 3 కి.మీ పరిధిలో మరో చోట ఆ మేరకు భూమిని కేటాయించవచ్చు. లేని పక్షంలో 5 శాతం భూమి ధరను సంబంధిత మున్సిపాలిటీకి/పట్టణ అభివృద్ధి సంస్థకు చెల్లించవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement