![Beneficiary House Warming At Jagananna Colony In Pileru - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/21/20PLR02-300133_27_44.jpg.webp?itok=k6lqFc4y)
సాక్షి, పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరు మండలంలోని యర్రగుంటపల్లె లే అవుట్‌లోని జగనన్న కాలనీలో ఒక లబ్ధిదారు గృహప్రవేశం చేశారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’లో భాగంగా పీలేరు పట్టణానికి చెందిన రెడ్డిరాణి, రెడ్డీశ్వర్‌రెడ్డి దంపతులకు ఇల్లు మంజూరైంది. స్థానిక తిరుపతి రోడ్డు మార్గంలోని జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం చేపట్టి 2 నెలల్లో పూర్తిచేశారు. ఆదివారం వైఎస్సార్ సీపీ మండల నాయకుడు కంభం సతీష్‌రెడ్డి చేతుల మీదుగా గృహప్రవేశం చేశారు.
ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ రెడ్డిరాణి, రెడ్డీశ్వర్‌రెడ్డిలను ఆదర్శంగా తీసుకుని మిగిలిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు జగన్‌మోహన్‌రెడ్డి, హబీబ్‌బాషా, ఎంపీటీసీ సభ్యుడు అమరనాథరెడ్డి, నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, ఉదయ్‌కుమార్, వినోద్‌కుమార్, భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
కేటాయింపులకు లోబడే ప్రాజెక్ట్‌ల నిర్మాణం: మంత్రి అనిల్
ఏపీ: 2008 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్
సొంతింటి కల నెరవేరింది
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యమా అని మాకు సొంతింటి కల నెరవేరింది. కొన్నేళ్లుగా సొంతిళ్లు లేకపోవడంతో అద్దె ఇంట్లో ఉంటూ ఇబ్బందులు ఎదుర్కొన్నాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో భాగంగా మాకు ఇల్లు మంజూరైంది. జగనన్న కాలనీలో మా ఇంట్లోకి గృహప్రవేశం చేయడం చాలా సంతోషంగా ఉంది.
– రెడ్డిరాణి
Comments
Please login to add a commentAdd a comment